
ధో –తార ఊరు .. నిదర్శ గాయజుడు
పోగొట్టుకొన్నప్పుడే తిరిర్గి దొరికిన దుఃఖ నిర్మాణ నిద్రల శకం మొదలై దొరికిన అనుభవాల ముద్ద ..వెనక .. ముందూ తిరుగుతూ.. తలపడుతున్న సంహిత దర్శనాల కల .. కళ
అదే తెలియాలని లేదు.. ఉండిపోవడానికి ఒప్పుకోరు..
సిద్ధ నిశ్వాసాల కలతని మోసి తెచ్చుకొన్న కంటి శ్రమకి నింపి తెచ్చుకొన్న ఖాళీలని దాటుకొని.. నిశ్చంత పరాకులో మోసిన కథ.. ఎప్పటికీ ఆ ఊరితోనే ఆగిపోదు.
మెళుకువలేని వెనక ఊరుని .. కొండలు పట్టుకొని చుట్టూ రక్షిత నిర్మాణాలై నిలబడ్డాక .. మంచు గుహల మట్టి బాటలోంచి.. అడివి కన్నుకి దిద్దిన బొట్టులా ఆ ఊరు..
పాటల వినికిడిని మోసుకొని నడిచే పడవల మధ్య సేద తీరిన కెరటాల చీకటి నది..
తాటాకు గొడుగు కింద పుట్టి పాకేసింది చంద్ర వెలుగుల గుట్ట వాడి ఇల్లు.. గుళ్లో పై నుంచి వేలాడే దీపంలా అక్క.. నాగలితో బియ్యపు రాశులని తెచ్చే నాన్న.. సైకిల్ ని తెచ్చిన రోజు …
పోగొట్టుకున్నాడు.. ఊరంతటినీ దుర్భిణిలా చూపించే వాడి సైకిల్ ని.. ఓ చెట్టు కింద సన్యాసి నుంచి అందుకొన్నాడు.. పాటల మహా చంచార్య ఖాళీ జోలెల నిర్యాణ మంత్రంలో దాచి పెట్టుకొన్న ఆకల్య గొంతుని… దోతారని..
………….
కలల గుమ్మం బార్లా తెరుచుకొంది.. నాభీ అక్షయం లోంచి మొదలైన పాట.. విశ్వ సృష్టి మహా అనుగ్రహంలో నెరిసిన శరీర కూర్పు వెనక .. మొత్తం ఊరుని దోతార కనుసన్నలకి .. తిప్పి తిరిగే సాధనలో దొరికిన వనశాల..
అమాంత ఆశ్రిత చిత్ర గుండంలో పాటల తొణికిసలాటని మోయలేని పడవ.. అటు ఇటు ఊగుతూ.. అద్ది వెళ్లిన దీప సగంలో కదిలే నిద్ర గ్రహణ చిత్తడిలో పాతుకొన్న కథకి .. ముఖాలన్ని ఒంపిన కునుకు పంటని..
శరీరం నిండా అననుకూల పిడుగు పడ్డాక.. మళ్ళీ పోగొట్టుకున్నది.. పాటని కాదు.. వాడి శరీరపు ఇంటి నుంచి బయటకి వినిపించేగలిగే కిటికీ అయిన గొంతుని..వనశాల వాడి చేతి వదలలేదు. ఆశని చావా నివ్వలేదు.. దోతార వాడి భుజాన్ని వదిలి వెళ్లిపోలేదు..
పాటని కలిపి ముసలావిడ .. దుఃఖ ద్వారం దగ్గర పిలిస్తే వాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాట .. వాడిని విసిరి అడివిలో పడవేసింది. వనశాలలో గంధపు చెక్కని అరగదీస్తూ.. సంభరిత చిత్ర కూళనల కౌగిలిని పట్టుకొని.. జాగ్రత్త చేసుకొంటూ.. అదే ఛాయల పక్కన మాటలని తోడుకొంటూ..
…………
సంసిద్ధ వ్యాక్యంలో గొంతుని ముంచి.. దోతార వాడికి అడివి మధ్యంలో చీకి పోయిన పాత పడవ గొడుగయ్యేలా … గుహల్లో తలదాచుకుని.. అడివి ఉగ్గబెట్టి ఏడ్చే వర్షాన్ని..చిచ్చు అర్పుకోలేని నిప్పునీ .. దుఃఖపు చెరువులో పూసిన కమలాల గుట్టునీ.. గాండ్రిoపునీ .. మెత్తని లేడి కాళ్ళ చూపుని.. ఏనుగు ఘీoకారాన్ని .. శబ్ద చలన మాత్రంలో ఎత్తి పోసుకున్న మట్టి కొండల మధ్య వరదనీ… భయం కట్టేసిన చెట్ల మధ్య తీగలు పేర్చిన పక్కనే.. తిరిగి వాక్కునీ .. పాటనీ..సమయ తంత్రీ వరద కమ్ముకొన్న దేహ ఉరవడి వెన్నెలపై ఆరబోసిన పాట .. కంగారు లేని నిరాదీక్ష మిగులుని కట్టుకొంటూ.. దేహపు ఊగిసలాటని కట్టుకొని.. పల్చని బెంగ ఆరబోసిన శిధిల వాగులో అప్పుడే కూలిన ఇంటిని కట్టుకొంటూ.. పాట..
దోతార చేసుకొన్నా ఒప్పంద నిద్రల పెద్ద చప్పుడు రాత్రి చట్రంలో కన్ను పెట్టుకొన్న మెట్ల సందడి పక్కగా హద్దుని చేరదీసిన అభయ రూపులు. చెరగమన్నా చెరిగిపోవు.. ధూళి తుడిచిన కళ్ళలో చూపుని సైగలతో ఆరబెడతాయి.
,,,,,,,,,,,,
నగర వేదికపై కురిసిన మట్టి వాన .. నిర్ణయ చితి గర్భంలో వదులుగా ఉంచి వెళ్లిన కలల ధూళిని తుడిచి.. అంపకాల శ్రమ చుట్టిన కథకి .. తలుపు మూసిన కంటి రాతని కౌగిలికి ఒంపి.. మోసిపోయిన గడువునీ.. అక్క మట్టి గాజుల చేతులు ఇచ్చిన దీవెననీ.. వనశాల చుట్టి వెళ్లిన కౌగిలి దొరికిన పాదాల మట్టి.. వరాల సందడి చిరు గజ్జెల మొత్తని చెవుల్లోకి నింపుకొని.. నిశ్వాస ధారలో కట్టుకొన్న స్వేద ముఖాలు.
ఆలస్యం లేని ఉపేక్ష పునాదులని గడ్డకట్టిస్తూ.. కంటి సొనలని చిలికిన ఉనికి.. తత్తరపాటు భూమి పరిచయ కూపంలో పడి లేచిన పడవ కన్నుని సరి చేసిన దీవికి .. రెండో నిశ్చయ గతిని సవరించి కదిలిన చర్యగా .. ఉండీ లేకపోయిన పునాది ముంపుల గతి గోళపు సవరింతని వదులుకొన్న సగం వేడుక.. అపార్ధ విఫలం చెప్పిన ధ్వని కదలికల చెట్టుని నేసిన దీపజాలం..
వందల దోతార లై.. దుఃఖ స్థిమిత ఆదిమ గొంతుతో.. తన జానపద చిత్ర గుచ్చపు గొంతులోంచి .. నగరాన్ని తడిపి.. తన ఊరి గుమ్మాన్ని పాతాడు. కొంచెం కలిసాక తడబడే నిద్ర గతుల మొత్తమూ మాయ చుట్టిన కథనే తిప్పుకొంటూ దోతార తీసుకుపోయాక..
దోతారలు పుట్టే ఆ ఊరిలో మొదలైన ఓ నిదర్శ గాయజుడి ప్రయాణ దీపాల గోష .. ఈ కథాత్మక కవిత్వం..
CHAPTER 1
ఇల్లు ..అడివి.. నది..
వడ్డించినవి.. ఏక చంద్రుడు.. రెక్కల పడవ
పెద్ద కథల నీటి దేవుడు … ఊరు చుట్టిన కొండ.. నాన్న భుజాల నిద్ర
చెల్లి తెచ్చిన వాన .. కథల గట్టు.. ఉండిపోయిన కల
వెదురు మొవ్వు.. నిద్ర ఖనిజం .. ఆదమరుపు నది
శ్వాస చెట్ల తోట .. నీటి బిగువు వంట .. అక్క దిద్దిన బొట్టు
అవ్వ ముద్దలు.. శొంఠి దీర్ఘం .. చూసిన పాట
దూది గొంతులు.. జీర బెల్లపు పాకం .. నిద్ర కన్ను
నుసి తీగలు.. అమ్మ దుప్పటి.. కథలోని చలి గాలి
జిలేబీ గొంతు.. రుణపడిన గట్టు.. మోగిన కళ్ళు
రెప్పల కునుకు.. చిలికిన పాట .. గాజుల డబ్బా
మట్టి గోడలు.. వెదురు రాతలు .. పెళ్లి ఇల్లు
CHAPTER 2
గుడి .. బడి .. మఠం
ద్రవిత ప్రమిద .. మోసిన హార్మొనీ .. నిధీ ధ్యాస
గుండ్రని చీకటి.. బైరాగి కొండ .. జాన పాట
ఆవలించి హరి కథ.. రుణ గీత .. వాకిలిలో జాజర
ముంజి కాయలు.. మామిడి తాండ్ర .. అమ్మ లాల
కథ చెప్పిన మాయ.. కొబ్బరాకు పందిర .. కంటి చెమ్మ
మంచు గాలి.. ఉసురు రాట్నాలు…లోపలి చెక్క గానుగలు..
భ్రమణ మైల .. చిత్తడి గుమ్మం.. గొంతు హోరు
రాళ్లు చూడని గుడి.. వాన పూతలు.. ఆరడి నొప్పి
పడవ తాళింపులు .. తాయిలపు సంచీ.. దీవి పాటలు..
చిందుల నోరు.. ఎండ కాసిన నది.. అడవి కుండలు
పడవ నలత .. తాగిన నది.. ఎగిసిన పాట
CHAPTER 3
కాలి బాటలు.. మట్టి గట్లు.. సత్రంలో కథ
తేనె వర్షం .. తెర చాప గూడు.. చెట్ల సత్రం
లాలపోసిన గుబులు.. మంచు గొడుగు.. దోతారల కన్ను
గుప్పెడు గింజలు.. చలి మంటల రేవు.. అద్దకపు వీధి బిక్ష
పెళ్లి మేళం .. సన్యాసుల లైట్లు.. పడవలో అమ్మ చీర
కాలి గట్ల వాన .. అడివి పొట్లం.. కర్పూర వేడుకల పాట
తప్పి పోయిన చక్రాలు.. పాట గుండ్రాలు .. దూరపు కొండల నీరు
తెగిన చెప్పులు.. బురద మట్టి.. మఠంలో బొమ్మల వాన
జ్వర జాగారం .. వణికిన కళ్ళ గొంతులు ..ఆశ్రయ బ్రహ్మాండం
మునివేళ్ళ రంగు.. బాదం ఆకుల పడక .. దోతార మాత్రలు
చిత్తడి పాటల నడక.. చావు నీరు.. సాధన వాలిన గొంతు.
ఆశ్రిత నీటి గొడుగు.. దోతారల ఊపిరి .. రెండో నిలివిడి
CHAPTER 4
ఊరు దాటినా అడివి కథలు.. దోతారల భావి.
తాబేళ్ళ కొలను .. పండిన పడవల ఇల్లు .. అడవి గాలుల దోతార
కొమ్మల మంటపం.. పెద్ద మర్రి కాళ్ళు.. దోతారలో ధూళి శ్వాస
నెమళ్ళ గట్టు .. ఈదిన నది.. ఇంద్ర ధనుస్సుతో ముగ్గిన దోతార .
కూలిన పాముల పుట్ట .. చెట్టు కింద భావి.. భుజాన ధో-తార
దో తార నేసిన అడివి .. జంతువుల కాళ్ళు .. చిందిన చిందిన రక్త గుహ
తందానాల చప్పుడు.. గొంతు నేసిన పాట .. అడివి గూడు అరుపులు ..
చెట్లలో బిక్ష.. విపుల సంధికి గొంతు.. దోతారల నీటి దర్శన
మట్టి పోసిన కొండ .. నలిగిన దారి.. దోతార మోసిన కబురు
సాయాల దేహ నజ్జు.. ఇగిరిన మాట .. అడివి మెడలొ వెన్నెల
వాన రేవులు,.. తడిచిన ధో తార .. మసక పూడికలు
తుడిచిన ఝాము .. కలలో సైకిల్ బెల్ .. అతను పాడుకొంటూ ..
CHAPTER 5
ఊరు .. నగరం .. సంచీలో పాట
ఊరి గుమ్మం .. ఎసట్లో బియ్యం .. వడ్డించిన పాట Recovery
ఆనవాళ్ల వంతెన .. అటు నగరం.. నాన్న ఖాళీ మాటల ఝరి … vachhina proposal
పాట మోసిన కథ.. విని పండుతూ.. హద్దరి నిద్ర పూడికలు.. preparation …
రైలు వంతెన … విమానం కిటికీ…. పాట నెగడు journey
తలనెరిసిన మంచు.. ఊరి కాగడా.. నగర దుమ్ము village .. dream
ఉరిమిన కొత్త చోటు .. కలత చలిగాలి.. పెట్టెలో పాడే ధో తార … in room
రుణ వీధి.. జంట నెలలు.. అక్క ఫోన్ competition start …
వేదిక పై మట్టి వాన .. పడవలో గుడి.. పువ్వులు రాల్చిన ధో-తార .. nagara vaana
గాలి బెంగ .. గొంతు ధార .. పురా జనపద వనశాల …. Musilaavida
వస్త్ర భుజం.. వేలి కణుపుల సారణ .. నిధీగ్ద … on platform
దోతార కణతలు … జలతారు మోత .. అందిన పాట on platform
……………….. 23.06.2026
CHAPTER 1
ఇల్లు ..అడివి.. నది..
గడిచిన మట్టి బాటల నిండా.. కదలిక కనిపెట్టిన రోజువారీ గాలి కథల నిండా .. దేహం తీర్చిన రొద
ఇంకా అలాగే ఉంది.. లోపల కథ ఇంకా దుప్పటి దులపలేదు
ఆకలి ఉడికిన అన్నం మెతుకు లో బోర్లించిన చీకటి కుండ నిండా .. పట్టు తప్పిన నిద్ర నాడి
చలిమంట పోసిన తత్వ బొమ్మల నాదం నిండా .. దృష్ఠి ఆరబెట్టిన కదలికల్ని ఎక్కుపెట్టిన
వీధిలోకి కలబడుతూ .. శరీర ఋణం ఎక్కుపెట్టిన ధూప రక్ష.. అదేం చెప్పుకొని దొరకదు
కాల్చిన గుమ్మాల బరువు నిండా.. కదిలే సమయ ముళ్ళు మోసిన . దొరకని కొండ….
కంటి ధారల కైపు నిండా ..సైకిల్ చుట్టిన అడివి .. రాతి నాలికతో అరుస్తూ..
తేరుకోలేని నిద్రవాగులో పోతపోసుకొన్న… నల్లని గొంతు వరలు దింపిన ఊటభావి.
ఒంటి రసాయన కవ్వపు నురుగుని చిలికిన గొంతు వాలులో పాటని నేసుకొంటూ..
కొట్టుకు పోతున్న సరళ భూమి నషాని తాగిన గోడల మధ్య చిదిగిన శ్వాస గోళపు జిగురు నిండా ..
కూరుకుపోయిన నదిలో పడవ నేర్పిన .. నీటి ముంపుల పాట నిండా.. ఇల్లు.
అదే కదిలే నిద్ర కి చక్రాలు కట్టిన కల .. నల్ల గొడుగుల కొండ కింద చీకటి గుప్పిన నీటి పాట
……………
అమ్మ పిండి తిప్పిన రోలు.. కారం పోటేసిన రోకలి.. బియ్యం పిండి చేసిన తిరగలి..
దుప్పటి పిండి ఆరవేసిన చెట్టుకొమ్మ .. ఇంకా అంచుల నుంచి కారే నీళ్లలా పాట ..
జుత్తు దువ్విన వాళ్ళ పుట్టింటి దంతపు దువ్వెన.. కథ మార్చుకున్న నీటి తెరల గట్టు
తిరిగి చేసిన తాయిలం.. కాకి ఎంగిలి పండు.. బంగారరాజు చెరువులో దొరికిన ఇత్తడి బిందె..
శోష పెట్టిన తయారు కడుపు నొప్పి.. రోష మొలచిన గొడ్డు కారపు దగ్గు… గొంతు పొడి
రేవు తాళం చెవులు.. సినిమా ఊసులు.. సైకిల్ బండి ఐస్ ఫ్రూప్ట్స్ .. సర్కస్ బండి
జ్వర కషాయం కలిపిన రాగి గిన్నె ..కుంకుమ పొదిగిన భరిణ .. దగ్గు మందు..
చిన్న పట్టణపు రంగు సీసాలు.. కారు వెనక దుమ్ములో పరుగులోనూ పాటే ఉంది..
కథలని దీవించి కప్పుకొని చాటుగా నవ్వింది.. మాటని తప్పించుకొని వలస నిద్రలో
కలని వడపోసింది. కన్నుకి చిక్కు తీసింది.. నిద్ర జడల ఉక్కకి విసిరింది.
రొప్పిన కంటిలో జోగు నీళ్ళని వడపోసిన నది పక్కగా కడుతున్న వంతెన ..
ఇంకా పూర్తవలేదు… రెండో పక్క పాటని జత చేయలేదు. మాటల్ని తొడగలేదు.
……………………
సత్రం లో రాత్రుళ్ళు రంగు దులిపి ఎగిరే రెక్కల పల్లకీ .. నిద్ర దాచుకొన్న ఊరి నాటకంలో
అందిపుచ్చుకొన్న పద్యం.. గొంతు నీరులో కంగుమన్న మునక బుడగలు.. సమీపాలు
నిమిత్త మాత్రత .. కదిలే గోడల మధ్య ఊగిసలాడే నేలని పట్టుకొని తలుపు కొట్టే నది..
ఉరిమిన నిద్ర భయాల్లో కూలిన పాట కలలో మోగే సైకిల్ బెల్.. వాన ఊడ్చి పెట్టుకొన్న
పాటల పెట్టెలో.. కొన్ని జరీ పోగులు రాలిన అమ్మ చీరతో కట్టిన హార్మొనీలో .. రాగి ఉంగరం
నిద్ర పోయిన ఇసుక దారుల గుడి.. తెల్ల నువ్వు సానబెట్టిన నవ్వు.. ఇత్తడి సబ్బు పెట్టె .. శెనగ పిండి
ఛాతీ లోపల శిలలు కరిగిన చప్పుడుతో . వాన పకోడీ నములుతూ.మోగే తలుపు చివర రాత్రి రాసి
దాచుకొన్న పాట.. పడవల పండుగకి .. దీవిలో రాలిన పూలు.. ఇసుకలో దొరికిన చీర
వెదురు మెడలో కథ చల్లిన మత్తుకి.. వాన కడిగిన కొండ మోకరిల్లాక .. అంతా అటే పోతూ …
భయం దువ్విన వేలి కణుపుల వణుకుని నానబెట్టి ….తడి పాముల పుట్టలో మొదలైన పాట..
……………………
వడ్డించినవి.. ఏక చంద్రుడు.. రెక్కల పడవ
సమయ భూమిలో నెరిసిన కొండల దీపం వడ్డించిన సాయంత్ర వెలుగు..
కాక పుట్టిన శరీర లాల పోసుకున్న పుట్టుకలు … మళ్ళీ చెప్పుకోలేని తేనె కొండల గాలి
మత్తు జువ్వుమన్న కథలని పట్టుకొని.. తీర్చి పెట్టుకొన్న చీకటిలో తడిబారిన కంటిని తాకి ..
నిద్ర తోవలో ఇల్లుని నదిలోకి చేర్చి కదిలే జాజుల పందిరి.. తీపి నలతలు
భయపడే ఉండిపోయిన ముఖాలతో.. కదిలే సవ్వడి మోగుతున్న మోసపు భయాల
మసక నవ్వుని కాల్చి .. గర్భ గుడిలోకి చేరిన నది.. మంగళ ధూపం..
నిశమి చర్యలతో కదిలే కునుకు .. అమ్మ ఎంగిలి చేసి ఇచ్చిన జామకాయ ..
చిత్ర ముఖాలని చుట్టి తిప్పి పెట్టుకొన్న కదలికల్ని మోసుకొని.. అదే చలన గతికి ..
సంపాదిత శిక్షిత మందలింపులని .. పారబోసుకొన్న కలలు ..
కొంచెం ఇరుకున పడ్డ బడి గంట .. ఇసుక పూతలతో తొరిపిన కెరటాలని తాగి ..
చీకటి తెరలు సాగిపోతున్ననాలుగు కలల పట్టులో దుఃఖాల మందలింపు.
……………..
కలని కూర్చిన రెక్కల పడవ .. నిద్రల కిందుగా నడిచి ఏడుస్తూ.. పొందికలేని మట్టి బాటలు
మధ్య చెట్లు ఊగుతూ.. రాగి బిందెలో నూనె గేలపు గంటల మోత…
మొక్కలు నవ్వే దీవిలో.. నీటి చినుకుల కాళ్ళని పీల్చి.. కథలని నేసి…
కళ్ళకి పోసుకున్న రంగు కళ్ళాపి మధ్య ఇల్లు మర్చి తిరుగుతూ.. చెంపలు ఒత్తుతూ…
శ్వాస నాదం తెరిచిన శరీర వాగుల్లో .. రశ్మీ ముద్దల అయోమయ చిత్ర తెంపరి రుణాల
కట్టడి గట్టుని కుదిపేస్తూ.. నాచు పట్టిన గోడల మధ్య పెద్ద కళ్ళ దేవత బొమ్మ
తేరుకోలేని.. నడక సగం తెగ్గొట్టి .. రెప్పల ఊపుని జోడించి కదిలే ..
చేదు గొంతులు.. చూపుల బిళంలో తడిచి పోయిన తలుపులతో ..
పెడ చెవిన పెట్టిన గదులని తోడి తెచ్చిన అలకలు .. కదిలి పోయే కెరటాల మధ్య కూలిన
ఓ కథ .. ఊకొట్టిన రెక్కల పడవ .. కప్పి వెళ్లిన నిద్ర గడువుల గుడి బోర్లా తిరిగిన శబ్దం కదిలి ..
నిస్సంశయ పూర్ణ త్రిజారణ మారకాలని దిద్దిన పడవలో ..
చిన్న చేపల కుండలో దీపం ఊగుతున్నప్పుడు .. వాడి జత చేరి నవ్వే లోపు ..
ఎవరో భుజం తడతారు. మరెవరో మెట్లని కూల్చి ..దుప్పటి పరుస్తారు…
…………..
ఏటి గట్టుపై ఒక్కడూ సైకిల్ పై వెళుతున్నప్పుడు .. వెనక వచ్చే ఏక చంద్రుడు ..
నీళ్లు నమిలిన వాన జల్లుతో..తేరుకోలేని బెల్.. సైకిల్ రెండో చక్రానికి కట్టిన బెలూన్
తప్పుకు పోయే చెట్లు.. ఆ చెట్ల గుబురులోంచి పలికి భయం రాసిన పొగల స్మశానం ..
కలత చల్లారిన దుఃఖ శకలం .. గానుగ పట్టిన నడకని తాగి .. మాట మోసుకొన్న
పరాయి బొమ్మల నాటకశాల.. వదిలేసిన పాత్రల రంగు బట్టలు.. పూసల దండలు
ఏది ముందు.. ఏది వెనక …ఒద్దికగా వదిలిన కంటి కూర్పుని జోడించే ముఖాల మధ్య
కలబడి చేర్చుకొన్న చీకటి సయోధ్య చర్యల గతిని సరిచేసే ఇంకేవో చేతులు ..
దగ్గరై.. జోకొట్టిన కొండల మధ్య మాయ చప్పరించిన గతి ముఖాలు.
అమ్మ వడ్డించినవి.. నాన్న పంచి ఇచ్చినవి.. సైకిల్ కట్టి లాగే ఇల్లు..
సాధ్య నిద్రలని కూరిన మంత్ర అవస్థలో కొలిచి తెచ్చుకొన్న కలల మధ్యనే ..
నీరు పుట్టిన కథల జల్లులో .. చెలరేగి ఊగుతున్న ఇసుక భూముల పంట రేవులు
మొత్తం ఊరి చుట్టూ ,, వెదురు ఊళ వడపోసిన పాటల ఏటిగట్టు తొంగిచూస్తూ …
……………………
పెద్ద కథల నీటి దేవుడు … ఊరు చుట్టిన కొండ.. నాన్న భుజాల నిద్ర
వరద గాలించిన నీటి దేవుడు .. దీవి గొంతుని కడిగిన ఎర్ర బరువు మెట్ల పక్కగా ..
పెద్ద కథల నిద్ర గతిని నింపుకొని రాలిన కునుకు … సాదమరుపు నిద్ర పోగుల కలనేత ముఖాలు
సాగనంపక ముందే ఊరు చుట్టిన కొండ .. సంభావ్యత చుట్టి.. సగం ఋణం తెగ్గొట్టి
చూపు చిత్రం పులిమిన కంటి ఋణం తీర్చుకోలేని నడక .. పడకని మడత పెట్టి…
కదిలే నిద్ర భుజపు నొప్పితో.. ఎండ బారిన చెట్ల మధ్య సగం కట్టిన మొండిగోడల ఇల్లు..
చెమరింపులేని పునాదిని కడిగి.. తలపట్టుకున్న శ్వాస దోషాలని దాటుకొంటూ ..
కదిలే నిద్ర కుండల్లో గడ్డ కట్టిన నడకలో మెలిక తీసి.. కప్పుకు పోయిన ఇంటిని కథలలోకి
పట్టి తెచ్చిన కుదుపు.. సగం రువ్విన కంటి శోధన ఏడ్చిన పాత కథల నిడివి.
మళ్ళీ నేను చెప్పుకోవడానికి లేని జత సాయంత్రపు తెరలని … మంద్ర తపాలని
నాజూకు మాటలని పట్టుకొని.. రంగుల్లో పారిపోయిన కాగడాల జాతర వెనక ఏడ్చి ..
చేర్చుకొన్న చెమట గుండాల్లో .. పడి .. తోడిపోసుకొన్న నాన్న భుజాల నిద్ర …
సమయ నిర్జర కంటిని .. రుణ భరిత శేష ధ్వని కమ్ముకొన్న చంచార్య ఆనుపానులు..
…………….
నాటకంలో వామన ఛత్రి చేసుకొన్న వాన కొండల అలాతని.. నటించి తప్పుకొన్న మాటలని
నంజుకొంటూ.. నాన్న భుజాల నిద్రలోంచి చేరవేసిన పాట .. తాయిలాల తప్పట్లు..
కదలాడిన తెరచాపల మధ్య కదిలించి చేర్చుకొన్న నిండు గ్రహణ సంబంధాలతో
పెనవేసుకున్న నడకలని దాటుకొంటూ.. వృత్తాలుగా కలిసిన చెట్ల మధ్య కొండ దారులు.
చేర్చిపెట్టుకొన్న దేహ నిందల కుట్రని తవ్వుకొంటూ.. తెంచిపోయిన మాటలని తాగి..
వర్ష గుంపులని చేర్చుకొని తల నిండుగా ఉండిపోయిన కంటి చీరలు..
అమ్మ చల్లని కాళ్ళ పక్క నింపిన నీటి కుండలు.. తలపట్టుకున్న దేహ రాశులని తడిపి..
నల్లని కొండలని దాటుకొని నడిచిన సముద్రాలని మంట పెడుతూ..
హద్దు తెలియని ముఖాలని దాటుకొంటూ.. భ్రమిత మందలింపుని చేర్చిపెట్టుకొన్న ముఖాల
బయట కరిగిన చిత్రభ్రాంతి కప్పుకున్న నటనపు భాషణల కైపుని అరగదీసి..
…………….
ఊరు చుట్టిన కొండ పారబోసిన నిద్ర నుంచి చల్లారిన పాటల మధ్య ..
అమ్మ వండి సంచీలో పెట్టి ఇచ్చిన తాటి రొట్టి … thumps up బాటిల్
ఊరుకోమని చిన్న కోపంతో … హద్దు నిండిన కలబాటు మునకల కట్టుడు రాత ..
నీరు పట్టిన చీకటిలో ఒద్దికగా పండిన దేహ నిల్వలో .. తీర్ధాల గట్టు దగ్గర దాహంగా చూసే నది.
నీటి దేవుడి గుడిసెలో మొదలైన చలిమంట .. నిండు బావిలోకి దిగబడ్డ పొగల కొండ
పెద్ద కథలని చాచి పెట్టిన బయట గదులని .. కూర్పు ముఖాలని పట్టుకొని చేర్చిన కథగా ..
పల్చని శ్వాస తెరలో సూది తిరిగిన తెరచాపల రంగు పక్కగా నాన్న పంపిన కబురు..
నీరు పట్టిన చెట్టు.. దేవుడు వదిలేసిన ప్రసాదం.. చెక్క సంచుల పక్కగా గొంతు తడిపిన
భయమూ వాడిదే .. దేవుడు గదిలో మోసిన మట్టి బుజాల బరువూ ..
పూడికలు.. కొట్టి తీసిన కరకు పేజీల కునుకు పేర్చిన దోసిళ్ళు..
పెదాల నిందని కదిల్చి చేసుకొన్న కల తీరుల నడక.. నుదురు పూసుకొన్న పసుపు పెదాల ఊపు
పొడుగ్గా సాగి.. మోసిన ఛాయల నిప్పుని ఊది.. ఉడకబెట్టిన దుంపలని ఊదుకొంటూ..
వెదురు నాడిని సరిచేస్తున్న పాటల మైకపు చెమట ధారల ఊసుల పడక..
అమ్మమ్మ ఇంటిలో వేలాడ దీసిన కథని తీసి.. వాడి ఒడిలో పోసి పాడుతుంది.
………………………
చెల్లి తెచ్చిన వాన .. కథల గట్టు.. ఉండిపోయిన కల
జడ కుచ్చులు.. రంగుల రాట్నంలో ఇరుక్కొన్న పీచు మిఠాయి.. సాగిన బందరు హల్వా..
చెదిరి పోయిన గాలీ వానల కొండపై.. ఒద్దికగా మోసి తెచ్చుకొన్న నీటి రంగుల కథల గట్టు…
సఫల నిద్రలేని గతులని కదిలిస్తూ.. నడక తడిచిన పాటల అద్దకపు చీకటికి నిండుగా ..
సాధారణ ఓపికని.. పెడ చెవిని పెట్టిన నిండు కణ విచ్ఛిత్తి.. తడిపొడి కలలని ముద్ద చేసి ..
నిషార నిద్ర రాశులని కనిపెట్టి.. ఆ లోపలే ఉంచేసిన ముఖాలని పోత పోసుకొంటూ..
చంచిత వర్తులాల మధ్య తీరుబడి లేని … పూడిక లేని చిగురు..
ముద్ద బంతి పూల పరికిణి .. కాలి పట్టీలు..లేత నవ్వు కూజాలో వెలిగిన మట్టి దీపపు పొంగు..
పాల గిన్నెలో పొగలొచ్చే పాయసం.. ఆదమరుపు చెక్క పల్లకీలో బొమ్మల కొలువు
నోటి నిండా వనని తెచ్చే కాగితపు పడవల సందడి.. ఎర్రగా ఉరిమిన ఆకాశం చూస్తూ..
అన్నని పట్టుకొని వణికిన అరుపు నిండా గొంతు క్షీరం నింపే పాట..
దుఃఖమూ.. వీధి బంతిలో పీల్చిన నెయ్యి వాసన … బుట్టలో తరిగిన ఉల్లిపాయలు..
దేహ శకటం అలవడిన నడకని తీసుకొని.. కొండని చేర్చుకొని .. ముందుకు వెళ్ళినప్పుడు ..
ఆరబోసిన అన్నా చెల్లుల గట్టు.. నీటి పథ్యం వదులు కొన్న సముద్రంలో ఉప్పు మోసిన పడవలు..
…………………
పెద్ద ఆనవాళ్ల కథల గట్టు పై.. సాధ్య నీరం ఉడికించిన ముఖ్లకి దూరం జరిగి పొంగు ఊదిన
చీకటి నలత .. నిద్ర కబురు.. పొదల గుబురుని బూచాడు చేసి అల్లిన కథల సంచీ
ఎవరో ఏడ్చినప్పుడు .. తడిసిన నైవేద్యంతో .. మోసిన పాడె వెనక డప్పుల మోత ..
దేనికి ఏడవడం.. దేనికి కంగారు..దేని ఖాళీల్లో ఎవరు మసకబారిన మాటని తీసుకొని..
లోపల కదిలే వాంఛ భూమి చిత్రాల గట్టుని.. పరనింద కలపోత ఉరుముని..
పొందికగా కట్టిన ఇసుక గుడి.. నీటి గొడుగు కింద దాచిన సీతాఫలం.. దోరగా ముగ్గిన అలసట
రాత్రుల మధ్య ఊగిసలాడే నిద్ర పేజీల ఆవిరిని తాగి.. గుట్టు చప్పుడు కాని నిద్ర..
చెల్లి గొళ్ళెం తీయని కలకి.. రంగు మార్చిన దుప్పటి పై .. కొత్త బొమ్మలని అలికి..
కాటుక జారిన ముద్ద చూపులో పెళ్లి పందిరి.. గుండ్రంగా తిరిగిన ఇస్తరాకుల చెట్టు
నీరు మార్చిన కుండలో తడిపోత గొంతుని మింగి.. సల్లబడిన కలతకి మోసి తెచ్చిన
ఇసుక కెరటాల కుప్ప పోతలో గడించిన పాటల కొలువు.. నొప్పి తెలియని నిద్ర జతలు
…………..
ఆగి తూలిన సైకిల్ పక్కగా ఉండిపోయిన కల .. స్థితి మంత్ర కథల సారం ..
ఊరబోత నిలవడి చర్యకి నేసిన కునుకు.. కథకి వెనక దులిపి ఆరబెట్టిన దుప్పటి..
పెద్ద పెద్ద రంగుల దీప నిర్యాణ గతికి ఊరిన దేహాల ముట్టడి..
నిరూప చర్యల మండపంలో పడి.. వేలాడిన వెలుగు ముద్దల సాధ్య శరణు కమ్ముకొచ్చిన
కేకని దూరం పెట్టి.. ఆవిరి పట్టిన లోయలో నిందలు ఊడ్చిన వాన గట్టు..
నిద్రశాలలో ఊరట లేని పాట గదిని అరగదీసి.. కాపుగాసిన నీటి వలసల పొద్దునే కట్టుకొంటూ…
ధ్వని సేకరణ ముఖాలని నదిలోకి లాగి.. పడవలో పాట .. కలలోనే ఉండిపోతూ..
సాపత్య కదలికనే కట్టి తెచ్చిన విరూణ పోలికలని అందిపోసుకొని..
బొమ్మ కట్టు నల్ల పళ్లెం లో వడ్డించిన పడవల చలి విందులో .. రొప్పిన నషా కేకల
ఋణం తిప్పుకొని.. గిరా గిరా లాడిన నవ్వు కోలాటంలో మరిగిన రుచిని ..
సీసాలోకి ఒంపిన నురుగుతో.. నిద్ర బాణిలిలో తొణికిసలాడే సంతర్ప సాగులు..
కలబెట్టిన ఇసుక కుండల వంటకం.. ఆవిరి నిశానీల గట్టు తెంచుకొని మీద పడుతూ ..
ఇంకిపోని నీటిపొగకి కట్టి తెచ్చుకొన్న భావి.. కాటుక గుబులులో నిండిన కల బరువెక్కి
గాజు జాడీలో మెరుస్తూ.. చూపుల బీరువాలో అమ్మ చీర పక్కగా తావీదు.. పాట
తోడి పోసిన నీళ్ల మధ్య గొంతుగా ఊరిన పాట .. చెల్లి మోగించిన జే గంట.. పాట
………………………
వెదురు మొవ్వు.. నిద్ర ఖనిజం .. ఆదమరుపు నది
కలిపిన నిద్ర ఊరేగింపులు పక్కన కూలిన గోడలు.. గాలి సుడులు మోసిన చెట్ల బొడ్డులో
నీలి మంటల పొగ .. ఊరటలేని కునుకు.. నేరడి లేని రాతి గుడుల ముట్టడి
కథకి మోసపు రంగుని కలిపి .. గుట్టు దాటిన నిద్ర ఒడిలో తురిమిన నడక పట్టుని దులిపి ..
కన్ను పాకిన గదిని తేల్చుకొని.. ఆదమరుపు నది. మసి రాల్చిన గొడుగు.
ఎండ మెడ దువ్విన రుప్ప జుత్తుతో .. సంద్రం తాగి అరిచిన కెరటాల కలతని మోసి
తీర్చిన చూపు మెలికని రుబ్బుకొంటూ .. తేల్చి రాలిన నిద్ర బోగపు గోడల
నిండుగా దీపాలు కురిసిన వాన పాట.. చిగురు పూసిన పాట నింపిన ఊరట పోగుల్లో ..
పట్టి పోసుకున్న చీకటి తర్జుమాల మాయని మోసుకొన్న పడక.. నీరందని దుప్పటి..
కదిలిన కెరటాలు వడపోసిన రంగు గంటల చెంప మెరుపులు.. పెదాల కణుపులు
మెరుగు దిద్దిన కంటి చూపు కల్లంలో తిప్పి ఆరబెట్టుకొన్న జోడు బొమ్మల నురుగు..
అప్పటికి చెప్పుకొని.. సరి చేసి తిరిగిన నిద్ర బరువు నిలబోత గంటని కరగబెట్టి..
ఒద్దిక మాసిన శరీర గాలింపుని నాజూకు మతిపోతల గుట్టుగా ఉంచి..
వెనక మాటల పెరటిలో .. మట్టి తవ్వి పాతిన మొక్క.. నిద్ర బూజు దులిపిన పాట..
………………..
తవ్వి పోసుకున్న నిద్ర ఖనిజాల మందకొడి తవ్వకాలు.. జత చేసిన కబురుకి కట్టిన
రెండు గుమ్మాల కావెడ .. విపరీత సమ సాయాల నిద్ర ఊతాన్ని పట్టుకొని తూగిన సైకిల్.
మోగని గంట … పట్టు జారిన చక్రం… పని చేయని బ్రేకు.. చుట్టూ తిరిగి చేరిన నాన్న..
సగం చల్లారిన వాన పొడుగు కాళ్ళని కమ్మేస్తూ .. నీరు మార్చిన ఇంటిలో ..
దేహ సగపు దోసిలి నింపిన కథని ఊరట పెట్టి.. కథ చాపిన నాలికలని తాగుతూ…
విస్తుపోయే నిద్ర కోపపు నాడిని పట్టుకొని.. చెమట చేతులు జార్చిన కొండల మధ్యలో ఇరుక్కొన్న
పడవ .. నాన్న మాట .. వదలొద్దురా .. ఎలా నైనా విడిపించి తీసుకురా.. నీతో కట్టుకొని ..
ఇక్కడ సంతర్పణ మొదలై పోయింది. అందరూ కదిలిన నదుల గట్టు బయట తీరికలు
అధాట్టు సంధికి నీరు గుప్పిన కెరటం పోసుకున్న స్నానాల చోటు…
దేహ తమనిష సత్తువుల బరువు బుట్టలో పంచిన ఇల్లు.. సైకిల్ తిప్పిన వంట ఇంటి నిండా
వేడి వేడి రసం చిందిన జ్వరాల వణుకు .. పాట కునుకుతుంది..
అవధి చర్యల కథకి .. మొండి గొలుసు తుప్పుని దులిపి.. సారబెట్టిన మెలికలు ..
……………….
అరిటాకులో చుట్టి ఇచ్చిన వెదురు మొవ్వు.. ఖాళీ గొట్టాలు.. తరంగ నీలపు పట్టు రాల్చిన కథని ..
తీరికలేని వంతెన దాటించి కట్టుకొన్న మసక తెరల ఊపు. వెదురు కర్రల తోపు
అదే నిద్ర మాయపు కథకి నేసిన కన్నుని పాట చేసి .. దూరం లో విసిగిన కథకి ..
వెన్నులో పోసుకున్న ఉమ్మడి రుచుల గొంతు వార్చి.. .. ఒడి పేర్చి .. కలత తీర్చి .. నడక నేర్చి..
అది నేనని … నువ్వని.. దుఃఖ మందలపు పెద్ద ఊరడి గొంతులో.. తిరగమోతలో…
నిప్పు కవాటం కూరిన ఇసుక నురుగులు కలతని పీల్చిన కబురు.. విని కూలబడుతూ
పొడుగు కెరటం ఊపిన పడవల గట్టుకి ఆవల .. నిద్ర సొరంగంలో .. ధ్వని నిఘాణంలో
ఊట పట్టిన కలత మోగుల జోగిని తడిపి.. కుండపోత వర్షాల ఇంటి సగంలో నేసి తెచ్చుకొన్న
గతికి .. స్థితి సగం చేసిన నిద్ర హోరు తాకిడిని సర్దిన అంపకాల కట్టుడు మాటని పాతరేసి..
కళ్ళలో ఊరిన ఇసుక కొండల మెలికని పట్టుకొని. సానబెట్టిన కథల కొరివిని
ఆర్పక ముందే చుట్టూ తిరుగుతూ సైకిల్…. గుడి కలతని సగం లాగి.. దూరం విడిచి.
ఉరిమిన ఝాము పడక ఆదరణలో మందలింపు క్షణం చుట్టిన రుణ నిద్ర ఆరడీలు ..
తల కొట్టిన చెట్టు దగ్గర ఏడుస్తున్న జడల మర్రి కథలో.. నిప్పు చుట్టిన చుట్టలు ..
నాలికకి తగిలి.. ఊపిరి పొగిలి .. కలతలు పాకిన బిగి నొవ్వలి.. చిగిలి…
ఆపద రాల్చిన కథల సయ్యాటలో .. సగమే పేనుకొన్న పాట ..
…………………………
శ్వాస చెట్ల తోట .. నీటి బిగువు వంట .. అక్క దిద్దిన బొట్టు
నీ పుట్టిన రోజురా … లాల పోసి అక్క దిద్దిన బొట్టు.. అడ్డ పంచె.. పులిగోరు పతకం .. హారతిచ్చి..
కజ్జికాయ పెట్టి.. వాకిట్లో కొత్త సైకిల్.. తగిలించిన సంచీలో దోర జామకాయలు …
ఊరంతా తిరుగుతుంది.. వీరాస్వామి కిరాణా కొట్టు.. అమ్మవారి మంటపం..
బోణం వారి హోటల్.. కథ చెప్పిన గాంధీ బొమ్మల సెంటర్ ..
పాటలు బయటకొచ్చే సినిమా హాలు… నువ్వు ఉండలు అమ్మే వంతెన పక్క చెక్కల బడ్డీ..
నెలల నలత పోసిన నిండు కలతలు నది దగ్గర .. పొడి రాసుకొని.. మట్టి కాళ్ళు ఊపుకొంటూ..
నడుము కొంచెం వొంచి పిల్చినా పడవ … సైకిల్ నా భుజంపై ఉండనీయమని …
పడవ చేర్చిన వెదురు తోట .. దీవి చెప్పుకొన్న జాతకాల వేటలో ఇసుక మేటలు…
అక్క నోటి దగ్గర తేనె జార్చిన వెదురు గెడ.. నీరు ఊరిన గొంతులో సన్నని మాయా గొలుసు
కృష్ణ ఛాయ మెరిసిన అక్క కళ్ళలో బృందావనం … గాలి అలల లోంచి పాట ..
శృతి కలిపిన అక్క గొంతులో.. పాట .. కంట్లో పండిన తేనె చుక్క ,,పుప్పొడి రాలే నది
పప్పు .. నెయ్యి.. అల్లం పచ్చడి కలిపిన అక్క ముద్ద .. ఉతికిన దుప్పటి..
మంచo కింద పెట్టిన సాంబ్రాణీ పొగల కుంపటి..
చర్యల సాధనాలని మోసే .. గుట్టు చప్పుడు చక్రాల నిండు పండుగ ..
అమ్మకి నయమైపోతుందిలేరా ..నాన్న ఉన్నారుగా ?
………….
దుఃఖం చుట్టిన నీటి బిగువు వంట పాట .. అది ఆరిపోని నిద్ర తూపుల తోరణం కట్టిన
చీకటి స్మశాన కథలో మోగే గజ్జెల చప్పుడు.. రాయి పడ్డ భావిలో కప్పల అరుపు
పొగ రుతువులు.. కాల్చి చేసుకొన్న ఒప్పంద తకమికలు .. బొడ్డు చుట్టిన నవ్వు..
కాగితపు పడవలో చేరుకొన్న ఊరు.. చీకటి పొగ పట్టిన గొడుగు
వెనక గుమ్మం లో ఏడ్చిన అక్క … గాలి నుదిటి కొండలో వాన కప్పిన యేరు పక్కగా ..
స్టాండ్ వేసి మరీ చూసుకొన్న సైకిల్.. పెళ్ళలుగా రాలుతున్న మగత నీరు
గోడలు వండవు.. దుప్పటిలో నిద్ర లేదు.. పళ్లెం లో అన్నం లేదు..కళ్ళాపి చల్లిన నెలలో ..
అమ్మ కాళ్ళ గుర్తులు లేవు. పాల పితికే చేతుల్లో మట్టి గాజుల చప్పుడూ లేదు.
అక్క నీరు.. జోకొట్టి గుక్క పెట్టిన అక్క.. ఎక్కడో దొరికిన చిల్లరతో వండిన నూకల అన్నం ..
పెరటిలో గోంగూరతో పచ్చడి.. ఆదమర్చిన నిద్ర దగ్గర తన చీరని పర్చిన పడక…
………………
పాట బిగువు కన్ను పక్కగా శ్వాస చెట్ల తోట..కదిలి నిద్ర పోయే మసక అడుగుల కథ చుట్టూ..
తొణికిసలాడే .. ధ్వని బిగువు కలతని చేర్చి.. నీరు మార్చిన రశ్మీ ద్రవాల గొంతు బిగువు
కాల్చి పెట్టుకొన్న కడుపు లోంచి మోసిన పాట .. రంగుల ఝాము చుట్టుకొని రాలిపోతూ..
కడిగి రాల్చిన బియ్యంతో పడవ .. నిండు కొండ ఊగిసలని సరిచేసి ..
మోసి తెచ్చుకొన్న కొండల మధ్య కుదురు దొరకని కత్తి నూరుతూ..
చల్ల కుండలో పెట్టిన వేపమండల .. పసుపు కలిపిన పరిమళ మాల పాట..
దీపం నరికిన చెట్టు నుంచి కారే పాలలా పాట .. నీరు చల్లిన వాన దీవెనల గడప .. పాట..
ఊరు దొరుకుతుంది,.. సైకిల్ చుడుతోంది.. గుడి మోగుతుంది.. చెరువు పండుతుంది.
నది ఇంకాసేపు కూర్చో అంటుంది.. దుఃఖం తేరుకొన్నప్పుడు కెరటం చుట్టుకొని..
గొంతులో పోసిన కెరటపు అంచుల నురుగు పాట.. కథల నీటి కుండ..
