BLACK & WHITE

Download Free Ebook
Download Now

                                                     బ్లాక్ & వైట్                 16.01. 2026

సినిమా అను సమాంతర వర్తమానంలో కల జోగడీలు

(Intro of suspicious narrations)

CHAPTERS UNFOLD …..

Screenplay of life vs cinema

1.మొదలవ్వక ముందు కథ  adhi sankaracharya

Formation of artist

a)దశాబ్ద  గాథగా నేను   .. మాగిన  తెరలు .. ఆ  నేను  ఎవరు ?

b)వెలిసిన రంగులు.. చెక్క తుపాకీలు.. కొండల్లోంచి గుర్రాలు.. కాలువ ఒడ్డున

c)సైకిళ్ళు.. మంచు రోడ్లు.. అర్ధ రాత్రి కుంపట్లు.. టికెట్ క్యూలు ..గది కిటికీలోంచి చూసి..

d)విప్పిన నిస్త్రాణ .. మూడు కళ్ళ అవతల .. సాక్షి భూమిలో ఎండు నదులు

e)పడవల గూడెం వెనక .. ముద్దు నిందలు.. తరుముకొచ్చారు

f)వెర్రిబాగుల  వీధులు.. స్తోత్ర ధారణ .. కంటి నూగుల జ్వరం

g)వెలిసి పోయిన శ్వాస నాడులు .. తడి కాళ్ళ అవధి.. కట్టి చేరుకున్నాం

h)అప్పగించిన శరీర నిధి.. అటు చీకటి కమ్మిన ఇంటి వెనక … నిలబోత

2.కన్నుని సెట్ చేసిన ఫ్రేమ్స్ .. హద్దుని కిందికి తోసి..

Geethanjali.. bombay … (Origin of love stories)

a)వర్ణ  చలనంలో   .. మృత్యు  పూతలు .. DOP 

b)నిరాధార ఆనుపానులు.. లోపల కంట్లో నీరు.. కదిలే కాస్త రుణాల తాకిడి..

c)తప్పిజారిన వీధి ముఖాలు.. ఒప్పుకొని ఉన్న తెర వెనక మేకప్ .. నిషారపు ధ్వని

d)రంగుల్లో సాధన .. నేర్చు పెట్టుకొన్న నటనలు.. కలిసిన నిందలు  parineetha

e)సఫల నీటి ఒద్దిక .. గది కంట్లో గంటల భుజం.. అలార రజనులు.. ardhasatya

g)నాచు పట్టిన రాళ్లు .. సముద్ర నాడులు.. అటు తెల్లవారాక….

h)కెమెరా గూడులు .. ఎత్తి పోసిన చీకటి నెల .. కదిలే గుడి

i)శరణు పోలికలు .. నిండిన హద్దు .. మరోలా పట్టుకొని

3.స్టోరీ ఆన్ ట్రాక్

Sampoorna ramayanam … pyasaa … mahanati

Youthfulness … incidental confusions

a)నిరాదరణ  .. కన్ను  జత  చేయని  నేరం .. మట్టి  జాడీల్లో   సినిమా 

b)ఆకలిప్త అసహన నిజాలు .. కిందికి చేర్చిన మనుగడలు.. ఒరిసి పోయిన డ్రామాలు.

c)కలిసిన కాల్పుల్లో మోగిన తూఫాన్ .. కదిలే నిద్ర రాళ్ళ జోడింపు.. పొడి గొంతులు

d)నిఘారమిత సంధి స్నానం .. వాన కలుపులు.. నీరెండ నడక

e)ఆర్ద్ర సంధ్యారి … దుఃఖ మతి.. అలుపు రాలత

g)మొండి రాతలు.. కప్పిన కంటి చోటు .. మళ్ళీ కలిసి..

h)విడదీసి రమ్మని.. అక్కడి చిత్ర కూర్పు …మాయాన తీరికలు

i)వండి వార్చిన హద్దు .. కదిలే రుణ వీధి .. మోసపు వడ్డన

4.డార్క్ coincides .. ఫిమేల్ anxiety

Fire … chitrangadha … maidhanam

Body on fire … dilemmas

a)కప్పిన దుఃఖ పరిధి.. హద్దు లేని జాగరణ .. లాంతరులో కంటి గోళం..

b)పొందిక లేని వీధి బొమ్మల అడితి .. వాలిన నదిలో నవ్వు… పరిలిత హార్ధన

c)ఒంటి పూతలు..జాలపు ఛాతీలు.. నిరావేశ స్థిర కూర్పులు

d)కెంపులు పండిన గొంతు.. నీల రాగంలో మైరేయ … పొద్దుకి ఊరట..

e)నిండు తీర్ధాల కైపు.. జడ గుప్పిన చూపు.. ఆ మత్తుని ఊగించి..

g)నిద్ర స్మిత మందకొడి ..కాల్చిన ముఖాలు .. సంధి రుణాలు

h)సమయ ద్రవ హేళన .. కంటి వార్పులు.. కథలో చేరుకొని..

i)మర్మయ దేహ చలువ ..ఆవార్తవ నరాల బిగువు ..ఏడ్చిన సలింతలు..

5.గుహల్లో చలి నిగ్రహాలు .. పోదారి పొగలు

Arebian nights .. chakde … paheli …

Freezing love stories … dark folders

a)Dream droplets  .. twisted Interval .. నేయని పాటలు

b)అప్పగించిన తప్పు కీడులు..చేరిన కథ .. నివధి భాషణ .. నేయని చీకటి మొర

c)వికిలిన కంటి ధూళి .. సగం పాడిన మాట.. దేవుడు కప్పిన గుడి

d)సర్ప దోషం.. అలిగిన నీటి గజ్జెలు .. ఏడూ రోజుల వరం   taal

e)గాలించిన నింపాది ఇల్లు.. అందని screenplay .. కథ మొదట్లో దిగి..

g)ఉండటం లేకపోవడంతో ఏం జరగదు.. నిద్ర ఊడలు .. ముసిరిన కథలు

h)దుప్పటి ముంపులు.. కదిలే నీటి గదులు.. పడవ చేరనివ్వదు

i)అయత్న నిగర .. పట్టి చూసిన చూపు.. వద్దనలేదు.

6.ఆవర్తన సంధి చలన   .. పిలవక కలుస్తూ

Bhoo kailash … devi .. mid night children

Lonlyness … secrete stands

a)గోడలు లేని ఇల్లు  .. మసక బారిన చావు.. Pre climax 

b)నిశిత నెగడుల చావు.. నాలుగు రీళ్ల ప్రదక్షణ.. తల జోడింపుల తోడు

c)ద్రవ నిర్జర .. పోలికల్లో పడి నాజూకు రంగు.. సేవన రాశులు

d)నిరంగ మైధూపులు.. మూడో కొలుకుల్లో వేడిమి.. తనిఖీ ఋణం.

e)విరూప స్టైధీన .. ముగించిన అలుముడు.. తోడు కలిసిన చీకటి నీరు

g)చంద్ర ఊటలు.. ఉక్కిరి మెట్లు.. రెండు జతల రోజు

h)నివేశ శపిత … ఆర్ద్ర సార్ధకం.. రుణ కూర్మి

i)చందన నిద్ర గతులు.. లోపలి మడుగు.. సమర్పిత తోడులు

7.హెచ్చరిక మోసి తెచ్చాక .. కళ్ళ విపులాలు

Devadas … iddaru .. chokerbaali …

Life on confused decisions … circumstantial evidences

a)తోడుగా  చలన  కక్ష్య  … గురుత్వ  విరోధ  .. Scream  of max.

b)ఒరిపిన దేహ లజ్జ …నుదిటి కూర్పు.. విగత కేకలు

c)రుణ విగ్రహాల ఓడ .. ఒరిగిన గట్ల నన్నుడి .. ఊహించక ముందే.. open homer

d)కలిసిన ఎద్దడి రంగులు.. లోపలి వణుకు.. అవకాల నింపుడు

e)కదలిక ఎండిపోయి.. ఉన్నదీ కనిపించక .. లలాయీక

g)ఏక వస్త్ర చాలన .. భరిణెలో పాము.. మంగళ శేషి

h)కళ్ళగంతల యేరు .. సాధనాల కైపు.. దడ రాలిన నింద

i)చీకటి సీసాలు.. ఆమ్ల దారుడి.. కదలిక ఒరిగి..

8.సరి పెట్టక ముందే.. నిండా కప్పిన ఆలస్య నిర్యాణం

Avathar … godhavari … life became dream

a)రెండు క్లైమాక్స్ లకి .. ఒకే కథ .. దేహమూ..

b)వర్ణ నైకల్యం .. కథ లేని ఊరట..అక్కడ జరిగిన హద్దులే కప్పుకొని..

c)నిరా వికారి.. చేదు చెమట .. అంతా మారుతుంది … erra gulaabeelu

d)సవ్యక్త  ధామం .. సర్దిన వేడుక .. విరుచుకుపడి..

e)ఆది స్వర్జన ముంపులు.. రగిలిన చెవి.. ఉన్నట్లుగా లేక ..

g)వదిలి వెళ్లాలని… నుదిటి కక్ష్య .. అవాహ గుర్రు

h)రక్షా వచన కలకామి .. పొడి రాలిపోతూ.. హద్దు మాత్రలు

i)మృత్యువుల దేహ నిష్కార .. కదిలే గంటల హోరు .. సగం మాట్లాడి.

సినిమా అను సమాంతర వర్తమానంలో కల జోగడీలు

(Intro of suspicious narrations)

దేహ రుణ గాఢత పాడిన చెమటలు మధ్య .. హఠాత్తుగా చీకటి కమ్ముకొని.. జోడించిన శరీర తలాల బరువుని సాగదీస్తూ.. పేరుకు పోయిన ఆయాస నీరులా …  వదలక తెర్లిపడ్డ కథాసారం.. గుబుసలుపడ్డ సగం తేలికల ఋణం బయట ఎవరో బయటకి పిల్చినా వినపడదు.

అప్పుడిక సినిమాహాల్లో ఎవరమూ లేం.. ఇద్దరమే .. ఎవరు మమ్మల్ని చూస్తారని తనేం అనకుండా .. పాడటం మొదలు పెట్టింది.. సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ ..  పాట అనుసంధానం తో .. నేను దానిలోకి వెళ్ళిపోయినట్లుగా….

నాన్న చితి కాలుతున్నప్పుడు ,, వెనక సినిమా తెర .. ఆ పెద్ద కళ్ళ నటి .. నన్ను దగ్గరకి తీసుకొని.. ఆ పడవలో ఎక్కించుకొని .., నది మధ్యలో .. తాను .. మొత్తం మా నాన్న నడిచి వచ్చిన మామూలు లైఫ్ ని గొప్పగా అభినయించి చూపుతుంది..

నాన్న చితి నా కళ్ళ ముందే నదిపై మండుతుంది..

కథ చెప్పడానికి నది చప్పుడు చల్లారే గుహల్లోకి వెళ్లి .. నా కోసం వెనక్కి చూస్తుంది.

అమ్మమ్మ తాయిలాల బిందె నిండా సినిమాలుగా మారిన చందమామ కథలు.. నిర్వాణ పట్టుని వదులు చేయక ముందే కలిసిన దూరంలో ఊరేగే సినిమా బండి..

చప్పిడి  నవ్వులు మోసుకొన్న నల్ల ముతక బజార్లు..

నల్ల రేగడి పులుముకున్న మర్రి చెట్లు.. కలబాటు నడకతో తూలిన కంటిపోటుని దువ్వుకొని.. విసిరినా రొమ్ము వరదలో పడి .. తీరిక దొరకని దుఃఖ మండలంలో ఊగి.. తొక్కిడి కెరటాల మధ్య కూలిన గట్లు … మెరిసిన కొండలు.. చెమట దులుపుకొన్న పడవలు..

కథ నిడివిని మోసి తెచ్చుకొన్న ముఖాలతో … పేర్చి పోయిన కొండలని దాచుకొని.. ఝాము మంద్రతలని అరగదీసి … అద్దుకొన్న నిన్నటి కఠిన బంధిత ఆనవాళ్ళని పై పై నురుగులతో … తచ్చాడే గంటలని చల్లారబెట్టి గుమ్మాలని పట్టుకొని మిశ్రమిత హెచ్చరికలని …

………………….

ఆ పెద్ద సినిమా హాల్లో హిమాలయాలు.. చలి గుట్లని విప్పిన చితికి దగ్గరగా శిఖరాల తవ్వకం..నేనై కలబడి మాట తీసుకోవడానికి మరేం మిగిలి లేదు. విశ్వపు తమక హేయన వడపోసిన ఖాళీల్లో…

రంగు రంగుల మేకప్ కిట్లు.. చెమ్కీ చీరలు.. గడుసుగా నసిలిన ఏడుపు.. లోపలి చీకటి ఆరణంలోకి దూకిన వెడల్పైన వింతన…నెరలింపు… తాళం కోసిన పెదాల దారకి పదునెక్కిన చెమట పరుగులు..

అట్ట ముక్కలు .. థెర్మోకోల్.. ప్లాస్టర్ అఫ్ పారిస్ మాయాజాలం.. మంత్ర దండపు పొగలు.. భూ గృహంలో వాడు చనిపోగల రహస్యం.. పై నుంచి పగలగొట్టుకొని లోపలి చేరిన మంత్రం దీపం..

హీరో ముందు ఆమె ఏడవడం లేదు.. తానూ కత్తి తీసుకొన్నారుకుతుంది.. వాడి తల మళ్ళీ మళ్ళీ వచ్చి అతుక్కొంటుంది.అయోమయాలన్ని అతనే పగలగొడతాడు.. అలా ఆమె ఒప్పుకోలేదని .. ఆమెనే మూవీ నుంచి తప్పిస్తారు.

జయించాల్సిన అడివి నగరంగా మారి వెక్కిరిస్తుంది..

శాసన బిళంలో కనిపించని ఆందోళన .. అక్కడే పగిలిన అంతస్తుల బిగువుని తట్టిలేపే ప్రేమ .. సీసాలు ప్రవహించడం.. లోపల నుంచి ఇంకేదో శూన్యం కడిగిన పరిష్కారాలతో నేను.. కట్టి వదిలేసిన సంకల్ప ప్రమిదలు వరదాగా మొదలై.. కూలిపోయిన నిరాకార దేహం పట్టుకొన్న నిశ్చల రంగుల రీతిని శుభ్రం చేయక ముందే .. గాలీ.. వాన ముంచుకొచ్చే.. రైలు మధ్యలో ఉండగా .. వంతెన కూలిపోతుంది..

ఆమె కి మరొకరితో పెళ్ళైపోతుంది..

కానీ అతను కలకత్తాలో తిరిగి బతికాడు.

స్వయోమయతకి సరిపెట్టుకోలేని కంగారులో.. ఇప్పుడెలా .. ఇంట్లో ఎవరూ లేరని .. తాను వచ్చేసి నిలబడింది… ఇప్పుడేం చెప్పాలి.. గుప్పెల్లో నుంచి చెమట కారి.. ఒళ్ళంతా వణికిపోతూ.. హద్దుని చేర్చి పెట్టుకొన్న శరీర చలనకి ఎర్రని హెచ్చరికని కట్టి .. తోడిపోసిన నడకలు..

అదొక ఉచిత సత్రం ,, పెద్ద గది.. రచయితగా ఉద్యోగం ఇప్పించి .. తన పెళ్ళికి పిలిచింది.

 శోభనం గదిలో అతను చనిపోయాడు.. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.

అనేక అపవాదులు.. ఇద్దరమూ .. ఊరు వదిలాం .. ఒక రోజు నన్ను వదిలి సినిమాల్లోకి వెళ్లిపోయింది.

………………………..

అసహనం .. సహన ధ్వనిలోకి చేరి కాలిపోతూ.. హద్దులు చెదిర్చిన నడకని కలిపి .. ఒక భోగ శాలలో కూలిన కంటి జ్వరం.. తడిచిన సాయుజ్య దాపరికాలతో .. కలతని చేరదీసి చూపు చివర చనిపోయిన శూన్యం దాటి .. చెదిరిపోయిన నకిలీ నవ్వు.

గుండ్రని నిర్లజ్జలోంచి ట్రిలిగి కొట్టిన శాపం..లోపల కనపడని అనుమాన దేహ గృహపు సందడిని కదిల్చి.. నీరు పోసుకున్న కలల వెంట పడి .. తీగలుగా అల్లుకున్న నడకని మడత పెడుతూ.. హద్దు చెదిర్చిన కంటి లోపల సాగ దీసిన శరీర ఋణం…

ప్రాణ  నిధిని   కంటి  నిండా  కలుపుకు  పోతున్న… ధ్వని మాల తెగిపడ్డ దాడిని కాచుకొని.. తెల్లారిన మాటలని సవరించి… హద్దుని చేర్చి తెగిపడ్డ కలుపుకోతలని ఏరిపారేస్తూ.. రీళ్ళని రీళ్ళకి చెమర్చిన నాజూకు మంత్రపు చెమటని పట్టి … రాల్చిన కునుకుని సాగదీసి మరకలని తుడుచుకొని.. గోడలపై నిండిన తెరలతో పట్టుకొన్న దేహాల ఉరుముని పట్టుకొన్న చీకటితో … హద్దుని తప్పించుకొని.. ఇదొక పులకిత మండలంలో మొదలయ్యాక తిరిగి ఆచూకీ దొరకని ఊరేగింపు.. వేసి తీసిన సెట్.. లెన్స్ పగిలిన కెమెరా..

తేరుకోలేని నిద్రజ్వరిత అపరిచిత కంటి చీదరతో … కొలిక్కిరాని నిరాపేక్ష దీపపు సన్నుడి ముందు.. అతను తన ప్రదర్శ చలనపు మంత్రం జాగారం కాలిపోతూ…. ఇంటికి … బయటకి వెళ్ళీ లేకపోయినా అద్దపు తలుపులని … తెగిపోయిన మాటలని వడపోసిన దిగులుతో పండిన అలసటని చేర్చుకొని …. ఊపిన దేహ ధారణకి .. వరాలు పోగుచేసి.. కాల్చి పెట్టుకొన్న నిశ్వాస గండం దారికి దొరకని ఝాము మొదట్లో కూర్చిన చీకటిని వదులు చేసి..

కథ మరోలా దుప్పటి కప్పుకొని.. భయానికి చూచిన కంటి నలతని కడిగి .. లోపలి చూసుకోమంటోంది.

CHAPTERS UNFOLD …..

Screenplay of life vs cinema

1.మొదలవ్వక ముందు కథ

( adhi sankaracharya .. sankarabharanam)

అసందిగ్ధ  నిర్విఖండం.. వాంఛని బిగించుకున్న కంటి కాపలాని తప్పిస్తూ.. కదలాడే నిష్ఠ భూమిలో పేరుకు పోయిన దృష్టి కంపనాల చిక్కటి బెదురుని విసిరాక .. కొన్ని నిర్దిష్ట ప్రేముల్లో పట్టి .. ఊపిరాడని దేహ పోతల నిండుతనం కారి ,, ఋణం కరిగిన హద్దుని వద్దనుకుని కదిలే నిద్ర ముందుగా ఉండిపోయిన ఆకార దర్ఫనాలు.. ఉద్ధడిని ఏమార్చిన .. అప్పటికే రికార్డు అయినా సత్యం ఒడిలో గింగరం తిరిగే కొండచూలుల నొప్పిని .. పడవల్లోకి పట్టిన ప్రసవాలు.

విస్మితః నిండు పోతలతో తెగ్గొట్టి .. పెరిగి పోయిన నమ్మకాలు.. ఒద్దిక లేని నిశగామిత తొందరలని అద్దుకొని.. పోటుకి గుచ్చుకొన్న ప్రయాణ తీరికల వెనక .. తోడు పOడని నిలిపే ముఖాల చుట్టూ .. కలిపిన సగం హడావుడి .. సగం పొందిక లేని అసహన దృష్టి నిలిపివేతలో ..తనతో బుజం కలిపి నింపేసుకొన్న సాధ్య నిరమ్య ముఖాల కౌగిలిలో ఉండిపోయిన కారణాలు. తోడు పడ్డాం .. గతిని కప్పుకొన్నాం.. ఇదంతా ఇలా అర్ధం కాకముందే మొదలైపోతాం. అక్కడే చేరగిలిన అపక్షేమ తీరికల్ని దుళ్లగొట్టి.. ఇంకా దొరకని నిర్వచనంలో… కొత్త చోటుని కాన్వాసులో చుట్టి.. కెమెరా గాధలని అనుకోని.. ఆ కథని దగ్గర చేసుకొంటాము.

సత్య దేహకూలతకి ముందే కవ్వించి వగరుస్తూ ..దిద్దుకోలేని వెన్ను తీరుల మేకులని దట్టించిన సెట్ లో పడి ఏడుస్తూ.. వికేంద్ర నిపూర ధ్వని కలుషిత మరకని తుడిచి.. హద్దు బయట కడిగిన చూపుని ఎగదోసి అక్కడే నీటిని పెనవేసుకొంటారు.

చలన నిషారిత హద్దుని దాటి ఆ పై నుంచి దూకాలని .. కనిపెట్టుకొన్న శాసన ఖండంలో కొట్టుకుపోతూ.. కథని పట్టుకోలేక .. తప్పి పోయిన చీకటికిని కడిగి.. హద్దు చెదిరిపోని కవ్వింత  రాట్నాలని  తిప్పి.. ఉమ్మడి కలతని తిని సొమ్మసిల్లిన ఏక నిరామలీన సింగల్ లైన్స్.. సత్య దేహకూలతకి ముందే కవ్వించి వగరుస్తూ ..దిద్దుకోలేని వెన్ను తీరుల మేకులని దట్టించిన సెట్ లో పడి ఏడుస్తూ.. వికేంద్ర నిపూర ధ్వని కలుషిత మరకని తుడిచి.. హద్దు బయట కడిగిన చూపుని ఎగదోసి అక్కడే నీటిని పెనవేసుకొంటారు.కథకి ముందూ.. వెనక ఆవరించుకొన్న నిండు మోతల బరువుతో కదలాడి .. కలిసి చేర్చుకొన్న నిర్ణిద్ర స్థితం కప్పిన వెనకా .. ముందూ కదనపు మండలాల దశని మార్చి … మళ్ళీ మొదలుపెట్టి..

దేహపు మధ్యస్థ ఎడారి కట్టడిలో పేరుకు పోయిన నిద్ర పూతలని తెరపైకి తేవడంలో .. నేను నీ దగ్గరకి జరగడంలో .. విశదీత కరగమోతలని దాటుకొని.. చిలికిన ముట్టడి రాత్రంలో పడి .. ఊపిరిరాటని దించి.. ఆ రిహాల్సస్ మొదలుపెట్టినపుడే.. తనకి ఓ గర్భ వాకిలి తెరిచిన రాత్రి ధూళిగా దులిపి.. కట్టి పడేసిన కంటి కూపపు దాహ వార్త కదిలే మబ్బుల దేహనీరుని వడపోసి.. నికరణని తాగి .. వలస చేరిన నుదిటి పాటని కొట్టి .. పాడుబడిన ఊరుని చేరుకొని.. ఆమ్లత ముసిరిన నిందలని కాల్చుతూ.. నియామిక కంటి జోతలని వడపోసి కదిలే .. నిరూపిత దేహ వణుకుని మూసేసి .. కళ్ళలో కూరుకున్న సాపేక్ష ధ్వని మంత్రపు శరణుని ఎక్కుపెట్టి.. అడిగిన దోసిలి మండలంలో పేరుకున్న కూల్చివేత.. నివార రొప్పుని పోగు చేసి కాల్చిన ప్రయాణ కేలింతకి వీథిని తోడమని చెబుతూ ఉన్నప్పుడే .. అలా జరిగిపోయింది.

కన్ను చెదిర్చిన మంథన కూపాలు.. ఒరిగిన పాత్రలన్నీ .. ఆ చీకటి గదిలోంచి ఒక్కసారిగా మీదకి దూకాక .. ఏదో లేదని తెల్సిన దూరపు కాపుదలని మరగబెట్టి.. తెచ్చి కట్టుకొన్న గోడల మధ్య నిలువు కందకాలని దాటిన ఎత్తు గొడుగుల పునాదులు. శాప ధాతువుల అశాంతర గడువుని తాగి.. ఋణం తీరని శ్వాస బిగువుల నిష్పత్తి తీరుని బిగించి కట్టిన కక్ష్యల్లో ఊరేగే నిండు సూత్రాల నిఘరీత ,, కల్లారిన తీరు ముఖాల నిండు గేలానికి చిక్కిన అస్పుట దర్పణం అద్దాల్లోకి బొట్టుగా గుప్పిన దిద్దుబాటుతో .. అమరికని బొడ్దులోకి తోస్తుంది.

a)దశాబ్ద  గాథగా నేను   .. మాగిన  తెరలు .. ఆ  నేను  ఎవరు ? sirivennela .. paather

నేను దొరకని నా రాతల తవ్వకం.. ముసిరిన ఎర్ర గొంతులు .. స్థిమితం మోసిన చీకటి నివేల భూతం కమ్ముకొన్న లెక్కల్లో … ఏళ్ళ తీరుకి దొరకని నిష్ఠూరణ కేక.. వదిలించుకోలేని తెరల మధ్య ఊరేగే నిండు ద్రవ ముఖాల ఊర్పుని కడిగి.. దృశ్య హద్దుని ఏకం చేసిన నివేరపు అలతి చూపుని కప్పిన రంగులకి చిక్కులు విడదీసి.. ఫొటోల్లోకి దిగిన ఆయురాహాల ముడి ఒంపుని చెక్కి.. ఊరగిలిన చెమట పొందులో .. కక్ష్యాలని చేర్చిన ఖాళీ గడువు సాగదీసిన సెగలు..

మంచుతో మండించి…. తేనె జాడీల్లో యుగాలుగా నానబెట్టి.. .. మంచి గంధం చెక్కలతో కాసేపు కాల్చి.. మునివేళ్లతో చెక్కి … ఆల్కహాల్  మోసిన బరువు రెప్పల తూగు .. మంద్రజాలం పట్టిన పెదాల్లోకి.. గొంతు మగత వడపోసిన నీటి బొమ్మలా ముందు నిలబడి.. ఆ నేను ఎవరని అడిగినప్పుడు .. నిశ్లేష గంభీరక సమాధి ఊరటని కాదని .. నిండు కుండల్లో పాతుకొన్న నిశ్చయ కాపుని .. తొడిగిన హద్దుని దాటి.. అక్కడికి ఎలా కెమెరాని అనుకోకముందే.. ఎవరో టికెట్ క్యూల కోసం మాట్లాడతారు.

నీరు పట్టిన భాగహార ముడులు.. ఎంతకీ తోవ దొరకని తాటి చెట్ల తోపులో .. అంత పెద్ద సముద్రం ముందు .. ఒంటిరిగా నిలబడినప్పుడు కనిపించిన .. ఆ నేను ఎవరు?

వాడు రెండో గదిలో నిద్ర పోతున్నప్పుడు.. తను కొంచెం నన్ను అటు  జరగమని .. పెళ్లి జరిగే ఇంటి కూరగాయ సంచుల మధ్య కూర్చొని వెళ్ళినపుడు తెలిసింది.. నేను ఎవరని?

సాయుజ్య నిండు తలంలో దీపం దోసిలిలో పెట్టి.. వెదురు కడవలు ఒంపిన పాటని తాగుతూ.. నన్ను మర్నాటి వరకు లేపనే లేదు. నది పక్కకి పిల్చి .. వదిలి పెట్టిన ఆ పడవ ఇంటిలో ..తను వండి .. నాకై వదిలి వెళ్లిన జున్ను కుండ .. అదీ వేడి వేడిగా .. మిరియాల ఘాటుతో..

దూరంగా వెన్నెల తాగుతున్న కొండ చూపించి .. అక్కడకి వెళదామా? అని అడిగి .. చలన వశీకరణ ముంచిన ఆరోపాలతో దశాబ్ద  గాథగా నేను … ఇది  వెనక నుంచి ముందుకి మొదలయ్యే ఫ్లాష్ బ్యాక్.. ఆరోపణలు లేని మైదానంలో తవ్విన గ్రహణాల ముద్ద .. తడబాటుకు వెనకగా .. ఋణం పండిన కథల మధ్య కదిలే గాలి కొండల తీరుని పట్టించే కెమెరా చాటుగా .. చీర మార్చుకున్న చీకటి రుణాల గొడవ.. గుబులుని తలకి రాసుకున్న మంచు మండలంలో పెనవేసుకున్న రక్షా నాడుల పొగరు చప్పుడు..

ఇంకా ఆ వెనక్కి.. ఇంకా వెనక్కి.. కనబడని నేర సందోలాల మూర్తిని కప్పేసిన భయ గతులని ఒడిసిపట్టిన కథలని తోడుకొని … మార్చి రాసిన మలుపులతో బేరీజు వేసుకొని..ఒద్దిక లేని నెలల జోడింపుని కంట్లో పెట్టుకొని .. ఇంకిన నడకలా ఖాళీలని అట్టే పెట్టుకొని.. తప్పిపోయిన బెంగాల నులిమిన పాట .. శ్వాసని దాచిన మంచు మడుగులో .. కాలి పట్టీల చప్పుడుని వెలిగించే వర్ణ ప్రవేశ హద్దులే గాలింపు… బంధన కలహాలు లేవని లోహిత కంటి నీరు దాచుకొన్న కొండల మధ్య గూడు కట్టిన బెంగని మరిగించి .. ఎంత చెప్పిన ఎవరూ వినరు.. రాత్రంతా ఏదో చేసే ఉంటారనే నిలదీతని మోసుకొని.. దర్ప దోషపు .. నిత్సర కలుపుని చేర్చుకొని .. ముఖాలని చేర్చి చిదుముకొన్న కలత తీరక ముందే ఉండిపోయిన ఖాళీలని దాటి.. కొంచెం రుణ పడ్డ కదలికనే జోడిస్తారు.

చెదిరిపోవడానికి దేహ క్షితిజ సత్తువుల ఊపుని తిప్పి రాస్తూ.. రాజేసిన గాలి నిమిర్పుల జలని తవ్వుకొని.. ఇంకిపోని కంగారుని కూల్చి.. హద్దు మోసిన శరీర శాలలో ఊరేగే చందన కొండల్లో దర్శన చితిని తలలో చుడతారు.. నానమ్మలా మనమూ అంతేనా .. తులసి నీళ్ల గురకతో.. గొంతులో కొత్తదే శ్వాసని వదిలించి.. సినిమా తెర వణికి .. ఆరబోసిన మట్టి కన్నుతో లోపలి లాగి .. వెక్కిళ్లు పడుతుంది.ఆగ్లయుతపు నీటి అవధిని మసకగా దాచుకొన్న నీరాది గతుకులపై .. కన్ను పిసికిన చీకటి కుండపోతల కలతని ఉతికి … వెనకా ముందుగా అతికిన ఎడిటింగ్ హద్దులే తెలియని దీర్ఘ వీధిలో .. పేరుకుపోయిన అవశేష నిర్మిత మట్టి ముంతలతో.. ఒకేసారి తోడైన నది కూరుకుపోతూ స్థలం మార్చిన రేపటి ఘటన.. అక్కడ మాటల లోపల పేజీలు దొరకక .. రాసుకు తెచ్చుకొన్న స్క్రిప్ట్ నలిగిపోయి.. ఉండిపోయిన కలలని దాటి .. నల్ల సిగ్గుల గతం నేసిన కంటిలో పేరుకుపోయిన జ్ఞాన విపాసి మోహరింపుని కడిగిన కాళ్ళ దగ్గరగా .. అదే అప్పటి సెట్.

b)వెలిసిన రంగులు.. చెక్క తుపాకీలు.. కొండల్లోంచి గుర్రాలు.. కాలువ ఒడ్డున sholay sapt

ఉండి ఉండీ .. బయలుదేరిన పెద్ద వెలుతురు భగ భగల్లో .. ఉరిమిన సెగ జాడల దేవుని అర్జీని చెరపకుండానే కుదుపుని అతుకుతున్న ఆ కొంచెం శ్వాస సేకరణ చేసిన కదలికనే ఊరడించి.. కదిలే నిద్ర రిక్కింతని తడిపి.. దూరం జరుపుకున్న కాసిన్ని ఖాళీలని వదిలిపెట్టి.. దోసిలికి పొగ పెట్టిన భస్మ మోడులు తవ్విన మొండి చేతులు… చీమని నులిమినప్పుడు .. గుర్రం మోసిన శవమూ .. ఊరు మసకబారిన బరువుతో.. గొంతు దిగని ముద్దని వదిలి .. పరుగుతో చేరుకొని..

గాలి బుడగలు.. నిద్ర ఊపులు.. కలబడే తీర్ధ గతులు.. ఒద్దికని చూపించే కంటి పోతలు..గారడీలు కూలగొట్టిన ఆ పెద్ద తెల్ల చీరల గదిలో దీపం చల్లారి .. చూపు చివర వణికిన కథలో కూర్చొంది. కథలోకి రావడానికి ముందే తూపాకీ పేలుతుంది.. నిండు గర్భిణీ తలుపు కొట్టి.. కాసిన్ని పాలు ఉన్నాయా ? అని అడిగినప్పుడు.. వందల గుర్రపు డెక్కల హోరుని తాగి సొమ్ముసిల్లిన పై నుదుర్లలో పేరుకున్న చీకటి మరకలని తుడిచి.. కలిపి చుట్టిన దేహ పైటల వెనక గజ్జెల కాళ్ళు.. ముడుపు కట్టిన వరాల దొంతర.. మొక్కు తీరని కొండకి కొట్టుకొని వెనక్కి వచ్చిన నిద్ర పిడుగులు.. కంటి ముందు పడుతూ..

రెండు రంగుల తవ్వకం చేసుకొన్నా కంటి ధూళిలోంచి..కలని కవ్వించే నీటి ధూపపు కావెడని మోసి … అక్కడ గ్రామమంతా సెట్ అని తెలియక .. పొద్దున్నకి అక్కడే ఉంటుందని నమ్మి.. విసిగిన నిరాధార కలిపివేతని అప్పగించి… సవ్వడి లేని నిద్ర కథని రాసుకొంటూ.. మంగళ నిరాయంలో ఊగే దాటివేతలు.. కన్నీళ్లు.. అమ్ముకు పోయిన గర్భ నిద్రలోంచి తల్లి దొరకదు.. మాటని తీసుకొని కొత్త యుద్ధపు నివాళి చేర్చుకొని.. కాలే చితిని చూస్తూనే ఆమె .. తన కిటికీని మూసేసుకొంటుంది.. ఆ రోజు స్కూల్లో .. తన చూపు చిప్పింత కింద పగిలిన నీటి ముద్దలా కవ్వింత వెచ్చగా చేరుతుంది.

ఎవరో నేర్పుతారు.. అదేదో అలాగే లేదుగా అనే లోపు .. కథలోకి లాగి .. గదిని కొండ పై ఒక్క రాత్రిలో కూర్చోబెట్టే గుర్రాలు. చప్పట్లు కొట్టి వాన ఎదలో మర్చిపోయిన డైలాగ్ .. కొట్టి తెచ్చుకొన్న నిరాశ ఒరిపిడి మోసుకొన్న గతుకుల మెట్లని తలలో పోసుకొని .. అప్పటికప్పుడు వెలిసిన ఊరు.. దీపాలు పాకిన మట్టి దిబ్బల మధ్య ఇల్లుని వేలాది దీసుకొన్న చెట్టు.. అదే మాట .. పెద్దగా ఆసరా తెలియని ఎండ పొడతో గాలించిన మంటని తాగి … విరుచుకుపడుతుంది. ఎత్తుగడలు ఎగాదిగా చూసిన గొంతు కింద చెమ్మలో తడబడే నిద్ర సంధిని సరిచేసి.. కథలో ఉండిపోయిన కన్నుని చేర్చుకొని.. కాసింత గొల్లుమన్న నీటి గడువులో తేరుకొని..

నీరు పోసిన భావి.. పాటలు కాలబెట్టిన ఆ రంగు గోడల పక్కాగా .. వణికి తొణికిన ముద్దుని కడిగి .. జోరు పెంచిన గాలుల మధ్య దీపాన్ని కలవరిస్తారు.. కానీ అప్పటికి ఆది తిరిగి సర్దుకోదు. గుడి గంటలు నానబోసుకొన్న అజాల కుంపటిలో … చీలిన గాజు పెంకులని విసిరి .. ఎండ పగిలిన వర్ష గుంతల్లో .. తోడు ఎండిపోయిన చీకటిని నులిమి .. కట్టి తెచ్చుకొన్న నిద్ర రుచుల కలతని అరగదీసి.. అక్కడి చేతులు లేని విగ్రహాన్ని నిలబెడుతూ .. శిక్షలని వెలిగించి బజారులో ఆ మాట చెప్పుకొని.. ఋణం తీర్చుకోవడానికి అద్దాల బండిపై ప్రయాణం చేసే గాలి నలతల గట్టుని తెగ్గొట్టి ఆయాస గూడుని నింపుకొంటారు. ఆయుః మండలంలో వీరుడి రైలు ప్రయాణం ఆఖరిగా ఆగినప్పుడు .. చెదిరిన జుత్తుని సర్దుకోక ముందే .. పిల్చి పెట్టిన ఒక ముద్దలోనూ మర్చిపోలేని రుచి.. తాయిలాల  సంచీలో ఖాళీల గడువుకు దగ్గర పడిన నిద్ర తోడుల చెక్క బల్లని తుడిచి.. తన చీరని సగం పర్చి..

చెక్క తూపాకీ గుండుని తిని.. నా మిత్రుడు వాలిపోయినప్పుడు తెలిసింది.. అక్కడే హద్దుల్ని ఒడిసిపట్టి.. ఆమె ఇక రాదని .. పై నుంచి దూకాడని.. కానీ నేనేం మారాను.. శవం వదిలేసి .. కాలువ ఒడ్డుకి .. పరుగుతో .. ఆమె అక్కడ తన నిషిద్ధ నవ్వుని అరగదీసి చంద్రుడు మీదకి వేసి .. ఆ వెలుగుకి .. పైట కప్పుకొని.. వానలో నాకై వణుకుతూ.. ఎదురు చూడడానికి ముందే ఆ పెద్ద మర్రి చెట్టు కూలిపోయి … దేహ నిర్దిష్ట గాలి ఊపులో పడి ఆచూకీ దొరకని నిద్ర దర్శన కలని తెచ్చుకొని .. సాగిన పచ్చ హారతి చెట్ల తోపుల్లో కలబడి .. దాటిన తగువుల ఊలని పక్కకి నెట్టి.. కదలిక లేని ఉన్నప్పటి గ్రహణ తోపుల్లో కదిలే ముహూర్త కలతని వడపోసి .. ఇక్కడే ఆగిన భద్ర సంతకాపు ఎత్తుగడనే కొల్చుకొంటూ….

simhasanam .. atma bandhuvu

ఇంటి నుంచి నిద్ర ఆవరింపులని వదిలి.. అర్ధ రాత్రులు చలి నులిమి .. మధ్యలో మధ్యలో ఉరిమి చూస్తున్న శరీర కాపుల అర్ధరాత్రి కుంపట్లని వెలిగించుకొంటూ సైకిల్ నురుగులు కక్కి ఆయాసపడి బెల్ మోగిస్తున్న వినక…. మహా జయాల శాసన మర్మపు యజ్ఞంలో పడి .. దొరికి ..నలిగిన టికెట్ వరం చేసిన క్యూలకి ఒంగి నమస్కారం చేస్తూ..లేదా వెనక తన్ని దొరక్క పోతే బ్లాక్ టికెట్ కే సై.. అని అర్ధ నిమీల ప్రార్ధనలా రిలీజ్ సినిమా .. సగం వినపడని.. మూడొంతులు కనపడని తెరని పొంగిపోయి చూస్తూ…

సమయ నిందకి తొలిగించిన దేహ నికారపు సాక్షాళిత కంటి శూలానికి పదును పెట్టి.. తేడాగా కనపడని చూపు దోపిన రాత్రి తగువుని ఆరబెట్టినా సాధిల్య గతి హద్దుని కప్పుకొని.. జోడించిన నడకకి మోసి తెచ్చుకొన్న .. రాశీ భుజాల నిలువెత్తు బాక్స్ ఆఫీస్ ముఖం మరిగిన నల్ల దారాల పట్టుని వదులు చేసి అల్లిన కాపలాల వరంతో దిద్దుకొని..  పందిరి బొమ్మలు .. కావెడకి  పట్టిన నీరు.. శుభ్రం చేసుకొన్నా చేతులతో వడ్డించిన దుఃఖం ..కదిలిరాని చలన గతి నిర్మాణం ఊరేగి నిండి పోయిన కదలికల్ని దాటుకొంటూ. నిష్పలకల సమయ దోషం ఆరబెట్టిన అవతలి గోడపై అప్పటికే మొదలై పోయింది..

ఇక్కడ గూడు బండి ఇరుక్కొన్న మంచు రోడ్లు కదిలే కొండలని కప్పుకొని.. శిధిల గంభీర కలయికనే దాటుకొని.. కొంచెం వెసులుబాటు లేని టికెట్ ముక్కలని అతుక్కొని.. జాగ్రత్తగా తలుపు తీసి .. కన్ను కలిపి.. ఆరబెట్టిన నిద్ర సగం నీదీ .. నాదీ..

పొలం దాటిన వాన చెట్టు పక్కాగా ఆ గుడిసె ఇప్పటికి సగం కూలి ఉంది.. ఇక ఎవరూ రారని ఏడ్చుకొంటూ .. తనకి చెమర్చిన కన్నుకి కాపిన శ్వాసల దడతో .. చెమర్చిన ఏక ధాతువుల చిక్కు .. తనలో తానుగా ఉండిపోయిన కదలికల్ని దాటి .. కన్ను కప్పిన విలాస కుంపట్లో .. పప్పు మెత్తగా ఉడుకుతూ..

నింపాదుల సుఖ సాఫల్య ఆషాదం కమ్మిన .. సమేరోయక రాహల్య స్థితి నడతని ఇంజెక్షన్స్ తో సరి చేస్తున్నప్పుడు.. ఆ చెక్క బడ్డీ వెనక చీకట్లో తను.. గోలి షోడాని చిటికిన వేలితో కొట్టి .. నురుగు ముఖం మీదకి పొంగిస్తూ.. ఇద్దరి కాళ్ళ మధ్యలోంచి రెండు పాములు కాల్వలోకి దూకి .. తలలు పైకి .. ఆ చీకట్లో కొట్టుకుపోతూ.. నిర్ణయపు వదుల్లో కాల్చిన చలిని పెదాల కుంపట్ల మధ్య నిప్పుని ఊదుకొంటూ…

సంధి సూత్రం వెనుక ఆమె గొంతు పెంచి నిలదీసినప్పుడు.. హీరో ఆవహించి .. అలిగి దూరం జరిగి.. జగత్ త్రయం మోసితెచ్చుకొన్న బరువు మందలింపులో పడి కొట్టుకుపోక .. అక్కడే చతికిలబడి.. తెర .. మనమూ ఒకటి కాదన్నప్పుడు ..ఉప్పొంగిన మంత్రం విషపు పెదాలని పిండిన నిహాజ్ఞాయ సేఖరింపులని వదిలిపెట్టి..

తనని కలవాలనుకొన్నప్పుడల్లా .. ఆసరా సినిమానే.. గది కిటికీలోంచి చూసి.. సైగలని దుమ్మెత్తి పోసే తిట్లని దులుపుకొంటూ.. చేరగిలిన అరచేతుల గోరు వెచ్చని నవ్వుని కలిపి పెనవేసుకొని నిద్ర సంధిని బిగించి.. హద్దు బయటనే మాయ కమ్మిన మసక విగ్రహాల కైపుని సాగదీసి కదిలే నిస్తారపు గ్రహణ మెలకువలో పొంగిన హద్దుల్ని వదిలి.. మాట తోడులోంచి … మలినాలు రాలిన నవ్వుని కట్టుకొని .. దిద్ది తీసిన కదలికనే చేర్చి పెట్టుకొని.. సమయం అచ్చులు పోసుకున్న  నిందలు ఆరా తీసిన చీకట్లో తప్పిపోయిన నిధాన ధారలా కలబెట్టిన కదలికలు..

వాల్ పోస్టర్లని అద్దకపు జిగురుతో అంటించి.. హద్దు మార్చిన పుట్టుకని దగ్గర చేసుకొని.. ఇక్కడే ఉంచిన ఖాళీల మధ్యలో కోతపెట్టిన మాటలని .. అక్కడే దాచి .. నలిగిన దేహ ద్రవాల గ్లాసులు నింపుకున్న పెద్ద నానుడి కొండల్లో మతి తప్పి.. బోర్లా పర్చిన సముద్రం ఏడుస్తూ ….కలబడుతున్న క్లైమాక్స్ ల  మధ్య .. దొంతర్ల పడ్డ దేహ రాల్యతని అతుక్కొని .. దూర గతిలో ఉండిపోయిన చలానాలు నల్ల కొండని కూల్చి .. అద్ది పోయిన కంటిని కూల్చిన సైకిళ్ళ మధ్య తోపులో … గది కిటికీల్లో అంది పోసుకున్న చలానాలు కీడుని దాచుకొని .. ఆ దూరంలో మాటలేకుండా ఉండిపోతారు. కొందరు ఆడిపోసుకొన్నారని కనిపించనపుడు .. దూపు మునకల తోడుని దగ్గరకి తీసుకొన్నార

d)విప్పిన నిస్త్రాణ .. మూడు కళ్ళ అవతల .. సాక్షి భూమిలో ఎండు నదులు…

malliswari … bees saal baad

పెద్ద బస్సులో ఏ మూలకో కర్చీఫ్ వేసుకొని పట్టుకొన్న రెండు సీట్లు.. గత్తర .. బిగిసిన గుప్పట్లో టికెట్ ముక్కలు.. అదీ సినిమానే అనుకున్నట్లు.. బయటకి చూస్తూ.. నిలువెత్తు కొబ్బరి చెట్ల తోపుల్లో నిద్ర పోతున్న పిల్ల కాలువల బయట సందడి వద్దని.. పొగ పండుతున్న గుడిసెలలోంచి .. మాగిన దబ్బ పచ్చడి ముద్దలని లొట్టలేసుకొంటూ.. విస్తారపు జాడలు గుప్పిన శ్వేత బోగపు నిందలని వరసగా అద్దుకొని.. ఓ అర్ధరాత్రి అదే దీప లాంతరుతో తాను కనిపించలేదని వెదుకుతూ.. హద్దు మోసుకొన్న నిద్ర కార్చిన చలన కక్ష్య మునకలని దాటుకొని.. ఆ పడవ మోసిన కొన్ని ఆత్మల నైవేద్య వేదికని కూర్చుకొంటూ.. పెనవేసుకున్న నిప్పు రవ్వల మాంస గూడులో ఆవరించిన నిస్త్రాణ ఊరటలు.. చెలరేగిన కంటి సారం పిండి.. మూడు కళ్ళ అవతల మళ్ళీ పునః తీవ్రాల కలతని ఊరించుకొంటూ..

కానిప్పుడు సాక్షి భూమిలో ఏం మిగిలాయి కొన్ని ఎండిపోయిన నదులు తప్ప .. తలపడుతున్న నిద్ర తనికీలు.. చెమట పొంగిన నిద్ర హద్దుల్లో పడి .. తేల్చి పెట్టుకొన్న భద్ర గోషణాల నిండు కడుపుని పట్టుకొని .. గడిపిన సమయ రక్షలో కడిగిన హద్దుని కాపుగాసి .. అక్కడే ఇంటిని చెదిర్చిన మాటలని తాగి .. చెల్లిపోయిన చూపుల నొప్పిని కడిగి .. పైకి చేరుకొంటారు.

సమర్ప వికారంలో పండిన ఛాయా దర్శితగా కలబడి.. విప్పిన నిస్త్రాణ మోసిన నడుము మడతల్లో తగిలిన నిప్పుని ఊది.. హద్దు జార్చిన మెళుకువని దగ్గర చేసి.. ఉంచుకున్న నివేళ సాధ్యంలో పడి కొట్టుకుపోతూ.. విరిచిన నుదిటి బరువు తాహతులో ఊరేగే నిద్ర ఆవర్త కంటి పోగుని దాటుకొని.. మూడు కళ్ళ అవతల నెరిసిన తెరని పొగలోకి దూసి.. నాలిక చివర మెరిసే ముద్దు చప్పుడు తాగి.. ఇంకేం నిరూప మంథన లేని ఆయాస సగంలో పట్టుకొన్న కౌగిలి మాసిపోయాక .. ఉండీ లేకపోయినా హద్దుని దాటుకొంటూ..

సాక్షి భూమిలో ఎండు నదులు… ఆయాస పడాలనుకొన్న ..అనాయాసంగా దాటిన సినిమా బండి..కొంత నిప్పుల ఆరవేతలో చెరిగిన ఎండ .. చెమట తడిపిన పమిట రంగుని అద్దుతూ.. తాటి రొట్టెని  కొరికి ఎంగిలి ముక్కని .. దగ్గర చేసిన ఇంటర్వెల్ లో బయటపడి.. కాలువల వెనక గట్టు గుడి మంటపంలో .. ఊరేగిన నిద్ర మూర్తికి సాయం పట్టిన నవ్వు భూమిని వడ్డించి.. నీళ్లు తోడైన చేద భావి.. మిల మిల మెరిసిన పిక్కలు..

వరద గాట్లు తెగి విరుచుకు పడినప్పుడు.. సాయిబు బన్నులోంచి .. పీల్చేసిన టీ చప్పరిస్తూ.. గుడి గంట తూర్పు మొండాలని దిష్టి తీసి నడుముకు కట్టుకొని.. దూకిన ఈదలేక .. పడవని కలతకి బిగించి.. ఆ హద్దు తెలియని మండలంలో ఊరేగే నిద్ర పట్టుని పట్టుకొని.. కథలోకి మార్చి తెచ్చుకొన్న కదలికనే జోడించే రెప్పలని తాగి.. నిసిరిన ఏక కొలతల ప్రయత్న ఖాళీలు..

ఓ అర్ధరాత్రి అదే దీప లాంతరుతో తాను కనిపించలేదని వెదుకుతూ.. హద్దు మోసుకొన్న నిద్ర కార్చిన చలన కక్ష్య మునకలని దాటుకొని.. ఆ పడవ మోసిన కొన్ని ఆత్మల నైవేద్య వేదికని కూర్చుకొంటూ.. పెనవేసుకున్న నిప్పు రవ్వల మాంస గూడులో ఆవరించిన నిస్త్రాణ ఊరటలు.. చెలరేగిన కంటి సారం పిండి.. మూడు కళ్ళ అవతల మళ్ళీ పునః తీవ్రాల కలతని ఊరించుకొంటూ.. వద్దనలేం.. ఉండిపోయిన కటకాలని ముద్ద చేసి .. కంటి నరం చెల్లిపోయిన దృష్టి కూర్పుని దాటి .. వదులైన చూపుల గొడవని రుద్దుతూ.. అదే హద్దులో .. తను లేవదీసిన కథని వింటూ .. చలన హిత స్తిమితంలో పడి కొట్టుకుపోతూ ..

వెన్నెల సాన బెట్టిన నిద్ర నదిలో .. కాపాడి పోయిన దేహ నలతని మింగేస్తూ.. తొణికిన కలని చిక్కుకొని … వేలాది దీసిన దీప లాంతరు చెలికత్తెతో చేరి … పాటని .. అక్కడ ఉన్న పాత మండపం లోపల ఉన్న సమాధిలోంచి తీసిన పాటని అతని భుజానికి అనుకోని వినిపిస్తున్నప్పుడు.. ఇక చాలన్నట్లుగా .. నన్ను లాకెళ్లి.. ఆ టూరింగ్ టాకీస్ వెనక పొలాల్లో ఉన్న భావి దగ్గర .. తానే పాడుతూ.. నా లోపలి కంటిని పైట చెంగుతో అద్ది.. ఏం వద్దులే అనుకొన్నప్పుడల్లా .. శిధిల గతిని మోసిన నిర్మాణ స్థాయిలని దాటి .. ఆ పొద్దు కాల్చిన తొందరలో .. వరండాలో కలిసిన దీపాల దేహం .. రెండో వరుసలో నిండిన కథ.. గాలి పట్టిన రుణాల కైపుని మోసి .. కథలు దాటించిన పడవ దిగబడి.. ఇంకెందుకు.. వాళ్ళెలాగూ చూసారుగా..

rudra veena .. mayabazar

మంచు తోవలో చనిపోయిన నీళ్ల జ్వరం.. రంగు మార్చిన హద్దుల్ని ఊడదీసిన కాళ్ళని కాపలా ఉంచిన మాటలతో తోడుకొని.. నిద్ర చెదరగొట్టిన ముద్దు నిందలు.. అక్కడ నిందల మహా శరీరం ఆమె దేహాన్ని మంచంతో మోసుకు పోతూ.. నేనప్పుడే .. ఈ హద్దు నా శ్వాసని చెప్పుకోక నిండిన ముఖాలని కప్పి .. లోపల వాడిన మాటలని చేర్చుకొంటూ.. తాకీ తాకని .. చీకటి మార్పిడిని అనువదించి … మాటలకి చీల్చిన విడుపు గొంతుని .. దారబోసి..

మాయ మోసుకొన్న దేహ యుద్ధం కరిగి.. అంచులు పిండుకొన్న రెప్పల స్థితిని కలుసుకొంటూ.. నేననే ఈసడింపుని తప్పించుకొనే గ్రహణ పరిధి. వేరు చేసినపుడు .. ఆ ఊరి చివర మంచినీళ్ల భావి.. అతడి పాటకి తీపిగా అప్పగించిన నిద్ర భాషణల కైపుని ముద్ద చేసి.. కదలికలేని అపేక్ష చిత్రం ..మార్చి పెట్టుకొన్న కళ్ళ అవతల ఇంకా చోటులోని ఇంటిని దూరం జరిపి.. రావొద్దని ముఖం తిప్పుకొంటారు.

విశ్వ బంజరు గాలింపుని మోసుకొని.. నుదిటిని చెక్కిన వర్ణ క్రియ కంటి నిండుగా సాగుతూ.. దృష్టి గమ్యత లేని సగం చీకటి పోసుకున్న మహా నృత్యం చేరగక ముందే .. ఆ దీర్ఘ వాహన వెదురు గొంతులో నివ్వెర గతిని తడిపి పెట్టిన రుణ తడిని కళ్ళకి ఇచ్చి .. బొట్టుని పాతిన అనుమాన సంధితో.. తరుముకొచ్చారు.. ఆమె దిగులు పడక ముందే .. తన దేహంలో మరో పురుషుడు గదని తిప్పి .. మీసం మెలేసి .. నుదిటిలో పండిన ఘటనని కాపుకాసి .. ఉండి పోయిన ఖాళీల వెంట కదిలే రుణాల దేహం కరిగి.. నేనెక్కడా ? అని అడిగినప్పుడు .. ఇక మరో సిద్ధత లేని పోలికని పండించుకొంటూ .. రుణపడతాం.

పడవల గూడెం వెనక… మీరేం ఉట్లని అడిగినప్పుడు .. చెలరేగిన దేహ క్షేత్రపు నిందలకి .. తురిమిన నికాంక్ష నాదనాయత కి మెరుగులు పెడుతూ.. హద్దులు చెదిర్చిన శ్వాస ధ్రువాల కావెడ.. ఉండీ గమనించుకోలేని ఆకర్ష గర్ష సంధిని వెలిగించి.. దర్ప సుడిలోకి దూకిన చలన గట్టు దాటించడానికి ఎవరూ లేరని .. నది పులుముకొని గూటి పడవలో తప్పిపోతారు.

కంగారు దేనికి?

ఆమె కూర్చొని వెళ్లిన చోటులో … ఎర్రని రక్తం బుడగల బుడగలగా పొంగి.. దుఃఖ చించిత సంచార్యంలో మోసపోయిన నిద్ర కవ్వాలు తెల్లార్లు చిలికాక …అక్కడ పడి ఉన్న రుద్రవీణ .. సమలయ కీర్తన మొదళ్ళయ్యాకా ఉండిపోయిన కదలికలు .. ఒప్పుకోని దేహ తొందరల అవస్థని కుదుపుతూ కదిలే నిద్ర గుహల్లో పడి .. రాలుతున్న తమకాల నిశ్వాస గుండ్రాలని దాటుకొని .. విరిగిన చిత్ర కథల నలత …నాన్న కొంచెం హెచ్చరిస్తూనే ఉన్నాడు.. కొంత బతుకుతెరువు నేర్చుకోరా? అని.. సమయ అనుపాలన ముగియక ముందే కదిలే నిద్ర సన్నాహా మూర్తులని పాతి పెట్టుకొని.. ఇక్కడే అనుకోక కదిలిన మార్పులని పసిగడతారా?

సినిమా నడుస్తూనే ఉంటుంది.. లేవదీసుకొన్న రొప్పుని వడపోసి.. ఆ వెనక కట్టుకొన్న కెరటాల చెట్టు ఆశీర్వదిస్తూ .. కదిలే బంధ గ్రహణలో కూర్చిన నడకనే దిద్దుకొంది. ఇగిరి పోయిన ఆయాస క్రతువుని ఎగదోసి.. కలుపుకు పోతున్న సంసిద్ధ గతి దొంతరని సర్దుతూ.. ఇంకిపోయిన రంగుల కోలాహలతకి కొంచెం రుణాలని జోడిస్తుంటారు. వాళ్ళు మాటకి మాట చెప్పుకొంటారు .. పెద్ద గొంతులు మత్తుని ఉడకబోసి.. లోపల ముగించిన కన్నుని జోడించి కదిలే శరణు హద్దులు.

కంటి ధాన్యతని అద్దంలో దాచుకొని .. కాల్చిన వెన్నులో చలిమంటని ఆర్పి .. ఇక దగ్గరకి తీసుకోమని.. అక్కడ రాత్రికి రాత్రే తెర్చుకొన్న బజారులలో కలబడే నిర్మిత ఛాయల గొడవని.. మంత్రదండం లో ఊగించి.. ఆ హద్దుకి ఆవల .. నేను ఆగిపోతాలే .. పర్వాలేదు.. ఆకలి .. దాహం తట్టుకోనైనా నీకోసం కాసుకొని ఉంటాలే..

పూర్ణం కాలేదు మనం.. కేవలం మన చుట్టూ పేరుకున్న మాయ పూర్ణతని పొందిందంతే…

గడించి పెట్టుకొన్న సంయమ చంద్రుడి జాగరణ .. అక్కడ బిగించిన కలకి .. స్త్రీ స్థిత్యంతర కలశాలని నింపుకొని.. ఆది వాదన నెరిసిన చెక్క పల్లకీల బయట ఊరేగే సంతాప మాదకం పండిన మొండి గోడల మధ్య కదిలే ఊపిరి గెడని సరి చేసి.. ఆంత్రమాజల లోపల తోడుని కప్పి .. సయూప పుట్టుకలని వదులుకొని.. నిషా రోదనని బిక్షగా తీసుకొన్న నిడివిలో .. దృశార్హ కంటి నూగుల జ్వరం కమ్ముకొని.. లోపల నుంచి లోపలికి సాధ్య చమరింతని నెట్టుకొంటూ.. సాధన లేని అపార్ధాయతలని.. ఆమ్లయుత చెరిసగాలు..

దుప్పటకి చక్కని మంచు కొండల నిమోగరింపుని చేర్చుకొని.. ఇక్కట్లని చుట్టుకొంటూ.. విరిగిన గోడలని .. అనుపాత చూపుల గాలింపుని దాటి  స్తోత్ర ధారణ… అక్కడ ఉండిపోయిన వీధుల మధ్య కదిలే నియారూపమ మెలికని తిప్పి.. ఒరిసి పోయిన శ్రమకి దిష్టి తీసిన నడకని జోడించి కదిలే గదుల సర్దుబాటు….

మాటని రెండు పక్కలా విరిచి హద్దులు నేసిన సవరింపులతో.. చేరిన పగటి తలుపుతో పడవలని తిప్పుకొంటూ.. పేరుకు పోయిన సంధితో కథలే ఉండిపోయిన మధ్యంతర వెర్రిబాగులతనం.. రెండు చెంపలపై నిండుగా అద్దిన చీకటి.. తరుగు పెట్టిన శ్వాస చరిత దగ్గుని వడపోసి.. నిందలని చేరదీసి కదిలే .. నిరూప దేహ క్రమం తప్పిన హద్దులని దాటి .. నీరు పోసుకున్న మాటలని ఊగించి .. చేర్చుకొన్న తల గోడల ఇరుక్కొన్న ముఖాలని సగం తెగ్గొట్టి .. అక్కడే ఉండిపోయిన శాసన భూమి తవ్వకం కదిలి .. అలిసిన నిరూప రక్ష.. సాయం చేయని రంగు అద్దకాల దేహం.

సమయ వగర్పులతో చెల్లా చెదురైన గొంతులతో .. తాపడపు కన్నుని మోయించి చూపుని పగలగొట్టి.. తోడుగా వాన గొంగళిని కప్పుకున్న సాధ్య శిఖరాలని దాటుకొని.. ఆ సైకిల్ పై   చేరని లైబ్రరీ బయటనే .. బల్బ్ ని  మింగిన కన్ను పోటుతో.. సిద్ధమాయల కలుషిత ఆర్ధన మోసుకొన్న నిందలు.. పొడి గాలుల సంధి తోపుల్లో పక్కకి జరిగిన దేహ హద్దుని కలిపిన దుఃఖం. పెళ్ళలు పెళ్ళలుగా విరిగిన హిమాలయ సత్యం.. కెరటాలు తరుకొస్తున్న పడవలో స్థిరంగా నిలబడ్డ దేహం.. అప్పగింత లేని శరణు మంద్రతని మోస్తూనే .. కదలికనే కనిపెట్టి ..వేరు చేసిన శూన్యం విపాలయ తీవ్రాలతో అద్దుకొని.. ఇంకిన కళ్ళ చోటుని కడిగే స్తోత్రాలు..

ఉండిపోయామనే నిద్ర లాలాతని పోతపోసి.. ఋణం తీర్చుకొన్న కంటి తోపులు..

తెరల నిండు కథని నేసిన నడకతో ..తోడు కట్టిన చీకటి సర్దుబాట్లు చెప్పుకొని.. నిద్ర కాల్చిన గుంపుల మధ్య నేను నటిస్తూనే తనకి సైగ చేసి .. దండన కదలికనే చూయించుకొన్న పెదాలని దట్టపు కలకి నివారీయ మెలుకువగా దృష్టిని చుట్టి .. ఒట్టుపెట్టుకొన్న నిందలని మోసుకొంటూ .. పెనవేసుకున్న రంగుల తాడనగా పట్టుకొన్న ఖాళీలు..

పగలబడిన కంటి చూపుని విడదీసి .. కేమేరాని ఇంకా సెట్ చేయక ముందే .. వాళ్లెవరో చూసి గుస గుసలాడుకున్నారు. నేను చర్చించడానికి .. చరించడానికి ఆ చోటుని వాడలేదు. కదిలే నిద్ర చాటు ముఖాలని కలుపుకుపోవడానికి కుదుర్చుకున్న రంగు మాటలని దులిపి ఆమె హెచ్చరిస్తుంది.. నేను మొదలయ్యానని .. కదలిక లేని నిరాశిత క్షేమన చితిలో .. పురాతన సత్య నింద ఊగి .. తెరవని గుడి…

చాలని నిలువెత్తు జ్వర భూమిలో పేరుకుపోయిన సాధ్య గంభీర సాధనాల కలత.. సహకార నొవ్వలి .. కలిసిన చిత్రకాపుల నురుగుని అడ్డుకొని.. ఇగిరినా సంధి తాళపు కీ ని నులిమి .. కథకి .. సేదార్చి పెట్టుకొన్న చీకటి కంటి మొరని చిక్కుకొంటూ.. పెనవేసిన  భయ సాంద్రతల అడుగుని తురిమి .. కాస్త అటు సర్దిన బరువుని తెగ్గొట్టి కదిలే పగటి తీరికలు. వీలుకాని చెమట పోగుబడిన నిందలతో కూర్చిన తటిల్ల క్షేత్రాలు సర్దుబాటు సాధారణాల ముందుగా నిలబడి….

ఏ తెరలకి .. రంగులకి.. మెరుపు బట్టలకి.. పెద్ద గొడుగుల నీటి పట్టుకి లొంగిపోక .. ఊరడి లేని అపక్షేమ మంత్రం దండం ఊపిన నాజూకు బట్టల కింద గడుసు మంటలు.. అక్కడ మరో ప్రశ్న లేనప్పుడు మరో అడుగు. ఆది సమయాలకి దొరకదని.. నిన్ను మళ్ళీ చూడలేనా ? అన్నప్పుడు .. తొడిగిన శూన్యాల పెద్ద అడుగుల చాటులో గుడి గుచ్చిన నిస్సత్తుకి అంటిన సత్యాన్ని దులిపి..

ఆ సినిమా కి వెళ్ళడానికి ముందేం జరిగిందని ఆమె మళ్ళీ నిలదీసింది.. అతనికి ఆ హనాగౌర్ నుంచి బయటకి రావడం రాక .. నేను ఆ లోపల చీకటి గదిలో పుట్టుకని చూసుకొంది.. దుఃఖపు సాధ్య తీరికని వద్దని.. ఉండిపోయిన నిద్ర ఝాముల కలతని కాల్చి పెట్టిన మన్నికల ముట్టడిని కదిలించి.. పేగు కాలిన నిద్ర పూడికలు ఓర్పుకి సగం తెంపి.. ఉండలేమని రుణ తీరికల పట్టుని వదిలించుకొని.. దుగ్ధ తమకంతో పడి తెరలుగా లేచిన కంటి దుమారపు కష్టం పట్టుకొని.. ఇక వదిలి పెట్టడానికి లేని దిగులు కుండీలో .. మోసి తెచ్చుకొన్న రీళ్లు..

తనో మృణ్మన ఆశీస్సు తాకిన నిర్జన గతి ముద్రాలని చెరుపుకొని.. దూరం చేసుకొన్నా కోపలాలతో ఆ వెళ్లిన వేపే చూసి.. తల విదిలించి .. తిరిగి అదే మూవీకి టికెట్ కొంటున్నాడు. ఆ జనం లో .. చుట్టల .. బీడీల కంపులో..కార కిళ్ళి అమ్ముల మధ్య … దేహ బిగువు తెలియని గాలి లుంగల స్థిరతని పట్టుకొని.. కాస్త క్రియా మర్మాతలని దాటుకొని… నాటక తెరలని వద్దని .. పద్యం బిగించిన తెల్ల తెరల బూడిద కుప్పలా మధ్య కదిలే నిద్ర తీరికల గుట్టుని దగ్గర చేసుకొంటూ.. విపరీత ధ్వనుల కేకాని చెవిలో వడపోసుకొని..

పరాయిగా ఉండిపోయిన దృష్టి కలతలు చుట్టిన ముద్రాలని తుడుచుకొని.. ఇంకిపోయిన నిందలని బరుగుతో వదులుకొని.. ఆ జారిపోవడం చూస్తూ.. పేరుకు పోయిన నిశ్చంత వాగుల్లో చేదదీరిన మునకల సాధ్య వారధికి గండి కొట్టిన వీధులు.. అక్కడన్నీ సినిమాహాళ్ళ రోడ్లే..సెకండ్ షో అయ్యాకా చీకట్లో నాకు తోడొస్తూ..

నైరాశ్య ఒత్తిడి కలిపిన చీకటిని చేర్చుకొని .. ఇగిరి పోయిన నిద్ర కీడుని దాటి పైకి చేర్చిన శ్వాస నిరూప మండలంలో .. చోటు దొరకని మాటలని దాటుకొని.. చేర్చిన తలపోటు కథలని కప్పుకొంటూ.. నిశ్చయ ఏకీకరణ సంధి సాధనకి చేర్చి పెట్టుకొన్న దూరాలని కప్పి .. తడి కాళ్ళ అవధి.. ఉండి చెప్పుకోలేక పోయిన నుదిటిని హత్తుకొని.. చెమర్చిన ముఖాలని వడపోసిన సమయ మూర్తుల వలయంలో పడి .. రంగు చూపుల తలుపుని నెట్టుకొని..

ఇక సాధనత .. రెండో రుణపు అవధిని కట్టుకొన్న నిరాధార మెళుకువలోంచి.. ఉనికిని నేలరాసిన ముంపుతో.. స్క్రీన్ షేక్ సగం రంగు ముద్దలని పొడిచి .. తప్పించుకొంటారు. పరాయిగా ఉండిపోయిన దృష్టి కలతలు చుట్టిన ముద్రాలని తుడుచుకొని.. ఇంకిపోయిన నిందలని బరుగుతో వదులుకొని.. ఆ జారిపోవడం చూస్తూ.. పేరుకు పోయిన నిశ్చంత వాగుల్లో చేదదీరిన మునకల సాధ్య వారధికి గండి కొట్టిన వీధులు.. అక్కడన్నీ సినిమాహాళ్ళ రోడ్లే..సెకండ్ షో అయ్యాకా చీకట్లో నాకు తోడొస్తూ.. ఛిన్దితా పరాయీకరణ .. నీటి ఔషధపు మహీత రాశుల్లో గుది గుచ్చిన నడకని తీసుకొని.. పెద్ద నరకపు గుమ్మంలో … ఊపేసిన కంటిని జోడించి చేర్చుకొన్న భయద తీవ్రాల పరీమళాయ ధూపపు నిద్రలో కలలు కారిపోతున్నాయి.

నిష్క్రమిత తెరల ఉపాసన.. దేహ తలంలో నటనకి అట్టే పెట్టిన ఖాళీల మధ్య డైలాగ్ పేజీలు.. తర్ఫీదుల చలన నేర్పుని ఉడికించి … శ్వాస జాలపు నొవ్వడి సగం అరగదీసి కంటి రేవులో పడి.. అతుకు పెట్టుకోలేని నీటి జడని దులిపి.. కలిపినా నిండు రవళపు పెద్ద నోటి ఒత్తిడిని కలిపి దూరంగా విసిరారు.. మరో కబురుకి ఇంటర్వెల్ లో రమ్మనమని చెప్పుకొన్నారు.

కొన్ని తెల్లని తెరల మధ్య ఎగురుతున్న దీపపు కొంగలు.. అతను ఎదురుపడి … వికృతపు కళ్ళతో నవ్వి.. నోటి నుంచి రాలిన నల్లని జిగురురుతో కాళ్ళ మీద పడి.. నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానంటాడు. ఇక్కడ ఉన్నామని అనుకోవడానికి లేదు.. లేదని చెప్పడానికి ఇంకేం మిగలదు. ఒకే నిందగా లేని ఏకైక భద్ర స్మరితంలో ఊగి.. గలగలాడే కంటికి చేర్చిన దురుసు గాలి తేమని ఊదుకొని … అక్కడే ఆగిన నిద్ర సాయాల బయట ఎవరో తెరకట్టి వెళ్ళిపోతారు.. రాత్రంతా అవే కలలు.. అవే కావాలనే కట్టుబాట్లని వదిలిన పరుగులో…

భ్రమ కరిగిన నిద్ర జుంపీల ముద్దని విసిరి.. మళ్ళీ ఆ తెరల మధ్యలోంచి మాయమవుతాడు.. ఆమె కుమిలిపోతుంది.. సాధన క్రియ ఎర్రని గుడిని పగలగొట్టి.. ఇసుక గుట్టల మధ్యలో పడి లేచిన మసక రాతి గొంతులతో తూలిపోతుంది.

 ఇక్కడెందుకు అలాంటి హద్దులే కనిపించడం లేదు.. దేహం చుట్టూ ముగిసిన బెంగ .. ఇక చాలని ఏడవడం లేదు..సామర్జ్య ధ్వని గృహంలో పడి.. అద్దాల ముందు అంతా సర్దుకొని.. కిటికీలోంచి వంగి చూసే టైంకే అతను  వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు.

తెలియకపోవడానికి .. తెలుసుకొని  ముందుకి జరగడానికి లేని నీపేక్ష చిత్రణకి .. నలుపూ.. తెలుపూ పోగలని అంటించిన కథలతోనే ఘర్షణకి రెండో చరణం సిద్ధం చేస్తారు. గ్రహణ గుండాల్లో పడి పోలికకి దొరకని నిస్పృహని మోసిన హద్దు పట్టుకొని .. జోడించిన ఆందోళన.

తప్పుకుపోతూ … హద్దులు మాసిన నడుముని ఎంత తిప్పినా … ఉనికికి చేరవేసిన కునుకుని పట్టుకొని.. నానబోసిన నిలబోత… కొంచెం పెద్దగా కొట్టడానికి వాళ్ళు వస్తామంటారు.. తెగిపడ్డ రాజీలేని దాటి .. చేరగిలిన భయం పట్టుకొని.. చుట్టేసిన చీకటి విపులతకి చేర్చిన చూపుతోనే కాళ్ళని పట్టుకొని చోటు అడుగుతారు.

ఎంట్రీ … మూడు పాటలు.. రెండు ఫైట్స్… ఒక ఏడుపు సీన్.. కొంచెం .. పల్చని దుప్పటి.. పాలపొంగులోకి జారిన అరటిపండు.. కీలు విరిగిన నరాలు.. సవరించిన దేహ నిందని అరగదీసి… నుదిటిలో పోసుకున్న ఝాము పులిమిత చర్యని పట్టి.. ఆదాన శాపితాల్లో తవ్విన భావి కోసం నిలదీస్తారు.. కప్పి పెట్టుకొన్న కుర్చీలని .. మడతలు విప్పి.. పెద్దదైన శ్వాస పోటుతో కుప్పకూలిన నిషేధ కలతకి రంగు పులుముతారు… ఐనా టచ్అప్ అని మళ్ళీ ఎవరో వెనక్కి పిలుస్తారు.

బయట పొలాల్లో ఆ చీకట్లోనే.. ఎలుకలు పట్టడానికి .. దూరంగా పొలాల్లో ఎవరో సందడి చేస్తున్నారు.. అటు చీకటి కమ్మిన ఇంటి వెనక … అవసిద్ధ బరువుని కరిగించే చూపులు.. దీప పదార్ధపు కొండలని కరిగించి.. మంచుకొండల్లో దేహ నాదం పట్టుకొని.. నింపిపోవడానికి లేని నిఘాత గండం దాటుతూ… హద్దులే లేని బయట నిక్కచ్చి చూపుల ముద్దని కలిపి .. ఒద్దిక లేని అపేక్ష చలన మీమాంసకి చెదిరిన కలలు…

చేలాంచన మృత్యువులా ఆరడీ.. పాతుకుపోయిన నిమ్నత ఊపుల చీకటి రసాయన పూతలతో హద్దుని చేరదీసుకొని.. కుదురులేని అన్య ప్రాప్తంలో ఊరేగి… తెరల నిండుగా రంగు పోసుకున్న బుగులుతో పండిన చీకటిని … అక్కడే కుర్చీ కింద దాక్కొని.. మళ్ళీ ఆటకి ఉండిపోవాలని..

నిద్ర విడదీసిన విముఖతల ధ్వని నిష్ఠ సాఫల్య మాత్రంలో పెదవి విరిచి.. అమ్ముల ధ్యాన పాత్రలో కరిగిన కీడుకి దేహమిచ్చి .. ఒప్పందపు గొంతుని అరగదీసి.. తడబాటు లేని పేటికని కిందికి దించి చూసాక … ఏడుపుని సాగదీసిన నివురు నల్లని వెన్నులో పడి … చీల్చుకు పోయిన వివర్శ ప్రాధేయ ముఖాలన్ని పోతపోసిన చీకటిలో తప్పించుకొని..

అక్కడ ఆ పాడుబడ్డ గుడి వాకిలిలో..  నీటి ఎంగిలి తెలియని ఆయువు మరకని తుడిచి.. వడ్డించిన ఆకలికి పడవ ఒద్దు దొరకక .. సుడిలో తిరుగుతూ… పూనకపు నిద్ర జోరుని పోగుచేసుకొన్న నిషాదపు మండలంలో పునాదులు వదిలిన మాంస కోతలు.. అరివిన దేహ సడలింపులో సక్షా పూనతాలు… అంపూర్ణతకి కలిసిన పూనకాలు. వివరాలు.. నిద్ర మోసిన స్క్రిప్ట్ ని తట్టి లేపుకొన్న జిగురు మునగాల పెద్ద గాలి నలతలని ఊపుకొంటూ… నిశ్చల మధన పోసుకున్న చీకటి నిలువు కూలడిలో ఉండిపోయిన కథలు..

అప్పగించిన శరీర నిధి… బాక్స్ ఆఫీస్ కాసులని నమ్మబలికి.. ఆనక ఎడిటింగ్లో కొంచెం .. సెన్సార్ లో కొంచెం తీసేసాక… వెర్రిబాగుల మత్తుని దింపుకొని.. ఉరికి వేలాడిన రొప్పు.. ఇనుప ఊచలు దిగబడ్డ సగం కాగడాల వెలుతురులో చిమ్మిన రక్త దర్పణ రజనుని … నూరుతూ… హేళనకి రాల్చి పెట్టిన రెప్పల నాజూకు జ్వరం జారిన గొంతుతో… ఏరివేతల కుట్రని పట్టుకొని.. ఇంకేం లేని ఓపికతో పడి  లేచిన కథలు.

కాల్చి పోసుకున్న మంచు కౌగిలిలో తెరలు.. కల పారబోసుకొన్న కౌగిలిని చెమర్చే కట్టుబాటులని నులిమేస్తూ.. తేరుకున్న చీకటి గట్టులని పట్టుకొని ఊపుతూ.. హెచ్చరిక లేని అలసటని కనిపెడుతూ… హద్దులే కనిపెట్టుకొని .. చేరదీసిన కథనాల తీరికని దాటి విరిగిన కుర్చీలు.. కాగితాలు.. మసక గ్లాసులు.. మత్తెర కూల్చిన గోడల చప్పుడు.. కలలో మోసిన నిద్ర తెరల మింగిన మెరుపు.. చెమ్మని ఆరబెట్టక ముందే..

చూపుని ఏడేడు రంగుల కల్చివేతలో కప్పుకొని.. రష్మీస్కలనంలో దీపం ఎగరేసిన నిందనత చర్య గడ్డకట్టి.. హాలంతా కాగితాల బూడిదగా మండి…పరాంచర చెలగాటం.. అవలీకన.. అవసిద్ధ చూపులని కడిగిన ఆ పెద్ద గోళపు తీరని గుండ్రంగా తిప్పినపుడు.. వెనక కెమెరా ఎక్కుపెట్టిన నిగల్వాత నల్లని దత్తపు గదుల్లో .. అదోలా అరిచే ఆయాస సరుగుడు.

అడకత్తెరలో పడ్డ అలవాటు శరీరాలు గగ్గోలుని సరి చేసి.. నిస్సారీమాలపై సానబెట్టిన కాళ్ళని కడిగి.. సిగ్గరి పొరపాట్లని నాబెట్టి..కనబడని ఝాము నిద్దతని కాల్చిన వణుకుని కడిగి…కరిగిన ఇల్లు.. ఒకోసారి అలాగే అర్ధం కాదు.. దూరపు గుండాల్లో చిక్కుకొని ఏడుస్తుంది..

ఒక కప్పు టీ ఇవ్వడానికి కూడా వాళ్ళు గొడవ పడతారు.. వెనక ముందూ అవుతారు.

i)నిండు పులకలు .. చేదు రాళ్లు .. ఆ అద్దం కావాలా?

లోపలికి మారినపుడు నిద్ర భూతం ఎర్రని గోళ్ళతో రక్కిన అరుపు చెలరేగిన ఏడుపుని రగడిస్తూ.. అక్కడ లేని మహా క్షేమాన్ని పాడుతూ.. హద్దు చెదిరిన నడకలని కట్టుకొంటూ.. రుణాల శరణు శిలతో దిష్టి తీసిన గుమ్మాల లోపలనే .. తన దీర్ఘ నిషారపు కంటి గాటుని కడిగి .. సినిమా తెరని కాల్చి పోసుకున్న నిశానీల దేహ కొలువులో దిగి.. కోప్పడిన గోడలలోకి కొట్టుకొని…. తేరుకున్న చనువుతో  దీపాల గడువు..తను ఆర్పి వెళ్ళినపుడు నాకేం కనిపించలేదు. ఏళ్ళకి ఏళ్ళు కన్నుని ఒద్దికగా తడిపిన మగతలో రుణాల కైపు.. గర్గత  హద్దుల్నిచుట్టిన  తీరికలో నల్ల గదులు…తత్కాల కలయికలో చావు ఊపులు.. బొల్లిపూతలు…

పాడుబడిన గది.. రెండో శవం .. కత్తిరించిన మాటలు.. సగం కాలిన శరీరం తను ఆ పాత మర్రి చెట్టు దగ్గర… తాగి పడిపోయిన పాట .. మార్చిన ఇల్లు.. తన కథలో ఎంగిలి నవ్వుని పోసుకున్న గుడారాలు.. కలత పోసిన నీటి స్తంభాల గుడి.. దీపం కాల్చిన చీకటి రైలు.. ఆవిరి రొచ్చు… తన కథలో ఉండిపోయిన నాన్న .. నిద్ర బ్యాంకు లో ఏటవాలు చంద్రుడి ఆత్మ హత్య .. గొడవ పడింది… కప్పుకున్న నిద్ర రుచుల నీటి సుడులు.. ఊరిన పాముల కుండ . తనకి పాత నిద్రలో అంత్య క్రియలు.. నల్ల చీరలో దేహ భోగం.. వదలక ముందే కన్నుకి పట్టిన చీము..

పులిమిన గొంతుల సిగ్గు.. క్రిటికల్ వల్గారిటీ … సమయ ద్రోణుల్లో తన రెండో పెళ్లి.. చచ్చి పోతావా? అని అడిగింది.. సగం గిల్లి పోయిన చికాకు.. కాటుక పొగలో పాల వాసన …కాపలాలు మింగిన నల్ల నది .. ఊరిన కొండలు.. ఆ బాటలు రెండో ఋణం..

…………..

ఏదో పోగొట్టుకొంటూ ముందుకి పోతున్నాం .. అదే కావాలిప్పుడు … నిశిత కంటి తీరికలేని సమయ నిద్రలేని దాటి ,, జ్వర పడి .. సిగ్గుపడి .. కలత హద్దుని నెమరేసుకొన్న సాధనని కాల్చి.. దూసుకు పోతున్న నిద్ర ఖండంలో పడి కొట్టుకు పోతూ.. హద్దు కలిసిన నిరుత్తర తెరల వెనక .. తనింకా అదే మాటని తాగి.. రుణ బరువులు లేని నడకని తూచుకొంటూ..

వీక్ష్య నింబరంలో పడి ముక్కలైన కథల వెంట పరుగుపెడుతూ.. హద్దు నులిమిన కాస్త కంటి రుణంతో ఊరేగి.. చలన మర్మతకీ కొలిచి పెట్టిన కాళ్లతో..

ఇంట్లోకి పిల్చి అన్నం వడ్డిస్తారు. విసినకర్రతో విసురుతారు. నెయ్యి వడ్డిస్తారు.. అన్ని కొసరి కొసరి వడ్డించి.. చివరలో తీపి. పెరుగు.. పండు.. పడక .. తాంబూలం.. స్టేషన్ వరకు సాగనంపి..

నన్ను ఎవరో లాక్కెళ్లి సినిమా స్క్రీన్ లో వదిలినప్పుడు .. దుఃఖ సాంద్రతల కంటి ధూళిని ఊదిన నోటి చివర .. నాలిక మెలికకి ఏడుస్తూ.. కదిలే నిద్ర సగంలో కోప్పడి

………………………

కొంచెం సంధి జరగక ముందే దేహ నిర్జన సాధన .. వేవిళ్లు … కలల సబ్బు నురగలు …రంగు నీరుని తాగి పాలిపోయిన కళ్ళు .. కట్టడి నిందలు…పోల్చిన వికారాల చీర మడతల్లో బొంగురు శంఖం.. నేను నాతో హద్దుని కప్పిన  వీధి కుండలు

ఎడారి ముఖాలు కడిగిన సమాధి…. నూనె బట్టలో కాలిన నది.. కొండల్లో కాల్చిన ఆనవాళ్లు .. అక్రమ కుదుపుల్లో నీరు తీసిన చూపు.

గాజు రొమ్ములు .. ఏక సమ్మతికి తెలియని నోటి పొగరు. … రిసెప్షన్లో చితి.. మంగళ ఊడలు .. పేటికలో బతికిన చెట్టు.. ఋణం మోసిన నుదుటి గంట

అడిగి చూసిన అంతే … గాలి నేసిన దీవిలో తను మాత్రమే గర్భ సంచీ వేలాడదీసి… విడి పోవడం మూడో సారి.. ఇంకేం లేదు.. అక్కడ విగ్రహాల్లో పుట్టిన నది.

ఊరి తోరణాలు .. జరిగిన పెళ్లి..చీకటి కురిసిన సంధి సూత్రాలు … సగం కూలిన నిద్రలో పలవరింత .. ఋణం మోసిన కలత ..హద్దులు లేని అప్పగింతని నగరంలో ముంచి.. కడిగి పెట్టుకొన్న నదిలో శూలాల పడక ..పరిమిత అసహనంలో తీరు మార్చిన హద్దులే కనబడి..

