Life On Canvas

                                                                        Life on canvas

Download Free Ebook
Download Now

రాత్రి అనేక మంతనాల వేడి మధ్య ఉడికిపోయాక .. స్నానచర్యలతోనే అంత గొప్ప శాంతి లేదని తెల్సినా… ఎటూ దరి లేదని సరిపెట్టుకొని ఆయాస పడ్డాక నేననే ఒక ఒడ్డున నిలబడి … నిలదీయడం చాలా తేలిక.. కౌశిక్ అమ్మ ఇప్పుడు అదే చేస్తుంది. ఒక పాటర్న్ లో కొడుకుని ఇరికించి తన భుజాల పైనుంచి బరువుని జాఢ్యమైనంత తొందరగా దించుకునే ప్రయత్నం.

విసుగు లో తన నిస్సహాయతని కూరి అమ్మ తో … కొంచెం స్పష్టత మరింత అనుమానం పెనవేసి

ఎందుకిలా చేస్తున్నావ్?

నా పర్సనల్ లైఫ్ లోకి ఈ రకంగా చొచ్చుకు రావడం ఏ రకంగా కరెక్ట్… I  need  some  personal  space  … hope  that  is  not  wrong  ? 

Koushik గొంతులో విసుగు ఆమెని చేరక పోలేదు. కానీ అమ్మగా సహించే హద్దు దాటిపోయింది.

అస్సలు తప్పు లేదు.. బట్, as  a woman  … not  at  all  agreed   of  your  .. Ideology  … this is totally   wrong and ridiculous… అంటుంది కౌశిక్ తల్లి అపర్ణ….

నేను ఏ అమ్మాయి తోనూ misbehave   చెయ్యలేదు… ఎక్కువ చొరవా  చూపించలేదు… విడిపోయిన తర్వాత మరెప్పుడు disturb చెయ్యలేదు. ఇంకేంటి.. ?

ఆమె నవ్వింది.. జ్ఞాన విలాసం విడిచి పెట్టిన మంత్రం ధార .. కొంచెం కమ్మేసిన గాలి గతులు .. పొక్కిన గొంతులోంచి లేవదీసుకొన్న ఓపికని కనిపెడుతూ మరింత నిరాశ కాల్చిన గతి చిత్రాల మెలుకువ. చింతన …

అదీ మా నుంచి నీకు వచ్చిన సంస్కారం.. but ,  here we are  talking  about  your  ideology  … what  ultimately  expecting  from  woman ? అతని లోపలి దిశా కాంక్ష ఆమెకి అందడం లేదని కాదు… కొడుకు ఇంకేదో బయటపెట్టాలని… స్పష్టత పొందాలని ఆమె ఆరాటం.

అదీ నాకు తెలియదు.. నేను వెదుక్కుంటున్నాను … అన్నాడు కౌశిక్

నీకు నువ్వే స్పష్టం కానప్పుడు .. మళ్ళీ ఈ ఇంట్రాక్షన్స్ ఎందుకు… నీ మీద నీకొక క్లారిటీ వచ్చాక వుమన్ గురించి.. పెళ్లి గురించి ఆలోచించు.  అంది అమ్మ.

దానికి కూడా వుమన్ తో ఇంటరాక్టు కాకుండా నా ఫిలాసఫీ ఎలా ఫిక్స్ చేసుకోను… వలం అతనిని రెచ్చగొట్టడమే ఆమె చేస్తుంది.. ఇగిరిపోయిన ఒక నవ్వుతో అతని మాటలు చేరుతున్నాయని ఆమె ఆందోళన .. అయినా కొంచెం కూడా చలించని గొంతు తోనే అతని ముందుకు తన మాటని చేరుస్తుందని ఆమె కి తెల్సు.

ఆమె ఏదో అనబోయే లోపే కాల్ కట్ చేసాడు. అపర్ణ తనలో తనే మళ్ళీ నవ్వుకొంది

…………………………….

ఆమె సహర్ష..  ఒక పూర్తి కానీ కాన్వాస్ లోకి దీపం దూకి చనిపోతే నిండిన ఆత్మ వెలుగులా .. నల్లని దిగులు రాట్నం వడికిన బట్టతో చుట్టుకొన్న ఓ జలపాతం లా సహర్ష… ఉండుండి చాలా పెద్దగా నవ్వుతుంది.. ఒక్కోసారి నవ్విందో ఆమెని ఆపడం ఎవరి తరమూ కాదు.   

అప్పటికి మూడు రోజులుగా అలా జ్వరంతోనే … కౌశిక్ ఒక్కడే పాట్లు పడుతున్నాడు..

