దేహశిల… ఏడు ముఖాల సంధి

                                    దేహశిల… ఏడు ముఖాల సంధి

Download Free Ebook
Download Now

కలబోసిన ఆందోళన

ప్రేమ మళ్ళీ మళ్ళీ ఎదురుపడుతుంది. విశ్వజాగృతంలో ఒరిసిపోయిన హింస తిరగబడుతూ .. ఈ లోపల ఇక సర్ధుకుపోవడానికి లేని అనుగమ రాశుల్లో పడి కొట్టుకుపోతున్న జాగారతృప్తి కదులుతూ .. ఉన్నదేదో తెలియకుండా దిశని మార్చుకొని .. కొంచెం కూడా మనిషి చప్పుడు లేని నల్ల కెరటాల దీపం ఒరిగిపోయాక .. ఓ నిండు చెమట కుండలో ఒబ్బిడిగా ఉంచుకున్న చర్యలు. చివరగా ఉంచిపోయిన కాస్త రక్ష సమయం తేలికగా ఉంచుకున్న .. నా లోపలి సాధన కిందికి లాగిన పల్చని ముఖంతో ఊరేగి … తడబాటు లేని జాము ముప్పెరల గంటని మోగిస్తూ ఎరుపెక్కిన నిద్ర తీరికల్ని వాళ్ళు తూలుతూ అందుకొని లాడిపెట్టిన గొళ్లాలతో తగువు పడతారు.

       స్త్రీ అనే ఓ అస్థిర రాశిలో పడి కొట్టుకొనే చర్యల చుట్టూ శతాధిక అనుమానాల్ని దీవిస్తూ చిత్ర పోత..  తానెందుకు అర్ధం కావడం లేదు.. అవ్వడానికి తానేం శ్రమ చేశాననే మాటని కాచుకొంటూ ఒక సంతర్ప అమాసని చెదరగొట్టి … విడిగా ఉండిపోయిన దేహ చొరవలు చొచ్చుకుపోయిన విషాద నీలం లోని శ్వాస రక్ష తో కూర్చుకొన్న అవిఘ్న ఆశీస్సు కొత్త నడక వడపోసి చేతికిచ్చి తాగమంటోంది. రుచిని గుర్తు పట్టక ముందే తన రూపం అదేనని .. అద్దెకి తీసుకొన్న దేహ రాశుల మధ్య లోనే నిషా మండలాలని తీర్చి … పోసిగిన ఆయాస రక్ష ఇక్కడే ఉండిపోయిన తీరికతో ఊడిపోయి రెండో దారిలో ఏక చిత్ర స్థలాన్ని సిద్ధం చేసుకొంటారు.

లాంతురు లో నుంచి పాలు కారుతూ … పడక పక్కగా .. వాళ్ళు శిల్పాన్ని చెక్కుతున్నారు.  లోపల ఒక చాపలతో చేసిన ఒక విమానం .. పై నుంచి కిందికి రాలుతున్న హిమాలయాల్లోంచి లావా ఉబికినప్పటి వేడిని కావలించుకొంటూ.. గడప లో రైలు గంట శబ్దం తో ఆయాసపడుతూ పెద్ద నిద్ర విప్పిన శరీర గోళం వెనుక వాళ్ళు ఇంకా కలని వండుతూనే ఉన్నారు.

చీకటిలోంచి .. చీకటిలోకి తప్పిపోయిన ఆచూకీలు పుట్టుకని ట్రంక్ పెట్టె లోకి దాచి ఆ విమానం లోనే దీవి చేరాలంటారు. అక్కడ మరేవరూ ఉండరు.. మాట మాత్రంగా చనిపోయిన దేహాలని జాగ్రత్త చేసిన కొండల మధ్య బిగుతైన చీరని కొలుస్తూ ఇంక్కాస్త దగ్గరకి జరిగిన ముద్దు తో కొత్త పోలికలు వద్దులే అని సిగ్గు పడతారు. పొర్లుతున్న  జ్ఞానదీక్ష ఆ కాస్త వెసులుబాటుని ముద్ద చేసే అక్కడే ఆగిపోయిన ఆశ్చర్య ముంపులతో ఒరిగి కొత్తగా తీర్ధ వేదిక పై ఒంటరి పాత్రని కలిసి మాటలు పెంచుకొంటుంది.