సగం గుచ్చిన చీకటి పూసలు..  నిద్రని పొడిచిన వెనక పేజీల్లో కసి పిడుగులు.. సంధి క్షేమంలో నేరస్తుడి గొంతు.. తడబాటు గొడుగులు కప్పిన దుప్పటి..కాపడాలు నెరిసిన నవ్వు.. రెప్ప పీల్చిన దోషపు ఎండ …

సాక్షి నల్ల గోడల చెట్టు …అమాస తలుపుల దగ్గర సిగెరెట్ల గుట్ట…సీసాలు  తొరిపిన పిండాలతో కూల్చిన కడుపు…ఎర్ర నగిషీల మాటల పొడి అద్దకం

ఒళ్ళు మార్చిన నీటి భుజాలతో… బదిలీ కాని హద్దుని తెగించి పెట్టుకొన్న నడక.. జోడించిన వీధిలో.. కనపడని శంఖాల భావిలో తవ్వి పోసుకున్న తీర్చిన పుట్టుకలు.. కాల్చిన నదిలో పారబోసిన నడకల కొండ

ఎర్ర నగిషీల మాటల పొడి అద్దకం .. నిశాచర కంటి మొనలని సానబెట్టే కన్ను.. పొదిగిన నడకలని తాగి నదిని ఎత్తి పోసిన కునుకు.. సరళ నిదర్శ దృష్టిని పట్టుకొన్న కాటుక భూమి  disturbed  key  nights / రెండో పురుషుడి మైదానం / నేను పీల్చుకోవడానికి ఈ నలుపు .. తెలుపుల దేహశాల / వెక్కిరించిన ఇంటి ముందు మహా నగరం / ఒంటరి తగువు/ నిరాధ్యత / పగలబడిన నిద్ర తవ్వకంలో పడి లేచిన పగ గొంతులు../ తోడు పడిన కాళ్ళ తొడుగు/ అస్త్ర నిరాశలో కాలుతున్న మడుగులు.. నా పక్క గదిలో తనే /

నిశ్చిత కలలో పోసుకున్న నడక .. కుడి ఎడమల దేహపు జాగ్రత్తని దాచుకొని…. / నిద్ర గదిలో చనిపోయిన తన కలతో నిండిన ఇల్లు.. / కాదనడానికి లేని మూడు కళ్ళ ఉరుము../ నేర భాషణ / ఉండీ లేకపోయిన ఆయాస గుణం/ తత్తరపాటులా ఉండిపోయిన నిద్ర లేని మసక బజారు/ రుణ గరగ హద్దులో పోసుకున్న చీకటి నలత /

నన్ను ఎవరో లాక్కెళ్లి సినిమా స్క్రీన్ లో వదిలినప్పుడు .. దుఃఖ సాంద్రతల కంటి ధూళిని ఊదిన నోటి చివర .. నాలిక మెలికకి ఏడుస్తూ.. కదిలే నిద్ర సగంలో కోప్పడి..

అమ్మ వంటిల్లు వెనక గాజుల కుంపటి .. టూరింగ్ టాకీసులు..మల్టీప్లెక్స్ నిద్ర జోరులు .. తన కాగితాల కొరివిని తాగిన ఛాతీ పోట్లు.. లోపల మరెవరో శత్రు దోషపు నడవడితో.. 

మట్టి రోడ్ల కుండలో మినప రొట్టె..పిజ్జా బాక్స్ లోంచి.. కథని బయటకి లాగి …

నీరు పట్టిన గొడుగు వానతో తగువు పడి…నేల సినిమా … తూఫాన్ గాలి .. గుర్రపు బండి..గవద నోళ్ళలో దగ్గూ.. శొంఠి కొమ్ము.. అమ్మమ్మ సినిమా తోకలు .. చేగోడీలు … తను వెళ్లిపోయినట్లు ఇంకా చెప్పుకోకుండా … తప్పించుకొని తిరిగిన సంధి గోషలు…

మర్రి చెట్టు జడేసుకొన్న రాత్రి పందిరి మంచం.. గింజుకొన్న నల్ల వంతెనపై తను లాక్కొచ్చిన గుడి.. ఎర్ర పాములు మంట పెట్టిన యజ్ఞం…శిలా వర్ణ కొండలు.. ఎగతాళి గొంతులు ఎర.. ఆ మూలనే పొడి బారిన నిశేష భూమి .. అప్పగించిన నేరాల కిందనే కదిలే ఎగతాళి ..

  కన్ను చిలికిన పచ్చ ఓణీ … సారె బిందెల్లో పసుపు రాలిన కాళ్ళు.. కూలడి సంచీలు.. ఎగసిన కలలోని జాతకం .. కొండల్లో వార్చిన చీకటి నది చుట్టూ పడవలు మధ్యలో తను .. మధ్యాహాన్న మత్తులో చెదిరిన రాకడ.. కూల్చిన నిశ్వాస కౌగిలి.. వర నొప్పిని కడిగిన పెదాల నెర్రులు..ఎక్స్చేంజి ఔర్ డ్రెస్సెస్ ..  అక్కడ లేని కథల ఎండమావి.. ఉండి పోయిన చీరల తాళాలు .. కట్టి బిగిసిన నిద్ర జారల అలక.. పోష్ అపార్టుమెంట్లో ఆ రాత్రి..

నిసిరిన సమాధి కన్నులో కలిసిన కల .. సిగ్గు నేసిన సినిమా రాట్నాలు.. అలుముకున్న కావెడ భావులు .. గుడికి పట్టిన వెర్రి ముఖాలు.. సినిమా పోస్టర్లు.. అప్పటి గుడి ఇప్పటిదేనా ? … కల కాల్చిన నిర్యాణ దేహ కమలత .. ఉంది పోయిన కత్తిరింపుల కౌగిలి.. ఎడమ బొమ్మల కౌగిలి..

                                                                                                  ……………………..

అద్దం లో అద్దం బిగించుకొన్న తోవలు.. కంట్లో నిల్చుకొన్న కంగారుని కాపాడి.. తాను శేషభూమి  మన్నికని కాదని బట్టని జరుపుకొని.. అల్లరి గతంతో .. తాడుని బిగించిన హద్దులో పడి .. తలకిందులుగా ఉండిపోయిన చిత్ర జ్వరపు నింపాదిని కలిపిన చూపుకి వడపోసిన వణుకుతో..

అక్కడే అప్పటికే సెట్ వేశారు.. ఫ్రేములో బిగించిన దుఃఖమెందుకో అర్ధం కాక .. ఖాళీ నీటిని జాడించిన కునుకుతో.. పడి పోయిన కెరటాల కైపుని పట్టి రాల్చుతూ.. ఇక్కడ మార్చుకొంటూ పోయిన రుణ అనుభవం …మొదటిసారి దగ్గరగా రాలిపడ్డ కంటి గిరికీలు.. సాధారణ భస్మ మూర్తిని కాదని పేరుకున్న దేహ రూపులతో నెరిసిపోయిన చూపు..

 కన్నుని సెట్ చేసిన ఫ్రేమ్స్… ద్రవ భూమిగా నెరిసిన శిలాజ జాతరలని కలుపుకొని… నెట్టేసిన ఉనికి చేర్చిన కంటి కాపలాని .. జరిపి .. కదిలే దృశ్య భంగిత హద్దుని సాగదీసి… అక్కడే ఉండిపోయిన నిష్కర్ష తెరలకి కట్టిన విందు.. పొద్దు పోయిన ఇళ్ల చుట్టూ … లేనిపోని కొత్త మాటల అపార్ధాలు..

ముట్టడికి జోడించిన వణుకుని … లోపలకి చెప్పుకొని .. గుమ్మాలని దాటి పట్టేసిన ముఖాలని అద్దుకొని.. చించి పారేసిన దేహ పురాణ స్థితులని కలుపుతూ.. పాత్రలు … ఫ్రేమ్స్ మార్చుకొంటూ పోతున్న అవక తవక జోరులతో … పిండేసిన చూపులని విడదీసిన ముఖాలతో.. హెచ్చరికని కప్పేసిన నమూనాలతో.. చేర్చిపెట్టుకొన్న నాటకాల్లోంచి… ఆ నదీ పడవల్లో లాంతరులని ఆర్పేసిన పుట్టు నెరవేరతాలని … ధూపకాలతో నిశ్చింతకి హద్దుని పెట్టుకొని చల్లారి పోయిన అద్దకాలతో

నిండిన కంటి నలతలతో … పోతపోసిన నిద్ర తీరుల కట్టడికి చేరదీసి కట్టు కథలు. లేపనపు శరీర సిద్ధతలని ఒంటికి రాసుకొని.. భుజాల బరువుని దాటించే వంతెనలని పట్టుకొని .. నిరా పూర్వక మెరుపుల్ని వదిలించుకొని.. కప్పడి పోయిన వివిధాలపై రొమ్ము పేర్చిన ఎత్తు కొండలతో.. హెచ్చరికలని మొండిగా పగలగొట్టి.. పల్చని నీటి రాతలపైనా కదిలే వరుస తలాలు..

నిండుగా కాలిన పెదాలతో .. చీకటి పోతలని మింగుతూ.. చెంపలపై చెరిగిన నిసృత … అపనమ్మకాలపై.. చెమటతో పట్టుకొన్న మాంస డోలనాలని ..పట్టుకొన్న రంగుల దిష్టిని తీసిన శరీరాలతో .. మన్నికని కాదని.. రంగులు సాగార్చిన దేహ నడకలా తీరుని కలుపుకొంటూ… శరీర నిందనల పోటుని తీర్చుకొంటూ.. వదిలేసిన విడి విడి గందరగోళాల్లో చల్లార్చిన పుట్టుకలు… సంభారమిత ఆయాసగతిని పట్టుకొని… జోడించిన వణుకుని కాదని .. మోసి తెచ్చుకొన్న కదలికలతో.. తోడి పోసుకున్న కలతలు .. నింపి రాల్చిన కుదుపుని చేర్చుకొంటూ.. పెనవేసిన కంటి సూత్రపు దారాలని అల్లుకొని..నిద్రని కడిగిన తెరపై .. ఇంకా తను అలాగే కనబడుతూ ఉంది.

ఊరి భోగం .. నదికి చేర్చిన పల్లకీలో .. ఎవరో మారిపోయి … పుక్కిలించిన నవ్వుని తాగి.. రెండో వరంగా లేని కుదుపుని నిలదొక్కుకొంటూ.. పేరుకు పోయిన వానల కౌగిలిని వణికించి.. సాధ్య వికారణని కలబెట్టిన నిద్ర రాళ్ళ కరగబోతలు.. మెట్లని చిక్కుకొంటూ.. దూరంలో వడపోసిన కథలని తెగ్గొట్టి .. నిద్ర  సన్నుడికి చెమర్చిన మంత్రం స్థలంలో పొడిగా ఉండిపోయిన అనుభవ తీరికలు.

 హద్దుని కిందికి తోసి.. తడబడే ఆయాస నిమ్మలాల కంటి తూగుని చెరిపి.. కలిసిపోయిన కెరటాల గాలింపుని పట్టి లాక్కుపోతున్న శబ్దాల గుట్టుని విప్పి.. తేరుకోలేని తెరల ముద్దలని కలిపి..

తన  కాలి  మువ్వల సన్నని తాడు.. నీరు పట్టిన కంటిలోంచి కారిన లేత మంచు తొనలు.. గడుసుగా ఉండిపోయిన చీకటిని అతికిన మాటలు.. నసిగిన దోసిలో పోసుకున్న స్నాన గడువులు..

అప్పుడే అర్ధమౌతుంది.. తాను అదే మాటని చెబుతుంది.. కలుసుకొని విడివడిన తొందరలని కాదని తప్పుకొన్న విపరీత అంటుడుపోతలు …

a)వర్ణ  చలనంలో   .. మృత్యు  పూతలు .. DOP 

అస్థిర గ్రహణాలు మోసుకొన్న నిద్ర రీతులని తాగి.. తరుముకొస్తున్న మందలింపులని సరి చేయక ముందే .. నిగ్రత పొంచి పోయిన మృత్యు  పూతలు… రంధి గేలనకి .. రెండో రుజువు లేని అపేక్ష చిత్ర చలులు ఊడిపడి.. అక్కడే తీర్పు చెప్పిన గుర్రపు బండిలో పాట కంగారుగా హాలుని నింపుకొంది.  

ఆయాసాన్ని స్ప్రే చేసి.. దుఃఖాన్ని గ్లాసిరిన్లో పోసి… నవ్వు కాగడాలని నూనె పోసి పెంచాక ..సెట్ సగం ఊడిపడ్డ ఫ్రేమ్ సెట్ చేసి.. నీ ఇల్లు ఇక లేదులే.. మూటాముళ్ళు సర్దుకొని వెళ్లిపోవడమే..

వర్ణ చలనంలోంచి .. పగటి  రుజువుని మోసి తెచ్చుకొన్న రుణ పీడనాలని జోడించి … పరిచయాలని కాదనుకొని వెలిసిన వాన .. నకిలీ మత్తుల డబ్బింగ్ … కీడుని కప్పిన చెమట పుటమరింపుల్లో కదిలే చిదిగిన ప్రాప్త నిరారపు కీ promptings … అడ్డుకట్ట ఒడ్డులపై మోగిన జయ హారతులు.. ఆమె పురుషుడు కనిపించక మోసం జరిగిందని పోలీస్ స్టేషన్ ముందు నిరసన.. కానీ పొద్దునకల్లా సెట్ కాబట్టి… ఇంకేం కనిపించక..

చెట్టూ .. ఇల్లూ .. వీధి… నది.. మంచు.. దుమ్మూ … అన్నీ అబద్దమే.. ఏది ఉందో అది మాత్రమే ఫ్రేములో ఉన్న .. ఏది లేదో అదీ ఫ్రేమ్ని  కరిచిపెట్టుకొని డైరెక్టర్ దగ్గరకి వెళ్ళినపుడు… అతనప్పటికీ ఊపిరి తీసుకోవడం ఆగి ఓ గంటైపోయిందంటాడు.. సగం పడిపోయిన తాటాకుల కొప్పు.. బుడగలు వదిలిన నిద్ర సాగులో కదిలే వణుకుని సరి చేసిన పూర్ణ నలతల్లో .. తేదీలు లేని కంపరపు తిరగమోతలు.. ఆ షవర్ కి రెండో పక్క గోడలేదు.. కెమెరా ముఖం నించి కిందకి దిగదని హామీ

తను ఉంది.. ఇంకా ఉంటానని అంది.. ఆ సెట్ కి ఆరోజే లాస్ట్ డేట్ … పొద్దునకల్లా ఇంకేం మిగలని నీటిపోరుతో నాని.. బిర్రబిగిసిన పలుకు మంద్రతల్లో పడి ఆచూకీ లేని కలుపు జారాలు.

గుద్దుకు పోయిన అంత్య ఛాయల కూర్పుని పోసుకున్న హద్దుని సాగదీసి.. చరియాలని పట్టుకొని ఊగిన నడక.. అక్కడే అట్లు పోసిన మంచం.. పెద్ద పొగాకుల కట్ట.. ముతక పంచె…

సాఫల్య చిత్ర గుజారంలో  పడి తలవని నటనలని పట్టుకొని .. రెండోసారి మార్చుకున్న గొంతు.

లెన్స్ లోకి లైటుని దూర్చి.. కదిలే కంటి రాలింపుల పొడుగు బాటని తెరిచిన అస్త్యవస్థాల రంగు కావలింతని సరిచూసుకుని.. భయం మోసిన నేరపు ధూళిని దులిపి పెట్టుకొన్న నిద్ర రాళ్ళ పేర్పుల పొగరుని కలుపుకొంటూ… విసిగిన తేడాల మధ్య కుదిర్చిన నింపుడు తేదీలు..

దశాబ్దాలు.. శతాబ్దాల నిమిత్తము లేదు.. అదొక ప్రయాస తాండవం.. అడవులు.. కొండలు.. నగరాలు.. స్మశానాలు … అన్ని అలవాటుగా మారి .. ధ్వనిని పోసుకున్న నిండు కుండల్లో పేరుకున్న జిడ్డుని వదిలిచుకొంటూ… తేరుకోలేని విషమ గగుర్పు.. రగుర్పు …

కన్నుని .. దృశ్య సాధనకి ముంచేసిన నలుపు తెలుపుల గడబిడని మోసుకొని … నివ్వెరపు అరుపులకి మోసి తెచ్చిన సూటిపోటి రాతల్ని తుడిచిన కెమెరా angles … జరుగుబాటులని.. సాధ్యా సాధ్యాలని దాటుకొని.. లేవదీసిన కంటి శ్రమని తిప్పి కొడుతూ… హెచ్చరిక లేని హద్దుని పగలగొట్టి.. తీరిక లేని అవశేష రీతిని చెక్కిన నల్లని మోతాదుల రక్షా తాడు.. వదిలించుకొని వెళ్ళిపోయిన అభయాల తీర్ధ నివురుల గాలింపుని చేర్చి పెట్టుకొన్న కాళ్ళ నిలువు వణుకు..

ఎప్పటిదీ ఇక్కడికి చేర్చిన అనుభవ సాంద్ర తర్జన గోళం పండించిన చేతి ముద్రలు..

దేహ వివర్ణ అంతః సారపు గండాలని దాటి .. ఎక్కువ కానీ నిద్ర తుంపరలని తుడిచి .. చేదు మంగళాల కంటి జరుగుబాటుని తాగిన మత్తులో పడి ఊగుతూ…

పంపకపు గోళంలో పడి .. కబురు తెలియని సగం ఘర్షితాయ బిగువుని సడలించక ముందే … ఊగిసలాట లేని తగ్గింపులు వరదని కప్పుకొంటూ.. తాను నటించడానికే వచ్చానని చెప్పుకొంది.. పాత్ర తన లోపలి వచ్చినపుడు మేకప్ దులుపుకొన్న ముఖాన్ని ముంచిన కలవరం …

ఆ డైలాగ్ ని ఏం చెప్పకుండా ఎడిట్ లో తీసేశారని… రోల్ గ్రాఫ్ ని సడన్ గా డౌన్ చేశారని.. కరిగిన రొచ్చులో చెమట పూసిన నుదురుని తుడుచుకొని.. నిర్ఘోణ ధారణకి లేచిన స్క్రిప్ట్ ని .. ఆ చీకటి పూర్తి కాకముందే వెనక్కి తెస్తారని.. కదిలించే మన్నలని దాటి .. నిలువు కంటిని అరగదీసి ఏడుస్తూ .. ఇక తేరుకోలేరని…

నేను ఇలా మాత్రమే లేనని … తట్టి లేపిన జ్వర దృశ్యపు రాకపోకలని సర్దుబాటు చేస్తూ… తీవ్ర నిరూప పేటికలని విసిరిన దుఃఖ గడింపుని చేర్చిన ఒడ్డూపొడుగుల నిలవర ధారకాలు..

ప్రభావాలు… ఎత్తు మడుగుల లోతుని పూడ్చుకొంటూ… పెనవేసిన నిలువు కొండల పాపిట వాగుల్లో ఊరేగే సంతాప గదులు.

అతనదే మాటి మాటికీ చెబుతాడు.. నీ శ్వాసని చూశానని..

నీ దేహం వెలుగు మొవ్వుని తింటూ.. మృత్యు తీరికని తాగిన కొండల మధ్య వేలాడటం .. ఫస్ట్ షాట్ అని.. ఎవరో నాకు అప్పటికే narrate చేసారు. కానీ నమ్మడానికి అక్కడ కెమెరా కనిపించలేదు..ఆ కొండల కింద లోయల్లో.. అనేక శతాబ్దాల వయస్సు ఉన్న భారీ చెట్లు.. తమ తమ ఆకులని .. దోసిలిలా విప్పుకొని.. నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా మాత్రం ఉన్నాయి.

 నీలోపలి పొగని … బయట మంచు వానగా చేసుకొని తడుస్తున్నాని.. ఆ బల్లపై … ఓ కొంగల గుంపులా సారిల్లబడ్డ అవిధేయ సార్ధత … కంట్లో ఊరిన కారపు నవ్వుని .. పల్చన చేస్తూ.. తీరిక లేని నికార గాథని పట్టుకొన్నశేష  భూమిలా ఆమె దేహం…..

నేను నిద్ర పోయాక .. నీ ముందు జన్మల స్మశానంలో ఊరేగి.. తలపడ్డ రుణ విలుపులతో హద్దునే  మాయ చేసిందని… నీరు కాలిపోయిన దేహ భద్రతలని కుదిర్చి.. చలిత మంద్రపు పట్టుని లాగిన నివ్వెరపాటు … సగం కాలిన పూడికలతో కోత పెట్టుకొన్న అవస్థలు.. ఒరిసిపోయిన పలుకు బిగువులు.. అదేదో తెలియని కులుకుని వేరే చోట చూసి .. అది నాకు వద్దే వద్దని.. భావిని దిమ్మరబోసుకొని.. విదిల్చిన నిద్ర సాయువుల గట్టి శాపపు రుణ తీరికని వదిలి పెట్టిన స్పర్ధల ఊపు..

రాకపోకలు లేని నిరాధార ఆనుపానులు కొత్తగా జరుపుకున్న సన్నని ముద్దల దేహ ఉరుము మీద పడ్డాక .. లేవలేని లోపల కంట్లో నీరు … ఇది ఎవరికీ చెప్పుకొని ఆగాలని ఎందుకో అనుకోకముందే .. తడబడే రొమ్ము రాత్రుల్ని పొడిచిన అణుకువల రెట్టింపు చప్పుడిలో నానిపోయిన మాటలు.. మంగళ ఘనీభవపు కుట్టడిని అంటు గట్టిన నేరపు చూపుల మధ్య ఇగిరిపోయిన కునుకుని వద్దనుకుని.. ఝాము పోసిన వీధి ముంపులో .. గుడి దొరకక మునిగిపోతూ.. ఆ ఇల్లే కాపాడిందని అరుచుకొంటూ.. రుణ వీరుడి గట్టుని కూల్చి కాపలాకి దొరకని నిందలు..

అవి .. స్క్రిప్ట్ బయట ఆయాసపడి.. ఉండిపోయిన నడకల ముట్టడిని కలుపుకొని… ఇంకిన జ్వర మోతాదుల కల్పివేతని దాటిన కదిలింపు.. పగగా రాలిన దేహాల మధ్య నింపిపోయిన ఇరుకిరుకు మంత్రపు సాధనాల పొగ

 ఎంతకీ అతకని ఆ రెండు కథలు కాపలా పెట్టుకొన్న నుదిటిలో .. బొట్టు తుడిచిన నాజూకు మందలింపుని పట్టుకొని.. నొప్పిని పీల్చిన కునుకు మలుపులు… ఎర్రబడిన కంటి గాలింపుతో అతను పగని తెచ్చుకొంటాడు.. భయానికి తొందరలేని చిత్ర దీపపు పొడిని చిదిమిన ముఖాలతో తడిచిన శరీర గేలన పొడుచుకొస్తూ .. కప్పుకున్న అటువైపు పూతలు.. రాతలు.. చెరిపివేతలు.. రాత్రి మారిన నిష్పత్తులు..  

ఇది ఇక కదిలే కాస్త రుణాల తాకిడి… కథ ఇంకా పొడుగై.. నివురుగప్పిన రాశీ పోతలని కప్పుకొని.. దూరం జరిగిన కంటి దస్త్రపు ముందటి జాగారంలో ఊరేగిన కుదుపు..

కాపలా ఆమె ఇంటిలోకి .. నల్ల చూపుతో దిష్టి తీసిన మృత్యువుని దాచి వడ్డించాక .. తనకి తెల్సిన కబురుని అందుకొని.. అతను చెట్టు ఊడలతో గోడలు దాటి చేరుకొని.. నీరు పట్టిన గోడలని ఉతికి .. తనకి తాను జ్వరపడ్డ కంగారుతో .. వదిలిన నీటి వర్తమానాలని జోకొట్టి .. అదేదీ తెలియనట్లు కలిసిపోతారు.. ఒద్దిక లేని రజ్జనతో హద్దు వాడిపోయిన కంటి బరువుని అరగదీసి .. జోడించిన మాటలకి .. తెలియకూడని అర్ధాలని ఒంపి.. పగబడతారు.

శరీర తెరపై ఆరబెట్టుకున్న ఆ మూడు కథలు ..ఒకటి నాది.. ఒకటి ముందు మీరు  ఇద్దరూ కలిసి చనిపోయింది.. ఆమూడేదే ఇప్పుడీ ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు..ఏదైనా ఓ అలసటని మోయక తప్పని బరువులో కుదురుగా ఉండిపోయే అవ్యథా ముసురులపై కురిసిన దేహ నిందల దట్టత ని పట్టుకొని … ఒరిగిన నిద్ర పొద్దుల మసక రుణపు పునాదుల్లో సడావుడి చేస్తూ… ఏక నిర్దత లేని పట్టుని దులిపి.. అక్కడే ఉన్న కెమెరా గదిలో.. ఇక అన్నీవదిలేసినట్లే … లైటింగ్ సెట్ చేసుకో… నేను వస్తా అంది.

నిరాధార రుణాల తాకిడిని నంజుకొంటూ… పారబోసుకొన్న స్థితి నిద్రత పట్టుకొని లేచిన నింపాది నీరులా పళ్లెంలో ఇంకా ఆ చేతులు ఎర్రబడి అలానే ఉన్నాయి. తలుపు బయట చప్పుడు ఆగలేదు.. చెట్లు రాల్చిన వాన బరువుని మోసిన పడవ ఇంటి ముందుకి చేరి పడుతుంది.. నిషా స్నానం చేసిన రంగు కాళ్ళ దేహం .. తనది కాదని చెప్పి దాక్కొంటుంది.

శ్రమన గతికి చెక్కిన దూరాలని పీలుస్తూ.. తేరుకోలేని చూపు నీలంలో వణికిన యజ్ఞ రాశుల కైపుని ఎత్తిపోసుకొన్న ఝాము మడుగులో .. ఒక్క పెట్టున కూలిన ఛాయా చీరాల కట్టుడు పల్చని నవ్వుని ఎంగిలి చేసి అక్కడే ఉంచిన కాగితాల మధ్య మొదలైన కథా నీరపు తొలి పగలు.

సినిమా గదుల్లో… అక్కడున్న గోడని తెరలా పక్కకి లాగి.. ఆమె అక్కడే రహస్యాన్ని వాంతి చేసుకొని… రక్తపు ముద్దలా రాలి కోమా లోకి వెళ్లిపోయింది.. అమాస మండపంలో కట్టిన ఊయలలో చెట్టుని చూసి.. తాను దేహంగా మారి.. నాకిది పడవగా కావాలనగానే అక్కడొక సెట్ వెలిసింది.. బలులు ఇవ్వడం మొదలుపెట్టారు.. 

తాను అంతకు ముందు తెలిసిన వాడే .. ఇదే వీధిలో తిరిగేవాడు.. ఇప్పుడిలా మారిపోయాడేంటి?

ఏదో తెలియడం లేదు.. కనిపెట్టిన శత్రు భూమిలో షూటింగ్ వల్ల అలా … అని ఎవరో ఏడుస్తూ చెప్పి .. ఇంకంతే  నిండా మునిగిపోయాక …

నిపార దేహ కృతులు కట్టిన జులుముని కత్తిరించి.. హద్దుని ఏకం చేసిన కంటి రసాయన శాలలో పగటి గండిని కొట్టిన శరీర రుణపు పోలింతలు కురిసిన దృష్టి సమీకరంలో పోగొట్టుకొన్న నిద్ర కక్ష్యలు మోసి తెచ్చుకొన్న దేవుని కడిగి.. పెద్ద పీడనాల ఆవరింపుని కదుపుకొంటారు.

 చలిగుహల్లో నెగడు అంటుకొని.. ఎవరో ఇంకా చాలదన్నట్లు.. ఇంకో షెడ్యూల్ ఉందిగా? అంటారు.. నేనెందుకు వదులుతాను … సమాధానం రాబట్టిన .. లేకున్నా .. అదలా మారే తీరుతుంది. గమనించే దేహ బోగపు ప్రమిదని పట్టుకొని .. కొండా దూకుతుంది. నదీ కులుకుతుంది.. మంచం వణికిపోతూ… కాగడాలని వెలిగించడానికి  ఆ కింద దాస్తోంది. అప్పటికే నూనెతో నానిపోయి ఉన్నాయి.

పొగలు కురవడం.. రంగులు కలిసిపోయి .. గుర్తు పట్టలేక.. సముద్ర రధం పేర్చిన కొండలుగా కనిపిస్తూ.. సూర్యుడిని మింగి.. తోక లోంచి వదిలి పెట్టిన చంద్రుడు కుమిలిపోతూ..

హెచ్చరికలు కదిలిన ఆరడి తలపట్టుతో … కుదరని నులుము మంటలు..

 ఇంకెవరూ ఏదీ అనుకోలేదు. బాగా ఉండటం.. బాగుపడటం గురించి చెప్పుకొని.. సీసాని కప్పెట్టిన టేబుల్ పక్కగానే ఆమెకి ఉత్తరం రాస్తూ… రుణ కార్తీకంలో ఉబికిన నిద్ర తోరణాల పట్టుని దులిపి.. కొంచెం ఆరబెట్టినా వానల వణుకుని జోడించిన బొడ్డు మూటలు..నడుముని ఇంకాస్త నీటి జారలతో పులిమి.. నల్లని అవలింతని కప్పుతారు. ఆపరీయం .. వికార మండలంలో పొడుచుకొచ్చిన వెలుపలి పడక

దుఃఖపు నిర్లజ్జ కట్టిన మెలకువలో నాని … తప్పిజారిన వీధి ముఖాలు… పొడుగైన అద్దకపు మండలంలో పెట్టుకొన్న చీకటి తర్జుమాలని నెట్టుకొంటూ.. తేరుకోలేని మాటలని కనిపెట్టి.. కలవడంలోనే అంతా ఉన్నట్లుగా చెప్పినా .. ఫోన్ పెట్టేముందు ఎక్కడికి రావాలో మాత్రం చెప్పరు.. సరిపోలేదనుకొని అప్పటికప్పుడే కథని పరిచయం చేసే మంత్ర గీరతో… పేలిన గొంతుని సాగదీసి మాట తప్పుతారు.

కథ తెలిసిపోయిందని కొంచెం పోతూ పెట్టిన నాలికల చివర ముద్దు చప్పుడుని నాకేసి .. ఆ  తలుపు వేసుకొని ఉండిపోతుంది.ఒప్పుకొని ఉన్న తెర వెనక మేకప్  … మాటి మాటికీ పిలుస్తూ.. ఒక్క అవకాశం ఇవ్వండి.. నేను వేసే మేకప్ కి .. ఎవరూ మీ నుంచి చూపు తిప్పుకోలేరు.. అంటున్నాడు..కానీ వాడి ముఖం ఎప్పటిలా లేదు.. అలాగే  మాట్లాడే కొన్ని క్షణాల్లోనే రక రకాలుగా మారుతూ.. హద్దులు దాటుతుంది.

కోప్పడ లేదు.. వద్దనీ అనలేదు.. కానీ వాడు అద్దంలో లేడు..ఇదొక శిధిల రంగులతో జోడించిన గుహ.. నీ పేరుని తలుచుకొని.. వెనక పాడుకొంది.

అటు వైపు అద్దంలోంచి  .. సైగలతో .. ఆ మాట నమ్మొద్దని ఇంకెవరో చెబుతున్నారు..కానీ వాడి చేతిలోనూ మేకప్ కిట్ ఉంది.. స్వయంగా కడిగిన అయోమయాలు..పెద్ద  పొడుగు నిషారపు ధ్వని చుట్టి పెట్టుకొన్న ప్రయాణంలో ఊపిరి నల్లతాని మోగించి హద్దుని చేరదీసి.. కంటి శస్త్రతకి తాకట్టు పెట్టిన ఇంటిలోనే ఇక ఉండలేనని…

చిలువలు రంభన .. పైకి తెచ్చుకొన్న నిఖారింపు వరద ముంచెత్తి.. కలబెట్టిన నడక చివరలో .. పెద్ద కన్నుకి చేర్చి పెట్టిన ఇసుక పుంతలు.. నిలువరపాటు.. నిత్తర … కబురులేని సెట్లో .. ఇది కాదుగా .. స్క్రిప్ట్ అంతా మారిపోయింది.. మీకు ఇంటిమేషన్ లేదా? రహస్యం ఒక కౌగిలి సాధించిన బిగువుల పొత్తు.. దులిపిన వేడికి వాన జాడలు గుప్పిన వేడుక.

సామర్ధ్య దేహ గతం తప్పించుకున్న ముడులతో నిండిన తెరలు.. కలలు పోసుకున్న వరదని నెట్టుకొంటూ.. పెడసరపు గొంతుతో.. నెమ్మదిగా కదిలిన దేహ రుజువుని కదిలించి పెట్టుకొన్న ముఖాలు.. మొదలైన రంగుల్లో సాధనకి పట్టిన కంటి శిలలా రాజుకున్న మంటని ఎగదోస్తూ.. మేకప్ రూంలో స్క్రిప్ట్ లోని డైలాగ్స్ అన్నీ గోడలకి అంటించి వెళ్లారు.. ఒక్కసారిగా వాటిలోంచి నీళ్లు రావడం మొదలై.. క్యారవాన్ అంతా నిండి.. ఆ నీళ్లలో తేలుతూ .. మర్చిపోయిన కేకలు..

పీల్చిన హద్దులతో పొడుచుకొస్తున్న గట్టులని దాటి.. నేర్చి పెట్టుకొన్న నటనలు.. ఏవేవో సర్టిఫికెట్లు.. స్టేజి పెర్ఫార్మింగ్ టోటల్ హౌర్ ప్రూఫ్స్.. డిక్షన్ ట్యూషన్స్ .. సైకలాజికల్ understandings కోసం స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్.. ఎందుకో అన్నీ .. వాడి కళ్ళలోకి చూడగానే ఫెయిల్ ఐపోతూ..

అన్నీ సహజంగానే అనిపిస్తున్నా .. ఇదంతా జరిగేదిగా లేదని అనిపిస్తూ… వేడికి పట్టుకొన్న పియానో … కొన్ని పాటల వాన కురిసి వెళ్ళినపుడు.. ఆ పెద్ద రాతి స్తంభం మొత్తం పై నుంచి కింది వరకు.. ఒక దీప కాంతి స్తంభం గా మారి కాలిపోతూ… తెల్లని పొగగా మారిన ఇంటి సెట్.. అక్కడ తీసుకొన్న దుకాణాల్లో దుప్పట్లు అమ్మే చోట .. ఒక రోల్ చేసి పెట్టిన కంబళిలో ఆమె ఉందని ఎవరో గుస గుస లాడుతారు..

విశ్వ వ్యాకులము నిండిపోయిన మహా నిద్ర దారిలో దొరికిన పడవ.. ముద్ద కట్టిన చీర.. బట్టల మూట మధ్యలో ఓ లాంతర్ల గుట్ట … గిటారు.. ఆమె లోకి పెయిన్ నుంచి తేనె ధార కురుస్తుంటే .. పాడుతుంది.. పడవ వెక్కిళ్లు పడుతుంది.. ఆ గట్టు తెలియని మృత్యువు దూరం జరిగి వాళ్లనే చూస్తుంది.. ఆమె కాళ్ళకి ఇంతింత పెద్ద పెద్ద గజ్జెలు.. ఉరుము మింగిన నుదురు.. పెద్ద పెద్ద కెరటాలని మింగగల చూపుల వరద .. సర్దుకోలేని ఆయాసంతో కరిగిన కొండలు.. పడవల గుట్టలోనుంచి చితి కాలుతున్న వాసన..

పడవతో నదిని దాటుతున్న నేనుకి.. ఆమె మళ్ళీ రమ్మంటున్న కబురు వినిపిస్తున్న .. గుబులు చుట్టిన కొబ్బరి తోపులు .. చూపుని లాక్కొని లంకలోకి తీసుకుపోయి కప్పెడుతున్నాయి. దుఃఖం ఆరిపోక ముందే .. గూడైన లేని పడవలోకి కురిసిన వాన.. అక్కడున్న ఇసుకలో కురిసి.. ఆమె బొమ్మలా కనిపించి వాలిపోతే .. స్పృహని లాగేసి.. కలలో ఇక చనిపోతావా? అని అడిగినట్లుగా … చప్పుడు.. కప్పేసుకొన్న నిద్ర ఝాముల కైపు..

ఒంటరి సాంద్ర ఛాయల్లో కలుపుకున్న నిశ్చయ కూర్పుని తిరగ రాసి.. తన కథ అక్కడితో ఆగదని అరిచి వెనక్కి వెళ్లిపోయింది. అదొక సత్యమని తెలియడానికి.. నాకు ఆ అర్హత లేదని ఎవరో నిందిస్తారు.. పని గట్టుకొని.. తెలియని దారిలో .. నది మారిపోయాక ఆగకుండా వెళ్లిపోతూనే మర్చిపోతారు.. కానీ ఆ గుడి మొండిగా .. ఎవరి మాటా వినక గంటని మోగిస్తున్నప్పుడు.. కల కధగా మార్చుకున్న దిశలు..

ఆమెని అతను అనుమానిస్తాడు.. కళ్ళు నులిమిన ఆయుస్సుని పట్టుకొని గోడ కడతాడు.. చుట్టూ కిటికీలకు మేకులు కొట్టి.. సీసాలని వేలాది దీసి.. దుప్పటి వద్దని .. పింగాణీ పనిముట్ల పై .. తన పాత పాట ని పలికిస్తాడు.. వింటూ ఉండడాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాడు….

గర్భం దాల్చిన ఆమె .. ఆ పాత నిండని కాదని కోప్పడి .. రెండో రంగుని అద్దుకొని తడబాటు లేని నిర్యాణ కల్చివేతని సాగదీసి.. ఆ పాటని తిరిగి ఇచ్చేయమన్నప్పుడే  అక్కడ పడవ కనిపించదు. వింటూ ఉండడాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాడు. ఉండిపోవడమంటే నిజం కాదు.. అది అద్దంలో మిగిలిన అబద్ధమూ కాదు.. నిందలని వడపోసిన నిద్రత ఊడిపోయింది.. సద్ధడి లేదు.. ఆగిపోవాలని తనేం చెప్పలేదు..

ఏదీ ఇదంతా యధాతధం కాదు.. పలికిన నిద్ర సాయాల బరువుని కరిగించే కలల కూర్పుగానూ లేదు.

ఇక్కడి శాప గాథలో కౌగిలి ఎంగిలి పడుతుంది.. చేరదీసుకొన్న నడక కూలిపోతూ.. హద్దులే తెలియని పుట్టు రాళ్ళ కైపుని కడిగి .. చీలిన చలన ద్రవపు మంద్రత ఊరేగి.. అక్కడ గడ్డ కట్టిన కాళ్ళని పట్టుకొని.. నిషేధ ఆజ్ఞని ఒప్పుకొని.. తిరిగి ఇక కనబడనంటుంది..

చెప్పుకొన్న విడిది లో ఆ పెళ్ళివారు … నానా మాటలు అని.. కొన్ని ఫోటోలని ముఖం మీద విసిరి వెళ్ళిపోయాక … వాటిలోంచి అదే పాట మళ్ళీ వస్తూ ఉంటుంది. రుజువులని ఏకం చేసిన కెరటాల పక్కగా .. గుడి ఆనవాళ్లలో కొన్ని కాగితాలు దొరుకుతాయి..పెదాలు వణుకుతాయి..పొట్టలో బరువు అది కాదులే అని నిందిస్తుంది.. జరగబోయిన హెచ్చరికని పట్టుకొని.. శేషితః భూమి చందన పూతల సంబరంలో వేషం మార్చుకొని కనబడతాడు.. కనబడలేదని చెప్పుకొంటుంది.

ఆమె లంక భూమి .. కొబ్బరాకులో గుడిసెలో.. కొబ్బరి కాయల గుట్టపై .. దూరంగా ..అదో  శిలా భంగిమలో కూర్చొని.. నొప్పికి మెలికలు తిరుగుతూ.. ఇదే చివరా ? ఇక నేను మళ్ళీ నిన్ను చూడలేనా?

దుఃఖం .. ఒక సంసిద్ధ నివ్వెరపాటులో మోగిన శంఖాల ఆమ్లాయ తమకంలోని శూన్య నిరూహాన ..

 కదలదు.. కదులుతూనే ఉంటుంది.. పుట్టిస్తూనే మాటని వదిలిపెడుతుంది…

వినదు .. చెబుతూనే ఉంటుంది. తిరిగి తిరిగి అదే చెప్పడమూ కాదు.

చూడదు.. తెరలని దాటి చూపుని పంపిస్తూనే ఉంటుంది.. పోలికని ఎప్పటికీ చెక్కలేదు…

హద్దుల్ని సగం నమిలేసిన దేహ భ్రమణ ముహూర్త గుంభనలో మళ్ళీ టైటిల్స్ వద్దని .. వాళ్ళు ముందే హెచ్చరిస్తారు. ఏదో తెచ్చిపెట్టుకున్న రంగుల్లో సాధన .. కస్సున కోపంతో లేస్తుంది.. కాలుని ఆ ఇసుకలో దువ్వి.. ఆ బొమ్మని చెదర గొట్టాక .. ఎనతసేపులే అని .. అతను తిరిగి మొదలు పెట్టబోతే.. వాడి చేతి పట్టుకొని.. గాల్లో గిరా గిరా తిప్పి నదిలోకి విసిరింది..

వీధిని క్రతువుగా చేసి.. వాళ్ళ పంపకాలని దూరం నుంచి చూసి.. నేర్చు పెట్టుకొన్న నటనలు.. కొంచెం కాదని చెప్పుకొన్న కథ పక్కదారి పట్టాక .. కూలిన కొబ్బరి తోటలో కాలుతున్న ఆ గుడిసె.. మొహమాటపడి కలిసిన నిందలు.. అపక్రమ మృత్యు తోరణాలు కలిసిన దుఃఖం .. చేరగిలిన సంతర్ప ముంపునీ కుదిపి .. పక్కకి తూలిన కునుకుతో నాని.. ఎక్కడో తప్పిపోయారు.

సగం సత్యం మింగిన ఎద్దడి మోసుకొని.. నీటి చర్మపు మంద్రతలని తాగిన చప్పుడిని పెదాలపై ఉంచినప్పుడు… భుజాల్లోకి జారిన గమ్మత్తుల బరువుని కరిగించి .. హద్దులు దాటిపోయినా కదిలిపోని విశ్వ నిష్పలతని చేర్చిపెట్టుకొన్న కథల మధ్య .. చేర్చి పెట్టుకొన్న కలలని వదిలిపెట్టుకొన్నాం.

దీర్ఘ మంద్రతల నెట్టుడు స్తంభనలో .. పెనవేసుకున్న స్పర్ధ గతుల నిర్వాకపు ఊతాన్ని పట్టుకొని.. రాలుతున్నఅలార రజనులు.. చేవ చనిపోయిన ఎండు గదుల్లో .. పొడి బారిన దేహాల నలుగుడు గొంతులని పట్టుకొని.. ఇరుకైన మాటలని కట్టుకొని … తీరిక లేని విసుగుని జోడించి … నిరాహేయత పగిలిన ఒడిలో .. ఇంకాస్త రంగుని వదలమని.. తలలో చేర్చుకొన్న ఊసులు…

కంట్లో నాచు పట్టిన చూపుతో.. హద్దుని మార్చి పెట్టుకొన్న నడతని సరిచేయక ముందే … అక్కడడే ఒడి దిగబడ్డ   రుణ కథల సఫల నీటి ఒద్దిక … గట్టుని తెంచుకొని ఏమార్చిన కాళ్ళ భూమి సంధానపు గర్గతి చూపుని దాటి మిగిలిపోతుంది. సమయ నిదాన నిద్ర జాగారపులని మోసగించి పెట్టుకొన్న చీకటి నసులుబాటు.. కిర్రెక్కిన మంటల్ని తాగి .. తూలి పోయిన మొండాల గుట్ట..

గది కంట్లో గంటల భుజం… శిలా ఛాయాన ఉండిన ఎత్తులని నలిపి.. దున్ని … బిడ్డని కలిసి.. వడ్డించిన చావుతో.. కలపని ఊసుల జోడింపుని బిగదీసి.. ఉండుండి మార్చి చేయించుకున్న తీర్మాన మూర్తులని .. దడతో కలుపుకున్న విభ్రమ పెనవేతలని చెమ్మని ఆరబెట్టుకొంటూ… పేరుకు పోయిన నిద్ర రాల్పుల కంగారు.

అతనొక సంకీర్ణ సత్యపు అవధిని కూల్చి వెళ్ళిపోయినా పగటి గుడారపు మంచు ఒడి.. ఒద్దిక లేని అవస్థని చేరుకొని.. తేరుకోలేని సమస్త గతి నీయపు పొడిని చల్లిన కత్తుల మధ్య నిలబడిన ముఖాలన్ని కోసుకుపోతూ… ఎవరమూ ఇక్కడ ఆగిపోయిన నాజూకు మందలింపుని తీసుకొని ఆగిపోలేదు.. కలపని దేహ రుజువుని సరి చేయక ముందే .. చూపుని వద్దని కనిపెట్టిన సెట్..

హేయత మళ్లించిన రోడ్లపై .. కంటి శోధనని కప్పుకున్న గుడార నింపులని సరిపెట్టుకొని..ఇప్పటికి ఇదే సరిపెట్టుకున్న కలవడి జంట రాతల్ని పోసుకున్న గోడలు. .. ఎవడో రాస్తాడు.. డబ్బింగ్   పూర్తయ్యాక ఆమె వెహికల్ ఫారం హౌస్ వేపు వెళ్లిందని.. నడకకి రెండు తాళాలని కట్టుకొన్న ఆసరాతో .. కలబెట్టిన కట్టుడు రాతలు.. ఊరికే అనుకోని తవ్వకాల ఊరింపుని జోడించి కసి తీర్చుకొన్న వేషాలు..

సఫల రజనులు.. మోసపు తెరల వెనక రికార్డెడ్ evidences తో న్యూడ్ క్లిప్పింగ్స్ .. చావుని తరుముకొస్తున్న బ్లాక్ మెయిల్ ఒద్దడి పోసుకున్న చెక్క కాళ్ళ చప్పుడు.. చావు నివురుని ఊదుతున్న బాత్రూముల్లో … పెనవేసి నడక కిందనే కదిలిన నిస్పృహ నీటి గతుకుల కూడలిని విడదీసి… లోపల ఖాళీ చేసిన వెలుగు మూతని పట్టుకొన్న సీసాల బురద..

కుక్క నాకుతున్న ఎంగిలి పళ్లెం.. ఉరిపోసుకొన్న చెట్లు .. చూపుని వాల్చుకొని చనిపోయిన కొండలతో.. చెమట పట్టిన నది పాడు వాసన .. మంత్రపు శ్వాస దూపుని ఆరబెట్టి.. సగం కొట్టి తీసిన తలుపు.. అంతా అప్పటికే ఆలస్యమైనట్లు గుస గుస లాడుకొంటారు. విరిగిన సంతాప మ్లానతని కరిగించి.. దిష్టి తీసిన సగం హాడావుడి నుదిటిలో పడి పోయిన లోయలు.. కలుపుకున్న దేహ కాల్పుని వడపోసి .. సగం ఏమార్చిన ముఖం లో బూజు పట్టిన ఎటి గట్టుని చెదరగొట్టి..

భూమి తన పుట్టుకని నిలిపిన రెప్పల మడుగులో … సర్దిన కెమెరా లెన్స్.. ట్రాక్స్ ని గుండ్రం తిప్పి.. కంటి బొట్టుని జూమ్ చేస్తూ.. మళ్ళీ మళ్ళీ తిప్పి… కోరికని బలంగా రిజిస్టర్ చేస్తూ.. పేరుకుపోయిన మంచు గొడుగులా నొప్పిని కరిగించి.. లైటింగ్ సెట్ చేసిన దేహపోతలతో చివరి కీడుని అరగదీస్తారు.

దేహ నిగ్రహాల బిగువుని చేతుల్లోకి తీసుకొని .. విశ్వాస నిరాకారపు పొద్దునే తాగిన అలమాటల కునుకుని పట్టుకొని.. వెనక్కి జరిగిన హద్దులు.. మీదకి తోసుకొస్తున్న భయాల తోపుల్లో పడి గజ గజ లాడుతూ.. పేరుకు పోయిన కథల గుట్టుని తిప్పి పెట్టుకొన్న పేజీలు.

ప్రమత్త గుహల్లో .. తనకి లెటర్ రాయించుకొన్న తనే .. వెలుపలి పగటిని మోసం చేయక ముందే .. కలపని కంటి రుజువుని జోడించి చెప్పుకొన్న ఊరబోతలు.. తనకి తను చెప్పుకొన్న సాధన నిండు గాధలు.. పొరపాటు చెదిర్చిన కంటి పోటుతో.. హేళన బిగించిన మాటని తోడుకొని.. బలమైన  వికార రుణపు పొగని దట్టించిన చెమ్మతో మరిగించి..

నడక ని సరికి చేయక ముందే .. కలబడే  నల్లని జ్వర తీర్ధంలో పడి .. నొసటిని సరిచేయని కదలికనే దాటుకొంటూ.. నాచు పట్టిన రాళ్లు… కలిసిన నీటి బొట్టుని పల్చగా అలికి .. చిదిమిన కషాయ ఊరటని .. దగ్గులో ముంచి.. నుదిటిలో పాకిన నిలువు మూటల నలతని బరుగుగా మోయించిన చిక్కులు.. ఆవిరి గొడుగులు..

కంట్లో కారిపోయింది సిగ్గు.. ఏక నిర్మిత లేని చూపుని పట్టుకొని .. శ్వాస తలంలో పోసుకున్న మసక రుజువులని కప్పుకొంటూ.. దీర్ఘ ఝాము లో స్నానపు రేవులని కడిగిన కెమెరా నాలికలు.. తనకి తను చెప్పుకొన్న సాధన నిండు గాధలు.. పొరపాటు చెదిర్చిన కంటి పోటుతో.. హేళన బిగించిన మాటని తోడుకొని.. బలమైన  వికార రుణపు పొగని దట్టించిన చెమ్మతో మరిగించి..

తలపడుతున్న నుదిటిలో పేరుకున్న నల్లని కీడుని … ఇంటి మెట్లని కడిగి.. హెచ్చరికలతో పండిన పగటికి చేర్చి పోయిన పడకలు… అప్పగించిన రాత్రులతో చేరిన కంటి దూరాలు.. గిరిగీతలతో చుట్టిన ఎర్రని గోళాలని కాదనుకొని.. ఇగిరి పోయిన సాధారణ క్రియలని చేర్చుకొని.. పేరుకుపోయిన చీకటిని కౌగలించుకొని… ఝాము పేటికని ఊరించి పెట్టుకొన్న సాధన గతులతో …

చిత్తడి ముసుగులో పోతూ పెట్టే మాటలని అరగదీసి.. సరిచెయ్యని సముద్ర నాడులు .. కథని మార్చి నాటకమాడుతూ… హద్దుని చెదరగొట్టిన కంటి గడపని తుడిచి … కిటికీలని సరిచేయక ముందే .. లోపలిని తెర్చుకొన్న నలుపూ.. తెల్లని మెట్లని పరుచుకొని.. తెల్లవారాక ఉండిపోయిన నుదిటిలో.. ఇంటిని పెనవేసుకున్న పూడ్చివేతలని …

మండుతున్న క్షయతో నీరు పట్టిన ముఖాముఖాలు… రుణ పారడీలని నింపుకొని.. ఇగిర్చిన వేడుకల నొప్పిని కళ్ళకి పట్టించి.. తోడు పెట్టుకొన్న నింపాది రాతలు.. చెమరిన కునుకు దుప్పట్లని చేరవేసిన కంటి తలుపుకి … గాలింపు సరిచేసిన ఊరటతో… ఇసుక మండలాల్లో పడి తోడు దొరకని వివశ పోలికలని దాటించే వెన్నులో చలి తీరికలు.. పొట్టు రాలిన కెరటాలు….

సమస్తమూ ఉండిపోని పొగరు గొంతుని అలవాటుగా నమిలిన కంట్లో ఒదిలిపోయిన చీకటి అటు తెల్లవారాక .. మిగిలి ఉండిపోయిన కాళ్ళని పట్టుకొని … బిగించిన కంటి కోతని జోడించి పెట్టుకొంటూ…

ప్రమత్త శరణుని కాదని .. చేరగిలిన తలుపులతో సద్ధడి ఉరిమిన పట్టుని బిగించి .. కండరాల్లో కుమ్మేసిన చెమట బరువుని పిండుకొంటూ.. సవరించిన దేహ సెగలని దాటుకొని వెళ్లిపోయిన నడకలు..schedules ..

ప్రాణ గమనత ఊరేగే నిందలని వడపోసి చెద పట్టిన గోడలని కొట్టుకొంటూ … నింపేసిన గాలి అలలతో పూడ్చేసిన కంపన మండలంలో పడి మొదలైన షూటింగ్.. అసహజ సహజంలోని మొండి గాలిని ఊరించిన మొదటి గండం తప్పిన కునుకు పాటలో పడి.. సరి చెయ్యని శిధిల బిగువు రొప్పుని లాగిన సద్దులు..

సరళ జ్ఞాత శిలావరపు పోతలని అంటుకడుతూ … పక్కకి తప్పిన మాటలని చిక్కుకొంటూ.. ఋణం తీర్చుకోలేని రసాయన కీడుని కడిగి.. వెళ్ళిపొమ్మనక ముందే గాలి పట్టిన కథలు.. నీటి పోతలు.. నాచు పట్టిన రంగుల భయం నిండిన కరుకు ముద్దలతో.. పీడన కప్పిన చుట్టరికాల దగ్గరి మోతలు..

కటువుగా నిండిపోయిన కంటితో .. తోడు పడిన పగటి దోషపు స్పర్ధని కాల్చి.. ఒరిపిడి నిలబెట్టిన కునుకు.. ఎవరమూ ఇక్కడనే ఉండడానికి లేని గదుల్లో మాటలని ప్రాక్టీస్ చేస్తాం. ఆవరించిన పాత దీపాల కొండపై చెదిరిన మోసపు బొంగురు గొంతులు.. నల్లబారిన వీధి స్తంభాలని ఆవరించిన కిటికీలని .. అద్దకాలతో మోసపోయిన నాజూకు పొరల్ని దాటుకొని .. వలసతని ఆరబోసుకొన్న ఇంట్లో.. నిడివి నింపిన స్క్రిప్ట్లని లాక్కొని .. తనకి ఎటూ పోనీయని కలతని నానబెట్టి .. బీడు గొంతులో కరుకుమాటలని కరిగించి..

ఎవరమూ ఇక్కడ తమ తమ కథలు చెప్పుకోవడానికి రాలేం.. దృష్టి చల్లార్చిన హద్దులే తెలియని ఖాళీ పట్టుని దులిపి .. కలిసిన జ్వర హద్దుల్లో ఆరాయ లిఖితం .. చేదు ముడులతో కలిపిన ఎద్దడి గొంతులు.. పాక్కొంటూ పోతున్న దేహ శిధిలాపు తోడుని చేవగా నానబెట్టి … ఉన్నప్పటి గదిని ముంచిన కథలని తీసుకొని.. ఇక్కడ కదిలే దేహ శీర్శ్యపు ముట్టడి …

కొంచెం చెప్పడానికి వదిలిన ఖాళీల్లో పెడసరపు ముంగాళ్ళని దాటి కప్పుకున్న వేసట ముఖాలు. లైట్ ఫేడ్ అవుతుందిగా … ఇక ప్యాక్ చేద్దామని కట్ చెపుతారు

మెత్తని శరీరపు శిధిల ముఖాలతో  పండిన నెలల గట్టుని తెగ్గొట్టి .. రెచ్చిపోయిన కెమెరా గూడులపై కప్పిన పలుచని బట్టని దులిపి.. పేరుకు పోయిన నటనల నీటి ముద్దలు కరిగి.. నీటిని కలుపుకున్న శ్వాస ఋణం పొగతో పండి.. నడుం విరిగిన మసకలు.. తెలియని పగటికి రెండో గది పేరుని చెక్కి,, విదిలించి చేర్చుకొన్న చీకటితో … కక్ష్యల్లో.. తేలికపడ్డ కన్నుని సాగదీయక ముందే పుట్టిన పెదాలని తీర్చి పెట్టుకొన్న ఫ్రేమ్స్..

పెనవేసుకున్న చలన క్రియకి అందిన సాధనతో … చేర్చి పెట్టుకొన్న సమయ తోపుల్లో పారబోసుకొన్న నిక్కడ రుణాల కైపుని చల్లారబెట్టి.. చీరలు నివ్వెర పెట్టిన చలి మడుగు నిప్పు బుడగలని తేరిపారా చూస్తూ.. కదలని నిద్ర పోతల అనుకువని జోడించి చెప్పుకొన్న నల్ల మానులు దాచి పెట్టిన కథ.

అనునాద గడువులో పడి.. ఆమెని తన చుట్టూ గుండ్రంగా తిప్పించుకొని.. మేకప్ ఇంకా ఎందుకు మార్చలేదని ఎవరో అరిచి వెళ్ళిపోతారు.. అనుకోని అడ్డంకిని దాటి .. ఓడిపోయిన రుణ ముక్కల నెట్టుడు శాసనం చదివిన కొండలని ఆనుకొని.. దీర్ఘ వశీకరణలోకి పట్టుకొన్న రక్త బిళం చేరదీసిన కండర నవ్వు.. బేల చూపు.. మసక చెమట.. బూడిద కప్పు.. చితి మరకలతో బీటలు తీసిన గోడ.. పూనకాల గొడుగు కింద అలిగిన చెట్ల గుండం.. పగ మోసిన ఊరు చప్పుడుని నమిలే కొండపై పొగ మొదలైంది…

వ్యతిరేక పరస్పర సంధికి చేరిపోయిన ఉపరి క్షేత్రాల్లో పడి … నిలువు చారల ముఖం పట్టుకొన్న కలలని సీసాలోకి పట్టి..  ఎత్తి పోసిన చీకటి నెల… గాలి పంపిన కోతలతో పగిలిన దోసిలిలో నిమిత్త రాతని తెచ్చుకొన్న సారపు పుట్టుకలు.. భ్రమిత తీరికల తూగు..

ఆ చీకటి రాత్రి గడువుని తిప్పించుకొన్న శరీర ఋణం పట్టుకొన్న కదలికనే గట్టిగా బొమ్మని చేసి .. అక్కడే నింపుకున్న ఆశర్య సత్తువతో ఎగాదిగా చూసిన కదిలే గుడి.. పాతుకుపోయిన నిద్ర ఊపుల వికార పుట్టుకకి జోడించుకొన్న అవస్థలు.. సాను సంధాన సడుల గుట్టలో నైవేద్య రూపాలు

అవాహ నిద్రల కిందుగా వదులైన కంటి శాపం మోసి తెచ్చుకొన్న సంపర్క జ్నతని కలిపి చూడని .. మేకప్ లోంచి నేనే అని నవ్వి.. వడ్డించాక .. మనమీ రాత్రికి అక్కడ మన ఊరి ఇంట్లకి వెళ్లి అక్కడే రాత్రంతా ఉండిపోదామని.. చిలికిన నిరావరణ దుఃఖపు ఆది సూత్రం నమ్మబలికింది.

నిర్మ రాతుల డాన్స్ compose ని కనిపెట్టి.. రంగు మెసేజ్లో ధ్వని పోసిన వర్తమానత తిరగదోడి .. కావాల్సిన రెండో మాట చివర పెదవిని కదిలించి గడప దగ్గర వదిలిపెడతారు. సామ్య సమయపు పై వరకు చిందాడే పెదాల తడిని దాటుకొని.. పొడి గడువు చిత్రంలో ఊయలని దాచుకొని.. సువ్వెరపాటు దూరంలో పడి కన్నుకి దొరకని మంట… మండపంలో దీపం ఊగినపుడు.. ఆమె కాళ్ళని  కడుగుతున్న ఎర్ర  సిగ్గు మధ్య మాట ఇస్తుంది.

ఎత్తి పోసిన చీకటి నెల .. కదిలే గుడి … ఎవరికీ ఎవరుగానూ ఉందని జోగు రాత్రంలో పడి కొట్టుకొనే నెలల ఖండపు గొడవలు.. చెప్పుకొని వదిలామని అన్నా… ఎవరూ వినరు.. అదంతా scripted  అంటూ … బరువు చిత్రాల కొండపై కాళ్ళు దులుపుకొంటారు.  

పక్కకి జరిపి .. టైం అడిగి.. రేపు కాల్షీట్ ఎప్పటి వరకు.. పికప్ ఎవరు చేసుకొంటారో చెప్పి … ఎక్కుపెట్టిన దోషపు పోతలని తుడుచుకొని.. నిండిన గది సామానులతో .. పెంచుకున్న ఇంటి పడకలని ఆరబెట్టి.. షూటింగ్ స్పాట్లో కిందా మీద ఒరిగిన దేహాలని దులుపుకొని.. చిరిగిన కొట్టుకొని.. గొంతు తడుపుకొన్న మత్తులో నీటి సగపు రుద్దని పుట్టుకని కలిపి.. ఋణం తీరక ముందే కప్పిన ముఖాల దొంతిని సర్దుకొంటూ..

సూర్య కైపులతో మసిపోసుకొన్న ఛాతీ ముంపులు.. మరిగించిన దేహ పూనకపు నివ్వెర రాత్రంలో పడి .. తల మునకల శ్వాస తాండవ మోయంలో కరిగిన విస్పతి శిధిలాన్ని సర్దుకొన్న కెరటాల భావి. ఊపిన మత్తు కండరాల మధ్య నువ్వు కలలో ఉండిపోతావా? రక్షా చలనపు కొత్త నిద్రని గడించిన హద్దుని నేల రాసి.. పగ పట్టిన కేకలని పెట్టుకొంటూ.. రుణపడని బొమ్మల గూడెంలో పంపక చర్యల ఇళ్ల ముందు సాయంగా తిరుగుతారు. ఎదుటపడి ఇంకేదో అడుగుతారు….

కలిసిన నిద్ర వణుకుతో.. అందిపోసుకొన్న ధ్వని చిత్ర పూతలని జోడిస్తూ.. అద్దిన రొమ్ము చూపుతో హడావుడి పడే దుఃఖ మోయరాలు.. కూడికలు .. పూడికలు.. జోడనాలు .. పెదాలని తెచ్చుకొన్న ఖాళీ డబ్బాలని కోరుతూ.. చేయించిన ఒప్పందాలని పట్టుకొని.. సమార్చిన కదిలే నిర్జనాలతో తోడుకొన్న నుదురు…

i)శరణు పోలికలు .. నిండిన హద్దు .. మరోలా పట్టుకొని….

స్వస్థ స్తంభన ఎరుక .. పట్టి తెచ్చుకొన్న గుండ్రని చప్పుడుని నానబెట్టి .. ఒదిగిన దేహ నిర్మాణ కక్ష్యల్లో పడి.. ముఖం తిప్పుకొన్న ఒద్దికని సరిచేయక ముందే.. సేకరణ అద్దిన దిగులు బుట్టలో చీరలు.. రంగు వదిలిన వాన .. అతను కీ ఇచ్చి వదిలిన వాచ్.. హోటల్ రూమ్ మాస్టర్ కార్డు.. కొంచెం తడిచిన చే రుమాలు.. భయం నొక్కిన గొంతు పండుతూ.. హెచ్చరిక లేని అతని పెద్ద కన్ను.. దిగుడు భావి..

చెట్టు నిండుగా పండిన క్యాలెండర్లు … పొగ ముట్టించిన కుర్చీలని జోడించి .. నొప్పి పుట్టిన కథని తిప్పుకొంటూ .. రుణపడిన కేకలని వదిలించుకొని.. రెండో నిడివి పగిలిన అడుగు..చిప్పిల్లిన అడుగు మోడులు.. కీ చరుపు..

శాపిత ఫలం .. దిక్కు మార్చిన గది.. జూమ్ చేసినపుడు .. ఫోకస్ మరో వైపని అలుగుతూ.. మాటలని టచ్ చేసిన చేతి తొడుగుల రుద్దుడిని చేర్చుకొంటూ.. అప్పగింతలు..

కురచగా నిండిన సగం గది.. సగం కెమెరా ట్రాక్స్ … నటిస్తున్స్ దూరంలో అతనికి కాలుతున్న చితి..

ఎవరో కలుసుకోవడానికి లేని ఉద్రేక సముదాయంలో ఉరిమిన శరణు పోలికలు …

ఉండాలని లేకపోతే .. ఇండడానికి లేని తీరకని కప్పుకొని.. తెగ్గొట్టిన సగం షెడ్యూలులో ఇండీసెంట్ ప్రపోసల్ ఉందని .. అమ్మకి విరిగిన కాలు.. మట్టిని దిష్టి తీసి పడవని నమ్ముకొన్నాక .. సుడిలో ఇరుక్కొంది.

దేహ వరదకి అడ్డుకట్టని వేయలేక .. కుమిలిన కంటి సారపు దాహం పోసుకున్న దోసిలో ఉండిపోయిన ఆధార కలతలని జోడించి తమ మంద్రతకి  నిండిన హద్దు ని దగ్గర చేసుకొని.. వివర్శ లేకపోయాక .. వదిలి పెట్టిన రాక పోకడలు చుట్టేసిన నాలికలని పల్చగా గదిలో పేర్చి.. మరోలా పట్టుకొని.. సంజ్ఞలని దగ్గర చేసి నల్లగా దగ్గుతారు. ఆవలించిన  చిటెకలు నానిపోతాయి…

రుణపడి ఉన్నాక .. తీసుకొన్న అడ్వాన్సులు తీరక .. తాను రాలేదని తెలిసిన .. ఇంకా స్టేషన్లోనే.. సొమ్మసిల్లిన జంట రాత్రుల విడబాటులో పడి గుద్దుకొని.. రుద్దుకొన్న సమయ సాయాల కూతవేటు దూరంలో పడి.. స్తూపాల కైపుని దువ్వుకొంటూ.. శ్రమాయ నిడివిని గండి కొట్టిన చావుతో పోల్చి కూలిపోతారు  

నీటి గంట సిద్ధం చేసిన చీకటి పిడుగుని పట్టుకొని.. పూర్తి  చెయ్యని మాటల అడుగున .. తడిమి పట్టుకొన్న నిండు రాశుల ఏక ధ్రువం కలిసిన శిలలు.. నిద్రపొదుగులతో సఫలం కాని కాగడాలు.. ఒంటికి పట్టిన ప్రాప్త మధ్యంలో ఊగిన నిలువు కొండల వంతెన .. పెద్ద శ్రమ తెలియని వణుకుతో హద్దులు చెప్పుకొని నిడివి గీతలు .. తలపోరులు.. ఒంటిపేట రైకలు.. ఇనుప చక్రాల తుప్పు..

వర్ణ ఛాయల ఎడిటింగ్ లో తాను వచ్చి పోయాడని ఆమె విన్నా … తెలియనట్లే ఇగ్నోర్ చేసిన స్వస్థ దీపపు మెలకువలో రాలిన పాదాలు.. సంధి విషణ్ణంలో రెండో మెలికని నులిమి .. గది లాక్ ని తీయక ముందే .. షాట్ రెడీ అని .. అరుపు.. లోపలి నడకలో వికార కుమిలివేత .. సర్దిన కొండల్లో పేటిక .. లైటింగ్ చాలదని అరుపు.. సెకండ్ సెట్ కెమెరాని తోసుకొంటూ..

రంగు కలిపిన ముఖం ఆశీస్సులు కురిపిస్తూ … ధ్యాన ప్రమిదలు రాలిన గుడిలో కడిగిన వాన భోగాలు.. నిడివి రాత్రుల పెద్ద సొనలు నిండిన దుఃఖం.. అతను కనిపించినప్పుడు ఏదేదో రాసుకొంటారు.. బెంగ పడతారు.. ధర్మ వివేచనా చేసి.. వాల్ పోస్టర్ పై ఉమ్ము ఊస్తారు.

ఇక్కడ మరోలా మారారు.. అందరూ అలానే .. ప్రదర్శకి అలవాటై .. శరణు గోషమిని దులిపి .. పైకి లేచిన హద్దుల్లో పడి తేరుకోలేక.. నీలిగిన దర్పపు పెను మంటని కడిగిన దేహ అనుకూలనలో పేరుకున్న ఆయాస సంధిని తాగి.. తూలిన నిద్ర సిరాల కలలు చెక్కిన బొమ్మ .. లోపలకి మోసుకొన్న విశ్రమిత చాటు పోట్లు..

నిమిత్తమానే సంధి పాత్రకి ఎదురు తిరిగే నిండు కలశపు మునకని కప్పుకొని తేలిపోతూ..ఎండ పువ్వుల యేరు.. కదిలే జడలో గుప్పిన నవ్వుతో హద్దుని సాగదీసిన రక్త మరకల విలోలం.. సగం చెప్పుకొని .. ఆరబోసుకొని.. వద్దులే అని సరిపోని మునకల ముట్టడిని జోడిస్తూ .. కణ కణ లాడే వణుకుని తవ్వి తీసి మాట మారుస్తారు. చేతలు బోగీల పడతాయి…

సాపత్యపు సంధి శూలం గుచ్చుకొన్న వీర రశ్మిని తొలచిన పెద్ద గదుల చప్పుడు.. అక్కడెవరో లోప్పలికి తొంగి చూసి .. భయంతో వెళ్ళిపోతారు.

                                                                         ……………………

3.స్టోరీ ఆన్ ట్రాక్

Sampoorna ramayanam … pyasaa … mahanati

Youthfulness … incidental confusions

గడిచిన నిద్ర దోసిలిలో పండిన చీకటి అనినీయ గుర్తుని .. తటపటలాడుతున్న శరీర స్వస్థతని కనిపెట్టిన నలతని పట్టి లేపి.. ఈ నిమేష కరగమోతలో పడి గింజుకు పోయిన నొప్పిని బిగలాగుతూ.. వద్దనోకొన్న సినిమా గుట్టల్లో… రీళ్ళని తెంపుకొని గుట్ట పోసిన పోగల మధ్య .. తన బట్టని సరిచేసి.. గొంతులో పాటని జోకొట్టి.. పులిమిన శ్వాస అడుగుని ముంచి.. దగ్గరైన పెదాల చాయని వడపోసి చూస్తూ..

తనా శిధిలాపు మర్రిచెట్టు దగ్గర పాకలో నాకోసం.. పదునెక్కిన విశ్వాస ఝామునే ఉంచుకొన్న మాటలకి .. రంగు పులిమి నడుస్తూ.. సగం తోరణాలు కట్టిన ఊరు.. ఆ పక్కగా మల్లి.. సంపెంగలు కలిసిన పొదల లాల గుప్పుమంటూ.. రుద్దేసిన కంటి తీరుని గట్టు కట్టి ఆడిస్తూ.. పీల్చుకున్న రుణపు బరువుని జోడించిన గుమ్మంలో పడి ముక్కలై..

తీసి పెట్టుకొన్న నిండు రాళ్ళ కమతంలో పడి పోలికలేని నిద్ర సంపదకి స్పృహ పోగొట్టుకొని.. తాను సినిమాహాల్లోనే.. పార్టీషన్ దగ్గరకి వచ్చి మొదటి లెటర్ ఇచ్చింది.. అప్పటి ఆ ముఖం లో ఓ యజ్ఞ దీపపు వెలుగులో మెరుస్తూ కాలుతున్నట్లుగా దేహం కంపిస్తూ.. నవ్వు.. చావు..దుఃఖ ఎర .. జలపాత నిందని మోసిన శ్వాస శిఖరాల చప్పుడు.. గుప్పిలో ముగ్గిన చెమట వాసనా..

మహా దాహం కూలిన ఒకోపం .. ఉన్మాడి పోటు.. కలకి సహస్త్ర చికిత్సాత … పలన శాపిత పనిగట్టుకొని కలిసిన రోడ్ల కూడలి.. ఎక్కడి నిద్ర జారిన పూనకపు ముట్టడి మోసిన నడక.. ఎటు పోయే .. దేహ నిండా పగులగొట్టిన తరలత గుక్క పెట్టిన నేర్పుని ఊదుకొంటూ.. సగంలో ఉన్నట్లుండి మారిపోయిన సినిమా.. ఎవరూ అడ్డులేరు.. ఇల్లంతా ఖాళీగా ఉంది.. షవర్ లోపల చప్పుడు లేకుండా కురుస్తుంది.. పొయ్యి పై పాయసం మరుగుతుంది.

ఆమె ని గుడిని చూసి.. అక్కడే నిలబడ్డ భర్త నిలదీదతని నేను ఆమెని పడిపోకుండా పట్టుకొన్నప్పుడు చూస్తూ.. పెదాల్లో నల్లని వర్ణ దీర్ఘం తో ఎస్ ఎస్ .. now  the  story  is  on track .. అని అంటూ.. తప్పించుకొంది. తప్పి పోయిన నేను తనకి దొరకాలని .. ఆ గుడి దగ్గరే పడిగాపులు పడుతున్నా…

అనేకం అని నేను చెప్పుకొన్న ఏకంలో పడి తలకిందులు చేసిన నోటి మాటని కరగబెట్టి.. ఒద్దిక లేని నిరాదీక్షకి చేరవేసిన అడుగుని దాచుకొంటూ.. రుణ దీపపు సంతృప్తంలో పగిలిన ఆందోళన మోసిన సీసాల మడి .. సలాస ఆర్తన గుబులు పడి గడ్డ కట్టి.. ఒళ్ళయినా తుడుచుకోక పరుగులు పెడుతూ.. కెరటాలు మోసి ఊపుతున్న పడవలో.. మంచం   చుట్టూ ఆ పెద్ద చేపలు ఈదుతున్న కుదుపు…

కదిలేది నేనే.. కదిలించేది తాను.. నిశ్వాస అనుగ్రహపు గ్రహం ఒళ్ళు విరిచిన చాటుమాటు తలుపుల వెనుక శీర్శ్య దీపం దాచుకొన్న పెట్టె లోంచి మహా శబ్దం .. శూన్యం పేర్చిన చితి.. పరంపరతకి రెండో భుజం ఇచ్చిన కంటి చూపుని రాజేసుకొంటూ.. ఈ చీకటిని నువ్వు ఒప్పుకోలేవా ? అని బతిమాలి.. కలబెట్టిన కూర్పులని వదులుకొని.. ఇష్టం పట్టేసిన తేనె తుట్ట కదిలాక .. తీపి ముగ్గిన దేహ నీరుతో దాహం మరుగుతూ..

నిషారూపక ఆవర్తనంలో కన్ను కడిగిన హద్దుని పట్టుకొని.. జోడించిన అణుకువని పాడక ముందే … ఇంకేం తెలుసుకోవడానికి లేదని వదిలిపెడతారా? పెట్టినా పెట్టక పోయిన సండ్ర భూమి కూటమిని తిప్పి రాసుకున్న .. ఇహిత రాపాడింపుని వదులుకొని.. పుట్టు కథల బాగంలో కదిలిన అరుపులకి కూరుకొంటూ .. వివిధపు పూనక నిలువు కెరటం పట్టుకొన ఛాతీల గుట్టలో..

అంతా తీరికలేని గడుసు స్థావరంలో పడి ముక్కలని కలుపుకొంటూ.. శేష భూమి నిర్వికల్వపు రంగుని దిష్టి తీసి .. పగటి చెమ్మతో నవ్వుతూ.. దేహం ఇంతకంటే ఏం చెప్పదని మసక రేవులో సిగ్గుపడి.. మళ్ళీ కావాలా? అన్నప్పుడు .. మళ్ళీ కాలే దైర్యం లేదన్నప్పుడు ..ఆమె గుక్కపెట్టడం ఇప్పటికీ ఆ సినిమా తెర పై వినిపిస్తూనే ఉంది. దట్టమైన పోగల మధ్య రానుగులు మార్చుకొంటూ కనిపిస్తూనే ఉంది.

పురుష శత్రువు పట్టిన నిందని తోడుకొని .. వివరం లేని దేహ సంధిని కరగబెట్టి.. కలిసిన భార వాకిలి నిర్వాణం లో కలిసిన కరుకు చలికి ముడుచుకున్న తెరలని తీర్చి .. బొమ్మలు మాట్లాడటం మొదలయ్యాక .. అది నువ్వే అన్నప్పుడు ఆమె ఒప్పుకోలేదు.

ఐతే నే వెళ్లిపోనా?  అంటే .. చూసిన ఆ చూపు ఇప్పటికీ పచ్చిగా గుచ్చుకొంటూనే ఉంది. సరళ దేహంలో నెమ్ముడి .. పెదవి చీల్చిన గది పడగని కాటేసి.. రంగు తెరల ఊపు .. అక్కడ నిలబడి ప్రాణ దీక్షని వదిలినప్పుడు.. జనం సీట్లోంచి లేచినా .. తాను అలానే ఉండిపోయింది.. తెల్లార్లూ   అక్కడే ..చీకటి పట్టుకొన్న ఎడారి చెట్టు నిండుగా .. నిద్ర కాచిన గబ్బిలాల శ్వాస చప్పుడు చెవుల్లో దిగబడితే.. తనేం ఆందో ఇప్పటికీ తెలియడం లేదు.

ఆయాస రాట్నం తిప్పిన నూలు నవ్వుతో .. బట్టని విడిచి స్నానపు గదిలోకి వెళ్తూ.. వెనక్కి చూసి వస్తావా ? అన్నట్లు సైగ చేసింది.. నేను తల ఎత్తడానికి మొహమాట పడుతున్నాయని .. లైట్ ఆర్పీ.. నల్ల నవ్వుని నా ఒళ్ళంతా పులిమి.. కలలోకి పంపి స్నానం చేయించింది.. గడవడానికి మరో చోటు లేని లోయల మధ్య ఊరేగే సంధాన రాత్రపు నివేళత.. ఇతమిద్ధం కానీయని  స్వర లోలతని గుప్పిన గోడల మధ్య తిరుగాడే .. కల దోషం .. నిద్రని కూల్చి .. పేరుకున్న ధూళి కొండల లోపల గొడుగు పట్టి నడుస్తూ.

నేను నవ్వుకొని.. now  the  story is  on track అనుకొన్నా..

ఆ ఇంట్లో నేనొక మంచంలానో.. బొమ్మలానో.. కిటికీ లానో అతుక్కుపోవాలని.. ఆ దారి మళ్ళీ మళ్ళీ పోతూ.. హాద్దులని దాటి నవ్వాలని… దేహ బిక్షగా ఉండిపోయిన పునాదులని పట్టుకొని..కరిగిన మంచు గూడులో చిదిగి .. నది పై పర్చుకోవాలని.. శంఖాల గోడకి అద్దిన చీకటి కలలు నీరు పట్టి అరుస్తూ.. పేట్రేగిన నల్ల జిగురు చెట్ల దగ్గర మంటని సిద్ధం చేశారు.

కానీ సృష్టి నిరాదరణ సామాన్యమనీ.. అక్కడే ఏ కొంచెం సానుకూలం లేని నిద్ర దేహపు రంగుని దులుపుకొని.. నిష్ఠ రాతని కప్పుకోవాలని… విడిగా .. తడి రేవుల కలతని దాచిపెట్టి .. కంట్లో చేరదీసిన అభయ నిడివిని చిక్కుకొని.. జత చేసిన కునుకుని చల్లారబెట్టి .. ఒదిగిన రాత్రి తెరలు..

కన్ను  జత  చేయని  నేరం.. సినిమా తెర మీద .. లైట్లు ఆపి .. టైటిల్స్ ఐపోయాక వాడు పరిగెడుతూ.. అందరినీ చంపేశారు.. వాడో ఓడలో సామాన్ల మధ్య దాక్కొని.. ముంబై చేరి .. నేర సామ్రాజ్య చక్రవర్తిగా … అంతలోనే అంతా ఐపోయాక .. మేకప్ కడుక్కొన్న సినిమా హాలు.. నిర్మిత కథని మళ్ళీ తెచ్చుకోవాలని .. రాత్రి సముద్రంలో దూరి తపస్సు చేస్తూ..

అక్కడ తలుపు బిగించి.. ఆమె నవ్వుని పులిమిన కాసిన్ని నీళ్లు.. వాడు తాగి తూలి.. పట్టుకొని.. ఉరిమి చూసి.. ప్రతిన పూని … ఏవో ప్లాస్టిక్ ముప్పులు… సరిచేసుకోలేని దేహ సందడి కూర్చిన నడకని జోడించి.. హద్దులు దాటినా కబురుని చేర్చుకొని.. ఇరుక్కు పోయిన చలన గర్హతని తొడుక్కున్న భయం పట్టిన రాకలతో..

కానీ తాను తీసుకెళ్లి .. ఆ టూరింగ్ టాకీస్ చీకట్లో .. బఠాణీలు తింటూ… మట్టి  జాడీల్లో   సినిమా  .. లాంతర్లోంచి దూసుకొచ్చిన మల్లె పూల పరిమళం.. సత్తర పడుతున్న నిద్ర కావెడ ని దించుకొని.. ఇబ్బంది పగిలిన సంచీలని విసిరి.. ఇక చాల్లే వేషాలని.. ముద్దుగా కోప్పడ్డాకా .. చేతిని వదిలేస్తూ..

గబ గబా జత చేసుకొన్న ఒప్పంద నిద్రల మధ్య కల కూరుకిపోయి.. నిరా పలపు ముద్దలని చుట్టి ముఖాలని దాచుకొంటారు. అక్కడకి దగ్గర చేసిన కోపపు దొంగ మాటలని చల్లారబెట్టి .. ఋణం పట్టుకొన్న ఆవిరి గుండాల్లో పడి తల మునకలు తీరుని సెగలకు చేర్చి.. పడిపోయిన నడకతో .. జీర పట్టిన వాన గదులు

ఉబ్బరించిన నవ్వు తెరలు మోసిన కాగడాలు.. గంటలు కూలిన లోయలో పెనుభారపు పల్లకీలని.. నదిని ముంచేసిన పడవని దాచుకొని.. ఇసుక కమ్మిన గట్టుని తెరల్లో పట్టిన కొండలు.. అవశేష గారడీలని తట్టుకొని.. ఇంకిపోయిన కంటి రాతని తుడిచిన బరువు మాటలతో.. అన్నం వడ్డించి.. కప్పిన నీటి కెరటాల రంగులో పడి తడుస్తూ.. వదలని కెమెరా లోపలికి  పోతూ..

హఠాత్తుగా మండిన సముద్ర దారులతో పండిన చెలగాటపు కెరటాలని.. ఉప్పు సంచీలతో గట్టుని.. పేరుకు పోయిన చీకటితో ఋణం పట్టేసిన గొంతులు..

ఇహిత కన్నుని … తీవ్రతని పట్టుకొన్న నియాగ్రతని పెనవేసుకున్న హద్దుని .. తాండవతో.. యత్న బరువు కొత్తడితో.. ఇంగిత చలనతో పట్టుకొన్న దృవ సత్తువలా ఉండిపోయిన … కూలడి పోయిన నర్మ దర్భపు ఆయాస సన్నాహపు పొడుచుకొస్తున్న హడావుడిని సాగదీసి.. కన్ను గడపని దులిపిన మోసపు సాయుజ్యంలో పడి రంగు మార్చిన కాళ్ళు.

చల్లారిపోయిన నిద్ర బరువుతో.. తగలబడిన నిందల గుట్టుని కుదిపి.. పక్కగా ఉండిపోయిన దేహస్థితి కంపరాలని కడిగి.. మసిపూసిన కలతని పట్టుకొని ఊపుతూ.. హెచ్చరికకి పట్టుకొన్న స్థిమిత పట్టుని దులిపి కన్ను మాసిన జాడీల్లో సినిమా .. లైట్లు వేసే వరకు వద్దు.. ముందే బయటకు వెళ్ళిపోదాం.. ఏముంది క్లైమాక్స్ .. ఇద్దరూ పై నుంచి దూకేస్తారంతే..

ఎవరమూ అనుకోలేదు.. ఇది ఇలా మాత్రమే దగ్గరగా నడిచి .. లోపలి ఒదిగి .. కళ్ళలో కూర్చుకొన్న శబ్ద మిగులుని తాగుతుందని.. వెలిసిపోయిన గొంతు మంటతో.. కదిలే నిద్ర ధమనుల కట్టడి ఆవహించిన పోటమి మంగళ నీరు పాకిన చేదు మబ్బుల గుండం..నెమ్ము చేసిన మత్తులో పడి.. కల పైకి చేర్చిన ఝాము పంపకాలు కొంత చప్పుడు చేసి.. చీరుకు పోయిన ఉరుముని పట్టుకొని.. మధ్యలో చేరిపోతాయి.

సంధి భ్రమణత చెప్పుకొన్న నడక రాత్రుల గుడి కథలో సంతర్పణ మొదలైంది.. నేనింకా ఆ చివర తాను రావడానికే .. షాట్ రెడీ చేసి మేకప్ రూంలో ఎదురుచూస్తున్నాను. తను ఆ డ్రెస్ వేసుకోనని .. కిటికీలోంచి చీరని అడుగుతుంది.. అదెలా .. ఊపిరి వదిలేసిన బట్ట .. శ్వాస నింపిన కథలోకి రాగలుగుతుంది.

బయటకి కనపడని .. చిందరవందర నిద్రపోరులని సినిమా చేసి .. తను చూసేసానని కొత్తగా చెప్పి .. కలని కడిగిన నీళ్లతో సినిమా హాలుని నింపి.. బయట తాళం వేస్తుంది.

రుణ ఋతువు కాల్చిన అధోగమాల పై కొసలని సరి చేస్తూ.. ఆకలిప్త అసహన నిజాలు… పోల్చి చూసిన వెనక తలుపుల దగ్గర చిలుము పట్టిన నదిని ఊడదీసి.. ఇంకిపోయిన సాధారణ దొరికివేతలని పులబెట్టి.. గొంతులో కూరుకుపోతారు.

సరి చెయ్యని చీకటి సర్దుబాటుని కొరికి వేసిన నిద్ర గానుగులని మసి చేస్తూ.. ఇంకిపోయిన కథల నివ్వెరపాటుని కాపాడుకొనే సంస్పర … ఆ స్క్రిప్ట్ లాక్ ఐపోయిందని ఏడుస్తూ .. స్వయం సేవన ఖాళీలని దాటి .. వెనక్కి చేరిన కౌగిలిలో పాడుబడిన రస శిల్పాలని వదిలిపోదామంటారు.

ఏదీ తిరిగి కనబడని నిద్ర దేహిత అవస్థలని కదిలించి .. చేరుకోలేని సమయ నిగారపు ఓటమిని దాటి .. చేర్చుకొన్న మత్తు ఊడల పెడసరపు చీకటి చర్యలై… అలవాటు లేని దేహ సమాధికి చేర్చిన నిబద్ధ అనుకూలనాలు..