నిన్న రాత్రి కోప్పడింది కూడా.. హాస్పిటల్ లో జాయిన్ చెయ్యమని..

అతనే ఇంకొక రోజని.. సాయంత్రం కొంచెం ఓపిక.. కాన్వాస్ ని చేరుకొని… కొన్ని రంగులని మిక్స్ చేస్తూ … అదొక నిర్వాణ విషాదం లాంటిదేదో మొదలుపెట్టింది…  

అతను రాగానే చూసి సంబరపడిపోయాడు. సహర్ష .. saha  is  back  .. thank  you  … అంటూ .. fresh అయ్యాక    .. రుచి లేని జావా …స్పూన్ల చప్పుడు… అతని పొడుగు జుట్టు … రబ్బరు బ్యాండ్ తీసెయ్యడం తో విచ్చుకొని ముచ్చటగా … ఓ యుద్ధవీరుడు పూజ గదిలో ప్రార్థిస్తున్నట్లు … విజయానికా? .. తన ప్రాణానికా … తన చావు తర్వాత కుటుంబం కూలకుండా ఉండడానికా ? బోర్లించిన నాలిక మాటని నీళ్లతో మింగి .. శాసన కర్త ఇచ్చిపోయిన కబురుతో తినడం అయ్యిందని ప్రకటిస్తూ కిచెన్ లోకి వెళ్లి … ఏదో  వంట చేసి .. మరో గంటలో డైనింగ్ టేబుల్..

రేపు టూర్ .. ఓ ten  days  .. unavoidable  అన్నాడు. చాలా try చేసా తప్పించుకొందామని …కానీ కుదర లేదు.

ఆమె ముఖం వాడిపోయింది… డే ఆఫ్టర్ టుమారో Iam  గోయింగ్ బ్యాక్ to  PG  .. at least  ఈ two  డేస్ నీతో spend  చేస్తా అనుకొన్న.. ఇప్పుడు ఇలా ఐయ్యింది.

…….

ఎర్లీ హౌర్స్ అతను లేచి రెడీ అయ్యే … ఆమె దగ్గరికి వచ్చేసరికి లేచినా .. కొంచెం ఫీవర్ … Please టేక్ కేర్ అని వెళ్ళిపోయాడు.

ఆమె కి మధ్యాహ్న్నము  ఆర్ట్ exhibition నుంచి కాల్ వచ్చింది… ఆమె ఓ పెయింటింగ్ ని కొనడానికి కస్టమర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని… కానీ అతను ఆర్టిస్ట్ తో మాట్లాడాక … డెసిషన్ తీసుకొంటానన్నాడని .. వెంటనే రమ్మని… అలాగే ఓపికి తెచ్చుకొని లేచి రెడీ అయ్యింది. ఆమె ఓ క్యాబ్ లో బయలు దేరింది. రిషబ్ చక్రవర్తి .. బెంగాలీ.. కేవలం 29  ఏళ్ళ వయసు … కౌముదిని చూడగానే … హాగ్ చేసుకొని… painting  కోసం మాట్లాడుతూనే ఉన్నాడు. ధ్వని చిత్రం పీల్చిన మందార మొగ్గలా పొడి అద్దిన వాడిలా … కళ్ళు ఏవో లోతుల్ని చూస్తున్నా … అభయాలు ఇస్తున్న .. కొంచెం ఇరుకుగా జ్ఞాన ద్వశమేదో జరిగిన వాడిలా … కాస్తా సిగ్గు… అతన్లోనే దూకుడు … పచ్చని దుర్భిణిలోంచి పైకి చూసి నడుస్తూ రానాగులని మీదేసుకున్న దేహ వృక్షం లా పొడుగ్గా … నమ్మకం ఉందా లేదా అన్నది అలా ఉంచితే … అతని మాటని ఓ నాధా స్వరం లా ఫాలో  అయ్యే టెక్నిక్ ఏదో నేర్చుకొన్నట్లే ఉన్నాడు.

ఆమె మిగతా పెయింటింగ్ కూడా చూడలన్నాడు ఆర్గనైజర్లు వెహికల్లో … మళ్ళీ ప్లాట్ కి.. అతనొక  shocking  expressionsతో  ఉండిపోయాడు… ఆమె ఒక నిండు రంగుల క్రియ వ్యాక్యం … బ్రష్ లని  ఆమె వాడే విధానం .. రంగులని మిక్స్ చేస్తూ ఓ composed  మూడ్ ని రాబట్టటం … unusual  సబ్జెక్టు సెలక్షన్ తో నడకని కొత్తగా ఉంచుకోవడం జరిగినట్లే ఆమె కాన్వాస్ ల స్టడీ లో ర్ధమౌతుంది .

