పసుపు ముఖమూ … ఎర్ర కాళ్ళు

                                                  పసుపు ముఖమూ … ఎర్ర కాళ్ళు

Download Free Ebook
Download Now

శూన్యాన్ని మింగి .. తన నిషా అవధి లోని మాటలని మింగేస్తూ తడబడే ఆశ్రయంగా తాను..ఇప్పుడు లేదు.. లేదు అంటే ఉంది.. కానీ నాతో లేదు… నా గొంతు వింటుంది..తన గొంతుని వినిపిస్తుంది.. కలవనివ్వదు. మాటలని.. మంత్రం మూర్తులని తడవనివ్వదు.

తనకి మరేం తెలియదు.. కొంచెం ముఖాన్ని వంచి .. లోపలికి  వణుకుతున్న నిర్జర భయం తోడుకుపోతున్న అంచుల్లో కదిలే నిద్ర సముదాయాల సుఖ ముద్రని మార్చి రాస్తూ … పైపైకి ఎగబడ్డ చీకటి అనుసర మూలుగులని దాటించే కలలో తాను దిగబడి.. ఇక రానులే అని పైకి నవ్వినా … ఆ లోపలి యజ్ఞశిల దాహంతో కొట్టుకొంటూ మరో సంధిచేయని నిరాశని రాసి .. తర్వాత జరగబోయేది చెబుతుంది. అసలు చెప్పడానికే తను ఉంది.

సగం కాలనీ దాటించే పడవల సముదాయం లో కొంచెం గొడుగు పట్టిన దేహ నిందని కడిగి …వెనక్కి చేరని ఆలోచనల గోడు నిలబడే అరుస్తుంది. అదేమంత స్పష్టంగా లేదన్న ఒప్పుకోదు. విని ఊరుకొని చెయ్యాల్సిందే చేస్తూంది. ఎలాగో ఖాళీ చేసుకొన్నాను … ఇప్పుడు ఆ ఎదురు చూసే టైం మిగలకుండా పోతుంది. ద్రుష్టి భ్రమణం తిప్పుకొన్న దేహరాశులు ఎంత వద్దని తల ఊపిన … వినేవారు లేక చీకట్లో  కలిసిపోతుంది. ఇదంతా ఓ ప్రీ-ప్రోగ్రాం అని అర్దమయ్యేలోపు మరెవరో అదే బెంచీ మీద దుప్పటి దులుపుకొంటూ … రెండు దశాబ్దాలుగా తిరుగుతున్నా.. రెండు సార్లు మృత్యు మాయ కోమా లోంచి  బయటకి చూస్తూ .. ఈ ఎదురు రాతని రుద్దుకొంటూ చీకటిలోకి తప్పిపోయిన మూర్చిత ఆనవాళ్లని కడిగేసిన నిరాశ తో దూకెయ్యాలని……

సాయంగా నేర్చుకొన్న గదిలో కొన్ని పెదాలకి నీరుపట్టి మాట జారినప్పుడు … పోటుపెట్టిన మువ్వల కొండపై నుంచి అయోమయం కమ్మిన గుబులు.. ఎలాగో ఖాళీ చేసుకొన్నాను … ఇప్పుడు ఆ ఎదురు చూసే టైం మిగలకుండా పోతుంది. ద్రుష్టి భ్రమణం తిప్పుకొన్న దేహరాశులు ఎంత వద్దని తలా ఊపిన … వినేవారు లేక చీకట్లో  కలిసిపోతుంది.

కథ మొదలవుతున్నప్పుడు అతను కారులో వెళ్తున్నాడు.. ఎదురుగా తను .. లక్షల అమావాస్యలని మింగిన దేహంతో పూర్ణ చంద్రుడిని లాగడానికి చూస్తున్న ఓ నిష్ఠుర దీప సమ్మెటలా…  నదిలోకి దూకడానికి సిద్దమై … అతను అన్నీ వదిలేసి.. అద్దం పగలగొట్టుకొని కారులోంచి దూకాక ఆమె కనిపించలేదు. కనిపిస్తుందని  అనుకోలేదు….

ఏడవాలనుకొన్నాడు.. ఎవరో అతని Bagని విసిరేస్తే వెనక తగిలి.. నది కౌగిలికి పిలిచింది.