పెద్ద గాలీ-వాన , వెనకనే గడుసు ముద్దలతో నింపుకున్న ఆకలి.. ఉప్పు అద్దిన నాలికతోనే మాటలు పదునెక్కాయని చెప్పుకొంటారు. ఏం చేసినా ఆ తలుపులోంచి పాములు రావడం ఆగిపోలేదని.. అందుకే కొత్త తీర్మాన రాత్రులతో కొండని దాటించే ఆయుస్సు ధారలుగా జ్ఞాన వివసం పట్టుతప్పి కథనే  కౌగిలించుకొంది.

తను చాలాసేపు పాడుతూనే ఉన్నాడు… పగిలిన గోడల్లోంచి పెదాలని బయట పెట్టి నేను సిద్దమే అంటూనే ఉన్నాడు… రక్త నిలువులేని దీర్ఘ చొరబాటుతో వాళ్ళు కొత్త దశ కి రంగులు కలుపుతారు. .. కిందికి ..పైకి చూసి దీప సర్ధుబాట్లులేని ఐక్యతీవ్రంలో అప్పటి వరకు పొందికగా ఉంచుకొన్న దేహశిల ఒరిగి మరింత పట్టుదప్పిన సుఖ రసాయనం తో చూసి వంకరగా నవ్వుతుంది.. అంత మారిపోవాలని .. ఇంకాస్త చోటు అడిగి మరి చెప్పుకొని… ఇరుకుల్లో చిక్కుకొని దుప్పటి కప్పుకోవాలని….

                                                                     ……………….

గది లోని చూపు..

అక్కడ కేవలం ఓ అడుగు ఎత్తు నీళ్లతో పెద్ద మైదానం … కొన్ని రసాయన వర్ణాల చేతన ముద్రలని అప్పగించి … రెండు నిద్రలు ఊరబోసిన మసక నవ్వుతో .. సాధ్య భూమి కొత్తగా వదిలిపోయిన నిర్వాకం …తను కనిపిస్తూనే ఉంది… ఎంత అరిచినా తలెత్తి చూడడం లేదు. కనబడ్డామని పెద్ద హడావుడిని చుట్టి అనుకోలేదు.. ఇంకని నిద్ర కదిలికలతో విసిగిన రధాల బరువుకి కట్టుకొన్న శ్లేష్మ రక్ష శ్వాస లో గింగిరాలు తిరిగినప్పుడు … వడ్డించని విస్తరిలో వాళ్ళు కొత్త గారడీ నాటకాలని మొదలుపెట్టారు.

ఎటో పోతుంది… నేను ఆయాసం తో చేరిన .. నీకు సంబంధం లేని చోటని ఎక్కడా అంటుందోనని అభయం లేని చిత్ర దండన మోసుకుపోతూ .. నిర్భయ సంధి ముద్రలేని ఉపేక్ష కదిలి పోసిగిన రాతి నిద్రల కింద సుఖం తెలియని ఆరడి మోయమన్న చిరాకులకి రంగులని తాపడం చేసే కొత్త ముసురుతో ఐక్యమవుతారు. వాళ్ళు ప్రయోజనం వెంట తీరుబాటు లేని రంగు క్షేత్రము లో తప్పిపోయిన దేహాలతో తీరుబడిగా .. రాజేసిన దిశా మురిపాలని తోడుపెట్టుకొని .. ఇంకా సవ్వడి లేని దీర్ఘ ఆచూకీ ల మధ్య గుమ్మలని జత చేస్తూ మాటని ఒద్దికగా దాటించడానికి చూస్తారు.

నివురు కమ్మిన సంసర్గ దీర్ఘ నిషాని రాశుల్లో కలదిప్పిన దేహ నెమ్మది ని ఓంపుతూ కొంచెం వదిలిపోయిన నిరాశ చుట్టూ ఉనికికి దొరకని ముంపుతో దిశా నగరం రమ్మని పిలుస్తుంది. అక్కడి వరకు తప్పించుకున్న నా నిరాశ పొడుగై .. మరింత శిధిల ఉత్సవ మూర్తులని దింపేసి నిద్రవైశాల్యం పెరుగుతూ అంతటా కమ్మేసిన లొసుగులతో చర్యలని మొండిగా తెగ్గొడతారు. ఊగిసలాడే నిద్ర సొరంగం లో వాళ్ళు కొంచెం తలలు పొంచి చేరుతూ .. సరి చెయ్యని శరీర రాశులని ఒదిగించిన కౌగిలి పైననే అంచులకి రాసిన కత్తి తో పదును పెట్టి అటుపక్కకి తిరిగి ఏడ్చుకొంటారు.