గాలి నేసిన దోమ తెరవెనక .. అక్క కుట్టి అమ్ముతున్న చలి కోటుల కష్టం పాట..
నడిపించి .. నిద్ర పుచ్ఛి .. నిద్రలో నింపుతుంది.
………………….
అవ్వ ముద్దలు.. శొంఠి దీర్ఘం .. చూసిన పాట
కథలు తెరిచిన ఊరిలో ఆ నది ఒడ్డున .. ఆ పాత మంటపంలో .. కొన్ని కొబ్బరాకులని అడ్డం
పెట్టుకొని .. అవ్వ కుండలోంచి తీసిన ముద్దలు.. తొక్కు కలిపిన పెరుగు ముద్దలు.
కంటి చూపుకి పల్చని ఆవిరి కందకాలని చుట్టుకొంటూ.. తేరుకోలేని దేహ భూమి మోసిన
నిందలని … ఊరు కలిసినప్పుడల్లా .. తన ఎడమ కన్నులోకి తోసి అదిరిన పొగరుని ఉడకబెట్టి..
అల్లం .. శొంఠి .. వేర్లు.. తేనె .. ఆకులు కాసిన కషాయం .. రోగాలని తీరుస్తూ..సాయంత్ర దీపం
వెలిగే వేళ .. శ్వాసని పిండి … తన బిడ్డని మింగిన నదిని చూస్తూ ఆమె పాడే పాట..
నిండిన కథల బయట కన్నుని తోడు తెచ్చుకొంటూ.. తేరుకోలేని రంగు దుప్పట్ల పడకని సర్ది..
ఊరుని నింపి తెచ్చిన సైకిల్ ని అవ్వ ముందు దులిపాక .. చంచరిత ఛాయల అసమ రాత్రుల
కొలువు..ఇసుక జాడలు తొలచిన రొప్పు.. కథలు పోసుకున్న భావిలో ఉరిమిన కంటి శోషలు
ఇదే కథ .. నొప్పి తెలియని చీకటిలో మోసి తెచ్చిన కునుకు.. శ్వాస తడిచిన బెరుకు …
సరిలేనివి.. సరి కానివి.. లోపల తట్టుకొని .. దూరంలో కూలినవి.. పొగ ఊడలు .. పాటలు..
ఆమె బిడ్డని సైకిల్ తో నదిలోకి వెళ్లి తెస్తానని వాడు.. ఆమె పట్టుకొని వెళ్లనివ్వలేదు…
…………..
కదిలీ కదలని నవ్వు చుట్టిన వానల గొడుగు కింద మట్టి పేర్చిన పడక ..
కదలని నిద్ర శూన్యాలతో.. తిరిగి చేర్చుకొన్న మాటల కలియకని పెట్టుకొంటూ..
దీర్ఘ సమాధికి కట్టిన దుఃఖం మాసిపోతూ .. తాను ఎలా వచ్చిందో ఈ భూమికి తెలియదని ..
నిద్ర వరస తప్పిన కన్నీరు బయట కథని దాటుకొని.. జోడించే మసక తెరల గతిని మోసిన
చలన ద్రవపు ముంపునీ.. పొగడ దండల యేరు ఎండిపోయింది… కథని చెప్పింది.
రాత్రి అక్కడే ఉండిపోతానని చెప్పిన సైకిల్ .. పొద్దునకల్లా ఏమైందంటే ..రాత్రoతా ..
తిరిగబోసుకొన్న ఊపిరి జడని అల్లుకొని.. మళ్ళీ చేర్చుకొన్న కథలని కాపుగాసి..
దృష్ఠి నలతని చేర్చి సగం చేసిన చీకటి నిద్ర పోతలని కుదిపి.. తెల్లార్లూ నడిచిన భాషణ
అడ్డుపడుతూ.. కథలే కథలని అచ్చు పోసుకున్న కునుకుని దాటుకొని.. మళ్ళీ చేర్చుకొన్న
శ్వాస మెరుగులు.. చుట్టూ తిప్పి చెలరేగిన కంటిని తీసుకొని ఒరిపిడి రాశుల కావలింత .
కనబడని.. కనబడి ఉండిపోయిన బెరుకు కళ్ళతో చూపుని కదిలించి ..
చర్యలని సర్దుకొన్నా ఊపిరి రొమ్ముకి అరగదీసిన నల్ల కాళ్ళ ఇంటి బయట పాటలని దాచుకొని..
గొప్పపడ్డాక .. లిపిని మార్చి చేసిన నిందల ఖాళీ పొగ ఊరిన చెమట పూతలు..
తెలియని.. తెలిసిన .. వినబడని.. కనబడే వర్ణ శాపంతో నుజ్జయినా ..
మండపం మోసిన పడవల మధ్య నీటి సుడి .. విప్పి పెట్టుకొన్న పెదాల నీటి ఆనవాలు..
ఇంకిన నిద్ర దోషాల ముడిని మెలిపెట్టి.. తేరుకోలేని నడకతో వాలిపోయిన ఇల్లు..
………………..
పడవ నదిపై ఆరబోసిన అమాసని దాటుకొని.. నిద్ర వరద కాల్చిన అంపకపు ఇంటి బయట కన్ను
దాచిపెట్టుకొన్న చూపుని పెట్టుకొంటూ.. కనిపెట్టి వదిలిన అయస్కాంత చలన దృష్ఠి వృత్తాలు.
అదే ఇల్లు.. మాయ గుచ్చిన శరీరంలో పల్చని రక్త నిఘాని జోడించి కాల్చిన కథని …
అమర్చిన కలలు.. వద్దని పోయిన శిధిలాలు.. కంట్లో చేరిన పుట్టుకలు,. రువ్విన బట్టలు.
కాదూ కూడదనే నిద్ర బయట .. కప్పుకున్న వర్ష సెగల ముంపునీ .. సడలింపునీ…
ఉన్నదీ నేనే .. ఉండాలనుకొన్నదీ నేనే .. కంటికి చుట్టిన చీకటి కథల నొప్పినీ నేనే ..
కొన్ని ఊరి బయట తీర్ధ స్థలాల్లో తిరిగి …తిరిగి… అవ్వ కోసం దొరికిన కథ..
విపుల నికారపు ముఖాలని దట్టించిన అంపకాలని మెత్తుకొని.. చల్లార్చిన దుఃఖ భూమిలో
ఒకే సమయ నివేళ కథకి మోసిన గుమ్మాలు. కొంచెం దూరంలో చూపు వాల్చుకొన్న పాట…
……………………
దూది గొంతులు.. జీర బెల్లపు పాకం .. నిద్ర కన్ను
భయం ఏకం చేసుకొన్న చెట్ల కింద .. కల్లు కుందని ఎత్తి మోసిన పదాలు.. జీర భోగాలు ..
ఆ ఇల్లు .. నడక కూలిన మాటకి చేర్చి సాగిన నిద్ర పొడిని కలిపి తాగిన రెప్పలు..
అదే చెరిగిపోని నిద్ర పూతల కలయికనే కప్పుకొని నిల్చిన ఉక్క..
త్వరపడి కదిలిన కాళ్ళ చెమ్మ శ్వాసని కాచి.. ఎత్తి కుదిపిన దూది గొంతులు..
చీకటి కాల్చిన రొమ్ము తడి గండాలని కప్పుకొంటూ.. పిసికేసిన కంటిలో చూపు మోసిన
గుస గుసలు.. రుస రుసలు .. మసక మసక జోడింపుల వెలుతురు తెరలు.
తీరిక లేని యుద్ధ గతిని కనిపెట్టుకొని.. ఇంకిపోయిన చదును భూమిలో కదిలే
నిద్ర దర్శన తీరికలని కనిపెట్టి చేసుకొన్న ఒప్పంద నిద్రల గుట్టు..
చెదిరిపోయిన చీకటి దోమతెరలు .. గుట్టలు పడి ఎగురుతున్న కంటి చాటున కాస్తున్న
బెల్లం పాకం .. చుట్ట కలిసిన మగత వాసన .. పులిసిన రేవుల్లోంచి పడవలని లాగేస్తూ..
పెడసరపు నిద్ర నదిలో కూలిన దీవుల మధ్య .. తాడు చుట్టిన పాటలు.
నిల్చొని ఉండిపోయిన కత్తి సాముల కళ్ళం .. గుర్రాల శాల.. నిద్ర కుదిరిన నడకలకి చేర్చుకొన్న
చీకటి తానుల పెనవేత … చీర మడతలు.. గుమ్మంలో పాటని మోసే కొండలు…
………….
నిద్ర కన్ను నిండా కల ఇచ్చి పోయిన నిద్ర తాఖీదులు.. ఒరిసిపోయిన కథలని తాగి ..
మోసపు శ్వాసకి చేర్చిన గండాలని దాటుకొంటూ.. ఋణం తీర్చిన కథని పాట చేసి కమ్ముకొస్తారు.
వద్దని .. అవునని.. కాదని .. కూలిన మాటల మధ్య కలిసిన చూపుల గుచ్చం తెంచి ..
విసిరిన ముట్టడి రంగుల శ్రమ తుడుచుకొని.. నిత్య తాప మోకరింపుల సల్లడి పోసిన
నుదిటి గండాలు.. నిత్య తీర్థపు హద్దుని దాటి గతి చక్రాల కునుకుని లాగిపెట్టి..
ఇంకిపోని నిద్ర గది చెలగాటపు నొప్పిని కలుపుతూ.. హద్దు చేర్చిన కథ..
ఆయన అమ్మమ్మ ముందు పాడుతున్నాడు.. ఏమాత్రమూ గొంతులో తొణికిసలాట లేకుండా
కెరటం లేచి నిలబడే ఉంది.. దుఃఖం చెలరేగిన నది.. కలతో మునిగి తపస్సులోనే ఉంది..
చేరి సగపు దారిని నేసిన కథ ఎటూ పోక .. జోడించిన నల్ల చీకటి గోడలని కట్టుకొని..
కథలో నేసిన మెట్లని కాల్చి.. మోడులని ఎత్తిపోసుకొంటూ .. శరీర చెమటలు గుట్టలు..
కలిపి చుట్టుకొన్న చర్యల నడకని కలుపుకొంటూ.. మోసపోయిన కాళ్ళ కిందుగా జరిగి వెళ్లే పాట ..
జరిగే జరగని దుఃఖ కథల విపులతని మోసుకు వెళ్లిపోతున్నా.. ఉండి కదలాడుతున్నా…
ఇంకా వినని చప్పుడు కదలక ఈడ్చుకుపోతున్న దుఃఖపు అరుపులు..
………….
దూది కళ్ళలో నచ్చని చూపుల నల్లని గదుల మంత్ర చాపపు బాటలో ..
తోడులేని భయం పోసిన పాటని కడిగిన భావి ఊరుని చుడుతూ… వెల వెల బోతూ
హద్దు బయట కదిలిన దేహ దీర్ఘపు నిరశత మోసుకొన్న కదలికల ఊపుని పట్టుకొని..
ఉన్నప్పటి నేనులో అంతా ఉందా ? ఉండలేని నేనులో కొంచెం చాటుగా నింపుకుందా ?
అదే స్వస్థ నిద్ర పూర్ణపు మంగళ చితిని చేర్చిన నీళ్ల పులకల వాన రేవులు…
కరకు గొంతులో .. ఊపిరి అరల చీకటి దట్టపు కలల నిరూప గాజు గోళంలో గాలి పోటు..
అక్కడికి వచ్చి తెలుసుకొన్న .. మాట పోసి తెచ్చుకొన్న .. కలత వాగుల దుముకుడు..
నీటి సిగ్గు చిమిడిన అన్నంలో.. హోరు పెట్టిన కలత జడలని దువ్విన శూన్య శిలగా ఉంచిన
అద్దాన్ని సైకిల్ గుద్దాక .. మరో ప్రయాణ మలుపుని సరి చేసి కట్టుకొన్న శిధిల నిగ్రహాలు
ఇగిరిపోయిన కళ్ళలో .. ఆవిరి లోయల విపరీతపు పొంగుల నిద్ర దీపం కదిలిన ఇంటి చుట్టూ..
చెట్టు మోసిన కాపలాలు.. పడవ పట్టిన చేపల గొలుసుతో.. నురుగు పడిన కెరటం తాగిన దీవి ..
దొరికిపోయిన కథల మెట్టుని దాటుకొంటూ.. విసిరేసిన శ్వాస దీర్ఘపు చలన నాదం జోడించిన
కంటిలో నిషేధ ధారగా ఉండిపోయిన మట్టి గుమ్మాలు.. ఒరిగిన సైకిల్ పక్కగా పాట ..
అలముకొన్న చలన దీర్ఘ నిందలని కొట్టుకొంటూ.. పేరుకున్న కొండల మధ్య
నిశేష ధ్వని కలతని కాల్చిన ఊరు…. అక్కడే పుట్టిన పాటని తీసుకొంటూ….
…………………….
నుసి తీగలు.. అమ్మ దుప్పటి.. కథలోని చలి గాలి
కళ్ళకి పూసిన నుసి తీగలు అల్లు కొంటూ.. దుఃఖ భాషిత ఊరిలో కథకి నేర్పిన చెట్ల గట్టు..
కొండ దగ్గర రాతి మండపం.. ఆ మూలగా ఎండి కదలలేక పోతున్న గది.. కొండ తొలచిన
ఆవిరి కెరటాల చమురు మంట.. ఊగిసలాడుతున్న నిద్ర దర్శన ఎండలలో నెరిసిన రాతి
బీటలు…అదే అడుగుతారు.. ఏదో చెబుతారు.. గదిలో చప్పుడు చేసిన భావి గిలకని వేలాడదీసి..
పాట తాగిన నీళ్లని వింటారు. జోగుతారు .. మురుస్తారు .. వెళ్లాలా ? అంటారు.
వాళ్ళు కొన్ని తేగలో .. ఇన్ని తాటి ముంజెలో.. కొంచెం తాటి బెల్లమో ఇస్తారు.
అక్కకి ఇవ్వబోతే .. నవ్వి నువ్వే తినులేరా … అంటుంది.అక్కడేం పాడారో నాకు వినిపించరా..
వాడు పాడతాడు.. పాడుతూనే ఉంటాడు.. రాదనడమే తెలియని వాడు…
అక్క రాత్రి ఇన్ని ఇడ్లీలు వేసి.. సంతలో అమ్మడానికి ఇన్ని బుట్టలు అల్లి..
చలి కోటులు కుడుతున్న .. ఇంకా పాడుతూనే ఉంటాడు..మధ్య మధ్యలో అక్క పెట్టె
ముద్దలు తింటూ.. అక్కడే నేల మీదే పడుకున్నా ..లేచేది మళ్ళీ మంచం మీద నుంచే..
వాడికి దుప్పటి కప్పి.. దీపం ఒత్తి తగ్గించి.. దోమ తెర కిందికి లాగి ..వీడి పాట ఎప్పటికైనా ..
ఈ ఊరుని నగరపు నడి బొడ్డున నిలబెట్టి .. తలుపులు తీసి …వెలుగు నింపుతాడని..
……….
అమ్మ దుప్పటి.. నాన్న రెక్కల కష్టం.. దీపం సర్దిన గొంతు క్షేమాల బయట నీళ్లు నమిలిన
కథల తీర్పుకి సరికాని నిశ్వాస క్షేత్ర దర్శన .. ఆలిన్య హద్దులే చుట్టిన స్థితి చప్పుడుతో నగారా ..
అదే ఉందనడానికి లేకుండా అంతే ఉంది.. అడుగులో కడిగి.. తుడిచి …లాగబడి..
నెరిసిన దృష్ఠి గోడలమధ్య జారుతూ.. కన్నుకి చుట్టిన నుదుటి పోతల రంగు నిప్పులా పాట..
పొగ పూసిన కంటి దీపం మోసిన సైకిల్ .. మట్టి హోరు నులిమిన వర్ష శపిత అడివి కలత మధ్య ..
చుక్క నీరు లేక ఎండి పోతూ.. దేహ నిద్ర గడ్డ కట్టిన కలత కూరుకున్న మాటల్ని మింగేస్తూ..
ఏదో మూడు రోజుల మహా పూజ తలపెట్టి.. చుట్టూ అందరూ ఉన్నా .. చివరి రోజు వాడి పాట కోసం..
ఊరే అక్క ముందు..చేతులు కట్టుకొంది. విల విలలాడి పలకరించింది…
సన్మానం .. బియ్యం మూటలు.. వెండి కడియం.. ఇంత మొత్తం లో సొమ్ము..
వాడు అక్క వేపు చూసాడు.. ఆమె సైగ ని తీసుకొని.. తల అడ్డంగా ఊపాడు.
వాడొచ్చి పాడతాడు.. మాకు ఇవేమీ వద్దు . వాడికి మీరిచ్చే ఆశీస్సులు చాలు… అంది.
అక్క గుర్రపు బండిలో హార్మొనీ తో.. వాడు వెనక సైకిల్ .. బెల్ మోగించుకొంటూ..
……………..
కొండలలోంచి రాలిన తేనె పట్టుని తాగినట్లు..తెల్ల నురుగులు చీర కట్టిన సముద్రం..
రంగు రంగుల డబ్బాల్లోకి దూకి బయట కొచ్చినట్లు.. ధ్వని పాయలు చుట్టుకొన్న.. నెట్టుకొచ్చిన
అడివి నలతల కొండల ముందు పడి.. గతి ఆర్దన ముక్కలుగా పట్టు దొరికి
చిక్కని అమాస కొండ..నిద్ర చెమర్చిన అడివి మొతాన్ని మంచు కప్పి .. అమాస చీర కట్టిన
దేహ స్థలంలో నిద్ర వాగుని నింపుకొన్న గొంతు దోషపు మందలింపుని కడిగి..
ఇంకేం లేదని ఒప్పుకోకముందు.. అటు తిరిగి మాటని కాల్చే నిమిషంలో..
నెగడు వెలిగించినట్లు.. కథలోని చలి గాలి చీకటిలో నైవేద్యం పెట్టినట్లు..
కథ కాల్చిన ఏటి నీరు గొలుసులు గల గలలాడినట్లు.. శేష భూమి పడగ విప్పి నాట్యం చేస్తున్నట్లు..
చితి వాగులో దేహ చలన గతికి చిత్రిక పట్టిన కథ .. మళ్ళీ స్నానం చేసి తలుపు కొట్టినట్లు..
వాడి పాట .. ద్వయ వర్ణ స్థిమితం ఎక్కుపెట్టిన మసక బంజరు భూమిని పట్టుకొని …
వర్ష రధం సన్నాహమై.. ఉరుముల చప్పుడుతో పరుగులు పెట్టి..
ఆకాశం మండలం సర్దిన నీటి కుండలన్నింటికీ ఒకేసారి చిల్లులు పెట్టి కార్పించినట్లు వర్షం..
నీరు చిందిన హార్మొనీ ఆ చిన్న వేళ్ళతో ఊగిస్తూనే .. వర్షాన్ని నింపుకొని పాడుతూనే ఉన్నాడు.
,,,,,,,,,,,,,,,,,,,
జిలేబీ గొంతు.. రుణపడిన గట్టు.. మోగిన కళ్ళు
గొంతు కట్టిన మట్టి కొండల పరిమళం లో నిద్ర తడిపిన నదుల ఊట ..
కథ నిర్మాణం లో మోసి తెచ్చుకొన్న దేహ జతల బిగువు.. తడి చెప్పులు .. నూలు చీరలో
జల్లించిన గొంతుల జీర .. తడబాటు నిషాలు కలిసిన ఏక నిద్రల గొడుగు కింద…
అటు మోసి.. ఇటు కరిగి.. ఊరు నేసిన చీకటి పక్కలో శంఖం ఊదిన సముద్రం..
అదే చెబుతుంది.. ఇక్కడో మాట .. పాటగా ప్రవహిస్తూ.. స్థితి గొంతు గడపని కట్టుకొని ..
ఆ రోడ్డు చివర బొడ్డు పొగలో … స్మశానం పక్క వంతెన కిందుగా .. కుడి వీపుకి తిరిగి..
కొంచెం అడివి ని మంచు పొందాలని పలకరించి.. మట్టి కొండపై భద్రంగా కాలు ఉంచి దాటితే..
వాడి ఇల్లు.. నాన్న సంపాదన కి బయట దేశం వెళ్ళితే .. వాడి అక్క ..
తన రెక్కల్లో దాచుకొని.. వాడిని గాల్లో తిప్పుతూ.. పాటని ఊరంతా చిమ్మేలా …
ఒకే ఒక్కటిగా ఉన్న భూమి తోవలు.. చూపు పోసుకున్న స్నాన బావులు.. చెట్ల మొవ్వుని కాల్చి
దించిన నీటి బరువు కలతలని పడవలోకి ఒంపి.. రొప్పిన కెరటాల శ్వాస అస్థిరలు మోగుతూ…
చెమట పండిన స్నానం .. దుఃఖం చల్లిన మసక నీరులో కుట్టిన మేఘదారపు చిక్కుల్ని విడదీసి..
మాట తీర్చుకొన్న కథకి .. తీపి నిద్రని కాల్చిన జిలేబీ గొంతు …
……………
అక్క వాడికి రుణపడిన గట్టు .. నీటి వాలు తెలిసిన వాడి పడవల రాక..
బొట్టు పెట్టి మొదలు పెట్టిన సంతర్పణ .. తీర్ధంలో పల్లకీ వదిలిన అమ్మవారు..
ఇంట్లో ఉతికి ఆరవేసిన అమ్మ దుప్పటి.. నాన్న వాలు కుర్చీ.. పెరుగు చిలికిన మట్టి కుండ..
వాడి పాట అక్కడిదే .. హడావుడి లేదు.. ఉరుకూ పరుగు లేదు.. స్థితి పూర్ణ జీర
కిందా మీదా పడదు.. మాటలు బదులు తెచ్చుకొని పోల్చుకోదు.. నేర్చుకోనివ్వదు
ఉన్నదీ ఉన్నట్లుగానే ఉంటుంది.. లేనిదీ ఉన్నట్లుగా కనిపిస్తుంది.. కదిలేది కదలదు..
అదేమీ నిశ్చల చిత్రం కాదు.. కొండ పక్కగా ప్రవహించే పుప్పొడి ముఖాల నది..
విరిచి పెట్టుకొన్న గొంతు ఛాయల చిక్కని మాటని కలిపి పట్టుకొని .. గట్టు చేరి..
పడవని అడిగి.. బదులివ్వని దీపం కోసం.. ఆ ఇంటి ముందే ఆగిపోయి..
ఇక్కడే ఎక్కడో.. దుఃఖ స్మరిత కౌగిలి మాటరాని గ్లాసులో పోసి .. నిద్ర చూపులని పట్టి తోసుకొంటూ..
నీటి భ్రమణ గారడీని తప్పించిన చీకటి కన్నులో పోసుకున్న చిత్ర పూడికలు మోసిన మరకలు..
అదే చిత్రాల నిప్పుని .. కలబెట్టి.. నింపుకున్నస్మరిత గొంతుకి లేవదీసిన అనుమాన రంగులు,.
………
నాన్న రెక్కలు కట్టుకొని వాలి విన్న వాడి గొంతుకి మోగిన కళ్ళు ,, స్థిమితం తెలియని ఆయాసం
బరువంతా దిగిపోయిన భుజాలు.. వెన్నంతా దిద్దిన కథన రాశుల ఊపులు
కన్నుగప్పిన నిద్ర తీరికల మాసివేతల గోడలని పట్టుకొని .. చేర్చిపెట్టుకొన్న నిద్ర గొలుసుల
మధ్య పాట … తడి రంగు భూమిలో పోసుకున్న నూనె మంటల చేరడీ …
దృశ్య నాల్కలు మోసిన కేక.. తలబాటు నిద్ర వరదలో పోటుపెట్టే ఇంటి చప్పుడులా
గాలి పొంతనలు … మోట రాకలు .. బండి గుర్తులు.. వదిలి జారే నడక చూరులు
తృప్తి రాల్చిన కంటి బొట్టుని తాగి.. నుదిటి గదిలో ఫోటో బిగించుకొని.. దగ్గరగా…
నిండు గ్రహణపు బొంగరాల తిప్పుడు అలాతని సరిచేయక… కదిలీ నిండిపోనీయక
ముందే ఆగిపోయిన నిద్ర కాళ్ళ నిండా వాడి పాటనే కట్టుకొని తిరిగే నాన్న..
చుట్టూ ఉన్న పట్టణాలకు వాడి పాటల మూతని విప్పి కళ్ళ పట్టుని చిలికి పంచాలని..
భయం కూలిన ఇంటిలో .. కిటికీలని కట్టి గుమ్మాలు మూసిన కంటి తీర్ధంలో
స్థిమిత జాగరణ రక్ష నులిమిన పొగల ముంపుకి .. సరిచెయ్యని నిర్జన రాత్రి పెద్ద కుదుపుకి
చెలరేగి నేర్పుడు రుణ కీర్తనకి ఉండిపోయిన .. అనుమాన సగాల ఇంటిని పక్కకి తీసి..
సరిహద్దు పోలికలని జోడించి కదులుతూ.. ఆ మూలకి ఉండిపోయిన .. మట్టి నడవాల మధ్య
ఇగిరినా నిద్ర దర్శన బిగువుని తుడుచుకొని.. ఇసుక గుడుల నవ్వుని పంచుకొని…
ఒంపి రాల్చిన కొండల మధ్య వణుకు పర్చిన నదీ ప్రయాణం.. పాటని దీపం లోకి ఒంపుతూ…
……………………..
రెప్పల కునుకు.. చిలికిన పాట .. గాజుల డబ్బా
అక్క నిద్ర పోతుంది.. అడివి జోలని తాగి.. నదుల చెమటని తుడిచి.. సముద్ర గోషని ..
దుప్పటిలో చుట్టి.. కథ పంచిన దుఃఖపు నలతని సరి చేయక ముందే ..
వాడు నిద్ర పోలేదు.. అక్క నుదిటి మీద తడి గుడ్డ మారుస్తూనే ఉన్నాడు..
నాన్న కోసం గుమ్మలో అటూ .. ఇటూ తిరుగుతూ.. తగ్గని వర్షాన్ని చూస్తూ…
సిమెంట్ ఖాళీ సంచీ తీసుకొని .. వణికే ఒంటికి బలంగా వానని చుట్టుకొని…
నెత్తి మీద వేసుకొని.. అక్క గాజుల డబ్బాలోంచి.. కాసిన్ని డబ్బులు నిక్కరులో పెట్టుకొని..
ఒకటే పరుగు.. వైద్యుడు ఇంటికి.. ఇప్పుడెట్లారా అని ఆయన .. కాళ్ళ మీద పడ్డాడు..
సైకిల్ నడవదు.. ఓ పాత గొడుగు.. మందుల పెట్టె .. సూది మందు.. జోడు తొడగలేని కాళ్ళు
అక్క గుమ్మంలో ఆందోళనతో.. ఎవడు వెళ్ళమన్నాడురా ? అని.. అరిచి.. వైద్యుడి చూసి ..
ఆగి.. ఇంజక్షన్ .. మాత్రలు.. వాడు వైద్యుడిని వెళ్లనివ్వలేదు.. అక్కడే పడుకోమని..
అతను నవ్వుకొని.. అక్క ఇచ్చిన జావ తాగి అక్కడే … చతికిలబడి నిద్ర పోతూ
మహా వివశన నేర్పిన మృత్యు తోపుల నిద్ర గోళంలో పడి చుట్టుకొన్న ..
అవ్యయాల నిగారింపుని పోసుకొని.. జోడింపులు లేని తలుపులని కుదిపి..
ఒంటి జోలని కలిపి చెప్పుకొన్న కథలని కూర్చి అప్పగింతలు చేసుకొన్న …
మితి చర్య ఒప్పందాల నిగర్పు.. కలతలు కుండలో పేరుకున్న దుఃఖ ఒగర్పు ..
………………
చిలికిన పాట .. అక్కడ తమలపాకులో పెట్టి ఇచ్చిన మీగడ .. నిండు పెదాల రుచి దీపపు
నల్లని చీకటి అమర్చిన హద్దుని నెట్టుకొని.. మట్టి నిద్రల కాటుక గట్టుని తవ్వుకొని..
ఝాము తెరిచిన గదులకు .. రంగు నలతని తాగిన చక్ర దర్శన కుదుపులకి చేర్చుకొని..
ఇగిరిపోయిన గొంతులో .. తడబాటు లేని నిగ్రహ స్థితి కలతకి నెరవేర్చిన కుదుపు
అలుముకొన్న నిద్రచూపులో తడి పొగల కమ్ముకొన్న దేహ వార్తలని తుడిచి..
వీధి మొత్తం తెచ్చి పెట్టుకొన్న మట్టి పళ్ళాల మధ్య కూరుకు పోయిన నిద్ర స్వేధపు గతం
చెప్పిన కథ అదే అని తెరిచిన దీపాల గట్టుకి .. కలబడిన పాటల పట్టుకీ ..
చెదిరిన నిద్ర పాదుల అల్లికని చుట్టుకొన్న ఇరుకు కొండల మధ్య ఊరటలేని
గది గుచ్చాల మెలుకువ తట్టిన కథన దృష్ఠి .. చెలరేగి చల్లారిన ఊపులు..
…………….
వాడు పాడుతూనే ఉన్నాడు.. అక్క రెప్పల కునుకు ని పట్టుకొని.. కలలోకి జారినపుడు..
దీవిని జల్లించిన ఊపిరి కోతల కెరటాల బిగువుని తెంచుకొంటూ..
పెడ తొవ్వల గట్టుపై.. నదీ ఒంగి పిల్చినా నీటి పిలుపు కథకి .. జోడించిన చిహ్న కదలికనే కలిపి ..
ఊరట లేని దుఃఖ సమలయ ముఖాల కొలువుకి .. సాధ్య మెరుపులు రుద్దిన జారుడుపోతలు
మాట పట్టిన ఊరట రంగుల దుమారం … సాధ్య భారం తెలియని అశాహేయ కలకలం..
కలుపు తీసిన గొంతులో.. వేడి చేసిన నును లేత నీటి పాయల హోరు..
కలబడి.. వినబడి.. కంటికి చెరబడి.. దుఃఖం నిలబడి.. వణుకు తడబడి..
సంతలో కూర్చొంటే ఆ పాటల పిల్లాడి అక్క అని సంబరపడి.. చుట్టూ మోగే జనం ..
కథలని సాగదీస్తూ … బుగ్గలు నొక్కుకొని…వెండి కడియాల కాళ్ళని తిప్పుకొంటూ..
లేత వేళ్ళ హార్మొనీని కొంచెం చేతుల్లోకి తీసుకొని.. పండో .. కాయో.. ధాన్యమో తెచ్చి పాట
అడిగినప్పుడు .. చిదిమి రాల్చినపుడు … ఆ సంచీలు మరెవరికో పంచి వచ్చేది..
ఇస్తూ పోతున్న ఊపిరి గొట్టం లోంచి కట్టెల పొయ్యిని ఊది వడ్డించేది..
జనం వస్తున్నారని .. దిష్టి తగల కుండా దుప్పటి అడ్డం కట్టి .. తిన్నాక తీసేది..
చెట్టు బిరుదు.. ఆకులూ నూరిన మందు.. తేనె చుక్కలు .. నెయ్యి కలిపి ..
వాడి గొంతుకి ప్రసాదమిచ్చి పాటల ఊతాన్ని … రోజూ చెక్కేది..
………………………
మట్టి గోడలు.. వెదురు రాతలు .. పెళ్లి ఇల్లు
నాన్న ఒంట్లో పేరుకున్న బెంగ .. ఇంకో వర్షం మోయలేక ఒరిగిపోయేలా ఉన్న గోడలు..
దుఃఖపు అనుసంధానంలో హోరు పెడుతున్న అనుమానాలు.. తల బరువులు
ఎదిగిన అక్కకి ఎలా పెళ్లి.. కొంచెం చిన్నదైనా . పెద్దమ్మ రెండో కూతురుకి పెళ్ళై..
పురిటికి వచ్చి ఉన్నప్పుడు… బరువెక్కిన పాటల నెల నొప్పులు.. కలబడే చంద్ర కూలడి
గతి మంత్ర సాధనాలు.. విపరీత గమన మూర్తికి మోసపు గొంతు చెక్కిన కలత పోట్లు..
నాకే పెళ్ళీ వద్దు.. వాడి చదువు ఆగకూడదు.. సంగీతం మాస్టారు దగ్గరకి పంపాలి..
లోతులోంచి వాడు ఎదగాలి.. వాడి కోసం నలుగురూ గొప్పగా చెప్పుకోవాలి….
అతను నిస్సహాయంగా .. ఆమె అమ్మ నగలు.. తన గొలుసు కూడా తండ్రి చేతుల్లో..
ఇంకేం వద్దని నాన్న చేతులు పట్టుకొని నువ్వు అక్కవి.. అమ్మవి కాదుగా .. అని..
ఆమె పలవరింతతో.. కాకపోవచ్చేమో.. కాని నాకు వాడు బిడ్డే ..మనమే వాడికి
………..
నాన్న వార్చిన నదుల పొంగు.. దుఃఖం నిలిపిన చేతులమధ్య ఊగిసలు పోయే పడవ..
కథల బయట ఊపుని సర్దిన అంపక శ్రమల నిలువు.. మరిన్ని అడ్డంగా నిలిచిన పొగ గోడలు..
కట్టి తెచ్చుకొన్న వర్ష జాగారం ఋణం తీర్చిన కట్టుడు రాతలు.. ఇగిరి పోయిన నిద్ర దర్శన
పోలికలు.. కదిలి వెళ్లిన పాట గడుసు ..ఇసుక పుంతల్లో ..కప్పి తెచ్చుకొన్న దేహ రాజీల కూర్పుని
కట్టుకొని దూరంగా నిలబడ్డ పెళ్లి ఇల్లు .. అన్నీ పోగులు పడి గాలికి ఎగిరిపోయాక
అడివి కాల్చిన పాటల గుట్టలో .. తోడి తెచ్చుకొన్న నిద్ర రాశుల కట్టడం కూలి.. తడి గోళపు
చేమ్పాలని రుద్ద్దిన కలతకి మోసి తెచ్చిన కరకు మాటలు.. నలుగుడు బెంగలు.. తీపి చేతులు
సమయ బజంత్రీలు.. సన్నాయిల మధ్య .. ఊరి నలత పొంగిన కలకి చేర్చిన పుట్టుకల మోత ..
నిలువు రంగుల కొండ ని చుట్టి పాడిన సైకిల్.. అక్కడే బెల్ జారిపోయాక .. దారి మూసుకొని..
భయం నిలదీసిన జాగార పాటలని.. కలిపి చుట్టిన దేవుడి గదుల విందునే.. పెళ్లి పాటల ఊపు
కట్టడినీ … నాన్న ఇంకేదో వెతుకుతున్నాడు.. ఏ నగరంలో అతనిలో వాన జాడని కడుతుంది.
…………………..
వాడికి ఇల్లూ .. కొండా .. నదీ.. అడివీ అన్నీ పాటే .. సైకిల్ యాత్ర .. పాటల కొట్టు..
నడకల గుట్టుని విప్పుకొంటూ.. చెట్ల సందుల్లో భూమి గుస గుసలని వింటూ ..
గురువు ముందు సాష్టాంగ ధార … అదే ఇక అలుముకున్న దేహ చలన సత్తువుతో కలబడి
చేరుకొన్న స్థితి ముగింపుని కట్టుకొని .. ఎటూ పోలేక కథల ఇంటిని కూల్చుకొని..
వెలిసిన కథల మధ్య తోడుకుపోతున్న భయాల కథని సరిపెట్టే నిద్ర పూడికలు..
అదే ద్రవ మిళీయంలో పడి లేచిన కలతలు.. ఎంతకీ పొగలు సర్దుకోక…
నీరు పట్టిన కన్ను చుట్టూ చీకటి నింపిన పాటని .. ఒంగిన నాన్న వెన్నునీ ..
అక్క వదిలేసిన గొలుసునీ మోయలేని బెంగ గడ్డ కట్టి.. చెంపల మెరుగు రుద్ది పట్టి
చర్యలు .. గతి చిత్ర చలన ముఖాల బరువులు.. పాట జారిన ఏడుపులోని అక్క కాళ్ళ గుక్క.
తెలుస్తుంది.. తెలియడం లేదు.. తెలియనప్పుడే .. తెలిసిన నిద్ర జారుడులో కల తెలిసి
కాని ఆమె ఊరుకోదు. వాన బొట్టుని కరగకుండా .. పాటని చెంగుని నడుముకి బిగించి మరీ లాగి
పాట అలికిన సంధి సూత్రాల కైపుని వడపోసి.. నిద్ర విపరీత దేహ ఋణం అరగదీసి..
కలత పట్టిన గురుత్వ సమాధిని వేలాడ దీసి.. పాటలు కనిపించిన గురువు ఇల్లు..
పెరటిలో రావీ .. మర్రీ కలిసి పెరిగిన మానుల నీడలో… శృతి దీర్ఘ సవ్వడికి నాడిని సరిచేసి
ఊగిసలాటని సరిచేసి హార్మొనీ తో.. అల్లిన కోటుని ఒంటికి వేసి .. బొట్టు పెట్టి గురువు .. ముంగిట..
………………..
CHAPTER 2
గుడి .. బడి .. మఠం
నిద్రాణ గతి పడవల కల్లోలంలో .. ముఖం తెలియని కథ పక్కగా .. కాళ్ళు కదిపినా
నదిలో తీగలు అల్లుకొని.. రుణ పూర్ణ కలతని నిండుకొన్న అమరికని చేర్చుకొంటూ..
అద్దకం…నిత్య సర్దుబాటుగా ఉన్న కథలకి నిరూప దారాల అల్లికని చేర్చి ..
ఒద్దిక లేని కుదుపు.. భయమూ.. వాడూ ఏకమయ్యే నిద్ర జతల మత్తుని పీల్చిన అడుగు..
మరీ చెప్పుకోలేని చలన సంహిత పాటగా .. గురు వృక్షం కాలిన మహా మైదానంలో ..
సూటిగా తలపడే సూర్యరశ్మి కమ్మేసిన నిఘ్రుతాల ముంపునీ లోపలికి తెచ్చి ..
కల కాల్చిన నిద్ర దూరాల మెలకువలో క్షేత్ర దర్శన చుట్టిన పాటని కట్టుకొని..
పాడాలని పట్టుకొని వెళుతున్నప్పుడు.. ఆకాశం సుడులు తిరిగి.. వాన సంచీలు దులుపుతున్న ..
నల్లని గాలి లుంగలు హత్తుకొని నిబంధిత నానా స్థితి కలమోతలో….
……………
నీలాలస పేరుకున్న నిద్ర సగపు ఝాములో .. గురువు రూమ్ తలుపు కొట్టి.. హార్మొనీ శృతి చేస్తూ.
దేహ ధ్వని చేసిన స్నాన గోళపు చప్పుడుని కడిగి.. ఆ రాత్రంతా ..
రెండు జత కళ్ళ శ్వాస సంయోజక క్రియ .. నిఘాగమ్య చలనాలు మోసి తెచ్చుకొన్న గురుపీఠం..
అక్కకి అదే చెప్పాడాయన .. ఎవరు ఎవరికి గురువో తెలియడం లేదని..
సృష్టి వాడికి ఇచ్చేసి పంపింది.. నేనెవరిని..ఇంకేదో ఇవ్వడానికి ?… ఇక తీసుకువెళ్లిపొమ్మని..
ఎంత వద్దన్నా .. ఇచ్చిన పీజు వెనక్కి ఇచ్చేసి..
కేవలం రాగ లక్షణాలు రాసిన ఓ నోట్ బుక్ ఒకటి వాడి చేతిలో పెట్టి.. పాటని అలానే….
కొండ పై నుంచి దూకుతూ వెళ్లి నియ్యి.. ఎప్పుడైనా నచ్చితే ఇవీ ఆలాపించు అంతే..
మీ ఇల్లే గురుకులం.. పాటకి జీవక్షేత్రం.. వాడి పాటకి నేను చరణమంతే ..
విసిరేసిన కథని .. నిశి సారపు భ్రమణ .. ప్రమత్త సమయాల చిత్తడి నేలపై..
వాడి పాదాల రుంజ ..నిద్ర తపాల చలి గుట్టని తవ్విన రక్ష .. పాట..
త్యాగరాజు .. నిధి చాలా సుఖమా ..లేక అక్క ఉండే ఇంటి సన్నిదా ?
శాశ్వత సన్నాహాల నిద్ర జతల ఊపుని కలిపే గది .. వాడి నిండా ప్రశ్న దులిపే పాట ..
…………..
అదే మళ్ళీ అమ్మ కట్టిన వంట గది.. సప్తపది ని వదిలేసిన అక్క వండిన .. చల్ల రాగాల తీపి గాలి..
ఆ మెత్తని వేళ్ళ కలవరమూ .. నాన్న నాగలి పదును గేలాల పట్టుని దులిపి … గొంతుని లేపి
నిస్వాయ పాద గంటికలో పడి ముక్కలైన నది.. మళ్ళీ జోడుకొని.. బరువెక్కిన నీరుతో
రశ్మీ చలన నింపుకొని ప్రవహిస్తున్నప్పుడు.. సాధ్య దీపపు నైవేద్య స్థితిలో చీకటి తుడిచిన
గాజు కొండ వెలిగాక… ఆదమరుపు కలత ఉడికిన నిద్ర వాగుల కౌగిలిలో జత కోలాటం..
ఊరూర పాట.. ఎవరో పిల్చి .. కాస్త ఎంగిలిపడి వెళ్ళమని.. నాలుగు పువ్వుల్ని వాడి కాళ్ళకి
తాకించి జడలో పెట్టుకొని మురిసిపోతూ.. ఎదురొచ్చి .. పక్కకి తిరిగి.. అన్ని పక్కలా చూసి
ఒళ్ళంతా ఇసుక పోసుకొని.. నిద్ర బరువు పల్లకీని నదిలోకి ఎక్కేసి వెళుతూ.. కథ బరువు
జోడింపులో పడి పోలిక లేని పెదాల గట్టుని తెగ్గొట్టి.. నాచు ఏరుని వడపోసి.. అరిచిన కొండ పక్కగా .
అడివి కూలబడి .. పాటని వింటూ.. ఇంకేం తెలియని గుర్రుని నిద్రలోకి తురిమి నవ్వుకొంటూ..
వాడుక ఊరుని .. తన సైకిల్ సంచీలో ,, రాగాల బుక్ గా .. వెనక carriage పై హార్మొనీ పెట్టగా ..
తిరుగుతూ.. అక్క కట్టిన రెండు గిన్నెలు ఆకలి మూట విప్పుకొంటూ .. ఊరునే పాట చేసి..
చూడగానే .. మిమ్మల్ని భావ అనొచ్చాoటే.. పొద్దునకల్లా .. అమ్మానాన్నలతో భావ..
అక్క బుగ్గల్లో కుంకుమ పంట.. దూరంగా అద్దంలో పండిన పసుపు బొమ్మలా వాడికి అక్క ..
కట్నంగా మళ్ళీ వాడి పాటే.. అక్క వెన్నులోకి వాడి ఓ రాగ దారపు ముడి … పాట..
,,,,,,,,,,,,,,
ద్రవిత ప్రమిద .. మోసిన హార్మొనీ .. నిధీ ధ్యాస
యజ్ఞ స్తంభం లాంటి అక్క .. పెళ్ళై వెళ్ళిపోయినా .. నాన్న రుచిలే మోసుకొని ..
సైకిల్ ఆగలేదు. కొండ దిగిరాలేదు.. నది లేచి అందుకొంది .. వంతెన మెలి తిరిగింది.
ఊరు హార్మొనీలో సాగుతూ.. మోసి తెచ్చిన ద్రవిత ప్రమిదలా .. పింగాణీ సరస్సులో మునిగి ..
ఓలలాడుతూ.. కళ్ళలో ఉరిమిన సాధ్య పరిమిత పట్టుని .. కథలోకి .. మర్చి పోయిన తాళాల గుత్తి
దుఃఖపు హద్దు కప్పిన చలన శాల .. పాట .. సాధ్య సమ్మతి నింపి చెప్పిన కంటికి చేర్చిన గండాలు
ఆ పాత గుడి నిద్ర కన్నుకి పక్కగా .. ఊటబావి ఇచ్చిన నీటి కుండని మోసుకొని..
చేదు గుండంలో పడి ముక్కలైన అక్కకైన కన్నీరు.. ఖాళీ గాజుల డబ్బా…
రుణపడిన ఇంటిలో .. ఓ ఝాము పొద్దులో మంచు పట్టిన బరువుతో ఇల్లు..
అడివి చెవులని దులుపు కొంటుంది.. కొంచెం దూరంలో ఉన్న మఠం కళ్ళాపి చల్లుకొంటుంది.
నానా జుత్తు దువ్విన వెనక ముడి ఊడి విరబోసిన పాట .. వానని దులుపుకొని..
వాడి అక్క రాకని వెదకడానికి వెళ్ళుతుంది.. సందు మలుపులో తడిచిన గుడి …
అక్క పంపిన కజ్జికాయ తిని .. మళ్ళీ వాడి పాట.. నాన్న నాగలిని మోయనివ్వదు..
వాడు ఆగక అతను తలుపు దగ్గరకి వేసి నిండి పోయిన ముఖాల బయట పడతాడు..
……………
గురువు మాటలు .. అక్కతో.. చల్లని అక్షింతల తూర్పు గుమ్మంలో .. చీకటికి అలముడు సెగ ..
సహజ జలానుగతం.. పూర్వీక బిక్ష.. ఆ హార్మొనీ అక్షయ రాగం.. నేను వాడికి శిష్యుడిని ..
అమ్మా .. ఇంటి పెళ్లి.. వాడి ఫీజు నాకొద్దు తల్లీ … వాడీ వృక్షశాలకి నిండు సరస్వతి..
కాని .. వాడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు.. రాగాలని పరిచయం చెయ్యమని..
ఆయన నవ్వుకొని.. పైకి చూసి.. విశ్వానికి నమస్కరించి ,, తల ఊపాడు.
కలత బిగిసిన నిండు గ్రహణ చిత్తడిలో .. ఇల్లు మోసిన కథకి బొట్టు నిచ్చిన కథని నేసి.. పాట..
నిస్వా అనుగ్రహం ,, కదిలిన కాళ్ళ విపరీత సంజ్ఞ .. నిద్ర పోసిన మంచు లోయలో ..
చీర పట్టిన నది బరువు పడవ రాగం.. నెయ్యి దీపాల కంటిగట్టుని దాటుకొంటూ …
ఆకూ వక్క.. చెట్టూ. తేమ .. కొండ .. నీడ గట్టు.. శిధిల భూమిలో ఇల్లు చుట్టూ తిరిగే
జనపధమూ..రాగ విపత్తుని నులిమిన మంచు తాకిడి దేవుని ఎత్తి చూపే పాటై..
ఆ రాగ లక్షణం బుక్ లో రాసుకోవడం తప్ప .. చిత్ర వాగుల దగ్గరలో … పేరు పెట్టలేని గురువు..
తన సాధన చాలదని.. ఆ బుక్నే . మళ్ళీ వృక్షాలలో ఆయన శిష్యరికం…. గీత చేసుకొని..
………….
దాచుకోకుండా రాలిపడుతున్న నిధీ ధ్యాస .. సఫల కార్య చిక్కుల్ని విడదీసి .. జోడించి ..