 ఎవరి ఎవరితోనో phoneలో  మాట్లాడాడు.

ఆమె పెయింటింగ్స్ లోంచి మూడు పెయింటింగ్స్ ని సెలెక్ట్ చేసి . తనతో వాటిని  తీసుకొని ఢిల్లీ రావాలన్నాడు.. రాత్రంతా అలాగే గడిచిపోయింది.. టాబ్లెట్స్ వేసుకొని… ఎయిర్పోర్ట్ కి… అతనే అన్నీ ఆరెంజ్ చేసాడు.. కౌశిక్ కి ఈ స్టేటస్ అంత మెసేజ్ పెట్టింది.. all the best చెప్పి ..వెళ్ళాక లొకేషన్ షేర్ చెయ్యమన్నాడు.. ఢిల్లీ  వెళ్లి .. అదొక కాస్టలీ ఫార్మ్హౌస్ … అదీ అతనిదే .. entry అవుతూనే లొకేషన్ షేర్ చేసా….

ఫారిన్ డెలిగేట్లు నెక్స్ట్ డేకి వాళ్ళ షెడ్యూల్ చేంజ్ అయ్యిందని … నైట్ అక్కడే స్టే .. నేను hesitate  చెయ్యలేదు. లంచ్ రూమ్ కే వచ్చింది.. డిన్నర్ కి అతనే స్వయంగా వచ్చి .. కలిసి తిందామన్నాడు.. నాకు కొంచెం పెరుగు అన్నమంతే .. ఇంకా ఫీవర్ వుంది అంది  .. జ్యూస్ చెయ్యమని servant కి చెప్పి ….తాగుతూ మాటలు.. … దిశ ముద్రలు కడిగిన సృష్టి రెండో అడుగు .. పైకి చేర్చుకొన్న నిద్ర సాధనాల రంగుల గుట్టు.. ఆకలి .. మూడు నిర్యాణాల అవతల పెద్ద కూల్చివేత … అంతా తెల్సనుకొనే ఊపిరిని కట్టి .. దూరం జరుగుతూ ఒక నిరాశ తోమిన చీకటి మెరుపు… ఒక దూరం లోనే దేహం వద్దనుకుని ఏడుస్తుంది .

 కాసేపటికి టేక్ రెస్ట్ అని .. తను రూమ్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళాడు.

కౌశిక్ కి మెసేజ్ చేసే లోపు నెట్ వర్క్ కట్ అయ్యిపోయింది. మార్నింగ్ లొకేషన్ షేర్ చేసాక అతని Messages ఉన్నాయి తప్ప… నా replies లేవు. కొంచెం భాద.. ఊరికినే అతను అలవాటు అయిపోవడం వలనా ఈ భాద… అర్ధం కావడం లేదు.

అంత నమ్మకంగానూ లేదు..  ఈ పోస్టుపోన్ … నైట్ స్టే కొంత డౌట్ create చేస్తున్న … ఉన్న liabilities .. ఫ్యూచర్ Projects తలచుకొని చిన్న రిస్క్ తీసుకొందామనే …. నెట్ ఎప్పటికి ఆన్ కాలేదు.. అలాగే నిద్ర పోయింది

లోపల ఒక చలా చలనం… నేను లేచానని తెలుస్తుంది..ఎందుకు అన్నది అర్ధం కావడం లేదు.. నా దేహమంతా దానికదే ఆ రూమంతా గుOడ్రంగా తిరుగుతున్నట్లు అయ్యింది .. ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయానా?

ఏదో నల్లని గోళం లోకి ఎవరో పిలుస్తున్నట్లు… అదీ నాకు పరిచయమైనా గొంతు కాదు … కానీ నమ్మకం వస్తూ ఉంది.. మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది… చాలా నెమ్మిదిగా … నచ్చచెబుతున్నట్లు.. లోపలి అడుగు పెట్టాను.. నాతో తెచ్చిన మూడు పెయింటింగ్స్ గాల్లో ఎగురుతూ … రంగులని వదిలేసి.. ఒకటి బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో… దుర్గ తో తొమ్మిదవ రోజు అని … మరొకటి.. కురుక్షేత్రం లో ద్రౌపది .. మూడోది..డెత్ బెడ్ పై ఉన్న భీష్ముడి తో Tolstoy మాట్లాడుతున్నట్లు .. నిర్ణయ సమాధిగా లేని అపసోప నిద్రలు.. ఇది ఏమికోరుకొంటున్నాయో … వాటిని ఇంకెవరూ దగ్గరకి చేర్చి ఖాళీగా చూడరు..ఒక పక్కకి విరిగి .. మరో చోట అతుక్కొని … రస ముద్రలోని కథనాన్ని తెచ్చుకొంటూ .. అలసట లేని నిద్ర సంపదల మధ్యనే నా కాళ్ళని తోసుకొని మరో నిషేధ రంగు కొత్త ఆలోచనని కడుగు తుంది.  ఇది ఎప్పటిదని ఎవరూ తెలుసుకోలేరు.. ఉండిపోయిచోటే కొన్ని మసక బారిన మూర్తులని కలిపి చుట్టి జ్ఞాన వివక్ష రాత్రి లో మొదలైంది.