కిందికి చేర్చిన మనుగడలు.. పెద్ద నిద్రల కదలికనే కనిపెట్టి.. ఉనికి చేర్చిన ఝాము మండలపు కసిని నూరుతూ… హెచ్చరిక లేని గది పసిరికాల ఎద్దడి రాత్రుల అయోమయం.. చేరవేసుకొన్న తెగదెంపులుతో రంగు మార్చిన చూపుని అక్కడ బ్యాక్ గ్రౌండ్ తెరలకి కట్టి .. will  correct  it  on  CG ‘S  … అంటారు

తోడు లేని అపరిచిత సాయాలని వదులుకొని … అవధికి మోసిన కంటి పోటుని చల్లారబెట్టి … నిండు మేకప్ తో  తన ఎక్స్ప్రెషన్స్ ని దాచి .. దూరంలో ఆగిపోయిన మాటలు.. కొంచెం చెమ్మ .. పొగబారిన గొంతు నిండుగా చేర్చిన కసి పోతలు.. దృవ తర్జుమాల ఏక భయం మోసిన చావు.

ఉబికిన అనుమానపు పొద్దునే కదిలించి .. చీరుకు పోయిన సాద్య చెక్కుడుని కలిపి చుట్టిన అడుగులు..

వదిలి వెళ్ళిపోతారు.. హాలుని ఎవరో మూసేసి వెళ్ళిపోతారు.. ఆ రాత్రి హఠాత్తుగా మొదలైన కంగారులో   .. వెళ్లి చూసుకొన్న గది రొమ్ములని పిండి .. శ్వాస వడ్డించాక .. చెల్లిపోయిన పునాదుల బయట .. ఒరిసి పోయిన డ్రామాలు…. ద్రావిత సాంబ్రాణీ పొద్దుల్లో గడిచిన అలార రొప్పుకి .. తల్లాడిన కథల పీడన….

సాగిపోయిన చీకటి రుణపు పీడనలని గద్దించి.. అనులోమ తచ్చరిత చలన ఒరిగిన కట్టడి..  ఆ కథని అలాగే ఉంచుదాం .. కదిపితే .. నిస్సంశయ నిద్ర రూపకాలని జోడించిన భయం నాలోపల గడ్డకట్టి మాటని తప్పిస్తుంది. అక్కడ కాస్త తొట్రుపడిన నివర్శ సరి చాయింపులు….

మెత్తని అడుగులతో .. నల్లని గదిలో తోడుగా నిల్చిన మాట చేర్చుకొని చనిపోక ముందే .. కనబడే శ్రమ సర్దుబాటులో పిండుకొన్న చెమటల బట్టని దులిపి .. సాగిలపడ్డ దూరంలో ఋణం తప్పిన కదలికనే చేర్చి.. పిండేసుకొన్న ఆయుర్ధాల కంటి సారం పిండిన దుఃఖపు పొడిని అద్దుకొని .. ఎక్కడిదో తెలియని నిద్ర రసాయనపు గాఢతని తీర్చిన హద్దులే కైపు..

పసిగట్టిన సంధి చేసుకొన్న నిద్ర తానుల కల్లాపం సర్దుకోబడి … నిస్త్రీత గతి రాల్చిన వేడుక చనిపోయిన చీకటిలో పడి .. పారబోసుకొన్న నిందలని ఏకరువుపెడుతూ… తేరుకోలేని నిద్ర సమాధులని తవ్వి.. దూరం చేసుకొన్న ఆశ్రిత తర్జుమాల గుట్టలో పడి.. కన్ను చనిపోయిన నాజూకు విపత్తులో కలిసిన మొహమాట ధ్వనులు..

డైలాగ్ స్ట్రక్చర్ ని ఎవరో కామెంట్ చేసి .. నల్లగా నవ్వుకొని.. కనిపించకుండా పోతారు. dubbingకి సిద్ధబడ్డ రూమ్ లో ఉక్కబోసిన శ్వాసకి చేర్చి తాళం పెట్టిన చావు .. కీచుమని అరిచి .. ఇక ఉందాములే ..అని  అనుకోకముందే ..సవ్వడికి తానులని చుట్టి కాపుగాసారు. వద్దులే అనుకొంటూ చాటుగా కదలలేకపోతున్నారు.

నిర్లక్ష గంభీరంగా సంధి చేసుకొన్న ఎడమ కంటిని పూడ్చి.. కప్పిన రుణ పొడిని దులిపిన నిష్కర్ష మండలంలో పోసుకున్న స్నానపు పడవల గొంతుని ఎత్తిపట్టి.. విస్మితః సానునయ లేని దేహ వికర్ష చిత్ర సానునతని పట్టుకొని.. కొల్చిన గోడల మధ్య కదలాడే ఆకలిప్త సహనం మోసిన కంటి ద్రోణుల్లో పొసిగిన మంట.. సగం పారబోసిన  నిండు గదులు..

వాళ్ళు దానికి సిద్ధమవడమే ఇక్కడ ఊపిరికి పట్టేసిన మలుపు.. పెద్ద కొండల కంటికి రుద్దిన శ్రమ జోగిలిలో పేరుకున్న పాత చీకటి వాసన.. కలిసిన కాల్పుల్లో మోగిన తూఫాన్… ఇతమిద్దంగా ఇదీ అని చెప్పలేని ..జ్ఞాన భాషణ .. కదిలే భయం పోతపోసిన నిరాకార పుట్టుకకి రెండో శాప ముంపునీ అంటగట్టిన నెలలని దిద్దుకొంటూ.. తేరుకోలేని నిష్పూజ మనుగడలు తెల్లార్లు వారించి పెట్టుకొన్న తెరల వెనక కన్ను తెరవని కెమెరా వినిపించని వెక్కిళ్ళతో..

నివ్వెరపాటుతో  ఏదీ తొలిగిపోదు.. కడబెట్టిన అంటు రంగులు దులుపుకొన్న సన్నుడి పూరింపులని సెగబెట్టి.. ఇసుక చుట్టిన ఋణం పాతుకొన్న నిడివిని సాగదీసి.. ఉన్నప్పుడు తెలియని నలతల కటువు రాతని స్తంభాలపై చెక్కి.. అక్కడ తెలిసినట్లే నడుస్తారు.

విరిగిన కుర్చీలు.. దళసరి కంటి అద్దాలు.. మోసుకు తిరిగే సంతః నిద్ర చావాడీలని దాటుకొంటూ .. కన్ను కుట్టిన దేహ పూనకపు విపులతని ఎండకట్టిన నెమరువేతలో … మళ్ళీ నటన నేర్చుకొని వస్తావాని? అడుగుతారు. విసిగి విసిరిన ఇంటి తాళాలు తవ్వుకొని .. చెరువు అప్పుడే శ్వాస ఎరుకతో ఎండిపోయింది.

బోర్లించిన నడకని దాటుకొని.. ఇంకిపోయిన చావు చెరుపుని అద్ది తీసిన దోసిలి మధ్యలో చోటు దొరకని నిశ్వాస అంగీకారం వదిలిన ఇంటిని తల్చుకొంటారు.. వేలాడబడుతున్న చీకటి అవశేష నిద్రలేని కూల్చుకొని.. ఇరుకైన శ్వాస సమయాల కరుకు ముద్దల గుప్పెటలో … సాధ్య స్థిరం కానీ నిస్సత్తు ఊపుని పట్టుకొని… సగం చనిపోయిన భాషణకి లేవదీసుకొన్న నిద్ర నైవేద్య పరి పూర్తి ముఖాలు..

నిలబడటం మొదలై.. కథ తెలియని రెండో షెడ్యూల్ ని తొందర చేసాక .. రుణ వికారపు సాధ్యతకి నిట్టూర్పు మొక్కిన గడీలని జోడించే ఎత్తుగడనే కుదిపి.. ఆవహించిన కునుకుతో తోడుని అడుగుతారు. బట్టలుగా.. మేకప్ లుగా  కొన్ని స్కెచెస్ చూపించిన … ఇంకేదో ఉరిమిందని.. కమిట్మెంట్ కి  క్యారవాన్ కొంచెం తొణికిసలాడిందని… లోపల నుంచి తీపిగాలి చేమ్పాలని కొట్టిందని .. ఎకసెక్కంగా చెప్పుకొంటారు.అద్దిపోయిన నటనలకి రాత్రి దుమారం బిగించిన కొలతలతో స్క్రిప్ట్ మారిపోయాక .. నిందలని మీదేసుకొని.. విచలిత పోడు భూమిలో సాగు మొదలుపెడతారు.

అక్కడ షూటింగ్ కి లైటింగ్ చేయలేమని … రౌండ్ ట్రాలీ వేయకుండా ఆ షాట్ తీయలేమని .. చెప్పీ చెప్పక ముందే .. పైనుంచి ఎవరో దూకడం చూసి.. we  are  bit  delayed అని పెదవి విరుస్తారు. అక్కడ పగిలిన గాజు కొండలో ఆమె దేహ సానువుల గుర్తుని పోల్చుకొని.. నానా కథలు అల్లి .. స్క్రిప్టులతో వెంటపడతారు.

ఉండిపోవడానికి లేని పెద్ద గదిలో .. ఓ గోడ కూల్చి .. కెమెరాని బిగించారు.. ఏడవడానికి ఎవరూ సిద్ధంగా లేరని.. పాట నిల్చిపోయిన కటిక చీకటి నివేదింపు అనుసరణ వాకిలో .. కూరుకు పోయిన చెట్లు.. కథ మారిపోయింది. లిపిన ఆవేశ తలుపుల ఉన్నప్పుడే గాజు నవ్వుల ధూపం కమ్మిన నల్ల పొగతో..తూర్పు వీధుల సెట్ ని మధ్య లోంచి ఓపెన్ చేసి.. నాకిదే తీర్మానం అని చెప్పుకు తిరుగుతారు.

కనడానికి లేని విడి విడి నిషాల వరదని దట్టించి … చేరుకొన్న గొలుసులు బిగిసిన ఋణం పాకుతున్న సర్దుడి.. ఏక భ్రంశ నిక్షేపపు నిడివిని కాదని .. చేరదీసిన చూపుని విడదీసిన ఆత్రమేయ గర్జన కాల్చిన .. శేష ఆర్జన కాదనుకున్న విడి కష్టాల కవ్వింత.. కదిలే నిద్ర రాళ్ళ జోడింపు… నేను వెళ్లిపోవడానికి ఇక్కడి మాటలని తోడి పెట్టుకొంటాను.. జ్వర మండల దుమారం ఊరేగి చిత్ర సానుకూలతకు పోల్చిన హద్దుని పోసుకొని.. గొలుసులు తెంచుకొంటాను.

అక్కడే చిక్కడు పోయిన సత్య తీర్మాన దర్శనకి మోసి తెచ్చుకొన్న కుదింపులని .. దాటి పోయిన కాటుక రేవుల్లో పేరుకున్న నటన… వద్దనుకుని వదిలేసిన సగం ధూళిని పట్టించిన గొంతు దడలు… గుప్పెటలో కన్నుని చిదిగి.. పాకిన నల్ల చెమట గోడ మీదకి పడుతూ.. హెచ్చరించిన నుదిటి మీటని తొక్కి .. చల్లబడిన సత్వ దూరపు ధూపంలో మోసి తెచ్చుకొన్న వరదలు..

ఆ క్లబ్ లో .. గ్లాసులు .. సీసాలు పగిలి.. చైరడానికి లేని బట్టతో తాను పరుగులు పెట్టాకా .. పెద్ద మర్రి చెట్టు కాలు పెట్టి.. పొద్దుకల్లా స్మశానమై .. కాలు తెగిపడ్డ ఊపిరి అడ్డాలో పడదోసుకున్న విలోల మూర్తి పంపకాలు. అదే నా స్టేజి .. మేకప్ లేని ఎద్దు గంటలతో.. బైక్ రైడింగ్.. ఏడ్చిన సీసాల సమయ భోగపు పట్టుని ఆరబెట్టి.. ఎటూ సర్దుకోలేని వేసట ఋణం పట్టి తీసుకొన్న అడుగులని  అల్లి… అలుముకున్న నిరాధార రుంజన కాల్చిన షూటింగ్ స్పాట్లు.

ఆగి అటు చూసినపుడు మొదలైన పొడి గొంతుల గర గ ర ని రాపాడిస్తూ.. కంట్లో నులిమి పెట్టుకొన్న దేహ సగపు మండల ద్రవంలో పడి .. తాడు తెగిన నిప్పు ఊటల పళ్లెంలో .. పూత పట్టిన చీకటి నివేళ చిత్రిత కడుగు రాతల్ని పాతుకు పోయిన శరణు అంపకాల మొండితనం raw footages గా చుట్టి…..

వదిలేయమనడానికి నేనెవరిని?

ఆ గుడిని ఏటవాలుగా పెట్టి.. నలత పట్టిన కాలువలని సరి చేయక కప్పి.. గట్టు తెంపిన వణుకుని బట్ట చుట్టి పట్టుకొని… ఆయాస ముప్పెన కట్టుకొన్న దోసిలి పండుతూ.. చెదిరి పోయిన నియాస సాధ్యపు కలతడిలో ఊపిన దోష పూరిత కవ్వెరపాటుని కలిపి .. వేరు చేసిన గుంజులాటని పులిమిన కన్నుతో.. తోడి పెట్టిన చీకటి ఉరుముని కాలచుకొంటూ.. రుణ పడ్డ నిశానీ తురుములని పోగుచేసి.. సరిపెట్టుకున్న గ్రహణ నివురుల నలత… అంటిపెట్టుకొన్న నిద్రలని గ్లాసులో కలిపి నోటికి ఇస్తారు..

వాన కలుపులు… కూడ బెట్టుకొన్న సంచీలో పడి.. మొలకలు లేచిన చీకటి నివ్వెరపాటుని సరి చేసిన నిన్నకీ  వినలేని పాటకీ.. నటన వాల్చిన చీకటి దుప్పట్లో వెలిగే కొవ్వొత్తిని దాచి.. గోడలపై పాములు పేనుకొన్న తీరని మింగాక .. నల్లని బుసల చూపులతో.. బిట్లు ఉంటాయేలే .. అని పక్కవాడికి భరోసా ఇచ్చాక.. ఆమె గొంతుకి చిల్లుపడి నల్లని జిగురు రక్తం..

రొమ్ము పగిలిన గదిలో ఏడుస్తూ.. స్నాన చంద్రుడు ఉరిపోసుకొన్న వానని తవ్వి.. balcony లోంచి దూకి లోపలి వచ్చేసరికి.. గాజు ద్రవం పోటుపెట్టిన కడుపులో పోటుకి .. శరీర నిత్యతని తాగిన శాప గిన్నెలో తోడు పెట్టని చీకటి బూజు పట్టి.. కలిసిన ఇరుకు నాడులు మెలితిరిగి..

ఆయుస్సు చేరుకొన్న నిఘారమిత సంధి స్నానం మెలిక పట్టిన దశల నిండా .. సుడిలో చిక్కిన పల్చని నిండురాతని తుడిచి.. దుఃఖ శిధిలం కూర్చి పెట్టిన ఆవిరి కొండల్లో గుబులుని అద్దిన కేక. అరుపు వేలాడుతున్న దూరంలో .. స్టార్ట్ కెమెరా .. ఆక్షన్ .. అనగానే ..డ్ తుష్టి మంత్రపు తూగుని నేసిన మధ్య కూర్పులో.. కథని మళ్ళీ చేరుకొని .. కొంత కట్ చేసి.. ట్రిమ్ చేసిన శ్వాసలని చేరుకొని.. తలపండిన సిగ్గుతో ముడుచుకుపోతారు. … ఆగి పొమ్మన్న హంతకుడు

గుర్తు పట్టే చూపుకి కన్నుని విడదీసి.. గొంతులో కోరిన గంధకపు మంటని కార్చిన నీరెండ నడక .. తనతో ఉన్నప్పుడు వేరే గుడిని వెదికే పనిలేదని వాళ్ళు తికమకలు పడి చెప్పుకొంటారు. గండి కొట్టిన నది నుంచి బయట పడిన పడవ గుడి ముందుకు చేరుకొని.. గంట మోగిస్తుంది.

ఏకం చేసుకొన్న భయం ఒక్కసారిగా సాగి.. అరమరికలు లేని చీకటి సవ్వరాలు పోసుకున్న నీహార  మాదకపు దోసిలిలో పేరుకున్న నాలికలని అరగదీసి.. కొత్త కథని తెచ్చుకోమంటారు. ట్విస్టులు .. ఇంటర్వెల్ బాంగ్ లు అదిరిపోవాలి.. మాక్సిమం ఎలేవేషన్స్ పడితే స్క్రిప్ట్ లేస్తుందని  చెప్పి పంపిస్తూ..

నాలో నడిచి వస్తున్నది ఇదే కథ కదా? అంటే .. గార పట్టిన నవ్వుతో.. గోడలపై అప్పుడే మొలిచిన కోరలు చూపించి.. తలుపు తెరుస్తారు. కొన్ని వెదికి మరెవరికో చెప్పి.. ఇల్లుని మార్చి పెట్టుకొన్న చీకటి నదిలో కూరుకు పోయిన అలముడి దేహ కోతకి చెమర్చిన మట్టి పోటుని సరిచేసి..

కొండల్లో కాలిన సంతర్ప ఎంగిలిని .. గదిలో ఊరబెట్టి.. పూనకాలు

తాను ముందే చెప్పింది.. వదలడం నేర్చుకోవాలని… ఎప్పటికీ అదే సత్య స్థాపనని చేసుకొన్న పెద్ద బజారులో చప్పుడుని కాసుకొని.. షూటింగ్ కి రెడీ చెయ్యగలదు. అక్కడి జనమే సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తారనగానే  .. ఎగబడి నులిమేసి బజారుని చంపేసాక .. వాడు packup  అంటాడు.

ఉండిపోదాం .. బులిపించుకొన్న మంత్రం తాకిడీలు.. కొరడా తగిలిన నిద్ర ఊర్పుల కట్టడికి .. తాడూ బొంగరం లేని మాటలని అద్ది.. ఇంటి బయటనే స్క్రిప్ట్ ని పాతి పెట్టి పైన చలిమంట వేసుకొని రాత్రంతా గడిపినప్పుడు.. స్క్రిప్ట్ తనుగా మారి వణికే రక్తం చేతులతో అతనిలోకి చూస్తూ…  ఆ నిర్మాతని చంపేస్సానులే? అంటుంది..

ఇలా ఎలా అర్ధమైందనుకొన్న.. అదేగా అని.. లోపలెక్కడో పీకులాట..

మంచు కలుపులు తీసుకొన్న పైన గొడుగు .. తెల్లబడి.. తాను మరింత దగ్గరగా కనిపించేలోపు.. ఇంకెవరూ రారులే .. బాడీ ని మూవ్ చేద్దామంటారు. అక్కడ కొంచెం నినతకి రాల్చిన దేహ ఇగురుని ఇంకా ఇగబెట్టాక .. మోగిన నిద్ర దోషిత చిలికితని రాజేసి.. కొత్త మాటలతో తిరిగి కనిపిస్తామంటారు..

నీ ఎక్సపెరిమెంట్లు .. నీ ఇంట్లో నీ డబ్బుతో చేసుకో.. స్ట్రాంగ్ ఎలెమెంట్స్ తో ముందుకి వెళదాం .. పనిగట్టుకొని.. మాటలని వదులుకొని.. జోడించిన బెంగల కింద కుమిలే వాడిని.. ఇక్కడే వదిలేసి పోతే మంచిది.. నాకిక ఓపిక లేదు.. వికార మంటతో కదిలిన దేహ సాక్షి తల పెట్టిన గ్రహణ మధ్యంలో పడి .. కెరటాలని తోడుకొని.. అదే ఆలోచన చనిపోయిన కంగారు.

వీడు అప్డేట్ లేదు.. లేదా వీడి ఆలోచనలు ఇప్పట్లో ఎవడికీ అందేట్లు లేవు.. ఈ సంత నీకెందుకు.. నే ఫామిలీ సర్వైవల్ నీకు ముఖ్యం.. దుఃఖం వడపోసిన తెరలని లాక్కొని.. అతనిని వెళ్లగొట్టిన హాలులో .. ఊది పోయిన మరకల చీకట్లో కలిసిపోయిన నిరాధార ముంపులు..

సరళ నిద్ర పగులగొట్టిన ఊపులు.. కానీ ఇంట్లోచి ఆమె ఎటూ పోవడం లేదు.. కప్పుకున్న కోపం చించుకొని.. ఇగిరినా రుణ బరువుని తోడుకొన్న సిగ్గుతో..పులిమిన చీకటి బజారులో .. కొంత కథని పట్టుకొని .. ఆశ చావక తిరిగినా … హద్దుల్ని ఎవరూ అనుకోని కాల్చరు. చెంపల్లోకి చేర్చిన జోడు మాటల మెలికని చుట్టుకొని.. సగం తెరిచిన దేహ వాహీకరణ చిద్రతకి నీరు పట్టిన కలయికనే మోసి.. పగల గొట్టిన హద్దుల వెంట కన్ను సాగదీసిన మలుపు..

సగం తెర్చుకొన్న దుఃఖ మతి.. పెద్ద భోగపు నిండు పూతలని మెత్తి .. జోడించిన అవకా తవక నిండు రాతల్ని వదులుకొని… జిల పెట్టిన కప్పుడు కొండలని దాపున పెట్టుకొని.. సరి చెయ్యని సగం పాత్రలు… అవి అలాగే ఉండటం కరెక్ట్ అని ఏడ్చిన పాత్రల చుట్టూ అతని ఇల్లు నిండిపోయాక .. కోలుకోలేని ముద్ద గొంతుల సెగని ఎగదోస్తూ.. అలుపు.. పక్కకి జారిన మృత్యు పుటారపు కంటిని కోసి .. తడబాటు లేని శరీర దీపం దగ దగ లాడుతూ.. చేతుల్లో పండిన కూల్చివేతలని కనిపెట్టి .. సర్దుకోలేని పునాదులని తెగ్గొట్టి .. తోసిపారేసిన చీకటి మొలుచుకొంటూ అతనిపైకి ఒరుగుతూ …

ఇదొక సంయోగ భూమికి పట్టిన నలతగా .. పనిగట్టుకొని ఊడిపోయిన పూడికలు .. నిత్సర తత్తరపాటుతో పులిమిన ముఖాలని దాటుకొని … దుఃఖ చితి.. సంధ్యారికి సమసిన రక్త ధూపపు మసిలినా ఉండిపోని … సార్ధక నిండిపోతలని కనిపెట్టుకొని చెంపలకి చేర్చిన సమయపు సూటిపోటి రంగుల అద్దకం … పోతపోసిన దృష్టి నియార్షపు పట్టింపులని దాచి పెట్టిన మధింపు…

ఐతే ఇప్పుడేం చెయ్యాలనే .. అలుపు రాలతని అరగదీసి.. చెప్పిందే చెప్పుకొంటూ.. దీర్ఘ వశీకరణ మోసుకొన్న తెరిపిడి నూగుని దులిపి.. నస పెట్టిన శరీర కూర్పుని సరిచేసి.. ఉన్నప్పుడే సర్దుకొన్నా సంచీలో … ఇంకా కొంచెం శ్వాస చావని బరువుతో.. గది తలుపు బిగించుకొని.. ఆర్ద్ర సంధ్యారి … సాధ్య నిర్మిత శకునాలని మోసుకొని.. సెగ ధూళిని ఎగరేసి.. రుణ భావిని నింపుకొని.. శరీర నిడివిని సాగదీసుకొని.. అపురూపక నిశ్చలని దుమ్మెత్తిపోస్తూ.. చెరి సగపు చీకటి అలికిడికి గొంతు పోసిన పుట్టుకలు..

సరిపడని  నిండు తొణికిస లాలతని అద్దుకొంటూ.. తేరుకోలేని నిద్ర భూమి కునుకుని చీరలుగా ఆరబోసుకొని.. జోడించిన కన్నులో పడిన వాన గొడుగులా వంతుని సరిచేసి..కూల్చొకొన్న చెట్ల మడుగులో లోపల కూర్చొని .. బలంగా నవ్వుకొని.. స్క్రిప్ట్ అక్కడే వదిలి.. ఈ రాత్రికి కలలో నీకు పంచుతాలే… కంటిని కలపకుండా నవ్వుతూ.. కుండలోకి దూరి మాయమైంది.

అదీ నేనూ అనుకొన్నా… ఇది ఇలా కలగా ఉండిపోవడమే.. గొంతులో నీరు పట్టిన కారపు గొట్రుని దిగమింగి పలమారి ఆయాసపడుతూ..  ఆ గంట అదేనని చెప్పుకొని.. అక్కడే ఆ నిర్జన హద్దులో పడిపోయిన వేడుకల్ని దాటి.. ఎవరూ పిలవని వర్ష సముదాయ వీధులని పట్టుకొని.. వెనక్కి పీల్చి.. జ్వరం పట్టిన రధం మోసుకొన్న ఇసుక పుంతల్లో వేలగొంతులు కోసిన నెలల దిష్టిని కడిగి.. పెద్ద నోరుల మట్టి బొమ్మ కూలిన ఒడ్డునే సముద్రం తాగిన జంట మూర్ఛనలు.

సళ్ళిపోయిన నిద్ర గాధని రంగులతో చెక్కి… నలతని తలకి పోసుకున్న సన్నాహాల కొలిమిని తిప్పుకొంటూ.. తీరిక లేని నిద్ర ముంపులని తట్టుకొని.. దేహ పురిటి నీరుని .. దీపంలోకి పోసి .. ఇంకేం కొత్తగా జరగదులే .. అని.. ఇదొక ఇప్పటి సెకెనుని పెనవేసిన  కంటి ధూళిని నింపుకొన్న దాపుడు ఋణం తలపెట్టిన మాటలని కరిగించి.. నిశ్చల అవసిత  తట్టి లేపిన నడకని చేర్చుకొని.. అక్కడే ఉండిపోయిన గ్లాసుల్లో ఇంకా ఎంగిలి మిగిలే ఉంది. విడిచిన చీర.. రంగు పోయిన గాజులు.. పాలిపోయిన బొట్టు బిళ్ళలు.. చీకి పోయిన చప్పుడు.. గాలి పట్టిన పళ్లెంలో   చల్లారి పోయిన వడ్డన … లాంతరు బెంగ పడిన ఒత్తిని పిండి.. సగం మోసుకొన్న చీకటి తురుముని గోడల్లో దాచి .. విని చేర్చుకొన్న నిడివికి రెండో గుమ్మం కట్టిపెట్టారు.  

కాలిపోవడానికి తాను నన్ను గుర్తు పట్టలేదుగా ? ఒకవేళ గుర్తుపట్టి నన్ను వెదుక్కొంటే .. అన్న చిన్న బూడిద మంటని కప్పెట్టి.. పునాదులు తవ్వి… ఇక మారదులే .. అని శాపమిచ్చి.. మరి ఏమాత్రం చప్పుడు చెయ్యక … మ్యూజిక్ sitting లో కలిసిపోతూ… ఎవరెన్ని పెద్ద మాటలు చెప్పిన .. ఎక్కడకి వెళ్లి ఆగిపోయినా .. కునుకు చెదిరి కన్నుని పూడ్చుకొని ఎగిరిపోతున్నా… శబ్ద మాత్రపు వణుకుని సర్దిన హద్దులో పడి .. కలిసిన కంటి తీర్మానం చూపించిన పొద్దు గొంతులు.. తెల్లార్లు నింపి పోసుకున్న బజార్లో తొరిపిన ముఖాలు .. అడ్డుకట్టలు.. పండిన సగం చీకటి నాచుని రుద్ది … మాటని మసకల బొడ్దులోకి కూరుతారు.

మసిబారిన తెల్ల కొండలపై .. ఎండిపోయిన కుంకుమ పాదుని నులిమి.. పాల కొండలు విరిగి పోయాక .. సాయం పలకని అటుపక్క గుండ్రంలో నీళ్లుపోత… తమాయింపులు సరళం చేసుకొని జాతరలో తప్పిపోయిన నిస్తేజ స్థితిని కులుముకొంటూ.. పెనవేసిన బొమ్మలని వీధుల్లోకి లాగి .. చెమర్చిన చీకటి నివ్వెరపాటులని కలబోసిన నిందలు.

సంభళపాటు .. నిద్ర పోతల సుడిగుండంలో పేరుకున్న చీకటి ఆనవాళ్ళని చెరుపుకొని.. ఇగిరిన సమయ చూపులతో నిలబెట్టుకున్న చంచల కీడుని దులిపి.. కక్కేసిన మెలికలు …పీడన గ్రహణ దొంతర్లతో కలబెట్టిన నెలలు ఇగిరిపోతూ.. అద్దకపు దేహాలని ఉరిమి చూస్తూ.. పేరుకున్న సాధ్య నిడివిని సర్దుకొని.. చంచర పూడికలు.. 

సమయ నిశ్చలతకి .. తాడు తెంపిన నడకని పట్టుకొని.. లొంగిపోయిన కథలని దాటుకొని.. ఇదే ఉండిపోయిన నా నడకకి మధ్యలో జోడించిన కన్నుగా చెప్పుకొని.. మొండి రాతలు.. సఫలిత నిద్ర కీడుని హెచ్చించి ..కంటి కీడుని దులిపిన నాజూకు మత్తుతో కోసుకుపోయిన నీటి సగపు మండలం గుప్పిన నడకని జోడించి.. కాస్త ఆ దూరంలోనే పొంగే దుఃఖాన్ని  విడిగా చేర్చుకొన్న గదులు..

 స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోయినా … షూటింగ్ మొదలై.. ఆమె తన మారుతున్న జాగ్రత్తలని పగలగొట్టుకొంటూ.. ఋణపడ్డ వ్యతిరేక ధూప ఎత్తుల్లో పేరుకున్న సాఫల్య సంధి.

ఎక్కిన కొండలు.. పారబోసుకొన్న చూపు.. వరదకి పట్టిన చెమట రేవులు.. కథ చెప్పుకొన్న దేవల భూమిలో నా నిమంత్ర పారబోతని నింపుకున్న నిద్ర సగంలో మళ్ళీ కలిసి.. చేర్చుకొన్న .. ద్రోహ నిమ్మలాల కరకు చోటుని కుద్దలించి .. హద్దు మార్చిన కాపలాలు.. అక్కడెలా .. రిస్క్ factors  assess చెయ్యాలిగా? ముందు.. కానీ ఎవరూ ఒప్పుకోరు.. ఏదీ ఆగిపోవడానికి.. చర్చిత నిండు గోళాల్లో పడి భూమి నిట్టూర్పు రంగుని పులుముకొని.. అదే ఆగి ఉండిపోయిన మొండి కాపలాలని దాటుకొని.. పేరుకున్న జ్ఞాపిత కథకి రెండో ఆప్షన్ని తిరగదోడి మన్నించమంటారు..

ఇదంతా ఇలా తెలియాలనే అనబోయినప్పుడు.. చెమర్చిన దేహ రొప్పుని కాపాడుకొని.. ఉండిన ఆ రెండు సీన్స్ మళ్ళీ మళ్ళీ రుద్దుకొంటూ.. నలత పెట్టిన కడుపులో మోగిన చీకటి పొడుల అయోమయతకి పోత పోసిన నీటి బొమ్మల కలోప ఎద్దడిని చీకట్లో సర్దుతారు. సళ్ళిపోయిన మంగళ పొడి.. రోత పెట్టుకొన్న నిదాన పంపకాలూ మీద పడి.. లేని గోడలని పోతపోసుకొన్న మందలింపుని సరిచేసి.. ఋణ దేహవుల కీడుని కాదని .. రస పోసిన పెదాల గమనింపుని కట్టుకొన్న దోసిలిలో …

నిండిన స్థితి బొమ్మలు మోసిన చీకటి దాపుల్లో .. తలబడిన మూలుగుల గొట్టడిని తప్పుకొని.. ఇరికిన నిద్ర పొరలని తేటగా వడపోసి.. సవ్వెరపాటు నూగు నవ్వుని మంచులో ముంచి..కప్పిన కంటి చోటు .. ముసుగేసి పీల్చుకున్న నిదాన కూర్పులో పడి .. తెగిపడిన నిందలు.. ఉడికిపోయిన కంటి బూజుని తాగి.. నెర్రులిచ్చిన స్వేద రాత్రుల కౌగిలికి చేర్చిన నల్ల మరకలతో.. హద్దులు నేసుకొన్న విడిది పక్కాగా మాటలు..

నిండిపోయిన ప్రార్ధన శిధిలాలు.. కోసి పెట్టుకొన్న పునాదుల ముట్టడిని కవ్వించి.. దేహపు శరీర గండిని పెట్టుకొన్న ఇసుక మడుల్లో .. పెట్రేగిన నిద్ర సానువుల కైపుని వదిలించుకొని.. ఇగిరిన విశ్రు చలన మత్తుని సాగదీసిన పెద్ద దుమారపు పొడుగు నిశ్చంత… అపార్ధ నిందలని దాచిపెట్టి.. ఋణ పడ్డ దేహ నిలువుల గోతులో దిగబడి.. సరి చేసుకొన్న మాటల నీటి తాడుని మెదిపిన కసికి.. తోడు పడిన బిగువుతో చెదిరి పోయిన అల్లయింపులని మోసపుచ్చి చెదిరిన మొండి ఊటలు..

ఉన్నదీ .. లేనిదిగా ఉన్న కథ.. మురిపించిన రంగుతో స్క్రీన్.. పోస్ట్ ప్రొడక్షన్ హడావుడికి .ఎడిట్ టేబుల్ పై.. చేర్చి పెట్టుకొన్న శోధనతో ఒప్పుకొన్న శరీరాలతో నివురుగప్పిన అంటుకోతలు ..

పాకిన  స్క్రిప్టులు వెంట తీసుకొని.. కలిసిన ముఖాలని ఎండబోసుకొన్న ఒరిపిడి నిందల స్తలబోత .. ఉండీ అడిగిన హద్దుని పాడుకొంటూ… రుణ బాలింత చేరదీసి కంటి శాపం.. కలిపించడానికి లేని పెద్ద వీధి సంతర్పణలో .. పాతుకు పోయిన సెగల ఉరుము పొగరేపుతూ.. అవధి కప్పిన చిత్ర దోషాలని కట్టుకొంటూ.. అటు తిప్పి చేసుకొన్న తీర్మాన రుజువులని మోసుకొని.. తర్జన పడతారు.

ఏదో మొండిగా చేర్చుకొన్న పదిల చిహ్న పూరింపులని .. కట్టుకొంటూ.. తేరుకోలేని ప్రవహిత రెండో దాపులో మొండిగా ఈడ్చిన రంగుల నెల నేత.. చెమ్మ పట్టిన చెక్కల్ని మంటకి ఎగదోస్తూ.. పూర్ణత మోసి పెట్టుకొన్న తోడులేని మతిమరుపుకి పెట్టుకొన్న స్వాధీన ముఖాలు.

చెరిపేసిన పెదాల నిడివిని ఒడంబడికని… చీకటి నిలువుల శరీర కోతలని కాచిపెట్టిన కళ్ళలో పాతుకొన్న పునాది జాడలు.. మళ్ళీ కలిసి అదే మాటని .. స్క్రీన్ పై ఉంచారా? అని అడిగినప్పుడు .. తాను మాత్రం కనిపించలేదు. వినిపించదని గోడల పగుళ్ళోంచి రహస్య నిమ్న కలత చెప్పుకొని కారుతుంది… మంచు పాతకాలతో నిమిరింది కంటిలో గాలిపొసుకొన్న ఇసుక దీవులు.. 

కిక్కరిసిన నిద్ర తోడులని .. చీకటి విరిగిన కంటి చెడులని దుల్లగొట్టి … పరిధిని  నించోబెట్టిన రుణపు బరువుని చెమర్చిన స్వాధీన మందలింపు.. కప్పిన సమాధుల మార్చుకున్న నిద్ర తోరణాల కట్టడిని దాచుకొని.. సగం మోసిన కసిని సాగదీసి .. పేరుకుపోయిన నిప్పులని గుట్ట చేసి ఏడుస్తూ.. వదిలిపోయిన స్తబ్ధ ఊరుపులు.. కలిపి చేసుకొన్న నిద్ర వరదల గట్టుని తెగ్గొట్టి .. ఉండిపోయిన కాల్చివేతల మిగులుభూమిని పోతపోసి..కప్పిన కంటి చోటు నాదేనని ఆర్చుకొంటూ.. పేరుకున్న చీకటి నలసలు..

జత పూర్ణ ఒబ్బిడి నురుగులు మధ్య కుదిరిన దేహ సత్తువుల బిగి రొప్పుని కలిపి పట్టుకొని.. అలాస పొత్తు దులిపిన కంటి సూదుల గుద్దుడు.. పోతపోసిన శిధిలాల ఊపుని కప్పుకున్న నిశ్శరీత దేహం చేర్చుకొన్న వృత్తాలు.. పాటని కప్పుకున్న సరిజోత ఋణం బరువెక్కి .. దిగులు పట్టి ఏడుస్తూ.. పోలికలేని దారిని పట్టుకొని ఆవలించిన గుబులుతో.. పేరుకున్న నిస్త్ర సన్నని గాలి లుంగలని చేర్చిన కాళ్ళు..

కొడిగట్టిన దేహ ఋణం తప్పిపోయిన నిందలని పట్టుకొని.. స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యాక … నివురుపోసిన రెప్పల కందెనతో.. తోడు పెట్టుకొన్న ఋణ భారపు మొవ్వుని పోగేసుకొని.. విడదీసి రమ్మని పంపిన సగం పుట్టుకలు పెట్టుకొన్న బొట్టుని తుడిచి.. చిత్ర తీరికల విడతీత కూర్పులు….భయం నమిలిన వాన గుండాల కూర్పుకి రెండో ఋణం పెట్టుకొన్న వర్ష తందన .. గుర్రాల కొండ వెనక్కి పీల్చిన దగ్గు మాటలు..

కలిసిన శ్వాస చర్యల విరామలో పడి కొట్టుకు పోయిన కెరటాల కూర్పుని అడ్డుకొన్న మాటలని పెట్టుకొంటూ… పగిలిన సంధి గెలుపు బరువుని తోడి .. కొల్చి పోయిన ఇరుకు మెట్లతో పండిన గాలి.. బొంగురు నిందలు కాల్చిన పెద్ద కళ్ళ వాన గూటిలో పేరుకు పోయిన స్థితి కలవరాల కూపం.. ఎగదోసిన మంటలు .. కరిగే నిద్ర అనుకూలంగా ఉంచిన నిద్ర గతులని ఎగాదిగా చూసి .. కలిపి చేసుకొన్న నీటి సోదాలతో … హెచ్చరికలని దాచిన కొండల్లో ఉండిపోయిన శబ్ద త్రిగుణ తోవలు.. ఆవరించిన దేహ శోధనకి లోపలనే ఉండిపోయిన చీకటి తెల్లబడుతూ.. పీల్చేసిన చెమ్మని మట్టితో కలిపి .. కొత్త నిద్రకి చేర్చి గుబులుపడతారు.

చివరకి   చేరిన అక్కడి చిత్ర కూర్పు… పాకిపోతూ.. చెమర్చిన పదునుతో పండిన నుదిటిలో .. కథ చెప్పుకొన్న జ్ఞాన వాసి ఏడ్చినా కన్నుతో .. అందించి చేరదీసిన మాటని జోడించి కలవాలనుకొంటారు. ఇంటిని సగం కోసి .. పెద్ద గేలాలతో పట్టుకొన్న నదిని ఫ్రేములోకి ఇరికించి .. దిష్టి తీసిన నీటి గుజ్జుని మెదిపిన కక్ష్యల్లో పడి .. తలమునకలుగా చేర్చిన నొప్పిని ఊదరగొట్టి.. ఋణ భాషణకి ఉండిపోయిన కన్నుతో.. విడిపోయిన నీటి సూత్రపు కట్టడిని చీల్చుకొని.. అంతా ఒకటైపోతారు.

ఎటు నుంచి ఎటుకి చేరుకొన్న ఖాళీ నిర్వస్తల పొగ గూటిలో చేర్చిన ద్రవీరవ మండల కూర్పులు.. నీరుపోసిన పాత గొంతులు చెమ్మకి .. దీపం కుమ్మరించిన గుండ్రాల్లోపడి .. తలపట్టుకొన్న ఒబ్బిడి రాతని పేర్చుకొంటూ.. ఇగిరిన సాంద్రతర ఋణం ఊపిన పూడ్చివేతలు .. విసిరినవి .. అక్కడక్కడా ఆర్దుకొంటూ మాయాన తీరికలు … వాన పేగులు పడగ ఎత్తి ఆడుతూ .. నెత్తుటి మడుగు.. తేరుకోలేని అవస్థలని దాటుకొంటూ..కలిపేసిన జత సాయంతో.. పల్చని అడుగు రాతలతో సమయ కేకలని జిలార్చి సరిచేసుకొన్న కొండల మధ్య కూలిపోయిన అభిభాషణ … ఏడు పొడుగుల ఋణం.. వెళ్లిపోవడం .. ఉండిపోవడం నిమిత్తం లేని పాత్రలు .. తెర వెనుక కాలిపోతూ .. హద్దులు నెరిసిన కంటి శోదాలని పెనవేసుకున్న కట్టడిని దాటుకొని.. మెరిసిన కట్టడి రంగుల నిలబోతని నింపుకొని.. లాగేసిన  నవ్వు..

సావళించిన శూన్య దీక్షిత రీతులని మార్చుకొని.. పాటలు చేరదీసి కుండలో .. ఇక కనిప్పించక నెమరువేసుకొన్న ఘటనలని దాటించి.. ఎంపిక చేసిన కంటి రోషణ పంపకాలు. కళ్ళలో నూరి పెట్టుకొన్న దాహపు కెమెరాల వాన .. కుండపోతగా కురిసిన దృష్టి ఐక్యంలో కనబడి ..  విలవిల ఆడిన సన్నాహా చిత్రాల కైపుని తట్టి లేపుతూ … దీప ధోరణిని నప్పక ఉంచిపోయిన .. మరలా పెనవేసుకున్న తప్పట్లని జార్చిపోతూ.. వానకి కరిగిన మేకప్ తో మరో ముఖం .. సరి సమానంలో వేలాడిన దేహ వెలితిని కలుపుకొని.. ఆవహించిన రుణపు పొడుగులో ఇంకిన చెరి సగపు పొందికలని చేరుకొని.. నిశ్వాస రాజీలకి చేర్చిన హద్దులు..

 బొట్టు ఊదిందని ..కొంగు పల్చని దాగుడు కుంపటిని వెలిగించి నిండిపోయిందని.. జోడించని కంటి శిక్షకి ఋణం పోసుకున్న ఇక్కట్లతో … తెగబడి నింపుకున్న కొండలని అద్దంలోకి  కూల్చి .. తీవ్ర దుమారపు నిద్ర మోడులని దువ్వుకొంటారు. నిద్రార సాగనింపులో వెనక నించి హింట్ చేస్తూ .. నటనకి వరుస గొంతులని దులిపిన పేటికని రంగు మార్చి ఇచ్చేస్తూ… ఇంకో సమాధి ఖాళీని వెదికి పట్టుకొంటారు.

 ధవళ నిరూప స్పష్టం పోసుకున్న కంటి తీరుని మార్చి పెట్టుకొంటూ .. ఓదార్పు మంతనలో పడి తొందరలేని నింపాది ముఖాలని కత్తిరించిన అమర్పులో పాతుకుపోయిన కథనాలతో ఉండిపోయిన కాల్చివేతలని నొప్పికి చేర్చి … తగలబడుతున్న బయట రక్షిత భుజాలని కొట్టుకుపోతూ..హద్దులు మార్చుకొంటారు. పనిచేసిన పరిధిని కాచుకొంటూ.. ఋణపడని దేహ విలోమ సంచారంలో సరిచేసుకొన్న నిమంత్ర రాజీల కంటిని తెగ్గోసి.. బోసిపోయిన నిగురు తేమని ఊదిన శూన్యంలో ఇంకో విస్ఫోట రాజీలు..

ఆవరించిన కునుకుని దాటుకొని.. జోడించిన చీకటి అలాతలు కమ్ముకొని.. ఇంకాస్త లైటింగ్ డౌన్ చెయ్యమని.. బెదిరిన రుణపు పోటుని మెత్తగా నాటుకొని.. దూరంలో పేర్చిన నికర ధ్వనిలోని తీరికలు.. అక్కడి కబురు నిజమని తెలిసినపుడు .. సరిచెయ్యని దృష్టి భోగం నమిలేసిన కన్నుతో.. హద్దుని చెరిపి .. కళ్ళలో పోసుకున్న నిండు ముహూర్త  నిమిర్పుని పెద్దగా ఆడించి దగ్గర చేసుకొంటారు.

ఆ మృత్యువు.. నా దేహ నిఘార సంధి సూత్రం పెట్టుకొన్న ఊర్పుల మెలికని తొల్చుకొంటూ.. పెట్టి తీసిన కంటి పోటుకి జిలార్చిన హద్దుని పాతుకొంటూ.. ఇంకిపోయిన నిద్ర చాటు నలకలు.. ఊరడింపులేని చీకటి గోళంలో కూరుకు పోయిన మోనిటర్లో రికార్డెడ్ పెర్ఫార్మన్స్ ని కాదని .. పెద్ద ఉరుముల కాటుక నీళ్లలో జుత్తుని నానబెట్టారు. ఇప్పటికీ ఇలా మార్చి వెళ్లిన దూరంలోనే కెమెరా జూమ్ కాక మసక నేసిన కంగూరుల కేలన గడ్డకట్టింది.

ఊదర గొట్టిన కథనే మళ్ళీ తిప్పి చెప్పినా .. తాడు దొరకని నిరాశ కమిలిన మండలాల్లో తొందరపాటుతో మోసుకొన్న హద్దులు.. విరమిత భాషణల నుదిటిలో మోగిన సంతః చలన దూపుని వడపోసి.. నమిలేసిన గొంతులో .. దీక్ష చనిపోయిన పొగ రవ్వల కంటి శోష ఈడ్చుకొని .. అరిగిపోయిన మాటలని తీర్చుకొని తాగుతుంది. అలా సరిపెట్టుకోవడానికి లేని కట్స్ ని rewind  చేస్తూ సమయచాలన గుండంలో పోసుకున్న ఎల్లో జర్నల్స్ .. వైరల్ వీడియోలు .. రీల్స్.. బ్రేకింగ్ న్యూస్లు 

ఒకేసారి ఇదంతా కాదని .. రీషూట్ అన్నప్పుడు .. ఆమె నొప్పితో అల్లాడి.. ఐనా చీరని సరిచేసుకొంటూనే రాణి క్యారవాన్ డోర్ ముందు కూలబడిపోయింది.. కెమెరాలు క్లిక్ మంటూనే ఉంటాయి.. చెదిరి పోయిన ఒంటి ధూళిని పొగతో చేర్చి.. ఋణం పట్టుకొన్న సమయ విడతీతలు.. ఆ మృత్యువు పుట్టిన మాయాన తీరికలని వదిలిన నిషా దాపుల్లో పట్టు తప్పిన కన్నుని పొడుచుకొని.. కడిగిన హద్దుల్లో పోసుకున్న స్నాన దీపాల రేవులో కుదిరిన నడకలని అప్పగించుకొని.. సడలిపోయిన నీటి పూనకాలే ముద్దగాగా తొడిగిన నిప్పుని … శరీర కాపలాల దాడిని కొట్టుకొంటూ.. ఋణం సడిలిన విసుగు.

స్తలపోత నిరా వ్యాపంతో .. చిదగిన హద్దుకి చేర్చిన నెరవేరపు ముట్టడికి పట్టిన కంటి రాతని తరుముకొని.. వండి వార్చిన హద్దు… పొద్దు మళ్ళీ దగ్గరకి జరిగి దర్శన ధూళిని ఇచ్చుకోదు.. గంటలని కొండలకి కట్టి .. లోయలోకి వాల్చిన నుదిటిని ఊపుకుంటూ … మోగించిన ఉత్తర దిక్కులోని.. ఋణ వీధి.. కలపాటుల నిషిద్ధ అయోమయం.. పట్టుకొని వదిలేసిన సగం కథలో .. ఏదీ సరిగాలేక వాళ్ళు వెళ్ళిపోతారు.

ఆక్షేప మందలింపుతో నిలబడి ఉండిపోయిన గోడల చాటుగా … ఆ దేహ దృవపు చెంపలని  రుద్ది.. పులతని బిగిస్తారు. నిందించినపుడు .. ఇంకేం తీరిక లేని దేహ నిర్మాణ రాత్రిని కుదిపి.. పేగులు తుళ్ళిపోయిన నడుము పోతూ పెడుతూ .. సాధరింపులేని వడ్డనకి  దొరుకుతుంది.

సెట్ రెడీ ఐనదని … కానీ ఆమె మాత్రం ఇంకా కోలుకోలేదని..ప్రొడ్యూసర్ హరషమెంట్ తోనే కోమాలోకి వెళ్లిందని..  కథని మార్చి పాత్రని చంపేద్దామని.. అతనెందుకో అరిచాడు.. అలా చేయొద్దు.. తను నిజంగానే చనిపోతుందని.. అదే జరిగింది..అస్పష్ట దేహ జాగారపు పట్టుని దులిపి.. నల్లబారిన మాటని తాగి సర్దుకోలేని  నిభీషణ … అలిగి పీల్చుకున్న నీటి ధనుస్సుల పై ఎత్తు తంత్రం పట్టుకొన్న నిరాశ క్రమాలు.

 కానీ ఆ రాత్రి ఆమె ఇంట్లో స్పృహలేని స్థితిలో అతను దొరికేసరికి.. పోలీసులు పట్టుకుపోయారు.. అసలేం జరిగింది ? ఆ రాత్రి… మోసపు వడ్డన.. ఇలా కొంచెం అలా కొంచెం.. దేహ భస్మ సమాధి కౌగిలిని చావులోకి ముంచి.. ఊపిరి నలకలని దుఃఖంలో ఏరుకొని.. నిమీల శబ్ద గోతుల్లో మట్టిని పోశారు..

వెనక ఎవరో పలవరించారు.. తాగిన గ్లాసుల చప్పుడు ఇంకా అలాగే ఉంది.. షవర్ కింద అతని చేతి వాచీ దొరికింది.. గోడలపై వేలిముద్రలు.. తలగడ పై వెంట్రుకలు.. brutal  ఎంట్రీ .. సీక్రెట్ పార్ట్శ్ అన్నీ స్వేల్ అయ్యాయని.. ఇంకేవో టూల్స్ ని ఇన్సర్ట్ చేసి … లోపల పుండు చేసి .. పొత్తి కడుపు దగ్గర కోసి … కండని కట్ చేశారని.. వికార అనుకూలంలో నిగిసిన నిరసన హద్దులో.. గొంతు చుట్టూ తాడు బిగిస్తున్నట్లు..

యవ్వనం ఐపోయిందని .. ఒక మసక భూమి పంపకపు నుదిటి రేవులో .. దొరకని ఆయుస్సుల మత్తుని ఊదుకోని.. తప్పిపోయిన చీకటి పారబోతలు.. నిలదీసి పెట్టుకొన్న స్క్రిప్ట్ సాధ్యా సాధ్యాలని చేరుకొంటూ.. గస పోసిన మొండి వాదనలు పట్టుకొన్న ఇల్లు.. ప్రతి చర్య అప్పగించిన నిద్రలో పడి తలకిందులు ఒగర్పుని దాటుకొని.. రుద్దుకొన్న అవశేష కల్మష తీరులని కడిగి .. తుడిచిపెట్టారు.

ఇప్పటికీ కదిలే రుణ వీధి కనిపించదని చెప్పుకొన్న .. ఇగిరిపోయిన శ్వాస రుణపు పట్టింపుని వదులుకొన్న సాధనకి గొడుగు పట్టిన నడక పొంగుతూ .. హద్దుని మూసుకొంది.. భూమి ఇక మోయడం మానుకుందని.. సముద్రం పొంగడం.. మంచు కొండ ఏడవడం.. తూఫాన్ మలుపులో చుట్టుకుపోయి ఇంటి పట్టుకోవడం మానేసాక … ఏదీ ఇక అలా లేదని .. ఇంకా మళ్ళీ పిల్చి చెప్పనక్కరలేదు..

తాకుతూ వెళ్ళిపోయినా కెరటాలు.. నానిపోయిన దగ్గుతో దీవులు.. అలవాటు లేని పడవల కునుకుతో.. సాధ్య సెగని దాచిన సంచీల్లోని.. ఏదో కదిలి సాక్షి నెరిసిన నవ్వుతో … కాపడం పెట్టుకొంటుంది. దూప గిర గిరలతో పాడుబడిన కన్నుని తొక్కుకొంటూ.. ఋణ కావేడలో పోసుకున్న వాన కుండల చప్పుడుని నాకుతూ.. పులిమిన నిద్ర గతులు ఏమార్చిన మేకప్ రూంలో పడిపోయిన పోలికలు..

అంటుకట్టిన విపరీతాలు ఏడుస్తూ .. కాల్చి పెట్టుకొన్న ఋణ నిఘార పేర్పుని ఊదరగొడుతూ .. గొలుసు కట్టిన ఆందోళన తిరిగే ఆయుస్సుకి చివర నేను ఉండిపోవడం తెలియక.. విపరీత నిర్ణయమూ.. జోడించని దిగులు గోడకి వేలాడ దీసిన కల.. గొంతు బరువు సకిలింతని చేర్చుకొని.. ఇంట్లో ఉంచిన గాభరా అడుగుల చూపుకి … నివ్వెరపాటు కట్టి.. పాతుకు పోయిన ఋణ గారడీ ..

వండి వార్చిన వడ్డన.. మృత్యు సాధకి .. మళ్ళీ కథని narrate చెయ్యమని అడిగి .. కనిపించకుండా పోతుంది.. అభయ గీరని .. నిద్ర రేవులో దాచుకొన్న ఇంకుడు నడకకి తీర్చి పెట్టుకొన్న చీరల గుట్టలో .. మాన్చు ముడిచిన తేనెపట్టు కలిపిన చిక్కని గాలి.. ఊపిరికి అల్లాడిన కంటి నొప్పి..

సిద్ధ సంపదలకు అలవాటు పడని కైపుని తీర్చుకొని.. దేహ సర్జిత సిరలు ఎత్తిపోసుకొన్న కెరటాలని దువ్వి.. గడుసు పడవ మింగిన చేపల ఊపు.. దళసరి చీకట్లో పండిన అద్దాలు.. సగం వద్దని శుభ్రం చేసుకొన్న నిద్ర గుహల్లో పడి.. తీరిక లేని గదుల మధ్యలో పడి .. దుఃఖ నిర్మిత గాలి సొరంగాలని కుదిపి.. ఒరిగిన నడుముతో.. తొంగి చూసిన వాన గుట్టుని పట్టుకొని.. మళ్ళీ అక్కడే మాటలని మొదలుపెడతారు.

కావలింపుకి అలవాటు పడి.. వండి వార్చిన వడ్డనతో .. చివరి చూపులోని.. సృష్టి తికమకల శిక్షణకి సరిచేసుకొన్న రంగుల ఇంకుడు ఇసుకలో .. ఆ బొమ్మకి ఆచూకే ఇచ్చి చేస్తూ.. తప్పిపోతారు.. మాటనే తప్పించి.. పైటలు వదిలిన మడుగులో ఈదుకొంటూ … చర్చిత నీటి గుంపులో.. వాన కలతని కలకి పట్టించి .. నేరుగా తాగేసిన కరుకు ధూపాల పొడుగు నిద్రని మడిచి.. వెంటిలేషన్ రాసిన వీలునామాల సందడికి …

అంతా బయటపడటం .. ఎవరు ఎవరినీ తల్చుకోక .. పాటకి కట్టిన ఉనికి మొత్తమూ.. గందరింపు.. పొడి పోసుకున్న దోసిలి పీల్చిన సాగ స్నానపు వాసనకి దగ్గరకి రాక .. రెందు ధూప మొండాలతో స్పర్ధ చలువల కైపుని పట్టుకొని పోతపోస్తారు. ఇది అక్కడే ఆగిపోయే సాధారణ కోత కాదని.. గంపించి పెట్టుకొన్న తీరుని వదిలి .. జడ నిండుగా గుప్పిన కళ్ళ కూడలిగా మాత్రమే ఉందని.. వాళ్ళు బిజినెస్ చెయ్యడం మొదలుపెడతారు.

మరో విసుగు పండిన కంటి శుశ్రూషకి.. కలలని కాల్చి.. ఆ సెట్ కి మరిన్ని రంగులని ముంచి..లైటింగ్ తగ్గించి.. తెల్ల కుండలు.. మైనంతో పోతపోసిన డెత్ బెడ్లు.. మంచు మింగిన లాంతర్లు.. బుస కొట్టని నల్ల నువ్వుల పొగ.. మిరియాల కాషాయం.. గుమ్మడికాయ దిష్టి తీసిన కంటి రేవుల పడగని కట్టుకొని.. దేహ సవరింతని  పెనవేసుకున్న బయట ముఖాలు.

నిల్వపడి .. వాసన వస్తూన్న కలబోతల కట్టడిని వదులుకొని.. దేహ నిగ్రహ పొందికతో.. విచ్చలవిడి దూరాల్లో మారిన కథలతో ఎదురుపడి.. ఒకరినొకరు గుర్తుపెట్టుకోలేక.. నిజారిత అంపకాలతో కోత పెట్టుకొన్న నగరం.. ఆ స్టూడియో.. తట్టుకోవడానికి .. వద్దని దూరం జరిగి ..చలన నిర్గతి పాడుబడిన చూపుని వడి వడిగా తిప్పుకొని.. నిండిన కాపుదలల కుమ్మివేతకి అలసట పడిపోతూ.. హెచ్చరింపు.. 

                                                              ……………………………

4.డార్క్ coincides .. ఫిమేల్ anxiety

Fire … chitrangadha … maidhanam

Body on fire … dilemmas

మహా నిద్ర అనుసారపు శాప భూమిని ఉడికించి.. నియుజ్య స్థితి రేవులని మంటలతో నింపి.. సాధన పట్టి రాల్చిన చీకటి ఔషదపు దీర్ఘ మృత్యువుల పగుళ్ళని … ఉండిపోవడానికి రమ్మని చెప్పిన అనుమాన గుహల్లో .. నిలిపివేసిన మాటలని చేర్చి సరిచేయక ముందే .. సబ్బుర పడిన నిలవరపు పట్టుని వదిలేసి .. కలిసిపోయిన గ్రహణ భోగంలో పడి మునిగిన దేహ రక్ష చేర్చిన వలయ నిర్మిత పగలు.

దుందుడుకు సామర్ధ్య చర్యల కలవరపు పట్టుని దులిపి.. సరిపోని రంగు జాడల బిగువుని నేసుకొని.. ఇగిరిన గోడల మధ్య ఉక్కపోసిన కథ.. అతనేదో చెప్పడానికి వెళుతున్న .. లోపల కొన్ని చీకటి నమిలిన నల్ల మానుల్లా కమిలిన శరీర అనుకూలనాలు మునిగి .. కేకలు పెట్టిన గోడలని దుల్లగొట్టి.. ఇలా ఒప్పుకోలేనని ఆమె ఏడ్చినా .. అగ్రిమెంట్ కాపీ ని ఆమె ముందు ఊపారు.

ఇవన్నీ .. ఇలా అని చెప్పక ముందే .. డార్క్ coincides … నిలువు చిత్ర సంధిలో పడి .. కడిగిన శరీర జాలంలో సుడులు తిరిగిన దోసిళ్ళ మధ్య కలిసిన నిద్ర బరువుల గతిని కాల్చి.. చప్పరిస్తున్న తేలికతనాల భయం పులబెట్టిన ఋణ పూర్ణ దోష మూలాలు.. చెంపల్లో మెరుగు పెట్టిన ఋణ దోషాల నివేర్పు కలతకి రెండో ముఖం ఇచ్చిన నడకని దాటించి.. కథ చెప్పుకొన్న పేజీలని గద్దించి పిండారు.

నిద్ర రాక.. గది తవ్వుతున్న చప్పుడుని.. శరీరమంతా వేల చేతులు.. నాలికలు.. కళ్ళు చుట్టేసి ఊపిరాడని భస్మ సారపు అడుగులని వదులుకొంటూ… ఎప్పటికీ తెలియని ఆ చీకటి హోరుని తోడుకొని.. ఉబికిన కీడుతో .. నల్లగా జారిన కంటి చేలన బిగువు భద్రం చేసిన సీసాలు.. అలా ఉండిపోవడం ఎందుకో.. తెలియక ముందే కాళ్ళని నమ్ముకొని ఉండిపోయిన పొడి చంద్రుడికి పట్టేసిన జ్వరం.

అసలేమీ .. indecent proposals  లేకుండా ఎలా? మీ స్కిన్ ఎక్కడా ఎక్సపోజ్ కాదు.. కానీ ఆ ఫీల్ పండించాలంతే … చిన్న చిన్న ఎరోటిక్ కదలికలు.. మెత్తని అరుపులు.. తూలు.. ముగ్గిన చెమటతో కొంచెం తడిచిన బట్టలు.. చీకటిలో కొంచెం నంజుకొన్న ఎర్ర లైటింగ్ మెట్లు.. జారి పట్టుకొన్న బట్టని బిగదీసి ,, కాస్త నివురుని దులిపి పెట్టుకొన్నారు.

సాగిలపడ్డ చావు నేరాలని కుదించి పెట్టుకొన్న దేహ రుణపు పొగని జోడించి.. కరుకు మాటలని కాల్చిన చలిమంటకి దగ్గరగా .. హద్దు పాడిన కన్నుకి జ్వర దీపం అంటుగట్టిన కునుకు.. వెక్కిరించి వెనక్కి పంపిన నిద్ర పోరులో … దేవీ భరణం ముంచిన బాక్స్ ఆఫీస్ ఏడుస్తూన్న .. shows మూసుకొని..

పెద్ద నవ్వులని మోయించిన నాచు దూపుల గదిలో.. కెమెరా చల్లార్చిన ఫిమేల్ anxiety ల మధ్య ఊరేగిన నిద్ర గానుగులతో తడిపిన … వణికిన మట్టి కెరటాలు దువ్విన రెప్పల నూగు..తడి గాలి చేతిని విదిలించి .. కంట్లో చేర్చిన సానునయ దుఃఖపు అంచుల్లో పడి .. తేలిక పడిన నిద్రల కథకి కలని దగ్గర చేసిన బాలింత బరువులు.. నడుము పోటుపెడుతున్నా ఒంగి తుడుస్తూ .. తప్పని వంటలో ఆయాసం తిరగబోసి …

సగం రేవుల్లో పడి కనిపించని దోష కదలిక .. ఊడిపోయిన చూపు… చెమట కార్చిన గొంతు నొప్పితో.. దుఃఖం బొంగురుపోయి.. కావలించిన ఛాతీల కీడుని మరగబెట్టి ..  దేవుకొన్న భద్ర బాణిలిలో ముఖం మాడ్చిన కంటిని ఆడించి.. దువ్వుకొన్న శ్వాస రాట్నాలని సరిచేసి రంగు తోడుకొంటూ.. అక్కడ హోమ్ థియేటర్ స్క్రీన్స్ నిండా ప్రశ్నలే.. అదెలా possible .. ఇలా ఎక్కడైనా ఉండిపోయి కనిపిస్తుందా? అన్నట్లు..

అదెలా .. తను వచ్చి మళ్ళీ ఎలా ఒప్పుకొంటుంది.. సెల్ఫ్ respect .. వెక్కిరించి వెనక్కి పంపిన నిద్ర పోరులో  దేవీ భరణం ముంచిన బాక్స్ ఆఫీస్ ఏడుస్తూన్న .. షోస్ మూసుకొని..దానికి మించి EMI లు.. క్రెడిట్ కార్డ్స్ .. parlor  ఖాతాలు.. ఏదో తెలియని గోలని కడిగిన చీకటిని నమిలేసుకొంటూ.. ..

నల్లని బండపై ఆకురాయిని నూరుతున్న నవ్వు.. తూఫాన్ మధ్యలో వెలిగిన దీపాల కొండలా కోపంగా అటు చూసింది.. ఎవరూ ఒప్పుకోలేదు.. తడబాటు.. ముందటి ఒట్లు మర్చి నిలదీసినప్పుడు.. అతను కృంగిపోయి సంపర్క దీక్షని వదిలేసి కథ మధ్యలో చనిపోవాలని ఉందంటారు.

చర్యలని ఏకం చేసిన కుంపటకి నింపిన కళ్ళ గుట్టని .. పట్టుకొని వెళ్లిపోయిన ధ్యాన ఉచిత రగూర్పు పొట్టుని దులిపి మళ్ళీ ఆ దేహమే కావాలంటారు.. డిమాండ్ అండ్ సప్లై కదాని .. కాగితాల చాటున వంకరగా నవ్వుకొంటూ.. హవాలా ట్రాన్స్ఫర్ లతో .. కోడ్ కి చింపిన కరెన్సీ నోట్లు.. ఆ నిర్మానుష్య ధ్వనిలో .. కిక్కిరిసిన ఏడుపుకి కొత్త రంగుమారి .. శరీరం పోలికలకి ఎంతమాత్రం దొరకదు.

నిద్ర ఖాళీల నల్ల తేరుల జిగురు.. ఉరిమిన దేహ సగపు ఒద్దికని దాటి .. పోతపోసిన కంటి ఋతువుని సర్దుకొని.. సరి చేసుకొన్న పోలికని పట్టి చూసుకొంటూ.. ఆవలకి  వెళ్లిపోయిన కథకి … ఒప్పుకోలేని తగువు.. ఎందుకీ experiments .. సేఫ్ గేమ్ ఆడదాం..

ఆమె ఏం చెయ్యకూడదు.. అంతా హీరో చేతిలోనే….క్యారెక్టర్ జస్టిఫికేషన్ కాదు.. ప్రేక్షకుడు మనకి ముఖ్యం… వాడు పాతుకు పోయిన చీకటిలో ఎర్రగా కాలిన అలసటని ముట్టుకొని.. తీర్చి పెట్టుకొన్న సంభారింపుల నిద్ర పిడుగులు కురిసాక..

సాదబాటు సమయ సన్నుతి ముఖాలని జోడించి.. పోతపోసుకొన్న కలల ఆవిరి గుట్టలో .. ఉంచిపోయిన చలన గర్హత … అవిధేయ నిద్ర ఋణం చేర్చుకొన్న .. అవశేష హేళనలో పడి .. తొందర లేని మగత చిత్రాల పొదల్లో … సమ స్థితం కాని నిద్ర ద్రోహాల నల్ల గాలి ఉరుముతూ.. ఇంటి మీద పడ్డాక .. రాత్రి నిద్రలో కమిలి నల్లబడిన ముఖం .. ఏ రకం మేకప్ వేసి సరికావడం లేదు.. సీజీ లో మొత్తం footage అంతా దేవలోప్ చెయ్యాలంటే.. కాస్ట్ అండ్ టైం.. ఆమె ఆమాత్రం స్పృహ లేదా? మైంటైన్ చేసుకోవాలిగా?  

కన్ను చెమర్చిన ఆది నివ్వెరపాటుతో.. హద్దుని కప్పేసిన కంటి నలుపుని వడపోసిన చీకటి తెరల మన్నిక … ఎవరమూ వేలాడడానికి రాలేదు. పెద్ద నిరాశ కమిలిన నిద్ర బజారులో పడి రాలిన చావుల కైపుని చేర్చుకొని.. అక్కడి తెరలని ఆరబెట్టిన ఉసురు తగిలి .. పాతిపెట్టిన శరీర కత్తిరింపులు..

చప్పరించిన నిద్ర విధులు.. కలబెట్టిన నడకలో ఊరిన నిద్ర రాతలని తిప్పుకొంటూ.. దారిలో దొరికిన శూన్య పలపు దుఃఖ సమాధిలో .. గొడుగు పట్టిన చీకటి మోసిన బజారుని రుణంలోకి పట్టి .. వేలాడుతున్న నిర్యాణ పద్దతుల కుట్ర.. జమ చేసిన భయాలని కోసి పెట్టుకొన్న వంతెనలతో.. పెనవేసుకున్న కథని రెప్పలకి జోడించి చేర్చిన ఇల్లు.

బావురుమన్న చీకటి ఏడుస్తూ.. పేరుకు పోయిన నిద్ర తీరికల కట్టడిని నిలదీసి .. కప్పిన దుఃఖ పరిధి… కాలు ఎత్తిన వాన గ్గోడుపై పేరుకున్న నాచు గుట్టలు.. ఇగిరిన ఋణ తలపోటులు.. పాక్కొంటూ పోయిన దేహ ఎద్దడి నిలువు కాకని కదిలించి పెట్టుకొన్న నిరవడి.. కోపపు ఊలని మోగించి కాసిని నులిమి పక్కకి జారిపోయిన నిద్ర విధులు .. పాక్కొంటూ పోయిన శరణు మితిని కరగబెట్టి.. అద్దుకొన్న నటనల పూర్తి కౌగిలి చేరదీసిన మాటలని సగం పట్టుకొని.. పేరుకున్న కల్పిత శ్వాస ద్రోణుల్లో ఊడిపోయిన రంగులని గాటు పెట్టిన చీకటితో నెలలని మోసుకొని.. తాపత్రయ మోసపు మందలింపుని చాటుగా ఉంచిన చూపుని పట్టుకొని..

ఎవరమూ ఇంకొకరి కోడ్ ని పట్టుకొని.. ఆ బంగ్లా చేరలేం.. డిజిటల్ డిస్ప్లే చేసుకొన్న మేకప్ పోలికలని దట్టంగా తుడుచుకొని.. లేవదీసిన అనుమాన కవ్వింపులని మార్చి చేసుకొన్న ఒప్పంద నిరూపాల గట్రు.. సాపేక్ష ఋణ వికారపు గొడవని అద్ది తీసిన కలయికకి .. ఏమార్చిన రంగుల క్షేత్రం పోసుకున్న వాన పీడనాల ముద్దడి విరుపుతో.. హద్దు పెట్టుకొన్న నిర్యాణ ముగింపులని జోడించి కన్నుకి పెట్టిన కాపలా.. అదే తెలియకపోవడంతో హద్దు మార్చిన మరుపుని దట్టంగా మెత్తుకొని… మళ్ళీ మాగిపోయిన కునుకుతో తెల్ల దుప్పటిని కలుపుతారు.

కొన్ని తల్చుకొన్నవి.. కొన్ని కానివి.. ఊదుకోని రాత్నాలతో పడి ముక్కలైన రంగు పొగరుని ఊపి.. హద్దు లేని జాగరణ .. ఉన్నప్పటి అమాయ రుజువు కంటిని తీర్చి నూనె పొందుగుల మట్టి జారుని మర్దన చేస్తారు.

సారించిన విశ్వ ముద్రలకి తెరిచిన కంటిని దులిపి.. ఊపి ఆర్పక ముందే లాంతరులో కంటి గోళం చూసి ఏడుపు మొదలుపెడతారు. ధ్వని ఛాయల మధ్యంతర తలుపుని గుద్ది ఏడుస్తూ ,, ఎంత చెప్పినా వినలేదని .. ప్రాజెక్ట్ ఒప్పుకొని.. డిప్రెషన్ నుంచి బయటపడక … నజ్జయిన శరీరంతో పగపట్టిన కలతని .. రాపాడించి కప్పుకున్న బెంగని తోడి… సరిచెయ్యని స్క్రిప్ట్ జోడించిన అడుగులు ..

కలిసిన నిషేధ ముఖాల పోలికని పట్టుకొని.. ఉన్నదీ.. లేనిదీ  మొత్తంగా కదిలి .. చెదిరి పోయిన నీటి నిడివిని పట్టుకొన్న లోపలి పలవరింపుని దాచుకొంటూ.. ప్రశ్న చలనకి పట్టిన చేదు పెదాల కట్టడిని దాటుతూ.. హద్దుని కప్పుకున్న దేహపు నియోర్జాల మాట.. ఉన్నపలంగా తను గదిని కొల్చి.. మాట తప్పిన ఓర్పుకి కట్టిన రుజువుని చేరుకొన్న ఒంటి రాతలు పిండుకొన్న నిద్రని పుక్కిలించి.. తురిమిన  అవధి పోటుతో రెండో తలుపుని కట్టుకొన్న భజాల చివర రాలగొట్టిన ఇరుకు మూటల చీదర…  

కలిసి ఉన్నామని.. ఉండలేదని .. ఉన్నప్పుడే తెలుసుకొన్న దోసిలిని నింపుకొని.. శ్వాస నిఘారపు కీడుని నానబెట్టి .. పగులగొట్టిన కుండల మధ్య చితిని కాగుతూ.. కథ గుక్కపెట్టి ఏడుస్తూ కాళ్ళ మీద పడుతుంది. సగం చివికి పోయిన మండపాలు.. భూమి కలతని అంటుగట్టిన కేంద్ర నిర్భేద్య కంకణం ఊడిపోయిన నొక్కుడు చీకటిని పట్టుకొని.. ఇగిరి పోయిన చూపుల విడి విడి రాకని దాచుకొన్న వంట గదిలో … కథ లోపలి పోయిన … అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టిన శవాన్ని తీసుకొని.. అరిచి కూలిపోతుంది..

ఊట భావిలో .. నీరు పట్టిన కలని తీర్చిన రంగు పోలికని వద్దనుకుని.. దేహపు సంద్రతర శ్వాసల గదిలో ఊరేగే సందడి … నిలిపేసుకొన్న రెండు వీధుల మధ్య కంటి బరువుని పోగుచేసి.. నేను నిగారుపడి ఉన్నన్ని .. కంటికి దొరకని పట్టుని దులిపి.. కప్పుకున్న శ్రద్దల కీడుని వదులుకొని.. చేర్చిన పూడికలు నిట్టూర్పు .. శ్రమ కక్ష్యకి చిక్కుకొన్న శిధిల గోళపు పుప్పొడిని చిలికిన కలలు

శత్రువు ఆరబెట్టిన బరువుని అరగదీసి తాగుతూ.. హెచ్చరికల లేని సమాధి మధ్యన నిండిపోయిన  జుగురు బొమ్మ ఊడిపోయే చీకటికి  నిలదీసిన బెరుకు చూపులు.. ఒప్పందాలు.. సేవక కొలిమి బొమ్మలు.. రస రస కథల మిగులు భూమి పోటుకి సరి చెయ్యని .. చూపుల నిండు కాళ్ళని కప్పుకొని … అద్దరికి పోయిన కథకి … మాటకి.. దశహిత కంటి జూలుని విదిలించిన కునుకుకి పట్టుకొన్న ఓపిక.. మరో చాప్టర్ లేని పొడి వీధులు..

కప్పిన జాగరణ.. ఋణ పడిన నిందలకి తీర్చిన కథతో .. కలబోసుకొన్న పరిధి.. దుఖానిదే కాదు.. తనది కూడా .. ఏ మూవీని వదులుకోవద్దనే చెప్పాను.. సగం తెగ్గొట్టిన ధ్వని ఛాయల కిందుగా .. మర్చి పోయిన నిద్ర పోరుని పట్టుకొని.. సరిపోని విపరీత గుంభనలో పడి.. తలమునకలు పట్టుని ఊపుకొంటూ.. కలిసిన విసుగుతో .. గుడారాలు విప్పుకొన్న సంద్ర పూర్ణతకి చోటుని కాల్చి..

తెల్లారేసరికి ఆ ఇంట్లో నేనుండనని తెల్సిన మరో గతకి చేరని అనుసారిత మర్సీకాల పునాదిని లేవదీసి .. కథకి రెండో ఋణం అట్టేపెట్టిన కల. పరాయి  పేటికలో ఇరుక్కొని కందిపోయాం.. ఒరిగిన దేహ పట్టింపులేని పట్టుకొని .. దులిపి పెట్టుకొన్న శరీర భారీల నలతకి కందిపోయిన కన్నుతో.. పీల్చుకున్న వివర్శ మోతాదుల చప్పుడుని కప్పుకొని.. అక్కడే నీరు పట్టిన ఇల్లు.. ఆ వెనక అదీ సెట్ అని అరుస్తారు.

లాంతరు గోళాలు కంట్లో నానిపోయి.. ఊరట పడని నివిర్ప్యూల రాత్రి సంధిని చప్పుడు లేకుండా గడిపి.. చేరదీసి కంటి శూలపు పదునుని సరి చేసే గొంతులో .. నిబీక్ష కనోమయాగాలు జత చేసిన కంగారుని పెట్టుకొని .. మళ్ళీ పులిమి పాక్కొంటూ పోతారు. చివికి పోయిన భ్రమణ సెగకి ధూపం పట్టిన చెలరేగింపుని పట్టుకొని.. పల్చని శరీర దట్టపు పూర్ణ శాలలో పడి .. తొందరలేని సమాంతర క్రతువులు మంత్ర స్థానం సరిపెట్టుకొంది.  ఆగిపోయిన జంట క్షేత్రాల్లో వినికిడి శ్వాసిత అద్దకాలని చేర్చిన కంటి శోధన .. పేరుకున్న చీకటి బావుల్లో కదిలే నిద్ర అనుయాయతకి చూపుని పెట్టుకొంటారు.

పాక్కొంటూ పోయిన దేహ ఎద్దడి నిలువు కాకని కదిలించి పెట్టుకొన్న నిరవడి.. కోపపు ఊలని మోగించి కాసిని నులిమి వెళ్లిపోవడాన్ని చిన్నగా చెప్పుకొని.. అనేక పెద్ద తప్పుల కుప్పలో పోసి మొత్తం కెరీర్ ముంచేస్తారు.. జట్టుకట్టిన తీర్మాన వణుకుల కుంపటిలో బిగిసిన అపార్ధ మూలకాల సర్దుబాటుని కలిపి.. తను మళ్ళీ కప్పిన బట్టతోనే తోడు పెట్టుకొన్న గోడలు.

పరిలిత ఆర్దన సర్దుకొని .. కాపలా పెట్టిన కంటిలో దీక్షని పోల్చిన రుణపు కట్టడి.. శ్రమన విరుగుడు …వేరుగా చెప్పుకొన్న మాటలు.. ఊసులు.. భాషణలు .. తెల్ల కొండల్లో జారిన ఊట.. చెట్లని సెట్ లో తగలబెట్టారు. మట్టి కూజాలని .. పింగాణీ చప్పుళ్ళని దండ కట్టిన మెలకువలో.. అరగదీసిన  సమాధి మూలకాలు చెలరేగిన చీకటికి ఎదురుపడి .. తడబడే ఉండిపోయిన కంటిని పట్టుకొని.. చప్పరించిన కథలకి చేర్చిన నడకతో.. హద్దులే చెరిపిన శూన్యం పట్టుకొన్న పరిధి.

కొండని కడిగిన నీటి జూలుతో .. పేరుకున్న నిద్ర రంగుల కెమెరాకి అద్దాలని ఎక్కించి.. మెట్లని కరిగించి దాచుకొన్న నిడివి పోటుతో.. పేరుకు పోయిన నిద్ర రుజువుల నొప్పిని తట్టుకొంటూ .. ఋణం తీరిపోయిన కంటి సూత్రాలని సరి చేయక కదిలే గదిలో పోత పోసిన చీకటి మూలాల్లో పడి .. పోలికని మార్చి చూస్తారు.

పాతుకు పోయిన నిరాధార గండం దిగబడ్డ కన్నుకి దీపమిచ్చిన చోటులో పడి.. పొందిక లేని వీధి బొమ్మల అడితి .. ఆటని తీర్చుకొన్న చావుతో.. కలిసిన నిఖారింపుకి తురిమిన నిర్దయ పుట్టుకలు.. సలకలం మొదలై .. కంటికి కాల్చిన పునాది ముట్టడిలో పడి .. ఊపిరి ఆడని కుదుపుని పట్టుకొని.. దారి గ్రహణపు పొందికని దాచుకొని.. శరీరం కలిపి చుట్టిన కన్నులో పోత పోసిన ధ్వనుల పూడిక…

తొలిగించి పోయిన చూపుల పట్టికని తుడిచిన గంటలకి .. ధూప భూమిని కప్పిన నిషార పాతకపు వాసనకి పట్టి వాలిన నదిలో నవ్వు…తిరిగి వెళ్ళిపోదాం.. ఎవరమూ కొత్త గొంతుని నమిలి ఇక్కడ మాటని విడదీసుకోము… చెప్పినప్పుడే ముఖాల సంచీని దులిపి .. పోగేసుకొన్న స్వేద ఋణం ఊగిన కాటుక మోడుల్లో .. చేరదీసుకొన్న నిర్ణయాలు ఏడ్చి.. దృష్టిని తాగుతాయి.

షూటింగ్లో చెలరేగిపోదామనే ఉంటుంది.. ఈ లోపు ఏదో స్లిప్ అందుకొని.. డైరెక్టర్ ఇంకేవో స్లో డౌన్ అయ్యే సూచనలు ఇచ్చి.. పాత్ర గ్రాఫ్ ని అటూ ఇటూ మార్చి.. సన్నివేశాలు ట్రిమ్ చేసి.. హీరో ఎలేవేషన్ షాట్స్ ఆడ్ చేసి.. పెరిగిన దేహ సవరింతకీ మోసిన చూపుని కుదిపి..

నల్లని ఓ పెద్ద చెయ్యి .. తన చెంపని తాకినట్లు నల్లబారి.. శ్వాస పీల్చేసే మెషిన్ ముందు ఉన్నవాడిలా ఐపోతాడు.. పొంగి పోయిన ఆవిర్లు పట్టుకొన్న చెమ్మని దులిపి.. భయ కాపాడింపులని పట్టుకొని.. నిలబడ్డ శరీర శుభ్రపు కారణాలని కట్టుకొన్న నివేళ దాహపు గతిని చేర్చుకొన్న అడుగులు.

 గురువు మరణించాడు.. గది రెండో నిద్రలో కరిగి.. కలపై కోప్పడుతూ.. నిద్ర హద్దుని దాటి.. మృత్యు పోర్న దుఃఖంలో కూలిపోయింది.. అతని నివాళిని కొత్తగా డిజైన్ చేయాలని .. అతను నా చుట్టూ తిరుగుతాడు.. మసిలిన శరణు పోటుని కప్పుకొని.. ఇగిరిన సిగ్గుతో తోడు నిలబడతాడు.

శరీర ప్రమిదలు మోసి తెచ్చుకొన్న గోళాన్ని కడిగి.. వానలకి రెండో విడిదిని సరి చేసిన పునాదులని వదులుకొని.. ఇగిరిన పెదాలతో పేరుని దాచిపెడతారు.. అతని నివాళిని కొత్తగా డిజైన్ చేయాలని .. అతను నా చుట్టూ తిరుగుతాడు.. మసిలిన శరణు పోటుని కప్పుకొని.. ఇగిరిన సిగ్గుతో తోడు నిలబడతాడు. ఇంకెవరో వెనక నుంచి చిన్నగా గొణుక్కొంటూ.. వీడు రేపటి నుంచి కనబడకూడదని .. చెప్పుకువెళ్ళిపోతాడు..

ఆనవాళ్ళని కడిగేసి .. చిత్ర పూనకాల కలబాటు పట్టుని దులిపి .. సగం సెగకి కాల్చి .. పూత పూసిన దుఃఖ గుండ్రల్లో తప్పిపోతారు. చీకటి నిండు కుండలోకి పారబోసుకొన్న చావు బూడిదని నింపి.. పరిధి మొత్తమూ చేర్చుకొన్న నల్లని అరుపులతో .. పోతపోసిన కంటి రవ్వల దాపులో కురిసిన కునుకు..వెంటపడే అన్నీ వదులుకొని.. దుఃఖపు మడుగులో పోసిన కంటి శిధిల మంగళ హోరిమిని ఎగదోసుకొంటూ.. తేరుకోలేని నడకతో .. వేరుపాటు లేని రెండో కంటి ప్రదక్ష మునకలని తప్పించుకొని జారిపోతారు..

పారబోసిన  నిండు ద్రోణుల కౌగిలి పట్టుని కలిపి చేరుకొన్న కొండల్లో .. అదే చోటు తను ఉండి .. మాటని అడిగి.. పరిలిత హార్ధనని సరిచేసి … కళ్ళకి మోసిన పుటాకారపు మన్నుడి గతిని కప్పిన రాతల్ని పోగేసుకొంటూ.. రుణపడ్డారు. ఇదిలా శాశ్వతమవదని.. చప్పుడు చెయ్యని విసుగుని మార్చుకొని.. స్థలన ఊపుని చేర్చిన పుట్టుకలు పూడికని చేర్చిన అరచేతులతో చదువుకొని.. అప్పగించిన శరీర పలకాల్లో ఊరిన గంటలు.. ఆకర్షిత నిద్ర చూపుల పట్టికని తుడిచి .. లేవదీసుకొన్న కథల కూర్పుని పట్టుకొని.. చేర్చిన నడకల మధ్య ఉరిమిన గోళాలు.. కాల్చిన శరీర కావెడ లో పడి .. నీరు పట్టిన కలకి గొళ్ళెం బిగించిన కంటిని అరగదీసి పొడిగా రాలిన మెట్లని పట్టుకొని.. గాలి ఆడని హద్దులో పడి.. తలమునకలుగా చేరుకొన్న నొప్పిని కరిచిపట్టుకొని.. సరి చెయ్యని రాతకోతలు.

పాతుకు పోయిన సాయుజ్య దీవులకు … కెరటాల దట్టపు కొండల్లో పోటెత్తిన మృత్యు రాతకి మేకప్ పూసి .. కంటికి దగ్గరలో కలనీ పొడిచి .. పాలని అద్దుతారు. కాల్చిన శరీర కావెడ లో పడి .. నీరు పట్టిన కలకి గొళ్ళెం బిగించిన కంటిని అరగదీసి … పొడిగా రాలిన మెట్లని పట్టుకొని.. గాలి ఆడని హద్దులో పడి.. తలమునకలుగా చేరుకొన్న నొప్పిని కరిచిపట్టుకొని.. సరి చెయ్యని రాతకోతలు..