                                                                                           ……………

గంధక వరద నుంచి … కిచెన్ కి

డైనింగ్ హాల్ ..స్పూన్లు చిన్న ముద్దలని కదిపి .. మరింత మత్తు వరదని తిప్పే విసుగు కందకాల్లో దిగబడి ఇదే తెలియని ముహర్తమని చెప్పుకొనే అస్థిర రెప్పల మధ్యనే ఒరిసిపోయిన నవ్వుతో.. వాడు మరో డిష్ని ముందుకు జరిపామని.. మూత తీసి చూస్తూ .. మాట లేకుండానే వెనక్కి విరుచుకు పడ్డాడు. ఏదో వినబడదు. కనబడదు.. ఆయుస్సుని వడ్డించదు.. ఐనా కొంచెం కరిగించిన చేతుల కిందుగా రుచి చుట్టుకుపోతూ వాళ్ళు నీళ్లు నములుతారు. ఏదో తరిమేసినా చోటోలోనే ఇంకాస్త నులిమిన నా వెన్ను దీర్ఘ బరువుని అతికిస్తూ వెళ్ళిపోతుంది. తలుపు కొంచెం కర్టైన్స్ని చింపి మహా ముద్రకి రెండో వరం ఇచ్చిన దేహ స్థలంలో కొత్త మంచO కావాలని వాడు అడిగి అదోలా నవ్వి.. వాడి నోటిలోంచి రక్తం రావడం చూసి … మాట లేకుండానే కూలిపోతాడు.

 వడ్డిస్తూ చివరిలో … కత్తిని వెన్నులో దించి నల్లగా నవ్వి .. అందరూ వెళ్లి పోయారు. ఇప్పుడిక నీకూ పలకరించడానికి ఎవరూ లేరు. ఇలా నా ఒడిలోకి రా .. మహా ఐతే ఇంకొన్ని నిమిషాలు.. ఆ తర్వాత అంతా నీది మహాయాత్ర.. ఎవరినైనా తోడిచ్చి … నా ఈ నిర్జీవ శరీరాన్నిగోదారిలో కలిపేయమంటానులే.. ఎక్కువ వెసులుబాటు లేని అవమోక్ష సాధనతో నిండిన పెద్ద పద మడుగులు దండ కట్టాక .. కనబడని అంతరిక్షంలోంచి ఎవరో నీళ్ళని వదిలినట్లుగ దిగిన వాన. ఇక్కడ కొంచెం కూలబడిన పొయ్యి ఎవరూ వెలిగించారు.. దేహ శిక్షణ కి వేగిన నిద్ర సంధిని అప్పగించి మరో ఇనుమడించిన అడుగుల సిద్దత పైకి చేరుకొంటున్న మసకల ముద్ద దేహాన్ని మల్లి తయారుచేస్తుంది.

చీకటి ఉన్నట్టుండి ముసురుకొంటుంది. ఎక్కడా అలసట చెదిరిపోని నిద్రతో … కాటేసే చూపులని దాటి ఆమె కిచెన్లో అనేక నిర్బంధ అనుకూలనాలని వదిలి పెద్ద రేవుల నోటితో అరుస్తుంది. ఏదో తెలుస్తూ ఉంది.. తన రాతని సిగ్గు దాటించి లోపల వదిలేసిన నిర్వాయ సూత్రం మసకబారి కొందరు మరో స్థలం లేని చర్యలతో చీరలని మడత పెట్టి ఊరికినే ఏడుస్తూ ఇంకేదో అంటారు. ఆమె గెరిటనే ఇంకా బలంగా తిప్పి.. వాడి అరుపు వినిపిస్తూనే ఉంది. కదలడానికి లేని పెద్ద కన్ను మసకగా వెనక ఛాయాని వర్షిస్తూ.. మృత్యువు దగ్గరగానే ఉండనే కబురుని అందిస్తూంది. ఎవరూ మరో వీధి ఆ పక్కగా అతకడం కోరుకోరు. 

                                                                    ……………………..

గుడి మూలలో గర్భ చమురు

గుడి .. అదెప్పుడో చనిపోయింది నాలో.. నాకెప్పుడూ ఏ కొంచెము నిర్ణయ ఆయాసాన్ని తీర్చి కట్టుకట్ట లేదు.. నువ్వువస్తాననే ఆ సాయంత్ర సజ్జల మసక మంటపాలు కింద .. తెల్లని నీ అరిపాదాల మెరుపు చూడడానికే నే వచ్చేది. నీతో పాటు తనూ వచ్చినప్పుడే కథ తెలియని ఘర్ష రాత్రుల్ని ఎగా దిగా చూసి కొంచెం సిగ్గుపడి రెండేసి నిద్రలేని ఒకేసారి ఒంచుకొంటాను.