పెళ్లి .. నువ్వు వచ్చి తీరాలి.. భయం ఎటు పోతుందో దానితో నాకు నిమిత్తం లేదు. కల్సి నీతో కూర్చొని అప్పటికి తల దువ్వుకొని నా మేకప్ మార్చుకొంటాను.

ఇది స్థిర పర్చుకొన్న నా వీలునామా… అని ముందైనా చెప్పలేదు. నేను ఎప్పటిలాంటి వాడినేనని తెల్సినా…. గదిలో ఎవరూ ఉండరులే .. అయినా నా కన్నొకటి ఆ తలుపుకి అతికే ఉంచుతాను.

……………………………………

వెయిటింగ్ రూమ్ లో … టైం అవుతుంది.. దశాబ్దాల శ్రమని ముందుపెట్టి మరేదో అవకాశమిమ్మని .. అన్ని లోపల trails.. ఎవరో చెప్పారు… వాళ్ళు ఈజీ అప్రోచ్ అన్నట్లై మాయ చేస్తారు…ఎవరిదో హితబోధ వాళ్ళ లెక్కలు వాళ్ళకి ఉంటాయని … ఇది ఓ మూత పడ్డ చాప్టర్ గా పక్కకి  తీసెయ్యమని ..అలా మాట్లాడటం వాళ్ళకి ఇండస్ట్రీ requirement  …  కానీ నన్నెవరూ వినిపించుకున్నట్లుగా లేరు.. ఇటు రా .. మనం  కూర్చుని మాట్లాడకుందాం. చెప్పుకొంటూ పోతున్నప్పుడు ఆగమని చెప్పడానికి ఎవరూ లేరు. మాటలుగా వేలాడి .. కొంచెం దూరం జరిగి అంటున్నదంతా వాళ్ళు లోపలి తీసుకొన్నారని కాదు…. తీసుకొంటారన్న ఆశా లేదు…..

వీడికసలు సర్దుకు పోవడం వచ్చినట్లుగా లేడు. వాడి పొగరుతో వాడిని చావనియ్యి… మనకెందుకు అవసరం లేని ఈ తొందర.. కొంచెం దూరం జరిగి  ఏం పట్టుతప్పినా ఎవరూ చేయి అందించి సాయం చెయ్యరు.. నువ్వు ముందుకు పోయి చెప్పినా వాళ్ళు అల్లాగే దానిని నమ్మరు.

కన్ను గడ్డ కట్టినపుడు … వాళ్ళు చూడటం లేదులే అని అలానే మాట్లాడుకొంటారు.

కథ ఎలాపోతే నీకెందుకు ? మరింత సర్దుకోవడానికి లేని విసుగుతో మనం ఇంకాస్త చోటుకి అల్లాడిపోతాం.. ఇండస్ట్రీ తీవ్ర దాహంతో ఉంది.. ఉత్త డ్రై.. టాలెంట్ కావాలి.. కొత్తగా మాట్లాడాలి .. వినాలి.. చూడాలి .. చూపించాలి… మృత్యువు ముందు చివరి తుంబురని సవర దీస్తూ .. కనీసం ఇప్పుడైనా రుద్దమవ్వాలిగా .. మలి చూపులోనూ అదే నిరాశని కుదిపి పైకి జరిగి అలసిపోయిన కన్నుతో ఎగబడుతున్న తెరలు….. మరింత నల్ల బారుతూ……

మీ కథల మీద తీరుబడి చేసుకొని ఓ రోజు కూర్చొందాO లెండి.. ఆ రోజు మళ్ళీ ఎప్పుడూ రాదు..మనమే తిప్పి తిప్పి మన కథలని రాసుకొని… రాసుకొని… తప్పిపోతాం.

ఇవన్నీ కొలతలు.. ఇక్కడేమి… art form గా ఏదీ మిగిలి లేదు.. ఇంట్రడక్షన్లు … ఇంటర్వెల్ బాంగ్ .. అన్నీ హీరోనే చెయ్యడం.. చూసే వాడిని లేపి కూర్చోబెడుతూ ఉండాలి. అదే అని చెప్పుకోవడానికి ఇంకేం నిందలు మిగిలిలేవు.

ఎంగిలి పడమంటారు.. అవన్నీ నోటి వరకే .. ఎవరితో ఎంతసేపు ఉండాలో వాళ్ళకి ముందునుంచి training ఐపోతుంది. అక్కడ ఆగిపోవడానికి ఏం లేదు… పోతూనే ఉండాలి… ఆవిరి గుప్పించిన గాలి కథల్ని వింటూ మరిన్ని గుమ్మాలు ఎక్కడ ఉన్నాయని వెదుక్కొంటూ..