కథలోకి దిగి.. అంచు తడిచిన వాన ఇంటిని దుప్పటి మూలకాల కంటికి చుట్టి..
గురువు ఆజ్ఞ .. ఓ చిన్ని పట్టణం లో ప్రదర్శన.. అక్క దర్శన.. చేతిలో నెలల బిడ్డ ..
సృష్టి మహానువాదపు దివ్య శాల ఒడిలో పాలని తాగుతూ .. వాడు మొదలు కాలేదు..
ఆమె చూసింది.. సైగ చేసింది.. ఊరు ఇల్లై వాడి ముందు కుదురుకొంది..
ఇక ఏవీ వాడి చెవిలో లేవు.. చప్పట్లు.. ఈలలు.. తుడుచుకొనే బుగ్గలు .. ఎగురుతున్న పూలు..
నదీ మధ్యంలో పడవ లో వాడు.. అక్క వాడి చుట్టూ ..వేల దీపాలని వెలిగిస్తున్నప్పటి పాట ..
నిరాపాయ శ్వాస గుండంలో తలమునకల్లే .. దుఃఖపు బొట్టుని బొట్టుతో కలుపుకొని ..
నీవోహ కంటి లయతో కలిసి..రాగ సయోధ్య .. దేహ నిహ్వల ద్యుతి ముంపు .. అక్క గొంతునే ..
తను కలిసి వాడితో చేస్తున్న… మ్లాన తపస్సునే చూస్తూ..
……………….
గుండ్రని చీకటి.. బైరాగి కొండ .. జాన పాట
సైకిల్ అక్కడే ఆగిపోయింది.. చీకటి చుట్టూ కదిలే నిమిష రాత్రులతో ..
కందిన కంటి పోతలతో తేరుకొని .. కప్పి ఉంచని దుఃఖ చిందులో మోసిన గుండ్రని చీకటి ..
తలపట్టుకున్న చిత్ర దర్శన కొండల్లో .. ఇంకేదో పాత్ర నింపిన పాట కావాలని..
దూరంగా వినిపిస్తూందా … కదిలి ఉండిపోతుందా .. మురికి రాలిపోతుందా ..
చలన మండలంలో కలిసిన నిద్రిత కలకి . రెండో గోళపు పునాదిని నింపి పెట్టుకొన్న
దేహ మర్మపు సంధి నిశానీ మడుగులోకి దూకి.. చిత్ర వలయం తప్పి పోయిన దేహ వాగు..
జమిలింత కుదిపిన చూపు నిషారాలో అనుకోని నిర్వికాల భూమి .. పంతనాల గొడుగు
గడప చల్లారిన కథలకి చేసిన వేడుకలు.. నిండు కూర్పులు పోసుకున్న రాకలు..
ఒద్దిక లేని భుజాలని కప్పుకొంటూ.. రుణ కావెడ లో మోసి తెచ్చుకొన్న కొండలు..
ఆ లోపల ఆరిపోని పాట.. కలిసి విడిపోయారు.. విడిపోయి కలిసి.. చూపు విడిచిన పొగల కిందుగా ..
నిరూప దీప రోదన పోలికని నల్లగా చేసిన దుఃఖ స్థిమితం కన్నుగప్పిన పూడికలు..
………………..
ఆ వెనక మలుపులో.. సైకిల్ దూకి వెళ్లిన బైరాగి కొండ .. పాతి పెట్టుకొన్న మెట్లని ..
తలపెట్టిన చలిమంటలతో.. పారబోసుకొన్న దేహ నివారణ సంధి పోతల రక్కోడి
ఖాళీ చేసిన సంధి సూత్రపు మునకలు … పడకలు .. ఎత్తిపోతలు.. బరువు నవ్వులు
సుజల ముఖాలని చేర్చి పెట్టుకొన్న నడకల్ని .. వెన్ను ఛాయలతో కదిలిన జోడు రాత్రుల ..
కూర్పు .. అంపక చలన ముఖాలతో.. ముద్రలు వేసి.. తేల్చి చూడని వీలుబాట్లు ..
కప్పుకొని.. వీధులని విడిచి.. ఇళ్ళని కప్పి .. మంచు నది కిందుగా.. అడివి వదిలిన పాట..
శంకాలు.. పూసలు.. గొలుసులు.. కొమ్ము బూరలు.. స్నాన హేయన రుచుల కుండలో ..
కలదిప్పిన మైదాన మండల గతిని నిలదీసి.. దూరం జరిగి .. కొంచెం చేర్చి పెట్టిన ఇంటి దారిలో
కనిపెట్టి పట్టుకొన్న వానల పుట్ట .. విపరీత దాహ నెలవు కోపడి తీర్చిన కథకి వెనకగా వెళ్లి
ఆగిపోయిన చిత్ర సంపదల కట్టడికి నులిమిన పాటని తాగి .. నిషిద్ధ మెరుపుల్ని
అద్దిన దుఃఖపు పులిఖితంలో ఓడిపోయి.. మాటని అంటు పోసుకొని ఊరట పొందుతూ..
నిశ్చిత పూనకాలు.. రెప్పలకి కనబడని కిటికీలతో .. పేర్చుకొని ఉండిన నలుగురిని
పట్టుకొని .. కొండపై.. తలపెట్టిన చలిమంటలతో.. పాట చుట్టూ చేరిన వింత కథల చెవులు
సమర్ప గది చక్రాలతో .. రువ్వి వెళ్ళిపోయిన అణుకువలతో .. తేరుకోలేని కథని చెమర్చిన
పేజీలని కత్తిరించి… తాళాలని బిగించి వదిలిన కన్నుకి పక్కగా .. పాట..
……………..
జాన పాట .. తడబడే కళ్ళకి మోసపు బొమ్మలకి ఆరబెట్టిన వెసులుబాటు ..
జోడించిన నాజూకు శ్వాసాలని అరగదీసి.. సగం తీసి పెట్టిన కునుకు తలుపుల నల్లని గోడలని
వేలాడ దీసిన దీపాల మధ్య … జారిపోయిన అంపకాలని .. ముఖాల్లో పట్టి తెచ్చి కాపాడిన
గొంతుల్లో కలబడి సరిచేసుకొన్న ఊపుని తెగ్గొట్టి కదిలే దేహ తీరులు ..
ఒక సమయ చీలికలు చిత్రంలో .. మోసి తెచ్చిన కదలికనే కట్టుకొని.. మరో నిమిష సగంగా
తెలియని ఆయుస్సుకి నేసిన కన్నుని పట్టుకొని.. వడపోత గుట్టల్లో ఇరుక్కొని ..
విరిగిన గోడల మధ్య .. సేద తీరిన దీపాల గుడిని చేరబిల్చి.. కథ కూలిన సమయ శేషం..
అదే ఉంది.. ఉందనుకొన్నప్పుడు మాత్రం లేదు.. ఎవరూ చూడనప్పుడు ఉంది..
ఎందుకు లేదో అది తెలియకుండానే ఉంది.. అని ఉందన్నా లేనట్లే ఖాళీగా ఉంది.
మంత్ర గతుల చీకటి లోపల కూరుకు పోయిన కథని.. జాన పాటలో ముంచి తీస్తూ చిందులు..
అది చల్లారబెట్టి.. కంటి దీపంలో నూనెతో కలబెట్టి.. ఆనుకొని నేసిన నదీ గతులని మార్చి ..
సేద తీరిన దుఃఖం మోసిన కలత.. కలిసిన దుఃఖ చిత్రికల ఎద్దడిలో కంటి వార్పు
గుడి ముంగిట మొదలైన కథా జాగారం .. తీసుకొచ్చిన వాన ఋతువు అండలో పడి ..
ధూప జ్వరం కమ్ముకొన్న ఇల్లుని మోసిన సైకిల్ చప్పుడు.. చక్రాల గానుగ ,.. పాట ..
………………….
ఆవలించి హరి కథ.. రుణ గీత .. వాకిలిలో జాజర
వాడి లేకుండా ఉన్నాడని.. నాన్న కబురు పెడితే .. అక్క పరుగున వచ్చింది.
కదిలించి పెట్టుకొన్న గదులని కాపాడుకొంటూ .. దుఃఖ నీలపు వాగుల్లో పడి కొట్టుకు పోయిన
ఆయాస శాలలో కదలాడే చూపుని వడపోసి.. కలిసిన రెండు రాకల పొగ .. నులిమిన
కన్నులో చీకటి బూజు… చప్పుడు చేస్తున్న దర్వాజా .. కదిలి నీరిచ్చిన కిటికీలు….
అక్క కంగారు పడలేదు.. భావ వచ్చి రెండో రోజులు ఉండి .. పొలానికి నాట్లు వేయాలని వెళుతూ..
నీకెన్ని రోజులు ఉండాలని ఉంటే .. అన్ని రోజులూ ఉండు.. వాడికి నచ్చింది వండు.. అని
వాడు.. వాడి పాట .. దేనికన్నా ఎక్కువ కాదని.. మళ్ళీ చెప్పి .. వెనక్కి చూసి .. వెనకెనక్కి చూసి
దుఃఖ సమస్తమూ.. నిర్యాణ గతి చిత్రమూ.. తడబడే రంగు చిత్రాల్లా .. శరీరం మార్చిన నటనలో..
గొంతు నానిన ఇల్లూ .. వచ్చే పోయే జనం .. వాడిలానే ..మాటా పలుకూ లేని నాన్న..
కథకి రెండో వేపు లేని చిత్ర జ్వరాల కంటినిద్ర .. భయం నానిన కన్నుని తాగి…
ఊరికే .. పాట సగంలో ఇసుక కూరిన హార్మొనీ.. దుప్పటి బయట నుంచి వెళ్ళిపోయిన పాము
అక్క భజన పాటలకి.. ఆవలించి హరి కథని తీర్చిన .. చుక్కానీ లేని పడవకి..
గట్టున పోసుకున్న జోడు బళ్ళ తీర్ధంలో పడి లేచిన గెంతులు.. బూరల ఊదుడు…
అక్క ఏమీ అనలేదు.. ఎవరినీ ఏమీ అడగనివ్వలేదు.. వాడు వింటున్నాడు.. అంతే చాలనుకొంది.
………..
భావ ఒక రుణగీత .. వాడిని తీసుకొని .. రైలు బండిలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాడు..
కూడా గురువు వచ్చాడు.. అతను కంగారూ పడొద్దని ..తనకి తానే చెప్పుకొంటున్నాడు..
ఎవరూ వినలేదు…. అడగలేదు.. కదపలేదు.. ఆయన ఎవరినీ కుదపలేదు.
డాక్టరు .. పిల్లాడు చక్కగా ఉన్నాడు.. వదిలేయండి.. వాడికి నచ్చినప్పుడు పాడనివ్వండి..
వైరల్ ఐన ఆ చిన్న పట్టణంలో వాడి పాట ని డాక్టరే చూపించి.. ఫీజు తీసుకోలేదు..
మూడు రోజులు గమనించి .. అన్నీ నార్మల్ అని కాయం చేసుకొని .. ఇక తీసుకెళ్ళమన్నాడు..
సాఫల్య గంభీరం .. నిషారూపు మాయల మధ్య కూలిన పీడనాల చీకటి .. బిగబట్టి లాగుతూ..
స్థితి మంత్ర కథని లాక్కొని పోతున్న ముఖాలని పట్టుకొని .. . ఆకట్టుకొని వదిలిన
వాడు భావ చేతిని అక్క చేతిలో పెట్టి.. నువ్వు నీ ఇంటికి వెళ్ళు .. భావని జాగ్రత్తగా చూసుకో ..
నన్ను నేను చూసుకొంటాలే .. తేలికగా గొంతుపై చెయ్యి పెట్టి .. సైగ చేసి నవ్వాడు..
అనూహ్యా చిత్ర కాపలాల సరీయాల గతి కంపన చేర్చిన కంటి నాడిని సరిచేసి…
ఉన్నదీ మొత్తం .. లేనిదిగా చేసే సరళ రాశీయ కట్టడం.. అదే చలన కూపంలో
శ్వాస రాగాల తవ్వకం… పాట వెనక నుంచి మొదలై వాడి వెనకే ఉండిపోయాక…
………………..
కలకలమూ .. నిద్ర రుణంలో సుళ్ళు తిరిగే దేహ దర్శన గొంతులు.. వానజాజర
నొప్పి తీర్చని కథకి చేర్చిన అంపక శ్రద్దల కైపుని కాగబెట్టే .. స్మరీర గతి సవరణ ముఖాలని
చేర్చిన కలతలు మోసిన ఊపు.. కళ్ళు జార్చిన చెమటల గుంపు .. నిత్తరపాటు
తొల్చుకొన్న గొంతు ఎడమ ద్రవ గోళంలో పడి ఊపిరి కాపుకొన్న నిద్ర పోటు
కొండలపై మొదలైన ఉరుముల పంట .. చిక్కని రాకలపై కుదిరిన శేష భూమి మోసిన కన్ను.
గొంతుఊటలో నింపుకున్న చిత్ర తాకిడి రాగాల ఉక్కడి… పీల్చిన కథలో మలుపులో సిగ్గడి…
అదే మెళుకువలేని చిత్ర పల్చని కథలో .. ఒద్దికలేని అప క్షేమ నిర్మితి చిక్కని రంగుల
కవాటంలో పొగగా చుట్టిన కలతని నేసుకొంటూ.. పట్టి రాల్చిన భయం ఊపుకొంటూ..
ఉన్నదీ నేనే .. ఉండిపోవాలన్నదీ నేనే .. అనుకోని దూరమైనా గట్టుకి అవతల పక్కా నేనే ..
మోసిన శూన్యమూ.. మడత పెట్టిన గాలి సవరింపు ఛాతీ పొంగు.. బొటనవేలి అరుపు ..
నిద్ర కాళ్ళకి మోసిన కలల పట్టుని కట్టుకొన్న చీకటి నదిలో .. గుట్టు చప్పుడు కాని ….
శత్రు కుండల బరువూ.. అదే చోటులో కదిలే నిద్ర తోపుల యజ్ఞ శిల…
ఏది పూర్తయిందో ,, ఏది ఆగిపోతుందో.. ఎవరికి ఎవరూ చెప్పుకోవడానికి తెలిసేది కాదు.
………………….
ముంజి కాయలు.. మామిడి తాండ్ర .. అమ్మ లాల
నది ఒడ్డున కూర్చొని అమ్మ లాలని తల్చుకొన్నాడు.. నది మెత్తని తడి ఇసుక మధ్యలో తిప్పింది ..
గడుసు గాలిని వదిలి ఆరబెట్టింది. నిప్పుల బొమ్మ కూలి రాలింది.. బొగ్గు చుట్టింది…
చలన కీంకార నిద్ర దీపం మోసిన ఇంటి గట్టు బయట నేసిన తవ్వకాల నొప్పి..
కథ చెప్పుకొన్న దేహ దాపుల గొంతుని ఉడకబెట్టి కదిలే నిద్ర చేదుల గ్రహణమాల
అదే పక్కకి ,,, రెండోసారి చెప్పిన జవాబుల ముట్టడి ధ్వని ముఖాలకి..
తియ్యని దుఃఖం.. కొబ్బరి నీరు.. ఎవడో పిల్చి పడవలో ఎక్కించుకొని..తిప్పాడు..
కథ చెప్పిన కొండ .. సాయంకాలమైందని రంగు మార్చుకొంది.
నారింజ కాలిన కుంకుమ పాదులో .. వర్ణ దోసిలి గుప్పిన శ్వాసల పొగ మంత్రపు గతి
మొరను లేవదీసిన కథ మధ్యలో చేరుకొని.. కదిలి పండిపోయి పగిలింది.
ఏది అటు పోదో అదే కొత్త నిద్రల గడువుని సాగదీసి.. ఊరి బయట కథని లాగి దూరంగా…
నవ్వింది. అదే చేరాలని అనుకోలేదని కొంతమంది వెనక సణుగుతారు..
తిరిగి చూస్తే ఎవరూ లేరు.. ఏదో జరిగింది.. చెప్పేది ఎవరో తెలియదు.
దుఃఖం చేరదీసి కథలో ఉండిపోయిన కునుకుని వడపోసుకొంది..
………………………
ఆవిరి పట్టిన కాళ్ళ చుట్టూ.. బెంగ చుట్టిన నది.. దువుకొన్న తలతో చీకటిని కప్పి..
ఓరగా చూసి .. ఎందుకు భయం .. నా గూటి పడవలో బొంత పరుచుకొని నిద్ర పొమ్మని..
నీరు గాలించిన .. పొద్దు కథల దేహ దీపపు పదాల్లో … శ్వాస కుద్దలించిన కథలో నెరిసి పోయినా..
భయం నెత్తిన పెట్టిన సంధి సూత్రాలు.. కథ వెనక్కి పోయిన గోడలు..
రంగు నీళ్ల భావిలో దొరికిన పాత నీళ్ల బిందె.. గడ్డకట్టి వేళ్ళాడే చలన మాత్ర కరిగిన ఎత్తుగడ ..
తాపిత శరణు గట్టుని చేరుకొన్న అనుమాన గుమ్మాలు.. ఒలిపిడి కేకలు ఊరిన కలకి ..
గుమ్మాల మధ్య తవ్వి పోసుకున్న ఖాళీలకు .. గ్రహణ మాత్ర కరిగించి పోసిన .. రుద్ది తీసిన
ఊపిరి రుణాల రాగం.. సాయపు శక్తుల అరకొర నిద్ర సానుడు గుహాలకి సర్దుకొని…
అదే పాత నడకల ఎత్తుగడ .. ఊపు తగ్గిన ఏటి చూపు.. త్రి ముఖ మండలంలో ఒద్దికగా
చేర్చుకొన్న ముఖాలకి సరిలేని దీప సముద్రాల కలబారిణీత విడుపులు..
ఒడిలో కూర్చొన్న అడివి.. అప్పుడే లేచి అరుస్తూ.. నీ బదులు నీ పాడతాలే .. అన్నట్లు..
వర్షం పెద్దయ్యింది .. నాన్న వెదుక్కొంటూ వచ్చాడు.
వణికిన చీకటి అడుగులు.. పెద్ద పెద్ద రైతు అడుగు ముద్రలు.. నాగలి మోసిన భుజాల ఒంపు..
కథ కూలిన పెద్ద వీధుల రధం .. హోరు పెట్టె సాయాల మధ్య కూరుకు పోయిన నడక..
…………
ఇక్కడ అంది పోసుకున్న విరాళ కూర్పుకి చేర్చిన కలత .. పూడిక తీసిన జరుగుబాటు ..
కటిక నిరాశ మోసిన ఇంటి వెనక అప్పటికే నిద్ర పోయిన సైకిల్..
మాట ని వెనక్కి తీసుకొని.. డైనమో వెలుగులో తొక్కుకుపోతుంటే .. నాన్న ఆ ఇంటి వేపు
ఆశగా చూసాడు.. ప్రకృతి వనశాలలా .. నెమళ్ళు తిరుగుతూ…. పొద్దునకల్లా ..
ముసలావిడ నాన్న ముందు కూర్చొని.. ఇచ్చిన టీ గ్లాస్ అందుకొంది.
పిల్లాడింకా చిన్నోడయ్యా .. కాసిన్ని రోజులు ఆగితే ఆగనియ్యి.. ఆదుకొంటాడు..
ఆ కొండతో,.. వంతెన ముసుగేసుకొన్న నదితో.. కంటిలోకి చూసి ఏడ్చిన సముద్రంతో..
వాడికి నచ్చింది.. ఆ సైకిల్ మీద ఎక్కడికి కావాలంటే .. అక్కడికి పోనియ్యి అంది.
జ్వరం తో ఉన్న వాడి ఒళ్ళు తడిమి ముంజికాయలు ..తాటి కాయలోంచి బయటకి తీసి పెట్టింది..
పాయసం కాచి తాగించి … మామిడితాండ్ర బుగ్గన ఉంచుకోమంది.
అష్ట చెమ్మ ఆడింది.. దూ ధూమ్ బిళ్ళ దుక్కుమ్ బిళ్ళ ఆదుకొంది…
రాత్రి అక్కడే ఉండిపోయి.. శొంఠి వేసిన ఏదో కాషాయం తాగించి.. వేడి నీళ్లు కాగబెట్టి
లాలపోసింది. దిష్టి తీసింది.. మాయల మరాఠీ కథ చెప్పింది.
ఈ మామ ఉందిరా ? చూసుకొందాం .. ఏం జరిగినా ? అంది.
పాట మరెక్కడో నిద్ర పోతుంది.. నడక కర్ర తాటించుకొంటూ వెళ్ళింది.. లాక్కురావడానికి
…………..
కథ చెప్పిన మాయ.. కొబ్బరాకు పందిర .. కంటి చెమ్మ
ముసలావిడ వనశాలలో .. ఆమె మహా స్వరం చేర్చి పెట్టుకొన్న తేనెతుట్టని అందుకొంది..
ఆది భూమి కీర్తన ,.. భూమి పుట్టుక .. సంగీత ప్రవేశం ఈ సృస్టిలోకి ఎలా? అని ..
స్వయోమయ దేహ వారధి కట్టిన అనుకువల నిద్ర రంగుతో భూమికి బొట్టు దిద్ది ..
కదిలే నిద్ర చలన కీర్తనకి పట్టు తప్పిన క్రియా దీపం వణికిపోతూ.. చెలరేగిన చిత్ర జాలం కింద
దూరం జరిపిన భుజాల నిశ్వాస సాయం గడ్డ కట్టిన చీకటి అరలో ముఖాల చిక్కుడు..
పోలికలు.. పుట్టు వాసనలు.. అడుగు మరకలు.. శ్వాస చిల్లులు .. నోటి రాతలు
మగత భుజాల మంచు కూలడి … అంతా అదే .. అని చెప్పేలోపే ఎవరూ లేరు..
వాడి ముందు ఓ కథా మాయని పర్చి .. అందులో వాడు తప్పి పోయిన .. సృష్టి నుదిటిలో ..
దీర్ఘ నిర్మాణ దుఃఖితాల చర్యని తిప్పి.. ఒక విసుగు వెనక కూర్చిన చీకటి నిర్జన ఘాటు
సతాయింపుని పగలగొట్టి.. నిశ్చర్య మంధన కౌగిలి చేర్చిన హద్దుని విసిరేసి.. పోతపోసి..
పగిలిన నిద్ర గుంభన పోలికని కాదనే ముఖాలని తాగి.. గొంతు మోసి పైన వెలిసిన నది..
ముసలావిడ cycle తొక్కు తుంటే వాడు వెనక కూర్చొన్నాడు.. కాళ్ళు తిప్పుతున్నాడు
వర్ష తలానికి నిలువుగా వెళ్లిపోతున్నారు. పొందిక చుట్టిన ఆయాసం… తీపి పరిమళం..
వాడికి ఆమె వేడి వేడి మిర్చి బజ్జీలు.. జిలేబీ పొట్లం కట్టింది.. అవితింటూ చుట్టూ చూస్తూ కలకాదనే
వాడు నిర్ణయమవుతూ.. ఆవిడ కథ చెప్పిన మాయని.. తన పైట ముసుగుగా
వాడి పై నుంచి.. వేడి పాలలో మందు కలిపి ఇచ్చింది.. తాగి ఘాడ నిద్రలోకి వెళ్ళిపోయాడు.
… ,,,,,,,,,,
ఝాము పొద్దులో.. లాంతరుతో వాడిని అడివి బాట గుండా.. కొండలని తప్పించి..
ఓ చిన్న గుండ్రని మైదానంలో ఆగమంది.. తలవొంచుకొని గుమ్మాన్ని దాటింది.
అదేదో పొరపాటు కాదు.. దుఃఖ నిందా కాదు .. పరిక్రియ సత్తువు క్షేత్ర మహిమా కాదు..
అది ఉంది .. అదే ఉంది.. అది కాని అనుకూలంతో పగులుతూ ఉంది.
వాడు ఏంటన్నట్లు సైగ చేసాడు.. ఆమె భావి పక్క నుంచి వెల్తూ ఆగమని ..
ఓ బకెట్ నీళ్లు తోడి.. అలా బట్టల మీద నుంచే కుమ్మరించింది..
వర్ణ చలన చీల్చిన కరకు మెట్ల పక్కగా నిద్ర అడుగులని కదిపే దేహ నిగురు కదలికనే
కాపలా కాస్తూ.. చీల్చిన కంటి తపస్సు మోసిన క్షణం ఊరేగి .. మాట తీసుకొని..
అక్కడొక కొబ్బరాకు పందిర.. వాడు వణుకు తున్నాడు..ఆమె తుడవ లేదు..
తన పైట చింపి.. వాడికి కాళ్ళ గంతలు కట్టి.. ఓ పీట పై కూర్చోబెట్టింది..
అప్పుడు మొదలైంది.. సంగీత శ్వాసలో వక్ర గతిని సరిచేసుకొంటున్న భూమి చప్పుడు..
సన్నాయి జూలుని విదిలించి.. వీణా చెక్కిలి … మృదంగ తాళం కౌగలించుకొన్న ..
సదా నిద్ర అమీలన గతిలో తిరగదోడుకొన్న నిస్పృహ రాశువుల దుఃఖ నీలపు వేణువులో చెలరేగి..
హార్మొనీ సర్దుకొన్న కచేరి.. వాడి మూసిన కళ్ళ చీకటి ముందు వైభోగాల ధారగా వెలుస్తూ..
……………
వాడు ఆమెని గమనిస్తూనే ఉన్నాడు.. ఆయాస పడుతుంది.. రాత్రంతా మేలుకునే ఉంటుంది..
వాడి దుప్పటిని సర్దుతూనే.. ఒంటి ఆవిరి తుడుస్తూ …కంటి చెమ్మని దాచుకొంటుంది..
వరుస గమనాల నిద్ర దేహపు పరిధి నదిలో ముంచి.. దృష్ఠి కప్పిన కథకి..వెనక వంతెన
కట్టిన పాటని .. వాడి వెన్నులో తాపడం చేసి.. తలకి ఇంత నూనె రాసి .. చేతులు మర్దనా చేసి…
లాంతురు వెలిగించి.. వాడి అరిపాదాలకి లేపన నూనె రాసి ..చల్లబరిచి..
కలలోకి వెళ్ళమని.. నీటి గొంతుతో చూడమని … కళ్ళకి కాటుక లేహ్యం రాస్తూంది..
మత్తు చుట్టిన పగటి గొంతుని పొడుగ్గా చేసి.. ఇంకొక పాటల చితిని దగ్గర చేసిన దిగాలు మోతలు..
సమయాసం తీరి .. ముచ్చట కప్పి ..ఇంకేదో జరగాల్సి ఉంది.
………………………
మంచు గాలి.. ఉసురు రాట్నాలు…లోపలి చెక్క గానుగలు..
చీకటి కింద వనశాల అననుకూలమయ్యే వర్ష గాఢ చెలరేగి ముంచి నపుడు… ఇల్లు సగం మునిగి..
రెండు ఊపిరికి చుట్టుకొన్న ప్రాణాల నెగడు.. ఎగదోసిన మంచు గాలి … వణికించే ఉరుములు
ముసలామె ఏం చేస్తుందో అర్ధం కావడం లేదు.. తనలో తాను ఎన్నో ప్రశ్నలు ..
తన అనుమానాలని తానే తుడుచుకొంటూ.. ఏదో చేస్తున్న .. వాడిలో ఏమాత్రం గుణం లేదు.
తద్వర్తన అక్కరలతో కూలిన ఏక మొత్తపు గండంలో ఇరుక్కొన్న నివేశ రాశుల రగడ పైకి లేస్తూ..
తేరుకోలేని నిషిద్ధ దీపదల ముఖాలు తప్పించుకున్న కదలిక .. మెలికపడ్డ కొండలు
ఆ రోజు నాన్నా వచ్చాడు.. ఆమె అదే చెప్పింది.. మీరు తప్ప ఇంకే దిక్కులేదు.
మీది ప్రయత్నం ..తర్వాత పై వాడి దయ.. ఊరట లేని ఆలోచనలతో చీకిన దేహమై అతను.
విసిరేసిన కథల మధ్య సరి చెయ్యని కెరటాల ఊపుని తాగి.. అడివి నిద్ర కాల్చిన కథ ఊపుకి
రెండో పక్క చేరి.. ఇంకేదో శూన్య ఛాయ నిలదీస్తుంది. కరిగి అంతటా పెరిగింది…
……………..
ఉసురు రాట్నాలు నేసి వదిలిన పాటకి .. అద్దిన రంగులు వెలిసిపోతూ.. సైకిల్ ఓ మూలన పడి.
హార్లోమోనీ లో బొద్దింకలు చేరుకొని… వాడి బట్టల నిండా చెదలు నములుతూ
తలపోసి చీకటి మలినాలు కుండపోతగా చేర్చిన కథలో మోసి తెచ్చుకొన్న ఊపిరి చోటుకి
నాచు పడుతూ… అవధి కథల మలుపులు.. నిరూఢ పట్టిన పాటల బిగువులు …
దుఃఖం మాసిన ఊరు మోత నిండా కల పాకి.. మధ్య రాత్రిలో లేచినపుడు..
సైకిల్ బెల్ మోగిన చప్పుడు వాడికి.. కొండ పంచిన మంచు గాలి ఎద్దడితో కలబడి…
ఉలికిన నిద్ర జలాల తీరుడు చెక్కిన కథకి.. రెండో గుమ్మం లేని ఇంటి శాలలో పోసుకున్న
భావి గట్ల నిరూప ధ్వని చిత్రాల గూడు.. పైకీ .. చేరి .. ఊపిరి కథల బరువు లేదనక ఎత్తుకొంటూ.
ఒక్కసారిగా లేచాడు.. సైకిల్ తీసుకొన్నాడు.. నది ఒడ్డున అర్ధరాత్రిలో వెళుతూ..
ఓ చోట స్పృహ లేని కళ్ళని పైకి చుట్టి చూస్తూ ….సైకిల్ వదిలేసి.. నది ఒడ్డుకి దిగి..
వర్షం మొదలైంది.. ఆ ఒడ్డంతా బురదవుతున్నా … అక్కడే నిద్ర పోయాడు..
ఓ పడవ వచ్చి ఆగింది.. గోనె పట్టా కప్పుకొని పడవవాడు .. ముసలావిడకి కబురు అందింది..
తాటాకు గొడుగుతో … కషాయం మరచెంబులో పోసుకొని … ఆవిడ బయలు దేరింది.
…………….
ఒక్క మాట అనలేదు.. ఒక్క చూపు విసర లేదు.. కళ్ళలో కంగారుని పంచలేదు ..
కిందొక కొబ్బరి తడికని.. పైకి ఆ గొడుగుని పట్టుకొని.. వాడు లేచేవరకు ఎదురు చూసింది..
ఎవరో వచ్చారు.. రెండు రేకులతో చిన్న గూడులా కట్టారు..
అదొక నిద్ర శపిత కల మోసిన పడవల గుట్టు.. నదీ ఒడ్డున కదిలే మట్టి పెళ్ళల లోపలి
ఒరిపిడి రగుడ్పు… అంతే తెలుసనే నిద్ర పోతల దేహ నిలువు ఒరుపు..
రెండు రోజులైనా లేవలేదు. మూడో రోజుకి లేచాడు. వర్షం తగ్గిపోయింది .. ఏవేవో సైగలు..
ఆ ఇసుక ని ఓ పలకలా చేసి .. కొన్ని స్వరాలు రాసాడు.. ముసలావిడలోకి చూసాడు..
ఒక్కసారిగా వాడి గొంతు నుంచి.. లావా దూకినట్లు ఆలాపన ..
ఆవిడ ఉలిక్కిపడింది. తీక్షణతో చూసింది.. కంటినిండా వింటుంది..
అనేకానేక ఆలాపనల సమ్మేళన అది.. లోపలి చెక్క గానుగలు ఆగకుండా తిరుగుతూ..
బయటకి రాలే నూనె దీపాల వెలుగు ముంతలు.. చీకటి బొరియల పొగ ఊడలు
ఆమె వింటూ ఉంది.. వాడు ఆగడం లేదు.. కనీసం నీళ్లు తాగడానికి కూడా ..
ఆవాహన చీల్చిన నిద్ర వైదీక్యంలో జోడించిన కథకి ముఖాలని చేరదీసిన నిగడ.
ఊరిలోకి కబురు వెళ్ళింది… ఒక్కక్కొరై వాడిని చేరుతున్నారు..
నాన్న తల ఒళ్ళూ తుడిచి బట్టలు మార్చాడు.. వాళ్లలో వాళ్ళు మాటల తడబాటు
అది పాటకాదు .. ఒక ఆలాపన మాత్రమేనని ముసలావిడ లోపల గొణుక్కొంది.
……………..
భ్రమణ మైల .. చిత్తడి గుమ్మం.. గొంతు హోరు
కదిలి .. వృత్త గమక నిద్రాణగా ఊరిన కాళ్ళ కిందుగా రాలుతూ.. హద్దు కప్పుకున్న నిశ్వాస రార్ధత
కమ్ముకొని ఉండిపోయిన కలతకి రెండో ఝామునే ఉడకబెట్టి.. భ్రమణ మైల..
నిఘారణ .. చిత్ర కూలాడిలో పెనవేసిన అద్దకాలతో.. గోడలని ఎత్తి కడుతూ .. మళ్ళీ భయం
చెప్పిన ఊరట కలల్తో ఊరిపోయిన పొగల గుండంలో కాల్చి పోసుకున్న నిర్మాణ రుజువులు..
వాడి శరీరం ఓ ఎండుటాకుల కొట్టుకొంటుంది.. ఆ ఆలాప ధునిలో.. దుఃఖపు సరళ మైకం ఊడ్చి
పారేసిన కంటి కిందుగా .. హద్దుని కమ్మేసి తిరుగుతున్న శ్వాస లాలాల పెద్దగా గట్టు వెనక ..
ఇంకో తీరికలేని చిత్ర స్థలం కదిలే పునాదులని కమ్మేస్తూ .. నిండిపోయిన కరకు
శబ్దం మోగిన గింతులో నల్లని వాంతి.. గొంతు దగ్గర కమిలినట్లుగా నల్లని మచ్చలు…
ఆమె కంగారు పడలేదు.. మందు వేసింది.. అంతా మాత్రాన వాడిని ఆలాప ఆపమనీ అనలేదు..
వాడూ ఆగలేదు. ఆపడానికి వాడెవడు .. అదొక అనాహ ధార .. కరుణించి వాడిపై కురిపిస్తుంది..
పడి లేచిన చిత్ర రుణాల పులకింపుని మార్చి పెట్టుకొన్న చీకటి నలతలు.. మోసపూరిత నిద్ర
గుర్రుని పగగా నమిలిన ఆలాప దర్శనలో కుదిరి.. వీలుకాక ఎదురు తిరిగి.. కలిసిపోతూ…
కాలిపోయిన శ్వాస గ్రహణ .. ఇక ఏ నిద్ర తూగుని కట్టలేదని మార్చి చెప్పుకొంటూ..
……………
నాన్న ఓ చిత్తడి గుమ్మమై చూస్తూ ఉన్నాడు.. ఒళ్ళంతా మట్టి పులుముకున్న వానరాకడ దేహంతో
వాడికేం కాలేదు.. మీరు వెళ్ళండి .. నేను చూసుకొంటానని .. ఆవిడ సైగ చేసింది..
అదొక నిర్వికార దిశా మార్దవ పరిభ్రమణలో కాపాడుకోలేని దుఃఖ బంధం ..
పరుగుకి పట్టు తప్పిన నిద్ర ఊటలని కలబెట్టి.. శ్వాస నిద్రాణ పూడికలని తవ్వి తీసి..
నల్లని గోడలకి గుద్దుకొన్న నిద్ర జారల బొమ్మ .. ఆ పెద్ద గదిలో కనిపించిన వెదురు బొంగుని ఆమె .
రంధ్రాలు చేసి.. ప్రాణం పోసి.. ఆలాప నింపమని వాడికి ఇచ్చింది..
శరీర దేహ రాళంలో నెగడు పండిన విహ్వల ముఖాలని చేర్చుకొని .. చెక్కబడ్డ దుఃఖపు శిలలా..
ఉండిపోయిన కునుకు .. సమయ వేలడి కూర్పుల విడిపోతలని కలిపేస్తూ….
ముందెప్పుడూ అలా వాడి చేతుల్లోకి.. ఈ వెదురు రాగమూ రాలేదు.. ఇప్పుడది ..
అదొక ప్రవాహ గతిలో పోతుంటే ,.ఆవిడ ముగ్ధ బొమ్మలా కొట్టుకుపోతుంది..
అవధి తెలియని ఆ వెదురు శిల ప్రాణం పోసుకొని ఆ వనశాలలో తిరుగుతూనే ఉంది..
……………….
అర్ధ రాత్రిలో .. నిద్ర లోంచి లేస్తాడు.. పక్క తడిచి పోయింది .. ఒకటి రెండుసార్లు..
వాడే దుప్పటి ఉతకాలని చూసాడు.. ఆవిడ ఒప్పుకోలేదు.. నవ్వుతూ వడ్డీని బుజ్జగించింది..
సమర్ప గొంతు హోరుని కప్పుకున్న .. శిధిల శిఖర నొప్పిని సరిచేయలేక ఉండిపోయిన
అనుమాన ముఖాలు కరిగిపోతూ.. పెనవేసుకున్న మాటల ఖాళీలని కప్పే చర్య
పక్కకి చేరుకొని దిగబడ్డ నది మధ్యలో .. పడవల ఆవిరి కన్నుని ఆర్పిన కెరటం పట్టుకొని..
అందుకొన్నాడు.. చుట్టూ ఉన్న అడివి కూడా ఉలిక్కి పడేలా.. బ్రహ్మాండం ఒక క్షణం
కదిలికని ఆపి.. నిగ్రహించిన.. శూన్య కూపపు భావి పక్కగా దుఃఖ వాలుని సరిచేసుకొని వింటూ..
పేర్చుకొన్న నిద్ర కట్టడి రాతల్ని తుడిచి.. వెనక బిగించిన కంటి శిక్షిత నిద్రకి జరిగి
మాయాజాలం నిద్రగ్రహ చంద్ర గుర్తలని కరిగించి.. పెనవేసుకున్న నిరాశ్రుత
కంటి గమన వడపోసిన దృష్ఠి చిత్రణ మార్చి చేసుకొన్న ముఖాలని చేర్చి..
ఒక్కడే అనేక విధాల అల్లాట.. ధ్వని దండన మార్చి చేసుకొన్న ఒప్పంద తీరిక ..
కదలని సంసిద్ధ మగ్గింపులో కురిసిన మంచు రాత్రి ఆయుస్సుల కథగా ఉంచిన ..
వాడి చిన్ని శరీరం ఉద్రిక్త భాషణ మోయలేని వనశాల నిలువెల్లా వణికిపోతూ…
…………..
పడవ తాళింపులు .. తాయిలపు సంచీ.. దీవి పాటలు..
దుఃఖం నిద్రని కోసి .. అమ్మేసి పోసిన ఆకాశపు అరుపుని కడుగుతూ వర్షం ..పడవ తాళింపులు…
సమయం సగానికి కోతపడి.. చలన సంప్రాప్తంలో కూలిన శరీర నదుల కూడలిలో మోసి
తెచ్చుకొన్న హడావుడి వేడిమిని కాదని .. ఉలిక్కి పడి… నింపి సర్దిన తాయిలపు సంచీ
అర్ధరాత్రి వర్షం .. ముసలావిడని తీసుకొని.. ఏటి గట్టుపై.. తను ముందు నడుస్తూ
ఆవిడని తీసుకు వెళుతున్నాడు.. లాక్కుపోతున్నాడో..ఆ చిన్న చేతుల్లో ఏదో బలం..
మహా స్మరణల దీర్ఘ దేహంలా .. దూరం నుంచి కొండ చూస్తూనట్లు.. వర్షం లోంచే చెట్లని ఊపింది.
క్షణం మాట తీసుకొని దుఃఖంలో పోసుకున్న చిరుగుల వాన..
కనీసం తాటాకు గొడుగు తీసుకొనే టైం కూడా ఇవ్వలేదు.. చిన్న శబ్దాలు నోటి నుంచి..
ఆలాపనతో పాటు.. కలబడి చేసుకోలేక పోయిన సంధి గందరగోళం.
స్వస్థ ఆయుజ్యంలో పడి .. కొట్టుకుపోతున్న కెరటాల అనుజ్ఞ తాకిడి కాల్చిన నిప్పుమడి
అదే గతికి చేర్చి సాయంత్ర యాగం .. ఇలా అర్ధరాత్రి ప్రసాదానికి పిలుస్తూ..
ఊరు .. నదీ .. కొండ బాట .. అన్నీ ముడుచుకొని నిద్ర పోతూ వర్షాన్ని వింటున్నాయి.
వానకి తడిచిన మట్టి గట్టు చివర వాళ్ళ అడుగు పడితే .. అంత ఎత్తు నుంచి
పెళ్ళలుగా రాలుతూ.. ఇంకా పెద్దదై.. చప్పుడుతో కింద పడుతుంది.
సవరణ లేని నిరాదీక్ష చిత్రణ కడిగిన ముట్టడి రంగుని కప్పి .. మరి కనిపించక…
పైకీ కిందికీ తెచ్చిన ఇంటి పూడికలు దొరకని … కథల సగంలో పాడుకొంటూ…
వాడు కిందికి చూపించాడు.. ఆరమ్య చించిత కీర్తనకి లేవదీసిన ప్రశ్న చిత్రాల బరువు..
మొలచిన గోడని కూల్చి చేరుకోవాలని.. ఆకట్టుకొని దగ్గరవ్వాలని….
……………
లంగరేసిన గూటి పడవ.. లోపల నుంచి వంట చేస్తున్న పొగల వాసన వస్తూంది.
నీటి కడియాలని తీసి.. చీరని ఆరేసి.. తడిసిన జుత్తు చిన్న మంటలో .. సాంబ్రాణీ వేసి
ఆరబెట్టుకొంటున్నట్లుగా పొగ … నిద్ర కూడలిలో మోసి తెచ్చుకొన్న కథల మత్తు జడని గుప్పి.
పడవ వాడు.. తాగేసి చిందులేస్తూ .. నవ్వుతున్న కూతురి ..ఆ చిన్ని ఇంద్రధనుస్సుల మూటని ..
ఆడిస్తూ తనే బొమ్మై … ఆ వానలో తడుస్తూ పాడుతున్నాడు.
వరదల్లో తప్పి పోయిన తన నావిక భర్త కోసం .. భార్య నది వేపు చూస్తూ పాడే విషాద జానపదం..
భార్య బయటికి వచ్చింది.. అతనిని కౌగలించుకొని.. నీతోనే ఉన్నాగా ? అయ్యా .. అంటుంది..
వాడేం అనకుండా దగ్గరకి లాక్కొన్నాడు … పిల్ల వాళ్ళిద్దరి చుట్టూ చేరి గెంతులేస్తుంది..
అదంతా ఒక గొంతు పంచి నాదీ ప్రసవ గొంతులా .. చిత్ర మాధకతకి జ్వరం గుప్పిన
శీతల వర్ష రుచిలా ఉంది.. అది వైద్యుడి మొదటి మందుతో లేపిన నిద్రలా ఉంది,…ఆ పాట
……………..
వాడు వాళ్ళని చూస్తూ.. ఆ ఎత్తు నుంచి ఆమె చేతికి లాగి కిందకి అడుగు వేసాడు ..
సుమారు పది మీటర్ల ఎత్తు ఏటిగట్టు .. ఇద్దరూ దొల్లుకొంటూ కింద పడ్డారు..
మెత్తని మట్టి ఏమీ కాలేదు.. అది చూసి ,, పడవ అతను పరుగున వచ్చాడు..
వాడు సైగ చేసి.. పడవ ఎక్కాలన్నాడు. ఆమె వేలి ఉంగరం తీసి పడవ వాడికి ఇవ్వబోతే వాడు
తీసుకోలేదు.. లంగరు ఎత్తాడు .. ఆమె వాళ్లకి వండిన చేపల కూర పక్కన పెట్టి …
చేతులు కడుక్కొని .. తల తుడుచుకోవడానికి గుడ్డని ఇచ్చి కూరగాయల అన్నం పెట్టింది..
వాడు అతనిని .. పాడమని సైగ చేసాడు.. వాడి కళ్ళు కాగడాల్లా మెరుస్తున్నాయి
సంసిద్ధ ఆనవాలుని తుడిచినా మహా వేడుక .. కుర్చీలని తీసేసి నేలని పులుముకొంటూ..
పురాతన సొరంగ యాత్రలో ఊపిరాడని పొడుగులో.. రెండో చివర కనిపించని చిక్క చీకటిలో..
పాప తెచ్చిన దీపం లా ఉంది ఆ పాట.. తుదీ .. మొదలు లేని నదిలా సాగిపోతూ…
పడవ నది లోపలి మెల్లని కెరటాలని నిమురుతూ వెళుతూ ఉంది.
వాడి నోటిలోంచి .. చిన్న చిన్న మాటలు.. ముసలామె సంతోషపడే లోపే .. నిరాశగా
కూలిపోయింది.. అవి తెలుగు మాటలు కాదు.. ఏ భాషా అర్ధం కానీ మాటలు..
పడవ నది మధ్యకి చేరింది.. నిశామయ బంధనని కాల్చిన మృత్యు ఛాయల వానని ..
చితి చేసి మండిచిన కళ్ళలోకి వెళ్ళినపుడు పెట్టిన కేకలా ఉంది..
చుట్టూ రంగులు మారుతున్న ఆకాశ ధ్వని.. సాధన విచ్చుకొని కురుస్తుంది…
………………..
వాడు ఆలాపన మొదలు పెట్టాడు.. పడవవాడు తన పాటని ఆపి.. అది వింటూ ..
కళ్ళ నీళ్లు పెట్టుకొని.. కాళ్ళ మీద పడ్డాడు.. గురు మహా గంట ఏదో వాడిలోపల మోగుతుంది
అదొక సంయోగ .. వియోగ ప్రతిపాదనలో .. సృష్టి వరం అందుకొన్న ..
విశ్వ పదికుడి నడకని మోస్తూన్న గొంతులా ఉంది.. ఆరిపోదనీ తెలుస్తుంది ..
ముసలావిడ నిలువెల్లా పులకించి పోతుంది.. కోటి దేవతలకి మొక్కుకొంటుంది..
కొండలన్నింటికీ వచ్చి కలుస్తానంటోంది … ఈ బిడ్డని చల్లగా కాపాడు .. అని..
పిల్లాడికి అదేం తెలియడం లా .. మధ్య లో అదే అర్ధం లేని మాటలు పలుకుతో..
ఆలాపన చేస్తున్నాడు.. పాప నిద్ర పోయింది..
చిందుల నోరు.. ఎండ కాసిన నది.. అడవి కుండలు
నిరూప సగంలో కడిగిన వాన జాజర రంగుల ప్రసవ దీపం మోసిన కొండలు..
ఇద్దరూ కొండనెక్కి అడవిని చూస్తూన్నారు.. కథ చెబుతుంది..ఆవిడ పాట ఎక్కడ పుట్టిందో …
అది ఓ కథలా చెబుతుంది.. చేదు మచ్చలని కడిగిన చీకటి ముద్దలని విసిరేసి.. తడబడ్డ నడకలు
రక్త శిల వినికిడి నిద్రలో .. నది పేనుకొన్న దీవుల మధ్య .. సొరంగా రూపుల ముట్టడి రాళ్ళ
గుట్టల వెనక. తేనె పట్టుల నగరంలో.. నదులని మాయం చేసిన నటనలని మూసేసిన
దేహ నిర్ధారణలు. పట్టురాలిన కొండల మధ్య కదిలే నడకలు ..