గోడలు నీటి మొక్కలని తాగి చనిపోయాక అంతా బయటపడుతుంది. నెలవారీ వాన. ఆత్మ నైరాశ్యం .. కొంచెం కూడా ఆచూకీ లేని మృత్యు దోషం. మళ్లించిన కాలువ … సిగ్గుపడి ఒంగిన కొబ్బరి చెట్టు … కథలోకి రాలేని .. నా దీపాల కంగారు.. ఆ మూల చెరువు దగ్గర మిగిలిన లైటు వెలుగు… బోర్లించిన పడవ కింద ఎవరో వదిలేసిన ప్రసాదం. కొంచెం గోరువెచ్చని చలిమంట కావాలని.. కల తానులని అడిగిన కొద్దిగా సన్నని కొసలని జీర్ణ ముడుపులుగా కట్టుకొని రాలిన ఒకింత వేరుపాటుతో స్థితి మారుతున్నా మలుపులో తను కూర్చొని అంతటిని తడిమి పోల్చిన శేష శ్వాసల కొలిమిలో పడి నా పోలికలని తోడుపెట్టుకొంటాను. నువ్వు ఇలాగే అని dictate చేసిన కొన్ని సంయోగ ధ్వనులకి కాపలా పెట్టిన వశీకరణ దీప వైధవ్యం … నేల రాలి … కొత్త పంటని అడుగుతాయి.  ఇక ఇది రెండో జన్మకి తలవాల్చి దీర్ఘ నిషాని మోసుకున్న ఒరవడి రాశుల  మధ్య అక్కడనే తను కావాలని అడగమంటుంది.. ఎక్కడనే స్పష్టంగా తెలియని ఆ మలుపులో….. నలిగిన దేహంలోంచి మగ్గిన  మల్లెపూల వాసన కమ్ముతూ దుఃఖం ముసుగు పెట్టుకున్న జ్ఞాన దోహపు సంకల్పం మింగేయనా అని అడిగే నిద్ర గెలుపు…

ఈ రాత్రికి ఇంటికి వెళ్లకపోతే… ఇక ఆ తలుపులని ఎప్పటికి రాకుండా మూసేస్తారు … అప్పుడిక నదే గతి… అదీ ఎప్పటినుంచో… అమాంతం దూకి .. అడుగుకంతా వెళ్లి … ముందెప్పుడూ వినని కథలు వినాలని.. తను  అల్లార్చిన ఆయాసం …సూర్యరశ్మి… వాన ముద్దలు… చిలికిన మట్టి… తొందరగా వదిలిపెట్టని వీధి స్తంభాలు.. చిన్నప్పుడే జ్ఞానం చంపేసిన  స్కూలు..లాక్కొంటూ పోయిన గుడి… దీర్ఘ సాయం లేని రాత్రి జాడ .. పెద్ద నవ్వుని వడపోసిన కంటిలోని రంగు జాడీ …  నీ పుణ్యమాని … అది తీరిపోయిన నాకు ఒక అనిర్బంద మృత్యు గుర్రుని మోసే దగ్గర తనం తో మోసపోతూ … అప్పుడే మార్చుకోనున్న మరో నిద్ర వాలులో తనని కలుసుకొంటాను..  అతని కన్నీళ్ళని చూడ లేదని కాదు. ఇక ఇదే వరసగా నేను తలవని దేవ నిర్మాణంగా నమ్మినా చిత్ర స్వని వెల్లకిలై కంటి దగ్గర మూసుకున్న స్మశానం.

అప్పుడది తొందరగానే దూరం జరిగి … జాగ్రత్తపడ్డామని అనుకొనే కొత్త నాటకాన్ని మొదలు పెట్టి ఒళ్ళంతా గారడీ మూర్తులని తిప్పుకొని చప్పుడు చేసింది.  స్టేజి పైనే అతడు స్క్రిప్టుని తగలబెట్టి.. మీకు నచ్చినట్టు మార్చేసాక రచయిత చనిపోవడాన్ని ప్రకటిద్దాం .. ఇంకేదో కావాలనుకోవడంలో అర్ధం లేదు. మాటి మాటికీ పిలుస్తూనే ఉన్నాడు.. గర్భ దోషపు ఆనవాళ్లతో గుప్పెట బిగించిన రహస్యం కావాలని ఎటోపోయి ఏడుస్తున్నాడు.

                                                                  …………………..

