విధా స్త్రీ … ఆఖరి పురుషుడు

                               విధా స్త్రీ … ఆఖరి పురుషుడు

Download Free Ebook
Download Now

                                         1st CHAPTER    

                       గర్భ నిషేధాలు .. ఆమ్ల తెగదెంపులు

1 . అనుపాత దర్శన .. రెండో స్త్రీ

2.  శరీర తాళాలు.. కాటుక రంగరించిన ఆవిరి.. దేహ సత్రం.

3.నా గర్భము నాదే నువ్వనే ఎరుక .. మృత్యుబావిలో చెమట కణం

4.ఆగాలని లేదు .. గాలి పట్టిన కల… వదిలేసి పోయాడు                              

5.సంధి గెస .. నిన్న నువ్వే .. సుఖాలాస

6.అద్దె నిబ్బరం.. సేవా గోళం.. అబ్బిన మాటలు..

7.సమయ పొద .. ఇంటి కబురు.. క్లబ్ తాళాలు

 8.వీర్య స్నానం .. దేహ ఉవాచ .. లేని చెరిసగపు పడకలు

9.అల్లికలు లేని మాంస కూర్పు.. పెద్ద మెడల గల్లంతు..

                                                                                  వశ్య గార్ధన లేని శరీర తేమ.

10. పసి రొమ్ములు.. స్తంభిత నిరమణ … విచ్చీల భ్రాంతియ రమన.

11 . సంక్షోమయ గోళ ప్రయాత .. కల మాసిన దేహ సాగు .. రెండో బిడ్డ అలాంటి   నెలలే ..

12 . నింపిన అవశేషాలు.. బీజ కీర్ణ వదులులు .. తన స్త్రీ పాడుబెట్టిన నెలలు

13 . తామా గర్గన .. నిందా వికృతులు.. కాకుండా పోదాం.. 

                             2nd  CHAPTER 

         పురా ఆలోయన …విచ్ఛిత్తి పొరపాట్లు..

1.శిధిల గర్భంలో అమాస .. ఎండిపోయిన ఇల్లు.. ద్వయన రూపసి

2. గుహని తొల్చుకొంటూ నిద్రదేవి.. రెండో బడలిక .. కాదనే కంటిజడ

3.  కదలికల రంజన .. బొడ్డు నొప్పి.. చల్ల ముంచిన నాడి

4. పాట లేని పాత ఇల్లు.. వాడు రాడు … దిశా నివురు సేవిత

5. నిశాపర్వ ఆందోళ .. తెలియని అడుగులు.. నిండిన రేవు నిరాధార

6.చీర పేర్చిన దీపం.. అవతలి ఒడ్డు.. బొడ్డు గాలిసూత్రం

7.నిరాధార .. తెలియని ఏక రధం .. కుక్కిన గోడలు

8.వాళ్ళ పెళ్లి ఫోటో .. గాలీ–వానల సంసారం … బిడ్డ ముడుల కంటి సొద

9.నిర్లయ సజ్ఞత … చామన దిగులు.. ఒరిగిన పెళ్లి ఇల్లు..

 10. నూరిన గంధక బిళ్ళలు..బయట పడిన రెండో పెళ్లి.. తెంపుకోలేక..

11 . విశ్రాయ చిత్ర ధూపం .. నింపిన వాన కొండ.. ఎర్ర బస్సులో వాలు కుర్చీ

12 . పెళ్లి లైట్ల గట్టు .. ఖాళీ పల్లకీ .. పడవ దాటించింది

13 . విమాగ సవ్య దోషం..నాలుగు దిక్కులా రుణ నాలిక .. రుచి కాన్పులో పాత కుండ   

                                    3rd CHAPTER  

              సైకో దృష్టి ఘాతాలు..విరంగామ నడతలు

1. ఆమ్ల ఊయింపన .. పులహిత రవ్వలు.. జోగిన తల ముంతలు..

2.బహుళ జాగారం.. కలత నిద్ర..దొరకని పురుషుడు

3.సరి చెయ్యని విన్నత .. ఒప్పుకోలేదు.. జోడింపు లేని మెడలు

4 .గెస్ట్ హౌస్ చిట్టీలు.. చర్మ నిద్రల కలత .. ఉండీ లేని నేరం..    

5.Live in దేహాలు.. ఫోన్ tapping’s .. మాంస నిఖిలీనాలు..

6 .ఎవరికీ వారే.. ఇప్పటికి మూడోసారి.. ECG  ఎలేవేషన్స్ 

7. adaptation … మూలాలు కూల్చిన మత్తెర.. రెండో నాలిక

8.ఉబిసిన గది వరద .. మంచం కింద శవ పేటిక.. తనిక వద్దనుకొంది..

9.ఎగిరి కూలతాడు .. కత్తి పుట్టిన బెడ్ రూమ్ .. గొంతులో బెంగ ముద్ద

10.  ఇక చెప్పలేం .. స్ట్రెచర్ పై నగరం.. మగధారణ

11 .బాలింత .. కథ చదివిన శత్రువు .. రెండు గుడారాల క్షేత్రం

12 . ఆమ్ల రుణాల కూర్పు .. తలలోని వాన కొంగు .. శరీర పొందుల తొక్కిడి

13 . మృత సన్నితాలు .. నెల కథల జాగారం.. ఉండీ లేని మూడో చీకటి తేదీ   

                                         4th CHAPTER   

              రోగి దేహ పత్రమూ … తాకీ తాకని నిరూపాలు..

  1.   శ్వాస రాలు సమయం .. విరాగ నింపుణి

  2. సహపార్ణ నిస్వాసీమ  .. ఆగని దుఃఖ నిధులు.. ఉత్తర గొడుగు

  3. సాయు రేగన వరుస .. ఎదురెదురు గదులు..దుప్పటి కోతలు

  4.వర్కౌట్ కాదులే ..నాభీ గొంతుల దోషం.. నాలుగ్గోడల పెద్ద శిక్ష

  5. రంజిప నానుడి.. తగలబడ్డ  అర్ధాలు.. చీకట్లో నిప్పులు

  6. అలగలు పడిన దేహ మాట .. సాధిత పగ .. తనలో తను..

  7.  కల్హడి .. నిద్ర అంజార్య .. పూత పట్టిన శబ్దం

  8.బ్యాంకు సీజ్ చేసిన ఇల్లు.. వేలం వేసిన చీకటి కాటు.. తను కొండా దాటింది

9.ఉత్త బొమ్మల గుండం.. ఫోన్లో సంసారం.. ఆనవాళ్లు లేని కొత్త కథ

10.ఊరిన మస్తిష్క ధార .. పెదాల తామన .. ఇకదే అలనేత చిల్లులు …

11 . ఈ లోపలి ఇల్లు నీది కాదు .. త్వరేయ గ్రహణ .. ఆటుపోటు సబ్బరింత

12 . అలోమయ ఉత్తర నడక .. మూడు సవారీలు.. ఐదు పుట్టుకల అప్పు

13 . పొడి బాటలో ఎర్ర నది.. సమయ ఔషధీ .. అపమ నిరోధి

                                    5th  CHAPTER

                   నిరావధి దేహ ఆలోకన .. సగ జారణ

 1.తను నేను కాదు .. స్వమర్మ తీవ్రాలు .. ఎనిమిదో అడుగు

 2.గమించిన ఆవాళి .. మూడు రాత్రుల విలాపన   .. కాస్త భయం పూసుకొని

 3.కాడె మోసిన బెడ్ రూమ్ .. గుప్పిన అలకలు .. ఇక అలా నమ్మలేం

 4.అలిమిన సంహకార కథలు.. అదేం వద్దులే .. బంధన నివాళి

5.విందు తమకాలు.. నీటి గంటలు.. కలబడి తిరిగి

6. Register eye … మూడో తీర్పు… కొండ నలత   

7.కూర్చిన నెలలు.. స్కానింగ్ మంత్రాలు .. గోడు నిలవదు 

8. మహా నొవ్వళి.. సాధ్య రేణం.. రుణ మంగళ సవ్యయ

9.నాదనే తను .. కలిసిన నీటి అడుగు .. నాలుగు గుమ్మాల మధ్య రెండు దేహాలు

10. విరి విరి దేహ తీరులు .. అదీ నేనే .. మమః జతల సాధన స్థితి

11 . సశరీర సౌష్ఠవ శాల .. వెనక పండిన పిలుపు.. ఆకళింపు మూసేసి..

12 . అముద్ర మాంస ఛాయ .. దేహ అనుగ్రహి .. భ్రమణ కూర్పు

13 . నివు రోరణ ..  దేహ కల్వంలో నీరు .. కాసిన్ని పుట్టుకలని కలుస్తూ..

                             విధా స్త్రీ … ఆఖరి పురుషుడు                              

తనలో తనకి దూరం కాని మైల  నిత్త్సవం .. పట్టుబడకుండా మళ్ళీ రమ్మని నిలదీసినప్పుడు .. శూన్య శాఖల వేర్వేరు ఘనాల చరిత నీలం ఒంపులో పడి .. అలాగే కలియతిరుగుతూ .. ఇంకేం ఉందనే నిద్ర దర్శనం కాక ముందే .. విడిపోయి.. మళ్ళీ కొంచెం విషాదం పోగేసుకొని కలుసుకొంటూ..

                                  ……..

వామన పాదానికి తొడిగిన మెట్టు .. గజ్జె కట్టిన నోరు .. గది మధ్యలోంచి పోతున్న ఊరు.. దుప్పటికీ సరిపోని  దేహాల నిందని మోస్తూ .. జ్ఞాన బిగీషని కలిపి చుట్టుకొన్న మాటల పురుడు..ఇంకొన్ని రక్త మలినాల గాలి కేకలు.. ఏవీ కనిపించక దారి తప్పి సీసాల గుట్టల్లో పురుషుడు..

……………..

సగం నరికేసిన వెదురు మెడ .. ఊల పోటులో సాగనంపిన దేహ పుకారు.. అండంలోకి ఇంజెక్ట్ చేసిన పురుషుడి బీజ కేక .. ఆమె తన గర్భ సంచీని వేలాడదీసిన వంట గదిలో .. పాడుబడిన శరీరాలు.. వాంఛని రెండోసారి విరిచి.. ఆ ఎత్తు నుంచి రాలిపడ్డ కెరటం .. తీరా గట్టు చేరక ముందే చల్లారి పోయింది..

……………..

నిండు మృత్యువు వెనక పాత రైలులో దాచిన పెళ్లి కబురు .. నిశ్చింత లేని అనునాద ఊరట .. ఒకే ఒక సమాధి దాచిన పడవ.. అక్కడ సిద్ధంగా ఉంచిన పెళ్లి పట్టు చీర .. గంధపు భరిణ .. గాజుల చెట్టు.. కాటుక కూలిన చీకటి కుండ .. అన్ని అలానే శిధిలమయ్యాయని చెప్పుకొంటూ ఎవరో వెళ్ళిపోతారు.

రెండు కలలని అంటు పోసిన .. ఏ కబురూ లేదని ఏడుస్తూ .. ఆ దీవిలో దిగాక .. పడవ తిరిగేళ్లే టైంకి ఆమె కనిపించదు.

…………………

అనుకున్నంత అయ్యింది .. అపార్ధ బంధన పై నిఘారించిన దేహ ధ్యాయతని నింపి .. కలలని దాటించే మూడు పుట్టుకలు పడగ ..

భజాలని .. నిద్రలోకి బరువుగా దించినపుడు ..వాళ్ళు చెలరేగిన ఒప్పందాలతో దేహ భూమిని అప్పగిస్తారు..

ఆ ఇల్లుని ఆమెకే వదిలి .. ఆఖరి పురుషుడు ఖాళీ చేస్తాడు.

………………

సాయుజ్యం చెప్పుకొన్న దేహ రీతుల్లో.. ఆఘ్రాణ కంటి దోషం కడిగిన పుట్టుకని దులిపారు. ఇంకాస్త నిద్ర తీరికని అడిగేలోపే ఆమె ధడాలున తలుపు బిగించి.. నిద్ర కాల్చిన మంచెం పై .. చితి నిగ్రహాల అద్దాన్ని బిగించి మరి దొరకదు.

ఇదొక కల్మష తూఫాన్ ..

రెండు దేహాలుగా లేని చెదురు మదురు గొంతులు.. సముద్రంలోకి జార విడుచుకొన్న కోట్ల అండాల సముదాయింపులేని అవశేష మూర్చన…కంటిని కప్పని దుఃఖం …

నిర్వాణ సమాధి పక్కాగా .. శంకుస్థాపన చేసిన లాబరేటరీ ..

……………………….

కలిపి కూర్చుకొన్న ఆక్రమిత శూన్య ప్రవేశిక ..

     ఒకటే .. రెండుగా లేని శత యుగాల పేరుపు.. అలవాటయ్యాం.. దేహఖజానాలో ఆమ్ల గని.. చర్యలని .. గమ్య సాంద్రత దొరకక  .. నిద్ర ఝాముల ఒరిపిడిలో దుల్లగొట్టి .. నలిపి .. కప్పెట్టి..  చప్పుడు లేని కన్నుని నానబెట్టి అక్కడే కూలబడిపోతారు.

నీటిని పట్టుకొన్నాం.. ఆవిరిని గాలించాం.. గర్భ నింపుదలలో కల్లోల ముంపు..

………………….

ఎదురు తిరిగే వేర్వేరు ముఖాలు.. అంతూ దరీ లేని పోలికలు

అవరాహితం.. రుద్ది చెప్పుకోలేని ఖాళీ నడక …అకారణ శరీర సలపరం  

పేరు చెప్పుకోలేదు….ఆ పెద్ద నిద్రలో గుండ్రంగా తిరిగి….

మాట దాచుకోలేదు… కథని మిగలనివ్వక ముందే .. గోడలిక వద్దని వెళ్లిపోయింది

సవరించబడని నిద్ర ఖాళీలని దాటుకొంటూ .. కొన్ని ఎండిన పడవల మధ్య సీసాల గుట్టల్లో వేలాడే ఆఖరి పురుషుడి గర్భసంచీ ..

………………..

అదీ ..ఇదీ .. ఏదీ కాని నిర్యాణ మంత్రం.. రెండో చోటులేని కణ విచ్ఛిత్తి డోలన..

సరాసరి ఏడు విశ్వాల మధ్య సాధ్య స్మరణ లేని ఆ దేహం మరిక కనిపించక .. సృష్టి నిండు వైధవ్యంలో బోర్లించిన రాతి గది.. మాంస గదుల్లో రసాయన క్లవన .. ఏదీ మరిక అందుబాటులో లేదని .. వర్ష పూర్ణాలు సమ ఛాయల గుట్టలోకొట్టుకు పోతూ .. అక్కడికే మరో విశ్వంలో చేరుకొని మొదలైన పురుష మాయాజాలాన్ని ఎవరూ గుర్తించరు.

……………….

పరి ముగ్థత ఊపేస్తూ .. స్వయార ఆర్తి గేలం.. పట్టుబడిన పెదాలు గాండ్రిస్తూ .. కాస్త కూడా ఊరట దొరకని మృత్యు సేవనలో ఇంకో పోలికలేని నిర్యాణ తలంపు..

నల్ల పొగలు ఊదుతున్న సంధి నిద్ర …లోపల వేలాడుతూ.. దుప్పటికి పులిమిన మట్టి చేతులని కలిసి.. జోకొడతావా ? అన్నప్పుడు .. ఇల్లే లేదుగా ? అని.. ఎవరో డప్పు కొట్టి మరీ .. నిలదీస్తారు.

ఆఖరి పోర్లింపు లేని  పురుష నింద …దానిని ఇంకెవరూ లెక్క చెయ్యరులే .. అని గది వదిలిపోతూ.. సముద్రం ముందుకొస్తుంది.. నువ్వూ వదిలేసి రా ? అని హెచ్చరిస్తారు

దేహం కావాలని ఇంటి ముందే .. చెల్లా చెదురైన గదుల్ని కలిపి .. పేటికలో…

……………………

అమంగా అయస్కాంత తర్జుమాలో చిన్ని చిన్ని తవ్వకాలు.. సమయ నలతలని జరుపుకొంటూ పోయే దగ్గర అనుమానాలు.. అవశేశాలు.. అనుగమన నిరాశలు.. అగడ్తలు..

ఓ పెద్ద నిద్ర కావాలనే ఇరుకు గదిలో… దేహ కాష్టం మొదలైనప్పుడు పుట్టుకలని బలి ఇస్తారు

రెండు దేహాలని పాతుకొన్న సంయోగ మంత్రం రార్జ .. ఆహామయ నిమిత్తం.

అవదేహాన కమ్మిన పురాతమాల విడి యుగాలు.. ద్రవ గర్భ నిషేధంలో పడి కలియదిరుగుతూ.. ఇంకాస్త ఊసూ పలుకూ లేని జోడింపులు మిగలవు.

సంధి విస్ఫోటనలో విధా స్త్రీ ని పట్టుకొనే ఆఖరి పురుషుడు.

                                                                1st CHAPTER    

(Background ;  కృత్రిమ గర్భాలు … impotency .. అలవాట్లు … multiple relationships …

కో–లివింగ్ .. డేటింగ్ అప్స్..  )              

                       గర్భ నిషేధాలు .. ఆమ్ల తెగదెంపులు

సరళ ఘాడత … నేననే ఉనికి సర్వం మీదికి దుమికాక ముక్కలైన పురుషుడు.. సాధారణ రసాయనతలని అడిగి అతను దారి తప్పుతాడు.. ఎవరూ నిలదీయరు.. చెప్పిందీ వినరు.

తిరిగి assemble చెయ్యడానికి ఏ వర్కుషాప్ లోనూ ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు చచ్చిపోవడం తప్ప మరోదారి లేదు.. ఏ మాటని గట్టిగా అరిచి చెప్పినా ఎవరూ లెక్క చెయ్యరు.

ఆ ఇళ్ళకి అన్నీ గుమ్మాలే .. పై కప్పు నిండా సోషల్ మీడియాకి కనెక్ట్ ఐన సీసీ టీవీ లే..

గది కాపలాల  వెనక  తెర .. ముఖాలపై పుస్తకాలని తీర్చి స్క్రోల్ చేస్తూ..

మరోసారి నా నిద్రా యుద్ధం కేక పెట్టింది.. ఆయుధమూ తనే లాక్కొంది.

తను లేకపోవడమే .. ఆ ఇంటి వీలునామా ? స్నానీయ కంటి శుక్లాలు .. లోపలనే చుట్టుకొన్న అనుమాన చీకటిలోని అపరోధాలు..

అది ఎక్కడో తెలియకుండా .. అందకుండా దాచే ఉంటుంది.. భరణం తర్వాతే ..

ఆరాలయ గంభీనంలో .. అడుగంటిన ప్రశ్నల చివర ఇంకొక శత్రు స్థావరం నిండిపోయింది.

                                               ……………..

ఈ దేహం .. నా ఆస్థి .. నేను ఎలాగైనా ప్రదర్శించుకొంటాను .. మింగేసిన నగిషీలు .. ఆష్ట్రే లని బోర్లించి తూలుతూ .. విసిరేసిన సీసాలు… తడిచిన నిక్కరుని మెరిపిస్తూ స్ట్రీట్ లైట్..

నా ఇంస్టాగ్రామ్ అంతా మచ్చలు కనిపించకుండా తొడిగిన ఫొటోలే .. అప్పుడే  పార్లర్  నుంచి బయటపడ్డ .. రంగు పోలిష్ తల తలలే……….. కదలక మాట్లాడుతూ..

కొంచెం యోగాలు.. థ్రెడ్ మిల్లులూ … లెగ్ఇన్ నడకలూ … సెల్ఫీ చమక్కులూ …

సింగల్ ఇంటిమసీ లా .. చీకట్లో.. వాడు మెట్ల దగ్గరే ముడిచిన నిద్రలో … వణుకుతూ..

వెక్కిళ్లు పడుతున్నప్పుడు.. తిరగబడి నిద్రని వెదికే కంటితో… శ్వాస కప్పిన మంచుతో..

తను అతనిని ఓ కుక్కపిల్లలా ఎత్తి దగ్గరకి తీసుకొంది. తలని దువ్వి..

నల్ల కళ్ళ మర్రి చెట్టులా ఆ చీకటి సముద్ర పోటుని చూస్తూ నవ్వి.. అమాంతం విసిరేసింది. అతనికి అది తెలిసినా మునివేళ్ళ అలికిడిని తలచుకొంటూ … అలాసపడి … స్వయాదీప ఆందోళనలో మోసుకొన్న ఐహిత మత్తు ఊడలని అల్లుకొని..

 భయమనే  కౌగిలి అర్జీలు మళ్ళీ మళ్ళీ పెట్టుకొని … అడిగీ అడిగి లేదనిపించుకొని … తనకి తెలియని నిద్రతేరుల్లో .. వడ్డించి లాగేసిన శరీరం ఆరబెట్టుకొని ..చీల్చి.. మరింత తేమని ఊది.. ఇక మరే సాయుధ సంతర్పణ అక్కడే జరగదని నమ్మించి .. లోపలి పంపిస్తారు  ..

అక్కడ ఏది లేదో అదే దొరుకుతుందని నమ్మాడు. వాళ్ళు చెప్పాలనీ అనుకోలేదు.. అనుభవమే సమాధానమని వాళ్ళకీ తెల్సు. అదొక రహస్య నల్ల సొరంగంలో దాచిన ఆశ.. ఎంత వెదికినా ఆచూకీ దొరకదు.. వాళ్ళు కొన్ని మాటలని జోడించి అక్కడ బట్టల మధ్యలో దాచి వెళ్ళిపోతారు.

 అలయ దీపకణం.. విచ్ఛిత్తి చలన తమకం .. నిండారబోసిన వేడుకలో .. కనబడని కన్నుని కాల్చి ఏడుస్తూ .. నిద్రకి సరిచెయ్యని .. మిగులురాతని సరిచెయ్యక అరుస్తుంది. ఇంకేం కొత్త నిద్రలేని తుడిచే ఖాళీలు మిగలవు. తడి ఆరబెట్టక ముందే ఎవరో దాడి చేస్తారు.

 విపలోమన చేదు గొంతులో కాలే నిప్పు.. ప్రాణ నిర్భర గతిని మార్చే నిలువెత్తు తలకిందులు చీకటి వలయం కూర్చొని .. కాస్త నిద్రని జరుపుకున్న తెరల వెనక చోటు తెలియని నిరాశని దాటిస్తూ .. అక్కడే మాటలు జరిగిపోతాయి. తాడనలకి  కూలిపోయిన ఆయాస స్తూపం…

                                                                                 ……………..

గర్భ నిషేధమే .. నా ఒంటరి శాపాలు ముడి .. పిలకలేసిన గర్భ మొవ్వుల ఎర్ర పన్నులు దిగబడి.. అదో రకమైన వదలలేని తనమని ఏడుస్తాడు.

తపమా మహా నీలంలో చేర్చి పోయిన కంటిని భద్రం చేసిన కథలు..

కేకలు పెట్టి తప్పించుకున్నా .. గుండ్రంగా తిరిగి అక్కడికే చేరతానంటాడు.

నేను ఎన్నోసార్లు .. నాకు నేనే చెప్పుకొన్నాను.. ఆర్చుకొన్నాను.. తిప్పలుపడి తప్పించుకున్న .. మళ్ళీ కళ్ళకి గంతలు కట్టుకొని.. పరుగున వచ్చి అందులోకి దూకేస్తాను.

ఏం చెయ్యను? ఏళ్లగా ఇది మాత్రమే తెల్సింది.

గర్భ మాల వాడిపోయాక ఫ్రిడ్జ్ లో పురుగులు.. వాడిని తను ఓ సంచీలో కట్టి ఊపిరి ఆర్పేసాక .. విఞ్ఞాయత లేని తెగదెంపులు.. ఈసడింపులు.. కదిలింపులు.. పగ ఒంపులో..

శత్రు పునాదులపై యత్న సంధికి  తెలియని పాట అక్కడే తాడుని అడుగుతుంది.

వాళ్లదే విని పడవని వెనక్కి మళ్లిస్తారు. ఇక ఎవరినీ ఇటుగా ఎంతమాత్రమూ రానివ్వరని అతనికి ఎప్పటినుంచో తెల్సు.

                                                                                  ………………………………

                1. అనుపాత దర్శన .. రెండో స్త్రీ

ఒక మోనోగ్రామ్ ని  నిర్ణయించాలనుకొన్నప్పుడు ఒలికిన .. దేహ స్కలిమ …

 పలకరించి .. తను చూడంది.. చెప్పుకొని చీకటి మెలికని చేర్చుకొంది.

సుగాలీ .. కంటిద్రోణుల తేమ .. శరీర విహీత కౌగిలి.. విమమ్న కుంపటి..

ఆ గదిలో ఒప్పించుకోవాలని చూస్తూన్న పురుషుడు.. సరిలేని అండ ..

దగ్గర చేరి.. ఇల్లుని దుప్పటిలోకి పట్టి.. మృత్యు తాళాన్ని దులిపి .. నదిలో మునిగాక..

స్పధికర  శ్రద్దని మోసిన కలవర తీరికలో పలకరించి .. తను చూడందదే.. అనుపాత కమాలిక …

                                                           ********

వద్దనుకోవడానికి ఏమీ లేదని .. నిద్ర తారీకుల్లో తిరిగే శ్లేషభూమి .. నిర్ల సాధ్యకి…

వందల క్లాజుల మధ్య అగ్రిమెంట్ .. ఆ బూడిదని కలుపుకొని తాగి..

హంతకుడి వేలి ముసుగు రుద్దిన శిధిల చావు..తడబాటు లేని శవాల గది..

ఏముంది.. స్వానుపాత దర్శనతో కుండలో పుట్టే బిడ్డ.. ఆస్తి జమలు చేసుకొని నోటి దీవెన..

ఎవరూ అతనిని వెళ్ళమనలేదు.. ఉండమని అనలేదు.. సంక్షోమ్న వర్ణ మితి..

                                                         *************

నా దేహశాలలో చీకటి గతి పట్టుకోలేని రసమస నిధుల వేట.. ఇగిరిన నవ్వు..

వీలుకాని రసాయన నిర్గతిలో ఆవరించిన వాంఛ రెండో నిలువు ఇంటిని తొక్కేస్తూ..

ఆమ్ల శాసన ఏడ్చి మొత్తుకున్నా .. రాజీ లేని వేరుపాటు గోడలు ఎత్తులు పెరుగుతూ..

చిత్రిక పట్టిన నల్ల శరీరపు గుబులుని చెక్కి .. పైకి చూసినపుడు ఆగి ఉన్న ఫ్యాన్ .. తప రుంధన..

అసహన మతి పెగుల్చుకొన్న .. విరుచుకు పడిన సమయ రశ్మి..

తలపెట్టిన అరమరకల వెనక తలుపు చివర ఎవరో తప్పిపోయారు….

                                                                                        ఒడిలో పోసుకున్న ఇసుకమడి..

                                                          ***************

ఒక రాత్రంతా నా లోపల చనిపోయిన నేనుని కలిసి ఏడవాలని.. కప్పుకొని కూలాలని..

                                                  వాడు వెకిలిగా నవ్వి.. శ్వాసని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.

వాడు రాడులే … వాడక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ ..ఎవరినో తగులుకొన్నాడులే..

                                                                                  ఇక్కడ దొరుకుతారులే కొంచెం చవకగా ..

నువ్వొక అగ్రిమెంట్ రాసుకో.. సర్దుబాట్లు .. ఉబికిన తూఫాన్ల పై కమ్ముకొన్న స్మశాన చరియలు..

తెలుస్తుంది.. ఇదేనని అర్ధం కావడం లేదు.. నల్ల మరకల అద్దంలో తొడలని పాలీష్ చేసుకొని ..

చీకటి తురిమిన వాగులో .. 16 వ  అంతస్తు .. ఎత్తు తక్కువ ఉన్న బాల్కనీ రైలింగ్ ..

 గెస్ట్ హౌస్ GPS లొకేషన్.. will discuss in detail … అంటూ .. సెకెన్ల కోసమే ..

                                                           ***************

బెల్జేరియన్ విగ్రహం.. తన శూల దండం ఊపి.. నిలదీసి .. సలబాటు బొమ్మల చితి ..

విశ్వాసఘాతం .. సరిపోలని క్రమాల అంటు స్కలిత … conceived ?

  నేను దీనికింకా రెడీ కాలేదుగా … విశ్వాస అర్ధంలో మింగేసిన ఆగమ నటనలు.. గరుకు.. విలయ తాపాలతో మునిగిన దేహ నీరు.. హెయిర్ షాపు.. గోల్డెన్ ఫేసియల్ ..

 లిక్కర్ ఊపు .. లిప్స్టిక్ కుబుసాలు.. ఏసీ మండలాల్లో పెడిక్యూర్ ముద్రలు.. సతీప గండాలు

ఉన్నాయని .. లేవని అనుకోకుండా .. తవ్వి తీసుకొన్న నిద్ర పడగల నల్ల గొంతుని కాల్చుతూ .. సమయచితి ఖాళీ చేసుకొన్నా విడువని  దేహవర్ణ లయని సరిచేసి..

కదిలే దుఃఖమానులో కొట్టుకొస్తున్న ప్రతీక్ష జతుల కలవర కూర్పులు.. సరిపోలం..

విశ్వ రంజిప కౌగిలిని జోడించి పురుష త్రయంలో చుట్టిన ఎర్ర కన్ను…

 ఆ గది రెండో శరణుని కాదన్న .. గోడల వెనుక తెల్లపొడిలో నులిమిన రక్త స్రావం..

గతి ఆవర్త కందిన చీకటి విలోమలో ఎవరో లొంగదీసుకొంటారు. .. కర్ష నింద..

పడి .. పడి .. రాలిన భయ సెగల అనంగీక పుండు.. చెలరేగినా వదలని హోరు దాడి.. 

మత్తు పులిసిన మండలంలో ఆదమర్చిన సాలోచనలు తిరగబడినపుడు … తక్లిష్ఠ ఒగర్పు

నేననే పోలికలేని నల్లని అరుపుల దూరం. … దుఃఖమొక అనుభవ సంద్రత మెలిపెట్టిన కథగా .. .. ఉరితోపు

 ఉండీ .. లేకపోయిన దేహ సాధన మూర్తుల కంటి జ్వరం … స్వయక్రమల మాంస దోషం..

                                                                                        ***********

నా నుంచి నీకేం  కావాలో తెలిసినప్పుడు  .. కూలిన హద్దుల తూఫాన్ .. కలోదధీమ్నామగత..

చలన మితిలో నీటి పట్టులు దులిపిన  బట్ట .. నగర చిలుము దులిపిన యాష్ ట్రేలు .. కో-ముడుల కీ బంచ్..

 ఆగి తెంచోసుకొన్న .. కోరి కలవడానికి ఏదీ లేక.. లెక్కలు సమానమై … నిండి ఎగిరే క్లబ్లు

ఊడదీసుకొన్న విపత్తు .. పైకి దూకి ఆక్రమించాక.. కలవడం విరమించుకొని..

                                  ——————————–

                   2.  శరీర తాళాలు.. కాటుక రంగరించిన ఆవిరి.. దేహ సత్రం.

నా గర్భ సంధిని వదులు చేసే కదలికలు .. ఒడిసిపట్టిన చెమ్మలతో.. నిరూప పురీషనాళం.. స్థితమిత రొప్పుని పీల్చి.. కల్పిత  బంధన .. చేర్చుకొన్న నిరాకార ధ్వనిపలాలం..

శేష ఊర్పులని  కనిపెట్టి .. నల్ల సాగులో పిల్లల పూడిక .. శరీర తాళాలు.కల రేహమ..

కనపడటం.. వినపడటం .. చేర్చి పెట్టుకోవడం.. వెల్లకిలైన నిరోధ శూన్యాల కైపు..నిఘాది గొంతు నజ్జు .. తలపడగా ముందే తల కాళ్ళ దగ్గర…  చావు ఊబి

మొరాయించి ఆగిపోయిన మాటలనే చేర్చి .. కథని మొదటనుంచే దాచి పెడతారు. 

బీడు పట్టిన మగతనపు ఎంగిలి .. ఆపి పెట్టుకొన్న గతి నిందల హోరిమి.. ఎవరు తేలిక చేశారనే ఈ గట్టిపడని మాటని తీసుకొని ఉరి పోసుకొంటారు? ఇంకొకరు లేని పరాయి శిలా ధూపం…

చెప్పి పెట్టాం .. కదిల్చి వణికాక .. పుంస మంగళ తీపు.. చేతకాని ఆమ్ల రోదన…రంగు సొట్టలు

సరిచేసుకోవడానికి లేని దేహ పొరుగు.. విపరీత చూపుల్లో వెకిలి పుట్టలు.. మాసిన నొప్పులు

తనెవరు? ఇక్కడే ఎందుకు మాటని పొడిచింది.. ఉమ్మడి గదిని ఎందుకు వదిలారు.

                                                                                          పూత రాలిన గోడలు.. గోడులు                

                                           *************************

దేహ సత్రంలో ఉమ్మనీరులా తొట్టె.. కదిలించి కాపలా పెట్టుకొన్న స్కానింగ్ పురుళ్ళు..

                                                          సమయం నీటి యాస లేని కౌగిలిలో పొదిగి వెళ్ళింది.

పుంస వాగులో జ్వర కుండలు.. మాంస సగపు నులిమిడి ఎండ ..  రెప్ప పుట్టిన మంచాల నేత …

తను పగగా రొప్పుని కూరినపుడు .. నేను..నువ్వు అంతే… నిష్ఠుర ఆగిపోలేదు..

మాటని పీల్చేసింది.. నెట్ వర్కుని కాపాలతో కొరికింది.. డిజిటల్ హద్దుని గాల్లో తిప్పింది.

తీరు మార్చిన నల్ల మడుగు.. దీప పుక్కిలింతలు.. తలవాల్చిన నిందలు..

                                                 వెన్ను పుచ్చిన సరుగుడు ఊలరొమ్ము కాసిన ఊయల  

ఉరిమింది .. తిరగబడింది.. లోపల వణికి కరిగింది.. బయట పొక్కిన ఆరాలు..

శరీర ఫలం.. పులమారిన రొప్పు .. ఎక్కి పెట్టుకున్న తేడాలు.. నిరాయ మాంసతోపులు.. తలపట్టుకున్న ఊంచిత జుత్తు మెరుగులు.. మెట్లు కరిగినా ఉండని తలుపుల ముద్ద ..

కిక్కిరిసిన మంగళ వీధులు .. వేగిరపడ్డ రోడ్ల బయట కనపడని జోడింపులు .. స్వతజర..

                                                 *****************

బాధ తలపోసుకొన్న నివురు శరీరాల చప్పుడు… అప్పగించిన దేహ నలత తీరులు..

                              విడిపోయిన మాంస ముఖాల్లో .. తేడాగా ఉండిపోయిన నాలుకలు..

అంతా విడిచి ఎటు పోవాలనే.. నిందలు కాల్చి వాలిపోవాలనే.. క్లబ్బులు చుట్టి పారిపోవాలనే..

                                                      నల్ల మాంసంలోకి దింపి మోయలేని ఏనుగు పల్లకీ

తేల్చుకొన్నా .. తేలికపడని వీరగతి.. శుభ్రపడని నిర్గతి.. శ్లేష్మ గంధక నల్ల మడుగులు..

మింగేస్తుంది.. దూకేస్తుంది.. సరళ తీరికలతో దుఃఖ జాడలు కూల్చినా ..

 కాస్త దిగులు పోసి ఒంటరిగా తోసేస్తారు.. నిందిస్తారు.. కలబడతారు..

                                                                          కన్నుని పగలగొడతారు.. ఛాయా డీలలు.

ద్రవళించిన రుతు పీడలు ముంచేసాక …కొంచెం ఆపమని.. అలపమ రూడీలు..

చెమట పోసిన కారులోంచి దిగి ఒక్కసారి కూడా వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది.

                                              నిస్సరించిన చలి గాడ్పులు … నరాల ఉండ మెలికలు పడి ….

రాకపోవడమనే సంతకాల బాండ్లు .. పైకి తిప్పి కట్టిన కథా మునకల ఒడ్డు ఒట్లు ..   

                                                  ******************            

 గమనిత శిలలు .. ఒరిగిపోయిన చీకటి అవసానలు…ఒద్దిగించిన నాటక లీలలు.. అర్ధాలు ..

                                                 ఆ  అణుకువ నిందించిన దూర ముడుల కెరటాలు

వరద కూడలిలో నిద్ర చాపిన రాక్షసి పట్టి ఎగరేసిన ఎర్ర గ్రహణం…మాసిన బట్టలు..

                             ఎండిన ప్లేట్లు.. చదవని గదిలో సిగేరేట్ పీకలు..నల్లబడ్డ ఫ్రిడ్జ్

ఒప్పించి పెట్టుకొన్న నిద్ర బజారులో మాంస అమ్మకాలు ఆ రోజు ఆగాయని అసహనం …

పీల్చి చూపుతారు.. తెచ్చుకొని సణుగుతారు.. మాట పట్టుకొని మీదకి లేస్తారు..

వికలమయ్యే తిరుగు శ్రమల అండ .. కదిలించి పెట్టుకొన్న తగువు… ఇక ఈ శరీరమే వద్దని..

                                 ఎండి బీటలు తీసాక .. వాడు నైట్ డ్రెస్ తో బయటకెళ్లిపోతాడు.

ఆలంబన శ్వాస కృతి తెగి.. మొండిగా జారిపోయిన నిద్ర దశలు తెల్లారిపోయాయి.   

                                                                      **************************                                                                                                                                                                     

 గదుల్లోకి సంపద మార్చి తెచ్చుకున్నాం.. కళ్ళు తిరిగే లెక్కలు .. గొడవలు .. వాటాలు..

                     టెస్టులు..తీర్పులు.. గెలుపులు.. మర్యాదలు.. జాతకాల నెంబర్లు..రంగు రాళ్లు..

ఒక గోడ .. ఇంకొక గోడ.. ఆ బాల్కనీ.. ఈ బాల్కనీ… దానిని మింగిన బిల్లు .. బ్లేడ్లు ..

                                        కొప్పు చుట్టిన చీకట్లో .. విరబోసిన చావుల కీడు దంభపు నవ్వు..

నల్ల జాడీలో సీక్రెట్ ఫోల్డర్ల పొగ .. కమిలిన ఆయుధాల బూడిదలో ఆచూకీ లేదు..

పురుషుడు కావాలని ఆమె ఎప్పుడూ అరవలేదు.. గుడినీ దాట లేదు.. ధర్మమూ వినలేదు.

ఎవరో అనుకొన్నా .. ఇక్కడేదీ మిగిలి పోలేదు.    

                                                                _______________________

      3.నా గర్భము నాదే .. నువ్వనే ఎరుక .. మృత్యుబావిలో చెమట కణం

తను కొన్ని నిర్వచనాలని నా పైకి వదిలేసి పోయాడు.. అవి పాతగానే మిగిలాయని ఎవరో అరుస్తారు.

 నేను నా దేహాన్ని అందులో నింపేయమని చెప్పుకొంటాడు.. సలగడ నేత

ఓ మధ్య రాత్రి లేచి.. వాడి కౌగిలిలోంచి బయటపడి .. వాడి పొగని పీల్చి.. గ్లాసుని తూలుతూ హాలులో

విసిరి కొట్టి… డైనింగ్ హాల్లో   దొరికింది .. దొరికినట్లు తిని.. షవర్ లో మత్తు తోసి…

 నా గర్భము నాదే .. అన్నాను .. ఓ సన్నని దమనీయ గొంతుకతో..

వాడు విసుగ్గా చూసి .. కొంచెం కంగారూ పడి .. రెప్పలు పూర్తిగా ఎత్తలేక కష్టపడుతూ..

 ఇప్పుడెందుకీ డిస్కషన్ .. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ టుమారో.. believe me ..

నాకు రేపు బోర్డు మీటింగ్ ఉందని.. బొంగురు గొంతులో తెగ్గొట్టిన మందు సీసాలా .

చెమట గనులు పీల్చిన మంచు పేటికలోంచి .. స్మశాన కుండల చప్పుడు తుడిచి…

 నా స్థితి గమన చిత్రం వెలిసి పోయిన నిర్వాణ సూత్రం ..ఒక తాటి పై నిల్చాక .. ఉండబట్టలేక

…………………………………

ఇది ఒక దేహమూ .. ఓ అన్వయ కల్ప ముద్ర .. చిగురు రాలిన చెట్టు మొండిగా మారాక..

సర్దుకోనివ్వని మాంస శాపాల గుట్టు.. ఒప్పుకోని గదికి తాళాల మధ్యనే నిల్చుండి పోయిన

శరీరాల నిషా వర్తన కీ వాడల్లో తిరిగే అపేక్ష ముఖాలపై ఒదిగే కాస్త గురి మార్చి..

మృత్యుభావిలో చెమట కణం … చెట్టు కూల్చిన దీప నరకుడు తలలు.. పాకుతూ వెళ్లే దేహం

నేను తెలియడం .. నాకోసమా ? నీ కోసమా? ఏది ఎందుకు ? ఎక్కడ ? ఎలా ? అని తెలియాలిగా?

………………………….

స్పష్టత లేని మహా సంతర్ప మూర్తిని బిగలాగి .. కొంచెం అనుకోని కాదని .. ఆ పైకి సర్దుకొని చూసాక ..

నీలోకి నేను సరిపడే .. నిద్ర కధనాలని కప్పి … నువ్వూ నేనని  పరాయిగా విడిపోయి…

 నా ఇల్లు పరాయిగా .. ఆ తలుపుని కొడుతుంది. వీధులు విందుకై తొంగి చూస్తాయి…

……………………………..

 అదొక సంపూరక ధ్వనిని మింగిన శూన్య శాల లో నన్ను నేను చూసుకోగలిగే .. నా మాటని నేను

తుడుచుకోగలిగే….. నా శ్వాసని నేను పెట్టుకోలేని నిస్సరిత విడిపేర్పు…

 ఏ అద్దంమో నాకక్కడ దొరుకుతుంది.. అది ఒక చలన మూలక మూర్తిని తట్టి లేపే.. హలార

వర్ణ ఛాయగా పైన కురుస్తూ .. ఇంకొక చీకటి భ్రాంతిని తెరుస్తుంది..

బహుశా .. అది నిన్ను ఇంకా దగ్గరగా చేరడానికి పనికి వచ్చే దగ్గర దారి కావొచ్చు .

 అది అలాగే ఉండిపోవాలి. … చలన నిర్గతి ఆధారాలపై కదులుతూ…

కాస్త కంటి శీతల తమక మంథన క్రియని స్పష్టంగా ఉంచుతుంది.

తలలోనూ .. బయటా నేను నీతో కలిసే vasa అగమ్య మూర్చన .. పుప్పొడి రాలిన స్త్రీ కథల పురానిద్ర ..

ప్రయత్న రాజీలు లేని వికర్షంలో పడి ఆచూకీలేని పురుష నివాళి..

తన కాళ్ళ కింద ఒబ్బిడిగా సర్దుకున్న అతని కథని ఇప్పుడెవరూ అడగరు.

ఏ నిమిత్తము లేని పరుగుతో .. నిశ్చలంగా ఉంపోయిన నిద్ర రూపులని దాటి పైనే మాంస నిద్రలు

ఎండిపోయిన కలవరింత ఎవరికీ పట్టదు.. నన్నూ కదల్చలేరు.. ఆగాయ దీహమ

అదంతా నువ్వు చూసుకో.. నాకు నీ వరకే నిమిత్తం.. ఆ పైన ఇంకే ఖాళీలు లేవు

రంగు ఊడదీసిన పెదాలతో..ఇనుప కాళ్లతో మెలిక వేసి పైకి రమ్మంటోంది..మాట అలాకాదు..

ఇలా అంటుంది.. నడక అటు కాదు.. ఇక్కడే ఆగాలి అంటుంది.. కరకు నిద్రకుండ పగిలినట్లు….

ముందుకీ .. ఇప్పటకీ .. నీ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది.. ఠిస్ ఐస్ అచ్చెప్తబ్లె ఫారం మై ఎండ్ .. అని..

గొంతు నిండుగా ఉరిమిన కథలతో.. గదిని మార్చ మంటోంది.. మొత్తంగా….

ఐతే అవుతాయి.. నేను దొరకడమే ఎక్కువ.. ఫాల్స్ సీలింగ్ నుంచి అన్ని మార్చాల్సిందే

ఓ న్యూ అంబియాన్స్ లో మళ్ళీ కలుద్దాం అని.. వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది..

                                          ………………………………….

      4.ఆగాలని లేదు .. గాలి పట్టిన కల… వదిలేసి పోయాడు

అస్తవస్త్యంగా పడున్న ఇంటిలో .. కాళ్ళకి తగులుతున్న మృత్యు పేటికలు .. వర్షపు జిలుగు .. తనతో ఉండలేని నిరాశ మూర్తులని.. గోడలు దాచలేని దూది బాండేజీల కట్లు…

ఇదొక కలవర గతిని కూర్చే .. అనునయ ఛాయా ముద్రగా మార్చిన నాటకంలో వదిలేసి పోయాడు  … అప్పుడిక గ్రీన్ రూంకి .. తెరకి మధ్య ఇంకేం గోడలూ లేవు.. అమ సంజీత

 పురుషుడిగా… నేనిచ్చే కొత్త నిర్వచనాన్ని తానొప్పొకోలేకపోతున్నాడని నాకే తెల్సు.

ఎందుకు చెప్పలేక పోతున్నాడో అదీ నాకు తెల్సు.. దానికి బయటనుంచి నేనేం కోరుకొంటున్నానో .. అదీ తనకి తెల్సు.. ఒకరికొకరం చెప్పుకోము.. వినము.. ఎదురుపడం.. ఒప్పుకోము.. ఇది ఇలాగైనా మిగులుతుందాని ఆందోళన అంతే.. … మనః ధ్వని విలోమ స్వఖీయ ..

తలపట్టుకున్న చీకటితో నల్లని అనుకరణని దాటి … నడకని చూపించే పగటి కలకలు … 

ఒక ఆయత్న  సరంజామా .. పై నుంచి లాగుతున్న చీకటి గోళం లోని వణుకు.. తత్తరపాటు.. జిగీష  మడతల దేహ పుంజీలని బిగించి రాల్చుకొన్న నిద్ర ఉరులు. జంట రుబ్బు..

 శూన్య చలనంలో ఎదురుపడి .. ముఖాన్ని ఛాయా మాత్రంగా ఒడిసిపట్టిన కలలని నెట్టుకొంటూ .. శరీరగతి చనిపోయిన వికర్ష తాడనల అనుమానం పులుముకొని.. సర్దుకోలేని ఒక సమర్ప మితిని సరిచెయ్యలేని కథతో నేను లోపలే నిండి పోవాలని.

చంచార్య దేహ బిగువుని చుట్టుకొంటూ .. సంధి చెయ్యని నిద్ర వర్తుల ముఖాలన్ని సాగదీసి నేను ఓ సంకల్ప నెగడుని ఊది.. కదిలే నిస్సత్తు తీరికలని దాటి.. జమల దొంతి

…………………….

 సంధి పూనకం మింగిన బాల్కనీలో ఇప్పటికీ ఏడుస్తున్న నీడ .. రైలింగ్ని వంచుతూనే ఉంది..

రక్కిన గోడల వెనక దాచి పెట్టిన నాలిక.. నీళ్లు ఆగినప్పుడు ఎర్రని షవర్ కింద గుక్కలు వినిపిస్తూనే …

ఏది దాడి ? ఏది కాదు? ప్రశ్న రెండోసారి వినక ముందే వాడు గదిలో లేడు.

విచ్ఛిత్తి ఎగిసిపట్టులా పుట్టగొడుగులు రాలుతూ.. శరీర భీష్మణ ముంపులో పడి లాక్కుపోయిన అవహేస రంగులు వదిలిపోతూ … బిగించిన రాతి చలన ముద్దలు రాలిపడి .. శ్రయా మూర్ఛ

కన్ను నులిమిన ఏక నిద్రారంలో పడి పట్టుకు పోయిన మాటలతో గొంతు.. చలన మంద్రత …

ఆ పురుషుడే లేనప్పుడు .. నేను స్త్రీనీ కాదు.. శూన్య మాదక ఊంజ

గర్ష మండలంలో పడి రాలిన యుద్ధ ముఖాలతో మోసిన గండం.. పెద్ద కాళ్ళ కొండ ..

…………………………………….

 నీ  లోపల పురుషుడు అప్పటినుంచి కనిపిస్తున్న .. వాడు నాకు ఎంత మాత్రమూ వద్దు. యుగాల ముందే వాడిని వదిలేసే నేనిక్కడకి వచ్చాను. ఆ ఇంటి నిమజ్జనమూ జరిగిపోయింది….

ఆమె నవ్వింది.. జీర అమాస గోళం ఆమ్ల నిద్రని  తాగి .. కెరటాల తెల్ల నురుగుని వాంతి    చేసుకొన్నట్లు… పుల్లని వికారం.. దట్టమైన అలమత … మసిబారిన దగ్గు

నువ్వు నాకేం అవసరం లేదు.. నేను దయతలిచానంతే ఇన్నేళ్లు.. ఆ సోఫాలో పడుండడానికి….

ఒక కర్ష విగ్రహం .. తెల్లారే సరికి గుడిని మింగేసి .. రధాన్ని తన కాలితో తన్నుకొంటూ వెళ్లి

 ఊరుని స్మశానం చేసినట్లు.. తన బరువుని వదిలేసినా సముద్రం పైకి లేచి ..

పడవలని చుట్టి చుట్టి .. విసిరేసినట్లు.. ఒడ్డు  మొత్తం తూట్లు పడి…

పక్క గదిలో నా పేరెంట్స్ ఉన్నారని అతను కాళ్ళు పట్టుకుంటే .. తన ఆ ఎత్తు విసురు విదిలింపుకి తల పగిలి .. కోమా లోంచి బయటపడనే లేదు.. ఇప్పటికీ. ఇక ఎప్పటికీ … నియో చాలీన చావు

నిస్సతా వశీకరణ ముంచిన దేహ చీకటి వలయంలో .. గింజుకొని వదిలేసిన పునాదులు..

…………..

కొన్ని వర్ణ దేహాల బజారులో పడి కలదిరుగుతూ తననే ఉంచుకొన్న అసహన నాటక వేదికలపై .. తనని తాను వదిలేసుకొని .. బయటకి .. లోపలికి జరిగి .. గాలి పట్టిన కల..

చేర్చుకొని ఉన్న … చెదిరిపోయిన .. పగటి వీధుల్లో .. నల్లని గోళపు అనుకరణని దాటి …

 మహా దేహపు సంఘటిత ఇరుకుల్లో … తలపడుతున్న వ్యతిరేక శక్తులపై …

 అనంగీకార నిద్రగోషలు బిళ్ళలై .. తలపట్టుకున్న ఖాళీ ముడుల కంపని ..  చిక్కులు విడదీయక ముందే .. రసి కారుతూ… ఛాతీలు నల్లబారుతూ.. వెనకటి కథలు వానలో చీకిపోతూ..

ఆగాలని లేదు… తెగిపోయాక .. చీకటి తెల్సిపోతూ .. తడబాటు చర్యలతో … సమరుద్దీప

 రశ్మీ గమకాలపై తేల్చిన అడుగులతో.. నన్ను నేను నిలబెట్టుకునే క్రమంలో … వయో ద్రవ

 వారించినా ఒప్పుకోని నటనలని మింగేస్తూ చలనశీలత … వదిలేసి పోయాడు.

………………………………………

ఏదీ ఇలాగే సరి కాదు..ఐనా ఆగాలనీ లేదు.. స్పష్ట పడ్డాక .. అద్దం వెనక ఇంకేదో అలజడికి ..

 నా చేతులే కన్నుని పొడవడం చూసి .. ఉల్లిక్కి పడటం తప్ప .. ఇంకేం చెయ్యలేక..

 మహా నిర్దేశం కోరిన సకల సత్తువుల చలనాన్ని ఒడిసిపట్టి .. పగిలిన నిద్ర స్తుతులని కలబెట్టి..

 ఇంకేమీ లేని… పగటి చోటిని తగలబెట్టిన అనుకువలా ఉండిపోయిన నడకలు.

 ఒప్పించుకోలేని ఆశ్రిత దేహాలపై … ఒక సమర్ప సంబంధి లేని గాలి పట్టిన కల

 ఆగాహధ్వని కేకలని దాచలేక గడ గడ లాడుతూ… వియోమయ…. తకరీయ…

 ఆ చివరకి చేరిన .. కిందకి తోసేవాళ్ళు ఎవరూ మిగిలి లేరు. తడిపి బోర్లించిన గది…

నా ఇంటి వీలునామాని వదిలేసి .. నాకు నేనే రాసుకున్న శాసనం ముందు వేలాడుతుంది..

 రోజూ స్మశాన పొగ కమ్మిన ఝాము పొద్దులో .. పడవల నుంచి దిగిన వారంతా ..

 దుఃఖాన్ని గొయ్యి తీసి ఇంటి ముందు కప్పెట్టి చెట్టుని పాతారు.. చెరిపి రాల్చారు

బోర్లించిన పడవలపై కూర్చుని వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు.. సముద్రాల జోడింత

ఆ చెట్టు కొమ్మలు ఒక్క రాత్రి లోనే పెరిగి …పెరిగి .. .. మట్టి పోతల రుణ నిర్ధింపు

 ఇంటి తలుపు తెర్చుకోలేనంత బలంగా పేనుకుపోయాయి..

                                                             ………………………….

                              5.సంధి గెస .. నిన్న నువ్వే .. సుఖాలాస

సాధన చేతి గతులతో పైకీ-కిందికీ కదలాడే నిద్ర వర్తనాలని దాటి .. శరీర రసాయన గదుల్లో ..

ముఖాలని తీర్చి.. కౌగిలిలో ముడిచిన నీటి ధ్వనులు .. పగతో రాలిన పడవలు…

రెప్పలు మూసేసిన చీకటితో పండుతూ.. సంధి గెస అరగదీసిన నొప్పిని మరిగించి..

ఎవరై.. ఎవరు ఉండిపోతారు.. కదలికనే అంటు కడతారు.. దేహాన్ని నిలువునా తీర్చుకొంటారు.

అక్కడే అనాది పురుషుడు .. దేనికో బెంగ పడతాడు..అల్లాడతాడు.. అరుస్తాడు.. అంతా లోపలే..

పదిల పర్చిన దేహ నిగురు ఊడ్చి .. కదిలించి చెప్పుకొన్న మాటలని .. నిర్ణయ సగం చేసిన ..

పోలికలు.. దూర గ్రహణాలు సంధి చేసిన నడక.. ఎటు నుంచి దేనినీ చేరుకోదు.

విడిపోవాలనే.. రోజూ ..అదే ధ్యాస.. కంటి పొగ గుచ్చుకొన్న చూపు.. సలివెల ద్రోణుల్లో పడి లేచి

నా మాటని వినడానికి నువ్వేం ఆగలేదు.. ఆగుతావని నేను ముందే అనుకోలేదు

నీ గర్భము .. నీ దగ్గర లేదు.. నేను నిన్ను ఒడిసి పట్టుకోవడానికి.. కూర్చోబెట్టి అడగడానికి….

ఈ అయోమయమూ అలవాటై పోయింది.. చేదు భూమి అంపకాలపై నిలదీసిన కన్నీరు..

భయమూ .. కన్నుని ఎరుపు చేసి .. లోపలికి జారుతూ.. ఇగిరిపోయిన నిరాశ.. పర్వాలేదు.

……………………………….

పాడుబడిన క్యాలెండరు .. రెడ్ కలర్ ఇంటూ మార్కులు.. ఇంకెన్ని..

నాకు తెల్సు.. ఆ బిడ్డని .. నా మాంస దీపం నుంచి దూరం చేసి ఆర్పి .. అటు తిరిగి నవ్వుకొన్నావని?

నేను నీకు ఏ ఆర్గుమెంట్ని వెంట పంపించదలచుకోలేదు..

ఇక .. ఈ ఖరీదైన అపార్ట్మెంట్ అక్కర లేదు.. నాకే సన్యాసుల సత్రమైనా చాలు .. లేదా ఓ రేకుల షెడ్

ఎక్కడా .. ఏ బాదరబందీ లేదు.. మన మన అకౌంట్స్లోజమాఖర్చుల,, .. అంతా .. ఇంత తేలికా?

అమ్మా   ఊర్లో  రెడీగానే ఉంది.. మరో సంబంధం .. అతికించడానికి..

……………………………….

ఏదో తెలియని ఖాళీ లోపల మండుతుంది.. దేనినో తడుముకొంటున్నాను..

ఇది కాదు పరిష్కారమని .. విడువని అరుపు.. కానీ తెలియడం లేదు..

ఎవరు ఏమంటారని కాదు.. అనలేదని కాదు.. అనిపోతారనీ కాదు….

ఇలా పోయి .. పోయి.. ఎక్కడికి వెళ్లి ఆగుతాం.. ఇలా ఎన్ని సార్లని.. ఏ రాత్రుల్ని మనం పోగేసుకొన్నాం.. నేను అనుకున్నట్లుగా ఏదీ లేదు..

అన్నీ .. నువ్వనుకొన్నవి .. పూర్తిచేసేసరికే నేనలసిపోయాను,

ఇప్పుడిక అంతా నాదే .. కానీ ఇక నాకు ఏ ఓపికా లేదు.. బిగదీసుకు పోయిన నిస్పృహ…

ఎవరినీ లోపలి తీసుకునే ఓపికే లేదు.  నన్నిలా వదిలేయడమే .. నాకే పెద్ద విశ్రాంతి..

అమాస గండాలు రాలిపోయిన .. ఏ పెద్ద ఇంటిలో .. ఇక ఏ దుప్పటీ నాకు

ఆ వెచ్చదన మివ్వదు.. వద్దూ కూడా.. నిశ్చలంగా గతి మాత్రపు తత్త్సరాన

ఈ కూలిపోవడంలో.. ఇంత మగత ఉందా?

………………………………………

 మరణ క్షమ ఊరిపోయింది నిద్ర దేహాల విందుని కప్పుతూ.. చలన ఖీల

వదిలేసి పోయిన నిరాశ క్రతువులు .. విశ్వ సంధిని సాగదీసి.. పురుష కవ్వాలతో.. మృత్యు రాశిని చిలికి .. పైకి చేరి తప్పుకొన్నాక.. అక్కడ మాట మార్చడానికి లేదు..

చీకటి ఆరిన గుర్తు పట్టలేదని.. ఎవరో ఊరుకోక నిలదీసి..చెప్పింది విని .. వెళ్ళిపోతారు..

మంచు మెదిపిన నిద్ర కీడుని జల్లేస్తూ… ఉనికిని జాడించిన చీకటి వాలులో నడక..

శరణు మర్దనలని కాల్చి .. పైకి చేరి ఊడిపోయిన నిద్ర తీరులు.. భయాలు.. నిర్ధరలు..

ఎత్తి పడేసిన కాలి చప్పుడుతో ఉండిపోయిన గదులు..సుఖాలాస…

నిస్తార చలన విగ్రహాల తోడుని వదిలిపెట్టి .. దేహ భిక్షని ఖాళీ చేసిన చీకట్లో ఇల్లు.

కొన్ని రాత్రులు .. ఇదొక సమాధి మందిరాల్లోకి పోయి నిద్రపోవాలనుంది..

ఐనా.. నన్నీ చాదస్తం వదలడం లేదు..నీ కెందుకే ఇవన్నీ .. అన్ని నిమిత్తాలు తెగిపోయాక.. 

                                       ———————————–

       6.అద్దె నిబ్బరం.. సేవా గోళం.. అబ్బిన మాటలు..

పిల్లలు మనతో … ఓ ఖచ్చితమైన bond మనతో ఉండదుగా?  

ఒక విరిగిన ఇంటి కథలో .. ఒప్పించి పెట్టుకొన్న చీకటి సరళతని కప్పి ..అద్దె నిబ్బరం…

 అనుగమన తాకిడిని దాటి .. పెద్ద హోరులా పట్టేసిన నిద్ర ఊపులు.. భయసంకెలల రాలి .. ఇగిరిపోయి.. చెప్పకుండా ఎలా.. అందరూ చేస్తున్నంత మాత్రానా కరెక్ట్ అని కాదు..

 wrong  is  always  wrong only .. physical  fitness  regain  చెయ్యడానికి చాలా methods ..

 even  for  stretch  marks  also …. తమకపు అయత్న అయస్కాంత ధారణలో ..

పిలవడానికి లేని నిస్సత్తు స్వస్థ జాగారనీళ్లు. అప్పగించిన నిద్ర జారాహాల మధ్యనే కేక..

నిందలు వాడిపోయిన పెద్ద మర్రి చెట్టు అరుపు.. అనీ అనక ఉండిపోయిన శకున తీపులు..

ఇదే మహా దేహంలోని నిందల వడపోత .. సమూహ వెన్నుముకలో గర్భ స్థావరం…

అవుననే .. కాదనలేని ఉపేక్ష దూరాల్లో ఒక దుప్పటి విసిరినా ఆయుధాగారం..

నింపి ఊగిపోయి.. సందేహ నికర్షంలో .. ఆపుకోలేని దేహ అపనింద కౌగిలీ మంధన విరగబాటు..

 …………………….

అముగ్ధలీయత .. శరణు ధార .. కోలుకొని వాదన …

ఇల్లు .. ఉడుకుతున్న నిద్ర విస్తీర్ణాల లోపలనే ఓడిపోతూ … దేహ బిగువులు మందగించిన శరీర శాలలో కంటికి కనిపించని అసహన దాడి..

నేను ఉన్నాను.. నీతోనా?

నేను ఉన్నాను.. నేనుగానేనా?

సరళ నిష్ఠుర వికారంలో చిక్కబడ్డ దీప గొంతు వణుకుతూ.. కళ్ళలో నిండిపోయిన పొగ .. నల్లబరక ముందే అతని తన్నుకొస్తున్న ఆందోళ తిరిక్త..

పెద్ద నిద్రల మధ్యలో కొట్టుకుపోతున్న పడవలు.. గానుగలా తిరిగే రాత్రులు..ఎడఎడంగా..

మాట్లాడబోతే.. మళ్ళీ అదే ఐతే .. ఇక చాలు.. our  discussions  are   more  than  enough ..

ultimately  .. This  is  my  body  and  ruling  on  my  own  words and  thoughts …. తమలత వేరు సగమై.. నెరవేర్చని ముఖాల దిగులు తీరుని కలబెట్టి.. మెలిపెట్టి..

సగం తెర్చిపెట్టిన ఇంటి మెలకువలో .. ఓదార్పు హితం కాని నిరా భ్రమల కీడు..

సంగత నిద్ర విచ్చేదనలో పడి .. మునకలైన దేహనీరుని కాల్చి .. కాగడాల సమాధి గతం.

……………………….

సేవా గోళం.. తలతిప్పుకొన్న చీకటిని గుమ్మంలోంచి లాగి … తత్సమ శ్వాస నిగ్గర.. దువ్వుకొని పోయిన

దేహ దండన .. మూసినా బయటకి రాని సాధ్య కల్హణ..

ఏవో నిహీత మాటల ఎర్ర రంగు తడిచి.. పేనుకొన్న చావు కొలతలని సరిచేసి..

శరీరం మసక బారిన .. నల్ల కొండల కాళ్ళని కడిగి.. అదే గది.. మరి చప్పుడలేని నికారింపు..