యుద్ధం ఒక పౌరుష బీజ కాంతి వెంట నడిచిన ఆనవాళ్ల దారిగా పట్టుకొని వెళ్లే అయోమయం లో పడి కొంచెం కొత్త దిశగా నిండిపోయిన దారులు .. ఇది ఇలాగే జరగాలనేం లేదు. అన్నీ వైపులకీ కదులుతున్న కన్ను .. కొన్ని అపస్మారక క్షేత్రాల్లో పడి లుంగలుపడి కొట్టుకుపోతూ … ఎటు పోయిన మరేం చెట్టు .. గుట్టు .. నది … నీళ్లు ఒంటిని తాకవు..

ఒక సంధి సందర్భం మాసి… ఒక నిలువెత్తు గర్భ దోషం ఇగురుతూ … శ్వాస బిళంలో పడి రాలుతున్న శరీరాల ఉద్భవ నిషా కన్నుని వెలిగించింది.

ఇక మరో సూర్య దర్శనకి ముందే దుఃఖం ఆనవాళ్ల కుంపటిని కుదిపి.. రాజీ లేని చిత్ర ధూళి కాళ్ళని ముడిపెట్టుకొని ముందుకుపోతూ .. దిశా తవ్వకాల ముహూర్త చలనం తో దీర్ఘ మంథన రాశులని తాగి.. తూగుతూ వాళ్ళు వెళ్లి అక్కడే కలుస్తారు. ఆయాసం బొట్టు దిద్దిన మారకాల ముఖాన్ని కడిగి … ఎంత రాల్చినా తిరగబడని కౌగిలితో రంగుల క్షేత్రం.

 ఆమె ఎదురుగా ద్రౌపది .. దుర్గలా నడుచుకొంటూ … మహా అపరాధం ఏడ్చిన నిద్ర పోతలతో..కదల్చబడ్డ అమరికలు గుద్దుకొంటూ .. ఇదొక పరీక్ష సమయం అని కొత్తగా వాళ్ళు ఇంకెవరిని పిలవరు. వెనకగా నిండి పోయిన దీర్ఘ రాశులు మైకం కమ్మి … నిలకడ లేని దీపాన్ని తాగి .. ఆరిపోయిన కొత్త ఆలోచన నిద్ర చాటుగా ముడుతలు పడ్డాక … ఇది అని తెలియని ఉపయ మంత్రమే … చిత్రం. అదీ మళ్ళీ మొదలవ్వక ముందే చివరి రంగులోకి దూకే ఆత్మ హత్య చేసుకొందని అనుకోవడమే నా సంతకంగా వదిలి పెట్టనా ?

అదీ .. ఇదీ అని లేని నా స్వయం దాడి ఒలిచిపోయిన నిందలతో చంద్ర దారుల సవ్వడి… కొంగు ముడిలో దాగిన పగా.. ఆ కోటని .. గుడిని.. అంతఃపురాన్ని .. దీపాన్ని.. సమాధిని..మొదటిసారి కలిసిన నదిని … ఇంతకీ అంతం లేని చీరని ఇచ్చి తోడేసిన పరువుని.. రెప్పలు రుద్దిన నురుగుతో దీక్షని  దాటించే మంత్రం స్థలం ఇక్కడ రంగుల్లో నిద్రని వదిలి మళ్ళీ పుడుతానంటుంది.

భీష్ముడు యుద్ధ నియమాలు చెబుతుంటే .. Tolstoy గుక్క పెట్టి ఏడుస్తున్నాడు.