వాడేదో చెప్పడానికి మాటలు వాడుతున్నాడు.. ఆ మాటల అర్ధం తెలియడం లేదు.
కానీ ఆవిడ చిరునవ్వుతో వింటుంది. . తనకి అదంతా ముందు నుంచే తెలిసినట్లుగా….
వాటితో ఆవిడ లోపల ఓ కథ అల్లుకొని.. ఆ మలుపులో నిలబడి వాడి కోసం చూస్తూంది.
ఒక పులి వాళ్ళకి కొంచెం దూరంలో ఆగింది. వాడు ఆలాపిస్తున్నాడు.. అది అలానే నిలబడింది..
ఆవిడకి కణతలోంచి చెమట కారుతుంది.. శరీరం వణుకుతుంది.. శ్వాస తడబడుతుంది
మృత్యు దర్శన మోసిన కదలికలతో .. సగలించిన చీకటి మరకల మచ్చలు.
కానీ అది .. తోక కొంచెం ఊపి .. నోరు ఆవలించి.. చిన్న చప్పుడు చేసి..
లోపలి కి నెమ్మిదిగా వెళ్లిపోయింది..
వాడి ఆలాపనలో ఏమార్పూ లేదు. చూశాడో.. లేదో అర్ధం కానంత..
అదొక సఫల దీర్ఘ నిద్రాణ మోసిన కథల పక్కగా .. నీరు పట్టిన కొండలకి .. లోయలు వేలాడినట్లు..
……………
ఒక ఏళ్ళ శిధిల కాండం తో ఉన్న చెట్టు వాళ్ళ ముందే నిటారుగా కూలిపోయింది..
కూలుతున్నది.. మన లోపలిదా .. కదిలే నిద్ర శాపాలు గురిని తుడిచే ఎత్తులదా?,,
ఆవిడని పక్కకి లాగి.. వాడు అమ్మా అని అరిచాడు.. ఆమె వింది..
కానీ ఆ ఒక్కసారే.. ఐనా ఆమె మళ్ళీ రెట్టించి అడగలేదు.. వినాలనుకొంది..
కానీ వాడిని ఇబ్బంది పెట్టి కాదు.. వాడిని వాడికే వదిలేయాలనుకొంది
భయమూ ఉంది..పుప్పొడి నలిగినా పరిమళం ఆ గొంతులో.. ఓ పట్టు దారంలా ఎంత వస్తే
అంతే అల్లుకోవాలని.. చుట్టూ రాతల కథని పట్టుకొని .. తెల్లార్లూ కనబడాలని..
కిందికి వచ్చినపుడు .. వర్షం తగ్గి.. ఎండ కాసిన నది పక్కగా నాన్న కలిసాడు..
బిరుసు భుజాలు నాగలిని ఏందో ఓ పై తుండులా మోస్తూ.. మట్టి శిల్పంలా.. ధాన్య గది వాసనతో..
ఆవిడ నవ్వుని చూసి.. ఒక కొత్త ఆశతో తల ఊపుకొంటూ.. దుఃఖం పోసుకొంటూ…
పనస కాయలు .. తేనే వనశాలలో పెట్టానని చెప్పి వెళ్ళిపోయాడు.. బమ్మెర పోతన ..
ఆ మూల సౌధంబు లోపలన్ .. పాడుకొంటూ.. కంచు మోగే ఉరుములగుట్టలా ..
ఆశ్రిత ధ్వని లేని ఉరుముని .. పిడుగుని తోసినపుడు వాడు ఆవిడని హత్తుకున్నాడు..
ఆమె వాడి వెన్నుని రాసింది.. కంగారుని సర్ది.. నీరు పట్టింది..
మళ్ళీ అమ్మా … అన్నాడు..ఆమెని చూస్తూ చిందులు నోరుతో వందలసార్లు అంటూనే ఉన్నాడు.
ఆశిర్థ స్మరణ రూపం కట్టిన కథకి పంచిన .. కొన్ని మలుపుల మధ్య .. చివరలో ఆగిన వీధి.
…………..
వనశాలలో అడివి కుండలు .. తేనె .. మరో దానిలో ముగ్గిన పనసతొనలు..
వాటిని పళ్లెంలో పెట్టి.. పనస తొనని తేనెలో ముంచి.. వాడి నోటికి అందించగానే ..
ఆ పడవవాడు జానపద నర్తన చేస్తూ పాడుతున్నాడు.. ఎగెరెగిరీ ఆయాసపడుతున్నాడు.
అవును అదొక సత్య సంకల్పంలా.. విశ్వ నిద్రాణ గతిలో కాలిన భూమి కన్నులా ..
ఆగీ ఆగని శ్వాసని పట్టుకొని.. తలబడి ఉండిపోయిన దుఃఖ శీతల ముడిని లాగి..
నెమలి పించం విప్పింది.. ఆవిడ మొత్తం శరీరం నీరై పోయింది.. మొక్కలు నీటిని
దులుపుకొన్నాయి.. వనశాల స్కలించి నీటిని వదులుతుంది.
ఆకాశం ఎండ మర్చిపోయి.. పరవశించి దుఃఖం తో కురుస్తుంది.. ఉరుములు తాగి ,,
వనశాల మళ్ళీ వెలుగుతుంది… దుఃఖ చిత్రణల చితి కళ్ళలో నిండిపోతూ…
కుందేళ్లు .. కొన్ని పావురాలు .. వర్షానికి అక్కడ కొచ్చి తలదాచుకొంటున్నాయి..
ఆమె వేడి వేడి అన్నం వండి.. పప్పు తాలింపు పెట్టి.. కొంచెం నెయ్యిపోసి..
వాడికి తినిపిస్తోంది.. ఆవకాయ కలిపి.. కారంగా లేదుగా అని.. ముందుగా తాను రుచి చూసి ..
వాడు ఆ రాత్రి నిద్ర పోలేదు.. మధ్య మధ్యలో ఆమె ఇచ్చిన మిరియాల పాలు తాగుతూ..
వాడు పాడుతూనే ఉన్నాడు. తడబాటు లేదు.. నిద్ర తూగుడూ లేదు…
అడవి.. కొండా .. నదీ .. గుడీ .. మఠం .. ఆ పులి .. పడవవాడు.. వింటూనే ఉన్నారు.
……….
పడవ నలత .. తాగిన నది.. కనబడని సైకిల్
కదిలి పోతున్న నిద్ర దర్శన మండలంలో పడి .. పోలిక లేని దుఃఖ సంధి మోసిన పాట ..
అన్ని చోట్ల వాడే.. కొండ ల మధ్య నిలువు చెట్లని లాలిస్తూ.. నదుల ఇసుకని వాడి గొంతుతో జల్లిస్తూ.. తేరుకోలేని చంచిత కాళ్ళ కదలికల ఓర్పుకి మంట పెడుతూ వాడు..
ఆవిడ బిడ్డని కనిపెట్టాలనుకోలేదు.. కేవలం ఓ సంచీలో భోజనం కట్టి సైకిల్ హేండిల్ కి ..
వెనక carrige మీద హార్మొనీ.. వాడొక చలిస్తున్న గేయశాల .. ఊరుని వనశాలతో ముడేసే
వాడి సైకిల్.. వర్ష మండలం కాపుగాసిన దుఃఖ నిద్రల పురుడు.. వాడి పాట…
పాడుకొంటూనే వెళ్ళేవాడు.. పాడుకొంటూనే వచ్చేవాడు.. నాన్న దూరం నుంచి వినేవాడు..
నలుగురు మంటపంలో ఉంటె వాడి పాట.. శవం వెళుతుంటే.. పెళ్లి కూతురు కాపురానికి ..
మరేదో యానాదులు పెళ్ళికి .. వర్షం వస్తూంటే.. చలి చెవుల్లో చేరి పోటు పెడుతుంటే…
నాలుగు పడవలు ఒకేసారి ఒడ్డుకి చేరితే వాడి పాట.. పడవల నల్లతాని సరిచేసేది.
ఆ పడవలోనే తన సైకిల్ని ఎక్కించుకొని .. దీవుల వెంట తిరుగుతూ .. నదులని కలబోసి
నాన్న వాడు వనశాలకి చేరాడా .. లేదా అని చూసుకొని వెళ్లిపోయేవాడు.
…………
కలలో పలవరిస్తూ లేచేవాడు.. చీకటి నెలలని జోడించిన కునుకు .. పెదాల బిగువు…
ముసలావిడ కాళ్ళని పట్టుకొని.. అమ్మా .. మీ బిక్ష అనేవాడు..
ఆవిడ చెప్పే కథలు.. వండిన తీపి వంటకాలు.. భయం మోసిన కలకి పండిన గట్టుని కట్టుకొంటూ
మాయా సంకెలలని కసితీరా తెంపి.. అన్నీ పాటలుగా మార్చి కురిపించేవాడు.
నదీ ధ్వని .. ద్రవ నిరాయు చిత్రాలని అడ్డుకొంటూ.. నివేశ గతిని రాల్చి మోసపోతూ..
మరో కనిపించని నమూనా రంగుల పోతలో పాట .. సవ్య నిర్ధారణలు కలతలో .. తాగిన నది..
అదే గదులని .. తలుపులని మోసపోతూ.. అవధికి .. చూపుల బయట … కల్లోలమిత దేహ రూపసి.
. దృష్టి వాల్చుకొన్న ఇంటిని .. భావి వెనక చెట్ల తోపులో దొరికిన నదులు..
నిలువెత్తు పునాదులని చుట్టుకు వెళ్లే పాట.. కథకి రెండో వేపు కాలిన ముఖాలతో
……………
కనబడని సైకిల్.. చిత్ర దర్శనపై కమ్ముకొన్న చీకటి.. ఒడిలో సరిచెయ్యని శ్వాస …
దిశా సమయ కథకి … కనబడని నీటి బాటలు.. నదిని అడిగాడు.. కొండని కలిసాడు..
చెట్టుని ఆలింగనం చేసుకొన్నాడు.. ఏ బెల్ చప్పుడు విన్నా… తన సైకిల్ అనుకొన్నాడు.
అలుముకున్న నిద్ర దీపాలతో .. పేరుకుపోయిన అలసట .. ఏ చెట్టూ.. ఏ నీటి కుంట..
ఏ ఇంటి అరుగు తీర్చలేకపోయింది.. ఏ నీటిగట్టు వాడి భాదని వినలేక పోయింది.
సన్యాసి… సొమ్ముసిల్లి చెట్టుకొన్న కింద పడున్న వాడిని .. నీళ్లు చల్లి లేపాడు.
కష్టం తెలుసుకొన్నాడు.. సైకిల్ నీ కాళ్ళని భూమికి దూరం చేస్తుందిగా … ఏదీ నాకోసమొక
కీర్తన … అతనొక హార్మొనీ ఇచ్చి .. చెట్టు నిండుగా వాలిన …. అన్నాడు..
అదొక నిద్రలని దాటి పైకి విప్పుకొన్న శోధిత మహా నైవేద్యం .. మృత్యు శుశ్రూష ..
విడమర్చి చెప్పుకోలేని .. దాహ గాలింపు సర్ది వదిలిన కథల నెగడుని ఎత్తిపోస్తూ..
కప్పుకు పోయిన నిద్ర తావుల కథకి రెండో ముఖం కట్టి .. వడపోసిన శరీరాల గుట్ట ..
కంటి చలన మత్తుని కడిగిన విశ్వ నిద్రల ఏకీకార సంఘర్ష ముఖాల ముట్టడి.. ఆ పాట
అతని కళ్ళ నిండా నీళ్లు.. నువ్వు దిగులుని నింపగలవు.. దిగులుని తీర్చగలవు..
నువ్విక దిగులుపడకూడదు నాయనా .. అని..అతని భుజం నుంచి దోతారా ని.. తీసి
వాడి చేతిలో పెట్టాడు. ఒడిలో రాలిన కీర్తన దర్శ మాయోమయ పరిమితులు…
……………
CHAPTER 3
కాలి బాటలు.. మట్టి గట్లు.. సత్రంలో కథ
ధోతార లని మీటిన గోడలని పట్టుకొని .. వీడిపోని జత సంచీల నిగడ కదిలిన వాడు..
ఆయన కాలి బాటలు తెగిపడి ఉండిపోయిన పాట .. లాల్చీ జేబులో పాటలు పట్టిన ఆకులు..
నిస్పృహలో పడి రాలిన కంటిని .. తేలిపోతున్న నిద్ర చలన రాశుల బిగువుని .. కూలిపోతున్న
కథలకి తెగిన మత్తుని దులిపి .. సంచార ముఖాలతో .. వెనకనే ఉండిపోయిన ఇల్లు..
వాడి నడక .. అలవోకగా మోసిన కాళ్ళ సడిలోని మట్టి ఉరుము.. గుండ్రని మాటలని ..
పాటల తీగలోంచి లాగుతూ.. మోగే దోతారల పట్టు దారాల తలుపు.. చల్లని మజ్జిగ చిలికే కల ..
ఆ రాత్రిలో చీకటి పేరుకున్న గొంతులని కడుగుతూ వెన్నలని తాగి సొమ్మసిల్లిన నది పక్కగా ..
కదిలే కన్నులో మాసిపోయిన పాటని తుడుచుకొంటూ.. నిద్ర తెరిచిన లోయల వెంట …
కనబడక ఏడుస్తూ.. పెనవేసుకున్న కదలికల్ని తడిపి కెరటాల మధ్య కూరుకు పోయిన నిద్ర
జతల మహా విడుపు.. కనిపెట్టి రాల్చుకొన్న మంచు సొనల మధ్య వండుతున్న దోతార
………………
కూలబడి మట్టి గట్లు.. పెద్ద సందడి ఒరిగిన అపార్ధ చెమటలు కట్టడిలో.. సమయ వర్ష్య జన్యువు
మొలిచిన గొంతుతో.. కదలాడే నిషిద్ధ ముఖాలని తెల్లార్లూ సానబెట్టుకొంటూ..
కొంచెం గెలిచినవి.. కొంచెం ఓడినవి .. దూరంలోంచి ఏడుస్తూ.. పరాయ దీపరేవుల్లో కుదిరే…
కంటి నిద్రని కోసి పెట్టిన మెట్లు. దాచి తెచ్చుకొన్న పింగాణీ పాత్రలు… సాధ్య మెరుపు ధూపాలు
పల్చని చీకటి గోళాల పట్టుని కడిగి .. అనునయ వీధుల్లో గడపలో .. బిక్ష జోలె ని దులిపినప్పుడు ..
కథ మధ్యలో ముసుగేసిన కథలో ఎవరో పోలికలేని రుచిని.. మాటనే.. గొంతుని..
చల్లగా నానబెట్టిన మంటనీ .. ముఖాలు తిప్పి చెప్పుకొన్న చలన దీపజాల కలవర నిశినీల…
కడిగి.. ఒరిగిన మాటల మధ్య కూలిన కరుకు మాటలు. తప్పుడు పోతల పేరడీ…
అదే నేను.. తన దోతారల నిద్ర ఝాము మోసి తెచ్చుకొన్న గడపల మధ్య కాలి ముద్రలని …
వదిలిన దుఃఖ పూర్ణ కదలిక .. చేదు మరకలని తుడిచిన దోతారా ముడుచుకుపోతూ…
కొంచెం తలపడి ఉండిపోయిన కథ .. రెండో పేజీ లేని మగత ఝాము కుంపటి..
……………….
స్థితి మధ్యన గీసిన కునుకుని నానబెట్టి .. నింపుర ధ్వని గాథని కట్టే దోతార ..
అవే తీగలు అల్లిన వేలి చివుళ్ళ మగ్ధత…కనిపెట్టి.. సరిచెయ్యని నవ్వురాటల పక్క నిగ్ధత…
దానినిండా నది జీనహించే నడక.. ఊపిన కెరటాల చాటున .. సగం పాడి వదిలిన దేహం
కలలోకి వెళ్లి .. కీర్తనల పుట్టు గొంతుని తెచ్చి .. వాడిలోకి పోసినట్లు.. తెలిసీ తెలియని ..
పెద్ద మొదలు చెట్ల కిందుగా .. కప్పిన గ్రహణ రాశిని తాగి .. తూలుతూ .. చిందుతూ..
వెల్లకిలైన చూపు తొందరలని .. పాటకి బొడ్డులో చుట్టి.. దోతారా పొగని తాగాక ..
మరింత చిరిగినా చీకటి తెర ఊరుకోలేక ఎత్తిన మాటలు .. పాటలుగా గుండ్రమై..
తడి మూట రుణాలు.. దీప ఊపుడు దుమ్ముని .. కళ్ళలోకి పోసుకొని .. వెన్నులో రుద్దుకొని ..
ఇంటి ముందు తిరిగి .. సత్రం తలుపు కొట్టాక …ఆరబోసిన దుప్పటి నుంచి కలువలని దులిపి ..
దోతార నానబెట్టాక .. పెద్ద ఊపిరి నోరుని తెచ్చుకొన్న సాయంత్ర కొండ ఎరుపుని మింగాక ..
సిగ్గు చల్లారిన ఆ దూరంలో .. అనునాద స్వరాల జమిలి గంధంలోకి దూకి కనిపించక..
మతి స్థిత ఎండా గొడుగులు కాపుగాసిన దృష్టి చంచార్యలో ముగిసిన నిద్ర ద్రోణుల్లో ..
తన నిద్ర తీరికల నవ్వుని మరగబెట్టి.. చీకటి చిలుకుతున్న అడివిని కొండ మింగుతుంది..
వీధులు విప్పిన చీరలని మడతపెట్టి.. చప్పుడు లేని చీపురుతో తుడిచి.. పైకి ఎగిరి
కలువ నీళ్లపై దోతార ఉంచినప్పుడు .. ఊరు మాటు గాసిన నవ్వుకి … దూరం తిప్పి చుట్టి
మళ్ళీ వెనకడుగు లేని.. వాడి సత్రాల చలి మంట .. పొగల వంటతో… దోతారని సర్దుకొని ..
వాడి కళ్ళ విందులో చీకటి నల్ల తీగ నీరుని నింపి.. పాటని పట్టుకొనే ఉంటుంది.
……………….
తేనె వర్షం .. తెర చాప గూడు.. చెట్ల సత్రం
నాన్నకి చెప్పి.. వాడికి ఇక దోతార కానుకైనా చోటే ఇల్లు.. నిద్ర .. ఆకలి.. ఆట .. తిరుగుడు కాదు..
వివాయ చిత్ర ధ్వని పసిగట్టిన కుదురుని మార్చి చేసుకొన్నా ఒప్పంద నిద్రగదిలో మోసి
తెచ్చుకొన్న కంటి గాయపు మంచుధార .. వాడు దోతారాలోకి చేర్చిన గొంతు.. తలపడి…
ఆ సంచార చిత్రం.. తేనె వర్షంలో తడిపే .. వాళ్ళ కాలి నడకల చిందు పాట.. స్థలపోత
చింతన తప్ప చింత లేదు.. సృష్టి అనుగమ తప్ప .. ఎవరి చుట్టూ తిరిగేది లేదు
నిశాపాయ ఆంతర్య చిత్రణ లేని జోడింపుని పట్టుకొని.. కలబోసినా కునుకు మోసిన చీకటి
అవలీలల స్థితి నియోగ తీర్ధన … ఎక్కడి వారు అక్కడే ఆగిపోయే నిర్ధారణలు..
ఒక .. జోలె .. భిక్షా పాత్ర.. మార్చుకోవడానికి ఇంకో జత బట్టలు.. ఎప్పుడైనా హుక్కా పైపు..
మత్తు ఊళల గట్టు పైనుంచి కేకని కనిపెట్టి దూకుతూ ,, రక్కేసిన గోడల పగుళ్లు
అమాంతక నిద్ర పోటుకి మోసిన మట్టి కొండ.. నది ఒరుసుకొన్న గొంతుని నాచులా పట్టిన పాట..
ఈ రోజే ఇక్కడ .. ఈ తాటాకుల సత్రం లో …చిన్న పొయ్యి మీద .. భిక్షా బియ్యం
ఉడకబెట్టుకొని..ఇంత పచ్చడి కలుపుకొని తింటూ. కుండలో నీళ్లు…. రేపు మరెక్కడో …
ఆయాస విశ్వాసమూ.. నిప్పు పుట్టిన భిక్షా పాత్ర .. కన్ను తుడిచి చావు గడపలో ..
స్మశానం మోసిన ఓర్పు చిత్రం.. దగ దగ మండుతున్న ఊపిరి గొడుగు కింద ఛాయలు…
మోసిన కథల గట్టు… నిరూణ గ్రహణ కూర్పులని ఆడించి ఉంచిన చేతుల మధ్య దోతార
…………………
వాళ్ళు వెళ్లిన చోటల్లా .. రస మ్లానత పట్టుతప్పిన వీధి వారల నడక ..అంటు కట్టిన ఇల్లు..
నాలుగు ఇళ్ల కూడలిలో .. రెండు పడవల నీరు తెచ్చి … ఓ చిందు వడపోసిన పాట..
ఊరంతా పాటలే..దేహమంతా మట్టిని మోస్తున్న చెట్ల వాసన.. గొంతంతా అక్కడి మనుషుల కథే ..
పరుగులు పెడుతున్న వీధుల్లో .. గాలిని.. నీటినీ.. నిప్పునీ.. మట్టినీ..చంద్రమండలం
మంచు కాంతి ని తాగే రాత్రినీ పంచుతూ.. వాళ్ళతో కలిసి తిరిగేవాడు..
ఏదీ వద్దనే వాడు కాదు.. తీసుకొని.. మెత్తని నవ్వుతో చూసి … ఇంకెవరికో ఇచ్చేసేవాడు.
ఎన్ని పాటలు వాళ్ళతో కలిసి పాడుతూ .. తిరిగిన .. ఓ చెట్టు కింద కూలబడి
ఆ చెట్ల సత్రం లో అందరూ.. ఓ దోతారాతో వాడే చెప్పే తత్వ భాషణ వినేవారు.
వర్షంలో కొమ్మల కింద .. చలి లో మంటని వేసుకొని డికాషన్ తాగుతూ..
ఎండలో చెట్టు ఇచ్చే గాలిని మోసుకొంటూ.. రెండు చెట్లు వాలి కలుసుకున్న ఛాయల్లో …
అదీ .. ఇదీ లేని నిద్ర సంక్రమణ ముఖాల మండల కక్ష్యలో .. ఉండిపోయిన నల్లని ఎండల
పొడి కన్ను.. కాలి గంటల సంజ్ఞ .. అదే ఉందని కాపలాల తీర్పు భూమి..
……….
నాన్న ఓ సన్యాసిని పేరడిగి.. పిల్లాడిని వాడి చేతిలో పెట్టబోతే .. అతను ఒప్పుకోలేదు..
వాడు మనం చేతులతో పట్టుకొనేంత చిన్నోడు కాదు.. వదిలేయడమే..
అతడొక నిశ్చింత గమన శీలాన్ని.. ఈ భూమికి పంచడానికి వచ్చాడు.. అలానే ఉండనివ్వు..
మనమెవరమూ ఏమీ కాదు.. ఈ భూమి దత్తత తీసుకొన్న మట్టి క్షేత్రం..
నువ్వు ధాన్యం పండిస్తే.. వాడు పాటని.. నిద్రని .. తన తెరచాప గోడులో భద్రం చేసుకొన్నాడు.
వాడి పాట ఈ భూమంతా గూంజిస్తూనే ఉంటుంది.. పట్టుకోవడం తేలికేలే.. దూరంగా ఉన్న
కొండని చూపించి..ఆ పైన ఉన్న గుడిలో గంట మోగుతుంటే … చాయని మింగుతున్న కొండ
అలాంటి దర్శన క్షేత్రం .. తప్పిపోడు .. మనం దారి తప్పినప్పుడల్లా ..
అలా వెళ్లి దర్శనమ్ చేసుకోవాలి , ఇంకే మాటలు అర్ధమివ్వవు ,అంతే..
నాన్న గొంతులో ఒక్క మాట లేదు.. గొంతులో తుండు కుక్కుకొని.. కళ్ళు తుడుచుకున్నాడు.
నిజంగానే కొండపై దర్శనం చేసుకొని.. మొక్కుకొన్నాడు.. నా బిడ్డని చూసుకోమని..
………………….
లాలపోసిన గుబులు.. మంచు గొడుగు.. దోతారల కన్ను
నీరు కాల్చిన హద్దులో పై బయలు నిద్రని కదిపి.. లోపల పారబోసిన దుఃఖ నింపుని మోసి
తెచ్చుకొన్న సయోధ్య భయం.. ఉండీ లేకపోయినా పునాది చక్రాల గుంపుని కదిపి…
ప్రమత్త సంధికి .. మరిన్ని ఖాళీల గతి చిహ్న ఊపుని కప్పుకొని .. అలాగే ఉండిపోయిన కథల మధ్య
తిరుగాడే మహా ధ్వజ గర్ష తాటించుకొంటూ.. మాటలని నెట్టించుకొంటూ…
పాతబడిన గోడలు.. రుద్ది తిరిగిన పాత్రలు.. చెప్పులు జారిపోయిన కాళ్ళు.. రెప్పలు గండిపడ్డ
కథల జోరుతో హద్దులో ముడి పెట్టిన రుణాల కలత.. పెద్ద చప్పుడు తలుపుల వెనక చీకటి
నూరిన కైజారు…. ఛాయామాల మగ్గింపులేని తొందరలో పోటు పెట్టే తలాల నీరు …
అప్పటికి ఒక దూరమూ.. కదిలే దోష కదలికనే దాచుకొంటూ.. మోసపోయిన పాటల కిందుగా
కదిలే సత్రాల గాలి.. ఎవడో చిన్న పిల్లాడి గుక్క .. ఆదమరచి జోల మోసిన జోలె లో కాసిన్ని
గింజల నవ్వు.. కప్పుకొని .. సత్రం మోసిన తలుపులు.. కలబారిన నిద్ర గడువులు
అమ్మ ఊసు.. దూరపు గుడిలోంచి మాయగా కనిపించే యజ్ఞ పొగ .. దేహ లాలాత కంటి
నిగువుని చుట్టుకొని.. ఇంకిపోయిన కంటిలో చూపుకి పంచుతూ.. లాలపోసిన గుబులు ..
అదొక వికర్ణ దేహ సంధికి చేర్చి పెట్టుకొన్న నడకలై దాటుకొంటూ.. నిడివి చేర్చుకొంటూ…
చీల్చిన చలన ముద్రల గొంతుని కలిపి.. ఇంకో వార్త లేని శిధిల మండలం..
………….
వాన గూడు సర్దుకొన్నా భూమి పడక పై .. అక్కడే పర్చుకొన్న మంచు గొడుగు.. చంచల
మాయగా ఉండిపోయిన కథల కూర్పుని జోడించి చెప్పుకొన్న అలపట బొమ్మల నెలవుని
కడిగి.. దండ వెలిగించి.. కూర్చొని చెప్పిన కథల మధ్య .. దొరికి పోలేక..
భ్రమణ మండల దుఃఖ తీర్మాన క్రతువుకి.. రెండో గుమ్మంలో పోసుకున్న శరీరాల కుట్టడి..
చెలరేగి ఉండిపోయిన పాటకి పక్కన వాడు .. దీపం సర్దుతున్నాడు.
ఉండిపోయిన నిద్ర నదుల పట్టుని కట్టుకొంటూ.. రుణపడ్డా కలకలపు పీడన వదిలిన
గర్భ శీర్శ్య ముఖాలన్ని చేర్చుకొని.. సగం చెప్పుకొని ఆగిపోయిన చోటే …
విచలిత నిద్ర రక్షా తేరుకున్న ముఖాలన్ని కట్టుకొంటూ.. పీల్చిన పొగల కథని .. రాత జలని
పట్టి తెచ్చుకొన్న చీకటి .. ఏడు రమనాల పుట్టుకని ఎంగిలి చేసి పళ్లెంలో సర్దుతూ..
పొద్దుపోని కథల మోట భావి ఊటల పక్కగా .. నానిపోయిన పాట.. చీకినా గొంతుతో..
నటనలు లేని ఓ బరువు కన్ను చెప్పిన ఊసు.. కన్ను నేసిన కలతల నెరుసు … పాట ..
అప్పుడిక వీధులు గడ్డకడతాయి.. చలన రుజువు ఏక మొత్తంగా ఊగిన నిద్ర నమూనాలతో
కరిగి చేసుకొన్నా వణుకు బుట్టలో కెరటాల నిలువు రంగుల ఊపు..
……………..
ఒప్పందమూ.. నిద్ర కణుపుల్లో గుచ్చినా కథల ఊపు .. గొడుగు పట్టిన కదలికలో ..
వంచి తెచ్చుకొన్న కొండ .. సగం బయటపడ్డ నది అడుగుల చిత్ర తీర్ధం
పెద్ద మడుగుల సంతర్ప ధూపం అలుముకున్న పాటకి .. తన స్పృహ మన్నికని చేర్చి
మోసిన వర్ష తాడనలా వాడు… కనబడదు.. వినబడతూ హద్దులు అడగడు..
క్రమమూ.. నిద్ర దూపు కింద మోసిన కునుకు .. ప్రసన్న ముక్కలుగా చుట్టిన కథ..
లాక్కుపోలేని సంధి సూత్రపు గుర్తులు.. అకారణ దీప గండం దుమికిన మాయానీరు..
గట్టులేని పడక.. ఊపిరికి రెండో పక్క కాపలాగా చూస్తున్న పాము కన్ను..
వాడు .. కుడి ఎడమల .. సన్నని గీతని దాటుకొంటూ ..సత్రాల బయట సర్దుకొన్నా
దోతారల కన్ను.. ఉక్కపోసిన దుప్పటిని కప్పుకొని.. అడివి లోపలికి నడుస్తూ..
……………….
గుప్పెడు గింజలు.. చలి మంటల రేవు.. అద్దకపు వీధి బిక్ష
చెదిరిన చీకటి రంజుల పాటకి .. నిలువుగా చెమట పండిన కథని తాగి..
సర్దుకోలేని చేతుల మధ్య కౌగిలి నలిగి ఏడుస్తూ .. తేరుకోలేని మాయలని కలిపి ..
బరువెక్కి చేర్చిన కలకి .. నొప్పి తెలియని కథని చేర్చి.. అదే పగలు.. అదే రాత్రి..
అదే మీగడ ముగ్గిన వాసన.. కుండలో పోసిన తెలిసి నీరు.. రాయిని మహిమకి చుట్టి
కదిలే విపుల ముఖాల గతిని … స్థితి భిక్షల పోలికని తాడు తెంచి అందుకొంటూ.. రెప్పల
దిగులు చెట్టు. ఊరట తెలియని సగం స్పర్ధ కూర్పుని తిప్పుకొంటూ.. ఊడికలు…
నెల పొదుపు రుణ తీగకి నింపి కట్టిన స్తంభాలని తెగ్గొట్టి … మళ్ళీ తెలియని మసక రాతని
నంజుకొని.. రుణ కేకల కైపుని ఆరబెట్టి .. కాల్చిన ఝాము రక్ష మోసుకొన్న నాటక తెరలు..
చప్పరించి చేర్చుకొన్న గుప్పెడు గింజలు తెల్లార్లూ మట్టి కుండలో ఉడకబెడుతూ..
మాటలకి పట్టిన కంటి జోరులని చేరదీసుకొన్న నటనలని దులిపి .. కొసలని కనిపెట్టి ..
వేరు చేసుకొన్న మలుపులని పట్టి చేర్చుతూ…హద్దు పగిలిన వర్ష జీబురు నాలికని కలబెట్టిన పాట .
వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పుకొన్నారు.. ఎక్కడెక్కడో తిరిగారు.. కనబడక .. ఆసరా మిగలక ..
తీర్ధ గాలుల నొప్పిని కరగదీసి.. పోటు పెడుతున్న పెదాల ఊడలని సాగదీసి..
సరిచేయక ముందే.. శరీరం పోతపోసుకొన్న నల్ల చీకటి అద్దకాల ఊడ్పుని చెక్కి పెడుతూ
…………….
మొదలయ్యీ ఆగిపోయిన చలి మంటల రేవు .. పెడతోవన పడుతున్న కలతలని నింపాదిగా
చేర్చుకొంటున్న ఆయుస్సుల కలయికనే తట్టిలేపుతూ .. నింపాదిగా దూరం పరుచుకొని..
కంగారు పడుతున్న దేహ నిందకి .. సంధి చేసుకొన్న మాయ ధూప సెగలకు ..
జోడించిన కసిపోతాల గడువుని కలబెట్టే .. నోటి రాతని గుప్పెటలో ఉంచి విసిరిన ..
పోతపోసిన కంటి దూపుకు .. నలిగి పట్టేసిన చూపు విడిదిని నిశ్వాస బరువుతో తవ్వుకొని..
కుండ నిండుగా .. చెమర్చిన దోతారా ని చల్లార బెట్టి .. పడవ ఎక్కాక .. నిద్రగదిని సర్ది ..
శుభ్రం చేసి.. నుదురుని తాకి.. ఊపిరిని సైగలతో కలిపి చుట్టి.. కాళ్ళ నొప్పులని పట్టి
సరి చెయ్యని మత్తు పండిన నడకకి .. రెండో గొంతు తెలియని విపరీత చలన ధ్వని చిత్రపు
నురుగుని మోసిన దోతార పలుకుల నిండు తీగల గడువుకు చేర్చిన కణుపులని సాగదీసి..
అందించి పెట్టుకొన్న చూపుల కవ్వింతని కరిగిస్తూ .. పట్టుకొని ఊదిన రుణాల గట్టుపై..
మండిపోతున్న వీధుల మధ్య పల్లకీ రేవుల పాటని వదిలి .. పడవ వెళ్ళిపోతుంది..
సంచార నెగడుని జోలెలో పోసుకొని.. మరో కొండల మధ్య లోయ సంతర్పణకి
అన్నం వండుతుంది.. రసం మరుగుతుంది.. తాగడానికి వర్షం పట్టి ఉంచింది
కథని ఎవరూ విని ఉండరు.. కలతకి వెన్నులో పొగని ఎవరూ మోసుకొని తేలిపోరు..
………………
మరో ఊరుని.. నాదీ .. అడివీ దాటాక .. ఏడ్పు పండిన తీగలని .. కొంచెం సళ్లించి ..
మాట చివర పెదాలని సరి చేసి .. తెల్లారిన దేహ గ్రహణ ఊపిరిని కలుస్తూ…
ఊరు మాటు మునిగిన సత్రాల కూర్పులో కసి తీర్చుకొన్న కథకి రంగుని తీసేసి..
శ్వాస ఛాయల గండం కనిపెట్టిన మెళుకువకీ చేరిన కథతో.. ముఖాలన్ని మార్చుకొని..
ఉండిపోవడం .. లేకపోవడం.. అంతే అని సరిపెట్టుకొని.. దూరం జరగడం..
మంచు ఊతాన్ని మోసిన సీసాల పక్కాగా .. బోర్లించి పెట్టిన పాటకి మెలుకువ తెచ్చుకొన్న
నిర్భర అతిదేహం కూరుకు పోయిన పోలికల పుట్టుక.. త్వరపడి కలుసుకొంటూ…
లోపల గదికి.. ఊరు మోసిన నలతలతో హద్దుని చెరుపుకొని.. ఊరటలేని కథలో
పెనవేసుకున్న జాగ్రత్తని తాగి.. కొంచెం బట్ట దులిపిన మాటలు.. పాటకి అతుక్కొని..
అంతలోనే రాలిపోతూ.. అద్దకపు వీధి బిక్షకి .. శ్వాసన దీపపు మత్తు తెరల గుట్టు ..
మంగళ కూర్పుని కనిపెట్టి లాగేసుకొని.. ఇంకిపోయిన పై మూర్తుల పోలికని దోతారలో ఉంచి..
పోగు పడుతున్న చీకటి దశల కట్టడిని కలబెట్టి .. పోతపోసిన చూపుని ఆరబెట్టి …
నీటి గుండాల్లో.. తిరగబడే ఆవిరి చుట్టిన కర్పూర మండలపు పరిమళ చూపుని తాగి
సోలిన ముఖాలు .. తడబాటు దోతార నొప్పుల మీద మంచు తడి పాకిన బెరుకుని తుడిచి..
అంతే తొందర లేని కలల చేదు మంగళ కీర్తన చుట్టుకొని బెంగ పడుతుంది.
……………………
పెళ్లి మేళం .. సన్యాసుల లైట్లు.. పడవలో అమ్మ చీర
నిరూప ధ్వని కథలు.. ఒలిపిడి రాజీయంలో పడి కొట్టుకు పోతున్న ఛిద్ర నిందలు కరిగి..
ఆ ధూప కవాటం తెరిచిన చీకటి గదిని నీళ్ల తో నింపి .. చెట్టు చుట్టేసిన కలకి ..
పరీవృత్త భుజాల నొప్పిని ఉడకబెట్టి.. కథని కూల్చిన .. రెండు గుమ్మాల మధ్యనే పెళ్లి మేళం …
ఆరోహ అవరోహ దోతార తీగలతో .. పాట బిగించి .. వాళ్ళని తడిపేసాడు.
ఏదో ఇవ్వబోయారు.. కొంచెం ఆ పూటకి భిక్ష తప్ప .. ఇంకేం వద్దని.. ఖాళీ చేసి వెళ్లాలని
కుదిరిన శ్వాస విసుగుతో ఊడిపోయిన మాంస శిదిలితే .. అనుకోని… రెండు పక్కలకీ పాకి..
సమర్ప ముఖాలని తచ్చాడే నకిలీ గాధలని చెమర్చిన శరీర భాష పాటలోకి చేరి ..
సద్రుడ సత్తువుల మైకం తగ్గి .. అటూ ఇటూ పోలేని దుఃఖం చేర్చిన మట్టి ముసుగుతో…
చరిచిన నడకల పెద్ద కాళ్ళ కథ.. ఎక్కువ తక్కువ కానీ రక్త గ్రహణాలు .. పండిపోతూ…
తప్పించుకుపోలేని మలుపులని మోసుకొని.. కథలని కాపాడుకొనే చర్యలతో కలబెట్టి…
కింద కొండల్లో వాలిన వ్యతిరేక ఝాము .. శరీర ఛాయలు కట్టిన నిబ్బరం.. గడ్డ కట్టిన దోతారా ..
వెనక్కి రమ్మనపుడు లేని దూర మోడులు .. కలిపి చేర్చుకొని నికారింపు పొదిగిన
ఆకర్ష పొందికల వేళ్ళు మీటుతూ.. కదిలే రుణాల గుడి.. గండి కొట్టిన ఊపుతో ..
పోలిక విడిచి పెట్టిన పుట్టుకలు…ఎక్కుపెట్టిన కథల మలుపులు…పక్కకి లాగేసి చూస్తూ…
……………………….
ఒక్కో దీపం తో అర్ధరాత్రి చీకట్లో ఒక్కో అడుగు వేసుకొంటూ.. ఆ ఇంటిని చేరారు.
మాట లేని అతనిని చూసి.. వాడు చెప్పాడు.. అలా అవుతుంది.. అన్నీ సర్దుకొంటానని కదిలి ..
వీడిపోని విసుగు మోసిన కథకి తెచ్చిన నీరిచ్చి.. కంటిలో రాలిన కరకు ముద్దల దేహశిలని
కరగదీసి.. ఆరుబయట మంచు పోసుకున్న చెట్టుని పలకరిస్తూ … సన్యాసుల లైట్లు …
పాతి పెట్టిన నమ్మకాలు.. ఎక్కి తొక్కిన కథల మధ్య .. కూలిపోయిన కునుకు పట్టుని కాల్చుకొని..
ఇగిరిన రుణ ముడుపుల కట్టడికి నేసిన…కదిల్చి ముంచుకొన్న … ద్రవ కిటికీల చూపు..
అది దోతారా విడిచి పెట్టిన ఊరు.. మెత్తని గదిలో కంటి గడపని తెచ్చుకొని .. మరింత …
చిత్ర ధూళిని ఎత్తిపోసిన కథలకి బార్లా చాపిన ఉనికి మండుతూ.. కళ్ళని చల్ల చేసి
విపరీత గతిలో చుట్టిన కంటికి .. మోసపోయే కలల మధ్య తచ్చాడే నడకని పోతపోసిన
కాళ్ళ బాటని కట్టుకొంటూ..చేదు మండల కూర్పుని చేరదీసి.. గాల్లోకి ఎగరేసి..
పట్టు రాలిన మరో దిశా గమన రాద్ధాంతం తప్పించుకున్న మాటలు.. పాటలుగా ….
ఈడ్చుకొంటూ పోయిన స్వేద దీపాల గట్టుని తెగ్గొట్టి.. వాళ్ళు ఆయాస సగం కోసుకు వెళ్ళిపోతారు.
అదే వరుస తప్పిన పాటల వినికిడి బజారులో .. కోలాట నిప్పుల పగ రాలిన వీధులు..
తలబడి పెట్టుకొన్న దీవి వెనక చెట్ల తోపులా మధ్యలో సత్రం.. అక్కడ సిద్ధంగా ఉంచిన…
పాటల కుడి పక్క గుమ్మంలో .. వాడు దోతారా కి నీరు పట్టిస్తూ అందుకొన్నాడు.
అడివి ఉలిక్కిపడింది.. దీవి సంద్రలోకి దిగి కళ్ళు మూసుకొంది.. నల్లరంగు మోసిన ఆకాశం ..
తెల్లని మంచు కురిపిస్తూ సేద తీరిన గాలుల మధ్య ఎగిరి.. నదిని కలుసుకొంటుంది.
………………….
ఆ మూల పడవలో .. పాటకి మోగిన దోతారా .. అతను చుట్టూ వెదుక్కున్నాడు..
ఎక్కడా లేదు.. పరుగున ఆ మూలకి వెళ్ళితే అక్కడ పడవ మధ్యలో అమ్మ చీర పై పెట్టిన దోతారా
మాట ముందు నుంచీ లేదు.. చీకటి కూలబడుతుంది …. పాట తడబడింది.
చెక్కబడిన బొట్టు కథకి వరుస దృష్టి ముఖాలని దాటుకొంటూ.. తీవ్ర సర్వ నిద్రల దోషపు ..
ఉదకమొత్తాన్ని కుదిపి.. ధ్వని చర్యల ఏక మొత్తంలో తిరిగిన నిద్రని వడపోసి…
సరళ మంత్రం చదివిన బొమ్మల దీవిలో ఇంకా ఆ పడవ నదిని చేరే కల మొదలు కాలేదని ..
దోతారా చెప్పుకు పోతూ పాడుతుంది.. వదలొద్దని భుజాలకి చెబుతూనే ఉంది.
దుఃఖ నివేద తీరికలేని పట్టుకొని.. రెప్పల బరువుకి లేచిన అభయ చిత్రం మసకబారి..
ఇంకిపోయిన కంటిలో దుఃఖ నమూనాల కుట్రని తీర్చుకొంటూ.. సర్దుబాటు లేని మరిగే ఇనుప
కండరాల మొలకని దింపుకొంటూ.. రాత్రి పాట చుట్టుకొంది.
………………..
కాలి గట్ల వాన .. అడివి పొట్లం.. కర్పూర వేడుకల పాట
విశ్వాస సాయుజ్యతే చెప్పుకు తిరిగిన హద్దు నుంచి.. కాళ్ళని కాపి రక్షించే దుఃఖపు అనులోమ
బిగువుకి చేర్చి పెట్టుకొన్న కొండల వెనక కాలి గట్ల వాన .. పైకి పేర్చిన శ్వాసల ఆన…
ఉన్నదీ .. ఉండిపోయిందీ .. ఉండిపోతానని చెప్పి ఉండకుండా వెళ్లిపోయింది..
గతి రక్ష భుజాల నెట్టుడు మాటలు.. తీర్ధ ఆశ్రయత తెలియని రంగుల కలనేత
బోర్లా పడి ఆవహించిన కంగారుని .. తీరుబడిగా నములుతూ.. కదిలే చూపు నిడివిని సాగదీసి..
దోతార కట్టుకొన్న తాటాకు గుడిసెలో .. డికాషన్ కాగుతున్నప్పుడు.. ఉన్న ఒక్క బ్రెడ్ ముక్కని ..
ఆకలి చూపుల కుక్కకి ఇచ్చి.. నిద్ర తురిమిన దగ్గుని వదిలి.. వేడి గుటకలు మధ్య ..
ఊయప కాళ్ళని పట్టుకొని.. అక్కడే ఊరి వీధిలో కలబడిన మంచు గుక్కల గోడని పగలగొట్టి..
మనుషుల చప్పుడు.. చెట్లు వణుకుతూ ఝాము పొద్దులో .. ఆకుల నుంచి తడి రాల్చుతూ
చెప్పే నిశ్శయ దీప తీర్ధంలో పడి తిప్పుకోలేని మీద చూపుని దోతార కిచ్చి …
త్రిప్పట చిత్రం అలుముకున్న వాన పోతలో .. జారీ కాలిబాటలని గుచ్చుకొంటూ..
కొండల నిలువు గారడీ గతిని అరగదీసి.. నిద్ర చరణ పొగలని పొద్దునే కనిపెట్టి..
కథలకి దూరం జరిగిన మలుపుని వదిలి పెట్టి .. ఆ పైకి చేరుకొన్న నిశ్చింత సమయ
ఊర్పుని కట్టుకొంటూ.. దూరం చేసుకొన్న మాటలని మళ్ళీ మళ్ళీ పదిలం చేసుకొంటూ…
ఉండిపోయిందీ .. ఉండాలని చేర్చుకొన్న కదలిక .. ఇంకేం తెలియని నీటిగట్టు..
…………………
నీటి ఉరుముని తాగిన నదిని పట్టుకొని.. కంటి దీర్ఘపు పొడి మొవ్వులో కూలిన చరణీత
కలబాటులో .. ఇంకో పోలిక లేని శుభ్రత మోసిన చీకటి నిలగాపులగపు ముట్టడి..
అడివి పొట్లం కట్టి ఇచ్చిన తాయిలం తింటూ..దోతార విడిచిన బెంగాల్లో కాగుతూ..
చెదురు మదురు దీప సాగవు నిర్దారకి నానిన కథని ఎంగిలి చేస్తూ.. తేరుకోలేని విపత్తు
ముఖంలో పడి .. పోలికని నేసిన …కథలని దగ్గర చేసుకొని తడబాటు గ్రహణాలు.. చెమట పోసిన..
నిరాయుజ్య ఖాళీ నిర్మితుల పట్టుని కొట్టుకొంటూ.. తీవ్ర నిర్మితి మోసిన పగటి కుండలో ..
ఆయుస్సుని తీసి గడిపిన దోతార కదిల్చిన కట్టడిని కాదని.. నిశ్వాస రాశుల ఎత్తులో
జోడు చీకటి నమూనాల మగత కన్నుకి .. బీటలు తీసిన కథని లాక్కొని .. ఒబ్బిడి రాతల
కలతని మోసుకొంటూ.. రుణ తీగ మోసిన పాట.. సరి చెయ్యని శృతి ముద్రల ధూళిని ఊది..
మాయా చిత్ర పోలికలని దాటుకొంటూ.. వెలిసి పోయిన నిద్ర రంగుల పోలికని దాటుకొంటూ..