ఒరిసిపోయిన నిద్రత ఆనవేతలతో   అబ్బిన మాటలు…

దేహ విలవిలలని వడపోసి .. చెమర్చిన నిద్ర గ్రహణాలతో.. తోడు తెచ్చుకొన్న..రౌరవ సాధనలో ..

అలిగిన స్పరిత తన్వలు.. చేర్చిన కాళ్ళతో .. నుడివిన దోసిలిని .. తనలో..

లోపల నుంచి.. లోపలికి … బయట నుంచి బయటకు.. పగటి దోషపు నిర్యాణ సత్తువులు…

దేహ అపనితలో … అవలోపాయ తీరులు..

ద్వనికీ .. హేళన ధృతికీ .. దృష్టి చలనకీ .. ఆవృత్తాయ సరిపోతలు..

తననే పునాదులతో సహా తీసి.. మతి తేల్చిన దేహ విరూప సద్దుబాట్లని .. మెత్తుతూ ..

లక్ష్య షరతుల… రుద్ద బడిన హేతుత మునకలని కాల్చి.. సడి రేయన కందకాల్లో దిగబడి..

స్వకీయ షరతుని దాటి .. అలిమిన గోళంలో చీకటిని ఉరిమిస్తూ … తట్టిలేపిన తలుపులు..

…………………………

        7.సమయ పొద .. ఇంటి కబురు.. క్లబ్ తాళాలు

ఆవిష్కర నిమిత్తాలు .. తెలియని రుణ గోషా షరతులు.. చివుళ్లు తెలియని మాటని తుంచి దేహగర్భ చేసుకొన్నా ఒడంబడిక.. తన శరీరమూ.. వేరొకరి కంటిశిల …

అనుపాత వీర్య దశల కొత్త చోటు.. గామింపు .. శరణు కోరని చీకటి నలత.. సమయ పొద

శూన్య వికర్ష గోళంలో ఓ గర్భ సంచీ వేలాడుతుంది.. నిద్రిత శూన్యంలో పారబోసుకున్న కాళ్లతో…

నేను–నువ్వనే ప్రవేశం చితి చుట్టూ కాలుతూ.. శ్వాస నిర్ఘాంత తడబాటుని కెలికి …

 విశ్వ సమాధికి పట్టిన మంచు దులిపి ముడుచుకుపోయిన .. ఇంకాస్త చౌటులోనే

మన్నన అడుగుతూ.. నిద్రిత శూన్యంలో పారబోసుకున్న కాళ్లతో  దేహంలోకి తిరగబడి ..

 మాంసం ఒల్చుకొని  .. భ్రమణ చీకటిలో .. రెండో వేపు గోళం చూసి .. స్పృహ తప్పి.. 

పుట్టు సూత్రం మార్చే .. మహా లగ్న కలయికలని .. మాయం చేస్తూ …

 నల్లని కృతక సాధనాల సన్నుడి.. వీలులేని ఇంటి కబురు.. ఐనా ఎవరూ రారు.

అంతా చెప్పే చేస్తున్నప్పుడు .. చెప్పకపోవడమే .. కోపం ఇంకెందుకు?

ఇంటి కబురు… సమర్పక మంత్రనిధిలో పడి తలమునకలై .. నింపి పోయిన కన్ను

…………………………………..

పైకీ …కిందికీ మారి.. దుఃఖ కీర్తనల తీపి నిద్రని మరిగించి.. చలన మూతలని కప్పిన .. సీసాల ఊపిరి రొదని అరగదీసి.. సమర్పక మంత్రనిధిలో పడి తలమునకలై .. నింపి పోయిన కన్ను

పరాయి పాస్వర్డ్ లని  మెలి తిప్పి.. నల్ల పెదాలమధ్య నుంచే నవ్వి.. పొడిబారిన కళ్ళతో..

పొడిని నాకి.. వాడి కాళ్ళ మధ్యనే విరిగిపడి… తలకిందుల చెమటని అరగదీసి…

తను తూలుతూనే క్లబ్ తాళాలు అడిగి.. ఇచ్చే లోపే చెంప పేలగొట్టింది.

రుణ ద్యుతిని మార్చు చేసుకొన్న ఒప్పంద పంధాని ఏమార్చి .. కదిలి చెప్పక ముందే ..

నోరు విప్పి బయటపెట్టిన .. సాధన కీల… అయోమ దిశల తర్జన హెచ్చరించినా వినక

ఇది ఒక నీహారపు తొలి దశల ముగింపుని మోసే కదలికగా .. ఉండీ .. లేకపోయాక..

పక్కకి తప్పుకు పోయిన నా భద్ర కథలని దాటి .. చెలరేగిన శ్వాస దోషాలతో.. కలబడి .. విరగబడి

ఉండిపోయిన నిహగతాలని తోడి .. అంతా సర్ది కనిపించక పోయాక …

……………………………..

బీకర్లు .. పరీక్ష నాలుకలు.. బాటిల్స్… ప్లాస్టిక్ బ్యాగ్లు.. స్పెర్ం కౌంటీలు.. జిగురు నవ్వులు..

నోట్ల లెక్కలు.. కదిలింపు సరిగతాలు.. కుద్దలింపు.. పడిపోయిన నిద్ర ఆకళింపు..

పుట్టు మాయని ఉతికేసి.. బట్టలేని రిపోర్ట్స్ తో కదిలే నిరాశ ముఖాల నిమజ్జనాలు.. గెలుపులు..

పడక గది గోడలని ఎత్తు తగ్గించి అమర్చిన సీసీ కెమెరాలు.. web లోడింగ్లు…

సిగ్గు మంధనలు లేని నెల పొడుగు పాకుతూ… దీర్ఘ మైల కమ్మిన భాషణలు.. ఒలిపిరి.. సాధారణతలకి తోడు పలకని పుట్టుకలు కథనే .. తిప్పి చూస్తూ.. ఇంకిన శరీర జలాలతో

పొర్లిన చీకటి అనుసృజ్య కంపన మోగి .. నటన లేని దేహ కక్ష్య చెప్పుకొన్న మాటలు.

కదిలిన విశ్వపు అంచుల చివర.. కలబెట్టిన ముఖాల ఊర్పుని నిలదీసి..

గొంతు తోడులేని వాంఛల ఉరేగింపు కనిపించని నిమజ్జన కీచులాటలు.. గొడవలు..

………………………………..

పోలికలని దారికి తెచ్చుకొని .. గుండె జారుడు నొప్పి.. ఉన్నదీ లేని దోసిలి గాడ్పు

పైకి ఎగరేసినపుడు.. పైకే మాయమైన దేహ నానుడి మాటల నూర్పు..

కొలత నిద్రలు.. ప్రోటీన్లు.. దేహ శిక్షణ .. రమింపు లేని దేహ కథలో మధ్యకి విరిచిన నొప్పి..

చలన మాత్రలు కరిగిన గ్లాస్ లో పోసుకున్న చెమట బట్ట పొందికలు..

నీరుని కాల్చి.. కళ్ళు పొడి చేసి… ఉప్పు నాలికని సీసాలోంచి అతుక్కొని .. హోరునవ్వు..

 కసి తీర్పుల నరాల కేకళింపు.. దడ బిగిసిన నడుం లాగుతూ.. అప్పుడేనా … సంశోధన  ఏదీ లేక .. అనవేత చర్మ మునకలు లేని విశ్వాసపు కల పండి.. రెండోసారిగా లేని ద్రవ మూర్తి..

ఇది ఇక ఇలాగే ఉంది.. అవి అల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి.. అలవాటులేని భయతీరులు..

సహజాతాలన్నీ .. విహరిత సంకీరణ తోడ్పాటు లేని నిద్ర రీతులు కరిగిపోతూ..ఉండీ లేవని..

…………………………..

టైం తిప్పిన నిరా ముంపుల పోలికల వేడికి కూలిపోతూ.. లోపలి మంట.. తోడు భూమి.

ఎలాని నిలదీత.. నీకు తెలియకుండా ఎలా ఉండాలనే  గ్డదింపు .. చెప్పుకోలేని ఖాళీ కడుపు..

కనిపించని నల్ల గోళం రొమ్ములో బరువెక్కింది.. కాళ్ళకి నీరు పట్టి.. తూగిన బరువులో

ఎదో నమ్మకం.. తెలియని అడ్డు.. కుదరని సంక్షోభ ధూపం.. వెనక పోటులో రక్త కక్ష్య ..

ఇప్పుడు పిండం తీసేయడమా? తల్లికీ ప్రమాదమే.. నొక్కి పెట్టిన కబురు….

ఇద్దరూ వినరు.. లోపలి తెరవని అరుపునీ కనుక్కోరు.. ఎంగిలి పడతారు..

ఒకరికొకరు ఎదురు పడక ముందే ఎవరో ఒకరు మాయమౌతారు…

                8.వీర్య స్నానం .. దేహ ఉవాచ .. లేని చెరిసగపు పడకలు

నల్లని ఆమ్లాల దేహ ఉవాచ  .. తన గర్భాన్ని మోస్తున్న రెండో చోటులో ఎవరో కత్తి దూసారు

రసాయ క్షేత్రంలో అల్లలాడిన శ్రమ మంధన కురిసి.. చెమ్మగిల్లిన చూపుతో.. తనలోకి తీసుకొన్న ..         అది అలా మాత్రమే జరుగుతుంది..

ఎవరో వెనక నుంచి .. ఇదంతా ఎందుకని ఏడుస్తారు.. తనని ఉండిపొమ్మని.. ఎక్కడో అహలీల కేక .. ఎందుకలా కంగారు.. ఉన్నదీ .. లేనిదీ ..

these  are  all  now  just  take  it granted  things .. మనకని మరో ఆలోచనకి ఆస్కారం లేని పరుగు.. నిశేష భూమి వంతులవారీ పంపకం..

Intracytoplasmic sperm ఇంజక్షన్ .. ఇప్పటికే .. ఏ construction job లో తీవ్రంగా నలిగి నలిగి ఉన్నానని అరిచేడు .. లోపల ఏం ఉందొ ఏం లేదో .. this is better for results .. ఓకే …

Naturalగా అనేది తర్వాత .. ఫస్ట్ ఈ మెథడ్ కి  వెళ్ళిపోదాం..  ఎందుకు ఛాన్స్ తీసుకోవడం..

అక్కడ నుంచి .. తనూ మెంటల్గా  తల్లి రోల్ కి ఇంకా సిద్ధం లేనుంటుంది.. గెస్టేషనల్ కారియర్ కి వెళ్ళిపోతాం.. కొంచెం ఆరోగ్యం ఉన్న వాళ్ళని డాక్టర్ సజెస్ట్ చేస్తామన్నారు..

ఎడబాటు లేని కకావికల సంతులనం తుడిచిన నిద్ర పోలికలు దూరమై.. నా దేహం నుంచి నేనై

 నడిచి రాలేదనే దూరం ఉండిపోతుందా?

ఏది కావాలనే లోపు.. ముఖం మీదకి .. అక్కరలేని డిస్ప్లేలు .. మెనూ కార్డులు ..

 లక్షల మంది కృత్రిమ జన్యువులతో తిరుగుతూ .. అసహజమే సహజంగా… సహా నిగడ శరీరాలు…

…………………….

తరాల .. పరంప మునకలు.. ఆమె 5  ఏళ్లగా ఇదే పనిలో ఉంది..దాదాపుగా ఐదుసార్లు గర్భాన్ని మోసింది.. ఏదైనా జరిగితే.. రక్తమంతా పాలగా మారిపోయిందేమో.. ఎముకలన్నీ పెళుసై.. వెన్ను గుల్లయ్యిందేమో

అసిస్టెడ్ హటచింగ్ ఇప్పటికే లక్షలు ఖర్చు పెట్టాం.. ఇక ఓపిక లేదు..

లోపల మండే ఆమ్ల ప్రవేశం .. ఇక దేనిని ఒప్పుకొనేలా లేదు.. అర్ధం కాని ఎద్దడి..

ఎక్కే దిగిన కొండలని కాల్చి .. నేను మహా నిర్యాణ ముంపు నిద్రలోకి కూలిపోయాను. స్వస్థ రాలమ్యాన

వీళ్ళని చాలా మంది ని చూసి ఫైనల్ చేసాం.. అలసట పొలమారింది..

లాస్ట్ మినిట్ లో వెనక్కి వెళ్లడం కరెక్ట్ కాదు.. ఏ అడ్వాన్సులు వెనక్కి రావు.. ఇరుక్కు పోయాం 

అనర్ధ బంధన .. అపల్య మూర్తి కథనాలు.. తనలో తన లోపటి మంత్ర తమక గర్జన..

ఏదో వదిలేసుకొన్న లోటు.. తెలియని నిరాశ చుట్టూ పోట్లలో కదలాడే దేహ నీరు.. బడలిక

ఇదెలా ఉంటుందనే అయోమయం .. జోడించి పెట్టుకొన్న నిద్ర ముద్రలతో కదిలే దీపనిందలూ ..  మృత్యు షరతుగా ఉండిపోయిన శరీర గండం.. త్వరపడే నడకని లాక్కొని లేని చేరిక

ఉన్నా ,, ఉండిపోలేననే.. కన్నా .. కనలేదనే.. పులిసిన పోలికల ఇగురు కళ్ళలో…

ఉబిక్త మంథన రేవుల్లో .. ధూళి పోసుకున్ననీటి కుప్పల్లా దేహాలు.. అస్వస్ధ నిరాకార దండనతల ఊడ్పు

పలకవు.. కదలవు.. జరగవు.. కప్పుకోవు.. అలాగే జరగడానికి ఒప్పుకోవు.        

………………………………

పుప్పొడి ధ్వని కలలని బయటకి లాగి.. శరణు అడగని నిరాశ రుద్దుడుతో అడ్డం పడి..

ఇగిరిపోయిన దేహ వార్తని తప్పించి.. ముడి పడిన మంతనాలతో మారిపోయి.. నేను నీలా ఇంకా

                          ఏ చూపుని మరిగించి.. నీలోకి ఓ అంగీకారంగా సర్దుకోక ముందే..

శరీర జాగారపు విశ్వ వీర్యం .. తనదై ఉండిపోని ఖాళీ సమయ ముఖాల ఒదిలింపు..

బడలిక లేని రెండో వంతెన కిందుగా .. ఆ చెట్టు ఇంకా కళ్ళలో తిరుగుతూనే.. నిలదీసిందా?

అనుకోవడానికి మరేం లేదు.. అక్కడ ఆగిపోవడమే నిందలని కాల్చి .. నీళ్లోసుకుందా?

సహజాత అపక్రమ చర్యలు.. ఊడిపోయిన నిర్మాణ మూర్తుల ఐకల్య రాత్రిలో ధూప జరుగుబాటు..

భ్రమిత దేహం ఒరిగిన కంటి చూలు .. ఒరిపిడి జిలార్చుకొన్న మాదక అంచుల్లో . ఉండుండి తిరగబడుతూ.

 లేని చెరిసగపు పడకలు .. చెలిమిలి ముద్ర కాల్చిన నిరోధ గమితగా ఊరేగి..

సాయత్న విపరీతంలో .. వణికే చిక్కని వణుకులో ముగ్గిన శరణు మాత్రలు.. శాప పొందులు

ఎవరు .. ఎవరి దగ్గరకి రాకముందే .. శేష దీపం కప్పుకున్న వాంఛ మరగని .. టీ ..లా ..

ఏది లేదో అదే ఉంది.. అది అక్కడే కదిలి శరీర కూపంలో రాలింది.. పట్టించిన శిలలు ..

………………   

మరేం కాదులే .. నువ్వక్కడే చోటులో .. మాటలేని నిద్ర వేటుని వేసి.. తాను పక్కకి జరిగింది..

just  recall  .. i  just  conveyed  all  these  nonsenses  are  not taken  into my  scope .. that  day  you  are  agree  also    .. hence  forth  .. don ‘t  discuss  in this  regard .       

పాలు మరగని వెన్న కుండలో చేపల గిల గిల.. పిండాలకి అంటిన తోక అల్లాడుతూ..

కదిలించి సాయం పట్టిన ఉపేక్ష నిండిన మోతాదుల పూర్వంలో చెదిరిన నడకల పులుముడు..

అది అలా మాత్రమే చేరుకొన్న .. ఆగకుండా జరిగిపోతూనే ఉంటాయి.   

                                                   ………………………..                  

9.అల్లికలు లేని మాంస కూర్పు.. పెద్ద మెడల గల్లంతు..

                                                                                  వశ్య గార్ధన లేని శరీర తేమ.

విరుచుకు పడ్డ ద్రవ హోళిమి.. నిస్సారపు దేహ సువిధ .. తమోధీర వశీయ.. అక్కడేం లేదు..

అల్లికలు లేని మాంస కూర్పు.. అతని లోపల అనేకానేక నిద్ర తీర్పుల పగ ఇగురుతూ …

చిత్ర ఫలమూ.. అద్ది పోసుకున్న రెండు చీకట్ల కోత .. అక్కడెవరూ మిగలరు.. మిగలనివ్వరు

కల తిప్పి కట్టిన నిద్ర రశీదులు చిరుగుతూ.. తేటతెల్లం కాని…భయ సేవకి అలిసిపోతూ..

                                               కొంచెంలో తప్పిపోయిన పెద్ద మెడల గల్లంతు .. ఆసరా లేని దేహ జీర..       

గదిని చేరి.. తన లోకి చూసేసరికి .. అతనిలో .. ఒక దిగ్భంధః మృత్యు కేక ఈడ్చికొడుతూ

చెమటతో చల్లబడి పోయిన అతని దేహం.. కథగా ఉండిపోయిన దీప నిర్జనలో నడిచే ఏసీతనలో తడుముకొంటూన్నదేదో అతనికి అర్ధమే కావడం లేదు..

 ఐనా ఆ చీకట్లో ఎవరికో ఏదో మాట లేకుండా చెప్పుకొంటున్నాడు..

…………………….

కోలుకోలేని దేహ నిమంగళత… అలాయ స్వేధిత .. కప్పిపోయిన తేడాలతో.. ఒరిగి..

అలవాటులేని సిగ్గు.. కనబడని వృత్త నిందలు.. పడిగాపులు..

గర్భ స్తంభంలో కూలిన సముద్ర జీర .. భయం తెలియని కంపిత ఉరుమిని మింగి.. వశ్య

                             గార్ధన లేని శరీర తేమ పొడి బారుతూ .. ఇంకేం లేని తడి జతల కలుపు..

జిగురు కెరటంలో చిక్కిన పడవ .. నిందలు పడ్డ దీవిలో.. గొంతు గర గర లో మాట రాక

పెద్ద మెడల గల్లంతు .. కౌగిలిలో ఆరబోసిన దేహ చమురుతో.. ఆయాసపడి…విరిచే చూపులని

                                మోయలేక తలకిందులవుతూ.. శరీర ధరల్ని కప్పే నిద్ర రేవులు..

అతని అగరుపాటు నిద్రలో చేరి చూసిన .. ఇసుక కొండల్లో చీము పట్టిన తన సమాధి బయట  

                        పడుతూ.. అదే ఇక సరి కాదులే.. మన ఆర్టిఫిషల్ స్పెర్ం ఇంజెక్షన్లకి వెళదాం

అతనేదో చెప్పలేనను కొన్నాడు.. ఆమె వినలేదు.

నేరం చేసిన మృత గాధకుడిగా కనిపించాడు..

బలంగా అద్దాన్ని పగల గొట్టాడు.. చేతి నిండా రక్తం

……………………………

ఏ చీకటి శబ్ద భూమి నుంచో తప్పిపోయిన వాడిలా ..

వెలపరపు పుట్టు లయలో శ్రయం సారించే దిక్కిత నెర్రులు.. మతి భోగ ముఖాలు.. ధూళి..

హలనో గయార … చితి నిద్ర జాడ .. తాను పడుకున్న ఆ గదిలో..

పుప్పొడి శరీరాల పుట్టు గొంతు తెగిపడ్డ దేహ నీలం చిక్కబడి.. అతను అద్దం లోకి చూసుకోలేక..

                   మధ్య రాత్రిలో ఆమె కాళ్ళని పట్టుకొని ఏడ్చాడు .. తను అలా ఉండిపోయింది.

మాంస బరువుతో .. ముడుచుకు పోయిన చెమట ద్రోణుల్లో పోటెత్తిన కంటి దారాల చిక్కు..

అతనేదో ప్రయత్నించబోయి .. అంతలోనే చెమటతో తడిచి.. శరీరమంతా వణుకుతూ .

                            తల దించుకున్నాడు…దేహమంతా తెలియని సిగ్గులోకి ముడుచుకు పోయింది

ఇక అదేం వద్దులే.. రా వచ్చి పడుకో.. కన్నైన తెరవకుండా అటు తిరుగుతూ….

……………………………

అగమ్య గతి చాంచల్యం.. కంటి జోరుని మింగిన మాంస గేలం ..

అస్థిర రమింతలో ఓడిపోయి.. అలాగే చిల్లు పడవ.. కెరటాలు కూలిన కైపుల మధ్యంలో.. జాసడింపు… తెలియని సయాస ఉలిపిడి .. పచ్చి కలల దొంతిరి.. ఏక బిగిన మీదకి దూకిన నిసంసయ

ముడుపులు అందాకా.. మృత్యు గాలి అతని చుట్టూ ఉబ్బిన కళ్ళతో తిరుగుతూ…..

ఊపిరిపై పడగెత్తిన పాము.. పుట్టని చిదిమేసిన ఆమె కాలు.. నల్లని ఆయువు

కారి బొట్టు వెనక అద్దం ముక్కలు.. మేకుల పరుపు.. నీళ్లు రాని గాలి మంట

నిర్లేయ సహాయ దింపు.. కొట్టి తీసిన పరుగుల నిలవేత.. ఇక వదిలేస్తే .. గొడవ లేదుగా..

 వదిలించుకోలేని ఇరుకులు.. జాయింట్లోన్ల విల్లాలు.. వేర్వేరు స్థల పట్టాలు..

………………………

ముందే చెక్ చేసుకోవాలిగా .. ఎంత updated  world లో ఉన్నాం.

 టెస్ట్స్ అన్నీ చేయించుకోవాలిగా? ఏదో పల్లెటూరి మొద్దులా చేస్తే ఎలా ..

 మగాడివో కాదో తెలుసుకోకపోతే ఎట్లా .. that  is  a  basic  thing  for  marriage ?   

ఆపాయ మృత బంధితం.. ఎగబాకిన నిద్ర స్ఫురణలో కాలే ..

 విశ్వ సర్జన నిందలని ఒడిసి పట్టి.. ఉన్నప్పటి గండంలో పడి తిరిగి..

పడుతూ .. లేస్తూ.. లేచి తిరగ లేక…ఉన్నప్పటి సెగని ఆపుకోలేక

 ఒక important  pleasure ruin చేసావ్.. నాకు .. this  is  ultimate  essence  of  life .. i  just  missed  out ..

ఒక్క హెల్ప్ చెయ్యి.. నా రూమ్ లోకి అంతగా రావొద్దు..పడుకోవడానికి.. ఎవరైనా రెలిటివ్స్ వస్తే తప్ప..

అతనిక  అటు తిరగ లేదు.. అర్ధరాత్రి ,.. సన్నగా వైబ్రేటర్ పని చేస్తున్న చప్పుడు..

అతని తలలో ఓ పెద్ద డ్రిల్లింగ్ మెషిన్ తో కొండని తొలుస్తున్నట్లు…

అఙ్గాధితా సమాధి ధారలు కళ్ళలో పగిలి.. ఆ గాజు ముక్కలు గుచ్చుకొని..

ప్రయత్నమూ వదిలిపెట్టేసాడు …  ఇక ఎప్పటికీ అనుకోక….

                                                                                           ———————–

10. పసి రొమ్ములు.. స్తంభిత నిరమణ … విచ్చీల భ్రాంతియ రమన.

సఫలమిత పచ్చి వాసనలతో నిండిన మహంపు గుంభన .. వడపోసిన నడకలని జాడించి.. వేలాడిన  పసి రొమ్ములు… స్థిర నిర్జనలో గాలించే చీకటి అంటుకోతలు..  ఎంగిలి చేతులు

ఎవరో చాటుగా తడిమి వెళ్ళిపోతారు.. ఏం జరిగిందో అర్ధమయ్యేలోపే .. పట్టుబడరు ..

ఎవరితో చెప్పాలో తెలియదు….అదసలు చెప్పాలా…చెప్పినా నమ్ముతారా?

ఏడ్చింది .. ఎవరూ చూడకుండా.. తనకి  తెలియని   తప్పుకి వణికిపోతున్నట్లు..

అదే ఆపాయ గతం .. పెదనాన్నల తాడన .. మావయ్యల నవ్వుతాలు హేళన.. ఓ casual  ఆటలా

పడి పడి రాలిపోయిన దేహ గాధతో .. ఊపిరి ఆడని నిశ్చర్య ముఖాలని పోతపోసి .. మెదిల్చే చూపులు..

 కదిలే అడుగులని పోతపోసి.. కదిలి చేరుతూ.. చలాయింపు మరకలు.. గదమాయింపులు

నల్లని చాటుమాటు ఆకలి.. నిగరపాటు.. నిల్చిన కథన ఊడ్పులు…అటు నుంచి ఎవరో వచ్చారా?

నైరంతీయ అసహాయంపులు.. పొడుగ్గాలాగేసి నిద్రలు.. ఆంజరితం…శిలాపులగం

జడలు కట్టిన సర్వ సాక్షజీల్లో ముక్కలయ్యే స్పర్ధలు.. అనుమాన నివృత్తాలు ..

…………………………

తెల్లార్చిన షరతులతో పాలిపోయిన పుట్టుకలో తేడా.. ఎడమ పక్క లాగుతున్నట్లు..

నులిమిన కేకలతో తొందరలేని ఆకస్మికాలు .. రుద్దర .. బొడ్డులో మంట … కంట్లో నాలుకలు తేలి

తలో శ్రేయస .. నిర్ధాక్షిణ్యత లేని గాఢ నిద్ర మధ్యలో కాళ్ళని కదిపినట్లు.. పేగు తెగిన నొప్పి..

మొదలై ఉండిపోయిన నిరుద్ధాల నిశాజ .. కలో స్నాన రంభన…  విష ఆయనాలు

తనతో తానే … విరోయ శరీరంగా … మైకపు నినాదాలతో ఆశ్చయాల .. కడుపులో నొప్పి.. 

………………………………

స్తంభిత నిరమణ .. శుభ్ర మోడులపై నిశ్చరత పుట్టి గడించిన శ్వాసలు..

నిశ్శమలత ఒంటికి పట్టి.. చలి మడుగులో దిగబడి.. దేహ జిగురులని .. తోడు తెచ్చిన సీసాల్లోకి పట్టి .. లోపల గడ్డ కట్టిన గర్భం.. తోడుగా లేని అర్ధాతలు.. తిట్లు .. బెదిరింపులు..

అంతకంటే ఏదీ దూరం జరగక పోవడం..అక్కడెందుకున్నావ్.. సరిగా కూర్చోవడం రాదా?

నెట్టిపోయిన పుట్టుకలు పచ్చి.. లాలస మాంస గుప్పులు.. ఏం జరిగిందో తెలియక ముందే ..

 ఎక్కడో రహస్య చోటులో abortion … కొన్ని ఏళ్ళు గడిచాకా..

కాళ్ళ మధ్యలో మండుతున్న రాక్షస బొగ్గు రైలు కూలినట్లు .. వదలని మంట

…………………………..

 తేమ గుమ్మల్లో తొందరపడే మంచు మంటలు..ఆమె లోకి ఏ స్పర్శా దిగని లోతట్టు స్తంభన

ఊపిరి రాల్చుకొన్న అగడ్తలు.. కొలిమి ఎంతకీ ఆరక.. అలాగే ఉండక … విలో దర్దన  

తమోయ రాజీపంలోని విసుగు పగిలిన శరీరం చిట్లి.. ఇక ఎటూ పోలేక … ఇరుక్కొని…

లోపల తెలియని సమయ నిశిని పీల్చేస్తూ.. కథా సవ్వింతలు.. కలనేత గింగిరాలు..

ఇది ఇక్కడే ఆగిపోదని .. మంటని కూలదోసిన .. అజమాసర దూరంలో దిగబడి..

ఏం జరగనట్లుగా అందరిలో కలిసి తిరిగేయమని..ఆ చుట్టాలతోనే  కలిసిపొమ్మని…

……………………………………

 తనని ఏదీ అడగరు.. విప్పి పరీక్షించుకొంటూ పోతారు.. కెవ్వెన.. చాటు నాలుకలు..

ముందే అబోర్తిన్ జరిగిందని తెల్సాకా .. నిన్ను నేను వదిలేయలేను.. ఫైనాన్సియల్ బైండ్అప్ తప్పదు..

బంగారాలు.. హై ఎండ్ కార్లు.. విల్లాలు.. ప్లాట్లు… అబ్రాడ్ టూర్లు  .. అన్నీ కావాలి..

కాని.. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒక మంచం మీద పడుకో లేదు.. వాడు  దరి చేరనివ్వలేదు

 దేహ విధామయ సంకీర్ణ ప్రోక్షణలో .. అండ లేని శరీరమితి పట్టుతప్పాక…

ఉండుండి మాటల దాడి..బూతుల చిట్టా విప్పి.. నాలిక మెలిక పెట్టి… పేగు నులిమే నవ్వు…

ఎప్పుడో ఆరిపోయిన ఆమె గర్భంలోంచి దుఃఖ పిండం రోజూ బయటకు లాగడం.

మాటి మాటికీ ఇదేంటని తనని అడగనివ్వలేదు.. కన్ను పొడిచిన ఆమ్ల జాడీలు..

 వంశ ముందుకు వెళ్లాల్సిందే.. అత్తగారు పట్టు.. తధా జతన విడదీసిన ముఖాల్లో….

 ఓ వికార నివురు కమ్మిన దేహ హెచ్చరిక…తనలో తనై మెడ విరుచుకొని…ఆగిలపడి…

నేను ఇంతమాత్రంగానే లేను.. చావు పొట్లం గట్టిన శరీర జాలం లో … నీరు పట్టిన కాళ్ళు…

బయట పడలేని గోడలు.. ఊటలు ఆగిపోయిన కళ్ళు పొడిబారి .. దురద

వదలని చేతుల బిగింపుతో తెల్లార్లు పొలమారిన దుప్పట్ల కింద ఆరబోతల పుట్టు పిలుపు..

ఏదైనా సేఫ్ మెథడ్ .. స్పెర్ం ఇంజెక్టయింగ్ లాంటిది.. ఆమె బాడీ ఓ బేబీ బర్త్ కి కావాల్సిన కంప్లీట్

ఫర్మ్ గా లేదు.. బట్ , విల్ టేక్ రిస్క్.. అంతకంటే మరో దారి లేదు..

ఆమె ని ఎవ్వరూ ఏదీ అడగలేదు.. తెల్సుకునే ఇష్టమూ ఆరిపోయి .. మాంస చలన బీటలు తీసింది..

……………………..

ఆగా లోహితం .. గట్టి పడ్డ పెదాల సడలింపు.. నింపు జాడ.. జడలు కట్టిన నిన్నటి వాసన

తనలోకి తానే లేని రెండో దేహంగా ముడుచుకొని.. కదిలిపోతూ.. నిల్చిపోయిన పుట్టుకలు..

అతని ముందు… సైక్రియాటిస్టులతో అడుగు కలిపి.. విడిపోయి.. డాక్టర్లనీ మార్చి.. చేతి వేళ్ళు నొక్కి పెట్టి…

physical  టెస్టులు..నిరాశలో  ముంచే ల్యాబ్ రిపోర్టులు..  ఒంటిని కుళ్ళ బెట్టే ప్రయోగాలు..

గొడవలు .. దాచి పెట్టిన రహస్యాలఫై ఉండుండి. మళ్ళీ మళ్ళీ దాడి.. ఆమె నిస్సహాయతని .. నిద్రనీ…

నలిపేస్తూ … తననుంచి అన్నీ కావాలి.. వెనకటి కథ మొత్తంగా మారలనే దుగ్ధ…

తానెప్పటికీ తల్లి కాకూడదనే ప్రయత్నం ఎప్పుడూ  ఆపనేలేదు.

                                                                                                          ………………………..

    11 . సంక్షోమయ గోళ ప్రయాత .. కల మాసిన దేహ సాగు .. రెండో బిడ్డ అలాంటి   నెలలే ..

రంధి మయూన మూర్తులతో సంక్షోమయ గోళ ప్రయాత … సరే సరే .. సరి చెయ్యని చీకటిని .. సరి చెయ్యక ఉండిపోయిన నిద్ర వాగుల పగటిలో .. సత్య ద్రవాల వికారం

వెళ్ళీ .. వచ్చీ .. నడకలని జాడించే కంటి ఒంపులతో .. చేరదీసిన పడక గదుల పక్కగా..

 ఆలంపమారాలు … ముగింపు లేని శరీర గుణంతో మళ్లించి.. కల మాసిన దేహ సాగు..

 సందోహ నిరూపాలని దాటి.. ఎందుకింత పరుగు ? ఎక్కడ దేనిని కలవాలని?

సపరిమిత శక్తుల కల్లోమంలో పడి తిరుగుతూ.. ఇంకాస్త సమయాల చోటుని ఇవ్వమని….

ఇప్పుడే మొదలుపెట్టాం కదా ? కేవలం ఫెయిల్యూర్ పట్ల మన ఫోకస్ ఎందుకింత ?

స్వపార్జిత శకున నిందలు.. కల లోపలే కట్టుకొన్న .. కొంచెం నిదానించలేమా?

……………….

అనువంశిక పరామర్శ.. రెండో బిడ్డ అలాంటి   నెలలే .. గదిలోకి పిండిన అడుగులని దాటి..

 ల్యాబ్ లోనే అద్దాల బిగువు.. నడుం బిగించుకొని .. సరిలేని చీకటితో కలబడే అవసరాలు…

వినీ.. వినని,.. చర్యల ఆపగాహేయ తలపట్టుతో .. పట్టి .. రాల్చిన.. నెలల నిడివిని సాగదీసి..

తడిమిన మాంస గట్టు .. నూనెల మండలంలో సజారా నెలవులు.. మంచు కావెడ …

సమయ దేహంలో ఊడిపోయిన … మగాడిగా నేనూ సర్దుకోవాలిగా? చల్లారక ముందే..

దిగ్భ్రమనే చుట్టి.. దిశా పాతకం లోనే చెల్లని కథ లోపలి..  వినికిడి బొమ్మలతో….

                      నిగ్గరి చాలన .. ఓడిపోతల కలబాటు .. ఊపని నడకలతో .. బాడీ రీడింగ్లు..

ఆధార మవ్వని ఎండా గాలీ మీదకి కురుస్తుంది.. కబురుని కప్పుతుంది.

…………………………….

జత చేయని నిద్ర తీరికలతో.. అలంపు పోసుకున్న ఆరిన గారడీల డొల్ల.. 

                      చెదిరిన వృత్తాల చుట్టూ.. ఒద్దికగా ఇంకిపోయిన దేహ నిర్మల రసాయన నింపులు

కౌంట్ ఎందుకు పడిపోయింది ? మెడికేషన్ టైం ఇవ్వాలిగా? erection లో ఏమీ ఇష్యూలు లేవుగా?

అవగాహ రంకెల.. సాధ్య మసిని దులిపి పెట్టుకొన్న .. చర్మ గాలుల అంపకంలో..

చేదు అమంగళ కన్యతలో నిద్ర దిటువు..

ఏదో చెప్పాలనుకొంటుంది.. తనకి అనుకున్నట్లుగా .. ఉందా ? లేదన్నా?

……………………………..

కలిసి … శ్రేయా నిర్లిమని ఊడ్చిన సరి రేవు.. కొంచెం కోసి పట్టికెళ్ళిన పరీక్షలు. 

మొత్తుకొని చెప్పినా .. ఎందుకంత రిస్క్.. ఉన్న ఫెసిలిటీస్ అందుకోవాలిగా?

ఐనా ఎవరైనా ఏం అనుకొంటారు.. ఆ చాదస్తం వదిలేయ్..

చివరకి బిడ్డ ఆ సీసాల్లోనే దొరుకు తాడు.. పెళ్ళగించిన సంధి రాతల్ని మళ్ళీ చూస్తాడు.

సంభన తెమ్మెర .. కౌగిలిలో ఊడ్చిన నెలల తాడు.. బిగి లేని నవ్వు జాడలు..

చీకటి ఎవరిదీ కానీ స్కలన గడ్డగా .. అంతం లేని అరూప కవ్వడిలో ఒరిగి.. ధూప పోలిక…

ఆరేడు కథల మధ్య తిరిగిన ఓ దేహ నిర్మాణ కార్యం తెల్సుకొంటుంది.. అవధాలన

………………………………….

గవద నొప్పి .. శ్వాసలో ఆరిపోయిన దీపం బరువు… కీ నీడ తుడిచిన పెద్ద చెట్ల ఇల్లు.. మట్టిపోడు.

సాఫల్య బిళంలో .. ఎన్ని కేకలు పెట్టినా తిరిగి రాని తను.. ఇక్కడే ఆగిపోయిన నేను. 

ఆత్మ నిబ్బర జత బరువులో కారిపోతున్న దేహ నిషాలు.. స్వపరిమిత స్కలన పరీక్ష…

అయమానిత గత్తెరపాటులో .. చేరదీసిన.. కంట్లో ఉంచుకొన్న .. దేహంలో సంధించి మిగిల్చిన ..            

                       అడుగుల పక్క అడుగులుగా ఒప్పుకోక .. నవ్వుతూనే నెట్టేసి.. మసకగా..

చేరదీయమని ఎవరో హెచ్చరించినా పట్టించుకోక వదిలేస్తూ…

అంది పుచ్చుకొందామనే .. శరీర శిక్షణ లేని అడ్డుతో దేహం కదిలి అద్దం లోకి దూరిపోయింది…

పై నుంచి వేలాడుతూ స్కలన గర్భం పేరు మార్చుకొంది… కబురూ అందదు.

…………………………..

సమసిత అంటూ రాతని .. కదిలే నిద్ర గతుల కుప్పనీ .. పగిలి కూలిన తలుపుల గండినీ ..

ఇదొక యుద్ధ పుండాది పై ఆరా బెట్టి .. బట్టలు ఊడదీసిన శరీరం..

పురుషుడి జాడలు విప్పుకొని.. చితి సాయుజ్యంలో పేనుకొన్న గాలి కొండల్లో ఊపిరి కలత

ఏది ఎక్కడ ఉందొ అక్కడే ఆగి చూస్తుంది.. మాటని వైనదనే తెల్సు..

కాళ్ళ దగ్గర నిడివి పగిలిన ఇంటిని క్యాలెండరు కి వేలాడదీసి.. నీకిక టైం లేదులే .. అంటూ..

సన్నని బిగీష పొంగులని వస్త్రం చేసి తను కప్పినా అనే వాళ్ళు అలానే ఉంటారు.

మడిచిన చాపలు .. మెడ విరిగిన టేబుల్ ఫ్యాన్ .. ఎంగిలి దుప్పట్లు.. పాకుడు పట్టిన బాత్రూం..

 నిండి పైకి వచ్చేసిన మాసిన బట్టలు.. యాష్ ట్రేల గుట్టలు .. పేగు తెగిన కాగితాలు….

ద్రవ బీకర్లులో … వాయు రాళనలో .. ఆయు ముంపులు చేరి .. నిగ్రహాల ఏక నిర్జన గురి..

శ్వాసితా అనంపనల ఆమ్ల ధూపంలో .. మండిన శాపర్ణి..

నిర్ఘళి …. ద్వయా చేలన … ఖేలన… అనుపాలిత కక్ష్యా తడి..

ఊళ పొడుగు నవ్వింతలో చెదిరిన అడుగుని వెనక్కి పిలవలేక.. కలిసి ముందుకీ పోకా ?

……………………

   12 . నింపిన అవశేషాలు.. బీజ కీర్ణ వదులులు .. తన స్త్రీ పాడుబెట్టిన నెలలు

టెక్నికల్ అసాసినేషన్ నా గర్భ మంత్రం.. తిరగదోడిన మునకలతో వేలాడుతూ.. పీడన

వండి వార్చిన ఒత్తిడి.. రోజూ మార్చని  లైఫ్ స్టైల్.. మరిగించేది.. మరిపించేది .. ఇంకేంటి?

అననయ వంశ దాహ ధార కావాల్సిందే … నువ్వు సుఖమివ్వక పోయినా ఓకే.. కాని … పిల్లలు కావాలి..

ఇందులో మరో సెకండ్ థాట్ లేదు.. నిర్లిత ప్రపథ తమకంతో ఊగే నిద్ర మునకలు..

నింపిన అవశేషాలు .. సమయ భావిలో లోతు తెలియని దుఃఖం.. తోడుతూ పోయాక

 ఏకధాటిగా చీల్చుకొంటూ.. నిద్ర దర్శనపు ఎంగిలిని తగల నీయకుండా

..నా దేహం నిండా పిల్ల అరుపులు.. ఒట్టు పెట్టిన  గర్భ పలపు అపేక్ష సిద్ధతని తాగి

ఆమె సొమ్మసిల్లాలని.. తపగత ముగ్ధ మూర్తుల కలివిడి నిద్ర కూర్పులు…చెలరేగి..

తొమ్మిది యుగాలని అడుగుల్లో కొలిచి పడవతో దాటుతూ.. నీక్ష్యా ద్రవన అణుసృష్టి ..

………………………….

 అవును ఇందులో మార్పు లేదు.. సహజంగా జరగలేదు కాబట్టి.. ఇంక నాకు వద్దంటే..

అమౌంట్ అంతా నేను చూసుకొంటా … నీకేం కంగారు లేదు..it is just normal

బీజ కీర్ణ వదులులు .. ఇంతకంటే నువ్వేం చెయ్యగలవ్? నువ్వంటూ నిర్ణయించడానికి ఏం లేదు

ఒకవేళ అదీ వర్కౌట్ కాదంటే ఆగిపోదాం.. ఇందులో ఇన్సుల్త్ ఏముంది?

నేనేదీ రెవీల్ చెయ్యనులే.. ఠాట్ ఐస్ ఔర్ పర్సనల్ థింగ్ … that is our personal thing..

 రొమ్ముచుట్టూ కుదిర్చిన పదిలత ఎండిపోయినా .. పాలు కారుస్తూ….

…………………………

తన స్త్రీ పాడుబెట్టిన నెలలు.. అప్పుడు పర్సనల్ కెరీర్ గ్రోత్ టార్గెట్..

ఇప్పుడిక .. అన్నీ చేరాను కాబట్టి.. లేదంటే .. ఈ earnings  అర్ధం ఏముంది?

ససోమిత ఆయుస్సు తడిమిన నిద్ర రాజీలని వదిలేసి.. కొంచెం కోపపడక ముందే ..

 కలిసిన ముఖాలతో.. దేహ నిద్రని పల్చన చేసుకొంటూ … హెచ్చరికని ఒడిసిపట్టి..

ఇంకా ఐతే ఉండి ఆగిపోయేదేం లేదు.. కడిగిన గుడిలో మొక్కులు..

 కొండ దారులు .. బాబాల ఆశీస్సులు .. తాయెత్తులు.. కొబ్బరికాయలు…

 వేల మెట్ల బొట్టులు.. ప్రదక్షిణాలు..కుంకుమ సాగులు

………………………….

గర్భ కృత్రిమతల నలతని సీక్రెట్ గా ఉంచలేం.. వెళ్తూ .. వస్తూ ఉండాలిగా

ఏజ్ ఫాక్టర్ .. గర్భం కుదరదంటే.. సర్గోసీ ట్రై చేస్తాం.. అంతేగాని ఆగేదేం లేదు..

ఇంతకంటే కీచులాట ఇష్టం లేదు.. ఇదంతా ఇక్కడితో ఆగిపోవాలి..

నువ్వేం చేసి ఆపలేవు.. పరువు పోగొట్టుకోకు.. సమయా నిస్ట్రాపు గారడీ

 అలలిత గంభీరం లో మాట ఏ మాత్రం వినని పట్టు.. లోపలి నల్లని అరుపు.

 తనలోకి తానై మాత్రమే నిండి బయటకు చూసీ చూడని చూపు..

 సాధించిన ఎత్తు నుంచి.. జులిపించిన అధికారపు  అంధత

……………………….

స్తంబితా అంగీకారంతో శ్వాస స్తంభనకి రెండో బుజం ఇచ్చి.. దిగబడి పోయాక..

ఇక వాడు.. ఆ ఇంపోటెంట్ నీ కెందుకు .. kick them out

నీకేం తక్కువ.. లైన్లో ఉంటారు మగాళ్లు.. మగతనం ఉబికే వాళ్ళు.. perform  చేసేవాళ్ళు

ముడిపడ్డ ఆందోళ మూర్తులని కాదని కొండల్లోకి తప్పిపోవాలని..

 నువ్వేం కంగారు పడకు..సరి చెయ్యని నిద్ర గ్రహణ ముసుగులో పడి .. ఏమీ తెలియనట్లు…

 కప్పుకొని తిరిగి .. వాళ్ళు అలాగే ఓడిపోతారు..నువ్వెందుకు ఎండిపోవడం..

సృష్టి నారాగ్రహ సమాధిని పట్టి తెచ్చుకొంటూ. తోసి పుచ్చిన క్షణంలో ..

 ఎవరు ఎవరికి నిదానించి సహకరించనిది… ఐస్ లా గడ్డ కట్టి ఆందోళన పర్చింది..

దేహం సంధి చెయ్యని నిరాశని కడుగుతూ.. వాన రొమ్ముల కటాక్షంలో ఓలలాడి..

దూసుకు పోతున్న మాంస లాసలో తిరిగిన నిద్ర మెట్లు.. కలవర దంపీలు..

కలని అప్పగించి.. మరిక తీరిక లేని నిద్ర వైభవాన్ని బరువుగా పట్టి తెచ్చుకొని….

అపనిందని  మోస్తూనే .. అతనిక అడ్డుపడడు…  కనిపించడు… వినిపించడు..

…………………………….

    13 . తామా గర్గన .. నిందా వికృతులు.. కాకుండా పోదాం..

హఠాత్తుగా.. ఎవరో చెప్పారని .. అన్నీ వదిలేసుకొంటాం.. మాట నిందల్లో పడి కూలుతుంది..

Heredity also a serious factor   .. నా మాట విని రిస్క్ ఎందుకు ?

ఇప్పటికే మ్యారేజ్ లేట్.. మళ్ళీ అప్పుడే మూడేళ్లు..

డిఫెక్ట్ ఎవరిదైనా కావొచ్చు.. అతనికి పిల్లలు కావాలి.. నువ్వా మాట వినాలిగా?

థర్టీ క్రాస్ అయ్యావ్.. ఇంకా ఫిగర్ మైంటైన్ చెయ్యడం ఏంటి?

తామా గర్గన .. అంతూ దరీ లేని ఉపేక్ష .. నాకేం ఇష్యూ లేదు.. ఈ గర్భం నా వల్ల కాదు..

                    నేను మోస్తేనే .. బంధన అంటే ఎలా?

కదిల్చిన మహా మోదన .. ఉండీరాని నిద్రలు

సర్ప గండాలు కనిపించని కాట్లతో .. లోపల నల్లబడి మాయమైన నవ్వు..

…………………….

నిగడ దీసిన నిందా వికృతులు .. పలుకుని.. నిద్ర రాల్పునీ .. పగనీ.. అప్పగింతనీ దాటి ..

 కొంచెం పైకి పోయి .. ఊపిరికి తాకిన తుట్ట తుది కదలికనే మోసి..

సమాధి దీపాలని కలలోకి కప్పి.. చలన శిక్షత అవహేయంలో .. ఉండిపోలేక …

చిందర వందర నిద్ర రీతులని సరి చేసుకొంటూ.. ఇదొక ముళ్ళుపోటు …

అటు పోదు.. ఇటు రావడానికి ఒప్పుకోదు.. మధ్యలో గోడని ఇంకా పైకి కడుతూ…

పిండం ప్రశినిస్తున్న చోటులోంచి.. గర్భ నిరాకరణ మోసే ఇల్లు .. వణికిపోతూ మూలకి జరిగి..

విఫల మితం లేని అవ్వపేక్ష రాజీలేని పట్టుకొని దులుపుతూ .. విడదీసి ఆరేస్తూ

 నెలలు దూకిన గదిలో… మంచాల గండం కత్తిరించిన గడువుతో వణికి…

…………………….

నీ ఇష్టం అనే అన్నాడతను .. కానీ అదో పెద్ద పంచాయితీ …

అటు..ఇటు .. బంధువులతో నిండి.. అతను ఫోర్సివ్ Nature తో ఉన్నాడు.. ఇదింకా initial stage …

ఇక ముందుకి ఎలా వెళ్ళగలం.. How to construct a strong life.. ?

పిల్లలు తర్వాత సంగతి.. ముందే నేను అతనిని వదిలించుకోవాలనుకొంటున్న.. థాట్స్ అల్ ..

ఇక నాతో అతను కాపరం చెయ్యలేడు.. చెయ్యనివ్వను..

మీరందరూ ఇందులోకి దూరిపోయి ఎంత గింజుకొని చచ్చినా సరే..

తనింకా ఆకర్ష ఛాయా దేవనంలో పడి రాలుతూ.. పడిపోక ఉంటూ..

……………………….

 సదా సంశయ నీరో మితంలో మీదకి పడుతూ .. కొంచెం పట్టుదప్పిన నడకని.. నడతని..

ఇక సరిచెయ్యలేక .. నిరాలోచన కప్పిన ఇంకిత నడుముని మర్దించి..

 కొంచెం తలుపు తీసి చూడలేవాని.. వేలాడి .. వణికిన తత్తరపాటుని ఇగరబెట్టి..

చిత్ర తోపులా కక్ష్యని చెల్లా చెదురు చేసి .. అప్పటికే ముగిసిన నటనలు..

సగం సగం మోసాలు.. దాచి పెట్టిన నిజాలు.. దోపుకొన్న గోడలు…

శరీరమంతా నిల్చునే రాలుతున్న దేహాల పరనింద వాకిలిలో జోకొట్టి..

ఆటే పోయి ఉండిపోయిన కన్నీరు.. ఇంకా తోడడానికి ఎవరూ అడగరు..

…………………..

 పరిరక్ష తెలియని తమాషా గిల్లుడు.. అధో తంత్రీని తెంచిన చూపు.. సెగబాటు…

 నిరాశక్త .. అన్నీ పరీక్షించి.. చప్పరించి.. పీల్చి .. కంగారులేని లైట్ వెలిగే దోషాలని తిట్టుకొంటూ..

 రసాత లేని నిరాశని రాత్రంతా ఉండక బెట్టి.. ఇంటిని బోసిగా చేసే  .. ఖాళీ గుమ్మాల ఊయల్లో

నిద్ర అయత్నంలో పెట్రేగి అరవక ముందే.. కప్పెట్టిన బీజ పూరణ చీకటి  తర్పణాలు

 ఇంక కొంచెం మతి జార్చిన కలనాలపై ఎగురుతూ.. పడిపోయిన కలని కప్పుకొని..

అలనేత పడవల ఉమ్మడి బజారులో బీజాల పేకెట్లు..

నగరమంతా కమ్ముకొన్న సంశయ జాగార పడకలు .. వద్దనిపోతూ …

గది నుంచి బయటపడని లాబరేటరీ వాసనలు.. దూదులు.. ఇంజంక్షన్ లు …

ఏక వికారము.. రొమ్ము బరువు.. చిక్కనైన అవాధేయ వ్యాకులంలో .. పొడిగా అవనత తీరులు .. 

తను ఏది వద్దనుకొందో అదే పురుషుడని తెల్సి.. భూమి లోపలికి  కూలిపోతుంది…

                               ……………………………..

                                                          2nd  CHAPTER

(Background: శిధిలత నుంచి కొత్తని ముడేసుకోలేక .. పెళ్లి .. సొంత ఖర్చు.. formalities … mindsets … తప్పిన పట్టాలు.. ఘర్షణల వేడి..  )

                     పురా ఆలోయన …విచ్ఛిత్తి పొరపాట్లు..

నాన్న పెళ్లి ఆల్బం.. పిన్ని కట్టిన పెళ్లి పట్టు చీర.. లంగా ఓణీ మరదళ్ళు … పైకి చేర్చి వాన ఒడిలో కళ్యాణ మండపాలు.. చుట్టాల ఇల్లే విడిదులు.. కొబ్బరి .. అరటి చెట్లే కళ్యాణ మండపం.. గాడి పొయ్యిలు.. అరుపులు.. నిద్ర లేని పూజలు.. అప్పటికే తీరిపోయే అలకలు.. ఆరోపణలు.. చిన్న గోడల దగ్గర గుస గుసలు.. వంటింటి తలుపు వెనక కనిపించని కీచులాటలు.. రాలే మామిడి తోరణాలు.. కథలు అందులోంచి దొరికి.. నటనలని తొందర చేసి .. ఆ పైన ఏడ్చుకొంటూ సాధ్య బిగీశ మోసిన గదుల్లో.. ఇంకా ఏదో సర్దు బాటు కాక…. ఉండీ ఉండనట్లుగా ఆగిపోతూ .. దగ్గరగా జరిగి అక్షింతలు….

ఏదో కావాలి.. ఇప్పుడూ ఐదు రోజుల పెళ్లే … కాని ఏ budget లో… ఎక్కడ ఏ అందని ఎత్తులో .. ఏ హోదాలో.. లేనిదీ కప్పుకున్న పులి తోలు గర్జనలు…. ముంపు రంగుల్లో ముసిరిన చీకటి….

శత మంత్రాల మధ్య పసుపు వాన.. సన్నాయి గుప్పిన నల్ల పూసల దండ .. చీకటి ఆవలించిన ముద్దు ఎంగిలి.. సర్దుబాటు. తెలియని ఆయాస కూర్పులో మంత్ర నీరుని పట్టిన సీసాలు.. గాలి మోగిన పడవల సంతర్పణలో .. ఊసులాడే రెప్పలని సరిచేసి .. రెండు నిద్రలేని దాటించే పగటి మోడుల వంతెన..

……………….

ఇప్పుడు అదేమీ లేదు..

చెప్పుకోలేని.. తడిచిన బజారులో నిండిన కళ్ళకి ఒదిగిన .. అంతా నటనలని దాటించే ఒంటి బరువుతో.. మంగళ స్నానాలు లేని జ్ఞాన మూర్ఛనలు కూలిన చోటులోనే.. ప్రీ వెడ్డింగ్ షూట్లు .. మెహందీలు.. బంగారం పేర్చిన చేతి స్పర్శలు.. అంతా .. జిలుగు.. వెలుగు.. నోట్ల కట్టల విందులు.. పళ్లెం పట్టనన్ని ఐటమ్స్.. DJ లు .. వీడియోలు .. ఫొటోషాప్లు ఎడిటింగ్లు.. లక్షలు కాల్చిన ముహుర్తాలు.

ఎక్కడో మూలుగు .. ఇద్దరలోనూ.. ఓ అనునయ దేహ ఆర్తి ఆర్పలేని దీపం కనిపిస్తుందా?

ఒకరి నుంచి ఒకరికి ప్రస్థానమౌతుందేంటీ ? అలా ఉండాలనే స్పృహైనా మిగిలిందా?

కలల నిద్రలో .. తూర్పు కొలిమిలో ముట్టించిన కథతో.. ఇంకా కాస్త నిద్ర ఋతువుని కాల్చే ఊపిరి చుట్టూ .. మాంస మాయ కమ్మిన చిత్ర ధూళి.  వశీకరణ బొమ్మల రంగు సంధిని కాదని…………

పొడవైన గతి వృత్తం గీసుకున్న పరిధులని దాటి.. అప్పటికి చేరుకొన్న దేహ మిళనని సర్దుకున్నారు. సమపార్ధ విస్మృతి కట్టిన నిండని వాళ్ళు కౌగిలిలో వదిలిపెడతారు..

ఏదీ ముందు అనుకున్నట్లుగా లేదు.. స్టార్ హోటల్ .. ట్రాన్స్పోర్ట్.. లిక్కర్ ముడుపులు..చెవుల్లో సన్నాయిని మింగేసిన ఐటెం సాంగ్ అరుపులు..

…………………….

పురా ఆలోయనని ఇప్పుడు పట్టి తెచ్చుకోవాలా ? అప్పుడు లేవా ఈ కనీ కనిపించని విచ్ఛిత్తి పొరపాట్లు.. గుసలు.. డబ్బు సరిపోకపోవడాలు.. చేదు గాథలు.. ఉపేక్షలు.. చిన్న అనుకృతిలో ఎగిరి మీద పడటాలు.. ఉపద్రవాలు.. పట్టి కురిపించిన కంటి జల్లులు.. ఊపులు .. ఒడిదుడుకు మండలాల్లో కురిసే వర్ష జంటలు..

ఏదీ అలాగే ఆగిపోదు.. ఆగితే మాత్రం బావుంటుందా? స్పర్ధ గారడీలు చేసుకొన్న నిద్ర పూచీలు.. అర్పణల పొలమరింత .. ఒడ్డు  తోసుకొచ్చిన మతి చింతన కదిలే నిద్ర చూపులని నాకుతూ ..చేర్చి పోయిన నిద్ర దర్శనాల కిటుకుని పట్టుకోలేక కూలిపోయిన నాటక స్టేజీలు..

ఇప్పడూ అదే .. కానీ అంతా కాస్టలీ.. మాట క్షణాల్లో నల్లగా మారి.. కమిలి పోయిన నిరాశ వేడుకల మధ్యలో  కూరుకు పోయిన జ్ఞాన బిగీస కలబడే విపత్తులు.. ఆయత్న మితి సంధిని తీర్చిన కాళ్ళ నిధులు.. అదిమిన దేహ రక్షలని కాదని చెలరేగిన నిద్ర పూరింపులని కప్పే దేహ సంగమితి..

……………………………

అంతా మాయమై పోతుంది.. అన్నీ లెక్కలలోకి మారిపోతాయి.. కథ అర్ధం కాదు.. విశ్వాసం నిండిపోతుంది.. సమయం చేర్చుకోదు.. విసుగు తెలిసిన నిద్రతో కథలు కూలిపోతాయి.

ఇప్పటి లెక్కలు ఇప్పటివిగానే చూడాలి.. ఎక్కడికి పోతాము.. నలుగురితో కలిసి చావైనా .. బతుకైనా? మరో చోటు అంత దగ్గరలో ఏం లేదు.

జిలుగులు ఆగిపోయాక.. albums మాసిపోయాక  … అసలు కథ ఎలా మొదలవుతుందని తను అడిగి.. చీకటి కొండపై అతని కోసమే ఉండి..దేహరుణం వదిలించుకోవాలని..

 కంగారులో వచ్చేశామని చెప్పుకోవడానికి .. ఇక్కడ ఏదీ చెప్పుకొని రాదూ.. అర్ధమయ్యే వరకు ఆగదు.. తోసుకొస్తుంది.. వెల్లాల్సిందే … అప్పటికే కూలి రెండో ముఖంలో ఉండిపోతుంది.. అక్కడ దండ గుప్పడానికి అన్నీ ఉన్నాయి.. దారం తప్ప..

బెంగతో .. ఇంత తొందరగానా? ఏదీ తెలిసిపోవడం లేదు.. కథనీ వదలడం లేదు.. అంతా చీకటి కమ్మేసిన నిద్ర విధుల్ని కప్పేసి .. అటే పోతున్న సిద్దతని ఖాళీ చేస్తూ.. ఊరుకోలేని నడకలు..

                                                                                                 ——————-

1.శిధిల గర్భంలో అమాస .. ఎండిపోయిన ఇల్లు.. ద్వయన రూపసి

తెగి పెట్టిన వీధిలో అమంగనా ద్రవత జాగాహారాన్ని చేర్చి ..  శిధిల గర్భంలో అమాస

ఉన్నాననే .. గోడల పరిచర్యలో .. వాడు పొంచి చూసి మాటని దాచిపెట్టి .. ఎండిపోయిన ఇల్లు..

                                   కళ్ళలోంచి మాటని అడగక .. మాసిన భాషణని అందిపుచ్చుకున్న నిరాశ

తిప్పి.. తిప్పి .. ముఖాలని చూసి.. కరిగించి .. నింపి సర్దుకొని.. ఎవరో ఫోన్లో నింపిన అశ్లీల కాటు..

హోటల్ రూమ్ లో తలపడడానికి ముందే పడగ విప్పిన సీసీ ఫ్యూటజీ ..

తను  ద్వయన రూపసిగా మారి పల్చని చీకటిలో దుఃఖం నింపుకొంది.. నిష్క్రమ హెచ్చరిక

గొంతుని ఒంచుకొని మీదకి దూకుతుంది.. మంగళ చిహ్నాలు లేవని కూర్చిన నడక… 

వెళ్లగొట్టినప్పుడే మరో అక్రమ ప్రపోసల్.. అతి సన్నని మంచు పొగని నాకుతూ.. పొడి బట్టలో చుట్టిన కత్తి.. డిక్కీలో సగం కాలిన ఎముక .. రొప్పిన వాంతి వాసన.. గమన దేహకి..

ఖాళీ కోపం మరిగిన విశ్వాస నిర్మాణమే… మళ్ళీ తన ముందే తను.. వికార కుప్ప ..

                                                     ********************

పగబట్టాడు.. బట్ట విప్పాలన్నాడు.. జీతం ఆగిపోయింది.. గొంతులో చీము.. కట్టు లేని నడక..

                        కలిసినప్పటి ప్రైవేట్ వీడియో శాపాలు.. లొంగదీసుకునే అస్త్రాలు.. అక్కరలు..

బొమ్మల్లా .. మళ్ళీ మళ్ళీ రంగు పులిమి.. కథ మాసిపోయిన నెగడు హంతకి.. దమనోయరా…

లేదా స్లీపింగ్ పిల్స్ తో నిండు డబ్బా.. అడ్డంపడ్డ ప్రొమోషన్లోనూ నీలి వాసనకి ..

మూతి బిగిస్తూ.. కపట జయం .. వెన్ను కలిపిన మాంస నర్తకి వణుకుతూ.. నొప్పి పిండం

అతనినెలానో రాకుండా చేసానని అరిచినా .. కలాప కంగారుని దాచిపెట్టినా.. సడి మోగదు

ఎక్కడో చావుని పట్టుకొని కూలిపోతాడు.. చెమట దారాల ముళ్ళకంప.. తగ్గని నస..

పాతుకు పోయిన గొంతు నరాల్లో ఉబ్బిన నల్ల త్రాచులా బుట్ట .. బుసలు పండవు..

                                                       **********************

ఏం జరుగుతుంది? మనలో..ఇలా ఎందుకు దూరం జరగాలి?

వన్ సిట్టింగ్లో మన ఫైనాన్సస్ క్లియర్ చేసుకోలేమా? నిండి వార్చిన రెప్పల మంట.. 

                                     సాగిపోయిన దేహనింద కరిగించి పెట్టుకొన్న అన్వాయ మూర్చన

చూపు పులిసిన రాత్రి నిద్ర .. ట్రోలింగ్లు .. స్కర్ట్ చిరిగిన రీల్స్ ..

ప్రేమ ఒక అనామోహ ఒడంబడిక .. లోపల క్షమ దొరకని మాటల కైపు.. వంకర నాలిక

పాస్వర్డ్ దాచిన ఫోన్లో రుమాలు చుట్టిన పచ్చి సిగ్గు .. క్రెడిట్ షాప్పింగ్ల నషా వదలక..

స్టార్ నైట్లలో గోధుమ రంగు పొగ తాగిన పాము బుసల శరీర పాడెపై .. ఒకడి తర్వాత ఒకడు తొక్కి..