ఇంకా అది దూరం జరపని భయం కలుపుకొని స్రవిస్తూ .. పేరుకు పోయిన నిశ్వాస రీతుల పట్టుని సాగదీసి.. అక్కడ జరిగిన సంతాప శూన్యంలో పేరుకున్న సమయ పేటికలు.. విరిగిన దూరాల మధ్య చేర్చిపెట్టుకొన్న .. కునుకుకి అద్దిన మరణతకి సరిచేసిన చోటులోనే … ఇంకోసారి అదే మాటని అందుకొని.. సరిచెయ్యని రంగు గ్రహణపు అద్దంలో దాక్కొంటారు.ఇదొక మాయ తొలిచిన కునుకు దూరంలో పోతపోసుకొన్న గ్రహణ నాభిని తొల్చుకొని.. నుదిటి కోతని సరిచేసుకొన్న కథని పొడుచుకొంటూ… విల తాయిలపు పుట్టు నవ్వుని దాచుకొని.. కదిలే నిద్ర గ్రహణపు పోటుని కదిలిస్తూ.. వెళ్లడానికి లేని  ఆరాయింపుల తుట్టని కదిలించి.. మాటలని కలుపుకొంటారు.

విభ్రమ మరకని తుడిచి .. నుదిటి నిండుగా పోగుచేసిన కంటి దీక్షకి ఒరిగిన .. కీడు రాతల అయోమయం పట్టుకొన్న చీకటి అనుసాధనకి సాధ్యం చేసిన గొడవలతో.. పగిలిన బొమ్మలతో నిండిన నది.. ఏడ్చి కింద పడిపోయిన ఇంద్ర ధనుస్సు….ఇదొక గర్భ వాకిలి చేరదీసి నెలలకి తాడుని చుట్టిన శిక్షణ.. ద్రవ హోమం.. బడ్జెట్ మోతాదులకి వణుకుతూ.. ఆత్మ హత్యల బరువుకి కుంగిన వెనక రధం దిగబడ్డ స్వేద రూపులని పోతపోసిన నీటి సర్దుడి బొమ్మలని సరిచేసారు.

పట్టుకొని.. విడిపోయిన నివ్వెరపాటుతో.. దుర్భల గతిని సవరదీసిన కంటి సూత్రాలు వదులై.. మల్లి చెప్పుకొన్న కొండలని అందుకొని..

ఏదీ బయటకు రాదు .. కొద్ది రోజులంతే.. ఆ తర్వాతంతా ఊహించ లేనంత ఎత్తులో… ఊయలలోపండించిన కల .. చీకటి form houseలో ఓపెన్ చేస్తే… కట్ చెప్పడానికి లేని ఏక్షన్ తంతు జారుతూనే ఉంటుంది. రమిత రీతుల కంటి నలుసుని పండించిన దుఃఖ చేలనకి .. ఒరిపిన దృష్టి సంధిని కప్పుకున్న నిలాస తమకపు పట్టుని ఊడదీసి… జ్వర గుండంలో పడి తలమునకలు … చేదు గదుల మంటకి చేర్చిన నడుము.. నొప్పి తీర్చిన గొంతు వేడికి తిరిగిన ఆయాస నీరుని తాగి.. సొమ్మసిల్లి …

కథకీ .. మాటలకీ.. ఒట్టు పెట్టిన నవ్వుల నాలిక పుండుకీ.. రంగులని తెచ్చి.. స్కాచ్ పోసి.. వెలిగిన దుఃఖ బల్బ్ ల మధ్య .. తూలి పడిన శరీర నీలపు మచ్చని ఆరబెట్టుకొని… ఒంటి పూతలు.. శరణు మితిని కలిపిన చేదు నిద్రల సముదాయ ముఖాలతో .. పీల్చేసిన మృత్యు పాశపు అస్థిర గ్రహణ సంధికి రంగు పులిమిన కంటిని చూపిస్తూ… నిరావేశ స్థిర కూర్పులు… సంధి సాధన నాదిగా ఉండక .. లోపల వణికిన నిద్ర ద్రోణుల్లో పిండుకొన్న నలుపు రొమ్ముల ధూళిని తుడిచి..

నిండి పోయిన కాస్టింగ్ లిస్టులో మరేం కనిపించదు.. కొంత కాష్ ట్రాన్స్ఫర్ తప్ప .. కలవడమూ అలానే.. ఏదీ కనపడదు.. ముందులా … ఇంకో రెండ్రోజుల్లో అంతా సర్దుకొని వెళ్లిపోండని… తరిమేసి.. జాలపు ఛాతీలు… సమనత .. అర్ధ చలన ముగింపుని నేసిన పుటాకారపు దృశ్య వంతెనకు కన్నీరు పెట్టిన మాటలని తడిపి .. ఇంకా చేరుకొని..  పొద్దుపోసుకొన్న శరీర లాల..

సమయపు సమయపు నీటి చతురస్ర గదులని.. కలత గోషని .. నిర్మిత చలన తటాకపు ముట్టడిలో చేరి కాలిన భయ నిద్రల గడువుని.. ఒరిగిపోయిన మిష్మిత ఘటనలని కొట్టుకొంటూ.. తాజాగా ముసిరినా చావుల మధ్య కూలిన ముఖాల చిత్ర కలతని నింపి పోసుకున్న … కంటి చేలన రాత్రంలో పడి కెరటాలుగా మారి.. ఒద్దు కోసుకుపోయిన నిర్మాణ మత్తుగడల పిలుపుని ఏమార్చి.. హద్దు లేని శ్రమల మంత్రపు జాగారం కూరుకు పోయిన పాత శరీరాల తోడు..

పేగులని మెలితిప్పి… కుండపోత దుఃఖ నీలాపు పడిగాపులని దాటుకొంటూ.. తెలిసినా .. తెలియనిది .. ఇలా చుట్టుకొని .. దగ్గరకి చుట్టేస్తోంది.. దీనికి మరో సారంజిత ఒత్తిడి కాల్చిన పుట్టుకతో హద్దుని పట్టుకొని మాయమై… ఉండీ లేకపోయినా అమరికని లాలించే స్థిర పూర్ణ నిడుపులకి … కోసిన ఛాతీల ముళ్ళ కంపలో .. దొఅర్ల్లని ఆచూకే నమూనాలని తుడిచి.. అంటుకట్టిన జ్వర నిందల గడువుకు దూరంలో మోసుకొన్న మోసపోయిన కంటి మీటలు.. కౌగిలి పూర్తి హంగులు..

ఒంటి గడపలపై బిర్ర బిగిసిన నమ్మకాలని కడిగి.. నూనె పోసిన కళ్ళకి మసక సానపెట్టిన కూపాల్లో పడి .. గింజుకొని.. అనేక అలిసాక.. నిరావేశ స్థిర కూర్పులు… పడిలేచిన కంటి పోటుతో.. హద్దు మీరిన నటనని పట్టుకొని.. చేర్చిన శూన్యాల కైపుని వడపోసి.. నిస్త్రీత మొండిగోడలని కూల్చుకొన్న శ్వాస దరువుల నలతకి .. కాపడం పెట్టిన చీకటి నిలువరింతని పగతో పట్టుకొన్న భయానిరూపాలు.. నిండీ కనబడని జాగారం .. అందిపోసుకొన్న రంగు రంగుల మేకప్లని .. తిప్పి కడుగుతూ.. హద్దు చెదిరిన పెదాలని దాచుకొంటూ.. తేరుకోలేని మాటలు.. పులకితలు.. పట్టూ విడుపులు..

పగులు కుండలు … కాసిన్ని చాటు చాటుగా తీసిన సగం సగం వీడియో క్లిప్స్ .. దేనికీ పనికి రావు.. స్థితి గమన హొయమాల పలుకులని కడిగి నడిచిన బూడిద కుప్పలు.. ఎవరికీ ఇంకో నడక దొరకని కుంపటిలో .. ఊదుకొన్న పెదాలని పక్కకి ఉంచేసి.. కప్పిన ఉరుముని స్థిరం చేసిన కాపలాలు. అంపకపు చలన దర్శనకి ఏడుపుని జోడించి .. కరిగిన దేహ మెరుపులా .. కట్టేసిన చూపులో పడి .. తలకిందులు గడువుని కాల్చి.. ఇదే అని తెలియని నిస్త్రాణ మధింపుని కరిగించి …

నిశ్వాస కుదుపుని వేలాది దీసిన సాక్షి .. కనపడని నిద్రిత జ్వర చీడని పెంచుకొంటూ.. నసబారిన వసలిక చర్యలు మొద్దుబారి… సీసాల భావి నిండి .. అందులోకి దూకాక .. ఊపిరికి అడ్డం పడిన దేహ స్పృహలో పడి లేచిన ఒగర్పుని మంటపెట్టి .. ఛాయా నిర్మాణ పట్టుని సాగదీసి.. రెప్పల నిండు గోళంలో పేర్చుకొన్న మన్మయాయ నిశ్చిత… అలుముకున్న జాగార పోతలు .. రుణపు ద్రోణుల్లో పడి లేచిన కంటి దురదని నులుముకొన్న ఊపిరి గుండంలో శరీర చలన చెదిరిన కాళ్లతో … పట్టుకొన్న నిద్ర దూపుల కౌగిలిలో కసి పెచుకొన్న దేహ నిడివి పాతిపెట్టిన దుమారాల గుండం.

వణికిన దేహ పొరలని దాటుకొని… అక్కడ వెనక రోల్ .. రెండు బలమైన సన్నివేశాల్లో నిలబడి.. ఒకటి రెండు ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు.. మంచిదే కెరీర్ కి.. మోసి తెచ్చుకొన్న నిరాధార కంటి తోడుని కాదని … నీరు పోసిన గ్రహణ పూడికల్ని వదిలి.. చీకటి ఒంటికి గుచ్చుకొన్న అస్థిర రుణాల పీడనని పేర్చుకొంటూ.. ఇంకిన దేహ ఋణం వదిలించుకొన్న ఖాళీలని కనిపెట్టుకొంటూ బరువుగా నిలిచిన ఒప్పందాలు.. పోతపోసిన నిద్ర గండాలని దాటి.. కదిలిన శరీర ఉరుముల పట్టుని సడలించి..కప్పి దాచుకొన్న గంటల మధ్య తేలిపోతున్న చీకటి నిల్వల దుర్గoదం .. పడిలేచిన సిగ్గుని దట్టించిన రొప్పు..

అప్పటి వరకు పార్క్ చేసిన కారుకి… డూప్లికేట్ డాకుమెంట్స్ ఉన్న ఇంటికి నోటీసు అంటించి బయటేసాక .. ఎవరో వచ్చి నోటీసు అంటించి గెంటేస్తారు.. ఇదిలా ఇంతకు మించి జరగదని .. చాలా మందికి తెలుసు.. అందుకే అప్పటికీ కొందరు రావడం మానేశారు.. పేగులు బయటకి వేసుకొని సంతర్ప కీడుని పంచి.. దూరంలో ఉండిపోయారు.. సర్దుకోవడానికి ఇంకేం లేదు.. చావులోకి ఒరిగిపోవడానికి మరో అడ్డూ లేదు.

చీకటి కుళ్లిపోయిన వాసనతో సీసాలు తరిమిన మత్తుకి .. footpath దగ్గరకి తీసుకున్నాక .. ఎవరో గుర్తుపట్టి… రీహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేసి.. కాసిన్ని నోట్లు చేతిలో పెట్టి వెళ్ళిపోతారు.. ఆ రాత్రి ఫారం హౌస్ లో తన శరీరం చివరిగా వాలిన పోలికలు దొరికినా .. నరాలు డదని మింగిన గొంతు.. మాటని రానివ్వదు.. విసిగించి భోగ నిరాయపు పట్టు గంటని మోగించిన కునుకుని వడపోసి.. కుదిపేసిన ముఖాలని దట్టపు పొగలో ముంచి.. కసి రాతల్ని తుడిచిన కంటి రాతని కప్పుకొని.. ఊరడింపులేని పెద్ద నాలికల దాడి.. ఇది ఎలాగూ ఇంతే జరగాలన్నా .. ఉండిపోయి పగటి బరువుని కరిగించి పెట్టుకోవాలన్నా .. ఉండిన అనుమాన రీతులని వదులుకోవాలన్నా ..

ఊధ్వల స్థితి సంపద … విలాస నీటి పక్కలు.. ఒంపులకి మెరుగులు దిద్దే స్విమ్మింగ్ పూళ్ళు… నిషా భ్రమణ చీకటికి కాసుకొన్న దేహ మర్మతని కొంచెం కొంచెం పంచి.. కెరీరే గ్రాఫ్ని నడిపించుకొన్నా.. గుప్పుమన్న నిందలు పట్టి లాగుతూ.. చేదుగా పండిపోయిన జత రాత్రుల కవ్వింపుని ఉడకబెట్టి.. కంట్లో నూరిన కథని తెచ్చుకొని.. గడవని గొంతుని అరగదీసిన భయం పెట్టుకొన్న చీకటి అలతిని పట్టి లాగుతూ.. పేరుకుపోయిన దేహ నిందల గట్టుని తెగ్గొట్టి .. పగగా ఉండిపోయిన కంటి శూలపు పట్టుని చల్లారబెట్టి..

అర్ధరాత్రి నిద్ర వదిలిన దూకుడుకి.. ఆయాస స్థలంలో వినిపించే ఆ కేక ఎవరిది.. కెంపులు పండిన గొంతు .. అద్ధాల పీఠ భూమిలో అందంగా సర్దిన సమాధి.. మరో పరిచయస్తుడి చూపుల నాలికని నాకుతున్న భయ స్తిరాల కైపు.. పండిన రంజాయి ఊటలు.. చేదు గ్రహణ ఒరిపిడికి తట్టుకొని.. కలిసిన నీటి యుద్ధపు క్షేత్రంలో పడి తప్పుకుపోతూ.. సేఖరిత పట్టూ .. నిడువుల గతిని కూర్చి.. హేయతని తాగిన నెలల కట్టు తీరుని తెగ్గొట్టి..

అదే .. ఇదని తెలియక పోయిన .. మొదలైనప్పుడు .. ఇదీ సరైంది కాదని తెలిసినా .. పొద్దు గడవని కోరికని దులుపుకొని.. నీల రాగంలో మైరేయ…దేహ గ్రాణ సరి నేతలు పల్చని ట్రాన్ఫరెన్సీ తో కోసిన నెగడు బజారులో .. వాసన పులిసిన మూటలని లాక్కొని..  ఉండిపోవాలని అనుకోలేదు.. సర్దుకోవడానికి కంగారుని .. మోసి తెచ్చుకొన్న దేహ లాలస దృష్టి కమతంలో సాగుచేసుకొంటూ.. ఋణం కప్పిన ఇంటి ముందు.. తానే.. నాకంటూ ఓ స్క్రిప్ట్ రాయలేవా?

అస్తమాను రాలేదు.. ముందు కన్నా తగ్గేంచేసాడు.. తనకీ భార్యా .. పిల్లలు ఉన్నారుగా? స్పయానత .. మండిన దేహ రాత్రుల కొలిమిలో దిగబడి.. నెల నెల కి బరువెక్కిన దోష నిద్రని అడుక్కి చేర్చి.. వదిలేసినా కంటిలో పడి తప్పుకొన్ననొప్పిని సగం విడదీసి.. కలకి మంత్రించిన కన్నుని అతికించి..

ఇప్పటికే గుప్పుమన్న వార్తలు తిరుగుతున్నప్పుడు… ఊరబెట్టిన చీకటి నైవేద్య అనుకూలనాలు.. పొద్దు మాసిన నల్ల నడకలో .. బూడిద పండిన పొద్దుకి ఊరటగా కాళ్ళ ముందు పడ్డాక.. ఇదే అని తెలియని విసుగుని పట్టుకొని.. గుంజుకొంటూ… పేగు మెలికలు … నిలువు భోషాణపు ముట్టడిలో కురిసిన గతి పీడనల జిగురు మంటకి నెరిసిన కథ…

ఛాన్స్ లు నెమ్మదించినపుడు… వ్యాపారం బానే ఉందిగా … అందరూ తన చుట్టూ తిరిగేది దేనికి.. అదీ వదిలిపోవడం మొదలైనప్పుడే .. లోపలి దిగులు మూటలు బరువెక్కి మోయలేక.. వెర్రిబాగుల దేహ గుండంలో పడిపోయిన కాపలాలతో కూర్చిన ఝాముల నేరపు పడగని పడగొట్టి.. ఇంకేం లేదని వరుస రాత్రుల పగని కూల్చి.. అక్కడే ఉండమని.. బలమూ… నిద్ర కైపుల పట్టుని దులిపిన కరకు నిలువు చీకటికి .. అన్య తలుపుని దిష్టి కట్టిన మెలుకువ .. ఆ దూరంలో చెట్టులా కూలాక..

దగ్గర వారంతా సెటిల్ ఐ .. ఊళ్ళో పనులు చూసుకొని మళ్ళీ వస్తామని కనిపించరు.. అలాగే అలుముకు పోయిన తాళాల వీధులు.. పాడుబడిన గుడులు.. లేచి తిరుగుతున్న సమాధులు.. రోడ్ల మొరుతూ బట్టని నాకుతున్న చూపుల పోటు.. తేలిపోయిన పాపపు బరువుకి కట్టి ఊరేగి ఈదుకొంటూ ఆయాసపడే చావు.. విసుపు గుండంలో మెరుపు చీదేసిన కన్నుని పట్టుకొని.. సరి చెయ్యని జిగురు నవ్వుని ఉడకబెట్టి.. సానుగతం కానీ నొప్పికి మెదిపిన చూపుల ఊపిరి పక్క…

కూలిన సద్దుబాట్లని వెనకా .. ముందూ చేస్తున్న నిజ రూప ప్రదక్షణలో పడి.. కాళ్ళ మడికి .. దున్నిన పొగని ఎగదోసి.. పేరుకున్న సఫల కన్నులో .. కాపడం పెట్టిన చీకటి ఉరుముని కట్టుకొని.. దవడ పగిలిన నిద్ర గున్నంలో పడి ముక్కలై.. ఇదే అనుకూలంగా ఉండిన రాశీ అనుకరణలు … వేలాడింపులు.. కలరింపుల అద్ది తీసిన దేహ పంటకి .. తెగులుపట్టిన కథని తాపడం చేసి.. చివరి షెడ్యూల్ కి చేరామని కబురు చేరుస్తారు..

నిండి పోయిన స్త్రీ శత్రువుల వీధిలో .. కలిసి చేసిన చీకటి పొగల ఉరుము చుట్టిన కలతతో .. హద్దులు పోసుకున్న నిందని జార్చుకుని.. ఇగిరిన నడుము మండుతూ.. కోలుకొని నిర్మిత బొమ్మల కక్ష్యకి జరిపిన మాటలని పోగుచేసి.. మాటల నసని మింగి.. శేషితః రుణ చిత్ర గడువులో .. దుఃఖం దొరికిన చోటుని పేర్చిన కలతో .. ఉన్నదీ నేనే .. ఉండాలనుకొన్నదీ నేనే … ఉండిపోక ఆయాసతీరుని కనిపెట్టి దాక్కొన్న కసి పొదుగుని కత్తిరించిన గొంతుగా ఉన్నదీ నేనే..

ఉండటం .. లేకపోవడం .. రెండు ద్రోణుల్లో పండిన మాటల మధ్య చెలరేగే మంత్ర నిధుల కాపుదలని వద్దని పట్టుకొన్న గంటల మధ్య .. ఉనికి పారబోసుకొన్న మాయని వద్దని .. పోటు పెట్టిన నిస్పృహ ఎద్దడిని కట్టుకొంటూ.. చూపు పగిలిన సీసాలని దాటుకొని.. దొరికిపోయి.. వదిలిపోతున్న శరీరం మేకప్ కి లొంగక .. మాటకి అతకక .. గొంతుకి వేలాడక.. చీకట్లో తచ్చాడే కణతని వెచ్చ చేసి.. కలబెట్టిన దేహ బావులింతని కనిపెట్టి.. లోపలి చీకటి వదిలిన గాలి గుండాల పిలుపుని దాచుకొని..

ఫలిత ముఖాలపై రంగు దులిపిన నిద్ర రేవుల్లో పడి.. ముక్కలైన కెరటాల జలముని పట్టుకొని.. బిగిసిన సన్నివేశాలు మళ్ళీ నల్ల ద్రవంలో మునుగుతూ.. హెచ్చరిక లేని ఆధార నిర్ణిత పునాదులు.. అక్కడే మొదలైన పురుష విగ్రహ నిర్మాణాలు .. ఉబుసుపోని ముఖాల పట్టుని దులిపి.. పొగ పట్టిన గింతులో మండిన చీకటి ఊగుని .. బూజుతో నింపి.. కంటికి చిత్ర జారుని సరిచెయ్యక పారబోసుకొంటూ.. తేరుకొని భ్రమణ మందలింపుని తోసుకొని చేరతారు.

ఎవరమూ ఇది .. అక్కడ దొరికిన ఖాళీలని పట్టుకొని … దుళ్ళిపోయిన పాడు బావుల కేకని పెళ్ళగించి .. మాసిన నెలల కూర్పుని దాచుకొన్న నడకకి ఎదురొస్తూ… తప్పి జార్చుకొన్న దేహ నిగడ పోతపోసిన మాటలని..చేదు బొమ్మల నొప్పిని .. ముఖాలని కాల్చి .. తప్పించుకున్న సిగ్గునీ .. పేరుకున్న చీకటికి మరో దోష విచ్ఛిత్తి కణపు నిప్పులు.. పైకీ .. కిందికీ చేరిన వేలి సంజ్ఞలని .. ఊరబెట్టిన కథల నిఘారపు మంత్ర దండం జులిపిన పొడుగు నేలని దువ్వి.. ఛాతీల భగ భగ లో పడి కొట్టుకుపోతూ

శాప పుడకలని జేర్చుకొని .. చేరదీసి పగటి బరువుని సెగకి .. ఒరిసిపోయిన గొంతుల చీకటి నాల్కలతో పండిన సీసాలు.. దేహ రసిని పీల్చేసాక.. ఇక్కడ ఉండటమే పెద్ద గోడల దుఃఖం కింద పడిపోవడమే.. కలిసే ఇలా అనుకోని పడుకున్నాక … రాత్రికి రాత్రే మారిపోయిన అగ్రిమెంట్ల మధ్య కూలిపోయిన కథని పట్టుకొని.. సగం లో ఆగిన షూటింగుతో … తిరగబడిన నిద్ర రవ్వల మంటని ఎగదోసి ఆర్పిన కంటి దోషం నిలదొక్కుకుని..

తడబడే నిద్ర తీరులని కలిపి చుట్టిన రహస్య తీరులని … మోసపోయిన శరీర ఋతువుల జ్ఞాన పోటుని సరి చేసి … కూల్చిన దేహ రంగుని పోతపోసుకొంటూ.. తెల్లబోయిన సమయ దేహవుల మత్తుని సాగదీసి ..కంటిని ఎరుపుగా తోడైన కథల మధ్య .. నల్లని జీర్ణ నిషాదక పొడిని గ్లాసుల్లో పట్టి.. ఉండిపోయిన కంటి కాపలాని దాటి  కత్తితో నరికిన చీకటికి నిల్చిపోయిన శ్వాస రేవుని చేర్చి.. పడవలు కాలిన గుమ్మంలో పడి..

తేరుకోలేని దుఃఖ నిరోవంలో పడి .. చుట్టూ తిప్పుకొన్న భద్ర రాత్రుల్ని సరి చేసి .. రెప్పల గానుగలో పడి రాలుతున్న శరీర రొప్పుని కడిగి.. సడి లేని నిషారీవాల పట్టుని వదిలిన జడని విప్పుకొంటూ.. నిండు తీర్ధాల కైపు… ప్రవర్త శరీర తెగింపులని పట్టుకొని.. మోతపెట్టిన కేకల సంధాన కాల్చివేతని పట్టుకొని.. అక్కడే ఉండిపోయిన పొడుగు ధ్వనుల కూర్పుని చేర్చిన చూపులో పడి.. చప్పుడు దొరకక …

వినబడే శూన్య హీనత .. కప్పిన మంచు రాత్రుల పొడుగుకి చెదిరి పోయిన నివాళి నడకని మొత్తుకొంటూ… విరిగిన కథకి రంగుని విదిలించి.. జడ గుప్పిన చూపు … ఊపేసిన దేహ పుట్టుకని కలిపిన దేహరింపుని గట్టిగా నులిమిన సంప్రోక్ష సంధాన గతిని లాగుతూ.. హద్దుని సరిపెట్టుకొని తిరిగే వివశ పాట్లని చిదిమిన శరీర దిశాజాలు… పోత పోసిన నిర్మాణ కంటిని పోలికతో పట్టుకొని చెదిరి పోయిన గంటలని దాటుకొంటూ..  

విపుల తీరుల కంటి మాలని తెగ్గొట్టి .. పేరుకు పోయిన దేహ నాడుల బిగువుని కప్పుకొంటూ.. పిసికేసిన నిద్ర రీతుల ఒరవడికి జంటగా నించొని తీర్చుకొన్న మసక భూమిలో పడి .. దిశని మర్చి తిరుగుతూ.. విపరీతము.. సద్వ విచారనో … కలిసి నేసిన నీటి చీర మోసిన కంటిలోని ఖాళీ బరువూ .. బిగుసుకు పోయి .. స్మిఖిత నింబోలనలో పడి .. మోసగించిన స్త్రీ చుట్టూ.. పడిగాపులు మృత్యు తాకిడి నలిగిన ..

చేదు మందలింపుని … ఆరబెట్టిన కంటి సూత్రాల ముడిని … సెగ పెట్టిన కణతుల్లో ఊరట లేని నరాల గుచ్చపు అలసతని.. నిండీ కావలించుకొన్న శోధన బొమ్మల వైభవపు పొడి అద్దకాల నిశిత కూల్చివేతలని పక్కకి నెట్టి … సెట్స్ ని వదిలి .. సహజ ధారణకి అతికిన బొమ్మల మేళంలో .. మేకప్ లేని నవ్వు కావాలన్నపుడు ఆమె పిచ్చిగా చూసింది.. ఎలా సాధ్యం?  

జాడలు గుప్పిన నిశ్వాసలో పడిపోయిన పంటి నొప్పి.. కలబడి ఉండిపోయిన నడకని దాటి .. పక్కకి జరిగిన నిద్ర ఊర్పుల పట్టుని వదిలి.. ఆ మత్తుని ఊగించిన శరీరజాలంలో కన్ను పెట్టిన దిష్టి చూపులని కపి .. విపరీతాలని దేహ జరుగుబాటుతో.. కలిసిన శత్రు భూమిలోని కట్టడి చేసిన మాటలని విడదీసి .. కేవలం భీష్మ భ్రమణ ఉమ్మడి రాకని పట్టుకొని.. ఉండీ లేకపోయినా … కలిసి నిలబడిన ముఖాలని తేరుకున్న కెమెరా ముందుకి లాక్కొని.. రెడీ .. స్టడీ .. ఏక్షన్… అనకముందే కూలిన …

తలపెట్టిన దీపాల వీధిని .. నూనె పోసి పెద్దది చేసాక .. ధ్వనికి చేర్చిన కలల దూపుని తొలచి.. నిమిత్తత లేని కంటి రోతల జిగురు పట్టుకొన్న ఛాతీలు.. రుజుజాడ .. కప్పిన నిలివేత గుమ్మంలో పది వాలిన తల .. సమయ స్థలంలో పడి .. తొణికిసలాడిన రాపిడి నిప్పుని మంచం పోసాక .. నిందలు చుట్టిన పొగరుతో గాలింపులు.. విపరీత భాష్య ధారకి .. గుప్పిన తడబాటు రుణ కలతకి పండిన కాస్త తీరుబాటులో ఊరేగి.. అది మళ్ళీ కట్ చేసి .. మరో చోట అతికించి చూసుకొందాం..

అక్కడ వినబడని డార్క్ డైలాగ్ని మ్యూట్ చేస్తూ.. కేవలం పెదాల కుదుపుని పట్టుకొని.. కంటి ఎరని జోడించి కదిలే నిద్ర గ్రహణపు పట్టుని దులిపిన కన్ను.. కొన్ని ఎడిట్ చేసిన ఏక్షన్ కట్స్ ని .. ఫైనల్ మిక్సింగ్లో ఆడ్ చేసి.. భరోసా ఇచ్చిన nudity ట్రిమ్స్ ని పట్టుకొని.. లోపల చీకటి గదిలో బిగించుకొని.. మరో చుట్ట చుట్టిన బ్లాక్ మెయిల్ టోన్ తో .. commitment ల   గొట్రుని   ఒంపి.. పారబోసుకొన్న నిద్ర తీరికల చీకటిలో పాతిపెట్టిన నల్లని తెరల వెనుక నాలిక చప్పరించిన ఆడియో రికార్డు క్లిప్స్ ని జోడిస్తూ..

నిశిని దులిపిన మసక రేవులో కాల్చి పెట్టుకొన్న కాగితాల యేరు.. పెద్ద కొండల నీటి కాగడా పులిసిన ఎత్తుగడని తప్పించి మాట తీసుకొంటారు.. పేటికలో జల్లెడ పట్టిన కంటి శోదాలు .. రుణ పట్టులు… కోపం మింగిన సర్దుబాట్ల కుట్రని కోసేస్తూ.. పెనవేసుకున్న నిందలని కలిపే సీసాల మధ్య తూలిపోయి.. బరువెక్కిన శ్వాస జేగురు దుఃఖం మళ్ళీ చెప్పుకొన్న కొలతల శరీరం..

తెలిసే జరిగినా .. జరగనుంది చాలా బయటకి వెళ్లి మరో ప్రచారంతో నరాలు పేనుకొని.. విడిపోయిన విశ్వ శిధిలాపు నగర దోషికి మోసిన నడకని అందించి.. ఊరడింపుల సలాస కదలికనే చేర్చుకొని.. చెమర్చిన గోడలని చుట్టుకొంటూ.. ఋణం పోసుకున్న కావెడ బరువుతో.. హద్దుని చేర్చి పెట్టుకొన్న చాలన రీతుల పుట్టు సూత్రం … బుడగలు బుడగలుగా లేచిన బాత్ టబ్ లో నిద్ర నివాళులు … దేహ సాగవుల నిరాశ కదులుతూ , రెచ్చి పోయిన నమ్మకాల కుట్రని జరిపి.. పాడుబడిన సాయుధ హెచ్చరిక .. ఇంకా అక్కడే ఆగిపోదు.

ఇప్పటికీ అదే చెప్పుకొంటారు.. ఆమెని వాటికి మాత్రమేనని పక్కకి పెట్టేస్తారు.. సన్మయ దుఃఖ జాడీలో .. సిగపాటు ద్రోణుల్లో పాతుకొన్న మాటలని ఒడిసిపట్టి.. కంటి ఋణం పోసుకున్న  నీటి రధం పట్టు తప్పిన కెరటాలని కడిగి.. చెమ్మ ఆరిపోయిన గూడులో … సంధి చేసుకొన్న తోవలో పిండేసిన ఖాళీలు. సరదాగా వదిలిన ఫోటో sharing’s  వైరల్ అయ్యాక .. రాత్రి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ భుట్టో పరుగులు పెట్టి .. రుణ అలుముడు కంపని విడదీయలేక అల్లాడుతూ..

రుణపడి.. పాలిపోయిన ముఖాలతో ఇగిరిపోయి.. దేహ సహకార నిర్లిమప్తం పట్టుకొన్న కలలని వండి వార్చి.. దేహ చీలికని మెల్లగా ఎక్కించిన పడకలు.. నిన్నా తనే ఉన్నాడని .. పగటి వెలుగులో ఒప్పుకోడు .. ధ్వని మాయ చేసిన పిడుగు చప్పుడు చెయ్యక తగలబడ్డ దేహంతో కూరుకు పోయిన దూరాలు .. గట్టిగా నిలబడ్డ పరాయి కులసతాని తీర్చుకొంటూ .. రుణ నిష్పత్తికి దొరకని prerelease ఈవెంట్లు.. కబురు గ్రహణ పొడుగులో మతి తప్పిన బూతుని తుడిచి.. అది కాదులే అని నమ్మబలికి .. తట్టుకోలేని ఛాయా నిర్లికాలు

పురుష గాలి.. పౌరుష శ్వాస .. నిందలని గట్టిగా దులిపి .. పొడవైన అనుసంధాన దృష్టి రొప్పుని వడపోసుకొని.. నిల్చిపోయినా… అక్కడక్కడా పాకిపోయిన దుమార నిందలు.. సంకెళ్లు పడ్డ లిపి దూరాల్లో .. అరక దీసిన మేకప్ కిట్లు.. గొడుగులు.. బుడగలు.. క్లిప్స్.. access కార్డ్స్ … పొద్దు గడువు వాసనలకి … పుకార్లు తట్టి లేపిన విసుగుతో చుట్టుకొని పొంగిన హద్దుని చీల్చుకొంటూ..

స్థితి స్థాపనకి చేర్చిన కూల్చివేతలు రోజూ.. ఏది ఎందుకు వైరల్ అవుతుందో తెలియని అయోమయపు ఘాడ సమ జోడింపుని కలిపి పెట్టుకొన్న అనుమాన రాజీల కైపుకి నిలబడి… నిద్ర స్మిత మందకొడి పట్టుకొన్న నిశ్చర్య తాకిడీలతో మార్చి పెట్టుకొన్న కొండలు.. సమసి పోయిన సేవిత ఋణం .. కలిసి కాపలా పెట్టుకొన్న స్వధయ ద్రువాల్లో పడి కొట్టుకుపోతూ.. ఊరుకోలేని నిస్పృహ సాధనకి లోపల ఏడ్చిన కథ .. బయట నిలబడి పోయిన బాడీ టెస్టులు. బాడీ టోన్ నెగిటివ్.. జిమ్ పర్ఫెక్షన్ లేదు.. nadumu  మడతలో మచ్చలు… ఇంకా వర్కౌట్ చెయ్యాలని.. emotional  carcking  is  later  stage .. ఫస్ట్ ఎంట్రీ ఐస్ ఇంపోటంట్ నా?

ఇదేం వద్దులే .. నీకని చేవతోమిగిలిన ఈ కాసిన్ని దీప పాపాల వెనక రికార్డు చేసిన సెకెన్లని పోగేసుకొని.. విధృడ తమక జోరుని చేతుల్లో పెడతారు.. సీన్ పేపర్లు పై discussion  diffinitely  చేద్దాం.. లొకేషన్ షేర్ చేసాం .. అక్కడ అవన్నీ.. చిత్ర నిద్రని కాల్చిన కంగారులో పడి ముఖం చాటుచేసుకొన్న నిద్ర రీతుల కంపనతో.. విడిపోయిన శరీర మితిని పట్టుకొని..

భయమని చెప్పుకొన్న చావు చుట్టరికపు సమయ వాగులో పడి .. మరి పోలిక తెలియని నిస్పృహ పూడ్చివేతలని కాల్చిన ముఖాలతో పోల్చుకోలేక ఆ దూరం లో కరిగిన దేహ సత్తువుల మరిగించిన గొంతుతో తిరిగి కప్పుకొని.. నదికి ముందు.. సమాధిని కట్టుకొని.. షాట్ రెడీ నా … అంటారు. మరో అవధి లేని నిరా దూర కంటి స్థలంలో పడి ఊపిరాడని క్షేత్ర తంత్రిని లాగిన గొంతుకి రక్షా తాయెత్తుని … కళ్ళకి నల్ల దారం కట్టుకొని..

ఆమె కనిపించదు.. అతడు నిన్న డ్రాప్ చేసిన దగ్గర నుంచి .. అతనూ లేడు..

ఆలోచిత ఊOభన తట్టడిలో .. సుక్చూచీ పాడుబెట్టిన తవ్వకాల సంధి రుణాలు.. దీపం చుట్టూ చితిలో స్నానం చేసి పాడుకొంటూ… రెండో ఒడ్డు వివరాలు అడిగినప్పుడు .. ఇంకేం వివశతకి దిక్కు తెలియని కథని ఊపుకొంటూ.. రుణ మాయక దుఃఖ చలమలో పడి .. ప్రవాహ సుగంధి పెట్టుకొన్న మృత్యు నిరాహత ఆశ్చర్యాల రుణ పోటుని దాచుకొంటూ.. ఉండీ లేవలేకపోతున్న రెండో పొద్దులో పడి పోలిక తెలియని నిస్పృహ హద్దుని మరిగించిన నడకతో పొడవైన భయం పాడుబడిన కన్నుని వాల్చుకొంటూ…

పెనవేసి పుట్టుకకి .. రెండో సమాధి సగం వదిలేసిన సీసాల గుట్టని పోల్చుకొంటూ.. అక్కడే వదిలి వెళ్లిన బట్టలు ఉన్నాయి.. కొన్ని మిగిలినవి.. కొన్ని నిండుగా సీలైనా విప్పనవి.. సీసాలు పడి ఉండి … కొన్ని తడిచినవి.. కొన్ని కాలినవి పేజీలు..స్టాంప్ పేపర్స్ .. ఏవో చెబుతున్నాయి.. నిస్పష్ట చావు చెవిలో పెట్టిన కేక అక్కడ మళ్ళీ మళ్ళీ తిరుగుతూ.. హద్దుని ఆరబోసిన వేడి వేడి చూపుల నిడివిని కప్పుకొని చెలరేగుతూ… అంటుకు పోయిన అనుమాన దృశ్య చరణత తెగి.. తెగ్గోసిన గొంతులు.. రక్త మచ్చలు ఎండిన పాత పెట్టె.. ఖాళీగా….. నిద్ర రజిత పరుగుని కూల్చిన శూన్య బాణిలిలో…

కెమెరా రోల్ అవ్వడం మొదలైన .. కళ్ళు తెరవబడటం లేదు.. ఊపిరికి పెద్ద నోరు తెర్చుకొన్న కాపలాలని వద్దని .. కుబుసం విడిచిన శ్వాస పచ్చిగా నటిస్తున్న … రిహాల్సస్ కి దీనికి పోలిక లేని మరో కొత్త ముఖం ఎలా కాప్చర్ చెయ్యాలో తెలియని DOP నిశ్చేస్తుడుడై చూస్తూ ఉండిపోయాక… బిగించిన ఆయాసంలోని పీడన .. కదిలే నిద్ర సాధనంలో తిరిగే నల్ల విగ్రహ దాడిలో .. పేరుకు పోయిన శరీర రాతల్ని తుడిచి.. హద్దు మోసుకొన్న కంటిలో పడిన బెంగని గుద్దుకొని,.

తిమ్మిరి బొమ్మల ఋణం పట్టిన అలకలు .. ఉమ్మడి మాయల కైపుని పట్టుకొని.. సఫలమవడానికి అక్కడేం కొత్తగా జరగలేదు.. భూమి చనిపోక ముందే ఇంటిని లాక్కొని.. కొత్ సెట్ కోసం .. మరిన్ని ప్రాపర్టీస్ కోసం వెళ్లిన వాడి పడవ చేరనే లేదు.. అంతా తెలియక ముందే మునిగి పోతుందని .. విషమ గుండంలో పడి సేదతీరిన కంటి క్షేత్రంలో ఒరిగిన దుఃఖ శిల కదిలి మిగిలిపోతుందని.. ఊరటలేని నియోమయ స్మయతకి వేళ్ళు తొరిపిన చీకటిని తాగించి .. సొమ్మసిల్లిన చావు నిడివికి కట్టిన పసుపు గడపాని .. ధూపాలతో కనిపెట్టి.. దూరంలో సెగ పోసిన నోటిని తీర్చుకొన్న నడకకి వెన్నుని అతికించి..

అక్కడని తెలియని మహా నిషేర్షాయ దేహ ఊలం లో పడి పిడుగులని పట్టుకొని.. మెత్తిన లోయలని గొలుసు కట్టుడుతో అడ్డుకొని.. ఇంకొన్ని రోప్స్ ని వేలాడదీసి.. డూప్స్ ని మళ్ళీ ట్రైనింగ్ తో సిద్ధం చేసాక .. అక్కడే ఆగిపోయిన నిర్యాణ మంత్రత కి పుటం పెట్టిన నిప్పుల కుంపటిని రాజేసి.. కదిలే దేహ గ్రహణ చప్పుడుని అరగదీసి.. అక్కడే సర్దుకోవడానికి లేని రుణ పిడుగుని పాతుకొని. ఉండాలని అనుకోలేదని అన్నప్పుడు .. తీరికలేని దేహ విరుపు మెత్తుకొన్న గొంతులో రహస్య చివుకుల చప్పుడుని పాతి….

విడువని శరీర దృష్టి అయోమయం పోసుకున్న కాళ్ళ కిందనే వణికిన దేహ నిద్రకి కడిగిన హద్దు. చెప్పినట్లుగా ఏదీ జరగలేదు… అన్ని షెడ్యూల్స్ ఐనా ఇంకా అనుమానంగానే .. రీప్లేస్ చేద్దామా ? అని చెవులు కొరుక్కొంటూనే … ముగిసిన దేహ భూమి పై మెట్టు పై కదిలే శ్వాస బరువు పూనకం కప్పిన ధూళి కొండలు కాల్చిన ఒక్క కేక బిగించిన దృష్టి రహణ. ప్రభావ అనుకరణ కట్టిన కంటి తూలుని పడగొట్టి.. తనకని దేహ జాలం పేర్చిన గొంతుని తాగి.. కదిలే దేహ నిరోధ కట్టడిలో పడి మరి… దొరకని కథతో ఊసిన మంటని తోడుకొని.. చర్మ బూడిదని మెత్తుకొని.. కాళ్ళ సత్తువలో కొట్టుకొని..

ఏదీ అపట్టుపడదు.. అడ్డం తిరగదు.. భయం పోసుకోదు.. చెమట గాలించదు.. కేకని పట్టుకోలేదు.. నిద్ర చప్పరించిన సీసాల పడకపై .. ఇంకా పొడుగు చావని నాలిక బుసకొడుతూ.. ఆవలించి ఉండిపోయిఅన్ శ్వాస కంటిని దీర్ఘOగా మోసుకొన్న విస్తృలాంభన కుదురుకుని.. ఇసుకలో పోత పోసిన కునుకుని పట్టుకొని.. ఇది ఇక మరో చితి చేరదని కనిపెట్టి… అక్కడ ఒప్పుకోక ముందే గడువుని కాపుకాసి.. శిధిల ముఖాల ఒత్తిడిని పట్టుకొని.. మెట్లని కాల్చిన నడక రేవులో కుమ్మేసిన చీకటి విలుపుని ఆరబెట్టి..

ఇప్పటికి ఇది మరో భంగం నిరాస్తిత పట్టూ విడుపుల పుట్టుక చెలుత్తిన్ మనం అల్లుకున్న కథ.. అలా జరిగిందా ? అంటే చూసిన వాళ్ళు లేరు.. నికరంగా విడిపోయిన చేదు ముఖాలు మోసిన కీడుని పట్టుకొని.. సేవ పోసిన పడకపై కదలని దేహ రీతిని .. బ్రెయిన్ స్ట్రోక్ అని తీర్మానించక ముందే.. వయాగ్రా .. ఎంగిలిని పట్టుకొని ఊగిన చీకటి రొచ్చు వాసనా పగిలి … సీసీ టీవీ ఫ్యూతాగే ని చదివినపుడు.. మూసి పెట్టి ఉంచడానికి.. కోట్లు అటూ ఇటూ అయ్యాకా..

కొంచెం వెనకా ముందూ తలకిందులు ఊసర పట్టుని పేర్చుకొన్న చితి దారిలో .. పేరుకు పోయిన కెరటాల కంటిని రాలగొట్టి.. ఇసుక కొండలు ప్రసవించిన దూరంలో పడి .. కాస్త నిద్ర ఊపుని చేర్చిన ఉనికిని మోసుకొంటూ.. ఋణం మాటతీసుకొని.. విపరీత సెగ పూర్థనలో కలిపి కట్టిన దూరాల పట్టు .. గొంతుని లాగుతుంది. మరి దొరికించుకోలేదా…..

విరమించుకున్నారు..చీకటి పులపరించిన భుజాలని సాగదీసి .. అక్కడేం ఏం జరుగుతుందో .. నీకు ఆమాత్రం తెలియదా? తెలియడమనేది.. తెలియక పోవడంలోని మసక బారిన మాటల మధ్య .. ఊపిరి సెగని ఊది కొట్టుకొంటూ.. మసిబారిన గోడల మధ్య కాపలాగా తిరుగుతూ.. తలపడ్డ దేహ రుణాల కట్టడికి బరువెక్కిన జోడీలు .. సంధి నిరాగ్ర అణిచివేతకు కరిగిన దుఃఖ పరిధిని పట్టుకొని.. తూలిన దేహ మొండెపు కథనాల్ని పొగరుతో తోడుకొని.. కప్పుకున్న శరీర గుచ్చాల కైపుని కరిగించి.. అక్కడే ఆగిపోయిన చూపుల విడి రాతని కలిసి..

అలా జరగకుండాని ఇవన్నీ ఎలా? అలా అనుకోకుండా అడిగి … ఇక్కడకి వచ్చి ఆగుతుంది? ఇక్కడ నుంచి మరేమీ తెలియని నిద్ర కలుపుడు నిధిని తవ్వి.. కలలని కలబెట్టి ఏడ్చుకొంటూ కనిపించకుండా పోతుంది. విపరీత గదుల తిరగమోత గుప్పిన భయం కెమెరా ముందు కదులుతూ హద్దుని చెదర గొట్టిన కాసిన్ని దేహ రుజువులు పట్టుకొన్న గొంతు.. కళ్ళలో బిగించిన సైగలు.. ఊరట లేని శ్వాస బిగువులా పూర్ణ హద్దులు.. కాల్చిన సగం కాళ్ళ నిడివి పై కమ్మిన నల్ల గొంతులు వరుస దాడులు..

ఊపిరి శూలం గుప్పిన పగటి భూమిలో .. శిధిల నెల విడిచిన చెప్పులు ఇంకా అదే పట్టుతో.. తిరుగుతూ… హెచ్చరించిన హద్దుని ఎగరేసి..సమయ ద్రవ హేళన… పాతిపెట్టిన సెట్స్లో .. జీవ సమాధుల కుట్రని కాపలా కాస్తూ… తేరుకోవడానికి లేని అపార్ధా దీప సంధికి .. చేర్చి పెట్టుకొన్న కథనాల ముట్టడిని కప్పి … అదే మరో చీకటి సంధాన రక్షకి చేర్చిన పునాదిగా మంది.. తురిమి పెట్టుకొన్న శేష ధ్రువంలో పడి.. అక్కడే కమ్మేసిన ఉనికి పట్టుకొన్న నిడివిని సాగదీసి.. కమ్మేసిన నడకల రేవులో పడి.. పోలిక లేని నగర దర్శన మునకని కాదని … వెనక్కి వెళ్ళాక ..

ఎవరమూ కాక పోసుకున్న ముఖాలన్ని దాచుకొని.. ఆరాలు తీయం.. పట్టు రాలిన తాళాల గదిలో పాటని గోడకి వేలాడదీసి తప్పుకొంటాం.. ఉండి చెప్పుకొన్నాం .. అనుకోవడానికి లేక మరో తడబాటు పోద్ది గొంతుని ఊరబెట్టి.. నడక మార్చిన జార్చన కూపంలో కలదిరుగుతూ.. హద్దుని ఊరడించే కంటిని కరిగించి.. పేరుకు పోయిన మాటలు.. జిగులు రాత పట్టుకొన్న సంజన భాషకి .. రెండో యోచన పడగొట్టిన కన్నుని మూసి .. కథల చివరి ఊగుడు బొమ్మల కాల్వల్లో  దొరికిన మాటల పాకెట్స్ ని ఫ్లష్ చేసి.. DNA  లని మాసిన కంట్లోంచి తుడిచి..

నిపత్తు పరిధికి వరస తప్పిన బిగువు మూటల రోతని పోసుకొని .. నిండు కూపాల ఒరవడి పాటని లోపలి కట్టిన రుణ కావేడలో మోసి తెచ్చుకొన్న తలలు.. వెలుపలా .. లోపలా లేని కాస్త దుఃఖమూ .. జోడించిన కంటిలో ధూప పరిధి చనిపోయిన సెగకి సేదతీరుతూ.. పుట్టుక లేని ఆచూకీ వివర్శలో పడి .. తలకిందులుగా కనపడే తలుపుని కాల్చి.. వెన్నుని ఊడదీసి శ్వాస సహకారపు తాడన కూల్చి..

కంటి వార్పులు.. తలపెట్టిన మేకప్ రూమ్ లో ఇంకా దేహ సంభాషణ మొదలవ్వక .. కంగారుగా తిరుగుతూ .. ఋణం ముగ్గిన దేహ వరుసలు కలబడి.. ఒప్పుకొన్న శరీర పట్టుని దులిపిన పెద్ద నోరుల బూతుల వెంట .. తప్పి తిరుగుతూ.. మేకప్ లో కవర్ చెయ్యలేని కోతలు.. కోరలు.. కమిలిన మచ్చలు.. ఎర్రగా ఉబ్బిన కళ్ళలో నీరు పాకిన నల్ల అడుగులు.. లిప్స్టిక్ ని.. టచ్ అప్ .. మాటి మాటికీ సర్దుకొంటూ.. కళ్ళలో డ్రాప్స్ వేసుకొంటూ.. పెయిన్ కిల్లర్స్ గంటకి ఒకసారి మింగుతూ.. తడిమిన కలతలని కప్పిన కాస్త వేడిమికి కరిగి… సాధ్య బుజాల నొప్పిని తవ్వి..

కథలో చేరుకొని. .. దీనిని నమ్మి వెళదాంలే అని చప్పట్లు కొట్టుకొంటూ.. నిశ్వాస చిత్ర తాజా ఊతాలని .. తాగి దూరం జరిపిన మృత్యు నిగర్ణ సత్యతని పట్టుకొన్న ఊరట.. స్థిత గుంభన తెల్లార్లు మోసుకొన్న రక్షా రేవుల్లో .. తీరిక లేని నిశ్వాస గతిని సాగదీసి.. ఉరిమిన ముఖాల వెంట పడి .. కళ్ళలో పాతుకు పోయిన చెదిరింపుల పగని కూల్చిన సమయ రీతిని అడ్డ దిడ్డంగా ఉంచేసి.. కూరుకు పోయిన నిద్ర తూగులో పడి..

కదిలి ఉండిపోయిన చీకటి నిర్జుమాల కొత్తని ఆపలేక .. సాయం చెయ్యని చెవులని దులుపుకొని.. అప్పుడు దించిన తెర వెనక ఇదే జరిగిందని తూలనాడుతూ.. పేరుకు పోయిన నిద్ర పడగల సగం రేవులో.. పడగ విప్పిన షాట్.. this  is  my  career  best  shot అన్నప్పుడు .. డ్రెస్ మార్చుకోవడానికి వెళ్లిన క్యారవాన్ కొంచెం ఊగిందని .. పులిసిన నవ్వుతో.. తాయిలం పంచుతారు..

అది అలా మాత్రమే ఆగక .. నీరు పట్టిన దోష రంధన కదిలి చెంపల్లో బరువు నింపాక .. మరో శిధిల పగకి ఋణం తీర్చిన గుబులుతో హద్దుని గీస్తారు.  శరీర గేలరీని  పోత పోసి.. మళ్ళీ చెక్కి.. అన్నీ సరి కానీ ఓపికని పట్టుతప్పించి.. గుండ్రంగా తిరిగి.. తలుపు చివరనే చీర మార్చుకొని.. కంగారులేని గొంతుతోనవ్వి.. కాగి పోయిన చీకటి అలసతలో పొడుగ్గా సాగి..

ఏకరువు పెడుతున్న రుణ పాపిడిని తీరిన .. దువ్విన దుఃఖ నిరూణ ముట్టడిలో పడి .. పోలిక తెలియని దాడుల్ని అంటుకట్టి.. సమయ వార్పులు.. కాదనుకొంటే మరి కనిపించరు.. వివరం పెట్టుకోకపోతే ఇక వినిపించారు.. కలబడకపోతే అక్కడే నిద్ర పడకని వదిలి నీళ్లలో కొట్టుకు పోతారు. పట్టు తప్పిన మాయ చిత్రంతో తగువుపడి.. ఋణం లో ఉండిపోయిన కీడుని పట్టుకొని.. దేహంలో కదులుతయారు.

అది ఆ కబురుని ఎప్పటికీ వదలదు.. సఫల మాయకి పండిన దుఃఖం కరిగి.. ఊసుపోని నిద్ర గడపాలపై కదిలే కంటిని అరగదీసి.. ఉరిమిన నడకని పట్టుకొని.. ఇంకిన భయ సాంద్రతల కట్టడిని కొట్టేసుకొని.. నడుము విరిగిన నిద్రని తెరిచి.. చీకటికి విడిచిన వీలునామాలో పడి దూరం జరిగి.. సారించిన ప్రయాణ చూపులో పొడి చల్లిన పేటికని వుడ్ఢిగించి.. లోపలి కంటిలో ధూపం పెట్టిన గొంతుని మరిగించి.. అనుకోని.. మాటల మధ్య చేర్చిపెట్టుకొన్న శపిత ముడులు..

ఇక్కడో అక్కడో ఇలా ఉండిపోవడమే మిగిలిన కరకు తదనకి పీల్చిన చెమ్మని ..సేవిత రుణ ముట్టడికి కొట్టిన గోడలని పగలగొట్టి.. అదే దేహ మని నమ్మబలికి మార్చేశాక .. బాడీ డబల్ అని ఎంత మొత్తుకున్నా వినక .. కాళ్ళకి ద్రవ హేళన కట్టి ఊపుతూ.. హెచ్చరికని వంతుల వారీగా మార్చి.. కంటి కథలో రంగులు మార్చి .. ఏదొక చోట దొరికి పోతుంది.

సమయ చిత్రణకి అద్దిన కంటిని జోడించి పెట్టుకొన్న చీకటి వరుసలని దాటి పూర్తి చేసిన … పిక్చర్ ఎక్కలేదుగా… బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్… ఐరన్ లెగ్.. ఇంకంతే.. నెగిటివ్ ట్రెండ్ సెట్ చేసి వైరల్ చేసిన కంగారులో పడి.. తలమునకలు పడ్డ గారడీలో ముఖం తిప్పుకొన్న నిరసన.. అనేక ప్రాజెక్టులు cancel  అవుతూ.. దేహ ప్రతీక తెలియని ఎదురుదాడి..

సంధి చేసుకోలేని నిద్ర పూర్ణతకి మెరిసిన పగతో.. తోడైన నిషిద్ధ ఋణం పోసుకున్న స్లావిత తగువుని ముంచి.. రాక రుజువుని పట్టుకొన్న పొద్దునే తిప్పేస్తూ.. మర్మయ దేహ చలువ… ఉండిపోవాలనడానికి నేనెవరు.. ? స్పష్టంగా చూసే కాళ్ళ దూరంలో మసకలు పడి.. దుఃఖ చలమలో పడి కొట్టుకుపోతూ… ఇదీ మార్చడానికి లేక  ….

నిండిన భద్రత అడుగున .. చిన్ననాటి కల మసి పట్టి.. శరీరంలో పాతుకొన్న గొలుసుల్ని కక్కుకొంటూ.. పేటికల విందుని మొదలుపెట్టిన చూపులు.. అనుకోకుండా పడిపోతున్న కథల సవరణ .. మొత్తుకొంటూ చిట్లిన కంటి పూడికని దాటి.. మన్నిక లేని మాటని తొక్కేస్తూ.. ఇరుకున పడ్డ శ్వాస చట్రంలో ఊరేగి.. అనుకోని నిషిద్ధ పొరల కంపనకి మోసిన కదలికనే పట్టుకొని.. విసిరేసిన కరుకు హద్దులే చుట్టూ చెలరేగి..

ఆవార్తవ నరాల బిగువు.. ఇప్పుడిక ఆ నెంబర్ బ్లాక్ అయ్యి.. చుట్టేసిన తడి గొంతు జీరని తుడిచినా కదలికకి .. ఊరట లేని గంభీర మృత్యువుకి పోసిన కథని ఊరటలో దిగబెట్టి.. పగబట్టిన  నిద్ర రూంలో జిగురు పట్టిన జుత్తు.. బూజు పట్టిన గొంతు.. నొప్పి సర్దుకొన్నా గొంతు..పొత్తి కడుపు దారులు.. రువ్విన నుదిటి చెమటలో పడి ఊరేగే చలన శాపిత శానవాళ్ళని కలుసుకొంటూ.. పేర్చిన కన్నులతో తోడైన కథ..

అంత చీల్చిన హద్దుకి .. నెరవేరని బరువుల సమయ మితికి .. తెల్లార్లూ.. పిండేసిన వణుకుని చూపించుకొంటూ… ఏదో తెలియని ఆయుస్సు నిందల గుట్టుని విప్పి.. ఇక ఎవరూ పట్టించుకోరని.. నేను మాత్రం ఉన్నయ్ వాడు వచ్చినా .. లీగల్ ప్రొసీడింగ్స్ ని చూసిన భయంతో మరి కనిపించక ,… వదిలిపెట్టిన అయోమయంలో .. కలబడని దేహ భుజాల పట్టు తప్పిన ఉరుముని మింగి..

ఉండిపోవడం ఎలాగూ లేనప్పుడు.. మరో బ్రిడ్జిన్గ్ కి ,, శరీరం సిద్ధం చెయ్యడం .. అంత వేగంగా ఎలా… నిరాశ్రిత పొడుగు గుమ్మంలో తవ్విన గుంతని .. మాంస ఊరటాల వాసనని .. పగిలిన సీసాల మధ్య తురిమి.. ఏడ్చిన సలింతలు… పల్చని పుండు పై వాలిన వాడి నాలిక .. పదును కత్తి.. కాళ్ళు ముడిచిన చీకటి రేవులో పేటికల నిద్రని కనిపెట్టి .. చేతుల్లోకి చేర్చిన చీకటి రొద.. పగటి సరంజామాతో .. పిండుకొన్న చప్పుడుని కాల్చి పైకి చేరిని అడుగులు..

సర్దుకోవడమంటూ జారక ముందే .. కంటిని సరి చేసి చీకటిలోకి నెట్టక ముందే .. ఉరిమిన కోపం కలబడి.. వణుకుని వడపోయ్యాక ముందే.. శరీర లాల మోసిన సిద్ధతని కనిపెట్టి.. ఒరిగిన హద్దులో తెచ్చుకొన్న విపరీత కొలిమిలో పండిన సాధన.. పైపూత బట్టల వెనక .. కొంచెం అలిసిన సిగ్గుని వదిలించుకొని… స్టేజి పై అటు ఇటు తిరిగిన … వలలో పడ్డ కళ్ళు లేవని బోరుమంటూ…గానుగ పట్టిన చీకటి సవరింతలని కడిగి.. ధూప మిశ్రమ ఊతంతో కదిలే నిండు మాటలు మళ్ళీ తొల్చుకొని..

మెదిపిన రుజు పోటుని.. రంగు మార్చిన కునుకు పట్టిన చీకటి నిడివిని సరిచేసుకొని.. వడపోతలని.. పెదివి నింపిన కలలా పిసికిన నిషాధూప ముట్టడికి … పరిధికి రెండో నాదం తెలియని పొడి గదిలో కాళ్ళ తగువుని .. బయట కారిడార్లో పెట్టేసిన దిగులుని వడపోతలతో.. అడ్డుకొన్న సగం గదిలో పోత పోసిన నివాళి మూటలు.. చెక్కుకి పోయిన నిజాలు..

పసిగట్టిన దేహ ఊపుని చల్లారబెట్టి.. ముఖాలతో.. తోడి పెట్టిన నల్లని పొడుగు కోతలు.. పరిధికి రెండో నాదం తెలియని పొడి గదిలో కాళ్ళ తగువుని .. బయట కారిడార్లో పెట్టేసిన దిగులుని వడపోతలతో.. అడ్డుకొన్న సగం గదిలో పోత పోసిన నివాళి మూటలు.. చెక్కుకి పోయిన వీధులు.. తీర్ధ రధాలని జోడించుకొంటూ.. అలుముకు పోయిన గరకు అయస్కాంత సాధనకి.. తొరిపిన గదిలో పీడనకు..

పగటి చుట్టూ వదిలేసిన సత్యం ఎలానూ మార్చలేం .. కథని మళ్ళీ తీసిన ఎంగిలి పడ్డ వాసనని ఉతకలేం.. ఊరట లేని గోడలని కడిగి.. ఆ ఎత్తులోకి తడిమిన గదిని మరెవరికీ సాక్షిగా ఇవ్వలేం..ఉరిమిన జతి స్నానపు ముంపునీ.. పడిపోయిన సమయ స్థావర దేహ ఉరుమిని పిండి.. కథలోకి కూలిన ముఖం జోడించుకోనూ.. పేర్చుకొన్న నడక ఆవురుమంటూ … తీర్ధ రధాలని జోడించుకొంటూ.. అలుముకు పోయిన గరకు అయస్కాంత సాధనకి.. తొరిపిన గదిలో పీడనకు..

ఇదీ అని కాసుకోలేని వివరార్ధ నసుగుడులో పడి.. కొంచెం రుణ పడ్డ కథలో పడి.. కాళ్ళ గొడవని నెట్టుకొన్న ఊరట రాత్రంలో పిండిన నటనలు.. అదిమేసుకొన్న చీకటి నిలువుల కట్టడికి తెరిచిన నిధ్రుడ పాకులాటని సరిచెయ్యక ముందే .. చేసి పెట్టుకొన్న ఒప్పంద కారణాలు .. పడిపోయిన దేహ దీక్షలతో నిద్రకి చేర్చిన అనుకూలన మూలాలు.. ఏదో తెలియని కథని తిప్పుకొని చూసుకొంటూ మార్చిన దుఃఖ సరిజోడులు.. పేర్చిన కంటి రాశులని నొప్పికి దులిపిన నటనలు.. వెనక మరో రకమని తెల్సినా..

వివరం తెలియని చిందుకి కట్టుకొన్న ఉరమిది సంతులనం కదిలి.. దేహ చలువల బిగువుని సాగదీసిన  కళకి పట్టుకొని ఉండిపోయిన చావు మరిగి.. భోగ నిద్రాణత బాత్ టబ్ లో చీకిపోయాక .. వదులైన కంటి తీర్థపు ముట్టడిని కదిలించి.. కాగిపోయిన కునుకు దూరంలో పేర్చుకొన్న శ్రమ కరిగి.. మంట పెడుతున్న గాలి కౌగిలిని చుట్టూ తిప్పి .. ఒరిగిన నడకకి దూరం చేసుకొన్న జోడు పూతలతో .. కెరటాలని ఆరబెట్టి..

మర్మయ సలింతలు అక్కడే ఆగి .. వివరం లేని ఎత్తుగడనే దాటుకొని.. అపార్ధ ద్రవ నిరోమంలో కాచుకొన్న భూమి లెక్కని పట్టుకొని… సరమరికల పాత తెర ని కట్టిన మాంస దేహాల కన్నుని పొడిచి.. నీరు పట్టిన మాటలని తాగి.. కొలిమిలో మోసుకొన్న రుణ కావలింతలని లేవదీసుకొని.. సాదృశ్య దేహ నివ్వెరపాటులో కదిలే రుణ కలశం.. కాలిన దేహ బూడిదని కక్కుతూ..  ఏడ్చిన ఆవార్తవ తెరలని ఊపి .. పొత్తు గడవని .. భాషణ రాత్రంలో పిసికిన రుణాల కొత్తని సరిచేసి.. కత్తికి పదును పెట్టిన వాకిలిలో .. పిడుగుని మోసిన సాయూప విడిదికి చేరిన శత్రు రుజువు..

                                                                ……………………………..

                                 5.గుహల్లో చలి నిగ్రహాలు .. పోదారి పొగలు

Arebian nights .. chakde … paheli …

Freezing love stories … dark folders

నిశ్వక దుంధిబికి పట్టిన శరీర చలనలో కరిగే మంచు గూడులు.. భూతాల దేహ చలమని దున్ని .. కన్ను పట్టని నిషా ముద్రల కైపుని పట్టుకొని..మార్చి రాసిన స్క్రిప్ట్స్ ని దులుపుకొంటూ..

జీరాడిన చూపుల విల విలనీ కట్టుకొని.. నిరాయించిన కాళ్ళ ని కప్పుకొని.. వానపడని నడక … కథని చెప్పుకొని.. గదిలోకి చొరబడి .. వినీ వినక ఒప్పించిన కంటి ఋణం కప్పేసిన హద్దుకి .. మరిన్ని మలుపుల్లో నిండిన గ్రహణ తీర్ధంలో పాతబడిన పేజీలు..

 కలబెట్టిన శరీర గుండ్రాలతో .. హద్దుని పొడిగించిన సిగ్గుకీ పండుతూ.. పెదాలపై కాగిన చలిమంట … లోపల ఆయుస్సుకి మోసిన నలభై రాత్రుల శరీర నిల్వలు.. నీటి సాధనకి ఒప్పుకోని గొంతుని వణికిస్తూ.. చలి అమాంతపు చావుని కట్టి తీసిన నివురుల దేహ రూపుని రంగుల్లో ముంచి..

ఈ రాత్రికి ఉండిపోవాలా?

ఆమె దడ కమ్మిన చూపుని.. వణికిన దోసిలిలోని నీరుని చూసి.. కాళ్లపై పడ్డప్పుడు.. కొవ్వెత్తులు కెరటాల నురుగు కప్పుకొని మండినట్లు నవ్వు..

సేఫ్టీ తెచ్చుకొన్నావా? అని.. నికర్ష కేంద్రంలో విరిగిన పిడుగుల ముద్ద .. సర్దుబాటు..

నేనై ఉండిపోయిన చలన దర్శకి .. అలవలామయ్యే చీకట్లో పాతిన కౌగిలి అంటపోతలు ..  కలుస్తామని … విడిగా ఉండటానికి లేని  భయసాధకి నిలబడి..

ఉరుము కూలిన నడకలో పెడ చెవిన పెట్టిన కంగారుని దట్టించి ఏడ్చుకొంటూ.. అన్వయ ప్రాధేయ పూర్ణం .. గతికి చప్పరించిన రెండో దేహ నలుపుకి ..

నదిని తోసిపెట్టుకొన్న పడవలతో .. దీవులతో కుడి ఎడమల చప్పరింతని … చలి మడుగులని దేహంలో కప్పుకున్న పాత క్యాలెండరులని వదిలించుకొని..

పగిలిన నిద్ర కలయికల అద్దాన్ని మార్చి.. నుదిటిలో దాచి పెట్టుకొన్న నిషా పోటు..తను నవ్వినప్పుడు కమ్మేసిన పోదారి పొగలు .. కుమ్మరించిన నిద్ర కలతల కౌగిలి సన్నాహాలు.. నిలువు నిర్లిప్తని పట్టి రాల్చిన .. ఒదిగి పోయిన కథకి … జాతకపు మంటల్ని జత చేసిన రుణ మెరుపులని … ఇంకిపోయిన అద్దకపు మంత్రతకి..పెనవేసిన భ్రమణ కాపలాలు..

కరిగిన రెండో పుట్టుకలో సెగల మార్పిడిని తిప్పి రాల్చుకొంటూ.. దట్టించిన నిషాహాలు…

ఇర్రుక్కుపోవడం .. పై పైకి ఎగరడం.. కలిపి చుట్టుకొన్న దేహ నిలయకి దీపం ముట్టించడం..

  పసి చెమటలు పట్టిన దీర్ఘ కొలిమిలో పేర్చుకొన్న శరీర మిళాయింపుకి గుహల్లో చలి నిగ్రహాలు..

…………….

సమయపూతలు.. ఆడిపోయిన చీకటిని దగ్గర చేసుకొంటూ.. నివర్ణ చప్పుడు లేని కలతకి చేర్చిన అడుగున పడిన వణుకుని దులుపుకొంటూ..

ఒంటరి స్టోరీ లైన్ .. పై నుంచి మారి కిందకి చేర్చి చలి మడుగులో పిండుకొని.. అలాస దుర్భిణీతో చూపుని చేర్చిన బజారులు.. ముక్కలైన చెరిపివేతలు.. లోపలిగతికి … సమయ స్థితి కారణాలని.. రాపాడించిన అద్దకపు ముఖాలని మార్చుకొంటూ.. తేరుకోని పొగలతో ఉరిమి  తెల్లబడిన పాత గొడుగులు.. నిండిన చీకటికి .. పారబోసుకొన్న నటనలని.. వీధి కలతలకి మేకప్ ని ఊడదీసుకొని..

చెలరేగిన దేహ భుజాల అలజడికి చుట్టేసిన కునుకుని పట్టుకొని.. ఇంగిత సత్తువులని రాపాడిస్తున్న మంతనాల మత్తుని..

ఎన్నో ఇగ్నోర్ చేసాక మిగిలే చరియల కాల్పుని .. సాఫల్య చితిని కెలుకుతూ.. అడ్డుకొన్న సరళ గతిని పోసుకొని దూరమైన నడకల ముంపులు.. అల్లికలని తీర్చి పెట్టుకొన్న త్వరిత గుండ్రాలని చేర్చుకొన్న కుండలని దులిపి.. ఘర్షించే చేతివేళ్ళు .. దోసిలి నిండిన కల ..

ఎవరమూ ఇలా లేవలేక పోయాం.. మాట తీసుకొని రెండో వేపు గోళంలో కూలి పోతున్న .. విరాళ గదిని తాళం వేసిన కంటిని చులకనతో చూస్తూ.. రెండు పక్కలా గద్దించిన మాటలని.. మోతపెట్టిన కేకలని.. రవికల్ని దులిపి.. చెరిగిన పెదాలతో.. నీరు పట్టిన ఛాతీలతో .. శ్రమ ఉద్దీపనలు తలబడిన కునుకుతో నిలుగు రంగుల ధూళి..

ఇంకెన్ని రిహాల్సస్ రంగులని దులిపి .. పెనవేసుకున్న దూర అద్దాల గదిని తవ్వుకొంటూ…

ధ్వని నికర్ష ఆనుపానులు .. కప్పుకున్న శరీర కలుపులు.. కరిగించి పెట్టుకొన్న  ఆందోళ గుమ్మంలో ముఖం తిప్పుకొన్న చీకటి పూతలు.. నిలువు కొండలు వేలాడిన గదిలో తొల్చుకొన్న గుహలు.. మన్నించుకొన్న నిరాపాయ సమాధి విగ్రహాలు..

నేను నీతో మొదలైనప్పటిలానే .. ఇప్పటికీ ఉండిపోవడం..

…………………….

కదిలి పోతున్న ముచ్చట్ల భావి.. పెద్ద మర్రి చుట్టుకి వేలాడే ఆ గుడిసె.. సముద్ర కెరటాల్లా ఎగిసిపడ్డ శరీరాల అనుసర దాడి.. ఉబికిన దేహ సందోళ .. లైట్లని పాతి పెట్టాక.. అడ్డంగా నిండిపోయిన కృతక జోడింపులని.. నివ్వులు దులిపిన నాజూకు రంగులు .. చెమర్చిన దేహాలు.. అప నింగమాలతో తేల్చుకోలేని అసత తోవలో పడి… పరాయి కాళ్ళ నిడివిని సాగదీసి..

ఒప్పుకొని నిద్ర తానులని బిగదీసి.. లోబడని కంటి గేలపు స్పర్ధకి … నిరామి పుట్టుక వెలిసి పోయిన కథతో.. నిలువెల్లా వణికి … గదులు సరాసరి నిచ్చెనలని వదిలి పెట్టి .. కలకి దూరంలో ఊరట లేని గ్రహణ కూటమిని దువ్వుకొని.. కప్పిన ఇల్లు .. దారి చప్పరించిన కంటి పాట .. టీ మరిగిన దుప్పటి కింద చితి నిద్ర చెప్పిన నుదిటిలో చల్లారిన శ్వాస..  

మగ్గించిన దృష్టి నిర్యాణపు లోపలి గట్టుని దాటి .. ఇంకేం లేని ఊదర గతిని తోడుకొంటూ.. పేర్చిన ధమనుల కొండ పేలిపోయాక.. ప్రభావ ఛాయన .. నిలువు కొండకి సగం నింపిన పగని కాటేస్తూ .. చిదిమిన నీటి ఋణం సంచీని లాగదీసుకొంటూ.. పేరుకున్న చీకటి నిమిత్త కావలికి కప్పిన పునాది..

అక్కడి నుంచి మరో షెడ్యూల్ కి తిప్పేసిన కథల సారం నిసిగిన హద్దుతో.. అంపకాల నిట్టడి రాకని తురిమి

చీకటి నలతకి రెండో పులకింపుని అతికించిన సాధన జోడించుకొంటూ.. నిస్వాయ అలంకృతపు  కొట్టిడికి తోడైన దిగులు.. సమయం ఎప్పటికీ కరగక నీటి బొమ్మల యజ్ఞంలో పొగని మూటగడుతుంది..

సగం సాధారణాల కుట్రకి వెలిసిన గోడల మధ్యనే కుదురులేని .. చీకటి తలుపుకి గొళ్ళెం పెట్టిన కునుకుని పాడుకొని .. విడిపోయిన మృత్యు పూర్తిని నెగ్గుకొంటూ.. పీల్చిన Dream droplets ఒత్తిడికి పేనుకొన్న కథని తిరగరాసి.. లోపలి ముఖం చేసుకొన్న నిప్పుల మడిలో .. నిలువు రాళ్ళ ఒప్పందం పై తను ఎగురుకొంటూ వచ్చి వాలాక… సెగల సంధికి చల్లారిన పెదాల నొప్పిని కాకపెట్టి….

ఏదీ సగం మాట వినదు.. సగం ఊసుని కప్పుకొని నిందని దాచుకోదు.. తేరుకోలేని నిద్ర ఆహాలీలో పాతుకొన్న కన్నుగా నెరిసిపోదు.. అక్కడికి కబురు రావడానికి.. చీకటి నింపిన ఇంటి సూచనల గడపకి … నిడసరి నేసిన కంటి పోటుతో .. సర్దుకోలేని జిగురు గొంతుని .. సాధ్యపు మెరుపుతో.. తొక్కిసలాటని కొరికి..  

స్క్రిప్ట్ ని re narrate చేస్తూ .. తనతో ,.. తమక రాజీని ఒంపిన గుహకు .. చప్పరించి వెండి పట్టీల చప్పుడుని చేర్చి..  twisted Interval … మళ్ళీ తలకిందులుగా మొదలై .. సరిపడని ఆపాత కుట్టడిలో కలిసిన పుట్టు నిరాయణ కథల జోడింపుని లాక్కొంటూ…

నేయని పాటలు … చెప్పని రాళ్ళ గుట్టల్లో కునుకు ఇంకిన మెరుపు చప్పుడుని తాగి.. శరీర నింపాది గోళాల్లో వాన కురిసిన మత్తు ఊడల జంట నీరు.. కలిసి నేర్చుకొన్న దేహ ముగింపుని కప్పుకొని.. వదిలేసిన నడకకి లోపలి చూపుని చేర్చి.. కాళ్ళ కుదుపుని పట్టి లాగిన రంగుల పొడితో.. కతికిన మాటల కింద రంగు వదిలి పెట్టిన వరుసలని దాచి.. కల హద్దుకి రుజువు లేని గది తచ్చాటని బరువుగా ఉంచి దిగబడతారు.

ఎమోషన్ carry కాలేదని సగంలో అడ్డం తిరిగి .. మొత్తం మార్చ మన్నాక… ఆమె అన్నీవదిలేసింది.. రాత్రంతా తాగి.. అతని రూంలోనే చిందులేసి.. ఆనక అతనిని హత్య చేసి పారిపోయింది.. చెరిపిన సమయ తీరికల టేబుళ్లపై ..టీ కూజాలని తొలచి పెట్టిన సేవక ఋణం కరిగిన కంటి రుజువుకి మాటని కట్టి…

సంభాళించుకోలేని కథ .. ఎలా ఆ పాత్రలు మోస్తాయని ఏడుస్తూ.. తిరగబడిన చీకటి నెరవేరికలు మొత్తమూ పట్టి చుట్టుకొన్నాక.. ధ్వని లాంతరు ఏడ్చిన ఊరి పొలిమేర నవ్వు.. జడ గుప్పిన చితి వరుసలు…..

స్వపోర్లాతకి చేర్చిన సగం గోళంలో .. చెలరేగిన కెరటాల పట్టుని .. తెగ్గొట్టిన ఉనికికి చేరదీసి ధూళి గొంతుని సర్ది… కమ్ముకొన్న నిధ్రువ అకారణ క్రియకి పట్టుతప్పిన చీకటిని సరిచేసి.. పగటి లైటింగ్లో .. కంటి కింద నల్లని వలయ ప్రదక్షణ మూర్తిని తిప్పుకొని .. మరోసారి సీసా పగిలిన చప్పుడు చెవుల్లో కూరాక .. వినికిడి దుఃఖం దూరంలో ఎక్కడో కూలుతూ కనిపిస్తుంది.

కునుకు కప్పిన కథా మలుపులో .. పాతుకు పోతున్న నీటి స్తంభాల ఒరవడి సగం … అమాంత కౌగిలి మందలింపు.. కొరికేసిన దేహ దూరం లో చితి పోకడలు.. నిరాయ గమక తీరులు.. అన్నీ మధ్యలోకి వచ్చి దూకేసిన .. నీదనే ఒకటి కాసుకొని ఉన్నచోటే తన షూటింగ్ స్పాట్ అని .. ఇంకెవరో అంటున్నప్పుడే ..ఐతే అదే మన… ఈ లోపు ఆటే ఎవరో వస్తున్నారని మాట కట్ చేసాక.. మళ్ళీ అదే కంటిన్యూ చేయడానికి అతను లేదు.. మహా ప్రాణపు కష్యలో పడి తప్పిపోయాడు.

గది బయటకి వెళ్లినపుడు… దూరంగా కొండల మధ్యలోని.. పాకుతున్న మంచు..ఒక్కసారిగా మంటగా మారి చుట్టేసినపుడు.. అన్నీ సర్దుకొని దూకేసిన climax పట్టుకొని వాళ్ళు మొక్కు తీర్చుకొంటారు.. అతని పేరు తప్పించి ముహూర్తం పెడతారు. భయ పొరల్ని పోల్చిన నిద్ర గతుకుల పెద్ద ఆరడి బంధనల పోటుని కప్పుకొంటూ.. శరణు కోరని రుణ విపరీతంలో నానిపోయిన కునుకుని కడిగి.. తెల్లార్లు ఊగిపోయిన ఆపద .. ముఖం ఇలా వాడిపోతే.. రొమాన్స్ ఎలా పలుకుతుందని.. హెచ్చరిస్తూ..

ఇది ఇప్పటి సాధారణంలోని కంటి రాతకి మసకగా దృష్టి పూరక నిప్పు ఊటని .. గిన్నెలో ఉంచి.. కాపడం పెట్టిన మాటని తిరగదోడి.. వేసారిన నిద్రగురికి చీకటి అనువాదపు ముమ్మర కొండలు దోపిన కాళ్ళని పేర్చి.. నడక మార్చిన హద్దుని పట్టుకొని.. వెనక్కి జరిగిన కునుకు రజనికి .. దువ్వేసిన సాధ్య నలుపుల గోడలని పిసికి … అందించిన నిద్ర నదిలో పాత బడిన రొప్పుని దిగదుడిచి .. కథకి సరిచెయ్యని ఆయాస రవ్వలని చేర్చి మంటని ఎగదోసాక …

ఎక్కడో మొదలు పెట్టి.. మరేదో అవసరం లేని చోట రిథమ్ పట్టుకొని… అప్పటికే నిద్ర వదిలిన ప్రేమ కథని ఊపుకొంటూ.. రుణపు ద్రవ మిళన కట్టడి చేసిన వీధి నాటకం.. రంగు మారిన తెరలు.. బుజం గుప్పిన రెప్పలా చలి.. నిలవని దేహ ఆరడి కాపు గాలిని దత్తం చేస్తూ .. దేహ నీరుల పగటి గట్టుని తెగ్గొట్టి.. సగం నేను .. సగం నువ్వూ ఉండిపోయిన కథకి చేర్చిన కారణాలని పట్టుకొని..

కొన్ని రోగపు పడకలు .. గారపు అంచనాలు .. కొట్టి తీసుకొన్న అనుభవ నివాలంలో పడి .. తిరుగు లేని ఒత్తిడికి లేవదీసుకొన్న ప్రశ్నల కైపుని వెనక్కి లాగి.. ఇంకో మమార్ధ .. నిస్కలిత చిత్ర దుమారం పట్టేసిన కునుకుతో.. చప్పట్లు బరువెక్కినపుడు లేచిన .. ఎదో ప్రవాహం అడుగున ఉన్నట్లు ఉక్కిరి బిక్కిరై.. అటూ.. ఇటూ ఎవరూ లేక .. బిక్కు బిక్కు మంటున్న చేయీకటిలో పిలవగానే .. గాలిలోంచి దిగబడి.. 

మృత్యువు .. అనుభవం పంచిన నేరశాలలో కథని వదిలి .. ఎవరో గొలుసులు కట్టిన రంగుల నిడివికి పెద్ద గోడల వెనుక కాల్చిన పుట్టుకని మార్చి చెప్పుకొంటూ.. తేల్చి పోలేని మసకర నెమ్ముని ఊదిన పోలికని చెక్కి.. స్మశాన చిత్రితని సమాధి గొడవతో గుర్తుపట్టి.. సెగలకు దండ కట్టిన రెచ్చిపోతలు.. కలబెట్టిన ఆధార కూపాలు.. అనుకోని సరళ రుజువు కూలిపోయినపుడు.. ఇక టికెట్స్ తెగడం ఆగిపోయింది…

ఆపుకొన్న .. ఆపేసిన సగం కలతలా ఉండిన కంటి ప్రదక్ష ఊరడి.. రెండో చోటులో పిసికిన కల… నిందలని జోకొట్టిన కారణాల నీటి గుబులు..పగకి చేర్చిన కునుకుని పట్టుకొని.. సహాయత లేని ద్రువాల్లో కాల్చిన రుణ పరుగులు.. అంతలో.. బయటకి తీసిన మాస్క్లు..  థియేటర్ అంతా ఉత్కంఠ లేదని.. సిగరెట్ కాల్చుకోవడానికి.. వాష్ రూమ్ కి వెళ్లే వాళ్ళు లేచి.. కథని ఇంతలా మలుపులు తిప్పి .. వంకర్లు   పోతే  ఇక ఫీలేం మిగులుతుందని కోప్పడుతూ..

తాళం మార్చిన భాష ని నములుతూ.. సర్లే .. రేపు రాత్రికి అంతా సెట్ చేద్దాం.. అమాంత పగుల్లో పడి.. నుదురు పోగొట్టుకొన్న ఊపిరి కుబుసాల ముద్దని మెత్త్తగా నూరి.. దవడ బిగించిన కోపపు ఆనవాళ్ళని దగ్గరకి తీసుకొని.. ద్వివర్ధని లేని కడసారి ఎత్తుగడకు .. రెండో ముఖం ఇచ్చిన ఆ రాత్రి సుఖం .. మళ్ళీ గుచ్చుకొన్న భయంతో కాపలాని తప్పించుకొని  బాల్కనీని చేరి ఆమెని పిల్చాక … ఎందుకో .. వాడిని ఇక కనిపించొద్దని చెప్పడం.. జనాలు .. మాకు తెలుసులే ఎందుకో అని .. వెటకారపు అరుపులతో..

విరిగిన కంటి ధూళి సగం పోసిన గ్లాసుని ఎత్తి పోసుకొని .. వెలిగించిన నిద్ర మధ్యంలో పడి .. పెనుమున్కల కంగారుని ఎంతగా ఈడ్చినా … ఇంకోసారి ఇలాజె ముందుకెళితే తప్ప .. అసలు భయం ఊరట పొందేది లేదని.. వాళ్ళు ఊసుని చెమర్చిన పొగ నిద్రలో పడి .. కల దొరకక ఏడ్చిన హద్దునే మళ్ళీ కొత్తగా చేసి.. ఇదంతా ఒకటి నీ మేకప్ ఐతే .. మరొకటి నీ నటనలో వేరియేషన్  …ఐనా చివరకి ఈ తప్పిపోవడాన్ని మాత్రమే నేర్పుతుంది.

శిలలా ఋణం ముగ్గిన కంటిలో తిరుగుతూ.. హెచ్చరికలేని తమకపు నటనని కాల్చుకొని.. ఒక కేకని ..చెట్టు దెయ్యం ఆవహించిన కథని.. తాటాకు బొమ్మల పెళ్లిని … గర్భ భూమిలో పండిన గంజాయి సాగునీ .. రాత్రికి వెలిసిన సుఖపు పొద్దులో కనబడని గొంతుని సాగదీసి.. అప్పగించిన తప్పు కీడులు…

విలాసతలు .. రొప్పు గొడుగులు తెర్చుకొన్న పొడి పొలాల్లో .. పోలికకి దగ్గర చేసిన నిలువెత్తు చీకటి బుట్టబొమ్మల కౌగిలికి .. నేర బట్టని ఇచ్చిన సగం మోసపు అలజడికి దారం గుచ్చి నేసిన ఆమె దగ్గరతనపు కుట్రని కట్టి చేరిన కథ…. ఎవరమూ మరి సరిపెట్టుకోలేం … కని పోయిన  నివధి భాషణ .. స్మరిత గాథని కూల్చి ఏడుస్తూ.. తేరుకోలేని నిద్ర అఖాతపు చలన కంటికి సమాధి పూర్ణత కప్పిన పడిగాపులు..

చేరగిలిన కంటి సూత్రాలతో పడిపోయిన చీకటికి ఏడు శాపాలు నిర్గతిని కట్టిన అనుకూలనాలు.. నిలబడి ఉండిపోయిన నా వెనకటి ప్రళయ ఝాముల ఒరుపుని రుద్ది.. కావలింతల చెట్టుని కూల్చిన కంటిలో .. దూసుకు పోతున్న నల్ల విగ్రహాల పురిటి పోటు.. అప్పగించి వదిలిన చీకటి మొర .. తడి రేవుల్లో కురిసిన అడుగు పుట్టిన ఒడ్డు రాతల బిగువుని చల్లారబెట్టి..