చలన చక్రాల ఇంటిని కడిగి.. లోపలే ఉండిన తాళాలని విప్పి.. ముఖాలని రోజూ మార్చే
కరకు ఛాయల వీధులని.. సత్రపు నీళ్లతో కడుగుతూ దోతార
ధూప మండలంలో పడి .. కుదురులేని ఉపేక్ష నిర్మిత కట్టడికి నేసిన చీకటి పరిధిని కట్టుకొంటూ..
చర్యకి చేర్చిన కథన దాపుల్లో .. పోలిక లేని నిరా ధ్రువ పట్టుని కూల్చి..
జోడించిన కరకు శ్వాసకి ఆయాస పడి.. కింద మీద గడువు చుట్టిన ఊపుని ఆపి..
……………….
ద్రావణ కట్టడి నేర్పిన ఉమ్మడి దోతారల కలివిడి నిర్ధేశ సముఖంలో మొత్తంగా కూలుతూ..
హద్దు మీరిన కథకి ముఖాలని జాతర చేయించిన సంధి ఛాయగా ఉండిపోయిన …
అదే నిషిద్ధ సంధికి అల్లార్చిన మాయగా ఉండి.. కథకీ .. జాగార మాత్రల పట్టుకీ..
తిరగబడే ఆయాస సాంద్రతల పొదుగుని నేసుకొంటూ.. కలని తీర్చుకొంటూ…
ఆధ్యాయ మాయన రాతకి నిలువెత్తు అమరికని కూల్చి పోసుకున్న భావి నీళ్ల చలిలో ..
ఛాతీ మంటల గర్గతని ఊపి మొదలైన దోతార పట్టుకి.. భుజాల చుట్టూ మోగిన కట్టుకీ…
అరగదీసిన నిద్ర కలుపుకి .. కాలి రాలిన చేదు మందు కప్పుకొని.. అదే పాటకి భుజాల వెనక
నిద్ర పోయే దోతారా లేస్తూ.. మాటలని దగ్గర చేసి నిగ్రహ చిత్తడిలో దిగబడి.. విలనిడి…
రుణ దీప వాలులో మోగిన శంఖాల కొసని పట్టుకొని .. దోతారని ఆశ్రయిస్తూ..
కదలిక ఉరిమిన శత్రు దోషపు పుట్టుకని అడివి సాగదీసి ఇచ్చిన నిరూప ధ్యాన మాయకి ..
చుట్టి తిప్పిన వదిలిన ముఖాలు.. అక్కడ కుదురుకోని పాటలు.
………………..
తప్పి పోయిన చక్రాలు.. పాట గుండ్రాలు .. దూరపు కొండల నీరు
దోతార నీళ్లలో తప్పిపోయిన చక్రాలు.. ఉన్నవీ .. లేనివీ కానీ.. అపప్రధ దుఃఖంలో ఒరిగిన హద్దుని
దాటుతూ.. రుణపు చప్పుడికి నానిపోని.. వెనక్కి పునాదిగా తీసుకోని… శిధిల ఓరిమిడి ..
అదే ఉంది.. ఆ సత్రంలో మిగిలిన కుండలు.. దీపం మోసిన గోడలు.. నిలువు చెట్టు కొమ్మల్లో
నిద్ర పోతున్న దోతారా .. పట్టు పట్టిన వీధి గుంజల మండపంలో.. చిత్ర కూలతని ఊపి…
కదిలే నేను.. కదలని తెర .. ఒలకబోసిన దృష్టి పాటకి..నిలబడిన కథని చేర్చి.. రుచి లేని వీధిలో ..
తెల్ల గడపల పొద్దునే మోసుకొని.. దండనకి దొరకని కథలని శుభ్రం చేసి .. నెరవేర్చుకొని…
కాళ్ళ కునుకుతో నడక లేదని .. తీర్చిన కథలని వదిలి.. కలలోకి జోగిన నిద్ర పుప్పొడి ముఖాలని
కనిపెట్టుకొంటూ.. పోత పోసిన రుణాల కట్టడి రాతని కలిపి..ఊరించి పెట్టిన కలత కప్పుకొని..
అదే నిద్ర కవ్వపు కలని చిలికి . భాషణల నుదిటిని చెరిపేసిన కూర్పులతో… ఒప్పుకోలుతో..
పాకుడు నవ్వులో .. కొండల మధ్య ఆరిన పురా ఊరిలో .. నది చెమ్మరించి దోతార కథలోకి
వెన్నుని ముంచి.. ముంపు రంగుల విసుగులతో ..అవధి రాతల ఇంటిని దాటుకొని..
,,,,,,,,,,,,,,,,,
పాట గుండ్రాలు .. దోతార నింపిన నెలలని తీర్చుకొంటూ.. నిషాయ కఠిన ఉరుముల
నిద్ర పోటుతో.. కదిలే గ్రహణ సగం కప్పుకున్న భయం.. రోడ్ల కూడలిలో మోసిన శ్రేయం
ఊరట పోసుకున్న కునుకుతో.. తేరుకోలేని..నిర్మిత చలన ధారణ.. కదిలే మంచు కూడలి
పల్లకీలో భిక్షాపాత్ర .. దులిపేసిన జోలెలోని వానని తాగి .. ఆ పక్కాగా దోతార..
సన్నని పొగ నిడివి తెరని సాగదీసి.. నిలువెత్తు కంటి తుడుపు కలలో దొరికిన దోతార ..
అక్కడే సత్రం గుమ్మం దగ్గర … భావిని కప్పిన చెట్ల ఆకుల సందడి పక్కగా..
కలిపి.. విడిపోయి.. కలిసి.. అంతలోనే దూరం జరిగి..అలుముకొని.. నాజూకు పెదాల
ఛాయలో పాడుకొంటూ.. ఒరిగిన ఊరు వంతెనని లేవదీసి.. నీరు పట్టి.. చెమట తుడిచి..
కన్నుని కలిపి కథని లాక్కొని.. ఉండిపోవడం తెలియని పెద్ద చీకటి వరుసల కూల్చివేత
నేసి పోయిన నిమ్మలాల పై సంచీ .. ఖాళీ నిద్ర గోష మోసి తెచ్చిన కథకి ..
రుణ మూల కట్టిన నుదిటిలో పోటు పెట్టే అనులోమ ముఖాల కీడుని వదిలించి
దోతార కలిపిన నడకలు.. ఊరంతా చెల్లా చెదురుగా పడున్న నడకలు…
……………
అడివిని దాటినా నదీ యజ్ఞంలో దూరపు కొండల నీరు దుముకుతూ.. ఎత్తి పొత్తులు లేని పాటని
అందుకొని దోతార మాసిన నవ్వుతో.. పై పైట ని తప్పించిన సగం కలతల గ్రహణ మాత్రలు
కరగదీసి.. వదిలేసిన భూమి అందని తాగి.. అంచుని తాగి.. చెలరేగే నిద్ర నడతని సాగదీసి
సంధి పోతల సహకార మన్నింపులని కట్టి రాల్చిన కథలకి చేర్చిన రంగుల్లో ..
మునిగిన దోతార .. కమిలిన నవ్వుతో.. కీడు పట్టిన ఛాతీ ని నల్లగా లాగి.. పొగచూరిన భయం
కలిసిన రగడని నేసుకొంటూ.. కోపగించిన నిద్ర మూర్తుల కసిని పిండుతూ..
అవధిని కప్పుకొంటూ .. తేరుకోలేని సదా మర్మ ముఖాల ఎద్దడి కోసం ఊడిపోయిన తలుపుల
మధ్యలో ఇగిరిన కథని .. మింగేసిన కంటి చూపుకి దోతార వేలాడుతూ ,,. పాటని ఇచ్చినపుడు
ఉండాలని లేని హద్దుకి .. తీరికల కలబాటు కుట్రకి.. లోపల రాలిన కదలికల కట్టుడు రుణాల
కైపుకీ.. మసి చేసిన కథకీ.. ఊసు చుట్టిన ఖాళీలని మాటలకి ఉంచక ..
పాటల అనువాద కట్టడికి చెంత చేరిన మసక ద్రోణుల్లో కదిలే అంపకాల దూరం .. కొండల నీరు..
వాడి నడకలో దొరికిన ఊరు చివర .. పడవ కన్ను మసకబారి ఉండిపోయిన శ్వాసకి ..
ఇంకో కోసెడు దూరంలో .. దూరపు కొండల నీరుని ఆయాసపడి తాగుతూ దోతార..
నిఘాయ వికలం.. దారి పట్టుకొన్న నలుపు పాటల కథకి జారిన రొమ్ము పంటలు..
పగిలి కిందపడ్డ ఉరుముని కనిపెట్టి .. రెండో గడప లేని ఆ పెద్ద వీధి.. చీకటిలోనూ..
నిప్పు కలిపి… మట్టిని తిప్పి.. నీరుని పోసి .. మంచుతో కడిగిన నిలువెత్తు విగ్రహంలా దోతార ..
…………………..
తెగిన చెప్పులు.. బురద మట్టి.. మఠంలో బొమ్మల వాన
అనామ తీర్ధంలో పడి లేచిన నదికి .. కొండల ఆనకట్ట వేసిన దుఃఖం మోసుకొంటూ..
ఆ పొడుగైన పాటని నములుకొంటూ .. తెగిన చెప్పులు.. మట్టి నిండిన దోతార ..
మాట వినని చావు రెండో గొంతులో .. దుఃఖ ముద్రని తుడిచిన కథ ఊరటకి లొంగక ..
సఫల మిత సలహాలని దగ్గర చేస్తూ.. పెనవేసుకున్న శరీర లాలకి చుట్టిన కొండ కూలిపోతూ..
దేహ సిద్దతని కనిపెట్టి .. లేవదీసుకొన్న కసిని పీల్చి .. సగం దూరంలో ఉండిపోయిన ముఖాలని
కరిగించి.. చిత్ర చిత్రాలుగా ఊడిపోయిన వేదికలు మాటున కౌగిలి తీసేసిన చెమట రంగులు…
మంచు దుప్పట్ల తడిని లాక్కొచ్చి.. \పడతోసిన కంటి బయట ఊపిరికి .. తోడు దొరికిన
ఝాము మందలింపుని కడిగి పెట్టి..ఆ బాట మొత్తమూ.. లోపలి తలుపులతో..
పడి లేచిన కొండల మధ్య తవ్వుకు పోయిన నదిని మోసే దోతార కప్పుకున్న నీటి దుప్పటి
ముంచిన రంగుల కల్లోల లోతుల్లో పడి పోయిన కెరటాల తడబాటుకు దీవులని కట్టుకొంటూ..
నురుగు పడవలు మోసిన గుట్టు.. తెల్లారి పోయిన నిద్ర కొండల మాటున కదిలి…
ఏది ఎటు వేపు వెళ్లినా ఉండిపోని వెనక నడక భుజాలని కట్టుకొంటూ .. రుణ పడిన కథకి .
. ఊరటాలేని గుమ్మలని కడిగి .. సత్రం లో దీపాలు వెలిగించారు.
……………..
గుక్కపెట్టిన బురద మట్టి.. కన్ను తడిపిన నిద్ర శిధిలాలతో కూరుకు పోయిన చీకటి గుండంలో
కోతపెట్టిన … మట్టి కాళ్ళని చేర్చుకొని.. జత సాయంత్ర కెరటాలకి నేసిన కథ..
లోపల ఇగిరిపోయిన దోతారల నొప్పిని అరగదీసి.. కథల పక్కగా .. దేహ పచ్చలు పొడిచి
పగులగొట్టిన నిద్ర పూర్వపు మెట్ల దగ్గర…తడిచిన కాళ్ళ ఆవిరి ఇంకా నిద్ర పోతున్న దోతార..
పగిలిన కంటి దోషపు బురద మట్టి .. కదిలిన దేహ దోషపు పుట్టుకని రాల్చుకొంటూ..
దూరపు నిందల కట్టడి ఇంటిని కరిగించి పెట్టుకొన్న నిషాద భుజాల చెమటకి తడిసిపోతూ..
చలన భస్మపు ఇంటిని కాపుగాసిన దూరంలో .. ఒకే పోలికని తెచ్చి చేర్చుకొన్న నడక..
ఉండాలని లేదు.. ఉండిపోవడానికి ఇంకో పుట్టుకలు వదిలేసిన వేడుకగా లేదు..
త్వరపడి ఉండిపోయిన దోతార నిండు గ్రహణ కూల్చివేతలని కప్పుకొంటూ..
చేర్చుకొన్న పరాయి ముఖాలని తెగ్గొట్టి వదిలిన గురుత్వ ఆయు రూపాల చంచార్య ..
పుట్టుకలతో హద్దుని చేర్చిన లేనిపోని గంటల గుట్టుని తాగి చెమట బట్టలు..
…………….
పగబట్టిన వానతో .. కొట్టుకుపోతున్న దారుల మధ్య .. కదలని నిరూప నిర్యాణ ముఖాలని
నుదురు మోసిన చీకటి అనుసంధాన కదలికల్ని కనిపెట్టుకొంటూ.. ధ్వని నానబెట్టుకొంటూ…
కని పోసుకున్న నిద్ర రుచుల గొంతుని కలబెట్టి.. రుణ పడిన చలన స్థితి మండలపు మధ్యంలో
కురిసిన బొమ్మల వాన .. తడి రాళ్ళని పేర్చిన ఊరి వీధుల కథకి దగ్గరగా జరిగి …
అవధి పగిలిన పాటకి.. దోతార కట్టి సానబడుతూ.. మరలా చెప్పుకొని ఉండిపోయిన
అదే అని ఉండిపోని నడక .. మళ్ళీ కట్టి లేచిన దుఃఖ సంపద కదిలిన చప్పుడుని ఏమార్చి..
కలిసిన నిద్ర వాకిలిలో పాటని లాక్కొని.. వేదికపై శ్వాస కూలిన నటనని వదిలి పెట్టిన కథ..
ఏడ్చిన దేహ వాకిలి నిమిత్తంలో పడి కలుసుకొని.. ఉండిపోయిన ముఖాలని చేర్చుకొంటూ..
పొందికలేని తూర్పు నిద్రల అరూప పాతకాల దుఃఖ నిధి నిడివిని సాగదీసిన కథ..
అదే ధ్వని .. మరిన్ని నిద్ర కల్వాల ముట్టడిని చేర్చుకొని.. అవసరపు చీకటి వరుసల
ప్రయాణ కదలికనే ఉంచిపోయిన వెన్నులో చెమట గుండాల్లో కొట్టుకుపోతూ..
దోతారలో ధూళి మింగుతూ అలిసి ముడుచుకొని కలలోకి జారిన పాట …
……………………
జ్వర జాగారం .. వణికిన కళ్ళ గొంతులు ..ఆశ్రయ బ్రహ్మాండం
తడిచిన శరీరంతో తోడుకు పోయిన నిద్ర నిర్మాణ గతులని పట్టుకొని లోపలి వెళ్ళిపోతున్న
దోతారలని మోసిన గతి తీవ్ర చిత్రాల కణతలో .. కమ్ముకొస్తున్న జ్వర జాగారం ..
దిగబడి లేవదీసిన కేక .. పడి లేచిపోయిన పొగల కుండలో .. చిత్ర సమేత వృత్తాల గతిని..
చేరదీసి .. పండి పోయిన కళ్ళ కిందుగా చీకటిని నేసుకొంటున్న చిత్రాల దోతార ..
స్వశిత అనుమానాల్ని కలబెట్టిన సగం కట్టిన రుణ దేహాలని .. నంజుకు పోయిన చెంపలతో..
పెదాల నజ్జుని వెచ్చజేసి. పెడత్రోవలని ఆవహించిన నటనకి … చర్య .. చర్యకి జోడించిన
కథలని .. స్వార్జిత కంటి పోగులతో..హద్దు చెరిపేసిన ముగింపులని .. పడి పోయి లేచిన కణతల
పోటుని గింగరాలు తిప్పుతూ.. సమర్ప రాశుల బరువుని నింపి చేసుకొన్నశేషభూమి
నివేద దీపాల కొల్లబాటు .. ఖాళీల మట్టి బరువు రుణాలపై చెదిరిన కణతల్లో…
వాడు కొన్ని బరువుని.. భుజాలపై భిక్షని .. కడిగి పెట్టుకొన్న అరమరికల చీకటితో తట్టి లేపిన
ఇంటిని పట్టుకొని.. విచ్చుకొని పోయిన కిటికీల పక్కగా నిండిపోయిన పోలికలతో చేర్చిన కంటి
పోతలని నింపుకున్న రంగులని కాపాడిన చిత్ర గతికి రెండో ధ్వని నొప్పిని చేర్చి పైకి పెట్టిన
నమూనా రహస్య బుజ్జగింపులని చేర్చి.. చల్లారిన కక్ష్యని ఒద్దికగా చీకటి నేసి నింపిపోయిన
మాంస మోడులు.. లోపలికి ఉంచి చేర్చుకొన్న దేహాల జత సాయంత్రపు మాటలని ఒత్తిపడుతూ..
………………
దోతార నిండా వణికిన కళ్ళ గొంతులు ..పొడి బారిన నిద్ర విపరీత కథల చాటున కదిలే
వీధిని కాల్చి.. దుఃఖ మంద్రతల కట్టడికి … మరిన్ని తెలియని ద్రవభరిత కట్టుబాట్లు..
ఉండిపోయిన దుఃఖంలో కట్టుతెంచుకున్న నిరాశని పీల్చి .. దేహం నింపి .. వాడి పాటకి ,,
రెండో చర్యని చెప్పి పెట్టిన ముఖాలు కట్టుకొన్న నిద్రరేవులని జోడించిన నిందలు ..
కంటికి చేసిన చీకటికి కంచె పెట్టిన పాటని దాటి వాడిని ఉంచి పోయిన సత్రాల మధ్య …
నిశిత మధ్యంలో ఇసుక జడలతో.. అమరిన గొంతు నిండుగా పోటు పెట్టే నల్లని చెట్ల కింద
నేసిన చీర .. సఫల సేవనకి నింపుకున్న దాహ ఊలం లో దోతారాల వేడుక
పరిధికి రెండో చర్యని చెమర్చి పెట్టిన కాటుకల గుండంలో పడి కొట్టుకుపోతూ.. కలబడి..
హద్దు మీరిన భయం చొప్పించిన కథకి దోషపూరిత భిక్షని ఉంచినప్పుడు ..
వాడు సొమ్మసిల్లి పడిపోయాడు. కథలూ.. నేను .. వ్యతిరిక్త వినికిడిలో చేరి ఊపుకొన్న
పుట్టుకని లేవదీసి.. అదే చెప్పి చూడని సగం నిశ్వాస చిత్రాల గట్టుని కూల్చి..
……………
నేను.. నువ్వని చెరుపుకొన్నఆశ్రయ బ్రహ్మాండం .. సత్రాల నిండు గది కూలినపుడు ..
పడి లేచిన నిద్ర చమర్పుల నొప్పిని ఉడకబోసి .. నీరు పట్టిన దేహ సంధాన ముడులని ..
దృష్టి నిహిత రాశులని కలబెట్టి .. కలిసి .. నిరూప మెత్తని ఒడిలో పడి.. కప్పుకొని ఇంకిపోయిన
చీలికలని .. ఇంటికి రెండో చోటులో దిగబడిన చెట్టు.. వీధి మధ్యలోకి వచ్చేసిన భావి
సగం కత్తిరించిన అవధికి .. గొంతులో మార్చిన కథకి.. సత్రాల్లో బోర్లించిన కుండలకు..
జత కలిపి గొంతులకి.. దూరంగా మెలికలు తిరుగుతున్న వంతెనకు.. రెండో చోటులో…
ఇరుకు శ్వాసలో కలిపి పెట్టుకొన్న ముద్దలని పిండుతూ.. తేరుకోలేని మంత్ర మోడుల
ఊపుని కనిపెట్టి .. అదే ధ్యాసని పక్కకి లాగిన దోతార.. ఇంకా ఊరుకొని ఉండలేక …
విని ఉన్నానని .. కన్నుకి చేర్చానని.. పెదాల్లో కదిలి అప్పగించిన నిద్ర నమూనాల
వెంట కలబెట్టిన రుణ ముగింపులని వదులుకున్నానని.. నెరవేర్చుకున్న బరువుకి…
అంది పోసుకున్న శరీర చిత్రాల కదలికనే మార్చుకొంటూ .. పేరుకుపోయిన దేహ గ్రహణ
చిందులు కదలికనే చేర్చిన నడక జోడిస్తూ.. పీల్చిన చిత్ర నిందల కలయికనే అనుకోక..
రెచ్చిపోయిన అద్దకపు నడతలని అణిచి పెట్టుకొన్న అవసాన రుణాలని కలుపుకొని..
అలాత నిర్మితి..గోడలలోకి ఇంకిపోయిన నల్ల కేకలని .. చెమరింపుల ఖండంలో …
కత్తిరించి ఉంచిన చిత్ర ముఖాల పోలికలని పెనవేసుకున్న .. సంధి చేసిన కణతలని
నొక్కుతూ .. సొమ్మసిల్లిన మెట్ల పక్కనే గదిని వార్చి.. చెంపలకి చేర్చిన దోతార..
…………………………
మునివేళ్ళ రంగు.. బాదం ఆకుల పడక .. దోతార మాత్రలు
వద్దన్న అనూహ్యాలపై పడి లేచిన మునివేళ్ళ రంగు .. నిగ్గు తేల్చిన కథకి .. రెండో ముడి వెయ్యని
తలుపుకి .. పాట వేలాడుతూ.. అక్కడే మర్చిపోయిన వీధి.. చీలిపోయిన కంటి చూపుని ..
చర్యల స్థాయిని మార్చి రాజేసిన కథకి వెన్నులో పాలిన నిద్ర గరుకు వెనక్కి తిరిగిన కల ..
ఇదొక నిద్ర శూన్యం దాచి పెట్టుకొన్న గది.. దోతార వదిలిన గాలి నిడువుల మన్నింపు..
ఇంకిపోయిన కంటి తుడుపు ఋణం .. సమరించిన దుఃఖ నిడివి పోలికలని కాల్చి …
సంభాలింత పెట్టుకొన్న సంబరాల బట్టని నేసుకొని .. నివేశ రాత్రి మధ్యలో ఊరట పడిన
కాళ్ళని సాగదీసుకొని .. కుదిపిన కాన్వాస్ పక్కనే మోసి తెచ్చుకొన్న .. పచ్చ గోడలు పండిన
నెలల బరువు మొత్తoలో దోతార …పూత పట్టిన నల్ల అడుగుల గోడలని దాటుకొంటూ…
పేనుకొన్న పుట్టుకలు .. బాట మళ్ళిన కంటి శిక్షణ .. కసి తీర్చిన బయట దేహం నంజుకొన్న
మాటలని కట్టుకొంటూ.. శరీర చిత్రం పాడిన రంగుల విగ్రహం .. తెచ్చి పోసుకున్న కెరటాల
ముంపునీ .. అక్కడే ఉండిపోయిన పుట్టుకలు నిషారపు రంగోళయ మర్ధింపులో ..
దోతార ఓ ఆసరాని జోడించి… కలత నూరిన గొడుగుల కింద మార్చి పెట్టుకొన్న కథల పోలికలు..
శ్వాస బిగువు వెనక చంద్రుడి నగారాని సర్దుకొంటూ.. పెదాల నిండు గుణం చేర్చి పెట్టి ..
వదిలేసిన చుక్కానీలని వదిలి పాట దోతారాలోకి వచ్చి … అటు ఇటు కెరటాలకి గుద్దుకొని…
నిశ్చంత మూట గట్టిన నమూనాల కప్పివేతని దాటుకొంటూ .. సంచారపు ముఖాలని
మోసిన కథకే వీలుపడని ఎండని వాల్చి రెండో నిద్రని వదిలిన కల
…………………..
సగం నేసిన చిత్ర ముఖాలని చేర్చుకొని..వణికిన దేహపు రంగుని కడిగిన చిత్రాల గడువు దాటి
ఏడుస్తూ.. తీవ్ర మాయని ఉడకబెట్టిన ముఖాల ధార చల్లారిపోతూ.. పై నుంచి వణుకుతూ…
వదిలేసిన సన్నాహా ఉరుములు కట్టుకొన్న నిద్ర రేవుల్లో .. కలబడి ఏడ్చిన కూర్పులని ఏమార్చి..
దోతార తో కలిసి బాదం ఆకుల పడక .. మృత్యు సందీయ ఆనుపానులు .. చెమట పోతలు
మోసపోని జత నీటి గదులని కాల్చి.. పేరుకున్న నాచు కన్ను బిగువుని చెమర్చిన నెలలు..
సమయం నీటి చుట్టూ .. తప్పుకు పోయిన కథల నిలువు గుండంలో ఊగిన కలత పేజీని
తుడిచి..కంటికి కనబడని జత పూనకాలే .. వెనక్కి చేరిన సత్రంలో పిసికేసిన నల్ల గనుల
మూర్తిని ఆవహించిన పాట ఆగక ముందే.. చెలరేగిన నిద్ర పల్చని రంగుల నడతని …
పండిపోయిన నిషేధ చీకటి చెట్ల కిందుగా .. తన పాట వెలిగిన మంట చుట్టూ తిరిగి..
తప్పిపోయిన హద్దుని కరిగించి పోసుకున్న పూడికలు.. మత్తు కూలిన ముట్టడి….
ఒద్దికలేని అపక్షేమ విసుగు ఏడుస్తూ… అక్కడే సత్రం ఖాళీ చేసిన జోలెలో పాట..
కంగారు మోసినది .. విప్పుకొన్న శ్వాసల మరుపుని తుడిచినది చెలరేగుతూ..
అదే తెలియని వంతెనని తాగుతూ నది.. అపమిత బొంగరాల కన్నుకి జత చేర్చిన
ఝాము పగటిలో కొన్ని వీధులు.. తాళాలు పడ్డ గుడి … ఖాళీ గడ్డి మంట ..
……………………..
నిభంగాల ఒరిపిడి చుట్టిన చీలికల్లోకి పొగ చేరిన కథకి .. మెరుగు పెట్టిన అవస్థ ముడులని
కుదిపి .. చర్య .. చర్య కి చేర్చిన గోడల చుట్టూ .. ఆ వీధి వెనక మిగిలిన మెట్లని నటనలోకి
వదిలిపెట్టిన వేదిక మట్టి బాటగా మారాక.. గొంతులో నిండిన రుణ వికార దోతార మాత్రలు ..
గొంతు రొప్పుని .. కడిగిన కొండల కింద రుజువు తెలియని నడకల ఖాళీలని ,..
నింపి పోసుకున్న చర్యల మధ్య ఏకం చేసే నిద్ర సాధన ముఖాల కవ్వింతనీ .. రవ్వంతనీ
చెదురు మదురు గాలి లుంగలు మోసి తెచ్చిన అంపకాల గరుకు సాధన చెదిరిపోతూ..
ఇంకా తెలియని నింపాదిత వీక్ష బొమ్మల సెలవులో … పగటి నలతల పట్టుతో
కొట్టుకుపోతున్న వీధులు.. పాటకి శిలలైన ఛాతీల గడ్డని కొట్టి విడదీసిన మునివేళ్ళ నొప్పికి ..
అప్పగించిన బొట్టుల బుట్టలో .. తేమ పీల్చిన పెద్ద నోరుల చీకటిలోకి దోతారల పడక..
కలబోత పట్టుకుచ్చుల నీరు పొడి తిప్పుకొంటూ.. ఊపిన దీక్ష కోలాటాల కథ పట్టుకొంటూ…
…………………..
చిత్తడి పాటల నడక.. చావు నీరు.. సాధన వాలిన గొంతు.
ఉన్నఫళంగా అందిపుచ్చుకొన్న కథలని లాగి.. ధ్వని చరిచి ఉంచిన కన్నులో ..
పొడుగైన చిత్ర నాలికలని తోడి పెట్టిన కథకి .. అంతేనని కాపాడుకొన్న జోడు రంగుల బొమ్మని ..
చీకటిలో వదిలి పోయిన కలకి .. రెండు వీధుల ఖాళీని పట్టుకొని .. కదలని మట్టి గుడిని కదిలిస్తూ ..
పాటలని తినేసి పోయే వాన రాకడ గుమ్మాల్లో .. పలవర చిత్ర చితి ముద్దలని దాటి..
అక్కడ అల్లా పాతుకొంటూ పోయే మాటలని మోగే దోతారా .. చిత్తడి పాటల నడక …
అదే ఉంది. అక్కడ తొలిగించిన నిద్ర సవరింతల ముట్టడికి నిలబడి .. రెచ్చి కలబడి..
ఒరిగిన దేహ గుండాల్లో చిక్కుకొని.. దొర్లిపోతున్న నిద్ర గుణాల సాహిత పలవరింత..
ఇంకా అదే ఉంది.. తెలుసుకోలేని దూర గ్రహణాలు మత్తులో ఒదిగిన కంటి పాటకి .. నీరుని కట్టి
బొట్టు దిద్దిన కథగా ఉండిపోయి … నిరూప ఛాయల భయంగా సవరిస్తూ పట్టుబట్టి
బయట నిండిన వాకిలి.. లోపల గొడుగుని ఆరబెట్టిన నడకలు..పైకి చేరుకొన్న నది గట్టుపై..
ఇంకా సర్దుకోక ఆయాసపడే పాట… నిద్ర సడిని జల్లించి దేహ గ్రహీప సంధి ని జోడించుకొంటూ..
…………….
పోత పోసిన నిద్ర బొమ్మల కలవెలపాటుని .. దుఃఖ వీధి ఉడకబెట్టే నిద్ర రంపాలతో కోసి..
అరగదీసి ఛాతీ బరువుల ముఖాలని పోతపోసుకొని.. రగిడించి గోకిన చీకటిలో…
సిద్ధ ముఖాల కథకి లేవదీసిన అనుమాన గతులు.. కప్పేసిన కల సగంలో పుట్టు గొలుసు
పాలిపోయిన చేతులని పెట్టుకొంటూ.. ఆరిపోయిన చీకటి సంధాన వృత్తంలో ..
కట్టి పోయిన మెట్లని కూల్చుకొని.. దోతారల నీటి బజారు కూలబడి …
నటనకి లోపల.. రంగు ఊడదీసి కళ్ళకి కాపలా .. ఉరిమిన దుఃఖంలో తిరిగే కథ ..
రెండో గంట మోసిన గత సవ్వడి.. ఊర్పుని పాతేసుకొంటూ ..పెడచెవిన పెట్టిన
కలతనీరుని వదిలిపెట్టి.. దేహ నిగ్రహ సగం బిగిసిన కేక ఒంటిలోకి చేరి నిండిన పూనక జీర
స్థిత పరాయి చావు నీరుని మోసిన ఒద్దికల చీకటి రేవులో కథని పట్టుకొన్న శరీర బరువు..
పులిసిన కథని ముఖాల్లోకి నింపి .. నీటి మడుగుపై తేలి … ఒరిగిన నిద్ర చాపలపై దోతార ..
ఊపి పెట్టుకొన్న నల్లని అడుగుల గోడలని పట్టుకొని .. కునుకు సాగిన నిద్ర బజారులో
నడుచుకొని .. అక్కడ కలిసే శరీర సాగుల రాళ్ళ పేనకొంటూ కూల్చిన జోడు రాతల
గదిలో కలిసి దోతార మూసినా కిటికీల మధ్య కలని కప్పిపెడుతూ .. నడుంలాగి…
పెద్ద ఆయాస నొప్పిని కదిలించి .. జోడించిన కన్నుకి చూపుని చేర్చి ఉడకబెట్టి..
తిరిగి పోయిన కథకి రంగులు తుడిచిన దేహాలని పట్టుకొని .. సవరించే కట్టు నిద్రల
మాటున లేవదీసిన కాస్త నిద్రల అడుగున మోట భావి. ..గాలి మార్చిన సత్రాలు
ఊపుకొంటూ ఆవరించి పట్టుకొన్న నిండు గ్రహణ మోడుని తవ్వి.. ఒక పక్కకి ఒరిగిపోయిన కల
కాపాడుకోలేని నటనల వెనక రంగు దులుపుకొన్న వేదికలు.. నింపిన చెమటల పాత్రలు
…………………
సాధన వాలిన గొంతు… రెండు గడపల మధ్య నిలిచిన సత్యం .. సాగే మహా యానపు ముఖాలని
సాగదీసి.. కప్పి పోయిన నిద్ర దర్శన చిత్రాల కథకి .. ఛాయా మెరుగుని దిద్దిన కథ తెలిసి..
కాళ్ళ బారజాపిన కన్నులో పడి .. నిశ్చంత నలత పట్టుకొన్న దోసిలిని నింపుకొంటూ..
తేరుకోలేని నిరాదీక్ష కథకి జోడించిన దోతారల చప్పుడు .. ఉడికిన గింజలు గుప్పెడు
అదే ఉంది.. అలా చెప్పుకొంటూ తిరిగి .. మరేం తెలియని చీకటి తచ్చాడిన పునాది చిహ్న
చిత్రిత సగం పోలికని తోడుకొని.. పాటకి మోసిన నిండు తలాల నిప్పుని పెనవేసుకొంటూ..
కాల్చిన తాపడపు దేహ స్థలాన్ని కలిపేసి.. అదే ఉండనే కంటి దోషపు నిర్వర్త గుండంలో ..
పైకి చేర్చిన కథనాల కుట్రని కప్పే చలన ముడికి .. బిగిసిన వాన కట్టుకీ …
బిగియ రాతల నిద్రచాపం పట్టుకొన్న పాటతో వాడు దోతారని సరిచేసి అందుకొని ..
లోపల కలుసుకున్న పాత వీధుల సంధి నిద్రకి .. ఆ బయట ఆగిపోతారు .
………………….
ఆశ్రిత నీటి గొడుగు.. దోతారల ఊపిరి .. రెండో నిలివిడి
అదే సిద్ధ రాత్రి కదిలిన బెంగ గూడులో గాలిని నంజుకొన్న పాటకి .. రెండో గట్టు లేని నిద్ర జాతరని
కలబెట్టిన కథకి .. కన్ను పోసిన నల్లని శూన్యంలో పడి పోయిన దుఃఖ గడువుని సాగదీసి..
నించోబెట్టిన ఆశ్రిత నీటి గొడుగు .. వెనక ఉండిపోయిన పొడి వీధులు .. త్వరపడని గ్రహణ
ముఖాల కట్టడికి దొరికి .. ఏడ్చి కనిపించని పొగలకి దుక్కి దున్నుతూ.. నేలవాడిన తడి కొండల
మధ్య చిక్కుకొన్న ముఖాలని పెట్టుకొంటూ.. పెనవేసిన రుణ పేటలని అల్లుకొంటూ..
శిధిల నాదపు కౌగిలి చుట్టూ ఇగిరి పోయిన కంటి చూపుని పట్టుకొని… నిష్పర సమాయ శాపిత
దుఃఖ మోడులో నిలబడి.. ముంచి తాగిన నీటి జడల బొమ్ముల అడుగుని కట్టుకొని..
మూడు మూడు ప్రమాణ చిత్ర పూతలకి .. నెమ్ము తుడిచిన శ్వాస పదునుతో..రొమ్ము నిండిన చీకటి
లోపలి వెళ్లిపోయిన దోతార ల మెలిక .. గొంతు మోసిన నిరాశలు దట్టమై.. కదిలి ..
లిపి ధ్రువాల గడువుకు మోసిన పుట్టుకలు. . వదిలేసి నిండిపోయిన పోలికలు…
అక్కడ ఎవరూ కొత్త దారిని వెదుక్కొని ఉండిపోలేదు.. కదలాడిన ధ్వని కలతని .. శ్వాస వేటుని
నెరవేర్చి చేసుకొన్న ఆపద గడువుల్లోకి .. తిమ్మిరి రాల్చి తెరిచిన తలుపులు.
………………..
తల్లడిల్లిన దోతారల ఊపిరి .. ఆగి చేరదీసుకొన్న జోడీ గదుల నిప్పుని ఊది.. నీరు చేర్చిన
కన్నుకి .. పాడాలని తడిపిన కలకి .. గడపలపై పూచిన కలువకు .. రంగు వదిలి ..
శ్వాస చెమ్మని తుడిచి పెట్టుకొన్న నిబ్బర గోడల పగుళ్లలో … గాలి నలతలని వడపోసి
రెచ్చి పోయిన కరకు ధ్రువాలు.. పిండి వెళ్లిపోయిన కళ్ళకి .. గొంతు పండిపోయిన
దోతార ముక్కలని అతుక్కొంటూ..బయటపడలేని నిండు శరీర కణతల్లో .. కాపాడుకొన్న
నిద్ర ద్రోణుల్లో విడిచిన కొండల్లో ఆద్దిపెట్టుకొన్న .. నాటక వీధుల్లో.. కలిసి పోయిన
అపార్ధాల నానుడిని కదిలించే .. నమూనాలని అల్లుకొంటూ.. మరి లాక్కొంటూ…
భభంగన ఛాయల సంధికి .. కలిపి తిప్పిన కలని చేర్చి.. చిక్కుపడిన జోడు ఊపిరి పిగిలి
కట్టుడు ఇంటిలో .. కాగబెట్టిన కునుకుని దోతార లోకి దింపి..ఊరు నిండిన సగం విపరీతాలని
కుట్టిన బట్టలు సరిపోలేదని విప్పేసాక.. పాట వదిలేసిన నీటి గంటల తేమరింపు ..
మసి పూసిన నిద్ర రవ్వల పూడికని తీసి.. అక్కడే నింపి ఉంచిన సగం పాట
నానబోసిన హద్దుల్ని .. కదలిక లేని ఊపిరి చీల్చిన అభయ సంధికి మోసపు రెప్పలని ..
నల్లబారిన కేకలకు .. తీరు మారిన పోలికలకి నిలువు విగ్రహాలకు .. వచ్చీ పోనీ దేహజాడలని
కలిపి చేరుకొన్న మంద్రతలని వడపోసి .. సగం ఉంచిపోయిన చల్ల సన్నని గోళ్ళని
మీటుకొంటూ పాటకి రెండో దశని వదిలిన కథ.. ఎప్పటికీ అక్కడే సత్రంలోనే ఉండిపోదని..
…………..
నిద్ర నిరూణ హద్దులో .. గతి తప్పిన కథకి .. రెండో కొండ చాటు తెరచాప గూడులో ..
అడివి మధ్యలో నీటి గోషణ చేస్తూ ఆ పడవ.. అది ఎందుకుందో ,, ఎలా ఉందో నిద్ర విడిచిన
దోషభూమి లో కన్ను ధరించిన దీప నెలల విచారణ .. కొంచెం మాటని నెట్టి పక్కకి జరిగి..
అడుగుని లోపలి వదిలి.. చుక్కానీ గొడుగుని ఆరబెట్టి.. ఇంటి లోపలి దుప్పటిని చుట్టుకొని..
వాడు చూసాడు.. ఆ గూడుని చేరి .. అక్కడే ఉండిపోయాడు… ఎవరికీ కబురు లేదు..
మరెవరూ ఆ చోటుని ఊహించనూ లేరు.. కలవనూ లేరు.. వాడిని కాపనూ లేరు..
దుఃఖ శ్వాస ఎర్రబారిన జోడు రథాల కొండకి కింద దిగి .. వర్ష నిరూప దేహతకి అందిపోసుకొన్న
గుణ రుచులని చప్పరించి.. నిరోహణ మోసి తెచ్చుకొన్న దోతార .. చుట్టూన్న గుహలని పండిస్తూ
అప్పటికే తీగల మధ్య కలబరువుని సాగదీసి .. ఉన్నపాటున వెలిసిన కొత్త చోటు..
గర్భ నీరు పొదిగిన నిస్వయ వాకిలిని చేర్చుకొని కట్టుకొన్ననిలువు భుజాలపై చీకటి సంపదల నదీ
వాహన లేని ఆ పడవ వాడికి వాసం.. కొన్ని చెక్కలు.. చెమ్మ పీల్చిన వాసన చుట్టూ ..
తులసి మొక్కల పొద …వేర్లు కూలిన మర్రిచెట్టు…. ఎగిసిపడే దేహ పాకుడు నిష్పాద
ఒంటరి కొండల్లో తప్పి పోయిన శత్రు ఆయుస్సు కదిలించిన కట్టడి ముఖాలని కట్టుకొని..
అదే అని తెలియని కలవర కాటుని వెచ్చజేసి.. మాయ జోడించిన కథల వసారా..
కథకి చేర్చిన రెండో వాకిలి నిద్ర కూపాల చేదు మందు మింగుతూ..
తడి రాత్రి బెంగని తీర్చే వాడి దోతారా.. కొంత అడివి అరుపులు.. జలపాత సంగర…పాట
…………………
CHAPTER 4
ఊరు దాటిన అడివి కథలు.. దోతారల భావి.
ఊరు దాటిన అడివి కథలు మొదలైనప్పుడు .. చలన మంత్రపు సవ్వడికి చేర్చిన ముఖాలని ఏమార్చిన చిత్ర తదన రంగులు పులుముకొని .. చేర్చి పెట్టుకొన్న పాటల దారిలో .. కాళ్ళు దిగబడే బురద మట్టి .. లోపలికి కాటేసే దోమలు..పాములు .. భయం కమ్మిన దేహ ద్రవాల గుండంలో పడి .. ఊపిరి సలపక కొట్టుకొంటూ.. పెడత్రోవలు.. నిలువు కొండల బిగువు.. వాన నీటి కవ్వాలు .. దుఃఖం చేర్చి పెట్టుకొన్న జోడింపులని కట్టుకొని .. చెదురుమదురు గుండాల్లో శ్వాస జాడలు చిక్కుబడి..ఒద్దికలేని చిత్ర జ్వరాల మగ్గింపు..
అమాంత సరిహద్దుల గుండంలో పడి కొట్టుకుపోతూ.. చెదిరీ చెదరని చర్యల పుట్టుకని .. సరి చెయ్యని మసక పూర్ణ గతులని జోడించే నిద్ర దృశ్యాల కౌగిలికి .. చేర్చి పెట్టుకొన్న దేహాల కను సైగని మార్చి పెట్టుకొన్న దీపాల గొంతు.. కాలినడకలు.. అడివిలో గూడు పడవ ..వరదలప్పుడు కొట్టుకొచ్చి అక్కడ మిగిలిపోయిందేమో..
కట్టెల మంట .. దేహాల రాజీ మత్తుని సాగదీసి.. మరిన్ని కలతల నిండు కలని పట్టుకొని .. దేహ స్థిమితలేని నిరాదీక్ష రాతల్ని తుడుచుకొంటూ.. పడి లేచిన చిత్ర నాదాల ముట్టడిని కట్టుకొని వెళ్లిపోయిన చెట్లు.. దేహమే తీగల గుట్టగా మారి అడివిని అల్లుకొంటూ.. మండిపోతున్న దేహ నిధుల కలతకి వడపోసిన కుట్రలని కూల్చి దూరంలోకి పొగపెట్టిన రుణాల భూమి నివ్వెరపాటుని పెనవేసుకొంటూ.. శరీర నాదం ఎక్కుపెట్టిన కలకి రెండో వీధిని వదిలిపెట్టి ..సాగదీసి దూరంలో పండి రాలిపోయిన వాన గాట్లు..
తూఫాన్ రాత్రులు .. చలి మడుగులో దొరికే మంచు కాకలు.. పొదివిన దుఃఖ నిందలు..కౌగిలికి చేరిన నదీ బొంగరాల తిరుగుడు..
……………..
శబ్ద పూతలు లేని దేహ అస్థిమిత చంద్ర గ్రహణాలు.. పట్టి దులిపిన నడకలని సరి చేయక ముందే .. తత్తరపడి లేచిన అంపకాల భావి..
గూటి పడవలో దొరికిన అగ్గిపెట్టి.. చిన్న కొండ తొలిచిన గూడులో మంటవేసి.. బాదాం ఆకుల్లో దుంపలు .. నిప్పులపై కాల్చి తింటూ .. ఊటబావి నీటిలో దాహమూ.. దేహమూ సేద తీరుతూ.. విశుద్ధ ధ్వని అఖాతంలో కేకలు పెట్టే శరీర జలాల ముట్టడికి చేర్చిన కథతో మండుతూ.. లోపలా బయటా లేని దూరాల మధ్య కాల్చేసిన కునుకు.. దోతారల భావి.. అలసట కరిగిన శ్రమ సత్తువుల కొలువుని కట్టుకొంటూ .. కాపాడిన నిశ్చిత మంగళాల దోష నివారణ కదిలే బొమ్మల పోటు..
నిగ్రహ హద్దుల్ని కాల్చి .. వేడికి కుదిర్చిన కథల మలుపులో పడి .. తొందరల కన్నుని సాగదీసి.. కథల వెంట నసిగిన మాటల వర్ణ స్వేదం పుట్టుకొచ్చిన శ్వాస కేంద్రంలో .. పరిమిత విపరీతము.. చర్యల వెంట చర్యలుగా వెనక్కి రాలేని ప్రయత్న నిందల గడువుని ఒంపి.. లోపల కాలచిన చిత్ర భూమి లోయల్లో కాలుతూ.. హద్దులు లేని కంటి శిక్షణకి మోసిన తలుపులని బిగదీసుకొని.. ఇంకిపోయిన కళ్ళకి బార్లా చాపిన ఉనికిని పెట్టుకొంటూ.. పిండేసిన మాటలని వదిలి పాటలై మోగుతూ..
……………………
నది జడ విప్పిన నోటి చప్పుడు .. వాన బుడగలు.. అదొక ధ్యాన దీపం వెలిగించిన నాజూకు ముంపులతో.. హద్దు మోసిన కంటి పోగుల అల్లిక .. చిత్ర సవారీలు .. నిద్ర మోసిన మోసపు గడువులు.. కన్ను పోసుకున్న చెమట కథలని నుదుటిలో దాచి పెట్టి.. మాట చదివిన చలి మంట దగ్గర వాడి పాటని ఏమాత్రం ఆగనీయకుండా .. దృష్ఠి మహా ఋణం కమ్మేసిన దుఃఖ నివురుని ఊదుతూ.. చూపులకి నిడివిని సాగదీసిన పుట్టు దోసిలిలో ఉంచి తీసిన చీకటి బావిలో మళ్ళీ చేర్చి వదిలిన దోతార .. వినికిడి సరంజామాని తిప్పి రాల్చిన కన్ను చెదిరి .. శరీర సెగలో కాగిపోయిన నిర్మాణ శృతి తప్పి రాల్చిన కునుకుని ఉడకబెడుతూ..
పత్ర హరిత నిద్ర సంధికి .. గొంతుని రుద్దిన వేడుకని నేసుకొంటూ… రవ్వలు ఉడకబెట్టిన ఆకలిని తీగలుగా సాగదీసినపుడు ..సృష్టి నీలం పులిమిన పాట…
అదే ఉన్నదీ .. లేనిదీ .. కదలనిదీ .. కదిలి పైకి చేరి దుఃఖం దోతార లోంచి కురుస్తూ ..
సృష్టికి .. వాడికీ ఒకే సమూహ నిర్జన సాయుజ్య ధారల ఏక వంతెన దోతార .. మొత్తం అడివికీ వాడొక్కడే
తాబేళ్ళ కొలను .. పండిన పడవల ఇల్లు .. అడవి గాలుల దోతార
రశ్మీ ధ్వని పోగేసిన నిద్ర సవ్వడి పోతలతో .. కంటి రాల్పు చిత్రాల కవ్వింతనీ .. చీకటి బిగువుల
చిత్ర వదులుని కడిగి .. మెలిక పడ్డ చెట్ల విందుని ఫలాలలోంచి తాగి సొమ్మసిల్లుతూ …
ఆ పక్క చెట్ల పక్క .. తీగల పొదని దాటి .. బాదాం చెట్టుని పట్టుకొని .. కొంచెం కిందికి చూస్తే ..