                                                     ************************

జామీన్లు లేని స్టేషన్లో పోలీసుల లుక్అవుట్ నోటీసులు.. లాక్అప్ పోటీలు.. నల్ల చరుపు

అపార్ట్మెంట్ కూంబింగులో బయటపడే దస్త్రాల నోట్ల కట్టల్లో … కందిన కోపం.. రుణగారడీ

                ఇంకేదీ అసాధ్యం.. కోర్ట్ ఏడ్చినా ఉందని తీర్మాన బరువు లాగుడు.. ముంపు తూకం

లాభ నష్టాలు.. దేహ నడతల పొలికేక .. చెమ్మ పట్టిన గొంతు బూజుల అరుపు .. అస్త్ర పాపి

చల్లబరుపులు లేని EMI లు.. భరణాలు.. క్రెడిట్ కార్డు క్రాష్ స్టేట్మెంట్లో …వాడి కోడ్ పర్మిట్లు..

 హాస్టల్ పిల్లలు.. dustbin  లో రాలిన పేరెంట్స్ .. పెద్ద నోటి శాపనార్ధాలు……. గది మోడులు

కోర్ట్ వాయిదాలు.. హ్యాండోవర్ కానీ అపార్టుమెంట్లు.. అంతలో లే-ఆఫ్ మెసేజ్లు .. 

     అనుకూలంగా ఉన్న కేబుల్ బ్రిడ్జిలు .. కథ తెలియని మీడియా తాండవాలు.. కైపులు .. స్కలిత నలత..

యుద్ధం ముగియని యుద్ధం.. రగడ ముగియని తెగులు.. గాలి కుళ్ళిన గది..త్వయారుతం

అర్ధరాత్రి  పులుముకున్న ఫేస్బుక్ల్ ల్లో .. వేర్వేరు విండోలు .. జాగీరులూ.. కొత్త ముడులు..

నగర గర్భం రాల్చిన  హంతకుడి వీలునామా.. ఎవరూ తెరవని నిద్ర గదిలో ఊపిరిలేని పాప ..

                                                                   ***************************

సమయ ఆయాస మూర్తులతో తలబడే కన్నుని తాగి .. ద్వయన అమాస మోసిన ఇల్లు.

అప్పగించి చూయించుకొన్న వేర్వేరు నిర్మాణ రీతుల కలకలం..శిధిల రూపసి

 తలపడుతున్న భద్ర రూపులకి అతికించిన తేడాలతో ..స్వయమాయ గందరగోళం

కలిపిన పగుళ్ల ఆయాస మొదలులో .. నేను తనకేమీ ఇవ్వనని అని.. బయటకొచ్చాక..

కీడు పట్టిన గదులు.. పురుషుడు .. ఆమె శరీర మధ్యంలో తలకిందులయ్యే క్రియా ముద్ర.. అనుమానం .. వేరే గది.. గోడలు రాల్చిన నల్ల బొగ్గు పూసిన రక్కిసలు.. చీకటి విళుపుర

ఆమెకి .. అతను వేరొకరితో.. అతనికి .. ఆమె .. కొందరితో.. ఊయంగన శ్వాస నిడువులు..

సరళ విషంతో నిండిన సీసాలు ..పేనుకొన్న చున్నీలు.. గాటు పెట్టిన కత్తి కిర్రులు …

 ఆమ్లాయ కేకల దొంతర.. దుఃఖ సొరదలో కాలు పెట్టి తన్నిన తలుపు..

ఎక్కీ దిగిన ముడుల బిగువు..  తెచ్చీ రాని గాలి గుండాలు తలలో పట్టేసి..

ఒక వీలునామా  మిగిలిపోయిన రెండు దారులు కలవక…  దూరంలో ఒకరికొకరు శిధిలాలుగా….

                                                   ___________________________

         2. గుహని తొల్చుకొంటూ నిద్రదేవి.. రెండో బడలిక .. కాదనే కంటిజడ

అస్థిమిత రాజీలో తల ఒంచుకున్న దేహ దర్శన…పుప్పొడి   సంధి

 వెగటుపై రాల్చుకొన్న కాళ్లతో ఛాతీపై దూకే కొండ.. తను మళ్ళీ డేటింగ్లో ఉన్నాడనే.. బిగలాగిన మాంస క్షేత్రం.. ఊరట పడ్డ మూడు రాత్రుల నిద్రలో గతుకులు..

నా  నడుము పెరిగి పోయింది.. జుత్తు పలుచనైంది.. బొడ్డు మూసుకు పోయిందనా? కంటి చూపు సన్నగిల్లి.. మోకాళ్ళు ముడుచుకోక …

విశ్వాస రాహిత్యంలో .. చావు చెరిసగంగా ఉండి … చెమట ఆరని రెండో బడలిక .. మాత్ర చలన.

వాడు ఆ కాసేపు  మాత్రమే కనిపిస్తాడు.. దుర్బిణీల గుడి

చలన గతిని అంటుగట్టి … హెచ్చరికలని.. శ్వాసదండాన్ని తిప్పి కొట్టాక  కాదనే కంటిజడ … మంచు కూడలి .. దేహ నివాళింపు .. పక్కనే ఉన్న దగారీలు..

అదే జరుగు తుంది.. శిధిలపు నకిలీల నవ్వుని కార్చి ..ఆమ్ల స్వనిహాయ పూర్ణ

 అటు తిరిగిన పెదాల వెనక ముద్ద కట్టిన నల్ల కసిని నలిపి.. సగం కూలిన పొగల విందు..

తనకి కార్ వదిలేసి .. నన్ను క్యాబ్ బుక్ చేసుకొని .. క్లబ్ నుంచి వెళ్లిపొమ్మంటాడు..

మొగుడు.. బాస్ .. రెండు చోట్లా … ఐనా ఇలా ఎలా పట్టేసాడో … జిగురు సన్నని నడుము కొలత? .

డేటింగ్ అప్.. డౌన్లోడ్ చేసినపుడు.. వేల కంబినేషన్లు .. పేర్మిటేషన్లు …

 ఒకటి.. రెండు.. మూడు .. కొందరకి … నాలుగో డైవర్స్ … దంపిన బొమ్మల నెలవు..కరువు

బ్యాంకు .. ప్రాపర్టీ.. కార్లూ ..ఆర్నమెంట్స్ .. లెక్కలు .. ఫోటోలు .. ప్రూఫ్ల్యూ..

                                                            ****************

ఎటూ దొరకని మాంస కవ్వన .. ఎత్తిపోసుకొన్న బెంగ .. నీరు పట్టిన కంగారు..

ఇప్పటికిప్పుడు ఇంకేదో కావాలి.. గుర్తింపుల లస లస లో మరిగిన గాలి పొత్తిలి..పంటి కాటు

నులిమిన గొంతు నలుపులో ఊడిపోయిన కండల మత్తుని పిండి.. కల్లలయ …

నిష్కరణ సాధ్య శరీరంలో .. సుయాస ఊపిరి కట్టిన నడకని దాచి పెట్టి..

వద్దని వదిలేసిన పార్టీల మధ్యలో తూలిపోతూ.. మెలి తిరిగిన నొప్పిని కప్పి..సీసాల పురి..

నివురు గప్పిన చీకటి వెనక .. ఎవరో పీల్చేస్తూనే ఛాతీల.. గుప్పెడు గరుకు నాలిక ..

ఆగనీయని ఆ చోటులో అరుపులు..తగువులు.. జవాబు వినని ప్రశ్నలు.. డిక్లరేషన్స్ ..

అర్ధ గొడుగు చీకట్లో పెదవి పంచుకొన్న ఫోటోలు .. ఫోర్జరీలు..పోలికల వంకర నస …

లెక్కలని .. భరణాలని .. ఇంటర్వ్యూ కాల్స్ తో  సరిపెట్టేసిన.. ఉనినికి నిందల పోటు ..

హెల్త్ కార్డులు.. క్రెడిట్ స్టేట్మెంట్లు .. దేహ నింపుదలలు.. పొరమళింపులు..

ధూళి గొట్టంలో నిద్ర పొడుల ప్యాకెట్ .. జేవురించిన బరువు నడకలు.. అయాస..

గర్భ నిడివి లెక్కలు .. ఇక నేను కాదని భరోసాలు.. స్తంభిత చక్రాల దిగదుడుపు.. సరళ శ్రమ

                                                             ********

వాడెవడో పిలిచాడు.. నన్ను లాక్కు పోతున్నాడు.. అదేదో .. ఏ ఊరికో తెలియని రైల్లో..

నదిలో దశాబ్దాలుగా దాగిన శిధిల సమాధిలోంచి .. అప్పుడే లేచిన వాడిలా…

 జ్ఞాన మర్దన .. విప్పిన కూడలి పట్టాలపై .. కప్పి రాచిన నిప్పు మడి .. ఎండిపోయి.. 

పొడుగు జారిన కన్ను…దోసిలి విప్పిన చేతుల్లో చలి మడుగులని కాచే నిద్ర ఊపు..

కంటి చప్పుడు.. గుండె దడ .. గొంతు వాపు.. బొడ్డు కింద నొప్పి.. తొమ్మిది నెలల పిడుగు.

అన్నీ దాటి ఆ రైలులో నేను..అకారరంధి.. కనీసం తనలోకి చూడాలని అనుకోలేదు…

వాడి పెద్ద అంగీ లోపల నేను ..  ఆ పక్క బోగీలో దేహం కాల్చిన సీసాలు.. పొగల ఆవ

కన్ను .. ఆ చిల్లులోంచి బయటపెట్టినపుడు.. ఏడు రంగుల చీకటి పట్టిన దుప్పటి అల్లుకొంది

గుహని తలచుకొంటూ నిద్రాదేవిలా వెళ్తున్న రైలు.. అదో మాదక నిరూపం.. విశ్వనిర్జ..

మహా సంగమం ఆవలించి విశ్వ సంపద కురిసే చీకటి అనుయాయి … స్వకల్పోమ వారధి..

                                                     **************

అలవాటు కాని నిందలు.. గర్భ తంత్రిని వదులు చేసి ..చూపు గాలింపులో నిందల గొడుగు

 నిద్ర ధ్వనిని వింటూ .. అతనిలోకి కూలిన కలయిక ఎన్నిసార్లయినా కావాలా?

నిర్మాణ కళ్ళు … మళ్ళీ పురుషుడు అర్ధం కావటంగా .. నింద నుతుడి రోలన వదులుకొంటూ..

దంచిన కొండల్లో .. పుట్టుక మళ్ళీ కనిపించిన వీధి పంట… ఇక్కడే ఆగిపోలేనా?

ప్రశ్న వినని సమాధానం ఊగే నిద్ర కణుపుల్లో .. వచ్చిన కష్ట జోడింపులు .. తలకట్లు..

అంత రక్షా ఎందుకనే వెనక చెట్ల అడివిలో అరుపు.. సరిపోల్చని మృత్యు పూచీలు..

ఏం కావాలి.. ఇంకా కావాలి? ఎందుకు కావాలి? ఎలా కావాలి? క్రిమి సంచీ.. మెదడులో..

లోపలనుంచి .. కీచుమనే పిల్లి అరుపులా .. నిన్ను తొక్కేసిపోవాలంతే … వెగటుమొర…

మెట్టు దిగని పులుముడు నొప్పి.. తెల్ల క్రీముల మాట పోరు…అంతకంటే ఏం కావాలి?

నియాగాథ నిస్తేజంలోని మాయ జరిపిన చీకటి ఒడిలో ఒలికిపోయిన మృత్యు గంట..

ఇక చాల్లే ఆగిపోదామన్న .. కూడా ఎవరూ లేరని… తోడు గుచ్చిన శాప ముడుపుల అలికిడి

ఎవరికి తెలియనిదో .. ఇంకా దగ్గరకొచ్చి ..మరింతలో ఇక కనిపించదు.

                                                                                       —————————

                     3.  కదలికల రంజన .. బొడ్డు నొప్పి.. చల్ల ముంచిన నాడి

ఇద్దరం ఒకరికొకరం ఒంటరిగానే ఉన్నాం.. సృష్టి శాపం వర్షమై కురుస్తూ ఉంది..

జ్వర గోళం మింగిన గది ఏడుస్తూ .. అటు కదిపి చెప్పుకొన్న కుదుపులతో కాళ్ళని పట్టుకొంది ..

                                అక్కడ జరుగుబాటు లేదు.. మాట నిండి పోదు..మగత పండిపోదు  ..

వాడిని వాడుకొని వదిలేసానని నా వెనుక నవ్వుతారు…. నిజా విలీన

                                  పునాది నూనెలు పీల్చేసాక తీరుబాటు లేని చీకటి సవరింతలు తేలవు.

కలబడే విందు గడువులు.. కన్ను తిప్పుకొన్న పుట్టుకని చల్లార్చి .. చల్ల ముంచిన నాడి ..

చెరి సగపు నిద్ర విడుపులని ఏమార్చి అప్పగించిన ఆశ్రిత వీధులు.. బొడ్డు నొప్పి…

శరీరజాలంలో చిక్కుకొన్న కదలికల రంజన .. దక్కిన సుఖంలో లెక్కలు

                                                                ——————–

నిర్దయ సమ గంభీరాలు.. వేలాడిన అసహనం ఉరికి వేలాడినప్పుడు .. విరిగిపోయిన

                                    మాంస   భూమిలో .. బలంగా చరిచిన చూపులు .. పుల్లవిరుపు చాడీలు.. ధ్వని నిరూప మంగళ విబేధాల్లో పడి .. తిరుగుతున్న విరోధ మూర్తుల కలోవరం..

                                   అసమ నికరాల పట్టుతప్పి… విష్పల విగ్రహమై గడ్డకట్టి… దూకుతుంది.

ఏదోలేదని … అదే కావాలని.. సరి చెయ్యని ముడుల బిగదీతని తల పట్టుకొన్న బిగువు..

సమయ నిక్కచ్చిగా తను నిలదీత .. లోపలి చెమ్మని ఆర్పిన గరుకు నాలిక ..

కంటి రాళ్ళ పగుళ్లు… దీప జాడలు విప్పుకొన్న ఇటుక మేడల గది..

ఎలా సరిపెట్టుకొని .. దూరమై కదిలే పగటి నిద్రలో .. కథని చెప్పి బెంగ పడాలి?

నా మాటగా ఉండి.. దేనినీ చూడదు.. నా కన్నుని నలిపి ..చూపుని మోయదు.. విశ్ర సారం

నా ఏడ్పుని పట్టి .. తనని చేర్చదు… నా ఉనికిని  కూల్చి .. తానేదీ ఒప్పుకోదు.. నల్ల గోళీలు

ఆఖరి వర్షంలో మొదటి విందుపై ఈగలు ముసురుకున్నాయి.. పొరబాటు లేదని..

                                  ఉప్పు చూసి.. కళ్ళని చాపి.. నాలిక మెలిపెట్టి…. గిన్నెని విసిరి కొట్టింది…

                                                                ————————

దేహ సరంజామాలో రసాయన ద్రవ్యాలు అడుగంటి.. భయం నేసిన గొంతులు.. బిరుసు నవ్వు

                                      చెల్లిపోయాం.. మాటల  తవ్వకం.. ఓడిపోవడం.. ఓడుతూనే వెళ్లడం..

నల్ల దుప్పటి కప్పిన శరీర ఇరుకుల్లోంచి ఇసుక రాలడం..బూజు పట్టిన కన్నీరు..కాలి దుమ్ము.. 

                               దేహశాలలో ఒంటరి శవాల గది.. చూపు కుమిలిపోయిన నిద్రలేమి చిదిగి..

ఎటు పోయిన .. అటు ఇటు లేని నరక ధృవాలు.. ఆ గోడలు .. తాళాలు.. రంగు కాగితాలు.. వాడి

                                                         ముందు ఒళ్ళు విరుచుకొన్నాక .. ఇక తను నాతో ఉందా?

ప్రశ్న .. ఓ ఎర్రగోళంలో గుండ్రంగా తిరిగే అనామక తీర్ధ గుహ.. చేదు ఛాయన ..

స్వధానిక్త లేని నిద్ర అమాంత పురుషుడి మధ్యస్థ గారడీతో లాల చేయించిన శ్వాసల పుట్ట ..

దేహ కనికరము.. ఆ రాత్రి తను నా దగ్గరికి జరగడమో .. స్తన్య ధరకాల ఆమ్ల మడి..

ఇక లేదు.. ఇదే మంత్రత  స్టోర్ రూంలో .. జల్లెడ దులిపిన వర్షాల కొండ.. టీ పొడి..

తను ఏడ్చి.. కలశ నిద్రలో తోడుకొన్న తెగదెంపులు.. ఊరట మోసింది..

                                                    …………………………….

 బొంగురు పోయిన మసి కాళ్ళ వాగులో .. చచ్చుబడిన మాంసాలు..

                ఎముక తెలియని షాపింగ్లు.. అంతా కొల్లగొట్టిన అపార్టుమెంట్లు..

గిఫ్టుల ముషాయరీల్లో నల్ల గుమ్మాల శ్వాసవాగు.. తత్తరపాటు లేని క్షమ ముంచిందా..

ఎద్దడి కమ్మేసిన మాట సమయాల మధ్య .. టీం లీడర్ ప్రెసెంటేషన్ల .. తెల్ల పేజీల మరుపు..

అసహన ముద్ద కట్టిన .. ఇంకిపోయిన నడకలతో నాచు పట్టిన ఫ్లోర్ పై … తడబాటు ఎండలు..

సమ రుతు కథనాల.. రెప్పల ఆదమరుపుని తుడిచి ఇరికిన.. కంటితనం మందగించిన..

 నీటిపుట్లని ..చాచి పెట్టుకొన్న అప్పగింతని తలపోసుకున్న చీకటితో ఓలలాడింది..

                                                        —————————-

నీరు కాలింది కళ్ళలో… పెదాలు బిగించి ఈసడించి .. శరీర అఘాత్యా మతి పొద్దులు..

గొంతు రుమ్మిన సెగలతో ..జుత్తు బిగించి అరిచింది.. మైల సంపెంగల ఉరి..

Don ‘t  say we …. now  stand  alone … అదే మంత్రం ..పెద్ద గొంతుతో దాడి .. 

పురుష వ్యాక్యం .. అతని శాసనం లేని దేహం ..నిస్వాధీయ ..  రాత్రి నుంచి పొద్దున్న కల్లా ..

మంచు తెర మాయమైనట్లు.. శ్వాస జ్వరం కాలినట్లు.. మాంస తాళం కనబడనట్లు..

ఒకే అనుభవం.. అదే ద్రవ శిలల ముట్టడి.. సూర్య తోపుల సందడి .. ఇంకేం వద్దు..

ఆ బరువుకి నేను సిద్ధం కాదు.. మరో మోసే womb .. నీకేం జేబులో చెయ్యి పెట్టుకొని.. హీరో పోజు..

నాకేదీ వద్దు .. సమయ పీల్చివేతలు ఊడిపోతూ .. మళ్ళీ stand alone …

                                                           …………………………….

4. పాట లేని పాత ఇల్లు.. వాడు రాడు … దిశా నివురు సేవిత

కలబెట్టి పోయాం.. పైకంటా లేని మధ్య గదుల గోడలతో ఆ పెద్ద ఇల్లు..

                   ఎప్పటిదో గ్రామఫోన్ ..ముళ్ళు విరిగి.. బొంగురుపోయి..  పాట లేని పాత ఇల్లు.

రవికలూ .. నిద్ర ఏరులూ.. పసుపు డబ్బాల తుప్పు.. ఇత్తడి బకెట్ల నాచు.. మరుగు దొడ్లూ ..

చుట్ట చుట్టిన అరుపులు.. తీర్మానాలు .. చెక్క పీటలు సర్దిన అన్నాలు.. ముందు మగాళ్ళకి..

మాట జల్లెడ పట్టిన గుడులు.. తలంటు స్నానాలు.. దుప్పట్లు ఉడకబెట్టిన వాసన ..

కుంపటి లో పప్పు.. బీటలు తీసిన గాడి పొయ్యి …

నదీ మేటలు .. పాత ఎత్తుల రైల్వే స్టేషన్.. రోడ్డుకి కిందికి దిగి..

దేహ నిద్ర అడుగంటిన కంటి చూపు.. గొంతు వాపు.. రహస్య మాను పెట్టె .. గాదె బియ్యం

మట్టి గాజులు.. నుదుటి మచ్చలో కుంకుమ బొట్టు ..

కర్పూర బిళ్ళలు దాచిన పట్టు చీర .. నల్ల పూసలు.. పెద్ద పెద్ద దుద్దులు..

……………………………..

వాడు రాడు … రంగంలో చూశామని కొంత మంది.. మరింత మంది కాశీ అని.. పిలవబోతే .

 గంగలోకి దూకి మాయమయ్యాడని.. చూసేందుకు కాటికాపరిలా ఉన్నాడని…

కాదు తిరుపతి కొండపై.. అరకు అడవుల్లో.. అక్కడా .. ఇక్కడా .. వాడురాడు.. రానే రాడు .

ఉన్నాడో .. లేదో కూడా తెలియదు .. కానీ తను మాత్రం ఠింగురంగాని తయారై..

వీధిలో కూర్చొంటుంది.. అందరికీ ఆడో వింత .. అనుమానం.. కసి.. దాచలేని తనం.

సొల్లు కార్చుడు.. తెలిసే కూర్చొంటుంది .. అందరూ చూడాలనే అల్లాడుతోంది.. ఏదో ఒకరోజు..

చెరువులోకి దూకి .. వాడిపోయిన తెల్ల కలువల గుట్టలా …  తెల్లారే సరికి తేలుతుంది..

కడుపు కాయని కోడల్ని వదిలిసిన చోటులోనే … తిరిగి కొడుక్కి మంచం.. తలనీలాలు..

……………………………….

గంగిరెద్దు తలఊపుడు.. నేల దువ్విన దున్నపోతు రంకె .. కన్ను చెప్పుకొన్న నిద్ర తోడు కల

స్మశానం పక్క .. పూరి గుడిసె లోకి వాడు అప్పుడప్పుడు అర్ధరాత్రులు వెళ్ళొస్తాడు..

మంత్రంసాని.. అరచేతి పై కర్ర తిప్పి.. ముందు చేటేడు బియ్యం అడుగుతుంది..

ఏం కావాలో అదెలానో తెలియదు.. మంచి మొగుడైతే కావాలని..

మంచి ముసుగేసుకొన్న నిద్ర పోరుల హంతక తీరులతో .. వాడు ఊరేగి ఎప్పుడో అడుగు పెడతాడు..

ఊరంతా పప్పన్నం పంచుతారు.. కళ్ళు తాగుతారు.. ముక్క నములుతారు..

 ఊగిపోయి ఆడతారు.. మళ్ళీ ఆరు నెలల్లో ఆ శవం  ఊరేగి నపుడు అదే చేస్తారు.

రెండో కూతురికి .. నూనె రాసి.. తల దువ్వి.. రిబ్బన్లు కట్టి.. పౌడర్ రాసి .. ఈడుకొచ్చిందంటారు.

…………………………………

విశ్వపు గరిభనాభి ఇంట్లోనే దొరుకుతుందని ఎవరో అరుస్తారు.. పది మందికీ చెప్పుకొంటారు

ఇప్పుడే ఇల్లే లేదుగా ? అని.. చీప్ లిక్కర్ బాటిల్ పైకి ఎత్తి .. తూలి పడతాడు..

పెళ్ళాం వదిలేసి పోయింది.. పిల్లలని తీసుకొని.. ఇక ఎప్పుడూ తలుపు తీసే ఉంటుందని 

చేపల్లాలతో కలిసిపోయి.. ఇంత డబ్బు పట్టుకొని.. ఏ స్మశానాల్లోనో పడుకొంటాడు.

 పాడుబడ్డ గుడులూ .. మూసేసిన బస్సు స్టాండ్లూ .. అన్నం పెట్టని సత్రాలు.. అవే వాడి గూడులు..

ఇంట్లోకి రానివ్వడం మానేశారు.. పెళ్లీడుకొచ్చిన పిల్లలుండి.. ఏదో గుబులు

అప్పుడపుడు .. గుర్రం జాషువా పద్యాలు.. నీళ్లు ఉబికేలా పాడతాడు.. ఇంత ముద్ద పిండం తిని..

చితి దగ్గర చలి కాగుతాడు… డప్పు లాక్కొని కొడుతూ తిరుగుతాడు…

…………………………………

తీర్ధ యాత్రలని చెప్పి.. రైలు బండి .. కనిపించకుండా దిగిపోయి..  పూనే జిలుగు రాత్రిలో

చెమ్కీలు .. అత్తర్లు.. ముందర రంగు బట్టలు వేసుకొని.. పౌడరు దట్టించి.. పెదాలు ఎర్రబెట్టి …

 స్టేషన్ బయట రోడ్లలో  కాస్త తూగు తున్నట్లుగా విటుడిని చూసి కన్ను కొట్టి.. ముందు బిర్యాని..

ఆ తర్వాతే ఏదైనా … ఎక్కడికైనా రావడం.. ఏదైనా ఇవ్వడం

శిక్షా సమాధిలో ఊరేగే విపరీత మాంసాలు వేలాడ దీసిన కభేళలలా

మురుతున్న డ్రైనేజీ పక్క .. చీకిపోయిన పాత బొంతలపై… మగ్గిన రాక్షసి బొగ్గుల గుండంలో

శరీర ద్రావణ యజ్ఞ గుండం.. పొగ కమ్మిన ఛాతీలోంచి ఉబికే రక్తం..

 ఒళ్ళు కుళ్లిపోయి . ఓ. గవొర్నమెంట్ దవాఖానాలో ఉపిరి రాల్చింది..

…………………………………..

     5. నిశాపర్వ ఆందోళ .. తెలియని అడుగులు.. నిండిన రేవు నిరాధార

నిరాధార ఒంపులో కూరుకు పోయిన నిశ్చల రతీ … ఆయాస నిగ్రహాలని తెరిచి .

 కదిలే రాశీ గొంతులని పెనవేస్తూ నిశాపర్వ ఆందోళ .. తలపోసినవీ.. మాట చెదిర్చనవీ

తను నా లోపలే ఇల్లుని కట్టుకొంది.. దీపం పెట్టింది.. కుంకుమ రాల్చింది..

పసుపు అద్దిన గోడల మధ్యనే  నాకు దిష్టి తీసింది.. తాయత్తు కట్టింది.. చల్ల నవ్వుతో చూసింది

చుట్టూ తిరుగుతున్న పొగరు గాలిపై కోప్పడి.. చీపిరి పైకి లేపి గాలిని కొట్టింది..

జ్వరం తగ్గేవరకూ కాపు గాచింది. తిండి తినీ తినకుండా అల్లాడింది 

నువ్వు అడుగు పెట్టాకే.. రాయిలా ఉండే మాంగారు గుటుక్కు మన్నాడని ..

 వ్యాపారం దెబ్బ తినదని.. ఇంట్లోకి మళ్ళీ ఆడపిల్లే వచ్చిందని .. బంగారం బొగ్గు అయిందని 

ఎవరో గుస గుస లాడారు.. చెవిలో పడేలానే.. కళ్ళ నీళ్లు పెట్టుకొంది…. అతని దగ్గర ..

వాడు నాకెందుకీ నస అని.. అరిచి.. వాడు పని చేసుకొని .. గుర్రు పెట్టాడు..

తను ఇదంతా కాదను కొంది .. చీకటి తెరవక ముందే కొంగు కప్పుకొని.. పొలాల్లోంచి .

 దాక్కొని .. దాక్కొని .. వెళ్లి .. పాడుబడ్డ గంగ నుయ్యిలో ‘శివయ్య .. నన్ను క్షమించు ‘ అని దూకేసింది.

…………………………….

నీ దేహంలోకి .. ఇవి తెలియని అడుగులు.. ఇవే చీకటినీ .. నిద్ర సగంలో ..

 విరిగిన అలసట రాత్రులనే కప్పి .. మాట జారుతాయి.. ఇక్కడే మరే వింతా అవుననదు..

అందరూ కాదనే వారే.. తెలిసినట్లు మాట్లాడే వారే … అనునయ సంధి సూత్రం అప్పగించేవారే

కొంతమంది లోపలి సణుక్కొంటారు… ఇంకొంతమంది పైకి అరుస్తారు…

 తల కొట్టుకొంది.. కత్తి పీటని పదే పదే చూసింది.. పళ్ళు కొరికింది.. పచ్చడికి ముక్కలు కోసింది.

శేష భూమి స్మశానమైన చోటే .. తన కలల చితి కాలిపోయిందని తను దిగులు పడింది..

 ఈ మధ్య  కళ్ళు .. తుడుచుకోనవసరం  రావడం లేదు. నీళ్లన్నీ .. చిక్కని గెంజి లా మారి రాలడం లేదు

మగ భయం విడిచి పెట్టేలా .. రోజూ ఒక కొత్త కత్తిని నూరుతుంది..

సన్నికాలు పొత్రం బలంగా పట్టుకొంటుంది.. రోకలిని కడిగి.. పసుపు రాసి .. బొట్టు పెట్టింది

ఇల్లంతా కాలుగాలిన పిల్లిలా తిరిగి .. తలకిందుల చెమటని కార్చింది ..

తుమ్మ జుగురులా మంచాన్ని అంటుకుపోయి.. నడుము నొప్పి అంటుంది..

భూమి తొలచి వెళ్ళిపోయినా కన్నుతో .. దేహం విడిచిన చెమట బొమ్మలతో ..

 కష్టం గదిలో వెలిగించి.. తప్పట్లు కొడుతుంది.. లోపలి పుండుని  అలానే దాచుకొంది

……………………………………..

ఎన్నో చెప్పి సిటీ తీసుకెళ్లాడు..

ఒక్కొక్కటిగా బయటపడి నా .. ఇంట్లో వాళ్లకి .. ఏం చెప్పాలో .. ఎలా చెప్పాలో …. అసలు చెప్పాలో.. వద్దో ఎంత వస్తే అంతే సరిపెట్టగలదు.. కానీ ఎంతనేదే తెలియడం లేదు.

 చిన్న గుమస్తా.. ఇంటికొచ్చి .. అతని ఆచూకీ అడిగే అప్పుల వాళ్ళు.. నిలువెల్లా వణికేది

 సగం రోజులు.. పస్తులు.. సగం రోజులు వాడు తూలి రావడం.. ఒక్కోసారి అసలే రాకపోవడం..

ఆ రాత్రే మరెవడో .. తలుపు కొట్టనట్లై.. కత్తి పట్టుకొని ..తీసేసరికి… వెనక్కి చూడకుండా

వాంతులు.. కొత్త చీరలు.. అలకలు.. ఇంటికి ఫోన్లు.. చుట్టాల రాకపోకలు వద్దనుకొంది..

ఎదురుగా రైల్వే ట్రాక్స్ .. రెండు.. మూడు సార్లు.. వెళ్లి వెనక్కి వచ్చింది.. ఎవరొకరిని చూసి ఆ దూరంలో

మూడో సారి మొగుడు లేనప్పుడు ముగ్గురూ కలిసి వచ్చి .. కత్తి గుంజుకొని.. చాప మీద కట్టి పడేసి

చొరబడి రాత్రంతా….. పుండు ముద్దని చేసి…. బట్టలు సరిచేసుకొని.. ఇంట్లో వండింది తినేసి .

.తన ముఖమైనా చూడకుండా…. బట్టయినా కప్పకుండా … బూతులు తిట్టుకొని వెళ్లిపోయారు.

లేచింది.. కష్టం మీద నీళ్లు తాగింది.. వాళ్ళు విసిరేసిన సామానులు ఎక్కడిక్కడ సర్దింది..

స్నానం చేసింది.. పూజ చేసుకొంది.. ఏడవ లేదు.. పదే పదే అద్దం లోకి చూసుకోండి..

దిగులు.. కోపం.. నీరసం.. కోపం .. అయోమయంతో ఇల్లంతా తిరిగింది.. ఇంకా చీకటి ఉంది..

చీర గట్టిగా బిగించుకొంది.. కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు.. జుత్తు ముడేసుకొంది…

 రైలు కూత చెవిలోకి దూరింది.. మళ్ళీ వెళ్ళింది.. ఊపిరి పీల్చడం లేదు .. గబ గబ నడిచింది..

 పగిలిన సీసా ముక్క దిగింది.. కాళ్ళలోంచి తీయనైన తీయకుండా నడిచింది …  

ఈసారి వెనక్కి రాలేదు..

…………………………

6.చీర పేర్చిన దీపం.. అవతలి ఒడ్డు.. బొడ్డు గాలిసూత్రం

కంట్లో నిలదీసిన మహా నిందలా .. దేహ వరం గాలిస్తూ .. చనిపోవడానికి … అవస్థలతో..

అటుగా ఉండిపోయిన .. నిశ్చల కంటి చూపుని కడిగి ..  అవతలి ఒడ్డులో ఉండిపోయిన నడక..

చేదుగా నిద్ర జాగాలని ఖాళీ చేసి .. ఉత్పాత దూరంలో అదే దేహం కొత్త చర్యని కదిపింది.

బరువెక్కిన దేహ జాగారం రొందని కలిపి .. విప్పుకొన్న గదిలో.. ఇంకా కొన్ని గాలి మాటలు మిగిలి ..

                 మర్చిపోయిన బొడ్డు గాలిసూత్రం  విప్పుకొన్న శరణు మాల.. అదే చెప్పుకొన్న..

ఉండిపోవడం.. ఉండీ లేకపోవడం.. కదిలే శరీర తీరుని కప్పుకోవడం..అంతా తెలిసే ..

నిగురింపు లేని అపా సహా కేకలు.. నిలదీయడాలు.. కదలికలు.. కలిసితీరడాలు.. ఉడుపులు..

………………………

నగలని నువ్వేదో .. నీ financial  protective  సంపదగా చూస్తానంటే ..

I  con ‘t  agree  ..  అలా ఎలా అనుకొన్నావో .. ఫామిలీ నడపడం .. నీ own responsibility                      

రమనిత స్తంభీర్యంలో .. కాదనని పుట్టు గొలుసు తెగిపట్టి లాగిన గుట్టల్లో.. 

 స్పష్ట జమరింపుని చక్కదిద్దే దీపాల పక్కాగా .. నిల్చునే కదిలే దేహ షరతుని కలిపి చుట్టి.. విడిగా ఉండిపోయిన నగరాల మధ్యనే .. కౌగిలిని తప్పించి..

అదే కదులుతుంది.. దేహాన్ని గమనిస్తుంది ..భయం అణగదీసిన ఒప్పివేతలో తలకిందులై..

those  are  all  .. our  great  generations   process  thread .. and  proud  thing  for  me ..

నేను వీటి ఏ మార్పుకి.. మరి ఏ  రకమైన చేంజెస్ కి ఒప్పుకోలేను.. సారీ..

మరీంత .. మనలని మనం మైంటైన్ చేసుకోవడం కష్టమైతే ..

నువ్వు ఇల్లరికం వచ్చేయ్.. నాన్న రియల్ ఎస్టేట్లో సపోర్ట్ ఉండు.. అంతే గాని.. అదే కదులుతుంది.. దేహాన్ని గమనిస్తుంది ..భయం అణగదీసిన ఒప్పివేతలో తలకిందులై..

అర్ధరాత్రిలో మాట పట్టుకొని ఉండిపోయిన .. గర్గత నిర్ఘరాని అరగదీసి.. కళ్ళలోకి చూడలేక..

నిస్పృహ గుణ గతుల నిష్పత్తిని తేలిక చేస్తూ .. మాట ఇలా కూడా నొప్పి పెడుతుందా ?

నీ నుంచి ఇంకేం అవసరం లేదు.. expect  చెయ్యను.. నువ్వూ నా నుంచి ఏం చేయొద్దు..

నా నుంచి ఇంతకంటే నువ్వేం ఎక్ష్పెక్త్ చెయ్యొద్దు.. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ..

this  is  only  making  of  right  senses  bring  to  our  lives  …

స్పష్టత లేని అవనత దర్శనలో.. కన్ను మోగిన నిశ్చరిత గతి మూర్తిని ఊగించి.. తలబడక ముందే.. అవతలి గాలి సూత్రం మారిపోయి .. కొట్టుకు పోతూ .. నిరోధ చీకటి పోటు.

………………………………………..

 సెగ నిర్మితాల గది .. ఒరిగిపెట్టాక..  తిప్పి ఉంచుకోలేని .. మవతః దీర్ఘ సులువుని.. కలబెట్టుకున్న కబురుతో ఊపి.. మాంస కొమ్ముని అరగదీసి చావుతో గిలకొట్టాక .. సూత్రం..

సాగలించిన ఇహిత కక్ష్యల్లో తలపడి.. అలిసి.. సమయ రమ్మికని వడపోసి..

ఇది మరో గదిలోని శత్రు మందక ఉరుముతో మీద పడదు.. మాట నింపుకోదు..

మసి పూసిన దేహ క్రమంతో.. సరిగా అందుకొని.. దేహ కబురుని .. మృత్యువుకి జోడించి .. ఆయాసపడినా .. వినడానికి లేని సీసాల గుర్రు.

………………………………….

 ఆమూల  చీకట్లో .. ఆ పెద్ద ఇంట్లో .. సాధ్య నిర్యాణ తప్ప ముంపునీ .. ఒకేసారి ఒంపి..

కదిలే ఉండిపోయి.. కదలక ఆగిపోయి… నిరయతని ఇగరబెట్టి..

గొంతులోకి పొంగిన పెద్దలని దాచి.. ఇంకోసారి ఆక్రమించుకొని .. అలాగే దూరంలో ఉండిపోయి..

దాహతా నిందలా పెద్ద గొడుగు కిందనే మదించిన దేహ ఋణం .. చిలికిన మర్దన శరీర జారులు..

ఇదంతా ఇలాగే ముందు నుంచి తెలియలేదు.. ఉండిపోవడం కాదు.

నిద్ర మిటకరించిన కంటి గాడ్పుని అరగదీసి.. మృత్యు కలశంలో మునిగిన కల.

అలా థానే దూరం విసిరింది.. కథని పట్టుకొంది.. మలుపులో దిగబడి చేరిన అడుగులు..

తేలిక పడనియ్యని ఇంటి నాభిని తవ్వి.. అటు మెట్లని పోతపోసిన కంటి రంగుతో దులిపి..

దాహతా నిందలా పెద్ద గొడుగు కిందనే మదించిన దేహ ఋణం .. చిలికిన మర్దన శరీర జారులు..

అననిది అనుకోవడమూ కాదు..  అన్నదనే అక్కడే ఆగిపోవడమూ కాదు.. అనుకోవాలని కదలక ఉండిపోవడమూ కాదు..

కలబెట్టిన దిగులు ఎండ పై బెంగ కమ్ముకొన్నాక .. అక్కడే ఆగానూ లేక..

                                         ———————

7.నిరాధార .. తెలియని ఏక రధం .. కుక్కిన గోడలు

పురా విభివత.. మా ఇంట్లో ఎప్పుడూ .. బయట నుంచి వచ్చేవాళ్లు పది విస్తర్లు ఐనా లేచేవి..

ఎప్పుడూ సందడే.. ఏదొక పండగో.. మేం చేసే కార్యాలో ఏదోకటి .. వచ్చీ పోయేవాళ్లు…

ఎవడొకడు నాకు లైన్ వేస్తూనే ఉండేవాడు.. అందాన్ని పొగుడుతూనే ఉండేవారు..

అమ్మలతో సంబంధం అడిగించేవారు.చాటుమాటుగా చూసి.. ఏదొక గిఫ్ట్ చేతిలో పెట్టేవారు..

 పేకాట.. దొంగ-పోలీస్..కబడ్డీ .. అన్ని ఏదొక రకంగా నన్ను పట్టుకోవాలనే ఆటలే.. ఆ నవ్వులు ..

 ఝాము తెల్లవారే చీకట్లో.. సరదాలు.. చేతుల వరకే అనుకో.. ఎన్ని కళ్ళో చాటు కాపలా కదా ?

ఎప్పుడూ చుట్టాలు.. చిరుతిళ్ళు.. గుడులు.. సంతర్పణలు.. తీర్ధయాత్రలు..

 బంధువుల ఇంట్లో కార్యక్రమాలు.. అసలు టైం ఎలా గడిచిందో.. నేనెలా ఎప్పుడు ఎదిగానో…

 నా డిగ్రీ ఎప్పుడు చదివితే పూర్తయిందో కూడా నాకు సరిగా గుర్తు లేదు.. పట్టింపు లేదు.

 ఈలోపు ఇలా నీతో పెళ్లి.. ఏదో సగం తెలిసి మసక రేవులో అడుగు పెట్టినట్లు..

 ఇంతవరకు సంబంధం లేని కొత్త పుస్తకం పేజీలు తిరగేసినట్లు.. దేనినో ఇక మొత్తంగా వదిలేసినట్లు…

నీ మీద నాకేం కంప్లైంట్స్ లేవు.. కానీ నువ్వెళ్లిన తర్వాత ఉండే .. ఈ నిర్జనలో .. ఈ ఇంట్లో ..

ఉండటం నావల్ల కావడం లేదు.. అలాని ఉద్యోగం చెయ్యలేను..

 ఆ మర్యాదలు పాటించడం.. టైమింగ్స్ .. ఫార్మాలిటీస్ .. అపక్రమ భాషణ .. నా వల్ల కాదు…

………………………

మళ్ళీ ఆ చోటే కావాలని అనడం లేదు.. ఏం చెయ్యాలో నాకింకా తెలియదు..

కానీ.. ఇక్కడ నీతో.. ఈ సందడి లేని నిరాశలో.. ఇలా ఒళ్ళుని .. నీకోసం తాకట్టు పెట్టినట్లుగా ఉంటుంటే ..

 ఏదో సరిపెట్టుకొని .. ఇదంతా నావల్ల కాదు. చర్మ నిద్రల హుళిక్కీయ… బరువుగా..

నా ఒంట్లో ఉండే ఆ మాదక స్పర్శ నీలాలు.. ఎంగిలి రుచి.. రంగుల రిబ్బన్ల మధ్య ..

 మురిసిన నలిగినా అద్దంలోంచి.. నీ మొగుడు అదృష్టవంతుడే .. అని .. దూరపు భావ .. అంటూ ..

నాలికని మడతపెట్టి చొంగ కార్చినప్పుడే .. రాలిపోయాయి.. వికారం పుట్టాయి..

ఈ కొన్ని కేజీల మాంసంతో.. అదే బంధన నాలో కట్టుకోలేను.. ఇప్పుడు దూరంగా ఉంచి విప్పుకోలేను.

నువ్వు చాలా మంచివాడివి.. దేనికీ బాధ ఎప్పుడూ పెట్టలేదు.. పెట్టవు కూడా…

నా మీద నాకే.. అద్దంలో చూసుకొన్నప్పుడు.. నాకు నేనే అన్యాయం చేసుకొంటున్నాని అనిపిస్తుంది.. ఒకోసారి నాకేం అర్ధం కావడం లేదు.. ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు….

 నాన్న లేని ఇల్లు.. అమ్మలో వెలుగు ఆరిపోయిన ఇల్లు.. చాలా మంది బంధువులు ఏళ్లగా ..

పులుముకొని తిరిగినవారు… నాన్న తో ఏదొక ప్రయోజనం పొందినవారు..

డబ్బు ఎగ్గొట్టిన వారు … నాన్న దళానికి సీక్రెట్ ఇంఫార్మర్ అని తెలిసాక… ఆరిపోయిన  ఇల్లు…

 అమ్మ ఇక రోజూ తిడుతుందని తెల్సు.. ఐనా దేన్నో మోసాను.. లాగాను.. కలిసాను .. చెప్పాను..

 సరే అన్నానుగాని.. అక్కడితో దేనినీ ఆగిపోనివ్వలేదు..  అలాని ముందుకి కదలనివ్వలేదు

ఐనా సరే ఇక్కడ నేను ఉండలేను.. ఏం అడగొద్దు.. ఇలాగే అర్ధం చేసుకో..

……………………..

కారణాలు .. నాలోపల స్పష్టంగానే ఉన్నాయి.. అవి నీకు చెప్పాలని అనుకోవడం లేదు

నేనీ పెళ్లి కోసం పుట్టిన దానిని కాదు..  ఏదో చేస్తాను.. చేసే తీరతాను..

అందుకే దీని నుంచి బయటపడటం .. నా ఈ ప్రయాణానికి మొదటి మెట్టు..

నాన్ను వదిలేయడంతో నీకు కూడా .. శూన్య సంశయ బలీయ స్పర్ధ .. రంగులేని చీకటితో

పండుతున్న దుప్పట్ల కోలాహలం.. రెప్పలు బెంగపడ్డ చూపుల నిరాధ మకిలి హోరిమి.. పడిగాపులు..

నాకు తెల్సు.. నీకు కష్టంగా ఉంది.. నాకూ అలాగే ఉంది.. కానీ దీనిని ఇలాగే ఉంచలేను.

…………………………

అభిన్నత.. జ్నత వశీకరణ .. ఎత్తు వాకిలి.. రాలిన ఒకటి రెండు కొబ్బరాకులు.. దూరంగా పాక లోంచి పొగ.. వాకిట్లో వర్షానికి తడిచిన ట్రాక్టర్.. వడ్ల గాదె పక్కాగా విరిగిన కుర్చీ.. నానిన బొంత…

విరగొట్టినపుడు .. మావయ్య దొంగచాటు సిగెరెట్ కథా.. సినిమా ఒప్పందం..

 ఒంటిపై అతని దొంగ కదలికలు.. వికార నవ్వు.. ఇంటర్వెల్ లో సమోసాలు .. వారం వారం సినిమాలు..

ఇంటి దగ్గర వెనక .. వచ్చేప్పుడు ..( ఫస్ట్ షో నుంచి) ముందు .. సైకిల్ పై.. కాలువ ఒడ్డున..

ఆపించి .. చెంప మీద కొట్టి.. అత్తకి చెప్పాలా? అన్నప్పుడు . మగ నిందాకరణ ..

చెమ్మగిల్లిన మల మల .. నిరూప అతి పూర్ణనలో తగ్గిన నడక … వెలితి సవర్ణతలు లేని …  

తను మహా సంతూర్ణ చెలమని నింపి.. వికాస మాయ కమ్మిన చెమట పైటలు..

నేనా ఆరుబయట కొత్త దేహాన్ని పొంది.. శూన్య నిరంప గోళం లోకి వెళ్లాలని…………….

.                                                           ……………………….

8.వాళ్ళ పెళ్లి ఫోటో .. గాలీ–వానల సంసారం … బిడ్డ ముడుల కంటి సొద

ఒకేలా నిండిపోయే శరీరాల గట్రు .. లోపలికి  బిగదీసుకొన్న శరీర వేడిమి పట్టిన వాళ్ళ పెళ్లి ఫోటో..

 మంగళుల సమయానికి మోగని గ్రామా ఫోనూ .. మాదిగ డప్పు.. పప్పన్నం..

ఆ దేశవాళీ మేకప్ ఫొటోలు .. ఎందుకు మాటి మాటికీ బయటకు తీస్తావని .. తను..

నగర కాంక్రీట్ అడివి నుంచి.. అక్కడకి వెళ్లి ..మొత్తంగా కూలిపోవాలని ఆశ..

అది ఎలాగూ తీరదని … కలబడే నిద్ర కక్ష్యల్లో కనబడి .. అదే దూరంలో ఆగి..

 జల్లించి పోసుకున్న బిడ్డ ముడుల కంటి సొద చిక్కబడి .. అలుపుని చుట్టేసి.. సర్దుకోమంటారు..

ఇదే అనని .. కలయికనే దాటి .. మంతనాలు లేని అపేక్ష సిద్ధతలో మిగిలి ..

చెల్లిపోయిన కథలనే అప్పగించి.. వెనకెనక్కి తిరిగి చూసుకొంటూ…ఏది తప్పిందో అర్ధం కాక…

సమయ కదలికనే దాటుతూ.. నిరూప ఉమ్మడి మదింపుని చేయిస్తూ.. కలిపి అరగదీస్తూ…

కళ్ళలోకి పట్టిన పల్లకీల నడక .. మారాయింపు.. మారకాలు లేని నవ్వు..  అతి తామిత దేహం

ఇది ఉంది.. ఇదే ఉంది.. తలమునకలు కలయికనే ఆపాదించి .. అనుగ్రహించి .. అప్పగించి..

చేరదీసుకొన్న  గాలీ-వానల సంసారం .. అదే దేహమనే సంసర్గ రంగుల తోవ..కట్టడి.. 

……………………

పిల్లలు ..; పుట్టీ పుట్టగానే .. జారిపోయి .. పెరిగిన నడుము కొలతలు.. జుత్తు పల్చనై..

గాజులు ల్లలాడిన నొప్పి.. ఛాతీలో మరిగించిన మాటలు.. మోకాళ్ళు పోటు.. గొంతు తిరిగిన బండ నాలిక..

బరువెక్కిన పొట్టా .. చూపూ .. నిద్రా.. అలుపు .. ఆయాసం.. అరగొయ్య భయాల పొడుగు.. 

సాధించే పిల్లలు.. బొట్టూ .. కాటుక కూడా తీర్చుకోలేక  .. ఉడుకుడుకు నీళ్లు పోసుకోలేక..

అతనలాగే ఉన్నాడు.. ఆమె వయసు ఐపోయింది.. కళ్ళకి జోడు మోసే మసకలు…

ఒక రోజు అదే అన్నాడు.. నాకేం మూడ్ రావడం లేదని…కొంచెం నీ ఒళ్ళు నువ్వు చూసుకోవాలిగా….

బయట రుచులు మరిగాడు.. నగలని కరిగిస్తూ .. పంటల్ని అమ్మేస్తూ..

దూకుతాను.. కోసుకొంటాను.. తాడు బిగించుకొంటాను.. బిళ్ళలు మింగేస్తానని..ఎన్ని అన్నా..

నువ్వు ఛస్తే .. రెండో ఏడు ఇంకో పెళ్లి.. పిల్లలని ఏ హాస్టల్లోనో పడేస్తా.. అంతే

అతను ముందు కాళ్ళ మీద పడ్డాడు. తర్వాత చెంప మీద.. ఆ తర్వాత ఎక్కడంటే అక్కడే..

ఆమె పిల్లల ముఖం చూసి .. అలా రాయిలా ఉండిపోయింది..

వాడు పరిమళాల వేటలో ఉండిపోయాడు. మునిగిపోయాడు.. పోగొట్టుకొని ..

 ఇల్లుని చిదిమేసాడు.. ఒళ్ళుని పుండు చేసుకొన్నాడు….

………………………….

అమంగళ గర్జన.. దమనీయత .. దాక్షిణ్య వెదుకులాట.. తనలో తనే దొరకక.

.వాళ్ళ మాటలతో ఉండిపోయి.. అదే జరుగుతుంది.. అనుకొన్నట్లే అవుతుంది..

 ఎవరో వెనక నుంచి కాలితో తన్నినట్లు జరిగిపోతుంది..

నిద్ర పొడులు రాల్చి .. కాల్చిన నడకనే అద్ది తీసి.. భయం పోసి.. మత్తుని ఉడకబోసి..

చమక్కులు లేని .. మృత్యు ముద్రల దేహం కరిగి .. ఆ పై నుంచి కిందికి కూలి..

 కూర్పు మండలంలో గుడిని వాలకుండా పట్టుకొన్నారు.. పునాదిని ఏమార్చి పొట్టు దులిపారు….

ఏనాడూ .. మొగుడిని తల్చుకోదని నిష్ఠూరాలాడారు.. బంధువులు..

దానికి బెంగేంటి.. రుబ్బురోలులా ఉంటే .. అదీ .. దాని వాలకం.. ఎన్ని రంగాలు నడిపితే

వాడెళ్ళిపోయాడో .. అని కణతలు దగ్గర వేళ్ళు విరుచుకొన్నారు. పలకరించకుండానే తిరిగెళ్లిపోయారు..

నిమంగళ ఆపాయ దర్శనకి వేలాడే కంటిశాలలో.. ఊరిన దేహాల మడుగు…దశ దశల నొప్పి 

……………………..

అతని పుట్టు రైలు వెళ్లిపోయింది.. ఆమె ఆవిరి గొంతుని దాచి పెట్టి .. గదిలోకి వెళ్లిపోయింది..

 పెళ్లిళ్లు అయ్యాకా .. పిల్లలు ఆమె ఊసు అడగలేదు.. తనూ ఎవరికీ చెప్పుకోలేదు..

అంత పెద్ద ఇంటికీ .. ఒక్కతే మొండిగా మిగిలిపోయింది.. అలాని ఎవరూ తల్చుకోలేదు

నిర్ధాంతర నిర్దయని వడపోసిన .. రుతు నిశ్చలంలో ఆమె పొలానికి వెళ్ళింది..కొబ్బరి కాయల.

 వరి బస్తాల… దిగుబడి లెక్క పెట్టింది.. నీళ్ల బొర్లూ సరిచేసుకొంది.. గేదె పాకలు తిరిగి కట్టుకొంది..

పిల్లలు పురుళ్ళకి రమ్మన్నపుడు తల అడ్డంగా ఊపింది.. ఇంటికి రంగులేయించింది…

సముద్రాలు దాటి ఎక్కడికీ రానంది.. ఈ కట్టె ఇక్కడే రాలిపోవాలంది…

ఆవిడ అంత పట్టుగా ఉంటుందని మొదటి సారి ఊరికీ.. వాళ్ళకీ తెల్సింది.

……………………..

ఆస్థి వాటాల ఇచ్చే ముందు.. సగం వృద్ధుల ఆశ్రమానికి రాసి.. మరి కనిపించకుండా వెళ్లిపోయింది.

ఆశ్రమం లో సరిగా పోలికలు లేని ఆమె విగ్రహం వెలిసింది.. ఊరు ఎప్పుడైనా తలచుకొంటూ ఉంది..

అక్కడవున్నవన్నీ పిల్లలు అమ్ముకొని వెళ్లిపోయారు.. ఇల్లు పాడుబడింది..

చిన్న లెక్కల పుస్తకం అంత దానిలో రాసిన ఆమె కథనీ ఆశ్రమం వాళ్ళు .. చవకగా వేసి…

కొందరకి పంచారు.. కొందరు చదివారు.. మరిందరు.. దాటుతూ నదిలోకి వదిలేసారు

                                             —————————-

9.నిర్లయ సజ్ఞత … చామన దిగులు.. ఒరిగిన పెళ్లి ఇల్లు..

ఏదీ తెల్సి రావడం లేదు.. కన్నుకి అంది.. దుఃఖం చెదిరి.. మాట పొడిపొడిగా..

ఒలిచి పోసుకున్న చామన దిగులు .. రెండు దేహాలు.. ఊరు నుంచి మహా నగరము..

 గత్యంతర స్థిరపాటులో మాట తీసుకొని.. నిద్ర సాధనాలు.. కొంచెం మాట మార్చి ఒరిగి…

కలనీ సర్దిపెట్టి.. అటు మూల దూరంలో.. ఇల్లు కొంచెం నాచు పట్టి.. పడవని వదిలేసి ఏడుస్తూ …

కదలికల ఉలిపిరి చీరని ఆరవేసాక .. ఇంకేం కావాలని సిగ్గుపడుతూ..

ఇంకిపోని నడకల పట్టునే.. దీర్ఘ నిమంతక శరీర లజ్జని తాగి.. అదోలా చూసుకొంటూ..

ఆగాలామయ ద్వయజాలన కాపుకాస్తూ.. ఇసుమంత తాకిడి లేని దేహ వేడి చిదిమాక.. తనకేదో తెలుస్తుంది..

అమ్మ చెప్పింది.. మీరేం చేసినా అడ్డు చెప్పొద్దని.. ఓర్పు పట్టి ఉండమని 

అతనేం అనలేకపోయాడు.. నిర్లయ దిగులు కప్పి ఎవరో తప్పుకున్నారు….

…………………………..

చలి మడుగులో కూలిన కాగడాలు .. ఒక్కసారిగా ఆగిపోతూ..

ఏమైనా చేసుకోండి.. ఈ ఎంగిలి మాత్రం వద్దు.. నాకు కడుపులో తిప్పేస్తుంది..

టీవీలోనో.. మూవీలోనో వచ్చినా తను అంతే .. లేచి వాష్ బేసిన్ దగ్గరకి పరుగు…

స్థితి స్నానాలు లేని దేహ శుభ్రతని వదుల్చుకొంటూ.. ఆరోప మునకలు లేని

 క్షేమ సారం మాంస కావరం… నల్ల కొండల్లో కాల్చిన దేహ జీరలు.. ఒల్చివేతలు….

ఒడిసిపట్టి.. అక్కడే దూరంలో ఊపిరి అడుగు దొరకని .. నిరాశిత గంభీనంలో పడి ..

 తొక్కుకు పోయిన నొప్పిని కాల్చి.. పైకి తోసేసుకొన్న నిరాధారత..

……………………………..

ఒరిగిన పెళ్లి ఇల్లు.. అతని లోపలికి.. మూడేళ్లయింది.. సరైన రుచి చూడ లేదు

దేహ వ్రతం కొల్చిన జాగ్రత్తలన్నీ .. ఒకటికి ఒకటి కలిసి ఊగుతూ.. స్తబ్ధ చాలీనా మతి

తీవ్ర భోగమూ.. విసిగిన రసోలీయమ అపవాదులో కదిలే రెప్పల రాట్నాలు నేసిన చీకట్లో..

దారి చెప్పే శరీరాలు దొరకక .. నిరాదరగా ఉండిపోతూ .. ఉప్పెన తల గాటుని కట్టలేక..

గుక్క పెట్టడానికి లేదు.. అరిచి పదనూ లేదు.. అడిగి కాదన్నదీ లేదు.. కానేదో మిగలడం లేదు..

ఎవరికీ ఏదీ చెల్లుబాటు కాకముందే.. తను మాత్రం రాత్రంతా ఒంటి పై ఏం లేకుండానే..

నీ ఇష్టం అన్నట్లే.. కాని ఏదీ ఎందుకు ముందుకు పోవడం లేదు.. అల్లాడాడు..

…………………………………

జ్వర గృహం.. వణికే నిద్ర ధూపం లో కాళ్ళు జాపుకొని.. ఊపిరి తిరగబడి .. చిలికి చిక్కబడి..

 శ్వాస చిక్కనై.. పెదాలు బరువుతూ… బొడ్డులోంచి బంక నాలుకలు కారుతూ….

దగ్గరకి వెళ్ళబోతే.. మతి లేదా ? వైరల్ ఫీవర్ .. దగ్గరకి రాకు.. నీకంటుకొంటుంది..

నీ ముచ్చట తీర్చలేదని .. చెంపలేసుకొని.. పెద్ద గొంతుతో ఏడుస్తూ..

కథన మూర్చనల్లో .. ఒళ్ళు కడిగిన దీపస్తంభం ఆరిపోయి .. చూపు లేక .. నల్ల సముద్రం అరిచాక..

 గొంతు ఎండి .. నీరు దొరక్క స్పృహ తప్పినట్లు.. పడవలు కాపుకాసినా… ఇసుక ఎగిరిపడినా….

సర్దుకో చూడలేని సమయ నిలవేత .. కూలిన వేడిమి శాలల్లో ఉండిపోయి..

 అక్కడనే తను దీర్ఘ సమ స్థితిని ఎక్కుపెట్టి .. అతని ఛాతీ లోపలికి దిగబడి.. రాత్రీ పగలు..

 ఏ మాత్రం ఆగకుండా గంటని మోగిస్తూనే ఉంది.. అదే అలా మాత్రమే పట్టుబడలేదని ..

 కొంచెం వివరాలు చెప్పుకొంటారు.. మాటలు తడుముకొంటాడు.. సిగ్గుతో తగలబడతాడు.

——————–

ఎందుకంత కంగారు.. వస్తాలెండి .. ఓ రెండు నెలలు ఆగి.. ఫోన్ రోజూ వద్దు.. చావు చూసిన ఇల్లు ..

 వారానికి ఓ రోజు చెయ్యండి.. మాట్లాడుతూ ఊపుకోండి.. రోగం తెచ్చుకోకుండా తిరగండి…

 అయ్యో.. అటువంటి మాటలొద్దు.. చావు ఇల్లంటే అర్ధం కాదా..

ఈ సారి అందరి ముందు.. స్పీకర్లో పెట్టి మాట్లాడతా? టైం కానీ టైములో చేశారంటే….

అంతా వెలుగు చుట్టిన కంగారులోనో దేహం దొరకక .. వంచకి అర్ధం మారి.. బుగులు పోసుకొని

సమపోత శరీర చుక్కానీ పట్టుదొరక .. పడవ ఎటు పోతుందో అర్ధం కాదు.

చూపు కలిసినప్పుడల్లా తప్పుకొంటూ.. శ్వాస బిక్ష దొరకని .. నిరాశజ దిబ్బడ వేసిన కలతో ఆగిపోయి..

 ఇక్కడనే అ చోటు కలబడి ఏడ్చిందని చెప్పుకొంటూ .. సరాసరి అతని కాళ్ళని పట్టుకొని .. కలిపి చుట్టి

పైకి చేరతారు.. .నిర్లయ సజ్ఞత…బీటలు తీసిన చీకట్లో పెద్దగా అరిచి….

……………………………

కదిలి మునిగే కంగారు.. ఎంత వెదికినా దొరకని చూపు నిఘాలో పడి తొందర పెట్టే మాంసకాపు..

అదే తెలియడానికి.. ఉండి లేకపోవడానికి.. దూరంలో పడిపోయి.. చామన దిగులు…

తీర్మాన తీరికల్లో తోడుకు పోయిన నిద్ర యుగం.. గతిని  వెనక్కి తీసుకొన్న నిర్లయ  ఆలిమలు

 నేర్పి పెట్టుకొని చీకటి నిల్వలు .. కల తీసి చెప్పుకొన్న పెదాలు… నరాలు చుట్టుకొన్న నల్ల ఉండ

తెంచి పారబోసుకొన్న దేహ నిందల కలవర పడకలు .. అటు పొద్దు రాలిన నదిలో

క్షామపు పొగలు  కొట్టుకు పోతూ .. ఇంకాస్త దగ్గరకి జరిగినప్పుడు.. ఎవరిదో హెచ్చరిక..

అలా తెలుసుకోవాల్సిందే.. ఎవరో ఇంకా సణుగుడు ఆపనేలేదు. 

                                                                         ……………………………

10. నూరిన గంధక బిళ్ళలు..బయట పడిన రెండో పెళ్లి.. తెంపుకోలేక..

శిధిల ధ్వని ఆపుకోని పడక గదిలో.. కొలిమిని సరి చేసి ఊదే ఛాతీ సంచులని పిండేసి..

ఆ మధ్య రాత్రి పలవరింపులో.. బయట పడిన రెండో పెళ్లి .. ఐనా మర్చిపోలేక పోతున్నా..

మంచం మీద సివంగి .. నీలా ముద్దపప్పు కాదు.. అబ్బబ్బ .. ఆ సుఖమే వేరు..

కమ్మేసిన అయోమయ రాత్రంలో … కెరటాలు గుప్పిన బొడ్డులోంచి పైకి లేచిన కత్తి..

ఆమ్ల వాన నోట్లో కురిసినట్లు.. ఏదైనా అంటే.. రోజంతా నొప్పేండేలా .. గొంతు నరం నొక్కుతాడు.

…………………..

తెల్సే చేసామే .. నువ్వు కాలేజీలో వేసిన వేషాలకి ..సెకండ్ హాండోడు కాక..