ఉండిపోవడానికి రాలేదని నాకు తెల్సు.. అది మరో సంధి కుదరని గుప్పెటలో మోగిన మాటగా కుదిరిన చీకటి నిర్జనల పోటుకి కప్పిన ముందుగా గ్లాసుల్లో పండి.. ఆ పెద్ద అద్దం ఏడ్చిన కాళ్ళని కప్పుకొని .. నిర్లాఖిత ధ్రువాల గడువుని చుట్టిన పరిధులు.. ఎవరమూ ఉండి చెప్పుకొన్న విడి విడి రాతల శాసన బరువుగా గుచ్చినా కళ్ళలో చూపు కాలిన నిద్ర గుహలు..

ఏక పాలన మెట్లని కడిగిన అంచు చప్పుడు ముఖం పుట్టిన రుణాలు.. పైకి తెచ్చుకొన్న దేహ తీరపు కలకి చేర్చిన కునుకు.. మెత్తని గొంతుకి .. పోతపోసిన నిద్రల రంగుకి .. చెదిరిన కంటి శాలలో కోపగించిన మత్తు రాతని కూల్చుకొంటూ.. పెనవేసిన బొమ్మల గుండంలో…. సర్దుకోవడానికి లేని నిషారా తమకం పట్టుకొన్న నివేది.. కూర్చుకొన్న పీడ కలల ముట్టడికి లేవదీసిన చూపుల గుట్టలో ఊరిన పాటల ఎండ…

కొన్ని కమిలిన శ్వాస నీలారపు పొద్దు కమ్మిన వణుకులోని కథకి చేర్చిన రంగుల పుట్టుకని కదిపిన దేహమై నిల్చి.. హద్దుని తిప్పి రాసి .. మాటకి రెండో వివరణ చెప్పిన నడకని దగ్గర చేసుకొందని అనుకున్నప్పుడే .. నివధి భాషణ … మళ్ళీ మొదలవడానికి లేని సంపూరక సవ్వడిని కప్పుకొని.. సగం నిద్ర పోయిన చావు గడప దగ్గర తిరిగే అనుమాన రవ్వల్లా .. చెలరేగిన శరీర జాడలు..

ఐపోవడం .. మిగిలిన నిద్ర సంధికి కుదిరిన నడకని తాగి.. మళ్ళీ నెమ్మదించిన కడసారి నడకలో .. కాస్త నాకోసం వీలు చూసుకోలేవా ? మళ్ళీ అలాగే .. తిరిగి నా ఇంటికి వెళ్లిపోయేలా ఐతే .. కుదరదులే.. అని .. నల్ల పడగల కింద గడ్డ కట్టిన నురుగు కెరటంలా నవ్వి ..ఇంకా అనుకున్నట్లుగా  నేయని చీకటి మొర .. ఉండీ లేనప్పటి గుర్తుని పట్టుకొని.. మరో ఛిద్రగురికి సరి చెయ్యని పడవని తీసుకుపోయి.. చిక్కుకొన్నాక.. చిలుము పట్టిన ఆ మాటలే మళ్ళీ తీసుకొస్తున్నప్పుడు.. ఆమె దూకేసింది..

నిషాలాయన పొద్దు దండన ,… మత్తుగడలేని కేకకి నేసిన దూర బిగువులా .. నిండైన గతి కోతకి చితిని తాగిన శోదత మరుగుతూ.. హెచ్చించిన నింపు పోతల సముద్రం నురుగు పోటుని కట్టుకొని దూరం జరిగి .. కనబడక.. కొండలని అమాంతం తాగిన దేహాల మధ్య సముద్రం ఊపిరాడక చనిపోతూ.. ముగ్గిన నిప్పుల గుండంలో కెరటాలు తిరిగిన ఆయుస్సు గెడని తిప్పి.. కాళ్ళని కాల్చి పెట్టుకొన్న చితి. ఇంకోసారి ఆగక పడవ మోసిన బూడిద కన్నుతో .. పగపట్టిన నోటి బిగువుని వాంతి చేసుకొన్న దయలో పడి సళ్ళిపోయిన సమయ ద్రోణుల కలత..

చూస్తూ ఉండిపోయాక అప్పగించిన భాషణ .. కదిలింపుని మోసి .. అప్పటి చీకటి సార్జిత దుఃఖ పురిని మరింత తిప్పి  కనపడలేదని చెప్పుకొని.. నివధి కప్పిన గుడారాల్లో పడి శరీరాల రొప్పుని జోడించి కాలుతూ.. ఆనక తీరికగా ఉండిపోయిన కంటిలోని చెమ్మని ఊది.. కమ్మేసిన నడక చల్లార్చిన పుట్టు రాతల సంచీలో .. పాము పగని గాలించి తిరిగిన కథ .. ఇంకేం పనికిరాదని అనుకొని… దేహ చుట్టరికాల చావుని గొలుసుతో చుట్టేసి పట్టుకొని.. అనుమానం గుచ్చుకొని తను వెళ్ళిపోయాక .. నివురుగప్పిన పొడి అలతల కట్టడి రాల్చిన కబురుని తాగి.. సారడిల్లిన మందలింపుని పండించిన మాటలు..

భళ్ళున దూరిన సమయ గింగిరాల కుట్రని తాగి.. నింపాదిగా ఉండిపోయిన ఇంటి తలుపుల గుట్టుకి చిదిమిన సూత్రాలతో .. ఆనుకోని వరుస తప్పిన గుణ శేషాలు.. శ్రమ మండిన గుప్పెటలోని కునుకుని లేపి.. కలకి నీరుని అడిగి.. రంగుని కొంచెం విసిరిన వీధిలో .. నలత బిగిసిన మందలింపుని కప్పుకొని.. నిమిరిన శాప గ్రహీత .. ఉండిపోయిన శాసన హద్దులో .. కథకి కూరుకు పోయిన చీకటిని ఇచ్చి .. తూలి పడిపోయిన నిర్ణయాల బిగువుని కత్తిరించే చేతులు.. వణికి నిండిన కసితో .. పాత నిద్రని జోడించిన చావు.

నివేది కీడుల చీకటి మొరకి .. రెండో దూరంలో పగని ముట్టడించి .. హద్దుని నేసుకొన్న అనుమాన రధం కూలి.. పెద్ద పెట్టున కన్నుని కాపాడే దీర్ఘ రధం తప్పిపోయిన కునుకుని కట్టిన భ్రమా పూడికలు తప్పుని సరిచేసి..విళాధన కాల్చిన కొరివితో.. చీకటి ఒంటి పూతని గట్టుకి చేర్చి.. నెమ్మదిగా ఉంచిన బరువుని వడపోసుకొని.. ఇంకిపోయిన కునుకుని తప్పించిన కంటిలో పోసుకున్న స్నాన గదిని పక్కకి పేర్చిన గుబులుని కాల్చి…

ఆ ఊరుని నువ్వీ సెట్లోకి ఎప్పటికీ తీసుకు రాలేవు.. అక్కడ ఉండిపోయిన ఆ నిద్ర గారపు కునుకుని మోసి తెచ్చినా .. గోరువెచ్చని ఆ కునుకు ఇక్కడా దేనినీ దగ్గరగా కనిపించనీయదు.. హద్దు ఎలానూ చెరిగిపోతుంది..దుఃఖం వరుస తప్పుతుంది.. కథ రెండో ముఖాన్ని తీసుకొని ఏడుస్తుంది. భయం నిఘార పెట్టిన అనుమాన గతికి చేరవేసుకొన్న మాటలతో .. శెలవు తీసుకొంటుంది…

అప్పటి వరకు అంతా బాగానే ఉంది.. తన లోపలి తనని నేను సంపూర్ణ పరిచయానికి వెళ్ళినప్పుడే .. తీవ్ర అలజడికి గురైన దుఃఖ చెలమలో .. నా శ్వాస తంత్రీయ వణుకు తెగిపడి.. రెండో పోలిక లేని ఈ దేహం ఇప్పటికీ వణుకుతుంది.. చివరి నిద్ర నాకో పెద్ద యుద్ధమని.. చూపు స్తంభిమించిన తక్షణ క్షణం లోనే అంతా మారిపోయిందని.. ఎవరో ఏడుస్తూరు..

ఆ చెట్టు కింద మెట్టు పై తాను తినిపించిన జున్ను రుచిని .. తిరిగి మరిగించడం ఎప్పటికీ జరిగేది కాదు.. అంతా అయోమయం అలికిన చప్పుడుతో తుడిచిన నీటి మెరకల నదిగా చనిపోయింది.. ఆ పెదాల లాల పోసిన వడ్డనని .. ఆ కంటి చెలమలో ఉబికిన రుచిని .. కడసారి పీల్చిన గాలి మునకల ఎద్దడి ముఖాలతో.. చెట్ల దీవెనకై రాలిన ఆ ఆకుల పరీమళం.. ఎగిసి పడిన శరీర రుందన కౌగిలిని విడిచి పెట్టిన అతని లాంతరు దగ్గరై.. ఇక్కడేం చేస్తున్నారు .. ఈ టైములో ? అన్న కథన రాతకి …

తేలిపోతున్న నిర్బరర ఋణం బరువెక్కిన కంటిలో దిగాలు పడిన దీప మండలం.. సముద్రం తాకిన చిక్కని .. నల్లని.. తేరుకోని.. సమసిపోని .. గతికి పట్టని.. ముఖం చుట్టని.. కెరటాల మధ్య కూరుకుపోతూ… ఛాయకి తెలియని సాయంత్ర మరుపుని అరగ దీసి .. నుదిటిలో చుట్టి .. పాకిన నిద్ర శ్రమల గుచ్చం విడిపోయిన కునుకు తో కలబడి..

అప్పటికే .. అది అలా మాత్రమే అనుకోని సరిపెట్టుకున్న .. వికిలిన కంటి ధూళి రాలిపోయి  ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పటికీ రాకపోవచ్చు.. అదే చప్పుడుని కాగబెట్టిన ఈ చీకటి .. సముద్రానికి కట్టిన ఆ నల్ల చీర ఆవేశ ధమన పూరక రొప్పుని ఎలా తిరిగి పండిస్తోంది.. ఎవరి అనుకరణకి ఎవరి దండనని  చేర్చుకొన్న అనుసర మృతిని దగ్గర చేసుకొన్న గుర్తులు కాలడం ఇక్కడ మళ్ళీ చెప్పుకొన్న ఖాళీల బయటనే ఉండిపోయిన శత్రు రుజానన

సగం పాడిన మాట.. అక్కడి నా సమాధి ఎప్పటికీ భద్రం.. నేను జోడించుకొని చెప్పడానికి లేని ఈ దూరంలో పిండుకొన్న చీకటి నివేద పోలికని .. తిరిగి అద్దంలో మండించి.. ఉనికికి తెచ్చుకొన్న ఓ రసాయన గ్రహణం కమ్ముకొన్న దోసిలిని పండించి.. గమక సంధికి తేలిపోయిన నడకని దాటుకొంటూ.. వంతెనలు సాగ దీసిన ఆ చోటు.. అలమారా నుంచి నేనెప్పటికీ తీసి నీకివ్వలేను. నిస్సంశయ భీతికి .. ఒరిగి పోయిన స్నాన చిత్రం పాకిన లేత ఎండా కమ్మిన రెప్పల్లో .. గూళ్ళు చెదిరిన పూతలతో కదిలే .. నిద్ర రూపనాల చిక్కుని తీసి.. రమక ప్రోక్షణకి చేర్చిన కరకు రక్ష.

సరిపెట్టుకోవడానికి లేని తీరిక ఏడుస్తుంది.. గభ గభ సర్దుకొన్నా నిండు రాతల ఫలకం పై కాల్చిన కాళ్ళ పడక.. అలవాటుగా నేను మాటని తెచ్చుకున్నాను.. జోడించిన కునుకుతో తత్తరపాటుని కూల్చుకొని.. ఇంకి పోయిన చూపుల మడమ తిప్పిన దేహం…

ఆ ఇసుకలో పడి.. దాహానికి అల్లాడి.. అక్కడే గుంత తవ్వి .. నువ్వు దోసిలి తో తాగించిన నీళ్లు.. తినిపించిన దిబ్బ రొట్టె ముక్క .. ఇంకా ముందుకెళ్లి .. చీకటి ముసురుతున్నప్పుడు .. రుమామిత గగ్గోలు పెడుతూ .. హద్దులే తెలియని చీకటి పోల్చిన కుండలో .. పొగగా లేచిన ఆధార స్థితికి అంటుకుపోయిన నిద్ర జోరుల గడప..

నువ్వు గుక్కపెట్టి ఏడుస్తూ… నా కాళ్ళని దాగ్గరకి లాక్కొని ఒత్తుతున్నప్పుడు … నీ అరచేతుల్లో ముద్దు పెట్టుకొన్న ఈ సముద్ర లోతుల ఆశీస్సు ఇంకా తిరిగి .. నేను సొమ్మసిల్లానా .. కలగా ఆయాసపడుతూ.. కొన్ని రంగులు వదిలేసిన కెరటాల మధ్య .. సాయంత్ర రంగులని మింగిన నది పురుడు పోసుకొంటోంది.. వినపడుతున్న పడవలు పక్కకి జరిగి ,.. సాయంపడుతూ..

నువ్వు నీ చూపుడువేలి చివర దుఃఖం రాజేసి .. నన్ను కమ్మిన కౌగిలి మధ్యలోంచి.. ఊపిరిని కొలుస్తూ చూసిన దేవుడు కప్పిన గుడి … అదెలా వస్తుందీ ఈ సెట్లోకి… రాలేక పోవడానికి ఏదీ లేదనే .. ఆ ప్లాస్టర్ అఫ్ పారిస్ ముక్కల్లో చనిపోయిన పరీమళం గురించి ఏడ్చుకొంటూ.. దేహపు సిగ్గరి గుణం హత్తుకొన్న పొగరుకి .. మరో నిర్వచన కూపం పండిన స్థలాలు..

అదే పలకడం అంటే .. మృత్యువు పై నేను విలాసంగా తిరుగుతూ.. చీకటి మడతపెట్టి.. ఆ గాజుల లోయలోకి.. కాటుక శిలలా కరిగి.. కలిసిపోవడం..   ఇక కాప్చర్ చెయ్యడానికి .. నీ కెమెరాకి ఏం దొరకదు..నిన్ను మరెవ్వరూ నమ్మి ఛాన్స్ ఇవ్వరు.. ఈ తలనొప్పులు ఇక పెట్టుకోవద్దు. నన్ను మళ్ళీ కలవడానికి .. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయొద్దు.

నన్నా మొగిలి పొదల రేవులో వదిలేసి.. మరో మాట లేకుండా మోసగించి మీరు వెళ్లిపోండి.. ఇది నాకెప్పుడూ అలవాటే.. మరో నవ్వు ఉడకడం కూడా చూడలేనని నాకు బాగా తెల్సు..  ప్రాణ గ్రహణం కుమ్మరించిన దేహ సెగలో పడి .. కొట్టుకు పోతున్న ఆయాస స్థలం జోడించుకొన్న ఆనవాళ్ల గారడీ ఇక మాటని కడుగుతుంది

చావు స్నానం చేయించి.. దేవుడి పక్కగానే పదుకు బెట్టడానికి తను ఎలానూ వస్తుంది.. ప్రభావిత దేహ సగం కురిసిన వానని కప్పుకొని.. పేరుకు పోయిన నిద్ర జడల రాట్నంతో వాడిన చీకటి నరాల కైపుని దాటి.. పల్చని ముహూర్త ధ్వనిలో పేరుకున్న శరీరం..

పిచ్చి పట్టి .. షూటింగ్ నుంచి ఏటో తప్పి వెళ్లిపోయాడని .. ప్రచారం చేసుకోండి.. ఇంకేవైనా అక్రమ సంబంధాలు.. తాగుడు సంగతులు.. దొంగతనాలు.. ఏవైనా అంటగట్టి ..నన్ను మొత్తంగా తుడిచెయ్యండి..

కోపాలు సమసిన దుఃఖ పుటమిని పట్టుకొని.. అక్కడే బొంతలు కుట్టిన దూది ఇంకా దుఃఖం పీలుస్తూనే ఉంది.. దానిని లేవడం ఇక ఎవరి తరం కాదు. ఆ ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు పోగొట్టుకోవద్దు. మీలోకి వచ్చి చేరుతున్న దిగులు ఏ రోజుకారోజే తుడిచి .. పక్కకి తప్పుకోండి.. ఇది ఇలా నాతోనే ఆగిపోనివ్వండి.. ఇంకోసారి అంటుకట్టిన నా కథకి దీపం పెట్టిన గదిలో నీటి చెట్టు ఒరిగిపోయింది.

వికీలో పాడిన పాటతో దేవుడు చేసిన సముద్రం పొంగు కొచ్చి .. ఆ తీసుకొచ్చిన ఇసుక మేటలోనే .. మరేం ఆచూకీ దొరకక … వెనక్కి పొమ్మని .. కొండలు రాళ్ళ జార్చి బయపెడతాయి.. మొదట్లోనే అర్ధం చేసుకొని.. తర్వాత అర్ధం చేసుకొన్న .. చెప్పడానికి ఎవరూ మిగలరు.. అదే ఇక లాస్ట్ షెడ్యూల్ ఐపోతుంది.. dubbing  కి వాడి గొంతు నాలానే ఉంటుంది.. ఇక మిగిలిన కథలో .. దేవుడి కప్పిన గుడిగా నా కథని తిప్పి … మరో మలుపులో .. రెండో పార్టీ ఉందని అనౌన్స్ చేయండి.. లేదా నా అభిమానులు మిమ్మల్ని వదిలిపెట్టరు.

d)సర్ప దోషం.. అలిగిన నీటి గజ్జెలు .. ఏడు  రోజుల వరం 

నిరా శిక్షిత ద్రోణుల్లో ఆది భోగం .. చుట్టేసిన గదిని పొడుగ్గా సాగదీసి.. మాట పడిపోయిన కునుకుని కప్పుకొని.. ఎండిపోయిన గొంతుతో.. కలల పూడిక … నిర్యాణ దేహ కలతకి వార్చిన పగటి దోషం ఏడుస్తూ.. కంట్లో పండిన శాపిత ఋణం కూర్చిన దేహ కుంపటి.. ఒరిగిన రెండో కలవర దూరంలో మోగుతున్న పెదాల ఆవిరి పట్టిన వాగులు..

ఉండిపోదామని .. నీరుని నింపుకొని గాలి కప్పిన చివర కేకని చేర్చుకొని … పడి లేచిన నిద్ర సత్తువని వదిలామని.. అప్పటి తన ముఖమూ.. శ్వాసల వేడుక.. కన్నుకి పట్టిన చెమటతో పండిన వీధి రథాలు.. నిప్పుల గుండం కోసిన తవ్విన గుంత.. దూరంలో ఆగిపోయిన గుడి.. అక్కడ మరో గొడవ ఏదీ లేకపోయిన అక్కడికి ఎందుకో.. ట్రాలీ పై కెమెరా జరగడం లేదు.

కెమెరా ఎక్కడ సెట్ చెయ్యాలని డైరెక్టర్ ని అడిగి.. ఆమె తో కొంచెం మేకప్ తగ్గించుకోమని అరిచాడు. పెద్ద పెద్ద గజ్జెలు.. చర్మ ఊడదీసిన మేకపోతులు.. గ్రహణ చిత్తడిలో పాతిపెట్టిన నలకల కన్ను.. మీగడ చిలికిన దగ్గుతో పూడుకు పోయిన గొంతు.. చివరకి తన చీర.. పాకుడు పట్టిన గాజులు.. మూలకి తుడిచిన ఇనుప చేతుల నుయ్యి.. కొంచెం మరిగించిన కాగితాల మధ్య .. కీడుని కప్పిన నులక మంచం పేర్చి.. లేవదీసుకొన్న బెంగతో కుదిరిన ఒప్పంద పూడికలు.

ఎవరికి చెప్పుకొని.. ఎవరి నుంచి విడిపోయి.. ఎండ విసిరిన దుఃఖ మూలంలో పీలికలైన చీకటికి అనువాద గ్రహణ కప్పుదల…సర్ప దోషం.. నిలువెల్లా విషం మరిగిన పాటని పట్టుకొని.. దేహ సవరింతకీ … చేసిన నిగ్రహ తీర్ధంలో వాడిన కుండకీ.. పిలిచి చెప్పుకొన్న నిరాధార భూమి పేటికని సర్ది.. కెరటాలపై కట్టిన కెమెరా..

మరోసారి సర్దుకొని.. ఏడ్చి.. కథకి పట్టు తప్పిన చూపుని పాకించి..   అలిగిన నీటి గజ్జెలు … ఎవరమూ చెప్పి రాలేదని కోప్పడి .. దుఃఖ మరుపుని జోడించుకొన్న రాజీలు.. ఎవరికీ ఇక తప్పించుకోలేని దేహ రీతులని కట్టి .. పగగా లేవదీసుకొన్న కునుకుని కాగబెట్టి.. జరిగిన దూరపు గ్రహణ సంధికి మార్చిన ఘటనని కాదని..విడదీసి కట్టుకొన్న సంపూరక చెలిమిని పాడుకొంటూ.. ఊరబెట్టిన పడక.. ఏడు  రోజుల వరం

మొదటి రోజు .. లొకేషన్ అదే .. పాత్రలు వాళ్ళే.. మాటలు కొంచెం మారినా .. modulation అదే.. గొంతు సరిచెయ్యని పాటనే .. బొంగురు గ్లాసుల్లో ముంచి.. తనతో తనకి రాజీ లేని నిద్ర గ్రహణపు పట్టుని సాగదీసిన చర్చిత పడిగాపులని వదిలిన దోసిలి.

రెండవ రోజు ;; కథ అదే .. స్క్రీన్ ప్లై మధ్య నుంచి మొదటికి.. చివర నుంచి చివరకి వెళ్లి .. మృత్యు ప్రార్ధిత పొగని కమ్ముకొని .. వేలాడిన చూపు.. ఒకేసారి చెదిరి పోయిన దేహ నిరాకార పుట్టుకలో వదిలిన నీటి సజ్జల మంచు పాతరకి .. అలతి నిడివిని మోసిన దేహ సాక్షికి..

మూడవ  రోజు … ఇక ఇదే శోభనమంటే.. అతను రాదు.. జెండా చుట్టి పంపిస్తారంటే.. కాల్షీట్స్ ఇక లేవుగా .. రాడు .. రాలేడు … అతని చుట్టూ గొప్పగా అల్లిన కథలే ఇక ఆమె ఆయువుని నింపి .. ఎండిపోయిన మంటకి శరీర మిచ్చి.. గదిలో నిండిన స్మశానంలో రోజూ తిరగాలి..

నాల్గవ రోజు ;; తన పాట మర్చి పోయి మతి తప్పి .. కరిగిన నిద్ర జోలలతో .. చెమ్మ వదిలిన వీధుల్లో .. వాన గదిని పట్టుకొన్న నడక .. చెంపల్లో సవరించిన చీకటి నడుముని దున్ని.. నటించే గ్రహణ వాకిలికి చెట్టుని ఇచ్చి పగతో దూరంలో ఆగిన నుదిటిని కట్టుకొని.. పల్చని ఆందోళ ముఖంలో రంగు చల్లుతారు.

ఐదవ రోజు;; పుట్టుకని వద్దని.. మాటకి పెనవేసుకున్న భుజాల బరువుని కరగదీసుకొని.. తేలికైన చావుతో.. కూర్చిన దోసిలిలో నిండిన భయం … కలబెట్టుకొన్న కంగారుల ఎత్తుగడని వదులుకొని.. ఇరుకైన దేహ నిద్రలో కలని వద్దని .. దేహం చెప్పి చేసుకొన్న ఒప్పంద శ్రమను విడిచి..

ఆరవ రోజు ; ఆ పక్క .. ఈ పక్క లేని దేహ గరుకుల నివేశ స్థలంలో పోతపోసిన చీకటి నిల్చివేతల కుట్టడి మాంసాల ఉడకమోత తాలింపు పెట్టి .. రాలేవా స్మశానానికి విందుకి.. అంటారు. అన్నీ అక్కడే సర్దేసి ఉంచాం.. పగకి చేర్చిన రుణ గాలి ముంపునీ కట్టిన చెమటతో పండిపోయాం..

ఏడవ రోజు; అంతా సరిపోలేదు.. కథకి రెండో సారి తెచ్చుకొని జాగ్రత్త జ్వర స్థలంలో పాడుబడిన గొంతుని ఊరడించి పగతో నిండింది. ఎంత చెప్పినా వినదు.. మాటని కొసరి రెండో చోటులోని దుర్భిక్ష పడకని తిప్పి కట్టి .. నీరు పట్టిన చీకటిలోకి పాకి మాయమై పోతుంది. ఇంకోసారి కథ చెప్పడానికి ఇప్పుడెలా మార్చి .. రెండో కొసని వదలగళం.. నన్ను గాలిలోనే వదిలిపెట్టేయమని.. నీళ్లు పెట్టుకొంది. చూపు మరి కలవదు.. రంగు ఇక మాసిపోదు.

  సరళ సర్దుబాటుకు ఒప్పుకోక ఏడ్చిన పెద్ద గొడవల గొంతుని పట్టుకొని.. ఇగిరి పోయిన శరీర తోవలో కూరుకుపోయిన దీప గతికి .. రెండు పక్కలా చేరదీసి పెదాల కాపుదలని జోకొట్టి .. ఉండిపోయిన మాటల ఒప్పందం.. గోడల్లోకి కూరిన చావు నిద్ర వేడుకలు.. సాగిలపడమని చెవిలో ఎవరో చెప్పి .. చూపుకి కనిపించరు.. ఆ మహా నివాళి ముందు పొలమారింది గొంతుతో.. పల్చని వణుకుని తాగిన నిరాశ ముంచుకొని.. సర్దుకొంటాం.

ఎవరు పోవడానికి వీలులేని నిద్ర ఝాముల కంటిని నులిమి.. విసిగిన దేహ వరదని కట్టుకొన్న ఛాతీలో పడి పోయిన కొండల పగుళ్ళని సర్దుకొంటూ.. పేగు తడిచిన ఆందోళ రవ్వలు నిప్పుని అందుకొని.. ఇగిరిపోయిన భయ పూతలతో పండిన దేహాల గరువు. ఇది నేను పాడి చెప్పుకొన్న చీకటి నిండిపోతాలు కట్టిన కక్ష్య .. నీరు పట్టిన ఆవిరి కుండలో .. చిటికెడు శరీర నీలం మంటని బోర్లించి పెట్టిన బూడిదగా మెత్తి.. గాలి చేసుకొన్న శ్వాసితాల స్పర్ధకి గుమిగూడిన చూపుని పంపుతుంటారు.

చప్పరించిన నిద్ర నడకల పథకాన్ని చెదరగొట్టి .. తడి కాళ్ళని కూర్చిన గొంతుతో .. తిరగబడిన చీకటి సాచివేతలని దాటుకొని… చేదు భ్రమణకి రెండో ముఖపు తాడనకి .. కూల్చిపెట్టిన అవసాన నిద్ర గదుల మధ్య తిరుగాడే సాధనకి పట్టుకొన్న వణుకు.. కూల్చిన నిద్ర దర్శనాల ముంపునీ … కొన్ని క్షణ చిత్రాల గడువుని కట్టుకొంటూ..

రెప్పలు గాలించిన నింపాది ఇల్లు .. స్థితి ప్రసాదిని.. అందరూ చెప్పులు విడిచి తుడిచిన కాళ్లతో లోపలి అడుగు పెట్టి.. గ్రహణ వీలుని పట్టి తెచ్చిన కబురుతో.. హద్దులే తెలియని బయట రొమ్ముని పీల్చి .. జోకొట్టిన కంటిని .. దోష సమితిగా నింపుకున్న చేతుల్లో పండి… నిమిత్త ఛాయల దేహ బిగువుకి కట్టిన కన్నుని సాగనంపి .. ఋణం కప్పిన అడుగుల వెంట కూలబడిన పుట్టుకలు..

పగిలిన నిద్ర తర్ఫీదులతో కాల్చిన కలని తట్టిలేపుతూ.. హద్దుని కాపాడుకొన్న జ్ఞాన స్థిమన పొద్దునే ఉంచిన కంటితో… నిండైన దేహ తీరుని కరిగించి.. లోపలి తెచ్చుకొన్న నిరాశల పక్కనే ఉండిపోయిన రైలు గొంతులు.. బయట నుంచి చీరలని కిటీకీలోంచి కెమెరాలో బందిస్తూ భాషణ.. ఇదిగో అప్పటికి ఇదంతా లేదని చెప్పుకొని.. సరాసరి కలిపిన చీకటి విల విలనీ తోడుకొని.. రెండో చోటులేని అపార్ధా గ్రహణ తీరుని కలిపి .. అక్కడే కాళ్ళని పాతుకొంటారు.

ఏడుస్తున్న దేహ తీరుల ఉమ్మడి చీకటికి తెచ్చి పోసుకున్న కథలని జోడించి .. బయట ఉండిపోయిన కరకు నిడివికి పెట్టుకొన్న అవధి. గాలించమంటున్నారు.. అతను తిరిగిరాడని బంధ గతిని సాగదీసి.. ఒంటరి గుహని చిదిమిన దుఃఖ చిలుముని ఊది పోసుకున్న ఊసులు.. విడమర్చి చెప్పుకొన్న సాధన సరిపెట్టుకొంటూ.. పెడ చెవిన పెట్టిన కథతో ఊగి.. రెండు సాధయ ఊగిసలాట చెప్పుకొన్న నిద్ర రహస్తిత మునకలు.

రంగుని వదిలి.. దేహం కరిగి.. ఘర్షిత ఆనవాళ్లతో బిగబెట్టిన ముఖాలని దాటుకొని.. చలి పట్టిన ఛాతీలని కదిలించే కునుకుని ఉడకబెడుతూ.. దేహ జాగ్రత్తని తట్టి లేపిన పడకని దాటుకొని.. సర్దుకొన్న పడవలతో గది బిగించిన ఏడుపుని తీర్చుకొని.. అక్కడే స్థిరపడ్డ కథ ఎటూ వెళ్ళక పోతే ఎలా?

దేహ లాల కురిసిన ముద్దల పూడికని దాటి.. కథలోకి కురిసిన నీటి వాన గర్భంలో పడి ఊగుతూ.. తేరుకోలేని నిరాయుధ యుద్ధ పోరుకి ఎక్కుపెట్టిన చూపుల విడిది.. సంప్రాప్త మాయకి చేర్చుకొన్న కలకి .. జోడించిన స్వగుణ రీతుల చీకటికి పట్టిన కుంటి నడకలతో … పెనవేసుకున్న సన్నని పోగులతో తుళ్ళిపడి.. వీధులని నానబెట్టి పోయిన దేహ రుజువులు.. సాధ్య చిత్రకాలని.. కప్పివేసిన నిడివిని.. ఒద్దికగా చేసిన సేవిత నిర్మాణాలని దాచిపెట్టారు.

.. …

ఇక్కడి కొన్ని అనుమానాల రొప్పుని విడిచి .. కప్పుకొని పోయిన చలన మీమాంశ పనిగట్టుకొని .. రెండు వీధుల మధ్య కూర్చిన కథకి చేరిపోయిన హద్దు.. సంప్రాప్త మాయకి చేర్చుకొన్న కలకి .. జోడించిన స్వగుణ రీతుల చీకటికి పట్టిన కుంటి నడకలతో … పెనవేసుకున్న సన్నని పోగులతో తుళ్ళిపడి.. వీధులని నానబెట్టి పోయిన దేహ రుజువులు.. సాధ్య చిత్రకాలని.. కప్పివేసిన నిడివిని.. ఒద్దికగా చేసిన సేవిత నిర్మాణాలని దాచిపెట్టారు.  

అలా తిరుగుతూ వెళ్ళిపోయినా నడకని కాల్చుకొని.. ఎవరి ముఖాలని వద్దని దూరం జరిపిన కథగా .. లేవదీసుకొన్న పడకని చుట్టబెట్టి.. ఒదిగిన నిద్ర పూర్వపు మంత్రం తాపం పట్టుకొన్న కళ్ళలో ..తర్వాత  ఆలోచనకి ఎంత మాత్రమూ అందని స్క్రీన్ ప్లే.. దేహ ఖనిజాలని కాల్చి పోత పోసిన చూపుని జోడించుకొని… సేకరించిన ధ్వని అంపకాల.. ఒద్దిక లేని రుణ ధ్యానపు పొదుగుని సరి చేసి కదిలే .. దేహ నిర్గుణ మంత్రపు ఊరడిలో పడి .. పోలికని తుడిచిన కన్ను.. గడవని ఆయుధ శాల …

ఎలాగూ మరో దూరంలో పొడుచుకొచ్చిన కణతలని దిగ్గొట్టి.. కనబడని గొంతుని పొగతో చుట్టి.. పాకిన నిద్ర గ్రహణ తాకిడికి చేర్చిన పుట్టుకని పట్టుకొని.. అక్కడే గాలి ఆడుతున్న బిగి నవ్వులు.. ఎప్పటికీ ఇదే కథకి రెండో చలంలో కురిసిన మాటగా పట్టుకొని… నీరు పట్టిన కంటి రాతని నాచుతో పట్టించి.. కలకి పుట్టిన దేహం కనుమరుగై… కెమెరాకి ఏదీ చిక్కడం లేదని .. అతను వెనక్కి విరుచుకుపడిపోయాడు. దేహ విపరీతాల చర్మ పూతలు.. మేకప్ .. లిప్స్టిక్ అడుగులకి .. గుమ్మం తెరిచిన అంగీకారంతో .. ఊరేగే దేహ చలువులకి పట్టిన బరువుతో.. నీరు పట్టిన శరీరాలతో.. పల్చని కిటికీలతో తెరలని పొగలని వడపోసుకొని.. దండిత గంటలని కూరుకు పోయిన ఆయాస పేటికలు…

…………………

చెప్పుకొన్న నిద్ర గురిని సరిచెయ్యలేక ఏడుస్తూ.. పేరుకు పోయిన దేహ పూడికలు ఒరిపిడికి కత్తిరించి.. కథ మొదట్లో దిగి… నాకు నువ్వెవరో తెలియదుగా ? అంటుంది. పడిపోయిన పుట్టుకలు..ఉరిమిన ముఖాలని పోత పోసిన కునుకుని దట్టమైన చీకటితో … తోడుకు పోయిన దేహవుల పట్టుని పెనవేసుకున్న నిర్ఘాతలు.. చెప్పుకొని విడిపోయిన ..  కునుకుని చేర్చుకొన్న .. నౌషాదపు ఉక్కిరి బిక్కిరి గాలులని .. శరీర ధునిలో కాల్చిన నెమ్మది తనపు సాయాస కథనాలు.

పరుగు పెట్టిన నిరామయ ద్రవ శూన్యంలో పడి .. తలకిందుల తపస్సుకి చేరదీసి కంటి సారపు స్థితిని జోడించే గుప్పెడు రంగుల పేజీని చింపి… పీల్చిన దేహ నీలుగు చర్చని కట్ చేసి.. అప్పటికే గదిలో దాక్కొంటారు. ఇదీ అని తెలియని నిద్ర కంపనకి చేర్చిన సదృవ ఎడబాటుని కప్పిన నడుము నిండుగా కప్పిన నొప్పి.. మరో సగం తీర్చుకొన్న తలుపు బయట క్రియా ఛేదన పట్టుకొన్న భుజాలని మళ్ళీ గుంజి.. 

మిస మిస లాడుతున్న దేహ సంపదకి రెండో చోట రుణ పడ్డ ఖాళీలని వదులుకొని..సర్ధేసిన కునుకుని పట్టుకొని.. ఇది ఇలానే ఆగిపోవాలని .. మళ్ళీ చుట్టుకొని దగ్గరగా నిద్ర గుండ్రాలని గీసుకొని … నిజారుణ చంచల ధ్వనిని పాతుకొంటూ.. కలబడిన నిద్ర గున్నాలలో చిక్కడిన ముతక భాషణల కైపుని తోడుకొని ఉన్నప్పటి మాటలు.. రంగు పోసిన కునుకుకి ..నివ్వెర పాటుని నింపిన రుణ తీరుకి.. కడిగిన గుడి రేవులో విగ్రహపు నలతల గుమ్మం పోసిన చీకటిలో దిగబడి..

ఇప్పటికి సరిపోయిన దేహ భూమి నిమిత్త ద్రవం కుమ్మరించిన అవకతవక నటనలు..కరిగిన అపార్ధా ధ్వని మండలంలో పడి .. అక్కడి గొంతుని పట్టుకోలేక దాటిపోయాక … మళ్ళీ కథ పట్టుదొరకక కొట్టుకొంటుంది. చేజారిన నొప్పితో .. పుండు పడిన కన్నుని సాగదీసి.. ముంచేసిన వయసుకి దూరంలో జరిపిన చీకటి సరంజామా..

అవలోమన దేహ పుట్టుకలు .. చేర్చి పెట్టుకొన్న నిద్ర ఊడలు… సెగని  సాగదీసి తేమరించిన మృత్యు సంధికి  నింపుకున్న అడుగులు.. పొట్టి పొట్టి కేకలని తుడిచి.. పేర్చి వెళ్లిన చితులు.. నీలోకి.. నాలోకి.. విశుద్ధ పగటితో  నీళ్లు నమిలిన మాటలతో.. పేరుకున్న సంధి చేయమాలకునుకుని .. పరిమిత సత్తువులతో పారబోసిన సంధి సూత్రపు గదుల మధ్య … చేజారిన సగపు … ముఖాలతో.. పెట్టుకొన్న నిజారుణ కళ్ళతో.. తోసుకు వస్తున్న మాటలు..

అదే నా ఊరు.. నా కన్ను తడిచిన నది.. ఛాతీ లోపలి పొంగిన గుడి.. చెవుల్లో నిద్ర తాయిలపు కాగితాన్ని విపినప్పుడు మోగిన గంట.. సమాధి దగ్గర గుచ్చినా అగరు బత్తీలు … ఇష్టంగా ఉంచిన జున్ను.. తిరిగి చూడక కాలువలో చేసిన స్నానం.. స్మగిత రుణ తీవ్రతలని ..తేమని జేగురించిన రెప్పల కనుసన్నల్లో పడిన చీకటికి .. రెండో విడత తలుపుని కాల్చిన కునుకుని దగ్గరచేస్తూ… పొడిబారిన మొండి పూడికలు .. వదులు గొంతులో పొడిని కూరిన చీకటి క్షేత్రాల గడువుని దాటుకొంటూ..

తెల్లారేసరికి ఆ సెట్ ని ఎవరో ఊడదీసుకొని.. లారీలో వేసుకొని వెళ్లిపోయారు.. వెనకా .. ముందూ .. పోల్చుకోవడానికి .. తలకిందులు అవుతున్న సంధి యాత్రగా హత్తుకోవడానికి ..పడి పోయిన చీకటి తెరలు గుట్టు విప్పుకొని.. లోపలనే కూలిన దేహం.. చెరిసగపు దేహ సెగకి నెరవేర్చిన .. కంటి శోధనకు తిప్పి వెళ్లి పోయిన చలి నిందలు.. గుబులు పట్టిన చీకటి చప్పరించిన రుణ ద్రవాలతో .. పేరుకు పోయిన నెలల ఊపుతూ .. ఒద్దికగా ఉండిపోయిన అంచులతో.. సమయ సముద్రాలతో తిప్పి చూసుకొన్న కొండలు..

ఉండటం లేకపోవడంతో ఏం జరగదు.. ఆ ఊరిలో ఇప్పుడు మర్రిచెట్టు కూడా లేదు. కానీ నా నిద్రలు .. బరువు కొండలని ఎక్కి నప్పుడు .. నా దేహం నుంచి బయట పడి కొండ కొమ్మకి బలంగా ముడిపడి .. నన్ను భద్రంగా పైకి ఎక్కించే ఊడలు .. నిద్ర ఊడలు.. అవి అలానే.. పట్టి బిగించిన మృత్యు శీతల పూతలు కనిపిస్తూ .. దేహం ఒత్తిగిలిన కాలి ముద్రల మిగులుని తుడుచుకొని.. ఇరుకైన గొంతుని కడిగిన కమిలిపోతలు .. ఆవాళి .. నిద్ర జాడలు విప్పిపోసుకున్న నిర్వేదక నలుపుని ఊడ్చి..

………………..

కుదిరి పోవడం .. కుదిరిన మాట వినక కప్పుకున్న దుప్పటి కింద విసుగుని కూల్చుకొని.. పెద్ద హోరుతో తిక మక పడటం.. పట్టు తప్పిన చూపుని కడిగి .. పెద్ద ఖాళీల శూన్యంలో పడి కొట్టుకు పోవడం .. ముసిరిన కథలు… ప్రభావ ఆవలిఖిత జత నిద్రల మధ్య గరుకుగా వేలాడే దీప తవ్వకాలని జోడించి కదిలే నిలువెత్తు కాపలాకి జోడించిన కన్ను .. దర్శ ముంపులని మార్చి చేసిన కరుకు కాపలా..

బ్యాక్ గ్రౌండ్ చన్వస్ అంతా అలాగే ఉండి.. కనబడని చూపుని దాచుకొని.. నిద్ర పట్టేసిన నీటి లోతుల భయం పట్టుకొన్న గందరగోళంలో చిదిమేసిన దేహ జాలపు ముట్టడి కి చేర్చిన ప్రశ్న తగలబడి మరో హెచ్చరికని వండుతుంది.. ఐక్య హొయమాల గుచ్చం పొగని వదిలిపెట్టి…. అక్కరలేని వాయిద్య కాపలాగా జత కలిసిన చీకటిని పోల్చి.. పేరుకున్న అనర్ధ కేకల పొడి గదిలో మేకప్ పూర్తికాని చేమ్పాలని ఎర్రగా కాల్చిన సమాధి పక్కగా .. నీరు పట్టిన కథకి .. మూడు మలుపుల ట్రీట్మెంట్ ని ఒప్పుకోక గుక్కపెట్టిన ఆయాస నీరుల పొందిక..

నీటి గేలం .. ద్రవ కలిత వివర్ణ కి పుట్టిన అనుమాన కక్ష్యలో పడి ఊరేగే పాత పేజీల బుట్ట .. సంకెళ్ళ నిద్ర ఊపుతో.. హద్దులు ఊడ్చిన శరీర సాధన.. ఇది మరొకసారి తెల్లార్లు ఉండిపోయిన కునుకుకి పట్టిన తేమల పడకగా ఆగిపోదని.. అక్కడ కలిసి డైలాగ్ పేజీని మొత్తం మార్చి వినిపించినపుడు.. కాస్త తీరిక లేని తీర్ధ గోషకి దూరం జరిగాం . మొదలవ్వని నిద్ర సరిహద్దుల్లో.. స్క్రీన్ టెస్ట్ చేసిన విగ్రహాల పడకని పట్టుకొని.. తిమ్మిరి పట్టిన రుణాలని జత చేయించి కదులుతూ.. ఎవరమూ .. ఇంకో వివిధంలో పడి దారికి తెచ్చుకోలేని విపత్తుని దాటేసి కదులుతాం..

అమ్మ విడిచిన వంట ఇల్లు.. మెట్లు కడిగిన నది..

…………………………

ఎర్ర చీర కట్టిన వేడుకలో తాను మొదటిసారి కలిసింది.. ఎనిమిదో నెలని కష్టంగా నడుస్తూ… చిక్కబడిన ఊపిరి ఆయాసం మోసుకొన్న… తడబడిన రంగుల కోలాహలపు భుజాలని చేర్చుకొన్న నొప్పికి .. తేడాగా ఉండిపోయిన నడుము కింద చేతులు వేసినప్పటి ప్రశ్నకి .. ఇదే ఆఖరి వాయిదా .. ఆ తర్వాత ఇక అగ్రిమెంట్ మాత్రమేనని….. సీసాలు కౌగలించుకొన్న .. తెల్ల పౌడర్ సరళతకి .. నల్లని ఝాము కూలిన బురద చేరుకొని.. విసిగిన హద్దులతో చేరదీసుకొన్న ఇల్లు.. అదీ షూటింగ్లో భాగమే..

నా పాటని తీగలపై విని.. పొంగిన నీటి దోసిలిని .. భద్రంగా కుండలో పోసి వెళ్ళింది.. ఇప్పటికీ ప్రసాదంలా .. ఒక్కో బొట్టు నా స్నానపు నీళ్లలో కలుపుకొంటాను. .. సన్నని పంటలపై కూర్చిన దుఃఖ పూడికలు మోసిన కలతకి జార్చిన హద్దుని పెనవేసుకున్న అభయ గతులు.. వెల్లకిలైన నిందలని మోసుకొని.. ధ్వని కవాటంలో పూనిన గోళాల తో చేరుకొన్న పునాది కట్టడిని పట్టుకొని.. దూరం జరిపిన పోలికల పుట్టుక..

గతపు మంటలో కాలేదిగా ఏదీ లేదని.. తను పడవలో వెళుతున్నప్పుడు అనింది.. తెల్లార్లు గంటలు మోగించిన గుడి.. పునాదులు కల్లోలమయ్యే నది పక్కాగా వేసిన సెట్.. కొన్ని పెద్ద క్రేన్లు.. ట్రక్స్ను.. బట్టల వాన్ … మొబైల్ కిచెన్ .. పెద్ద పెద్ద లైట్ మాస్టలూ… వివరాలకై దూరంగా .. విసిగిన హద్దులో పడి .. కన్ను పోసుకున్న నిరాధార కట్టు పోతల గుట్టుని కాదని .. ఉండిపోయిన కునుకు పోటుతో.. తీర్చి పెట్టుకొన్న సమయ నిధి గడువులు..

కానీ మళ్ళీ కనిపించలేదు.. పెద్ద కెరటాల మధ్య విడిచి వెళ్లిపోయింది.. నాకు పడవ నడపడం రాదు .. కళ్ళు మూసుకున్నాను.. పడవ వెళుతూ ఉంది.. నా లోపల తాను పాడుతూ ఉంది.. నేను తీగలని సరి చేస్తున్నాను..

తీరా ఇంటికి వెళ్ళాకా … ఈ ఇరవై ఏళ్లగా ఎక్కడికి వెళ్లిపోయావురా అని? ఆపుకోలేని ఆయాసంతో కిందపడి .. అంతలోనే లేచి.. వాడికిష్టమైనవన్నీ వండాలని పరుగుపెడుతూ… దూరంగా కూలిన పిడుగు.. దిష్టి తీసి చేతులని తుడుచుకొని.. వాడి ముఖం దగ్గరగా లాక్కొని.. బుగ్గలని నొక్కి.. చిన్న కోపం పట్టలేక .. చెంప మీద కొట్టి.. మరో మాట చుట్టిన గొంతుని.. కొంగు కూరుకొని ఆపి.. కంట్లోంచి మాటని తీసుకొని .. తలదించుకొన్నాడు. పక్కకి తప్పుకున్నాడు.

నాకు నోట మాట లేదు.. అంటే .. ఆ ఒక్క రోజు ఇరవై ఏళ్ళు .. ఇంకోక్కసారి కలిస్తే.. స్క్రిప్ట్లో అంత వివరంగా ఎందుకు.. ? ఇక్కడొక ఫ్లిప్ తీసుకొని.. నెక్స్ట్ కి వెళ్ళిపోదాం.. ఆవిడకి ఇక కాల్షీట్స్ లేవు. భయం చేజారిన నీటి గ్రహణ జ్వరం తప్పించుకున్న కలలని కూర్చుకొంటూ.. తీరిక లేని వివరపు  పొడవుని కాల్చిన కునుకుతో.. పెడ చెవిన పెట్టిన కేకలని దాటుకొని … మాటలని వదులుకొంటారు.

……………………….

ముసిరిన నిద్రలు.. మంచు ఊడలు పట్టుకొన్న కధలు.. ఉండడం .. లేకపోవడం తో కథకి నిమిత్తం లేదు..

విశ్వాస సగం ఇచ్చుకొన్న దేహ నీరు పాకిన చీకటిలో … పేరుకు పోయిన అప శతాబ్ద సమయ వారధిని పడవ లోకి ఇచ్చి కెరటాలు ఇంటి వరకు వస్తాయి. ఇసుక గుడి ఇంటిలో వెలుస్తుంది.. ఆరడి పట్టిన నెలల ఊపుని సాగదీసి .. కంట్లో నులుముకొన్న పింగాణీ పాత్రల చప్పుడుని ఊడ్చి.. నెలల కాల్పుని జోడించిన ఊపద

నేను వదిలేసుకొన్నాను. మళ్ళీ దగ్గర చేసుకోలేను.

గరుకు రెప్పల్లో నూరిన తెల్ల నిద్రల పొందుని కప్పుకొని.. మహా స్మశానపు చిత్ర వరదలో కొట్టుకు పోతున్న చలన పూర్ణ అసాధ్యత … తిరిగి తిరిగి చెప్పుకొన్న .. అక్కడి వరకు వచ్చి ఆగి.. ఆయాసం వడపోసుకొని.. ఇంకి పోయిన కథతో ఎదురుపడుతుంది. భయం మాట వినని కూడికని.. మృత్యువు చేర్చి పెట్టుకొన్న తీసివేతలు పేర్చుకొన్న వేడుకల మధ్య చిందుని తప్పిస్తూ.. తేలిపోయిన నడక.. కన్ను గుచ్చిన నిద్ర ఊతాలు..

మంత్ర ఆధ్యపు మృత్యు కొలను.. పెద్ద కన్నుని గుప్పిన మంచు వాకిలిలో వాన .. ఛాతీని తెరిచిన గొడుగు.. హద్దుని విడదీసుకొని కదిలే నీటి గదులు… సమయం తేలిపోయిన సగం నిద్రకి .. స్క్రీన్ టెస్ట్ చేసిన నటనల పుట్టుకని దాటుకొని.. వలస పోయిన రుణ సత్తువని.. కాలబెట్టిన నడకలని దగ్గరకి చేసుకొని.. ఇక్కడ వీలు చూసుకొని .. పండిన కలల బిగువుని సర్దిన ముఖాలతో .. గుదిగుచ్చిన కంటి చూపుని నానబెట్టి.. కలబడిన గదుల చివర విరిగిన కన్నుతో..

నీకని .. నాకని దూరం జరగని అంటు కట్టిన రాత్రి ఝాములో పడి … అటు ఇటు తప్పి పోయిన వెళ్లినా .. అక్కడకి మాత్రం పడవ చేరనివ్వదు.. ఎవరమూ ఇంతకంటే చెప్పుకోలేం.. అక్కడ భారీగా నిండి పోయిన కలలతో పండిన కునుకుని దాటి.. విపరీత సానుగతిని పేనుకొన్న పుట్టుక.. అక్కడిక్కడే తేలిపోతున్న నిద్ర కంపనల ఊరటని కాదని .. వెల్లకిలైన దుఃఖ ముద్రలతో కూర్చుకొన్న అవసాన భుజాలని చేర్చుకొని.. అప్పగించిన దేహ గడువులో తొందర పడని కునుకు జాడలు తెర్చుకొన్న కెమెరా..

ఐతే ఇంకెందుకు.. ఏ కథని ఇక ఏంచెయ్యగలం? ఇలా వదిలెయ్యడమే అందరికీ మంచిది.. వివరాలకై దూరంగా .. కంటికి చేరదీసి సూదులని గుచ్చిన పడక.. తేరుకోలేని విపరీత నిద్రకి పూత పెట్టి.. దగ్గిన గొంతుని సానపెట్టి.. కలబోసిన నడకలా మధ్య కుమిలిన చూపుతో.. హద్దుని మార్చి పెట్టుకొన్న రుణ పూతలు.. పునాదులు..

నువ్వనుకునే .. ఆ సినిమాటిక్ experience ఇది అంతగా ఇవ్వలేక పోవచ్చు.. నీరు పట్టిన కిటికీలు.. సిగరెట్లతో బొంగురైన గొంతు.. దోసిలిలో పండిన చీకటి నిలువుల వణుకు.. కావిడకి దగ్గరగా చీకటి అంటుపోసిన నడకతో చేరి .. మసక నిద్రల పాటని అందుకొని.. ఇక్కడ కొంచెం అందుకొని ఉందామని..చెప్పుకు పోతున్నప్పుడు.. నమిలిన దుఃఖ పోతకి .. విసిరిన నిర్గతి పుట్టుకని పట్టేసిన గాలి లుంగల కుదుపుకి.. అలిసి కట్టుకొన్న దూరాలపై పేర్చిన దుప్పటి ముంపులు……………………..

కొత్తగా ఏదీ అడ్డు రాదు. చెప్పబోయిన మాట ఈడ్చుకొని.. పొగిలిన దేహ రీతులని సరిచెయ్యక .. ఊరట లేని నిషారపు సమయ సంకోచంలో పడి.. దిశాయ స్పర్థ తంత్రీ తెగిన గది అరుస్తుంది.. ఇప్పటికీ సీసీ టీవీ లో కనిపించినది అదే శరీరమని ఎవరికీ తెలియక .. సర్ధేసుకొన్న అనుమానాల్ని రాజీ చేసుకొంటూ.. ధ్వని అఖాతపు మండలంలో పేరుకున్న నిశ్చల రూపమాల కుట్రని కౌగిలిలో పండిస్తారు.

ఇంకా ప్రాక్టీస్ .. సీన్ పేపర్ ని నమిలేసి.. కప్పు బోర్లించిన … ముఖం దొరకక… మానిటర్లో అంతా మాయమయ్యాక .. చేర్చుకొన్న ధ్వని సగపు తలుపుని పట్టుకొని .. ఊపి.. చేదుగా నింపిన గాలి పోటులా .. నిషాదిక రజ్జువుల ఊపుని తాగి.. నిలువెల్లా వణికిన శ్వాసతో..

అల్లాడుతున్న చీకటి జరుగుబాటులో.. ఎండ పోసిన ఉల్లిక్కిపాటు గ్లాసులు … ఆ వెనుక తెల్ల తెరల్లో పడి.. కలబడుతున్న కునుకుని పట్టుకొని.. విసిగిన వేరుపాటుతో అవధిని జోడించి.. పాతరేసి కంటి శూలాలతో వంతెన కట్టిన చోటులోనే.. ఊరు కలపని నది.. గుడిని మింగేస్తూ..

కల ఆసరాలు ఊడిపోయిన దృశ్య తమకం కప్పుకున్న జరుగుబాటుతో .. తిప్పి రాల్చుకొన్న దేహ బంధిత పొగరుని కమ్ముకొంటూ.. విప్పి పెట్టిన కొన్ని జతలు కాంటీనులంటే కావాలన్న .. ఆ పడవ దొరకలేదని అతను కంగారుగా అనే లోపు .. సంద్రం మింగిన నది బయటకి వచ్చి అరుస్తుంది.

రుణ పడటం .. ఏడ్చి దూరంలో పాటని కలుపుకొని.. కుండ పగలకొట్టడం.. పొగల మంటని మరింత పెద్దది చేసి.. స్మశానంలోనే వంటలు మొదలుపెట్టాక .. ఉండిపోలేని శరీర ధార పట్టిన నీలాస ధ్వనికి .. చెమ్మరించిన పడకని సిద్ధం చేస్తారు.

………………..

దుప్పటిని చేరనివ్వదు పడవ.. కెమెరా ఆచూకీ దొరక లేదని.. కాపుకాసిన నిద్ర కాపలాల మధ్యలో ఇరుక్కు పోయిన హద్దు.. అక్కడే మొదలుపెడదామని.. మరో narration లో కూర్చొని .. అన్ని వెనకా మందులూ .. మరేదైనా ఇబ్బందిలోకి చేరిపోతాయా?అని తెరిచిన భయశాల కుంపటిలో పేర్చుకొన్న పెదాల నొప్పిని మరగబెట్టి.. ఒద్దికలేని ఊర్పులు.. అదే కథ లోపల ఉంచుకొని బయట పడక .. నిలువు గుండాల్లో జోడించిన మాటకి చేరిన చీకటి నులుముకొంటూ.. తెరిచిన ఎర్ర తలుపు గుండాల్లో కనబడే శ్వాస నిధిని కప్పుకున్న మలుపులు..

పెదాల నల్ల బారిన మరు నిద్రలో కల మోసంతో గుంజిన వాన … చెడిపోయిన సెట్.. బోరుమన్న ఇంటి నరాల పోటుని … చల్లారబెట్టిన కునుకు మధ్యలో కూరుకు పోయిన చీకటి పోతల గుడిని .. మడత పెట్టిన చీకటికి రెండో వీధిని కప్పిన అరుపుని పట్టి..ఊరట లేని కథకి దూరం జరుగుతారు. ఇదివరకే ఎవరికీ ఏదీ తెలియక పోయినా .. అంత తెలిసినట్లే నటిస్తూ .. మరిన్ని షెడ్యూల్స్ జరగనిచ్చాక ఉండిపోయిన కథలని జోడించుకొని అలిసిపోతారు.

కదిలే నీటి గదుల్లో పడవ… అటు పక్క గోడ తీసేయకుండా .. ఎట్లా ఫ్రేమ్ సెట్ చేయమంటారని ఈఅవరో అరుస్తున్నారు.. ఎంత చెప్పినా వినలేదని .. అతను గుమ్మం బయట ఎవరికో చెబుతూ .. ఇంకేం తిరిగి రాదు.. కనీసం పాత్రని చంపాలన్నా .. ఒక రోజు కాల్షీట్ కావాలి. ఎవరమూ మరోసారి చెప్పుకోవడానికి దగ్గరకి జరగం.. మోసిన కన్నుని సాగదీసి.. కుమిలిన నిర్యాణ తీర్ధంలో పడి .. తోడు దొరకని ఇంటి నిందని గుప్పిన వానని కాదని .. పొడిబారతారు.. బీటలు తీస్తారు.. బిర్ర బిగిసిన చూపుతో హద్దుని పెట్టుకొంటారు.

 ఎక్కువ కానీ అపేక్ష తీరుని చిక్కుకొంటూ.. రుణ తేలికల పట్టుని దులిపి.. నుదిటి నిండుగా చేర్చిన పెద్ద కెరటాల గట్టు.. కూలుతున్న మర్రి చెట్టులోంచి .. బిగదీసిన అరుపు.. కన్ను చెదిరిన రుణ తీరికని కాదని .. చలన మితికి చేర్చిన కునుకుని ఉడకబెట్టి.. ఒద్దిక లేని సమయ సాయపు మంత్రధారకి నిలువెల్లా పూడికలు….. చెప్పి తప్పుకొన్న మండలాల్లో చీకటి నిలువు అనువాద దీర్గంలో పడి కనిపించక ..

……………………..

విసిగిన మెరుపు దాడిలో… మసి పూసిన ముఖం .. గుర్తు కాల్చిన ఊరిలో పెనవేసుకున్న దోష గుండాల ఆవిరి రొమ్ముని పిసికి… శరీర జతలని తురిమిన పట్టుని దులిపి.. కథకి దూరం జరిగిన హద్దులో పడి తలకిందుల .. నగర దర్శనలో .. ఉక్కిరి బిక్కిరయ్యే నడథాని మార్చుకొని.. ఇగిరిపోయిన చిత్తడి పుట్టుకని దారిలో పెట్టుకొని.. అక్కడే నెలలు పేరుకున్న మంచంపై .. అతనింకా కదులుతూనే ఉన్నాడు.

త్వరపడని నడకకి చేర్చిన కంటిలో దీప లాంతరుల సవ్వర నులుముకొన్న విపత్తు.. ద్వియాయ మునకల సంధికి తెరిచిన గేట్లు.. పెద్ద లోయల పొర్లింతలు నది .. గురక పెడుతూ .. కలలోంచి పడవని వదిలాక … లాంతర్ల పూతతో ఆవిరి జడలు విరబోసుకొని ఏడుస్తున్న దేహ ఝాముల కట్టడికి ఒప్పుకోక …

ఈ screen play ఇంత complicate  చేస్తే .. సగటు నాలాంటి వాడికి ఎలా? నేనోదో సైంటిస్ట్ లా .. ఈ కథని పరిశోధిండానికి రాలేదు.. ఊపిరిలో పడి స్పృహ లేకుండా పడి ఉండడానికి అసలే రాలేదు.. నిన్ను గుర్తు అన్నీ నిన్ను మల్లి పిలడానికి వచ్చాను.

అన్నీ రిజెక్ట్ ఐనా .. కనపడే దేహ కంపన దూరాల్లో పడి.. పోలిక లేని ఆయాస సమాధికి రెండో చూపుని ఇచ్చిన నడక … ఏకైక నిద్ర గురి .. పల్చని నేరపు కొత్త పుట్టుక .. నిషాద దీప మొండెం విరగదీసిన కునుకు.. పాతగా ఉండిపోయిన పడక.. ఆనవాళ్లు లేని ఇంటిలో.. పాతి పెట్టిన అల్మారా బయటపడుతూ .. హెచ్చరిక లేని సంతర్ప ఊడిగాలు తిరగబడి..

గాలి ఛాయలు ఒంపిన గొంతులో.. పాతరేసిన సిగ్గుని కట్టుకొని.. శ్వాస త్రిగుణి దిద్దుకొన్న ఒంటరి సాధనాలు.. మరింత దూరం చెప్పుకొన్న క్లైమాక్స్ ని పంచుకొంటుంది. 

తడిపిన నిద్ర గొంతుల్లో పాతుకు పోయిన కలకి .. రెండో వీధిలో దాచిన రుణ శత్రువుగా .. కలపని కథని దాటుకొని.. ఇగిరిన చూపుల మధ్య కొలిమిని ఊదిన గ్రీన్ తెరల మధ్య పడిపోయిన దేహం.. తెల్లార్లూ పట్టించుకోలేక పోయిన నిద్ర తెరల ఇంటిని.. కాల్చి పెట్టిన కళ్ళ కాపలాకి చేర్చిన దోషపు మూలాల్ని తొక్కి పెట్టి .. దేహ నిర్గతికి పట్టించిన చూపుని దాటి .. ఆ పైన ఉండిపోయిన సైగలు..

అక్కడ గుర్రం లేకుండానే ఎగురుతూ.. ఆ పెద్ద కొండల్లో దాచిన ప్రాణ లయ కెరటాలుగా పొంగుతున్నప్పుడు.  కొండలు అందుకోవాలని తల పైకెత్తి ఏడుస్తూ.. సముద్ర ఆలింగనలో ఆవిరి కక్కిన చీకటి చెదిరి .. మసి పూసిన మాటలని దుళ్లగొట్టి.. కంటి ముందు సాగిలపడ్డ రుణపు బరువు..

కనిపించి వినిపించలేదని.. వినిపించినా కనిపించలేదని … వరం పట్టిన నిద్రలకి చేర్చిన ఆయాస సేద్యం జోడించుకొన్న కునుకు.. నుదిటి నుంచి చెమట గుణం తీర్చిన కాల్చివేతలకి దూరం జరిపిన దృష్టి పొరపాటుని కాదని .. ఉండిపోయిన చూపు పలవరింతని మరిగించిన నుదిటిలో పడి …

పసి గట్టిన నిద్ర రాజీల మధ్య తడుపుకొన్న వాన పడక .. పై గోడని అడిగింది.. కిటికీని చేర్చి.. కాళ్ళ నిద్రని వడపోసి.. ఒద్దిక తప్పిన ముఖం తోడుకొని.. ఇసుక పిండిన కునుకుని వదిలిస్తూ.. పెద్ద ఉరుముల ముట్టడికి చేరుకొన్న ఆ ఖాళీల మధ్య నే దుఃఖం తీరిన భయం ఉడికిపోయాక ..

కంగారు పడడానికి ఏం లేదు.. everything  is  అండర్ కంట్రోల్ అని .. డైరెక్టర్ అరిచినా .. ఆమె మాత్రం తన మేకప్ కి ఒప్పుకోక … వాన్ తలుపు తెరవక … తను మాట మార్చిన స్థలంలోనే కసిగా నిలిపేసిన దుఃఖ సంధికి .. వరం చుట్టిన కాళ్ళ దీవనగా ఉండిపోయిన ముఖాలన్ని వడపోసి.. అయత్న నిగర….

……………………

పట్టి చూసిన చూపు..చేతుల్లో పెట్టిన స్క్రిప్ట్ .. కథకి రెండో టోన్ ఉందని నమ్మబలికే .. చీకటి కప్పిన సముద్రం ఏడుస్తూ నమ్మించినా .. పడవ మాత్రం ముఖం అటు తిప్పుకొని ఉంది.. కెరటాలతో గొడవ పడ్డ నురుగుని కక్కుకొని.. బోసిగా ఉండిపోయిన కథల సారం వదులుకొన్న బిగి పోటుని ఏమార్చిన పెదాల గుర్రుని రుద్దుకొని.. అక్కడే ఉండిపోయిన పడకలని నీళ్లలో నానబెట్టి .. తడి రేగిన జ్వరంతో శుభ్రం కానీ తలుపుల మధ్య కూలిన పిడుగు…

సమాధి సిద్ధమైంది.. గంట ని మోగించారు.. దుఃఖం పలకరించి.. గడుసుగా నిర్యాణ ముడిని వదిలి.. కంటి శూన్యంలో దిష్టి తీసిన చావుల గుట్ట దగ్గర అన్నీ కథలే.. వచ్చి పోయిన వారే చుట్టూ తిరుగుతూ.. పెద్ద అండ లేని భయ దీపం కోసం ప్రాణం లాగిన హద్దులో పడి.. గీత చెరుపుకొన్న కొండలని కప్పుకొని.. కన్నుకి చెదిరిన వాన వీధుల కవ్వింతని కనిపెట్టి.. ఒరిగిన మాటలతో ద్వై చెలమలో పుట్టిన పాట

ఉగ్గబెట్టిన కోపంతో .. గట గట తాగి ఖాళీ సీసా విసిరి .. నుదిటిపై బోర్లించిన నవ్వుతో చప్పుడు చేసి.. సరే .. నాకిప్పుడు ఏం కావాలి? ఎవరమూ మరో పోలికని పట్టుకోలేదు. రంగు దిద్దిన కథని తాగి .. పూనకాలు పట్టిన కంటిలో ఆవిరి రోతతో మసకబారి .. తెల్లార్లూ మోసపోయిన రథపు మెలికల్లో పడి .. ముఖం తీర్చుకొన్న బాధ…

ఆమె చనిపోకూడదు.. అతనిని పట్టుకొని ..భార్య ముందు రుజువు చెయ్యాలి? అంతేగా… అదేం అంత చిన్నది కాదు.. ఆ మైనస్ డిగ్రీల చలిలో .. ఇక ఎటు పోవడానికి ఏదీ లేదు.. ఇద్దరమూ ఒకే గదిలో గడిపాము. మరో ఆప్షన్ లేదనడానికి .. నమ్మడం తప్ప మరో ప్రూఫ్ లేదు.. ఆమె ఈ భూమి మీదే లేదు.. గొంతులో మరిగిన చలికి ఆయాస పడుతూ.. పెరిగిన దుఃఖ నమూనాల దేహ స్థలంలో పడి .. సొమ్మసిల్లిన పుట్టుకని దాటుకొని.. మరో సంపర్క స్థితిలేని గరుకు మాటలు.. దీపం తిరిగి వెలగడానికి. .. ముఖం పట్టి చదవడానికి మరో గతిలేని సత్యం..

ఈ రుజువుల్లో .. పాత్ర సెల్ఫ్ respect ఎక్కడ ప్రొటెక్ట్ అయింది.. ఒక పాత్ర గ్రాఫ్ ని మీ ఇష్టమొచ్చినట్లు ఎట్లా మార్చేస్తారు.. ఇక ఆమాత్రం దానికి ..pre – narration  ఎందుకు ఇవ్వడం?

అంతా మీకు నచ్చినట్లు చేసుకోవడానికి .. ఎందుకు నన్నీ ప్రాజెక్టులో ఇన్వొల్వె చేశారు.

పొద్దు కాలిపోతుంది.. పెదాలు అదిరిపోతున్నాయి.. కన్ను చెదిరిన కలత పారబోసుకొన్న నడక ఎండిపోతుంది.. మారలేకపోయిన వరద గురిని ఎక్కుపెట్టి.. ఒద్దిక లేని అమాంత గ్రహణపు దాడికి .. చేర్చి పెట్టుకొన్న అవస్థల నేరాన్ని పెట్టుకొంటూ.. తేరుకోలేని నిరాధార చీకటి నివేశ తీరుని చక్కదిద్ది మరీ గొంతు నులిమి …

…………………..

నింపాదిగా నెరవేర్చిన హద్దుని పట్టుకొని… కలిపిన చీకటి నివేశ స్థలానికి కట్టిన సమయ ముద్రని దులిపి.. పగతో కూలిన దేహ నిందని కప్పుకొని… వద్దన  లేదు. ఉండిపొమ్మని అనలేదు. నమ్మిందనడానికి వేరే సాక్షి లేదు.. ప్రసవ పోటుని జల్లించడానికి వేరే సంధి చేసుకొన్న చీకటి పిడుగుల సముదాయమూ లేదు.

విపరీత రుబ్బుడులో కలిసిన పుల్లని గాలుల ముద్దని కలుపుకొని… ముడి వేసిన కాస్త దూరపు నెడబాటులో .. పిలిపించి చెప్పుకొన్న స్వేద గడువులు.. అద్దిన కుదుపులు.. చేరవేసిన గంటలని ఈడ్చుకొని.. నుదిటిపోటుని దిమ్మరించిన కెరటాలుగా అడ్డం పడుతూ..

కలిసి తెచ్చుకొన్న ఇల్లుని … స్క్రీన్ పై పగతో కూల్చి.. my  man  is no more అని స్తతెమెంత్ తో పోలీస్ స్టేషన్లో కూర్చొని కాఫీ తాగుతూ.. పింగాణీ ద్రవపు బాణిలిలో పాతుకు పోయిన నిర్జన కాల్చివేతని.. చప్పరించిన ముఖాలతో గంటు పెట్టిన మచ్చలని గుర్తుపడుతూ.. చెదిరి పోయిన కళ్ళ మధ్య ఎడారి గుడారాలని ఎత్తి .. మెట్లపక్కకి ఉండిపోయిన రాద్ధాంతాలు…

సఫలిత దేహ సాధ్యంలో పడి.. తలకిందులుగా ఉంచిన చెమట మరకలతో.. ఒద్దికగా అప్పగించిన కాపుదలలు .. ఎగిసిన ముంపులతో తచ్చాడే నిర్మాణ దేహ ఉరుములు.. పగలబడి.. నియోమాల నడకని దాటించి పెట్టిన రంగుల కలతకి పెట్టిన గొంతులు .. సాధారణ మంతనాలతో.. రొప్పుని వడపోసిన స్క్రిప్ట్ నిండుగా .. నిద్ర ధూప జ్వర కంటిపోటుని చిదిమిన ధ్వనికి రెండో ఒడ్డుని ఇచ్చిన కేక..

కథతో.. పేరుకు పోయిన కంటి నెలలని .. చూపు నేర్వని కెమెరాతో తలపడుతూ.. నిషామి గుణం

సెగలకు … నిస్త్రాణ ముడులని .. చెంపలకి చేర్చిన నాజూకు విస్మయాలకి.. తెర పడక ముందే..,

                                                                  ……………….

సమయం చనిపోయిన అర్ధరాత్రి .. కథని పట్టుకొని.. శూన్య గతికి అద్దిన కాలి నడకల నొప్పిని నొక్కుకొంటూ.. రుణ పడని శత్రువు కడిగిన ఆధార స్థిమితం పట్టుకొని.. ఆవర్తన సంధి చలన .. భయపు  తాళం చెవి మిగిలి పోయిందని .. చేదు నవ్వుల చెలామణి తవ్విన కంటి మీగడని చిలికి .. పోత పోసిన దుఃఖం పెట్టుకొన్న ఒప్పంద నిద్రలు ఇగిరిపోయి.. కలకి రెండో చర్యని పట్టుకొని.  దగ్గర తనంలో కప్పుకున్న ఊసులు…

నా లోపల తన ఇంటిని వదిలి .. ఎప్పుడూ మోస్తూనే ఉండాలని.. అదొక శాసనంలానే.. ఒకవేళ తెగించి కింద పెట్టానా … సమాధిగా మారి నన్ను దానిలోకి లాక్కొంటుదని .. ఇకాదిక మరో ప్రయోగం చేయడానికి లేదు.. ఊపిరి నషాయ గతిని చుట్టుకోవడానికీ లేదు.

దుర్భిక్ష స్థల కీర్తనకి దగ్గరగా ఉండిపోయిన అడుగులు.. పోసి తెచ్చుకొన్న నిద్ర అడుగుల నొప్పిని కాదని.. దాచి పెట్టిన ఊపిరి మోతాదులని మార్చి.. విడిపోదామనే అనుకొని .. దూరం జరుపుకున్న సంసిద్ధ గతి చిత్రం కప్పిన ఆయుస్సుని దాచుకొని..

అన్నీ తెలిసినపుడే .. పిలవక కలుస్తూ .. రంగుల స్థితి పిండం ప్రసవించిన హేయత హద్దుని కాల్చి.. దూకేసిన కునుకుతో.. పిడచకట్టిన శ్వాసకి తడిచిన కొత్త విగ్రహంలో దిగిన దేహం… షూరిటీలు  .. అగ్రిమెంట్లు.. లక్కులు .. లుక్కులు.. రోజులు.. వాస్తులూ.. సెంటిమెంట్లు  .. numaralogeeluతిరగమోతలు.. సీసా చప్పుళ్ళు.. రాత్రి డోర్ knock చేసిన అనుమానాలు.. వైర్ కట్ చేసిన సీసీ టీవీలు.. వాష్ రూమ్ క్లిప్పింగ్స్.. ఇంకేవో ఇంట్రా నెట్ హెచ్చరికలు..

పూనిన అడ్డు గోడల మధ్య కథని తాగిన నిద్ర గుండాల్లో పడి .. అంటూ గట్టిన కన్నుని .. చూపులో కాపలా పెట్టుకొన్న నీటి మెరుగులు సరి చేసిన కథతో పడిగాపులని సరి చేసుకొని.. నియంత్ర దీపాలతో నచ్చ చెప్పుకొన్న దేహాలు.. తగ్గిన పెదాల నిడివిని  పులుముకొని.. చేర్చి పెట్టుకొన్న కలత నిద్రల పూడిక.. రంగు బురుజులు.. పులిసి పోయిన నటనలతో నల్లని గడువుకు చేర్చిన తెరల శరీర స్వాధీనాలు..

………………

 నిగమ్య చరియల కోలాటం కమ్మిన నిద్ర పొందుని కప్పుకొంటూ.. రుణ పడిన గంటలని కొట్టుకొంటూ.. అదొక రహస్య ధ్వని చిత్రం విప్పిన చీకటి నెలల కట్టు పాట .. పాతబడిన రొప్పుని సరి చెయ్యక ముందే వెళ్ళిపోతూ..

రెండూ మిక్స్ చేద్దాం .. ఆ బ్లెండింగ్ లోంచి వచ్చే కొత్త రుచి కిక్ ఇస్తుంది.. కాక్ టైల్ తేడా కొడితే.. ఉంచేసిన సమయ సంధికి చేర్చిన పుట్టుకతో .. తోడు తెచ్చుకొన్న పునాదులని తవ్వుకొని.. ఇగిరి పోయిన సూచనలతో.. తెల్లార్చిన నమూనాలతో చెక్కి పెట్టుకొన్నారు..

అవి అంత తొందరగా ఎలా కలుస్తాయి.. ? మరే అదే ఎక్స్పీరియన్స్ అంటే .. అలాంటి బలంతో కాపీ చేసుకోవాలి.. నిజం ధరించిన గోడుని చెప్పుకొని మాయమవ్వాలి.. ఒద్దికని కరగబెట్టి.. మసి పూసిన కునుకుని చేర్చుకోవాలి..  

ఎంత వెదికినా దొరకని ఆనవాళ్ల దుర్భిణీని పట్టుకొని.. ఆ పొడి గదిలో తవ్విన బావిలోంచి కేకలు.. వాడు ఏమాత్రం ఆగకుండా చెప్పుకు పోతూనే ఉన్నాడు.. కదిలే నిద్ర దేహం సంతకం చేసిన ఊరటకి .. చేరుకొన్న నొప్పికి కాపడం పెట్టించుకొంటూ..  

తను రాత్రికి వస్తాడులే.. ఇంకో మాట చెప్పడానికేం లేదు..

ఒక వేపు సమాధి.. రెండో వేపు సముద్రంలో పడవల ఖననం.. ఏది  వదులుకోగలం.. ?

కాపాడుకోవడానికి ఇంకేం మిగలదు.. శరీరం దారి తెచ్చుకొన్న నీటి చెలమల దట్టడిలో .. చెరి సగవు నిండాలని వార్చుకొని.. కథని కప్పుకోవాలి.. నిలిచిన దుఃఖం పొడుగునా మాయ కరుగుతూ.. హద్దుల్ని చెరుపుకొని..

నిసాధ్య మితి .. కిక్కిరిసిన దృష్టి కదిలాకని పట్టుకొని.. ఇగిరి పోయిన కంటి రాతని తుడిచి.. నొక్కేసిన మాటలని కడిగి.. వాళ్ళు తప్పుకు పోయి కొత్త దీపం వెదుక్కొంటారు. అప్పటికీ బోర్లించిన దుప్పట్ల చప్పుడు పైకి లేచి .. పొగ పట్టిన సిగ్గుని వడపోసిన దీర్ఘ నింపు మొత్తాలని ఈడ్చుకొని.. అక్కడే ఆగమంటారు.

అదిగో అదే తెలియని నిస్పృహ కట్టిన మాంస ధూపంలో ఉడుకుతూ.. హద్దులు మారిన కంటిని తెగ్గొట్టి చీకటి చేస్తారు.. సాయం అడిగిన నల్ల నడకలో .. నది చుట్టిన ఇంద్ర ధనుస్సు నల్లని చెట్ల మానుగా మారి .. కళ్ళకి అడ్డం పడి. తల బొప్పికడుతుంది.

ఋణం గడ్డ కట్టింది.. చెదిరిన దీపాల గుడిని వెదికి పెట్టుకొంటూ… సరే.. ఐతే అదే కథతో వెళదాం.. తెల్సుగా .. తేడా కొట్టిందా? మనం ఇక కొట్టుకు పోవడమే.. విలాస నిద్ర పూర్వంలో పడి .. పోలిక తెలియని నల్ల జెముడు గుచ్చుకొన్న మంత్రం నిధికి చేర్చిన హద్దుని పట్టుకొని.. ఇక అదే కేకని తర్జుమా చేసి కథలోకి వాలిపోతారు.

యాన గమన మితి పట్టుకొన్న .. కలుషిత పట్టు రాతని తొలచి.. ఇంకోసారి కోసం ఏ జర్నీ టికెట్స్ బుక్ కావు.. ఏ ఫోన్లు కనెక్ట్ కావు.. ఏ ఆశలూ ఎగురుతూ కనపడవు.. మీడియా మరో panel ని announce  చేసి .. జిగురుగా చప్పరించిన వార్తల మురికిని కడిగి.. ఏ మూలనో ఇంకొన్ని పేర్లు జత చేసి వదిలి పెడుతుంది.. disclaimer clause  ఎలానూ ఉంటుంది.

……………………..

నిశిత ఛాయా సమయపు పొట్టుని దులిపిన కన్నుని పట్టుకొని.. జోడించిన ఆయుస్సుకి చేర్చిన మాటని సాయం తెచ్చుకొని.. పగటి ధూళిని లాగేసిన మాటలు.. లొంగని సమయ బరువుతో.. బాటిల్ పట్టుకొని.. వాష్ రూమ్ లో లాక్ చేసుకొని.. ముఖం కప్పుకొని బయటపడ్డా .. ఆగని కెమెరా క్లిక్కుల వర్షం.. బెదిరిన పెదాల మధ్య స్పృహ తప్పిన   మాట..

తొందరపడి చెప్పుకొన్న అపార్ధ నిద్ర కొండలలో పడి .. పోత పోసిన వాలు జతల గుట్టుని పట్టుకొన్న గదిలో కూరుకు పోయిన కథని తాగి.. ఇలాగే ఉండిపోయిన సగం సహాకృత దండన.. చీకటి నివస్త్ర పోతని  దాచుకొన్న శరీర జిల .. విడిచి పెట్టుకొన్న సమాధి కిందుగా నిల్చిన అనుమాన గదుల్లో .. పూడ్చిన పేటికలు

తను ఇంకేదో చెప్పబోయి.. నా మాట నువ్వినువులే .. అని దూరం జరిపి వణుకుతుంది. ఎంత చెప్పుకొన్న .. వాళ్లకి కావలసింది దొరికాక .. మరో సాయం ఇక నిమిత్తం కాదు.. ఆమె ఆ సెన్సేషన్ లోకి దూకి .. ముఖం మార్చుకొని.. ఊరిలోకి తప్పుకొంటుంది.

వేలాడిన చెట్ల కింద … నీరు పోసుకున్న నిర్లిప్త గనిని తవ్వుతూ.. కదిలే నిద్ర భూతాల గుహలో తప్పి పోయిన శరీర ఖనిజాలు.

పోల్చి చెప్పుకొన్న జత జడల కన్నుని తాగి.. తూలిన ఆయుధ గర్భంలో కత్తులని చూసి దూరం జరిగినా .. మళ్ళీ ఫోన్ రాదు ..

కర్కశ భేదాలు ఒడిసిపట్టిన ఊపిరిని రుద్ది .. కళ్ళలో కూలిన పిడుగుని పట్టుకొని.. దూరంలో చేసుకొన్నా ఒప్పంద కథలు కూలిపోతాయి.. నువ్వు ఎంత వెంటపడి మేనేజర్ లని  తిప్పినా .. ఇంకేదో కదలికనే నాకే కన్ను జిగురుగా అతుక్కొని ముందుకు పోనివ్వదు.

తమాయించిన వలస దారుల్లో .. పోసుకున్న నిలవడి గొంతుని ధాటీగా ముంచేసిన కథగా ఉంచిన మాయా నలతకి పట్టిన మాంస నీరుని ఉడకబెట్టి .. పాలిన శ్వాస నీటికి తేలిన జరుగుబాటుని  ఉంచిన గది చుట్టరికాలు.. సిట్టింగ్ ఎప్పుడు.. కాస్టింగ్ సంగతి తర్వాత .. ముందు భయం కడిగిన దీప లాలని పోసుకున్న మత్తుని ఊపి .. పడక జోడించుకొన్న పరిధిని చేర్చుకొంటూ..

సాయం అడగని జ్వర గుండ్రాల మధ్య తిరిగే కలకి .. ధూప మేసిన నిర్లయ తంత్రుల గదిని చేర్చి.. క్రమ భూమి నివ్వెరపాటుకి కూలిన పై పూతలా.. చీకటి నమిలిన నిద్ర జోరుతో సరిపెట్టుకొని ఉండలేని చావు.

నిర్ధారణ లేని అపేక్ష స్వాధీనం.. మెరిసి పోతున్న కంటి పాల రుచికి .. తోడు పెట్టిన లోచనలని జరుపుకొని.. ఎద్దడిగా ఉన్న ముఖాల తడి.. ఇగిరి పోయిన చేదు కణతలు..రణ గొణ గోడలని పీల్చిన దేహ సంతులన .. స్క్రీన్ ప్లే కి తూట్లు పొడుస్తూ.. పొగ పట్టిన దుమ్ము గోడలు..

రెండో సారి కనిపించడానికి అతను శత్రువుని కలుసుకోలేదు. మాటని తెగ్గొట్టి శత్రు స్థలంలో పడి ముఖాలన్ని వాడుకోలేదు.. అందరూ దూరం పెట్టారు.. కొందరు మైనపు కొండలని చూపించి కథని చెక్కమన్నారు.

శ్వాస దగ్గరగా ఆవిరి శిలాజంలా .. చెమట… చీకటి దూళి .. కంటి చెమ్మలతో గట్టిపడి ..చూస్తూన్నప్పుడు.. లేదా తెరలోపలికి నడిచి … దేహం సినిమాగా మారినపుడు ..మొదలైన … చివరకి చేరని అనుమానాల్ని పట్టుకొని.. సర్దుబాటు కాని నిశిత కథల ఓపికని తాగి.. రుణ నిగీత పట్టిన మాటలకి చొచ్చుకొన్న శబ్ద ద్రోణుల నిఘారిత పట్టుని వదులుచేస్తూ.. చూపు చెప్పుకొన్న నిశ్వాస ఖనన …

Pre climax … పొద్దు పొడవని నీటి చెట్టు కూలిన హాలు.. వేల జనం.. నేర్చుకొన్న కాస్త దిగులు మండిపడుతూ.. దేహ లజ్జని ఉడక బోసిన కంటి రాతని తుడిచి.. కలలని పట్టుకొని.. నీటి భుజం వణికిన బరువు పోటుకి చేర్చిన కన్నుని పగగా సర్దిపెట్టి… లోపల మిగిలిన నిద్ర తర్ఫీదుల ఒబ్బిడిని మాట వినక ఎగరేసి..

నిందా కమతంలో దున్నిన నడకని దేహంలోకి వదిలి.. కంటి గడపని తవ్వుకొంటూ… ఊరి రాతని స్మశాన నిధికి చేర్చిన అడుగులని కాచుకొని..జోడించిన మసక రాత్రుల గొంతుని పట్టుకొని.. చుట్టేసిన రుణాల కైపుకి వదులుగా సర్దిన చీకటి హాలుని విడదీసి పరిచి..

ముడిపడ్డ కథతో.. దశ తలల  అన్వయ మాయని నింపుకున్న మహా పర్వత పగుళ్లలో పడి..పుట్టుక తెలియని అనుభవం ఏడ్చిన పెద్ద కళ్ళ గుండంలో వణికే ఒత్తిడి కాల్చిన సమయ ధార.. ఉండి కలవడానికి ఆలోచిస్తూ గడిపిన వేల ఏళ్ళ నిద్రల పరిధిని దాటుకొని..

పిసికిన దేహ రాశుల పట్టుని కడిగి.. ఉంచి పోయిన నిద్ర ఖండంలో ఖాళీ ఊరులు.. ఆరిన పాత్రలని మళ్ళీ మేకప్ తో  దింపి.. వేదిక మొత్తం జోల పాడిన హత్య ముందు కుదిపి.. లోపలి చేరని గండంతో.. పూత పెట్టిన రంగుల బాగోతం వినని వీధిలో పిసికిన గోళాల ఊపుని సరిచేసి..

………………..