ఈ ఐరావతాలు.. పెద్ద పెద్ద గాలి ఏనుగులు .. కుదుపు.. నులిమిన దీప జ్వరం .. అక్కడే ఉంది అంతలోనే కుదుపు చుట్టేసిన కన్నుతో లొంగిపోక అటుగా ఓడిపోయినా ముసురు కిందుగా నా జాము ముగిసిందని కబురైనా పెట్టారు. తొందర పడి మరో మాటని గిలిగించక ముందే పాటగా నా నుదుటికి అందిన నిమిర్పుతో తను నా వాటా ఎక్కడా ? అంటుంది..

మరేమి కాదు .. భాద కోసి రెండు గంటలు నానబెట్టి .. ఒరిగిన నిద్ర గుంజాటనల మధ్య కదిలే అద్దాల తెరలు ఏడుస్తూ .. ఇక మళ్ళీ చెల్లు చేయాల్సిన ముగింపులు లేవులే అని తీర్పు చెబుతాయి.

తను కలుస్తుంది.. నిలదీసింది.. ఇంకా ఎందుకు నీ చీకటి గదిలో నేను కూర్చోవాలి. ఉండడానికి నాకంటూ ఓ నిద్ర పడవనైనా ఎప్పుడూ కొంటానని అనలేదు. ఇవిగో నీ లెక్కలు.. ఆ చీర … కాళ్ళ పట్టీలు .. నుదిటిలో నువ్వు వెలిగించిన ఈ కుంపటిని గోదారిలో కలిపేసాను.. ఇక అంతా నిర్జన రాత .. మాట ఎలానూ లేదు.. శ్వాస గడ్డ కట్టింది.. పొగ చుట్టేసిన ముఖాలతో కురిసిన వాన దోసిలి నిండి కదిలే ఊపుతో రాజేసిన ముట్టడి ని తాగి సొమ్మసిల్లిన ముసి ముసి పొదల్లో నెరిసిన ముళ్ళు కళ్ళలో ఎగబడి … దాపుల్లో కుదురుకున్న నిద్ర కళ్ళు గడ్డ కట్టినప్పటి శోష.

అప్పుడప్పుడు లేదా ఎక్కువ సార్లో … నుదిటి రాత  ఎదురు తిరగడం అలవాటే ..ఎప్పుడూ అలానేనా .. మరీ ఇంత కష్టమా ..  మరీ మోయలేనంత నిర్దయ….

                                                              ………………………………

మొదటి పేజీ

కదిలించి పోదామని తనేం అనదు.. బయట ఎవరికీ తెలియాలని అనుకోదు. కాని ఇదెలా ముందుకి.. వెనక్కి .. అటు.. ఎటు .. పోనే పోదు. నిద్రకి దూరం చేసే బెంగగా మారి … ఆ చీకటి గదిలో రహస్యం పొంగుతూ .. ఎవరికీ కావాలి మనలోకి తొంగి చూసి కంగారు పెట్టడానికి… ఏదో ఎవరికో తెలియకూడదు … అదెప్పటికీ అలా రాజీ లేని గడుసుతనం తో అరగ తీసుకొన్న ఒత్తిడితో దిద్దుకొని ఎందుకు నవ్వుని మర్చిపోవడం? అలా అనుకోవడమెందుకు?

ఎలా నడుస్తుందో అలానే నడవనీయి.. ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు ఆగిపోనియ్యి.. ఇక్కడ ఎవరికీ అర్ధం కాని కొత్త కథేం కాదు. కాని ఎవరికీ వారు .. వాళ్ళకి తెల్సిన మర్యాదలోనే కూరుకుపోయి ఉంటార ని నీకూ .. నాకూ బాగా తెలుసుగా…

గేరంటీలు … ప్రమాణాలు … వరసలు .. నిద్ర బాగోగుల్లో నడిచే సిగ్గు రంగుల పోలికలు … నిరూప దీపాలు లేని ఒంటరి గదిలో ఒకే కన్ను తో వదిలించుకున్న వీడ్కోలులు … ఒక పాత గుంభన శ్రుతిలోనే పాట తొణికిసలాడు తుంది.. గమనించడానికి ఎవరికీ తీరిక అన్న నేను  వినలేదుగా ?