ఇంతకంటే గొప్పోడు ఎలా దొరుకుతాడు.. ఇద్దరూ బలాదూర్ తిరిగారుగా…

ఐనా అది గొడ్రాలులే.. నువ్వేం కంగారు పడకు.. ఆ ఇంటికి నువ్వే రాణివి.. వాడే రాజు..

ఎప్పుడైనా వెలుతూ.. వస్తూ ఉంటాడంతే.. నిన్ను జాగ్రత్తగా చూసుకొంటాడులే..

ఐనా నే అందం ముందు … అదీ చాల తీసుకట్టులే.. కిరిసనాల బుడ్డిలా ఉంటుంది..

ఇబ్బంది పెడితే .. చెప్పి చూస్తాం … లేదంటే ఓ పెద్ద కేసు పెడతాం..బొక్కలో వేస్తారు..

 వాళ్ళ జుత్తు మన చేతిలో ఉందిగా? మనం చెప్పినట్లు ఆడాల్సిందే..

…………………..

సమయం చనిపోయి.. అతని కలాయింపులో బయటపడ్డ క్యాన్సర్తో దూరమై.. అతను

మరి కనిపించలేదు.. అప్పటికే డాక్టర్స్ ఇచ్చింది ఆరు నెలల గడువే.. ..

ఆ జ్ణప్తి పెనవేసినప్పుడల్లా గింగిరాలు తిరిగే నొప్పి.. వినలేని మాటలు.. బెంగ కమ్మిన సముద్రంలో

 వందల రక్తపు కుండలు పగిలినట్లు.. ఒళ్ళంతా ఎర్రని చెమట … పులిసిన శ్వాసల చిక్కదనం….

శేషణీయపు దొంతరలో …చీకటి చెల్లుబాటులేని దాహక ముంపులో.. మృత్యు తలచాటు ..

                      స్మశాన నీరుని తలలోకి ఒంపి .. బరువెక్కిన నిద్ర సెక్కింపులు దుఃఖమై..

నూరిన గంధక బిళ్ళలు… సాజాల్యతని అరగదీసి.. పదునెక్కాక అదను చూసి దింపుతూ ..

                     చావు ముద్రతో దూరం జరిగి.. మరి కనిపించనే లేదు.. ఇక రావడానికీ లేడు..

………………………

తెంపుకోలేక..ఊరటని మంట పెడుతూ.. పెదాలు నిగిరినా విననీయని సంతర్ప జాడ..

                           కన్నుకి చేరవేసిన నీటి కబురుని .. వాళ్ళు దూరం చేసి నాకేస్తూ..

ఏదీ వాళ్ళకి అపురూపమూ కాదు.. అవసరమనీ తెలియదు..

కదిలి.. కదలక.. ఉండీ .. ఉండక.. సర్వ భాష్యత నిద్ర గుంభనలో పలవరం లేక …

నిరాద్వనం .. ఆపదాయం.. పుట్టిన నెల పొదుపు ముద్దుల్లో మరిగిన నీటి కుండా..

                              అద్దంలో కాపు కాసిన కళ్ళ వెనక .. వాడు నవ్వుతూ చేతులు చాచి..

ఏం ఇవ్వగలను.. ఇదేగా … అని .. సముద్ర పర్వాలు వెలిగినప్పుడు .. తలుపు కొట్టి .. లోపలికి

                            వచ్చి .. సంగమించే నదిలో.. పై నుంచి దూకి కౌగిలి…

………………………………

పడవలు ఆరబోసుకొన్న చీరల లోకం.. మరుగుతున్న చేపల పులుసు..

ఆనక .. ఉల్లి పకోడీలు .. బొబ్బట్లు.. అతన్లోనే .. పూరి విప్పిన నెమలిలా .. నా డాన్స్ చూసి వాడి నవ్వు..

 ఇసుక కెరటాలు కట్టిన బొమ్మ గుడిలో .. తూ.. తూ.. మంత్రాల పెళ్లి..

అంతలోనే వాడికి నోటి నుంచి రక్తం.. ఒళ్ళంతా చెమట .. వాసనా .. దగ్గుతున్న ఆయాసం…

పెళ్లి కొడుకుకి కాన్సర్ అని తెల్సి.. శోభనం కాన్సుల్ చేశారని కడుపు పట్టుకొని నవ్వి ..

 స్పృహ తప్పి పడిపోయాడు.. అతను కోలుకోవడానికి .. ఇంకాస్త వెనక్కి జరిగిన చీకటీ ఒప్పుకోలేదు.

మృత్యువు ఎవడి అనుమతిని అడిగి చేయదు.. అలా ఐతే .. ఏ భూమి బరువెక్కి..

బరువెక్కీ ఎప్పుడో చచ్చి పోయేది.. ఆ తర్వాత నా చోటులోనూ నువ్వే నిండిపో..

…………………….

నువ్వు .. పెళ్లి చేసుకొని.. బిడ్డని కంటే ఆ బిడ్డని నేనే అవుతాలే..

కూలిపోతున్న మృత్యు సరిహద్దుల్లో సరిపడని శ్వాస రేవుని చేరిన .. పడవ అల్లాడుతూ 

                                  అరుస్తుంది … ఆ మాట అలా ఇంకెప్పుడు అనొద్దంది..                 

నా చావు వరకు.. నువ్వు పోసి ఈ నొప్పిని మోయడానికి అలిసిపోయాక.. ఇంకా బిడ్డనెక్కడ మోయను..

 ఆమె అతని కాళ్ళని కడుగుతుంది.. వెక్కిళ్లు పడుతుంది..నిద్రలోకి వెళ్ళింది..

అక్కడకి వచ్చిన ఫ్రెండ్ తో.. టాబ్లెట్ పని చేసింది.. నాకు ట్రైన్ టైం అయ్యింది..

తను లేచాక .. ఇంటి దగ్గర దించేసెయ్యమని..

………………..

ప్రాప్త ఆంధన .. సరాలయమయ్యే మృత్యు నిద్రేక సంధిని ఏమార్చి.. తడి రేవుల్లో నిమజ్జనం..

మరి తెలియదు.. ఇంకాస్త గడువూ ఇవ్వదు.. మాట తీసుకోదు.. నిలుపుకోదు..

ఆక్రమించుకొన్నప్పుడు .. దేహ నిర్లిప్త సృజీకాల  గొంతుని తొరిపి.. నిలువునా ముగిసిన.. పడదోసిన…

 దేహ ఉత్తరువుని అందుకొని.. అదంతా వద్దని కొట్టి పారేస్తారు….

నన్ను కోసి ముక్కలు చేసినా .. ఎవరి కోసమూ నేను గర్భాన్ని మోయానని తెగేసి చెప్పింది.

తనదనే సమయ పుట్టని తవ్వి.. నిద్ర సాధనాలతో మొదలైన చీకటి పట్టిన కాళ్ళని కలిపి..

 నాదైన నిద్రగది లేని తిరుగుడులో కనబడని నిష్ఠుర హత్య .. రోజూ లోపల జరుగుతూ…..

                                                …………..

11 . విశ్రాయ చిత్ర ధూపం .. నింపిన వాన కొండ.. ఎర్ర బస్సులో వాలు కుర్చీ

విషయా ఆందితాలు.. నులిమిన దేహ కానుకని  చుట్టూ తప్పి నది సరిచేసుకున్న గట్లు..

తన కళ్ళే ఖాళీగా చూసి.. సమయ ఊహమ సంతర్పగా ఎండి..విశ్రాయ చిత్ర ధూపం …

        ప్రతి నిద్ర నిర్వచన మునకల లేని సమ నిందన.. గోరు గీటిన పొగల ఊబి…

చలన మంత్రపు ఒద్దికని దాటి .. పైకి లేచిన నిద్ర గదుల్లో .. తాళాలు లేని మాటలు..

చుట్టూ   ముగింపుకి లేని సాధనగా తాను దగ్గర పడి .. సిగ్గు రాల్చిన పాత ఇంటి ముస్తాబులో..

 powder ఎక్కువైందని .. వాన కింద నిలబడుతుంది.. అతను కోప్పడతాడు..

 నీ దేహం లో ఏవో కదలని సరిహద్దులు కావాలని నిలదీస్తాడు..

మాటకి మాటని చేర్చి.. అటు తిరిగిన నిద్ర సగంలో .. ఊరట లేని గదిని రంగు కలిపి తాగుతాడు.

……………..

తనలానే వచ్చినా.. ఉండలేనన్న.. అన్నీ వదిలి . రాత్రీ పగలూ అందులోనే.. తడబాటుల ఎర..

కలబోసుకొని .. పాత గర్భంలో ఎండబోసిన ఇంటిని చూసి .. మసకేసిన భయం..

ఇరుక్కుపోయిన ఆకర్ష సంధికి క్రమం తప్పి.. ముసుగురు .. అలల్లో అలలుగా .. నొప్పి..

శరీర నిద్రల ఏకైక ఘీంకారం ..నలిగినా హద్దుల్లో కదిలే కాలి గుండాల దేహ భూమి కటకటాలు..

ఇది ఇలా ఆగదు.. వెనక్కి పోతూనే ఉంటుంది.. ఉన్నప్పుడే తన నిద్ర చరణం .. పల్లవి కూర్చి

 తప్పించిన కూడికలని దాటి .. మహా మొహాన గెలిచిన కాళ్లతో అపార్ట్మెంట్ తలుపుని తన్నుతుంది..

ఎవరో తొంగి చూసిన.. మల్లి మొబైల్ కాల్ లోకి వెళ్ళిపోతారు..

 రమ్మని తిరిగిన రాట్నాల కబురుని చుట్టి.. సిగ్గు ధరించిన శిథిలాల్లో తిరుగుతారు. 

………………………….

నేను కూడా వెళ్లడం వలన వాళ్ళ పరువు పోయిందట .. అవునా అనే బుగ్గ నొక్కులు..

పల్లెటూరి మొద్దని .. డ్రమ్ము కి బట్ట చుట్టినట్టు ఆ చీర.. వరసవాయా లేని నడక ..

నేరుగా .. ఉన్నపలంగా దొరకని అలుసుతో వేళాకోళం.. సమాన దివ్వెర…

కొబ్బరి తోటలో మధ్యలో ఆ ఇల్లు.. వరి చేలు.. ఒక్కతే కూతురు.. వడ్డాణంతో సహా బంగారం..

అక్కడే దొరికిన స్త్రీ ధనం.. నువ్వు దొంగిలించి దాచుకో.. నోటికి వచ్చింది చెప్పుకో..

కొంచెం గడుసుగా సర్దుకొని.. మాటని జల్లించి .. రంగు దిష్టి తీసి ..

నడక వెనక జారిపోయిన సంచీ లతో ఊరి .. కథనే కప్పుకున్న నిలువు పొగరు గాలులు..

 ఇంకిపోయిన నిద్ర నదుల పుట్టాక కిందనే .. ఆ చీకటి చోటులో తన రహస్యం మింగి .. కెరటం              

 ఒడ్డుని కదిలించి … తాళం లాగి చూసి.. వెనక్కి తిరిగి .. మెట్ల దగ్గరే కూలిపోతుంది.

………………………..

అక్కడంతా ఊడిగం చేసే చిత్ర సమోయ గిరుల తొలబాటుని సగం సాగదీసి.. సగం వదిలిపెట్టి ..

కలుస్తూ.. ఉండీ .. లేని… అవునూ ..కాక .. అపభద్ర మిగుళ్లు..

అలా ఉండిపోవడమంటే.. అలా ఆగిపోవడమంటే.. అక్కడే నిండి .. ఖాళీ కావడమంటే..

knowledge లోనే ఖాడు.. జ్ఞాన నిశ్చరణ అవతల పారబోసిన చీకటి ఆలంప ధ్వని చీడలు..

 నింపిన వాన కొండ… అతుకు పట్టిన కొండ గుర్తు తేడాగా మిగిలి .. ఉన్నప్పటి

దేహ రుజువు జేబులో .. కూరి .. వాళ్ళు అప్పటికే వెళ్లిపోతామని చెప్పి.. ఉన్న ఇల్లుని దాచిపెడతారు.

వెనకెప్పుడో జ్వర నిశీధంలో మీదకి చేర్చిన కొండలు.. అక్కడే పాత వంతెనలు… నీరు తోడి..

ఇంకొక ఇల్లు ఉన్న చోటుకి వెళదామని.. రాని పడవ కోసం .. ఎండలో నించో బెట్టింది..

……………………………….

నువ్వేం దిగొద్దు .. ఆ లోయంతా .. సంవత్సరాల ఊబీ .. పొగా.. అంటుకోని మంట ..

అంపకాల సమోయ తడి గొంతుతో.. పండిన కాళ్లతో.. మంధరఃత ..

నిస్సంశయంగా .. నీ గర్భాన్ని మోయడమో.. భూమి ద్వనరిక స్థితి బయటపడుతూ..

నువ్వు నన్నెది అన్నావని కాదు.. అలా ఎంత మాత్రమూ వద్దు..

మరో స్త్రీ వద్దనుకొంటే .. లేబ్ లోనూ .. కృత్రిమ గర్భ సంచీల్లో పొదిగే బిడ్డ..

అండాల మర్జననే కాదనే ..  నిలువుకా కమ్మిన బయాల్లో దిగబడుతూ..

కొమ్ముకాసిన నిద్ర పరీక్షలు .. కలలని తేలగొట్టి.. ఆ పడవే కావాలని పట్టుబట్టాక ..

 కొంచెం వివరం సర్దుకొని .. నిరాశ జడ దులిపిన ఆయుస్సులో గోడ మొలుస్తుంది..

……………………..

ఆ పెద్ద మంగళ సూత్రాల మెడ మోసిన నెలలు.. కలలు .. కలతల వెర్రి .. నిండు పోటు ….

 ఎర్ర బస్సులో వాలు కుర్చీ… గొలుసులతో కట్టి.. శ్వాస పోసి.. నిశ్వాస దూకిన మొండి గాథలతో

ఊరేగి.. నేను ఇంకొక స్వయం గర్భ నిషాద రాశినని చెప్పుకొని.. అక్కడే అలిసి కలిసిపోతారు.

ఊరేగిన నిద్ర దోషాల్లో .. దేహ కమలత తీరాలని అల్లి .. గట్టిగా బిగిస్తారు .

పట్టీలు గుచ్చినా ఛాతీ లోంచి అదుముకొన్న పొగల మంగళ హోనత..

అది లాంటి కథనే మళ్ళీ చెప్పుకొని .. విరిగి కొత్త నిద్రనే కలబెట్టుకొంది….

దట్టమైన పసుపు గోడ .. కుంకుమ అలత .. గాజుల మొండెం .. శరీర విస్తీర్ణాలో పండిన

మృత్యు కావలి.. అతనే అతని శత్రువని తను నిందించి .. మరి వడ్డించమని అడగకుండానే

దేహం తీసుకు వెళ్ళుతుంది. లేని రంగుని శూన్యంలోకి పంచుతుంది

                                                   ………………………………….

12 . పెళ్లి లైట్ల గట్టు .. ఖాళీ పల్లకీ .. పడవ దాటించింది

తను అందరినీ వదిలేసి వచ్చింది..లేదా వాళ్ళు .. తీసికెళ్ళిన ఇంట్లోనే వదిలేసి పోయారు.

ఎవరినీ నిందించలేదు.. మాట తీసుకోమని చెప్పి… అన్నదీ లేదు.

కొంత తడి నిజమే.. వాడిన మొక్కలు .. అంత పెద్ద ఇంట్లో ఒక్కతే.. పాలేరు కుటుంబం పెరట్లో..

గోలాల్లో కురిసిన వాన మాటలు.. బొమ్మల కొలువు.. పరికిణీల చెక్క పెట్టె..

రైలు అద్దం లోకి దిగి ఏడుస్తూ.. పొగ కమ్మిన సొరంగాలు.. నిద్రలేని ఆయుస్సు రంగులు..

ఆల్బం.. పెరట్లో ఇంకా మిగిలిన గాడి పొయ్యలు.. పందిరి కోసం కొన్ని కొమ్మలని నరికిన చెట్లు..

                     నాన్న ఫోటో హాలులో వేలాడుతూ.. ఇంకెవరెవరో వచ్చి..

నాన్న చెమర్చిన దీపం కిందుగా ఆమెకి మరో మాట తెలియదు..

ఇంకో గర్భంలో పెరిగాక .. అందం నాదైన.. నేను ఓన్ చేసుకోలేను.. i  con ‘t  imagine that  kind  of  birth  ..

 ఇది తప్ప మీరు ఇంకేదైనా అన్నా  నేను అడ్డు చెప్పను..

ఆ స్త్రీ ఋణం నన్ను భరించనివ్వకుండా చేస్తుంది.. నా బదులు గర్భం మోసే..

 ఏమంత వయసుని.. పాపం కాన్సర్ మింగేసింది.. అసలు వాడిలో వాడే ఉండడు

 ఎప్పుడూ నీ మాటలే..నీ ఆటలు.. నీ ఇష్టాలు.. నీ చదువులు.. నీ టూర్లు

 నీ పెళ్లి కోసమే అల్లాడేడు.. ఇప్పుడు ఉండక పోవడమే మంచింది..

 పెళ్ళైన రెండేళ్లకే .. కూతురు కాపురం కూలిపోయిందంటే తట్టుకోలేక పోయేవాడు..

 ఆమె కి ఇష్టం లేకపోతే బలవంతమైతే చేసేవాడు కాదు.. అది ఆమెకి తెల్సు..

కొన్ని పచ్చని సమాధుల బయట .. వదిలేసి పోయినా పడవలా..

 మగ్గిన దేహ కమురుని దీపంలో పోసి నాన్న సమాధి ముందు వెలిగించినట్లు..

అతనా పైనుంచి కాదనడని ఆమెకే తెల్సు.. అది వినగలదు..

…………………………

పల్లెటూరిది కావాలన్నావ్.. అమాయకంగా .. అన్నీ ఒప్పుకొని…

కలలని తాటిస్తూ.. ఆమె ఎర్ర గాజుల డబ్బాలో చిట్టి.. నాన్న passport  size  ఫోటో .. అంతే తనది.. 

అది నిజమే.. ఆమె దేనికీ .. భర్త ముచ్చట్లకే అడ్డుచెప్పలేదు.. కట్నమూ లాగాడు..

సెక్కింత .. మెలికలు పడ్డ జార్లోంచి కుచ్చిళ్ళు దిమ్మరించిన ఇసుక ..

ఏక సలాసాలో నిద్ర గిన్నెడు బెంగ.. అనిర్మిత తాయిలం.. ఒంటి పైన స్నాన దిగులు

సీక్రెట్ గర్ల్స్ ఫరెండ్స్ నీ వదల లేదు. అర్ధరాత్రుల చాట్టింగ్లు మానలేదు. ఏదీ తెలియనట్లే ఉండేది..

అన్నీ రుచులూ వండేది.. ఏ ఇష్టానికి.. తన అకౌంట్లో నాన్న వేసిన డబ్బుకీ .. దేనికీ అడ్డు చెప్పలేదు.. బంధువులకి తన వైభవం చెప్పి మురిసిపోయేది..

పెళ్లి రోజుని తల్చుకొనేది.. నాన్న చావు కన్నీళ్లు.. బరువెక్కిన పడక

రెండేళ్లు గడిచింది.. అత్తగారు .. ఇంకా నీళ్లేందుకు పోసుకోలేదని గసిరింది..

 కాసేపు ఏం అర్ధంకాక అయోమయం గడ్డ కట్టింది.. తల దించుకొంది..

…………………………………

హాస్పిటల్ ., టెస్టులు.. రిపోర్టులు.. పరుగులు.. లక్షలు..

ఇదంతా కాదు.. ఆమె womb లో ఇస్సుఎస్ ఉన్నాయి.. సర్గోసికి వెళ్లాల్సిందే .. అన్నారు..

ఆమె ని హాస్పిటల్కి తీసుకెళ్లారు.. డాక్టర్స్ మాటల మధ్యలోంచి అర్ధమైంది..

ఆమె సడన్ గా లేచింది.. పెద్దగా అరిచింది..

this  is  not  to  accept  from  my  end  .. this  is  totally  ridicules  .. if  my  body  is  not  accept  birth .

 that is   ok  for  me … ( ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదని వాళ్లకి అప్పటి వరకు తెలియదు)

నా గర్భాన్ని ఇంకొకరు మోయడం నాకు అంగీకారం కాదు..

ఎల్లా దారికి రావో చూస్తామని బెదిరింపులు.. హెచ్చరికలు.. రాజీ పోగులు..బుజ్జగింపులు..

దుప్పట్లోంచి పాము పుట్టని దులిపి .. దుమారింపు.. ఛాయా సేగం..

మా రోజుల్లో ఐతే .. గొడ్రాలు అని చెప్పి.. వదిలిపెట్టేసేవారు.. అంది అత్తగారు..

ఆ మర్నాడే .. luggage  తీసుకొని .. నాన్న లేని  ఆ ఒంటరి ఇంటికి వచ్చేసింది..

……………………………….

రెండు కాళ్ళ మధ్యలో ఖాళీ గొడుగు.. మతి చూపు కప్పిన ఏక గది.. ఒంటరి హోరు..

అన్నం కుండ ..చెప్పిన కొత్త వీధుల గెరిట .. పదికోట్లు లేని వికారినిగా  గదిలోఊగింది..

పొగ మెటికలు.. నా తల్లే మహాలక్ష్మిలా ఉన్నావని అని అమ్మమ్మ .. పెద్ద మనిషి ఐనప్పుడు..

ఎప్పుడు ఎదిగిందో .. ఎప్పుడు నాన్న సంబంధం చూసాడో .. ఇప్పుడంతా కూలి..

అంతలోనే .. ఏదీ అడగ కుండానే దిగబడ్డాడు. నిద్ర కల్లతలా తెర చినిగింది..

కల బావురుమందం ఎలాగూ తన లోపలిదే .. ఎక్కి మార్చుకున్న పట్టీలు..

మంగళ సూత్రం వేలాడదీసిన మేకు.. గార పట్టిన ఇంటి గోడల నవ్వు…

ఇక ఆమె వెనక్కి చూసే అలవాటుని పూర్తిగా మార్చేసుకొంది..

                                                            …………………….

13 . విమాగ సవ్య దోషం..నాలుగు దిక్కులా రుణ నాలిక .. రుచి కాన్పులో పాత కుండ

పాప బొమ్మరిల్లింది.. దీపం పై పిడుగు పడ్డాక ఇంటి ఆచూకీని దాచి పెట్టింది..

యోచన పూనికలో రెండు బావుల నివ్వెర..వాడు పట్టిన కొలతలు .. నోటి బూతులు.. వికారం..

క్రియేటివ్ ఫీల్డ్ ముసుగులో.. వాడు ప్రధానంగా చేసేది.. అమ్మాయిల సప్లై..

తను వదులుకొంది .. పూర్తిగా .. నెలల పిల్ల ఉన్నా వదులుకొంది..

నమిలిన గాలి గుండాల పెద్ద రేవు నోరు తెరుచుకొంది.. ఐనా పర్వాలేదని దిగింది..

ఊరిలో .. ధాన్యము మిల్లు నడుపు కోవడంలో ఆమె ఎక్స్పర్ట్ .. నాన్న ఒప్పుకోలేదు ముందు..

  ఆ తర్వాత అతనే ఫోన్ చేసి .. నీ ఇష్టం అన్నాడు.

సంధి చేసుకో జూసిన దేహ రక్ష .. పనిలో పనిగా కాటేసే నిద్ర పాములు..

 గోడలనిండా మచ్చల దుప్పట్లు.. ఆయురోత ఉడికిన తర్జుమాల బురదలో దేహతర్పణ.

ఏం జరగక పోయిన మోసేసే… లోపలి ఆరాలతో … వాగిపోయిన నోళ్లు..

……………………………..

మాయ రేవులో సగం నమిలేసిన దేహం.. పొగ బండి ఏడుస్తూ..

సలాహాలం.. ఉబికిన గారడీ పళ్ళు ,, గార పొడి.. కంటి స్మరణ రంధ్రం..

మధ్య నుదురులోని భయాలు మెత్తిన గేలాల కొండా.. అమాంత ఎర .. రేపు తనకూడానేమో..

తన జాకేట్లో ఎర్ర సొమ్ముల ఎంగిలి.. బిగిసిన బొడ్డు .. వాడి కొలతలు..

చూపు చిక్కులు పడ్డ నిద్ర రూడీలతో నల్ల బిరుదుల గది గంటలు.. ఊరి చోటులు..

కంపరం గుడిలోనూ తాకాలని.. జుగుప్స సైగలతో చూపు కలపాలని.. ఎంగిలిపడ్డ శాపాలు

దుఃఖ వివర్ణత లేని మాంస రంజన తలకిందుల్లో పడి మగ సెగల కుంపటిని మోస్తూ..

 గాఢ నిద్రలోనూ బటన్లు సరిచేసుకొనే అలజ వానకుల జలదరింపు.. పై మెడ నొప్పి..

……………………………….

సగం తవ్విన శరీరానికి .. బొట్టు తుడిచినా ఎండా మీగడ బీటలు.. ఒత్తిరి .. గాలి పోసుకొని..

నడుం పగిలే శ్రమ.. ఒంటి నిండా కమ్మిన నిద్ర.. అలుముకున్న కాటుక వేటు

వంతెన కింద రాయికి అంటుకున్న రక్తపు మచ్చ ..చీకిపోయిన చీర అలాగే పడి..

 ఇంట్లో ఎవరితోనో చోశానని .. తమ్ముడు వరసన్నా వినలేదు..

ఇప్పుడు పడక గదిలోకి తీసుకొచ్చేదీ ఆ మాంస వాసనే.. అదీ అడుగు దూరం లో .. దూకడానికి చూస్తూ

ఆదార నీలం లో లోపలి జరిగిన చెక్క కాళ్ళు వాడివి.. ఇప్పుడు కాదు.. సర్ప గండాలు..

బొమ్మ నవ్వారు ఊదా దీసిన మంచాలపై మొండెం .. పెద్ద బజారు కేక..

మేకులు కొట్టిన ఇనుప జాడీల్లో నూనె పొంగిన స్త్రీ శవాల కైపు.. జారిపోతూ..

చిత్ర తవ్వకాల్లో జారిపోయిన ఆచెట్లు.. కలతలు.. నిద్ర గన్నేరు నవ్వులు..

……………………………..

మగదండన .. వెలిసిపోయిన కొత్త నవ్వు.. కుళ్ళిన వాసనే.. అదీ పులిసిన మందు పోసి మగ్గిస్తూ…

 బ్లాక్ ఐన్ డ్రైనేజీని కెలికినట్లు వాడి నవ్వు.. శరీరాన్ని మెలిక తిప్పే అదోలాంటి నడక

  బెడ్ రూంలో మాత్రమే …..అదేదో పేటెంట్ ఐటెంలా … secrete service అన్నట్లు చూసి

 నల్లని నాలిక భాషతో.. చిదిమేసిన మాంస గుట్టల లిస్ట్.. శుభ్రపడుతున్న అధో గమన .. వమన..

సరిహద్దుని తొలిగించి .. శరీర నిద్రల కైపుని చల్లార్చి.. కదలిక లేని … మర్చిపోయిన…

అవశేష తీరులని పట్టుకొని.. సరిచెయ్యలేని మంతనాల బూతుల మధ్యనే నలిగి..

అద్దపు సగాల్లో శత్రు స్వయంగా ,, శ్వాస దర్జీలు పూసిన బట్ట .. చీకినా కుట్టుకొంటూ..

నీళ్ల చెంబు వికారంలో కొప్పు చుట్టిన చీకటి గొళ్ళెం .. గోళంలో పొడి..

ఏక చిత్రాల స్వయామా రార్జనలో .. అనోహ్య థమాయ రేరింపు..

చిత్ర నిగారింపుని అరగదీసి నల్ల వాకిలో దేవుడి రంకె .. ఇంటిముందు నుంచే వెళ్లే రథం..

మరోలా ముగిసిన కలలోని ఉపాధి .. నిశామ కంటి జీర .. గొంతు శూల

అతికి చుట్టిన భిక్షుకుడి ఎదుటి రేవులో పల్లకీలు.. ధూప కవ్వలి

నులిమిన ఒంటి కక్ష్యలో చేరగిలిన ఎద్దడి కథల ఆయోగార్థత …

ఒక శుభ్ర పడుతున్న దేహ నాదం లోపలి చెమ్మని ఆరబెడుతూ.. తనకి తనే నచ్చుతూ…..

………………………………….

                                         3rd CHAPTER  

(Background : Single parents … ఆత్మహత్యలు .. ఒంటరి ఆహ్లత … ఇద్దరూ పరస్పరమూ దూర దూరంగానే … రాసుకున్న అగ్రిమెంట్ .. nervous  breakdown  )

            సైకో దృష్టి ఘాతాలు..విరంగామ నడతలు

ఒంటరి హేళన కూలుతున్న ఉపేక్ష నిద్రలేని చిహ్నాలని జాడిస్తూ కథన మధ్యంలో.. తీర్చి పెట్టుకొన్న

 నిరాశ మూర్తులని కదిపే శూన్యంలో .. ఎవరూ కొట్టని ముందు తలుపు.. జల్లెడ బిగించిన కిటికీలు..

పడి పోయిన ఆయుస్సుని సర్దుకొని .. తనలో తనే ఉండిపోయిన చీకట్లో జారిపడి ..

పుప్పొడి పొరలు .. నిలువు గోడల్లో ఇరుక్కొన్న దేహవాలుల్లో కలబడే రుందన.. సాకీజం

నిశ్చల నిద్ర దర్శనతో కదిలే చలన ముంపులు .. కథనాలు.. చెలార్పులు ..చూపు దడ దద్దరలు.

విరంగామ నడతలు .. స్తబ్ద నియతిని  దాటి.. ఆ పైన కూర్చుకొన్న స్థితి తాపాలు..

తను నాలోపలికి రాకూడదనే అడ్డంకి .. వేరు చేస్తూ ఉండిపోయిన ..

పట్టపగలులో ముసిరిన చీకటి నాదేగా ఉంటూ .. చపల గొడుగుల కింద దీపం ఏడుస్తున్న

 పురా మందిర పూనకాలు.. శ్వాస ఆజ్యయ పేచీలు … తడి పూనకాల మెడ విరిగి…..

నిరా ముఖాల ఎద్దడిని కప్పి .. రెండు నిప్పు పోటులని దాటించి పెట్టుకొన్న విరాంగామ స్త్రీ ..

నిద్ర కాల్పుల దుమ్ముని కప్పి.. ఎవరో కన్ను దొరకని దృష్టి ఘాతాలతో ఎదురు తిరిగాక …

కలవరపడి కల్లోలమౌతారు. వల వల ఏడుస్తూ .. ఇంకిపోయిన నిద్ర కిందనే సర్దుకొంటారు.

…………………….

ఆజ్ఞా భీష్మత ,,, తల పండిన చీకటిని వారిస్తూ .. పొడి గొంతు పొటమరింపుతో..

వడపోసిన దేహగతిలో .. మరో కక్ష్య దొరకని ఒంటరి నిద్ర మార్పులు.. కల జేవురింతలు..

ఉండిపోలేనని తెలిసినప్పుడు గది వేడెక్కుతూ .. పైకి చూసిన ఖాళీల్లో…

కుంకుమ పాదుల్లో .. నుదిటి కూపాల్లో కూరుకుపోయిన శ్వాస తెమ్మెర కదిలిస్తూ ..

లోపల చోటు లేని కథనాల భద్రతని సర్ది.. అనులోమ ఘాతక తీరని వదిలేస్తారు.

 అలజరి కన్ను కొత్తల్లో .. నీరు పట్టి .. బూజు బిగి నులతలు.. తుడిచిన నిద్ర జారలు

చెమటని పొడి చేసి .. దేహ నిద్రలు కథని పట్టుకొని .. స్మర ముఖాలతో

తురిమిన పట్టు పోతలు .. గాలి దాతువులు.. పశ్చిమ గది అతుకులు..

అపక్షేమ జాగ్రత్తలని సరి చేసే దేహపు నిండు గాలి కోసుకుపోతూ .. ఒబ్బిడి మంచాలపై

దుప్పటి అలానే.. కదిలీ కదలని మంటని సరి చేసి వాటర్ జగ్ .. ఇంకా బోర్లించే ఉంది.

ఒప్పుకొనే విడిపోయామని కంటిని పాతుకొంటారు. వెన్నుని నిలబెడతారు..

 మాటని తెచ్చుకున్నా .. లోపలే ఉంచుకొని .. వినే వారిని వెదుకుతూ… శాపాలీయన… కలక స్పర్ధన..

గంధక చెట్ల కిందనే .. దేహ అడితిని రాజేసి.. నిష్ఠ మునకల్లో వేరుగా ఉండిపోతారు. 

                                              ……………………………..

 అంభాయాల నిద్ర కోతని కాల్చేసి .. నడుము ఎత్తని చాకిరీతో తలకిందులై..

దేహపు అంచనాలు లేని .. శిధిల గతుకులో పడి కొట్టుకొంటూ .. సాధ్య చిందులేని ..

మృత్యు విమృత లేని పలాధీరతో చెలరేగి కలిసిపోతూ..సఫల నిధి .. స్మరిత గాలులు..

సంభావ ముంపులు లేవదీసుకొన్న నడకల్నే దాటి .. పైకి చేరి .. కదలికనే ఆపేసాక..

సరిచేసి తుడవని నిద్ర బరువుతో .. చావు వాసన మరిగే గోడలని దాటి… దుల్లగొట్టిన కేకలతో

చెప్పుకు తిరిగిన విరంగామ నడతలు … అవీ .. అక్కడా ఇక్కడా అని లేని అంచనాలు..

భయం బిగించుకొని .. నేను చెలరేగి .. నీలో కూరుకుపోతాను.. అదే కథ ఆగింది.కూలింది..

సంభావిత దృష్టి ఘాతాలతో పండిన నిద్రమానులు దిగబడి … తనతో … తను నిండిన

అపార్ధ శ్రమల చేర్పులు.. కదలికలని కనిపెట్టి.. దూరం జరిగిన ముఖాలతో..

నల్లని అడుగులని చుట్టిన చలన నింపులతో … కదిలే జాగృత అంటురోధతో కమ్మిన ముడినేతలు..

సరి చెయ్యని నిద్రని జాగారంతో మండించి .. తలని .. జుత్తుని.. కళ్ళనీ .. కలనీ ..

 చేర్చి పెట్టుకొన్న ఆపాముద్రకాల చలన ధూపం.. అప్పగించిన నిస్సహాయ ముంపులతో విలోమన..

భయం రెండోసారిగా ఉండిపోయిన నిర్మాణ చిత్ర విధుల్ని దాటించి ..

 అక్కడే తన ఇంటిని భద్ర పరిచారు. ఇంకేం లేదని కన్నుని అప్పగించి ..

 తనతో తను అప్పగించలేని చప్పుడుని పీల్చి.. సమయ దేహ నిర్మాణంలో ఖచ్చింత దాటిపోయినా ..

ఇక చెదిరిపోనే లేదు.  ఉంటానని ఒప్పుకోలేదు. సవరించుకోగలమా?

                                                          ……………………………………

         1. ఆమ్ల ఊయింపన .. పులహిత రవ్వలు.. జోగిన తల ముంతలు..

సగమాగం .. నేను నువ్వనే ఓటమిలోని గతి ముద్రల కౌగిలిని .. శ్రద్ధ మోసిన దోసిలి బొమ్మని..

 విపరీత కథలని వదిలేసిన నాటు శరీరంలో ఆమ్ల ఊయింపన..  అధమ లోపిత సందెర..

పురుష త్రయపు లోపలి కంగారు ..ఆగమ చిధాలాపం .. మన్నెర .. సారబోత వినికిడి..

ఒక రాత్రనే ఆదమరుపు  పేజీలో గాలి పోసుకున్న విశ్వ నిరాకార మార్గనివేశాలు..

స్త్రీ అనే ఓ అనునయ దీప జల అడుగంటిందా? సర్దుకోవాలి.. శ్వాసయ అచంచర .. పూడిక

సరిపోని నిమ్న చెమటలు దేహఊపు నిమ్మళించి పట్టుకొని .. ఇంకిపోని భయంతో ..

 కలని మొదలుపెడతాను.. తను వెనక ..ముందూ …  కుడి -ఎడమ పక్కలా .. ఎటూ లేదు..

                                                           ఏకంగా పైనే.. ధీమిక పెడరెక్కల ఊపు..

                                                                                       ………………………..

శుభ్ర కర్పూర బొమ్మ .. నెమలి పింఛాల రేవులో నిలబడి.. ఆకాశం నుంచి రాలే పిడుగులోని ..

 పురుష శిలలోపడి కాలిపోయాక.. చెమట స్ఖలించిన వాన పేగుల్లోంచి గర్భ ధార ..

ఆయాస బంధన మూర్తి తిరిగిన చీకటిలో .. చిక్కబడ్డ కెరటం .. దేహాన్ని మింగి .. తెగి రాల్చుకొన్న

 నింపూర్ణ గోళంలో .. దేహరొప్పు ఊడ్చిన సాధనాల నిర్భయ చింత కదిలే కాళ్లలో .. ఒదిగిన నిరాశ బొట్లని

 నాకేసి .. భూమికి రెండో జన్మ వృత్తాంతం లేని మిరుమెట్ల కవ్వింపు..

అర్ధ సన్నాహా జోజిలంలో పడి తిరిగిన నిద్ర పరిధులు.. వర్ణ కలనీతం మెత్తిన సన్నని అరుపుతో

వెనక్కి జరిగి.. నువ్వు నువ్వేనా ? అని నిలదీసినప్పుడు..

ధూళి సంకెల పై కూలిన ఉరుము.. ఆ మూల కొండపై  వేల కాగడాలు వెలిగి ఆగిపోయిన

నూనె పరీమళం… జాజు ఊయల తెగి పడి.. ఆమె ఒడిలో కుప్పపడిన చీర ..

శ్వాస నవ్వారులు పేనిన యుద్ధస్థలిగా .. మంచం.. మంచు పోడులు …

విరుద్ధ ప్రతిబింబాల ఆకర్షణ ఓ సహజ కోలాహల సవ్వరా .. గ్రహణాలు కాల్చిన మైల గోడలు..

                                                                                     ……………………………..

ముంతల్లోంచి లేచిన రవ్వలు.. తలకిందుల కంగారులో దేహం ఊడిపోయిన నడకలు..

                                                               శ్రయ వర్తన జంట కోతల్లో సయ్యామొర పంటి రాపిడి

పులహిత జోగినా ఆమ్ల ఊయింపన ఆరిపోదు.. కథలోని నిద్ర దూరాల కౌగిలిని మోసి ..

                                                               కన్ను మూత పడేలోపే దేనికో ఒప్పుకొని అరుపు.. నిశ్చల మహా పూర్ణంలో పగుళ్లు … ఉండబట్టలేని మిగులు రాతల ఊయతని వడపోసి ..

                                                             అటు మార్చిన రోడ్డులో ఎవరూ గుర్తు పట్టక వెళ్ళిపోతూ …

ఏదీ తెలిసి ఆగిపోదు.. మాటని మందగించి నివ్వదు.. ఆక్షేపమా నిద్ర సోగాయంలో..

                    కూర్చుకొన్ననీటి రాత .. సాక్షయంగా దొరకక … మగ్గిన ధాతు క్రీడలో ఆమ్ల తెంపులు

ఇదేమీ సేవా కేంద్రం కాదు.. ముసిలివాళ్ళ ఫాషన్ షో  కాదు.. హాంగీయ స్థల రాతలు.. కూర్పు

whatever the add  on cost  of monthly drive , myself  ready to share ..

తెల్లారే సరికి ఈ సంత ఉండకూడదు.. నేల రాలే అయస్కాంత భుజాల అండ.. కనువిప్పు

 if  you  are  insisting  , this  is  my own  house  ..వీలునామాలేని హెచ్చరిక

 please  get  out  from  my  house within  this  week .. గొంతు నిగర దిగబడి..

అనుయాయి కంటి కొమ్ము విరిగినప్పుడు ఎవరూ ఊసులాడుకోలేదు.. మాట విసిరి దూర లేదు..

                                              ఇంటిని పట్టి వరద నీటి తోడుకొని .. తోడుకొని.. తిరగబడ్డారు.

సత్వ ఆయాసము.. నిందల కబురు.. దేహ పొడి కలిపి మింగిన కోపమూ..ఉపా సాక్షి నివ్వెర

                                               సాధారణ రుణ గతంలో .. పుట్టుక లేని ఉరీక్ష మరణాల కొండ

తాను అరచేతుల్లోనే పుట్టి .. అరచేతుల్లోనే ఆరిపోయింది.. అసులుబాటు దగ్గు తెరలు…

                                                                  …………………………

అచ్చుపోసిన శరీర పోలికల కూడలిలో .. కథలు ఒరిగిన మాంస బాణిలిలో మరిగి..

                                             శరీరం కాపిన దుఃఖ భాష ఓడిపోయి నేననే పట్టు రాలిన ఇల్లు..

అజ్ణాత దేహకొండికి వేలాడదీసిన చీకటి అనుశాసన కదలికలు చప్పుడు చేస్తూ…నిరూదండన..

                                   పైకి వాలిన శబ్ద దండన ఏడుస్తూ .. దూరంలో విడిపోయిన మసకచూపు

అస్థిమిత సమాలయంలో ఎక్కి తొక్కి అలిసిన నెమ్ము పాదాలు .. నిఘామికలు ..

                                                   తొందరపడి … విప్పేసుకొన్న ఆక్షేపాలు గొంతు పొంగాక

ఆమంధన దేవళింపులో ఊరే చిత్ర యాగపు పురుష ధ్వని కీచుమంటూ.  నీదీక్ష క్రియ ఉండి

                                                  పట్టుతప్పి కూలబడుతూ మొత్తుకొంది .. అంతా లోపలే..

ఆవురావురుమంటున్న దేహభూమిలో తవ్వకాల నిద్ర కాగడాలు .. స్థితి గుర్రులు .. వాంఛల

                                                  మరిగిన నేతి వాసనా … చిలికిన రుతు మార్దవ పెళ్ళలు…

నిజ్ఞాత గుండాల్లో చేరుకొని పోయిన లక్షిత శరీరాల కావలింపు.. ఇంకిపోయిన ఆటుపోటులా

                                                  ఉండే  విపలిత ధ్వని పూతలు … గర్భ పూరిత కంపాలు..

మొదలైందంతే … ఎక్కడకి చేరి ఆగుతుందో వాళ్ళు చెప్పుకోలేదు.]

                                                    ………………………………..

                           2.బహుళ జాగారం.. కలత నిద్ర..దొరకని పురుషుడు

అనన మాయ స్థిరపడి .. కదిలే నిద్ర కూపాల కన్నుని నింపిన కదలికల్ని తట్టిలేపి..

మనం ఓడిపోయాం .. ఇలా విడిగా ఉండటంలోనే మితి దాటిన సుఖం.. శుభ్రత ..

నిమ్మిళిత.. ధ్యాన సాగు.. చీకటి మెరిసే భద్ర కాన్పులని నిలదోసుకొని … వేగిరపడే దేహ నిరుత్తర శృతి.. సరళత అనే .. అదీగత నిర్ణయ మందలింపులు ఊడిపోతూ .. ఊరబోసిన రాత్రి పడకలు..

నీటి గాలుల కంటి మోరని ఎత్తి .. పెద్ద కేకని అదిలించిన చీకటి అప్పగింతలు..

వేలాది దీసిన అద్దాల్లో .. బట్టలేని వాన ముతకల నవ్వు కాలుతూ ఊరేగి.. పరాగత మాటలని ..

 ఎంత తిప్పి చెప్పినా.. వాళ్లకి వినపడేది అదేనని .. వేరేదేదీ కనపడదనీ అనుకోని.. కోకపోనీ

 తెల్సి అల్లాడి .. రెప్ప చేసుకొన్న చీకటి ఆలవాలపు ఓర్పుతో చెమర్చిన .. ఎవరూ చూడరు .. అడగరు..

అడిగినా .. చెప్పే వరకు ఉండరు . కదిలిపోతూ ఉంటాం .. ఎంత అర్థమైనా .. కాకున్నా… 

అందుకే మనం ఓడిపోయాం.. ఇలా ఓడిపోతూ ఉండటమే .. ఇద్దరకీ క్షేమం

…………………..

ఆ రోజులన్నీ బహుళ జాగారం.. ఎత్తి పెట్టలేని కినుక .. వండి వార్చిన నిద్ర సంధులు.. పడకలు..

ఏ రోజూ .. ఒక విరమణ లేని వీలునామాలో తిరుగుతున్నట్లే … 

ఎందుకిలా అయ్యాము.. మన సంవత్సరాల ముందు పరిచయం.. మనలని ఒకరి నుంచి ఒకరికి

దేనిని ఎందుకు ఓపెన్ చెయ్యలేదు. అనుకోవాలని లేక ఒప్పుకున్నామా?

అంతా నీరు పట్టిన అనుమానాల్లో .. సాధ్యహేతం కాని అపేక్ష మంతనాల మధ్యనే ఇరుక్కొని..

తనతో నేను లేను.. నాతో తను ఉండాలని అనుకోలేదు.. విరానీత చికిలించాకా….

నీకేవో.. పాస్వర్డ్స్ .. బ్యాంకు అకౌంట్స్ ( unofficial ) ఉన్నాయన్నది .. నాకేం నిమిత్తం కాదు.

 నీ ఫ్రెండ్స్ .. అర్ధరాత్రి Insta  sharing’s .. అర్ధ రాత్రి మందు పార్టీలు.. లెక్కకు మించి షాప్పింగ్స్ను  .

 ఇవి కూడా కాదు.. ఇంకేవో.. anti  age  injectionlu . లెక్కకు మించి ప్రోటీన్లు.. గొంతు నెమ్ములు..

మనకెందుకీ .. తెల్ల పొడి నషాలు.. అన్నప్పుడు.. మగాడిగా .. నువ్వేం కిక్కు ఇచ్చావని? అన్నప్పుడే ..

 నా లోపల కుద్దలిస్తూ దిగబడ్డ గునపం ఇప్పటికీ అలాగే అంత లోతుగానే ఉంది?

……………….

మధ్య నిడివిలో జ్ఞాన తలం కూలిపోయిన .. నా పురుష నెమ్మలిత .. కదిలే కంగారు..

ఊరటలేని ఆశాపేక్ష నిరావళిలో .. నేను నీ నుంచి తప్పుకోవడాం తప్ప ఏం చెయ్యగలను?

అసహన బిగింపు.. మందలించిన సంధి వివశం.. పికిలిన పెద్ద కన్ను.. అంతా దేహ విలాస..

కదిలే నిర్జన కళ్ళల్లో .. పైన ఉండిపోయిన నివేశ మూర్తుల కల్లోల సంధిని .. నిష్ఠ రగుడుని..

 సరిచేసి..కనపడని చీకటిలో ఊరేగింపు.. అది .. ఏ ఇంటి దారీ కాదని అరుస్తున్న వినక…

ఇక్కడే వాళ్ళు .. బట్ట కూరిన గొంతుతో .. మాటలని తాగి.. అటు వెళ్లిపోవడానికి సిద్ధమౌతారు..

ఏదీ తెలిసిపోవడం లేదు.. కూర్పు మోసిన పగలు.. చీకటి … స్నానాల గదిలో .. నీటి ఒడుపుల మధ్యలో .. ఒలరేగి … అదే మాటని వాళ్ళు చెప్పారని అబద్ధమాడి …అదే కాయం చేసి .. కన్నుకి పట్టి..

నిద్రరశ్మీని ముంచి.. సూదులతో గుచ్చుతుంది.  దేహ ఆరణాల ముప్పుని .. నిలదీసి .. పారబోసి..

 కలిపి జోడించి.. విడదీసి రెండో కన్నులోకి జరిగి.. అక్కడే .. ఆ చోటులోనే ఉండి .. అదీ ఒప్పుకోక 

నిష్ఠూర తీరుల గదిలో పల్చని దూరాలు. అన్ని అడుగంటి .. మాటలని సరిచేస్తాయి….

…………………….

 ఇక కలిసి చేరుకోవడం నువ్వు ఒప్పుకోవు.. ఎందుకనే దిగులు నా నుంచి వదిలిపోదు..

సాక్షి సాయం పట్టిన నిద్ర వీధుల్లో .. సరిచెయ్యని దేహ ముద్ర మసకబారి .. ఆఖరి విందు ఎండిపోయి…

 వీధుల్లో తిరిగే అనాధ భర్తల తీరని అచ్చులు పోస్తుంది. కొంచెం కంగారు పడినా వాళ్ళ మాట ..

 ఇంకేమీ కొత్తగా చెప్పదు. చెప్పదని తెల్సిన .. ఇదంతా చెప్పేవారు .. ఎక్కడున్నారా? అని అడిగి ఆగిపోవడం.

సాగమ లిపి ముద్రలు కలిపినా దిశాగాత్రంలో నేను తలపడతాను.. ఒకటీ .. రెండుగా ..

 ఉందని మాటలని తరుముకొని.. తురుముకొని.. దేహ బిక్షకి సరిపోని చీకటిలో ఊరేగి నిండాలని మోస్తారు

నీ దిటవు నాలోపల ఎర్రగా పండుతుంది….  పండి రాలుతుంది…

కొంచెం తీరిక చేసుకొని .. ఆ మూల విడిచి పెట్టిన శ్వాస భ్రమలు కొత్త దేహాన్ని దిద్దుతాయి.

శరణు మాయని పోసుకొని కనిపించదు…

                                                      —————————–

                        3.సరి చెయ్యని విన్నత .. ఒప్పుకోలేదు.. జోడింపు లేని మెడలు

నీ లైఫ్ లో ఏం జరుగుతుంది ? అనే దానితో నిమిత్తం లేని .. ఈ relationship కి ఏం అర్ధం ఉంది?

నువ్వు రాత్రంతా ఎక్కడున్నావని ? అడగడంలో.. అనుమానం కాదు.. ఆశ్రిత రక్షని చూడాలిగా?

ఇది కుటుంబ హింసగా నువ్వెలా హైలైట్ చేస్తున్నావ్? అయోప రాజీయతని తాగి …

 నా లోకి నేను నిండిపోయానని.. స్పృహలు తప్పిన ప్రతీసారి.. నవ్వుకొన్నానని ..

 ఓ గ్లాసు నీళ్లతో కోలుకొని…కొంచెం ఎంగిలి గోడని అదిమి …  మళ్ళీ అదే గట్టుని చేరుకున్నానని..

ఊసులాడుకొని.. తగువులని నంజుకొని.. గాలి నిండాలని ఉడక బెట్టుకొని.. భయంలో పారబోసుకొన్నానని..

సరి చెయ్యని అభద్ర గండం పొంచి ఉన్న మహా నగరమిది.. చట్టాలు..నాగరీక భయాలని దాటి ..

 ఒక సంక్షోభ మితిని ఆ పైకి చేర్చుకొన్న దిశగా మనం ఎదిగిపోయాం… అటెవరూ రాలిపోలేదు

…………………………………

కాపాడడానికి ఎవరూ లేరు.. కాపాడుకోవాలసింది .. అసలేంటి? అదీ అర్ధం కాని అయోమయం..

ఆ సర్ది చెప్పుకోవడాలన్నీ ఏక పక్షంగా ఎందుకు మిగిలిపోయాయి. రాజీల చోటు పగిలి…

ఎందుకో నేను సరిపోనని నువ్వనుకొంటే .. దానికి నా దగ్గరేం సమాధానం లేదు. ఎప్పటికీ రాదు.

ఉన్నన్ని రోజులైనా .. ఓ జవాబుదారీగా ఉండగలవా? సమార్జన .. అధమాయన నింఘర్షత 

కొత్త కన్నులేని విపాత నిర్ఘాంతల దర్శన .. ఉమ్మడి ఎద్దడి.. చేరబిలిచిన ఖాళీ ఇంటిలో..

 ఇంకేం సద్దుకొని గర్భ పంటలో.. మాట కనబడని మంచు పోడుల్లో …  ఉమ్మడి నలతల్లో

అవునవును.. అదీ నాకు తెల్సు.. ఈ అపార్ట్మెంట్ నుంచి వెళాల్సిన వాడిని నేనేనని?

ఐనా .. మళ్ళీ .. ఇదే అంటాను.. నేను ఉన్న కొన్ని రోజులకైనా.. అదే మాట..

నేను కూర్చొని .. కూర్చొనే .. నీ మాటతో దూరం జరుగుతాను. ఎప్పటికీ మళ్ళీ చూసుకోలేనంత…

……………………………..

ఈ శరీరం నిండా అపరిమిత నిద్రని కాల్చిన సంక్షోభ మంధన మాత్రమే గడ్డకట్టి ఉంది..

మరేం తెల్సుకోవాలి? కమనీత .. శరీర ఒరవడి కూర్పుల సలింత .. శూన్య ధారల మయం ..

నాకు తెల్సు.. నీ లోపల ఏం నడుస్తుందో.. నా నుంచి .. చిన్నవాడిని ఐనా .. ఏం కావాలన్నా .. తీసుకో..

 నే వెళ్లే లోపు.. నేను సిద్ధం .. చాలా ముందే సిద్ధం.. నీ ఊహాకన్నా ముందే… నీ అలికిడి .. సణుగుడు

నంజుకు తినేంత పెద్దగా .. ఉరుము ఉరిమి.. అటు ఇటు అపార్టుమెంట్లు డోర్లు సందులోంచి

చూసి.. కంగారుగా మూసి.. లెంపలేసుకొని.. చెవులు బిగబట్టి.. కంటిని అనుమానంగా ఉంచి..

చప్పుడుని చల్లారబెట్టి అందిపోసుకున్న నిప్పు తొవ్వల గుయ్యారింపు.. పోతూ పెట్టే సమాయలాలపై

నూరిన కత్తి.. మడత పెట్టిన చాకు.. పెదాల లల్లారపై నూగుని చెక్కి.. చెక్కిలిని తడి తుడిచి రుద్ది..

 నీనుంచి బయటకెళ్ళాక .. నాకిక మొదలుపెట్టాల్సిందేమీ లేదు.. నమ్ము .. నమ్మకపో…

నాకేదో కనిపిస్తుంది.. నేను లోపల కేరింతతో ఎగురుతున్నాను.. తడిచి .. ఆరి.. తడుస్తున్నాను

అక్కడ ఇంకెవరో పురుషుడి .. సమాయోపాల సరిచేత తగలబడుతోంది.. పగలని రాలగొడుతుంది

ఇక్కడిక ఏ బలనిరూపణలు అవసరంలేని స్మశానం నా ముందు కదులుతుంది.

…………………….

స్పష్టత పగులగొట్టిన అధికార నిరసన.. మరేమీ తెలియని విశ్వ బ్రాంతిలోకి మింగేసిన చలన మూర్తుల

కల్లోల స్థిమితం.. ఏదో ఉంది.. మరేదో అర్ధం కాదు. అనుకున్నట్లుగా ఎదురు పడదు..

భ్రమణ పరాగ ఒంటి సూత్రంలో .. కంటిని నూర్చి .. దేహ శిధిల మూర్తిని కప్పుకున్న నిద్ర రాతలతో..

 తడబడే అటునుంచి రాలుతున్న ముఖాలని కుదిపి చేర్చిపెట్టారు. అదిమి అదే బలంతో కుట్టారు

ఒంటి స్కలనలోని ఉరవడి ఎగురుతూ .. తల కొట్టేసిన నిద్ర కుదుపులకి దేహం సిద్దమై..

నిల్చి వెతల గొంతు మధ్యలో .. కూలిన దూర నిడువుల శిక్షని మింగుతూ… చెలగాట మాడారు. 

దీప మేత్తాది మింగిన కల .. ఇప్పటికీ సగం దొరకని నీ దేహ పలవరం..ఓ పక్కకి లాగి..

………………………..

అంతే అని సరిపెట్టుకోలేని చీకటి నాలికని కదిపి.. మాటని మెదిపిన శత్రు ధ్వని.. మొదరింపు..

పరాశక్తం  ..ఉన్మద  ప్రాణ దిశని కలుపుకొని .. నిలబాటు … రుజా మర్మన …స్వస్థ నిర్దన…

శత్రు ధ్వనిలో గుదిగుచ్చిన అరమ్యం .. రంగు పులిసిన దగ్గుతో పండిన జ్వరం.. నడుము గిల గిల

పోటుపెట్టే చీకటి నిజాయంలో పొర్లిన శరీర దిశా మోయింపులు.. తేలిక గండాలు… స్థలనాలు..

వెనక కాళ్లతో స్పృహ తప్పిన శ్వాస గండన.. ఆత్ర ధారణ .. శిధిల గతి రమింపు .. పూత చీరలు..

 స్థితి సమ్మతి కరిగిపోయింది.. అస్థిర పునాది నిలిచిపోయింది. .. అలవి బొట్టు  తీరుకొంది …….

                                                       ………………………………………. 

                    4. గెస్ట్ హౌస్ చిట్టీలు.. చర్మ నిద్రల కలత .. ఉండీ లేని నేరం..

సమాళీయ కప్పివేతల బిగువులో … నేసిన పగటి రోజుని.. తలనొప్పి బీడు గదులని..

సర్ది చెప్పడానికి లేని దొంగ చూపులని.. మసకలు వార్చిన కంట్లో .. చర్మ నిద్రల కలతని…

ఉగ్ధానీతన .. శరీర కొలతలు.. ముఖాల మెరుపు..జుత్తు విరబోతలు.. చప్పుడు లేకుండా.. కసి సైగలా

 మింగేసే చూపుతో.. బరువుతో.. నిద్రాణ గతి చెదిర్చిన మంథని తీరులతో ..

ఎదురుపడ్డప్పుడల్లా .. హెచ్చరిస్తూ.. అవతల న్యూక్లియర్ పవర్ స్టేషన్ లాంటి వాడు.. ఒక్క రాత్రి .

. అంతేగా .. పొద్దునకల్లా .. అంతా మారిపోతుంది.. దాహ యావృత కెల్లగింపు

సైక్లిక్ రియాక్షన్.. నీ ఎంటైర్ లైఫ్ మారిపోతుంది.. ఒక్కరోజు నీ పక్క మరో చోటికి అంతేగా…..

మాంస మంతనాల క్యాబిన్లు … కల చెదిర్చిన బ్యాంకు ఫ్రీజింగ్స్ ..  గెస్ట్ హౌస్ చిట్టీలు

……………………..

రోజూ మార్చాల్సిన పాటర్న్ అఫ్ లివింగ్ .. అదే మగాడు.. రెండు..మూడు రంగులు..

శరీర సత్యన శ్వాస అవరీయాలు.. ఏదో కుదరడం లేదు.. కన్ను పట్టడం లేదు.. కథ అర్ధం కావడం లేదు..

కానీ వాడు.. పట్టు- విడుపు లేని ఆకలి చూపుతో.. సర్దుకున్న నిరాశ చలన దుఃఖ బంధనని వినకుండానే..

బూతు బొమ్మలు.. మార్ఫింగ్ వీడియో బెదిరింపులు.. కూతురి హాస్టల్ లొకేషన్ షేర్ చెయ్యడం.

నడుస్తున్న జాబ్లని మూత పెట్టి.. నిశ్వాసాని నొక్కే ఆయాసాన్ని వింటూ.. తడి గొంతు కామెంట్లు..

రాత్రంతా అపార్ట్మెంట్ ముందూ.. ఎవడో .. ముసుగులో తచ్చాడుతూ వెళ్లడం.. నల్లగా చూడటం  

నిశ్చల ఘర్షణలో ఊరిపోయిన అడుగులు.. చంచార్య తీర్ధ గోతులు.. విశ్చయా రీతులు

నిద్రని పీల్చేస్తున్నా వదలని..చర్చిత కంటి ఊధ్యనలు.. తల ముడుపు పొంగులు.. కంగారులు 

నిస్తేయ వీధుల మధ్యనే … మతి జారలు ఒడిసిపట్టిన .. వదలని కదిలే గొంతులు..

………………………

పెదాల నలుపుని రుద్ది .. శాసిత నుదురుని పగలగొట్టి .. స్థితి రుత అజ్జేయంలో పడి

సపాయ కుదిలింపులతో .. లోపలికి రాని పట్టింపులు.. మసక కీడుల ఆరబోతల వేడిమి

లోగా .. వదిలేసినా కదిలే .. గది నుంచి .. నీటి జాడీలతో .. పలకర దొరకక …

త్వరపడి నిద్రలతో కలిసి .. దూరంలోకి విసిరి.. కంటి సూత్రాలతో అమాయ విగ్రహాలు.

 తెల్సిన వారే .. అదోలా చూసి.. దూరం జరిగి మాట్లాడతారు.. కాల్స్ ఇగ్నోర్ చేస్తారు..

మాట్లాడుకొంటున్న వారి దగ్గరకి వెళ్ళామా .. మాటలు ఆపేసి ఎవరికి వారు విడిపోతారు.

అంతా మామూలుగానే కనిపిస్తుంది.. కానీ అలా .. ఏదీ లేదు.. రాదు .. బిగిసిన వెర్రి..

చావుని చప్పరించే నాలికలతో.. ఒళ్ళంతా నల్ల జిగురు ఒంపుతూ.. సహా అవసానలు..

……………………….

రాత్రే ఏం చెబుతుంది.. దుఃఖాన్ని ఒడిసిపట్టి.. చలన కీలని మెలితిప్పి బిగించి..

ఉనికి మొత్తం సమయంలోకి కూరుకుపోయి.. నిశ్చయతా ముంపులో దిగబడి.. రాలబడి

ఆయాస నిండి  తరుముతుండాగా  పైకీ -కిందికీ మార్చి పెట్టుకోలేక.. మాటని వదిలి.. అరిస్తే..

బరి తెగించిన హెచ్చిరిక.. తన live in  partner .. వాడితో  కలిసి మందు కొడుతున్న ఫోటో షేర్ చేసి..

 all  things  normally  we  share  together … this is our regular …

నిద్ర దర్శన లేని అయోమయంలో పోటు పెడుతున్న నిరామ దృష్టి కనుమల్లో చెదిరి..

కథన దిందన మెరుస్తున్న అయోమయంలో పడి కొట్టుకోకుండా..మృత్యు ధార కురుస్తున్న ఉలిక్కిపాటు.. మధ్య నిద్రని సర్రున కోసేస్తూ … తలుపులని చిత్రిక పట్టిన దుప్పటి గోళాలు….

విముక్త చలన .. అశ్లీల కుదుపులో పడి.. ఊగిసలా పట్టి కదులుతున్న .. ఊపిరి ఛాయలు ..

 పక్క గోడపై .. భయపెడుతూ కనిపించి.. ఊరుకోక మీదకి ఎక్కి పట్టుకొని..

 గొంతునొక్కిన అధాట్టు స్మరితలో … జలగలు ఈదుతున్న వాటర్ జగ్ … కొన్ని పురుగుల తెట్టు

పైకి తేలి .. మింగేస్తున్న దాహం.. తరిమేస్తున్న నీళ్లు.. కళ్ళలో నిండిన నిప్పు నలకలు

ఫ్రిడ్జ్ లోంచి పడగ విప్పి దూకిన పాము.. చీకటి పేనిన లుంగీ .. గొంతుని అరగదీస్తున్నట్లు..

…………………………..

 అడిగితే వచ్చిన ఆఖరి శత్రువు .. నీరు కార్చిన ఊపిరి పొగలో దగ్గి.. రక్త పొలమార్పులొ ..

ఒబ్బిడి లేని ఆయాస ముహూర్తం ఊరేగి.. తొందర మోతలు.. అలాతలు.. కెలుకుడులు..

మగ మాంస బజారులో.. ఒంటిపై బట్ట కాలాక .. పరుగులు పెట్టించే నిప్పు గుండాలు..