తాబేళ్ళ కొలను … నీటి కసిని.. చెమట హద్దులే కలబడి … శరీర శ్వాసలు నిలబడి…
పెడ చెవిన పెట్టిన నిద్ర దర్శిత ఘర్షణ మాసిన ఊపులతో.. చెలరేగిన నిద్రగండిని దాటుకొని
చిక్కిపోయిన వివక్ష పాటకి .. రెండో చెంప నిమిరింది దోతార నిద్రపోతూ.. కదలికనే పట్టి రాల్చిన
కథకి .. కొన్ని భుజాల సత్తువని కలిపే పట్టింపుని నేసుకొంటూ.. కలిపి పేనుకొంటూ…
చిత్ర స్వరం ఉడికిన చూపులోంచి.. నిద్ర పలకరించిన కలల గుట్టని వాడి ముందు పోస్తూ దోతార..
భయమనే నిపాద వర్షగతిని చిత్రిక పట్టి.. దుఃఖ గుబులుని కట్టుకొన్న శరీర మాయకి జోడించిన
నాటక తెర చింపేసిన అడివి.. ఒక్కోసారి .. క్రూర అరుపుల .. నల్లవారిన ఉరుము పెళ పెళ లతో
విరుచుకు పడ్డ.. వాడు చిరునవ్వుతో గమనిస్తూ.. ఒక్క చిందు… దోతారని భద్రంగా పట్టుకొని
వేసేవాడు.. వాడి ఉనికి లోపల చీకటి నది అడివిని చెప్పాపెట్టకుండా …కౌగలించుకొనేది.
ఒక మొదలుకాక .. పడి రాలిన పళ్ళ మధ్య ఎదురు చూసిన నిద్ర దోషపు మండలంలో ..
కాక పెట్టిన ఎండలని మెలిపెడుతూ.. హద్దు తుడిచిన కలకి మోసిన నిద్ర తూగు..
వాడు ఆ కొలను చుట్టూ తిరుగుతున్నాడు.. ఆ మూల ఈ మూల కూర్చొంటున్నాడు..
…………………
కంటి అరల్లో దాచి పెట్టుకొన్న నీటి గనులతో పైకి చూస్తూ… నవ్వుకొని.. తడి మట్టితో బొమ్మలు
చేసుకొని.. సంశయ నిద్ర వాహన మోసిన పాటని కంటూ… మంచు ముసిరిన రెప్పలతో చేరగిలి
ఏ మాత్రం నీటి చప్పుడు లేకుండా .. మొప్పల శ్వాసని దీపం ల పెట్టుకొన్న మెరిసే చేపల చీకట్లు..
నిండు ఆక్సిజన్ గని లాంటి ఆ నీళ్లలో తాబేళ్లు .. చాల నెమ్మదిగా .. చాల అంటే చాలా నెమ్మదిగా
గట్టుని .. నీళ్ళని కలుపుతూ.. ఒక ధ్యాన ముద్రలోలా ఆగిపోతూ.. వాటిని గమనించడమే..
వాడికి అవే అతిధులు.. లేదా వాటికి ఖాళీ చూపులతో ఎప్పుడూ చూడని అతిధి తనే…
రాలే ఆకులు.. కురిసే మంచు.. హోరు గాలి కమ్మేయడం.. మధ్యాహన్నం దాటేసరికి చీకటై
పోవడం.. వాడు ఖాళీగా వదిలేసినా తేనే తుట్టలని.. ఎండు కొమ్మలని విరిచి ..
మంటలోకి వేస్తూ,, ఆరకుండా చూసుకొంటూ.. అక్కడే ముడుచుకొనేవాడు..
ధ్వని బొంగరం ఏడ్చిన ఉక్కినంతలో .. కాసిన్ని నీళ్లు పోసుకొని.. తడి బట్టలతోనే..
వనశాలలో వాడికి కొన్ని ఆకులు కోసం తెలుసు..మంటలో అవివేస్తే.. దోమలు.. క్రిమి కీటకాలు
అటు వచ్చేవే కావు.. మధ్య రాత్రో ,.. ఏ రాత్రో తెలియదు..
దోతార వాడి ఒడిలో … ఓ పండు తిని మొదలుపెట్టేవాడు.. లక్షల కోట్ల శబ్ద తంత్రుల వేడుక ,.
నిశ్చంత తెలిసిన విశ్వ ధుని కలవరం.. ఆముఖ సంధి ఎక్కు పెట్టిన మహానాదంలో ….
……………
శరీరం .. రెండో దేహ ధార సర్దిన నిశ్వపు మహా గతిని మోసిన కథకి .. తను ముఖం చుట్టిన
మూడో స్వరమై.. నాలుగు పక్కలా అడివిని .. పంచభూత విచక్షణతో చూస్తూ… ఆరు రుతువులు..
ఏడేడు గంటల వరస సాధన .. ఎనిమిది రకాల పాటలని .. మట్టి,, నీళ్లు.. నిప్పు.. ఆకు ..
జీరశ్వాస .. చీకటిని తింటున్న మంచు.. వాన కడిగిన గూడుని వంగి పట్టుకొన్న
చెట్ల లోంచి తీసి.. పండిన పడవల ఇల్లు … బరువెక్కిన గాలి కెరటాల తేమ అద్దుకొంటూ …
కదలినవి.. కదలక.. కదలనవి.. అలానే ఉండిపోతూ.. దుఃఖ హద్దులో ఝాము ఎత్తుని ఊపి ..
కలకి పట్టించి .. పాటని నెట్టుకు పోతూ.. విసుగు లేని అమాంత రాజీల పోటుని పట్టుకొని..
ఇంకిపోయిన సాధనకి గస పడుతూ.. అడవి గాలుల దోతారని విప్పుకొని.. చప్పుడు లేని
నిద్ర గదిలో ఊడిపోయిన అడవి కాళ్ళని పాతుకొంటూ .. శుద్ధ సాధన మోసిన కథకి పట్టు తప్పిన
దాహపు నీరు .. నాచు ఎంగిలి.. చేప మొప్పల వెలుగు.. తేట నీరుల దాహం .. తాబేలు అందిస్తూ..
చిత్ర స్వరం ఉడికిన చూపులోంచి.. నిద్ర పలకరించిన కలల గుట్టని వాడి ముందు పోస్తూ దోతార..
………………….
కొమ్మల మంటపం.. పెద్ద మర్రి కాళ్ళు.. దోతారలో ధూళి శ్వాస
వాడు ఆ చోటుని గుర్తుపట్టేలా కొన్ని కొమ్మలని వి ఆకారంలో మాడు చోట్ల కట్టి.. కట్టె బొగ్గు తో
గుహ కొండపై రాసి …ఓ మండుతున్న కట్టెతో అడుగుని నమ్ముకొని ముందుకు వెళ్ళాడు..
అక్కడ కొమ్మలు .. తీగలు .. కొన్ని ఊడలు కలిసి పోయి.. ఓ పచ్చ కొమ్మల మంటపం..
అక్కడే తిరిగి చీకినా చెట్ల మొండాలు .. కొమ్మలతో మంట వేసుకొని .. ఆ తీగలపైనా ఓ
ఉయ్యాలలా పక్క … మెత్తని పరిమళ పూలని చల్లుకొని.. మంట కొంచెం చిన్నది చేసుకొన్నాడు
సుజల నిర్మాణ వెన్నుల్లోంచి .. చీకటి చలి కుమ్మరించిన కాగడాల మంటని పెనుకొంటూ..
కలని పక్కకి లాగిన చరణ గంటల కాళ్ళ ధూళిని .. కొంచెం జాగార దిక్కుగా పంచుకొంటూ..
రుణ గడపని చిదిమి .. గాలి కట్టిన తూగుని వడపోసి.. దోతార గొంతులో పోసి మొదలుపెడుతూ..
మళ్ళీ సవరింత తెలియని .. వెలుగు ముంతలు కాపలాలో ,, వాడికి దగ్గరగానే నీటి కుంట..
అంపకాల సంధి తలుపులేని చెట్ల మధ్య .. దుఃఖ బిగిసిన ద్రుష్టి కణతలని సరిచేసి..
కథకి రెండో ముడి వేసిన కరకు నాలికని మెలితిప్పి.. దోతర తీగలపై కలుసుకున్న గోడలు..
అవి వదిలి పారేసిన మెట్లని కడిగి.. దుఃఖ స్థిరం కానీ పొడుగు శ్వాసతో .. వర్షం చిక్కగా నేసిన
నీటి మైదానం సర్దుకొంటూ,, దేహ శ్వాసల పుట్టుక తెంచిన కన్నుని అరగదీసి .. అల్లుకొని…
దుఃఖ ధ్యానం వదిలేసినా వర్ష సాగు.. ఓ చెట్టు భుజాల కింద .. మెత్తని.. చల్లని.. రంగు
రంగుల పూల మొక్కలు.. విప్పారిన వాడి కళ్ళు విప్పారినట్లుగా ఉండిపోయేంత
అందంగా.. చలన కృతి మోసిన దండన చుట్టూ.. దీపం ఒలిచి చప్పరించిన పొగల రుణమై
…………………
ఆచితూచి వేసిన పాటల అడుగుల మధ్య కుదేలుపడ్డ .. స్మర మంత్రసాగులో .. కొట్టుకు
పోతూ.శరీర పాత నిద్ర కింద ఒరిగిన చింతితాల సాగుగా .. అట్టేపెట్టిన చలి కుండలతో
పెద్ద మర్రి కాళ్ళు.. నిద్ర భోగారపు ఊడలని పట్టుకొని…చెల్లా చెదురుగా చెలరేగిపోతూ
అవే అతనికి శ్రోత .. విడివడిన గొంతు సాధనలో కాల్చి పెట్టుకొన్న తీర్మాన నిందలని కలుసుకొని.
వసారా కంటిలో మోసి తెచ్చుకొన్న సాధ్య విపరీతాల కలిసిపోత.. ఇంకా నకరింపులోని
చేదు పలం తినే తినక .. మార్చిన కాళ్ళ ఊడలని జాడించి పెట్టుకొంటూ.. రగిడించిన
కునుకుని పట్టుకొని.. అదే సవరింపులేని ఒంటి పాటతో.. మాటలని తోసుకుని పట్టుకొంటూ ..
అదే ఉంది.. అదే కనబడక .. నిద్ర వదిలిన ఖాళీలని దాటుకొని.. అంత దట్టంలోనూ..
చుక్క నీరు వదలని.. కథగా పండుతూ.. విరిగిన రుణ కావలి నేసిన తీగల దొంతలర్లో..
నీటికుంట విసిరినా ఆవిరిపట్టుని .. విదిలించుకొన్న దోతార .. ఇక నేను సిద్ధమేనని..
కసి రాత్రి కొసలని పట్టుకొని.. దీప సగం ఊరట పిండిన కథలోకి పోసుకున్న చెమట గొంతులని
కాల్చి..అక్కడే ఉండిపోయిన ఖాళీల గతికి .. రొమ్ము పండిన నడకని చేర్చి..
శ్వాస గడప దాటని ఝాము పాటని .. దోతార మింగేసాక.. తీగలు చెప్పే మాటని వాడి గొంతు
వింటున్నప్పుడు.. సమయ సపరిమిత అయోమయం మోసి తెచ్చుకొన్న కట్టుకథలు వదులై.
శరీరమంతా ఊరేగే చంద్ర గాలుల పరికింపుని కట్టుకొని.. చర్యల మధ్య ఉరిమి పంచుకొన్న
కథలని దగ్గరగా సాగదీసి.. వరుస తప్పిన చెరిచిన అడివి హద్దులపై.. తిరిగి పట్టిన ముసురు..
………………….
మందగించిన వర్షంలో దోతార పీల్చిన ధూళి శ్వాస .. కదిలే నిద్ర నదుల కల్లోలికాల ఒరిపిడి
ముంపులని కట్టి పడేస్తూ.. తేరుకోలేని దుఃఖ నిమిత్ర కథన రాశి.. చీకటి.. నీరు పండిన
చెమ్మ .. వెనక్కీ ముందుకీ కానీ అడుగులు చిక్కుబడుతూ.. కథకి పట్టుబడక ముందే
ఆయనటం హితం లేని చలన గుండ్రాల తీగలు.. దోతారాలోంచి .. అడివి తీగలకే అల్లుకొని..
రసాయన ముద్రల నీరు వడపోశాక.. ఆవిరి నిండిన కథల గోడలని విడదీసి.. కళ్ళలో
పోసుకున్న చుక్కానీల పట్టుని రాల్చి .. పగటి సాయం తెలిసిన నీటి గుంట గుప్పెటపడుతూ
ట్వీకొని వదిలిన గాలి గొంతుల్లోంచి.. అడివి ఝాము పొద్దులో ఒళ్ళువిరుచుకొంటూ పాడే నిద్ర
సందియ ముద్దురాతలని తోడుకొని.. పెద్ద పాల పుంతలు ఆకాశ సమాధిలో చుట్టేసిన
పొగ మంచుల మధ్య … కదిలే ఉక్కిరి కన్నుని నింపుకొని.. ఆరనిప్పుని చేతుల్లో పోసుకొని
శ్వాస సగం ఏడ్చి పెట్టిన గుస గుసల ముట్టడిని హత్తుకొంటూ… రుణ తీరికల పట్టు తెగిన
వీధిని కాపాడిన కల అడివి చెట్ల మహద్యలోకి దిగి .. శృతి మొదలుపెట్టిన దోతార..
………………………
నెమళ్ళ గట్టు .. ఈదిన నది.. ఇంద్ర ధనుస్సుతో ముగ్గిన దోతార
రోజంతా మబ్బుగానే ఉంది..కానీ వర్షం రాలేదు.. వాడికి కొంత అలసట … మత్తుతో…
తీగల ఉయ్యాల దిగనే లేదు. అలా కిందికి చూసినపుడు.. నెమలి పింఛాలు కనిపించాయి..
శరీర విశ్వం మోసుకొన్న నిధి గర్భ అంచులని తడుపుతూ.. లేవనెత్తిన కథకి .. మళ్ళీ
సాచిపెట్టుకొన్న చూపుల పదునికి .. పర్వాలేదని దుఃఖం చెప్పుకొన్న మాటకి..
మాటలని జార్చి నేసిన కన్నులో రంగులని సర్దిన అడివి..
దోతార తీసుకొని కిందికి దిగి.. వాటిని చూసుకొంటూ.. దారిలా ఉన్న వాటి వెంట వెళుతూ..
అదొక సమయశాల కన్నుకి మిటకరించిన ఏక దిశల నెట్టుడు గాలుల లుంగ
ఆకాశం వేపు చూసి పాట అందుకొన్నాడు.. పాడుకొంటూ.. కొంచెం దూరం వెళ్లి అలా
ఉండిపోయాడు.. అదొక పెద్ద చెరువు.. తేటగా మెరుస్తూ… దాని చుట్టూ.. నెమళ్ళు ..
కొన్ని వదులుగా .. ఓ గట్టులా.. వాడు దోతార లోకి తన గొంతు నింపి పాడుతుంటే.. అవన్నీ
వాడిని చూస్తూ .. ఒకేసారి పింఛాలు విప్పాయి.. అది చూడడానికి వాడి కళ్ళు సరిపోవడం లేదు..
ఉగ్ర నిర్దారణ చల్లారే నిద్ర గనుల తవ్వకంలో .. కల దొరికిన మంత్ర స్థావర గొంతుల ధార
పాట ఆగిపోయింది.. వాటినే చూస్తూ వాడి కళ్ళలో నీళ్లు.. దోతార లోంచి దానికదే వస్తూన్న
తీగల చెప్పు.. ఆ నెమళ్లన్నీ .. ఒక్కొక్కటిగా .. చిన్న చిన్న శబ్దాలు చేస్తూ వాడి చుట్టూ
చేరాయి..వాడు మళ్ళీ పాట అందుకొనే.. అక్కడే నెమ్మలి పింఛాల గుట్టపై సోలిపోయాడు.
నిస్సంశయ వివర్ణ చాపిన దేహ గడువుని దాచుకొంటూ.. పెనవేసుకున్న నిద్ర ఖాళీల గుట్ట
………………..
పైకి చూసాడు.. నింగి నిండా మేఘాలు ఓ ఈదిన నదిలా ఒకే చోటని చేరుకొంటూ.. వర్షం..
వాడు లేచాడు.. నెమళ్ళు పింఛాలు విప్పి వాడికి కొంచెం దూరంలో డాన్స్ చేస్తున్నాయి.
వర్ణ వాయిద్యం కట్టుకొన్న మట్టి రాల్పుల నిశీథ గంధపు వంతెనలా … అడివికీ .. వర్ష తలానికి
వాడి లోపల ఏదో తెలియని ఉత్పాతం జరిగినట్లు.. శరీరమంతా వణికిపోతుంటే.. నిలువెల్లా తడిచి
పోయి.. దోతార ని హత్తుకొని.. తదనంతర దుప్పటి మెరిసిన కల భావుల్లో దిగి తడిచినట్లు
తిరిగి పాట మొదలుపెట్టాడు..అది దుఃఖమూ .. ఆనంద సాంద్రత వలన సాపేక్ష గండిని దాటి
వచ్చిన..బొంగురో..తెలియదా.. పాడడానికి ఎంతో కష్టపడుతూ పాడుతున్నాడు..
నెమ్మలు గుండ్రంగా వాడి చుట్టూ తిరుగుతూ… పాటకి అనుగుణమైన చిన్న చిన్న శబ్దాలు చేస్తూ..
డాన్స్ చేస్తూనే ఉన్నాయి. సమంవిత దృష్టి రాజీయ కొలువుకి మాటని కట్టి….
వాడు .. పాడుతూ.. నెమళ్ళు వెంట వస్తూంటే .. తన చోటికి వచ్చి .. కొన్ని దుంపలని కాల్చి..కొన్ని
ఆకులని పర్చి .. తోలు వాల్చిన దుంపలు వాటి ముందు పెట్టి సైగ చేసాడు.. అవి ఓ పక్క .. వాడు
ఓ పక్క తినడం మొదలుపెట్టారు.. కనబడని చిత్ర ధ్వని కలిసిన అభయ ముఖాల గొంతులోకి
ఊదిన సాధ్య దీపాల మెత్తని ఆకులు .. నలిగిన శబ్దం చేస్తూ.. సంతర్ప వేడుకలా ….
………………
సద్దుమణిగిన హద్దుల వెంబడి మోసుకొచ్చిన కునుకుని .. చెమర్చిన కంటి కొసల్లోకి ఊదుకొంటూ..
రొమ్ము చీల్చిన హద్దుల వెంట కదిలే చీకటి శాసిత పుట్టు చెట్లు. …బిగిసిన ఆయువు పట్లు
సాయంత్రమైంది.. వర్షం ఆగింది.. అడివి సర్దుకొన్నా రంగుల చీరాల్లోంచి.. నల్ల చీరల నిద్రలోకి
మారుతూ.. ఆకుల చప్పుడు లోంచి వర్షపు బొట్లనీ కుదుపుతూ.. తేనె చిక్కని గడువు పోసుకొని
దూరంగా ఆ కొలనులో రంగు చూసి .. పైకి చూసాడు.. మాయ చిత్ర కవచం విడిచిన చూపు
కందిపోయిన గుట్టుని బట్టలో కట్టి పిండుతూ.. సాధ్య ఊపుకి పంచేసి కట్టిన విసుగు మోతలతో..
పెనవేసుకున్న జోడీలు,, నిశ్వాస దృష్టి చలనకి బొట్టు దిద్దిన కంటి పాటని దోతారా తుడుస్తూ..
పెద్ద ఇంద్రధనస్సు.. ఆ వెలుగుతో.. ఏడు వర్ణాలుగా మెరుస్తున్న నీళ్లు..
వాడు డాన్స్ చేస్తూ పాడుతూనే .. దోతారాతో కొలనులోకి దిగిపోయాడు.. దేహ నియంత్రణ
తెలియని అడివి సాగులో.. చెట్ల ముసుగులో తప్పుకొని మోసుకొచ్చిన కొలను నిండా కలలు
దోతారని ఆ నీళ్లు తాకాగానే అది.. ఏడూ వర్ణాలుగా మారి పోయి..నీటి చప్పుడు కలిసిన పాటని
వాడి గొంతులో ఒంపి.. అడివి ఆ నెమళ్లతో కలిసి వింటూ ఉంది.
……………………….
కూలిన పాముల పుట్ట .. చెట్టు కింద భావి.. భుజాన ధో–తార
అక్కడ నుంచి ముందుకి జరిగిపోతున్నాడు.. ఈసారి వాడు ఏ గుర్తులూ పెట్టుకోలేదు..
ఆ చోటుని వదిలేసాడంతే … సమక్ష ధూళి నెరిసిన కంటి తూర్పులా దిశని దులుపుకొని..
ఇంకిపోయిన భయం కోసుకొంటూ …అదే దేహమని తెలియని కంటి శిక్షణ మూర్తిని కాల్చిన
దీపాల మడి.. శ్వాసల మడుగులో దొరికిన కలువ గుత్తులకి కాపాడిన చీకటి నొప్పులు. అడివి
అక్కడొక చోట కొన్ని పాము కుబుసాలు.. కూలిన పాముల పుట్టలు కనిపించి.. కళ్ళలో నీళ్లు..
వాటి ఇల్లు కదాని.. చెదిరిన ఆందోళ మధ్య కుదిరిన కథకి ముఖాలని చేర్చుకొని దూరం జరిగి
వాటి చుట్టూ తిరిగాడు.. ఆ దగ్గరగా ఉన్న మొక్కల నుంచి.. ఏదో పరిమళం.. కొన్ని ఆకులని
తీసుకొని.. వాసన చూసి స్పృహ కోల్పోయాడు.. నిఘార ఘాడత లోపలికి గడ్డ కడుతూ..
అదొక తమలపాకులతో చేసిన ఊయల .. అది గాలిలో ఎగురుతూ.. నీళ్లలో దిగుతో…
వాడిని గుండ్రంగా తిప్పుతూ.. ఆ వేగానికి వాడు అరుస్తున్నట్లుగా కల … వెనకా .. ముందూ
తెలియక …తెలిసిన కట్టడి లేని నిరాపేక్ష చలన కట్టడికి చేరుకొని .. .. ఇంకేదో కావాలని…
ఎప్పటికో లేచాడు.. అడివంతా చీకటి.. నల్ల పాముల పాకి వెళ్లిన గుస గుసల దుప్పటిలా…
ఎక్కడ ఉండాలని.. ఓ పెద్ద చెట్టు.. కిందికి వంగిన కొమ్మతో పైకి ఎక్కి … అక్కడ బలంగా
సమతలంగా ఉన్న ఓ కొమ్మపై పడుకొన్నాడు.. వాటి పెద్ద ఆకులని పక్కలా పరుచుకొని..
రెండు ఆకులు కలుపుకొని.. కింద ముందే మంట వెలిగించి.. నిరాభంగాల అలసటని
కట్టుకొని …ఛాతీ గంటల చప్పుడుని ఆర్పుకొని … దోతారని హత్తుకొని నిద్రపోయాడు..
………..
వాడికి మళ్ళీ కల.. ఆ పెద్ద చెట్టు కింద ..బావిలోకి పడిపోయి.. అదేదో తెలియని చోటులోకి
వెళ్లిపోయినట్లు…. దోతార .. చాలా పెద్దది.. దాదాపు ఇల్లంతా.. తీగల కింద నల్ల తలుపులని
తెరుచుకొంది.. వాడు దానిలోకి అడుగుపెట్టాడు.. కర్పూర మంటలో వర్షపు ఆకులు కాలిన వాసన
తీగల గుట్ట.. వాడి శరీరానికి అల్లుకు పోతుంటే.. వాడు ఆర్చుకొంటూ.. విడదీసుకొంటూ..
దూరంగా కట్టెల పొయ్యి పై అన్నం మండుతున్న అమ్మ.. కాళ్ళూ చేతులు కడుక్కొని.
భోజనానికి రా రా … అని.. వాడు గొంతు తెరవబోతే.. గొంతుని చుట్టేస్తున్నాయి..
కాలు కదపబోతే కాళ్ళని పట్టేస్తున్నాయి.. కలబడి ఓడిపోయిన దుఃఖ నాదపు చమురు..
అమ్మ వెనక్కి తిరిగి చూడటంలో.. గెంజి పెట్టిన నూలు చీర.. తల పిడప ఇంకా తీయని జుత్తు..
మట్టి గాజులు …గెరటతో పులుసు రెండు చుక్కలు చేతిలో వేసుకొని రుచి చూస్తూంది.
……….
వాడు.. కొన్న్ని వందల పాములు .. కిందనే .. కలలోంచి బయటపడి కళ్ళు తెరిచేసరికి ..
విష బంధన మోసిన పెద్ద చీకటి కన్నుని నులుముకొంటూ.. అడివి చూపిన దారిలో వెలిసిపోయిన
గొంతు మన్నికల ముద్రని.. దేహ ఖనిజాల లోపల స్పృహ తెలియని శ్వాస నిత్సర మంటనీ
తెల్లార్చిన నడక కోలుకోక ముందే .. చెదిరిన కంటి కొసల ఊసటకి నలిగిపోయి…
గగుర్పు.. ఛాతీలో రాళ్లు కొడుతున్న చప్పుడు .. మంచు పాతర వేసిన భూమి నెర్రులోంచి
అదే అని తెలుస్తుంది.. కౌగిలి మాసిపోయిన శరీర చిత్రం పోసుకున్న వాన వాగుల తుళ్లింతనీ
కట్టుకొంటూ.. పికిలిన నిద్ర ధారల .. మోసిన సగపు స్పృహని కదిపే నాజూకు మంటలు..
ఉబికిన దుఃఖాల కంగారు.. నించార్య అయోమయ గతికి చుట్టిన మెళుకువలు గండం..
పరుగు తెలియని మృత్యు భాషణ మొదలైనప్పడే అడవి రాల్చిన … వాన గొడుగుల పోటు
వాడికి ఏం చేయాలో అర్ధం కాక .. సతాయింతాల స్పర్ధని తోసి దోతార ని అందుకొన్నాడు..
అవి పడగలు విప్పి .. తలలు ఊపుతూ.. కాసేపటికి ఎవరో పిల్చినట్లుగా వెళ్లిపోయాయి.
కానీ వాడిపాటా ఇక దేనికోసమో ,, ఆ రాత్రి అంతటికీ ఆగిపోలేదు
…………………..
దో తార నేసిన అడివి .. జంతువుల కాళ్ళు .. చిందిన రక్త గుహ
అమాస మోసిన చీకటిని కడుగుతూ.. హద్దు వదిలేసిన శరీర చిత్రణ నేసుకు తిరిగిన ..
భయాలని సర్దుకొని .. ఉక్కిపోయిన నీటి గ్రహణ సంధికి చేర్చిన అడుగులని దాటుకొంటూ..
ఋణపడ్డ కథల వెంట .. తెల్లార్లూ ఊడగొట్టిన గోడలని సర్దుకొని… చెట్ల మానులకి పేనుకొంటూ..
అక్కడే నిలదీసి వాలిన అడివిని కప్పుకొని.. వేసట దోసిలిలో పేరుకున్న మెట్లని కట్టేసుకుని..
మహా నివేశ దేహ రాజీయత లేని పెద్ద కాళ్ళ కలల భూతం.. విద్వ సత్తువుల దుఃఖ మంద్రతని
సరిచేయక ముందే .. కదిలే నిద్ర గుణాలని చేర్చుకొన్న .. నిద్ర రాట్నాలతొ వడికిన చీకటి
అనుసాయన ముఖాలు….చెదరగొట్టిన దేహ రాజీయ ముఖాలని దట్టించిన నల్లని ధూళితో..
ఎక్కీ తొక్కిన నిద్ర రాజీల ఒంటి బిగువుని మోస్తూ .. చిత్ర ధ్వని ఉడికించిన అపశ్రుత నిద్ర బయట
ఉంచిపోయిన తలుపులని కదిపి.. దుఃఖం ఒరిసిపోయిన కథకి ,, రెండు పుట్టుకలు నొప్పిని
సాగదీసి.. కనబడని సంధి చూపుతో.. నికారింపు ఉడకబెట్టిన కథని తాగి.. సోలిపోతూ…
దో తార నేసిన అడివి .. అదొక పాటల గుట్టని ఎక్కినా చెట్ల సముదాయ నిద్ర పుంజీలని కట్టుకొని..
అదే చలన గతి శీర్శ్యం మోసిన ఒబ్బిడి తాకరాలు.. కలబెట్టిన చెట్ల మధ్య నీరు పట్టిన ఆకారాలు.
………………..
విస్మరిత సత్తువ.. నివిరిన గాలి నెరిసిన దుఃఖం విదిలి.. కసి పోసుకున్న సరిహద్దు దీపం
ఒరిగిన అంపకాల శ్రమని దాటి.. నిలువెల్లా వానని మోసి బరువెక్కి కునుకుతున్న అడివిని
దాటుకొంటూ.. నింపాదిగా ఏడ్చినా దిక్కుల వెంట కరిగే నిద్ర గ్రహణ ముంపులని కలుపుకొంటూ..
దోతారని భుజాన వేసుకొని.. ముందుకి పోతున్నాడు.. దూరంగా ఓ పెద్ద కొండ .. దానిలో ఏదో
పెద్ద జంతువు.. కొండ కన్నా పెద్దది మహా బలమైన పంజాలతో తవ్వినట్లు.. గుహలు..
అవి చిన్న చిన్న బొరియల్లా ఉన్నాయి.. కాగడా తీసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ..
వాడు వణికిపోయాడు.. తెల తెల్లని కంటికి శిక్ష … లోపల మోసిన మోతాదుల కొండలని పట్టుకొని..
అన్ని వయసుల పులులు… బయట అవి తిని వదిలేసినా ఎముకలు.. ఇంకా రక్తం ఆడుతున్న
జంతువుల కాళ్ళు. చిందిన రక్త గుహ.. దృష్టికి జాగారాలతో అడివికి మోసపు గుర్తులని తుడిచి..
జిగురు కాళ్ళని.. రక్త మర్ధనల కేకాని ఒడిసిపట్టి.. రొప్పిన నిద్ర గనిలో తవ్వుకొన్న పొగలని
జోడించుకొన్న కలలకి .. మాటని వెనక్కి తీసుకొన్న జ్వర గ్రహణ ముట్టడికి మోసిన నడక..
మండి ఆరిన గొంతుతో.. వానలని తాగిన దోతార మత్తు మోసిన కళ్ళతో దారిని కట్టి..
వాడికి కాసేపు… ఆ కొండంత గుండ్రంగా వాడిని చుట్టేసినట్లు ఐ.. చూస్తూ ఉండిపోయాడు.
చావు దగ్గరని కడిగిన వాన గుహల కొండ.. దీపం వెలగని శ్వాస గిన్తులో ఉరిమిన కాగడా
…………….
నల్లని గుండ్రని కాళ్ళని.. మెరిసి మిణుగురులతో .. మెత్తని బురదలో దిగిన గిట్టల చప్పుడుని ..
ఒబ్బిడిగా సర్దుకొంతో.. పీల్చి చేర్చుకొన్న మన్నన రాశుల అడివిని మోసుకొంటూ..
నివేద గ్రహణ సంగతిని కనిపెట్టి.. దుఃఖపు అనుకూలంగా దర్శన కాల్చిన కట్టుబాట్లు..
అదే వదిలేసినప్పుడు .. చేర్చి పెట్టుకొన్న మెట్ల ఇంటి పక్కగా .. చెట్లని కూల్చి..
వాడికి చేతికి ఏదో తగిలినట్లై .. వెనక్కి చూసాడు.. దుఃఖ మోతాదుల మాంస కణతుల్లో తొరిపిడి
అందంగా ఉన్న పిల్ల లేడీ.. ఎంతో ముద్దుగా ఉంది.. వాడి కళ్ళలోకి .. తీక్షణంగా చూసింది..
వెనక్కి తిరిగి నడుస్తూ .. శరీరం తేలిక చేసి .. రంగులని పోసుకొని.. మెడ తిప్పి వాడిని చూసింది..
వాడు దాని వెనకనే నడవడం భరోసా తెలుసుకొని.. సరి చేసిన చప్పుడు .. మొదలుపెట్టాడు.
అముక్త ధ్వని కలవర పూతకు నేసిన కంటి తలుపుని .. వేలాడ దోతారని కలిపి చుట్టుకొంటూ..
దేహ నిందలు లేని క్షమయా చిందు. అప భ్రమణ నిద్ర వార్పుని … సర్ధేసిన ముఖాలతో ..
హద్దుని చెరిపి.. చేరదీసి కథకి.. నాలుగు మూలాల చూపుని కదిలించి .. దోతారాలో పోసిన
చీకటిని ఎత్తి తుడుస్తూ.. కళ్ళకి చేర్చిన జత సముదాయ నిద్ర కీర్తనల ముప్పడి మోతలని కనిపెట్టి
కొంచెం దూరం వెళ్ళగానే వాడి వెనక ఓ లేడీ … మరి కొంచెం దూరంలో కుడి పక్క .. ఇంకొంచెం
దూరంలో ఎడమ పక్క మరో లేడి.. చేరుకొని .. వాడి డాతరాని వింటూ.. లేత చిగుళ్లు తింటూ..
వాడిని… వాడి భుజాల మీద నుంచి దోతార మోగుతూ .. నడక వాన పరిమళం పీల్చుకొని..
………………………..
తందానాల చప్పుడు.. గొంతు నేసిన పాట .. అడివి గూడు అరుపులు ..
శుభ్రం కానీ నిద్ర తీరుని కడిగి.. దుఃఖం తెలిసిన కథలో .. ఎర్రబడ్డ నీటి కుంపటిని సర్దుకొంటూ..
పిసికేసిన లోపలి చీకటి దాటుకొని.. గడ్డ కట్టిన అడివి రాత్రిని విసిరి.. రెండో కన్ను లోపల దాస్తూ
అలసట కమిలిన కలలో తందానాల చప్పుడు.. ఉరిమి మీద పడ్డ చలన భూమి పంపకంలో
తేరుకోలేని సమాధి పాట ..వణికిస్తూన్న మంచు ఊపుల కథకి చేరదీసిన మాటని కట్టుకొని..
పారబోసుకొన్న నిద్ర భూముల సంకల్ప మాయకి తేరుకోలేని భుజాల బరువుని కట్టిన
మాంస సాధ్యాల కొట్టుడు గోడలని కరిగించి.. వీలులేని చూపుకి పోసుకున్న తీర్మాన
చీకటిలో పాతి వెళ్లిన దోతారల పాట .. ఉండే లేక కదిలే ఆకుల మధ్య ఆకాశ స్థలాన్ని
నింపుకొంటూ.. చెప్పుకోవడానికి లేదా దూర భూముల కవ్వం చిలికిన నిద్ర గుణాల బరువుకి ,..
చిలికిన నాజూకు రవ్వల దోసిలిలో మోసి తెచ్చుకొన్న నీటి గ్రహణపు .. పురిటి వాసన కదిల్చిన
శరీర ముంపులని పోగుచేసుకొని.. గర్భ వశీకర నిర్మాణ గ్రహణ స్థిమిద రాశులపై కట్టుకొన్న గుహని
కుదిపేస్తూ.. ఒక్కాస్త ఒరిగిన అంత్య దీపపు చలన కేళన ఈడ్చుకు తిరుగుతో..కల కరిగి..
కలకి రెండో వేపు .. మోసి తెచ్చుకొన్న కదలిక .. అప్పటికి తెలియడం .. ఇంకేం కానీ ఝాము
దూరంలో శత్రు నగరం ఊడదీసి కంటి చూపుని మెదిపి.. కక్ష్యలని మార్చి చేసుకొన్న
ఒప్పంద నికారింపుల మెలికని సరిచేయకముందే.. అడివిలో నెమ్మదించిన దోతార ల పొంగు…
…………….
అదొక వనశాల మోసిన కలకి .. రెండో వినికిడి నిద్ర కథని చేర్చిన చల్లని నిరోధ మాయకి కట్టేసిన
ఆ చివర గొంతు నేసిన పాట … దూరమూ .. దగ్గరా కాని మట్టి రుణంగా అడివిలో దిగబడి..
వాడు అక్కడే .. ఓ చెట్టు కింద పచ్చిక పై నిద్ర పోయే లేచాక .. చుట్టూ తిరిగే లేళ్ళ గుంపులు..
చుట్టూ చూసి.. పరుగులు పెట్టాడు.. అన్నీ అప్పులే.. సీతాఫలం.. సపోటాలతో నిండిన చెట్లు..
దాదాపు పళ్లతో బరువెక్కి ,.. కొమ్మలు నేలని తాకుతూ.. ఆశ్రిత బాటసారి రక్షకి వినయ సమర్పిత
అడివి రుణం తీర్చుకొని మట్టి బరువుల గొంతుతో.. హద్దు మోసిన కలతని పట్టుకొని..
జాగారం నేసిన మెరుపులా పళంగా .. అక్కడే స్వచ్ఛ నీళ్ల కుంటలు.. లేళ్ళు .. వాడి చుట్టూనే
తిరుగుతున్నాయి.. చుట్టూ వేళ్ళాడే తేనె పట్టులు… గర్భ తీపిని ఒంపిన మంచు దోసిలి..
భూమికి ఒంటిని చుట్టి మాయ చేసిన కథగా .. వాడు నడచుకొచ్చి సేదతీరి చోటు .. భయం
బయట మొరుగుతూ ,, చప్పుడు లేని చీకటితో కమ్ముకొని .. మాంసం చీల్చే జంతువుల అరుపులు
అదే కదలాలని .. కదలకుండా ఉండాలని .. అడివిని లాక్కొని దూరం జరగాలని .. నెట్టుకు
పోయిన కథగా ఏడ్చి తడబడాలని.. నిండి పోయిన పొద్దునే పట్టుకొని దోతార వదలక..
కొంచెం అనుకోని .. బయట రుణాల పట్టుని దులిపి . కరిగించి పోసుకున్న శ్వాసని అలుముకొని..
……………………
లేళ్ళు నిద్ర పోయే ఆ గుహ లో వెచ్చగా నిద్ర పోయాడు.. మధ్య రాత్రిలో మెలుకువ..
వాడు దోతార ని అందుకొన్నాడు.. అదొక నిద్ర పూర్వపు కందకం లో దూకి.. చిత్ర వలయ గురుత్వ
నిందని వడపోసి మోసుకొన్న భుజాల బరువుని . నియంత్ర ఛేదనని కలిసి ..దించే పాట ..
మెలిసి నిద్ర వాకిళ్ళ పళ్ళని ఓంపుకొంటూ.. భూమిపై మొలచిన ఫలాల అడివి.. నీటి బొట్టు చేతన
కైవారపు యజ్ఞ పీఠం కుదిపిన జన్మ రాజ్యతని కట్టి పెట్టిన దేహ క్రతువు.. ఆగక సాగిపోతూ ..
అవి వాడి కళ్ళలో కళ్ళు కలిపి వింటున్నాయి.. శ్వాసలో శ్వాసని పట్టుబట్టి రాలుస్తున్నాయి.
గ్రహణాలు చిత్ర భ్రాంతికి తుడిచిన అరచేతుల వేడి పొంగుతూ.. కలిసిన దీపాల మెలుకువల..
బయట మొదలైన ఉరుములు.. దానికి అనుగుణంగా వాడు .. పాటని మార్చుకొంటూ వెళుతూ
తారాస్థాయి చేరేలోపు.. ఊహకి ఏమాత్రం అందకుండా ఓ పిడుగు.. ఆ పళ్ళ చెట్లపై..పడింది..
వాడు ఒక్కఉదుటున పరుగుతీసి.. కొలను నీళ్లు విసిరి .. విసిరి.. ఆయాసపడేలోపు .. స్పృహ తప్పి
పడిపోయాడు.. సృష్టి నిగమ్య నిప్పుల వరదకి ఎదురెళ్ళినపుడు…ఊపిరి దొరకక
లేళ్ళు పరుగున వచ్చి .. వాడి చుట్టూ గుండ్రంగా గోడలా నిలబడ్డాయి.. వాన మొదలైంది..
మంటలు ఆరిపోయాయి. అతి కష్టం మీద ఓ లేడీ మీద పడుకొంటే .అది నెమ్మిదిగా వాడిని
గుహకి చేర్చింది .. సమయం మోసి తెచ్చుకొన్న సర్దుబాట్లు ఉరిమి మీద పడ్డాక…
పొద్దున్న లేచిన వెంటనే ..ఆ చెట్ల కొమ్మలని నిలబెట్టి .. కొన్ని మొక్కలని మళ్ళీ పాతి నీళ్లు
పోసి.. అక్కడే ఓ మట్టి దిబ్బపై కూర్చొని.. శ్వాసని పల్చన చేసి .. దోతారని పలకరించాడు .
అపార్ధాల భూమి చిత్రంలో ఒంపి పెట్టుకొన్న రశ్మిని సగం చేసి మళ్ళీ బిగిసిన నడకని
కట్టుకొంటూ.. పేర్చుకొన్న నడకలు.. అదే అడివి.. కాలి బూడిదైన పునాదుల మీద రోజూ
తిరిగిపుడుతూ .. సమర్పిత దివ్య భూమిలో ఎదిగిన మంచు గోడలపై రాలే ఊట
…………………………
చెట్లలో బిక్ష.. విపుల సంధికి గొంతు.. దోతారల నీటి దర్శన
శరీరమంతా ఉడికి పోవడం.. తీవ్రమైన అలసటతో.. ఒళ్ళూ పై తెలియకుండా నిద్రపోయాడు..
మెలుకువ వచ్చేసరికి పెద్ద పెద్ద అరుపులు.. చెట్లలో బిక్షని తగలబెడుతూ..అందుకొనే వాటి
ప్రాణాలని లాగేస్తూ.. నిస్వా ఛాయల అడివి మధ్యంలో కక్ష ఒప్పిన చీకటి నిద్రని లాగేస్తూ..
విసిరిన కథా నిందలు మోసి తెచ్చుకొన్న రక్షా నిధుల కంటిని బంధించిన నిద్ర వదిలిపోయేసరికి
ఒకటే ఉలిక్కిపాటు.. గుహ బయటకి వచ్చి చూసి.. బయట చూసేసరికి .. లేళ్ళు తిరుగుతూ..
తింటున్నప్పుడు.. ఊహించిన ఎండలోనే పిడుగు పడిందనుకొంటా.. కొన్ని కాలి బూడిదై
పోయాయి.. కొన్ని కొన ఊపిరితో ఉన్నాయి.. కొన్ని గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాయి
అంత పరుగే .. కొన్నింటికి కట్లు కట్టి నీళ్లు తాగించాడు.. కొన్ని కాలీ కాలని శరీరాల పైన కొమ్మలు
పెట్టి.. వాటి శరీరాల్ని బూడిద చేసాడు.. వాటి ఊపిరిని కట్టుకొని మోయలేక పోయాడు
ఓ ఏనుగుల గుంపు.. పరుగున అక్కడికి వచ్చింది.. వెనక మంటలు వస్తుంటే.. వాడొక ..
పదునుగా ఉన్న ఓ కొమ్మ తీసుకొని.. చుట్టూ ఓ గండిలోఆ తవ్వి.. ఏనుగులు చూస్తూoడగా
నీళ్లు తెచ్చి పోసాడు.. అనుగమన చర్య గుక్కపెట్టిన సృష్టి మోసిన కొత్త లయ …
వాటికి అర్ధమైంది.. నీళ్లు తొండాలతో పోయడం మొదలు పెట్టాయి.. అతను చేతులు ఫుల్లు
పడుతున్నా తవ్వుతూనే ఉన్నాడు.. కలలోంచి కలలోకి పడిపోయిన రంగుల దట్టపు పునాదులని
గుచ్చుకొంటూ.. శరీరం దాచుకొని … పిసికేసిన కంట్లో ఋణం పీల్చిన ఊపుని కట్టుకొంటూ…
అదే లోపల భయం వేసి తెచ్చుకొన్న మట్టి పోసిన పాత బాటలు బావిని .. ఇంకా లోతుగా
తవ్వుకొంటూ … దుఃఖంతో ముంచుతూ.. ముందూ.. వెనకగా సర్దుకొని..మంటలు అక్కడి
వరకు వచ్చి ఆగిపోయాయి. గండి కట్టిన నీటి రాశుల మట్టి కట్టలని చూసి…
……………..
దోతార అందుకొని.. ఫుల్లు పడ్డ చేతులతోనే శ్రుతి చేసి .. ముందుకు నడిచి.. రెండు పక్కలా
పేర్చిన కొండ.. మధ్యలో ఓ పెద్ద కొలను.. కొన్ని గుహలు ఉన్న ఓ చోటు చూసి..
వాటికి సైగలతో నచ్చ చెప్పి ..అన్నింటినీ మాట సాయం లేకుండా అక్కడికి తీసుకెళ్లాడు.
సృష్టి నుంచి విపుల సంధికి గొంతుని సిద్ధం చేసుకొని.. జోడించలేని చీకటి జరుగుబాటుని కలిపి..
వీడిపోని నిర్ధార ముఖాలని పిండుకొని.. హద్దు తెలియని కంగారులో పడి… తిరిగిన అడివి
పాదాలు తిరిగి పోయిన నొప్పిని పీల్చి.. కథకి .. మూడు తోవలని పెనవేసి చూపుల నిడివిని
సాగదీసి.. గమన కనువిప్పుల కలకి .. లోపల మూసి పెట్టుకొన్న గంటల లోలకం ఆగక తిరుగుతూ..
పారబోసి కథని లోపల కలుసుకున్న విపుల సంధికి .. అడివిని సిద్ధం కమ్మని పిలుస్తూ..
తీర్చిపోయిన నిర్మస్త పూనకాలని జోడించి పట్టుకొన్న శరీర రాశుల్లో పునాదుల జ్వరం..
రంగు వెలిసిన సర్దుబాటుకు … మరో చిత్ర వికలo చీకటి మిష కి పట్టిన కథని తాగించి..
ఓ కొండని ఆధారం చేసుకొని. ఒక్క జంప్ తో… ఓ ఏనుగు పైకి ఎక్కి ఆ చోటుని చేరుకొన్నాడు ..
…………….
లేళ్ళు.. ఏనుగులు మధ్య తానూ.. ఆ కొలనులో స్నానం చేస్తూ.. ఓ ఏనుగు పైకి ఎక్కి దోతార
గొంతుని మీటడం మొదలుపెట్టి.. మంగళ శబ్దాల దృష్టి మాత్రంలో నీళ్లు పోసుకొంటూ…
శరీర స్థితి మందలపు మందలింపుని కట్టుకొంటూ.. పిసికిన చీకటి నివ్వెరపాటుకి … విశ్వ శిక్షణాల
పాటని తాగి .. మళ్ళీ తెలియని మత్తు ఊడల పగుళ్ళని నేసుకొంటూ.. ప్రమత్త కౌగిలిని దాటుకొని..
