
కథల జాగారం
విశ్వం చీకటి చాటున తన వర్ష ఛాయల చీరని సరి చేసుకొంటూ.. శృతి చేసుకొంటున్న దేహ ధార కుచ్చులు కుచ్చులుగా ఒలిచి పోయిన నాటకంలో… ఒక పాత్ర నిద్ర దోపుడుల కృతిని కప్పి … నిశ్వాస నిద్ర సరి చేసిన ముసుగుతో .. కాళ్ళని కప్పే దేహ ద్రవ నియతినీ … హద్దునీ .. దాటి … ఆవల గట్టుని వెదికే మనిషి ప్రయాణ గమన .. మొదలైన చోటికే రావడం. కళలు ఆత్మ కుశలతలోని దుఃఖ తెరని అటు తిప్పి … ఇక ఇదే రాత్రని సిద్దమయ్యాకనే చేర్చుకున్న సమ మూర్తుల తాఖీదులు అర్పించుకొని…ససోల్లయ స్థితి తీవ్రంలో ఆ ఈదిన కెరటాలు.. గంగని ఒడిసిపట్టాక .. మళ్ళీ మళ్ళీ రమ్మని పిల్చే కాశీ యజ్ఞ వాటికలో ఆమె దేహం … ఓ పండిన కథల జాగారం….
………………………….
సవ్య క్షేత్ర దీపంలోంచి పాలై కురుస్తూ .. గాజు శరీరాల వాంఛ పారదర్శక ధూళి ఊపుతో కలబడి.. కన్నీళ్ల లోకి సుడివడి ఇక స్తంభన లేని కాస్త చిరాకుతో.. తనకి వీలుకాని విబేధ్య గోడల గోడుని పట్టుకొని.. సొమ్మసిల్ల ఏడేడు గతాల వెనుక కళ్ళకి అడ్డం పడ్డ కలనీ వడపోసి… అదేమీ కొత్తగా నేర్పేది కాదని నీరస పెట్టి… సరిచెయ్యని చల్లని శరీరం అప్పగించిన తలుపుల కిందుగా హామీ లేని శేషభూమి తనని కుంకుమ మంటలలో పొర్లిస్తుంది. అప్పగించిన ఒంటిలో మతాబులు వెలగ లేదని నిందా పూరక వాహికల పొగని తడిపి.. మెట్లని గది ముందు తవ్వి.. ఇదే కాదని .. ఇంకేదో లోపలి చూడాల్సి ఉందని నమ్మించి వాళ్ళు తిరిగి కనబడరు.
శత్రు నిర్యాణం తృప్తినివ్వని వెలుగుతో తోసుకొచ్చాక జన్మ ఫలం మెత్తని వర్ణ కీలని మార్చి చూసుకొంటూ కబురు పెడుతుంది.. అది కథ చెప్పడానికే అని.. తనకెవరో చెబుతారు.. నమ్మేసావా? అని గట్టిగా నవ్వుతుంది. విరిగిన మంచం .. అరువు తెచ్చుకొన్న గాజు సీసాలు.. రెప్పని కొంచెం పైకి లేపి మీకు దిగ్గొట్టిన కిటికీ.. తేనెలో రోజులుగా నానిన దుప్పటిలా దేహం.. పాయసం పూసుకొన్న పింగాణీ పెదాలు … గాజుల అలారం కుచ్చిళ్ల చప్పుడుని తాగి.. మూడు పూతల గొంతుతో మసకగా చూసి .. మాట తడుపుకొని రెండు కలల వంతెన మధ్య గట్టుని నరుకుతుంది. చిత్ర ఋతువు పక్కకి తిరిగి .. క్యాన్వాస్ నిండా మాట తాగిన నిద్రల కరువుతో ఎండిన ఉపరి ముంపుని … జాగారాల మధ్య తప్పించి .. లోపల కడిగిన కన్నులో దీపం ఉంచి నడుము .. వెన్ను నుంచీ సరిచేస్తూ .. గమనించుకోమని నవ్వి .. సాగదీసి … మడతలని పెట్టి … కలగా పులగపు ముద్దలతో రెప్పలా కదలికనే దుళ్లగొట్టి … అనేక తీరికల మధ్య చితిని వదిలేసినందుకు చిరాకు పడి వెనక్కి నడవమంటారు.
…………………………………..