లోపలి దేహమంతా ఎప్పుడో చచ్చి పోయింది… ఇప్పుడిక కొత్తగా బయటకి చచ్చిపోవాలంతే

                                        ————————

                    5.Live in దేహాలు.. ఫోన్ tapping’s .. మాంస నిఖిలీనాలు..

ఇదసలు ఇలా ఎందుకు మొదలుపెట్టాం.. కేవలం ఫాలో అయ్యామనుకొంటా…

నీలోకి నేను ప్రవహిస్తున్ననా ? కదిలి కనిపిస్తున్నానా ?ఏంటి అర్ధం చేసుకొన్నాను..?

ఇది just  one  kind  of escapism  .. షార్ట్ కట్ ఫర్ లస్ట్  అని… వికృతంగా నవ్వి.. అతని ఫ్రెండు

భార్య తెమ్మన్న .. farex  .. పాడ్స్ కొంటూ .. విసుగ్గా ముఖం పెట్టి … జాలి జిగురుతో…

ఇంకేదో అడుగుతున్నాడు. మధ్య మధ్య లో భార్య కి ఫోన్ చేసి క్లారిటీ అడుగుతూ

 ఆ షాపింగ్ లిస్ట్ లో  మునిగిపోతూనే.. ఆదర్శ దాంపత్యం చూపించడానికి .. ఫోన్లో నవ్వుతూ…

అలాస రంగులో పాలిపోయిన చీకట్లో .. అనుమాన అలసట గుచ్చుకొన్నట్లు.. మాటలు తోడుకొని

త్వరపడి ఒప్పుకొన్న గుంపుజెంపీల్లో.. తప్పిన అడుగులు ఉన్నాయాని ఆలోచిస్తూ  …

………………

అలయ ముసుగేసిన అర్ధరాత్రి.. జ్వరం కమ్మి నిజంగానే … కాళ్ళు గుంజేసే నొప్పి..

వెన్నులో సన్నని పోటు.. ఎన్ని కప్పుకున్న ఆగని వణుకు  తలుపు తట్టినపుడు..

              తను   ఎంత మాత్రమూ .. తియ్యలేదంటే .. దీనిని ఎలా నమ్మాలి?

ఒకింపు ప్రార్ధనతో.. ఊడిపోయిన కవాట గంటలని పట్టుకొని.. పెదాలు చిదిగి పోయాకా ..

సిగ్గు దులపరించిన గోడల చెమ్మని ఆరబెట్టి.. నిఘా ఊంతర .. సమ జాగృనిందన

తెలియని ధ్వని బలుపు.. మరో విపుల ముడి బిగుసుకోదు.. నిశాగ్రహి

నియోమ దళసరి పూతలతో ముడుచుకున్న స్పర్ధ.. ఫోన్ tapping’s .. సీసీ ఫ్యూటజీ చెక్లు .. సీక్రెట్ గా    

దేనినీ నేను ఎందుకు వినాలి? ఈ కట్టిపడెయ్యడాల నుంచి ఏంటి ప్రయోజనం?

దీన్నెందుకు బయట బజారులోకి జారవిడిచారు.. అన్ని రెండు .. రెండు.. కామన్ అవసరమా?

ఏది లేదో .. అదే కావాలి? అది మృత్యువైనా? బతికి చూపించడమైన… లోపలనే  రొష్టుతో.. గోష పడి

స్పర్ధల శ్వాస గోళంలో ..ఉండీ లేకపోయినా దీప స్థలం.. తప్పించి.. అమాస నిదన…

నిన్నీ హాలులో ఎంత సేపని ఉండమని బతిమాలతాను. నీ మధ్యరాత్రి భయాల అల్లాడింపుల్లో  …

పాలిపోయిన దేహంలోకి.. చుట్టూ తిరిగి తప్పిపోయిన నిరాధార అలసట.. పెద్ద నిడివి..

ఆగని ఉగ్ర నీలంలో .. మీదకి దూకే కన్నుని .. అలసరాతో పట్టి .. ఆవలించి..

……………………………..

అన్ని చోట్లా అదే ఐనప్పుడు.. వెక్కిరించడానికి ఎవరూ మిగలరు.

వీధులూ .. వాడలు  .. గేటెడ్ కమ్యూనిటీలు.. సింగల్ BHK లు,.. జోపిడీలు

ఆధార్ కార్డులు.. లైసెన్స్ లు .. పోలీస్ క్లీరెన్సెస్ .. మధ్యలో   కోర్ట్స్ … లాయర్ల భుజ ఊపులు…

దహిత నిమంత్ర చోధ .. ఇది ఇలా ఉండాలా .. వద్దా? ఉండటంలో నిజంగా రక్ష ఉందా ?

అనడానికి నేనెవరు? అనలేనిది… ఇంకెక్కడా అనకూడనిది .. మరేదైనా ఉందా?

మనలోకి మనం ఏం తెల్సుకొన్నాం ? ఒకరికొకరం తెలుసుకోవడానికి?

 అనాహిత కంటి నాలిక పుల్లగా తగిలి.. లోపలి చీకటి వెక్కిరిస్తున్నట్లు..

………………….

అలరింపు విధాయ నిలువు కోతల గారడీ … ఎక్కి తొక్కి పోతున్న దేహ బీష్మణ..సలిల్లాత

ఆ గదీ .. ఈ గదీ మధ్య జ్వరం కమ్మిన నీటి వంతెన .. గాజుమర .. సెల్ఫీలు… వాట్సాప్ గ్రూపులు

రాత్రను కెరటం విరుచుకుపడ్డ ఆనకట్టలని దాటి .. పొంగిన చెమటా..రక్తమూ.

 అనాహిత కంటి నాలిక పుల్లగా తగిలి.. లోపలి చీకటి వెక్కిరిస్తున్నట్లు..  నషాలా మెక్కిన నురుగు

ఉప్పూ .. కారం కలిపిన నిద్రలు.. మధ్య రాత్రంతా వెక్కిళ్లు నానే షవరూ …

ఏదీ తుడుచుకొంటే ఆరేదీ కాదు.. ఆ కాOపిటీషన్లో నీలో .. చివరి వరకు నిలబడతానో .. లేదో..

సంధి భిక్షకి ముందే .. హాలులో .. మరో అర్ధరాత్రి.. ఇంకేదో మగ గొంతు వినక ముందు..

అదే హాలులో నేను పగల గొట్టిన సీసా.. స్నాక్స్ ఉన్న పింగాణీ ప్లేటూ .. నేను మాత్రమే … నేనే

కట్టేసుకొన్నాననే హెచ్చరిక .. ఉక్రోషం.. ఖర్చుల్లో నేనూ సగం కదాని దుగ్ధ,. వేగిరపాటు….

ఒక్క దెబ్బతో నేను బిగించుకొన్న గది తలుపు .. ఒరిగి మంచం పై బలంగా పొర్లినప్పుడు.. చెవి తిరిగినప్పుడు..

మొదలైన.. సన్మాయ తీర్ధ రథంలో మొదలైన మట్టిపోటు . ఛాతీ లస…. గుంజేస్తుంది..

……………………….

ఇదంతా భరోసా లేనిదని తెల్సి దూరం జరగలేను.. తలవ లేను .. కరగా లేను.. కాళ్లపై పడలేను

 అవునని దగ్గరై .. నీ నిష్ఠుర అనుమానమూ మోయలేను.. కథ నాలోపల … మన కనబడని బయట..

గాలిని ముమ్మరం చేసి .. శ్వాసని దట్టం చేసి.. చూపుని నిప్పుగా చూసి … బంధిస్తుంది..

ఎవరు ఎవరిలోనూ .. చిక్కుబడిలేముగా ? అన్నప్పుడు ..

 నేను ఆ రోజుని గుర్తుకుతెచ్చుకోవాలిగా? ఏదో నిలదీయ లేను.. ఇదంతా వద్దనడం తప్ప..

ఇద్దరం ఖాళీ చేసి వేర్వేరుగా మళ్ళీ వెదుక్కొంటూ వెళ్లిపోయాం..

                                                                ———————————-

                6.ఎవరికీ వారే.. ఇప్పటికి మూడోసారి.. ECG  ఎలేవేషన్స్

నెమ్మది చూపులు.. శరీర భద్రంలో చీల్చుకొచ్చిన అరుపు.. ఎలా వదిలిన ఇల్లు అలానే..

 అన్నీ వదిలి పెట్టి పెంచినా .. వెనక నుంచి వాడు … అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు..

అతనికో పెళ్లి చేసుకోలేదు కాబట్టి.. ఆ ఆస్థిపై వాడి ఆశ అనుకొంటా..

ఇప్పటకీ మించిపోయిందేం లేదు.. Please  think  over  .. very  practically .. single  parent  position  not  that  much  easy , when you  are  reaches  to old age .. 

 i  will  take  that  forward  step  for  realign  every  thing ..

అనడంలో వాడి స్వార్ధమే ఎక్కువా?

ఈ దేహంలో రసాయన నిమజ్జనాలు ఎప్పుడో జరిగిపోయాయి.. ఇక తవ్వుకొనే ఓపికాలేదు.

విడిపోయామనుకొంటే.. కొడుకు నుంచి మగాడుగా మారి.. మరో మగాడిని సమర్ధించే

……………….

మళ్ళీ అదే ఆధ్యాత.. అదే అధికారం..చిన్న చూపు .. గద్దించడాలు… ఇన్నేళ్ల అనుమానాల ఎక్సరేలు .. కదలికలు చెలరేగిన నిస్సత్తులోని గంభీర గోడలు..

వెకిలి నవ్వు.. నలురిలో.. ఖరీదైన 7  స్టార్ హోటల్ విందులో..

వీడు.. అతనిలో మారబోయే మరో నాన్న.. జీన్స్ వదలవా?

కొడుకు నుంచి తండ్రిగా మారే క్రమం.. దేహ అల్లీన క్రమ జోడింపు బిగువులు..

పొట్టుని ఎంత దుల్ల గొట్టినా .. అదే లేకపోయి .. వాడుకున్న కనపడని దూర క్రియలు..

తిప్పి చీల్చుకొన్న ఆయాస ఊలం.. పోటు పెట్టే ముందు చూపు.. వాడిని వాడి కోసం వదిలిస్తే..

…………………….

అస్త్ర నిర్యాణ .. కదిలే రవ్వల గుడ్డని తడిపి.. నీటి వికర్ష ధ్వనిని .. అవపోత కన్నీరుతో కప్పి..

వాడు తెలుస్తున్నా .. ఇంకేదో మదర్ అనే మనన .. చెప్పుకొని.. ఆక్షేపణ..

దేహ అలంగాణలోని కాపు గొంతు.. ఇదిక .. నా ఇష్టమేగా? కదలిక కాదనుదుగా?

అపాశ్రయం.. గండం తిప్పిన ఈసడింపులు.. గసిరిన పొగ గొంతుల్లో మరకలు.. ముడులు..

సమయ భస్మత కూర్చిన నిండు రంగుల కుండలోని.. చుట్ట విప్పుకొన్న చీకటి కోతలు..

గోడలని చీల్చే నల్ల నవ్వు.. కంట్లో బీటలు.. దోసిలి బరువు.. కరుకుగా నిద్ర జాడీ లోంచి

లేచిన పాము.. విషపాత్రలో పోసి మరిగించిన అంత్య ఉబితా కంటి ఎర్రలు..

………………………

నల్ల బడుతున్న గోడలపై .. ఊపిరి బుస కొడుతూ .. జ్ణాహిత భూమి కనుసన్నల్లో ఉండి

 ఒప్పుకొని రెండో నిద్ర కథని .. ఏమార్చి.. కత్తిని దూస్తారు.. అతనలా చూస్తూనే ఉంటాడు..

 ఎవరో తప్పించుకొని వెళ్లిపొమ్మని అరుస్తున్నా?

మృత్యు నిషాగం .. అమలైతే బొద్దు ముడిలో.. దాచి పెట్టిన నిద్ర ఊదులు..

 కలబడి.. ముడిపై ముడిని బిగిస్తూ.. స్థాయీ మతిని అరగదీసి నడకనే దాటుకొంటూ…

నిస్ట్రీనా మాదక వివన కలనీ … అప్పటికి ఒప్పుకోక .. నిద్ర రాతని మారుస్తున్నానని … అనుకొని

మాట తప్పి ఆమె లోకి చూసి తలదించుకొంటాడు.

ఎవెరెవరో ఒకటై పోతారు.. నా ఇంటికే వాళ్ళ తాళం వేసి వెళ్ళిపోతారు..

పెద్ద నదుల మధ్య రాత్రిని ఆరబెట్టి.. నీకేం తెలియదులే.. ఐనా నీ రోల్ ఐపోయింది..

 ఇప్పుడిక ..ఎలా ముందుకు పోవాలనేది.. నా లుక్ అవుట్ కదా?

నువ్వు వదిలేసేయ్.. నిన్ను దేనికి ఫోర్స్ చెయ్యను.. ఫ్యూచర్ లో ఏ సాయం చెయ్యను..

ఆశ్రయ దిగ్దతి.. కనబడని మంట .. దేహంగా తెలియని ఆహరిత చిత్ర మైకపు కొండలు..

తరగవు.. కరగవు.. వదలవు.. ఊరేగవు.. కూర్చుకోవు.. కోప్పడవు..

                 7. adaptation … మూలాలు కూల్చిన మత్తెర.. రెండో నాలిక

కలబడిన మూడో రొమ్ము నిద్ర.. నీరు పట్టి తిరిగిన దేహ వికార .. తెలియని ఏక రధం …

సమ గుంభన కూర్చిన .. అదే మరకని వదిలేసినా .. కన్ను పొడిచిన దీర్ఘ నిశీకర మీద తిప్పినా ..

 పంటి గాట్లు దాయలేని చోట మిగిలిపోయిన.. రెండో నాలిక.. దాహ దమన

నిరాధార… అతి కష్టం మీద ఆశ్రమం వాళ్ళు వదిలించుకున్నారు. మళ్ళీ కలవొద్దని చెప్పి మరీ…

నిస్వాస మూర్తుల శిధిల గర్భ సమీకరణ .. దేహ వార్షిక నిందలు.. కౌగిలి ఆర్పని మంటలు..

మూలాలు ముడిచిన గొంతులోకి నాలికని తెచ్చుకొని.. ఇహిత సత్తువు కూర్పుని చెదరగొట్టి

తలలోకి మాటై .. నల్ల జిగురుల శరీర ఆర్తనని తాగి.. కలగలిసిన భద్ర ముఖాలతో..

……………………..

మూలాలు కూల్చిన మత్తెర…. సార్ధ మృత్యువు పై నుంచి ఎర్ర కన్నుతో చూస్తుంది..

మాటని ( ఎవరైనా సరే ) మన్నించ నివ్వదు.. చేతిని కలుపుకో నివ్వదు.. కంట్లో కూలిపోయాక ..

చీకటి చిక్కబడి ఏదో హెచ్చరిక చేస్తుంది.. పగతో తగలబడ్డ నేరం.. ఇంకా ఆ రుజువు లేక..

కావలించుకొన్న దూరాల్లో మిగిలిపోతూ.. భూమి నిర్యాణ పూనకం.. పులుముకొంటూ..

 అసమస రంగు పడక వెలిసి పోయి .. చిరిగిన దుప్పటి కoతల్లో.. రిమోట్ కెమెరాలు..

 high voltage గొంతులు … షేరింగులు.. లైక్లు .. పాస్వర్డ్ లాక్ లో దాచుకొన్న లస్ట్ లు …

……………………..

నిద్ర వరుస తప్పి.. కంట్లో మరేదో దృశ్య ఋణం కదులుతూ.. పూనకాలే రేవు.. కసి పండిన adaptation

కళ్ళు నూరిన వేసవి చెమటతో ఎదురు చూపులు.. మృత్యు దేవత ఎవరైనా వచ్చి .. వాళ్ళే ..

 ఏ స్పృహ లేకుండా అనుగ్రహిస్తే.. అదీ ఓ మహా నిద్ర అంతేగా.. కలలకు దారీతెన్నూ లేని..

దానికి వాళ్ళే రావాలా? వీళ్ళు అదీ ఇదని కారణాలు వెదకాలా?

ఆ తర్వాతైనా అదే మిగులుతుందా ? దుఃఖ చలనగా ఊరిన రంగులు కప్పుకొని..

 ఎవరెవరో చెవులు కొరుక్కొని.. నాలిక తడుపుకొని.. బాత్రూంలకి పోయి.. కర్చీఫ్ లు పిండి…

నిశ్చిత కక్ష్యల్లో పడి  తిరిగే  దేహనింద ఏం చెప్పినా .. పురెక్కని భాషణ లేకుండా ఉందా?

అదేం కాదులే.. వాళ్లలాగే అంటారుగాని.. మనం చేసేది చెయ్యడమే..

వాళ్ళింకేం చెయ్యలేక .. చచ్చినట్లు దార్లోకొస్తారు  …మరో గతి ఎంతమాత్రం లేదు…

………………………….

ఆ శరీరం అలాగే పడి ఉంది.. గడ్డ కట్టిన సముద్రం పై తిమింగలం లా .. మరెవరినో మింగేయాలని..

 అతను దొరక లేదు.. ఉండీ దొరకడు.. మాయా దేహం ఏకరువు పెట్టే భయం కమ్మి

Multiple relations లో ఉన్నప్పుడు.. అందరూ నాలా సాఫ్ట్ గా ఉండరుగా.. ఎవడో అక్కసుతో..

అంటే .. నేనేం చూడలేదు.. అంటే విన్నాను.. పోస్టమోర్టమ్ చేసుకోండి.. ..

మాయా దేహం ఏకరువు పెట్టే భయం కమ్మి…  విచ్చి పోయిన మాంస గోష అణగారి .. మొండిగా కాల్చిన ..

 నిరా రుతు మర్దన .. అంగాల అస్థిమిత హోరు చెలరేగిన ఆనవాళ్లు.. దొరకడం వేరు..

 దొరికిన దానిని అలానే బయటపెట్టడం వేరు.. లొంగిపోలేదని చెప్పుకోవడం ఆగదు…

 గదిలో ఉన్నమాట నిజమే.. కానీ ఒక చిటికెన వేలు కూడా తగలనివ్వలేదు..

ఊపిరి జడి కూడా …మీద పడి తడవక ముందే తప్పుకొని.. తల దాచుకొని…

తడవనివ్వలేదు. నేను పెళ్ళైనా వాడినేనని తనకి తెల్సు.. ఇందులో ఏమీ రహస్యం లేదు.

అందరితో అలాగేనా అంటే.. అందరూ.. నాలా సాఫ్ట్ గా ఉండరు కదా ?

దేహపు అంత్య శీల అనంతంలో ఇంకా ఊరుతున్న దాహం.. చనిపోయాక కూడా వదలలేదు..

ఆగ్రహ రమనలో ఉడికిన కేలనల ఉన్మత్త శరీర కలతకి తీరుబాటు లేని ఉగ్గింపు..

……………………….

భయం ఊరడించి .. శీల నిద్రగా ఓడిపోయాక.. పడకలని పర్చిన వార్తలు.. చిన్న నీలి బిట్లు..

 చెల్లుబాటు కావు. దూరం చేరవు.. ముఖాలని మళ్ళీ …దాచుకోవు.. గొంతు నలపవు..

చీకటి స్నానం సాధ్యం కానీ అమాస .. సముద్రాన్ని  మింగి.. వాంతి చేసుకొంది

చావు బట్టగా మారిన స్క్రీన్లు.. ఎవరో మార్ఫింగ్ చేసి .. షేర్ చేసిన గతాలు .. ఉమ్మడి గర్భం..

వెలివేసిన తల్లిదండ్రులకి .. చావు .. తిరిగి కూతురవడం.. నగలు  బరువవ్వడం

face book అంతా అయ్యోలు .. RIP లు .. సోమవారం కవిత్వాలు.. లైక్లు వెదుక్కోవడాలు..

కొవ్వొత్తులు పట్టుకొని అరుస్తున్నవారికి పేర్లు తెలిసిన బయటపడరు.. కలత నిలుపుకోరు ,,,

ఆర్పీ ఆర్పక చీకట్లో అందరూ కలిసి కలిపేస్తారు..  కాలిపోయే గుంభళిత ….నిరా ధ్వజం

 మరో కాష్టం .. ఇంకా బాగా రాయడానికి మళ్ళీ ఎక్కడో జరిగే ఉంటుంది…జరిగే తీరుతుంది

 మరింకేం చెయ్యలేక .. బాడీని గట్టి చేసుకొని.. సిద్ధంగా .. ఇంకెందుకు ఆలస్యం అన్నట్లు…

                                       —————————

8.ఉబిసిన గది వరద .. మంచం కింద శవ పేటిక.. తనిక వద్దనుకొంది..

ఊపిరిడటం లేదు .. ఆమె వక్షాన్ని విప్పి కప్పింది.. తన వెలుగుని కాల్చింది..

నా చూపు పోయిందన్నారు.. ఆమె కలనీ చల్లారబెట్టి అతనిలో దులిపి.. నా ఏడు రంగులు నీవేనంది ..

బెంగలో  శంఖాన్ని ఇచ్చి .. ఎప్పుడు ఆమె రావాలన్న ఊదమంది..

తను ఊదాడు.. ఆమె డాన్స్ చేసింది…మంత్రం జ్వరం కమ్మిన మహా శిలలా…

తను ఊదాడు.. ఆమె పాట పాడింది.. శూన్యతా విశ్వ గోళాలు కరిగేటట్లు….

తను ఊదాడు.. ఆమె రంగులు పులుముకొంది.. పుప్పిడి బొమ్మలా పక్వమైంది…

కంగారుగా తన ఒంటిని చూసుకున్నాడు.. పాలిపోయి .. ఏ రంగూ లేక.. నవ్వుకున్నాడు.

తనిక వద్దనుకొంది.. ఇంకేం చేసుకొంటాను .. తన లోపలి కలలని అనుకొంది

మృత్యువుని సిద్ధం చేసిన పడవ .. మహా శూన్యగాథలో చిక్కుకొంది..

……………………

నిప్పు శిలలా యజ్ఞవాటిక పక్కాగా ఇల్లు.. చెదిరిన గాలి భవంతులు.. చెమట బీటలు..

తగలబడ్డ పెదాల నషా… అనుకోక ఓడిపోయిన నీటి ఓడలో .. తన పాత ఇల్లే కనబడింది. …

 ఉబిసిన గది వరద… నింబిత సముద్రంగా ఆరే కంటి కొసల్లో నిప్పు ముట్టించి….

వెలపరం.. ముంచుకొచ్చిన దేహ పచ్చల నడక.. కోలుకోని గోడల మధ్యనే సాగారు..

సమయ ఒప్పించడానికి .. కెరటాల తోపులాటకు ముందే కేక పెట్టిన శరీర తీరికలు..

చెలగాటలతో.. చల్లార్చిన హద్దులతో నిలబడే నీలానే ఉండిపోయిన విపత్తులు..జాగ్రత్తలు..

……………………………..

 తను ఆ గదిలోనే ఉండిపోయి.. అక్కడ నుంచే అన్నీ జరపాలనుకొంది..

వాడు  రాల్చిన దొంగ కన్నీరుని నమ్మి … వాడు వదిలేశాక.. తనకని మంచం కింద శవ పేటికని సిద్ధం చేసుకొంది.. లోపల సీసాలో పాటని పట్టి.. మూత బిగించింది..

పెద్ద దగ్గుతో ఉబిసిన గది వరద .. పొట్టలో ఆమ్ల సంచార ఒద్దిడి . మెలికలు తిరిగింది.. రక్తం కక్కుకొంది.. మాటని దాచుకొంది.. బట్టని కప్పుకొంది..పోబడిన పొలమార్పు ..

ఆ గదికే ఎన్నో చెప్పుకొంది.. ఎవరినీ శపించలేదు.. కనికరించనూ లేదు.

అంతా కలిసి తనే అనుకొంది.. మంత్ర కథని లాక్కొంది..మతి తప్పి తిరిగింది..

ఇదేంటని.. ఎలా ఉన్నవని .. అడగడానికైనా .. ఎవరూ ఇంటి గడప తొక్కలేదు.

……………………………………….

మాంస శాలల గతినే తిప్పి.. తనిక వద్దనుకొంది.. వేళ్ళాడలేనని చెప్పింది..

అతి దేహ సంపూరక నిధ్యంలో ఓలలాడిన అడుగులుని తుడిచి.. మళ్ళీ రావొద్దని..

శరీర నిషాలిక కప్పిన దేహ నైరూప్య ముఖాలన్ని .. గుర్తు పెట్టవద్దని..

అడిగినప్పుడు.. అలిసి పడిపోయినప్పుడు.. అక్కడే ఆగి నిదానించినప్పుడు

సమ భద్ర మన్నిక లేని విశ్వ సంచార ఒడంబడిక లేని ఉపేక్ష స్థలాల కంటి తీరులు..

రొప్పు.. నెగ్గిన కొండల్లో .. దాచిన శరీరాలతో.. పోతపోసిన పెదాల నలతనే …

వలస పోయిన అంపకాల్లో .. మత్తు గుంజింపుల్లో .. తేట పడిన గదుల్లో జీరాడే..

నిండీ నిండక .. చెదిరీ .. చెదరక .. ఊసు పోసిన దేహ కలుపులని తీసి.. మాంస చూపు..

అరమరిక దేహ గణాల మధ్యనే నిల్చి.. తాళం తిప్పిన ఇంటి గుమ్మాలని పట్టుకొని …

                  అవసరమూ.. మెదిలింపు  సగమూ .. నిద్ర వార్చిన కలల నిందా అలుముకొని.. 

తనకి తను పరాయిగానే ఉండి.. సరిపెట్టుకొంది….

                                           ——————————–

9.ఎగిరి కూలతాడు .. కత్తి పుట్టిన బెడ్ రూమ్ .. గొంతులో బెంగ ముద్ద

అదే జరగడం లేదు.. అక్కడేదో ఖాళీ … విశ్వ సమాధిని శుభ్రం చేసే చేతులు..సరి లేని దేహ

ఆవర్తనకి బిగించిన .. సరి చేసుకొని ఉంచుకోలేక అతనిపై అరిచింది. సమాజారత

అతను ఇలా మాట్లాడటాలు నాకు అలవాటు లేదు.. లోపలి రా … కూర్చొని మాట్లాడుకొందాం.. అన్నాడు… తను వినలేదు.. అక్కడనుంచే అరిచింది.. కదిలే నిద్ర గున్నంలో కలువల కుండ…

ఇదేదో పరంపరగా వచ్చే నిలదీత .. అతనే అలాంటి అనుమానం రావడానికి .. 

ముందెప్పుడైనా ..అలా ప్రవర్తించాడని ఆలోచించాడు.. కలవలత గడ్డ కట్టి .. బరువెక్కిన ఛాతీ…

అసహన గతి మంటలు .. లాగి పెట్టి కదులుతున్న నిద్రా ప్రవేశాల పై ఊరుకోలేని దీక్షిత సరిగతులని

తవ్వి.. సరికి చేస్తూ… గొంతుని కెలికిన స్పర్ధ నిహారితా.. ఎప్పటికీ చల్లారదా?

ఆలోచనల నిండా కమ్ముకొన్న కత్తుల పురిటి నొప్పి.. అపారదబ్దాలు.. నలతల వణుకు..

నేను ఎవరినీ అక్కా.. అని.. చెల్లి.. అని .. అలాంటి ప్రొటెక్టీవ్ పిలుపులతో పిలవను..

 ఫ్రెండ్స్ గా చూస్తానంతే .. బిజినెస్ టూర్ మీద వెళ్ళినప్పుడు.. అక్కడ ఆ రోజు అనుకోని ఎమర్జెన్సీ వలన .. availability లేక ఇద్దరమూ .. ఒకే రూంలో.. నిజానికి అది.. సూట్ .. very  luxuries 

 ఆమె లోపల పడుకుంటే .. నేను బయట ఎంట్రన్స్ రూంలో సోఫా మీద పడుకున్నా… she is 10 years older than me also my Boss … గంపెడు పిల్లలు ఉన్నావిడ…

ఏది ఎందుకు మనం .. ఎదుటి వాళ్ళు చెప్పినట్లే వినం.. మరేదో అభిజాత్య పల్చని … పదునైన…

 ఆయుధాలు దిగబడి.. కంట్లో గుచ్చుకొన్న జ్ఞాన శరీరపు పొగ మండుతూ… లోపలికి  మాటలని తీసుకోక…

అందరి ముందు ( ఆమె పేరెంట్స్ ముందు .. హాలులోనే..)ఈ మాట అతనికి చెప్పాల్సి వచ్చింది..

ఐతే ఇక్కడా హాలులోనే పడుకో.. అని దుప్పటి అతని ముఖం పైకి విసిరి .. ఓ ఈసడింపుతో  …

ఆమె పెద్ద చప్పుడుతో బెడ్ రూమ్ తలుపు బిగించుకొంది. ఎవరూ అతని వేపు చూడలేదు….

…………………………

తన దేహ నిద్రలోంచి కత్తి దిగిన అరుపుతో.. నిశ్వాస గండం ఓడిపోయినా మత్తుని ఉడకబెట్టి..

సరాసరి మృత్యు దర్శన చేసిన ఆనవాళ్ల పై .. కూర్చునే .. గతి ముడిని వదులు చేసి ..

 కదిలే ముఖాముఖీల మధ్యనే కదిలే గోడలు.. బీటలు తీసిన దుఃఖపు చప్పుడు… కలబడే స్పృహజ్ఞ…

పల్చని నమ్మకాలు.. దిగదుడిచిన నిష్ఠూర రాత్రంలో .. తల రాల్చే మాటలు..

 జిగురుగా అతుక్కొని…గడ్డ కట్టిన అపక్షేమ ముఖాలని నానబెట్టి.. శరీర రవ్వలని ఉడకబెట్టి..

రోజూ అనుమాన దొంతర్లు.. కనిపించని చోటి నుంచి ఊహించని విధంగా……

ఏది ఎందుకు ఎలా మొదలవుతుంది.. ఏ నమ్మకం పగిలినప్పుడు ఇలా మారడం..

కదిలిక గడ్డ కట్టి .. ఊరబోసుకొన్న సమయాలతో ఒకరి లోంచి ఒకరిగా ఆగి పోయిన సన్నద్ధ..

ఎప్పటిదో ఆ దూరం ఇప్పటికీ మసకబారక అనుమానం కనిపిస్తూ … ఉండుండి ..

 ఆరిపోతున్న పుండుని కెలుకుతూ … తలబడి చీకటి కొండపై నుంచి దూకి తలపగిలి..

మాట ముద్దగా జోగి..  బొప్పి కొట్టిన గొంతుతో చల్లబడి .. గడ్డకట్టి.. ఇంకేం దొరకక …

…………………………

ఎప్పుడో ఏదో అనే ఉంటానని ఎవరినైనా ఆమె ముందు అనుమానం కలిగేలా చూసానేమోనని

 సరిపెట్టుకున్నాడు.. మళ్ళీ మళ్ళీ లోపలికి  చెప్పుకొని.. పైకి సైలెంట్ గా ఉండిపోయాడు….

వారం రోజులు ఉంటామని వచ్చి .. రెండో రోజే ఆమె పేరెంట్స్ వెళ్లిపోయారు. వెళుతూ తలతిప్పి …

ఇద్దరూ అతనికి సారీ చెప్పారు.. అదీ కూతురు లేనప్పుడు.. ఒక నిర్బంధ ప్రతి క్రియలా ..

 అతను నల్లగా నవ్వాడు…. మీరు మాత్రం ఏ చేస్తారు లేండనే చూపుతో .. నిషా చురకల అలవి గుట్ట

అతనేదో చెప్పాలని చూసాడు.. వాళ్ళు ఇంకేం చెప్పొద్దన్నట్లు అతని చేతి నొక్కి ..

 నమస్కారం పెట్టారు. కాళ్ళ మీద పడేంతలా కుంగిపోయారు. వెళ్లిపోయారు..

 కూతురి గురించి అతనికేదో అర్ధమౌతూ ఉంది.. వాళ్ళకీ ముందే తెలుసని..

 కాని బయట పడలేదు.. అతని భార్య అనుమానం లేకుండా  విరుచుకుపడుతుందని

ఏదో గడ్డ కట్టిన చీకట్లో .. బరువుగా దిగబడ్డ శిలువలతో.. మాంస విక్రయ నిద్ర తగువులని… తీర్పులని

 ఆమె మోస్తుంది.. తెలయపర్చడానికి ఆమె అవకాశం ఎవరికీ ఇవ్వడం లేదు..

ఇస్తూందన్న నమ్మకమూ లేదు… అప్పటి కథ వేరే ఉండేదేమో..

ఇక్కడేం .. ఎప్పుడేం .. మాట్లాడుతుందో తెలియని .. అలోప నిర్భర సంధి పాత్రతని తాగి తలకిందులై .

 దారీ తెన్నూ లేని ఆమె లోపలికి చూసి అల్లాడినా? ఏదో దగ్గరగా కరగదు.

………………………………….

మరోసారి.. నీ కథంతా నాకు తెల్సులే.. నీ కాలేజీ .. నీ బంధువులతో నడిపిన రాచకార్యాలన్నీ నాకు తెల్సులే అంది.. నీ Ex -Girl friends లిస్ట్  నా దగ్గర ఉంది.. అంది

అతనికి నిద్ర పట్టడం తగ్గిపోయింది.. రోజు రోజుకి.. మాటకి మాట చెప్పడం కూడా ఆపేసాడు..

ఐనా ఆమె ఏ సందర్భం వదిలేది కాదు.. అతను ఎంత రెచ్చగొట్టిన ఏం అనేవాడు కాదు.

స్లీపింగ్ పిల్స్ కి అలవాటు పడ్డాడు.. ఆ తర్వాత  పెరుగుతూ వెళ్లాయి… అరుపులు .. బిళ్ళలు

 ఇంటికో ఎప్పుడో అర్ధ రాత్రి వచ్చి తన కీ తో తలుపు తీసుకొని.. రెండో రూమ్ లో పడుకునే వాడు..

విడాకుల డాకుమెంట్స్ ఆమె ముందు పెట్టాడు.. ఆమె సైన్ చెయ్యలేదు.. అరిచింది

నా లాయర్స్ చెప్పారు.. నువ్వు నన్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. చిలికిన ఆశ్చర్య పూత

 నీకు ఇష్టం వచ్చినవారితో తిరిగి వస్తున్నావని.. నీపై .. డొమెస్టిక్ వయోలెన్స్ కేసు ఫైల్ చేస్తా అంది..

అది విని అతను నిర్ఘాంతతో ఉండిపోయాడు. ఘనీభవించిన గాలి గుండంలా….

………………………..

ఆమె పేరెంట్స్ అతనితో .. అలా జరగకుండా చూస్తామన్నారు.. కానీ చూడలేదు..

అతను కొద్దీ రోజులు కోర్ట్స్ చుట్టూ తిరిగాడు.. లాయర్లు కూడా అంతగా ఇంట్రస్ట్ చూపలేదు…

తర్వాత .. రోజు రోజుకి అతని మాటల్లో పొంతనలు తగ్గిపోయి .. లాజిక్ జారిపోయి..

 ఎక్కడికక్కడ ఫ్రీజ్ ఐపొతూ ఉండేవాడు.. చలితో గడ్డ కట్టిన మూటలా మారిపోయేవాడు.

మాట తడబడి నత్తి మొదలైంది.. మాటే లేని విశ్వసేద్యంలో రాని వాన…

ఆఫీస్ లోనూ.. ఏదైనా హోటల్ లోనా.. ఒకోసారి బెడ్ రూంలోనూ .. గంటల గంటల ..

ఏడుస్తూ లేదా.. వికారంగా నవ్వుకొంటూ… ఒకోసారి మరేం లేక .. అలానే నిద్రలోనే ఉండిపోయాడు..

అతని మెంటల్ కండిషన్ పాడై పోయిందని.. మెడికేషన్ అవసరమని.. కోర్ట్ తేల్చి.

. డివోర్స్ శాంక్షన్ చేసింది.. అతనికేం అర్ధం కావడం లేదు.. ఎవరూ చెప్పా లేదు… తీర్పు ముగిసింది…

అతను అనాధ కాబట్టి.. మెంటల్ హాస్పిటల్ ట్రెయిట్మెంట్కి ఏర్పాట్లు చేసింది..

 కొన్ని శరీరాలు .. వాటి అనులోమ గతమూ.. సాధించుకొంటూ పోయే నిర్దత పగబట్టి..

 వెనక్కి తీసుకోలేని సత్య ధారణ .. లోపలి కణుపుల్లో సరి చెయ్యలేని నొప్పి .. దీర్ఘ వికారము..

ముందంతా ఏదో తెల్సినా .. పోను .. పోనూ .. ఎగిరి కూలతాడు.. తలగోసట.. అంకురార్ప..

ఇల్లు ఓ సంతర్ప ముద్దగా లేని అసహనంలో చెలరేగే దేహ తీరుని సాక్షి చేసి.. ఉరిమిన నిందలు.

నిజానికి .. అబద్దానికి మధ్య గొంతులో బెంగ ముద్ద .. ఎన్నిసార్లు చెప్పిన .. రెండు రోజుల్లోనే

మళ్ళీ మామూలు.. అదే శిక్షా సంధిని ఆపలేక .. తలకిందులు మస్తిష్క మునకలకి ఊపిరాడక …

 కత్తి పుట్టిన బెడ్ రూమ్ .. రోజూ ఇంకాఇంకా పదునెక్కుతూ.. సలశాలీయ …ఊగురాటం..

అ రాత్రి ఆమె .. అతని రూమ్లో స్లీపింగ్ పిల్స్ని వెదికి .. గుండ చేసి .. గ్లూకోజ్ కలిపి…

 మొత్తం ఒకేసారి మింగి..నిద్రపోయి.. మరి లేవలేదు.

………………………….

                             10.  ఇక చెప్పలేం .. స్ట్రెచర్ పై నగరం.. మగధారణ

కల సత్యం కానీ దేహాలలోంచి.. కనిపించని నిరోధ గర్భ సూత్రం కడిగిన అనుపానుల  మగధారణ

పొగ నిండిన సంచీలు..మాదక ఋణం చల్లారి పోయిన కథ చనిపోతూ.. దొల్లుతున్న సీసాలు..

డొల్లలు పడుతున్న మాటలు..  స్ట్రెచర్ పై నగరం… సగం చప్పరించిన సిలైన్లు….

 హార్ట్ .. పల్స్.. బ్లడ్లో షుగర్ లెవెల్స్ ..ప్రెషర్ న్నీ.. బ్రెయిన్ అటాక్స్.. పుండవుతున్న womb …

హై అసిడిటీ లెవెల్స్.. at least reduce  the  cigarette quantities … మృత్యు విధీక్త స్పర్ధలొ ఓలలాడి .. ఉండి కనబడని ఊపిరి నిండు వడపోతతో పిండుకొని.. 

అదోల్లాస .. సరిపడని నిద్ర జాగీరులో గుండ్రంగా తిరుగుతూ.. వదిలిపోయిన చలన మూర్తుల ద్రవ నిద్రల రేరింపు.. పట్టు జ్జారిన బిడ్డ … ఒరిగించిన నాటకాలతో పెద్ద తెరల వెనక పోలికలని పోల్చి చేసుకొన్నా వదిలిపోని మేకప్లు… బోర్లించిన సీసాల కింద కాటుక పుటకలు….

…………………..

ఇదేనాని అనుకోకముందే .. దేహ వార్పులో పడి కొట్టుకుపోతున్న నిద్ర మునకల .. దేహ జిగుర్పు..

పదే పదే .. పడదోసుకొని వెళ్లి చలన ఘాడతలని మార్చుకొంటూ ఇక చెప్పలేం …

సమయ నడకలని దాటుకొంటూ .. చలన ముంపుల దూరం లో పడి .. భయానిర్మిత గదులు..

మళ్ళీ చెబుతున్న అన్నాడు .. ఈ మొత్తం నగరంలో నాతో పాటు నడిచే అనేక అర్ధ ఆయుస్సు శరీరాలతో ఉడికిపోతూ.. సర్వ శక్తులని కలిపి  ఊగిన గుంజులాటలో పడి .. శరీర పూరక రుతు ముడులని కాల్చే రంగు పూతలు..

…………………………

తను మొదలు పెట్టిన మగ ధారణ .. చెప్పి దూరం జరగని విడి విడి నిద్రల జోరుతో కురిసి..

పురుషుడిని నేనెందుకు ఒప్పుకోవాలి ?  చెదిరిన గదులని శుభ్రం చేసుకోవాలా?

ఒప్పుకొనే ప్రత్యేకతలు ఏం మిగిలాయని… నాలోని భయాన్ని.. అణుకువని.. సహనాన్ని .. తృప్తిని.. చలనాన్ని.. శ్రద్దని .. వాంఛని.. నమ్మకాన్ని.. అర్పనని.. విశ్వాసాన్ని.. నువ్వెప్పుడో కన్వీనెంట్ గా చంపేశావ్..

ఇప్పుడిక వెనక్కి పోయి చూడడానికి ఏం మిగిలలేదు..

కాలిపోయిన నిద్ర దేహం నిండా .. నీ కోసం ఏ ఉలిక్కిపాట్లు.. ఏ కంగారూలు.. ఏ ఎదురుచూపులు  తల్చుకోలేదు.. అక్కడ ఇదేమీ చేర్చుకోదు..

అందరూ ఒకటే ఐనా .. నేనిలా డేటింగ్లు చేసుకొంటూ .. ఎంత మందిని మార్చి తిరిగినా.. నిన్ను  చూపించే అర్ధం మారడం లేదు. చేర్చి పెట్టుకొన్న నిండు కలతలు..

………………..

ఆ చెక్క ఇల్లు… సముద్రము.. నెమలి రెక్కలతో తేలియాడే నది.. పౌర్ణమి.. టీ మరుగుతున్న కెటెల్ .. సమ ప్లావ ఎత్తు పోతల్లో పడి తిరుగుతూ.. నేననే పురుష సంకీర్ణతని తలలో చుట్టుకొని.. నిద్ర ఊడ్చి పెట్టిన దుఃఖం తోడుకొంటా.. ఆ పురా పాటల దేహ రుజువుని కప్పి .. మరింత పైకి చేర్చి పెట్టిన సాపేక్ష రుణాలని తాగుతూ…

చెల్లిపోయిన పోలికలు.. కొలతలు.. లెక్కలు.. అదుపాజ్ఞలు.. పొగరులు.. పగలు.. జీర పట్టిన నవ్వులు.. నల్ల బారిన గోడల మధ్య ఇగిరిపోతున్న భద్ర రీతులు..

………………………

నేను నీకు కావాలా? నువ్వు నాకు కావాలా?

 కాదని ఉండిపోయిన … ప్రశ్నని జోడించుకొన్న చీకటి ముల్లు

హేలాస్థిత నిద్ర ఆర్తనలో గడుసుగా చుట్టిన దుప్పటి మాంసాలు.. మెరుగులు

చరణ నిద్రలు కాల్చే .. రుణ విపత్తులని కూల్చి.. అట్టడుగున తట్టి లేపిన నజ్జు గొంతులతో ..

 అదే చీకటి సంభాళించిన మృత్యుధార కాల్చిన చోటులోంచే.. మళ్ళీ పుట్టి లేవదీసుకొన్న

 మంథన మూర్తులతో తేడాగా ఉండిపోయిన మగ ధారణ … ఆదితామితం…

కొంచెం కబురుని వదిలి .. ఇల్లుని ఒంటి మీద వదిలిపెట్టి .. అప్పగించిన నిద్ర తమలతో ..

ఎదురుపడి తప్పుకుపోయే చిరాకుతో.. రాత్రి కాలిన మట్టి దోపుల కొండల్లో పడి..

 అమాంతం కిందికి దొర్లి.. చిట్లిన గొంతులోంచి.. జీర ముంపునీ బోర్లాపెట్టి …

.హద్దుని .. అమరికలని .. అందుబాటులో కదిపినా .. కుదిపేసి ఉండిపోయిన చావు పుటకలు..  

శ్వాసని మూయవు.. ఒక దారినీ చెప్పావు.. ఆ మంటనీ ఆర్పవు.

                                                                    ……………………….

11 . కలలోని బాలింత .. కథ చదివిన శత్రువు .. రెండు గుడారాల క్షేత్రం

కలలోని బాలింత .. బొడ్డు తాడులు.. ఆవలింత పట్టేసిన శరీర ఆగలింతలో .. కనబడుతూనే

లోపలికి జరగాలని .. గుక్కపెట్టి.. నిస్తార క్షేత్ర నిర్జన వశీయంలో పడి ఓడిపోతూ..

ఇల్లు .. బోసిగా బొమ్మలని చిదిమి.. నిమారింపు.. ఆవిరి ముళ్ళు.. చెదిరిన   నుదుర్లు..

అనుకోని దగ్గరకొచ్చే లోపు .. అవతలికి తరిమిన.. ఆనవాళ్లు కనిపించవు..

 కలబడి వంట చేసిన రాత్రుల నొప్పి.. దీర్ఘ నిశీవతంలోని మాటని తీసుకొని బరువెక్కి .

. కాస్త సాయం కోసం వెనక్కి చూసినపుడు అర్ధమై పోయింది.. ఒంటరి గంజరింపు..

 మరేమి దొరకదని.. కొంచెం కాళ్ళని కుదిపి మెట్టెని సరి చేయబోతే ..

తన్నిందా? ఎందుకిలా వెనక్కి విరుచుకు పడ్డాను.. తన్నిందా? అర్ధం కాక ముందే కలత పడి..

 ఏదో వికారపు అననుకూల నిర్జన గోళంలో వేడుక కి తెర పడింది..

తాడు తెగిపోవడంగా ఏదీ ఉండదు.. వాడికంత వెయిటేజీ లేదు.. మనమేం చెప్పక్కర్లా..

                    పోతాడో.. ఉంటాడో.. వాడి చావు వాడు చస్తాడంతే … ఇంకేం కుదరదు..

…………………………

కథ చదివిన శత్రువు విని ఊరుకోడు .. అటు ఇటూ జరగడు.. కొంచెం నేర్చుకొని…

 రెండు గుడారాల క్షేత్రం కన్నుగప్పి .. చేదోడు లేని మహా నదన వేళ్ళాడే ..

 అక్కడి సమూహంలో స్త్రీలు కత్తి దూస్తున్నారు.

 ఇది నా ముఖం.. రెండో సమన్వయగా ఉందని అతుకుల బొంత.. కళ్లాయార …

ధ్వనీ .. దాని అరక్ష సముదార పట్టిన .. సాదిల్లిన గుండపు నిద్రలో నిర్జన తంపకాలు..

నిశ్వాస బిగీషని కుదిపి .. కలిపి.. నులిమి.. పేనుతూ.. పెద్ద నోరుల నల్ల జిగురు తీర్చుకొని..

                                అలిమిన నిద్ర తీర్దాల్లో అలికిడి .. శకున మంటలని తోడి.. రాల్చుకొని..

ఒంటి నిండా ఖాళీ గదుల బరువుతో దొరకని నిద్ర..

కన్నుకి ధార పట్టినపుడు .. ఏక దివ్యమాల నీటి కత్తులు మోగే ఒడ్డులో రంగు తీసిన రధం..

……………….

గట్టు తెగిన ఖనిజ నవ్వు..,ఎవరో కెలికి పోయారు..

విడి విడి జబ్బులు..గర్జించిన దోష సాధిత..ఏకైక రెప్పపాటులో .. కన్ను నులిమిన కెరటాల పక్కాగా .

 అటు చేరుకొన్న నిద్ర మండలాల గుర్తుగా .. మట్టి గుడి.. సాధ్య నిద్రల్లో నది..

ఖాళీగా నింపిన శరీర నిధులు.. ఇంకేం ఉంచుకోలేదు.. అనుకోనూ లేదు..

మూర్చనల దీప మోపురం.. శరీర ఖేలనం .. అది అక్కడా అలాగే ఉంది.

అక్కడిక హామీలు .. భరోసాలు పనిచేయవని..నిద్ర దర్శన కల మండుతూ ..

 విపరీత దర్శన భూమిలో కనబడే శరీర తనిఖీలు తగలబడి..

ఇంకోలాలేని దేహనిందని వడపోసుకొన్నాయని.. ఆగి సాయం మర్చాయని  …

…………………….

సరళ స్వధాయతో .. దయ గాలించినా కనపడని .. వినడానికిలేని వెక్కిళ్లు మధ్య .. కలబడి ..  

 హటాత్హుగా తెగే నిద్ర ఊలలు .. ఇక్కడే కాస్త నిండి.. ఖాళీ కలని దులిపి…

చప్పిరించన చీకటి నెలల రవ్వళింత .. పోయి పోయి చేరుకొన్న దీర్ఘ రసాయన ముడుపు..

వాళ్ళు ఎదురుపడ్డప్పుడు .. ఎవరో నాటకం రాసి .. స్నాన రేవుల్లో .. ఒంటి దీపంతో మరిగిన

                    నిద్రనే కోసి.. కలలని విసిరి .. తిరిగి కుట్టి.. జోకొట్టి వెళ్ళిపోతారు.

సాక్షి లేడు .. మరీ తెల్సుకొని రాడు .. తెలుసుకోవాలని అనుకోడు..

ఇదేమీ నిర్దయ కాదు.. పరిస్కారమని మోగే జత ముడుపుల బరువుతో కూలిన ఇంటి ముందు

 ఏడుస్తూ .. ఎవరికో చెప్పాలని చూస్తారు.. పుట్టుకని వెళ్లగొట్టి…

విని ఊరుకోవడానికి మేమూ పడుతున్నానంగా ? అంటారెవరో..

………………………….

ఆనంద కల్వంలో .. దేహ నిమోర్ణ గాలింపుని దాటి .. ఎక్కడికో చేరి అక్కడే ఉండిపోక..

సమ్మోహాల ఎత్తుగడ .. చేతయా రాజీయాలు లేని గది.. ఇంకాస్త ఒంటరిగా మసలుతూ..

రంగుల చేతనా తీవ్రంలో ఒంటరి చెట్టు విదిల్చిన దేహం ..

దుప్పటి పొడుగుల్లో తుళ్ళింతల నగుబాటు.. తొందరగా గడ్డ కట్టి.. నిండీ నిండక ..

ఇంకొక చెక్ .. డబల్ చెక్ లో భాగంగా .. ఉందనే శరీరం పోగొట్టుకొని..

 ఇక్కడొక మొండి నిద్రగా కాపుగాచి… చేతన నిందని వెలిగించి .. కూలబడుతూ..

వర్ణ క్రియగా లేని.. ఈ దేహ విభజనని తానొప్పుకోలేదని … తప్పుకోవాలని చూసానని…

చీకటి గదిలో ఒక్కడే తిరుగుతూ చెప్పుకొంటాడు.

…………………………………

12 . ఆమ్ల రుణాల కూర్పు .. తలలోని వాన కొంగు .. శరీర పొందుల తొక్కిడి

తెల్లారిన వాన తలలు..వచ్చి చేరుకొన్న నిద్ర తీరికలేని గాలించి.. ఇక తను ఎటూ రాదని అర్ధమయ్యాక … ఆమ్ల రుణాల కూర్పు… ఎండిపోయిన రుణాల దేహ దొంతర కలబడి.. ఊరిపోతూ

గానుగ ఎండలు.. రోజూ అదే నిర్జనల వడపోత .. తరుముకొచ్చే కోతలు.. అక్కడికక్కడే కందిపోయిన చావు ఎరలు.. కడగాటలు .. పొంచిన కాళ్లతో.. మీద పడి రక్కి.. అంతలోనే ఎవరికీ దొరకక

కంపించి .. చేతులని పట్టుకొని.. ఈ రోజుకి ఉండిపోవచ్చుగా ? అంటే .. తూలనాడుతూ.. నిమురుతూ..

 యుద్ధ ఎత్తుగడలు.. మంథన చర్యలు .. క్రియా శాలలు .. దేహ పడకలు .. లోపలి నీరు..

ఊపిరిని ఎవరో లాగేసినట్లు .. అలిసిన దేహ తోరణాల మధ్య బోసిగా ఉండిపోయిన ఇల్లు..

నీరు పట్టినా చీకటి.. మగ్గిన వాసన.. పాడై పోయినా బట్టలు.. బయటకి ఎలా వెళ్ళాలి..?

………………………………….

నిశ్చల చిత్ర వాకిలిని తుడిచి.. గంటని స్తంభం నుంచి కోసి.. పడవని పిల్చాక …

 తలలోని వాన కొంగుని తడుపుకొని .. నాకు మరో దేహమే లేదని ఎంత నమ్మించిన వినక ..

 గసురుతూ.. నెడుతూ.. గుద్దుతూ.. వగరుస్తూ .. కలబడుతూ.. నెపమేస్తూ…

ఆ గది లోంచి .. అన్నీ మొహమాటాలు వదిలేసి.. వెళ్ళిపోయినా పుట్టుక.. సజాయ

నిరాల్య భూమి పొంతనాలు ఉబుసుపోక .. నిర్మాణ ముద్రాలని పల్చన చేసి…

కదిలే చావు స్థావరం లో .. ఉండిపోయి.. ఎంత చెప్పిన వినక… ఎగసిన నొప్పి..

నాలోకి నేను .. మంత్రించిన గాలిని పోసి.. సీసాలు  విసిరి .. కలతలోకి చూస్తే

………………………………..

రక్త విలాస పండుతూ.. నేరం ఒప్పుకొని మొదల్లయ్యే శిధిల ప్రయాణనాన్ని తను ఒప్పుకోదు..

అంతా చిక్క బడుతుంది.. మరి ప్రవహించడానికి లేదని నది ఏడుస్తున్న .. తన సీసాని వదలక కోపంగా చూసి.. నన్ను అట్టే కెలకొద్దు.. కెంపు దీపం వెలిగిన కన్ను.. చీదర గొంతుతో..

నన్ను disturb  చేసి పక్క మీదకి  పిల్చేంత సీన్ నీకు లేదు.. ఎప్పటికీ ఇవ్వను.

అతని బయటకి రాలేదు.. మంత్రించి పెట్టుకొన్న నిద్రలా ఊరేగి .. కరిగి..

ఎగబడి నిద్ర తీరికల మధ్యలో .. అదే భయంతో మోసిన శరీరం.. నిషూజ మాలిన్య…

ఊపిరికి పట్టిన బంక ఎంత లాగినా వదలక.. గుర్తుకొస్తూ.. బీజవర్ధని..

దేహ తారీఖులు మారిపోయిన .. దిన పలం అర్ధం కాక పోయినా .. మృత్యు సంధి సాగుతూ..

చేరీ .. చేరక .. రాజీలు లేవు.. చివరి మాటలు దొరకవు.. ఆగి నిదానించడమూ లేదు.

ఆ రాత్రి మరేం చెప్పలేదు.. రేపు ఏంటని ఊహించ లేదు..

దేహ ఊళన లోకి ఎత్తి పోసిన గంటల రేవు..

నిరాకరణని తీసుకొని ఇల్లుతో కృంగిపోయాడు.. వెళ్లాల్సిన దారి నిండా పేర్చిన తలుపుల గుట్టలు..

 మాట పడిపోయిన కిటికీలతో ఒజ్జు పెట్టిన భయ అంటుకోతలు..

…………………………………..

నే వెళ్తే తిరిగొస్తానో .. లేదో నాకే  తెలియదు.. మళ్ళీ పిల్లల జంజాటం ఎందుకు?

మానమది justify చెయ్యలేం .. as a  జర్నలిస్ట్ .. నేనీ మైనింగ్ రాకెట్ ని బ్రేక్ చెయ్యాల్సిందే ..

 ఇప్పుడే లీడ్ దొరికింది.. చావుకి ఎదురొడ్డి .. ఎన్నో ఏళ్ళ నా కష్టం…

ఎవరో ఆపై నుంచి చూసి నిష్ఠుర శాపం వదిలినట్లు..

candle లైట్ డిన్నర్లు .. ఊరి చివరి రెస్టవురంట్లో నైట్ స్టే.. గోవా ట్రిప్ ..  ఇవేవీ ఎలాగూ లేవు..

ఒక పూర్తి రాత్రయినా దాచుకొందామని??? నేనే   సర్వమై నిండిపోదామని..  ..

దిశా ఋణం తెలియని అసహన గుర్తు.. వెళ్లిపోతున్నా ప్రాణ శీతల గట్టు తెగి..

అన్యయ స్థితికి అంటుపోసిన దహన రీవంలో కలబడి.. తీరికలేక .. అలసత మిగిల్చి..

ఇంకాస్త చోటులేని నిర్యాణ గచ్ఛేరని నింపుకొంటారు.. సర్దుకొంటారు..

ఏక దిశా లేని అవ్యయా కనికరం ఒరిగి .. నేననే సంతర్ప సంధి .. కనపడని పెద్ద తలుపు

మృత్యువుని కాన్వాస్ పై చూపిస్తుంది.. నిజమదే కదా? అని.. మాటి మాటికీ అనుకొన్నాడు..

ఆమె  బాల్కనీ  లోంచి నేరుగా దిగి .. మార్కెట్లోకి వెళ్లిపోయింది..

………………………………..

13 . మృత సన్నితాలు .. నెల కథల జాగారం.. ఉండీ లేని మూడో చీకటి తేదీ

నలుగురిని గగ్గరించిన దిశా ఋణం ఆ దూరంలో కప్పుకొంది.. ఆసట లేదు.

.నేనదే పోగొట్టుకోలేదు..  మృత సన్నితాలు  .. తృప్తిని మోస్తూ.. రెండో వానని పట్టుకొని…

ఇంకిపోయిన నిరాశని దాటి.. పెద్ద నిద్రల ఋణం తప్పించి..

 ఏక దిశగా మోగుతూ … సంధి చేసుకొన్న నిద్ర ధూపాలతో పండిన చర్యలని సరిచేస్తూ..  

దూరంలో ఆగిపోయాక .. నిలవాలని ఖాళీ చేసే సంతూర్ణ కలవడిని దగ్గర చేసి..

 కృతక గోడల ఇంటిలో … సంతూర్ణ … తమలోతాల నిద్ర చర్యల.. కదిలే రంగు మాత్రలతో.

కలిగించిన శరీర కలత.. నిరాపలం కప్పుకున్న దేహ భాషణలు ..

సంపర్గ దేహ చిత్రణ కదిలి ఆరిపోతూ.. విరిచేసిన నడకలని పట్టి .. ముఖాల పోత…

………………..

నెల కథల జాగారం .. తాను ఒప్పుకోలేదని తెలుస్తూనే ఉంది..

ఛాయా మైత్రీయంలో కదిల్చిన రాళ్లనే జోడించి.. విడదీసి.. కన్నుకి పట్టించి..

సాధారణ నిద్ర కలతల్లో .. రక్షల్లో.. కలతని కుదిపిన శరీర ఆందోళనలు..

డే-రైల్డ్ మెటబాలిజం.. వెయిట్ తగ్గడం కష్టం.. క్రాస్ డైట్ కోర్సెస్ కి డాక్టర్ ఒప్పుకోవడం లేదు..

 Heart issues suppressed గా ఉన్నాయి కాస్త popup  అవ్వచ్చు అన్నాడు..

పోన్లే ,, నీ ఫంక్షన్స్ నేను అటెండ్ అవ్వనులే..

నాకు ముందే తెలిస్తే .. అప్పుడే చెప్పేవాడిని కదా? అలా కాగానే కదా?

……………………….

 సమ సాధారణంలో ఉండిపోయిన దిగులు నిద్రని బరువుగా లాగుతూ..

 సరి చెయ్యని గొడవలకి   సంధి చెయ్యని నిరూప సన్నని మూర్తులతో..

 తడబాటు లేని సగంగా చెలరేగి నగరం .. అండ లేకపోయినా చీకటి సలసలలు

చీకటి బరువెక్కిన విలాస మైపానంలో పొర్లుతూ.. తడిమి .. తడుముతూనే..

నిడివి లేని భ్రమణ గోళ రక్షని కాపాడుకొనే శ్వాస బిళాలు .. అవే అక్కడ ఉన్నాయి..

ఏకత సంపేయంగా ఉండిపోయిన నీటి ప్రదక్షణ.. ఇల్లు దొరకనే లేదు.

మంద్రతల నిప్పుని ఊదిన భాగాహార నిప్పుల కొలిమి.. ఊది రెచ్చగొడుతూ …

దుఃఖం తెలిసినప్పుడు .. దేహ సాధ్యం కలిపి చుట్టుకొన్న పై గదిలో ..

 ఇంకా నిందని నీళ్ల కుందని అమర్చారు.. కుదిపి పరీక్షాసకి పెట్టారు.

……………………………….

 సాధ్య నిరూపనలతో.. ఇంచుమించు .. చీకటి చలన ధూపంతో కడిగిన కంటిని రాల్చుతూ..

అక్కడేదో .. జాగ్రత్తని చెప్పి తలుపు తీస్తుంది.

 ఏదో శత్రు జాడని పీల్చిన నడక.. కొంచెం గలాట.. తొందరపాటు

తేడాగా ఉండిపోయిన నీటి అవస్థలో పడి.. అక్కడనే ఆగి వెనక్కి చూసుకొన్న నది..

తనింక వద్దనుకొంది.. ఎవరూ రారని నమ్ముకొంటూ ఉంది..

అప్పగింతలు లేవు.. చర్యలు నిద్రని గడ్డకట్టించవు.. అనుమాన ఆవిర్లు చెదురుతూ…

మొదలవ్వని దేహ ఊలంలో పగ తుడిచినా ముఖాలు లేని చీకటికి. అవతలి ఉంటూ..

అన్య సత్తువలాకి శరీర మిచ్చిన నంజారు నడకలు.. రేలాయ…

……………………………….

చలన మూర్తిని అక్కడే ఉంచి.. నిస్సత్తు ముంపుల రాత్రంలో .. కూర్చి పెట్టుకొన్న నదులనే …

దీపంలోకి ఒంపారు.. శరీరం కట్టారు.. మాంస నిద్రని ఉడకబెట్టారు.

నీరు చల్లినా .. నిప్పు ముట్టిన .. కన్ను చిట్లిన .. గొంతు మోసినా ..

నిర్ణయాల మధ్యనే తాను ఎప్పటికీ మోయలేని మెట్లు.. అగచాట్లు.. తిట్లు..

మృత్యువుకి సరిపోక పడవల దిగులుని ఎక్కించి నిమురుతూ..

విశ్వ దుప్పటిని పరుచుకొని.. నిండు ఇంటిని కలగా దాటించి .. నదిని దారి తప్పించిన.. రప్పించిన…

 దీవులతో …  పోత పోసుకున్న స్మర తీరికలతో కలిపినా రంగు గంటల కైపుని పట్టించి.. పడవ..

పాకిపోయిన శరీరాల కెంపుని నానబెట్టి … నిద్ర విడిచిన శిలలని చెక్కుతూ ..

 దీర్ఘ చక్రాల నిడివిని తిప్పుతూ .. తను ఓ శరీర మిధ్యని ఉడకబెడుతూ ..

 తీరికగా నిద్రపోతుంది. … అలవాటు లేని ఇంటిని పట్టుకొని లోపలికి చూస్తూంది….

మగ శాసనాలని పట్టుకొన్న నెంపిక లేని అసహన తీరికలపై.. వచ్చి ..వెళ్ళిపోతారు.

……………………………

                                                    4th CHAPTER   

(Back ground ; ఆర్ధికంగా చితికి .. విపత్తుని హేండిల్ చెయ్యడానికి దగ్గర దారులు .. దాడులూ.. హత్యలూ.. శృతిలేని భయాలు.. మానసిక రోగాలు  )  

          రోగి దేహ పత్రమూ … తాకీ తాకని నిరూపాలు..