సస్మియా కొండల గుహల్లో .. చింపి పెట్టుకొన్న దండన రుచిని చెప్పుకొంటూ.. చూపుకి దొరికిన చోటు మొత్తమూ గోడలు లేని ఇల్లు… మొండి కత్తులు రాల్చిన చెట్టు.. బావురుమన్న రాత్రి నది గడ్డ కట్టి ఇరుక్కుపోయిన పడవ.. సమయ సారపు పొడిని కప్పిన భయ పోరుతో..  

అనుకొని పెట్టుకొన్న సమాధాన రుజువుకి .. అలిగి చేరుకొన్న శరీర క్రియ నల్ల అడుగుల ఊరికి … మధ్యలో పోగుచేసుకొన్న పొగలతో మసక బారిన చావు… ఇంకా ఉండమని అనడానికి .. తనకి అవకాశం ఉన్నా .. ఎవరికీ చెప్పుకోలేని దూరంలో చీకటి నులిమిన నురుగుని కక్కిన కొండని చూపించి.. ఆ దూరంలో ఒరిగిన కణతల్లో దిగబడిన అరుపు.. ఎవరికి ఎవరమూ కాని రొప్పుని సెగకి  నానబెట్టి … కథలో దూరం జరుపుకున్న నుదుటి పూతలు. వెంటబడిన దేహ రుణపు స్థలంలో పడి పోలికలేని గతిని తప్పించి పెట్టుకొన్న దూరాలని పట్టుకొని… శిలా మాపక ధునిని ఎర్ర చేసి……

కుండలని.. పాడెని .. అంట కట్టిన చెట్ల కొమ్మలని.. చక్రాల బండిని సిద్ధం చేసుకొన్నా.. అక్కడ ఏ దూరంలోనూ కనిపించని స్మశానం… ముందు  రాత్రే మరో దారి పట్టుకొని .. వెళ్లిపోయిందని.. రాళ్లు చేరుకొన్న నది ఏడుస్తూ .. పెద్దదిగా ఉండిపోయిన రేవులో పడి .. దుఃఖపు చిరుగుని కుట్టిన రుణ తీరుల తెరకి బలంగా చుట్టిన కన్నుని పట్టుకొని.. ఇదే మాటని మార్చిన ధ్వని పోరు.. గజ్జెలు ఊగిన చెదురు మదురు రాతల్ని చెదరగొట్టి…. స్వేదిత గ్రహణ తచ్చాటనలతో  గుప్పుమన్న పుట్టుకలు…

ఇంకేం చెయ్యగలం.. ఇంటిలోనే కాల్చి.. ఆ చోటుని పాడుబెట్టాలనుకొన్నారు.. నొప్పికి చెదిరిన నలతల గండం గడిచిన కదలికనే తిప్పి.. పడక మార్చిన నిద్ర గుప్పిన జ్వర రేవుల్లో పడి .. మాటని తొక్కుకొని.. గదిని లేవదీసుకొన్న నడకకి .. వెళ్లగొట్టిన ముఖాల రొప్పుని పండిస్తూ.. పెనవేసుకున్న చీకటి నిర్మాణ తర్జుమాల వణుకు…. పొందిక లేని సాధారణ గుణ గతుల సేవన…

కానీ కొన్ని ఏళ్ళు గడిచాక .. వచ్చే పోయే వాళ్లకి అదొక తీర్ధ స్థలంగా మారి.. అక్కడొక వాంఛ మాయావి .. ప్రతీ రాత్రి వచ్చే.. పురుషుడు లోగదీసుకొని.. సుఖంలో ముంచి స్పృహ తప్పక .. కాల్చుకొని తిని నిద్ర పోతుందని… సఫల ముఖాలని .. తోడుకోలేని కాళ్ళ తీరుని తప్పించుకొని.. అద్దకపు నీటితో చేరగిలన బంధనతో క్షేత్రాలని తడిపి … చేయూత పట్టిన విచ్ఛిత్తికి తడబాటుని పట్టుకొని.. జారిన నిశీధికి తప్పించిన అంపకాలతో….

……………………..

కొందరు అలా ఎలా .. అనుకున్నారేమో.. అనుకోక ఊపిరి బిగబట్టి చూస్తూ ఉన్నారేమో… ఆగామిత చందన పొరల్ని .. చేదుగా ఉన్నసీసాలతో పట్టుకొన్న సఫలిత కలలని.. పట్టి రాల్చిన ఇంటి  గుమ్మంలో తేమని ఆరబెట్టిన నిగ్రహాలతో తోడుని వదిలిపెట్టి.. వీలుచేసుకొని.. మాటని బాగు చేసుకొని.. కన్నుని చెంపలకి రుద్ది .. కదిలే నీటి బొమ్మల రేవులో చనిపోయిన ఊపిరి గాడిని తవ్వుకొని..

ఐనా ఉండిపోయిన నా దేహ ధ్వని సంతాపం మోగించిన శంఖాల మూర్చనకి కదిలే తప్పట్లు.. సీట్ edge లోంచి… కాళ్ళని ఫ్లోర్ కి బిగించి.. మరో తెలియని నిజపు మండలంలోకి కూలి.. చిత్ర పాకుడుని రుద్దిన కునుకుతో.. పొరపాటుని కలిపి చుట్టుకొని.. .. రంగు రేగిన రెండో అశ్రద్ధకి పట్టిన దిగులుని నాటుకొని.. సాధ్య నికారణ క్షేత్రంలో కురిసిన చీకటి దోసిలిని కనిపెట్టి.. అడుగుకి చేరిన కెరటాల పోటు..

కుర్చీలోంచి.. మహా నరకం తెరిచిన వాన బరువుని మోసుకొంటూ.. దుఃఖం చిమ చిమ లాడినపుడు .. దీర్ఘ సంతులీనాల గడువుకు దూరంగా … నిషాశిలని కదులుకొన్న పుట్టుకలు … నల్లని గ్రహణ తోపుల్లో పడిపోయిన చెదరగొట్టిన దేహాలతో..ఇళ్ళని కప్పుకున్న మంచు జాడీలతో చెదరగొట్టిన వీధుల్లో నిలబడి.. కెమెరాలకు ఫోకస్ చేస్తూ.. 

ఇంకేం ఉంటుంది.. ఇక అదే జరుగుతుందని.. ఎవరికి తెలియదు.. యుద్ధ రేవుల్లో పడిపోయిన శరీరాల్ని సర్దుకొన్న అనుమాన గదులు.. విపరీత గాలులని చెదరగొట్టిన అమాంత తీరికలని చేర్చుకొని … నాటకపు సవ్వడిని దిద్దుకొంటూ.. ఉండక పోయిన నవ్వుని తేలగొట్టిన నురుగులతో పడిపోయిన చూపుని కప్పి …నెరిసి పోయిన భూమి తలని దువ్వుకొంటూ.. తేరుకోలేని జ్ఞప్తియే హద్దుగా చెప్పుకు తిరిగే నటనలని దులుపుకొని.. ఇగిరి పోయిన శోధ్యాపు పడకలని పడవల్లోకి వదిలి..

…………………….

నిరా గమస్తక .. నీటి కొలువులో పట్టు తప్పిన నిద్ర రాతని దిద్దుకొంటూ.. సరళ గతికి రెండు నోళ్ళని కట్టిన చీకటి సంతర్పణలో వడ్డించిన చావు… అడిగి తెచ్చుకొన్న వీలురాతల ముట్టడిని పాతుకొని.. చెదిరిన మత్తు ఊడలని సాగదీసి .. గంటలని దాటినా చలి మడుగులో పడిన నిప్పుల కెరటం పీల్చుకున్న ఒరిపిడి నాలికని అరగ దీసిన ఆయాస గుణం నిలిపిన కథకి …

కొన్ని కళ్ళు ఎర్రబడి..దగ్గరగానే తెలుస్తున్నప్పుడు మళ్ళీ మరో దూరమెందుకు?

సవరించిన కన్నుని చేర్చిన .. పగటి రంగుని పల్చన చేస్తున్న .. ముఖాలతో చేరదీసుకొన్న చెమర్చిన ఝాములని పట్టుకొని.. చెరిగిపోయిన చేతులతో.. పెనవేసి ఉండిపోయిన అడుగులతో.. ఎవరమూ కెమెరా ముందు భాష అందుకొని ఉండిపోలేదని .. కునుకుని చల్లారబెట్టి చేర్చిన గతికి నల్ల కాలువులు వదిలిన కాలువ చావుల గుట్టని నేసుకొంటూ .. తెరలు….

స్వజత ఆనుపానుల గుట్టలో తడిపి వదిలిన నొప్పిని పిండుకొంటూ… వియోమ దేహిత కంటి జాలంలో పడి .. పోలికకి దొరకని నిర్జరాల దోషిత కథకి చేర్చిన రంగులని దిగదుడిచి.. పగిలిన నిశ్వాస గుండంలో చెదిరిన మాటలని తూచుకొని.. అప్పటి మాంస రేవుల వాసన గుప్పుమని..  పడగ విప్పిన దేహ చావుని నిలబెట్టి .. కాల్చిన నిద్ర పెదవుల మంత్ర స్థలంలో .. కూర్చుకొన్న రంగుల పుట్టుకకి వ్యతిరిక్త  నులుముడిని కప్పిన నిశీధక మంటలు.

శత్రు శేషపు కథని నేసిన కలబోత రంగుకి.. చీకటి చేర్చిన నీటి మంట పోల్చిన కథగా ఉన్నా.. ఇక దూరం చేసుకోలేని కంగారుని కలుపుకొని… ఒరిగిన హద్దులో తెల్లార్లూ నింపుకున్న ఓ కల .. పొడిగా రుద్దేసిన చూపుల ముందు తిరుగుతూ.. పిరికిగా ఉండిపోయిన చావు నీళ్ల ప్రవహిత చప్పుడుని కంటూ.. నియ్యారపు పొద్దు మూలలో పాతుకొన్న గడువు.

ఊసుని పట్టుకొని ఊపిన కాళ్ళతో … గాజు నూరిన దేహ పలవర చోటుని కుదిపి.. వాళ్ళు మాత్రం మిగిలి పోయిన హాలులో .. మరో సినిమాకి శ్వాసలని తీర్చుకొని.. చీకటి అరుస్తుంది.

స్థిమిత నెగడు ఉడకబెట్టిన కన్నులో పోసుకున్న తల రంగుల స్నాన శ్రమకి .. ఉండిపోయిన సగం ఖాళీల గొడవని తట్టుకొని.. వరుస తప్పిన కథకి చేర్చిన చోటులో.. పడిపోయిన కాళ్ళు.. ఎన్ని చెప్పుకొన్న .. ఎక్కడికి తిరిగి తప్పుకొన్న .. ఉండీ కనిపించని సార్ధత కనిపెడుతూ.. నాలుగు రీళ్ల ప్రదక్షణ .. పోసేసుకొన్న దేహ చిత్రపు మహా నిద్రని కుదిపి .. గిరాటు పెట్టిన స్క్రిప్టులు..

నాలుగు రీళ్ల ప్రదక్షణ .. ఆమె వచ్చే .. జోగుతున్న కళ్ళతో .. సీసాని పక్కకి నెట్టి.. లోపల ఉండిపోయిన కొన్ని భూమి డాక్యూమెంట్లని  చూపించి  .. ఇవన్నీ  కరిగి వెళ్లిపోయాయి ..నీ స్పృహకి చేర్చిన చెమట నిగరపు మండలంలో పడి .. కన్ను గుచ్చినా ఝాము ముంపునీ … ఒద్దు పై రాల్చిన దుఃఖ తాండవ నెరుపునీ..

వాడేందుకు రావాలిరా … కత్తి ఇవ్వు నే చూపిస్తా తడాఖా .. అని చేసుకొన్న వీరంగాలు.. లోపలి వేడుక కరిగిన గోడలు ఊడిపోతూ… సినిమా ఇలా మాత్రమే ఉండాలని .. తాను చెప్పుకోలేనని .. దుఃఖపు నిద్రిత విగ్రహాల గడువుని తెంపుకొని.. కలిసిన నిజార కలతకి ఎత్తిపోసిన చూపులు..

……………………

వెలుపల .. లోపల అని లేని ఖాళీలని కట్టుకొని.. ఆ గ్రహణ ఆసాంతమూ పేర్చిన కథకి.. మూలాన ముడుచుకున్న నది .. కొంచెం అనుమానంగా చేరుతూ.. నిర్మిత దోష తీర్మానం మోసిన కదలికనే పట్టి చూసుకొంటూ.. భయం నాలోపల ఉడికినప్పుడు తను అడ్డు చెప్పలేదు.. విరిగిపడ్డ పదవికి సొమ్మసిల్లిన కంటి చూపుని అద్ది.. కనబడని ఝాము మార్చిన రెప్పని తొడిగి.. వడపోసిన ఖాళీ గుమ్మంలో ఎవరో వచ్చి వెళ్లిపోయారని..

విన్నానని ఏమాత్రం విన్నానో.. చూడటంలో మాటని మింగేసి..  నిశిత నెగడుల చావు.. మాట మార్చిన తల జోడింపుల తోడు .. పెద్ద వంతెన ఆరబెట్టినా దేహ చలమలో పడి తప్పించుకొంట్టూ.. పెనవేసుకున్న భ్రమకి నేర్పిన కథా రీతుల మధ్య ఇమడలేక ఆమె .. క్విట్ చేసి .. ముఖం తిప్పి మళ్ళీ చూడనైనా లేదు.

సఫలీక ముఖం చెప్పిన .. ఆరు చోట్ల అమాంతం లేచిన కథ … నెరవేరని ఏడుపుని దువ్వుకొని.. ఇంకిపోయిన చావు ఋతువుని పాడుకొని… ఆ ప్రీ క్లైమాక్ సందర్భంలో హీరోయిన్ కోమాలోకి వెళ్లిపోతుందిలే.. ఇకంతా సేఫ్ గేమ్ మాత్రమే .. చేరదీసుకొన్న మాటలని కడిగి..ఉన్నప్పుడే కలిసిన దూరాల గ్రహణ భాష ఏడుస్తుంది. చెమర్చిన కలతకి పట్టిన దేహ ఋణం వేలాడి .. కృంగిన హద్దుల్లో పడి తీరిక లేని సమయ నిగ్రహ స్థిరణ వెలుగుతుంది…. వoతులు మారి ఆ గదిలోకి అడుగు పెడుతూ..

ఆ ఎదురెదురు టేబుల్స్ ఏడుస్తున్నప్పుడు .. కోప్పడని నిర్మాణ రసాయనత కరిగిన నిట్ట నిలువు శ్వాసకి దొరికి .. నన్ను నమ్మండి.. నాకీ బాక్స్ ఆఫీస్ మాయ తెలుసుగా.. అప్పటికి అక్కడే చేర్చిన … ఒంటి రాతని చూసి .. ముహూర్తం పెట్టి… ఇక దశ తిరిగిపోతుందిలే .. అని చేరదీసిన నిద్ర ఋణం కాపలా పెట్టుకొన్న హత్యలు…. కంటిలోకి సరళ పుట్టుకని వదిలి నిశ్శయగా చూస్తూ..

నిశిత నెగడుల చావు .. వానని దాటుకొని.. పాతి పెట్టిన చెట్ల పక్కగా .. నిండిన కలత పూర్ణ ఆయువుల రంగుని దులిపి.. చప్పట్లు చల్లార్చిన శ్వాస కంఠాల్లో కథకి రెండో దీపం వదిలిన నాజూకు నవ్వు…. ఆర్పాలిత దేహ సంబంధం కుదిర్చిన సెట్లో .. రాజీ పడని గుహలలోకి కూరిన నటనలని కలుపుకొని.. ఉండిపోయిన కథల పక్కగా చేర్చిన కునుకు..

…………………..

ఎనిమిది నోట్స్ ల గొంతు.. రుద్ది పోయిన కంఠ తాళం మార్చి చేసుకొన్న రుణ ఒప్పంద మసకలో కూరుకు పోయిన నిషౌద పుటని తిప్పి.. వెళ్ళినప్పుడు .. వాగి పోయిన తిట్లని తోడుకొని.. నిగురు చచ్చిన కంటితో పంటి నొప్పిని తిరగతోడి .. చెప్పుకు తిరిగిన అడ్రస్ తో గుర్తులు చెరుపుకొని.. ఇంకి పోయిన నిద్ర గతిని పీల్చిన చావులు.. సాగిన నిరాకరణ వెలుతురుకి రుణాలని కట్టి..

విరిగిన చిత్ర పూరక గేలం పట్టుకొన్న చీకటికి రెండో తెర గుప్పించిన కుట్రలో.. … చేవగా నవ్విన జాగ్రత్తలని దాచుకొంటూ.. భయ నిత్యాంతర కథకి గుమ్మం మూసి.. వీధుల్లో వదిలేసిన అనామక తిరుగుడుతో పట్టుకొన్న చీకటి నిల్వలు.. రంగులు కొట్టాం నిండుకొంది.. పాత్రలని అలానే సహజంగా ఉండనియ్యి..

ఇదే చావని నమ్మబలికి .. అక్కడే కట్టి పడేసాకా.. ఒకవేళ కట్టకున్న .. అక్కడే శిధిల గత వంటకి మంటని చేర్చి.. చలి కుంపటకి పేరు మార్చి కనబడుతూ.. .. నిసృ గతిక పూనకాలు.. ఒరిగిన నిందలని తోడుకొని.. నిశ్వాస రాజీలంలో తిరిగే నీటి కమతం పండి.. మాసిపోయిన కళలు కుమిలిపోతూ… ఇక జరిగేది కాదులే … అని ఆర్చుకొంటూ.. ఉబికిన నిరాశ గింజల్ని పాతి పెట్టి.. పొగ చెట్టు కూలింది.

కథని ముందు నించి సాగదీసి.. సొమ్ము సిల్లిన కునుకుని వడపోసి .. పాక్కొంటూ వెళ్లిన నడకని దాచి పెట్టి .. రాత్రికి చూసుకొందామని.. అక్కడెవరూ లేరనుకొని.. కొండ అప్పుడే కాయం చేసుకొని చనిపోతుంది.. వివరాలు.. సాక్ష్యాలు .. శాప నోరుల నొప్పిని అరగదీసి .. చలువ పట్టిన దుఃఖం పూడ్చుకొన్న.. శరీర జాతరలో ముగిసిన కథ.. ఎవరూ లేవడం లేదు.. ఇంకేదో కావాలి.. అదేగా ప్రాంచైజీ …

పగుళ్లలోంచి కారుతున్న పొగ ..రక్తమూ… శ్వాస మూర్చన .. కంటి పాలని తోడిన చావు.. మరో షెడ్యూల్ పెద్ద గ్యాప్ ఉంది.. ఈ లోపు స్టోరీ డిస్కషన్ .. రిహాల్స ఉన్నాయిగా ..? always  available ఉండాలి..దండ తెగినప్పుడు మొదలైన దగ్గు.. నడుము కెలికిన వణుకుని దాటుకొని.. ముఖం లో కమ్మిన దిశా నిద్ర కూర్చిన హద్దు.. మరోసారి కలిసినప్పుడు .. చూద్దాం అని….. భ్రమణ సమానాలు ఎగురుతూ .. డ్రోన్ తో capture  చేసిన షాట్లని మళ్ళీ మళ్ళీ కత్తిరించుకొని.. జూమ్ చేసి.. ఆమె లోతుల్లోకి పట్టి చూస్తూ..

ఇక్కడే ధ్వని అగడ్త తెర్చుకొన్న కంగారుని దాటుకొని.. వద్దనుకుని ఉండిపోయిన నడకతో.. వర్ణ స్థలం కంగారు పడుతున్న నీటి గడువు గడ్డ కట్టి.. ఒదిగిన హద్దుకి రెండో భుజం కప్పిన కంటి రాత… అక్కడే తెలియడమనే శూన్య ప్రదక్షణ ఊగిపోతూ.. తుళ్ళి పడిన కలలు

ఆ లోపలికి విసిగిన నోటి వాసనని తిప్పి.. సగం వాడిపోయిన కళ్ళతో .. చూపుని చంపుకొని.. సీసాలని అడుక్కొంటూ… కొన్ని చెట్ల మధ్య ఉరిలా వేలాడుతున్న ఊయలలో .. రోజూ కాలుతూ .. నేనిక రోజూ కథని .. ఇలా చెప్పుకోక .. తప్పిపోయిన నా పాటకి కూర్చిన చావుతో.. కాపలా పెట్టుకొన్న కాగడా వీధుల సమాధిని దాటుకొని .. ఎప్పటికీ వెళ్లలేం..

విప్పిన నిర్గతి చలనకి పోసిన పగటి వానని .. కని పోసుకున్న ధ్వని సంబరాల గుట్టుని చేరదీసి.. పని గట్టుకొని వదిలి పోయిన కలని .. దేహ భద్రతకి మరిగిన ఆయాస పూర్ణ జోడింపుని పట్టుకొని.. ఇంకో నిమిత్త శూన్యం లేని ఆపదని సర్దుకొంటూ..

రుణపడ్డాం.. షూటింగ్ మొదలైంది..

సమయ ఐక్యంలో నిద్ర చల్లిన కునుకుని పట్టుకొని.. ఖనిజ దీపపు చల్లని ఇంటిని దీవిలోకి మూసుకుపోయి .. ఏడ్చి చెప్పుకొన్న నిరాధార కంటి శ్రమకి .. ధారణకి .. వెలితికి.. అనుకోని అడ్డంకిని తొలచిన చీకటి కునుకుపాట్లతో.. ఉండిపోవడం గురించి ఎవరూ మాట్లాడారు.. అందరూ వెళ్లడమే పనిగా ఆగి లోపలి చూసి.. వంకర నవ్వుని చిట్లించుకొని.. శరీర నిర్మాణ రీతిని చిక్కుకొన్న కొండలకి కృతజ్నతని వెలిగిస్తారు. 

దీవులు రంగు చలన చక్ర స్నానం చేసిన చీకటికి నివాళిని సిద్ధం చేసి.. కప్పుకొన్న శరీర నిలువులో పాతి పెట్టిన పుట్టుకని ద్రవ నిర్జరగా సీసాలో పట్టి.. సగం సేవకి ఒరిగిన నిద్ర కూడలిలో మాట తీర్చిన కథని చేర్చుకొని.. లోపలి చప్పుడుకి దొరికిన గోడలు ఊడిపోతూ..

అప్పగించిన పోలికల్లో పడి నాజూకు రంగు.. వదిలి పెట్టిన శరీర ముట్టడి చేరుకొన్న కొండలని తొల్చుకొని.. ఇక ఇదే మొత్తమని చెప్పుకొంటూ… ఇక్కడ విడిపోయిన .. నీ వెనుక చెప్పుకొన్నదే అంతా … మరో చిత్ర ధూపపు మన్నన కాల్చిన పెద్ద అడుగుల సముద్రంలో ఊరేగే పడవల ఆచూకీని ఫ్రేమ్ లో ఇరికిస్తారు.

………………….

ఆలాతమాల నీటి గుజ్జుని పిండుకొని.. దీర్ఘ నిశార్ణ మంతనాలని దాటించి.. ఒద్దిక లేని విపరీత కుదుపుని దాటుకొని… సేవన రాశులు.. పొయ్యి రాజేసిన నీటి మంటతో  ఊరిలోకి కెమెరా తిప్పి.. పాడుకొంటూ పోతున్న పిచ్చివాడి గెంతుని వదులుకొంటూ.. మెరిసిన వాన పొదుగుకి .. చాపల్య నిండుతనపు ఊరటని కట్టిన తాళ్ళకి బిగిసిన దృష్టి తోడుని కప్పుకొన్న స్మరిత కౌగిలి రాశులు.. 

ఇదంతా ఇక వద్దు.. సంధి చేసుకొని ముందుకు వెళదామని.. ఉండిపోవడం మరో చలన క్రియలోని ఝాముని తొల్చుకొంటూ… ఉండిపోవడాన్ని ఎవరూ తేల్చలేరు.. మాట రాలడం ఎవరూ కనిపెట్టలేరు.. తూలి పడితే మాత్రం వైరల్ అయ్యే .. నాళికల సముదాయంలో పడి ఊరేగే నిద్రల జరుగుబాటు.

చేర్చి పెట్టుకొన్న నిద్ర తోపుల్లో పడి.. నుదురు దొరకని నిరశిత గంభీరం కూలిన ఎత్తు కొండల ఋణం దాచిన పడవలు.. సాక్షిని ఒప్పుకోవాలి.. మాటకి వణికి పోవాలి .. కంటిని శస్త్ర దీపపు మొనకి గుచ్చిన చీకటి రాలుతూ .. ఉండిపోయిన కథకి .. దారికి రాని మాటల యత్నానికి చేరబడి .. పెదాలని నింపిన కునుకు చప్పుడుకి వార్చిన భయం పట్టుకొని.. వదలక …

మరో స్థితి విమూల్యంలో పిడచ కట్టిన గొంతుని కోసుకొని.. ఋణం కప్పిన కథకి .. మధ్యలో చేరి .. అర్ధం కాలేదని పేచీ పెడుతూ…రూమర్లు స్ప్రెడ్ చేసి.. ఇంకొక సమయ ప్రమాణం ఏడుస్తుంది.. కదలని కటి చప్పుడుని నిద్రలో పంచి.. చెరొక పక్క ఉంచేసి చీకటి నగరం చెప్పిన నల్ల కథల ఊపుని పట్టుబట్టి.. నిర్బంధ కౌగిలి మాసిన సగం మాటకి … నిద్ర పూర్వపు దశలో తీర్చి పెట్టిన తెరలకి .. అనుమాన శ్రమ తీసుకొన్న takes కి .. ఏడ్చి తప్పుకొన్న చాటు నలత కప్పుకొన్న ఉరుము..

…………………….

సాక్షాస ధ్వని భావిలో.. నీకని చెప్పుకొన్న పోలికని దాచుకొని.. నేనూ చేరగిలిన ఆ కాస్త చోటులోనే కెమెరా గుచ్చి వైరల్ చేసాక .. ఇప్పుడిక నీ డిఫినిషన్ మారిందని.. వాడు అర్ధ రాత్రి తలుపుకొడతాడు.. సగం కొరికిన సీసాలు.. ముఖం మూసిన మాస్క్లు.. బొడ్డులో గుచ్చుకొన్న రబ్బరు తొడుగులు.. చొంగ కారుస్తున్న వికార చిత్తడికి నెరిసిన భయం పోసుకున్న నడక.. వెళ్లి పొమ్మని చెప్పక ముందే గాలి పట్టుకొన్న నిద్ర సంతులీన పోలికలని వెనక్కి తీసిపెట్టి..

దగ్గర దగ్గర గుండ్రాల్లో .. ముఖం తిరిగిన గాలి రేవుని తగలబెట్టి .. ఊరుకోలేని దిశా నిర్మిత చప్పుడుకి నలత కప్పిన వణుకు.. ఇక్కడ ఏదీ కనబడక ఉండిపోని .. సగం సాయం పట్టిన కన్నుకి చేర్చిన పాటని జోడించి.. పాకిన చీకటి బేజారుల కేకకి పగల గొట్టిన గొల్లాలతో .. పేరుకున్న నీటి బరువు శిక్షకి దొరికిపోతూ.. అనులోమ గండం తీర్చుకొన్న గంటలు… వదిలేయమన్న నూనె వాగుల చిచ్చు…..

ఒక్క రోజు అబ్సెబిట్ అంటే .. ప్రొడక్షన్ లాస్ ఎంతో .. నీకర్ధం కావడం లేదు. వాడే రాత్రంతా నిలిపిన దాడిలో ముక్కలైన శరీరం .. మత్తు దిగిన బాషణతో మీదకి వస్తూ.. పేరుకు పోయిన నిస్సహాయ కోప శాలలో .. మరో పడక లేని సమాధి.  నల్లని ప్రమిదలో తెల్లని కాగడాలు పాలిపోయాక….

పాతదిగా ఉన్న దేహ చలువల గదిని మళ్ళీ అద్దాలతో అద్ది.. కథలో బిగదీసిన నివ్వెరపాటుతో కొత్త దీపం పెట్టుకొంటారు. మరో తోడు తెచ్చుకొన్న .. ఎమర్జెన్సీ create  చేసి .. లొకేషన్ మార్చి.. టికెట్ ఒక్కరికే అని సాగదీసి.. గస గస లాడే నిద్ర ద్రోహపు మాటని ఎగదోసి.. కదిలిన మాటలకి .. మరో వరం వదిలి పెట్టిన శమిత దేహ ధీరనాలు… బిగలాగిన అగ్రిమెంట్ల పగుళ్లు….

అపసవ్య నిర్ణయంలో పడి.. తేల్చుకోలేని నిశామిక వర్ణ కూటమిని … చావులో ముంచి.. కైపు పట్టిన నిద్ర యుగం కడిగిన నదితో.. ముహూర్తం షాట్.. ఇగిరి పోయిన చిక్కని రంగు మాంసాల అండ .. కంటికి దొరకని నిర్భీతి కౌగిలిని దాటించే అరుపుతో.. చెలమల్లో పండిన దేహ నిద్రకి చేర్చిన చీకటి అలతని పట్టుకొని..

ఉన్న చోటనే ఉండిపోవడానికి ఒప్పుకోలేక.. ఓడిపోవడం ఖాయమని తెల్సిన .. సాయుధ గాలిని కోసిన కెమెరా ముందు.. కంటి చుట్టూ చీకటి ముద్దలని కప్పిన మేకప్ ఊడదీసి.. గొంతుని విప్పినా .. డోన్’ట్ వర్రీ .. విల్ కవర్ ఇట్ ఆన్ దుబ్బింగ్ టైం .. అని .. చప్పట్లు కొట్టి .. షాట్ ఓకే .. అంటూ అరుపు.. పూనకాలు మండుతున్న సెట్లో .. పవిత్రత కాపాడే పంచె కట్టుల .. దోష భూమిని  కడిగి .. `చెరొక పక్క ఉండిపోయిన పునాదులని దాటుకొని.. అదే షెడ్యూల్లో .. ఊరుని ఇరికిద్దాం.. ఫర్ నామ షాక్ త్వో సీన్స్ అంతే.. టైటిల్ జస్టిఫై అవ్వాలిగా?

సమయం జార్చిన కంటిలో పడి దుఃఖ మరుపుని తుడిచిన మెలకువతో .. చేరగిలిన ఆయుస్సుతో పట్టి లాగిన హద్దుల వెంట తప్పుకు తిరిగే .. నిద్ర బానిసల తీరికని చేరదీసిన.. రుణ పడిన వీధులని సర్దుకొని.. నంజుకు పోయిన నుదుటిలో నిరంగ మైధూపులు..

వద్దని వెళ్లిపోవడానికి లేక .. సర్దుకో చూసిన దుఃఖమై కదలక .. తనలో తనుగా ఉండిపోయిన చీకటి సానులోమాల జరుగుబాటుని తొందరపెట్టిన కలతో కూడదీసుకుని.. విప్పి చేసుకొన్నా ఒప్పంద దాడిని దూరం జరిపినా వినని రక్షలో సీసాలని కలిపి తూలిపోతూ స్పృహ తప్పి..తడబడటం.. ఉండిపోవడం.. ఇంచు ఇంచుగా వెళ్లిపోయిన పుట్టుకలని అప్పగించుకొని.. చేర దీసిన పాత్రలు మాట వినని  మూడో కొలుకుల్లో వేడిమి…సరి దిద్దుకొన్న నీటి మండలపు కవ్వింతని దాటి .. పైకి చేరిన కళ్ళకి పూసుకొన్న తనిఖీ ఋణం….

అస్థిర చిత్ర గతికి చేర్చిన ముఖాలని దాటుకొని.. జోడించిన కంటిలో పడిపోయిన చీకటిని పీల్చి.. కాపలా పెట్టుకొన్న ధ్వని సాయాలకి చేర్చిన అనుభవం ఒడిసిపట్టి .. కథలని అప్పగించిన కునుకు. విఘాత జనుముడు పట్టుని రాల్చుకొని.. దుఃఖ నివిధ సరాసరిని ఎక్కుపెట్టిన దృశ్య మాయని విని పట్టుకుపోయిన నిమిత్త త్వరితలో ఏకం చేసిన ఫోల్డర్స్ ని అటూ ఇటూ తిప్పినపుడు… మళ్ళీ  దేహ జీరని ఒడిసిపట్టి తుడిచినపుడు.. బిగి తగ్గని కథని వినిపించాలని…. సిప్ సిప్ కి ఒక్కో మలుపు చుట్టి.. మొత్తానికే కనిపించకుండా పోవాలని..

భయమని రెండో సవ్య చలన కట్టడికి చేర్చిన అడుగులని రాలగొడుతూ.. అదిమి పెట్టిన చెమట గాలులని దాటి పైకి చేరిన ఖాళీలని నింపుకొని… ఇక్కడే నిద్ర సంధిని చేసుకొన్నా దర్శనకి కప్పిన నిరూప మెట్ల కొండ.. విభోగ వర్ణ చలమ ఎండిన దుఃఖ పరిధికి చేరదీసి కక్ష్యని కట్టుకొన్న … విడిపోయిన ముఖాలతో కుదిరిన ఒప్పంద నిద్రతో కూరుకు పోయిన అడుగులు.. ఎంతకని  వేలాడటం .. విదిలించుకొంటున్నారని తెలిసినపుడు .. కలిపించుకొన్న శరీర నిఘావి కథని ఎంత తీర్చి చూసినా ….ఆ గదిలో చీకటిని చదవడం వీలు కానప్పుడు .. తను ఇంకో దూరంలో కూర్చొని.. ఇక ఈ రాత్రికి చాల్లే అంటుంది. గ్లాసులు పగిలినా ఇక చప్పుడు చేయవు.

ఎవరమూ మరే చిత్ర తోపుల పరిధికి చేర్చుకొని లోతుల్లో పహారా కాస్తూ.. వినపడని కంటి నిద్రల కలని చూడాలని .. శ్వాసని లోపల చోటులో కెమెరా బిగిస్తుంది. బ్రహ్మ ఛాయాన పుట్టుకని నిర్వచించి .. కదిలే కంటి మధ్యల కుట్రలోకి ఒదిగి.. తేరుకోలేని దేహ నిజాపు గుండంలో పడి .. మరో పోలిక తెలియని నిరశిత కట్టడిని కాదని దూరం జరుగుతారు.

…………………

చూపుకి  దట్టంగా  కట్టిన కన్నుని పట్టుకొని.. విరిగి పోయిన హద్దుని దాటిన ఆయాస మునుగుని దాటి .. కెరటాలని కట్టిన నిర్జన రూపసికి చేరదీసిన కల .. ఒంటరిగా .. నీటి పొదకి చేర్చిన కెరటాల గట్టుని పట్టుకొని.. తవ్వుకొన్న కొండల మధ్య కదిలే దీప బరువు కుట్రని తీర్చుకొని.. ఇంకి పోయిన కటి ధారని కలుపుకొని.. వదిలేసినా నిద్ర సవారీకి వాంతులు మార్చిన హద్దులో పడి.. తనిఖీలు

విప్పుకొన్న గోడలు.. ఉరిమిన నడకకి చేర్చిన నిద్ర పూర్ణపు ఎద్దడిని చేర్చి … అక్కడే మాట తీసుకొన్న వేడుకని కలిపి … చెమర్చిన నీటి కప్పుల ఇంటిని దాటించిన ఒత్తిడికి .. కూరుకు పోయిన చీకటి పొద్దులోని ఝాము చావుని రుద్దుకొని.. విసుగుపోటుతో దూరం జరుపుకొని.. వద్దని ఉండిపోయిన కునుకుతో.. పల్చని కంటి రాతల దుఃఖ చలనకి గంటలని కట్టి.. తెలుసుకొంటూ..

తను కనిపించని లేదు.. మాటకి దర్పణ మరుపుని చుట్టిన చప్పుడుని చేర్చి.. మాసిపోయిన గోడలకి వేలాడిన ఫోటో షూట్లు.. కరెంటుని   జత చేసిన కంట్లో .. నీటి జలని వెలిగించి.. నడుముని సరిచేసి.. బొద్దు చుక్కలు ఒంపిన రంగు బొత్తాముల వదులుని తాగుతూ.. మెలిక పడ్డ నాలిక చప్పుడు కాల్చి.. గాలిపట్టిన పూనకాలు జుత్తు నీలంలోకి  కురిసిన కల

గిలిగించిన గంభీర ముఖాలని మాటలకి చేరదీసి .. కదిలే సగం .. పిండుకొన్న నల్లని గ్రహణపు సాధనకి పుట్టుకొచ్చిన పసిరిక దీపాల కొండపై కదిలే కాళ్ళు.. మళ్ళీ మరి దేని వెంటా పడక .. కునుకుని వడపోసుకొని.. దుప్పటిని పాతిపెట్టిన భయంని సాగదీసి.. తోసుకొస్తున్న నికర దేహపు సలజత కూర్పుని ఉడకబెట్టి.. కథకి రెండోసారి దీప  జూలుని వేలాడదీసి….అంతా అనుకున్నదే అంటే ఎవరూ ఒప్పుకోరు .. విసిగిన రుణ గాలిని పట్టుకొన్న సాధిత గుఉండ్రాల మధ్య కూర్చిన కసికి ,.. వెచ్చజేసిన కంట్లో పేగుని చుట్టి.. కలబోస్తారు.

…………………

కలుసుకున్న దూరాల పేటికని సరిపెట్టుకొంటూ.. పేగు కాలిన నొప్పి వెనక దీర్ఘ నిడివిని సాగదీసిన కటిక చీకటిని నులిమిన కక్ష్యని దాటి .. షూటింగ్ స్పాట్లోనే .. కనిపించినట్లే కనిపించి అంతలోనే మాయమై.. రాత్రి క్యారవాన్ లో ఏడుస్తూ కూర్చొని.. రాత్రి నదికి విందుకు వెళ్తున్న .. భయపడకు .. ఎవరి కళ్ళు నన్ను చూడలేవులే … అని భరోసాతో..

సరి లేని నిద్ర ధూపపు మత్తులో ఊగుతూ.. పెరిగి రాలిన నోటి రాకకై ఉండిపోయిన చూపు.. నిమర్శ గతికిన గొంతులో.. సీసాల పొడిని నూరిన నది.. పొద్దు లేచాక .. ఏం తెలియనట్లే.. దేహ సమాధికి .. రెండో పుట్టుకని కట్టి.. అంతలోనే తెగిందని ఏడుస్తూ.. ఎవరినో కోప్పడి.. విసిరేసిన కన్నుతో .. చీకట్లో తిరుగుతారు.

ఈవృ లేరో వాళ్ళు మళ్ళీ తెర్చుకొన్న నిద్ర విడిచిని దాటుకొంటూ.. నటన మొదలుపెట్టాక .. ఇక వద్దన్న వాళ్ళే లేరని కదిలే దేహ ఝాముల బరువు.. కాచి పెట్టుకొన్న సదా ఖండనల మరుపుని పట్టుకొని.. విరబోసిన దుఃఖ పులిమి వరుసని కనిపెట్టి.. సంధిని తెగ్గొట్టి.. ఉనికికి నేర్పిన బొట్టుని తుడుచుకొని.. లోపల పగిలిన గాజు బొమ్మని తుడిచి పారేశాక … లెట్ అస్  స్టార్ట్ ఇన్ న్యూ వే .. అంటూ..విపరీత ధ్వనుల కలతకి పట్టిన నాచుని తుడుచుకొని.. తెల్లార్లు మార్చి మార్చి తీసిన షూటింగ్లు .. ఆరేడు సార్లు బట్టలు మార్పించి.. కదిలే నీటి యాగపు గట్టుని కూల్చిన హద్దులు.. తెల్లబోయాం.. అంతే చాలని దూరం జరిగి.. నిశిత రమణపు ముట్టడి పోల్చిన అద్దాలని పొడి చేస్తూ.. కొన్ని దీపాలు చెప్పుకొన్న కథకి చేరదామా ? అని అడిగి.. తిరిగి కనిపించదు.

మసి పూసిన చిత్ర గరుకుల నిడివిని దాటించి కదిలే కునుకుని కాదని .. తప్పి తిరిగిన హద్దుని పాతుకొంటూ.. ఋణం పట్టిన దోసిలిలో పండిన ఎండని కట్టుకొని.. తిరిగి రాల్చిన నిషేధ దీపపు మసకని వడపోసి .. వెళ్లిపోయిన దేహ కల్పిత ఋణం తీరిన కాపలాకి చేర్చిన కథలే కలిసి.. లోపలి శ్వాసని ఖాళీ చేసి .. భయమని చెప్పుకొన్న వితర్క అనుభవ నిడివిని చేర్చిన నిభ్రాంత కటి కాపలాకి కుదిరిన ఒప్పంద తీర్మానాలు..కలబెట్టిన రుణాలతో భుజాల నొప్పికి చేర్చిన కథ ఏడుస్తుంది.. కప్పిన చావుని కాదని . ఆక్షన్ మోడ్ ని సరిచేసి.. పడవలో కూర్చోమంటోంది.

e)విరూప  స్టOధీన  .. ముగించిన అలుముడు.. తోడు కలిసిన చీకటి నీరు

ఊరంతా కప్పుకొని.. నోళ్లు నొక్కుకొని.. విరుచుకుపడి.. శరీర శృతికి పోసిన కన్నుని ఆవహించి.. మెరుగు పెట్టిన కలకి వెనక నడిచి.. అవధిని కాల్చిన దుఃఖ సరోహంలో పూత పెట్టిన ఛాయల్ని కలుపుకొని… విరూప స్టOధీన… అడిగిన వివరాలు లేని అర్ధాంతర నిద్ర నిమిత్తంలో పొడ చూపిన కంటి రాతని సెగకి పట్టి.. కథలని వద్దని… ఊట తుడిచిన ఇంట్లో ఇక అంతా packup అని చెప్పుకొంటూ.. నిర్నిమిత్తాల చెలగాటపు ఒడిలో మోసిన అనుమాన కంప..

అనుకోమని ఎవరూ ఏదీ పెట్టుకోరు.. సరి చెయ్యడానికి మరో విషణ్ణ కదిలికని దాటి .. ఏదీ ఆగిపోదు.. ఉండిపోవడానికి మరేమీ తెలియని ఊసుని కడిగి.. తప్పుకొంటారు. ఎంత అనుకొన్న అక్కడ టీ మరగదు.. ఇవ్వడానికి ఆమె బయటకి రాదు .. చేదు మింగిన దూర స్థలంలో పడి .. గుడిని తలకిందులు చేసిన విపరీత కళ్ళ రేవుని .. అటు పక్క ఉంచేసి వెళ్ళమంటారు. మొండి కాగడాలు ఊరబెట్టిన దేహ పంచలో నీరు చల్లి .. వడ్డించి.. చావు గదిలో సిద్ధంగా ఉండని గుస గుస లాడి.. ఎక్కి పోయిన నీటి కథకి అప్పగించిన హద్దుని ఏమార్చిన కాళ్ళని కూర్చి..

వెల్లకిలైన ముఖాలని పట్టుకొని.. మరో మాటకి దొరకని నిద్ర జోరుని అరగదీసి .. పట్టించుకోని.. విశ్వ సమయపు గతిలో కరిగి.. అడ్డు చెప్పని చీకటి విలోమ తాకిడికి చేరదీసిన స్పర్ధని కాల్చి.. నిమిష .. నిమిషానికి మారిన రూపులు.. ఒడిలో కూలిన చీకటి ఇల్లు.. సిగ్గు మోసిన కిటికీల పక్కాగా గరుకు నాలుకలు.. జడ గుప్పిన కంట్లో పడి అడ్డం తిరిగిన నిందలు.. ఉమ్మడిగా దేహం మోసుకొచ్చిన కళ్ళలో బిగిసిన పాత గోడలు..

ముగించిన అలుముడు .. చెదిరిన గుండ్రాల పరుగు మధ్య .. పాపెడ చుట్టిన చూపులోంచి .. ఎవరమూ  ఇక్కడ కొత్తని దాచిపెట్టలేం.. మసి పూసిన చూపుని పులవగొట్టినా .. దేహం తీసుకొని పారిపోలేం.. వాళ్ళు పేటిక గురించి మాట్లాడతారు.. తెలిసినట్లే ఉన్నా .. మనిషి పట్టు దొరకని ఊరి రాతని తాగి.. నిద్ర సూచీల పెద్ద వంతెన కింద మృత్యు సాయం చెప్పుకొన్న కలని పాఠేసుకొంటూ.. తేరుకోలేని విపరీత దగ్గరలో మోసుకొన్న పొట్టి రాతల కౌగిలిని దాచుకొన్న నల్ల నిప్పుల యేరు.

……………….

పడవని లాగి ఫ్రేమ్ లో సెట్ చేసి .. కథలకి ఊరబెట్టిన కునుకుని తోడుకొని.. రెండు మాటలు.. ఇంజెక్షన్లు.. కొన్ని సిలైన్లు.. తెల్ల దుప్పటికి కింద దాచిన అగ్రిమెంట్ పేపర్స్.. మొబిలిలో లాక్ చేసిన చీకటి వీడియోలు.. నిగారు కమ్ముకొన్న చావు ఊటలో చేదుగా తగిలే ఊపిరి. సంధి హేళనకి మాయం ఐన తీరికని పట్టుకొని.. మళ్ళీ నేను రెడీ.. టైం సెట్ చెయ్యి.. కలవాల్సిందేగా .. ఈసారైనా కనికరిస్తాడేమో.. నిమూల రాత కథకి చేర్చిన కాళ్ళ పాటకి తప్పించిన దేహ రుజువు నేర్పిన కల ..

వెనకకి లాగిన నిస్వాయ సాయం వద్దని కోప్పడుతూ.. మన్నింపు లేని పోటుతో.. కుమిలిన సదాహరణ గతికి కూరిన గంటలని పట్టుకొని.. నిలబడి కూల్చుకొన్న దేహ శపథం.. మూర్చన లేని రెండు కళ్ళ మధ్య కూలిన గడప .. పోత పోసిన కన్నులో ఉండిన కునుకు.. ఇంకి పోయిన దిగులు చెట్టుకి వేలాడదీసిన కట్టెల మోపు.. ఎంత చెప్పుకు పోయినా .. వాడేం కళ్ళెత్తడు .. మాట వారసకైనా చూడడు.. ఫోటో షూట్ ఎలా ఉండాలో చెప్పి.. ముందుది .. సబ్మిట్ చెయ్యమంటాడు.. అంతా చెదిరిపోయిన .. కంటి క్షేత్రంలో ముగ్గిన చీకటి పాముల బుసలు చల్లారిన దగ్గుతో.. చూపుని వదిలేస్తారు.

పుల్లని ప్రఫుల్లతకి ముఘీన దీవిలో .. ఆ నీటి గుంతల చోటు పక్కగా …  టెంపోయారారీ టెంట్ ని నువ్విప్పినప్పుడు.. నీకు ముందే తెలుసని.. అతనికి నువ్వు ఏదో చెప్పి ఒప్పించగలవని .. వాడితో అబద్దం చెప్పించవని తెలిసిన …  ఆ క్షణం లో నువ్వూ నాకు కావాలనే.. విసుగు తెలియని విపత్తు మందలింపుని కూర్చుకొన్న కథకి.. ఐనా ఉండిపోవడానికి .. ఈ షెడ్యూల నీకేం లేదుగా ? స్టడీ అని చెప్పి .. మీరు స్టోరీ .. హీరో లుక్ ముందే రెవీల్ చేస్తారు.. నాకదేం వద్దు..

ఎవరమూ.. తాండవ మాయకి లొంగిపోమని.. నడిచి వచ్చిన దారిని వదులుకోమని… నిశ్వాస రాల్చిన వీధి మడుగులో.. వంతెనని మడిచి పెట్టి .. కరకు గొంతుతో ఊగిపోతామని.. భయం బిగిసిన కెమెరా ముందు.. తోడు కలిసిన చీకటి నీరు నిండి పోతూ .. పని ల్లేని దేహ సగపు గొంతుని అంటుకట్టిన రుణంలోకి పట్టుకొని.. అదే నిశ్చల మునకని అందుకొంటారు.

కొత్త వల దారిలో రంగు మార్చిన కెరటాల కుట్ర.. నది కల్సిపోయాక .. తన దేహం మళ్ళీ కావాలని ఏడ్చినా .. మృత్యు గీతని చెరిపిన నవ్వు కెమెరా ముందు నిలిబడిపోతూ.. కట్ .. వినిపించదు. ఇంతకీ ఆరబెట్టినా దేహ నమూనాల కావడి మోతకి .. పెదవి బిగించిన తిట్టుని మింగి.. ఋణం మోసిన వీధిలో పిడుగుగా పడిపోతూ..

తనలో తను .. లోపలా బయటా లేని నిద్ర జోజుల నిశీధంలో పడి .. గుంజుకు పోయిన అపార్ధా క్రమాలు దాటిన ముఖం దగ్గర చేసుకొని.. ఊపిరి చేర్చుకొన్న నడకని ఎత్తి కట్టి.. అడుగున నిండిన కథకి .. ముఖాలన్ని దాచిన నవ్వుతో.. తుడిచి.. వెళ్లిన వాన సెట్ ని తిరిగి లాగి… ఇలా సరిపోతుందాని.. నిల్చిన భూమి గొంతులో ఆరబెట్టుకున్న నిద్ర కుండలిని నింపుకొని.. జ్ఞాత సంధికి చేర్చిన కన్నుతో ఊరేగి .. చంచల నియుక్తంలో పోసుకున్న ముఖాలు. ఏదీ ఎవరికీ చెందదు.

అంచనాకి దొరకని దృష్టి జరుపుడు.. పెద్ద గుమ్మం నిండా వాడు వాగి వెళ్లిన సీసాలు.. తోడు కలిసిన అలుముడు వణుకుని కుంపట్లో దాచి.. రెప్పలాడిన ఊగిసనీ నానబోసి.. కళ్ళకి పోసుకున్న నిద్ర దొరకక.. ఆనవాళ్ల వెంట నడుచుకొంటూ..

…………………….

అక్కడ చెప్పుకోవడానికి ఏదీ లేదని.. ఉండిపోవడం ఏమేమీ మార్పుని తీసుకురాదని తెల్సిన .. ఒప్పుకొని జత ముంపుల పోలికకి .. కొన్ని నిర్వరాయ గాలి తమకపు ఊడలని అల్లుకొంటూ… కొంచెం పల్చగా ఆరబెట్టినా బెంగ .. నీరు పోసిన అవక తవక ఎత్తుగడనే దాటి.. మాయం చేసుకొన్న విపరీత రాత్రంలో ఊగే చేతులని కట్టుకొని.. వలస పోయిన కాటుక రేవుకి .. కొత్త సంధి చేసుకొన్న కథని దగ్గర చేస్తారు.

చెప్పి తప్పుకొన్న కళ్ళకి మరింత పోలిక చుట్టిన కథలని పట్టించి … తన దేహంలో వలస వచ్చిన నిర్ణయాల గుట్టుని తవ్వుకొన్న …విపరీత కన్నుగా ఆరబెట్టిన నడకని పెట్టుకొంటూ.. తేరుకోలేని కంటి గడపల కూర్పు. విప్పుకొన్న అనుమానాలపై పొంగిన అనుగ్రహ సంధి.. మళ్ళీ రాత్రి తాళం తెరవాలన్నప్పుడు విసిగిపోయి..

అన్నీ ఏకం కానీ దూరంలోని పట్టింపులే ..భయం దగ్గరకి రాణి విశ్వ సమాశ్రయ కూర్పుని వదులుకొన్న ఎడబాట్లే.. ఏదో చెప్పుకొన్నట్లే ఉన్న .. అదేదీ కానీయని దేహ రశ్మికి పట్టిన వణుకుతో.. చెల్లాచెదురైన గొంతులో ఉండ చుట్టుకొన్న బెరుకు.. అదీ .. ఇదీ అని తెలియని .. పెద్ద నోళ్ళ సెట్లో .. ఒక్కసారి అరిచేసరికి అంతా సద్దుమణిగిన .. లోపల రక్తం తిప్పిన వాంతిని .. గట్టు కట్టలేక కూలినపుడు..వాడు ఊపిరి కొన్ని క్షణాలు వదిలి కూలిపోయాడు.

కప్పేసుకొన్న ఎండకి .. గొడుగులా మధ్య ఎగిరే చెట్లకి … దోసిలో పోసుకున్న ఊపిరి రాతల పట్టుకి.. ఊరి భాగోతంలో మార్చి స్క్రిప్టుకి .. ఇంకా తెగ్గోసిన డైలాగ్ పార్టీకి.. తరిథితా నిద్ర సానువుల్లో కూలిన మంచు కొండకి.. పగలూ .. రాత్రిని తెలియని నిండు కోతల సముద్రం .. నదికి చేసిన ఒప్పందం తెగ్గొట్టినప్పుడు,. మధ్యలో ఇరుక్కు పోయిన పడవ మృత్యువుని మోస్తూ.. పేరుకున్న బెంగల పక్కగా ఉంచేసిన అగ్రిమెంట్..

సాపేక్ష సంధి సూత్రం తప్పించిన దూరంలో పడి .. తలకిందులు దేహ దర్శనకి చేర్చిన కలని .. దూరంలో సాగదీసి.. గడపలకి అంటిన చూపుని పగతో నులిమి.. మీట నొక్కిన కంటి ఊటల కూర్పుని .. పింగాణీ ముద్రలు చేసి మోగుతూ.. చంద్ర ఊటలు

పొర్లిపోతూ.. వెనక కట్టిన గ్రీన్ తెరలు వదలిపోయాక … ఎవరమూ లేని నిరాధార కూర్పుని కాల్చిన ఒత్తిడికి చెదరగొట్టిన ధ్వని భారాల నిర్ణయం.. తెలిసినట్లే ఉన్నప్పటి నటన .. కొంచెం దూర చిత్రంగా లేని సమయ గురికి చేర్చిన కంటిలో .. ధూపం విడిచిన కునుకు.. ఇంకి పోయిన సమయ చిత్రపు గొంతులో ఆవిరిగా లేచిన నిద్ర కథలు..

కొందరు కనపడతారు .. కొందరు ఓ మాట అడుగుతారు.. కొందరు వదిలేసి పోతారు. ఎప్పటి రాతని తుడుచుకొని .. మళ్ళీ చేరిన మాటలతో నానబెట్టామో .. అక్కడే మరో చిత్ర లీల పంచుకొన్న నజ్జుది రజను నిండిన గ్లాసులు .. ఆ రెండు  జతల రోజులోకి .. ఇంకా ఎవరో తచ్చాడతారు.. నీళ్లు పోసుకున్న సమయ గతం పట్టుకొని .. నిరాధార మాటలని వదిలిపెట్టి వెళ్ళిపోతారు.

నిర్వాసిత సమయ మండలపు చప్పుడికి కూలిన దర్శనకి .. కొండల్లో చిక్కుకొన్న అలసట నీరుని ఊతగా పట్టిన కథలని కలిపి.. ఇంకా విడిపోలేదని చెప్పుకొన్న .. సూచీలన్నీ అవే కదాని? అని నిలదీసినప్పుడు.. కొన్ని నెలల గుట్టు బయట పడుతుంది..

………………………..

పొద్దు పోసుకున్న ఉక్కిరి మెట్లు.. సాపద కాలబెట్టిం స్మశానంలో పడి దిక్కులేక తిరుగుతూ.. వినికిడి దేహం లేని ఆపద కూల్చిన హద్దుని .. ఝాము మండలంలో పెట్టుకొన్న తీరికని కడిగి… విస్మితః జాడలేని మొత్తం దాడిని చేర్చుకొన్న కంటిలో .. నీరు పట్టిన దుఃఖ నిద్రల కైపుని తొడిగి.. అప్పటి ఖాళీ సమయ అమ్మకంలో పడి .. సందు దొరకని కీడుని ఏమార్చి.. కదిలే దేహ సమ్మతికి కట్టిన రుణాలు..

కొంచెం వివరాలు గుప్పుమన్న నిద్ర దర్శన మండలంలో పడి .. సూచీ గీతాలని చెరిపిన ఝాము బిగబట్టి ఏడుస్తూ.. తేరుకోలేని కలతకి నీరు పట్టిన గోడలు.. విస్మితః జాడలేని మొత్తం దాడిని చేర్చుకొన్న కంటిలో .. నీరు పట్టిన దుఃఖ నిద్రల కైపుని తొడిగి.. అప్పటి ఖాళీ సమయ అమ్మకంలో పడి .. సందు దొరకని కీడుని ఏమార్చి.. కదిలే దేహ సమ్మతికి కట్టిన రుణాలు..

పరితృప్తం కాని అభయ చలానితకి చేర్చిన కంట్లోకి మోసుకొన్న ఇసుక మేటలు.. ఇంకా కనపడని నిద్ర పూతల కలని తాగి.. నిద్ర ఊపులకి లేని సమయ ముడికి లేవదీసిన ఇరుకుల్లో గాలికి చుట్టుకొన్న భద్ర తమకపు ఊట… ఎదిరించిన మసక భూమిలోకి ప్రార్ధిత కథల హోమంలో ఆవిరై పోయిన ఆచూకీ నిడివిని కదిలించే భయద నివేశం..

కథ చెప్పిన సొరంగ ధ్వనితో నింపుకున్న ఆధార మన్నింపులని కాదని.. తొలచిన చూపులతో.. తోడుకు తెచ్చిన రుణ తీవ్రతలతో.. వేలాడిన కన్నుని కప్పిన మాటలని వేలాడదీసి .. కలబడుతున్న చీకటి నివేశ దారుల్లో.. కొంచెం పగటి మాటలు… పొగ చూరిన కథలకి పట్టిన చెమట ..రంజుగా మారిన కంటి రేవులో కలబడే  నీటి గుణాల తీరికని వేలాడదీసి..

పోతపోసిన దేహ రుణాలని కప్పుకొని.. వివర్శ చిందులు .. శరీర చూపుల గట్టుని కోసి .. పడిపోయిన యానత పొడుగునా మాటలని కోసిన ముఖాలు..   కొంచెం బయటపడటానికి లేని ఆపత్తుని చిదిమి.. అదిలించిన మాటల వేడిమిని కత్తిరించి.. శరీర కాపలాల కొలిమిలో పడి .. నిరాకరణ వేడుకని వదిలిన స్టేజీలు..

పేట్రేగిన కంటి రాత్రంలో .. కునుకు పేర్చిన ఇంట్లో.. అదే సూట్ కానీ షూటింగ్ ఇళ్ళని కోప్పడి.. షెడ్యూల్ వెనక పడిందని ఏడ్చి… వెళ్లగొట్టిన నిద్ర రాత్రిలా.. పట్టు బత్తిన రాత ఒప్పందాలు.. అతను పోయాక గాలిలో కలిసి.. పెదాలు నమిలిన చీటీ అనులోమ గట్టుపై కుదిరిన చీకటి సోదాలకి .. దొరికి పోయిన మృత్యు లాల మూసుకొన్న కలకి రంగుని దులిపి..

మేకప్ లేం వద్దని అరిచి.. కథ గోల ఇప్పుడెందుకు.. ముందు జరగాల్సింది చూడని .. హెచ్చరించి.. కాపలా పెట్టిన కాపలాల మధ్య కదిలే రుణ బుజం కప్పిన ఊసర కలయికనే నానబెట్టి.. కలుసుకున్న నిద్ర రీతుల కట్టడిని పేర్చుకొని… కసిగా రాల్చిన చెమట మంటలతో కన్నుని చేరదీసి..

అంతా అనుకొన్నట్లే ఆ స్టేట్మెంట్ ఇస్తారు .. మరోసారి కలుసుకోవడానికి లేని పెద్ద యజ్ఞ గుండాల పక్కాగా ఏడ్చినా కలయికనే తాగి కనిపించరు.. సమస్థిత సగంలో పాతుకొన్న ఊపిరి అండని కనిపెట్టి .. దుఃఖ నిరూప ధ్వనికి చేర్చిన కథల ఊడలని కట్టుకొని.. ఇక్కడే మిగిలిన ఆయాస ధునికి వేలాడిన కన్నుతో.. కాపలా పెట్టిన ధూప నిఘానీల వెలుపల మాటని తీర్చి..

…………………….

కలని కాసేపు దూరంలో ఉంచి.. మాటలని వినీ వినక వదిలి పెట్టి.. చూపు కలపని నిరాశని వదిలిపెట్టి.. అద్దిన చీకటి రోజుని గ్రహణ రొప్పుకి కట్టి .. నిద్రపోత రుండానకి వేలాడిన ఆయుస్సుని చేర్చి.. రెండు జతల రోజు… కలిసిన కంటి దూరం లోని పొగరు.. గుర్రు పెట్టిన కొండల మధ్య కుదుర్చుకున్న సంభంద పెనుగోషిత సమితికి చేరిన పడవ నురుగు కక్కుకొని చనిపోతుంది…

నిర్లిప్త స్తంభన కల్సిన ముక్కలని దాటుకొని .. మరో సంధికి దొరకని .. ఝాము పొడుగు హద్దుని కాదని .. రెండో సంధికి నమిలిన పిడుగుల చప్పుడుని స్నాన నిధికి చుట్టి.. చీలుకు పోయిన దూర కణతలు నిక్కపోతని కరిగించిన మధ్య కూరిమిలో పడి దేహం దొరకక .. నీరు పాడిన పడవల దొంతరలో జాతర మొదలై.. వివర్శ గమన లేని జోడింపుని పట్టుకొని.. జతగా ఉంచిన కంటికి … పడవల గొంతుకి ముడేసి  కెమెరాలోంచి .. నీరు కారినప్పుడు మోసుకొన్న గోడలని పట్టుకొని.. సర్ది పోయిన నాటక కోతలు..

ఎక్కడా లేని నిద్ర యుగాల బయట ..పొంగిన ఊపిరితో పడవ అరుస్తూ.. పేర్చిన భయ తీవ్రతల గట్టుని చెదరగొట్టి.. అంచనాలేని మరో ఎత్తులోని కలని కలుపుకొని.. ఆయాస రేవుని తవ్వుకొన్నాం.ఖనన మాయావి కట్టిన ఆ పెద్ద సముద్రపు ఒడ్డులో పడి … ఏమాత్రం ఆచూకీని పట్టుకొని.. దేహ పులస్థితాల భద్ర ఛాయావిని ఊపుకొన్న చీకటి నిరుత్తర పోలికని ఊడ్చుకొని.. అక్కడే ఆగిన కథని మళ్ళీ చెప్పుకొంటారు.

ఆపనివేశ ముఖాలతో పండిన కన్నుని పట్టుకొని .. శరీరం చెప్పని నీటి భాషను రాజేసుకొంటూ.. ధ్వని సయ్యారంలో పోటు పెట్టిన గాలి హోరుని కట్టుకొని .. కూలిన నిస్వస్థ రభసకి ఏడుస్తూ.. పెడ చెవిన పెట్టిన శరీర ఋణం ఊడిపోయిన చీకటి అవలోమక దాడిని నిర్జించి.. కంటి గడపని దాటిన గదుల మధ్య కెమెరా ఊగిసలాడుతూ… హెచ్చరించిన ధూప మండలాల్లో కనుక్కొన్న వ్యతిరేక నటనలు..

తేరుకోవడం.. మాటని తీసుకెళ్ళడమూ.. ఒప్పుకొని వదిలేయడమూ.. పరిధి కలిపిన బిగువుతో.. ఊపిరి ఆరబెట్టుకోవడమూ… అంతా నిద్ర క్రమంలో పోసుకున్న చీకటి నిరాపాయ అవస్థని దాటుకొని.. రుణ కూర్మి ..

 ఆ పెద్ద సెట్లో ఇంకా ఎవరూ కనిపించని లేదు.. అక్కడ చెప్పుకోవడానికి ఇంకేం లేదని .. ఉరిమిన మాంస చలనకి పట్టిన బూజుని దులిపి..కలిపి చేసుకొన్న ఒప్పంద తీరికలేని జోడించి .. పైకీ కిందికీ మోసిన గొంతుని తాగి.. దిమ్మరిల్లిన మాటలకి జోడించిన కునుకు..

లేవదీసుకొన్న కథని తెగ్గొట్టి .. పిలిచినా గదిలో ఉండిపోయిన కాళ్ళని దాచుకొని.. ఇదే అని చెప్పుకోలేని.. గ్రహణ తాళపు పట్టుని కోసి.. వదిలి పోయిన సెట్లో… కొన్ని నిర్వచన దూరాలు లేని పగటి వేషం తీసేసి.. ఒద్దికగా పేర్చుకొన్న గోళంలో తేరుకున్న నడకని కడిగి.. విసిరేసిన చెమట బట్టని అలానే ఆరబెట్టి.. సీసాలని కొసాక రాలే రక్తం..

ఆర్ద్ర సార్ధకం.. సీన్ పేపర్ ని మించి elevate ఐన.. కంగారు.. కట్ చెప్పలేక .. నిలువు కళ్ళతో ఉండిపోయాక.. వాడు చీకటి కోరని బయటకి తీసి.. ఓ క్లిప్ వదులుతాడు.. వైరల్ అవ్వడమంటే చావుని మంటని దగ్గర చేసి .. నల్ల బావిలోకి దూకిన దేహ సంధికి దొరకని వైభవ మండలంలో పడి .. కాళ్ళని జార్చిన కునుకుని తేరగా లాక్కొని.. తిట్టుకొంటారు

………………..

నివేశ శపిత .. కలబోత భూమిలోని కంటి కాపలాని కదిలించి పెట్టుకొన్న శరీర పొగల వేడిమిని ఎగదోసి.. అభయ చిత్రం కాల్చిన భవ తీరికలని గుప్పుమని పీల్చుకొంటూ.. నీరు పట్టిన ఉరుము ఏడ్చాక .. ఒంటిలో పోసుకున్న కోసం గాలుల వరం తిప్పుకొన్న జంట బావుల కొలిమిని ఊది.. అడ్డుకొన్న కంటి రాతని  తుడిచిన ఖాళీలని పట్టుకొని.. విపరీత సంధికి తెలియని ఆయుస్సు పట్టుకొన్న స్కెచ్లు..

సవరించిన చీకటికి .. కౌగిలిని తోసుకొని.. అద్దిన క్రమాలని దాటుకొని.. జోడించిన నడకలతో.. పెరిగిన బయట వీధులని ఎగరేసి.. పట్టూ .. విడుపుల కదలికనే మోసుకొంటూ.. ఎవరమూ  అడ్డుపడి చెప్పుకోలేదు.. ఉంచేసి సమయ సంధికి చేర్చిన  ఆయాస మేకప్ లని తోడుకొంటూ.. ఋణం తీరని గొలుసు కొట్టుడు తాళ్ళని బిగిస్తారు. ఎలాగూ మార్చేసి ఒప్పుకొన్న ధూప మందలపు ఒద్దికని చేరదీసి.. కంటికి చేరవేసిన బుగులుని వెచ్చజేసుకొంటూ .. నిర్మాణ గుప్పెటలో పోసుకున్న నిందలు..

సమాన ద్రవాలని పోసుకున్న హద్దుకి.. లోపల విడిపోయిన గుమ్మాలతో .. చేర్చి పెట్టుకొన్న నిరామిత సాధనకి … రెండో చలనతో తోడి పెట్టుకొన్న నటనలు.. లోలోపలే వణికిన మృత్యు తాఖీదులు వదులుకొన్న మండలంలో ఉద్ఘాటన.. ఇంకో మిగులు ఆయాస నిందలేదని అనుకొంటూ.. రుణపడ్డ కదలికనే దాటి.. కొత్తగా పదును పెట్టిన కత్తిని లాగి.. బొడ్డులో దాచాక ..చూపుని వదిలిపెట్టారు. అందించి చెప్పుకొన్న ఒకే మొత్తపు నిరావద్ద స్థితికి .. శ్వాస గడువుని దాచుకొన్న చూపుల విడిదని లాలించి చేసిన కాళ్ళని కరిగించి..

సాయుధ్య స్థిమిత .. పిండేసిన కంటి రాతని … కీడుని తప్పించిన చిక్కులు.. కలలో పడేసిన కూరిమితో … చీకటి సయుక్ష రాశుల కలతకి పట్టిన బూజుని దులిపి… స్క్రీన్ టెస్టులు .. అమిరిన కంటి చివర కొత్త దేహాన్ని కొనుక్కు రావు.. కళ్ళాపి జల్లిన చీకటి అవస్థకి మోసిన మృత్యు భాషణ తెలిసిపోయి ఉనికి మొత్తమూ ఊహన రేవుల్లో దిగబడ్డ శరీర కణుతుల్లో.. ఇంకో పగ చుట్టిన దీర్ఘ శ్వాస కనిపెట్టి చూసుకొంటుంది.

 మరో విసిగిన దేహ రుణ గతి నిండిన చీకటి అలవాటుగా .. పండిన దేహ బొంగరపు పోలికని పట్టుకొని.. అక్కడే ఉండిపోయిన నాటకపు ఆందోళనకి .. కాల్చిన వీధుల్లో దొరికిన ఇంటికీ.. మసి తుడిచిన మాటకీ … ఇప్పుడేం చెయ్యాలి.. వెనక్కి పోలేం.. మధ్యలో చంపేయడం క్యారెక్టర్ని.. కానీ అదీ బలమైన స్కీనెగానే ఉంటుంది.. లేదంటే మొత్తం డ్రైవ్ అర్ధం లేకుండా పోతుంది..

తొoదర పడమని ఎవరితోనో అనుకోని.. రాలిన చావుల గుట్టలో పడి దేహ రుజువు దొరకని .. పుట్టుకని చేర్చుకొని.. ఇంకి పోయిన దీపాల కొండలో వాన పుట్టుక వెలిసిపోయిన ఉక్కపోతకు .. చంచల నిర్మాణ పట్టుని కోసిన కదలికని ఆర్పీ.. అడగడం తెలియని నిరా ద్రోణుల్లో కూలిన ఒప్పందాలు.  పల్చని తెరల నిండు నలతకి చేరిన గంటల మధ్య నడక చెమర్చిన హద్దుని చేరుకొని.. ఉండిపోయిన కథకి బొట్టుని తుడుచుకొని…. చీర కుచ్చిళ్ళు నీళ్లు పోసి సర్దుకొని….

విప్పుకొన్న ద్రవ జాలంలో .. కొప్పు చుట్టిన అభ్యయతని కుదిర్చి.. గమనిక లేని ఒంటి రాతని కడిగిన వీధిలో పరాయి చప్పుడు తో కుమిలిన పడవ.. అక్కడ రూమర్లుగా అనుకోవడాన్నే తవ్వుతారు.. గర్భ నిందని వడిసి పట్టిన కలయిక తీర్చిన చీకటి యజ్ఞ భారం మోసిన కళ్ళకి అందిన .. దేహ తీరికని పట్టుకొని .. విసిగి దూరం జరిగిన హద్దుని కప్పుకొంటారు. ఇక కుదురుకుని పూర్తి కావడానికి ఏదీ మిగలదు.

అలుముకొని విడిపోయిన మంచు ద్రువాల్లో పడి తిరుగుతూ.. హెచ్చరిక లేని ఒంటి మీద పూనకాన్ని వద్దని .. ఆమూడు మాటలని దాచుకొని వెళ్ళిపోతారు.. అది ఒప్పుకోక ముందుదీ .. ఒప్పుకొన్నాక మారిపోయిన స్క్రిప్ట్ దీ ,, పనిలో పనిగా తోసేసిన నిరాకరణ అభేషణలోని రొప్పుదీ … సామ్య చెలరేగింపుని వదిలిన పాటకి .. డాన్స్ చేసిన నీటి దీపపు చాయని గీసి.. మరో దేహాన్ని అందులోంచి లాగి.. కంటికి చెమర్చిన మాటలని తాగి.. రుణ భేరీ మోగిన ఇంటిని షూటింగ్ స్పాట్ చేసి … కన్ను కొడతారు.ఇక ఏ విషాదాత లేని కంటి చాయని కమ్ముకొంటూ.. పీల్చిన వాన కొండల్లో .. కూలిన పిడుగు..

ఇదొక వివరం లేని శరీరం కొత్త.. శిధిల భాషలోకి ఒరిగిన కంటి నీరుల మంట .. గమనించుకోక పోతే ఎలా ? మెడికేషన్ కి వెళ్ళాలాల్సిందే.. కొలతలు కావాలిగా?

వాళ్లకి వాళ్ళుగా ఎదురు పడుతున్న నిద్ర ధ్వనికి .. రెండో ముఖం ఇచ్చిన పరిధిని దూరం చేసి.. కంటికి చేర్చిన హద్దుని మార్చుకొంటూ.. ఏమరుపాటుల దేహ ఖనిజం చేసుకొన్న శరీరపాళ్ళు. ఇది లోపలి చెప్పుకొని.. ఇక అన్య చలించినంత ఒడంబడికగా ఉండిపోదు.. దాచుకొన్న శిధిల రేవులో కదిలే పడవల ఏక గడువు నిండిన కథని చెప్పుకోదు.

లోపలకి చెదిరి పోయిన చందన నిద్ర గతులు .. పరిధి లేని రెండో గొంతులో కట్టుకొన్న శరీర గేలాలు .. ఉండీ ఉండని… సమయ భయంలోకి .. ఒదిగి పోయిన చంచార్య దీపాలు .. పగటి అరుపులకి చల్లార్చిన నిద్ర వాగుల పొడుగునా అనుమాన పట్టిన నటనలని దులుపుకొని…..నింపిన సగం దేహ రహస్తన చెలగాటం పట్టుతప్పి .. కూలిన గోడల మధ్య పోల్చిన సగం గుమ్మంతో దారి కప్పిన మంచు కాగడాల ఉరుము పిండుకొని.. జోడించిన కలకి వేరుగా పీల్చిన శ్వాసిత తీర్మానం చేయించుకున్న దీక్ష వణికిపోతూ..

చెదిరిని శూన్యాలతో .. సమర్పిత తోడులు .. పట్టించుకోలేని చీకటికి చేర్చిన వీధులని దులిపి … అక్కడ వేసిన సెట్స్ .. ఊరి వాళ్ళని  కెమెరాలోకి తీసుకోవడం.. వద్దనుకున్నా భూమి కన్నుని పొడుచుకొని.. ఇగిరిన చూపుని వద్దని చెలరేగడం.. అంతా విడిపోయిన కునుకుకి పట్టిన చెమట పోటుతో.. కొట్టుకు పోయిన నిద్ర భారపు ఆవేశ స్థిరలని కూల్చుకోవడం..

………………..

సమయ నిర్గయ ఆందోళనని పొడుచుకొని.. జోడించిన కంటి రొదకి పిసికిన కాళ్ళని వదిలి.. అంతా బావుండటంలోనూ.. తప్పుల నిండుగా నవ్వుని పాతుకొని.. మొవ్వు కోసుకొన్న మండల రేవులో పడవ కెమెరా ముందుకి.. అదేంటి .. ఇక్కడ నా ఎమోషనల్ సీన్ ఉందిగా? నిలదీయడం భరించలేని మగాడి బూతు మాటతో.. చెంప దెబ్బ.. వందల మొబైల్ రికార్డ్స్.. సెన్సేషన్..

భోగపోతలు నింపుకున్న ఆయుధశాలలో పురుష పౌరుషం .. మీట నొక్కిన కంటిలో మింగేసిన నిద్ర ఖాళీల మునుగుడు రాతల కిటుకుని వదిలించుకొని.. శరీరం పట్టిన కథని తెగ్గొట్టి.. ఇంకా వివర్శ తెలియని గాలుల్లో చిక్కుకొని.. కథని కాల్చి ఇంటి బయట ఉండిపోయిన కేకలు .. బండబారిన నాలుకలు చుట్టూ తీత తీర్చుకొన్న చప్పుడు.. నాకి పోయిన తలుపులు..

నిండిపోయిన లోపలి మడుగు తవ్వకాల్లో లోతుకు పోయి.. ఒంటి పూతలపై కథని చెరిపి రాస్తూ.. ఇరుకు చిత్రాల నివేశ భూమి సగం ఏడ్చినా కంటిని దాటి.. సగం సత్యం గిర్రున తిరిగి .. ఓడిపోయినా కంటికిని చిదిపిన నోటితో పొగని వదిలి … కాల్చి పెట్టుకొన్న నిరాశలని దాటి.. కమ్మేసిన నిద్ర రాతలతో పెట్టుకొన్న దేహ వదులు కోపం రాలుతూ

నిర్గుణ హద్దుకి .. మీద చేర్చిన పగటి తలుపుల కన్నుకి.. పేర్చిన నుదిటిలో .. బొట్టు పోసుకున్న సమాధుల కైపుకి … ఇంకో వివర్ణ గతి తెలియని ఓటి పూతల భయం పట్టుతప్పి.. అతనిపై కూలాక .. సీసా పగిలి సారీ చెప్పాక.. అనుకోని దేహ సరంజామా మోసుకొన్న పూడికలు నెట్టుడు రాతని తుడిచి… హద్దుని మార్చి .. రెండో కొండపై సర్దుకొంటారు.

లోపలి చిత్ర నిడివిని తీర్చుకొని.. పెరిగిన ఆయాస రాత్రుల కైపుకి పట్టిన నూనె వాగుల లోతుని కప్పేసి … దూర నిడివిని దాటిన నడక.. కొంచెం చెమట పట్టిన కలవర శేత్రంలో మాసిపోయిన నిద్ర నిలువు బిగువుని వడపోసుకొని.. ఇంకేం తెలియని కథకి చేర్చిన జోడన తాలింపుని గడువుకు దగ్గర చేసి.. ఊతగా పేర్చిన భూమి పడకలు…సమయ అయోమయంగా ఉండిపోయిన అనుభవ ఊసులు గడ్డకట్టి .. నిండిన ముఖాలని తిప్పుకొని.. ఉండిపోయిన చీకటి కలతలని కోసుకొంటూ.. రుణపు తేడాలని దాచిన రొప్పు..

……………………….

ఎవరమూ మరి చెప్పుకోము.. మాటని వినాలనుకొం.. ఏదో జారకుండా తప్పిస్తారా?

ఆటిట్యూడ్ .. బలుపు.. ఒకటి హిట్ ఐతే చాలు.. కళ్ళు నెత్తికెక్కి.. భయానికి గుచ్చినా కన్నుని చిదిమి.. కక్కేసిన చెమటకి నిప్పుని జోడించి .. కదిలే నిద్ర మెరుగులు ఊడ్చిన అడుగుని కప్పుకొంటూ.. పేర్చుకొన్న నిరాధార కౌగిలి దాటేస్తున్న పేటిక…

సమయం కాల్చిన సగం రేవులో కప్పిన నిర్మాణ భూమిని కట్టుకొన్న సంధి రాతలు.. మళ్ళీ షెడ్యూల్ ని ఎవరూ కంఫర్మ్ చెయ్యలేదు.. కోపము రంగుల కూర్పుని దాటి .. కాస్త అణుకువ ఉంచిన కునుకు పట్టుకొని.. ఇగిరిన దేహ నీరుని పగలగొట్టి..

అభ్యయ నిద్ర పోతలని పట్ట్టుకొని.. తప్పించిన రాళ్ళ పోతలని ఊడ్చి.. కంటికి రాయిలని అతికిన చీకటి వీలుపతన .. అగధి లోపలి గది కట్టుకొన్న దుఃఖం.. వెంటపడి తప్పుకు పోయిన షూటౌట్.. మరిన్ని గాలులు ఒరిపిడి లేపిన కంటి రాతల పేర్పు.. మార్చిన దేహ విచ్ఛిత్తి చలన దిగాలుని కట్టుకొంటూ.. తేరుకోలేని ఆందోళన పేర్చిన కథలు..

గొడవ పడుతున్న కంగారుని తాగి.. హద్దుకి తెలియని తాళ నిద్రకి .. రగిడిన అద్దకపు పాత్రలకి తేలిపోయిన నీటిని .. గ్లాస్సులోకి ఒంపి.. నల్లని దీపాల పాపిడిని దువ్వుకొని.. ఇగిరి పోయిన కాపలాని.. కంటి దీక్షకి లోపల నిల్చి పోయిన వానని కాపాడి.. వద్దనుకున్నా హంతక రాతని మోసుకొన్న హడావుడి.

చిరాకు లేని ఆపద దారుల్లో .. పోత పోసిన దేహ రుణపు తీగలని అల్లుకొని.. జోడించిన కంటిలో పగిలిన సాయపు ఇంటిని తలచుకొని.. వెనక్కీ వెళ్లలేక.. ముందూ కనిపించక … అద్దంలో కనిపించిన పాత్రలన్నీ .. అంతే చలన గొంతుని అరగదీసిన ముంపుతో.. పైకి లేచి .. తగలబడుతున్న నిర్ణయ కీలల్లో పడి .. సాయాలు మరిగిన చింతన స్థితికి చేర్చిన గంటలు.. ఋణం తీరని పట్టుదలని ఊపుకొంటూ .. ఇంకోసారి కనబడని అవే వీధులు… సమయం సరి చేయని భూమి నుంచి .. కలని కప్పుకున్న నీటి ఝాములు మోసుకొన్న మెట్లని కలబెట్టి .. శూన్య విపరీతంలో పేరుకున్న కంటి చూపు.

ఎవరూ కనిపించరు.. మొబైల్ ఏమాత్రమూ మోగదు.. నోటిస్లు ,,, హౌస్ EMI ల హెచ్చరిక.. స్థిరం చేయని ఇంటి బెంగని మరగబెడుతూ.. హద్దుని సరిచేసి.. కళ్ళలో కూరిన నొప్పి  … మిగిలిపోయిన కునుకుని వద్దని పూడికలని దాటి .. మరిన్ని హద్దులు కలిపిన నీటి కలతకి లేవదీసుకొన్న చీకటి నివేశాలు..అంతా దగ్గరై .. ముగిసిపోవడం.. కనిపిస్తూ.. దూరంగా అతను విడిచి పెట్టిన పాట .. ఓ జత బట్టలు.. వదిలిపెట్టిన సింగిల్ BHK తాళాలు.. అక్కడి టీ షాప్.. పార్క్.. స్కూల్.. డంపింగ్ యార్డ్.. ఓ పాత లైబ్రరీ.. ఏదీ మళ్ళీ తలుపు తెరుచుకొని లోపలి రమ్మనదు

విఫలత ఆది షరతుని కాదని .. దుఃఖం మోసుకొన్న నిడివిని సాగదీసుకొంటూ.. చేమ ఆరని కంటి క్షేత్రంలో పడి .. తలమునకల నిరాధార కంటి శ్రమకి నేసిన మాటని వద్దని .. చేరదీసిన సర్దుబాట్లని మరిగించాక .. పొడి చేసిన దేహ శ్రమల ఒత్తిడికి చేర్చిన గదులని కూలగొట్టి.. పిసికేసిన చీకటికి అనుమాన దేహాలని కట్టి ఊపుకొంటూ.. రుణపడ్డ శరీరాల కొలిమిని మండిస్తూ.. పేరుకు పోయిన నమూనా కథలకి చేర్చిన వణుకుతో పండి…. అప్పగించిన నిద్ర క్రియలని సవరించే మసకల చప్పుడు…

 కాల్చి పెట్టిన హెచ్చరిక మోసి తెచ్చాక .

చూపుని పట్టుకొని ఊపి వదిలిన నిద్ర గ్రహణంలో పట్టు వదిలిన కల కొంచెంగా కనిపిస్తూ .. శ్వాస తెర ఎత్తినప్పుడు.. పల్చని వాన తెరల మధ్య నివస్త్ర మాయా శకలం .. సినిమా..

అది లేక ముందు ఉంది.. వద్దనుకున్నా ఉంది.. తెరలని కప్పిన నివస్త్ర ధ్యానితగా .. నిశ్చల మొహాన మోసిన విగ్రహంగా ఉంది. సమయ కాపలాలు మరిగిన దర్పణం…

ఉరిమిన కౌగిలి..రంగు పులిమిన శ్వాస.. తురిమిన భాషణకి దగ్గరగా నేసుకొన్న శ్వేతా ఛాయల బావిలోకి తొంగిచూసినపుడు కనిపించే కల సినిమా ..

 నీటి కాలువలు పండిన మహా నది మధ్యలో దీవి చేసిన విందు సినిమా…

కనిపించి చెప్పుకొన్న జలతారు నది .. అనుకొన్న పాడుబడ్డ గుడి.. పుణ్య స్నానం చేసే కంటి శాల .. అతని దేహంలో ఆమె… కలవరపాటుని దిద్దుకొన్న దేహ శిలాయ తీరులని చెక్కిన రుణ గ్రీష్మ..

శరీర తేలికల గుట్టుని .. కాగడాల గుహలో దాచి.. రొమ్ముకి చుట్టిన నిర్భీక చలన స్థిమితం ఎత్తుకు పోయిన నరాల గుంపులో .. పోలి కనిపించిన పలకరింపు సినిమా..

ఇది ఉంది.. ఇదే ఉంటుంది.. ఇక్కడ చెప్పుకోవడానికి మరో దారి కనిపించని మసక పోటుతో కమ్మేసిన చీకటికి దూరంలో మిగిలి పోయిన ఛాయా దుర్గం కూల్చిన పునాదుల మధ్య . చూపు ద్రవం అద్దాలుగా పోత పోసుకొంటూ….చిక్కుకు పోయిన అనాథలా సినిమా …

………….

 సినిమా  ప్రవేశించిన గదిలో .. దుఃఖం తెరుచుకున్న నింపాది చెమ్మ ఆరిపోక ముందే .. శత్రు రేఖని తడుముకోలేని వెన్నుపోటుతో.. రోడ్డు పై నిలబడ్డ చర్యల నిద్రని సముదాయించే అమాంత పిలుపు .. రుద్దుకొంటూ పోతున్న చర్యా దీపాల ఒంటి పిలుపు మధ్యంలో ఊరేగే కథని దాచుకొని.. విరిగి పోయిన చీకటిని నములుతూ.. హెచ్చరిక మోసి తెచ్చాక…

కాన్వాసులు పర్చుకొన్న సినిమా.. సరి జోడింపులు.. జోలెలు.. సత్రాలు .. నీరు పండిన వంట శాలలు.. వెదురు చుట్టిన ఇల్లు.. తీగలు అల్లుకున్న గుహలు.. గుర్రాలు ఎక్కే కొండలు.. మత్తు పంచిన నాయకురాలి బొడ్డు సంచీ .. ఏది దూరంలో కూలిన విఫగ్రహంలోని పొగ .. దృష్టి నిర్మిత ఊపుని చీల్చిన కథకి దూరంలో ఉండిపోయిన మలుపు..