సాగిలపడ్డ శ్వాస భాగాల తీర్ధాన్ని చేరుకొని… శంఖాన్ని మోగించి.. జోలికి ముందుకు చాపి.. కన్నుని కాల్చిన ఊపిరి కూర్పులో ముడిపడ్డ జిగురు రాత్రుల్ని కలిపి ఇల్లుని కడుతూ … దీర్ఘ వశీకరణ పేటికలోంచి గంగా నుదుటిని ముద్దాడి పెద్ద గొడుగులా దీప భూమిని రక్షిస్తానంటుంది. అదేమీ కొత్తగా నేర్పేది కాదని నీరస పెట్టి… సరిచెయ్యని చల్లని శరీరం అప్పగించిన తలుపుల కిందుగా హామీ లేని శేష భూమి తనని కుంకుమ మంటలలో పొర్లిస్తుంది. సాగు చేయబడ్డ చీకటి నలతలు .. గుడ్డ చింపుకొన్న పూర్ణ కవ్వళింతనీ కాదనే ఏడుస్తూ .. ఊరు నేర్పిన సంకేత దారులు పూడిక తీసి.. ఎండిపోయిన కంటితూలుతో కలల సూత్రాన్నే సరిచేసి.. గంభీర అద్దాల విగ్రహ దేహాల తీరిక కాల్చి పోసుకున్న మండలం లో కొత్త వేడుకని మొదలుపెడదామంటారు.
అప్పగించిన ఒంటిలో మతాబులు వెలగ లేదని నిందా పూరక వాహికల పొగని తడిపి.. మెట్లని గది ముందు తవ్వి.. ఇదే కాదని .. ఇంకేదో లోపలి చూడాల్సి ఉందని నమ్మించి వాళ్ళు తిరిగి కనబడరు. దేహపు ఉపరితల కక్ష్యలో సంచరించే కోరికని వెదికి.. ఇదొక ఉన్మాయ సంకలన కూడికలోని పెద్ద నివురుల గాలి పోరుగా కమ్మేస్తూ ఉండిపోయాక .. ఇంకో నిద్ర చితిగా మరగని టీ చుక్కలు.. వడపోసిన భస్మంతో తిరుగుతాయి. నిశ్చల తీర్మాన బావిలో జలపడిందనే వార్తని కుదిపి .. కాళ్ళని భద్ర పరిచారు. కాస్త పెద్ద మాటలు ఋణం తీర్చుకొన్న తీరుబాటుతో కదిలే దూర గ్రహణం మసకబారి వడపోసుకొన్న ముక్తి సూత్రం ఫార్ములా తిరగబడి.. పోలిక దొరకక వేలాడే ఉమ్మడి సత్రాలలో స్మశాన గడుసుదనాలు ఉక్కపోసాక .. ఇదే జరగదని తను చెప్పనే చెప్పింది. పుట్టుక చుట్టూ కూర్చిన గుండ్రని ప్రయాణాల దూళి మంత్రాలతో వయసు మోసిన కంకణ మొండి చేతులు తలుపుని నెడతాయి.
ఎవరు ఎవరి లోంచి చక్ర స్నానాల మృత్యు ముంపుని కలబోసి … బొట్టుని చక్కబెట్టిన పోలికలనే మళ్ళీ అడిగి తప్పిపోయిన అరుగుల దగ్గరే పాడుకొంటుంటే .. ఎవరో జోలెలోకి భిక్షని వేస్తారు. అనుకునే అన్నీ జరగవు.. అనుకోక పోయినా కొన్ని జరగకుండా ఆగవు. అతని చెంత నీరు తడిపిన జాములో ఊరేగి .. తలమానాలయ్యే తిలోదకా శరీరాల దూరపు చూపు మందగించిన కినుక తో ఊడిపోయిన ఉమ్మడి సరిహద్దు పోరులని కట్టుకొంటూ దూపం వేసుకొన్న సూర్య సన్నాహతి ముద్దల పూడికని ఇంకా పూర్తి చేయకుండానే తను కనిపించి హడావుడి చేస్తుంది. కసి నిఘ్రాణీ తూనికని తప్పుపట్టి.. కాపలాలేని జ్ఞాన భూమి ఏమరుపాటుని అరగదీసి ఉనికిని పట్టుకొని అరగదీసి నవ్వు .. ఇంకా కదులుతూనే ఉంది… అవే కథలు.
………………………………
ఇది ఆగిపోవాలని తనలా చెయ్యడానికి ఒప్పుకోలేదు.. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆగిపోకుండా నడవడానికి ఇంత చేసి కొత్త చూపుని తొడుక్కొని కథలని మొదలు పెడుతుంది.. ఎర్రబడిన గదుల కిందుగా స్మశాన గాలులు ముట్టడించిన వార్తలతో కొంగు పరిచి విందుని చల్లారాక ముందే కలిపి ముద్దా అందించినపుడు … ఊరేగే సంతర్ప పల్లకీల కింద ఓ పెద్ద మర్రి చెట్టు గొంతు సవరించుకొని పాడుతుంది.. వినిపోవాలనే తను ఎప్పుడూ అనలేదు.. కదలికకు కారణాన్ని అడ్డగించి.. మోసుకొన్న దీవెన రాశుల కినుక మోడులా కూల్చిపోయిన గది చిత్రాల తాకిడిని దాటుతూ.. వెళ్లాలని నేను నీకు చెప్పలేదుగా ? ఉండిపొమ్మనడం .. తీరిక లేని పడవని పట్టుకొని.. శిలాజ మూర్తిగా ద్రవిస్తున్న సత్యంలో ఆగకుండా తిరగడం .. అదేమీ చెయ్యకూడని పని కాదు… కానీ ఇప్పుడెందుకు… తను మరో చలన క్రతువులో సాపేక్ష ముసిరికా మోతాదుల కదలిక వడిసిపట్టి.. ఆ ఇంటినీ మళ్ళీ మళ్ళీ చేరుకొంటుంది.