అబద్దాల చక్ర వ్యూహం .. నుదిటి బొట్టుని తుడిచిన కల్లోలం… విరిగిన రధాల మధ్య రక్త మలం దిగబడ్డ మాటలు… ఆఖరి శరణుని కాదని గొంతులో దించిన కత్తి… లక్షల కిలోల బరువైన నిరాశ.. వందల స్మశానాలని మిoగేసిన యుద్ధక్షేత్రంలో … కాష్టం మండి మసక బారిన చూపుతో … రోజూ చూసి పోయి చనిపోతున్న గాంధారీ సంతతి.. ఒక అవయవము .. ఓటమి లేని యుగాల జిగురు పండుతూ .. బిగిసిన నిరాశ ల చిత్రం ఎక్కడో మండి కన్ను దగ్గర మాట తీసుకొంటుంది. అటు జరిగినా ఏదీ తెల్సుకోలేం….

రెండు సరిహద్దు రాశులుగా లేని దీర్ఘ నిరాశ తబడుతూ కాంతిని దూషించే నేలని నాకేస్తూ … బాష కుమిలిపోయిన మురికి దాడితో .. ఓ పెద్ద అరుపు అరిచీ అరిచి కీచుమంటూ … నిలువెత్తు పగని ఉడక బెడుతున్న ఆకలి.. దాహం.. నిద్ర… కొన్ని పోలికలు ,… చెప్పుకోలేని అవస్థ ల మధ్య ఎర్ర మంత్రం ఒక జన్మని రాలగొట్టి పాపం చేసిందని శపించడానికి ఎవరూ  లేరు. కలకి కావాల్సింది … బతుకు నేర్చాల్సిందేంటని అడిగీ అడగక ముందే … జ్ఞాన ఛాయా ఇగిరిపోయిందని ఎవరో అనుకునే విడిపోతారు.

 ఆమెకి వీళ్ళ మధ్యలో ఎక్కడున్నానో అర్ధం కావడం లేదు..

………………..

 ఆమె అలవాటుగా మార్నింగ్ రెడీ అయ్యిపోయి.. బయటకొచ్చి తిరుగుతుంది .. చాలా మంది పనివాళ్ళు గార్డెనింగ్ చేస్తూ ఉన్నారు.. కొన్ని కోట్లు విలువ చేసే భూమి… మళ్ళీ దానిపై అంతకన్నా విలువైన  కన్స్ట్రక్షన్.. రిషబ్ ఇదంతా ఎలా ఆరెంజ్ చేసాడో అర్ధం కాలేదు.

అదంతా తిరిగి వచ్చేసరికి రిషబ్ రెడీగా ఉన్నాడు.

రండి .. Breakfast  చేసి.. పెయింటింగ్స్ జాగ్రత్తగా కారులో పెట్టి …   బయలుదేరదాం .. అన్నాడు.

 ఆమె తల అడ్డంగా ఊపి.. నాకు ఒక టీ అంతే … నేను కేవలం two టైమ్స్ మాత్రమే తింటా .. అంది.

అతను bread .. ఆమ్లెట్ ..టీ.. నేను టీ ఫినిష్ చేసి.. కాస్టలీ కారులో ..

నెట్ వర్క్  ఆన్ కావడం లేదు.. ఎందుకు ?  అని అడిగింది

మీరు వాళ్ళని కలిసి.. డీల్ కుదిరే వరకు .. ఆన్ కాదు … అన్నాడు.

 ఆమె వెంటనే గట్టిగా అరచి కార్ ఆపమంది.. Driver కార్ పక్కకి తీసి ఆపి.. రిషబ్ని చూస్తున్నాడు.

 Iam not ok for this kind of treatment .. అOది

రిషబ్ కొంచెం విసుగు తో… It’s a laces deal.. it will take another two hours .. after that you are free bird with lots of money…అన్నాడు.

 ఆమె ఒప్పుకోలేదు.

నిస్సంశయ నిర్ణయం … పడి రాలుతున్న వాన రాత్రి సమాధి సర్దుకొని ఓ ఆత్మ వినతిని విన్న తీర్మాన దేహంలా వుంది ఆమె. పారదర్శక స్పష్టత .. ఎటు పక్కకి ఒరిగిపోని దారిలో మరింత పెద్ద బ్రహ్మ జెముడు పొద … ఛాతీలో మొలిచిన రాతి తీగలు …

ద్రౌపది రధం తో అక్కడికి వచ్చింది. పెయింటింగ్స్ అన్నీ అందులో సర్ది … bye చెప్పింది.

సంశయ బ్రాహ్మణాలు నిండిన ఈ గోళం ఏ సమయాలని వెనక్కి తీసుకెళ్తే ఇలా జరుగుతుంది.. ఎవరూ చెప్పలేరు.. ఆమె అడగడానికైనా.. కించిత్తు అనుమానమూ లేదు.. ఆమె యుద్ధక్షేత్రంలో తన బొట్టుని .. బిడ్డలని కోల్పోయిన ద్రౌపదీ .. అలానే నిలుచుని .. ఆమెనే చూస్తూ రమ్మని సైగ చెయ్యడం రిషబ్ స్పష్టంగానే చూస్తున్నాడు.