ఇదెప్పటికీ మారదు.. నీ ఊపిరి ఆగిపోవడం నాకు తెలుస్తుందిలే.. అప్పుడు ఈ  భూమిని ఖచ్చితంగా నేను గుర్తు పట్టగలను.. ఒక్క పూల మొక్కా లేని క్షామ ఎడారి అది..

ఈ క్రతువులతో నాకేం నిమిత్తం … భయం తొలిగిన మహా ప్రవాహాల్లో పడికొట్టుకునే నీ శిధిలాలని నేను గంగ లో … ఆ వారణాసి ఘాట్ల సాక్షిగా గమనిస్తూనే ఉంటాను.  ఇదొక మహా రక్షా లోని ఒంటరి సముదాయాల ఒరిపిడి భోగం.. పెద్ద ఆసరా..

రెండో పేజీ

ఆ రోజు నాకు బాగా గుర్తు ఉంది… నేను నిన్ను చూడాలని ,,, అదీ తనివి తీరా .. ఎవరికీ ఏ అనుమానాలు లేకుండా.. నువ్వు దానికి ఎంత రిస్క్ చేసావో తల్చుకొంటే ఇప్పటికి నేను ఒణికిపోతాను. ఒప్పుకోలేక పోతాను.

అదొక నిద్ర మూర్తిని  తాగే నిషా సమయం ,, నేను విశ్వానికి మరో వేపు నిలబడి పిలిచాను.. నీకేం వినబడిందో   … ఇన్ని వందల కిలోమీటర్లు నువ్వెలా దాటి చేరుకున్నావో.. ఎంతటి యజ్ఞ మూర్తిగా సృష్టి సంలీనమై దీనిని సాదించావో తల్చుకొంటే నేను .. నా అర్హత ని తలచుకొని ఇప్పటికీ సిగ్గు పడతాను….. తలకిందులవుతాను….

అడుగు దూరం లో అద్దం లో కనిపిస్తే చాలా అన్నావ్ ?

ఆ రోజు … ఇంటి ముందు  … మహా అమావాస్య చుట్టిన అర్ధ రాత్రి నిశ్శబ్దం … ఎవరో తలుపు కొట్టినట్లయినది … నేను ఎప్పుడూ జాగురతతో ఉంటానని నీకు తెల్సు.. అందుకే ఆ చిన్ని శబ్దాన్ని నేను వదులు కోలేదు. తలుపు తీసి చూస్తే … ఓ గుడ్డ సంచీతో సుమారు .. అడుగు పొడవూ .. వెడల్పు ఉన్న గ్లాస్ బాక్స్ దానిపై  అంటించి స్లిప్ చూసి …చేతులు వణికిపోతున్నా  ఆ పైనున్న స్లిప్ తీసి చదివాను. ఆ స్థితిని  నేనిప్పుడు ఊహించి కూడా చెప్పలేను.

నేనే … ఇది నా గాజు పేటిక .. చివరిసారి నువ్వు కోరుకొన్నట్లుగా కలవడానికి వచ్చాను..నిలువుటద్దం ముందు ఈ బాక్స్ పెట్టి  మూత తీసి చూడు.. లోపల ఒక అందమైన చిన్న సీసా ఉంటుంది.. దానిని పట్టుకొనే ముందు.. నీకు చెప్పినట్లుగానే.. గులాబీ.. మల్లె .. సంపెంగ పువ్వులని ఓ పళ్లెంలో ఉంచు.. ఇప్పుడు సీసా మూత తీసి … ఆ ద్రవం ఆ పూల పై పొయ్యి… ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూస్తావుగా ? అని… ఆక్షణం లో తర్వాత ఏం జరుగుతుందనే ఆలోచన లేదు.. అలా ఉంది ఉంటె .. నిన్ను పోగుట్టుకునే దాన్నికాదు.