సిగ్గు ముడిని ముంచిన నల్ల గండాలని తప్పిస్తూ దీర్ఘ చలన తీరికని పెద్ద కథతో తిప్పుతారు. పెద్ద గుబులు మండుతూ.. ఇరికించిన చిత్ర దూరాల పొలమార్పుతో కథల మూర్తిని తిరిగి పోత పోసి … కాశీ నగరం లో తప్పిపోయిన సన్నాయి తీరికల గంగని తలలోంచి తీసి.. దాహ గొంతుని మరిగించిన స్థల పూర్ణత లేవదీసిన చీకట్లో కమ్ముకొచ్చిన నిండు రాతలు చేసుకొనే జాగార దర్శన. కల కలలని దీపం లోకి కళతో నింపి జాగార ముఖాలన్ని తాడుతో పేని.. విసిగించే నిద్ర పొరల తవ్వకంతో జోడించిన కొత్త కొండల వెలుతురు … ఊరేగించి చిత్రపాటులతో తప్పిపోదామని అనుకోక ముందే .. సరిచెయ్యని చీకటిగా ఇంకిన నల్ల తెరల ఊలని మోతాదుగా పట్టించి .. గజ గజ లాడుతున్న బరువు గాలి వరదలని .. ఘటనలకు వేలాడదీస్తారు.
దయా కనర్హత ఊరబెట్టిన నడకలతో తీరికగా అల్లుకున్న స్మరణ కంటిని లాలగా తెంచుతూ .. స్వేద ఛాయల కప్పుని మోసిన ఇంటిలో .. తన తడబాటు ముఖాన్ని కూర్చోబెట్టి .. తలకిందులు జ్ఞాన కుదుపు మోసిన కూర్పులతోనే బొమ్మ గీసిన అంతః తర్పణ వెలిగే కళలు. ఇవే తనకి తెలియకుండా నా దగ్గర దాచుకొనే.. ఒక్కొక్కటిగా బయట పెట్టినప్పుడు .. కోపంతో తను ఇల్లు వదిలి వెళ్లిపోయింది.. ఇకంతా తప్పిపోవడమేగా అని.. ఎవరో వంకరగా భృకుటి ముడిపెడతారు. లోచనల మండలం లో దర్శ మాత్రల ఋణం తీర్చుకోలేని విసుగుని వడపోసి ముంచుకొని జాగారపు బొంగు గొంతుతో నడకని చెట్టు కింద ఊరబెడతారు. ఇక వినిపోవడానికి ఎవరినీ కాదని … కొంచెం సిగ్గు తడిచిన వెసులుబాటుతో తలుపుని మూసి కొత్త పాట దొరికిందని అబద్దమాడతారు.
కొంచెం ఆఖరినించీ మొదలు పెట్టిన మొదటి మెలిక తీరిక చేసుకొని … నిందలని ఏకం చేసే కలల మత్తుని ఊరేగించి .. తడిచిన ముహూర్త రాజీల తొక్కిడి తంత్రులని నారదీసి .. మోపుకట్టి.. సరుగుడు తోటల వెనక మూర్చిల్ల గుడిని కడిగి .. ఓ నిద్ర పోయి లేచేసరికి … తను కథతో ఉంది. అక్కడే వద్దని వదిలిపోయిన దేహం తొడుక్కొని .. నువ్వు మళ్ళీ మృత్యువుని చూసి … ఎలా అన్నది చిత్రించడం కోసం చెబుతావా? వెసులుబాటు లేని సవరింత నడకని ఊరబెట్టి .. చల్ల జేసి .. నీ పెదాలమధ్య ఆచూకీని వదిలించుకొంటూ.. పిలుపు ముడిని వాదులు చెయ్యాలని.. మహా నింద చెంతకు చేర్చిన ఆనవాళ్ల బయటనే నేను కొన్ని పోలికల కోసం రక్తాన్నీ .. మాంసాన్నీ .. రసాయన తీపుల తిమ్మిరి రమింతనీ మింగి.. గతి మండలం లో కనపడకుండా పోయిన శ్వాస దర్శన పుట్టుకలని రెండోసారి దులిపి దుప్పటి పరిచాక .. ఉడికీ ఉడకని మాటలు .. గాజు జాడీలో ఊరుతూ.. నాలిక చివుళ్లు పట్టుకొన్న పడవ ఊరేగింపుగా నమిలిన నిద్ర సగాల దీవి.. అక్కడనే చెక్కి పోయిన కథలనే .. లాక్కొచ్చి నా ముందు ఆరబెట్టి.. తన బట్టలు మార్చుకొని వస్తానని లోపలి వెళ్ళింది. ఇది తన కథ కాదు.. అది నేనెప్పటికీ రాయలేను.