అదొక కథా ప్రయాణమని.. ప్రయోగమని.. చావుకి బొట్టు దిద్దిన చితి యాగం లో సీసాలు సరిచెయ్యలేని ఓటమిని పట్టుకొని రాలిపోతుందని..

ఆ దుఃఖమే లోపల మిగిలినపుడు .. ఆమె ఆ పాత గుడిలో అలా అనుకొనే చూసినపుడు.. దేనికైనా సిద్ధమననుకొనే .. నిపరిక్వత .. పట్టి చూసిన బిగువుల దాడికి దూరం జరిగిన పాట.

రెండు పక్కలా తనే ..తన  పురుషుడు ఆ చిన్నప్పుడే చనిపోయాక.. వరుస గుచ్చుకొన్నా.. స్పర్శ పట్టిన మాయకి చేర్చి.. కళ్ళలో పాతుకొన్న ఊపిరి రాతని తుడిచిన అయోమయ కీర్తన ఆ గుడిలోని .. దీపాలని అన్ని చోట్ల వెలిగించి.. దేవీ దర్శనకి సమయం చూసిన సమాధి ముందుగా అవ్వడి ..

అంతా ముందు సరి చూసుకొన్న కథలో .. నీరు పట్టిన కోసివేతలని కాపాడుకొంటూ.. శరీర పట్టుని వదులు చేసే కంటి ధూపాలపై కరిగే నిద్ర జోరులు.. కల కాలుతున్న సీసాల చితి…

వాడు దగ్గరై.. చీకటిని మాత్రమే వెలిగించి.. పడవల నీటి యాత్రలో అడుగుకి తీసుకెళ్లి పురుష ఉత్త్సవంగా వాంఛని విస్ఫుటించిన సిగ్గుకీ లోపల చుట్టి పెట్టిన కథని లాక్కొని..

అవలోకనం తీరుల గట్టుని చెదరగొట్టి.. నిశీర ఛాయా విపరీతంలో పడి .. తొక్కుకు పోయిన నిద్ర హోరులని ఆపేసిన కల .. తన బట్టలో చుట్టి పట్టుకొని పోతూ… ఘాడ నిద్రల నివస్త్ర స్థితిని చీరతో పైన కప్పి .. ఆ నిర్జన దీవిలో వదిలేసి పోయాక.. అంటీ ముట్టని రుణాల కైపుకి తోడైన నిలువు తలుపులు….

వాన మాయ ఆమెని కలిపేసుకోంది.. కరిగిపోయిన కాలిముద్రలు మరి దొరకవు….

…………………

అపరిమెంట్ EMI లు.. కలిసి షాపింగ్ చేసిన క్రెడిట్ కార్డ్స్ .. కుప్పలా డబ్బు పోసిన క్లబ్ తిరుగుళ్ళు.. లక్షల దిష్టి తీసి వదిలేసినా బెట్టింగ్ apps  … ఇంకొన్ని పర్సనల్ లోన్స్ … మరిన్ని సగం బట్టలున్న వీడియో లని పబ్లిక్ చేసి వాడు వెళ్ళిపోయాడు..

ఆమెని తన లోపలికి తీసుకోవడానికి ఏ వనదేవత రాలేదు.. చున్నీ తాడుగా మారి వేలాడటం తప్ప . నెమ్మదించిన మాటని తోడుపెడుతూ. జోలగా వడపోతని.. వాంఛ మరిగించిన ఎర్ర కారపు కేక సినిమా …

ఏడ్పు పెట్టిన చిచ్చుని మరింత లోతుగా తవ్వి పెంచుతూ.. శపిత నవ్వుని పెట్టెల్లోకి కూరి .. శ్వాస ధనుస్సుని గురి చూసి … ఎవరూ చూడనప్పుడు వెళ్ళిపోతారు.

చూపు బరువుని కాల్చిన కొండకి నలుపు చీరని మెత్తిన పడవని వేలాడదీసి.. ఊపుతూ .. కలని తలంటి పోసిన మెళుకువల పగటి నిద్ర .. సినిమా..

చెరిగి పోయిన కలతలా కుట్రకి తెర్చుకొన్న రుణ కూపాలని నింపుకున్న .. శరీర తలుపులని .. ఉండే లేకపోయినా చీకటి తర్జుమాల పేటికని నింపి.. అక్కడే తగ్గిపోని చూపుతో మల్చుకొన్న కౌగిలిని అంటుకడుతూ.. నాచు పట్టిన నవ్వుతో పండిన కునుకుని కాపుకాచి..

………………….

కలయికల మహా మాయ సినిమా .. గట్టు తెగిన అర్పణలో .. ఎత్తైన కొండపైన మెరిసే పురుష నివాళి సినిమా .. ఉండీ లేనట్లుగా పేర్చిన రక్షా నిద్రల సముదాయం సినిమా ..

ఒక మహా సమర్ధ రధ యాతరలో … విశ్వ సన్నిధానపు నీలం కాగడాని మింగిన దేహ మెరుగులు నీటి స్తంభం సినిమా … విపరీత మాయలోకి కూలిన దోష ఋణం పట్టుకొన్న తెరలు..

లోపలి జారిన మహా శబ్దం పేర్చుకొన్న ఛాయా గర్భ కేకల నిధన సినిమా.. తెరలు తెరలుగా లేస్తూ.. మన లోపల ఒక్కో చర్యకి గంధపు పరిమళ దోసిలిని గుప్పిన ముద్దు సినిమా..

మొదలవ్వడానికి ముందు ఏం ఉండదు.. ఐ పోయాక ఏదీ కూడా రాదు.. నిగ్రహించబడిన కంటి దోషపు పౌర్ణమిని కాల్చిన రూపస దీపంలో కదలాడి… వంతులు  మారిన మంత్రం దండం దొరికిన చెక్క బొమ్మల దగ్గర మాటలు వింటూ..

అదీ సినిమారా .. పోలిక దొరకదు.. అన్ని టైంలు పడకుండా కొండని ఎలా ఎక్కగలం? కనిపిందంతా అలానే సత్యమని కాదు.. తీరిక దొరకని రుణ శేషపు మండలంలో కూలిన కాళ్ళ కూడలి….

ఋణం ఊరటాలోకి చేరిపోయిన కథకి దొరకని నిద్ర ఋతువుని దాటించే పడవకి .. ఎర్ర రంగు దేహం పట్టించిన ఝాముతో ఉరిమిన కథ .. సద్దు నేలలో పొడుచుకొచ్చిన దేహ రుజువులు.

తను నీతో వచ్చేస్తానని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంది.. వినిపించుకొన్న ..జాబ్ .. ఆస్తిపాస్తుల లెక్కలు రాలిపోయిన కుదురుతో .. పై పైకి విరిగిపడి.. మరో అంచనాలేని లోపలి ఓటమిని ఒప్పుకొని..

కాపలా పెట్టుకొన్న తీర్ధ దారుల్లో .. వాళ్ళు కనిపెట్టుకొని మీద పడతారని తెల్సినా..

వాడి దగ్గరేం ఉంది.. ఇంకా పిల్లాడు.. తాడూ .. బొంగరం లేనోడు.. వాళ్ళమ్మ బాబులకు మాత్రం ఏం ఉంది.. ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు.. ఇంకా కొన్ని అప్పులు మిగిలే ఉన్నాయి..

ఏం రోగమో.. వాళ్ళ బాబు ఎప్పుడూ .. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పీక్కు పోయిన బెంగని మోయలేక ఓడిపోయిన వాడిలా కుంగి పోయి.. నెమ్మదిగా నడుస్తూ

తోడుగా  చలన  కక్ష్య.. విడిపోయి .. అప్పుడప్పుడు ఎదురు పడుతున్న గ్రహాలు.. కాని ఈ పుండు ఆరకుండా చేసేది… సినిమా.. అది మాత్రమే తలుపుల లోపల చీకట్లో హత్తుకొంటూ….

మాయ ధునితో కామేంసిన పొగ .. కల ఊరిన గది.. శత్రు నిద్ర చప్పుడుని కాలుస్తున్న అద్దం.. ఆ ఫ్యాక్టరీ నిండుగా మొదలైన కలలు .. శరీరం వద్దని ఏడుస్తూ..తేరుకున్న పెదాలని తాగి..

ఊరిన మాయకి చేరిన దీవుల్లో .. అంటూ కట్టిన శ్వాస ధ్రువాల గతిని సరిచెయ్యలేక ఏడ్చినా కథ.. సంధి చేసుకొన్న బాలింత బరువు .. కిందికి వాలిపోయాక బిగిసిన ఆందోళన మరుగుతూ.. హెచ్చిన నిమ్మల కంటిని కూరుకున్న కష్టంతో.. కలత పండిన నిరాకార ఊతాలు…

తరుముకొచ్చిన రక్షా ఊళనలో పడి .. కథకి చేర్చి నిండు రాతల పాత పేజీలని దులిపిన పాడుబడిన చీకటికి .. ఎర్రబారిన ఆందోళన కప్పిన వణుకుతో..గురుత్వ  విరోధ…

…………….

 గొంతు చించుకొని ఎక్కడని ఏడవగలం.. ఏ నిద్ర విరుచుకొని అల్లాడి ధూపంలో ఎగరేసి .. చీకటి నిప్పు ముద్ద ఏడ్చిన కట్టుబాటుని చిదిపి..  Scream  of max. దృష్టి నెమ్ముల దగ్గు కురుస్తూ….

స్క్రీన్ మీద ఏడుస్తున్న వాడిని చూసి.. లో లోపల అరుచుకోవడం తప్ప.. నీరు కూలిన ఇంట్లో శవం లేచాక .. కంపించిన ద్రోహ నిడివి చిక్కుల్లో బాధ మరుగుతూ.. పరిధిని బడ్జెట్లో ఇరికించి.. చేసుకొన్న దేహ భాషణని అప్పటికే తెగ్గొట్టిన నిద్ర కథగా అందిపుచ్చుకొని.. ఎదురుపడ్డాక..

నిరయ స్థాపనలు మెత్తని ముఖాలు.. నెమ్మదించిన కష్టాల మధ్య ఆ ఎత్తుకి ఎదిగి నిలబడి కౌగలించుకొన్న రక్షా శాలలు.. ఆదరణ .. ఏం ఆశించకుండానే… అభయ సుఖం అలజడితో ముంచి సగం ఆందోళ రాశుల నొప్పిని కదిపి .. కూలిపోయిన ఇంట్లో కన్నుకి పట్టిన విసుగుని సాగదీసి.. తెల్లబోయిన ఎదురుదాడికి ముక్కలైం కంటి చూపుని వడపోసి .. చిక్కబడ్డ దేహ ఖనిజాల గుట్టుని పట్టుకొని.. అదే వారిలో పడి ముందుకు పొమ్మని.. సమయ నిరావి మూసిన తెరల వెనక మాట వణుకుతూ…..

ప్రభావ దంపన కురిసిన నీటి ఋణం కప్పిన పరదాలు మధ్య కూరుకు పోయిన నిద్ర సంతులనకి వేరుగా ఉంచిన నల్ల తెరల గుట్టని తవ్విన ఆకలితో.. మాట చేర్చుకొన్న నిరాధార కంటి శోషకి .. కొలిమిలో పండిన కునుకుని తాగి.. కలని వదిలిన శపిత రాత్రంలోని పూడికలు..

దిగిపోయిన నీటి శిథిలపు గట్టుపై.. అడుగులని దాటుకొని.. విరిచి పెట్టిన చీకటి నాదం వినిపించిన కథనే మళ్ళీ చేరి.. ఉండిపోయిన కంటి పాటుని కట్టుకొన్న చీకటికి ఉరిమిన కన్నుతో .. కాపలా లేని ఇంటిని తాగిన నిద్ర గాలుల ఊళన … నిషేద ఛాయల అయోమయం…

ఇంకొకసారి .. నీరు పట్టిం ఏక దీపపు సిగ్గు.. అరమరికలు లేని భాసం మధ్య .. వివరణ లేని అర్దాంతర దానిని ఎక్కుపెట్టి.. ఓర్పుకి గుచ్చిన నీటి ముద్దల సాధనాన్ని సాగదీసి..

చిన్న దూరానికి అల్లాడిపోవడం..  పాపిట దువ్వుకొన్న చీకటితో గొడవపడతారు.. కొంచెం చూపు తడిచిన నిర్ణయ ముంపుని కడిగి.. చెల్లిపోయిన చూపు చివర గదికి ధూపం పెట్టి.. అల్లాడుతున్న నిద్ర దోసిలి కంటిని సాగదీసి.. పెను ముఖాల ద్రవ గోళంలో ఓలలాడి

నీరు పట్టిన కొండల్లో .. అర్ధరాత్రి కాగడాలు పట్టిం గుడి.. సంధాన మసక కమ్ముకొని.. ఇగిరి పోయిన విసుగుని సాగదీసుకొంటూ.. కదలని నిద్ర ఆవాహిత చావులో ఊరిన స్పర్ధలని కడిగి .. వాన.. సరళ నిఘా పండిన కునుకుని చేరుకొని.. ఎత్తి పోసుకున్న మంటల్ని కుదిపి.. చలన స్థితి పంచుకొన్న కథని ఒప్పుకొని..

తెల్సుకొని కలిసిపోతూ… నిద్ర వాలులో కూర్చుకొన్న నిరోహణ తలపుల కూరిమిని మార్చి చూసిన నుదిటిలో ఊరిన ఆశీస్సులు.. బయటప్పటికే దొరకవని సినిమా చెబుతూనే ఉన్నా..

పొగలు .. సిగరెట్లు.. కారా కిళ్ళీలు.. ఉమ్ములు.. వెక్కిళ్లు.. అరుపులు.. కాగితాలు.. ఈలలు .. చెమటలు ఉక్కపోత.. ఒక్కోసారి మసకేసిన తెరలు.. పోయిన కరెంటు.. సమోసాలు ..టీల అరుపుల మధ్య ఊరేగే పెద్ద కన్నుల పండుగ సినిమా..

లోపలి స్త్రీ ని భద్రం చేస్తూ .. మళ్ళీ కలుపుదనే ఆశని తీసుకొని .. ఎగిరి పడుతూ.. ఎవరికీ చెప్పుకొని .. చీకటి వీడ్కోలు నిషాదక తీర్మాన రాత్రంలో పడి తలకిందులు మెరుపుని నానబెట్టి.. కదిలే నిద్ర నిష్కర్ష తాపం కమ్మిన ఆవిరి మండలంలో ఊరేగి..

అవధి పూర్ణ చలన హితాన్ని తాగి .. సొమ్మసిల్లిన దారి పాటల కథ.. లోపల డైరీ ని అదే చేసి.. కళ్ళు మూసి నవ్వుతూ.. ఆ వెనక చీకట్లో ఫాలో అయ్యి .. అంచనాలు వేసిన జరుగుబాటుని చేరదీసుకొని .. పరిమళ పాతకాల నొప్పిని సాగదీసి.. ఏది కనుక్కొన్నామో అది చెప్పుకోగలమా?

భాషణల బయట వరద ఏడ్చిన సముదాయ మండలంలో ఊగిన కునుకు కథని జోడించి.. కసి పూనిన వేడుక తనది కదాని ఒప్పుకొని.. దగ్గరా కాదు.. దూరం అసలే కాదు.. అదే సత్యమని నమ్మక పోయిన .. ఆయాస సత్యపు ఆవేశంలో ముంచి .. రంగు వలయం పేర్చి లాక్కొని మాయా పేటిక .. సినిమా

చెమర్చిన కలతకి తట్టి లేపిన దేహ రుణపు పట్టుని దులిపి కాపలా పెట్టుకొన్న చాల దూరాల మధ్య కూడిన ఒప్పంద నిరూప స్పర్శ మైకం కమ్మిన కల.. ఇది ఆగిపోక ముందే మొదలై.. కదిలే నిరూప జాజడిగా దూసుకు పోతున్న పట్టుని పట్టుకొని.. కళ్ళకి ఆరడి చేసిన దుఃఖంలో ఒరిగి..

అదే నిశ్వాస గమకత పట్టి రాల్చిన నిద్ర ఖండంలో పడి .. ఓలలాడిన కంటిని తోడుకొంటూ.. ఋణం బిగిసిన కథగా గర్నరై.. చీలికని దుఃఖ గుండ్రల్లో ఆమె తిరుగుతూ.. ఏక వస్త్ర లయలో .. చాటు చూపులకి లొంగిపోయే దేహ కుంపటి … నిద్ర ఉరుములు చేర్చి మండుతూ.. నీటి పరిధికి చుక్కనీని పట్టుకొన్న దేహ సత్తువ కదిలి.. ఒప్పుకొని లాలాజ తీరుల ఋణం కరిగిన గుడి ముందు కూలుతూ..

కనబడక .. నిద్రని ఉపక .. చలన గొంతు రాగాలకు రమించిన కంటి చివర చూపు పండిన మూడు రాత్రుల వరద.. మళ్ళీ కనబడని ఇల్లు.. వెక్కిళ్లు పడుతున్న నీటి కునుకులో కొట్టుకు పోతున్న శ్రద్ధ కలుపుకొని.. మరింత పైకి కూలిన కొండల నిషారపు మెలిక..  

వాడు రాదనీ అనుమానం కొంచెం ఉన్నా .. కాదనలేని నిస్సహాయత గట్టు తెంచుకొని.. నది వంతెన రైలింగ్ పై సగం వంగి… కొంచెం తెలిసిపోతున్న .. కొంచెం అడ్డుపడుతున్న .. తెగాల్సిన శ్వాస వణుకుతున్న  

 అతను కిందిగా వెళుతున్న పువ్వుల పడవలో పడ్డాక.. మళ్ళీ పుట్టుకొస్తున్న దేహ ఖనిజాల ఓగూర్పు అరగదీసిన కునుకుతో పండి..

………………………….

ఎవరో చదవ కలిగిన నుదుటి కూర్పు.. విప్పేసుకొన్న చేదు రుణాల పోటుని పట్టి దగ్గర చేసుకొంటూ.. సాయమడిగిన సంతులీన కథకి… చెప్పుకు పోవడానికి లేని చీకటి లెక్కలు.. భరోసాలు కూలే సర్దుబాట్ల మధ్య సగం నిజం చెప్పుకొన్న కౌగిలి పాటని కాల్చి.. జిలుగు జాడలు విప్పి విరబోసుకున్న మైల మూర్తులు.

తన వంతు మలుపుని కట్టి.. వేరే అతనితో ఉండిపోయాక.. నేను తనని కలిసి.. నేనలా చేయనని చెప్పినా .. తను నమ్మలేక కాదు.. అమ్మకి కాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజి .. వదిలి రాలేను.. అతనికి తెలిసిపోతూనే ఉంది.. ఇక మరోలా నిలదీయడానికి లేదు..

ఎందుకిలా .. సినిమా వదిలి పెట్టిన రెండు రుణాల పట్టుని దులిపి కదిలే చావు బరువుని కప్పిన చీకటిలో తిరుగుతూ.. హద్దుని కాలచిన ఆవేశ చతురస్ర కీడుని వడపోసిన కునుకు.. ఎప్పటిదో .. నిద్ర అర్థమానపు గుట్టుని తోడి.. కలత కూలిన కథని జార్చుకుని.. పీడన మోసిన గదిలో ఉన్నా కాస్త కదలికనే వదిలి..

ఎప్పుడైన కూడదానికి వస్తానన్నా.. అది నాకు మరో నరకం.. పుండు పై పెంకు కట్టే లోపు మళ్ళీ కెలకడమని.. గుక్క పట్టి ఏడుస్తూ.. నిండు రాత్రి వదిలిన అడుగుని దాటుకొని.. ఇంకేం చెప్పుకోక ….

 కొండల్లో ముగ్గిన సాయంత్రం చూసి.. మందులు మింగించాలని.. వెనక్కైనా చూడకుండా పరుగు.. సవరించిన వివరాలు లేవని.. దుఃఖం చెదిరినప్పుడు మరో పోలిక వదులుకొన్న ఛాయావి పోసుకున్న కథలో పేరుకున్న చెమ్మని ఊదుకొని .. చెప్పి చూసిన ఏక సంధికి రొప్పుని కట్టి..

…………………………..

నిరాప్త చిక్కుల్లో పడి .. కథ దొరికిన వీధి మొదలులో .. తనని మార్చేసి .. పొగరుని సగం వదిలేసిన కంట్లో బెదిరింపుని శుభ్రతని నులుముకొంటూ.. పడి లేచిన శ్వాస జడల అల్లికని వదిలి పెట్టి.. పూనకాలు.. నీటి ఋణం పట్టుకొన్న దోసిలి గడువుని కొల్చిన హద్దులో పడి… తలమునకల కెరటాలని జోడించి .. హద్దుని లేవదీసిన కంటితో జారిన మెట్లని తీర్చుకొని..

బిగువుగా వెలిసిపోయిన అనుకరణ రీతుల గుట్టలో పడి .. కనిపించకుండా పోయిన గోడలని దాటుకొని.. నులిమిన భయాల గుండంలో ఊగిన చర్యల ఏక చలిత ప్రాణ సహాయపు గండం. రుణాన్ని పట్టించిన దీపం .. ఒరిగిన పడవ గూడులో.. శ్వాస ఇంకా కదులుతూ.. చేతి ఏటో చూపించి ఊపుతూ..

మంద్ర నిరావధిలో చల్లగా కదిలే కథ .. వరద గొంతుని నొక్కిన కలబాటు చూపుకి పక్కగా పండిన తెల్ల జుత్తుతో చీకట్లో తప్పుకొని.. వెనక మండిన గంధపు శిలని నీటిలో ముంచి.. చెదిరిన భయాల గుట్టుకి తెరిచిన కంటిని వదిలి.. నులిమిన కక్ష్యల్లో పడి.

సమయ నిధి కూరుకు పోయిన విగత కేకలు .. వదలక పట్టుకొన్న శరీర చిత్రాల యాసటని తప్పించి.. హద్దుని కురిపించిన చివరి గోషాకి పట్టుకొన్న నడక.. ఒకరికొకరు ఏదో వద్దనుకుని విడిపోయినా .. ముళ్ళు గుచ్చిన శ్వాస కలని ఎగదోసి.. చావు గడపపై కాళ్ళని కాపాడుకొన్న రాక వదిలిన దూరాలు.. జాగ్రత్త తెలియని ఆయుస్సుని కలుపుకొని..

ఎలాంటి కన్నైనా ఉండిపోని చీకటి బజారులో.. ఆమె తనని తను అమ్ముకొంటూ కనిపించినప్పుడు.. వీడిన ఆందోళన .. అప్పుడే నేనూ ఒక సంచీని ఆమె పైకి విసిరినప్పుడు.. వెనక్కి విరుచుకుపడి.. ఏ చప్పుడు లేకుండా ఆగిపోయి.. నిరాలేహన .. మూడుసార్లుగా ఉండిపోయిన నీటి ఎద్దడి.. కన్నుకి పట్టిన చెమటని నులుముకొంటూ.. ఋణం పట్టిన ఖాళీల మధ్య కూరుకు పోయిన అసహన కూర్పు ..

నేర్చుకొన్న వివరాల మధ్య కూలిన జడల పెద్ద చెట్టు .. ఊరు మడిచిన కాళ్ళ మధ్య పడకని సర్దుకొని.. సంధి చేసుకోలేని ఉద్రిక్త ధారకు కప్పిన అయత్న కుదింపుని … దగ్గర చేసుకొన్న చూపుల విడిదిని ఏమర్చి గడిపిన శోధనకు తెచ్చుకొని.. గుస గుసల కూర్పుని వాడుకొంటూ.. ధ్వని జిగీస ఏడ్చిన కుండల్లో .. పేరుకున్న చిత్ర కలతలని బూడిద చేసి .. నిల్వపెట్టిన నిమజ్జనాలు.

మహా వినాశనం విప్పుకొన్న విశ్వ రహస్యం .. కదిలే కంటికి రాత్రం అద్దిన బూడిద రాశుల కొండలు.. కొన్ని లక్షల పిడుగుల ముద్ద మింగి.. లోపల ఉంచుకోలేక వాంతి చేసిన విస్ఫోటన చంచల రీతిని కప్పుకొని..

ఆమె లోపలి అలజడి సర్దినపుడు జరిగిన మహా విస్ఫోటనం పట్టుకొని.. అది ముగించానే కథ పక్కగానే .. కారుని అపి.. ఏ పొడుగు ఎడారి కమతంలో .. నిప్పుకొండలని పండిస్తూ..

 ఏదో అడుగుతుంది.. కోపంగా చూసిన అతనేదీ వినలేదు. సమయం అతనిలోని తర్జుమాని.. యురేనియం కూలిన విశ్వ రుణ గతి మోసుకొన్న ధవళ కూపంలో మెరిసిన నిర్జనల మెడ విరిగి..

విసిగిన నిద్ర పీలికలు నొప్పిని కదిలించి.. హద్దుకి రాలగొట్టిన పరిశీలనలు.. విగత గొంతుతో..దీనిని పిక్టరైజ్  చేస్తే .. అనుకూలన పలుకుతుందాని? వద్దన్నట్లే చూస్తుంది.. అతనెలాగూ వినడు .. అనుకున్నదే చెయ్యడానికి వెనకాడడని…

అంతా ఒప్పుకొనే . పక్కుకు తప్పుకొన్న నిరాశ గతికి చేర్చిన కథలని ఊపి .. గుర్తుగా జెండా పాతి,. అంతలోనే తప్పుకొంటారని.. 

కొన్ని చీకటి అనువాదాలు రక్షతి గుణం ఏది.. తెల్లార్లు.. లేదా చాలా రాత్రులు ఏడ్చి.. పట్టు వదిలిన చీకటి ఎడారి గుప్పిన కంట్లో పిలుపుని చేర్చుకొని..

ఇదంతా ఒక యుద్ధ తీర్మానపు గీత .. యుద్ధ తీర్మానాలు అప్పుడు మాత్రమే లాగుతాయి.. మహా శాంతి చలి కాసుకొంటుంది.. షూటింగ్ లెక్కలు … ఏరియా సర్వేలు.. కాస్టింగ్ లిస్టులు.. ప్రీ – అచ్తింగ్ టెస్టులు.. మేకప్ ఒరిజినల్ మోడల్ని అద్దిన కన్నులోకి తెర్చుకొన్న నిశ్చలన కైపుల ముద్ద..

సమయ నిరతి లేని నిశ్వాస చలన ఓడిపోయిన యోచన..

పద్య రాత్రిని మరిగించిన కథలో .. మాయో శీర్శ్యం వదిలిన మెరుపులని కన్ను మోయలేక ఏడుస్తూ.. చూపు ప్రసరించిన రుణ విగ్రహాల ఓడ…

………………….

సామ్య సాధారణకి దొరకని ఒక్కో సెకనులోని మిల్లీ వంతుని కుదిపిన .. శ్వాసితాల రక్షా సముదాయం విస్తరించి .. యుద్ధ ప్రకటన.. ఎవరమూ ఇక్కడ వచ్చి పోయే లెక్కలేని సవరించుకోక .. ఓడిపోయిన నిషధ భూమి లోపల విస్ఫోటక మంతనాలు ఒరిగిన పరీక్ష.. కెమెరాలోకి ఒదగడాన్ని కలగంటూ… ఆమె కనిపించని రెండు రోజుల నొప్పిని .. వేలి కణుపులతో మోసినప్పటి రాత ..

పరాయి నిర్వేద ధూపం ఒలికిన గోళంలో .. చీకటి అనువాద లెక్కింపులని పట్టుకొని .. సమసిపోతున్న భయాల గుట్టలో దిగబడ్డ కునుకుని మృత్యువుకి అప్పగించిన యుద్ధ ఖండంలో..

భయం పరిధికి .. చూపుల ఆవిరి గోళం పట్టుకొని .. ఒక్కసారిగా పేలినపుడు ..లోపల నుంచి కథకి చేర్చిన స్క్రిప్ట్ ని తలలో దించుకొని.. కట్ చెప్పకనే వణికిన నిద్రతో కూలిపోయే.. పార్ధ చెమ్మలపై ఆనుకొని..  కుడి ఎడమల కుట్రని తాగిన కెరటాలని కట్ చేసుకొని.. ఒరిగిన మాయల కుట్రని ఏకం చేసిన అమాయకత్వంతో .. ఇంకా కొన్ని తాళం చెవులు తన దగ్గరే ఉన్నాయని మురిసిపోతూ..

చెదిరిన మంతనాల మధ్య ఒప్పంద ధారల సలవడి ముద్దల గండం పగిలిన కథతో.. కూర్చుకొన్న మసక భూముల ఎడారిలో .. సృష్టి స్తన్య గుర్తుకి దగ్గరగా జరిగి.. అనుకొన్న సగంలో చూపు చలన పట్టి ఇచ్చిన వేద వ్యాక్యమూ .. నిర్ధేశ  చలన కాల్చిన కంపన నసిగిన కాపాలాని వదిలి.. ఆగామిగం .. కన్నుకి పట్టని వెలుగు.. దూరంగా పేర్చిన గంధక కొండలు.. పులిమిన నల్ల గొంతులు వాయు ధార కప్పడి .. చూపు దొరకని ఎదురుదాడిలో..

…………………

 రక్షణకి రెండో చోట మగ్గిన గొంతుని నానబెట్టి.. నిశ్వాస చలన పూడిక వదిలిన కంటిలో దిగబడి.. చెప్పుకొన్న దేహ రుజువు కత్తిరించిన ఎడిటింగ్ టేబుల్… నిక్షణ ముఖాల నిస్సత్తుని కుదిపి.. చూపు పట్టుకొన్న చీకటి పరిధి గుణం మండి .. కెలికిన దుఃఖ చెలమలో .. అదే శాంతికి పునాది కాగలేదనే అనుమానం కెమెరాలోకి లాగి.. రిజిస్టర్ చేయగలనా ? అన్న అనుమానం తో ఆమె లోకి చూసినపుడు.. మోసగించడం నీకు అలవాటుగా? అని .. మరో నిరసన కాలిన దేహ మంధన

అంపకాల సుడిలో చిక్కి .. మాట లేని వివరణ చేరుకొన్న కథకి అటు పక్క ఉండిపోయిన కునుకు.. మీనింగ్ కి దగ్గరైన ఆమె లో చిక్కుకొన్న దృశ్యం తియ్యలేక .. మధించి పెట్టుకొన్న దూరంలోకి కూలి ఏడ్చుకొంటూ.. తేరుకోలేని విసుగుని ఊపుకొంటూ..

చేర్చి పెట్టుకొన్న ఆపదలని జోడించి కదిలే .. నిండు పగకి మరో దారిని మోసిన నిదర్శనాలు… ఆ రెండు రోజులు ఆమె అతనితో పక్క పంచుకోవడమే కథలో మెయిన్ ఎలిమెంట్ .. అదే నిప్పు పుట్టిన రహస్య గోళంలోని సంతుల విపరీతం..

 ఊహించక ముందే .. దారికి తెచ్చుకొన్న  దేహ గనులని తవ్వుకొని.. నిండిపోయిన కునుకుని చేరుకొన్న అవధికి చేర్చిన ఆయాస రేవుల్లో … తెల్సిపోవడంతో ఆమెకి ఏ నిమిత్తము లేదు.. ఇప్పుడు నీతో .. సంపూర్ణాంగా నీతోనే ఉన్నాగా? అదే నిమిత్తం .. అదే అతనిలోపల విస్ఫోటనల పరీక్ష..

………………

పీల్చి కప్పుకున్న తీర్మాన రాజీలు తొల్చుకొన్న జడుపుని కట్టుకొని.. ఒరిగిన గట్ల నన్నుడి .. విరిగిన కవ్వాలతో చిలికిన చీకటి ప్రవాహ నీలం లో … మరింత పట్టు తప్పిన గోళం కూలిచి వేతల సైక్లిక్ రియాక్షన్ .. అణువులోనూ… అతని లోపల దాచుకొన్న చీకటి దట్టాల లోపల బెంగలోనూ..

విస్ఫోట ధ్వని ముట్టడిని భూమి అడుగు పొరల్లోకి పాతి.. ఏడ్చి చేరుకోలేని ఓపికని దుళ్లగొట్టి.. ఒక బంధన విరిగిన దూరపు ఝాములో పడి .. పోలికలేని చీకటికి దొరికిపోతూ.. హద్దు లేని కంటి రాతని .. డిజైన్ లో ముంచి.. అంతా అక్కడికి చేరుకున్నాక … పడి లేచి కెరటాల గతిని రొప్పుకి చుట్టి.. కనుసన్నల్లో అంతా ముగిశాక .. వందల ముందు టెస్టులో పెట్టి.. ఆమె మాత్రం అద్దం ముందు స్టడీ చేసి..

కుదరని గాజు గాలి ముక్కలు.. ఇంతకీ పట్టు దొరకని ఆమె లోపలి మాట.. దృశ్యాన్ని అలుముకోలేక పోతున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఉరిమి మీద పడ్డ చావుని శపిస్తూ… కలవలతల గుట్టుకి ముగ్గిన భయంలోని .. దూరపు గ్రహణాలు పోసుకున్న సుడిలో .. సర్దుకోలేని నల్ల పొగల ఒడి.. అక్కడే నిద్రకి మోకాళ్ళపై కూలి..

విపరీత అనునాద నాశనంలో పడి రూపు తెలియని వరద కమ్ముకొంటూ.. శేష దీపం మరిగించిన కదలికనే కంటిలో ఉంచి.. కప్పుకున్న నడకలా మధ్య కూరుకు పోయిన అసహన ధారత..

ఇలా అనుకోక ముందే విచ్ఛిత్తి సంకెల ఒడిసిపట్టిన మహా శక్తి స్థావరం .. మృత్యువుల మహా స్వరం కలిపేసుకొన్న కేక.. విశ్వం చేరదీసుకొన్న నిద్ర విరుగుడు గొంతులో పడి .. దిక్కు తెలియని విశ్వ రక్షకి చేర్చిన కథతో .. మొత్తంగా చుట్టిన స్క్రిప్టుని సీక్రెట్ ఛాంబర్లో డిస్కస్ చేసి..  బయట పొక్కడానికి   వీల్లేదని అగ్రిమెంట్ చేయించుకొని.. పైకి కిందికీ చూసి .. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని

విశ్వం ఎలానూ ఇంతకంటే ముందుకి జరగదు.. చలన ఖీల కట్టిన జోజుల సణుగుడు ఎప్పటికీ ఆరిపోదు.. హద్దుని కడిగి పెట్టుకొన్న నిరాశ రూపతకి చేవగా దులిపిన కంటి చూపుతో .. పొగని మింగించి.. యధాలాప ముట్టడి కాని సైన్స్ని కాచి పెట్టుకొంటూ.. లోపల నుంచి వదిలి బయటపడ్డ .. ఓ రహస్య ధారా ప్రవహించి.. హెచ్చరిక మిరులెట్లుగొల్పాక .. తోడులేని విశ్వపు చీకటి లొంగదీసుకున్న కాపాలాని దాటుకొని.. ఇది తప్పనుకొన్న.. ఒప్పనుకొన్న అంతకు మించిన అవసరం .. రెంటికీ అదే చెప్పాడు.

దేహం వడలి పోతుంది.. డేటాక్సషన్ .. రిచ్ మినార్లస్ .. హోమ్ ఫుడ్ .. ఇంకేవో ఆయుర్వేద రహస్యాలు తడిమి.. కొలిమిలో పండిన సాధ్య భస్మయ గతికి తప్పిన .. కలలకి చేజారిన గుణ అవకతవకలని కప్పి ..సరళ మూర్తిని కట్టిన నిందలని పోసుకొని..

వెళ్ళిపోతున్న నిద్ర గుండంలో పడి .. ముక్కలైన కుదుపుని పట్ట్టుకొని.. లాగి పెట్టిన కథకి దూరం జరిపిన యోచనతో కరిగి.. కొన్ని కనిపెట్టిన నల్ల అడుగుల ఖండంలో మోసి పోయినా కళ్ళని కాపాడుకొంటూ.. శరీర భ్రమణ కౌగలింతని కట్టుకొన్న నిరాధార కదలికనే కనిపెట్టి..

మళ్ళీ చెప్పుకోవడానికి లేని విపరీత ఘాడతకి ఏడ్చిన గంటలోనే.. ఇంకొక సిట్టింగ్..లోపలి వణుకు.. తల్లి పాత్రలకి అలవాటైంటే.. ఇంకా నీతో ఉండే రొమాంటిక్ angle అడుగంటుతుంది,.. సత్తువుల మడుగులో పిండుకొన్న దేహ రుజువులతో.. పెద్ద దుమారపు మండలంలో కూలిన పిడుగుకి .. చేర్చి పెట్టుకొన్న నటనలు.

ప్రతీ కథ నిద్ర ధరించిన మెలకువలో మగ్గిన చీకటి భుట్టో తిరిగి మళ్ళీ కనిపించక లోపలి అరుచుకొంటూ.. ఇదే కథకి కావాల్సిన సరుకు అని ఎగిరి మీద పడి.. బయటకి చేర్చిన అడుగులు .. సాఫల్య కంపనకి జోడించిన ముతక మాటలు.. ఇగిరి పోయిన కునుకు.. ముద్ద కట్టిన గొంతులని పిండుకొని..దేహపు ముహూర్తపు చందన పూతలు..

ఎలాగో ఉండిపోయిన నడకలని.. వేసవి శిబరంలో కూలబడిన కునుకుని కాదని.. కంపనకి రెండో పక్క చీకిపోయిన దుప్పటిలో చుట్టుకొన్న చిరాకుని అల్లుకొంటూ..

నటనకి పెట్టుకొన్న అంచనాలని దాటుకొని.. హద్దులతో తోడేసిన పునః ద్రోణుల్లో … ధ్వని స్వఖాతం కూల్చుకొన్న నిశీధి ద్రవ యోగంలో పడిపోయిన కట్టడి..

కలుపుగోలు రాతలతో..తోడు విదిలిన కంటి తీరులు.. అల్లుకున్న సమయ నింపివేతలని కంగారుని .. ఉడకబెట్టిన వణుకుని వదిలేసి..

………………………..

అతను మళ్ళీ ఏదీ చాటుగా ఉండనివ్వడు .. చెప్పేది ఒక్కసారే.. మళ్ళీ అడిగిన ఇక కనిపించదు.. అది డ్రగ్ aadictors ఎక్కువగా వచ్చే  క్లబ్ అన్న వినడు.. అక్కడే బిర్యానీ తినాలంటాడు.. మంగళ శాప ద్రోణుల్లో కూలిన మహా దర్శనకి కప్పేసిన సమర్ప పొడిని దులిపిన రక్త కారక మందనలో కాళీ.. రుజువులేని సావకాశ నిలువుల రాతని కరిగించి.. వెళ్ళిపోయాక

ఇలా తెల్లార్లూ .. నీతో తిరిగి బల్క్ సర్కిల్స్ వస్తే.. మళ్ళీ నువ్వే రిజెక్ట్ చేస్తావు.. కాని నీ దగ్గర తనానికి బానిసని.. రుణ కప్పివేతలు కరిగించిన ఝాములో  ద్రవ రూపకాలతో పోతపోసిన వణుకుని మోసుకొని.. తీర్చి పెట్టుకొన్న మంగళ ముహూర్త కంపనకి .. కూడా ఉండిపోయిన పోలికలతో.. ఋణం గడించిన చీకటి నిల్వలని గడ్డ కట్టిన చలిలో వదిలి .. రెండో పక్క కూలిపోయారు..  

పడిపోవడం .. లేవడం కాదు.. ఇక తిరిగి రానిదిగా .. ఆ మెరుపు ఉన్నప్పుడు.. ఉరి పోసుకోవడానికి ముందు రాత్రి నీతో గడిపి.. ఇక శెలవు .. అనుకోవడమే.. సగం తీర్చిన కన్నులోకి కెమెరా దూకి .. మసి పూసిన కునుకుని పట్టుకొన్న జాజర మూర్తుల శైవాల్య కూపం..

విశ్వం ఒరిగి పోయిన ఛాయా చలన మంద్రతని జార్చుకొన్న నిమిత్త రాశుల కుట్రకి .. జోడించిన అనుభవం కప్పిన ఓదార్పుని తిప్పుకొన్న ఉరుములు.. సమయం పట్టి తెచ్చిన అనులోమ వికర్ష ఎక్కుపెట్టిన కదలికనే కడిగిన అంచులపై .. తుడిచిన నుదిటి భాషణ నొక్కిన అతని చేతులు..

……………………..

భయం కురిసిన చాటుగా .. మంత్రం స్థలం లేని జోడు బాధని కుదిపి .. మరిన్ని నిద్ర భూతాల కౌగిలిలో నేసుకొన్న ముఖాలు.. చెప్పిపెట్టుకొన్న విలోమ ముగ్ధ…. దండ గుప్పిన చీకటి వాసన…

 ఒప్షన్స్ ఉన్నా … అతను మళ్ళీ అదే చెప్పడానికి వస్తాడు.. కుర్చీలు తీసేసి నిలబెట్టాక ..ఓ రకమైన సిగ్గు.. ఏం అడగకుండానే .. అంతా అర్థమైనట్లేగా అంటాడు. కొంచెం ఒప్పుకొని.. ఒప్పుకోక .. ఆ మేజిక్ నాలో పలకడం లేదని నిష్ఠూరమాడి.. కంటి దాచిన చీకటిలో తప్పిపోయి.. రుణ కలకి జాడని తప్పించిన కంటి చివర మెరిసి..

నిరళీనా దేహ పునీత దీపాలని కట్టి .. తేదీలు లేని సావకాశం ద్రోణుల్లో పడి.. నిలదొక్కుకోలేని .. సాయుధ్య మర్మాన్ని కడిగి.. లోపల కూలిన చూపుల గుండం.. సమయం మళ్ళీ వినాలనుకొని నిద్ర రాయించిన ధూపాలతో కదిలి .. అక్కడే చతికిలబడ్డ పెద్ద కేకల మృత వలయాన కూపాలు.

స్క్రిప్ట్ కొన్ని చేంజెస్ మారిన ఆమె కొలతలని  accept  చెయ్యరు..తెలిసీ రిస్క్ ఎలా తీసుకోగలం.. పాత్ర means  ..It’s a strong biological expression and extend the thought ..  నటన  secondary..

పురుష చితి ఆ లోపల కాలుతూ.. వదిలిన లోపలి కంగారుకి మొదలైన చీకటి తొలచివేతలు.. విపరీత బిగువుని పగలగొట్టిన దేహ నీరుల మంటల వేడిమి..

……………..

అదొక శిధిల భూమి .. వందల దశాబ్దాల వెనక కథ .. వాన గుట్టు నేరుగా పట్టుకొన్న కొండల మధ్య కదలాడే దాగుడు ముంపు.. అవకాల నింపుడు … మాటని దగ్గర చేసుకొని కప్పెడతారు…

విపరీత సంధి సూత్రపు కన్నుని కాపుకొంటూ.. తప్పి పోయిన రంగుల్లో ముంచిన అడుగు రాతల గుట్టుని పట్టుకొని.. ఇంకేం తెలియని మాటకి … మూత పెట్టిన చప్పుడుని కట్టి … అద్దిన కాళ్ళ పట్టుకి వేలాడిన సినిమా గోళాలు.. Boxoffice  లుకలుకల్లో పడిపోయిన నిద్ర రాజీల వణుకుని చేరదీసి.. అమాంతం తోసేస్తారు.

ముసిరిన ఛాయా వర్ణ కలకి పెట్టుకొన్న బొట్టుని కాపాడి.. నేసుకొన్న కథల విపరీత ముద్రాల్లో.. కురిసిన చీకటి చెప్పిన కంటిలో పడి .. ఊపిరాడని సాయుధ్య చెలన మరిగించిన ఆందోళన..

చేర్చి పెట్టుకొన్న పరాయి గంభీర రుణాలని కట్టుకొన్న ఊరటని మింగి.. తాళ్ళకి కట్టిన రుణ తంత్రపు ముట్టడిని దాటుకొని.. ఇగిరిన చూపులోంచి ఏం అనలేక.. మళ్ళీ కనిపించరు

శిధిల ఆయుజ్య సమేతపు పుట్టుకని వదిలిన కంటిని ఉడకబెట్టి .. నిలబడి కూలిపోతున్న .. చలన మంద్రతలని కాపాడుకొన్న దీపం మోగిన హాలులో పడి.. చూపు విడిచిన వీధిని తాగి.. ఎవరు ఎన్ని చెప్పుకొన్న విడిదికి దూరం జరిగిన కక్ష్యల్లో పోతపోసిన చీకటితో బొమ్మలు చేసి..

ఉండిపోవడం మరేం కాదు.. షీర్శ్య ధ్వనికి చేర్చిన మసక భూమిలో కుదుర్చుకున్న నిద్ర ముఖాలని చల్లారబెట్టి.. మాట చెల్లిన కన్నుని పట్టుకొని.. రవ్వల రవ్వలుగా రాలుతున్న చీకటి అనుగ్రహం లాగి పట్టుకొన్న నిరాశ చిత్రం వదలిపోయాక.. కట్టి పోయిన నడకకి నేర్చిన మాటలు.. అద్దకాలు.. రంగుల తోపు.

 అదే చెప్పలేను కొంటాను.. ద్వజీన లయం.. ఆకస్మిక శరణు తోడైన మంగళ హుతి.. చెప్పుకోవడానికి   ఎవరూ లేరని.. కందిపోయిన చూపు చుట్టూ కలవరం చనిపోయిన నడకని దాటుకొని.. ఇంకేం కాని నా అభయ స్థితి సమాధిని కడిగి.. ఇక ఉంటానని..

సగం మాసిపోయిన సమయ రాద్దాతంలో పడి కనబడని కాలివేతని దాటుకొని.. అమాంత దేహపు పొరపాటుని పట్టుకొని.. ఉండిపోయాక ఇక కెమెరా వెనక నుంచే చూడాలని .. అతని ఇష్టాన్ని దూరంలోకి నెట్టి .. పగిలిన కథలోకి నేసిన బట్టని చుట్టుకొని.. అవసర జరుగుబాటుని కూల్చిన ఇంటిలో .. పేరుకు పోయిన చీకటి వలసని చేరుకొన్న చేదు మండల మూర్తులని కప్పుకున్న నిద్ర వీధులు..

…………………………

ఎట్లా … ఈ పగిలిన పొగల శరీరాన్ని కుట్టుకొనేది.. నీ ఆసరా లేకుండా.. సాధ్య నిర్ణయ సంధికి వికార చప్పుడుని అంటించిన మోసపు కుదుపుని .. విడదీసిన రక్షా నేరపు రక్త మడుగులో … చెలరేగిన కంటి యాత్ర కుదిపిన ఆయుధ బావులు..

ఈ కదలిక ఎండిపోయి .. మాట కలిసిన కంటి పోటుని సర్దుకోలేక .. విసిగిన ధ్వని ఖండంలో పడి మునిగిన దేహ రధం మోసుకు తిరిగిన కునుకుతో.. హద్దుని రాపాడించి.. పునాదులని ఎగరేసిన కన్నుకి జ్వరం కమ్మాక .. వినపడని నిద్ర రుజువుని పట్టుకొని.. కాపాడుకోలేని సంధి యత్నపు పోరుని కట్టుకొంటూ.. పెనవేసుకున్న శరీర రాతల కైపుని పట్టి బిగించి.. కదిలిన గొంతులోని ఝాములు కెమెరాలో చిక్కి..

భయాన్ని కలిసినపుడు కమ్మేసిన దేహ తంత్రుల దగ్గరలో తోడి పోసుకున్న రుణాల బరువుని చంపిన కథ… అలా ఇదొక చోటులో తప్పుకొని .. దారి ఇవ్వాల్సిందేగా … అలా చెప్పుకొని వెళ్లిపోయిన లయం .. కలబడే నిద్ర గ్రహణంలో ఊరేగే చింతనకి సవరించిన కుదుపుని వేలాడదీసిన రంగు మారకాల ఊయలని కట్టుకొని..

దారి మళ్ళిన కారణాలు కథలోకి వాలి… రెండు రుణాల బరువు ఊతాన్ని తాగిన నిరాస్తిత కంటి మూలల్లో పడి పోలిక దొరకని అలసదట.. కలుసుకున్న చీకటి నివాసంలో.. నీ పోలిక దొరకని గొంతుని పట్టుకొని నేను కూలిపోయాక .. ఈ కథకి రెండో మలుపు లేని కరకు తాబేలు దగ్గర ఓడిపోయిన సమాధి..

………………………

ఇదో  లలాయీక .. పోల్చి పెట్టిన శ్రమ .. కదలని ఓపికతో కాల్చిన చీకటి పైన కూలిన సమాధాన రంగుల ఎండ పట్టుకొని.. కప్పుకున్న నిద్ర గతికి చేర్చిన కాళ్ళని ఊగించి.. ఉండిపోవడానికే భాగాలు పంచుకున్నాం .. వేసట తీర్చుకొన్న కంటిని తుడిచి కప్పేసుకొన్న నిద్ర వీధుల ధూళిని పోసుకున్న స్నాన చర్యల ఊతాన్ని తోడుకొని.. ఇంకా ఉండిపోయిన స్థలాలని కట్టుకొని.. వెంటవస్తూ..

ఆహభంగర చితి లయనంలో ఊపేసిన హద్దుకి పోసుకున్న కునుకుని వడపోసి ..ధ్వని పోటు.. రొప్పు గజ గజ లాడుతుంది.. ఇక నీ చేతుల్లో ఏం లేదని ,. వాళ్ళు మళ్ళీ చూద్దాం అన్నారంటే .. ఇంకేం లేనట్లేనని మాటని వంచుకొంటూ.. భ్రమణ మర్మం కాల్చిన కాపుదళాల మధ్యనే ఆగిపోతుంది.

నిలబెట్టి .. కలిబెట్టి.. కరగబెట్టి.. సంతులీనాల కాపుదలకి నీరు పట్టి.. మైకపు నీటి అల్లుని జోడించిన కంటి శ్రమని దూరం చేసుకొని.. మసి పూసిన నిద్ర వేవడి ధూపంతో మునిగి.. పరిధిని కట్టుకొన్న చీకటి నివేళపు ద్రోణుల్లో .. ఏకం చేసిన చీకటి నివేశపు కణతులని జోడించి.. కరగబెట్టిన శ్వాస గ్రహణం చీకటై.. ఇంకేం లేని కదలికలు ఊగిపోతూ..

హద్దు మార్చిన కంటి శ్రమని మోసుకొన్న వీలుబాటు.. చుక్కలు చెరిపేసిన కునుకుని పెట్టుకొంటూ.. పాతి పెట్టిన కాపలాలకి కురిసిన వాన గోళంలో పడి దొరకని ఆనవాళ్లు.. సంధి సాకల్యతకి కూరుకు పోయిన నిరాశ ధునిని కట్టి .. పాడైన నడక చివర భూమిని కమ్మేసిన వికార నిందకి చేరగిలిన ఆయాస దర్శనని మించి వెలిగిస్తూ.. పట్టుకొని ఉండటం ఎలాగో తెలియక….

పారబోసుకొన్న నిద్ర సవారీలు .. మోసుకొన్న కథల దూరం లో ఒబ్బిడిగా సర్దిన పేజీలు.. ఇక ఈ project   అటక ఎక్కినట్లే … లోపల బయటా కాని దేహ ఋణం బరువెక్కి .. మరింత చల్లార్చిన తొడుగులని కప్పుకొని.. సమాయాశ పడుతూ…. విల్ టేక్ లేటర్ will talk later  అనే మైదాన కలుగులోకి దూరి.. నిద్రకి కనిపించక

సత్యమని తెర నిండుగా పర్చిన కలని తాగి.. అదే దేహమని నమ్మే అద్దాన్ని పగలగొట్టి .. పొగల రేవులో దిగబడిన తనని గుర్తుపట్టలేక ..  మెథడ్ ఆక్షన్.. తానే ఆవహించిన ఉద్రేక సమాధికి మోసుకొన్న రెప్పల బిగి రాలత.

నమ్మకానికి చుట్టిన అయోమయ నిర్వచనంలో పడి… దుఃఖ నిలువుల్లో పాతుకు పోయిన మంగళ శేషి నింపుకున్న మహా వర్తన చర్యల కొలువుని సగం వదిలి.. నిఘానీ తంత్రుల నిర్జన గొంతుని కలిపి చేసుకొన్న ఒప్పంద తీర్మానాలని వదిలి పెట్టి.. దుఃఖం కనిపెట్టిన నిశానీ నడకల మసక చూపు..

సమయ గడింపుని దూరం జరుపుకున్న నిద్ర వర్తన క్రియల ఆయుస్సుకి చేర్చిన కొలిమిలో చీకటి దులిపి.. సాధారణ తెరల నల్లని జంకుని కోసే చేతులతో తీసిన భరిణెలో పాము… పై నుంచి వేలాడే కంటి సరదాకి పోసుకున్న వినికిడి రాత్రిని కలిసిన శత్రువు కాచుకొన్న స్మశానంలో .. దీర్ఘ శత్రువు విప్పిన కీ ని తిప్పుకొని.. నిరశిత దేహ రొప్పుని పగలగొట్టి.. దూరం చాపిన చావు.

శ్రుతికి చేర్చిన కథలని వద్దని .. పల్చని పొగ పండిన మాటలని పోగేసుకొని.. అక్కడ ఇంకేదో నటన కొత్త దిశని ఏమార్చి … వెనక దట్టించిన కథ .. కెమెరా దూరమైనప్పుడు పెరిగిన అసహనమూ.. దేహ తీరికని ఒడిసిపట్టి.. కళ్ళలో కూరిన భయద రాత్రం చెప్పిన ఓటమి కథలని దగ్గరగా చూసి.. కోలుకోలేని నిస్సత్తు తాకిడిని కప్పుకున్న .. విసురు మంటల కలతని దాటుకొంటూ..

……………..

సగం జాడ.. సగం నిర్ణయం కాలిన కథ .. అతని పెదాలతో ఎంగిలి పడుతూ… సంధికి నిలబడిన వెకిలి చూపు గరికి రుద్దుకొని.. ఎక్కడో వేలాడుతున్న కొండ ఏడ్చి.. ముఖం తిప్పుకొన్న నిరాశీత కంటి నమూనాలని వదులుకొని.. పోత పోసిన దుఃఖ నివారం … విసురు మంటల కలతని దాటుకొంటూ.. నిద్ర విరాగి కనిపెట్టిన కళ్ళకి వెచ్చ చేసిన చీకటిని జార్చి.. పడగలు విప్పిన కళ్ళకి తొలచిన హద్దుని కడిగి.. చావుని దాటించి .. పైకే కూలిన విపరీత సాయుధుడి కల…

నిప్పు పండిన విరుద్ధ ముఖాల విడిచిలో .. అర్ధ రాత్రి తాగిన పొడి నీళ్ల గలుసుని బోర్లించి.. అద్దం ముందు .. ఏక వస్త్ర చాలన .. కట్టి పోయిన నిర్యాణ కంటి పొద్దునే కడిగే విపరీత మాటలు.. సమ్మతా తెలియని ధూళి కొండల్లో పుట్టుక తెలియని రుణాల బరువు..

భయ నిఘారం … కాని పెట్టి తెచ్చుకొన్న దేహ సలీల మంటని కట్టుకొని.. నిశ్వాసితా కంటి నమూనాలని పోత పోసిన కరగమోతలు అల్లుకొని.. పిడచ కట్టిన మారకాలని తుడిచి .. ఎవరో దగ్గరగా కదిలిన నటనలు.. ఛాయా మెరుగులతో.. పేరుకున్న ఎండని పోసుకొని .. మెత్తని శరీర కేంద్రంలో .. పూర్వ కథల  నటనని వదిలిపెట్టిన వీధిలో … లోపల గదిని ఇసుక పోసుకున్న ఒంటరితో తోడుకొన్న మాటలు..

అదే ఊరు.. మాంస ధారణలో వదలిపోయిన నులినొప్పి.. కాపడం పెట్టుకొన్న చూపు…పికిలి పోయిన చిత్ర మండల జ్వరంలో పడి ఊరేగి.. ఎంతమంది .. తిట్టినా వదలక కోలాటపడుతూ.. పట్టి ఉంచిన బిగి నిర్మాణ వదులులో చెప్పుకొని వదిలిన శరీర చూపులు..

………………………….

సంధికి ఒప్పుకొని .. నిశీర్య స్నాన కూలనని జార్చి పెట్టి.. కంటిని సాగదీసి కొసలని పిండిన కునుకుని పట్టుకొని.. చేరదీసిన హద్దుల్ని పెకిలించిన హోరిమి ఘాడతని నెట్టుకొంటూ.. పూర్ణ కౌగిలిని దాటిన కనుసన్నల్లో పిసికిన నలుపు కొండల్లో .. తెల్లబడిన అతుకుల గోడతో.. హెచ్చరికని పసిగట్టిన … సమర్ధ వివశాలని దట్టపు కథల్లో ముంచి..

అదే స్క్రిప్ట్ నా చుట్టూ ఎన్నిసార్లు తిప్పినా … నా దరిద్రం నన్ను ఎంత కష్ట పెట్టినా … అలాంటి రోల్ నేను చెయ్యనంటే చెయ్యను.. ఆ మీనింగ్ అలాగే ఆగదని ,,, కెరీర్ గాడి ని తప్పించి.. పెద్ద కొండని నెత్తి మీదకి విసిరి పాతేస్తుందని తెల్సినా… సమయ నిష్పూరకలని పెనవేసినా కాళ్ళ చూపుని పరీక్ష చేసిపెట్టుకొన్న.. దేహం విడిచిన ఇంటి పక్కగా షూటింగ్ ఏరియాలో తడబడే పూడికలు..

సదా గాధల నిద్ర తురుముని పట్టి దూరం చేసిన కునుకు చెదిరిన కాలనీ ఆవిరితో ముంచి.. మసి పోసిన నుదిటిని జోడించిన మరుపుకి చెల్లిన మాటలని వదిలిపెట్టి… వెళ్లిపోతున్నా ఉండని కక్ష్యలు .. లేవదీసుకొన్న కన్నుని కాదని .. సమయ దీపానికి చేర్చిన జోడు పోలికలని ఒంపుకొన్న నిద్ర గంటలు.

………………………….

తెంపేసి దేహ వివరాలు .. దాడికి దొరికిన ఒత్తిడి రంగుల త్రివిధ నిద్రల శరీర నిడివిని సాగదీసి.. ఒద్దికగా పరాధీన కలతకి పట్టిన ఉనికిని కడిగి.. దేహపు శిధిల దేహన గడ్డకట్టిన ఋణం .. మోసి తెచ్చుకొన్న పంపక నిర్ధార గోడలని కట్టుకొని..,తప్పించుకొంటూ..

 కంట్లో పోసుకున్న ఝాము మండల రూపధ కుట్రని తోసిన కన్నులో .. వణుకుని ఆరబెట్టి.. పురుష నివేశ చూపుంకి .. మాటని జత చేసిన కష్టంతో .. బయటకు తెచ్చుకొన్న కొండని మోయలేక.. మోసినా లాక్కొని ముందుకి పోలేక..

కాస్త నీరు.. కాస్త వణుకుని పోసుకున్న స్మశాన స్నానం .. పెద్ద గండం దాటినా అవస్థల కైపులోకి పిండిన దేహ వరుసల అయస్కాత చలన…. కెమెరా తాగిన తొడల ముద్దని ఆవిరి చేసి.. రంగు పులిమి.. నాలికని కలిపి కుట్టి.. బొడ్డుని సాగ దీసిన గంటని కట్టాక.. వేరు పడ్డ మంచాల పక్కగా ఏడ్చే సీసాలు..

పురుష గండి.. ఆమెతో మోసపోయిన అతని సీసాల భోగంలో పట్టు జారిన చీకటి కోరలు దిగబడి.. సమయ స్థితి అలుముకున్న ఊపిరి శోధ్యాలని రుద్ది… కలకం చుట్టిన శరీర సాధనకి .. లోపల మిగిలిన కంటి రుణపు పగుళ్లలో .. తోడు పెట్టుకోలేని చూపుల నేరానికి కట్టి తోసిన కునుకుతో.. అద్దిన నెలల బిగువుని మీదకి రాల్చుకొంటూ.. ధ్వనికి అమాంత పూర్ణ తలని దిష్టి తీసిన వాగుల్లో చితి చల్లారుతూ..

కథని కొంచెం ఆపి.. ఇదే అతను.. upcoming కదా కొంత సాక్రిఫైస్ తప్పదు.. ఆమెనీ ఎలివేట్ చెయ్యం.. విలన్ కి కొంచెం ఎక్కువ ఎలివేషన్ ఉంటుందంతే… అదిమి పెట్టుకొన్న చీకటి శాలలని కోసిన రొప్పుకి కడిగిన హద్దుతో.. కేకని దాచుకొన్న చూపులో .. దిగబడిన ఆ నడక కనిపిస్తూనే ఉన్నా.. నాకలా కాదనే ఆశ..

నిషా తరుముని కాపాడే అంచనాల మధ్య కుదిరి .. తప్పుకొన్న కాళ్ళ నిడివిని సాగదీసి.. లేదనుకున్న ఉనికికి మొత్తం ఆరబెట్టిన కంగారుని కలిపి ఉడకబెట్టి… రసాయన మితిని జోడించిన కన్నుకి పోసుకున్న వెగటు నిద్రల కౌగిలిని దాటించి.. పైకి చేర్చిన చలి మడుగుల కథల్లో పడి.. వెనక్కి రాలేరు.

స్త్రీ సంనాథ దేహ గడువుని లేవదీసిన శత్రువు… దూరంలో నింపిన ఏక గొంతులు ఖండం.. ఛాయా నిడివి కట్టునోన్న సవరింతని కదిపిన ఏకైక కళ్ళగంతల యేరు… సమయమయంలో .. దోరగా పడిన చీకటిని పోల్చి.. కంటి కింద రాలిన వాన గొడుగు కదలికనే ఉంచుకొని.. అక్కడే తనే లేదని .. వాడు లోపలి సైగ చేస్తూ..దీక్ష కుమిలిన నటనకి మోసిన గంటలు..

ఎంత పాడి.. బెంగపడి.. కూలి మళ్ళీ నిలబడి.. గారడీ చెయ్యని సత్యంలో ఒరిగిపోయి.. ముక్కలై.. చిదిమేసిన చూపుని మళ్ళీ తెచ్చుకొని.. ఎక్కడెంత గెలిచినా చివరకి చిక్కుకొన్న కళ్ళగంతల యేరు … గుర్తు పెడుతూనే ఉంది. స్థితి లీలన కనుక్కొన్న రొప్పుకి .. సాధన మోసిన కంటి బిగువుని కనుక్కొని .. చేదుగా పండిన కక్ష్యల్లో బిగుతు చలిని కాచుకొంటూ.. పెనవేసుకున్న జోడింపుల పొదుగుని పిండి … దేహిత కంటి కొసల్లో చిక్కుకొన్న నిభామిత సాధ్యాల మలుపు..

అదే చెప్పుకొంటారు.. ఆమె గొంతు కలవడం ఇక్కడ అనవసరం.. అదొక చైల్డ్ స్ట్రాటజీ గా ఉంచేసి.. ఎమోషనల్ బ్లాస్టుకి .. రాజు విధించే శిక్షలని అడ్డుపెట్టుకొని.. బిల్ట్ చేద్దామని.. కథకి సింగల్ లైన్ డిస్టర్బ్ చెయ్యకుండా .. ఈ జోనర్ కథలన్నీ ఫిల్టర్ చేసి.. కొంత టెక్నాలజీ మాయ గుప్పించి.. మరింత ఫోకస్డ్ డ్రెస్సింగ్ సెన్స్ని కలిపి …

దుఃఖపు దిశా తీరికని కడిగిన వాన గుప్పుమని మండుతూ… సాధనాల కైపు… సంధికి దూరమైనా దిశా నిరావి పోసుకున్న కలని దాటి .. పైకి చేరి  ఆగిన చీకటి విప్పిన గది తలుపుని నెట్టుకొంటూ.. విదిలించిన వాన కవ్వపు సన్నుడికి చేరదీసిన అడుగుల నిమిత్త కలత.. అదే తనని ఎవరో చెప్పుకోవడం విని ..కబురు  చేరవేస్తారు. సంకెల తాగిన పొడి గదిలోని పోలికల అద్దం కడిగిన దేహ నెమ్ముల దగ్గు.. ఒక సూచికని .. కన్ను తిప్పి వెళ్ళిపోతారు

………………..

ఆమె విసిరినా మత్తు గుండాల వల .. చిరిగినా గుప్పెటలో పోసుకున్న వాన కుంపటిపై కాల్చుకున్న అడుగు నిండిన కన్నుకి .. తూర్పు మైకం కలిపి కుట్టి.. సగం తినేసి కెరటాలు.. ముడి మాల కట్టుకొన్న కొండలని అదిమి .. కళ్ళలో పోసుకున్న చీకటి నివేద గ్రహణ ధూపపు ముఖాలని పట్టుకొని.. నెల బరువు కథలో కూలిన పేటిక .. ఉండిపోవడం.. ఉండలేకపోవడం.. సగం చిత్ర కన్నుని పట్టుకొని దిష్టి తీసి .. వెక్కిళ్లు పెట్టుకోవడం.. అంతా అలాగే

ఆ మూలలో తాను ఓడిపోవడమే ఇష్టంగా దగ్గరై.. ఇంకిని నిద్ర రుణాల కుదుపుని పట్టుకొని.. గతికి ఊడ్చిన రెండు ముడుల చీకటి అప్పగింతలో  దడ రాలిన నింద…. సన్నబడినా .. ముఖంలో ఆ వెలుగు వాడిపోయిందని.. మేకప్ లో రెబిల్ట్ చెయ్యలేం.. బుగ్గలు కొంచెం లోపలికి.. నడుము బావున్నా … మిగతా కొలతల్లో ఎరోటిక్ స్పేస్ లేదు..

ఉండిపోవడమనే నిద్ర కలతలా తెర నిండా కమ్మిన పురుష వాసన.. చేతులకి చుట్టుకొన్న చీకటి నలతల వణుకు గుట్ట చేసి .. సగం పంపి డిలీట్ చేసిన మెసేజ్.. నిజం కవ్వించినా కంటి చివరకి దిగిపోయిన చూపుల దడని వడపోసి.. నించొని కూలిన అడుగులకి కట్టు చుట్టిన మాటని చేర్చి..

కథలని .. నాటక వేడుకల్ని.. జోగు పెట్టిన కాళ్ళకి నానిపోయిన గొంతుల దీర్ఘ రసిని తుడిచి.. ఎక్కువ కానీ నింపాది బరువుల కుట్రలో పడి ఊపిరి ఎత్తుగడని మోసిన కుట్ర.. ఆయుమ్య సాధకి నేర్చిన మాటలకి .. తడబడే దేహ నలత మరిగిన హద్దుని కూడబెట్టి.. సర్ది చేసుకొన్న అంచనాలని కట్టుకొని.. చీకటి వెలిసిపోయిన చప్పుడుకి చల్లార బెట్టిన మగత బీడు భూమిని కప్పిన మాంసాల మీగడ.. గుప్పుమన్న వాసన..  ఎవరో ఖచ్చితంగా మాత్రం దొరకలేదు.

………………….

కళ్ళగంతల నిందాఁకి కరిగిన అగ్రిమెంట్ల  వికారoగా విసిరి .. క్షీనతని నానబెట్టిన కంటిని కాల్చి చెప్పుకొన్న దోషాల మధ్య ఊపి.. సంచార్య దీపనలతో.. పెనవేసిన కునుకుని వద్దని .. పొడుచుకొచ్చిన నడకని పట్టుకొని..ఖాళీ నిద్రల కొరకంచుని ఎర వేసిన పట్టుతో.. నింబాళించిన పెద్ద కొండల బలుపుని అరగదీసి.. కొండల్లోకి జాడించిన దుఃఖ స్థిరణ తీర్మానం పసి గట్టిన చావుకి దగ్గరగా ఆ నవ్వు.. వదిలిన కొంచెం కొసల విగ్రహ దూరాలు.. కెమెరాలని దులిపిన గుస గుసలు….

సగం నాదని .. సగం నీదని పట్టు తెంచుకున్న ఇరుకు నిందల కౌగిలో పేరుకున్న చీకటి అనునాద కూపాల్లో పడి రూపు ముడిచిన ముఖాలు… నిషాయమ దేహ సాధకి నేర్పిన కథకి దూరం జరిపిన కథని చూసుకొని.. ఆ దూరంలో ఉండిపోయిన కన్నుని లాక్కొని.. విడిది మండల బరువుకి కదిలే చీకటి పొందకని కలబెట్టి..

సర్దిన సమయ దృష్టికి .. సగం పీల్చిన చావు బరువుకి.. కాగబెట్టిన కునుకు పట్టుని తోడుకొని.. నీరు పట్టిన కంటిలో తెల్లబడిన మెరుపులా … కెమెరాలు కూలిన చలి మడుగులో .. చిత్రిత జ్వరం కమ్మిన నివేశ హద్దుని సాగదీసి ఏడుస్తూ.. ఋణం ఉంచుకోని ఇక్కట్లని జోడించిన మహా హేళన..

ఎవరమూ దగ్గరగా రాలేమని .. మసకగా ఉండిపోయిన దేహ షరతుని కదిలించే కూపాల మంటని ఎత్తిపెట్టి.. రుణపడని ధ్వని పేర్పులో మోగిన మాటలు.. వింటూ ఉండిపోవడానికి.. రికార్డెడ్ గా ఉండడానికి మోసిన బీఫ్ లని కనిపెట్టి.. విరుచుకు పడే లోపు.. చెప్పి పెట్టుకొని.. నిద్ర యుగాల సంధి ఊర్థన మోసుకొని.. కూలిన పునాదులకి చేర్చిన అనుకూలన దర్శిత ముఖాలని పోతపోసుకొంటూ… రుణ సంయుక్త లేని కప్పివేతలు

…………..

అన్ని పాత్రల మధ్య పాత్రలని వదిలిన వీలునామాల బయట .. జాగ్రత్త చేసిన సమాధి కబురు చేరాక ముందే.. కదిలే చూపు నిడివి పెద్దది కాక .. సరళ మునుగల గండం పీల్చిన కాటుక ఏరులో .. కాపాడిన ఒడ్డుని తవ్వుకొని… ధ్వని శాసన కప్పిన గోడలని ఊపుకొంటూ.. మరిన్ని కలల పోటు..

వేరుపడ్డాం .. దేహం నిర్జించిన హద్దుని కాదని కప్పుకున్న చీకటి నిడివిని సాగదీసిన అద్దాల దుప్పటిలో .. మోగిన నవ్వుని తీసుకొన్న ఒంటరి దోసిలి ఏడుస్తుంది.. అదే కథ .. ఇంకెవరికీ పంచుకొని.. నియమిత దేహ సంధికి మోసిన కన్నుని జరిపి.. కలబెట్టిన ఊరుకి మళ్ళీ వెళ్ళడానికి ఆగని రైలు.. మంచు కొండలు కప్పిన గుహలు.. నిప్పుల ముంపుని పైకి చేర్చిన కంటి రాతల్లో కాగిన నిందల కనుముప్పు.

చెప్పుకోవడానికి వీలుకానిది తనతో ఉందని.. జోడించిన ఖాళీల మధ్య కన్ను పోసుకున్న చెమటని ఊదిన దేహ గంధపు కూపంలో వాసన.. ఉంటాలనుకొన్న ఉండనివారు.. కలిసి రాలేదు.. కొంచెం కీడు మోసిన వెన్ను.. శరీర మెరుస్తున్న . ఓ శాప ఛాయ కమ్మేసిన దూషణ హద్దులో పగ.. ముఖం మీదే చెప్పేస్తారు..

అవసరాలు మారుతున్న మారకాల యుద్ధ నివేహ కరకు చప్పుడుని నానబెట్టి.. కంటి చూపుకి సమయ నిరతిని కూర్చిన తొణికిసల ఊతంలో మోసిన పడవల గట్టు. మాట తప్పిన నిద్ర రాత్రుల్ని విసిరి కొట్టి.. ఢీకొన్న చోట చెప్పుకోమంటారు.

ఆమ్ల దారుడి నెపాలు .. కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదని.. నెక్స్ట్ టైం బెటర్ లక్.. అని.. కొన్ని చిల్లర  నోట్లు చేతిలో పెట్టి… కార్ ని అసిస్టెంట్ ని అక్కడే ఆపేసి.. కలిసిపోవడానికే నిలబడి ఉండిపోయిన కలత నెలని .. కాపుగాసిన తీపి రంగుల మాసికని తుడిచిన వీధిని కమ్ముకొంటూ.. పేద చెవిన పెట్టినా కాటుక పూసిన పేజీలని చింపేసుకొంటూ…..

ద్వయ సగంలో ఊరట లేని గుంభన తగువులు.. నీరు కట్టిన కలతని పట్టుకొని.. దేహ సమ్మతికి మాసిపోయిన నెలలని బరువుగా లాగి.. చిత్రాల కంపుకి చిక్కిన చూపుల నిడివి.. … సఫల పూర్ణతకి నెట్టుకొని .. ఉండిపోయిన చీకటికి తొలచిన మాటలని దాటుకొని.. చెప్పి పెట్టుకొన్న నీహార ముఖాలని … అడ్డుకొని .. నిలిపేసిన కంటికి చేరదీసిన భయాలతో అద్దిన ఎర్రబావుల కన్నుని రాల్చుకొని….

తల పట్టుకొన్న నిద్ర భయం కమ్మేసిన కదలిక ఒరిగి … అదేంటని చెప్పలేం.. అతను దగ్గరకి జరిగినప్పుడు .. నొక్కి పెట్టలేని జుగుప్స కదులుతూ.. సమయ నిచ్చెనల విడుపుని .. ఒరిగించిన దేహ చలువుల పూనకపు ముంపులని కనుక్కొని.. విప్పి పోసుకున్న పెదాలని దడ దడ లాడిస్తున్న కసికి .. పేరుకు పోయిన నిశిత దేహ ముప్పులకి ఊడిపోయిన కథని …

నీరు పట్టిన ఊసులకి .. కూల్చిన రెండు దేహాల పుట్టుకని కవ్వించి.. అరగదీసి.. కాగడాలని దాచి.. సంధి చెయ్యని కథకి .. లోపలికి తెల్లారిన మాటలని సెగకి .. ఊరబెట్టిన కళ్ళకి సాయమడిగిన హద్దులో ఉన్నాక .. చేర్చుకొన్న సేకరణ రుణాలని నింపుకొని ..

చెమ్మగిల్లిన సేకరణ మెరుపుల రాసిత క్రియకి .. నోరు పట్టిన నొప్పిని కప్పుకొని సహాయ నింపుడు కథలని చేర్చి.. అద్దకపు నిద్ర తీరుల్ని కాల్చిన విరగబాటు.. స్మశాన ధార లోంచి మోగుతున్న మహా నివ్వెర గతుల కుట్రకి తెరిచిన వేదికని కడిగి .. ఆరబెట్టినా కంటిలో పొడిగా ఉండిపోయిన కూల్పులు..

……………………

అక్కడే .. ఆ లోకల్ హోటెల్లోనే .. చున్నీ కప్పుకొని.. సీసీ టీవీ లకి దొరకకుండా .. ఎత్తిపోసుకున్న నిద్ర గొంతుల పల్చని హద్దుని .. పొడిగించి.. పాతబడిన సంతులన చీకటికి నివ్వెరపాటుతో.. అద్దుకొన్న కంటి చూపుతో.. సరి చెయ్యని గడుసు నెలలని బిగుతు చెమ్మతో .. సహాయక మందలింపుని కనిపెట్టి .. చేజారిన కలకి రెండో దూపులని దాటిన కలాపక నివ్వెర పోలికలు..

సాయూప ద్రోణుల్లో పడి ముక్కలైన కంటి ఋతువుని కడుగుతూ.. పోత పోసిన నిరూప గతం మాసిన చూపుకి మంటని ఎగదోసి.. నిప్పు పట్టిన శాప దూరాల్లో .. దుమార కథలని .. కలతల్లో నింపి.. ఊడలు దిగిన చూపు నిడివిని సర్దుబాటు చేసిన గొంతులో మరిగిన నడకని పట్టుకొని.. ఇంకిన చేతుల పట్టుని సరి చేసి … అలా వెద్దిలో ఎందుకు.?. నోళ్ళలో నానడమెందుకు? సరిపోలని  స్టేషన్లో కెమెరా స్థిరపడి … వణికిన చేతుల మధ్య పగిలి.. ఋణం బరువెక్కిన నిప్పుల గది చీల్చిన శ్రమకి పోసుకున్న స్నాన రుణాలు.

మురికి నూనెలా బజ్జీలకి.. కొన్ని ఎండు చేపల వాసం మిక్స్ చేసి నమిలి.. అతని పెదాలపై చీకటి సీసాలు.. కడుపులో తిప్పి … వికార మంటని వాడు చిరాకుగా చూసి.. కడుపులో తన్ని.. తలుపు బలంగా విసిరి కొట్టి వెళ్ళిపోయినపుడు.. సీసాల మంట .. పైకి లేచి కింద పడ్డ మంచం చప్పుడు.. భళ్ళుమని పగిలిన అద్దం.. నీళ్లలో నానిన బట్టల మూట.. కాళ్ళలో దిగబడ్డ చూపు.. నిడివి పెరిగిన ఆయుస్సుకి చేర్చిన ఖాళీ కణతలు యోచనలో పండి..

ఒకే కథని .. మరో డిఫరెంట్ narration తో కదిపి .. మాటలని మరింత కైపుల ఎంగిలి చుట్టిన .. అపనమ్మక సాధనకి చేరదీసిన అభయ ముమ్మరలతో తోసుకు పోయాక.. సాధ్య ఊపుల ఏక నిర్మాణ ఎత్తుగడలో కలకి పట్టిన కూల్చివేతల బరువుకి వేలాడుతూ.. హద్దుని కప్పిన కాళ్ళకి .. మరిన్ని ముడులని బిగించి.. కలబెట్టిన నిద్ర తీవ్రల ఒంటి చెమ్మల వాసన ..

……………………..

నింబాళించుకొన్న నిర్ధ భూమి పేటిక లో కలబెట్టిన నిజం .. ఎవడో ఓ మూల న్యూస్ గా వేసిన … మైలేజ్ లేని పత్రిక మూలిగి మూలకి చేరుకున్నాక.. సమయాన్ని తడిపి చూపించుకొన్న కదలికలని కప్పుకొని.. జోడించిన కన్నులోని నొప్పిని తీర్చుకొని.. గోరువెచ్చని చూపుని మోసిన దీపాల అంపకం..

మరో బిగ్ ఆడ్ … కొంత సినిమా అనౌన్స్ చేస్తూ.. బహుశా ఆమె .. ఆ ఎండు చేపల వాసన మింగేయగలిగింది.. సంధి చెయ్యని వరుస నిద్ర కూపాల్లో పడి .. ముఖాలని దాచుకొన్న శ్వాస గండం .. కోసి పెట్టిన నిద్ర ఊపుల కట్టడిని దాచిన గది.. తాళం పడని కన్నుకి నింపుకున్న నీటి గొళ్ళాలు బిగించిన తాకిడి..  

సమర్ప చేతుల్లో పండిన దోసిలిని .. దోర భయంతో ఉడకబెట్టి … ఆయాస నిరుత్తర స్వముఖం లేని కలచివేతని దాటుకొని.. జోడుగా ఇమిడిన కంటి రసాపు గాడిని .. ఇంకా తవ్వి.. ఇంకా కంపించడం మోసిన కెమెరాకి చిక్కిన వరుస నిద్రల కూర్పుని చుట్టుకొని.. ఋణం పోసిన కాటుక తోవలో .. కదిలే నీటి తలుపుల ముట్టడి చేసిన వీధులు.. అప్పటికి చేర్చుకొని పరాయి గొంతులతో రాజీలేని రాసి పైకి చేరుకొంటాయి.

నిర్బంధ మాత్రా దేహానికి తెలియని ఊహలని దాటుకొని.. పెట్టేసిన కంటి ఆందోళ ముడులకి చేర్చిన కథని తాగి.. ఊగిన కంటి శిధిల కరకు మండల దిగ్భ్రాంతిని కప్పుకొని.. విడిపోయిన నిద్ర గ్రహణాలు.. చెమర్చిన కంటిని సాగదీసి .. నడక మార్చిన దీపాలని సర్దుకొని .. విపరీత సర్దుబాటుకు దొరకని ఝాము ముట్టడికి చేరిన ఆయాస కలుపుని తిప్పుకొంటూ..చేదు బొమ్మల నివాళికి లేచిన అద్దాల యేరు..

ఊరటకి చేర్చి పెట్టిన సీసాల గుట్టలో … సమ ఆయూప రాశులతో కాల్చిన నడక .. మాట తీసుకొని.. ఇంకా వీలుకాని .. హద్దుని కట్టుకొని.. పొరపాటులని .. దేహ నిడివి సాగదీసిన కంటి సాధనకి కప్పిన కథతో.. పీక్కుపోయిన కలలకి .. సలాప కీడుని అద్దిన కాటుకల కిటికీ..

గజ గజలాడిన కంటి శోధన మెరుగులు గుట్టలో పడి.. దిగబడిన కష్ట చోటుని ఖాళీ చేసి.. విరిగిపడ్డ నిషార గతుల దేహ చలన బరువుని రుద్దుకొని.. వర్ణ తేదీల వెనక ముంచేసిన చీకటి షెడ్యూల్స్.. సమీప దేహ నిగ్ధతకి పట్టిన చెమట మడుగులో పడి.. పోత పోసుకున్న జాడలని దులుపుకొని.. ఇంకిపోయిన కళ్లలో చూపుని వదులుకొని.. ఇరుకైన నిద్ర పోలికల సందడిని కాపుకాస్తారు.

ఇంకా తెలియని గతి పోతలకి మాట తీసుకొన్న రక్షా పరిధిపై గదులు.. అలవాటు లేనివి..ఉండక కనిపించని ఆయూప ద్రోణుల్లో తిరుగుతూ.. సేకరణకి గురికాని మంద్ర స్థితి కాపలాని దాటుకొని .. ఇంకొక సలపర నిర్మితిని మార్చి చేసిన తీర్మాన గుంపులు..తెలిసేలోపే  దూరంగా జరిగిపోతాయి.

సమయ చలుల అఘాతంలో పడి తల మునగాల నిషుప్తం మోసిన కథకి … రెండు సార్లుగా నిండిన పూర్ణత కాలుతూ… గది గదిలోనూ .. మూసుకొన్న తెరల మాయా దీపాల చాయకి కప్పిన దేహాలు.. విశ్వ నిర్దిష్ట సాధ్యంలో ఆచూకీ లేని దహనపు కక్షయని కావలించుకొన్న పునాదుల కైపుకి కట్టిన గోడలని దాటుకొని… సాధ్య నిరోధంలో మాసిన కంటి శిక్షలు.. పట్టు తెగిన నటనల మధ్య కదిలే కెరటాలే .. కుచ్చులు కట్టిన సాధనకి ఒళ్ళు మర్చి .. ఆ దూరంలో ఉండిపోతూ

నిద్ర జోల పట్టిన అయోమయ రాజీల కైపుకి వడపోసిన స్క్రిప్ట్ వెంట నడుస్తూ… రోజు రోజుకి .. రూపాంతరం చెందే సాధనకి చుట్టిన అనుక్రమణ సంధానత … కట్టి రాల్చుకొన్న తమ జోడింపుల ముట్టడికి నేసిన కంటి నొప్పిని సాగదీసి.. దృష్టి దూరంలో మగ్గిన శ్వాసలపై మేకప్..

అదే చెప్పుకొంటాం. వరసలు చెప్పుకొని కలుసుకొన్నా .. దీపజాల మంత్రపు హేళనకి కూలిన సెట్స్ లో పడి తాగుతారు.. రెండో సారి చెప్పుకోవడానికి అలాగే ఉండే సమయం దొరకదని.. లేదా చేతుల్లోంచి జారి .. దేహ నిరాధార సుముఖత తిప్పేసిన కథల మధ్య కూరుకు పోయిన పెదాలని కాగడాలతో అంటిస్తూ..

ఎన్నిసార్లు ఎన్ని గదులు తిరిగి .. తలుపులని లాగి చూసిన .. అన్నీ అంతే .. వేటికీ లాక్లు లేవు.. వెంట పడి నలిగినా ఏడ్పుని కాల్చుకొని.. గదిలోనే మంట వేసుకొని.. రాత్రంతా … కదిలే గోడలని కాగడాలు పీల్చిన చీకటితో అంటుకట్టి.. రాత్రి గడవడానికి అక్కడేవారూ కాపలా లేరు.

…………………..

సంభాళించుకొన్నారు..చాటు మాటు రాతల్ని స్పష్టం చేసి.. గొంతులో మరిగిన అనుమానాలతో.. వేలాడే అనంతంలోని మరో సృష్టి దాహపు నిరాకార రుజువుల కట్టడిని సరి చెయ్యాలని బతిమాలతారు.. ప్రయోగ శాల .. గాజు పేటిక .. నాచు కట్టిన నవ్వులో చిక్కిన సగం దేహం.. ఘాడమైన రసాయన తూగుని వడపోయ్యలేని నలత..

ఇంకొక మహా విశ్వం వేలాడుతున్న .. నీ గదిలో కూరుకు పోయిన కాళ్ళని .. నడక సగం కానీ దుఃఖం వండి.. కలబెట్టిం ఆచీకటి రుచిని చప్పరించి.. గామిత కంపరం పసిగట్టిన ఋణం కవ్వించి హద్దుని లాక్కుపోయిన కూపాల్లో పడి .. నిద్ర మార్చిన కల సరి పెట్టక ముందే… అది పోగొట్టుకొన్న రుణాల కథకి.. రంగులని పోసుకున్న దృష్టి నిఖాతకి .. చెవుల్లోకి మార్చిన తలపోతల క్రియని చల్లార్చి కప్పిన … ఊరట..