సమయదేహం ధరించిన త్రిదశని అద్దిన … నాలుగు గంటలుగా ఉండిపోయిన పగటిని నింపి..

 గంటల మధ్య ఖాళీల్లో .. రోగీ దేహ పత్రమూ నిండుతూ.. కదిలే చీకటి అలలని పట్టి లాగుతూ ..

శరీర జారణలేని అనుకరణలో .. అసలు పునాది దొరకక … అల్లాడుతున్న ..

నిద్రపూతలని ఆనవాళ్లు లేకుండా కప్పి ఆటు నించే .. తప్పించి.. వీధి గుమ్మంలోంచి… ఏం తెలియనట్లు…

లోనికి వచ్చాక .. అద్దంలో దాచి పెట్టినదంతా బయటపడితే.. అది పగల గొట్టే లోపు..

తాకీ తాకని నిరూపాలు…సమన సమయ అనిర్వాయ వేరుపాటులు..

 దేహ ద్రవాల్లో పడి కొట్టుకుపోయిన అనవరత సత్తువుల ఘటనని పోగొట్టుకొని.. ఉండిపోయి .. పైకీ -కిందికీ మార్చుకున్న పగటి దేహాలని కప్పేస్తూ .. ఉత్తర గోళంలో …

నిద్ర మాసిన కదలికల్ని చల్లారబెట్టారు… చావుని పండిస్తున్నారు.

తను ..   రోగి దేహ పత్రమూ .. సరి చెయ్యని మరణ ఉవాచని వదిలిపెట్టి.. శరీర ఖనిజాలతో

 పోతపోసిన స్త్రీ నిద్రని జార్చిన కథనాలతో వింటూ ..పథకాల్ని దాచిపోయారు.

…………………………..

అతీ గతీ లేని శరీర చాయని పట్టి లాగుతూ..విశ్వ అనిస్టా ధ్వనిని వడపోసి.. చెదరగొట్టి …

 బెదిరిన ఇంటిలో .. పునాది గతి దొరకని నిష్ఠూరం రాశిని కలిపి .. కుదిపి.. అరిచి .. అదిలించి ..

 పెకిలించి పెట్టిన … దుమార దర్శనాలతో తలుపులని ఊడదీసి .. ముఖాలని సవరించి నరుకుతూ…

శరీరాల మూర్త ధ్వనిలో రాలే కథని విని.. ఆ రేవుని దాటి .. కథలు ఊరించిన… గాలిలో నిలబెట్టినా…

 దేహ ద్రవ గొంతుని మూయించి.. అక్కడే ఉండిపోయిన నిద్ర పోత విగ్రహాల బిగువుని చెక్కి. నిగవుని రాసి..

ఏది ఎవరికీ చెందక చూసుకొంటూ .. పరిధి రంగులు మార్చి.. ఏమార్చిన నిద్ర సొరుగుల్లో కాళ్ళు.

దాచలేం.. ఉంచలేం.. కదపలేము.. చూడకుండా ఉండనూ లేం.. ఆక్రమించలేం..

 అనుభవమిదేనని అనుకోనూ లేం.. వాళ్ళకీ .. వీళ్లకీ .. చెప్పుకొని తిరగలేం..

 నీలోకి పంచుకొన్నాను. నీతోనే కలుపుకొన్నాను.. నిన్నే జోడించుకొన్నాను. నిన్నేనని మోసుకొన్నాను

ఇంకొక వివర్శ వానల్లో ఇరుక్కొన్న నిద్రలతో తలపడే ఉండిపోయిన పగటి అంపకాల చుట్టూ …

                        చేర్చి జోడించిన తలుపులతో నిండిపోయిన గంటలని చేర్చి పెట్టారు.

సామ్య విరూప అతుకులతో చీకటిని నమిలిన అసహన ఇంటిని తవ్వి ..గదిని నిర్మించి.. 

అటు కొండపై నడకని చేర్చారు.. ఇంకేం అనుకోలేదు. అలాగని .. ఆగిపోతామని తెలుసుకోలేదు

…………………….

తనకి తెలియదని మతి నిద్రని దిద్దిన కుంకుమ రేవులో ముఖాలన్ని ఆరబెట్టారు.

నా దేహ పరిరక్షని నేనే చేసుకోగలను.. దానికి నీ నుంచే నాకు చేరాల్సిందేమీ లేదు..

 నువ్వు నా పరిరక్ష ముద్రలని కాపుకాసి .. చిమ్మిన భయం పైన అవసవః రుద్దనగా కనబడాలని..

ఉండిపోవడం…  ఇంతలోనే ఆగిపోతుంది… సాధ్య అయత్న దేహాతీరులు .. గొడవలు..అంచనాలు .

 పొడుగు పెరిగిన సణుగుడులో దేహ ధరింపులు.. ఆవర్తనాలు.. కందిన రాతలు..

 భయం కమ్మిన నేల వాలుల్లో .. నెలలు నిండిన దేహ తీర్ధం పండుతుంది.

ఇది మరోసారి ఇలాగే కలుపుకోగలనని నేను ఎక్కడా వివరం ఇచ్చుకోలేదు. 

ఇంకో సమయ అవధి కలిపినా వీలుకాని .. దేహ తీపిని పీల్చి .. ఆ దూరంలో నిలబడ్డాం.

………………….

అసమ గతిని ముఖాల్లోకి నింపిన దృష్టి చలన నిడువులో పడి కొట్టుకొనే దేహమై..

 ఒక శరీరమూ.. కొన్ని దూర మలినాలని తాగి తప్పిపోయాక నేను సంధి పాత్రత లేని ఓర్పుకి

మోయాలని  శాసిస్తూంది. కదలికనే అందించలేని ముఖాల్లో ఓగూర్పు.. తల నిండుతనం.

ఈ రోజుని గడపటం మించి .. చావే రెండో దర్శన నిగ్రహాల ఖనిజ ముద్రని మింగి .

 దూరంలో ఆగిపోయింది. చెల్లాచెదురయ్యాము. అటు ఇటు కాక గింజుకొన్నాం.

మాటా మంతీ కప్పుకొన్నాం.. రంగూ పొంగూ మాసిపోయింది. నీరు నిప్పూ బూడిద అయ్యింది

సడీ చప్పుడు లేని అవస్థలతో కూడిన ఉప్పుని నిమేష రాత్రంలో తోడుకుపోయిన

స్మర మడుగులు… కలవరపాట్లు.. గతి మంతనాలు.. జతి అవపోశన మంద నడకలు

……………………..

                           1.   శ్వాస రాలు సమయం .. విరాగ నింపుణి

అదే వరుసని సరి చేసే మహా వ్యూహ సంశోరణ … ఉందీ-లేకపోయిన దేహ పగలు

              అలిమిన చెట్ల తోపుల్లో గాలి చుట్టుకొన్న కొండ హోరు..  శ్వాస రాలు సమయం

యధా మైకరణ పట్టుకొన్న ఛాయాభూమిలో తిరిగే పట్టు గోడలు.. ఉరి గుండాల  విరాగ నింపుణి

                       గతి సంభార చేయించుకున్న దీప ధృవంలోని యజ్ఞ కలత..రరోర కణత 

మృత్యువు సర్దిపోయిన వాన పూర్ణాలు గుప్పిన వెలుగు.. అక్కడ తనలాగా ఏదీ లేదు.

అన్నీ గడిచి పోయిన రంగుల మధ్య నిరాశ ధ్వనుల పొందిక .. చేర్చి చూపించాకా..

                         విడిపోవడాలనే యదార్ధ మకిలిని శుభ్రం చేసి..పురా నిబ్బరాల గడువు…

జ్వర తోపుల్లో నీలి గంట .. ఆమ్లదుఃఖి గా నిలబడి …. తలపడే దేహ ఖనిజం

                                                                  …………….

 ఆయాస అప్పగింతని గడువులోకి ముంచినపుడు .. పురుష ఎంగిలి హద్దుని  నాన్చుతూ  ..

                కనబడి.. వినబడి .. విరాగ నింపుణి .. దేహపు సంపెగలు కళ్ళలోంచి రాలుతూ ..

కాళ్ళ కింద నలిగే ఎండిన అకుల మధ్య పండిన మట్టి దోసిలిలో కదిలే నిద్ర ఊర్పులు

               కథన ఉత్తర దీపపు భస్మ మోక్షంతో .. కూలిన చెట్లని చూస్తూ … సమ ఆమన స్థితి

పుట్టుకని చేర్చి పెట్టుకున్న వృత్త చలన శపించి వెళ్ళాక .. సాధ్యయ మంత్ర తోపుల్లో అతను.

            చెల్లిపోయిన ఇరుకు కోపాలు .. రంగుల పొడి అద్దిన కన్నుని కలుపుతూ …గహన సేరు

విశ్వాస సంధిని వదిలి నింపుకున్న పరిధిని  కాల్చి .. దేహనీరుని పట్టి నింపుకున్న చీకటి..

                కన్ను బావురుమన్న దుఃఖంలో ఊగుతూ .. స్మర మళ్ళింత తోవ చేరిన ఒడి

కూలిన విశ్వ తమమా తీవ్రాల్లో అంటుకు పోయిన నడకని సర్ది పెట్టి … శిధిల వాన

                 శరీర గాలులు కందిన మంచు కొండలని లోపల సర్దుకొని .. చీకటిని  తుడిచారు.

పొడవు తీర్ధాల జాతర మట్టి తో నిండి. .. నదిలో బోలు పడవ

                                                     ………………….

అప్పగించిన వాన ఎటూ కూలిపోదు.. సమయ కక్ష్యలో చితి కాలిన దూరంలో కౌగిలి…

                            ఋణం ఎలా తీర్చుకొన్న .. మస్మయ బరువు వాగుల్లో కొట్టుకొని..

వెచ్చని జడి వానలో నిందలని వడపోసుకొన్నమకిలి… కాశీ తోవల తొలి కునుకు .

 కాష్ఠ వినోమయ దేహ జాతరలో కళ్ళు పొదిగిన శిల్పాల జడి .. మంత్ర సేవన కలశం

                            మండి రాలిన వీధి హారతి .. చావు దీవించిన మాంస ఆవిరి గట్టు.

బూడిద రాలుతున్న పడవలో … తలపై కురిసిన పసుపు అక్షింతల వాన దొంతర

                            తూపు మసిని తుడిచిన అద్దం.. ఆ గది దేహమై .. వణుకుతుంది.

                            చలన నిశ్వకి  పరుచుకున్న ఆఖరి నిద్ర కాళ్ళని తడుపుతుంది.

ఇల్లు .. మంగళ ధ్వనిలో చేర్చి పెట్టుకొన్న అహంగ పొలికేక .. కాఫీ జాడీలు .. చల్లని

                          ఊరి నలతలని కట్టు తెంచినప్పటి నిర్జీవ శరీర జాడల తోపులు

పింగాణీ నవ్వుని కడిగిన చీకటి గుడిలో దేవుడి అక్షింతల వాన .. తలకిందుల తపస్సు

                            మాటు మునిగిన పాట వైఖరి .. మెత్తని లోయలోకి తప్పుకొంది.

తేయాకు గంధం రాలిన పరిమళ ఊపిరి ఎగసి .. చుట్టుకు పోయిన పుప్పొడి మెట్లు..

 వర్ణ వానల నెమిలికన్ను…. పండుతూ.. గది తోసుకొన్న నిరూపజాల నిర్ణతి

                                                           …………………

జ్వరపడ్డ వాన పోగులు.. కంట్లో నింపిన శరీర పొగలు.. విరిగిన నిద్రరేవులో దూరం జరిగిన కల

                             తాను ముందే ఉన్నాడు.. నల్ల పౌర్ణమి విడిచిన మాంసాల సంచీలా …

ఎదగడం .. కొత్త అర్ధంతో తోసుకు వచ్చిన కథలు తడిచిన బెంగల చలి ముంపు ..

                              నెమలి పింఛాల కొండలోంచి వాన పుట్టినపుడు ..దుఃఖ పాదులు..

మాట సరిచెయ్యని గాలి మంటపాల సాయంత్ర రశ్మి .. వానని పొదువుకొని .. ఆ పురుషుడిని..

                              ఇక వదలక .. నిన్ను వెలివేసాను .. చూడకుండా .. పో .. అంటుంది.

వికార అయస్కాంత సత్తువల జోడింపులో .. నా శరీరమొక ఉక్కు ముక్కల పోత ..

                              వాన బైలాల సరామరిలో .. లోతట్టు ద్రవనముఖి వేలాడిన చితి గుమ్మం

మృతజీర తో నిద్ర వాలని ఇంటి గొడుగు .. చితిసార పంచుకొని కదులుతూ….

                                                    ……………………………..

ఏదో పట్టుకోవాలి.. అది .. ఇదేనని అర్ధం కాదు.. అరుపూ విననే వినదు.

గది .. గది లోనూ పడవలని   చేర్చిన దేహ విలుకాడి లక్ష్యత చావు కాదు.

ఇదొక ప్రమాణం. నిన్ను ఇక కలవనని చెప్పుకోవడం.. పైన కప్పుకున్న బట్ట కూడా ..

         పెదాల సంసర్గ మితిని సర్దుకోక ముందే .. వాడిని వదిలేసి చేరుకొంటూ …

ఆ పాత కొండల మధ్యనే .. కొత్త బాటల వాన గుడిని చేర్చుకొని మొదలైన కంటి నీరు

           సెగ దట్టించిన శ్వాస పేటికలో తను కర్మ నిద్రని మోసే దయాళు..ఉపరి ఝాము

ఆర్తన ఛాయా గుంబింపులో నిల్చిన సమయ దేహమై మరో కక్ష్యలో తను

            ఏది అక్కడ చెప్పుకొని ఆగిపోయేది కాదు.. మళ్ళీ కదిలి వెళ్తూనే …

                                                     ……………………………………………..

                   2. సహపార్ణ నిస్వాసీమ  .. ఆగని దుఃఖ నిధులు.. ఉత్తర గొడుగు

కథల వరుస చల్లారి పోయింది.. గర్భ సూత్రాలు జోడించుకొన్న … అల్లాడిన మడుగులో..

                         ఆగినా తలపట్టుకొన్న నిజరూప మంతనాల్లో జోడించిన పునాదులు..

నా గర్భ  స్థలాన్ని ఖాళీగా ఉంచాలనుకొంటున్నాను …అవును .. నువ్వు సరిగానే విన్నావు..

                        నేను ఈ సృష్టి గమనంలో విధించిన ఈ చర్యని ఒప్పుకోలేనంటున్నాను..

నేనిక నా యధాతదం లోనే .. మగ్గిన నా నిశ్వాసితా నెలల రీతిని వదిలిపెట్టి.. ఉత్తర గొడుగుని

                          కప్పి ఆచూకీ  లేని నా బాల్యపు తీర్ధ రథాలు.. తాడు లేని గాలి బొంగరాలు..

తిరుగుడు లేని కాలేజీ హాస్టల్లో రహస్య రికార్డులు .. పోతపోసిన చెక్క నడకలా .. నీటి పొగ

 ఈ ఎగుడు దిగుడు నడకలో తెగదెంపుల.. పొడి గోడల పగుళ్లుకి పట్టిన బూజుని ఊదుతూ

              శరీర వ్యూహం .. అందిపుచ్చుకొన్న విలాసమూర్తుల దేహ సవ్యత .. జరిగింది..

తెగిపోయిన ఉమ్మ నీటిలో .. ఇగిరి పోయిన నిందలని దుల్లగొట్టి .. చేరుకొనే విందుల కూర్పులు

               సజావుగా ఏదీ లేదు.. సహపార్ణ నిస్వాసీమ  .. కదిలీ వదలక .. తెంపి .. పూడ్చుకొని

సమయ బిళంలో రంగు మాంసాలు ఉడికి .. తెల్లని నిబ్బరాల అలికిడి .. కథా తళుకులు..

                  ఆగని దుఃఖ నిధులు .. నిలబెట్టినా కనుక్కోని ఖాళీ ఊరడింపుల అలసరి…

                                                ……………………….

అంతా ఒకప్పుడు .. ఎవరేం అనుకొంటారోనని.. వెనక చెవులేల కొరుక్కోకుంటారని..

                        నా కోసమేదో గొప్పగా అనుకోవాలని.. తాపత్రయాల కంటిజాడని ఊదుతూ …

కొన్ని మరకలు.. నెలలు.. బరువులు..ముసి మసి ..ముసి మసి … కలిపినా నిద్ర తోపులు..

                          పలకరించే మాంస జాడలు.. ముగ్గిన శరీర నిధుల నివ్వింపు దిగాలు.

నిరీశ దేహన మండలంలో .. కక్ష్యని చెలరేగించిన విపరీతాల్లో దిగబడ్డ.. నిస్వానిధులు

నాకది భయం.. ఆ బరువుని మొయ్యలేనని ఓ కుంగుబాటు.. నెల తెరువుల గరుకు

ఆ తర్వాత ఏం వస్తుందో? ..ఎలా మారుతుందో? .. ఎందుకు నేనే? .. అలాగే ఎందుకు ?

విపత్తు కదిలికలో సర్దుబాటు లేని నెలలు.. ధ్వని పచ్చిలోని లేబర్ రూమ్ చెవిలో …

                                                ……………………….

ఖాళీ స్మశాన వీధులు.. రంగు పోలని దాడిలో కదిలే మృత్యు దర్శన పునాదులు..

                   కల గణన పురుషుడు .. ఆ గది వరకే చాలు .. ఎందుకీ మోత బరువు అరుపులు..

లోపలనే తగలబడుతున్న దృష్టి గండాలు పోతపోసుకొన్న ఇల్లు .. కాసిన్ని మాటలు..

                   ఆ మూల బాల్కనీలో ఉన్నప్పుడు అడిగాడు… తడబడ కుండా వేలాడదీసాడు ..

అదొక కాట్లాట ..ముందుకి చాపి.. లోపల సర్దుకోక  ముందే పొడిచి .. ఎగిరి .. రేగి.. నలిపి..

                  కాలే గడ్డి బొమ్మలా కూలి.. మాటనైనా ఎంగిలి పడనీయక .. చెమట తడి కాకముందే 

 కనీసం గది వరకు కూడా వెళ్లనివ్వకుండా సోఫాలోనే.. గ్లాసు నీళ్ళైనా తాగనివ్వకుండా…

                 పెదాల నుంచి జారే కంటి సూత్రాల కౌగిలిలో పొడి బారిన ఆయాస కక్ష్యని తడిపి..

అదొక మంత్రస్పర్శని అందిస్తూ .. ఉబికిన దుఃఖం ఒడిసి పట్టిన దేహద్రవ

                  అనూహత పండిన .. నగర దీపం చేసుకున్న ఆత్మ హననా .. గర్భ రొద

                                                    …………………….

                  అతనేం చెప్పాడు.. మళ్ళీ కనబడనీ .. కాలర్ పట్టుకొని నిలదీస్తాను..

నెమళ్ళు కురుస్తున్న జలపాత వేడుక .. సరిలేని ఆపాత మట్టి కొండ పర్చిన పక్క …

              చలి గుహల్లోకి నెమ్మదిగా పాకుతున్న లావా.. కందిన జ్వర మాల గొంతులో దిగి ..

శరీర లాస్య ధారల సెగని పంచుకొని.. బరువెక్కిన పెదాల మధ్య ఆవిరి గుహలో నెలలకై పుట్టి.

                విశ్వాస గోళం.. గర్భ చిందుని మోగించే గజ్జెలు.. పరిమళగనిని బొడ్డులోంచి తాగి 

ఉబికిన కెరటాల నురుగుని సర్దినా .. కాళ్ళ నెంపుని కాచి రక్షించే మెలికలు తాయెత్తు..

                తాయిలపు చెమటని ఊదే తీపి నవ్వుల జంట కత్తెర .. చీకట్లో చప్పుడు చేస్తూ..

అలసి .. కలిసిన .. నీటి లోయలో మాంస చిలుముల ద్రోణుల్లో స్వయోమ్లా కలకలల హద్దు

              ఇదేదీ .. అదీ లేదు.. అతీ గతీ లేదు .. ఎక్కడా ఆగదు .. దేనినీ అడగదు..

నిమోగ్ధ విచ్ఛిత్తిలో కంటి తెరలు కట్టుకొని.. దేహ దూరంలో విప్పిన అసమాస కినుకలు..

              పూర్ణ ఆయుర్ధాయ ఆ వృత్త చర్యలు.. అవేవీ లేనప్పుడు .. నాకీ గర్భం వద్దేవద్దు.

                                                              …………..

ఉరిమి మీదపడ్డ నిశ్వాస పోటు గుద్దుకొన్న నిర్మానుష్య సమాధి .. నా లోపల నేనే చిక్కుకొన్న  

                            నా గర్భాల అద్దం .. ఇంకొక శరీర భాష్యం  నా లోపల అడుగంటింది.

ఇంకేం కావాలి ? ఇంతకన్నా .. నన్నీలానే ఉండనివ్వండి.. వెళ్ళిపోనివ్వండి.. ఇల్లు వదిలి..

                                                               ……………………………………..      

     3. సాయు రేగన వరుస .. ఎదురెదురు గదులు..దుప్పటి కోతలు

సాయు రేగన వరుస .. ఎదురెదురు గదులు..దుప్పటి కోతలు

     నేను నా లోపల నుంచి ఖాళీ కావాలనే ఆతృత .. సంక్షోభ దేహ రీతులని చెదరగొట్టి ..

 అటు ఇటు కాని .. అసహన మత్హులో దుమికి .. శరీర ముడిని చిదిమి .. కలనీ జోడించి.. కన్నుని దులిపి ..

 ఒక ఎర్రని వర్ణ ముంపులో తెల్లార్లు నలిగే ఎదురెదురు గదులు … మరభూమి కంతలు

కప్పుకున్న దేహ నిద్రలే ఉండి .. అడుగంటిన ఉనికిని సరిచేసి . సత్తర గాటు

కలబడే నిషిద్ధ కంటి ధారాలతో చిరిగినా మాటలు గుచ్చుకొని .. . గత్యంతర తాడనలు

హఠాత్తుగా .. నాలోపలికి అతను ఏడ్చి వెళ్ళిపోతాడు. పెద్ద గొయ్యి.. తిరగబడి..

పెద్దగా ఏ చప్పుడునీ వార్చ లేదు.. కథని కప్పుకోలేదు.దేహం మోసుకొలేదు.. 

తడబాటు లేని నిద్ర శిఖరం పై నుంచి.. కలనీ మోసిన చీకట్లో తప్పిపోయాక ..

ఇంకెవరూ ఆ చేతిని ఇవ్వలేదు.. ముఖాన్ని కరిగించలేదు..శ్వాస రీతిని కలపలేదు..

ఆపత్తు మింగిన పురుష సత్పరత మునిగిపోయిన గింగిరిత .. తోడులేని ఆరోక్ష.. దమింపు..

………………………………

పురుషులు వచ్చి.. వెళ్తూ .. ఉండొచ్చు .. కాని నువ్వు నాలోపల ఆగినవాడివిగా .. నీకెందుకు గుర్తుకు రాదు.

ఆ రాత్రి నన్ను నేను పూర్తిగా సర్దుకోలేదు..అర్ధవంతపు నిర్జన కౌగిలిని జోడిస్తూ .

 కంటి చూపుని మొత్తం ఇగరబెట్టిన అవిధేయ మృత్యువుని తనలో ఓలలాడించుకునే కళాకారుడు.

 ఎక్కడా ఆగేవాడు కాదు.. కలబడి మాట్లాడేవాడు కాదు. కన్ను దులిపి నవ్వేవాడు కాదు

వాడికి కావాల్సిన ఏ శూన్యం నాలో దొరికింది.. అది ఏ మాంస సందడితో కలిసి ఉందొ.. లేదో

శరీర దిగదుడుపులు ఉక్కిన మాంస నిద్ర .. కన్ను రాలగొట్టిన కేకలని నులుముతూ..

నాకు తెలియదు.. అదొక సాయు రేగన వరుస .. తీరులేని అలసత .. సమామ్య గసర 

 తడబాటు కమ్మిన చీకటి లేమి.. సవరింతలు లేని మృత్యు గర్జన పేనిన చీకటి నీరు

…………………………

 అదే  ఆలోచన లేని సమాధి విళన నైరాగ్యం … పునాది పురెక్కిన తత్తర ఊడలు

సగార విపలయంలోని చేదెక్కినా విడువని … నోటి నలతలు.. కసి ధారపాలు

అంగీకారము.. చెప్పుకోలేని సాధనతో చూపు నిలబడి దృవ దీప పొర్లింత

పురుష నిరాశని మోయలేని అనిరూప శ్వాస సర్గంలో నింపుకున్న చంచల సాయురీయ

తనని నేను … నాలోంచి వేరని ననుకోలేదు .. ఇప్పటికీ .. ఎలా దగ్గరో .. నాకదీ తెలియడం లేదు..

 నాకు ఏ శబ్ద విగ్రహాలు వద్దు .. ఏ సంక్లిష్ట అనుభవమూ కదిలించి తెలుసుకోలేని…

 ఒక ఆస్థితి.. నిన్ను ప్రేమించడమూ నాకిప్పుడే తెలుస్తూ ఉంది.. నా లోపల కదులుతూ .. కరుగుతూ.. ఉంది.

ఇది ఓకే చలనధార .. నాక్కొంచెం .. టైం కావాలి.. మీ ఇద్దరినీ ..

 వేర్వేరు పురుషులుగా విడదీసుకోవడానికి.. లేకపోయినా లేదు.. ఉంటే ఉంది.

. ఆపత్తు పులిమిన సాధన .. నిరూప దొంతిగా పేరుకొని పోయిన విశ్వపు అంచుల్లో .. సగం చేర్చిన ఇల్లు

సర్దుకొని జారిపోయిన కథనాల నిద్రనే వాళ్ళు పేర్చుకొన్నారు. తిరిగి తెచ్చుకున్నారు …  

పునః విశీల రుద్ధణ .. ఆగే ఉంది. విరుపు ఊలత కప్పిన చరణ వీధులు.. అనాహ జుంపీలు .. లుకలుకలు

తనకి తెల్సిన తన వాడుగానే ఉండక.. ఇలా ఎందుకు మారిపోతారో.. ద్వమోయ స్థితుల కంటి ఎర..

స్త్రీగా నాలోపల అడుగంటిన స్వానులోమన .. అరగదీసి నిరాశ .. జాడ లేని వికర్ష గోడు ..

తనని ఇంకెవరిరో పిలవ లేదు.. అతనికి ఆ గది గురించే తెలియదు.. నిశ్చల రోహణ

కొంత నాటకమూ.. కొంత మాయ .. కొంత వగరు తీసిన నవ్వు.. దోపుడు నొప్పి .. పురా దేహరుచి

గదిలో తెల్ల నెమలిని పూడ్చి.. డైనింగ్ హలో వేలాడ దీసిన చీరని తగలబెడతారు.

మహా మన్నన ఊగే శిఖర ముద్రలు .. విడిపోయి.. శ్వాస గుహలో .. అమిరిన మంట

………………………

నేను ఏ అపవాదుని నీలోకి పంచాలనుకోవడం లేదు.. ఆఘారుహ్య .. సత్వ ఉరుము..

ఇదొక కొత్త చర్యగానో .. నీకు తెలియని మత్తు గాధల అలికిడి రాతగానో ఉండిపోదు.

భయ శిక్షసి అభయ ధ్వనిని మింగి .. ఆరాలేని కొత్త రాతని దిద్దుకొంటుంది.

 శంఖ మంత్రాలు.. వేడుకలు.. నిర్ణయం లేని ఆర్జయ చాపాలు.. కొప్పు ముడులు..

సమయం ఎవరికీ ధ్యాస విలాసమితిని చెప్పి .. ఆ చివరలో అడ్డుకోదు.. కాశీ జడ..

ధూళి కావెడతో పండిన  భయరేణి …. పూర్ణ నిర్జన జరగని పురుష నివాళిలో తను గొంతుని సరిచేసుకొంది.

పురుషుడు మిగిలి లేడని .. వాడు గ్లాస్ బోర్లించబోతే తను వాడి చెంప పేలగొట్టింది.

అపసవ్య నిరాధార .. కొత్త పుట్టుక దొరకని సంశయాన స్మశాన నిద్రనే పేనుకొన్నారు.. a

స్వtనయా నిద్ర ధృతిని ఆర్పీ.. యజ్ఞ వాటికలో ఇంటిని ముంచేసి.. అక్కడికి దూకుతారు.

భయం చుట్టిన ఓ మహా నిర్యాణ ముంపునే దాటి .. ఇంకా పైపైకి పోవాలని..

                                                               ……………………………………..         

                         4.వర్కౌట్ కాదులే ..నాభీ గొంతుల దోషం.. నాలుగ్గోడల పెద్ద శిక్ష

ఆయుమ్ల గతీప నిమిషేయ .. తడవని ముడి నొప్పులు.. నాభీ గొంతుల దోషం.

. ఈ ఇంటిని ఇలాగే వదిలేసినా.. పోయిందేమీ లేదు.. నేనేలనూ ఈ స్క్రాప్ లో తిరిగే వాడినే..

తదేక నిస్సాధన శృతేయ మూర్తులు.. నీ గది .. అది ఎప్పటికీ నీదే .. కాదనే ఓపికా లేదు.

సదా సంధి మర్మంతో తగలబడి .. వలస నిరూప శరీరాల కినుకని జోడించి..

 ఇసుక రాల్చిన నడకలో పండుతూ.. హద్దుని మరిగించి నిద్రాణ కొలిమిని ఊది.. శ్వాస చల్లాక ..

ఆధ్య సలాప .. కొండ గుర్తులని వదిలేసి పోయిన ఇరుకు అపార్టుమెంట్లు.. చలి క్యాబిన్లు..

ఉండీ -లేకపోయిన మృత్యు కృతి నానిపోయినా .. గద్దింపులో .. నాతో పాటు లేవని తెల్సు..

ఉండాలని అనుకోలేదు.. ఇదంతా నాకెప్పుడూ .. మామూలే.. తెల్సి .. ఇప్పుడిప్పుడే ..

నిరంతర అవమానం.. కష్టం.. ఇల్లులు ఖాళీ చెయ్యడం.. మగత బీడులు..

సగ .. సగం .. వైద్యాలు.. కట్టలేని టెస్టులు.. ఇదంతా నాకు మామూలే.. వదలని నొప్పులే..

………………………..

భూమి కంచంలో పండని కరువు.. ఆవిరి సజ్జల్లో తప్పిన గురి.. మంటలు .. ఇవి పైకి తగలబడవు.

పులపర తలఒంపులు.. సాయస్సు లేని దేహ అజ్ఞాయ .. అదే కథనత 

ఉంచిపోయిన శాప నిద్ర మడత పెట్టిన ఊరింపులని పట్టించి .. కథలోకి

ఒంటరి నిద్ర మూర్తుల రోడ్డులో పడి .. తోసుకొస్తున్న శరీర బిగువులా తర్ఫీదుని దుల్లగొట్టి..

తను ఉంది.. ఉన్నచోటనే ఉంది .. అప్పుడు ఉన్నాప్పుడులా మాత్రం లేదు.. కానీ ఉంది.

సరి చెయ్యలేను.. నీరు దులపలేను.. నిప్పు ముట్టలేను.. పుటం పట్టలేను..

మందన రాల్పు మెట్లు దొరకని పెద్ద ఆరణాల నెలలు.. అదే పట్టిన గొంతు చీడల కలలు..

…………………………..

 అది ఎంత చూసిన .. బతిమాలినా వర్కౌట్ కాదులే .. అలా చెప్పిందే చెప్పి .. సన్నని గొంతుతో

                  తెగని ఆశతో చూసి.. సీసాలోకి పొగలా మారి దూరిపోతాడు.. గుక్క వినిపించదు.

నాభీ గొంతుల దోషం తీసుకొని ఆమె దుప్పట్లోకి నవ్వి .. అంతలోనే విసిరి.. వాసనా .. చీకిపోయిన చలి.. కాళ్ళు కప్పుకోలేకపోతున్న.. ఈ ఇంటి నిండా అమంగళ హోరులో.. చెవులని నింపుతూ..

అవును .. ఈ ఇల్లు.. నేనూ .. నీకు పరాయిగా మిగలాలి.. మిగిలే తీరాలి..

 లేదంటే .. ఈ శిక్ష నాలుగ్గోడల పెద్ద శిక్ష .. దీనిని భరించడమూ అంతే కష్టం.. ఊసర బెడద..

సళ్ళిపోయిన నిరాశ ధ్వని నిద్రలో పడి .. కలలని దులిపి తిరుతున్నప్పుడు .. తన కబురు..

ఎవరమూ ఇంకో నిండని .. నాదని ఐతే మొయ్యలేం.. గగ్గోలు పడ్డారు.. దారి కాచారు..

కడుపు పండని శ్వాస కూర్పుల ఊసడింపులు.. పగటి జోరులు.. కలకలు..

వాదులు కానీ గుమ్మంలో మట్టిపోసిన మాటల మధ్యనే .. కాలి నిద్ర మూసుకుపోతూ …

నువ్వూ తన్ని పో.. పోతూనే ఉండు.. వెనక్కి తిరగొద్దు.. రావొద్దు..

ఆ గింజులాటనే మోసుకొని .. దోపుకొని.. శరీర నిశ్చతాలలో మాట తీసిన రంగు వీధులు..

……………………….

అక్కడే తేలిపోతూ .. మరో ఇంటి పూర్వంలో .. నా కథని చెప్పడం మొదలుపెడతాను.

సమ రణాయ అంపకాలతో ఊరిపోయిన నొప్పి.. ఇది వదిలేది కాదు.. ఇంకోసారి నొప్పికి..

                             నాకిక ఏ గ్లామర్ మిగలలేదు.. దీనిలో…

ఆమ్ల ఛాయాన రంగు రాళ్ళ కలత .. నొవ్వడి.. తాదారుణ కదలిక ..

దీపజారు చప్పరించిన ఆజ్న గతంతో .. అల్లాడి లేని విపరీత ముఖాల కౌగిలి..

ఆధ్యయ  గంభీర చర్యల కోతని.. బలంగా లాగి.. కోతని మొదలుపెట్టి..

శేష తమయంలోని .. కంటి గోళాన్ని పాతి.. చూడలేక.. ఊగిపోతూ.. గడుసుకళ్ళు..

ఇక మరోసారి నిద్రలో కూడా ఆ ఇంటిని అడగవు.

                                                              ………………………………….

5. రంజిప నానుడి.. తగలబడ్డ  అర్ధాలు.. చీకట్లో నిప్పులు

రోజంతా తనని తను తిప్పుకొంటూనే ఉంటుంది.. సమంజ అవవాహ నిరక్తి.

 అన్నం తింటున్నట్లుగా ఆక్ట్ చేసి.. సడన్ గా లేచి .. టోయిలెట్లో వేసి ఫ్లష్ చేసేది.

కోప జాహృతపై కదిలే వాన జారల ముఖంతో చుట్టుకొన్న దేహ కొలువు.. పరాయిగా …

పెళ్లి ఫోటోలని.. పూజారులనీ .. గుడులనీ .. చూస్తూనే విరుచుకు పడేది.

అవివివాహ నిద్ర తరుణం సలిపిన దుఃఖ పోటులో .. ఒళ్ళు ఒగర్పు..

ఐతే .. తనలో తానే బడ బడ మాట్లాడుకొంటూ ఉండేది..

లేదా రోజల రోజులు .. మాట లేకుండా పడిఉండేది.. సమయ నిర్ధార చావు శకలాల కూలిత

ఇంట్లో దొరికిన ఎవొక టాబ్లెట్స్ .. నూరికుని.. మింగేసి స్పృహ తప్పి పడిపోయేది..

జరిగి పోయిన నిన్న కలలోకి చేరి .. బలంగా కళ్ళలో పొడిచినట్లు.. పెద్ద కేక .

. రోజంతా కళ్ళు తెరవకుండానే ఉండేది. అలానే నడిచి ఒంటికి దెబ్బలు తగిలించుకొని..

ఏదో తరుముకొస్తుంది..ఊగుతున్న గోడలు.. మరుగుతున్న కాళ్ళు.. నెరిసిన శ్వాస ఒగర్పు …

పొరపాటున టెర్రస్ మీదకి వెళ్లిన.. గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడ్డ .. మసకలు తూలిపడ్డా….

 మెడికల్ షాప్ ఏదో ఆర్డర్ పెడుతున్న .. ఇంట్లో వాళ్లకి లోపల రైళ్లు పరిగెట్టేవి.

సహన నిరగ్రహ కూలిపోయిన చిక్కని చీకటి నేలపై .. పుండుపడ్డ ఆమె సమాధి దొల్లుతున్నట్లు..

ఆక్షిణ్య ఆక్షేప నిర్మతి రోజు రోజుకి పెరిగి .. మీదకి కూలుతున్నట్లు … పెనుగులు మోసే ఊట

 మాట సాయం లేని మృత్యువు.. కిటికీలోంచి లోపలి రావడానికి .. ఊచలు ఒంచుతున్నట్లు..

జ్నహామి తరంపన ఉండుండి … మాట ఇచ్చి మరీ కూలిచినట్లు.. ఏదో తిరిగి కట్టుకోలేని శాపం…

వివిసాయ దేహ మూర్చనలోని గర్భ వాతపు పడక .. పొత్తి కడుపుని కత్తి తో రుబ్బినట్లు..

………………………….

హాస్పిటల్స్.. న్యూరో .. సైకో .. అనాలయిస్టులు .. డాక్టర్స్.. ఖరీదు ట్రెయిట్మెంట్స్ …

ఎగిరిపడి .. ముక్కలు విరిగి.. దేహపు గర్భ నిలివేతలో పూడికలు..

ఏ విడాకుల లాంటి పార్మాలటీస్ లేకుండానే .. భర్త వదిలేసాడు.. వదిలించుకొన్నాడు.

అత్తగారు అప్పుడప్పుడు వచ్చి.. చూసి.. ఏడ్చి.. క్షమాపణలు చెప్పి.. కుమిలి ..

 పరాలయ చీకటిని కొట్టి కొట్టి.. నుజ్జు చేసి పిండి..ఒంటిని ఒక మృత గాబుగా చేసి .. మగాడై ఓలలాడి.. ఊపిరి కొలతని మొత్తం పైకీ-కిందకీ చేసి..

సహన షరతులని మొత్తం తగలబెట్టి… గోడలు కూడా చూడలేని హింసని నానబెట్టిన దుప్పట్లు ..

ఎర్రగా ఆరాక.. చలన నిర్గతి లేని కరకుతనం మండి .. నల్లని పొగతో నిండి..

తలుపులు ఊడక .. రాత్రంతా అల్లాడుతూ.. శూన్య ధ్వనిని కాపుకాచి .. నిర్ధాంయ పగల ఉసురు..

ఒళ్ళంతా పండిన కారపు చేనుల మాన్తా వదలక.. ఏడ్చే ఓపికా లేక కూలిపోయి..

చెమట పండిన గరళం కూరిన నోట్లోంచి .. ఆపుకొన్న కేకలకు పగిలిన ధ్వని హేళన … 

నా కొడుకు ఇలాంటివాడని.. నాకు ముందే తెలిసుంటే… అని గొణుక్కొనేది..

కొడుకు .. ఇంట్లోంచి .. వెళ్ళగొడతానన్నప్పుడు .. ఇక రావడం మానేసింది.

దంబన మరకలు.. వేలాడిన మాంస గుండాల్లో వికార నివ్వెరలు.. పులిసిన లోపలి కత్తి..

……………………….

అస్త్రాయత.. ఘనీభవన నిష్క్రుతీ తాండన ..  తగలబడ్డ  అర్ధాలు .. పై కిందా లేని కంగారు

అధిగమించలేనని  నిష్కారణ సపల్లత… కట్టి పోసుకోలేని నిరూర అదిహ్యత ..

కలబడుతున్న అరూప గోడలు.. సలిలించబడ్డ అసహన గదిలోని దూరాలు..ఒక్కలపాటు ..

తమందత .. కత్తిపోసుకొన్న కంగారుల సంచీ .. దేహ విరోప గుంభనలో చెవిటి కేకలు

అసంపు గోళంలో .. నిండా మునిగిన చీకటి .. జువ్వలత .. జలగల కుండ…

ఎర్రగా మారే మాట నుంచి.. మన్నన దేహ గడువులో ముగ్గిన స్వరేయ గదులు.. వికారాలు..

గెస్ట్ హౌస్ రేవ్ పార్టీల్లో .. గ్రూప్ లతో శరీర దారాల చిక్కులు.. వద్దనడం ఓ నాసిరకపు చీడ

శిక్షా ద్రోణుల్లో పడి తిరిగే … గొంతులు.. వాతలు.. పోతల్లో.. తురిమిన నడకల లొల్లి..

తలపడుతున్న .. మండిపడుతున్న.. కదిలి రాలుతున్న.. చెదిరి కదులుతున్న .. వేసారి..

దేహ క్షేమన రంగులు మారుతున్న .. అలరజనుని కంట్లో పెట్టి.. నుదిటిలో మోసి..

చలన మంగళ హోరుని పోసుకున్న రుజాస్మర .. తడి బట్టల్లో ఇరికిన బూజు నోరులు …

ఆది దోషం తెలియని … అపాకృత నిద్ర గాథల్లో మునిగి.. అవస్థ నిరాంపనల పేరుకొని..

 అనియత్న సవరణల వెనక .. దేహం ఇక కనబడని యత్నాలు..  మరి దేనికి..

                                                            ………………………

       6. అలగలు పడిన దేహ మాట .. సాధిత పగ .. తనలో తను..

ఇవన్నీ మాట్లాడితే .. నీది నువ్వు చూసుకో.. నాలోకి రావొద్దు … ఇక వినలేను

సరళ మహా గతాన్ని తాగి .. అన్ని ఒక్కసారిగా తిరగబడి పోతాయ్ .. ఏదీ అలాగే ఉండిపోక…సరికాక..

 నలిపేసాక.. అమాస ఇగరబెట్టిన   కన్ను కలతపడి .. దారి తప్పనంటోంది.. అటు లాగుతున్న…

మళ్ళీ ఏదో దొరకదు.. చెప్పిన మాటనే ఇక నేను వదిలేసానంటోంది.. 

నా నరకం సంగతి నీకు అర్ధం కాదు.. ఏ ఇరుకు అపార్ట్మెంట్.. పిల్లలకి అంత స్టాండర్డ్ లేని.. కుదరని

 స్కూలింగ్ .. చిన్న డాక్టర్లు .. జనరిక్ మెడిసిన్.. కుళాయి నీరు.. బండి మీద కర్రీస్ …లో దుస్తులు…

సరే.. నా ఖర్మ .. ఇలా కాలిందిలే అనుకొన్న … నాకూ .. నా పిల్లలకి…

నిర్దయ ముసుగులో పదాలు .. తెగి రాలి పదునెక్కి.. గొంతులో చిల్లు పెట్టి .. నల్ల రక్తం పీల్చి..

 నిస్సత్తు మహాకారంలో ఊరేగి.. తలకిందులై.. మరో మాటకి ఖాళీ ఇవ్వక..

ఇప్పుడు అవకాశం మొచ్చాక .. మళ్ళీ self  respect  .. ethics  అంటే ఎలా?

అవుట్ అఫ్ ది బాక్స్ వెళ్తావో.. ఇంకేం చేస్త్తావో.. compromise  అవుతావో.. అయ్యినట్లు నటిస్తావో…

వాళ్లనే మోసమే చేస్తావో.. ఎవడికైనా bribe  ఇస్తావో .. ఏదైనా నీ ఛాయస్.. నువ్వేం చెయ్యకపోతే మాత్రం..

 నేను పిల్లలని నీకే వదిలేసి వెళ్ళిపోతాను.. మరి కనిపించను .. విసిగించను

సమ బంధన లేని పెద్ద ఊడల నిరాశ చుట్టేసి.. కదలికనే గట్టిగా కట్టి..బిగిసిన చూపు మంద్రత..

ఇంకెక్కడో వెదకాలనే తొందర అతుక్కు పోయి..ప్రాణ లాలాసని పొగరుగా నింపుతూ..  

 this  is  my  ultimate  decision .. there  is  no  change  in  this .. 

……………………………….

జడలు బిగించిన శరీర గాలుల్లో.. తడిమి చూసుకొన్న ధ్యాన గోషా చిక్కబడి.. తలబాటు లేని

అమాస పళ్లెంలో .. ఉండిపోయిన నిద్ర తానులని నానబెట్టి.. పిండిన మాంసాలతో…

తనలో తానుగా ఉన్న కలోనివ్వెర వెలిగిన గదిలో గోడ మాత్రమే మిగిలి.. కిటికీలు ఊడి

ఉనికి చిత్రంలో ఓలలాడే .. శిధిల బరువుకి .. నీలోని కసి ముద్దని పిసికిన అరుపుతో..

నువ్వసలు ఏంటి   ఖాళీ చెయ్యాలనుకొంటున్నావ్.. నాలోంచి..అది చూడగలిగావా?

శూన్య త్రయాల గాలి ముంపునీ దాటి పడవ మధ్యలోకి వెళ్ళాకా .. వలయంలా చుట్టేసిన కెరటాలు..

 చీకట్లో విస్తరి వడ్డించి.. దీపం తిరగబెడతారు.. చెంపలు సవరించి… కిటికీలు మోస్తారు

శరీర లాల ఒడిసిపట్టిన వణుకు ముదాలని బిగదీసి.. శ్వాస తడిమిన తలగడ అనుస్తారు .

ఇదొక బరువెక్కిన దేహ విగరపు సముదాయ కేలన లో పడి ముక్కలై.. గాలి పొసుకొని….

పుట్టుకలు అనులోమ ఊపులు.. కట్టి పోసుకున్న నిర్ధార ముఖాలన్ని దాటి .. దూకేస్తూ..

……………………………………….

పరస్పరమూ .. పోలికలేని ఆశ్చర్యం.. ఆశ్రియత తేడా చేస్తూ .. కంపించే బరువులు..

తెలిసి .. తెలియక .. తెలిసి ఉండిపోయిన దూర గతిని .. చలన మితిని వడపోసి..

అలగలు పడిన దేహ మాట .. మళ్ళీ మళ్ళీ చెరుపుకొని.. ఇంకా కొన్ని ఉప మూర్తుల పోలిక

విగ్రహ సంధి మూర్చన నిండిన … ఆపాద ముగింపులతో.. చరిత స్పర్శని మోసుకొనే అవకరాలు.

తనే .. ఇలా .. ఎలా..అయోమయ నికర్షలో పడి కొట్టుకొనే .. బుజాల బరువుతో కవ్వింపునీ బిగించి

రంగులని పోగేసుకొని .. విందుకి పేర్చిన దేహాన్ని వెనక్కి లాగి.. అటు సాధిత పగ .. 

………………………

అవ్యక్త పరామయి మరోసారి కదిపిన నీటి ముద్రతో పేనుకొని…తలకిందులు పడినా…

.దేహ రుణ కాపుని తిప్పి పెట్టి .. నమ్మించిన కదలికలో దిగబడి .. ఊసుపోక

అల్లా .. ఉండిపోవడమే నయమని నమ్మే .. ఉత్పత్త నిమోయంలో కలబడే అక్కడనే..

వికార మాయని నానబెట్టి.. దేహ రుజువుని ..కప్పి ముంచిన నిగర్పుని .. మాటని ..

ఇది కేవలమూ ఓ నిస్సహాయ నిరాకరణ.. ఏ లోపమూ లేని దుఃఖం .. నిమంత్ర దేహ నెల

తనలో తానుగా మింగి.. మదింపు మునకలని దాటి .. ఎత్తి పోసుకున్న ఊరట దొరకక..

నిరూప ఆమ్లత్తపు గుచ్చాన్ని తెగ్గొట్టి.. మరింత ఛాయల ఊగింపుని చిలికి .. తోడుపెట్టాక ..

చీకటి రెండో గుమ్మం లేని చితిలో .. మరో నది తాగిన హెచ్చరికని ఊరేగిస్తారు.

                                                       —————————

     7.  కల్హడి .. నిద్ర అంజార్య .. పూత పట్టిన శబ్దం

ధ్వని కవాటంలో .. నిండిపోయిన మాటలని మూటగట్టి విసిరాక..  కల్హడి… ఎత్తడి చర్యలు

చిత్ర బంధనల అరూప ముంపులతో.. చెదిరిన చీకటి పునాదులని కాదని.. మాంస ఊరట..

ఈ ఫామిలీ లైఫ్ కి కూడా ఒక రిథమ్ని పట్టుకొన్నాం .. పరవశించాం.. పిల్లలని కన్నాం..

ఇప్పుడేంటి.. మళ్ళీ ఈ మాటలు .. రుచీ పచీ లేదని.. వాసనా నచ్చలేదని…

బోనస్ రానివ్వు.. ఏదైనా టూర్ వెళదాం.. జ్యువలరీ కొందాం.. టీవీ ఇంకా పెద్దది.. డాల్బీ టోన్ తో

విల్లాలు కూడా చెక్ చేస్తున్న .. ఈ లోన్ ప్రీ-క్లోజ్ చేసి .. మరో లోన్ తో…

 ఇల్లంతా సెంట్రలైజ్డ్ AC చేయించి .. హై ఎండ్ కార్ కొందాం..

———————

ఇది కాదు.. ఇంకేదో కావాలి.. ఖాళీ శూన్యాలని అందుకొని  తప్పి పోవాలి.. మహత్త మ్లానత ..

 విడదీయని విషాదంలోని సృష్టి మగత వడపోసిన శ్రమ మరక …ఆమంగమాల శరణు

మారకాలు లేని మృత్యు గదిలో .. నిరాకారగా నిలబడి..శూన్య భాషణ .. అవశేష గని

వితర్క దేహ ధ్వని మందగిస్తూ.. శూన్య మాల గుచ్చిన సమయ పూరింపు…  చెమట పోత

నేర్చుకొన్నప్పటి అవహేయ నిధాభ్రాంత క్రమత .. ఆశీకరణ ..ధ్వని అభావతలోని మెలిక ..

సాదృశ్య నిమ్మలీమన దశ మోడులు.. వర కల్పిత నిద్ర కదిలింపు.. సమధీయతం

కుక్కర్లో పెట్టి .. మూత బిగించిన ఈ అనుభవాలు నాకొద్దు.. ఈ పరుగు.. ఈ లెక్కలు..

సమయం ఏ మాత్రం ఉనికికి దొరకని.. మహా విన్యాసం దర్పణంలో పగిలే కేకలుగా…

అందిపోసుకొన్న …నిద్ర అంజార్య … నన్నే ఓ విరుద్ధ అనుభవంలోకి  చేర్చి…

కథని విని.. అక్కడే పరిమళ మట్టి గోళంలో నిద్రపోయి..  పూత పట్టిన శబ్దం …

ఇక్కడా మరో వివరం లేదు.. కనికరం దగ్గర కాదు.. చేతుల నిండా పని బిగించిన నొప్పి..

……………

పిల్లలకి నువ్వేం చేసావ్? ఎక్కడో దూరం లో .. నీ ఉద్యోగంతో ఉండిపోయావ్?

నరకం అంతా నేను చూసాను.. వాళ్ళ  బాగోగులన్నీ నేను మోసాను..

ఇప్పుడంతా .. వాళ్ళది  వాళ్ళే చూసుకునే వయస్సు.. నన్నిక వదిలెయ్యి..

నాకీ సంసారం .. లెక్కలు.. వర్క్ ప్లేసులో ఎంగిలి  చూపులు.. మాటలు.. అధికారిక వాంఛలు..

ఆ నిగార నవ్వుల్లో .. పెదవులు కోసుకోవడాలు.. మధ్యలో మెలిపెట్టే టార్గెట్లు ..

ఇవ్వన్నీ దాటి ఎక్కడికో పోవాలి..తెల్సుకోవాలింకా .. అసలేం తెలియదనీ కాదు

 ఆవర్త సమ లాలయ నిఘ్రాణి ..  పడి పోతల నిర్జన తెంపు.. నిర్కషల కదిలింపు

ఏదో ఆకట్టుకోవడం లేదు.. నిశిత స్థితి కందిపోనివ్వడం లేదు.. బరువు తగ్గనివ్వడం లేదు..

అదే తెలియాలి.. మహా దర్శనకి మార్చి రాసుకున్న ముఖాలుగా మిగిలిపోవాలి..

 నన్ను నేను పోగొట్టుకొని .. నా అసలు దేహాన్నితెచ్చుకొనే … పుట్టు కథని  కనుక్కోవాలి.

……………………..

దుఃఖ లయగా తలకిందులయ్యే .. శేష భూమి కన్నుని కాల్చుతూ.. విశుద్ధ స్మరితని తాగి ..

తూలే .. తాప భోగంలో ఊగుతూ.. చలన మూర్తుల కాష్టం.. మిగిలిపోలేదు.. దగ్గరా కాదు..

విగత గొంతుల పొడవైన కన్ను చిదిగి పోయింది.. ఇంకా దేన్నో కలుపుకోవాలి.. తెల్సి రాదు

నిమిరిన దేహ తవ్వకాలు.. ఒక ఆశ్చర్య దేహ కవచం రాలిన విచలిత ఎండ .. కోసిన గది

కలుపుకోవడం .. విడిపోవడం .. చెలరేగి .. నిండిన మునకలతో ఊరుపుల పడక..

ద్రవ సేతువుల రొమ్ముని పీల్చి .. కడిగిన చలన మార్పులతో.. రోజులు తెగిపడి.. నిలబడి…

మార్దవత లేని శరీర ధార వణికిపోతూ.. చరిత చిత్రంలో రంగు మార్చిన పెకలింపు..

నాకిలాగే కావాలి.. రోజంతా తిరగాలి.. మీద పడ్డ కాళ్ళని పొడిచి .. ఇంకేదో అందుకోవాలి..

ఆ గట్టి నమ్మకంతోనే .. ఈ భూమి నంతా మళ్ళీ మళ్ళీ చుడుతూనే ఉండాలి.

                                                                       ————————————

8.బ్యాంకు సీజ్ చేసిన ఇల్లు.. వేలం వేసిన చీకటి కాటు.. తను కొండా దాటింది

ఆలబెట్టిన వికర్ష ఛేదనతో .. వేరుపడిన లెక్కలు..పిలిచి చూసుకొని.. అదోరకమైన నిందల

 కరుకు బరువుతో.. తప్పిపోయిన నిర్మాణ దేవిరింపులతో పట్టుబడిన మట్టి తంపన…

ఏ కథనీ వినని మొండి గోడలు.. రధం డిగ్గబడ్డ నది.. వెనక్కి పీల్చిన శత్రు శిబిరంలో ..

 ఎవరో పేని సిద్ధం చేసిన తాడు.. ఊరట కావాలిగా .. ఇటొచ్చేయమని.. మాలో కలిసి పొమ్మని

చూపు వదిలేసి.. నా మీద నీ బరువు వదిలేసి..నిమ్మళంగా ఉండు..

అదే చెప్పాలి .. మాటి మాటికీ.. మాట మాటకీ అడ్డం పడి … కోప్పడే కళ్ళలో విసుగు..

ఇంకాస్త .. ఇంకాస్త .. ఇంకెంత కాస్త.. ఎప్పటికి కాస్తతో తేలేది… సగం కాదని పోయాక..

బ్యాంకు సీజ్ చేసిన ఇల్లు.. ఇద్దరూ కలిపి మొదలుపెట్టిన EMI కాదని ..  పెరాలీసిస్ వచ్చిన ఆమె నాన్నకి సపోర్ట్ చెయ్యాలని.. ఒక్కసారిగా … కలిపి అనుకొన్న మాట లేకుండానే …

ఆర్ధిక వలయ నిసృతాలు.. నువ్వు ఓడిపోయావని అతనిని మాత్రమే నిలదీసే నల్ల అరుపులు..

వెన్నులో పోటు .. చేరగిలిన మాంస ముద్దలా ఆమె ముందు..

ఇంత అవమానంతో నేను ఉండలేను.. పుట్టింటికి వెళ్ళిపోతాను.. జాబ్ transfer పెట్టుకొని..

…………………………..

తను కొండా దాటింది  .. అతను లోయలోకి .. ఎంత లోతో తెలియని లోయలోకి..

                 నిస్వాయ పథం తప్పించిన సిగ్గుతో.. దేహ మోహరింపుని వదలగొట్టి..

సరిపోయాం.. నిలబడి ఉన్నాం.. మాటని పట్టుకొన్నాం.. చెప్పాలనుకున్నా…

పగటితో నింపుకున్న చర్యలతో పండించి పెట్టుకొన్న … అనుశాసన నిందింపులతో .. తడబడే

                      స్థితాలతో.. అనుసరింపు చీకటిని చీల్చి.. నుదుటి కలతలా అల్లాడే ముడతలు.

తీరిక లేని దేహ ఋణం .. తలకి పెట్టుకొన్న దీప నిందలని అప్పగించిన కల దాటింపులు..

శుభ్ర నాడులు.. పొంగిన ఆవిరితో నిండిన కుండలతో.. ఇల్లుని చూసి .. నెట్టిపోతారు.

చీకటిని.. రాత్రిని..అప్పులని.. అనారోగ్యాలని దాటి.. అన్నీ అమ్ముకొని.. ఉద్యోగం పోయి..

నువ్విక చచ్చిపోయినట్లేగా? అని.. నిందలని .. నిందలపై జోడిస్తూ.. చేతగాడివని .

 నీవల్ల ఏం కాదు.నన్నొదిలెయ్…నా చావేదో నేను చస్తాను… నాకేం భరణాలొద్దు..

మంచిదైంది .. నీ లోపమో .. నా లోపమో ఇంకా పిల్లలు లేకపోవడం.. అదీ ఇందుకేనేమో

…………………………..

అది.. అలాగే ముగిసిపోయింది.. ఇంకొకరెవరూ చీకటి చాటునైనా కలపాలని చూడలేదు

మృత్యు గంభీరం మోసిన చితిలా  .. బ్యాంకు బోర్డుతో వేలాడుతూ.. సీజ్ చేసిన ఇల్లు

ధ్వని రాశుల్లో పడి .. ఊపిరాడక తిరుగుతూ.. కదిలే నిద్ర ఊర్పుల చలన గతి చేరదీసి ..

                                     ఉండిపోదామని.. ఉండనీయరని.. ఉండటంలో ఏదీ లేదని .. 

అతను వారణాశి వెళ్లడం ఎవరో చూసారు.. అప్పటికి ఇంట్లో ఇంకేం లేదు..

కన్ను పెకలించిన మాటల జల .. ఒంటికి పట్టిన పోరు వదలక .. నది ముందే కూలి..

ఉన్నాడో .. ఏదైనా చితిలోకి దూకేసాడో .. ఆరా తీసే వాళ్ళేలేరు.

 అనుకొని దగ్గర చేసుకోవడానికి అతనికెవరూ లేరని తనకి ముందే తెల్సు.. స్వయామిత ఒంటరి చితి

 శూన్య ఆరామయని మోసిన మాటల ధూళి తప్ప.. సఫల నియోమ కొండల్లో.. రంగుల మంత్ర తవ్వకం

సరి చెయ్యని చీకటి సాధనాలు..   అదీ ఒక కర్మ శాపమేనని ఎవడో కూస్తాడు….

గతం చెరిగి పోయిందిగా .. వాడో చవట .. కుటుంబం నడపడం రాలేదు..

                   ఇప్పుడేం వయస్సయిందని.. ఇంకో పెళ్లి చేసుకోమని..

ఆమె కొద్దీ నెలల్లో .. రెండో పెళ్లి వాడిని .. రెండో పెళ్లి చేసుకొంది.. చలనిత ద్వయ ధార

…………..

మృతు భాష్యాలు హెచ్చరించిన కలయిక..సృష్టి ధారణలేని ఆడ శరీరం..

చలమలు ఎండిపోయిన నిష్ఠుర స్వేద ముఖాల్లో .. తొందర లేని ఉద్గీతల కొలువు..

కత్తులని సానబెట్టి .. నిజార గోళాలపై నడకని ముద్రిస్తూ .. కదిలిపోతారు.

ఇక ఆ స్త్రీ దొరకదని.. ఎవరో పిచ్చినఁగా అరిచినా.. ఎందుకు దొరకాలని.. ఎవడో బాటిల్ పగల గొడతాడు

ఉరిమిన దేహ క్షేత్రంలో .. ఒక్కసారిగా లేచిన మంట .. ఉత్పత్త నిద్రలో దూకే జేవురింపు

కలబెట్టారు.. అద్ది తీశారు.. మాట పట్టారు.. నోరు నొక్కారు.. నొసలు తిప్పారు..

మిగిలిన ఆయుస్సు రేఖని తెంపి.. అతను మరేదో .. తెలియని చోటుకి..అక్కడ స్త్రీ ఉండదుగా ?

                          అని ఆశగా అడిగి మరీ వెళ్ళాడు.. ఉంటే తట్టుకొనే ఓపిక లేక..

                                                                                         ———————————

9.ఉత్త బొమ్మల గుండం.. ఫోన్లో సంసారం.. ఆనవాళ్లు లేని కొత్త కథ

సమయనిశి మెదిపి.. గొల్లుమన్న నిద్ర సాగులో .. హఠాత్తుగా లేచి .. పక్కకి తిరిగితే తను లేదు..

తనెప్పటి నుంచో లేదు. మాటకి సాయం దొరకని కలగా ఆరిపోలేదు.

రెప్పలని వదిలి వెళ్లినప్పుడు … ఉత్త బొమ్మల గుండం భయపెడుతుంది.. దేహ సంపద లేని రంగు మైకంలో పడి .. ఊసూ..పలుకూ లేక తిరుగుతూ..

నిద్ర సర్దిన ఆనవాళ్లు లేని కొత్త కథ …. అదే దేహం లేని చిరునామాలో .. ఎవరో శపిస్తారు.

ఆమ్ల గుంభన మరిగే చిత్ర జ్వరంతో .. మసకలు పడిన నిద్రని తెరిచి ఏడుస్తూ ..

 దేహ పూనకాలే వెనకనే .. అడుగుకి చేరి ఉడికిపోతున్న .. ఇంకో దూరం జరగదు

ఇంకొకటిగా లేని సమర్ప చాలీనత .. ఉండీ లేని ఆపసోప ఎద్దడి .. కథలో ఏదీ లేదు..

సంధి చేసుకొన్న.. అపామాయ మంద్రతలో ఊరేగి.. చలన శృతి మర్ధనలని కాదని.. ఏది లేదో                   

                       అదే ఉండనే నానుడి మంద్రతలపై కన్ను మార్చుకొన్న శరీరాల గతలోల…

సంప్రాప్త ముఖాల్లో పడి ఊరేగి … నిద్రలేమిని విడిచి పెట్టి.. అక్కడే ఉండిపోయిన శరణు స్థలం.

మాయాజాలం కమ్మిన విపత్తు మునకల చీకటిని కమ్మేసిన .. ఆంతర్య దేహ పునాదిని తవ్వి ..

అస్థిమిత గర్భ దోషపు నివాళిని కూలుస్తూ.. చేరక ముందే కళ్ళని దోపిన సంచీలో….

 కదిలించి సంభాలించలేని నిద్ర జోడింపులని .. కుదిపిన చలన మాత్రంలో నింపుకుని . దాటుకొని….

పోటెత్తే బెంగలు.. నిద్ర గృహాలు.. పొగలు .. సీసాలు.. చిరిగిన బనీనులు .. వాసన సోక్స్లు..