నెట్ ఆన్ అయ్యింది.. కౌశిక్కి  మెసేజ్ చేసింది.

జరిగిన విషయం చెప్పి..  ఇప్పుడు ద్రౌపది తో ఉన్నా..  అంది … వెంటనే కాల్ కట్ చేసింది

అతనికి అర్ధం కాక . call చేసి … కం అగైన్ … అన్నాడు.

  ఆమె మళ్ళీ చెప్పింది . ద్రౌపదితో రథంలో వెళ్ళుతున్నానని..

అతను పెద్దగా … నీకేమైనా పిచ్చా.. ద్రౌపదితో రథంలో వెళ్ళడమేమిటి? 

Tolstoy ఇంకా  భీష్ముడిని ఆమె నాకు పరిచయం చేస్తుందిప్పుడు.. అంది.

విపరీతాన్నించి .. విపరీతానికి చేస్తున్నా .. విరాగ ప్రయాణం .. అవునన్నా .. కాదన్న .. తనకలా జరుగుతుందనే ఆమె నమ్ముతుంది. విశ్వాసక్షేత్రం లో సంపూర్ణ గతి దేహాలతో నిండిపోయిన స్మశానం.

పెద్ద చప్పుడు .. తర్వాత ఆగిపోయినట్లుగా ఏం లేదు.

…………………………

కౌశిక్ .. I  have  a  proposal .. if  you  agree  then  only …

 ఆమె నవ్వి .. పెళ్లి గురించేగా ? అంది.

ఇష్టం ఎన్ని జన్మల వెనక దిష్టి తీసిన చూపుని ఇచ్చి గట్టిగ చెప్పిందో .. అదే మాట పదే పదే వినపడుతుంది.. ఇక్కడ కొంచెం కూడా దేహ రాక్షసంగా ఏమీ జరగదు.. వచ్చి వెళ్లి పోతున్న నిలువెత్తు మృత్యు తాళం చెవి కొత్తగా అటు తిప్పి .. రాలేదుగా అని నవ్వుతుంది.

మీ అమ్మ చెప్పారు. కానీ నన్ను నువ్వు భరించగలవా? లైఫ్ టర్నింగ్ మోడ్ అని చెప్పిన .. కేవలం ఓ రెండు గంటలు నా స్వేచ్ఛ ని ఆపాలని చూస్తే .. I  can ‘t  accept .. అంది.

నాకు నీలో నచ్చింది అదే.. full clarity తో ఉంటావ్ అందుకే  ఇష్టం …  అన్నాడు.

కానీ … ఇంకా చాలా తెల్సు ఆమె గురించి అతనికి … ఆమెకి అప్పుడప్పుడు  మతి స్థిమితం తప్పుతుందని.. ఎప్పుడూ ఎవరొకరు .. ఆమె గురించి పూర్తిగా తెల్సిన వారు కూడా ఉండి కంట కనిపెట్టాలని… ఆమెని పెంచినవారు.. ఆస్తిని లాగేసుకొని… సిటీ పీజీ లో జాయిన్ చేసి .. ఓ ఆరు నెలల ఫీజు కట్టి పారిపోయారని…

ఆమె పెయింటింగ్ ఎక్సిబిషన్ తోనే మొదటి పరిచయం … రిషబ్ ఆమె కాలేజీ ట్యూషన్ ఫ్రెండ్ .. ఇన్ని ఇయర్స్ గా కాపాడుకొంటూ .. పెయింటింగ్స్ని నలుగురిలోకి తీసుకు వెళ్తూ .. ఆమె పర్సనల్ విషయాలు పెద్దగా స్ప్రెడ్ కాకుండా భాద్యత తీసుకొంటూ…

అతను పడుతున్నా కష్టాన్ని కూడా ఆమె మర్చిపోయి అరుస్తూ ఉంటుంది.

Gurdian లా ఓ మ్యారేజ్ ఏజ్ కుర్రాడు ఉండటాన్ని .. రిషబ్ ఒప్పుకోలేదు… ఆమెని పెళ్లి చేసుకొని పూర్తి protection ఇస్తేనే … మెడికల్ రిపోర్ట్స్ కూడా చూపించాడు.. మ్యారేజ్ ఆమె లో మైండ్ ని కొంతమేరకు నయం చేసే అవకాశం ఉందని… డాక్టర్స్ కామెంట్స్ అందులో….