ఇంకొక దేహ నిరాశ 

స్మశానం .. నువ్వెన్ని చూడ లేదూ … నేనెన్ని చూడలేదూ .. ఐనా పర్వా లేదు.. కాసేపు అక్కడే .. చాటుగా ఆ మట్టి దిబ్బ వెనుక.. నువ్వు రోజంతా ఎదురుచూడు.. నేనొక  టైం లో వచ్చేస్తా .. ఓ వేళా రాకపోతే అక్కడే పడుకో… పోగొట్టుకోవడానికి ఇంకేం లేదు.  పెళ్లి పడక ని సిద్ధం చేసిన పడవని లంగరు తీసి నది లోకి వదిలేశారు.. అతని వెన్నుముక లో దించిన కత్తులు అలానే ఉన్నాయి… కలలని లోపల ఉంచిన దేహ విధి .. ఏం జరగాలని ఉందొ అంచనా వేస్తుంది

వాడు నాకేమంత సరైనవాడిగా కనిపించలేదు.. అంతగా పెదాల వెంట పాటని తడుపుకొని తిరగడం లేదు. రెప్పల్లో పొడిగా రాలిన నమ్మకాల మత్తునే వండుతూ దీర్ఘ చక్రాల మోక్ష చిరాకు నీళ్ళని పోసుకొంటుందని … చప్పుడుతోనే చెప్పేస్తారు.. కాని అదేదీ కనిపించి చావడం లేదని తన ఆ మూలకి జరిపిన దర్శన కొండలని కాదని తను పుట్టిన భూమి వాసన తో కనిపెట్టి … వాళ్ళని వద్దని తానే వడ్డిస్తుంది.

ఆకాశం నుండి నల్లని వాన .. తెల్ల కొంగల యేరు పొంగి కల కావాలనే వదలని నిద్ర ఛాయతో గిల గిలా కొట్టుకొంటూ … ఇంకాస్త నైవేద్య పలమై.. చంద్రుడు ఏడుస్తున్న దుఃఖ నిర్మాణం.. పట్టు తప్పిన అల్లాస మూర్తి కౌగిలిలో మురిసిపోతుంది. నది పసుపు వర్ణానికి మారి… కొండని మింగుతూ … చేసుకొనే ఎర్రని వాంతిలోంచి నునుపు మాటలని దిగమింగి అటుగా ఆత్మ హత్య చేసుకొన్న దేహాలున్నాయని ఎందుకు చెబుతుంది. ఎక్కడనుంచో ఎగిరొచ్చి అతుక్కొన్న మర్రి చెట్టు నీడ … దాని నిన్న ఉరిపోసుకున్న ఖాళీ తాళ్లు.. వివరాలు లేని నెలసరి సంతాపం మరో పిండాన్ని వదిలి కనిపించకుండా పోతుంది.

మరొక విందుకి సిద్దమై … దేహాల్లో పోతపోసుకొంటున్న దుఃఖం కరిగి నిలువెత్తు కంటి శోధన మసక బారుతూ దీర్ఘ విశ్రమం లేని సంపదగా ఈ రాత్రి సమయాలకి … యుద్ధం నేయని బట్టతో దేహాన్ని దాచుకోలేమని తను చెప్పినా … ఇంకొక నిద్ర జాము పండలేదని గర్భసంచీని కొండ శిఖరానికి వేలాడదీసి.. దూకాక ముందే ఎలాగో మాయమైంది… నేను నా మృత్యువు ని కాపలా ఉంచుతాం.. భయపడకుండా… రా .. ఇక్కడ మాత్రమే .. మరొకరి కన్ను తొందరగా మన మీద పడదు.

వరం .. నే  ఏడూ జన్మలు .. ఒక ఫలం లేని ఆపేక్షా రాశుల మధ్య నే కొత్త కన్నుని గుప్పించి .. వెసులుబాటులేని నవ్వుతో కొత్త వరాన్ని ఇమ్మని నన్నే అడుగుతుంది… అది నా దేహాన్ని ఆత్మ నుంచి దూరం చేసే.. ఆ workshop  లోకి తడబడే సంకల్పం చెప్పుకొని వరస తప్పులని ఒప్పుకొంటుంది. ఏదీ నేను కాదు. కథ చుట్టూ జరుగుతున్నపుడు … మార్చి కొత్తగా ఇంకేదో చెప్పాలని చూసి తను నవ్వి కనిపించకుండా పోయింది.. అదే నిర్దేశ స్థావరం..

                                                                          ………………..