ఆ పరిమిళా ద్రవం పొయ్యగానే .. ఆశ్చర్యం .. పై నుంచి .. అన్నీ వైపులా గోడల నుంచి … ఆ మూడు రకాల పూలు రాలుతున్నాయి.. మొత్తం ఇల్లంతా అప్పుడు మంచుతో తడిచి పుట్టినట్లుగా ఉండే పూలతో నిండి పోయింది.. అద్దం లోంచి ఎవరో   పిల్చినట్లయి .. ఉలిక్కిపడ్డాను..తీరా చూస్తే … నాకు ముందే చెప్పినట్లుగా … నువ్వు… ఇప్పటికీ ఆ పులకింతని మర్చిపోలేను …  ఆ అద్దాన్ని పట్టుకుని ఏడుస్తున్నాను… గుక్క పెట్టి ఏడుస్తున్నాను.. పక్క వాళ్ళు ఏమనుకొంటారని ఆలోచించకుండా ఏడుస్తున్నాను… చాలా గట్టిగా అంటే నమ్మగలరా ?

అప్పుడు నువ్వు ఒకే మాట అన్నావ్?

నాకు చెప్పాలిసింది ఏదైనా ఉందా … అంటే అది ఇప్పుడే… ఈ చీకటి తెర లేచేసరికి ఇందంతా …  ఈ అద్దం లో నేను మాయం అయిపోతాం .. నా జన్మ అంతటికి నేను నీకివ్వగల చివరి దర్శనం ఇదే.. నిజానికి నాకు ముందే ఈ విషయం చెప్పినప్పుడు నమ్మలేదు.. అందుకే నిన్ను టెస్ట్ చెయ్యాలనే … నిన్ను చూడాలని అంతగా  పట్టుపట్టాను.. నిన్ను ఈ భూమి నుంచి దూరం చెయ్యాలని కాదు.. అదే చెప్పాను… నువ్వు చిరునవ్వు తో విన్నావు … ఆ వింటున్నప్పటి ముఖమే ఇప్పటికీ అలానే నాలోపల ఉంది… కాని నేనే ఇప్పటికి నన్ను నేను క్షమించుకోలేని  యాతనతో నలిగిపోతున్నాను.

నువ్వు నాకు ఇచ్చింది .. వరమా ? శాపమా?

మూడో పేజీ

ఈ  నల్ల చీర కింద ఎర్రబడ్డ నీ కళ్ళని దాచుకొని … ఆ టీ కప్పులోకి ఒంపి … కొంచెం మట్టిపోసి .. ఓ తీగని..నీకిష్టమైన  మల్లెతీగని నాటుతాను… ఎర్రని ఆశలు ఆరిపోయాక పూసే తెల్లని మల్లెలు … ఇవే నా స్తనాల లోపల కుంపటి వెలిగించి నన్ను నీ గట్టుకి చేరుస్తాయి.. మరో బిచ్చగత్తెగా నీ పక్కన ఓ చోటుని లాక్కుని … నా చేతులతో ఆ భిక్షని తినిపిస్తాను… నీకై నేను నేర్చుకున్న పాటని వినిపిస్తాను … నువ్వా పాట వింటూ .. నా కాళ్ళని కడిగి ఒత్తుతూ ముద్దు పెట్టుకోవడాన్ని నేను పులకిస్తూ చూస్తున్నాను..  ఇదే జరుగుతుంది. అల్లా నువ్వు నమ్మవని .. ఆ ఆకాశవాణి నాకెప్పుడో చెప్పింది.

……………………………….

ఆమె ; వద్దులే … నిన్ను అడిగి కూర్చోబెట్టిన వారెవరు ? ఇప్పుడు కొత్తగా వదిలేసి పోవడానికి?

మసకబారిన రుణ రవ్వలతో తురిమిన ఆయాస నిద్రకి నేను చేరగిలిన చోటుని.. కనబడి తప్పిపోవడానికి నా చోటు మారినా దొరకదు. బొమ్మ కట్టిన ఆందోళనని మోసుకొని తిప్పి రాల్చుకున్న ముసురు మూటగట్టుకొని.. సరళ నిద్రకి దొరకని విసుగుని రాపాడిస్తూ వాళ్ళు తుళ్లిపడతారు.

ఇక్కడ కొంచెం కూడా నాదే అనే చేతులు ఉండక .. ముంచేసిన కలలతో దూరం జరిగే జన్మనే దగ్గర చేసుకొని ముద్దుచేసుకొంటారు. కొంచెం విశ్రాంతి స్థలం కావాలి.. నివాళి రంగు ని ఖాళీ చేసుకోవాలి.. గుప్పిట బిగించిన నిద్ర రుచులని కలుపుకొని … మళ్ళీ తిప్పుకున్న భయంతో వెనకెక్కి చేరి తన మాటని దగ్గర చేసుకొని పీల్చుకొంది.