కొండల ఎత్తుగడలని లాక్కొని ఉండిపోయిన సాధ్య కృతాల .. తెలిసీ తెలియని నిండు వర్ష గాథ
నొప్పికి రెండో ఋణం తెచ్చుకొన్న నడక.. ఇంతకీ సవరించబడని శ్వాసగా స్వస్థత పొంది.. మళ్ళీ
చేర్చిపోయేట్టుకొన్న.. గోల తీర్ధంలో మసిలినా కథకి దూరంలో ఊరేగింపు.. సృష్టి చేదు కుండలిని
నింపిన తేనె తుట్టల మష్యలో పెద్ద పెద్ద మంటలు అంటుకొంటూ.. రుణపడని కథకి దోసిలి పట్టిన
చెమటని తాగి.. మత్తుగా చుట్టుకొన్న సరీహ హద్దుల్ని తెగ్గొట్టుకొంటూ.. పేర్చిన కలతల మధ్య
ఊరేగే శబ్దాలు…ఇంకేదో తెలియక పోయాక ,, నిర్యారా పులకిత దేహ ఝాము కూల్చిన .. మార్పిడి
రథాలని కట్టుకొని .. ఆ పెద్ద కట్టుడు చీకటి తలంలో మోసుకు వెళుతున్న పాటల నడక..
………………………
మట్టి పోసిన కొండ .. నలిగిన దారి.. దోతార మోసిన కబురు
వాడికి మధ్య రాత్రిలో మెలుకువ వచ్చేసింది.. కలని గుర్తుకు తెచ్చుకొని ఏడ్చాడు.. వాడి పుట్టిన
రోజుకి తలంటి పోస్తున్న అమ్మ కలలోకి వచ్చింది.. కొత్త బట్టలు పెట్టెలోంచి తీసి ఇస్తూ
గ్రహణాలు కమ్మేసిన వరద నిద్రల కట్టడిని తెగ్గొట్టి.. మాయ కమ్మేసిన చెదురు మదురు ..
పాటల వెనక తీపి కుమ్మరించిన అమ్మ.. వెనకా ముందూ కాని దోతారల సమయ ఊసు
ఒక్కడై.. బెంగతో ఇంట్లో కూర్చొన్న నాన్న .. వాడి ఆందోళన పడుతున్నాడు.. అటూ ..ఇటూ
తిరుగుతున్నాడు.. కలవర చీకటితో .. గుప్పెట బిగించి గుద్దుతూ… కొంచెం ముందుకి వంగినట్లుగా
నిలబడి…\నిస్పష్ట పునాదులని తట్టుకొని.. మళ్ళీ చేసుకొన్నా .. దృష్టి సర్దుబాటులకి ..
గొంతుకి చెమర్చిన నిశీధికి .. చెట్ల మొదళ్ళని తవ్వుకొని.. పాతుకొని.. పెడసరపు ముట్టడికి లోపలే
లోపలే … ఉండిపోయిన పునాదుల కథ.. ఎంతకీ మాసిపోని దోతారా పాటల పగుళ్లు
సఫల నిర్బంధ అననుకూలతలో పాతుకు పోయిన ముఖాలని .. పెదాలపై.. అద్దకం చేసి
పెట్టుకొన్న నాజూకూ .. మాటలని వదిలేసి… శ్వాస త్రిగుణ రూపక మాయని కట్టుకొని..
నిశ్చంత చెమర్చిన సగం జీరల గండం మెరిసిన వాన ఛాయలు.. కథలోకి మళ్ళీ చేర్చుకొన్న
ఊరు వాడికి ఆ అడివిలో కనిపిస్తూ ఉంది. కళ్ళ ముందు చెక్కతో అన్నీ కడుతున్నట్లుగా ఉన్నాయి
ధ్వని చిత్రణకి మోసపోయిన కథలకి చేర్చి పెట్టిన కన్నుకి పోసుకున్న స్నాన దీపశాలని ..
తన్నుకులాడిన అపప్రధ నిడివిని కట్టుకోవడంలో … సయుధ్య చేదు మంత్రాలని నీళ్లలో
కలుపుకొని.. రుణ మూర్తులని కొట్టుకొని ఉండిపోయిన కలలు..
……………………
దీపాల దివిటని… చుట్టూ తిప్పిన కన్నుకి .. లోపలా .. బయటా తెలియని.. నడకల మధ్యలో
మట్టి పోసిన కొండ .. అక్కడ చెవిని పెట్టి.. లోపల నుంచి ఏదో వింటూ.. దోతార ని సవరిస్తున్నాడు..
గడ్డ కట్టిన అనుమానాల్ని.. కుండపోతగా కురిసే నిద్ర రాతల పుట్టు రాళ్ళ కథనీ…
ఆ చుట్టూ తెచ్చాడే అడివినీ .. కదలికనే నిర్జించే శపితగుణ యజ్ఞంలో ఊరేగే చేదు మంగళ
బరువుని వేలాడదీసి.. గర్భభూమి నెరిసిన ఎత్తుగడకు లోపల ఉండిపోయిన కాటుక రేవులల్లో
అమ్మ ..వాడి నాన్న కోసం ఏదో చెబుతుంది.. మార్చి వేలాడదీసిన పుట్టుకలని వలపట్టి..
కదలని నిద్ర గున్నంలో పేరుకున్న చీకటికి వెలిసిపోయిన కునుకు.. పేరుకున్న మంచు గనులు
వాడి దోతార చప్పుడుతో అది సరిగా వినిపించక పోయినా .. ఆ చేతులు మాత్రం అతని
స్వాధీనంలో లేనట్లుగా మోగిస్తూనే ఉన్నాయి.. తడబడి అడ్డుకొని .. అద్దేసిన ముఖాలతో
శరీర సర్వమూ.. నలిగిన దారి కళ్ళ ముందు ఉంచి.. దుఃఖ స్థిమిత లేని కరగబోతల నిద్ర చలనం
మోసి తెచ్చుకొన్న .. దుఃఖ మార్మిత పోతలని అడుగుకంతా కూల్చి.. పెద్ద గదులని మూసిన
కథలో తప్పించుకు తిరుగుతూ.. అంపాకాలు మోసిన పాటని ఇంతకీ ఆపక . చిదిమిన చీకటి
సరంజామాలకి మోసి తెచ్చుకొన్న నీటి గనుల్లో … రాళ్ళమట్టి తోపిన కొండల్లో .. అదే కల..
………………..
తడిచిన మట్టి కొండలోంచి లేచిన పొగ.. చీకటి సముదాయాల మధ్య .. గడ్డకట్టే చలి గాలి..
నిర్ణయ సగం మోసి తెచ్చుకొన్న ఒరిపిడి రుజువు పట్టుని బలంగా అరగదీసి..
అక్కడే ఉండిపోయిన కలత … దోతార మోసిన కబురు .. అపనింద తెలియని కథకి రెండో తలుపు
తెరిచిన హద్దుకి తాళం బిగించి.. కునుకు చల్లారిన మాటలకి చేర్చిన పునాదులు.
వాళ్ళు వచ్చి కలుస్తామని.. నిద్ర చప్పరించిన కునుకుతో వెలుగు వానగా నిండిన లోయల
వంతెనలని చేర్చిన అడివి.. కబురు తెచ్చిన గుండాల మధ్య ఊరిపొయిన నీటి బిగువుల సన్మతికి
కూరుకు పోయిన నడకల వీలుని చాచుకొంటూ… తేరుకోలేని మంత్ర నిధికి సరి చెయ్యని పాటని
కట్టుకొని.. చీకటి చప్పరించిన మాటల మధ్య కలిసి చేరుకొన్న తర్జుమాలని జోడించుకొంటూ..
చిద్ర గతుల మహా సంవర్థ భూమిని పగలగొట్టి.. చేవ రాత్రుల్ని మూటగట్టి …
ఇంకో ఆచూకీ పునాదిని కప్పుకున్న శరీర నిశీధి మెళుకువని కట్టుకొన్న అదే నిద్ర..
దోతార మోసిన కలువల చెరువుని…. మాగిపోనివ్వకుండా పాట చేరుతూనే ఉంది.
…………………..
సాయాల దేహ నజ్జు.. ఇగిరిన మాట .. అడివి మెడలొ వెన్నెల
సగం సాగిన .. సగం ఊరిన .. కంటి శ్రమకి ఊడిన కలలో లేచి.. మట్టి కొండని … నీటి ధారల
మధ్యలో మంచుసొనల నిప్పునీ దూరం నుంచి ..చూసి.. చూస్తూనే చాలా సేపు ఉండిపోయి..
అడివి లో తెల్ల అడుగుల దారిలోంచి.. సగం సెగ చుట్టిన కథకి మోసి తెచ్చిన బిగువుల ఊపుని ..
నటించి తప్పించుకున్న జాగార కళ్ళని.. కాళ్ళని.. భుజాలని కాపీ రక్షించిన కుదుపుకి ..
నీరు పట్టిన అడివి.. బెంగాని తెల్లగా పేర్చి.. ఆకుల చివుళ్ళలోంచి.. చంద్రుడిని పీలుస్తూ..
ఆ మట్టి విఫల దేహ ఝాము పొడిచిన కంటి నిద్రకి కాపడం పెట్టి.. కొట్టి చూసిన కొండల నాడిని
పట్టి చూసి.. కొలను కలువలని చేతుల్లోకి ఎత్తుకొని.. ఛాతీకి దగ్గర చేసి.. అభయ గతికి చేర్చిన
ఝాము ముప్పుని కనుక్కొని.. పైకి చేర్చిన కంట్లో చూపుకి .. ఇగిరిన శ్వాసల నొప్పిని అరదీసిన
మధ్య మార్దవ గొంతుని మంచుతో తడిపి.. దోతారా గురకపెడుతున్న అరిటాకు పై నుంచి తీసి.
కొండపై వాడు నిలబడి చూసినపుడు.. అడవి పై కప్పిన తెల్ల చీరలా వెన్నెల.. నిద్ర నీరు
కంట్లో ముసిరిన శూన్య హద్దుని కప్పుకొని.. సమయ వేడుకని జోడించే కలతకి మోసపు రంగు
గొంతులు కపటపు నిద్ర పూర్ణాలు మోసి తెచ్చిన గడువు.. ఇంకిపోయిన కలతలో …
మళ్ళీ మొలచిన కాళ్ళని తీసుకొని సాయాల దేహ నజ్జు… మరిగించిన కుండల్లో…
…………….
నిద్రల వేలి ముద్రని నుదిటిపై ఉంచి.. మసకబారిన దుఃఖ సమాధి మోసిన కలకి .. కొట్టి తెచ్చిన
అవధికి నేర్పించిన … మోసపు రంగులని శ్వాస ఛాయల మెరుగుకి రుద్ది దులుపుకొంటూ..
నిశేష భూమి పులకల ముట్టడికి చేరిన ముఖాలన్ని దాచుకొని.. రగిడిన దేహ సంధికి మోసి
తెచ్చుకొన్న తెగింపులని కట్టుకొంటూ.. పెనవేసుకున్న నిద్ర చూపులని గండి కొట్టి..
అదే అంతా తెలిసినట్లుగా లేదు.. ఆగిపోయి వింటున్నవాడిలా .. దుఃఖ నిండని కడిగిన మాయకి ..
తెల్లార్లూ నిద్ర ఝాముకి మోసిన కథలని వెలిగించి.. మాటు వేసిన అడివి అరుపుకి.. నిప్పుని
చేర్చిన కొమ్మలని కొలను పక్క వెలిగించి.. నీరు పోసి ఆర్పుతూ.. నిద్ర దర్శన మోసిన
కంటి వాలుని సరిచెయ్యక వీలు వెంబటి మోసుకుతిరుగుతూ…చెమట ధనుస్సులు విరిచిన
దోతారఆర్పిన గడపల దగ్గర నిలువు స్తంభాల నీటి రేవుని కనుక్కొని.. పుట్టి పెట్టిన రంగుకి ..
నవ్వుని కరగబెట్టి ఛాతీలో పోసి.. లేళ్ళనీ ,, ఏనుగులని .. ఏమాత్రం సందడి కాకుండా తప్పించుకొంటూ… దోతారాని భుజాన వేసుకొని.. కాసిన్ని పళ్ళని మూట కట్టుకొని…
అర్ధరాత్రి..స్థితి కథని రెండోసారి దిద్ది పంపిన… ఊసులకి మధ్య ఇగిరిన మాట..
…………
అదే వాడు .. పరాయి పంపకాల నిద్ర చూపరి కదలికనే ఏడ్చి కలుపుకొంటూ.. మళ్ళీ తనకే
కనబడిన సగం లేవదీసిన దుఃఖపు అనునాద ముద్రలో పడి .. పోలిక లేని చుక్కానీల కుదుపుని ..
ఇగిరిపోయిన కంటి సూత్రాల బిగువుని సరిచేసుకొంటూ.. పేరుకున్న విపత్తు కందిన కలలో
మార్చిన దేహ గతిని కనుక్కొని.. ఇంకేం లేదని కథకి .. రెండోసారి సమయమిచ్చి చేరుకొంటూ..
మార్చి పెట్టుకొన్న తీరికలేని అమాంతం.. చేజార్చి మాసిన అడివి పాటకీ.. దోతారా ని చేర్చిన
బరువు మంత్రం కట్టేసి .. సవరించి.. సరిచెయ్యలేక వదిలేసి…కట్టుకొని ఊపేస్తూ
భూమి పురిటి స్నానం చేసి .. మంచు పెట్టిలోంచి.. ఇస్త్రీ చేసిన తెల్లని చలువ చీరని
కట్టుకొని .. అతని కోసం ఎదురుచూస్తూన్నప్పుడు … దోతారా భుజాలు కనిపెట్టిన ఆందోళన
అడివి మెడలొ వెన్నెల పల్చని నవ్వులా .. తీరికలేని నిశ్వాస మెలిక సర్దుకొని సాగుతూ..
జారుతూ.. ఉండిపోయిన నిస్వార్పు శ్రద్ధలు దాచి పెట్టుకొన్న తడిచిన మట్టి కొండల వెనక శృతి
పట్టుకొన్న చేతులు …వివర్శ గురుత్వ నిందలు తెలియని పాటకీ దోతారా మునిగిపోతూ..
మట్టి గొంతుతో కాల్చిన కలని చేరుకొని.. నిరుద్ధ కలతలా పట్టుని సాగదీసి.. రెండో తోవ లేని
ఊపుని జోడించి కునుకుని వడపోసిన గది పక్కగా ..ఊరిన కిటికీలు.. మోసిన మట్టి తోవల బురద
తొందరపాటు లేదూ.. ఉంది.. ఐనా ఆగని ఛాయా మగ్గింపుని పట్టుకొని ఉందీ..
లేకపోయినా గుర్తులని వదిలి పెట్టి.. ఏదో నదీ చప్పుడు .. నుదిటిలో సానపెట్టిన దీర్ఘ పాటలతో ..
అమ్మ నడిచినప్పటి కాలి మువ్వలని గుప్పెట పట్టుకొని నడుస్తున్నాడు.
……………………….
వాన రేవులు,.. తడిచిన ధో తార .. మసక పూడికలు
మహా నిర్యాణ భూమిలో .. పెళ్ళలుగా విరిగిన చిత్ర వదులుల కట్టడి నిద్రని కప్పుకొని..
దూర నిగ్గర పూడికలని కప్పుకున్న జాగార ముప్పుని .. కదిలే శ్వాస చిత్ర పునాదుల్లో
ఉండిపోయిన చూపు దట్టపు కథల నిప్పుని .. ఊది.. కడదాకా లాగుకొని.. నిండిపోతూ
హద్దు తెలియని నడకకి లేవదీసిన కంటి నరాల ముట్టడిని సరిచేసుకొని.. సరిపెట్టుకొని
సరికాని వృత్త పుట్టుకలు మధ్య దోతారా.. కలబడే అడివి నిద్రల మధ్య కమ్ముకొని..
వాడి కంటి పందుల లోపలికి చేరి వణుకు పుట్టిస్తూ… పీడన ముగింపుల దృష్టి రక్షకి మన్నింపుని
చుట్టి.. పైకి నమిలేసిన కరకు దండన పూతలని వదులుచేస్తూ..,తేరుకోలేని నిరాదీక్ష ఆనవ్వాళ్ళ
బయట పాటకీ .. శరీర ఆవంధిక గతుల శ్వాస నజ్జులో మోసి తెచ్చుకొన్న వాన రేవులకీ..
వాడిలోపల అల్లుకు పోయిన తీగలు.. పాము విషాలు .. పులి గాండ్రిoపులు .. మెత్తని పూల రక్తమూ..
తడిచీ .. చీకీ .. ఆరిన శరీరమూ.. పగటి తలుపులు తవ్విన … తననే పట్టుకొన్న దోతారా..
అపరిమిత సంక్షోభంలో పడి లేచిన కంటి క్షేత్రం .. శుభ్రం చేసిన గోడలని గుద్దుకొని.. సరి చెయ్యని
కథకి గొంతునిచ్చి .. మోసపుచ్చిన మత్తుకి ఊగిన రుణ లుంగలు.. తూఫాన్లు..
అన్నీ ప్రవేశించే ఉంచిన దోతారా.. సమాధి నిశ్శబ్దం .. మృత్యువు నంజుకు తిన్న చావు విందు..
కడుపులో చీల్చిన ఆకలి నేలని తాటించి పెట్టుకొన్న కథలోని నీలం చూపులు ..
………
లేడి కన్నులో బెరుకు.. పులి రక్తం తాగి .. ఊపిన నాలిక.. బుస కొట్టి మింగేసిన తేలు ..లోపలి
శ్వాసల చప్పుడు.. శరీర దిగులుని నానబెట్టి… ఇంకా దోతారాలో పదిలం చేసుకొని ..
ఊడిన మంచు సొనల కథకి.. రెండో ఋణం తెలియని ఊరు మోసిన గుడి గర్భం మోగిన మట్టి
కొండా.. నిద్ర నడిచి వెళ్లిన ఏనుగు కాళ్ళ బరువు..తడిచిన ధో తారలకి .. ఊరటాలేని సమాధి
నిగ్రహాల ఆకలిని అదుముకొంటూ.. కొలను నీళ్లలో.. వేర్లని ఉడకబెట్టి.. దుంపలని మెత్త చేసి
పండిన చేతి వేళ్ళ మధ్య దోతారా కొత్త స్పర్శని వింటూ.. ఇంకిన ఝాము పొద్దుకు మోసి తెచ్చిన
అంపక మొత్తాలని బళ్ళలో చేర్చుకొని.. అటు ఇటూ కనబడనీయని గతి చక్ర నిందలని
పట్టుకొని.. కథకీ… ముఖాల్లో పోలికకీ.. పెదాలకీ.. మాటల మధ్య కూరుకు పోయిన
నిద్ర చాటు కంటి సూత్రాల చీకటికి పాటని అద్ది .. దుఃఖపు మిల మైలలో సర్దుకొని…
గమనింపుకీ.. ఏక చిత్రం కాని అవసర నరకాల కూకటి వేళ్ళని దులిపి.. వింటున్న గొంతులో
పొడుగా సాగిన నిశ్చంత గడువుకు మళ్ళీ పట్టించి వచ్చిన …
……………..
వాడి నాడిని చప్పరించి.. శ్వాస పుట్టలో కల దిరిగి.. చూపుని కాటేసిన కల పక్కగా వాడు
నిద్ర మర్చి .. మోసిన అలజడి క్షేత్ర స్థలమై దోతారా.. ఇంకేదో తెలియని దేహ ధారా క్షేత్రం
అదే అతనిలో ఉంది.. అది వాడి చేతుల్లో ఉన్నా లేకపోయినా అదే ఐ పలుకుతుంది..
నిద్ర సందియ మాయకి జోడించిన కన్నుని నేసుకొని.. అడివిని కాల్చిన మంచు ముసుగుల ఊపిరి
కట్టుకొని నిమిత్త సంభంద చీకట్లో నేసిన చిత్రాల పంట పైకంటా లేచిన గొంతుతో దోతారా..
కొలనులో మునిగిన కృతులకి.. ఏడు రంగులు తగ్గించి సొమ్మసిల్లిన గంటలని కాపాడుకొని..
ఏడేడు శ్రుతులై లేస్తూ.. మహా విశ్వ మాయకి చుట్టేసిన కథని పట్టుకొని దూరం జరిగి..
సగం మోసిన కళ్ళకి జాగార ముడిని బిగించి ఏడుస్తూ.. అడివిని కలబెట్టి పొడుగ్గా నడుస్తూ..
కదల్లే అడివిలోంచి.. నిశ్చల మృత్యు కాగడాతో నల్లని అరుపులకి లోపలి దోతారా మోతలు
తరిమి పేర్చిన ముగ్గు బాటలు.. తగ్గి రాలిన బాటల ముళ్ళులలో కేకలు పెట్టిన మట్టి నెప్పులు
నిద్ర .. నిగారింపుని తెచ్చుకొని ఆయాసపడే దోతారాల రాగ దర్శనాలు..
………………………
తుడిచిన ఝాము .. కలలో సైకిల్ బెల్ .. అతను పాడుకొంటూ ..
కలలోంచి కల తాగిన కల .. కలగా ఉండిపోని కల వెనక కలకి.. వంతెనలా నిల్చి తడిచిన
ఝాము..అర్ధ రాత్రి నుంచి నడుస్తూనే … ఆ మూల సైగలా మధ్య ..ఆవిరి కొండల ఎరుపులో..
నది… సమర్ప నిద్రల కౌగిలిని చిదిమేస్తూ .. తెలియక రుణాలుబరువెక్కి కూలుతూ
వాడి లోపలి ఊపిరి చప్పుడు ఒక్కసారిగా పెరిగింది.. ఒక్కసారిగా అరిచాడు.. అక్కడ ఎత్తు
తక్కువలో ఉన్న చెట్టు నుంచి ..బొప్పాసి పండు.. తిని .. కాసేపు .. పైకి లేచి గెంతులేసి..
దోతారకి చెవి నిండుగా మోసిన శ్వాస శిధిల చప్పుడుని కాల్చి …ఏదో చెప్పాడు..
నీళ్లు తాగి .. అటుగా పరుగులాంటి నడకతో.. శిధిల కలకి రెండో నాడిని చూపించిన మంచు దోసిలి
మరిగిన నాదీ చలిత వృత్తపు ముడిని లాగి .. బిగుతుగా కట్టి.. భయం మోసిన కథల నిద్ర
గుడారంలో పడి తలకిందులుగా రాలిన భుజాల గతిని చెక్కి.. కన్నుకి మీటిన నాజూకు గుండాల
లోతులో పడి.. ఇంకేదో మిగిలిన నడకని వడిసిపట్టి.. కలిబెట్టి దోతారాల ఒడిలో పోసి…
దోతారా ..నదిని చూసి పొంగిన పాటని వాడిలోపల వదిలి.. దుఃఖ నిందలు లేని శరీర శాలని
దులిపి .. దీపం పెట్టి .. కునుకుని నానబెట్టుకొని.. జోడించిన కంటి సరిహద్దుకు కలని అతికించి..
సముదాయ నిద్ర వార్పుని కట్టుకొన్న శిధిల మంగళ కూర్పుని పైకి లాగి.. తాళ్లతో కట్టి..
చూపుని నదిపై నిలిపే ఉంచి…ఇల్లు తడిచిన ఊరుని కళ్ళలో మోస్తూ ఒడ్డు చేరాడు.
చుట్టూ ..నీళ్లు.. కన్ను పేర్చిన మేరంతా నీళ్లు.. అటు ఏ పడవ వచ్చే అవకాశమే లేదని…
తన నడక ఇక నదిపై ఒంటిరిగాననే పట్టు చెమటని కూల్చి .. వాడికి తెలుసు..
……………
చీకి కూలిన కొబ్బరి చెట్లని .. ఒక పదును రాయితో తెగ్గొట్టి .. రెండు ఒకేలాంటి మొండాలని
తయారుగా ఉంచేసరికి .. వాడు ఒళ్ళు హూనం ఐపోయింది.. సృష్టి శరణు కోరిన చేతుల్లోకి
వాలే బలం ,, మోసి పట్టుకొన్న.. ఆకర్ష నిద్రపోతని మరిగించి .. వడపోసి.. పాటల నిధి దోతారా
మళ్ళీ కష్టం మీద ఆ రాయితో.. ఓ కొబ్బరికాయ ఒలిచి .. నీళ్లు తాగి.. గుంజు తిని .. పడుకుండి
పోయాడు.. కల కమ్ముకొచ్చింది.. దానిలో వినిపిస్తున్న సైకిల్ బెల్.. అలాగే ఉంది.. కాని గాలిలో
లేచి వెళ్ళుతుంది.. బెల్ మోగించుకొంటూ.. చేపలు.. పడవలు గాలిలోనే ఎదురుపడుతున్నాయి..
అమ్మ మాట తొందరగా రా.. నీకోసం పాయసం చేశా.. పప్పు పులుసు.. నోరు ఊరుతుంది వాడికి..
నాన్న దోతారా వాడికి ఇచ్చి.. నవ్వుతూ.. నీ పుట్టిన రోజుని వెలిగించి రా అనగానే పాడుతున్నాడు.
మర్నాడు.. కొబ్బరి చెట్ల కొమ్మల నుంచి కమ్మలని తీసి.. నది ఒడ్డుకి అన్నీ లాక్కెళ్లి .. ఆ రెండు
మొండాలకి.. కొబ్బరి కమ్మలతో.. ఒక మీటర్ వెడల్పు ఉండేలా అతికి.. కొబ్బరి కొమ్మ నుంచి
నార తీసి బలంగా కట్టాడు.. అదొక నీటి యాత్రకై .. సంయోగ తలపోతల గుట్టుచప్పుడు నడక
బొప్పాయిలు.. ఇంకా ఏవో పళ్ళ మూట .. కొబ్బరి కమ్మతోనే .. ఓ తెడ్డు.. దోతారని
నడుముకి బిగించుకొని.. తలకి ఓ బట్టని బిగించి …వాడు దానిని నదిలోకి లాగి పైకి ఎక్కాడు.
నిషాదక సాధనాల గుట్టు చప్పుడు మూలాల పట్టుని నీటి క్షేత్రంలోకి …వదులుచేసి ..
……………..
ఒక పంటె లాంటి ఆ సాధనం నదిలో ఆగక వెళ్ళుతుంది.. దూరంగా కనిపించే దీవిని చూస్తూ..
వాడు తెడ్డు కదిలిస్తూన్నాడు.. కాని వాడి శక్తి చాలక ..వాడు అనుకొన్న వేపే అది వెళ్లడం లేదు..
మహా ద్రవ చర్యల అగాధ ముఖాలని జడ విప్పి .. నాట్యం చేస్తూ.. వాడి ముందు.. ఉరుమై
దగ్గరగా వచ్చి ఎర్రగా చూస్తూ.. కెరటాలని విసిరి కొట్టి.. సాధన లోతుల్ని కనిపెడుతూ.. నికర్ష
చిత్రాల గడువుకు మోసిన మృత్యు మంగళ శ్రమ పండిన నది తన పని చేసుకుపోతూ,,
కెరటాలు ఎగిరిపడుతూ.. అలసట పండిన ఆకలికి .. ఆ పళ్ళు సరిపోక.. దాహమూ..
పైన ఎండా .. బుజాల నొప్పి.. నిస్సత్తు.. శ్వాస ఇగిరిపోయిన గరుకుతో .. సొమ్మసిల్లిపోయాడు..
అన్నీ ఉన్నాయి.. కాని అంతటా లేవు.. నది ఛాయల గుట్టలో చావు మెలికలు ఊదినప్పుడు
భయం మీదికి దూకిన నిర్లిప్త ద్వయంలో… అనుగమన కృత్యాల మైకపు చర్యగా కదిలే చావు..
బిగిసిన కెరటాల గడ్డలు గుద్దుకొన్న అలసట ముఖాల మధ్య చెమట పండుతూ.. హద్దు చెదిరిన
శరీర నిడివికి జోడించిన కథనే తాగి తూలినా కథలో మండిపోతూ.. దీప జ్వరణ నిద్ర పోసిన సగం
కథ ఇంకా అక్కడే తనదిగా ఉందని పెద్ద గొంతుతో చెప్పుకొంటూ.. నిలబడే దూకుతారు..
కాని అప్పుడే .. ఓ జాలరి బోటు వారు .. దోతారనీ వాడినీ కనిపెట్టి.. అటుగా వాడికై వస్తూ ఉన్నారు.
…………………..
CHAPTER 5
ఊరు .. నగరం .. సంచీలో పాట
రుణ విషాదం మోసిన పాటకి క్షేత్ర భూమి ఊరు.. నిండు కొండ మోసిన సముద్రాల కౌగిలి..
దోతారా కాలి ముద్రలని కప్పుకొని.. నిలువెత్తు గోడల గర్భ చెమ్మ మోసిన నది..
రెప్పల కింద సాగిలపడ్డ దీపాల నిద్ర జల్లు.. ఒకేసారి ఎగిరి చేరుకొన్న వనశాల ..
బయట కిటికీకి సత్రం కట్టిన ఊరేగించిన నీటి రధం .. మోసుకు పోతున్న మట్టి బాటలు
మాయ పట్టిన చిత్రికల నదిని కాపాడుకొంటూ.. రొప్పిన కలకి మోయబోయిన నడకని
పాడుకొంటూ… రెచ్చిపోయిన పోలికల చిత్ర వేదికని గట్టిగా ఊపి సరిచేసుకొన్న నెమ్ములి..
అదే కట్టి విడిచిపోయిన కునుకు ..సరళ బావిలోంచి తోడిన కల .. నూలు చీర మడతల్లో
దొరికిన అక్క మట్టి గాజులు.. ఊలు దారాలు… వంగిన సూదులు … రాగి కడియం ..
గొంతులోకి పొంగిన చిత్ర ధూళిని కడిగిన పెద్ద పాటల కొలువు.. అది మాత్రమే దొరకని
చిత్ర కొండల వాలులో పోగైన చీకటి నిర్జన ముఖాల కొలువుకి చేర్చుకొన్న ఊపిరి దారాల కన్ను..
సత్రాల చెట్టు కింద మంతనాలు.. పెద్ద చెట్ల మొండాల కింద విరిగిపడ్డ దిగులు..
ఊరిని అక్కడకి తీసుకెళ్లి అక్కడ పాతి రమ్మన్న చర్యల లోపల ఆశీర్వాదం..
………………
కథల ఊరి పొద్దునే దాచుకొని.. ఝాము ఖండంలో ఊరట లేని వృత్త ధాతువుల ముద్దలా
విమానం.. దోతారాని ఒడిలోకి తీసుకొని.. ఆకాశమండలమంతా పాటని చిమ్ముతూ…
గతి సారాల ముఖం పట్టుకొన్న రంగుల ఒడిలో కరిగిన శ్వాసల దట్టపు శూన్యం .. అదే అని
తెలియని కలత వెలిసిపోయినపుడు .. మరో చిత్ర శ్రమ తెలియని కదలికనే దాటుకొంటూ..
మళ్ళీ మోసగించిన కునుకుని పట్టుకొని.. లోపల ఉండిపోయి పండిపోయిన నాటకశాల..
అప్పగించి తప్పుకొంటారు..విసుగు మండిన అడివి.. పడవలోకి దిగి ఊపిరిని పోసి..
నిద్ర మంటల్ని చల్లార్చి వాన బొమ్మల దీవి.. పోతపోసిన నీటి భావుల సల్లింపు..
కప్పుకొని ,, విడిపోయిన మెట్ల పక్కాగా .. నెరిసిన దీపపు పుట్టు నీరుని పోతపోసిన గొంతుతో..
దోతారా నిమిరిన ఏడు రంగుల కొండ.. నీరు పులిమిన గొంతులో పాట
అనుకొని వదిలిన శిక్షల ధ్వని జతల పట్టుని కట్టుకొని.. నిండిన మాటలకి.. గోళపు
సముదాయాల సాధ్య వర్తన గుమ్మాలని పట్టుకొని.. జత చేసిన కంటిలో చూపు నిడివిని
సాగదీసిన మధ్య స్థలాల వేడుక.. సర్దిన దేహాల మధ్య కూర్చిన వేదిక
………
వేదిక నిండా నిర్ఘాంత చప్పుడు.. నది పెనవేసుకున్న గోడల చుట్టూ వందల దోతారాలు
ఒకేసారి మోగుతూ.. అడివి గర్భం ప్రవేశంలో నిండిన పరిమళ పూర్తి ..
మూడు రాత్రుల మెడ ఒంపులు .. ఏదొకటి ఎక్కడో అక్కడ కలిసే కలుసుకొని ..
ఊపిరి ఊదిన వీధిలో ఊరుని లాగి.. నదీ గట్టుపై ఊసులాడి కదిలిన పాట కంటిలో తిరుగుతూ..
అమరిక లేని చిత్ర ఊపుల చూపుకి .. పాత నిద్రల గడువుని పోసి.. సాగదీసి..
అందించి వెళ్లిన నిర్భయ కృతిలోని.. నిర్మల మూర్తుల గాజుల చప్పుడు.. ఊపిరి దాటిన
కలాపాల నిశ్చయ కంటి పాలని చిక్కన చేసిన కథకి .. మళ్ళీ చేర్చుకొన్న సదా నిద్రల కథకి …
మార్చి తెచ్చుకొన్న పోలికలకి రంగు దులిపి … వంతులు వేసుకొని ..బురద చుట్టిన కంటి బాటలు
నిద్రలో పొలమారి.. నిశామిక చిత్ర వాలని సాగదీసిన దోతారల ముప్పుని కప్పుకొని..
చేర్చి పెట్టుకొన్న ముఖాలన్ని సర్ది.. నస పెట్టిన అపార్ధా కవలికలని వద్దని దాటేస్తూ..
ఋణం పేర్చుకొన్న సగం కన్నుని కూల్చి.. మళ్ళీ కనబడని దూరాల్లో చిక్కుకొని…
గింగిరాలు తిరిగిన హద్దులో ఊపిరి జాడలేని అల్లుకున్న మాటలు.. మసక మందలింపుల్లో ..
గది నింపుకొన్న అడివి గాధల చలిమంట.. దోతారాల పుట్టుకని మోసిన కొండల పక్కగా ..
మట్టి వానలు నిండి పోతున్న వేదికపై .. అడివి .. తీగలు తీగలుగా అల్లుకొని..
నిశ్వాస రాజీయపు మంత్ర మిగులుని మోసుకు తిరుగుతూ…
…………………….
ఊరి గుమ్మం .. ఎసట్లో బియ్యం .. వడ్డించిన పాట
శరీర ఋణం కనిపెట్టిన దారులు … కప్పిపోయిన శ్వాస రక్షకి చేర్చిన అనునాద దోతారలని
రాజ్ఞ దీపపు సానునయ మూర్తులని విరిగి చేజారి కలిపి మోసి తడిచిన కంటి దీక్షలకు ..
చేజారిన వరాలతో గుదిగుచ్చిన ఆలోచనలని మోసుకొంటూ.. నల్లని దేహ రుణాల కట్టడి ..
నిషారాయ ముఖాలన్ని తోడి తెచ్చుకొన్న వర్ష గ్రహణాలు నొప్పిని .. లాక్కొని.. విశుద్ధ కళ్ళలో
పోసుకున్న నాన్న .. ఊరి గుమ్మం దగ్గర.. సైలెన్స్ .. హాస్పిటల్ తిరుగుడు .. భయం చుట్టిన
కథలు.. జుత్తు కత్తిరింపులు.. కొత్త బట్టలు.. సన్యాసితో భాషణలు .. వనశాల పలకరింపులు ..
ఉండిపోయిన కథల ఖాళీల మధ్య తిరిగే .. నిద్ర దర్శన మూర్తులని నటనకి చేర్చిన
వేదికల మధ్య .. బట్టలు పైకీ కిందికీ వేసుకొని … మేకప్ ఊడిపోయిన కళ్ళలో ..
సైకిల్ ఎవరో ఇంటి దగ్గర పెట్టి వెళ్లిపోయారు.. చిన్న స్లిప్ మీద .. వీలైతే క్షమించమని..
డాక్టర్ ని అడిగి .. సన్యాసి మాత్రం వాడికోసం దోతారాని మోగిస్తూ … కలల లోపలకి
తీసుకెళ్లుతున్నప్పుడు… వాడు తిరిగి అడివిని పలవరించి లేచాడు.
…………….
వర్ణ ద్రవాలని … నింపుకొని వచ్చిన దేహాలని హద్దు కోసం .. చేర్చి పెట్టిన నడకలో చేర్చుకొని..
గమనిక ఋతువుల కట్టడికి .. లేవదీసుకొన్న రుణ దీపాలని సగం .. కాపాడుకొని..
రాపాడ ధుని జత సాయంత్ర పునాదులు … లోపల గదికి మోసి తెచ్చిన అడివి.. ఊపిరి తోడుకొన్న
నిద్ర నిర్ణయాలు … అమాంతం మార్చి ఊరి కొండ వెనక మొదలయ్యే పొగ ..
నాన్న ఎసట్లో వేసిన బియ్యం .. అక్క పంపిన పచ్చడి జాడీ.. కారపుపూస.. జంతికలు..
పెరట్లో ఆవు ఇచ్చే పెరుగు.. ధ్వని కూపాల పూజ గది.. కిటికీలో ఎర్రని మందారాల చెట్టు..
కలని దూరం పెట్టిన ఝాము … చూపు తడిసిన పోలికలని తుడిచేసి.. చీకటి వలస ఒత్తిపట్టిన
క్షణ నింపుదలలు… కదలికల నెట్టుడి రాతకి మెరుగుతూ… ఉండీ లేకపోయిన చేతివేళ్ల తిమ్మరి
పెనవేసుకున్న .. మెట్ల చుట్టూ.. బొంగరాల మెత్తని దిశా గొంతులని దాటుకొని… తడిపి ఉంచిన
ఆధారాలు.. ఒద్దికగా దిద్దిన ఇళ్ల బయటనే మెట్లు పోసిన మట్టితో కిటికీలని జోడించి..
శరీర శాలలో దించిన వనాల ముట్టడికి .. దోతార ఆడించే బొమ్మలు..
………………
వడ్డించే పాట .. దిద్ది పెట్టుకొన్న నదికి .. మూసి తెరిచిన గుడి.. ఇంకిన పుట్టుకల మధ్య తచ్చాడే
ఇసుక రాశులని కట్టిన … పట్టుబట్టి చేతన బొమ్మల క్రియకి వేలాడుతూ..
వినీ వినని మాటల చుట్టూ ..తలపడటంలో పర్చుకొన్న కథలకి మలుపులని వదిలిపెట్టి ..
అక్కడే నిండిన కలతని పాడుకొంటూ.. వచ్చీ రాని కబురుని ముద్రించుకొని .. నిర్భర ముఖాల
పట్టుని అరగదీసి.. ఏదో కనబడనిది.. కనబడిన దుఃఖ నిండని కాచుకొని రాలేది .. దోతార కలని
మోసుకొని.. దారి తప్పిన పాటని శుభ్రం చేసుకొని విడిపోయిన స్థితిని నెట్టుకు వచ్చేది..
నాన్న ముసలావిడని అడిగాడు.. ఆవిడ నవ్వి.. వాడు అరణ్య వాసమే చేసి వచ్చినవాడు..
జనారణ్యం ఏపాటి? వాడిప్పుడు నీ నీడలో మొక్క కాదు.. మహా వృక్షం.. నది చిలికిన దీవి..
మహా సాధనల వరప్రసాది .. మట్టి బొమ్మల కావెడ… అతనొక నెంబర్ ఇచ్చి.. మీరు మాట్లాడండి..
నాకు వాళ్ళేం చెబుతున్నారో … ఎందుకు చెబుతున్నారో … కూడా అర్ధం కాలేదన్నాడు…
విశ్వపు ఏక దీక్షలో దిద్దిన కనుసన్నల దేహ నిజం వెలిగించిన కథగా ..
హద్దుల్లో ముడుచుకు పోయిన కన్నులో ఇగిరిన పాటకి దోతార మోసిన కాటుక రాశుల
చెమట ధ్వనులు.. ఉండబట్టలేని ఊరి సత్రంలో సంతర్ప పాటని అందుకున్నప్పుడు..
దుఃఖం విడగొట్టి తిరిగిన అసహన మూర్తుల ముట్టడి ముగియక చేర్చిన అనుమానాలు ..
చిత్ర గ్రహణాల నెలవు. భయపు వేదికల బయలులో ఉండిన విగ్రహాల కథ తెలియక ముందే..
………………………
ఆనవాళ్ల వంతెన .. అటు నగరం.. నాన్న ఖాళీ మాటల ఝరి …
నివేశ ఊరులో .. ఒంటరి పాద ద్రవపు సీసాల్లో పడి తగలబడుతున్న కన్ను కింద ..
మగ్గిన శ్వాసల అడివి మంట చల్లారక .. ముసిరిన వాన రాకడ మత్తుని వదిలిన నదీ గాలిలో
వాడి పాట .. అది ముందుదీ .. ముందుకీ సాగేది.. అలసట అద్దిన లోయల చీకటి మింగిన
నది చప్పుడుతో.. కక్ష్య నీరుల కొండ వెనక దీపం పెట్టుకొంటూ.. మసక మంచు చీరలు రాల్చుతూ
నాన్న .. వనశాలకి తీసుకెళ్లి చెప్పగానే .. ఎన్ని రోజుల టైం ఉందని అన్నాడు.. ఆ వచ్చిన ఆయన
ఓ లాప్టాప్ .. సినిమా పాటలు ఎలా వినాలో చెప్పి .. చూపించి.. రెండు రోజులు ఉండి నేర్పించి..
వాడి పాటలు వింటూ.. మళ్ళీ మళ్ళీ అర్ధం కానీ ఏవో ఖాళీలని తడుముకొంటూ…
నాన్న అడిగినపుడు.. వాడికి ఈ వేదిక ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు..
వీడి పాట ఆ నగరానికి .. ఓ నదినీ ..అడివినీ .. నీటి కథనీ .. పడవనీ తీసుకొస్తూంది..
అది చాలా అవసరం.. కొండలు చెప్పే నీటి బెంగలో తలదాచుకున్న దీవినీ .. కంటి నలతనీ
దేహ వానలో తడిచిన అడివికి ముఖ చిత్రం వాడు.. నాకిక రక్త బంధువు.. నేనూ పాటనే ..
కానీ వేళ్ళు నాకు .. నా ఛాతీ లోపలి .. వీడు కాళ్లతో కుమ్మిన మట్టితో కట్టిన ఇల్లు కావాలి..
చల్లని పడవలో వాడి పాటని వింటూ.. అది అంతిమ యాత్రగా ఉన్నా .. నాకిష్టమే..
,,,,,,,,,,,,,,
చెట్ల ఊయలకీ .. మంచు పాతర్ల తడి నేలల ఇంకుడు భావికీ … వెళ్ళాలా అని అడిగి..
.వాడు దోతార ..laptop తో సత్రలా నీడల కింద నీటి చెట్ల కబురుని మోసి సన్యాసి ని కలిసాడు..
ముందు రెండు రోజులు ఆ పాటలు విని కంగారుపడ్డా.. ఆ తర్వాత తన గొంతు వింటూ
వెళ్లే దారి దొరికి .. ముసురు వదిలిన దీపపు చీకటి కింద బొమ్మలు గీసుకొంటూ సంబరపడ్డాడు..
అదొక మాయ నగరాన్ని .. అమ్మతో చీరతో అద్దిన బాటలా .. మెత్తగా వాడిలో దిగబడటం
మొదలైంది.. అది కంటికి కనబడేది.. గొంతుకి వినబడే మాయగా ఏడుస్తూ.. తేరుకోలేని సిద్ధ
యాత్రల కథకి లేవదీసుకొన్న మహా కథన మూర్తుల కక్ష్య కూలిపోయి .. ఏడ్చి చేరిన ..
వాడి చెప్పింది విని .. సన్యాసికి మాట లేదు.. అదెలా సాధ్యమని.. అది వాడిపై అనుమానం కాదు..
భయమూ లేదు.. ఒక ఆశ్చర్యం దిగబడక ముందు ఉండే చలన ధారల ఊగిసలాట..
వాడు నవ్వి.. కాళ్ళకి నమస్కరం చేసి… నీళ్ల పైన ఊపిరిని తాగి నది గట్టున కూర్చొన్నాడు.
అనుగ్రహ నిద్ర మూర్తుల కలతకి పోసుకున్న నీటి యానాల పుట్టుకని మోసే నిద్ర కథలని
దాటుకొంటూ .. ఊరికి నిండిన మట్టి మోతలు… కలత నేసిన గుమ్మాలు..
…………….
నాన్న ఖాళీ మాటల ఝరి .. నువ్వు అనుకున్నదే చెయ్యి.. ఏం జరిగితే అదే జరుగుతుంది..
ఈ ఊరూ ,,, ఇల్లూ ,,నాన్నా .. పొలం.. సత్రం .. వనశాల .. నది.. నిన్ను రక్షించిన పడవ
ఎటూ పోవు.. అదే సరి కాదు.. అదే సరి అవుతుంది.. ఇంకోసారికై ఏదీ లేదు.
హద్దు నెగ్గిన ముఖాలు దాటుకొంటూ.. శ్వాస మగత కూలిన దుఃఖం ఇగిరినప్పుడు ..
సమయ నిరాయ కల్పంలో చుట్టి పెట్టుకొన్న సిద్ధ వేదికలు.. త్వరపడి రాతలు.
ఇక్కడ పుట్టిన పాట.. ఎగురుకొంటూ .. ఎప్పటికైనా తిరిగి.. ఈ గూటికే రావాలిగా ?
కానీ ఆ వేదిక పై ఈ ఊరి గుమ్మాన్ని పాతి .. రావాలి.. అంతే .. అక్కడ మన సత్రం ..
ఆకు వేసి భోజనం వడ్డించే పాటల రుచులు..కప్పుకు వెళ్లిన మంచు ద్దుప్పటి కింద రంగులు
పెనవేసుకున్న ఇంద్రధనస్సుల నది.. గుట్టు తెగిన పాటల ఆ పెద్ద ఏటిగట్టు..
నిశ్చంత బద్ధత మోసిన కంటి రాల్పుల కుట్రలకు బయట .. లోపలకి చేర్చి అడిగిన..
అద్ది తీసిన కంటి నీరుని జోడించిన కణతల్లో .. పూడ్చి పెట్టిన చలన రాద్ధాంతం
ఊగిసలాడి.. విపరీత సాయుజ్య స్థితికి చేర్చిన కల మెరిసిన కలతలు..
ఉండీ .. ఊడిపోవడం తెలియని అపేక్ష శరణు కాపుకొన్న దూర రాశుల ముట్టడికి
అంతు తెలిసిన నడకల పుట్టుక.. పాట మరో మలుపులో శిధిల ధ్వని మోస్తూ…
……………………….
పాట మోసిన కథ.. విని పండుతూ.. హద్దరి నిద్ర పూడికలు..
నీలోకి నువ్వు నిండిపో.. విశ్వ భ్రమణ సత్యం పిల్చుకు వెళ్లిన కథ .. మరో గుమ్మం ..
సర్వ దేహమూ చలన ముఖి .. మృత్యు ద్వనిలోంచి.. సరాసరి.. నీ వెన్నులోకి పోసి
విద్యుత్ మండలపు తాళం చెవి నగరానికి ఇవ్వు.. దోతారని నీ వెన్నులోంచి బయటకి తీసి ..
దానికి మళ్ళీ జన్మనిచ్చి అనుసరించు.. హద్దరి నిద్ర పూడికలు తొలచి పెట్టిన కథలో…
అన్నీ తిరిగి రావడమే.. ఈ జరిగి పోయిన చోటు ఎప్పటికీ ఉంది.. కథ మరో దానిలో గడ్డకట్టి..