సముద్రమూ…ఉబికిన మెలకువ

సముద్రం … లెక్కలేనన్ని కెరటాలు .. మరేమి తెల్సుకోవాల్సిందీ లేదు. భోగ నైవేద్యం … విసురు  జాడ.. కనిపెంచని కౌగిలి .. మళ్ళీ మీరే రండి.. నాకు ఇక్కడా తెల్సిన వారెవరూ లేరు. ఐనా నన్ను ఇందులోకి లాగొద్దు .. తననే అలవాటు లేని మూర్తులని మొత్తంగా పోతపోసి … కనిపించని శరీర కష్టం తో తొందరపాటు లేని క్షేమదీపం ఒరిగిన రసాయన దీర్ఘం లోనే నా ఇల్లు తప్పిపోయి మరి దొరక లేదని ఎవరికీ చెప్పుకోవాలి.. తనే నమ్మనని చెప్పాక.. ఇదేమి కాదులే .. లెక్క తెలియని చావు మునకలు .. రాల్చి పోయిన దేహ సగం లో పొద్దు గుప్పిన సరి సమయాల నిద్ర తెగింపుని కనుక్కోలేక ఆ పైనుంచి దూకి తరిమేసి మోసపు స్నానం తో గుర్తుని వదులుకొంటారు.

 విషాద దోషమా అదెలా ఉంటుంది.. ఆమె తన బొట్టుని దులిపి … మాటని తాగి … కెరటాల గాలిలోకి దీపాన్ని విసిరి .. దిగులు మోసిన నినాదాలతో విసిగిన మూర్తులని కాపాడి రెండో సారిగా  లేని బిక్ష తో … నాకు మళ్ళీ ఇప్పుడే పుట్టాలని ఉంది… అదే నీకు అందే వయస్సుతో.. ఇదొక శాపనార్ధ వరం … లిపి లేని ఆందోళన మోసే దిగులకి ముందే విడిపోయిన స్వర్ణరాశి … రెండోసారి ఇచ్చుకోవడానికి లేని సంతర్ప నివాళికి నేను రెండు చేతుల దోసిలితో పడగలుగా విప్పి కనుసన్నల్లో ఆట మొదలుపెడతాను. కొన్ని ఇల్లు తమ తమ మొండి గోడలతో అడ్డం పడతాయి.  పెద్దగా లేని దోషరక్ష ఇంకేమి మరకలని తుడవలేదని  చెప్పుకొని ఊపిరి సెగలో కూరుకుపోయిన కలల పొట్టుని ఊది.. ఊది.. కాపాడని కంగారుని వడపోశాక అటుగా వస్తున్నా శతశాలలో దీర్ఘ మైకం కాలుతూ వశీకర మూర్తిని కప్పెడుతుంది.

వాడా లైట్ హౌస్ పైనుంచి చూస్తూనే ఉన్నాడు. గమించిన కెరటాలు ముంచేస్తాయని ఆశ.. అయినా ఎవరో ఇంకా గుసగుసలతో అదే మాట చెప్పి విసిగిస్తున్నప్పుడు తను దూరం జరిగి … పద .. పదా వెళ్ళిపోదాం.. చీకటి కెరటాల్లోకి వెళ్లి చనిపోతే .. పైన అంతా శూన్యమై ఆచూకీ లేకుండా చనిపోతాం. . గదిని కడిగి ఇక ఆనవాళ్లు నాకు దొరకకుండా ఉండవని ఎగురుతూ అలవాటు లేని కింది చీకటితో యుద్ధం చేయలేనని అలిగి కొత్త మాటలని అడ్డుకొని తడబడుతూ అటుపక్క ఛాయభూమితో కలిసి తిరగబడ్డాడు. కొన్ని నిర్ణయాలకి ఒరిగిపోయింది అలారం … కొత్త పోతలతో నలిగి … కొంచెం నిద్ర పోదామన్న .. ఎక్కడా నిద్ర పోవడానికి అంతదూరం నుంచి వచ్చిందని నిలదీస్తే.. కొంచెం కూడా అనుమతి లేని వెసులుబాటు తో మూసినా కంటి దోషం ఊరేగి అటునుంచి అటే తాగి పోయిన మసక కీడుని రంగుల్లోకి లాగి నిలదీస్తారు.