అటు వెళదామా … మహా నది… తెర తీసిన ఇల్లు అటే పునాదిని తవ్వుతుంది. కొన్ని దశాబ్దాల మంగళ ముహుర్తాన్ని వరించుకొని … ఇక్కడే తల దువ్వుకున్న దీప రాశులు తలపడే చోటు. భయం చల్లారబెట్టుకొన్న కలలని తాగి .. తూలిపడుతున్న నిరాశ మితి చక్ర స్తావళీలు.

తను ఒక చెట్టుని సింహాసంగా తొలచిన చోట కూర్చుని ఉంది .. నన్నొక పెద్ద రాతిపై  .. చుట్టూ కంచెతో  బోనులా కట్టి …

ఆమె ; చెప్పు … ఎందుకలా చేసావ్?

నేనెప్పుడూ .. నా స్వభావాన్ని దాటి అటు ఇటు పోలేదు. అలాగని మరింత కొత్తగా అడగడానికి నేను దోషిత రుచిని ముంచి చీకటిని ఎప్పుడూ చూడలేదు . అంతా దగ్గరకి రాకుండానే మాటని మార్చి తప్పిపోతోంది. ఇది కొంచెం వంచనతో తప్పించుకున్న నా జ్ఞాన దీపపు వణుకు కావచ్చు.

రాలేక పోవడమంతే .. రాకూడదని కాదు.

ఐనా నేను చెప్పడమెందుకు? నీ లోపల వినిపించాలిగా …

ఆమె ; శిక్షభారం మోయాల్సిందేగా ?

తప్పు ఏది ? మంత్రం నీలపు నవ్వులో తడిచిన ఈ దుఃఖపు అద్దాన్నిస్పష్టంగా చూడు.. నా గతమంతా నీ ముందు ఉంచుతుంది. కదలక కనిపించని వివర్శ రీతిని కడిగి .. వాళ్ళు మళ్ళీ తప్పి పోయిన నిరాశలో ఓలలాడుతున్నారు. కనికరించడానికి నేను ఏ కలని మోసగించి తీసుకుపోలేదు.

నువ్వు ఏం మాట్లాడుతున్నావో.. దానికొక baseline లేదు.. నువ్విప్పుడు బిహేవియర్ని , మర్యాదలని, వస్తూ వెళ్లడాలని నేర్చుకోవాలి.. కానీ ఇవన్నీ .. నువ్వు నేర్చుకొనే వరకు నేనేం ఆగాను… అప్పటికి నేను చేరిన ఎత్తులు .. అప్పుడే నడక మొదలు పెట్టిన నువ్వు ఎప్పటికీ అందుకోలేవు. మన మధ్య ఈ దూరం ఎప్పటికీ తరగనిదిగా ఉంటుంది. ఉండిపోతుంది ..

నేను ; నేను నాలాగే ఉన్న .. నాకీ శిక్ష ఎందుకు ? అందరూ అన్నీ వైపుల నుంచి నన్నే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు?

ఆమె ; ఇది నీ మాట … నేను ఇన్ని ఏళ్ళు నమ్ముతూ వచ్చిన మాట.. ఇక లేదు.

నేను ; ఇది ఏక పక్షం కదా?

ఆమె ; అంటే దేనిని నువ్వు నమ్ముతూ వచ్చావో అలానే ఎప్పటికీ జరగదు. నువ్వు మారాలి.. పూర్తిగా మారిపోవాలి..

నేను ; అప్పుడిక .. నీ ఉనికి నాలో ఆవిరై పోతుందిగా ?

ఆమె ; అది నేను ఎప్పుడో  చేసి పెట్టేసాను.. నీకిప్పుడు అర్ధమౌతుందంతే .. యు అర్ కంప్లెట్ల్య్ డెరైల్డెడ్ ఫ్రొం లైఫ్.. నువ్వొక బికారివి అంతే … నేనొక బికారిని దగ్గర చేసుకొంటే.. నువ్వు మాత్రమే ఉంటావ్ … మిగిలినదంతా నా నుంచి వెళ్ళిపోతుంది.. ఒక పూర్ణం లోంచి … ఒక బికారిని తీసేస్తే వచ్చే నష్టం నాకేం లేదు.