వరుస తప్పి ఉండిపోయిన దేహ నిరాష్టాల కరిగిన మెట్ల దారిని కనిపెట్టుకొంటూ… సేవిత నిర్మాణ తీరులని చిక్కుకొంటూ.. రుణ గతికి చేసుకొన్న కళ్ళ కాపలాని..గది గదిలోనూ.. పేర్చుకొన్న ..చెరి సగపు బరువుని కరగదీసిన నెలల కూర్పు.. రుణ ద్రవం ఒడిసిపట్టిన దేహ ఊళన సత్తువని కరిగించి.. హద్దుని మార్చి చేసుకొన్న ఒప్పంద రోజులని కాల్చుకొంటూ.. పెనవేసిన  చీకటిలో రంజుతో కప్పిన పొగరు చూపులు..

ఉంద్రేక శ్రమకి జోడించిన కళ్ళకి మోసి తెచ్చిన కథని కాల్చిన వీధుల రక్షా నిద్ర హోరణ.. పై పైకి చుట్టిన చూపుల నిడివి కథని సర్దిన పేజీల మధ్యనే ఇగిరిన కంటి జాలం.. ఇగిరి పోయిన కంటి రాతలకి .. ఒడిసి పట్టిన దేహ స్థితి అంతపు మత్తులో కూలిన కథకి .. బోసిపోయిన కునుకుని పట్టుకొని.. పల్చని ఆందోళన కరిగే నీటి పైటలు. .కాళ్ళ నిండుగా పండిన ఆందోళ మిగులు..

……………………………..

నిండా కప్పిన ఆలస్య నిర్యాణం .. సగం మాట తీసుకొని సరి పెట్టుకొంటూ.. రుణ క్లిష్టతకి చేర్చుకొన్న సావకాశపు నొప్పిని కుదిపి.. ఉండడానికి ఏదీ లేదని అనుకొన్నా .. దీపం మాసిపోయిన చీకటిలో నడక కూలిపోయిందని కంగారు పడినా .. కన్ను ఏమార్చిన దుఃఖపు మాయాలీన మృత్యు తూగుని వడపోసి .. గడ్డకట్టిన అవసాన రుణాలని .. పుట్టుక మర్చి పెట్టుకొంటూ.. ..

ముందొక vision ని ఫిక్స్ చేద్దాం… అన్నారు.. అంటే అదేం completeness  ని define చేస్తుందని కాదు.. సరాసరి అక్కడకి వెళ్లి ఆగి.. నిద్రని కట్టుకొని.. పల్చని వాన గుట్టుని కడుగుతుందని..

ఇద్దరం ఒకటే చూడలేం గా ? ఇదొక నిస్సహాయ అంగీకారంగా ఉన్నప్పుడు .. దృశ్య సాదృశ్య అంతంలో పడి తూగిన చావుని రేగ్గొట్టే అరుపుతో ఆమె లో వర్షం పూని.. నగరం .. దాని అనుకొన్న ఆ పెద్ద పెద్ద సెట్స్ కొట్టుకుపోతున్నాయి.. అరుపులు కొండలపై నుంచి పెళ్ళలుగా విరుగుతూ.. చావు కప్పిన దేహ ఋణం కరిగిన హద్దుని కట్టుకొన్న మాటలని పట్టుకొని.. సంచీలో వదిలిన నడక..

రుణ గ్రాహ్య ఏడుపుని ఒద్దికగా చుట్టిన నిరమిత శిక్షణకి కప్పిన గంటలని ఊది.. అటునుంచి వెనక్కి వెళ్ళగలం .. అతనిని మళ్ళీ పాడుతున్నప్పుడే చూడగలం.. సాధ్య నిస్త్రాణ జోడింపుని పొగలకి చేర్చిన అనులోమ సిద్ధతని దాటిన ఊతాన్ని వదిలి.. లోపలికి పడిపోయాక .. బరువుగా ఋణం కప్పిన చీకటిలో గుమ్మాలు….మరో ఫ్లోర్ లో మొదలైన షూటింగ్…

……………………………

పడవ ఎక్కడికీ పోదు.. కెరటాలే కలుపుకొని లాక్కుపోతున్నప్పుడు.. అది ప్రయాణమెందుకు ఐదని .. వాడు నిలదీసి..స్క్రిప్ట్ భౌతిక సూత్రంలోనే బలం లేదు.. ఇది ఏదొక మలుపులో కూలిపోతుంది.. బిగి చల్లారిన కంటి క్షేత్రంలో పడి పూనకాలని తాగాలని ఎవరో స్పష్టం చేస్తారు…కేకల రుణ ముహూర్త ధ్వనికి రెండో మెట్టుని కట్టిన కథకి దగ్గరగా ఉండిపోయిన పునాదులని కరిగించి.. హద్దుని మార్చిన కంటికి మాటని అతుకుతారు.

మనమిప్పుడు జన్మ పునాది కట్టురాతని శోధించాలి.. భయమని మహా వినాశ రుణాన్ని రికార్డు చేసే కెమెరా ముందు మోకరిల్లాలి. వేరు దర్శన లేదు.. ఒరిసిపోయిన గొంతు.. సగం కాలిన చీకటిలో పోలిక తెలియని దేహం.. అదే ఒప్పుకోవడమని.. చేరదీసి భయానికి పోసుకున్న పునాదుల కైపుకి మార్చిన రంగులు. ఉండుండి వంతులు వేసుకొన్న చావు గడపకి దగ్గరగా .. జాగ్రత్త చేసిన దేహ సర్దుల ఒడుపుతో.. కూరుకు పోయిన దేహ సగం కత్తిరించిన చేతులని విడదీసి..

కథని ఆ కొండల వెనక దాచిన సమయపు మరో చీకటి నివేశంలో కొంత గడిపి రావాలి.. కథకి రెండో దేహముందని ఒప్పుకోక ముందే శరీర శాలలో విస్ఫోటన రహాయ శేషపు నిద్రలో పడి కొట్టుకుపోవాలి.. కొంచెం సిగ్గుని అనునయించి.. వదులుకొన్న కొండల మధ్య కూరుకు పోయిన నిద్ర సాధనకి .. బిగించిన హోరుని తాకిస్తూ.. అక్కడే రెండో దేహపు నకిలీ చప్పుడు ఊరిన కథ

…………………………

అంత కళ్ళ ముందే ఉందిగా … ఇక షూటింగ్ మొదలుపెట్టడమే.. నిందల పూనింతకి మందపు అడుగులని కనిపెట్టి.. ఉండిపోయిన నిషా రుణపు కేకని కాదని.. ఆ దేహం నీలోని రక్త సముద్రల్లా నాచుదే.. కావాలంటే వాసన చూసి గుర్తు పట్టు… సమ దూరం అద్దిన ఓర్పుల గుండంలో పడి .. పోలిక తెలియని గుర్తుని కప్పుకొని.. లయత సాధ్యపు గుమ్మరింపుని సరి చెయ్యక ముందే.. కూలిన సమయ ఛాయల మోహార్ణ

కలిసి తీసుకొన్న మాటల మధ్య ఫోటో షూట్ ని ముక్కలు చేసి .. రంగులు అతికించి.. aligned రహస్యాల మధ్య కూరుకు పోయిన దుఃఖం తాగి.. విసుగు ఊపిన రాత బల్ల పక్కాగా గుమిగూడిన కాళ్ళ పోటుని కత్తిరించి.. సముదాయక నీటి జరుగుబాటుని తేల్చిన గదిలో .. మరో సన్నని మంటకి కాలిన కథ.. అదే సవ్య ఛాయన కూర్పుకి ఎత్తి పోసిన చీకటి ఆనవాలుగా కడిగిన గోళాల మధ్య కూరుకు పోయిన మెళుకువలు చేరుకొన్న గుట్టు.. డి రూపుల నిరూప సంధికి చేయించుకున్న ఒప్పంద అనుభవిక శరీర నిర్మిత పట్టూ విడుపులు..  లొంగిపోక తల పట్టుకొని…

ఇక్కడ ఆ రెండో వణికిన కుండలో .. బిగదీసిన నిద్ర రేవుల కునుకుని జోడించే పూడికలు నొప్పిని దాటి .. ఆవరించిన కథల గుట్టుని తొలచిన హద్దుకి ఎగబడి.. తనేనాని గుర్తుపట్టి.. ఇంకొంచెం బయట రుణ తీరులని కుదిపి.. పట్టి తెచ్చిన దుఃఖ నిద్రని ఉడకబెట్టి .. అద్దిన గతి రాత్రంలో పోసుకున్న విశ్వ సంధికి చేర్చిన యానాలు.. కొంచెం విడిపోయాక  పండిన దేహాలు

ఒక కథలోంచి ఇంకొక కథలోకి .. అన్వయ సమాన ధారణకి తేలగొట్టిన కంటి సాధకి .. మెరిసిన గట్టులని దాటుకొని.. కథకి చేర్చిన మలుపులని సాగదీసి.. రుబ్బిన సగం కాటుకల గుట్టలో పడి.. దిగబడ్డ కాళ్లతో .. నడకని తోసుకొచ్చిన ఊపుని వడపోసి.. ధ్వని లేవదీసిన కునుకుని ఆరబెట్టి .. వొంగిపొయిన వర్ణ సర్గ కప్పిన చూపుకి .. బిగించిన కంటి ఋణం ఊడిపోయిన కదలికనే ఉంచుకొని .. ఊహామాల సగం పండిన కునుకుని కట్టుకొంటూ

నిరూప రాజీలు లేని క్షేత్ర సంధికి.. మరో దేహం ల్యాబ్ లో తయారు చేసి.. వర్ణ చిత్రాన్ని కాపీ చేసినా .. శ్వాస స్నా ధన్ గతిని కట్టుకున్నా… చీకటి తొరిపిన భయం వడపోసి తాగించినా .. మరో కాలేని చీకటి పూతల నిడువు మధ్యంలో ఊగిన గోడలని దాటి.. వెనక ఉండిపోయిన దూరాల కలనేతకి .. బరువెక్కిన ఝాము నివ్వెర చోటులో కప్పిన మన్నింపులు..

ఏదో ఆగి పోయింది.. నిర్వచనానికి లొంగని భాషణ తిరగబడి .. ఎర్రని చూపుతో అదుముకొన్న కంటి శ్రమని పట్టుకొని.. రాలగొట్టిం కదలికనే మోసిన కాళ్లతో దున్నిన కథని తెచ్చుకొంది. ఆవిల పడి రెండు రాత్రు పూనక తురుమిని పంచి.. కలకి పక్కనే ఉన్న చావు నిలువుల్లో కెమెరా దొరకగానే .. సగం కూలిన ఇంటిని కాల్చుకొంటూ.. పాట..అదే చెప్పుకున్నట్లుగా వినపడదు..

………………….

అంతా అనుకున్నట్లుగా జరిగితే .. ఏ ప్రయాణం ఎప్పుడో మొదలవ్వాలి.. కాలేదంటే .. దానర్ధం ఇంకేదో జోడించిన లేని దూరంలో కాసుకొన్న మాటలు పల్చబడి.. వణుకుతూ .. దూరంలో ఆగిపోయాయని.. నడుం గిల్లిన అలకలని జంపి కట్టి .. మళ్ళీ తెలియని నిద్ర రూపక నిడివిని సాగదీసి. కథలో ఉండిపోయిన చీకటి తర్జుమాల నొప్పిడి రాతని అరగదీసి.. కొంచెం పూత పెట్టిన రుచికి పెదాలని కట్టి.. దేహ నిర్మిత గాలి లుంగల్లో పడి మరి దొరకని … 

విడిపోవడం ఎలాగూ తెలిసేదే.. వాడు అప్పుడే చెప్పాడు.. నేనే సరిగా వినలేదు.. రెండు క్లైమాక్స్ లకి .. ఒకే కథ .. దేహమూ..కలిసి నేర్చుకొన్న సహస రుణ సమీకరంలో పెట్టుకొన్న అనుమాన ధాటీలు.. పెద్ద పేగు విప్పిన కలతలు.. రోజూ నొప్పి పెట్టే షెడ్యూల్ ని వదిలి దూరం జరగాలని ఏడ్చి చెప్పుకొన్న గ్రహణ గుంభనలో పడి .. తలమునకలుగా శరీర స్థాపన …

శ్వాసల ఏక రాధకి మేకప్ చేసి.. కళ్ళకి తీర్చిన కునుకు పట్టుని కలిపిన చూపులో పట్టు తప్పిన ఒద్దికని సరిపెట్టుకొంటూ.. పీడన .. ఏదో తెలియని రెండో అవసరపు కట్టడికి రాసిన మాటలే తిరిగి ఎదురుపడి.. గాలించిన కునుకు.

త్వరపడి మొదలు పెట్టిన స్క్రిప్ట్ నిండా శూన్య స్థలాలు.. అంతః సర్దీన పూడ్చివేతలని బిగించిన కాస్త చోటులోనే మరో ఇల్లు దిగి .. తగువులు పడుతూ..  ఈ కథని ఒప్పుకోలేక పోవడం కాదు.. ఇదే ఒప్పించాలి..

………………….

చెప్పిరావడానికి ఎక్కడా ఖాళీలు లేవు.. రాలగొట్టుకొన్న ఛాయల మందలింపులు అసలే లేవు.. కళ్ళకి ఆరబెట్టిన కూలిచి వేతల పక్కగా …శూన్య సన్నాహం చేసే రంగులతో ఎగిరే ఓడ .. సిద్ధంగానే తల పట్టుకొన్న ఝాము మంద్రతల కట్టడికి దొరకని కంటిని ఊరుకొని .. చల్లారిన శూలన పాతకాల పునాది విప్పుకొని కంగారుగా చూస్తూ ఉంది..

చేతలు మరిగించిన హద్దుని ఊడదీసి కంటి రేవులో దిగబడి.. ఒప్పుకొన్న సరళ సతమక ఋతువుని ఎండలో ఆరబెట్టిన నైవేద్య గతిని వడ్డించే మాటలు.. కట్టు రాతలు.. అడ్డదిడ్డపు మంథన కథకి రంగు చేర్చి .. పండించిన కంటిలో పడి .. పూత పట్టిన చీకటి ఏడుస్తూ.. తేరుకోలేని నిద్ర కథకి గుప్పిన బెంగని అతికి.. లోపల కాల్చిన కౌగిలి నెరవేర్పుల గట్టుని తెగ్గొట్టి కలుపుకొని..

చేరగిలిన మాటకి .. రెండో కక్ష్యలు ఒంపిన చీకటి సయ్యారని ఊపుకొంటూ.. దోసిలిలో అప్పుడే పుట్టిన వాన.. కళ్ళలో నిషాదీనని మింగిన హద్దుకి చేర్చిన ఉనికి.. మళ్ళీ మార్చడానికి అక్కడే పండిన కథ గుట్టుని విప్పి .. కళ్ళకి నూరిన పట్టుని వదిలి.. కథ కప్పిన గడువుని సాగదీసి కళ్ళకి చేరుతుంది.

విరిగిన శాఖల విశ్వపు అనుసంధాన క్రియ తడిపిన వాన గూడులో .. అక్కడ కొండని పట్టుకొని.. తాను నాకై ఇంకా వేలాడుతూనే ఉంది.. కొన్ని మంత్రం లోయలు.. నోళ్లు తెర్చుకొన్న పాములు.. నురుగు దోసిలిని సరిచేసి సముద్రం.. కెరటాలని పట్టుకొని ఊగే నిద్ర గడువుల పొడి గట్టు మాటని తీర్చుకొన్న గడువు.

వండిన అన్నం.. కూర .. చారు .. మరో కుండలో లోపల చేతులకి దొరకని చిన్న సంచీలో .. కొంచం కాల్చి ముద్ద చేసిన పొడి.. అదే కావాలి .. అని నేను అడిగాను.. ముక్కలు ముక్కలు చేసిన పోల్కలని కలిపి కుడుతూ… ఓ ప్రాసెస్ సెట్ చేసి.. కంటికి తీర్చిన దిగులు గొంతుని అరగదీసి.. పట్టుకొన్న కుచ్చుల కుచ్చుల చీకటి..

ఆమె నవ్వి .. నల్లని మాటని ఎత్తి.. గొంతులో రాలుతున్న ఇసుకతో ముడుచుకొని… అది పుట్టుకలు గర్భ సంచీలో దాచుకొనే మందు .. నీకెందుకు.. అది స్త్రీకి మాత్రమే.. నిడివిని సెగలకు చేర్చి ముంచిన కంటిలో పడి తలమునకలు ఎత్తుగడకు జోడించిన హద్దుని కప్పుకొని.. ఇగిరిన రుణాల పట్టుని దులిపి.. మళ్ళీ ఋణం తీరిన కెరటాలని లాగించి..

అతను అరిచి .. ఆయాసం సర్దుకొని… ఐతే .. నన్నీ ఈ క్షణం స్త్రీని చెయ్యి.. ఆ గరళ సత్య దర్శనకి నన్ను సిద్ధం చెయ్యి.. అప్పటిదే ఆ పాతబడ్డ గుడికి కట్టిన చీరల రధం .. ముసుగేసిన కన్నుకి కప్పిన ఆందోళ కలుషిత నివ్వెర ఎగరేసిన కునుకు…

గడుస్తూ ఉంటుంది.. సీన్ బై సీన్ మారుతూ.. ఋణం బరువుతూ కన్ను దిగబడుతూ.. పెదాల వణుకుకి శ్వాసల ఛాతీలో కుంపటి వెలుగుతూ.. ఎవరో  అరిచారు .. ప్రివ్యూ థియేటర్లో … ఒకే కథకి ఇదేగా రెండో climax  అని… కొంచెం   కూడా సర్దుబాటు చేసుకొని .. BG తో .. తల పండిన నిరాశ కడిగిన శత్రువు కలతని సాగదీసి..

దేహం నిండా అంగీకార మంటలు మండుతూ.. సేఖరింపుల హద్దుని కూల్చిన తమక ముఖాల రంధిని కూల్చి.. చేతుల్లోకి తీర్చిన కంటి నిసౌక సమయ ముంపులో పడి కొట్టుకుపోతూ.. నిరూప పూతల సందిగ్ధ ముఖం వణుకుతూ.. తేడా తెలియని ఆయుస్సుని తాగిన కుండలోని మరో దేహం

హద్దు మార్చిన కంటి శోధాలని దగ్గర చేసుకొని చిక్కబడ్డ కేక.. వదులైన గంటల మధ్య తీరిక కాల్చిన దేహ తమకపు దొంతరని కప్పుకొని.. కలబడి కూలిన శరీర రుణంలో కనబడే నిద్ర గ్రహణ నేర్పరి కప్పిన ఖాళీలు.. ఎవరమూ.. మరో సమూహ సవ్వడి తురిమిన కన్నుని తాగి తూలిపోలేదు.. కాచి రక్షించిన అనుభవ తీరికని కడిగి మళ్ళీ దీపం పెట్టలేదు.. కూల్చిన హద్దుకి రెండో బొట్టులేని కథని దగ్గరగా మిగిలించుకోలేదు.

ఈ దేహం నిండా కప్పిన స్పృహని వదిలి..మరో నిర్ధార యాత్రకి వారు లాగినా .. నేను ఓడిపోయినా కంటిని రక్షించే శరీర ద్రువపు కత్తిరింపుకి కూలిన కొండల మధ్య కుదిరిన ఒప్పందాలు..

ఎదురుపడ్డ వర్ణ నైకల్యం .. చప్పరించిన హద్దుని మార్చి పెట్టుకొని.. జోడించిన సమూహ కౌగిలిలో పడి పోలికని కడిగి.. ఏది మారి మళ్ళీ కనిపించలేదో.. అదే కథని రెండో ముఖం పట్టిన పోలికతో నమిలి .. కళ్ళకి చేర్చిన ఆరబోతల కవ్వింపుని కోసిన తలుపుల మధ్య కూలిపోయిన నిద్ర రుచుల విందు..

………………….

గ్రీష్మ నిరీహపు ఎత్తు ఖండంలో ఓడిపోయినా నల్ల రంగు తలపోతల జారిపోతూ.. హద్దు హెచ్చరికని తాకినా చూపుని ఊపి.. పట్టుతప్పిన రెప్పల ఉరుము కురిసిన గది.. సస్త్ర శాల .. నిశేషా విధి గతుల్లో నింపుకు పోయిన కంటి శోధనకి పూత పెట్టిన కాళ్ళ జ్వరంలో.. వణికిన ఇంటికి దుప్పటి కప్పి.. మరో మహా దేహం కలగన్న కొండలని సముద్రంలో ముంచి.. ఏక సంధాన పడవ ఒడ్డుకి చేరుకొంది.

నేనవని ఊరట కదిలిన మెరుపులా కుట్రకి చేర్చిన చూపుల నిడివిని ఎత్తి పోస్తూ.. మహా దర్శనాల చీకటి ఖననం తీర్చుకొన్న దేహ స్టాంఘణ కప్పిన మంచు గుహలు.. ఆ దేహ నకిలీ శ్వాసలు.. మిగిలిన తీర్మానంలో చేదు గది కంగారు పడుతుంది.. దేహం దొరకదు..సినిమా మొదలైంది…అప్పటికే ఆగి ఉండిపోయిన చిన్న కథల తోపులో చిక్కుకొని.. దేహం చేర్చుకొన్న విడి విడి నిద్రల పుట్టుకలో దిగబడ్డ విశ్వ చలన అనుగ్రత…

వాళ్ళు సగం వేలాడిన దూరంలో కమ్ముకొస్తున్న నిద్ర ఊడల పట్టుని దులుపుకొని.. ఇగిరిన కథని దాచి పెట్టిన కునుకుతో అరగదీసి.. కథకి రెండో నిద్ర వదిలిన చూపుని అద్ది.. ఆధార సంధికి . నేను కాదని అరిచినా .. ఒప్పించలేని చావుకి దగ్గరకి జరిగి.. ఇల్లుని లాక్కుపోయాక..షూటింగ్ స్పాట్ మారినట్లుగా తనకి ఎవరూ.. ఇన్ఫోర్మ్ చెయ్యలేదని..మెల్లిగా అని గదిలోకి వెళ్లిపోయింది..

……………………

ఎప్పటికీ చెప్పుకొని.. మాట సరి చేసిన కంటి చూపుని చిదిమి.. కాల్చిన దుఃఖ కొలిమిలో పడి దేహ సహంకృత దీప ముంపుని అదిమి.. సరి చెయ్యని దేహ సగం పట్టుకొన్న చీకటి  అలసతని కప్పెట్టి.. నానిన కథలకి దూరం జరిపిన చూపుని సాగదీసి.. రొప్పుని సగం మార్చి పెట్టుకొన్న .. ఏమార్పుల కథకి మళ్ళీ మోసిగించి వదిలేస్తారు. ఇలా ఎందుకు జరగాలని నిలదీస్తారు…

 కథ లేని ఊరట .. దేహం తీరిక చేసుకొన్న సాధనకి ఒడిసి పట్టిన కంటి సాధకి నెరిసిన జుత్తులో .. పేనుకొన్న చీకటి నివేర రాశుల కసిని నులిమి.. పాతుకు పోయిన శరీర శార్ధకి కన్నుని ఇచ్చి.. కడిగిన నిద్ర చేలన అడుగులు.. నెమరు వేసుకొన్న మాయల గట్టుని .. నీటికి ఎదురు కట్టి నవ్వుకొంటారు.. మరి తిరిగి రావడానికి లేదని.. ప్రయోగ శాలనే కూలుస్తామంటారు.

భయం చప్పరించిన మరో ఊరటలో తిరుగుతూ.. హెచ్చరికని కనిపెట్టే .. కంటి చూపుని సాగదీసి..  సమయం నాది కాదని ఇంటి బయట కట్టిన శిలా శాసనం.. పేర్చిన కంటి శోధనలో పేరుకున్న మంటని జోడించే కరకు నోళ్ళ ముట్టడికి సేకరించిన చెమట నిగ్రహాల వేడుక…శ్వాస చూపుల వడపోతకి .. తొరిపిన చీకటి నెలల నెమ్మిది మోహరింపులని కదిపి.. అక్కున చేరిన కొండలని వదిలి.. కలబడుతున్న సమయ వంతెన బిగువులో పడి కొట్టుకుపోతూ..

సంధి నెరవేర్పుల బాటకి రాని ఇల్లు.. పలవంత నిద్ర ఓర్పుల కుదుపుని సర్దుకొని.. కనబడని జోడింపులతో .. అదిమిన కంటి క్షేత్రంలో ముసుగేసిన నడకని చేర్చుకొన్న అందుకొన్న సెట్.. ఒక నిద్ర .. రెండు మంగళ ఊర్పులు.. అలికిడి లేని దేహ చేర్పుని కట్టుకొన్న చీకటి అనునాద చెమట కండరాల్లో కురిసిన రక్త స్థలం.

కొంచెం ఉన్నదని చెప్పుకోవడానికి.. కొంచెం పోలిక ఓడిపోయిందని అనుకోని.. దూరం చేసుకోవడానికి మధ్య చెదిరిన మేకప్ తో ఊరడింపులేని చీకటి. రాసినంత మాత్రాన అదే జరగాలని కాదు.. జరగడమనే ఊహని పట్టుకొని..శరీర నిధిలో శ్వాస తంత్రిని కుదిపిన సన్నాహా పోతల పగటి హోరు.. సినిమా..

………………

అక్కడ జరిగిన హద్దులే కప్పుకొని.. ఆమె రెండో సవరణతో.. ఆ దేహం తన పురుషుడు కాదని అరిచినా .. చూపు నషాలో దిగబడ్డ సగం ఊరట .. మరో శరీరంలో ఆయుస్సుకి పట్టిన బరువు.. సమయ నిర్బంధ నిలువు కూర్పుకి .. చేర్చిన నల్లని ముఖాల రొప్పుకి.. మధించి పెట్టుకొన్న దేహ సాధనాల శ్వాస జోరుని సరిచేసి కంటికి .. మోసపూరిత చలన స్థితి మండలంలో పడి .. పొగరు తొడిగిన కునుకుతో కాల్చిన చూపుల నైవల్య దండన.. వ్యతిరేక దేహ పీడనకి మోసిన నటనలని దగ్గర చేసుకొంటూ…..

ఇంకి పోయిన అనుమాన రొప్పుల తలపోతకి దగ్గరగా ఉండిపోయిన తలుపులని దాటి.. పైకి లేచిన కంటి శాలలో… అదే కల దొరికిన నటనకి పరిధిని కాల్చుకొని.. ఊగిసలాడిన నిద్ర పూతల పుట్టుకని సాగదీసి.. కన్నుని పొదిగిన నిద్ర నొక్కుతో ..ఊడిపోయిన పుట్టుకలు .. నీటిలో పొర్లుతూ… అవధి కప్పిన గోళాల మధ్య కేక…అక్కడకి చేరి..తిరిగి బలంగా చెవుల్లోకి దిగుతూ..

అదే విపత్తు చుట్టిన దేహ సాగవు రుణంలో పడి .. తొందరలో కొట్టుకుపోతూ… పాకిన కొండల మధ్య ఆ మరో ఇంటిలో.. నా ఖాళీ దుఃఖం ఊరిన సీసాలని … జమకట్టిన నిద్ర తేరుకొంటూ.. చావు బిగిసిన కునుకుతో తోడేసిన కథలని లాక్కొని .. విరోధ చిత్రం పెట్టుకొంటారు.. అలుముకు పోయిన పంపక నిద్రలేని జోడించి.. కళ్ళకి కాల్చి పెట్టుకొన్న చేదు బొమ్మలని కప్పుకొని.. మరో చిత్ర పూతల మసక కథని లేవదీసిన చీకటితో పులుముకొని.. ఆయాసపడతారు.

ఆపదవలకి సర్ది.. ఇంకా నేను షూటింగ్ కి సిద్ధంగా లేనన్నప్పుడు .. ఇంకేదో భయం కారిన వాన పొడులు.. మూసుకు పోయిన మృత్యు నిద్రల కైపుకి మార్చి పెట్టుకొన్న తాళాల గది.. పొడి పొడి మాటలు .. సగం కాలి దూరం జరిగిన శాపం.. వాన గుడిలో కాళ్ళు పెట్టిన కలకి మోసిన కంటి రాత .. కౌగిలి విచ్చుకొన్న శరీర గుణాలని సరిచేసి.. భగ్గుమన్న విడి పునాదులు.

నిదా చలన భూమి.. గతులని కప్పిన చలన చాంచల్యంలో .. ఊసులు కట్టిన దుఃఖ నిర్మిత కునుకుని సరిచేసి.. సగం దులిపిన కథకి కన్నుని మారుస్తారు. అదే అక్కడ భద్రమని.. నమ్మ బలికి.. సీసాల పగిలి మత్తులో కాల్చి.. వికృత నవ్వులతో తెరంతా ఊగిపోతోంది..

అందిపోసుకొన్న ఆకస్మిక సాధనాలని దాటుకొని.. జోడించిన కరకుతనాలతో చప్పుడుని మోసుకొంటూ.. రుణ భారపు కథలని చేరుకొని.. సవరించిన సహనాలతో నిగ్గరగా ఉండిపోయిన .. సాపేక్ష ధ్వని తంత్రులని బిగించిన శూన్యం ఏడుస్తూ.. ఆ దేహమే కావాలని .. అడ్డుకొన్న నిరూప దర్శనకి …

అది మారిపోయిన కంటి శోధన పట్టుకొన్న ఝాము పొగరు.. నింపి వెళ్లిన కంటి క్షేత్రాల కూపంలో పడి తలకిందులై.. నిరా వికారి.. అడ్డుకొన్న గోడలని కమ్ముకొని.. జాగార పడిన కంటి నీరుని నింపుకొని.. తలలో పండిన శోధనకు .. మాసి పోయిన చీకటి గంటలని మోసి తెచ్చుకొన్న నివ్వెర గుహల్లో …  

 తాను ఒప్పుకోలేదు.. కథకి చెప్పుకొన్న ఖాళీలని కప్పుకొని.. నిద్ర కిందుగా జారిన కళ్ళని మరిగించి .. ఒడిసిపట్టిన రుణాల కవ్వింపుని కలిసిన గంటలు. చెరిపిన కలకి .. బొట్టు పెట్టి కలుసుకొన్న నిదాన రాశుల్లో … వినపడే వినపడని చూపుల నిడివిని సాగదీసి.. కాల్చిన నొప్పికి కట్టిన దారాల కొండ…

సగం చెప్పుకొన్న కథ.. ఓ పెద్ద బాంగ్ తో ఆగి.. ఆ అరుపుకి ఎండని వాల్చిన సంయోగ భూమిలో .. నీంపూరక దేహ సమితి కథనాల కూర్పుని కడిగి .. హద్దుల్ని మళ్ళీ తెల్లగా కడుగుతారు. భయమూ.. నేనూ ఏకం కాని దేహ సజల నేర్పుల కట్టడికి .. మూసిన గొంతుల రక్షా నీటికి చేర్చిన కలకి.. పోసుకున్న మెట్లకీ..

…………………….

చేదు చెమటతో … అంటు కట్టిన చీకటికి అద్దిన గ్లాసులతో … మిగిలిన నడకతో.. పేరుకు పోయిన సమయ సందడికి నిండిపోయిన చీకటికి పొలమార్పు.. సయోధ్య సమ స్థితి లేని కట్టడి రాతల్ని తుడిచి.. అనుమాన రగ్గింతల నీటి పూలమార్పు అంపకాలని దాటుకొని.. అదే ఇంటికి కాల్చిన అనుభవం మోసిన కలకి దిద్ది..

సరి చేసిన ముఖాలని .. రూపు పట్టిన కథని దాటి .. అలజడి కూర్చిన నీటి దోసిలిలో కూరిన చీకటి తర్జుమాల కినుక..

పైకి చెప్పుకు పోయిన మారకాలని దాటిన క్షమాయలు.. దేహ నిందడిని అప్పగించి పేరుకున్న నల్లని ముద్దలతో .. తొరిపిన దేహ సలజడికి చేర్చిన రగడని పట్టుకొని..

కనబడుతున్న నిద్ర గదులని పట్టుకొని..చేర్చుకొన్న కంటి దీవుల్లో కుమిలిన కన్నుకి … దూరంలో ఆగిపోయిన చీకటి నలత..

కదిలి .. ఉండిపోయిన శరీర ఋతువుల ముట్టడిని .. చేర్చి ఇంటి రాత్రుల నడకని పెనవేసుకొంటూ..

……………………..

అంతా మారుతుంది.. శరీర దాడులకు ఒరిగి పోయిన శరీర నిదర్శన సమ్మతాలని కట్టుకొని.. నిఘా పెట్టిన కంటిలో రాలిన వాన గుండాల నొప్పిని కాగబెట్టి.. తేల్చుకోలేని కథకి దగ్గరగా జరిగిన కునుకుని కాపాడుకొని..

అంతా మారడం .. పురుషుడు మోయలేని స్త్రీ దేహ రుణంలో .. వాంఛ కాల్చిన నిర్దేశ సగపు మంత్ర జోరుని పట్టి లాగి.. హద్దుకి చేర్చిన కథకి పోసుకున్న నడత..

కలలని కప్పిన నిద్ర ఋణం పీల్చిన కత్తితో ..పగ రేగిన రెండో దేహంగా దూరం జరిగి అలిసిపోయాక .. నిరూప నిండిన దేహ తేలికల కూర్పుని కూల్చి.. అక్కడే నిండైన సమయ కోతతో దేహం ఎగిరిపడుతుంది..

అలవాటుగా ఏదీ లేదు.. కథగా ఏదీ సరిపోదు..

సమయ నీరుతో తడిపిన భూమికి .. రెండో సత్రపు వసారాలో .. దేహ సర్దుబాటుకి .. నెగ్గుకు పోయిన చీకటికి వ్యతిరిప్త మండలంలో పిసికేసిన రంగులతో తురిమిన చూపుల శోథకి .. ఉండిపోవడం .. లేక పోవడం.. ఉండీ లేకపోవడం.. పరిధిని దాటి వెళ్లిపోయిన కంటి దారాలతో చిక్కుకొన్నమహా దోషపు ఎత్తు నడకల దేహ నిజరూప సత్తువని కడిగిన నాటకంలో పడి .. తేలికగా చుట్టేసిన దృష్టి నడకని పోసుకున్న భయాల పట్టు.

పక్కలకి .. నిలువలకి.. అడ్డుపడ్డ దుఃఖ చిలుము మోసుకొన్న దేహ వరుసల కలివిడి రంగుని ముంచిన నటనతో.. ఋణం బరువెక్కి… ఇంకిపోయిన కథకి అడ్డం తిరిగారు. ఎవరమూ మరో చిత్ర నిందని వదిలిన కన్నుకి గుచ్చిన చీకటి నడకగా ఉండిపోతూ..సమయ నికర్ష ఆందోళన పట్టుకొన్న ఖాళీలని దాటుకొంటూ..

అలమిన నిద్ర సాధకి .. వరుస తప్పిన నిండు గ్రహణాలు .. ముద్ద కట్టిన అరుపులతో.. సవ్యక్త  ధామం పండి పోయిన కథ.. పేర్చిన దేహ నిర్జన కదలికనే మూసేస్తూ.. పేరుకున్న కునుకు బరువుల మాటని తాగి.. తూలి పోయిన కంటి పోటుని కరిగించి.. సవ్వడిని తుడిచిన కథకి .. మాసిపోయిన నీటి గదుల గుట్టుకి …

సమయ ఆలనతో కప్పుకున్న కథలని వదిలేసి.. దేహం పంచిన మాటలని కలిపించి పెట్టుకొన్న చెమ్మకి .. నిరూహా తమకని .. తోడుపెట్టిన నియోమ ద్రోణుల్లో చొచ్చుకొన్న .. కణతలని .. చేదుగా పండిన కలలు..

………………………..

సాధ్య విసుగు నువ్వు చెప్పినపుడు .. దేనిని చేర్చుకొని కదలికనే పట్టుకోదు.. శరీర చిత్రణ కప్పిన ఖాళీలని గట్టిగా దింపిన కన్నుని కుదిపి… ఆరబెట్టినా వెన్నులో కూలిన ఇంటిని కెమెరాకి ఇచ్చి..వాళ్ళు వెనక్కి చూడకుండా వెళ్ళిపోతారు.. అదే చెప్పుకోవడానికి పిలుపుని వడపోసిన కథ.. సమయ నిరూణ కప్పిన సమ తూలుడు చుక్కాని పట్టిన కన్నుని కుదిపి.. చేరి సగపు కవ్వింతని చేర్చిన అవధి.

దీనితో నీకు ఎలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం లేదు.. అంతగా మండిన కాళ్ళని దాచుకొని.. ఇంటి నిద్రకి కురిసిన మెత్తని గాలి చర్యని కప్పే నిప్పుల కుండ. అక్కడే ఆ గది నిశ్చంగా నది చూస్తున్నప్పుడు.. ఎవరో తలుపు కొట్టగానే.. వాడు కిటికీలోంచి నేరుగా నదిలోకి దూకేసాడు.. భయం చంపేసిన మసకల రంగుకి నీరు తీసిన నవ్వుని గుచ్చి.. వెనకకి విరిచిన తలుపుని .. రెండో గడప దగ్గర వెచ్చ జేసిన గంటలుగా తెగ్గొట్టి.. మలచిన దేహ నీరుల కైపుని తాగి తూలిపోతారు.

జ్ఞాన బరువు తెరపై సాగిపోతూ.. వెనక నుంచి గుద్దిన ముఖం పోసుకున్న నీటి తడుపుకి .. పోత పోసిన కునుకుని జోడించే నిద్ర పూర్వ మంద్రతలు. మరింత చూపుని ఒడిసి పట్టిన ఋణం తీర్చుకొన్న చూపుకి.. వద్దని దూరం జరిగిన కంటి దశని ఎడమ కణతలోకి చేర్చిన మాయన కరకు నెలలు. శత్రు సమాలయం.. మాట తీసుకొన్న శరీర జోడింపుని కట్టుకొని..విరిగిన శరీర కప్పివేతలని దాటుకొని.. జాగ్రత్త చేసిన కంటి నీరుని తొరిపిన కథ..

…………………

తెల్లబడిన శరీర పిలిచివేతలని దాటుకొని.. పోలికని అద్ది తీసిన కంటిలో .. ఉరుము పిండిన కథని చేర్చుకొని.. మాటలని సరిచేసిన చీకటిలో పట్టుకొన్న నడక.. పాలిపోయిన నిద్ర మధ్యలో .. కల తెరిచిన కునుకుని వడపోసిన చీకటి వరుసని సరి చేయక ముందే కదిలిన నిద్ర తమకపు మన్నింపుని పొడి చేసి … కన్నుకి చేర్చిన రంగు నిద్రల కలగా పులగపు శరీర సాధనంగా ఉండిపోయిన తెరలు..

సర్దిన వేడుకని పట్టుకొని.. సమయ ధూపం మోసిన కళ్ళలో కప్పి తెచ్చుకొన్న… చొరబాటుకి కందిన చూపుని వడపోసి.. మండిపోయిన శిక్షణతో పెనవేసిన నిలిపివేతని.. మరలా కనిపెట్టుకొన్న గదులని .. చేర్చిన రంగులతో పగగా నింపిన ఆయుస్సులకి కందిపోయిన సగం రాత్రిలో కలిసిన చీకటికి విరుచుకుపడి… నింపుకున్న సఫల ముఖాల పుట్టుకని జోడించిన మాటలు..

చెదరగొట్టిన పునాదులని కనిపెట్టి.. ఉరిమిన ద్రోహపు కొండల్లో జారిన వాన కళ్ళని లాలించి.. కప్పేసిన ముంపులతో.. అదిమిన కాస్త చోటు.. ఇక్కడే పాత్ర తిరగబడి.. గొంతులో పోసుకున్న నిషా కలతని చేర్చుకొని.. మన్నింపు మోసిన కన్నుకి గుచ్చిన కునుకుతో.. తొందరగా నేసిన కంటి రాతల గుబులుని సరిచేసి.. వద్దనుకొన్న శరీర నడకని దాటి.. పైకి చేర్చిన వంతెనలపై కదిలే దేహ వరుసల మెరుపు.

చీటికీ మాటికీ కమ్ముకొన్న చీకటి అందుబాటులో .. వాడు ఎంగిలి నాలికని చాపిన మాటలని పేనుకొని.. కిటికీకి కట్టిన పూడికలని తోడుకొంటూ.. సగం కట్టిన చీకటి ఊయలకి .. మసి పూసిన ఆవాలయత కథని కప్పుకొని.. విడిపోయిన కంటి రాతకి మిగిలిన నిండు భాషణ మోసిన సాధారణ కుదుపుని సరిచేసి .. మిగిలిన ఊసులు.. అక్కడే మిగిలిన పాత్రలు దిద్దుకొన్న జ్వర బరువు కలమోత…

నికర్శితాల మంద్రత కప్పుకున్న నిద్ర చోట్లలో పడి తప్పించుకున్న శరీర రాతల మరుపుని తుడిచి.. కథలో మార్చిన పేజీలని దాచుకొని.. గద్దించి చేర్చుకొన్న మృత్యు సంధికి మోసిన కాటుకల నిరూప మంద్రతని కనుక్కొని ఉండిపోయిన తలుపుల మధ్య నిరా విహరణ..

ఇది సగం … అక్కడ కనబడని రెండో సగం .. కలిసి ఉండిపోయిన నిద్ర పోటుతో కునికిన ఝాము కుమిలిన పగటి గాలులని వడపోసి కూలిన ముడుల ఆయాసం. మసి పూసిన శరీర పడవలో  దిగబడ్డ .. కాపలా పెట్టుకొన్న కెరటాల చాటుగా ఉంచిన అనుమతికి .. లాగి పెట్టినా కంటిలో నిరూప పోతలు..

ఉన్నట్లుగా లేక … తడబాటు కూలిన స్క్రీన్ మీద .. తనకి చెప్పిన స్క్రిప్ట్ అంతా మారి.. ఒకరికి ఇవ్వని నిద్ర అనుపాతపు నివర్ణ గతి సంపర్క నిసతికి మోసిన అయోమయ కర్కషంలో పడి.. మెలుకువ లేని ఆది స్తంభిత తీవ్రంలోని .. నిషేదిక కల్పితాలు … చెక్క పడకలు.. నిద్ర పూతల చీకటికి చుట్టిన వాన బొంగరాల దీపం పెట్టిన ఇంటిలో పడి .. తీసుకుపోయిన కథలు.. ఊర్పులు … మళ్ళీ కట్టుకొన్న సంభాషణల  పరిధులు..

కప్పిన ఊపులో .. పొడుచుకొచ్చే చీకటి నలుపుని చిక్కన చేసి.. కాదిలే చూపులోని గుండ్రంగా మెలితిరిగిన కను గుడ్డు లోపల గందరగోళంలో పడి కొట్టుకో పోతున్న .. సర్వ చిత్రాల కైపుని ఎగదోసుకొంటూ.. నిద్ర మార్చిన కాన్వాస్లు … స్థితి తిప్పుకొన్న కంటి శోధనలు … కథ మార్చిన దుఃఖ పోట్లు.. అవసరం తెలియని శరీర శోధక దర్శనకి నిండిన కథలు….

రుణ దృష్టి కల్పిత దోసిలిలో ఉండిపోయిన గదుల్ని లాక్కొని .. అదే శరీరం ఉడకబెట్టి.. కొంత సవరింత లేని మాయ కలిపిన చీకటికి అనుభవ సారం కలిపిన కంటిని చూసుకొంటూ… ఎవరెంత దూరం గెంటినా .. మాటని తీర్చుకొన్న స్క్రిప్ట్ లో ఎక్కడో ఒకచోట ఒక మాటని వదులుకొని.. మిష్మిత గుంభనకి మెత్తిన కళ్ళతో చూపుని చేరదీసుకొని..

నిద్వల కంటి రసాయన ముంపులో .. లోబడి ఉండిపోని కట్టుపోతల గుణం మారిన దుఃఖ విచలిత చూపుల అండని దాటుకొని… లబడిన కలతలా ఉండిపోయిన చీకటికి .. రెండో చూపుని వదిలిన శాపిత రుణ గ్రహణ.. అప్పటి గతికి చేర్చిన శిధిల గతి మంత్ర ఛేదన ముగిసిన కునుకుని ఆరబెట్టి..

…………………………

కలాప నిగూర్ణత .. వెళ్లి పోయిన చీకటి రేవుల గుట్టుని కదిపి.. నీటి ఋణం తప్పిన అద్దకాల గడువుని సాగదీసి.. ఉన్నట్లుగా చేరిన ముంపులతో ఊరు నానిపోయాక … మిగిలిపోయిన దండన గొంతులో విసిగిన నిద్ర ఝాముల రంగుని దులిపి.. రసాయన పూతల మత్తుకి పండిన కథతో .. పలవరించిన దేహ సన్నత గుర్తుని .. రుణాలపై కట్టి..

సరిచెయ్యని మాటకి .. రెండో నిడివిని కట్టుకొన్న పగటి భుజాల గట్టుని కూల్చి.. ఉన్నదీ మొత్తం.. లేనిదీ కూర్చిన కన్నుతో పాతుకొని.. కబురు దొరకిన ఆందోళ తీరికని గట్టుకి తెచ్చి ఎగరేస్తారు. తేలిపోయిన కెరటాలు.. నల్లని నూరులో కలిసిపోయిన పడవ.. కథ మార్చిన చావులతో కలిసి ఊగే కెమెరా.. నిన్నటి రాత్రి ఇంకా ఆరక కళ్ళలో తిరుగుతూ వాంతి..

ఆది చెవి.. ఉండిపోయిన శబ్ద మాలకి .. అల్లుకున్న నిద్ర ఝాముల తంత్రిని తెంపిన బయట కంగారుని దగ్గర చేసుకొని.. రగిలిన స్వర్జన .. ఉండీ లేకపోయిన అనుమానాలు.. ఏ ఎమోజీల్లోనూ ఇంకేవో సంకేత వాంఛలు మోసుకొన్న పుట్టుక.. వాడి శత్రువుని సంకెళ్లతో బిగించి చెలరేగుతూ .. పెనవేసుకున్న కునుకుని కప్పిన అడుగులో కదిలే ఇసుక కొండల బరువులో పాడుకొంటూ..

అందిపోసుకొన్న శరీర వంతెనల పట్టుని కుదిపి.. దేహ జలకి పట్టిన బిగి సడలని గరుకు పూతల నొప్పిని సరిచెయ్యలేక ఏడుస్తూ.. సమయ నిధిని తవ్విన .. రెండు రాత్రుల వంతెనకు కట్టిన నలత పోటుతో.. రుణ దూరాలు..

…………………

జోడింపులు..నీటి కప్పివేతలు.. పల్చని ఊపిరి ముసుగులు .. సర్దిన నడకలోని దీపపు పడకలు.. వేలాడే మెరుపు సాధ్యమా కొలిమిని పండించి… రగిలిన చెవి.. నిశిత రమనలో పడి .. కొత్తగా నెరిసిన చీకటి మోసుకొన్న కునుకుని చేరుకొని.. దిగబడిన గొంతు ఖాళీల్లో తిరిగే శ్వాస రుజువుల ఖండంలోకి దూకుతూ.. హెచ్చరిక లేని గోళం..

చేదు మధ్యత చుట్టుకొన్న అనవరత చీకటి నిలువుల  అద్దకపు పొడిని జల్లుకొంటూ.. రుణ దేహంలోని చుట్టూ మోడులా కట్టుకొన్న నిఘాత సందూరమ స్పర్ధల కనుపుని సాగదీసి.. కెమెరా చనిపోయిన దృశ్య స్టియత పట్టుకొన్న ఆందోళ మరకని తుడుచుకొని.. ఉక్కపోసిన కళ్ళతో కురిసిన వాన రాళ్ళ కొండకి పక్కగా …

ఇక్కడ కొంచెం ఆగి.. కొన్ని షాట్స్ ఐనా తీద్దామని.. సమయ తాళం విప్పుకొన్న నిషేదిత భూమి కoతల్లో నిలువుపాటి ముఖాల నీరుని ఆవిరి చేసి.. దుఃఖ విలోమ ఝాములో చక్రం తిప్పుతారు.

సరిపెట్టుకొని.. వదిలేసుకొని.. ఇంకేం కదలక ఊరిపోయిన .. నడతని సరి చూసుకొని.. అక్కడ కలిసిన కొత్త కొండల మధ్య ఉరి పోసిన శిధిలాలని .. ఇంకా మోస్తూ.. ఇప్పటికీ వణుకుతూ.. పడవని జార్చుకుని.. నదిలోకి మునుగుతూ.. ఊపిరి గిల గిలని .. సంధి దేహపు పొగరుతో ఒడిసిపట్టి.

అదే దేహ కంపనకి చేర్చిన హద్దులో పడి .. చెప్పని నిద్ర దూరంలో ఉండిపోయిన కలతల నిద్ర నివర్ణ గతికి పట్టేసిన కన్నుని కప్పి… పరిమళ గతి కాలుతూ.. బూడిద కుప్పలు మధ్య AC .. పిడచకట్టిన దాహం పెట్టుకొన్న ఖాళీలని కడిగి.. ఘర్షిత దోసిలిలో పడి.. ఇక ఆ రాత్రి కె అన్నీ .. పొద్దున కల్లా .. ఈ హోటల్ సూట్ ఖాళీ చేసి బయటపడాల్సిందే.. నిఘ్ట్స్లో ఆ డబ్బు ఇచ్చింది.. అక్కడి బిల్ సెటిల్మెంట్ కే ..

నిబంధ రుణాల కాటుక చెమ్మని ఊరబెట్టిన సిగ్గుతో పడి కొట్టుకు పోతూ.. అనులోమన మరుపుకి తుడిచిన హద్దుని దాటించుకొని.. ఆది స్వర్జన ముంపులు.. సంధి చేసుకొన్న పక్క దాడి గుద్దుని  .. లాక్కొని మీదకి ఒరిగిన కంటిలో చూపుని నలిపి .. చుక్క చుక్కలుగా పెట్టుకొన్న నమ్మకం కూలి..

ఏక బిగలాయన మనోప విసుగుకి చేర్చిన కంటి శాలలో పడి … ముక్కలైన గతిని.. మతి తప్పిన కోపపు నిర్ణయ సమాధికి .. దగ్గర లేని దేహ కథకి … మోసి పోయిన నిద్ర కౌగిలి గతి నిందకి ..  పట్టేసిన చీకటి నొప్పిని కట్టుకొని .. ఓ పల్చని దేహ వలసల గట్టుని తెగ్గొట్టి .. అప్పటి మహా ఋణం తీర్చుకొన్న గడపలని దాటి…

సమయ గుండంలో పడి కొట్టుకు పోతూ.. హద్దు మార్చుకున్న నీటి రుణాల పట్టుని వాదులు చేసుకొని.. ఝాముల కైపుని ఒంటికి రాసుకున్న కదలికనే జోడిస్తూ.. పిసికేసిన మాటల మధ్య కథ కొట్టుకు పోయి.. క్యారెక్టర్ చనిపోయాక … రాలాల్సిన దేహ చమురుని పీల్చేసిన స్క్రిప్ట్ పట్టుకొని…

ఎన్ని ఫోన్లు చేసినా .. వినక .. వినీ విననట్లే ఉండి .. చివరకి  బయటపడి.. ప్రొడ్యూసర్ ని ఇగ్నోర్ చేశావతా కదా? …అవాహ గుర్రు … నిఘానీ బోగత .. ఒంట్లో చిక్కబడ్డ వణుకుని దంచుకొంటూ.. పేట్రేగిన సంతులన కరిగిన కన్నుకి బూజు దులిపి.. ఒడిలో గుప్పిన రంగుల పేటికని కలుస్తూ..

దూరంలోకి కదులుతూ.. సరి చేసుకోలేని దుఃఖ నిమిత్త కష్టాన్ని కుదిపి.. మరేం లేని చలన క్షేత్రంలో పడి … కొట్టుకు పోయిన నిద్ర చూపుల గదికి .. అవాహ సమాధిని నింపుకొని.. పొగ రేగిన మాంస భాషణ .. పురుష నిరూప ఘర్షణలోకి దిగబడి.. సమయ శూన్యం మరిగిన పాత ఊరిలో .. పోలిక దొరకని కాళ్ళ జాడని దులిపిన మెట్ల పక్కగా … మాటలని తాగి .. తూలి.. డొల్లుకు పోయిన కథతో చేరగిలిన మెత్తని మలుపుతో..

నిండిన దేహ సగపు చీకటి నులిమిన చూపుకి పట్టి తెచ్చిన కథని తాగి.. తూలి పడిన గోడలని చుట్టుకొని.. విడిచి పెట్టినా శరీర కాపుదలని ఊగించి.. కౌగలించిన ఒడి మండుతుంది.. వెనక నుంచ్చేవారో కత్తిని దించుతారు.. ఋణం ముగిసిన కునుకుతో.. తోడు లేని చీకటి ఆర్తన దృష్టి పోలికని దరి చేసుకొని.. ఇంకిపోతారు. మతి ముగిసిన దేహ పాతరలో దొరికిన దేహ వలయ చుట్టపు చూపులు కదలాడి .. మరే సూచూకీ కప్పని .. నిద్ర రాతల బుడగ పేలిపోయాక.. సందడి లేని నిద్ర ఆర్తన కూడబలుక్కొన్న ఖాళీల మధ్య నేసిన చీకటి. మళ్ళీ పేనుకొన్న మాంస డబ్బాలు….

నుదిటి దూరంలో గుర్రుగా చూసిన మాటకి.. వినపడ్డ చప్పుడుకి.. వాంఛ మెలికలు తిరిగి.. స్పృహ కట్టుకొన్న నొప్పిని కుదిపి.. అదే వివరం లేని జహము పొద్దునే కడిగి.. ఊతం లేని కంటిలో కుదిరిన చీకటి విప్పి పోసుకొని.. సమయ దగ్గర రాతల్ని శాసనం చేసిన పడకలు..

వదిలిన కక్ష్యకి.. ఉండిపోయిన కెమెరాకి.. నీరు పట్టి వెలిసిపోయిన స్క్రిప్టుకి… కొండలకి తగిలి తల పగిలిన పాటకి … పౌరుష ఆవలింతలు.. పురుష రోషం.. కళ్ళు పట్టుకొన్న బెంగ .. సమయ నిర్జన ద్రవ భూమిలో వాన గుప్పిన కన్ను.. చేర్చి పెట్టుకొన్న నీటి గడువులకి దూరం జరిపిన పోటుతో.. చీకటి పంచిన మధ్య చిందుని తుడిచి.. పోలికని దాటుకొని ఉండిపోయిన కాటుకల జడ

వెళ్లడం .. ఉండటం .. నిమిత్తం కాని .. ఆరాది గ్రహణాలు పట్టు దులిపిన సగం దూరంలో .. దొరికిపోతూ.. వెళ్ళగొట్టిన నడకకి ఉంచిన దేహ నీరు దాహంలో కురిసి కూలిపోతూ… అక్కడే నిలబడి చూసిన పడవని ఎవరో వెనక్కి పిలుస్తారు.

……………………..

నుదిటి కక్ష్య…ఉండే వెలగాలని చెప్పుకొన్న .. రెప్పల దేహ కొలిమిలో పడి కాలుతూ.. అద్దిన ముఖాలతో.. పొడిగా చుట్టేసిన నడకని కప్పుకొని.. కొంచెం కొంచెం మిళాయించిన దేహ సాధ్యానాల పొట్టుని దులిపి.. కంటి రసానికి పిండిన అవధి నెలని పట్టుకొని.. తీరికలేని సావకాశపు ఋణం పట్టిన కొండల్లో.. కాగితాల పడవ.. నీరు పట్టిన దగ్గుతున్న కెమెరా.. ఉండమని  అంటారు.. మాట పట్టుకొనే వెళ్ళిపోతారు.. ఋణం మోసుకొనే చప్పుడు చేసి కలత మెరుపుని సాగదీసి .. తర్జుమా లేని పూనకాలే మధ్య దేహం చుట్టుకొంటారు.

జోడించిన మహా బరువుల గోళం పట్టుకొన్న నిషా ద్రావిత రుణ పూర్ణతని తోడుకొంటూ.. పెట్టి పోయిన గోడల మధ్య ఇగిరిన వర్ష తాళం తప్పిన కంటి దూరంలో పడి .. అందుకోలేని రెండో స్మరణ గుండం కప్పిన చూపుకి .. మసక భూమి చింపిన అడుగుల ముంపులో పడి.. మాట తీసుకొన్న ఖాళీ మడుగుల సముద్రం..

కలత చుట్టిన కూర్పుని దాటుకొని .. నువ్వక్కడే ఉన్నా… ఇక్కడ కాళ్ళ అలికిడి లేని కుండల మధ్య దాహపు గరిమనాభిలో… ఏది లేదో అది మాత్రమే ఉంది.. ఏది దొరకదో అది మాత్రమే ఎదురుపడింది. ఒక నిషిద్ధ గమనకి చేరిన స్క్రిప్ట్ వెనక నుంచి మొదలుపెట్టి.. ముందుకొచ్చే సరికి .. స్టోరీ align కావడం లేదని తప్పించి..

చేరవేసుకొన్న నిద్ర గుండాల్లో పడి .. పోలికని తచ్చాడే కదలికనే కనిపెట్టి.. వలస పోయిన కరువుకు ఎండిన గట్టుని తెగ్గొట్టి.. ఆవిరి కొండల గాలిని ఎత్తిపోసి అంతా పబ్లిక్ ఐపోయాక.. ఆ నోళ్ళన్నీ తీర్చుకొని చొంగ కార్చాక .. ఇప్పుడెందుకు? ఈ తాపత్రయాలు.. మోసపు నిండు కూళనకి పట్టి తెచ్చిన నిర్మాణ ఛాయల్ని ఉడకబెట్టిన నీంపూరక వేడి..

చలి మడుగులని వదిలి వెళ్లాలని .. అంటు కట్టిన రక్షలోకి కూలిపోయి .. దూరం జరిగిన హద్దుని పాడుకొంటూ… తేరుకోలేని దేహ నిర్జన గతికి చేర్చిన కట్టడాల మధ్య నిలబడి లోపలి చూడాలని.. కొంచెం భయం పంచి .. మాటని పీల్చుకొని.. నటనకి చెందని అనూకార చాయని కడిగి.. పెట్టి తీసిన కంటిని మళ్ళీ సర్దుకొని.. ఉన్నదీ లేనిదీ .. కట్టుకొన్న ఇంటినీ తనఖాలో ఉంచి.. ఎదురిచ్చి పాత్రని పట్టుకొన్న …

అదే చెప్పుకొన్నారు.. ఇక్కడే కాపుకాసి  ఇళ్ళని దులిపి .. న్యూస్ ని వైరల్ చేసి.. స్పై లని .. ఆమె వెనక తిప్పి.. వినబడని శాప దీవెనని అంటుకట్టి.. మసి పూసిన కంటిలో దిగులు మంద్రతని కడిగిన నటనని కాల్చి.. అక్కడే నెట్టి పోయిన నుదిటిలో పిసికిన చీకటి నేరాలతో వాంఛని పిండి.. గాలించి పెట్టుకొన్న కెమెరాల గొంతుని .. ఖనన నిద్రకి ఒరిగిన పడవని.. ముంచేస్తూ .. మరో గట్టు తెగిన బయశాలలో పోసుకున్న చూపుల నిడివి.. తనలో తనుగా లోపలికి జరిగి.. మాట సాయం తెలియని చీకటిని కడిగి..

లోపల మాంస యజ్ఞాన్ని బూడిద చేసి.. రుణ పడని ఆయుస్సుని దాటుకొని.. విపరీత చలన దర్శి కట్టిన చీకటి సాయుధ్యంలో పడి కలిసిన శత్రు బావిలో పోసుకున్న మధ్య రాత్రి ముట్టడి.. ఆవిరి ధూపపు పొగలో .. ముఖాలని దూరం చేసిన నటనతో సరిపెట్టి..కలబడుతున్న మాటని లాక్కొని.. ఉండిపోయిన నీటి రథాల పొడుగు భూమిలో చీకటిని  నలిపి..అదే కథకి రెండో ముఖం లేని భయం కాలిపోయాక .. మూసేసిన తలుపుల వెనక కూలిపోయిన సమాధిని ఖాళీ చెయ్యమని….

మాట పండిపోయిన వదులు రొమ్ములు.. దేహం కమిలిన నిద్ర జతలని తొడుక్కొని .. బాధిత కనుసన్నల్లో ఒదిగిన హద్దుని నేలకి రాసి.. నూనె మడుగులో ముంచి పైకి తీసిన … మరో విశ్వ సముఖాల కథ.. మాపు దొంతరలు.. కట్టు మాటల నిడివిని సాగదీసి..

అదే మళ్ళీ మళ్ళీ చెబుతాడు.. అది మాత్రమే అతని లోపల కథగా మెదులుతూ… భయం ఎంత చెప్పుకొన్న.. ఒక మాటని కూడా కొసరుతో చూడక .. నమిలేసిన గొంతుకి కూర్చిన కథని తోడుకొని.. ఇగిరిపోయిన మాటలకి చూపుని పంచి.. కలిసిన దూరంలోని ఝాము పొడి నిందలని పట్టుకొని.. వలసిత కటి రాత్రంలో పడి ముక్కలైన దేహ స్థావరాలు..  

subconscious రుణ తీర్మాన గర్భం మోసిన గంటల చివర .. వదిలిన పురుష కణకథ… కప్పుకున్న నిద్ర గుణాల పట్టుని దులిపి .. కన్నుని చేర్చిన కథకి మాటని తాగించి.. కునుకు తిప్పుకొన్న నిద్ర మాటలకి వణుకుతూ… హద్దు చెరిపిన నటనలు..  అదేం వద్దనుకునే దూరం జరుగుతుంది.. శాసన గతంలోని కన్నుని కాల్చి .. మరింత పొడిగా రాలిన కంటి దోషం దులిపిన ఎండతో .. పగిలిన ఇంటిని కప్పుకొంది.

విచ్చిన దేహ పట్టుకి హద్దు మాత్రలు మింగించినా … కలలోకి జారిన నిండు గ్రహణాలు మోసిన కౌగిలి మార్చి తెచ్చుకొన్న కూపాలని నింపుకొని.. ఒకేఒక భూమి కట్టిన నిద్ర దోషిత పోటుని.. కదిలించే విరూప గ్రహణ సంధికి చేర్చిన కన్నుని కట్టుకొంటూ .. పిండి పోయిన దేహ రుచికి …

విహీత చలన భూమిలో .. పూర్ణ నిందల బరువుని కప్పుకున్న పూడికని తవ్వి తీసి.. రుణ భద్రం కాని నివేళపు శరీర కంపన మోడులు బలంగా దిగబడి.. ఎంగిలి చేసిన పూర్ణ భూమి తవ్వకంలో .. దొరికిన దేహ గడువుకు చేర్చిన కన్నుని .. దృష్టి పూనకపు చోటులో కదిలే నిద్ర గుణం సరిచేసి కదలికనే పట్టుకొని..

………………….

విలాస నిర్జన కప్పుకున్న చీకటి నులిపెట్టిన కన్నుకి తొడిగిన పురుష శరీరమూ.. పట్టు తప్పిన వాంఛని నిగ్గదీసి.. కప్పుకున్న శరీర ఋతువులని వదిలి … ఇంకొక సమాధి మూటగా వాడి ముందు కదులుతూ.. పస చచ్చిన కన్నుని గిల్లి.. చలి పోసుకొన్న కెరటాలే ఇసుక నిద్రని బరువుగా లాగి.. ఊపేసిన కెరటాలకి జల్లెడ పట్టిన శూన్య గోళాల తెర..

సగం చీలిన నిద్ర కుండలో పడి .. దేహ పిలుపుని వడపోసిన కన్నుని కూర్చిన మాటతో.. హద్దుని మార్చి పెట్టుకొన్న కుండల్లో పొగలని పెద్దవి చేసి.. ఉండిపోవడం చెప్పుకొని నీటిలో కలిసిన దేహ గుణాల రుచిని ఎంగిలి చేసి .. కంటికి తీరిన అలసటని మోసి తెచ్చిన కునుకుని సాగదీసి.. సాధిత శరీర చుట్టిరికాలని బయట పెట్టి ..వరస కలిపి.. గది తలుపు కొట్టినప్పుడు.. ఒక మాంస వాసన ముసుగుని దాచిపెట్టి.. ఓదార్పు నటనలు.. రంగులు జార్చిన ప్రవాహ చిత్రాల కంపనకి తీర్చి పెట్టుకొన్న దేహ భాషణల నొప్పిని సరిచేసి.. కూరుకు పోయిన చీకటి బురదలో ..

మంట పోసుకున్న సమాధుల చివర .. మరో విశ్వ గుంభన రహస్యం వడికిన నుదురుతో… హేళనకి దూరపు విడిదిని కట్టుకొని మరో మాట లేని .. పట్టి ఉండిపోయిన వణుకుని బుట్టలో నింపి .. కలలకి చేర్చిన కథలని ఊగిస్తూ.. తేలిక పడని నిద్ర ఖాళీలకు ఉలిక్కిపడి ఆటే చూస్తూ.. కలిసిన దేహ సాగులో .. పురుగు పట్టిన కోతలు.. కత్తి దూసిన నిద్ర వేవిరింతల పైనా కాపాడుకొన్న గోడలని దాటుకొంటూ..

కలకామి పట్టి తెచ్జిన హద్దు మాత్రలు.. మింగకుండానే మోసం చేసి.. నడుము పట్టేసిన చీకటిలో పాక్కొంటూ… నదిని విసిరేసిన సిగ్గుకీ పడవని చాటుపెట్టి.. అన్నీ మర్చిపోయినట్లుగా .. అంతే దూరమైనట్లుగా .. కల చేర్చుకొన్న కంటి గడపకి రంగు అద్ది.. కలతల నిద్ర గుహలో మూసుకు పోయినట్లుగా .. పట్టా పగలే ఒంటిపై చీకటి రాలుతున్నట్లుగా….. భయం మోసిన పొడి గొంతులోని గర్ష తాండవ ముఖాల నొప్పిని కలుపుకొని .. వెచ్చ జేసిన కంటి రాతని తుడుచుకొని.. మిగిలిపోయిన కంటి శిధిలాలని కలిసి ,.. కొట్టుకు పోయిన నిద్ర కూపాల్లో పడి భగ భగ లాడిన పడక..

…………………..

దుఃఖం నలిగిన దేహ స్థితి .. మళ్ళీ చెప్పుకొని ఉండిపోయిన చూపులని వేరు చేసుకొని.. పొడి రాలిపోతూ … అదొక ఆనోహ మర్మశిలగా ఉండి .. కంటికి పోసుకున్న స్నాన గుంభన ఎద్దడి కంపనకి చేర్చిన నడకని పట్టుకొని.. కలిసిన విపరీతంలో .. అడుగుకి చేరిన రహస్య తమకపు నిద్ర జాడని కలిపి.. చీకటిని నింపి పోయిన గాలి ఋణం అడుగంటిన మాటలకి మత్తుని ఊడదీసి.. కదలికనే చేర్చిన ఝాము పొద్దునే కప్పే చూపు నిడివిలో..

అదే ఉంది.. అది కథని ఒప్పుకోవడానికి ఏ ఖాళీలు మిగలక .. తోసుకొస్తున్న  దూర గుండాల ఎద్దడికి చేర్చిన మాటని తాగి.. వలస పోతారు.. సరిపెట్టుకోలేని విపరీతాల మధ్య.. గుమిగూడిన నిద్ర కరువుల సాధ్య ఊహన వదిలించుకొన్న చీకటి అలసత్తాకి పేర్చిన కంటి సాధనకి కనిపెట్టిన జాగ్రత్తలని దాటుకొని.. నిద్ర రాళ్ళకి చేర్చిన కంటి సముదాయ ఇళ్లలో పడి .. దేహ నిందని కూర్చిన మొదటి చీకటికి వలస పోయిన కూర్పుని కట్టుకొని .. దేహం పై గిల్లిన సంతాప నిడివిని సాగదీసి..

ఎనిమిది రెక్కల ఇల్లు .. నీటి గోళంలో తేలాడే పడవ.. ఇసుక పాముల్ని మింగిన దీవి.. చెట్లు తిరగబడ్డ నల్ల మానుల దేహ పొగరుని .. దీపాలతో కాల్చి.. ఉమ్మిన శరీర పేర్పుల మత్తు గెడని సగానికి నరికి.. వెదురు పొగలో అరిచిన పాటని చప్పరిస్తూ..  స్తన్య జీరలో చెరకు తీపి .. ఒడిసిపట్టిన పొగరుని కడిగి..  వీలు కుమ్మరించిన కథల గ్రహణం వీడిపోయిన కన్నులో పడి .. తలకిందులుగా చేర్చిన కథని ఊగించి.. అంపక రాశుల మధ్య కూరుకు పోయిన చలన కీల మెరిసిన పునాదిని కదలగొట్టి ..

ఉండటం .. లేకపోవడంతో అడ్డుకొంటున్న నిద్ర రాత్రుల కంపనకి పగిలిన చిత్ర ధూపాలని పీల్చి నెరిసిపోతూ.. సమయపూనతని మరిగించి కలబెట్టిన కాళ్ళ అడుగుల స్వార్ధనలో కొలిమి పండిన కలకి చేరి.. దేహం రెండో కన్ను చివర నిద్రని కొరికి .. అటు పక్కకి దూకి .. ఇక లేనులే అంటుంది.

…………………………

రక్షా వచన కలకామి .. సర్ది పోయిన కల నిలువు ద్రోణితో తగలబడి.. మంచు తాగిన కొండకి ఇల్లుని అతికించి.. చూపులోంచి పొడుచు కొచ్చిన కాళ్ళని పట్టుకొని.. దీక్ష గడిచిన నిద్రల ఆనుపానుల్లో .. పొడువుగా పేరుకున్న దేహ వరుసల నిద్ర చూపుకి.. మగత దుప్పటి చుట్టిన చీకటి కడిగి.. హద్దు మార్చిన కునుకుని కట్టుకొని.. అదే దేహ శీలన… ఒడిలోకి చేరిన చావు ముడుతల వెక్కిరింపు.

జోడింపులు లేని ఏక నిద్రలో కరిగిన ద్రవ రొమ్ముల కలకి .. మెత్తని గొడుగుని పట్టి… చితి పేర్చిన ఎండలో తాగి పడిపోయిన మత్తుని చల్లి.. పరాయిగా మారిన కథలతో .. బలుపు నలిగిన చీకటికి నీరుని పట్టి .. కలకి చేర్చిన కూకటి రాతని కలిపే నడకలు.. పడవలు.. మొండి కాళ్ళు .. చూపు పగిలిన కెమెరాల దుఃఖం..

విపరీత సాయుజ్యం లో పోసి తెచ్చుకొన్న నిడివిని సాగదీసి.. కంటికి చేర్చిన కునుకుని ఆరబెట్టి.. మసకబారిన గొంతులో పోటుపెట్టే కేకలని మింగేసి.. కెరటాలే మధ్య కూరుకు పోయిన మాటకి .. దేహ వరుసలని సర్దిన కెమెరా నడతని సరిదిద్ది.. వెనక పెట్టుకొన్న మెట్లని .. ముందు మోసిన చెట్టుని .. చీల్చిన ఏడూ వరాల కాపుని .. దూరం చేసి.. అదే కనబడుతుంది..

i)మృత్యువుల దేహ నిష్కార .. కదిలే గంటల హోరు .. సగం మాట్లాడి..

అవతలకి తోసేసిన శరీర నిద్రలో వదిలేసి.. పట్టు పని పది రాత్రులు కూడా కాకముందే.. ఇంకా ఏ అగ్రిమెంట్ సైన్ కి సిద్ధం కాక ముందే.. చవుకబారిన ఎర … నిద్ధర కట్టిన గోడలని తోపుకొంటూ.. సరిగా సరి చెయ్యని శరీరం పాడుబెట్టుకొన్న .. కోతలని కప్పి రాల్చిన మృత్యుహోరిమి కూలిన నిద్ర దేహాల కలతకి మోసిన పుట్టుక..

దేహమని అనుకోవడానికి లేని .. పురుగుల పట్టిన పాత సంచీలా వదిలించుకొని.. శ్రమన గొంతుల ఏక ద్రోహంలో పడి పోలిక తెలియని నిద్ర గడువుని .. తట్టుకొంటూ.. పెద్ద రాతలు కట్టిన అడ్డంకిని కూల్చుకొని.. పిసికిన చీకటి అయోమయంలో కన్నుని కాపలాకి పెట్టి.. కప్పుకొన్నప్పుడే ఆగిపోనీ ఎండు దీపాల కొండని వదిలించుకొన్న దేహ ఋణం  పగులగొట్టిన కంటికి . నిమిరిన దుఃఖంలో కలతకి చేర్చిన ఆందోళ కూపంలో మోసిన బిగుతు మెడల్లో తాళ్ళని పురెక్కించిన చేతులని .. నూనె మర్దనా చేస్తూ ఎక్కడో తడిమిన…

స్వజార్జిత సమయ గోళం తిరిగిన కక్ష్యని తీరికగా సర్ది..మృత్యువుల దేహ నిష్కార … మొత్తం స్ప్రెడ్ అయింది.. ఇక కెరీర్ అటకెక్కినట్లే..సినిమా తలుపుకి వెనక పెద్ద బండరాయి.. నువ్విక తోయలేవు.. గాటు పెట్టిన ఛాయల సంచీకి నింపిన చీకటి చప్పరించిన హద్దుని దాటి.. కదిలే నిద్ర చూపరి చేరుకొన్న విందుని కరిగించి.. .. మండి ముక్కలైన పడవల మధ్య దొరికిన కెమెరా

రుద్దుకొని ఉండిపోయిన పాత్రలని దాటుకొంటూ.. కదిలే గంటల హోరు… ఏకైక బంధిత కనుసన్నల్లో పడి.. పోలికల రెండో చిత్ర ధ్వని.. సాధన గడువుల చిత్ర కలతకి .. సగం ముంచి తీసిన చీకటి అనునాద జ్వరాలు.. మరి సగం నిండి పోయిన నడకల కూల్చివేతల పైన కట్టుకొన్న దేహ చిరుగులు .. మడత నవ్వు.. కథలో మాసిపోయిన గోడలు.. కౌగిలిని తెరిచిన వీలునామాల మధ్య కూరుకు పోయిన అగ్రిమెంట్లు

సంభాళించుకోలేని దేహ సర్దుబాటుకి .. చలన గతిని తీర్చిన ఉక్కపోతతో .. శరీర సాధన ఒడిసిపట్టిన గుణ దోషాలని కప్పుకొని తిరుగుతూ .. తప్పిపోయిన పరిధి.. విసుగు బీడులో అంపకాలని  కరిగించి . ఎత్తి పోసిన నటనలని కెమెరా ముందు బిగించి.. పోత పోసిన పోలికల గట్టుని తెగ్గొట్టి.. వదిలేసిన చూపుకి అడ్డుకొన్న ఝాము మదింపుని చిక్కన చేసిన కథలకి అదిమి..

సగం మాట్లాడి ఉండిపోవడం .. చూపు కలిపి ..వాంఛలోకి ఒరిగి భాషని తడుముకోవడమూ.. నిద్ర కాల్చిన కన్నుని తిప్పుకొంటూ.. మరలా చేతకాని మాటల మధ్య చక్కబర్చిన గుండంలో దూకి .. వైభోగ సాధనలో అరమరికలుగా లేవదీసుకొన్న పునాదులని కూల్చొకొని.. జడ విప్పి విరబోసుకున్న చీకటి తర్జుమాల కథని కప్పిన మత్తులో పడి ఊగుతూ.. హెచ్చరిక లేని నిందలని కలుసుకొంటూ..

మసకబారిన .. గాలీ ఉరుముల ముట్టడికి తేలిన కళ్ళతో బిగిసిన దృష్టి వ్యాకులతని చుట్టుకొన్నమడతల మధ్య కూలిన కొండలు.. కాన్వాస్ కి దొరకని మహా భాషణ కప్పుకున్న కాళ్ళని దారికి తెచ్చుకొంటూ.. కన్నుకి పట్టిన కీడుని దులిపి.. కాదన్న ముఖాలని పోతపోసుకొన్న ఝాము ముంపులో పడ

వాళ్ళు వెళ్లిపోవడానికి.. నేనై ఉండిపోవడానికి … మాటకి కట్టిన నిద్ర సంచార గుమ్మంలో ఒరిగిన చావుని కప్పుకొని.. నిల్చి పోయిన కథని తాగి సొమ్మసిల్లడం.. చెప్పుకోవడానికి .. చేర్చిన కదలికని దాటి.. పైనే ఉండిపోయిన అనుమాన రాతల్ని కప్పుకొని.. విసిరినా కలతలతో.. కూలిన దర్శన కథల మధ్య పాత్రని తోడుకొంటూ.. కూలిన కెమెరాలని మీదేసుకొని..

అదే మరో సాధ్య సమ్మతి లేని స్పష్టతకు అంటిన కలని నింపుకొని… తలలో కలిసిన నిద్ర హోరుని దాటుకొంటూ.. చల సఞ్ఞాయల పాతకపు శ్వాసాలకి రంగుల్లది.. అదొక బి గ్రేడ్ సెట్ అని తెలుస్తున్న… పల్చని బట్టలు.. సెట్ నిండా ఆర్టిఫిషల్  రైన్.. నులక మంచం.. కల్లు కుండ.. రంగు వేసిన పాత టైర్లు వేలాడ దీసి.. బూతు డాన్సుని .. కారా కిళ్ళీ ఊసి ఊసి ప్ట్రాక్టీస్ చేయిస్తూ.. అదొక రకమైన మాధకతలో మునిగిన లైటింగ్….. నాని నాని పాలిపోయి వణుకుతున్న దేహం….

కదిలే మాంస ప్రోక్షణ కక్ష్యని కప్పుకున్న వాన గూడులో పడి.. తొందర లేని విపరీతపు సంధి తమక నిర్మతిని చుట్టుకొని.. మునిగిన కంటిని చేరదీసిన మాటలు.. ఒత్తిగిలిన సమర్పిత అండ కూలిపోయాక .. కంటి నీరుకి ఎండిపోయిన దుఃఖ నిదాన రాశులని కప్పి  పోయే .. కలిత నిర్మక ఖేలనగా విసిరిన రుణాల గుట్టు విప్పి..

…………………

భుజాలకి గుచ్చుకొని.. దేహ సాధకి వదిలిన నల్ల చెమట .. ఇంటిని కదిపి పునాదులు ఊడదీసిన గొంతు.. చల్లారిన ఏక ముట్టడి కథకి పోసుకున్న రంగుల పుట్టుక .. తెరలు .. కెమెరా తాగిన నీళ్లు.. ఎండిపోయిన కంటిలో పోసుకున్న శరీర పులుసులు..బూతు దుప్పట్లపైనా కాగిన నాలికల వేడి..

కదిలే నీటి చలనకి తీర్చిన కుదుపుతో.. పట్టుతప్పిన కన్నుని కడిగి.. కెరటాలని అప్పగించిన శ్వాసత  కొండల్లో దిగి తెచ్చుకొన్న కాగడాలు.. రాతి పడవలు పరుచుకొన్న కొంగు.. సగం పగుళ్లు తీసిన కాటుక బావుల పోలికని తుడిచి.. కాళ్ళ పక్కగా ఉండిన చోటులో .. ఆమె చిరిగిన చీర .. ఊడ దీసి పక్కకి పెట్టినా మెట్టెలు.. మట్టి గాజుల గుట్ట.. కొన్ని పెద్ద మువ్వల పట్టీలు.. అక్కడే సర్దిన నడకని ఏమార్చి కప్పిన మసక చీకటి ఆవేశంలో పడి .. ఇక ఏదీ కనిపించక.. మార్చి చెప్పుకోలేని దేహ నిడివికి చేర్చిన కంటి నీరుని తోడి.. అప నమ్మక ద్రోహపు కంటిలో .. బీడుపడిన కేకని తవ్వుకొంటూ.. ఇంకా ఏ నిమిత్తము లేని గుస గుసలాని కట్టుకొన్న

అంతే అలా చూడటమే వాడికి అలవాటులేదని… వారణాశి .. వాడితో కలిసి ఎక్కినా ట్రైన్ తర్వాత తెలిసింది.. నీరు ముంచేసిన దేహ పరిధికి .. రెండో ఋణం విడిచిన కంటి సాధకి మూర్ఛనలు పోతూ.. ఇంకా అదిమి పెట్టిన కలకి .. రంగుకి.. మాట నివ్వని దేహ గోళంలో కరిగిన వానకి.. బిగువు తగ్గని నడకని కూల్చిన హద్దులో పడి .. దూరం జరుపుకొని.. కంగారుతో పోల్చుకొని..

మరో భయం సేకరించిన కన్నుకి చేర్చిన గుప్పెడు .. నిద్ర దుప్పట్ల చలి మరుగుతున్న.. కొన్ని చేతులు .. ఒడి.. గాలి నింపిన పాట.. గొంతులో సన్నని మంటని కప్పిన జోల,.. అపార్ధ నమూనాల కేకని తొడిగిన హద్దుని కాదని .. కప్పుకొని విప్పిన ఇంటి గోడని కెమెరా ముందు ఒంపి.. పగ బట్టిన కన్నులో తిరిగిన శత్రు నిద్రని జోకొట్టి.. ఉండిపోయిన కథకి దూరం జరిపిన అడుగుని చేర్చుకొని..

కనబడని ముద్దల చీకటికి గొళ్ళెం పెట్టినా ఆయుస్సుని కడిగి .. సంతర్ప దుఃఖ శిధిలం మోసుకొన్న గంగ పక్కగా నీళ్లు తాగుతున్న రైలు… ఆ పక్క చెట్టుకి వేలాడుతున్న ఇల్లు చూపించి.. నిలువెత్తు గోడలని   కదిలించేలా వేళ్ళు పాకిన దేహ సర్గని పాడి..రాగ లయకి శరీర శిలని చెక్కి..  అదిమిన చీకటి కెరటం మంచు తాగి కురుస్తున్నప్పుడు.. ఎంగిలి కావాలని దగ్గరకి జరిగి.. మూడు దశల నీటి కవ్వంతో చిలికిన ఉనికిని పట్టుకొని.. నెమ్మదిగా మార్చిన మాట తీరుని స్నానం చేయించి….

మన కొత్త సినిమా సెట్ ఇక ఇదేనని.. అతను చెప్పీ చెప్పకనే  .. కంటి సైగతో చెప్పి .. తన ఒడిలో కూలిన ఆమె దేహం నుంచి .. చివరి రుచుల శబ్దం వింటున్నాడు. తడబడుతున్నాడు.. అంతా అయిపోయిందని వణికిన గొంతుతో తనకి తనే చెప్పుకొంటున్నారు.

                                                                  ……………………………

Back Cover

ఇదొక హాల్లోహన … హాలు నుంచి ఇంటికి .. ఇంటి నుంచి కెమెరాకి.. కెమెరా కై గదులకు.. ప్రేమ నిర్మాణం పట్టుకొన్న సినిమా నుంచి.. సినిమా నిర్మాణపు వెనుక గదిలో శ్రమ పడటం వరకు.. కంటి నుంచి కాన్వాస్ కి .. కాన్వాస్ నుంచి శరీర లజ్జలని కప్పిన మేకప్ కి.. అక్కడ దేహ నిర్మాణం చేరదీసి అగ్రిమెంట్లకి.. ఫారం హౌస్ లొకేషన్ షేరింగులకి …

దృశ్య అంపక పూర్ణంలో పోగొట్టుకొన్న నిడివిని సాగదీసి.. కదిలే ఫ్రేమ్స్ సర్ది చెప్పుకొన్న కళ్ళని చిటకరిస్తూ.. మాయా కల్లోపేయ చంద్రుడి ఆగమ వర్తమానం చెప్పుకొన్న నిడివిని .. రెండు పక్కలా కత్తిరించి ఎడిట్ చేసిన లైఫ్..

చర్మ భూమి నెగడు పండిన కణతుల్లో పుట్టిన చీకటి పుండు.. వెలుగు గుమ్మం బయట ఆరబోసుకొన్న మహా విశ్వాల తెర..

మాస్క్ విడిచిన చీకటిలో మెదిలిన నొప్పికి.. నుదిటిలో కాంబినేషన్  మారినప్పుడు తవ్వుకొన్న భయాలకి .. ఉబికిన కంటిలోని ఊటని పీల్చి ఏడ్చిన పొగరు

తడిచిన నిద్రల మధ్య కుదిరిన ఒప్పంద చర్యల కట్టడిని కూర్చిన మాటలకి.. తోసుకుపోతున్న నిద్ర కథల పట్టుని విదిలించిన కన్నుకి దీపం మింగేసిన సంభాషణలు..

ఇది దేహం ,.. శ్వాస పుట్టుక నుంచి.. మసక బారిన శాపాలు చుట్టిన షూటింగ్ నలతల వరకు మోసుకొన్న కుదుపుల మధ్య … నేల వాలని కలల సాయుజ్య సమ్మతికి..

 పూర్ణ నిమజ్జన చలన గతి చెమట పోటులకి.. కథకి.. కథని మింగేసే టెక్నిక్ కి … స్క్రిప్ట్ పులుముకున్న మత్తుకి.. తొలచిన కళ్ళ ఆరడికి .. గాజు సీసాలకి వేలాడే రబ్బరు తొడుగులకి..

 భయాన్ని పేనుకొన్న కొండల మధ్య కుదిర్చిన కోపానికి.. కదిలే నీటి గమన చీకటి పురి పెట్టినా చావుకి.. కరగమోతలని కప్పుకున్న జాడలకి..

యధాతథ గతానికి అద్దిన రంగులని రాల్చుకొని.. ఆమె నా ముందు.. సినిమా ఇక అంతేనా ? అన్నట్లు చూస్తూ … ఒకటి మొదలుపెట్టడం .. సమాధికి దూరం జరిగిన అంత్య ధారణకి చెల్లుబాటు కాని కలలని మోసగిస్తూ.. రుణపడతారు.

                                               ……………….. END ……….          11.02.2026                                                     బ్లాక్ & వైట్                 16.01. 2026

                                               ……………….. END ……….          11.02.2026