ఏదొక చోట మొదలు పెట్టాలిగా అని.. తను పొట్లం విప్పుతుంది.. చీకటి ఆరబోసుకున్న మొండి రెప్పలు తరుముకొంటూ నిషా వదులుతో ఒక నిర్వాణ కొనసాగింపు కొత్త పాటని. కనుక్కోమంటుంది. ఈ సముద్రం నాకు చాలా నేర్పింది.. అప్పుడప్పుడు సణిగింది… ఇది కాకుండా ఇంకో చోటు లేదని వేళాకోళం చేసింది… నిద్ర గడువు సంగతి నీకెందుకు… మూసుకొని .. పెట్టింది తిని వెళ్ళిపో అంది. స శరీర దీర్ఘ వివశం ఊరిపోతూ కాస్త గాలి తీసుకొన్నా మృత్యువు సన్నని పాముల మందని … ఉప్పు మడిలో దొరికిన తలలని… తూర్పు దీపం కక్కిన నల్ల నవ్వు నొక్కులని.. నుదురు పగుళ్ళలోంచి బయటపడ్డ చొంగని… తలలోకి సర్దింది. వీలు  చేసుకొని కనుక్కోమంటూ … ఇంకా కొంచెం దారి తప్పిన కబురుతో అక్కడ దారిని కుట్టుకొన్నానని ఒప్పుకొన్నాక … అటు నుంచి కూలిన మాంస వికారం జోలె పడుతుంది.

………………….

కలలు …రెండు వీధుల పడవ

కలలు … శ్వాస దారాలు.. మూసినా జత రంగుల తాయెత్తులు .. పగటి గొంతుల సదా చిత్ర మెరుగులు .. కొంచెం ఆ మూలకి జరిపి పోసుకున్న నీళ్లు.. చంద్ర తాయెత్తుని మింగిన నీటి గవ్వ నదిలోకి దూకేస్తూ దొరుకుతూ … సరిపడని పాటని గర్భ నిమిత్తంమై రుద్దుతూ … అటు ఇటు తిరిగే ఆందోళన పైకి తిప్పుకొని జడ గుప్పుకొన్న చేదు ముద్దలుగా మురిసిపోతూ ఇక ఇదంతా మరో చోటు దొరకని ఇంటిని చూపించి … ఇక చాల్లే అంటుంది.

నీటి సాగలింతకి దొరకని ముప్పేట రంగులతో ఊసిపోయిన నిరాశ దశలని కీడుకి బిగించి .. ఏక శిక్షణ ముహుర్తాలతో కదిలే సాయుజ్య నిర్యాయం ఉండిపోకూడని వాళ్ళు అనుకొనే ఉంటారు. శాశ్వతాల ఒడంబడికల్లో తిరుగులేని శేషభూమి మొత్తాన్ని ఊరబెట్టి .. కడిగిన ముప్పులతో పోల్చిన గింజుబాటు తో కనబడే రాశీ కోతల కల మొత్తంగా ఉండిపోయిందని చెప్పుకొంటూ అక్కడే నిరాశ మితాన్ని మింగే గొడుగులా ఇనుకుడు మూటలని పైన్నుంచి సర్ది కొంచెం మాట సాయం అడుగుతారు.    అలా ఉండిపోయే ఊపిరి రాతని రాల్చుకొని … జువ్వుమంటూన్న ధూప సంధి కమ్మేసిన గొంతులో … ఇంకా సముద్రం చేరలేదని పడవ నమ్మకంగా చెప్పక నేను .. నేను .. అనుకొంటూ మృత్యువు ఇంకాస్త నిజ నిద్రనే అరగదీసి కొత్త ముడుపుని సార్ధముంటుంది.

ఇంతకంటే నా దగ్గర ఏ కొత్త వీలునామా సిద్ధంగా లేదు. కొంచెం కొసరి తినిపించిన చిరాకు తో పోల్చి పెట్టుకున్న రసాయన ముసురు .. పోలికలని వదిలేసిందని అనుకొన్న .. నాలోపల ఆ బొమ్మని మాత్రమే నా కన్ను తాగగలదని ఏడ్చాను.. సరే ఐతే నే వెళ్ళనా .. అని.. ఎందుకు అలా అనుకోవాలి.. మరి కొంచెమైనా కాలుకడప లేని ముట్టడితో కదిలిస్తూ కనపడని జీర్ణ బాలింత మోసుకున్న ఆ నిద్ర బండి కలలని తవ్వి .. కొత్త చోటుని ముడివేసుకుని .. అక్కడి వీధులని జాడిస్తూ పుట్టిన ఊరినే దొరికించుకొని … లాక్కెళుతుంది.