………………………………………….

పండు ముసలి భీష్ముడు … అమ్మ నువ్వెందుకు .. మృత్యు ఛాయల్ని టచ్ చెయ్యడం లేదు. …  అన్నాడు.

వందల స్తబ్ద శరాలు దిగబడ్డ వెన్నుముక … చావు ప్రేమించి… ఎదురు చూసి.. గుణించుకొని… భాషణా సుభిక్ష గా ఆశీస్సులు అందజేస్తూ … అంపశయ్యా శ్రుతుడి నిర్దయ విచక్షణ లో మెరిసిన ఒక తెల్లని నిద్ర బిందువుల ఒగర్పుని నులిమి దీపంగా వెలిగించి … సరాసరి స్వప్న దోషాల మధ్యనే .. దేహ ఒడంబడిక చేసుకొంటూ … చేరని రాక్షస రీతులని అదిమి పెట్టి .. ఆ పైకి పెద్ద నోటితో అరిచినప్పుడు … వినిపించే మృత్యువుల శరీరధారి

నా ఏజ్ జస్ట్ 28  ఇయర్స్ .. ఇప్పుడెందుకీ విషాదాలు.. అంది.

నా మృత్యువుని మించిన రంగుల్లో విషాదాన్ని సృష్టించి మళ్ళీ ఇప్పుడెందుకిలా ? అన్నాడు. జ్ఞానంగా తెలియని మసకలో నొప్పితో నులిమేసే చావు.. అదీ పట్టి దులిపిన ముసురుని కదిలిస్తూ .. ఎటో తెలియక ఒరిగి పోయిన కదలికని చప్పుడు చెయ్యక కలుపుతూ … అలవాటు లేని గర్భ దోషాన్ని కడిగి నేను దేహమై కదులుతాను.

మీరు స్వయంగా మృత్యువు ని చూసారా?

అదొక అసాధారణ భ్రమలోకి మనం విసిరేయబడి..మనకి మన పరిచయం తెగ్గొట్టుకొని.. నిర్వచనాలని మర్చిపోయే అనుభవం అది ..  అక్కడొక నిరామయం సంధి చేసుకొన్న మూర్తి తన విసిగిన పుట్టుకని నడక లోకి నింపి … ఉల్మీన రాశీ చిత్రం లో పడి రాల్చుకొన్న ఖాళీ కదలికలు నేర్చుకొన్న సమాధి.

ఇచ్ఛా మరణం… వరమెందుకు అవుతుంది.. శాపం కదా?

అవును .. నేను శాపగ్రస్తుడిని .. తీసుకొంటున్నప్పుడు .. నాకు నేనే మోసపోయి వరమనుకొన్న … 

మీరు అడిగిన దాని గురించి నేను ఆలోచిస్తా … బాగా లోతుగా నేను ఆలోచిస్తా … నన్ను నమ్మండి…   అంది.

భీష్ముడు మళ్ళీ … టాల్స్టాయ్ చివరి దశ లో ఆ రైల్వే స్టేషన్ లో పడి ఉన్నాడు..

కొంచెం వెళ్లి కలవొచ్చుగా ? అన్నాడు.   

ఆమె తల ఊపగానే …. తనే స్వయంగా తీసుకెళ్లి .. స్టేషన్లో వదిలి … మాయమైపోయాడు.

యుద్ధం నిండా శాంతి మునిగిన ప్రశ్నలు … అవేవి లోపలి అడుగులని అంచనా వేయగలవా.. ఏదీ ఎక్కడా ఆగిపోదు… విశుద్ధ దారి కాంతి కమ్మిన మిరుమిట్ల అలసట ఇక్కడ మరో సంధి సూత్రాన్ని అనుసరిస్తుంది.. దానికి ఇంకా రహస్య ధ్వని గురించి వివరంగా తెలియదు. పండిన దేహాలు అలానే ఉంటాయి.. వదలాల్సిన చేతుల్లా అవి ఉండవు.. ఆ వేలి కనుపుల్లో … నిద్ర రసాయనాలు పంచిన శాంతి మంత్రం.. ఓ దీర్ఘ రోగీ నెలలుగా మృత్యు దేవతకి చేస్తున్నా ఓ అబ్సహిక జల పరిమళం.

………………….

అమ్మ ; ఇంత త్యాగం అవసరమా? అమ్మ గొంతులో తడి..