నేను ; ఇప్పుడు నేనేం చెయ్యాలి?

ఆమె ; నీ బిక్ష పాత్రని ముందుకు పెట్టు… నిన్న రాత్రి మిగిలింది దానిలో వేస్తాను… ఆ బయట కుండలో నీరు ముంచుకుని … నేను పని ముగించుకు వచ్చేసరికి నువ్విక్కడ కనిపించకూడదు.

నేను ; ఒక్క రాత్రి కోసమైనా మరెప్పుడైనా పిలుస్తావా ?

ఆమె ; మళ్ళీ ఎందుకు ? ఈ గొడవతో నన్ను వదిలేయొచ్చుగా ?

నేను ; నా నడక చిందించిన రక్త పుప్పొడి .. తేనె బరువుతో తూలిన నా చూపు.. శూన్య బిలంలో చిత్రించిన నీ బొమ్మ .. కన్ను ప్రసవించినప్పుడు మొదలైన ఊరేగింపులో తప్పిపోయిన సృజాయ పీఠం .. మృత్యు రధం దిగబడ్డ నా ఇల్లు .. ఇవన్నీ నీకివ్వడానికి… ఇంకా నా చావు చివరి వరకు సరిపోయేటన్ని మాటలు..

ఆమె ; నువ్వు నాకిక పరాయివి.. ముగిసిన కథవి. వదిలించుకొన్న బరువివి.. నా ఒంటి పైనుంచి తోమేసుకున్న జిడ్డువి.. స్మశానం నుంచి ఇంటికొచ్చి కడిగేసుకున్న కాళ్ళ ధూళివి.

నీ అప క్షేమం ఈ భూమికి  రక్షణని ఇస్తూ ఉందని నమ్ముతాను .. వెలిగించిన కట్టె కాలిపోయాక ఇంకా వెలుగుతుందనుకోవడం ఓ పిచ్చి అంతే…

                                                       ……………………………………

ఈ విశ్వానికి నేనేం అర్ధం చేయించాలి?

విసిగిన నా నడక లో .. దాహం పుచ్చుకొంటారా  ?  అని అడిగిన ఓ మిత్రుడూ నాకు లేడు. నీది దోషరహితం కాని ఆత్మగా నాకెప్పుడూ కనిపించలేదు. 

విరాగి నేర్పించిన కొత్త కథకి మేము ఎప్పటికీ సిద్ధం కాదు. మృత్యువు నిరంతరం తల్చుకోవాల్సిందిగా ఎందుకు ఉండాలి?

కనబడకుండా కనిపించే నిరాశ రెండో ఫలం .. పుట్టుక లో ఆరిపోయిన శరణు కౌగిలితో గర్భవాసం చేస్తుంది. వాళ్ళు కొత్తగా మారి లేవలేని నిద్రనే కలిపి పిసుకుతూ దీర్ఘ మోహంలో ఒత్తిగిలిన దృశ్యాన్ని నేర్పుతూ తప్పిపోయిన ఆచూకీలతో సత్రాలు నిండి పోతున్నాయి .

అందరికి అన్నీతెల్సు.. నీకే బతక నేర్వడం రావాలి.

సరిపెట్టుకోలేని నిర్దయల నిస్పృహ నీ రాతలో ఎప్పుడూ తిరుగుతూ ఉంది. ఆ రొచ్చు ని మేమెందుకు తలకెత్తుకోవాలి ?

నీ విషాదాన్ని మేమెందుకు వినాలి.. విశ్వమంతా నిండే శంఖారావం అదైతే అవ్వనీ ..కాకపోనీ… మాకు ఆ రావంతోనే నిమిత్తం లేదు. ఆపాదించుకున్న మూల సూత్రాలు ఎప్పుడో మూలన పడి మూలుగుతున్నాయి. ఆ చేరుకునే దారి ఎప్పుడో మూతపడింది.

ఇప్పుడు నువ్వు కొత్తగా తవ్వి సాధించాల్సింది ఏముంది?

……………………………..

నాలుగో పేజీ

ఆమె కథ ని తాగేసి పసుపు ముఖం తో మండపం లో కూర్చొంది … తన వాన రాత్రిని తలచుకొని ఇంకా కొంచెం దిక్కుతోచని ఎర్రకాళ్లతో మలుపులో ఆగింది.