 రాత్రంతా వాహన హోరులు.. మురికి గుంటలో దొర్లే పందుల చప్పుడు…దోమ గుయ్యారం.

తన స్త్రీ తన భద్ర స్థలం వదిలిపెట్టి .. దుఃఖ చలనగా సాగి.. అక్కడే ఊపిరిని దాచి .. పాతిపెట్టి…

తన కోసం చూస్తుందని.. నమ్మకం అదే .. కానిది అదే.. ఉండిపోయేదీ అదే.. కదలికనే తట్టి లేపేది

అదే.. వాళ్ళు మార్చుకొన్నామని పొగ బండిని వదిలి స్టేషన్లో…. తను గుక్కపెట్టి ఏడుస్తుంది.

……………..

తను మళ్ళీ మళ్ళీ పీల్చుకొంటాడు.. గాలి నాదపు తంత్రుల నుంచి స్త్రీ గా మరిగిన దేహాన్ని..

తను అతనిని నిందిస్తుంది.. అల్లా ఊర్లు పట్టుకు పోయేదానికి పెళ్ళెందుకని..

అతనేం అనడు.. నవ్వి .. వచ్చే నెల వస్తున్నాగా అంటాడు.. తను నమ్మదు. ..

వచ్చినప్పుడు చూద్దాంలే అంటుంది.. ఎప్పటిలానే .. అతని రాలేకపోతాడు.

గర్భ నిశానీ .. మళ్ళీ తొడుక్కున్న వర్ష శిలల బట్ట.. ఊరి నడకలో కుంగుబాటు..

చెప్పి పోసుకున్న ఆమె ఊసుల నిండా .. ఈ రోజు ఇల్లు విడిచి వేళ్ళని వాళ్ళ నాన్న కథే..

 రాత్రి ఉండుండి ఎవరో ఇంటి తలుపు కొట్టి .. వెళ్తున్నట్లుగా ఉందని కంగారు..

పండగ రోజు పిల్ల .. నాన్న కోసం ఏడ్చిందని.. బొమ్మలు అడిగిందని….

ఆమె .. ఇంకేదో .. రాగ ముమ్మరల .. అలాకాని.. ఇష్టాన్నో చెప్పాలనుకొనే లోపు ..

 ఫోన్ కట్ చేసాడు.. నెట్ వర్క్ కట్ ఐ కాదు.. దుఃఖం ఆమె ముందు వద్దనుకుని…

వాంచ గడ్డ కట్టినప్పటి నిరాశ .. భయం తెలిసినప్పటి అణుకువ ..

 శరీరం మరిగినప్పటి స్నాన గాథ కదిలి వెళుతూ ..

ఆమెకి తెల్సు .. అతను తనలోనే ఉన్నాడని.. బయటపడి ఏం చెప్పుకొంటుంది..

…………….

మరోసారి … అతను దిగుతాడు.. ఇల్లూ చేరతాడు.. అతని నాన్నకి హార్ట్ ఎటాక్ అంటే

ఆ రాత్రే మరో ఊరికి బయలుదేరతాడు.. కర్మకాండలు.. సంతర్పణలు.. బంధువుల ఏడ్పులు ..

తిరిగి అక్కడ నుంచే బంధువుల మధ్యలో ఉన్న భార్యకి సైగ చేసి.. ఎయిర్పోర్ట్ కి …

మళ్ళీ ప్రమాణాలు.. ఈసడింపులు.. పాత దుప్పట్లు ఉతికి .. లోపల పెడుతుంది..

ఫోన్లో సంసారం .. వాన గారడీ తో ఏ అర్ధ రాత్రో చేసినా.. తను ఆస్తమాతో ఆయాసపడుతుంది..

మామగారికి  బ్రెయిన్ స్ట్రోక్ అని హాస్పిటల్లో.. .. బామ్మరిది కాలు విరిగి ..వాళ్ళింట్లో….

 మధ్యలో ఆ సరదా మూలనపడుతుంది.. అన్నీ సర్దుకొన్నా.. చావు లీవుల వాళ్ళ ఆ ఇయర్ కి ఇంకేం లేవు.

……………………..

అతనికి వర్క్ ప్లేస్లో ఆక్సిడెంట్.. ఫీస్కికాల్ ఫిట్నెస్ వస్తే .. రమ్మని ఇంటికి పంపిస్తారు..

చెప్పాలనుకుంటే  ఆమె ఫోన్ ఎత్తదు.. ఎన్ని రోజులు .. ఎన్ని సార్లైనా..

అతని ఇంటికి చేరాకా .. ఇల్లు వదిలేసి ఆమె ఏటో వెళ్లిపోయిందని .. ఎవరికీ ఇంతవరకు ఆచూకీ దొరకలేదని.. కూలిపోవడానికి.. తిరిగి కట్టుకొనే ఆశ మిగలడానికి .. సరిహద్దు చాలా చిన్నది..

కనిపించనిది.. కదలలేనిదీ.. కంపన మారకాలని తుడిచేది..

ఉన్న పళంగా.. ఇంకొకటి ఏదీ దొరకనప్పుడు .. అక్కడే ఉండిపోయిన శత్రు గుడారంలో …

 ఎవరో కత్తుల రాట్నాన్ని తిప్పి .. ఒంటి మీద చీలిన బట్టని కప్పుతారు..

ఏదీ ఇక మారదని.. ఎటు పోవడానికి ఏమీ లేక .. అతనా దూరంలో వణికిపోతాడు. కూలిపోతాడు….

                                            ————————

10.ఊరిన మస్తిష్క ధార .. పెదాల తామన .. ఇకదే అలనేత చిల్లులు …

సమయనిశి ధారణతో అలరింపు ముడులని .. తేలిక చేసి.. పెదాల తామన..

ఉన్నప్పుడే ఉండిపోయిన సంపూర్ణ దేహంలోంచి.. అడుగుకి చేరిపోయిన నిశ్నిత కలశ్రుత  …

దూరాల కైపుని   సరి చేసి.. నువ్వు నాలోని ఉండి నవ్వావని .. కొత్త దీపం చిదుముకొన్నాను.

భయమూ నాదే .. శరీరమూ నేనే .. కథలోకి ముడుచుకున్న నిద్ర ద్రవ్యం కరుగుతూ…

నేనీ పుట్టుకని సంపూర్ణం చేయడంలో.. నువ్వొక బిడ్డని నా చేతిలో పెట్టినందుకు ..

 రాత్రంతా ఏడుస్తూనే విన్నాను.. మాటకి మాట తేల్చుకొంటూనే ఉన్నాను.. సహన కొరివి….

సృష్టి మొత్తం నా ముందుకు దిగి ఆ వింతని చూస్తుంటే .. ఏం చెప్పాలో తెలుసుకోలేక ..

 నాకు నేనే శూన్యంమై.. నీవిచ్చిన ఆ ప్రసాదాన్ని సాక్కొంటూ.. ఇలా యుగాలు గడిపేస్తున్న..

………………………..

ఊరిన మస్తిష్క ధార .. హఠాత్తుగా పగిలిన నాలోపలి కాలి ముద్రలని తుడిచి ..

 కొత్త ఇంటి నమూనాలని మార్చి.. కునుకు లేని చీకటి మడతల్లో దుప్పటిని దులిపి..

 అల్లార నిద్ర తీరులు కూలుతూ…చూడడానికి లేని వెనక తేదీలు …ఇంటూ మార్కులు…

 నిరాలంపన కాల్చి వేతల్లో .. గుట్టు చప్పుడు కాని మగ సన్యాసాలని గుర్తుపట్టి…..

ఉమ్మడిగా ఉండిపోయిన అస్థిర నిద్ర పిండాలని వదిలించుకొని.. కంచంలో కడిగిన కాళ్ళ ని

 భాదగా చూసి .. నిలదీయలేక .. ఓడిపోతూ.. ఏం కాదులే అని.. తల ఊపుకొని…

శరీర ఆసరా లేని పుట్టుకలో మంత్ర స్నానపు మకిలిని వదిలించుకోలేక గుక్కపడుతూ..

నిండాలని వడపోసి.. దూర భ్రమణ దోషాలతో మెరుగు పట్టిన కన్నుని చెక్కి..

ఒక్కసారిగా .. నేనో కల నుంచి బయటపడ్డప్పుడు .. నే నుంచి ఏం విన్నానో అది .. చాలాసేపు ..

 నాలోపల సర్దుబాటు కాక … నిస్తేజ తమకంతో పోతపోసారు.

నిరామకల్వ సంధితో తీరిక లేని విస్సత్తుని రాల్చి.. పోగుట్టుకొన్న తీరూ అర్ధం కాదు

…………………….

నాకు ఏముందో .. ఏం లేదో .. అదెప్పుడు నీ దగ్గర దాచలేదు. నా సంపాదనలోనూ … ఖర్చుల్లోనూ…

ఏ రహస్యము మిగిల్చుకోలేదు.. చాలక పోవడమనేది కూడా నాకు అర్ధంకాదు.. నువ్వుంటే చాలు..

కానీ అతను నాకేం చెప్పాడంటే.. ఇక ఆమె నీ భార్య కాదు.. నీ సింగల్ BHK లో ఉండే స్థాయి కాదు …

 unfortunately నీకా awareness కూడా లేదు.. ఇక వస్తుందన్న ఆశా లేదు

ఎంత హింస గురి చేసావ్.. ఎంత మురికి బట్టలు కట్టించావ్ .. ఎలాంటి నేల మీద కూర్చోబెట్టి

ఎలాంటి తిండి తినిపించావ్.. ఇక చాలు.. ఇక నిన్ను ఆమె కలవనూ కూడా కలవమని చెప్పేసింది.

 ఫోన్ నెంబర్ మార్చేసింది.. ఆ బిడ్డ ఇక నీకే.. వరం కాని శాపశిల…అమాలయ స్థితి గండం…

.దీనిని బట్టయినా తాను ఏం కోరుకొంటుందో అర్ధమయ్యే ఉంటుంది…

 నీకు ఇక ఆమె గురించి ఏదీ తెల్సే అవకాశం ఉండదు.. ఆ ప్రయత్నం .. ఇంకో రకంగా చేసినా…

 నీ ప్రాణానికి కూడా ప్రమాదం కావొచ్చు.. నే చెబుతున్న దానిని వింటున్నట్లుగానే

లోపలికి  చేర్చుకో…సర్దుకోలేని కదలికనే కాదని ఉండిపోక .. చెదిరిన రుణ మాంసాల కీడు

అమిత నిస్త్రాణ దొంతి ముడులు.. ప్రాణం ఊడిపోయిన రోటిపోటు…

………………………

శూన్య మహా యానంలో .. గొంతు వచ్చిన కేకలతో .. నలుపక్కలా ఉన్న .. నిద్ర దేవతలు తెల్ల సరస్సుతో….

తిరుగాడే ఇంటిలో.. ప్రమిద వెలిగించే ఆ చేతుల గురించి ఎవరైనా అడిగితే .. నేనేం చెప్పాలి.

ఏ ధూప పాటలని దాచిపెట్టిన కొండలు.. నడుము వంగిన వంతెన .. స్నానం చేసి నది..

 గజ్జెలు పేర్చుకున్న సముద్ర కెరటాలు.. ఇవన్నీ వెనక్కి చేరి నన్ను నిలదీస్తున్నాయి..

ఇవన్నీ నీకు చెప్పేది .. వెనక్కి రమ్మనడానికి కాదు.. ముందుకు పోవడానికి ఏదీ లేదు….

నీ అందాన్ని.. ఆనందానికి మించినదేదీ నాకు అవసరం లేదు.

 అది నువ్వే వెదికే ప్రయత్నం లో వెళ్తున్నప్పుడు …నేనెవరిని అడ్డం పడడానికి..

ఇదంతా నీకెందుకు చెబుతున్నానని నువ్వనుకొంటే .. నువ్వు  తప్ప నాకింకెవరూ  లేరు..

 కనీసం మన బిడ్డ పెద్దయ్యేవరకు… ప్రయోజనం లేని నా లోపలి మూలుగు…

అంతమూ.. ఆదీ తనగా లేదని ఎవరో చెప్పినా …కుదుపు సర్దుకోలేక పోయినా  …

…………………………….

11 . ఈ లోపలి ఇల్లు నీది కాదు .. త్వరేయ గ్రహణ .. ఆటుపోటు సబ్బరింత

అక్కడినుంచి తరిమేసాక … శపిత దర్శనల కొత్త ఇల్లు.. కథలోకి వాలి.. పట్టు దొరకక …

మొత్తంగా చుట్టుకొన్న కాటుక బీడులు.. అథః నిండు పోతల్లో మారు పలకని దేహాలు.. తెల్సుకొని..

నిద్ర రాట్నం కవ్వించి .. దులిపిన బట్టని కిందికి తీసి కడిగి.. అలా ఆరబెట్టి..

వదిలేసినా పాత చీరలు.. తేలు దొరికిన అలమారా .. ఇక వెలగని స్టవ్ .. వెనక తలుపు ఊడి..

                    చేతిలోకి వచ్చేస్తూ.. కాకూడని దృశ్య తలంలో పడి .. కలబడి.. ఊరేగి..

ఎప్పటికో ఒప్పుకొని .. అటు ఇటు తడుస్తూ .. అంతలోనే నిందిస్తూ.. అదీ బూతులతో…

                   పెద్ద గొడుగు చంద్రుడు చిల్లు పడి.. ఉరుముగా నేల రాలి .. రక్తం కక్కి..

చలన భూతపు ఆన నింద కరిగి.. తెలియకుండానే రక్తంలో మరిగి.. మాటల్లో చుట్టుకొని

 చిత్ర నేరాల కుదుపుని లాగి.. శరణు కోరని ఝాము కొండనై ఎక్కుతూ ..

 ఇదీ అనలేని శరీర తర్జుమాని ఎవరో మార్చిపోతారు.

…………………………….

ధీమతః లేని శూన్య ఫలం .. ఓపిక లేని దేహ ధార .. అమాంత తాడనలో ఉండిపోయిన కెంపు

                 నిందలాల ని పట్టుకొన్న గుండం.. శత్రు సమాచారంలో ..దాచి పెట్టిన నిజం..

ఆ పాత ఆల్బం..  పాడైన వంట పాత్రలు.. నల్లబారిన ఫ్రిడ్జ్ .జడలై రాలుతూ కర్టైన్లు ….

అలానే మిగిలిన పూజ గది.. ఖాళీ నగర బాక్స్ లు..ఆరాదీయ .. ఇలా ఒక దాని కొకటి జోడించి

                 ఎన్ని మోసుకుపోవాలని అనుకోని అలిసిన.. అదంతా సరి కాదనే గబ్బిలాల కూత .

 విశ్వ నిందని కలబెట్టి… కంట్లోకి చేర్చి.. సమయాన్ని చేర్చక ముందే .. కౌగిలి పండినా…

 this  is  not  at  all workout  ..please   leave me alone  అంటూ..

తొక్కిడి ఉక్కిరిలో తారతమ్య నిద్ర నలతల కవ్వింత రేగుతూ వినబడిన నిందలు..

…………………………………

ఎండిపోయిన నదిలో .. చీకటి తూలిన పడవని దాచి.. పెళుసు నవ్వు.. కడుపులో ఆకలి..

వడ్డించమని ఎవరినీ అడగలేదు.. తాను మంచెం పై నుంచి లేవలేనంత జ్వరం..

ఎంత తడిపిన సాగక.. ఎంత ఊపినా విడివక .. ఎంత లాగినా తలుపు రాక..

కళ్ళు బార జాపుకొన్న దుఃఖ తంత్రీ పొలుసు రాలుతూ.. శరీర సమయ గాథని కాదనే మూలాలు..

రాత్రి మైలాల శిలా ఊయపం.. అటు పక్క నిండుకొన్న దాహ కూర్మితో … మెరుగులు..

ఐనా .. ఇప్పటికీ అటు పక్క ఎవరూ లేరు.. ఐనా ఎందుకో ఒప్పుకోరు..

……………………………….

మెట్టు తడబడి .. కలలో తలకి కట్టిన బొప్పి.. ఇంకా సూదిపోటు.. నడుము కలుక్కుమని..

రస ఖేలన .. నోట్లతో వడపోసిన స్త్రీ మాంసాల చమురు.. సమర్గా ఊయసాలు రేగి..

జంట కవ్వాలతో చిలికిన నోటి మాటలు.. కంటి తూగులు.. నిద్ర కాని గరగరాల కల మోడులు

దురుసుగా మోసిన గోడలు.. కాలు కెలికిన కిటికీలు.. ఆ చాటులోనే విని .. రంగు పులిమి..

డ్రైనేజీ లేని జిగురు ఊటలు.. కంటి సలుపులు.. ఇంకిన నిద్ర తావుల్లో కదిలే నిప్పు మడులు..

……………………………..

హై ఎండ్ సిక్స్ సీటర్  కార్ ఇంకెందుకని.. పెట్రోల్ బొక్క .. మైలేజ్ రాదుగా

 కలవర నిద్ర తొక్కలు … బరువు నొక్కిన ఇంటి పాదపు పిక్కలు.. నేరారణ

సజరింపు.. ఆది దేహ మైలాన .. ఒకే ఒక నిద్ర కమతంలో పండుతున్న గిల గిలలు…

రవ్వంత సర్దుకొన్నా మాంస ధూళి.. మృత్యు కైవారంలో శరీరం పెట్టి నూర్చిన కొట్టుపోతలు …

డోర్ బెల్ లేని మెయిన్ డోర్.. ఆ గదిలో పడి ఉన్న బొమ్మల పార్సెల్ .

 చెద పడుతున్న పుస్తకాల పక్కాగా .. పెళ్లి ఆల్బం బరువుకి చెక్క అల్లాడుతూ 

డూప్లికేట్ కీ లేని మెయిన్ గేట్ .. బూజు పట్టిన రెండో బాత్రూం.. కొన్ని షవర్లు..

 ఎక్కడా రెండోది అవసరం లేని సజారతా సడి ఎండిపోయాకా….

…………….

నిన్నొదిలిన సీసా .. ఈ రోజు అక్కడే ఉంది.. ఎంగిలి కంచెం పురుగులతో.. బ్రేడ్ ముక్కలు …

                      సంగం రక్తం ఎండిన చాకు.. వానలో తడిచిన చీపురు.. బెంగపడి చీకినా చీరలు

చీకటి ఎరలు వేలాది.. వాన్ బెంగ పడి .. దాచి పెట్టిన చావు కూడు ..

కొంచెం ఎంగిలి పడదామన్న .. పాచి వాసనతో కడుపులో తిప్పేస్తూ…

ఎన్ని యుగాలైనా .. ఈ ప్రతీక్ష తెలియని దేహం తలకిందులవుతూ….

………………………………………………..

12 . అలోమయ ఉత్తర నడక .. మూడు సవారీలు.. ఐదు పుట్టుకల అప్పు

ఏక నిద్రల స్వయం తీరంలో .. అననుకూలమూ దగ్గరపడి.. అలోమయ ఉత్తర నడకతో .. నిలదీసి .. చేతకానప్పుడు .. వదిలేసేయ్ .. నీది నువ్వు.. నాది నేను చూసుకొందాం ..

ఇంతకంటే మాట్లాడటానికి  ఇంకేం ఉంది.. అననో గతం .. చేర్చి పెట్టిన రోడ్లు

ఒక్క జాబ్ లో స్థిరంగా ఉండవు .. ఎథిక్స్ .. self  respect .. ఎందుకవి..

 నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావు.. కూడా ఉన్నవాళ్ళని చంపడానికి తప్ప…

నేను ముందే చెప్పా.. నేనే జాబ్ చెయ్యను.. నా కళతో ఉంటానని.. అంతా ఒప్పుకొన్నాకే కదా?

ఊపిరి చలన లేని రెండు దేహాల దూరమూ నిందించుకొని .. పరగడుపు మాత్రలు

స్వదేహాల కాలీనంలో పడి డొల్లుతూ.. దీర్ఘ నిద్రని కత్తిరించి.. కంగారు పడి.. అదేం లేదని..

 సర్దుకొందాం.. అవసరమైతే .. ఊరిలో ఇల్లు అమ్మేస్తా … ఇంటి బంగారం తాకొట్టుతో…

సముద్ర మోతలు.. అల్లాడుతున్న చీకటి వలసల్లో నిండిన వాన గదులు.. ఏడుపులు..

………………………..

విడి విడిగా ఏవీ దొరకవు.. మంతనాలు లేని జ్ఞాన బిక్ష కి సమాధి చేసిన దేహ నిద్రల కంపరం..

మూడు సవారీలు .. ఒకే దేహంలో బెంగ పడి .. అదే కావాలని పట్టుబట్టి..

ఎందుకిక ఇన్ని రాజీలు.. పోటీలు.. తగువులు.. భయాలు.. దాక్కోవడాలు.. కథలూ ..

అన్ని అవదిలేసుకొన్న .. కొంచెం సర్దుబాటు కానీ పునాదులని కౌగిలిలో ముంచి..

చర్యల అవందేయ పక్షపు ఉనికి తాగి.. తలకిందులై.. తననేమీ అడగక..

దేహాలు రగిడిల్లి.. శాంతత దీప రాజీయంగా ఉండిపోయి .. చలన మాత్రంలో ఊగి..

పల్చని తలుపులు .. ఎక్కడా ఏదీ దాచకుండానే చదివేస్తూ …

…………………………….

కనబడని మగ కన్నీరు..దేహ రశ్మిని దాచిన బెంగలూ .. వడలి పోయిన కాన్వాసులు

 సిద్ధ మద్దతులేని స్త్రీ ఆర్ధన దొరకక .. శిశిర తమకంతో ఊడిపోయిన నమ్మకాలు.

 నిలదీస్తున్నప్పుడు రాలిపోతున్న సంపద.. అలవిగాక వేలాడే జాగ్రత్తని నులిమి…

 అవసరం లేని అపేక్ష స్థితిని కాల్చే రంగు గోడల్లో బీటలు.. కిటికీ పూచీలు  …

కాళ్ళు మసలించిన ఉడుకు కొండల్లో చిరాకులు.. అవిధేయతని బరువుగా ఈడ్చి

స్త్రీ గా దేహ స్థితిని నమిలినప్పుడు .. ఉరిమి మీద పడుతున్న గమన ఊపిరి గుండాల కూర్పు..

 తెల్లార్లు మోసుకొన్న అనుమాన శిధిలాలని కలిపి కట్టి .

 కొంచెం జాడ మరిచిన కంటితో అసహన నిద్ర తీరుల గతి నిందిస్తూ..

…………………………

నీ మీద కంప్లైంట్స్ ఏమీ లేవు.. ఎలా ఉంటాయి.. అన్నీ నీ పైకి తీసుకొంటావ్..

అరుపులు.. కోపాలు .. నిష్ఠురాలు.. శాపాలు.. నిద్ర పోగొట్టుకొన్న సీసాల జడల గుట్టలు.. అన్నీనావే..

నువ్వా మాట వినడానికి లేదు… అనడానికి లేదు.. మర్చిపోవడం అసలే లేదు…

సంధి చేసుకొన్నా నిర్మాణ రక్షా మధ్యనే కదిలి .. రెండో స్మరణ లేని ఏక దీక్షతో..

ఫ్యూచర్ నాకు అర్ధమై పోయింది.. ఎప్పటికీ ఎదగలేం..ఇలా తగ్గి తగ్గి బతకాల్సిందే..

………………………………..

ఐదు పుట్టుకల అప్పు  .. ఇదంతా అలాగే ఉంది.. కూడా ఉండిపోతుంది….

అనుకోవడానికి లేని భయంగానే తలలో చేరి .. చెమట కొలిమిని అంటించినట్లే ఉంది..

ఇక ఆ రొద ని నెడుతున్న వాగులు.. అకస్మాత్తుగా .. అందీ అందక..

నిడివి తగ్గిన చీకటి బుజాల నొప్పి.. దీర్ఘ రాల్యత లేని పరాయి సగంలో ఇరుక్కొని..

నిర్దయ కప్పిన ఉపిరి ఆడక .. ఆటే ఉండిపోయి.. నిలకడ లేని దేహ చలనం..

ఇదొక పురుష సమాధిపై ఆమె కూర్చొని వేస్తున్న పెయింటింగ్.. అదే తడబాటు పొంగుతూ..

………..

నిర్లిప్త ఆర్చనల దేహ చెదిరింపులో కదలాడే చర్య … చర్చ,,, కరాళ కరకు

నిల్చునే కమ్మేసిన కలలోంచి.. లోపల కూర్చొన్న నేను.. స్థిరపడలేని దేహ నింద..

దీప మాయణతో ఊయస ఎత్తుగడాలని కాల్చి.. పెట్రేగి.. చల్లారక ముందే.. ఉండిపోతారు

శరీర పూతనలో .. కదిలే నిద్ర పూడికల్లో.. శాపనార్ధ ఓటమి కనుసన్నల్లో .. దిగబడి..

కోసి పట్టుకొన్న చంచార్య దేహ దీక్ష కరిగే నిద్ర చలనంలో ఓడిపోతారు..

నలత పట్టిన గోడలని ఇంటిలో మిగిల్చి.. కన్నుకి పట్టిన మగత వీడక ముందే …

తను మళ్ళీ కనిపించనే లేదు.. మాట వినిపించనే లేదు..

…………………………………

13 . పొడి బాటలో ఎర్ర నది.. సమయ ఔషధీ .. అపమ నిరోధి

నిషా డోలనాల కొరివి అంటుకొని.. దీక్షని కప్పి.. మళ్ళీ రాని చావుని పక్కకి తోసి..

తనలో తనే తిట్టుకొని.. నిలదీత రాతని ఊరేగించి.. చప్పుడు లేని ఉపాసన దూరాల లోలిమి..

పొడి బాటలో ఎర్ర నది .. తను ఒప్పుకోక వెళ్లిపోయింది. నిరశన కుదురుకొంది..

కథ మంతనాల్లో స్వశిత నిద్ర.. ఇంకిన నడకలు .. పేనుకొన్న వంతెనలు.. ఇల్లు లేని నిడివి ..

నీ పేరునే నేను తలచుకొని.. ఈ భూమిని తాగి వెళ్ళిపోతాను.. నిందలని వడపోసి..

ఏ అపరాధ జరిమానాలు లేని అనల్ప పెద్ద ఆగడం లో .. మూలకి జరిగి..

నోరు నొప్పి పెట్టేలా చెప్పుకొంటూ .. దేహ సజాత శత్రు నిద్రలో తలపడి..

 ఇంకేం లేదనే దేహ నిర్ధని తిప్పేస్తూ.. మరిన్ని సమయ నడకలని కప్పేస్తూ….

……………………………..

అనూహ్య సందడికి గుచ్చిన ఏక సన్నతి తీరులు.. తీరిక లేని అమరికలని కాదని …లేదని.. వద్దని..

వెనక్కి జరుగుతారు…అక్కడొక మహా నిద్రని శపించినపుడు పుట్టుక నిలదీస్తుంది…

అపమ నిరోధి … పరాయి చలానాలు దుఃఖం పోతపోసి.. కంటి ఊక్షణ ధ్వని.. తడి గోడలు..

సరాసరిగా ఉండిపోయిన … కప్పిన కుర్చీలు.. స్థిమితాయా రాజింపులని కౌగిలిలో..

తడిపి.. మధ్యాహాన్న ఆకలితో పడవ.. కళ్ళలో చెల్లాచెదురైన రంగుపోతలతో.. పూడికలు..

చెట్టుపోసుకొన్న ఇల్లు.. నీరుగారిన నదిలో.. కొట్టాడుతూ.. గదిలో ఉంచుకొన్న మంచాలు..

వాళ్ళు మాట్లాడుకొంటారు.. తాను వెళ్లిపోయింది పాపం.. ఎన్ని పడిందో .. వీడితో..

శ్వాస ఊంగనతో రంగులని తురిమి .. తెరల కట్టుబాటుని వదిలిపెట్టి.. మాంస నిందలు..

……………………………

సమయ ఔషధీ….వయసనే విందుని జోడించి.. అయస్కాంత చలన దీపాన్ని దాచుకొన్న పాట.

ఇప్పుడిలా జీన్స్ తో … బయటకొస్తే దమ్ము కొట్టాల్సిందే .. మాట వెయ్యాల్సిందే..

తనకి .. ఈ జర్నలిజం.. ఈ రిస్క్లు .. తగువులు.. ఎదుగు బొదుగూ లేని జీతాలూ ..

ఎందుకు తాను దగ్గరయ్యేందు.. ఇప్పుడదే మర్చి.. నిందలు.. కలనాలు …దేహవేటులు..

ఇప్పుడేం కంగారు లేదు.. let  us  quit  our  relationship  at any movement… without  any  second  thought ..I can bring back the essence of life…

పోలీసులు అపార్ట్మెంట్ కి రావడమేంటి.. నీ మూలంగా నన్ను నిలదీయడమేంటి?

తల కొట్టేసినట్లైంది.. ఇంకో దారి కనిపించడం లేదు.. నీ నసనీ వినలేను….

 ఈ బురద  మీదేసుకోవడం నా వాళ్ళ కాదు.. నలుగురిలోకి నడవాలంటేనే సిగ్గుగా ఉంది

నువ్వు అరిచావో.. తిట్టుకొన్నామో.. తాగి వచ్చావో అని కాదు.. అంతకు మించి ఇంకేదో..

……………………………

నాకేం issues  .. now a days common kitchen .. age బట్టి డేటింగ్ అప్ లు..

Between us there is no love and lust .. just fill with fearful vacuum. it may blast at any moment .. that is an unstoppable momentum.

It is not yet sustained for long run. ఊరికినే నస పెట్టకు.. ఇది ఇద్దరకీ క్షేమం..

Iam unable to thinking my future with you.. in the same time .. I did not blame you at any kind of hard reasons or hurting thoughts…

అవసరమైతే .. ఇంట్లో ఫోర్స్ చేస్తే.. ఇంత facilities ఉన్న ఈ రోజుల్లో

I just became a Single mother without your support …

నా అండాన్ని ఇస్తే చాలు .. బిడ్డని చేతిలో పెడతారు.. దానికొసం ఎందుకీ రోజూ రచ్చ..

ఆమ్ల గర్భంలో ఒత్తిడి కోసిన విచ్చిల్ల గతి చంద్రుడి నిర్యాణం…

పురుష సన్నాహం లేని గర్భ శిక్షని నిందిస్తూ.. గాలి కొండల్లో కూల్చివేత

……………………..

శూన్య గాధల అననయ మహా దేవళం.. కొట్టి తెచ్చుకొన్న శరీర పుట్టుకలు..వెనక బడిన

మంద్రపు ఊడలు చుట్టుకొని.. పెనవేసుకొని రాలే బీజ గుంభన పడవలు…

ప్రాకృతీయ నిస్సార సాను గమనంలో ఊదుకోని.. అప్పగించిన కరకు నిద్రల మొండాన్ని తెగ్గొట్టి..

ధావన జలాల్లో దొరికే పురుష బీజాల ఎడారి.. సన్మాద కేవలం.. అవిస్సులోని అరుపు…

సౌకుమార్యం అంటే .. మాట లేకుండా పడి ఉండటం కాదు.. తేడా వస్తే తాట తియ్యడం

నాకు నేనై మిగిలి మళ్ళీ పుట్టడం … స్పష్టమవడం.. అర్ధంగా ఉండటం..

                                                        ……………………………….

                                                               5th  CHAPTER

( Back ground : అసలేం కావాలి?

ఎందుకు కావాలి?

 అది అలాగే ఉంటే చాలదా ?

మరోలా ఎందుకు మారిపోవాలి? )

                               నిరావధి దేహ ఆలోకన .. సగ జారణ

కలల వింపూరవ దేహ అనుమతి.. పుట్టుకల పచ్చి గొలుసు కార్చిన తప్పటడుగులు.

.దేహ సరీశ్రుతంలో ఓర్పుగా అల్లిన చీకటి.. ప్రసవ నిండాలని దాటిన కుంకుమ జోల .. అరళితం..

సాక్షి నిందితం.. నాలో ఉన్నప్పటి అలజడి చుట్టూ మహా కక్ష్యలు.. గడుసుగా తెచ్చుకొన్న పడవ…

సంభాళితం … అది ప్రయాణం.. చే సంచీ లోంచి రాలిన పల్చటి పగటి ఊరి చెట్లు….

నేను నీకు ఎప్పటికీ మామూలు కాను. సరిపడే శక్తి వీలుని వడపోసుకొన్న కథలు..

యుగాల అనుకరణ లో నేను నీ లో .. నువ్వు నాలో భాగమై నడవడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం.

పరస్పర విభేదాలు లేకుండా కాదు.. అవీ కావాలి.. ధూప కన్నీరులో నానిన గంటల చెట్టు..

………………………………

దేహపు రెండో పక్క ఉత్త్సవమూ.. మరొక తెలియని అనుమానంలో కూలిన నిద్ర మూర్తుల కలవరం

మనలోకి జారి.. పొగగా కమ్మేస్తుంది. కమిలిన కళ్ళ వెనక దేహ పోతలు….

అవును.. ఒక యుద్ధం తర్వాతే మన పుట్టుక .. ముందెప్పుడూ నిన్ను చూడలేదు..

 ఇప్పుడు చూడకుండానూ ఉండలేను. అలా ఉండిపోవడం .. ఉండడానికి అర్ధం కాదు

ఇదంతా ఆధారమే.. స్పష్టతని కలుపుకొందాం.. విశ్వ వృష్టి కి తాడు కట్టి రాల్చిన వాన

ఇక్కడ కురుస్తుంది. పెద్దగా తెంపి రాల్చుకొన్న నిరాశలు లేవు.. నిద్రలూ వదలవు….

మళ్లించి పెట్టిన వీధుల్లో .. నీ దుమ్ము పెట్టిన కాళ్ళని అక్కడే వదిలేసిరా..

ఆ పడవ మనలని … నదీ మద్యంలో కెరటాలు చుట్టేసిన చోట వదిలిపెడుతుంది.

నా నాభి లోంచి వచ్చే ఊపిరితో నిన్ను కాపాడుకొంటూ.. మన పూర్వ పుట్టుకల దీవిని చేరుస్తాను..

మనం వాళ్ళకి ఏం ఇవ్వగలం? కాస్త తిమ్మితాన్నా? పరుగున? నిద్రానా? ఏమీ కాని విసుగునా?

అంతా శ్వాస తెల్లం.. గస బరువూ … నిద్ర కూడలిలో తిరిగే అనామక చీకటి కురిసినప్పుడు ..

 ఇది మరేమీ కాదని .. తలపట్టుకున్న నెలల గడువుని తెంచి .. మరో చోటికి కదిలిపోతారంతేగా?

…………………  

  సంధి వర్ణంలో దేహ నిడివిని … సాగదీసి.. పొగబెట్టిన నిశార విగ్రహాల పోతని తడుముకొంటూ..

 కక్ష్యల్లో తురిమిన నీటి  బరువుని కలిపి తిప్పుతూ.. చేదు ముద్దలని పిసికిన భయసారాలు. దేహాల కూర్పు

 గిగిర్పులు .. నిద్ర ముడులు.. వదులు చేసిన గొంతుల్లో పండిన చీకటి సారాల తడబాట్లు.. కలతలు..

 దేహ పోలికలు .. సరి వారింపులు..  కదిపినా కదలని నిద్ర దోహలిని కూర్చిన మత్తుని కుదిపి ..

 లొంగిపోని సమయ లిపిని .. సగంలో ఉండిపోయిన చలన ధూపపు గండంలో ఇరుక్కొని ..

 అలమట తీర్చుకొన్న ఊపిరి నిర్దన మితి.. అపార గతి చేర్చిన కాళ్ళ ముడుపు.. రేహాల  అయోమ

కలారీతని మోసే చీకటి సాయుపూతలు.. సక్త మంధన గుదికూర్చిన నిరాశలు

 చెక్కిన తలుపుల విసురు నడకలో పోతపోసిన దేహాలని తాగి .. వర్ణ సగపు మంత్ర చప్పుడుని కాదని

నేను ఆ దూరంలో నిలబడ్డాను. నీ అనుమతి నా లోపల తొలచిన కథనంతో కూలిన పగటి గది.

 కొత్త ముగ్ధంలో పండిపొతారు. ఇది ఒకప్పుడు తెలిసినట్లుగా లేదని వాళ్ళు చెప్పుకొంటారు.

                                                     ………………………………….

 సమర్పించబడ్డ దేహ అర్ధం నాలోపల చీకట్లో చోటు దొరకక ఉండిపోయింది..సాధ్య నిరాగి …

నాకు ఏ సమయం దొరకని నిద్ర దశ తీరుబడిగా ఉండదని.. తలదూప మంగళ రొద

కాస్త విసుగు గదిలో కోరిన మాటనే .. మళ్ళీ తొడుక్కొని అక్కడే ఆగిపోయిన పుట్టు రవ్వలు ..

నిషాధూప అవలింతని కరిగించి .. నేను చెప్పుకు పోయిన విశ్వ మూర్తి నిండిన ఆ ఇల్లు ..

 ఇక నాది కాదని తోసేస్తారు.. సంయమ గాలింపులో ఊట దొరకని పెదాల గని..

తన విగ్రహ విలయంలో తిరుగుతుంది. దేహ అరాచకంలో చల్లారిన తెగదెంపులు.. అలసర..

స్తబ్ధ సంధి .. ముసుగు తీసిన నిర్ణయంలో పడి కొట్టుకొనే తలుపులు..పూడుకు పోయిన….

 నిరూప పాదాలు.. ఇరికించుకొనే ఉండిపోయిన సదా ముంపుల తొలచివేత.. 

ఊపిన జాగారం మండలం.. పైకి ముడిచినా వదలని కంటి పట్టుని దులిపి.. గొంతులో తిరిగింది.

ఇంకా కొన్ని కలలని అందిపుచ్చుకొంటారు.     

…………………………….        

ఇక్కడ మనమేం చెప్పుకున్నామని నవ్వుకొంటాం.. ఆశ్రిత జాగరణ .. సృష్టి మసకలో ఎక్కడో…అక్కడో…

 దూరంగా .. గాలిలో కలువలు విచ్చుకొంటాయట .. చంద్ర కెరటం .. ఇంటి ముందు ఆగి .

 కూడా తెచ్చిన పడవలోకి పిలుస్తుందట … నాకు కొంచెం వెసులుబాటు కావాలంటే..

 ఆ మహా నిద్ర నీటి అడుగున ఓ శ్వాస మండలమే కట్టి .. ఐదారనీ అందులోకి వదులుతుంది..

నువ్వు నాకు ఎప్పటికీ పరాయివే .. అంతలోనే నిన్ను మించిన పరిచిత .. ఈ భూమి మీద నాకెవ్వరూ లేరు.

అన్నీ నాలోపలికి అలా యధాలాపంగానే రాలేదు.. కొన్ని లక్షలసార్లు ఈ కన్ను చిట్లి పోయింది..

 ఈ దుఃఖం గడ్డకట్టింది.. చెమట కకావికలంగా ముంచేసింది. రప్పించుకొంది….

నాకు ఏదో కావాలి.. కాని .. దానిని కూడా నీతోనే మొదలుపెట్టి .. నీతోనే ముగిస్తాను.

ఇంకే ఏ యుగ నిద్ర నాలో గడ్డకట్టదు. నేనిలా నిరాకార మృత్యువుగా నీలో ఉండిపోవడానికి ….

 చోటు అడుగుతాను.  మాంస చెమరింపుల పక్క సర్దుతాను

      1.తను నేను కాదు .. స్వమర్మ తీవ్రాలు .. ఎనిమిదో అడుగు

ఇది నా దేహం .. నీకు ప్రయోగ శాలగా అప్పగించుకోలేను.. అస్థిర మంత్రార్ధతని విసిరి అవతల వేసి .. నీలంగా చూస్తూ….పొడుచుకొచ్చిన నల్ల గర్భపు అంటురాటలు…

నాకు అర్ధమైంది.. నేను మోసపోయాను.. నీ వల్ల ఏమీ కాదు.. నిదానించి చెబుతున్నానని నాకు తెల్సు

 నల్ల నిద్రల కంటిపోటు …విరామ గతిక మంటలో నులినొప్పి… కాళ్ళ గట్టు

పెర్ఫార్మన్స్ anxiety  అనేది .. నీకొక ముసుగు.. నేనిది ఓపెన్ చెయ్యకుండా ఉండటం కుదరదు..

 నువ్వు చస్తానన్న ..    నాకు నిమిత్తం లేదు.. నేనిక దీనిని మోయలేను….

తను నేను కాదు.. మధ్యమ ఉపరీయాస .. చెమట పురీయంలో పెద్ద అండ …

నా బాడీ కోరుకొంటున్నవి .. నేను టైంకి ఇవ్వలేకపోతే … దానికి నేను అన్యాయం చేసుకోవడమే..

అతను అలా నిశ్చేష్టగా ఉండిపోయాడు.. చేతిలో మెడికల్ రిపోర్ట్ తను చూడడానికి సిద్ధంగా లేదు..

 కనీసం కంటి చూపుని కూడా కలపడం లేదు.. విసిరేసిన పడకలు .. మూట గట్టిన పెదాలు

నాలుగేళ్ల   ప్రేమ .. ఒక ఏడాది పెళ్లి లైఫ్ తర్వాత … వికర్ష సానునయ విగ్రహ నలతలు..

పురీష ఆమ్లతలు ఎండిపోయిన గర్భంలా.. కుమిలిన దేహ సాధ్యంలో ఒడి పంచిన ఎనిమిదో అడుగు …

ఏడు గుమ్మాల చావు వానగా కూలిపోతూ… పుట్టుక సమాయించిన దిష్ఠిజాల … అల్పితం

 తల పండిన మూలకాల నిష్పత్తులని కాదని … సజామయం.. ఆవర్ష దీప వైరాశ్య .. 

తట్టి లేపిన గుమ్మాల తోవలో అరమూత సాయాల్నే కాదని …

నిజ ధూప మంతనాలతో పండిన చీకటి అయోజ నిడివి లేని ఆయాస విఖీమ…

ముమ్మర గొంతుల్లో దోరగా నవ్వినా వీధి.. పురా వికార్మిత అసహన స్వమర్మ తీవ్రాలు…

…………………..

నేను కాని తీవ్రాలు … ఆపాయ కక్ష్యల్లో అనుదాహన లేని చలి గొట్టాలు.. నులి పేగులు ..

 దవడ కండరాలు.. చేదు కాగలీలు.. మృత అండ ఊపిరి అంపకాల చమురుని పీల్చి ..

నిలువు కొండపై తడిచిన ఇల్లు…. సమాశ్రమ మితి మిశ్రమ చంచార్య కలబెట్టిన మోయరాలు..

నియో ధారతని వదిలి పెట్టి .. కలహేళి పడ్డ ధమాకా వెలతలు.. కలత నిద్రల గాలి విషాలు

కలత నిర్యయ రాత్రంలో కోతపడ్డ గదులనేత.. ఆవరించిన నిరూప గద్గత’… పోహరింపు.

నన్ను ఒప్పుకోవడానికి ఏం మిగులందని? ఏది ఎటువైపు నుంచి నిజమౌతుంది?

తలుపు చివర సీసాని కట్టి వెళ్లిపోయింది.. విధాగ భద్రతలో ఏదీ మిగిలి లేదు..

తెలుస్తుంది.. తెలియకుండా ఉండాలని ఆశ.. ఈ తెలియక పోవడమే ఎన్ని రోజులని?

దస్త్ర ఒడంబడికలు కంట్లోంచి రాలి.. సూదులుగా గుచ్చుకొని.. చూపు చివర పేనుకొంటున్న తాడు .

 కొంచెం ఎండిన గెంజి వాసన .. పులిసిన చెమట మింగిన శ్వాస

……..

సదా నీజ్ఞాత … యజ్ఞతలం ముందు సరి చెయ్యని శరీరం .. సీసాలో మగ్గుతూ ..

 ధృష్టిని తప్పించిన దేహ మొండాలు.. హెరిడీటీ లేం లేవుగా?

ఇంకొంచెం టైం .. దేహ సహకారమంతే.. ఇదంతా వద్దు .. తొక్కిపెడితే ఇంకాస్త రాక్షస తృప్తి..

వాడలా కాళ్ళ దగ్గరే పడి ఉండాలని అనుకొంటుందేమో..

ఈ నెల్లోనే తనెంతో దూరం జరిగిపోయినట్లుగా …ఇంకెప్పటికీ ఆ చెయ్యి దొరికదన్నట్లు..

మొరిగిన ధర్మ నింద .. కట్టి పోసుకున్న దూరాలు.. ఏక ఆజ్యత లేని నిద్ర విగుణ తీరులు..

అదే దేహం .. నేను కనపడని అద్దం లో మంచు కురిసిన శరీర పేటిక ..

తనతో ముడిపడిన ఈ బరువు ముఖాల చర్మ దండం .. తిరగబడి వెకిలిగా నవ్వి..

శిశు నిజ్ఞత .. తడి పోతూ మంత్ర దండం గట్టి పడని వర ప్రదాతలు.. వీర్య సవరాలు..

……………………….

కంటిపోటు మొదలయ్యాక ఆలోమ స్థితి మగత చంద్ర వర్తనలు..

పేరుకు పోయిన నల్ల గర్భపు తంత్ర నిందలు.. కలహేతులు.. కొండగుర్తులు..

ఊటల చేదు బిలంలో కూలిపోయిన దేహ రక్షా వికారాలు.. ఆలోలయ పూర్ణ మృతులు..

అన్నింటి నించి బయటపడటం .. అందిపోతలు.. అరమూత చప్పుడులు.. అలాతలు..

కందిపోయిన శేషజ భూమి పై మెట్టులోంచి నాచు పట్టిన వెకిలి నవ్వు మీదకి చుట్టుకొని…

                ఊపిరి అరగదీసి మంత్రం జాతరలో తప్పిపోయిన కథల నిడివి.. గాలింపు.

తను నవ్వినా వదలని ఆ ఎర్ర గాటు తెగబడి కుట్లు పడని  గాయం..  యుగాలుగా..

పరిచేత అపరిచయ నల్ల కెరటాలుగా .. దీప పాకుడిని దులిపే ఆ చోటునే నింపి..

మట్టి బుట్టలో చేతికి దొరికిన అంగాలు.. ఓటమి.. చెలగాటపు నిద్ర సాధ్యాలు

తలని పొంచి.. పై ముగ్ధ స్కలీయాలు .. ఎంతకీ  ఆగని ఊటలు.. అటే కన్నీరు..

                                                           …………………………….              

  • గమించిన ఆవాళి .. మూడు రాత్రుల విలాపన   .. కాస్త భయం పూసుకొని

దేహ సమయస్కాంత అద్దిన రంగుల చెమటతో .. పరిమళ వర్ణతలంలో ఆర్తన కురిసి .. తడిచిన కాస్త  భయం పూసుకొని..చెలరేగిన మంత్ర జిలుగులతో .. తిప్పి పెట్టుకొన్న దేహరాశిని అరగదీసి ..

 అక్కడే సరిచేసుకున్న ఇల్లు పిలుస్తూనే ఉండిపోయింది.. తెల్ల నిద్రల  మధ్య లేచి … ముగ్గు పోసుకొంది

అకారమితి సర్దుకొని శత్రు ఊడలతో చిక్కుకొని.. విశ్వ సంధిని సరిచేసుకోని .

 గర్భ తాండవ రాశిలోపడి తిరుగుతూ.. తప్పించుకు పోయిన అనుమాన పాటలని కాల్చి ..

 అనూహమ శూన్యంలోంచి ఒలికే సంధి ముంపులు.. ముడి నుడి మాంసాలని ఉడకబెట్టి….

గమించిన ఆవాళి .. వాళ్ళు వెనక్కి పీల్చి .. ముందుకు ఊగి .. చలన కేలన ఊపిన ముట్టడితో..

 కాస్త భయం పూసుకొని.. చెమ్మని ఇగరబెట్టి.. కొంచెం నిద్ర జడని అల్లి .. కమ్మేసిన దేహ జోరుని …లలింపుని

పట్టి .. లాగుతూ.. కోసి .. అతుకుతూ.. జోకొట్టి.. కలలో కప్పి.. దేహంలోకి ఆర్పి …

………………………

అపరిమితమూ .. దేహ జోడింపు.. కథ చెదిరిన నిద్ర మూర్తుల కౌగిలి .. తడి రాళ్ళ పేర్పులోని కంగారు..

 నేనే ఉన్నాను.. కొత్త నిద్రని మార్చుకొని తేలుతూ జరిగి.. అటు పక్కకి ఒరిగి .. ఇసుమంత కరిగి…

నిశ్చల ఊగాంతంలో పడి లేచిన కెరటాల తోపు .. కల మందలింపు.. ఆశ్వాస చెమరింపు

నిద్ర పురాయింపుల దేహ ఆర్తన… పొడవుగా లాగిన దేహ గంధపు పరిమిత మాటలు.. ఒంపులు.. ఆటుపోట్లు.. అదిరింపులు.. అందిపుచ్చుకొన్న ఆశ్వాస చెమరింపు పట్టిన మూడు రాత్రుల విలాపన గొంతులు..

స్పర్ధార విపులీయంలో పడి రాలే గొడుగుల అడ్డన … అక్కడే గాథని చేర్చిన ముగింపు పరిధుల్లో  కలబడే .. నేనై ఉన్నాననే తీరుని సర్ది.. ముఖాలని సరిచేసారు. మాటని అతకక చేస్తూ ఉండిపోయారు.

ఖాళీ రాత్రుల విలాపం ముద్రని మార్చి.. దుఃఖ శిలాజ ముద్దని నూర్చి.. నుదిటి పట్టీల వేసి.. అలాగే నిండి..

………………………..

విలోమ నిందలు లేని చీకటి కలుసుకొంటూ .. దేహ గంభీర జాగృతిని సరిచేసి కదిలే శరణుకొండని

నీ కాళ్ళ  దగ్గరే ఉంచి .. నేను శాశ్వతమవ్వాలని ఆశ. తిప్పి చుట్టాలని గోష….

మరేం తెలియదు .. అలాగని ముందే తెలిసినట్లుగా అతకదు .. చెప్పిపెట్టుకోవాలి..

సంపూరణ జరుగుబాటుని తను తలలో చుట్టింది .. తడిదేరిన రాత్రి జోరుని మింగే  కాగితాల గుట్ట..

అల్లాగే ఆగేపోలేం.. మాటతీసుకొని మరలా చేరుకోలేం.. ఎప్పటికైనా అని చెప్పి పెట్టుకున్నా .. విడిపోనూ లేం.. అంతా అలాగే ఆగిపోయింది … తెలిసినట్లే అనుకోనిది జరిగిపోయింది….

అదో సమ్మతిలోని అకారణ శ్లేష .. గొంతు గరగ .. కూర్చిన నల్ల దీపపు మెత్తడి.. నివ్వెరలు .. 

అరల మధ్యంలో పొడి చేసుకొన్న చూపులని దాటి .. అక్కడెవరో కళ్ళని పట్టి  మాట్లాడే ఉంటారు..

అధమ మరకని దువ్వుతూ .. నిశ్శ్రేష భూమి ఏడ్చిన ఖాళీలని తాగి .. కొంచెం తిరగబడ్డాక..

…………………………..        

అనూహ్యత ఎలానూ ఉండేదే.. ఈ దేహమూ.. నువ్వూ.. ఎప్పటికీ చేరని పడవ .

 గాలి గొంతులో తడబడే ఉండిపోయిన బెంగ .. నువ్వనే ఆచూకీ లేని విపత్తు గడిచిన లెక్కలు అర్ధం కాక ..

గమించిన .. గమించకున్నా .. ఇక్కడేం చీకటి తడిచి .. బెంగ నీరుని నింపుకొని.. చూపు కసురుకొని..

 శరీర ఆసాంతమూ నిండిన గతులని సర్దుకొని.. ఇల్లు కనబడదు. చూపు బెణకదు.. ఎత్తు అడగదు.

దగ్గరకి రమ్మన్నా .. వెళ్ళ లేదని అలాకాదు.. మళ్ళీ .. మళ్ళీ .. పిలిచి ఇబ్బందీ పెట్టదు.

సరిలిత అనుకూలనాలు.. ఒక్కో రాత్రిని మొదలుపెట్టి.. అటు పక్క కూలిపోయిన .. విలాప ఎగిరిపోయిన…

 పునాదులని సర్ది పెట్టి.. నింపిపోయిన జారు ముఖాలన్ని కడిగి.. నువ్వా ? అని ఉలిక్కి పడుతుంది.

ఆ చీకటికీ .. నాకూ ఇదంతా తెలుసని.. అనుకొన్న .. అక్కడ బదులు లేని ఘటనల పొట్టు దులిపి..

మాట కలిపి.. నీరు చిలికి.. శ్వాస గాలించి.. మూడు రాత్రుల బరువుని మోయించి..

ఓ నిండు సమాధి.. శ్వాస ఏరులో .. దుమికిన కెరటాల జూలుని బిగించి..

ఏక దీహం కానీ నిద్ర ఉత్త్సవ సంపోదని మరిగించి.. కాళ్ళకి పాలుపోసి.. తలని చీకటి  తోరణాల మధ్య గాలించి … ఊసు లేదని .. సరిచెయ్యని గోడలని దులిపి.. ఎత్తులు వదలగొట్టి…

 చిలికిన దుఃఖ పొడవుని.. అతికించి.. నిరూణ రాశుల్లో తగలబడి.. నీలాగబడిన ఏక రోహణకి అందీ అందక..

 ఇంకేం కానీ నిరూప దేహ నీరంలో వడపోసుకొని.. ఊది పెదాలకిచ్చి… తడబడతూనే ఉండిపోయారు.

                                                 ————————————        

       3.కాడె మోసిన బెడ్ రూమ్ .. గుప్పిన అలకలు .. ఇక అలా నమ్మలేం

 ఇల్లు మనకిచ్చి .. ఇక ఎవరూ ఉండకుండా వెళ్ళిపోతారు.. అడగాలని అనిపించదు.. అనువుగా లేని మాటలని నానబెట్టి.. ఉనికి మొత్తం పేల్చేసిన వీధిని చూస్తుండి పోయి.. నీరుని అదిలించి…

 కొంచెం  నిస్సత్తు ముంపులోకి పాకుతూ .. గుప్పిన అల్లికలు మళ్ళీ విడదీసి.. నీరుని ముంచి..

నిశ్శ్రేష ధూళి పోసుకున్న గోళంలో ఊరేగి.. చలన మునకని దోచి పెట్టి ..

లొంగిపోని కథల కిటుకుని తెచ్చుకొన్న చీకటి మెట్ల దగ్గర ఊరిపోయిన చీకుడు నవ్వుతో..

నిర్జన్త తీరునీ .. సాధ్య వికారంలో అలిమేసిన కంటి ధోరణిని .. కౌగిలి మందలింపునీ..

సరిచెయ్యక.. చేసిందీ ఒప్పుకోక .. అలాగే ఉండనీయక .. అదిలించిన స్వసాయ గోడు…

కొన్ని మాటలని.. రీతులని.. సామానులనీ … గోడలకి బొమ్మలనీ.. గాలి మొండాలనీ…

అక్కడే చాటుగా .. విడి విడిగా ఇద్దరకీ కొన్ని.. కలిపి కొన్ని.. చెప్పలేక కొన్ని.. అపచ్చయానవ్వు

చెలరేగుతున్న ప్రశ్నల్లో .. బెదురుతున్న అనుమానాల్ని గడ్డ చేసి.. ఇంకేం కానీ..

కదలక నిద్రరశ్మిని .. దేహ రజనుని .. తాల్చిన శరీర నిధినీ .. మునకనీ .. చేరేగింపునీ..

కాడె మోసిన బెడ్ రూమ్ని .. వాళ్ళు అనుకొన్న చోటే దించి.. కొంటెగా నవ్వి.. అరచేతులని ..

చలి మడుగు తప్పించుకోవడానికి రుద్ది.. నుదిటిని బోర్లించి మంట వేసి.. ఊడిపోయి..

అసమ సన్నాహాల్లో .. పడి లేచిన కెరటాల మధ్య తెలియని ఊరేగింపుని కప్పి…

దుప్పటి అడుగులో .. ఎండపొడిని నూల్చి .. కన్ను పడలేదని వాళ్లకి కబురు పెట్టి …

…………………

మనం ఎదురెదురు పాడినప్పుడు .. ఇక అలాని నమ్మలేం.. తడవలేం..

తుడిచి పెట్టుకు పోయిన నిద్ర మోడులనే తవ్వి .. దూరంగా విసిరేయలేం.. కనిపెట్టుకోలేం

చెంప నిమిరిన .. దేహ ఆయాస మడుముల్లో పడి లాక్కుపోయి.. ముద్దు.. సమమూటలు

సంధి నిందని .. మళ్ళీ పొడిచి.. దేహ వసారాలో వాళ్ళు తొక్కి పోయిన నిరా కోతలు..

అక్కడే కంగారు పడినా .. రెప్పకి రంగుని తుడిచినా .. సమయ నిరతని వదిలించినా .. అదీ ఆగిపోదని..

కొన్ని గుప్పిన అలకల మధ్య స్నాన ఊటలని తుడిచి.. కంటి బుడగని ఊది..

మళ్ళీ రాని వీధిని రాళ్లతో కట్టి.. విప్పి చెప్పుకొన్న గాలి రాతలు.. పాత బట్టలు..

చీకి పోకముందే .. విడిచి.. తల స్నానం చేసి.. అలానే లోపలికి  వస్తే.. ఇంటిని సర్ది… సమమూటలు

అనుకోకుండా తడిచి.. నలిగి.. ఊరేగి .. చలన గతి ఓడిపోయి.. అలా ఉండటమే ..

వృత్త గదిలో చెమర్చిన ముసుగుని తీసి..దేహ కరువుని సాగు చేసి.. పిల్లలు..

చీముడు ముక్కులు.. చిరిగినా లాగులు.. కొట్టుకు పోయిన చర్మాలు.. నిద్రని గీరుతూ ఆట .. నత్థి మాటల మధ్య తేనె కుండని  పగలకొట్టిన నవ్వు.

……………………………..

ఒబ్బిడి లేని అలసట .. రాత్రి కాదనుకున్న స్మశాన నిద్ర .. ఊరుకోలుకోని మంతనాలు..

అదిలించి .. సరిచేసుకోని.. కదిలించి.. అలా కూర్చుకొని.. చప్పరించి…

అపక్రమత కాగిన పెద్ద చీకటి అలారంలో దాక్కొని .. ఉండిపోయిన పడకలని .. కళ్ళనీ..

సముద్రాలుగా జోడించాలని.. కెరటాలని గుప్పించి.. దీవి ముడుపులని..

అతని ఆశని .. క్షమాయ దీనతని … రగిలింత పీడననీ.. విని.. పిచ్చిగా చూసింది.

ఆ స్మశాన నగరాల్లో .. పెదాల ఇగిర్చిన నల్ల బూడిద .. నాకు ఊపిరాడదు.

…………………………

నువ్వెళ్లు.. రాత్రుళ్ళు నాకు వాడు తోడుంటాడులే.. వర్ధత జాడలు… నాల్కలు

గర్భ నిరాకరణ నేను ముందు నుంచి అనుకున్నదే .. చలి మడుగులో మంచు తురుము..

అధీజ్ఞ వశీమ దాపుల్లో .. చెరిగి పోయిన.. గోడలు ఒంచేసిన.. గుమ్మాలు ఒదగవు.. గంటలు మోగవు…

కాళ్ళకి.. దోసిలికి.. ఉపరి తలంలో ఊయల ఊటలకి.. అల్లికని ఊపి.. తధా ఆర్పులు

చెదురు.. మదురు ఎత్తుల్లో .. నదురు కుదురు లోయల్లో.. మరకల గొంతుల్లో.. తోడినేతలు

ఆపరౌయాణాల..చేర్చి పెట్టుకున్న సమాధి స్థలాలు.. కుదిరిన నిద్రత దాహమాలు.. అలపులు

ద్వయస్తంభన శరీరాలికి .. సలసలాడే పాదాల దొంతర్లలో .. అర ముడుత గానుగల్లో..

కేకలని.. దీప మందలింపులనీ.. నడకలనీ.. దాటి .. నానబెట్టిన ఊయలల రంకె

పోత పోసిన మధ్య మధ్యహాన్నతలుపులతో  నిండిపోయిన పోలికల ముఖాలు..  ..  

                                                             ———————————

      4.అలిమిన సంహకార కథలు.. అదేం వద్దులే .. బంధన నివాళి

ఉద్రిక్తతలు … సమయ నిర్బంధ బంధన నివాళితో చేర్చుకొన్న నిద్ర గుహల్లో నిపాయ గండం అమరుతుంది.. కదిలించలేని అవస్థ చెమర్చి.. ఒడ్డుకి రాలిన చీకటి సర్దుబాటు..

 నీరు పట్టిన శంఖంలా వణికే నీ గొంతు.. జ్వర పడ్డ మంచు కొండలా నిలబడి..

నీ ఇష్టం.. ఎప్పుడైనా .. రా ? నీ దగ్గర ఇంకో డూప్లికేట్ కీ ఉందిగా?

ఈఫ్ యు నీడ్స్ మై హెల్ప్ సెండ్ మీ ది వాట్సాప్.. with current location

మన ఆల్బం.. మనం కలిసి నప్పటి నుంచి ఇప్పటి వరకు.. అది మన  దేహలీల

పుప్పొడి శకలాల్లో వాన బండి పై వస్తున్నా పెళ్ళికూతురిలా .. నువ్వు.. తహతకలతో…

రంగు కొండల మధ్యలో వెదురు పంటకి వేలాడే ఇల్లు.. శూన్యపు గుహలలోకి ప్రవహిస్తున్న నది..

దేహం చేసిన అయస్కాంత ఖనిజాల సమీకరణ.. మన నువ్వుని సర్దుకొంటూ…..

వర్ణశిల ఆరబోసుకొన్న ఎడారిలో పాత గుడి జరీలు విడిచిపెట్టి ఎగురుతుంది.

అల్లిక లేని రెండో గదిలో .. మొండిగా వేలాడుతూ ప్యాంటు .. షర్ట్ .. గాలిలో .. నీ దేహమై..

………………………………..

ద్రవ వ్యూహంలో .. స్థితి సామ్యత లేని దేహ ఊంజల గాలులు.. పెద్ద కోతల వాన గట్టు..

 మన నువ్వుని సర్దుకొంటూ  తడబాటులు దిద్దుకోలేని మహానగరంలో చెదిరిన గొంతుతో  తిరిగి…

ఎప్పుడూ పిల్చుకొనేది నిన్నే…. అంతకంటే మరేమీ తెలియదు నాకు

 అటు -ఇటు … నువ్వు – నేనూ .. కప్పిపోవడానికి లేని చేతన నిద్రల హోరు..

కదిలించి.. విడదీసి.. మాటని తాగి.. పాటని విని… సమయ నిందని ఊరిస్తూ..

కుదిపిన నిద్ర దోహలి మంత్ర రీతిని సరిచెయ్యక .. ఉండిపోయిన అగాధ జతుల మేళా ..

……………………….

అదే కథని .. తెలియని వివిధాల తీరుని కప్పి.. చప్పరించిన నిశామ శూన్య ధార.. 

నాకేం కంప్లైంట్స్ లేవు.. ఇద్దరు కలిపితేనే ఇల్లయినప్పుడు .. నీదీ కష్టమేగా ?

నా భుజాలకే అంత శక్తి లేదు.. లేదన్నదీ మన అగ్రిమెంట్ అయినప్పుడు …

 ఈ పాట ఎందుకు దిగులు పడాలి? ఈ మాటెందుకు నీతో కలిసి ఎంగిలి పడకుండా ఉండాలి?