అడిగిందెవరు? అడగాల్సిందెవరు? ఒబ్బిడిగా చేరగిలిన రక్ష మోసపోతూ ఇంకా తెలియని దురుసు నివాళితో పంచుకున్నా భోగ మంతనాలు తెగిపోయిన ఆయుర్దాయ నెమ్మిది ముద్రలు తగలబడిపోతున్న కలబాటు తో కలవరం గెంతులేస్తుంది. మనమున్నామనే ఈ దీర్ఘ ప్రకటన ఏదీ కొత్తది కాదు… ఉండిపోవడానికి ఇక్కడే ఎవరూ అతకని నిద్ర బిగువలని జోడించి జ్ఞాన విపరీతంలో తగువుపడే ప్రతి చర్యా నిమిత్తాలని వడపోస్తారు.   అసాధారణమైనది .. ఏ ఉనికి వడపోతగానూ … ఒరిపిడి లేని నిద్ర సాయుజ్య మోదులని తిప్పి నాటుతూ ..అలానే జరిగిపోతూ .. ఏ నిందని తను తాగి అతని మీదుగా నడవక ముందే ..  కలవర నిరాశలకి తూర్పు వశీ మైకాల నిద్రగా తీరికలేని సర్దుబాటు చేసే మరోసారి తప్పుకొని జోకొడుతుంది.

…………….

చిట్ట చివరి విన్నపం ;

నాకోసం ఇంతకంటే గొప్పగా ఎందుకు అనుకోలేక పోతుంది.. స్పష్టత లేని అయోమయంలో తొందరగా కనిపెట్టుకున్న నిద్ర ని పోల్చుకొంటూ జ్ఞాన ఛాయ మోసిన దీపస్తంభం.. అంతే .. ఇంత మాట కూడా లేకుండా వదిలేయడమేనా.. తడిచిపోయిన రహస్యాల చాటుగా ఉండిపోయిన దుఃఖపు తలుపులు ఇప్పటికీ కిర్రు కిర్రు మంటూ .. తెలపడానికి లేని ఉద్రేకం అటే తూర్పు జాముని కడిగి చలన దృష్టిని మార్చుకొంటుంది. ఏదో  తెలిసిపోయిందనీ .. ఉండడానికి చోటులేక తడిచిన నిద్రనే వరంగా చేర్చుకొన్న అనవసర చేర్పులు.. తలలో దున్నిపోతున్న క్రియా మెరుపుల అయోమయం తో తలపడే గందరగోళం.. ఇలా ఉండడాన్ని ఎవరో చూడలేకపోతున్నారని తల బాదుకొంది…

అతనికి ఒక్కసారిగా గడ్డకట్టిన సముద్రాన్ని చూసిన వాడిలా ఒణికాడు.. కొంచెం భద్రస్తలం లేదా ? అన్నప్పుడు .. నీకా ..నాకా తెలియాల్సింది అన్నట్లుగా చూసింది.. పెద్దగా ఆసరా లేని ఉపేక్ష సందర్భాలు మూసుకుపోయిన తీరుతో కొన్ని సరిపడని మూర్తుల ఊరేగింపు తడిమిన రాశికి అంటించిన ముడులు… ఇది ఇలా లేని కొత్త వరదగా ముంచేసిన  … తెలిసిన వాళ్లంతా ఎవరికీ వారుగా కొట్టుకు పోతారు. అది పిరికితనం కాదా ? అని నిలదీసినప్పుడు .. కొంచెం చోద్యం చూసి వదిలేసిన ముట్టడికి దొరకని మంథన షరతులు పెద్ద ఘోషల ముఖాన్ని తోడుతెస్తాయి. ఇది మారి చెప్పుకోవడానికిలేని రంగు నిద్ర మరకలు… ఒరిగిపోయింది జీవ ద్రవం ఒళ్ళంతా పూసాక నిలువెత్తు సంకల్ప నింపాదులతో మోసిన కెరటాలు భుజం మార్చుకొంటాయి.

 అనుకోని చూపు తో తన గది లో దాచుకొన్న చీరని ముఖం పైకి విసిరి… తను మరో చీకటి గది లోని అద్దాన్ని బద్దలు కొట్టింది… మాటలు వాటిలోంచి రావడం మొదలైనప్పుడు కంటికి దొరకని నిద్రని అడిగి .. మాటలని కలలకి బలి ఇచ్చేయమంది. అవి వరస తప్పి దీర్ఘ ముద్రలతో కదులుతున్నాయి.. ఎవరూ దేనిని కదిలించడానికి లేని సందిగ్ధంలో పడి.. తన లోపలి ముసుగు రాసి పెట్టిన వీలునామా తీసి .. దీనిని వినే అర్హత నీకు లేదు..కాని.. నేను రాసానని చెబుతున్న అంతే … ఎప్పుడూ ఏదీ కొత్తగా మొదలు కాదు. తెలిసిన వారి మధ్యనే ఊగిసలాడి చెప్పుకోలేని మత్తుగా అలజడి రేపుతుంది.

ఇది ఇంతకంటే మరోలా ఉండదు..

                                                            …………………………..