ఎవరూ ఏం జరిగిందని అడగ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం నువ్వు చనిపోయి చాలా గంటలు గడిచాయని చెప్పారు. అతను ఊపిరి వదులుతున్నప్పుడు .,, ఈ భూమి కంపించడం మేము స్పష్టంగా చూసాం…పట్టుకోగలిగాం…

అదెలా సాధ్యం .. తను శాశ్వతం కదా ? ఇక ఏ మాటని నేనెప్పుడూ నమ్మలేదు.. తనని నాకూ ఇచ్చెయ్యండి.. అలా నాతోనే ఉండిపోతాడు. తన కథలని.. పాటలని వింటూ నేను అలానే శాశ్వతం చేస్తాను. తను ఉన్నప్పుడైనా అంతకుమించి ఏమీ ఆశించలేదు.

కొంచెం లోపలి సర్దుకొని.. తానింకా నా ఇంటిలోకి రాలేదు.. పాట బయటే వినిపిస్తుంది.. విందు తడిచిపోయింది.. నా ఆత్మ తీవ్రంగా నిద్రపోయిన ఈ ఇసుక మైదానం లోనే ఊపిరిని వడపోసి తన కివ్వడానికే ఈ ఖాళీ గాజు సీసాని ఇంకా భద్రంగా పట్టుకున్నాను. నేను తనకి అద్దం లో కలిసి అప్పగించి … ఆ చివరి ముద్దుకై కాళ్ళ మీద పడతాను.

నేను ఏ కథనీ .. నా కథనీ .. ఎప్పుడూ పొడిగించాలని అనుకోలేదు.

నేనూ దానికి ఒప్పుకోను అని తను నాతో అన్నప్పుడు … నేను అంతరిక్షం వరకు వినిపించేలా నవ్వాను. నా కళ్ళలో నీళ్ళని ముద్దుపెట్టుకొని.. నిజం .. నిన్నటి ప్రయాణంలో ఈ రోజు నేను ఉండను.. అనంతం నుంచి అనంతానికే నేను రాస్తున్నానని అన్నాడు.నేను నమ్మలేదు..

నేనిప్పుడు నమ్మానని చెబుదామన్న తను వింటున్నాడా ?

ఈ విశ్వం ఎక్కడి  వరకు పరుచుకొని ఉందొ అక్కడి వరకు నా మాట చేరగలదని .. నాకూ ముందే చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడో ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది….

కాని ఇప్పుడింకా పూర్తి కాలేదుగా అని నా ఆందోళన … ఎవరో నాకిప్పుడే చూపిస్తున్నారు… అలాంటి దిక్కుతోచని యజ్ఞ సాఫల్యం మరుగుతున్న ఉపేక్ష రంగుల్లో తిరిగి రాల్చుకున్న ఆత్మ .. పరస్పర రంగు నీళ్లలో కునికే విశ్వ నిర్జన గతి చిత్రానికి ఉనికిని ఆరబెట్టి .. వాళ్ళతో కలిసి నేను తప్పిపోతాను.

నా లోపలినుంచి జ్ఞాపకాన్ని తీసేసే మందు ఇక్కడెవరో నాకు పంచుతారట .. కాని ఆ queue అంతే పెద్దగా ఉంది.. ఇది కొన్ని దశాబ్దాల … శతాబ్దాలకై ఉందా?

ఇక్కడెవరూ కనిపించరు నీ మాటని వినడానికి… కోటానుకోట్ల కథలు ఈ భూమి దగ్గర కక్ష్యలోనే తిరుగుతూ ఉండటం.. అదే నాకూ అలవాటుగా మారే నిరాశ. నేనిప్పుడు నమ్మానని చెబుదామన్న తను వింటున్నాడా ?  ఇక్కడెవరూ

ఓ బికారిని నేనన్నా తను ఒప్పుకోలేదు .. తన బిక్ష పాత్రని ఎక్కడా వదిలిపెట్టాడని .. ఈ భూమినంతా వెదుకుతున్నాను … కాని .. ఎక్కడా ఆ ఆచూకీ నైనా వదిలిపెట్టలేదు. అయినా అది అతని పాట ని వింటూ .. ఆదరించి వేసిన బిక్ష.. నా జోలె పట్టి అడిగినా ఎవరైనా నన్ను కనికరిస్తారా ?  

నువ్వు నాకు ఇచ్చింది .. వరమా ? శాపమా?

                                                       …………………………….