 ఆయాస సమ దృష్టి సెగ నిండిన పడక .. ఇప్పుడు ఒంటరి..

 నువ్వొచ్చే వరకు నేను సోఫాలోనే.. ఈ బాటిల్ ఇంకా ఖాళీ కాలేదులే….

అపాశ్రమ .. వెదుక్కోవడం.. శరీర శ్రధలపై నిరూయన శబ్ద తాడన జరుపుకొంటూ..

ధ్వని కటకాల్లో .. ఇంటి చాటుమాటు గదుల్లో.. ఆర్చి పెట్టుకున్న పరాయి నీరు…

……………………………

అందీ అందని .. మృత్యు గడువులో నుదిటిపోటుని సరిచేసి .. ఎవరో నవ్వారుగా…

అప్పటి దేహ వాన దీపాల్లోకి జారి.. బెంగపడి .. చెట్ల తోపులు.. గది మండలాలు..

గదిని జలానికి పట్టించి .. ధూపం వేసిన కలలు .. కళ్ళలో ఆనవేసిన మరకల చిహ్నాలు ..

నీతో కలిసి .. నిద్ర సాగిలపాటులో దిగబడినప్పుడు..

భయం కాల్చిన .. చీకటి పోసుకున్న .. పుట్టుకల తోడు.. వరద దీవులు .. మన కాళ్ళు..

……………………………..

అవనీయన ఆ ఎత్తులోంచి కూలి… పొదువుకొని .. చేదు రుంజనల వెలుపురు

అడ్డుకొన్నారు.. దేహద్రవం పంచుకొన్న కాలి జాడలు..  నీటి తోడులు .. రగడింపు  ..

రుచి లేని రెప్పలని పట్టి.. చీకటి పులిమిన గది చెమ్మ .. పగిలిన కుండలు..

ఆయు పులాప .. పండిన రోజుల క్షతిజ తలంపై గడుసు నిద్రల కీడులు..

విని .. కని.. తప్పుకొన్న తెలియని కంటి రొద.. మాటల గత్తర .. మాంసాల స్వాంజర ..

ఇది ఇలాగే జరుగుతూ ఉంటుందని నమ్ముదామా?

                                            ——————————

5.విందు తమకాలు.. నీటి గంటలు.. కలబడి తిరిగి

పరస్పర సహాయ అనుకరణలో పడి .. కలబడి తిరిగి .. కలత నిందని కడిగి .. విసిరి..

తలపట్టుకున్న దేహ రోషాల కన్నుని అరగదీసి.. చీకటి లజ్జకి మెరుగులు పెట్టి.. రంగులు గెలిచి .

 పరిమళ గతిలో చిట్లి..ముద్దు రుణాన్ని మోయలేక విడిచేసి..

ఇప్పటికి చెప్పుకొని.. అలా ఉండిపోలేక.. మరి పూర్ణ నిడుగుల్లో తడిచిన కాళ్ళు ..

                  నిర్లాయ గుణి .. తోడుపెట్టుకొన్న చీకటిని వార్చుతూ.. నింద మడుగులు..

అక్కడే … తలుపు వెనక లిప్స్టిక్ మరకలు.. ఎర్ర గాజు ముక్కలు.. గాలి గలగలలు

ఆవాసక నిద్ర మోడుల్లో.. తల గడువుల్లో .. నడుము చిప్పిల్లిన చప్పుడు గుప్పిలిలో.. దిగబడి..

నిలువు రాతల పట్టూ .. విడుపుని .. దగ్గర చేసి.. శ్వాస నిర్గ్రాఫు నిమిత్తని సరిచేసి..

చెమట గొడుగుని .. శరీర కూర్పుల కౌగిలి దమ్ముని.. సరి చెయ్యని.. సరిగా లేని..

పట్టి తెచ్చిన దూరాలని ముద్దగా .. చివుళ్లు కలిపినా విడదీయని నిద్ర గాడ్పుల్లో….

ఆపుకొన్నవి.. చెప్పుకొని దూరం జరిగినవీ .. అనుకోక దగ్గరయ్యేవీ ..

కన్నుని చాలించుకొని అవహేయ ముతక నీరుని .. లోపలి దిద్దుకొని .. నిన్నే చూస్తాను.

……………………….

చెలరేగిన విందు తమకాలు.. ఉప్పుని నీటి అంపకం .. నాకిన చలనగతి తేలికలు..

తప మాత్ర ఆంచారీత .. కలగలిసిన ముఖాల ముడి.. దంపుడు ..

సంచార ద్రోహన ముంపులు .. కలబడి నేసిన శ్వాస దిగులు బరువులు.. ముప్పులు ..

తేల్చుకోలేని అంతర్య శిలా పాదుల్లో .. అల్లుకున్న రగడతల నీటి గుణ్ణం కప్పుకొని..

ఏ రాత్రి మధ్యలోనో … అంటే తెలియని ఆయాస కంపిత ముడులలోనో.. గసపైనో …

దుప్పటి విరిచిన కెరటాల దీవి.. కనుసన్న విబేధ్య రహాయ తోడివేతలని..విపల గతులని..

నిరాయ శృయ ద్రోణిని దేహంలోకి రజనుని ఒంపి.. ఒడిసి పట్టుకొన్న నుదురు ..

గుంభించి .. సదా మాయ కీడులో దిగబడి .. పట్టుకొన్న నుదురు.. శబ్ద జీరలు … 

అలసట లోపలిదీ .. అలజడి బయటదీ .. కన్ను చిలికిన వాన ఇద్దరిదీ .. కగాలీనత..

తన్మ కొండల్లోంచి జారే నిద్ర పురాల్లో .. పులిమి చుట్టుకొన్న జోడింపు మండలాలు.. కుదురు ..

ఉన్నప్పుడే .. లేనిదీ.. లేకుండా ఉన్నదీ .. తలలోంచి కారిపోయేది.. కళ్ళలో కురిసేది..

……………………………

క్యాలెండర్లు జారవిడిచిన పెద్ద ఉత్సవాలు… శరణు దొంతి.. శరీర నిగురు ..

మళ్ళీనా .. మళ్ళీ మళ్ళీనా ..ఇప్పుడు నేనోద్దంటే.. ఒప్పించుకొనే సరిజోతల్లో ..

కలిపి చుట్టిన గొంతు నురుగుల్లో .. నానబెట్టిన శ్వాస వేడిలోంచి.. మతి గర్హత

ఆందియాల దేహ కొలువుని పగలగొట్టి .. మగతనపు మోటు మాటలని దుళ్లగొట్టి ..

ఇద్దరూ .. ఒకటయ్యే దేహ నాదాతల మహః గంభీర.. ఎందుకు దేనికైనా తక్కువా?

అటు..ఇటు.. చాటు మాటు చీకట్లు ఉండనియ్యి.. కరగనియ్యి.. కూలనియ్యి..

ఎంగిలి కవ్వింతని ఊరబెట్టిన నీటి గంటలు మోగనియ్యి .. ఏదీ అలాగే ఉండిపోదు.

…………………………………

 సఫలమిత తీర్ధ భావి కమ్మిన వీధుల్లో.. గాలుల్లో.. కలిపినా వదలని కంగారు ముద్రల్లో..

పొడవైన నిద్ర .. విడిపోతాల చేతుల్ని కదుపుతూ .. నిరాయ వ్యతిరిక్త రంధన .. ఉండీలేదు.

తననుకొని మాత్రమే ఉంది.. కలిపి చుట్టుకొని ఆయాస పడింది.. అక్కున చేరింది.

కై జోర్ల అదిలింపుల మధ్యనే నిండిపోయే గదుల సడి.. మాది దున్నిన కాళ్ళ హోరిమి..

తడి గోడ బొమ్మలపై శరీరం అద్ది .. అటు మళ్లించిన నవ్వు దవడలు.. మెడ మోడులు…

నికర్ష స్వయం స్థావర .. గతనుత శ్వాస రాయన .. అందీ అందని నీళ్ల గంధం తీసి.. 

అదో .. సంకర్ణ గుణత .. ఛాయా రుణ .. గతి చామన చెలగాటం..

మీద చుట్టిన గొంతులో పాట .. ఉండీ .. లేకపోయినా అలసట… సళాయలు..

చెల్లుబాటు కానీ అద్దక ముంపులో శ్వాస పూతలు.. కరగనీరులు.. కణతల పొంగు

ఇదే దేహమనే .. నా నిద్ర ఋణం ఊగిపోయి.. రోజంతా నడిచే ఏడూ రంగులు అద్దకం..

ఇది .. ఇలాగొ .. ఎలాగో .. లేకపోవడమే .. ఉందని .. కదిలి చేరుకుందని..

                                                       ————————————–

                   6. Register eye … మూడో తీర్పు… కొండ నలత   

 దేహంలోంచి దేహానికి చేర్చుకొన్న … పగటి చాంచల్య తీర్ధంలో కనబడని పోలికని ..

 తీరు పట్టిన .. తీరు మార్చిన.. కథలతో.. విని ఒప్పుకొని పక్కకి పోలేక .. అలిగిన అమాంతంలో 

ఒంటికి పట్టిన గదులని కడుగుతూ.. నిరూప పరిమళంలోంచి.. దేహం చొచ్చుకు రావడం..

విపరీత చపలంలో పడి కొట్టుకొని … Register eye … నెట్టుకొని పోసిన నాటక తెరలు..

దేహ మడతలని సరి చెయ్యక ముందే .. నిందలని .. గట్టిగా .. బలంగా విడదీసిన నడకలు..

అవక తవకలతో నిండిన నా యోచనల ఘాడతని లేపి.. ఉరిమి పడుతున్న నిరాశలని కలిపి చుట్టి..

కంట్లో పారబోసుకొన్న చీకటి కొండలని తొలచి.. ఉన్న చోటనే ఉండక .. పైన పడి .. కిందికి లాగి

భయమూ నాదే.. నిద్రగా ఆవహించిన అనుమానమూ నేనే ..

గతి.. స్థితిని .. మతి ..మూర్చనల దిగులు కప్పునీ.. ఆ ఇంటి లోపల కలువల సముద్రాన్ని నేనే ..

మాయోమయ దేహ నిర్జనల అవపోతనలో.. కదిలే నిద్ర దేహపు పరిధి ఓడించి..

నీ క్షేత్ర స్థలంలో నేనే ఓ ఉమ్మడి ప్రార్ధనల ఊరుని కట్టుకొని.. పెన్సింగ్ బిగించుకొని…

చెమట పట్టుని దులిపినప్పుడే .. నీ కేంద్రిత మాయలో .. నా జ్ఞాత వరద ముంచిన ఆనవాళ్లు..

…………………………..

చప్పరించిన స్వగుణ హెచ్చరికలలో మూడో తీర్పు …

స్వధాయ రధంలో పడి లేచిన నల్ల చీకటితో.. పోల్చి పెట్టిన కొండ నలతతో .. కప్పుకున్న చెమటని ఆరబెట్టి.. సమ మునకల నిద్ర ధూపంలో పడి తిరుగుతూ .. దేహ పలదాయన..

చీకటితో కలిపి పెట్టుకొన్న అపేక్ష శరీరాలతో పోతపోసుకొన్న నాటక మైళ్ళు..

ఇదే దేహమూ.. మరే ఆనుద్రవమూ వదలని మాటలని తాగి.. సన్నగిల్లిన నాలికతో…

నొప్పికి .. చేరగిలిన ఒత్తిడికి … చేరదీయని నిద్ర కలతలు.. కలలు దాటించిన నడకలు..

ఉన్నప్పుడే లేకపోయినా నిద్ర దీపాలపై ఆరిన నూనె మడుగుల నిశాంచరణ

ఇది కనబడని సమర్ప దోసిలిలోకి ఒంపిన వర్ష శాపంగా నిండిపోయి.. శిధిలతని నరుక్కొని

చెలరేగిన దేహ మర్జన .. కళ్ళలోకి పాకిన శ్రమల నీరుని ఒత్తుతూ .. వెళ్లగొట్టిన శత్రు ధూపపు పొగ…

పలకరింపుని దులిపి.. కలిపి చుట్టుకున్న నల్లతని దులిపేస్తూ … మళ్ళీ కలబోస్తూ…

శరీర లయలని జోడించే మూర్తన గతులతో .. చెలరేగిన ఆయుజ్య మితిని కుదుపుతూ …

                  మొరాయించిన మృత్యు గోళంలో పడి తన్నుకులాడే పాటనే సరిచేస్తూ..

………………………………………

మూడో కొండ నానబోసిన కంటి నిద్ర ఒళ్ళంతా నిండి.. ఒక అలసట పాకుతున్న నిద్ర తోరణాలని  దాటి .. ఆ కిందనే గాలి దొంతర్లని సరే చేసిన నిగారింపు.

కొంచెం ఏడ్చి.. ఈ చెమ్మల విడిది గదిలోనే .. ఈ రాత్రికి ఆగిపోదాం  ..

నీకు గుర్తుందా? ఇదే అప్పటి మన ఆవేశ సగంలో పడి.. ఊపిరాడనివ్వక మనలని దాటి ఊరేగింది.

ఇదే మనం అనుకోని వదిలేసినా దేహ ధార .. కంటి పోగులు గుచ్చుకొన్న చీకటి నాలిక..

మాటని చమురులో ముంచి వెలిగించినపుడు .. మళ్ళీనా? అని నువ్వు అంటున్నా?

                           నీకు అన్ని తెలుస్తూనే ఉన్నాయని నాకు తెల్సు.

సంధి చెయ్యని నిర్మాణ పరిధుల్లో దేహ సాయత్నరీతులతో… చెల్లుబాటు చేసుకొన్న శరీరాలు.

సమగ్న తెగదెంపులు ప్రతీ రాత్రినీ నల్లగా అరగదీసి.. ఉల్లిక్కి పడే నిద్ర సంతులన..

కరిగిన దేహ పరిధిని కాల్చి .. నిర్యాణ వాంతులతో చేరదీసి నీటి గనుల్లో ఈదుకొని..

నిద్ర మాట్లాడుతూ ఉండిపోయిన చెవులతో.. మాటని విని.. పసుపు చీరలో స్థిరం చేసి..

చేర్చి పోయిన సమయ చెల్లుబాటుని అరగదీసి .. ఇదే భ్రమిత నల్లతని ..తెల్లారే చలి ముంతనీ

వేడి నూనెతో మర్దనా చేసి .. కప్పిపెట్టుకొన్న నిరాశ తీరికలేని శ్వాసని ఊదుతూ.. కనపడి…

పొడవని రెండో ఇంటి పోలికని అడుగుతారు.. అక్కడే దూరంలో చెక్కుకొంటూ…

…………………………

 ప్రతీ దూరమూ నిండిపోదని వారు వంతులు పడతారు.. అవలీయ నింగారతో తోసుకొని…

పడి పడి లేచిన దేహ నిలువుల ఒంపులో .. దాహమడిగి .. అక్కడే మండిపోతారు..

అమిరిన చీకటి స్వలాయన తీర్పుతో ఒరిగిన నవ్వుని తీసుకొని.. దీపం వెలిగించి..

ఇంకేదో రిజిస్టర్ కావాల్సిన మతి వర్తన కేంద్రాల్లో నిలబడి .. లోపలనే ఆగుతారు.

పోలేకుండా ఉన్నాననే తను కొత్త పాటని స్నానం చేయించి .. బొట్టు పెట్టి వదిలిపెడతాడు.

సఫల నిండుతనాల మధ్యనే … పలకరింపుని గదిలో ఉంచి.. ఇరుక్కొని ఉండిపోయిన పాదాలు.

నిజాగ్రస్త కాళ్లతో … కాళ్ళని పారబోసుకొన్న .. తేరుకొని ఉండిపోయిన నడకలు..

చేతులని ..దులపరించిన చూపులతో పండిన గదుల్లో .. కూరుకు పోయిన వికార నిడువులు..

ఐనా .. ఒక దేహమవుదామని ఎవరో చెవిలో .. తేనె చెమ్మని అద్ది .. చెప్పి వెళ్ళిపోతారు.

                                                                 …………………..

           7.కూర్చిన నెలలు.. స్కానింగ్ మంత్రాలు .. గోడు నిలవదు 

తీపి చుట్టిన దేహ పూనకం.. కూర్చిన నెలలు …స్కానింగ్ మంత్రాలు.. సరి చేసుకొన్న హార్ట్ బీట్లు

ఎవరో వెనక పడతారు.. మళ్ళీ అడుగుతారు.. నేను వెల్ settled  కదాని ?

ఐయామ్ ఎంగేజ్డ్ … అన్నా…  వదలక.. వాడికంత సీన్ లేదుగా ? వాడికెలా పడ్డావ్? అంటూ

ఏదైనా చెప్పు .. అతని కోసమని..  ఏమో నాకు మాత్రమే ఏం తెల్సు .. కానీ తెల్సు

రక్తం చిక్కబడ్డప్పుడు .. గది బొంగురుమంటూ .. అతని ఆశ్రియతని వెదికి ..

 అంతలోనే కంటితో నెడుతూ … శరీర రంజపాలు పట్టుబడ్డ నిద్ర విరుపుల్లో.. చిట్లిన కేక చుట్టూ ..

 నీటి నలతని పేనుతూ… గర్భ నిరాకరణ లేని సమ్పర్ప ఎత్తుగడల్లో.. తలని దాచుకొని…

కూరుకు పోయిన మాంస జాతులని కూర్చి.. తడిచిన నాలికల మమాంధ తమరస..

………………………………

అతనికి .. పురుషుడి జన్మ స్థానం తెలియదు.. అంతగా మాట్లాడాడు.. ఎగరడు.. అరవడు ..

 మాటి మాటికీ కలవాలనడు.. కానీ నా అంతట నేననడిగితే వద్దనడు

ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? అక్కడెందుకున్నావ్? లాంటి చెత్తతో మాటలని నింపడు

ఎప్పుడూ రాసుకోవడం తప్పించి.. దానిని ఎక్కడా బయట పెట్టడు..

వారలాగా అంట.. వీడు ఇక్కడి వాడట.. ఆవిడతో తిరుగుతున్నాడులే.. లాంటి .. కామన్ మాటలు

ఎప్పుడూ వినలేదు.. తనకోసమూ ఎప్పుడూ చెప్పుకోలేదు..

ఉద్యోగాలు పోగొట్టుకొంటూ ఉంటాడు.. సెటిల్ అవ్వడం తెలియదు.. సంధి ఆగ్రాంతంలోని కనబడని.. దేహరుచిని దగ్గర చేసి .. లోపలి నాలోకి కొత్త పుట్టుకని పర్చి వెళ్తాడు.. అక్కడే ..

 తన దగ్గరే ఉండిపొమ్మని అనడు.. నన్ను చూస్తూనూ ఉండిపోడు.. చాంచర్య వశీధృతి

వాడికంటూ కాస్త చోటు ఏదైనా ఉందీ అంటే.. అదీ నా దగ్గరే.. పరిగమ్య విసాధీనత

తననుంచి జరుగుతున్నప్పుడు.. తన నుంచి మనం దూరం  జరిగినపుడు కలిగేది…

 వాడు ఎప్పుడూ ఉండక పోవచ్చు.. కానీ లేడనీ అనిపించదు. …

…………………..

సూటిగా ముఖంలోకి చూస్తాడు.. ఏదున్నా .. క్లియర్గా చెప్పేస్తాడు..

ఈ వేళా ఓకేనా ? అంటాడు.. మనం కాదంటే దేనికని రెట్టించాడు.. కానీ మనం కాదనలేం..

నా కలలని పండించుకొంటూ .. ఓడిపోతున్నా .. అంతగా బాధ లేదు..

నువ్వు ఎదురుగా ఉన్న .. దిగులుగానే ఉంటుంది.. అనాలనిపించినా .. ఎప్పుడూ అనలేదు.

 తన గురించి ఏదో అనడాన్ని ఎప్పుడూ ఎక్ష్పెక్త్ చెయ్యడు ..

అసలేం మాట్లాడాలో .. ఎన్నిసార్లు ప్రిపేర్ ఐనా .. వాడెళ్లాకే గుర్తుకొస్తాయి.

ఆ శరీర అనుభవం నాలోపల ఎప్పటికీ ఎర్రగా కాలుతూనే ఉంటుంది.. స్వముగ్ధ కలా వలయం.

ఏ మాత్రమూ బరువులేని .. ఓ ఆయాస సముద్ర నీటి యాత్ర.. మంచు పోసి ..

కెరట నునుపుల నురుగని సర్ది.. పక్కసర్దిలోకి త శ్వాసని గుప్పించి ..వెళ్లినప్పటి నిద్ర..

మసకబారిన గొంతుతో నేను కొత్త పీడనని తగిలించుకొని .. మూర్చన పోతాను..

……………………….

విఫల రసాయన గోళంలో .. ఆకర్ష నిమిత్తం లేని.. చంద్రుని మృత్యు వార్త ..

నీరు పట్టిన గది.. లోపల ఇద్దరం ఒకటై ఈదుతూ…  సమా అలయ మేళన

విసుల్లాయ కంటి ముద్దకి చీకటి కమ్ముకొని.. విసిరినా ముఖాలన్ని దాచుకొని..

నియోపార్ధ సంధి సూత్రంతో .. కలిసి.. ఒడిసిపట్టి.. కాళ్ళని లేపి.. భుజాలని కరిగించి…

భయమని ఔషధీయ మగతని నానబెట్టిన చూపుతో.. తాను నాలోపల దిగబడ్డాక..

విశ్వం అంతా తెలియని  మహా శూన్యంలోకి ప్రవేశించి .. కనబడని .. కోరికని దాటి..

ఒకటై కప్పుకున్న వరద ,, ఇంటి గోల .. గోడలు తడిచిన వణుకు.. శరీర లోలక తంత్రులు

మట్టి మగ్గిన పెదాల వాసన.. గతి దారాల పాటని వినిపించే చిక్కుల్లో .. గొంతు ప్రతిధ్వనుల కలగా ..

 నిండి.. రంగుల సమాధిలో .. దీర్ఘ రాగపు పుల్లవిత.. ఆర్థావతం..

……………………

ఎక్కడికి వెళ్లావని గాని.. నే ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావనిగాని..

పట్టు కూలిన భయంతో.. నిరాశని మోయడంగాని .. ఏదీ చెయ్యడు.. అడగడు..

ఎప్పుడైన మధ్య రాత్రి టీ కావాలనో.. స్వీట్ అడగడమో .. ఈ poem వింటావా ? అని అడగడమో అంతే

ఏ లెక్కలు అడగడు.. అసలు అవి తెలియవు.. నాకు తెల్సి.. ఎప్పటికీ నేర్చుకోలేడు

ఏం కావాలన్న .. అడగకుండా తీసేసుకోవడమే.. ఐనా బావుంటుంది…

ఎప్పుడైనా .. ఏదైనా అన్నాడా ? అని కోపగించడానికి కూడా లేదు.. గుర్తుకి రాదు.. రానివ్వడు..

అన్వయ శ్రయం పిలిచి చుట్టిన మృత్యు మాత్ర ….తమో శీతల దొంతర…

కరిగి కలిసిపోతాడు.. శ్వాసత స్వస్థత.. వినిర్భ గోషిత నివిర్పు.. మమాలిక

                                                       ………………………..

8. మహా నొవ్వళి.. సాధ్య రేణం.. రుణ మంగళ సవ్యయ

ఇదే నా దేహమూ.. తంత్రులని కడిగే విశ్వ సదామృతల తెగింపుని ఈడ్చి .. మహా నొవ్వళి…

నేనొక శరీరశాలలో మిగిలిపోయిన షరతులతో.. తోడు తెచ్చిన రాత్రీ- పగటి గడపల ఓల

కొంచెం గర్భ మాత్ర .. తడబాటు లేని తర్జనల కంటికోతని జోడించి..

ఇది ఇలాగే లేదని.. మరోలా విడిపోయిన చిత్ర దారుల్లో పొంతనలేని… అపారవ్య సన్థలన..

నువ్వీ ఆకర్ష ముంపులో పడి.. పోలికలేని రంగులని ఊడదీసి.. చలిత అక్కసు..

 తప్పిన పొరపాట్లని వానలో ఉడకబెట్టి.. చలి మంటలోకి కూల్చి  .. ధూళి బొమ్మని.. 

ఆ దూరంలోంచి పోత పోసి.. చీర పోసిన వాన మల్లింపుల గదిలో తలపడి..

నిండిన దేహ కరకు గట్లని తెగ్గొట్టి.. ఆ ముడిని బిగదీసిన మంచాల చమురు.. సమదాయన …కండరాలు ఓడిన సముదాయింపు.. మతి నిర్గతి కూల్చిన ఒంటి చూపు..

గేలం వేసిన మృత్యు తాకిడిలో.. చిన్ననవ్వుతో వెళ్ళగొట్టిన సాధ్య గాలింపు.. ఊరట

సుమంగళ దేహ సంధింపుతో .. గాలిత రొమ్ము కలతలతో.. పైకి జరిగారు.. ఖాళీ కాళ్ళు..

 ఏదో ఉంది.. అదే అర్ధమయ్యేంత దగ్గరగా రాదు.. కన్ను రాల్చదు.

గొంతు నీరులో ఉడకబెట్టిన పాట కనబడుతుంది.. శ్వాస వార్పులు.. విన్నింపులు

……………………

రుణ మంగళ సవ్యయ .. సరిచేసిన ఊపిరి ముడుల శరీర సంపుటిలో .. ఊరి..

 నీటి పట్టుని దులిపిన నిద్ర రాజీలేని మోసి.. తను అలిసిందని కథని దాటిస్తూ..

కప్పుకున్న చీకటి నొప్పిని సాగదీసి .. కండరాల దప్పికని వడపోసి.. నిలువు మాటలు అడ్డం పడి

ఎండని దుల్లగొట్టిన రంగుల ఆవలోంచి.. శరీరం చిమ్లించే కుండలు ..

దాహ రేఖలు  .. శ్వాస హద్దు మండలాలు.. కంటి ఊగులు.. పాల మైలలు .. నికరాలు

ఉడకబెట్టిన ఊపిరి కలయికలో దాటిస్తున్న గాలి మందలు.. అప్పటికి కోలుకోని చెమట కయ్యలు..

మహా గంటని ఒడిసిపట్టిన ముహూర్త గుబులుతో .. శరీర నిలోమాల ధార గోతులోకి దిగి..

 సన్నని పాట వినిపిస్తూ… రాత్రి నురుగులో చిలికిన దేహ రెమ్ముల మంత్ర కూర్పు ఊలబడి  

తలలోంచి లేచిన అసహన ముఖాల వల… దేహమంతా చుట్టుకొన్న రాత్రి గంధపు సరాలయం….

ఆ పైకి .. పైపైకి .. దాటిపోదాం.. సరీహ నిద్రకథలు దొరకని భయం చుట్టుకొందాం.

శరీరానికి ఆధరువుగా శరీరం ఉంచుకొని.. నిద్ర రుణ కవ్వింతలని దాటి ఉరుముకొంటూ …

                          నిర్యాణ మంగళ హోరులో మునిగి .. ఊంచల నిధ్ఘాత .. అలంపు..

                                                    ……………………….

 మండిపోతున్న దాహ నీరం.. కదిలే మంత్ర గదిలో పారాడుతూ .. చంచల దేహ నిర్ధారంలో కూలి..

 చెల్లా చెదురై మసక మంథన ఈసురాతపై.. మంగళ సవ్యయ .. అణురాయ 

అనుకొని ఉండిపోక.. ఆపుకోలేని శ్వాస గుబులుని .. సంధి సేవన నిద్ర జారులోకి పట్టి..

అలంపు దూరాల్లో తిరిగి.. గోషిత తలరార్పు సంకేరంలో గమన పూతలు.. కలబాట్లు..

ఉన్నాననే తాను చెప్పుకున్నప్పుడు .. లేదనే శూన్యం గుచ్చుకొంటూ .. సంధి జోలల గామింత

అతి దగ్గరా.. కొంచెం దూరం.. మతిలో అయస్కాంత శిలలని కరిగించే మహా నది సoజ్యోత

అకారణ పలకరింపుతో ఇల్లు వెలుగుతూ.. నిశిదేహపు మరకలని .. తుడిచి .. దులిపి.. కప్పి ..

విడిపోక సర్దుకొన్నాం.. కలబడి నేర్చుకున్నాం.. రెప్పని దూసి .. నలిగిన కాళ్లతో …

తెల్లార్లు మోసిన శరీరాల కణుపుల్లో .. నిద్ర గడించిన సంచార దేహ జాగారాలాతో తన్నుకొస్తూ ..

తలబడే నిద్రతో కనబడే .. సమయ అయోయతో కన్నుని తాగిన శరీర జతలు..

                                                                  —————–

కొండల్లో దేహ మొవ్వుని కోసుకొని.. ఉడకబెట్టిన శ్వాస సంపదని గాలించుకొంటూ..

సమయ నిగురుని ఆరబెట్టినా శరీరంలో అలసట ఎర్రగా కాగుతూ.. తడి తెంపులు..

గర్జన ముగించిన వర్ష చీరలు పైనుంచి కురిసి.. సదా యత్న శిలలా దేహంపై పడి .. కాలుతూ..

సమ భ్రతయ అంచులు చెరిపిన నిద్ర చలన కీడుని తుడిచి.. మళ్ళీ కుచ్చిళ్ళు సర్ది..

ఇసుకపాతాలు తల పై నుంచి కురుస్తూ.. చెమట అద్దిన చలన ద్రవంలో ఓలలాడే కన్ను

ఒకరికొకరు కాపాడుకోవాల్సింది దేన్నీ .. అటు నుంచి ఇటు నుంచి కదిలి …

ఆకర్ష నిద్ర వాగుల్లో దిగబడి.. చెలరేగిన నిశ్వాస ముంపులో గ్రహణ పొద్దునే ఉంచింది .. అక్కడే..ఏదో ఒక సమయ చర్య జీరలాడే కంపన పడవలపై.. దేహనిద్ర కట్టిన రేవులు..

కాసింత ఈ నిద్రా కావాలి.. కొంచెం అలజడి ఇక్కడనుంచి మోసుకుపోవాలి..

రోజు రోజుకి .. తలపడే దేహ తర్జుమాలని కాదని .. ఉండిపోయిన అక్రమ తోపుల్లో చల్లారి పోయాం … అలగింపుతో పండిన ఉపరి కంపన నికర్ష చేజారి పోయింది.. తల్లడిల్లామా?

అదే అనుకోనిది.. నీలోకి ఉండిపోయేది.. కప్పుకొని చెప్పుకోలేనిది…

                                                                ———————

9.నాదనే తను .. కలిసిన నీటి అడుగు .. నాలుగు గుమ్మాల మధ్య రెండు దేహాలు

తనలోపలి తనతో .. తన నుంచి తనతో.. నిర్భయలని పోతపోసుకొన్న చలన మరింపులు..

నాదనే తను … శూన్య నిండిపోతలని దాటించే పుట్టుకలో పట్టి .. స్నాన వ్యూహం ..

                      సమయ నిరాకార ఏడుపులు .. హెచ్చరించిన పగటి తలుపు బరువులు..

నల్ల విశ్వం లో సంచరించే తెల్ల కాగడాల పూర్ణత .. మెలిక పెట్టిన నడక..

సంభాళించడానికి లేని .. నిద్ర సర్వంలో కలిపి పెట్టుకొన్న నాలుగు గుమ్మాల మధ్య ఎడమైనా లేక చెలరేగే రెండు దేహాలు… కొంచం నీళ్లు నమిలి .. కలిసిన నీటి అడుగు…

………………………

నాదనే తను … తనకై జాగ్రత్త చేసిన నిద్ర విన్యాసంలో చెలరేగిన మసక దీపాల తోడు..

ఇక్కడే నిండిన అనుమానాల్ని దాటి .. ఆ పై నిండిపోయిన దేహ ఊళన పాకుతూ..

నేనై నేను ఉండిపోయిన .. పగటిని తట్టి లేపిన పడవల్లో పడి .. కలలో పొడిగా కలిపినా ..

అతుకు పడిన దేహాల నిందనే చెల్లాచెదురు చేస్తూ.. వికార గర్భంలో పడక..

నేనేం ఆగిపోలేదు .. అక్కడే చోటు అడిగి ఉండిపోలేదు.. కంటిలోకి శూలం దింపి ..

మాట కలిపి .. ఇంకాస్త శరణు గదిని  ఊడ్చి .. ఇద్దరూ వెళతారు..

………………………..

 ఈ ఆలోచన తనలో సగమవ్వాలనేం లేదు.. ఒకోసారి అతని ఆచూకే దొరకదు ..

 వెళ్తే తిరిగి వస్తాడో .. లేదో తెలియదు.. కానీ వదిలి వెళ్లిన కంపనీ .. నా గుండె చప్పుడుతో కలిసి.. కొత్త భూమిని పోత పోస్తుంది. పగటి తలుపుని గుండ్రంగా చిక్కుతుంది..

ఏదీ చెప్పమనలేదు.. నా గురించి తను దాచే ఉంచింది..  ఉంచమని అనలేదు..

ఆకలి చూపు కుండలో ఉడుకుతుంది.. నేల చూపులు చూస్తుంది.. దగ్గు పూలమార్పులు..

 ఆ చీకట్లో.. ఎప్పోడూ చూడని మనుషులు తోడు రాగా .. తాను చెప్పిన చోటుకి వెళ్లాను..

 ఏదో భారీ మెషిన్ మీద వెళ్తున్నాను..

ఒక వేళా నేను తిరిగి రాకపోతే .. ఇదే నా వీలునామా .. అంటూ .. ఓ నెలలో రాకపోతే .. తెరిచి చూడమన్నాడు.. ఒకవేళ వచ్చేస్తే .. తిరిగి కవర్ తీయకుండానే ఇమ్మన్నాడు.

…………………………………..

నన్ను నేను పరాయిని చేసుకొన్నా దేహమిక అతనిదే.. అదే చెప్పాను..

అతను తల అడ్డంగా ఊపి.. నీకెంతో లైఫ్ బాకీ ఉంది.. మరొకరిని  తీసుకోవాలాల్సిందే.. అన్నాడు సగం చావు లేపిన నిద్ర కథలతో చక్కబెట్టిన ఇంటిలో.. ఆరబోత లేని దుఃఖం..

నాతో ఈ రాత్రికి ఉండిపో అన్నాడు.. ఆమె సిగ్గు పడి .. ఇక్కడ పర్వా లేదా ? అంది.. 

అతనొక సౌండ్ వచ్చే ఇన్స్ట్రుమెంట్ చూపించి.. దీనితో ఊడితే తప్ప ఎవరూ .. రారని..

అదొక సంయోగ నిశ్వాస.. గతి జన్మ మోసిన ఆనవాళ్ల రసాయన సుడి గుండం.. కంటి నలుపుని పీల్చుకొని ఉండిపోయిన ముద్దు.. మెమోల గగంతం .. ఉమ్మడి దేహ ప్రవేశం..

మహా శూన్యంలో .. దేహాలు కలిసి కూలినప్పటి శకలం విరిగిపడి .. విస్ఫోటనా వెలుగు..

చిత్రా స్కాంత అయో దహనంలో ..పోల్చిన సిగ్గు నిగ్రహాల పుట్టు విడుపులు.. బోసినీరు..

———————————-

చపలిత రుణ తీరిక .. రెండు కాళ్ళ జతల నిర్మాణ కూడలిలో కోసుకు పోయిన భరోసా ..

అంతే ఉంది.. ఎత్తకుండా ఇంకేదీ ఉండీలేదు.. సమంగ్ల అయోమయం..

నిగ్రహం సడలిన చెమట పోరుతో.. ఇక చాలనక ముందే మళ్ళీ దౌడు తీసిన దేహ రాంధన..

ఆమె కాదనక  ముందే ఔననీ మళ్ళీ అతనిలోకి కలిసిపోయింది.. స్కలయాహితం..

దూరంలో ఎక్కడో మెరిసినట్లైంది.. ఎవరో పరుగులు పెడుతున్నారు..

ఇంకా వాళ్ళు బట్టలైనా కట్టుకోకముందే.. కొన్ని వందల చన్నుల గ్రనేడ్ పాతర విస్ఫోటన

ఒకరికొకరు ఏ వీలునామా లేకుండానే …ఒక్కటై…

10. విరి విరి దేహ తీరులు .. అదీ నేనే .. మమః జతల సాధన స్థితి

ఎన్నో చెప్పాలనుకొంటాను.. అది .. ఇలా మాత్రం కాదనీ అనుకొంటాను

తను రాసిన పాటని పాడుతుంది.. ఇక సంబంధ నిద్రలు లేని అనుమాన కథనే లోపలి వదిలి పెట్టి  ..

దుఃఖాన్ని జాగ్రత్త చేసుకొందాం.. ఎందుకిలా మాటలతో భూమి మీదకి వదిలేస్తే .. గర్భ ఊపు

మనలోపల ఉనికి అల్లాడి పోతుంది.. చెప్పా పెట్టకుండా నిలదీసినప్పుడు…స్కలోప

నీకు తెలియంది .. నాకు తెలియంది నాలో ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి..

ఒకరి ఎదురుగా ఒకరం రోజూ పుడదాం.. మళ్ళీ కలుద్దాం.. సర్వ సలీలయాన …

కలిసినప్పుడు .. విడిపోవడం కోసం.. విడిపోయినప్పుడు కలవడం కోసం..

………………………

విరి విరి దేహ తీరులు … అదే ఎవరో నాతో చెప్పాలని చూస్తారు.. హెచ్చరిస్తారు..

నమ్మాలనిపించదు .. కానీ నమ్ముతాను.. కదిల్చి కట్టుకొంటాను….

10నడవాలనిపించదు… నడుస్తాను.. కదలాల్సినప్పుడు ఆ పడవ కెరటాల్లో

ఎగురుతూ .. తూలుతూ ….తడబడి వణుకుతూ…ఛాయాదమన నిర్వ గుండం

ఎదురుపడుతుంది.. మాటని చాటుగా చేసి .. నటనని వద్దంటుంది…

అక్కడితో ఆగిపోని నేను .. ఎవరూ ఏదీ వినరు..

కలిసిన నిద్ర రీతుల సముదాయంలో .. ఊరికినే మాట తోడుకొని సత్య మడులు..

పుట్టినప్పటి మృత్యు నిద్రని రాసిన కౌగిలిలో ఉన్నాననుకొన్న.. అదీ నేనే

పెద్ద కంగారు లేదు.. భయం సర్దుకొని .. పెద్ద నోరుతో.. కథల రంగు మారుస్తాను.

…………………………

మమః జతల సాధన స్థితి… వచ్చేసరికి .. ఊరు మొత్తం ఎడారి.. శిధిల ఒడుపుల నెలలు పండిన మూర్చన

గుడి జలాన్ని మొక్కులతో చుట్టి.. పట్టుకు పోయిన నడకలని కూల్చి అక్కడే ఊరబోసుకొన్న…..

 నిర్వాణ సంధిని చెదరగొడతారు .. పట్టుబట్టి ఇల్లుని పైకి లేపుతారు.

ఇంకాస్త వెనకా ముందూ వివరాలు అడగాలనీ తట్టలేదు …విరోప గుణం  

ఇక్కడ కొంచెమే అప్పగించి వెళుతూ .. ద్వయో లాయన మోతుడులా ధ్రువ పరాశీత

మొండి భుజాలతో.. బొడ్డులో పాముతో గుడి .. బొట్టులేని పూర్ణ విపత్తు..

ఆ రేవులో .. ఈ శిలని తీసుకెళ్లి .. మీ ఇంట్లో పెట్టుకో అని ఇచ్చారు.. అనుమానం రాలేదు..

శరీర వల్లకాడులో ఇరుక్కొని .. నువ్వు లేవని తెలిసిన నిస్త్రాణ చాపాలతో కల బెంగపడుతుంది.

రంగు సన్యాసమని ..ఎవరో అంటే .. ఏడూ రంగుల దహన పేటిక నేనని .. అరిచాను.

………………….

పరిధి ఖచ్చితంగా కావాలనే  మాట్లాడతారు.. అదేంటో నాకు అర్ధం కాలేదు..

అంతా అలాగే ఉండనే .. కొన్ని అసత్య మునకలతో.. తీవ్ర ముంపు కప్పిన నది..

 దూరంగా .. కళ్ళు లేని పడవ.. కొన్ని చీర చుట్టిన కెరటాలు… గజ్జెల మడుగుని ముంచి…

దీవి … ఒక ఏకాంతపు వాలులో సమాధిని శుభ్రం చేసి.. ఈ యుగమా ఆఖరిది? అని అడుగుతుంది.

వ్యక్త  అస్థిరల్లో పడి తల మునకలై.. ఊపిరి గెడ బిగించి ,. రేవు వెళ్ళిపోతుంది.

సరిపెట్టుకోవడానికి ఇంకే ఆధారమూ లేని జ్ఞాన చర్యని మెదిపి.. మాటకి చాటులేక…

సర్దిన సమాన రాతలు.. ఒంటి పై పోసుకున్న ఆమ్లాయ సొంపుని వడపోతతో కలిపి..

ఇంకెలా ఇద్దరమూ ఒకరికొకరం కలిసేది?

………………………………..

పుట్టుకల ఊపిరి చుట్టిన పరితాప నిర్జనలో కదులుతూ .. కొంచెం వీలుకాని నా సిగ్గుని కడిగి..

                      ఆ శిలతో  నా పేటికలోకి వెళ్ళినప్పుడు .. ఉత్త్సవం మొదలైంది..

కంట్లో నాసపోసిన దేహ గానంతో పండి.. నిద్ర చలన ముట్టడిగా ఉండిపోయిన నా గతం తనే..

రేపటి సంతర్పణలో .. నా మొదటి వడ్డన తనకే..

 కొండలని పల్లకీలుగా చెక్కి.. నీరు పోసిన కంటిలో .. తడబడే నిద్ర వరుస ఖాళీలని పట్టి..

తుడిచిపెట్టుకు పోయిన కాళ్ళని … ఎడమ కెంపుల సముద్రంలో దీవిని నంజుకొని..

సగం శిధిల అవపోశ మూర్తుల కైవలి .. అంటుపోసిన మధ్యస్థ వెన్నులో చెమట కుండ.. 

ఇది కొంచెం ఇక్కడ రాశి పోసుకున్న దీప గుండాలుగా ఊపిరి తీసుకొని .. అదురుతుంది.

 శరీర సమాధి వెనక చీకటి చేసిన స్నానం .. మైదాన ముదాలని నది చేసి మొదలై..

విశ్వ సంకీర్ణ వాకిలిలో .. రెండు దేహాల ఎడమని వద్దనుకుని ..

ఇంకే చాటుమాటు లేని జ్ఞాన భాషణని మోగిస్తూ .. యుద్ధ రంజన వెనక పడక గది

………………………..

శూన్య కసక్ష్యల్లో .. ఎన్ని యుగాలు మన స్పృహని వదిలి తిరుగుతూ.. ఇప్పుడిలా కలిసామో..

ఆధారం లేని దేహ సవ్య ధార .. కంట్లో దొరకని ఖాళీలు.. ఎడమ పక్కాగా కూలిన ఇల్లు..

గతి నెమ్మది ముద్దుల్లో .. ముద్ద కట్టిన చీకటిని చిలికి .. నీ విగ్రహాన్ని పోతపోసి .. చూసుకొంటాను..

నేనిక నా ఊపిరి పోయాలనుకొన్నప్పుడు .. అశరీర వాణి ..ఆమెని బ్రతికించినా .. నువ్వు లేకుండా పోతే ..

 ఆ లోకమిక .. ఇక ఎవరికి మాత్రమెందుకు? అనుకోలేని నిద్రపట్టుని దులిపి .. మరింత రంగు మార్చిన

తేలిక తనాల గట్టుని బయటపెడుతూ … తప్పిజారిన దేహహోరులు …

అప్పుడే .. నాకు ఏం చెయ్యాలో స్పష్టంగా అర్ధమైంది.

                                                    ————————

11 . సశరీర సౌష్ఠవ శాల .. వెనక పండిన పిలుపు.. ఆకళింపు మూసేసి..

ఏకాగ్ర సవరణలో .. వెనక పండిన పిలుపుని విని .. తడబాటుని దాచుకొని .. ఒక దేహ విపరీతంలో

                 పడి ముక్కలై.. దాహ మడమల నొప్పికి .. కాయం చేసిన నీవోష్ణ స్తంభనతో…

దాహ మడమల నొప్పిని.. కుంపటి మండిన నిద్ర తేదీల గతిని .. పీల్చి..

సశరీర సౌష్ఠవ శాలలో  కట్టుకొన్న రంగుల అనుక్రమ అంతాలని దాచిపెట్టి..

 క్రియా నిద్రలు లేని అపేక్ష కదిలి.. శరీర శిక్షణ కప్పిన కాళ్ళని వదిలి…

ఇప్పటికీ అనుకూలమయ్యే దేహ నింద చుట్టూతా నువ్వే తిరిగి కాపు కాసావని తెలిసాకే ..

ఎవరెవరో నన్ను గుర్తుపట్టడం మొదలు పెడతారు..  కైమోడ్పుగా .. సత్వర గాలుల చుట్టింపులో.. 

                   దారి పట్టుకోలేక .. ఇల్లుని ఆసరా చేసుకొని.. ఓలలాడే దేహాలు.. సరిపోతలు..

నీకు రుణ పడ్డానని … మరోసారి కలవాలని .. దేహ అగాధం లోంచి అరుస్తాను.

”””””””””””’

కలబోసినా .. దూరం ఉండిపోని వాగుల దండ .. అక్కడే ఆమె సముద్రం.. తనదేనని నాకు

                                 తెల్సు.. వినిపించుకోదు.. హత్తుకొంటుంది.. అలసి చూసి.. చిదిమి..

దీప తీరంలో ఆ పడవ .. ఇంకాస్త ఎంగిలి పడి.. తిరిగి చీర కట్టుకొని .. వస్తూ ఉంది..

అక్కడే రాట వేసిన దీప స్తంభం.. కదలిక లేని శరీర కవ్వం

నిశి రాల్చిన పెద్ద కేకల హోరిమి తలంలో .. మాట తీసుకొని తప్పుకొన్న..

నిర్లిత ధ్వని కంకణం ఊడి.. పెద్ద చప్పుడుతో ఇంకిన దేహ తీవ్రతని కప్పెట్టి..

కాపు కాసిన దీవి మేడలో వేసుకొని తిరిగే చీకటి అద్దాల మెరుగు.. కొంచెం మళ్ళీ రుద్ది..

నల్లని మాటల్లో చిక్కుకొన్న .. తీర్ధ మాయల్లో.. నలుపక్కల విసిరినా కుచ్చిళ్ళతో .. కైపు..

…………………….

గంటలు.. తూర్పు నదిలో .. వేసట చెమట కెరటాలు వాడిపోయి.. నన్నే చేరి..

దోసిలిలో పోసి.. ఎండ గలించిన ఆ దూరపు వాగుల్లో పొగ .. లోపలి నీ దేహం..ఉక్కిరి పోటు 

తీర్ధ ఛాయావి పట్టుకొన్న నిద్ర రుచి తెలిసి.. కానీ పోసిన కాళ్ళు.. డేరాలు దింపి..

నలిపి నింపుకున్న దేహ మండలం లో చెమ్మ పూసిన కలువలు.. గట్లపై ఆ చేతి వేళ్ళు..

అక్కడ చోటు దొరకని బీజ క్షణాలు .. తత్తరపాటుని కనిపెట్టే దేహ పొంతనల కాగడాలు..

 పెద్ద జలాల వాన పాపిటని దువ్వుతూ .. తన తడిచిన పెదాల నెట్టుడు

తధారణ .. నిమర్షణ.. హళేత నింగూరు రాళ్ళలో బరువు.. వదులత.. కలిసిన నిండు ఘాతాలు..

 సూత్రం దర్శనాలు కథని వెలిగించే చాటులో ఉండిపోయి..

 దేహ రక్షణ స్థితిని లాలించే ముహూర్త గదులు కిక్కిరిసాయి………

……………………………………………

రెండో గొంతులో కుడి బరువు చేతిని దాచిపెట్టి .. ఊట కావెడల జంటగా.. నది ముందు సొమ్మసిల్లి ..                             తిరగబడి.. పై సవారీలో ఓడిపోయి.. ముక్కలైన శ్వాస నిద్రలేని అలుక్కుని …

తనదని నేను.. పడవ మునిగింది.. దీప స్తంభం నిండా కంగారు.. ఐనా నిలబడే ఉంది..

 చేరగలదనే ధీమా .. కొంచెం బరువు పట్టి కెరటం తన్నుతూ పడవని పైకి లేపింది..

లోపల అంతా అలాగే ఉంది. వణికిన మృత్యురాల ఎగిరిపోయిన ..

 ఇగిరిన వంటతో.. విందుని మళ్ళీ పేర్చి.. గట్టుని చూసుకొని చప్పట్లు కొడుతూ..

సమయ రంధన లేని ఏక సమూహం నిండి .. ఇంకొక వాన దువ్వూరు లేని సాగు మొదలైంది. 

దీవి వాళ్ళ ఆచూకీఎవరికీ  ఇవ్వలేదు.. ఏ చప్పుడూ లేకుండా ఉంచాలని….

………………………………..

పుట్టుక లేని .. సమాధిలో జ్వరపడి..కలిసిన ఇంద్ర ధనువులు… ముప్పేటలా కంటి ధరి..

ఎత్తు కెరటాల పంటనీ కోసి.. బరువెక్కిన తమకర రాల్పులు.. కంటి మరకలు..

దుప్పట్లో … అప్పటికే దొరికిన మేకుల్ని తీసి.. ఖాళీ బొంగురు గొంతులు నిడివి..

రెప్పలేం చెప్పాయి.. వినడానికి లేని ఏక దీపనలోంచి.. ఆరుతూ .. వెలిగి..

దేహాల సంధి యత్నంగా .. లేవదీసుకొన్న నిద్ర రుచులలో .. ఒకే చలన ముద్ద మరిగి..

మత్తు చెరుగులు .. ఉమ్మెర..నెలలని నాళాలతో కలిపి..

ఊరిన కాళ్ళ చప్పుడుతో ఆయాస గింగిరాలు పట్టుకొన్న .. నవ్వుని జడలో అల్లుతూ…

కొన్ని యుగాల సంక్షోభాన్ని పక్కకి నెట్టి .. కలిసిపోవాలని.. కలిసే ఉండాలని..

                                              …………………………………….

12 . అముద్ర మాంస ఛాయ .. దేహ అనుగ్రహి .. భ్రమణ కూర్పు

విశ్వ నిర్జనంలో తలకిందులయ్యే నా పాటని తాగుతూ.. నీలోకి ఉండిపోతూ .

 నేల నిండిన శరీర అవస్థని ఊపి .. ఆలోచనని తీసుకొని.. రుద్దన గతులని మరిగించుకొని…

 జనహిత దీక్ష చెమర్చే.. కంటి నాడిని పట్టుకొని..సరళ ముద్రల కన్నుని పిసికి..

 సడి ముద్దు.. రంగు రుచులని ఆరబోసిన ఏడు రంగుల వెలుగు…

 అముద్ర మాంస ఛాయగా ఆరి పోయినా.. అదే నడకలా నిడివిని పట్టుకొని..

ముందుకి పోతూ.. మాటా .. పలుకూ లేని నమ్మకం ఒంపి.. ఊపిరిని వడపోసి తాగి….

 సంధియుత మాగింపులు లేని తగువులు.. ఎటు పోయాయో స్పర్ధ చమక్కులు దండ కట్టిన

 నేలబారు నవ్వుతో పల్చనవుతూ .. దేహ సాంద్రతలు ముగ్గిన చెమట బట్టలు..

విసిరేసిన అనుమానాల్లో తిరిగి..గాలిని మోసి.. రెప్పని మిటకరించి..

దేహ అనుగ్రహి… చెప్పుకొన్న ఆఖరి కథ… వినీ విననట్లుగా ఊగిపోతూ…

………………………

లక్షల నరపోగుల్లో .. గంధకం ఆరబెట్టినపుడు .. నిప్పుని ఎగదోసి కొండని నూరుతూ..

 నిద్రపాతంలో పడి దూసుకొచ్చే కెరటాలు.. దారులు పడగ  విప్పిన ఏక సముద్రం.

వాన లోంచి లేచిన అగ్ని అంటుకొని.. దేహ మిరుమిట్లుగా మృత్యు సంధి తీర్చిన… తప్పి పేర్చిన

అవమాన రంజు.. విరమిత జాడలు గుప్పిన నటనలతో .. హద్దుల్ని దాటి .. కథలే విని..

ఉబికిన హతః కేలన .. ఇంకో బదులు అడగానే లేదు.. సంధి నిద్రని తోడనే లేదు.

 శరీరం గాలించినా కంటి రాల్పుతో మొదలవని యోచనల కక్ష్య . చేసిన దీక్ష…

.అదే అలా ఉంది.. కెంపు చంపలపై చలి మంటని అద్ది.. కాళ్ళని లోపలికి అడిగి..

…………………………

నిప్పొంగిన దేహ క్షేత్ర బీజాల్లో రంగరించిన పెదాల గుట్టు.. నుదుటికి చేర్చిన నీటిపట్టు

 అవాంతన ఇక్కట్లని కలబెట్టి.. ఆశ్రిత నాభి లోని నల్ల కెరటం విరిగిపడి…

అప్పగించుకోని సంధాన త్రయత ..కలివెల పాటు… నిద్ర మార్జనలు ఖాళీగా ..

నిలాత కట్టివేతలు అక్కడ కూలినపుడే గుర్తుపట్టి.. భ్రమణ కూర్పు .. వాంఛల మహా దాపుడు.

రాపాడించిన  గతుకులు .. నేననే అరమోడ్పు గాంభీర్యంలో స్థిత సంజ్ఞ గతిని కలిపి..

విడిపోయిన చీకటిని అదురుబాటుగా చూసి.. వెన్నులో పోసుకొని.

 ఇరుకైన చూపు నిల్వలు .. పలుకు చూసిన సీసాల బరువుకి కరుగుతూ… తేల్చి లాలిస్తూ

ఇదే ఎప్పటికీ నేననుకునే దేహమూ… అన్వయ మగతని ఆడించే

నిద్ర దారుల తలకట్టు.. పోత పోసిన దేహాల పగ సర్దుకొని.. మరో దీపంగా నిండుకొని..

…………………………….

పెళ్లి పందిరిలో .. పెట్రోమాక్సీ బగ్గుమన్నప్పటి వెలుగులో .. పండుతూ.. నిండిపోయిన …

విచ్చుకున్న వేల చందమామల కొండలా ఆ నవ్వు.. జుత్తు విరబోసుకొని..

 దుప్పట్ల సవరింత.. మంచాల చప్పుడికి మేకులు కొట్టి .. వాన గూటిలో దాచిన తాయిలం

నువ్వనే దేహ శిధిలంలో .. నేను మోసుకొచ్చిన రసాయన సిగతని పట్టించుకోని..

 కలిపి పేనుకొని.. ఉండి లేవదీసుకొని.. లేక గాలి విప్పదీసుకొని.. శరీర మంధన

ఏది తెలిసిందో .. అదే దూరంలో మిగిలి..సపజ్ఞ దేహ రీములని చుట్టి.. కనిపెట్టి .. అనుకొని నిలబెట్టి

 కన్నుని ఉడకబోసారు.. కలలని ఒప్పించి .. పడవకి చేర్చి.. రెండు దేహాల నిద్రలో సరిపోయేలా సర్దారు

…………………………..

కొంచెం అనుమతి తీసుకోవాలనుకొంటే .. తను చెంప మీద కొట్టి .. మీదకి దూకి

 జుత్తుని నాజూకుగా లుంగచుట్టి లాగి.. నూనె పట్టిన శరీరాన్ని .. చెమటతో నానబెట్టి.. కన్నుని గెలిపించి..

 నాకు తెల్సుగా .. అంది.. కదలడానికి లేని ఉపేక్ష సంధి నిద్రని ఎవరో కదిలిస్తారు..

అంత అలుముకుని.. కనిపించనప్పుడే .. ఆ ఆయాసాన్ని అందుకొని..

 నేను పాకుతున్నాను. దగ్గర అయ్యానని చెప్పుకోక ముందే కరుగుతూ .. మెత్తగా వినపడి….

ఆ ఇలు తనదే .. నాకెందుకు మరో బరువుకా అని  నిలదీసినప్పుడు..

 నా కళ్ళలోకి చూసి.. నా శ్వాస తేమ పై ఊది.. ఛాతీ కొసల్లోంచి విని.. నిద్ర విరుపుని

 కాళ్లపై వాలి.. నన్ను సమస్త సంశయ మాత్రంగా మిగిల్చి తడుపుతుంది..

                                          …………………………………

13 . నివు రోరణ ..  దేహ కల్వంలో నీరు .. కాసిన్ని పుట్టుకలని కలుస్తూ..

మసకబారిన రంగు మెడని ఒంచింది.. దేహ క్షేత్రంలో పిండుకొన్న అపాయగతిని వేలాది దీసిన

                 కంటి శాలలో.. ఉమ్మడి శరీర రక్షని కప్పి.. ఊసుపోని ఝామునే దిద్దుకొంది.

 కాసిన్ని పుట్టుకలని కలుస్తూ.. అలా వెళ్ళిపోతున్నప్పుడు .. సంచీని దులుపుతున్నప్పుడు

 జ్ఞాన భస్మం కుప్ప పోసిన ఉనికిని కాదని .. భయశాలని చాపుకొని ..

 అక్కడే ఉండిపోయిన నిరాశ రుచులు కలుపుకొని.. పట్టు విడువక నిలబెట్టుకొని….

ఇంకిపోతూ…  దేహ కల్వంలో నీరు .. అలా చూస్తూనే ఊపిరి నిద్రలో కదిలే కలలు..

కొన్ని దారాలు కట్టిన దూర గ్రహణ వికారం మోసుకొని.. కదిలే గంటల మధ్యనే .. నిల్చునే

తను తీరిక చేసుకొంది.  రక్త దీపం వెలిగించింది.. మాంస చలనకి దిష్టి తీసింది

 పోనీ ఈ ఇల్లు నువ్వే తీసుకొని.. ఎప్పుడైనా రా .. అంది.

…………………………………

 నివు రోరణ .. ఏడ్పు కాదు.. గాల్పు పగిలిన నిద్ర రవ్వంతలపై.. పగ సమ్మతాలపై..

 ఒదిగిన ముడుల దుప్పటి.. సంచార్య నిరూప ధ్వనులని..

తను కనపడదు .. మాటని విన్నానని అంటుంది.. దోసిలి విప్పుతుంది..

మాంస కలాయంలో చికిలించిన మసాలాల మన్నిక .. దేహ భూమి కవ్వింతలు..

గొడుగు పట్టిన నిద్ర ఋతువులని కురిపిస్తూ.. సజారున ముంపులని కలిపే వేడుక.. ఇద్దరమే ..

రాత్రి ఈ గంటనే ఎన్నిక .. మన్నిక లేని శరీరం లో శాశ్వత నిద్ర గీరులతో

 కోలాట పందిరిలో .. పోలిక లేని సాధన రాత్రులతో… నీటి ధనుస్సుని ఎక్కుపెట్టి…

 మళ్ళీ చెప్పుకొన్న పెళ్లి కబురు.. అతిధులేని .. అనామక దీవిలో..

మాటా కథా లేని బొమ్మలు సంధి స్థావరంలో అలసట పోసుకొని.. ఇంకా తెలియని

 పుట్టు మర్మాలని చేతుల్లో చదివి … ఒడిలోకి రాలి.. నిశ్వాసన మొలకని పాతి పెట్టి….

  వచ్చీ .. పోయే  పడవలు.. విలాస రాద్ధాంతాలు ఉడికిన శ్వాసల కిందుగా గోరువెచ్చని నవ్వుని తాగి

…………………………………………

అంచుల నిమిత్తత లేని మసక మసక భూమిలో .. చేజార్చిన నిద్ర షరతులని మార్చి రాస్తూ .

 దేహాలు ఉడికే క్షేత్రంలో  నివు రోరణ .. శ్వాసల దేహ గదిలో .. ప్రతి క్రియల ఉమ్మడి

హద్దుని నిర్ణయించే కొద్దీ సమయపు పెద్ద కావెడలో మోసుకొస్తూ .. అదిలించిన నిద్ర వేడిమిని.. 

నిద్రనివడపోసి.. నీళ్లలో నానబెట్టి..  దేహ కల్వంలో నీరుని చిలికి .. గట గట తాగి.. అలాగే నిల్చి

పట్టుతప్పిన కొంచెం నిద్రని తానే అడిగి..ఊసులాడి.. అడ్రస్ ఇచ్చి.. బొమ్మ గీసి.. అన్నం వడ్డించి..

 ఆ మూలకి చాప వేసాక .. ఇంకో నిద్ర నుంచి లేచి నిన్ను కలుస్తామని ఆందోళ పడి..

రంగుని నానబెట్టి.. పనికి చేరిన కాళ్ళని దోష నిద్రలో ఉడకబెట్టి.. చివుళ్లు నునిపి….

కలబెట్టిన రంగుల మధ్య నిన్ను గుర్తుపట్ట లేనందుకు సిగ్గుపడుతూ.. కంగారుని నమిలి..

కాసిన్ని పుట్టుకలని కలుస్తూ… నిద్ర అనుశాసన లేని ఆ పెద్ద వీధిలో ఎదురుపడి.. నడిపించి..

ఆరాలు తియ్యని ఆ ఇంటి దగ్గర నేలపై చతికిల పడి.. అద్దంలో నిన్ను చూసి .. తొణికిసలాడి..

…………………………………

అదే బరువు.. నెలలని తొక్కి .. పైకి లేచి.. కథలని పట్టి.. తేదీల్ని దాటించి ..

ఇది ఇక్కడే ,, సాక్షిని నడిపించే చీకటి పులుముడు.. ఉండిపోయిన నిద్ర గడువులు..

అంతగా చెదరని కంటి కింద సాగిన నవ్వులోని.. ఏడుపు మిగుళ్లు సంత .. వంత పాడుతూ

దన్ను పట్టి దున్నిన ఏక వస్త్రం .. చాటు మాటుగా లేని మాటలని దాటిస్తూ .. హెళింపు..

పడగ విప్పిన చీకటి తన పాటతో కప్పుతూ .. కొంచెం పునాది కావాలని అడుగుతుంది..

నేను మొత్తం నా ఊపిరిని సంచీలో పోసి తన కాళ్ళ దగ్గరే ఉంచి.. తలుపు బిగించి…

 చాలా అన్నాను.. చాలదని తల అడ్డంగా ఊపింది. కంటిని ఎంగిలి చూపుతో కలిపింది….

ఇల్లు మరి వదిలి పెట్టిపోదు.. కానీ ఉన్నానని ఎవరి దగ్గరా ఒప్పుకోదు..

నివస్త్ర ధీమంగా .. అనలయగా ఉండిపోయిన రంగు తీక్షణం .. నొప్పిని తగ్గించి ..

బొడ్డులో బిగించి.. నడుముని కుదుపుతూ.. పెదాలని ఒంచానని .. ఇంత అలస్యమా ని అలుగుతూ..

ఆరబోసిన దేహ సగంలో ఆకలి నంజుకొని .. చిన్న గంటలతో ముడేసిన కసి గొంతు సల్లాత..

ఇది ఇక్కడే ఇలాగే ఆగిపోయి.. రెండో సెగ గొంతులో పలవరించి.. నిద్ర పోతుంది..

                                                               ………………………………….