(నిశ్వాస నిద్రని ఎవరో అననుకూలంగా మార్చినపుడు .. పై  నుంచి రాలే దీపాల రంగుని తుడుచుకొని… ఎదిగీ..ఎదగని … సానుకూల ముద్రలని హఠాత్తుగా ఎవరో చెరిపి వెళ్ళిపోతే … విసుగు లేని చేతులతో మళ్ళీ సర్దడానికి దేహం లేని ఆత్మ తొందర పడుతూ … పిలవడానికి మొదలైన మాట వెనకా .. ముందూ అవడాన్ని సృష్టి ఏదో ఒక మూల నుంచి గమనిస్తూనే ఉంటుంది.

అతను రిప్లై ఇవ్వడానికి ముందు  కొన్ని క్షణాలు గడ్డకట్టాడు.. అతనికి చాలా విషయాలు ముందు .. ముందు .. ఎంత complicate అవుతాయో ఊహించాడు … కానీ….)

కౌశిక్ ; ఇందులో త్యాగమంటూ ఏమీ లేదు.. తనొక normal kind of lady కాదు. రోజూ కొత్తగా పరిచయమవుతూ ఉంటుంది.ఆర్టిస్ట్ గా ఆమె అసాధారణ ప్రతిభావంతురాలు.. ఆమె అసాధారణ స్త్రీ …నాకు తారసపడటమే అదృష్టం.. తనని అలా వదిలేస్తే .. నా తోటి  మగాడికి నమిలి మింగేయడానికి క్షణo పట్టదు.. నాతో తను ఉండటం వలన నేను లోపల ఎదుగుతానని … నాకు స్పష్టంగా తెల్సు.. కొంచెం మతి స్థిమితం తప్పినప్పుడు కూడా తనదైన కళలో ఉంటుంది తప్ప … మనలని ఇబ్బంది పెట్టదు. అంతకు మించేం కావాలి.

(ఇంకా ఏదో చెప్పాలని ఆయాస పడుతూనే ఉన్నాడు.. చివరికి ఒకటే బాణం ఎక్కుపెట్టాడు. )

నాన్నని నువ్వెందుకు భరిస్తున్నావ్? అన్నాడు.  

(ఆమె నుంచి కాసేపు ఏ మాటా లేదు. ఆలోచనలు గతం లోకి వెళ్లడం వలన అనుకుంటా )

అమ్మ ; రెండూ ఒకటి కాదు. పెళ్లయ్యేనాటికి … నాకు అతని గురించి తెలియదు.. పేదరికం .. అంత .. కోటీశ్వరుల సంబంధం… వద్దనలేకపోయా… కానీ నీ case different …  నెలలుగా ఆమె గురించి తెల్సు.. పేరెంట్స్ లేరు.. గార్డియన్స్ వదిలేసారు.. లైఫ్ లో చాలా పేస్ చెయ్యాల్సి రావొచ్చు.. అంది

కౌశిక్ ; మీ ఇద్దరూ నా దగ్గరకి వచ్చేద్దురు … ఓన్లీ నాకు టూర్స్ ఉన్నప్పుడే డిస్టర్బన్స్ … otherwise it is ok. అన్నాడు.   

అమ్మ ; అదంత ఈజీ కాదురా.. propertiesని … పొలాలని చూసుకోవాలిగా .. మీ నాన్న ఈ మట్టితో కలిసి నడుస్తూ తన ఆర్ట్ లో ముంగి తేలుతూ ఉంటారు.. ఇది మారితే ఆయన అక్కడ adjust కాగలరా ? అన్నది … మనం చూసుకోవాలి

అయినా తను పిల్లలకి ఒప్పుకొంటుందా ? అంది

కౌశిక్ ; తెలియదు.. నాకు నీ భాద అర్ధమైంది  .. కొంచెం … కొంచెంగా ..తనలోకి వెళ్తూ ఉండడమే నాకు ఇష్టం..

At the end those are all secondary things. అన్నాడు.   

(రోజువారీ  సరళ ముఖాలు గోడకి గుద్దుకొని.. మరింత చిక్కబడ్డ భయం రెండో వేపు కదలని చోటులో గమనించే ఆగిపోతూ .. తెలియని నిషిద్ధ రాత్రికి అతను సిద్దమై .. ఆమె లో తన స్పష్టత ని వెదుకుతూ)

అమ్మ ; అలానే.. ఏదైనా నీ ఇష్టమే …  కానీ నాన్న   ఆర్ట్ ఎక్సిబిషన్ ఢిల్లీలో నెక్స్ట్ మొంత్.. నువ్వు తనని తీసుకు రా .. ఇద్దరూ ఎలా ఇంటరాక్ట్ అవుతారో చూద్దాం. అంది  (నవ్వుతూ )

…………………………………