చూపుని మార్చి పెట్టిన రంగుల మధ్య స్నాన దేహాన్ని మాటి మాటికీ అడుగుతుంది..
ఇక నువ్వెప్పుడూ కిటికీ తీసినా .. అడివి తాగుతున్న నది కనిపిస్తూనే ఉంటుంది.
ఏదోకటి జరగుతుంది.. మంచీ చెడుల నిర్ణయం మనది కాదు,, మృత్యు శీతల గర్భంలో
పాటల వేడుక మొదలైంది.. వ్యాక్యం మాట కాదు.. కానీ ఓ మాట వ్యాక్యం ఐనప్పుడు ..
పాట పుట్టుకల చోటు వెతుకుతుంది.. అక్కడ నీ అడివి చలి కాచుకొంటుంది.
సంధి చిత్రం మోసిన పాటల నదిలో కొట్టుకు పోతున్న నగరం.. ఊరి కబురుని వార్చుకొని..
నీ రధాన్ని సిద్ధం చేసి నీ దుఃఖాన్ని చుట్టిన దోతారని సరి చేసుకొంటూ .. పిలుస్తుంది..
…………….
సర్వ సన్నాహా ఆది నాటకంలో .. తెరలు చిరిగిన హద్దు వెనక .. చంద్ర శిలకై తవ్వినప్పుడు
మొదలైన పాట .. దోతారాలో ఉంది.. నీ వేళ్ళలో బతకడానికి .. సమాధిలోంచి పిలుస్తుంది.
సన్యాసి వాడి లోపలికి చూస్తూ ఆ పాటల్లోనూ.. నీదైన కథ వెదుకు .. నీతో పాటు తిరిగే ఈ ఊరు..
సత్రం.. నది.. అడివి అన్నీ వెదుకు.. ఆ పాటలోకి నువ్వు వెళ్ళకు.. ఆ పాటని నీలోకి తెచ్చుకొని..
నీ పడవలో తిప్పు.. అప్పుడిక నువ్వెక్కడికి వెళ్లినా .. నువ్వు నువ్వులానే ఉంటావు..
జనారణ్య ధ్యానం నీకొక పరీక్ష అనుకో.. రాసిరా .. అంతే.. దేహాల విడిచిలో పోసుకున్న నది నీళ్లు..
ఇదంతా ఎక్కడికీ పోదు.. ఉండాల్సింది ఉంటుంది.. పోయేదాన్ని నువ్వు ఆపలేవు..
ఈ బురదల్ దిగబడ్డ .. నీ మట్టి కళ్ళతో నగరంలో ముద్రలు వేసిరా…వాళ్ళ కంచం లో అన్నం
మన ఈ ఊర్లో .. నెత్తి మీద పెట్టుకొంటారు.. శిక్షిత నిర్మాణ బంధిత చీకటి సలసల..
ఇదొక నిద్రసంధికి చేసిన వంతెనల ఎగ ఊపిరి అద్దిన కథల పట్టు.. శ్వాస సాంద్రతని
తట్టి లేపే ముఖాల రుద్దుడు. అదే తెలుసుకోవాలని తెలియని మాటల ఎద్దడిలో మోసి
తెచ్చుకొన్న తీరికల చిత్ర నిందలు … అపనిందలు జారిపోతున్న కణతలు మధ్య కూర్చివేతలు
తొక్కాలనుకొంటే .. అదే కాళ్ళకి చెప్పులా మారి .. మెత్తదనాన్ని ఇవ్వు అంతే..
…………
వనశాల వాడికి అన్నం వడ్డించి.. పప్పు .. ఇంత నెయ్యిపోసి.. బట్టలు పెట్టి.. కొత్త చెప్పులు తొడిగి..
జలుబు.. దగ్గుకీ.. గొంతుకి బొంగురైతే వేసుకోవడానికి కొన్ని లేహ్యలని కట్టి.. చే సంచీలో
కొంత డబ్బు పెట్టి.. ఒక చిన్న అద్దం .. దువ్వెన .. టూత్ బ్రెష్,.. జేబురుమాళ్ళు … తెల్లని కలలు..
నిన్ను సృష్టించిన ఈ సృష్టి ముందు నీదైన ఊరుని లోపల మోస్తూ… నదిని చుట్టుకొని ..
కొండల్లోకి దూకిన లోయల అలసటని.. గర్భ దోషం తెలియని ఉడుకు అన్నపు కుండలనీ..
బురద మెత్తని నవ్వుల నాన్న భుజాల శ్రమనీ .. నాగలి కన్నుకి పూచే ధాన్యపు గింజనీ…
నీ ప్రదర్శన కూడా ఇవ్వాలిగా .. అది భూమి పుట్టుక లోని వాన చప్పుడు నింపాలిగా…
కొత్త దర్శనాలని కలలు కను.. ఏదీ ఆగిపోలేదు.. ఏదీ పూర్తయి పోలేదు.. కదిలించు..
ఈ కొండలని కరిగించి .. అక్కడ నీ పాటల గోళాన్ని ఈ మట్టి చల్లని కాళ్లతో వెళ్లి దించి రా..
నీ అడివిని అక్కడ పాతేసి రా.. నీ నదిని .. ఊరభావి చెమటని వాళ్ళ దాహాలకి వదిలిరా ..
పిల్చింది ఎవరు? పిలవబడుతుంది ఎవరు చెబితే.. అక్కడా నీ కళా రహస్యం అంతా దాగి ఉంది.
దానిని పగలగొట్టు.. ఊరికినే ఉండిపోవద్దు.. పరుగునే నమ్ముకోవద్దు.. కంగారునే కోరుకోవద్దు
చేతనకి రెండో వరం పోసుకున్న సృష్టి మైదానంలో నీ పాట ఇళ్ళకి అంతా సిద్ధమైంది..
నీ నదికి చెవిలో చెప్పి.. అనుమతి తీసుకొని … నీ పడవ ని అటు వేపు తిప్పు..
…………
రైలు వంతెన … విమానం కిటికీ…. పాట నెగడు
మొదలవ్వాల్సిన నీటి యాత్రకి .. కలని సరిచేసి.. లేళ్ళ గుంపుతో అడివి కలిసి వచ్చి ..
వాడి ఇంటి ముందు దోతారని చుట్టుకొంటూ చూస్తూంది.. నివర్ణ ముంపు తెలియని గంటలని
దాటుకొంటూ.. అక్కడే కనబడే మేఘ కొండల దీపం వణుకునీ పట్టుకొంటూ…
చిన్న బట్టల సంచీ.. అద్దం .. దువ్వెన.. నూనె డబ్బా.. పచ్చడి సీసా .. నది రుచి చూసి ఇచ్చిన
ఎంగిలి నీళ్లు.. లోయలు ఇగిరి పోయిన ఆవిరి ఝాములో మంచు మూటలు
ఇల్లు నిద్రని తుడిచి.. భావి శుభ్ర నాదం ఒంపి.. కన్ను గురుత్వ తమకం దిద్ది..
అక్కకి మళ్ళీ తొమ్మిదో నెల .. రావొద్దని.. తాను అల్లిన ఊలుకోటు.. అక్క చేతి వేళ్ళ వాసన ..
స్పర్శ.. సరి చేసి వెనక్కి చేరి మూటలు కడుతూ.. అవధి లేని కేకల చిత్ర ఊలని నానబెట్టి
కథలని భద్రం చేసి కట్టిన రొట్టెల మూట.. కలలు వదిలిన మట్టి రాతని కట్టుకొని …
కొండల చాటున పంచిన అన్నం కుండలని వార్చుకొంటూ.. దోసిలి నింపుకొంటూ…
నాన్న ..వనశాల .. సన్యాసి.. వాళ్ళ ఊరుని దాటి.. రైలు ఎక్కి .. వంతెనలు .. సొరంగాలు దాటి.
విశ్వ రుజా గ్రస్త కౌగిలి నేసుకొన్న శరీర ఒంపుల్లో .. పాట సర్దుకొంటూ పెట్టే కేక .. నిండి పోయే
స్టేషన్లో .. అటు ఇటు .. ఏం జరిగి కూలుతున్న … మాటలని కడిగి .. పట్టించుకోక…
………….
రుణ దీపం మోసిన కథకి .. కాళ్ళ స్పర్శని మోసిన దుఃఖం వెలుగుతూ.. కదిలే నిద్ర గుండాల
మెలికని సరిచేయక ముందే .. బెంగ స్థాపనలు చేసిన శరీర వయస్సు.. పైబడిన కంటి శిక్షలు
అడివి మోసిన నిద్ర నీరుతో అద్దిన దుప్పటి అడుగులు.. వానతో నాని.. సిద్ధ యోజన ముఖాలని
కనుక్కొన్న విశ్వ నిద్ర పాటని పట్టుకొని రంగుల కట్టడిని నేసి ఊగుతుంది..
ద్రుష్టి చెప్పిన కథ.. దేహ సందడి కుదిరిన గట్టు పై .. చలన ముఖి చేసుకొన్నా .. ధూప నైవేద్యంలో
ఆ పొడుగు పెట్టెల పాట.. దోతారాతో అరుస్తూ.. సొరంగాల నీటి ఛాయని కళ్ళకి రాసి.. పాడుతుంది..
నేపధ్య శృతి సిద్ధం చేసిన పొడుగు బండిలో తిరిగి ఆ రాత్రి పూట వేడుక మొదలైంది..
అందరూ వాడి అడివి వానలో తడిచి..కొత్త బట్టలు తొడుగుతున్నారు.. ఆ పడవ కోసం క్యూ లో
నిలబడి వాళ్ళ వంతు కోసం చూస్తూన్నారు.. చెదురు మదురు పాట గుర్తులు..
కథ తెలిసిన నిద్ర రాతల మధ్య ఉడకబెట్టిన కళ్ళ ఊసులు.. అదే నడక ..
మరో గుమ్మం చుట్టిన ఊరిలో నగరం దిగబడి కంగారు పడుతూ.. ప్రభావ లయకి చేర్చుకొన్న
ఝాములో పొర్లుకొంటూ …ఏది ఉందో అదే లేదనే మాయలో కొట్టుకుపోతూ…
…………
విమానాశ్రయం వరకు వచ్చారు.. ఆర్గనైజర్స్ వాళ్ళని అక్కడే ఉంచి..వాడ్ని.. దోతారని.. బట్టల
సంచీని లోపలికి తీసుకెళ్లారు….కథలు పోసుకున్న నిద్ర నిందలని పడగొడుతూ..
హద్దుల లోపల మంచు పూతలు …తడబాటు లేని నిశ్వాస చర్యల కలతని నేసుకొంటూ
రెక్కలు మొలిచిన దీపస్తంభాల కొండ గాల్లోకి లేచాక.. ఎవరో అడిగారు.. దోతారాని చూస్తూ ..
అదేంటని… చిత్రమైన ధ్యాన స్వరంలా ఉన్న వాడిని .. రెండు తీగల ఆ చెక్క సాధనాన్ని..
వాడికి మాట పెకలలేదు .. సిగ్గు .. బెరుకు .. ముంచుకొచ్చింది … వాళ్ళు వాడి మాటకోసం
చూస్తూన్నారు.. వాడి కదలికల్ని గమనిస్తూ.. కంగారు పెట్టకూడదని అనుకొంటూ …
అంతే ఆకాశ మండలమంతా పాటే.. దోతారా ..అక్కడే విమానం నిండిపోయేలా నదిని
ఓంపుతుంది.. అంతా నీళ్లలో తేలుతున్నారు.. కలలని చేరదీసుకొంటున్నారు …
అడివి వాళ్లకి .. మెత్తగా పుప్పొడి అద్ది సేదతీరుస్తుంది.. ఆది యంత్రాల చలిగాలి కాదు..
వెనక నుంచి ఎవరో అదే అరిచారు.. చేర్చి పెట్టుకొన్న మాటలని వదిలి… వచ్చింది ..
వచ్చినట్లు….మాట్లాడుతున్నారు .. చప్పట్లు కొడుతున్నారు.. అలిసి నవ్వుతున్నారు
రెక్కల అల్లాట.. బయట గాల్లో ఎగురుతూ.. తడబాటు లేని నిద్రని గొంతులోంచి తాగుతూ
లోపలి కురుస్తున్న కొండ మట్టి.. ఉండబట్టలేని కలలకి చుట్టి . కదిలిపోతూ..నిలబడి రాలుతూ….
ఆర్గనైజర్స్ దానిని వీడియోలో బంధిస్తున్నారు.. దిగాక షేర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు…
ఆది నగరాన్ని బతికించే కొన్ని శతాబ్దాల గనిగా మారబోతుందా?
…………….
తలనెరిసిన మంచు.. ఊరి కాగడా.. నగర దుమ్ము
సంసిద్ధ ఆందోళన … గొంతులో సన్నని వణుకుని కాల్చే నీటి మంటలో కదిలిన మాటలకి ..
తేరుకొని ఝాము కత్తిరించిన దుఃఖం వెళ్ళిపోయినా ఆవిరి కుండలో .. కాటుక నులిమిన కథకి..
రెండో నిద్ర ఊరట తెలియని పాటతో తలనెరిసిన మంచు.. లోపలికి రాలుతూ…
తడి రాల్చిన వేసవి గొడుగుని అడ్డుకొన్న .. స్వాధిష్ఠాల కంటి ముంపునీ పట్టుకొని.. జేర్చిపెట్టిన
కథలకి పాకుతున్న నదిని చుట్టి .. దాచిన ఊరు.. వాడి బట్టల మధ్యలో అక్క పంపిన ఫోటోలు.
కౌగిలి బిగించిన బట్టల సంచీ .. చలి మగతల గది.. ఎన్నిక… ఎవరో తాకి వెళ్ళిన గొంతు..
ఇది అచ్చమైన రాతితో తనని తను చిక్కుకొన్న శిల్పం . మనమేం చెయ్యనక్కర్లే .. అన్నాడు..
trianer వింటున్నారు.. వెళ్ళుతున్నారు..మళ్ళీ ఎవరినో తీసుకొని వస్తున్నారు..
మళ్ళీ వింటున్నారు. తడబాటు లేని నిద్ర వంతెనల మధ్య కూల్చివేతలు …
దోతారని వాడు బుజ్జగించడం చూసి మురిసిపోతున్నారు… తడిచిపోతున్నారు…
మనిషి రసాయన చలనం తెలిసిన చెట్ల చుట్టూ .. బొంగురు దోతారాల అడుగుల గుట్టు వాళ్ళ
ముందు విచ్చుకొంటూ.. ఏవేవో పేర్లు చెబుతున్నారు.. వాడికి వాటితో సంబంధమే లేదు..
పాట దోతారా నుంచి జారీ వాడిలోకి వెళ్లిందా.. లేదా వాడి నుంచి చేరిన శ్రుతిని దోతారా
వినిపిస్తుందా ? తనే అనుకొని కనిపోసుకొన్న రాతి శ్రమల చీకటి అలవాటు కాలేక…
ఛాతీలు బరువెక్కిన కథలా .. శ్వాస బరువెక్కిన .. అక్కడ వాడి చేతుల మధ్యలో తడిమి..
ఆ అనుమానం తీరనవసరమే లేదన్నట్లుగా… వాళ్ళు..
…….
చిత్ర ముఖాలు … కాలే భయాల ముద్దల్లో నిశ్చంత ఇంకిపోయిన జాగారాల సాహరింపు
ఒరిపిడి..పేరుకుపోయిన చలన మోసపు ఎత్తుల్లో .. కలబడే చీకటికి .. నిలువు దుప్పటి ..
రగ్గులా మారి … ఆ పెద్ద కిటికీలోంచి దూరంగా .. నగరాన్ని చుట్టుకొని .. పరుగు పట్టుకొని
లైట్లతో మండుతున్న సముద్రం.. ఆగిన మర పడవల పొగల దగ్గు .. ఊపు నలత..
వేసట లేని నిద్ర గతిని అరగదీసి కథగా .. ఇది ముహూర్త చలన చీలికలో పొడుచుకొచ్చిన
కుదురుని కనిపెట్టి.. మోసి తెచ్చుకొన్న అనుభవ నేర్పుల కలకి.. చిత్ర ఖనిజ రొప్పు…
దూరమూ.. దగ్గరా చెయ్యని నిరాక వీధిలో కంటి శిక్షిత ఆనవాళ్ల బయట ..
ఎవరినో అడిగాడు.. అన్నా సముద్రం దగ్గరకి తీసుకెళ్లమని .. అనీ అనక ముందే …
జనాల హోరు కెరటాలకన్నా ఎక్కువ ఉంది.. ఐస్ క్రీం గొంతులో కరిగినా..
దుమ్ములో పొర్లి అలిసినా .. మంచు కమ్మి తడిచిన .. ఉప్పుగాలి పెదాలని ఆరబెట్టినా ..
వాడి పాట .. దోతారా ఊరు నిద్రపై పేర్చిన జోల .. అలానే పాడుతూనే ఉన్నాయి ..
జనం ఇంకా చేరుకొనే లోపే .. కారులో కూర్చోబెట్టుకొని అతను తీసుకెళ్లిపోయాడు.
…………..
అక్క పచ్చడి సీసా .. పెరుగు అన్నం చాలన్నాడు.. అక్క చేతి రుచి ఉందిగా ? అని..
నిహీమాయ దేహాల చుట్టుపోతని కనుక్కొని వెళ్ళిపోయినా చేతి గుండ్రాల కొసల్లో .. మెలి తిప్పి
మూడేసి సగం చీకటి గదిని.. అక్ .. లైట్లు ఆఫ్ చేసి.. చెమట కిటికీలోంచి.. ఆ ఝాము పొద్దులో..
దోతారా అడిగిందని మొదలుపెట్టాడు.. చీకటి చలి గదిలో లోయల ఊపుని మీదేసుకొంటూ …
ఆ తలుపుల దగ్గరే నిలబడి వింటూ.. చప్పుడు చెయ్యని శ్వాసలని రూడీ చేసుకొని నిద్రపోయారు..
అది సృష్టి సంయోగ నాదం .. అదొక పాట కాదు.. ఎప్పటికీ ఐపోయేదీ కాదు..
ఎక్కడ మొదలో తెలిసేదీ కాదు.. ఎక్కడికి చేరుతుoదన్న ఊసూ లేదు … కొసరూ మర్చి…
దుఃఖం విడిపోయిన కథ చుట్టూ.. అడివి తీగలతో నేసిన కథల మధ్య .. దిగులు సరిచెయ్యని
కుడి…ఎడమల ముట్టడిని రాల్చిన విశ్వ మూర్తవ గంభీరంలో …
……………………….
ఉరిమిన కొత్త చోటు .. కలత చలిగాలి.. పెట్టెలో పాడే ధో తార
వాడికి ఆ సాధనల హోరు నచ్చలేదు.. బయటకు వచ్చి లాన్లో తిరిగాడు.. వాళ్ళు అప్పటికే వాడికి
సాధన చేయాల్సిన పాటల లిస్ట్ ఇచ్చారు..
వాళ్ళ వేపు ఖాళీగా చూసి.. ఒక్కసారిగా .. మట్టి పోతలని అలానే పట్టుకొని.. నది కింద తడిచి
పెట్టుకొన్న కథలని కనిపెట్టి మోసిన పాటగా .. జానపద దృశ్యం అందుకొని.. వాడు పేర్చిన
సాకీతో .. ఉండి ఆగిపోయిన శ్వాసల నిద్ర ఋణం వదిలిపెట్టుకొని… ఝాము మగతని తీర్చి..
మహా అంతరిక్ష పలికే దోతారా మధ్య .. ఆలాప ముద్రకి.. ఎవరి నుంచి మాట లేదు..
అన్ని పాటలు ఆగిపోయాయి.. ఉరిమిన కొత్త చోటు ని దాటుకొని దూసుకొస్తూ..
ఆది మానవ పుప్పుడి రాలిన కెరటాల మధ్య కొట్టుకు పోతున్నట్లుగా ..వాడినే చూస్తూన్నారు..
దాని నుంచి వాడు… ఆ లిస్ట్ లో ఓ పాటలోకి చేరి.. బెంగతో నిండిన గొంతుని ఒంపి..
వాళ్ళ లోపలి చీకటిలోకి.. కాగడాలతో నడవడం మొదలుపెట్టాడు.
……………
గదిలో మోసుకొస్తున్న కలత చలిగాలి కమ్ముకొని.. రుణ నిగ్రహాలని వదిలిపెట్టి ..
సిద్ధ మ్లానత దగ్గరకి తెచ్చిన కంటి రాతని కనుక్కొని ..
విస్మితః రంగు నిద్రలని దాటుకొని.. ఝాము ముప్పేటల చీకటికి నల్లబారిన ఋణం ..
పడి లేచిన కెరటాల మధ్య కదిలే చదును నడకలని దున్నుతూ…
సన్యాసి మోసిన చెట్టు కిందుగా .. పాటకి ముందే మొదలయ్యే పరిమళ శబ్దం ..
మట్టి పలుకుతున్న ఝరులే వాన ముద్దలని చేసి కట్టుకొన్న జోలెలు.. దాచి పెట్టుకున్నా
చిందు.. ఇప్పు వాడిలోపల .., ఆ గదిలో .. షవర్ కింద అర్ధరాత్రి..
సమయ నిబంధ ముఖాలని అడ్డుకొన్న దీపాల శపిత నిద్రలేని జోడించుకొని.. చంచల ఝాము
నానిపోయిన నది.. అతని చూపులోంచి మంచుని తాగుతూ.. పొగల చక్రాలని గుండ్రంగా
తిప్పుకొంటూ.. తేరుకోలేని నిద్ర నింపుల కట్టడికి చేర్చి పెట్టుకొన్న మహా శ్రమ కప్పిన ఇల్లు..
కొన్ని తాలు తీసి ఉంచిన రైళ్లలో.. పాటని తీసుకుపోతున్న మట్టి కొండలు.. లేళ్ళ పరుగు..
గుహల్లో పులి అరుపు.. కల కూలి లేచిన కంటి తుడుపుల మధ్య కుదిరిన అననుకూల
మంతనాలు. …మాయజ గ్రహణ మూతలని కానీ పెట్టిన కిటికీలోంచి చంద్ర వాకిలిని చూస్తూ ..
నిర్మిత గర్భ దోసిలి కడిగిన అప్పగింతలు .. బరువెక్కిన కునుకు చుట్టల్లో పొర్లిన మట్టి రుణాలని
మెలి తిప్పి.. రోజంతా మకిలి పట్టిన దుఃఖపు కబురుని రుద్దుకొంటూ….
……………….
విశుద్ధ శరీర ధారలని చేర్చుకొని ..దోతారా మోసిన బెంగాలు.. గుచ్చుకొన్న ఊరి గుమ్మం..
అక్కడే దొరికిన కథకి .. రెండు నిధి తవ్వకాల మధ్య కల్పపు నిద్ర పూతలని సాగుచేసుకొని ..
సర్ది ఉంచిన పెట్టెలో పాడే ధో తార .. నిర్వీకార సమయ ద్రోణుల్లో కురిసే మంట ..
తనకి ఏదో తెలుసు.. వాడికి ఇంకేదో వినిపిస్తూంది … అక్కడివారికి ఆది తెలియదు.
ఆది తెలిసిన చోటులో మాట తీసుకొని.. గంభీర ముఖాలని జోడించి కదిలిన ఉలిక్కిపాటుకి
కరిగిన నిద్ర చావేడలో పోటు పెడుతున్న వికార మలుపుల్లో .. తలుపువార గుట్టులో …
కథ తెలిసిన పేజీలని తిప్పుకొని.. మలుపుకి చేరదీసిన పడవల్ని నదిలో పట్టుకొని…
ఏదీ సరి చేసి వెళ్ళక ముందే .. ఇదే వాడి ఫార్మటు అని.. వాళ్ళ లెక్కలు మార్చుకొన్నారు..
వాడు రాసిచ్చిన పాటల లిస్టుని … దానిలో వచ్చే గమక ముద్రలని చూసి.. సరిచేసుకొన్నారు.
దుఃఖం అడగని నిద్ర దోసిలిని కట్టుకొని .. శరీర ప్రాయం నిలదీసిన గతిని మార్చుకొంటూ..
భయం పోసుకున్న కథకి .. చెమట చుట్టిన నీటి నది వెన్నుని నిమిరించి.. కక్ష్యకి…
లేవదీసిన కథని కట్టుకొంటూ.. రుణ ముద్ర పోలికలని దీక్షించి పారబోసుకొన్న నగరం ..
ఇంకా సిద్ధమవ్వాలని అనుకోక ముందే.. అనుకొన్నప్పటి సమయం తిరిగి దొరకక…
……………………….
అక్క ఫోన్ … రుణ వీధి.. జంట నెలలు..
రేపే ప్రారంభం అనగా .. ముందు రాత్రి అక్క ఫోన్ చేసింది..
వేళకి తింటున్నావురా? అని.. బెంగ పెట్టుకోవద్దు.. చలి గాలి తగలకుండా చలికోటు
వేసుకొంటున్నావా ? ఎక్కువ మసాలాలు తినొద్దు.. వేళకి నిద్ర పో మరి.. సరేనా ?
నీ గొంతు అన్నీ ఆది చేసుకు పోతుంది.. నువ్వు తయారీ రుద్దుడులు ఏమీ చేయొద్దు..
మన ఊరు … ఇల్లూ .. నీ కిష్టమైన సత్రం.. వనశాల .. అన్నీ నీకు తోడే ..
అక్కడొక రాట వేయరా .. మనందరం కలిసి ఉండే ఇల్లు కట్టుకొందాం.. అదొక అభయ సంధి ..
నిర్మిత సత్తువు శరీర భూమి నేసిన దుఃఖాల మెలికని తీయలేని .. నిరువున గుచ్చిన పునాదులని
కదుపుతూ.. హద్దు తడిపిన కథకి … చెలరేగి పోయిన మాటలని అతుకుతూ …
నిష్రమిత దేహ చీలికని సాగదీసి.. కంటి దీక్షని నమిలిన కక్ష్యలు .. చుట్టుకు రాలిన ఝాము
పొద్దులు.. లోపల ఉండిపోయిన గది దుప్పట్లు.. బార్లా తెరిచిన తలుపుల మధ్య గంటలు…
రెండు తలుపుల నిద్రని జోడిస్తూ.. పీడన కావలించుకొన్న మసక ఊటల పాట కి రెండో వేదిక
తెలియని నటనని వదిలి పెట్టి… పైకి బిగదీసి కట్టిన శరణు మాత్రలు..
…………………
నిగూరిన రుణ వీధి.. చేతులు రాల్చిన రధం .. లిఙ్గట్లు మింగిన సముద్రం.. సంధి చెయ్యని చెట్టు
విరిచిన గాలి వెంట తిరుగుతూ .. గొంతు మోసిన చీకటి జ్వరాల దుప్పటి..
అదే సంపద.. నిద్రల వరద .. కన్ను తాకిన కెరటాల నీటి చప్పుడు.. భయం పీల్చిన కథకి
నిండు ఎండని తురిమిన ఝాము మొవ్వుతో..నురుగు.. అక్కడే మరి తెలియని నిద్ర భూమిలో
కలని చేర్చుకొని సాగిపోతూ.. శ్వాస తర్జన…శరణు గాధకి సరి చేసిన మాటల తుప్పుని దులిపి ..
కథకి నెరిసిన నవ్వునిజోడించి.. చీకటి ఋణం చేసిన దోతార ల మెరుగుని రుద్ది .. రుద్దుకొంటూ..
శిధిల నడక పెనవేసుకున్న దీపాల కొండ వెనక చల్లారిన మెట్లని కడుగుతూ..
కలిపి .. కలబెట్టి .. పోసుకున్న సముద్ర కెరటాల ఊపుని పట్టుకొని.. కథలో మోసి తెచ్చకున్న
నిద్ర పూతల పాటని అరగదీసి.. నది ఇచ్చిన బొట్టుని దిద్దుకొని… పడవలు మోసిన గాలి బరువు
గొంతులో .. దీవిలా పేరుకున్న పాట.. మరో చిత్ర గదిలో ఊగిన నడకలని ఊరబెడుతూ.. అద్దిన
నడకని తెగ్గొట్టి …అక్కడే సువిధ ముఖాల పోలికలని కడిగి తలుపులు మూస్తూ….
పాటకి కనిపించని నిదాన గురికి .. సవరించిన కథగా రంగుల మంద్రత కప్పిపోయిన పుట్టకల
మాసిన అద్దం మీద నుంచి తుడిచి… అక్కడే వెనక ఉండిపోయిన ఊరు.
………..
జంట నెలలు.. విపరీత గ్రహణాలు చీల్చుకొచ్చిన దీపాల వరదని కట్టుకొన్న ఆ గదిలో ..
పాతబడిన కళ్ళని దోతారాలో ఉంచి నేసిన నిద్ర .. కలబడని రంగు రాట్నాల మెలికల పూతలు
గంటలు పండుకొన్న మాయ పైకీ .. కిందికీ నలిగి ఉంచిన కాటుక మడతల కొలిమిని పట్టుకొని ..
కాల్చి వదిలిన నిద్ర గ్రహణ విపత్తుల వెంట రుద్దుకొని .. విడిపోయిన కథగా లేవదీసుకొన్న
ఆధారపోతలు… అది ఊరినీ.. ఊరుకి గుండ్రంగా కట్టిన గొలుసులా నదిని .. జోకొట్టి గడ్డ కట్టిన
కొండల మధ్య ఊరేగే చలన దశ కుదురుకుని.. అప్పటికే బెరుకుని చుట్టిన మైనపు పోతల
దుఃఖ నిశ్చిత మాటలకి చెలరేగిన శ్వాస స్నానాలతో అందుకొంటూ.. రుణ బరువు కలకి మెట్లని
కట్టుకొని.. కనబడకుండా వెళ్ళిపోయినా శత్రు కాపలాల మెరుపు ముద్దల కన్నుకి …
కదిల్చిన కంగారు.. ఇమిడిపోని విపత్తు మందలింపుని కరిగిస్తూ.. మండిన కథలో ఊడిపోయిన
పుట్టుకలు వేలాడుతూ.. ఇంకేమీ తెలియని నిద్ర దర్శన ముంపులని తిరగదోడి..కలబడిన నిగ్రహ
గోడలని కట్టుకొంటూ..తేలిపోయిన కథకి.. రెండో శరీరం మోసుకొచ్చిన వీధిలో .. సరి చెయ్యని పాట
వెనక.. వెన్నుని బలం చేసే అడివి రాత్రి చలిని కుమ్మరించుకొంటూ.. లాన్ లో వెనక ఓ మూలకి
హోటల్ వాళ్ళు వాడి కోసం వేసిన చలిమంట .. పైకి సర్దిన పొగల జడని దులుపుకొని..
వాచ్మాన్స్.. నైట్ స్టాఫ్ సాక్షిగా వాడి పాట.. అర్ధమయ్యే కాని నీటి చుక్కల పోతని మింగేస్తూ….
………………………
వేదిక పై మట్టి వాన .. పడవలో గుడి.. పువ్వులు రాల్చిన ధో–తార
అదీయ దర్శన చిత్రాల కథకి .. రెండు వైపులా గొలుసు బిగించిన దుఃఖపు నీరు పొంగుతూ..
అదిమిన గతి చిత్రాల మసక భూమిలో పేరుకు పోయిన దేహ నింద .. కలబారుతుంది
దేహ నిరాకార మందలింపుని సరిచేసుకొని.. జోడించిన కంటి క్షేత్రంలో పేరుకున్న దీపాల
మధ్య కదిలే నిద్ర సమయ మూర్తులని.. సర్దుకొని ఉండిపోయిన ఇంటిలో కథని మోసుకొంటూ
చల్లారని వాన .. కుత కుత ఉడికే అన్నం కుండా..చలి కోటు అల్లుతున్న అక్క గాజుల చప్పుడు..
స్పృహ పోయాక నది చేయించిన ప్రయాణం.. పచ్చని అరుపులని త్వరపడక మోసిన అడివి..
కప్పి రాలిన చీకటి శ్రద్ధలని సరిచేసుకొంటూ.. ఝాము మోసి తెచ్చుకొన్న ముఖాలని..
పోలికల్లోకి దాచి.. కదిలే నిద్ర గ్రహణ ఊర్పుని చేరదీసుకొని.. బురదలో వనశాలతో కలిసి చేసిన
పాటల తోవ … వేదిక పై మట్టి వాన … ఓలలాడుతున్నారు.. తడిసి తూగుతున్నారు..
దుఃఖమాయకి తొందరలేని కన్నుని గుచ్చి నిశ్చరువు గొంతులతో పరవశిస్తున్నారు..
ఒకీయ మాయకి దేహ తాండవ శృతి ముంపునీ కదిల్చేదీపం పట్టుకొన్న కథగా వాడు..
వాడి పాట పూర్తవగానే .. అలవాటుగా అక్కడే చతికిలబడ్డారు.. బెల్ వినిపిస్తూంది..
అక్క ముద్ద కలిపి తినిపించడం . జుత్తు సవరించడం….గుర్తుకు వస్తుంది..
………………
కొన్ని చేతులు పట్టుకొని.. వాడిని భుజాల మీద కూర్చొని ఊరేగిస్తున్నాయి.. పాట కోసం ఏమీ
మాట్లాడటం లేదు.. ఎలా ఉందో చెప్పేదానికన్నా పైన ఎక్కడో లాక్ ఐ పోయిన వాళ్ళు…
వాడిని ఎవరూ .. ఏమీ అడగలేదు.. మాటకి రెండో కన్నుని సర్దలేదు.. వదలనూ లేదు
అక్కడ స్క్రీన్ పక్కకి ఉన్న ఆర్గనైజర్ కి సైగతో ఆకలి అన్నాడు.. వాడు పరుగున వచ్చి..
బీజాల మీద ఎక్కించుకొని.. డైనింగ్ హాల్ వేపు మోసుకుపోతున్నాడు.. కెమెరా ఒకటి వెనకాల
వస్తూ ఉంది. వాడి ప్రతీ శ్వాసనీ .. కంటి చుక్కనీ .. నవ్వునీ రికార్డు చేస్తూ.. డీకోడ్ చేస్తూ…
వాడి భుజాన ఉన్న సంచీ లోంచి.. పచ్చడి సీసా తీసి.. నాకు పెరుగు అన్నం చాలన్నాడు..
అక్కా అని అరిచి.. సన్నగిల్లిన ఓపికల ఉక్కపోతతో … తినక ముందే స్పృహ కోల్పోయాడు..
అక్క పడవలో గుడి దగ్గర ప్రసాదం వండుతుంది.. నాన్న నవ్వుతూ.. వెన్నలని చూస్తూ పడవ
నడుపుతున్నాడు.. బువ్వ పెడుతూ … వాడు పాడుతూ పాపతో ఆడుకొంటున్నాడు.
కళ్ళు తెరిచే సరికి.. ఆ గది నిండా పాటల ఫ్రెండ్స్ .. వాడిని కాళ్ళని చూస్తూ ..
అదే పాటని పాడుతూ ఉన్నారు.. వాడు పాడింది.. వాళ్ళు అనుకరిస్తున్నది ఒకటి కాదని
తెలుస్తూనే ఉంది …ఆ రహస్యాల పట్టుని పట్టుకోలేక .. కిందా మీద పడుతూ..
రెఫరెన్సులు వెదుకుతూ … ఏదో దొరకని రసాయన పెనుకేకల ధ్వని చలన మోసుకొని…
ఆర్గనైజర్లు నాన్నని.. అక్కని తీసుకు రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
…………..
చెవులో దూదులు.. నెలల పాప.. అలిసిన ముఖం తో అక్క.. నాన్న అందరినీ పిలిచి పంచిన
కజ్జికాయలు ,, జంతికలు.. భావ అందిస్తుంటే అందిరికీ నవ్వుని తుంచి ఇస్తున్నాడు.
ఆరిపోనీ నూనె దీపం తో అక్క వాడికి దిష్టి తీసింది.. వాడి ఒడిలో పాపని పెట్టింది..
ఎవరో క్లిక్ చేశారు.. తడబడే అడుగుల కథని ఓడించారు .. ఒడిలో కలబోశారు ..
అక్క మళ్ళీ అడిగింది.. కాన్పు అయ్యాకా .. తల్లి బిడ్డకి లాల పోస్తూ పాడే పాటని..
అదీ ఎవరూ వదిలిపెట్టలేదు.. వీడియో రికార్డు చేసి.. యూట్యూబ్ అప్లోడ్ చేసిన క్షణాల్లో వైరల్
ఐపొతూ ఉంది.. అదొక అలిసిన దుఃఖ సంబరం.. మహా ఉత్త్సవ స్థితి స్తంభం వెలిసిన నగరం..
అడివి గోష నింపుకున్న పసి పాప కళ్ళలోని.. నీటి తూగు..పాప కోసం పువ్వులు రాల్చిన ధో-తార
అక్క అడుగుతూనే ఉంది.. నాన్న వాడికి తలగడ సర్దాడు.. మిరియాల పాలు ఇచ్చాడు..
దోతారా ని శుభ్రం చేసి మళ్ళీ ఒడిలో పెట్టాడు.. తలపోత గదులని నొక్కిపెట్టారు…
వాడు ఎవరికీ పోటీ కాదు.. మా పోటీ వాడిలోకి చేరి కాలి పోవాల్సిందే ..
వాడి నిన్నటి పాటకి ఈ రోజు పాటతో .. వాడికి వాడే పోటీ..
………………
గాలి బెంగ .. గొంతు ధార .. పురా జనపద వనశాల
అడివిని కాపాడిన చిత్ర వేదికపై.. నలుపక్కలా తిప్పి చూపించుకొన్న .. శూన్య నిద్రల పక్కగా
వనశాల.. సైకిల్ తొక్కుతున్న సన్యాసి.. వెనక ముసలావిడ.. దేహం నిండా మొక్కలతో…
ఏటి గట్టు వాలులోంచి కిందికి దిగి.. ఆ సైకిల్ నేరుగా పడవలోకి వెళ్లి ఆగింది..
అయ్యా .. ఒక మావాడి పాట పాడండి .. అంది..అడుగుతున్న ఆవిడ గొంతులో గాలిబెంగ..
పోతపోసిన నిద్ర రాజీల మధ్య కూరుకుపోయిన హద్దులో .. ఇంకిపోయిన కథకి ఊరు పేర్చి తెచ్చిన
నగర పటం.. అద్దకపు నవ్వు రాటలని .. నిప్పు పొట్లంతో చుట్టి వెలిగిస్తూ …
అతను పొడుగైన ఆలాపతో .. వాడికి ఎంతో ఇష్టమైన పాటతో … ఓ జానపద యాన దీపాన్ని
వెలిగించాడు.. మట్టి పోసిన అడివిలో పాముల పాకిన గొంతు.. లేడి పరుగు.. చిరుత నిర్లక్ష్య
అరుపు.. దోతారా కమ్మిన ఆవిరి రుణాల బరువు.. కలిసి చేరుకొన్న నిర్ధార గతి మంద్రత ..
అదే వాకిలి.. అక్కడే స్టాండ్ వేసి.. ఎవరో వదిలేసి వెళ్లిపోయిన సైకిల్.. ఇంకా అలాగే హార్మొనీ తో ..
పాట .. ఏమాత్రం అటు పోటూలేని పడవలా మెత్తగా వెళుతూ ఉంది.
ఏమాత్రం తొందర లేదు.. నది పై పర్చుకొన్న వెన్నలని ముసలావిడ పట్టి.. తన కొంగులో
కట్టుకొని తెచ్చి నగరం లోని వాడి గదిలోకి విసిరింది.. కనుసన్నల ఊపుని మరిగించింది ..
వాడు ఉలిక్కిపడి లేచి పాడుతున్నాడు.
………..
ఒకరిద్దరు డైరెకర్స్ నాన్నని కలిసారు .. వాళ్ళు వెనకా ముందూ ఎంతో పొగుడుతూ వాడి కోసం
చెప్పారు;; అప్పుడేనా … వాడికి మీరు చెప్పినట్లు పాడటం రాదు.. వాడికి నచ్చింది మాత్రమే
పాడతాడు..వాడిని నేను దేనికీ బలవంతం చేయలేను.. భూమిని నమ్ముకున్నాం..
దానినే దున్నుకొంటాం. వానని కొల్చుకొంటాం .. నదిని చేదు కొంటాం.. కొండ ని అండ
అడుగుతాం ….ఏటి గట్టుని పట్టుకొంటాo ….అని నమస్కారం చేసాడు
అతను నాన్న చేతులు పట్టుకొని.. నాకదే కావలి.. కేవలం మేము సన్నివేశం చెప్పి.. మా పాట
రాసిన రాత ఇస్తాం.. వాడు ఏది పాడితే అదే.. ఫైనల్ వాడిదే.. మా మాటలన్నీ ముందంతే…
మా రికార్డింగ్ థియేటర్ లో పాడటమే.. వాళ్ళేదో చెక్ పెట్టబోయారు.. అతను తీసుకోలేదు..
ముందు పాట.. మిగతావి వాడికీ ఇష్టమైతే అవన్నీ తర్వాత .. అని నవ్వాడు..
అదొక అనులోమ చిత్రాల రధం దిగబడ్డ కునుకుతో ఉండిపోయిన కలతకి వడపోసిన
దీర్ఘ నెమ్మది సమిధల కూర్పుని కట్టుకొని.. ఇంకా సరిచెయ్యని నిద్ర ఊసుల గొంతుకి ..
బొట్టు దిద్ది వదిలిన అడివి.. ఇంకేదో మూల కాలుతూనే ఉంది..
………………
పురా జనపద వనశాల .. పొద్దున్న లేచేసరికి వాడిపక్క ముసలావిడ. నువ్వే కళ్ళలో క్షణం
వదలకుండా పాడుతున్నావ్. ఆయాస పడుతున్నావ్ … ఉండబట్టలేక .. వచ్చేసానురా.. అని..
పరస్పర విశ్వ సందోలా కమ్మిన నిగారింపు సమాధి చేసిన ఆయుర్వేద మొక్కల మధ్య
ఆయుస్సు ని కరిగించి తీసుకొన్న చీకటి నిఘారా చిత్ర భ్రమణకి ఒడిని పట్టుకొని…
పోసుకున్న నిద్ర నడతల ఊపుని కనిపెట్టి.. ఒద్దిక లేని కథకి రెండో ఇంటిని కప్పిన పెద్ద
మలుపుల అరుపుని మర్చి.. అంపక రుణాల పెద్ద గడువుని సాగదీసి .. గొడుగుల కింద..
రెండోసారి వెనక పడి ముందుకి తోసిన పాటలో .. వద్దని పారబోసుకొన్న గొంతులు మధ్యలో
పునాది వాసన కమ్మిన చిత్ర దీపాల పంటని సాగు చేసి వెన్నులో పండిన చెమ్మాతో పాట..
దుఃఖ శిధిలాల మధ్య కూలిన సంతర్ప శ్వాస .. ఆమ్లాల తర్ప మాసికాల బొమ్మని మోసుకొని
ద్వనికూలనాలు లేని పెద్ద నిడివి చీకటి మోసిన ఉత్త్సవం.. నది పెద్ద జడలని అల్లుకొంటూ..
ఆమె వాడికి ఏదో ఆకు రసాలు కలిపిన నీళ్లు తాగించి. వాడి గొంతునీ…కడుపునీ నిమిరి….
కాసేపు పడుకొని.. అప్పుడు పాడరా .. వేదిక మీద అంది..
…………………
వస్త్ర భుజం.. వేలి కణుపుల సారణ .. నిధీగ్ద
సన్నని సందేహ దీపం కరిగే చిత్ర భుజాల అండ .. తిప్పి పెట్టుకొన్న ఝాములో పోత పోసిన
కథలని కప్పుకొంటూ.. ఋణం మార్చిన హద్దులో పడి .. మాయా భద్ర కలకలం నేసిన దృష్టి
చుట్టూ .. ఒకే కన్ను పట్టుకొన్న సరాసరి నిర్మిత మూర్తుల వస్త్ర భుజం.. నిద్ర కోతలు
నివస్త్ర గండం… మోసపోని చీకటి సర్దిన అడివి కన్ను దొరికిన నగరం మధ్యలో.. గుక్క పట్టి..
దారికి తెచ్చుకొన్న దోతారల ఊపుని ఆపలేక.. తడబడుతున్న నిద్ర పోరుని పేర్చుకొన్న కుండలు
తెరిగి తెచ్చుకొన్న నడకకి మోసుకొన్న చలన మూర్తుల గ్రహణ కాపుదలని కనిపెట్టి ..
ఆలోచనలని అరగదీసి కథకి .. గది ముద్రలని తిప్పి రాల్చుకొన్న ముఖాలని ఒడిసిపట్టి..
రుణ పూర్ణ ఒత్తిడికి …దోతార కూల్చిన శరీర గోళం.. పారబోసుకొన్న ముఖాల పోలికలు…
విదిలించిన నిద్ర పోలికల వరదని కాపాడుకొని.. ఝాము నడకల కట్టడికి దొరకని
నిద్ర తోడుతో పాట .. పరీక్ష నిద్రల దేహ కోతని దాటుకొంటూ.. సిద్ధం చేసిన పుట్టుక..
పరి పరి నిద్ర యుగాల చాటున కదిలే మాయకి దర్శన చిత్రాన్ని పట్టి తెచ్చిన ద్రవ ముఖాల
ఓర్పుకి తిప్పే వేదిక … వాడు నగరం ఓ వేపుగా .. చిన్న గుడి .. చెరువు ఉన్న చోట
దోతారని పలకరిస్తున్నారు.. ఒరిపిడి లేని ఆపేక్ష చిత్రాన్ని నింపుతున్నారు ..
…………….
నీటి పాయకి .. శ్వాసితాల నిద్ర భుజం కూల్చిన గడపని పట్టుకొని.. లేవదీసిన కథలకి చేర్చిన
చుక్కానీల కూర్పులో ఓ పడవ వాడిని తీసుకు పోతున్నట్లుగా .. కలలోపల పొదిగిన పాట
దానిలో అక్క వాడి కాళ్ళకి నూనె రాసి.. తలపై తడి బట్ట ని కప్పి .. జ్వరమని.. విసనకర్రతో
వనశాలని కంగారు పెడుతుంటే .. ఆ ముసలావిడ నవ్వి .. కుదురుకున్న శ్వాసతో చల్లగా చూసి
ఇదొక యాధార్ధ ప్రార్ధన వాడికి సృష్టితో.. ఓ సంధాన క్రియ.. అనుతాప మాయమాలు ..
వాడి శరీరం తట్టుకోవడంలో కొంచెం వేడి తప్ప .. ఇంకేం కాదని.. పక్కన కూర్చొని..
కూడా తెచ్చిన కాషాయం తాగిస్తుంది.. వాడి నాడిని పట్టుకొని శ్వాసని పరీక్షిస్తోంది..
వాడి పలరిస్తున్న వేలి కణుపుల సారణని గమనిస్తూ .. తడిచిన కొంగుతో చెమట తుడిచి
వాడి చెవిలో ఏదో కూని రాగం వినిపిస్తోంది.. అది మహా విశ్వంలో కూరిన కాళ్ళ పోత..
వాడు చెరువులోకి దిగిపోయి చాలాసేపు ఉండిపోయాడు.. కలలని పట్టుకొన్న వాడిలా….
కథకి వినపడని నిశిత ముంపుల కక్ష్యని చేరి.. జత చేసిన మాటలని జోడించుకొని…
లోపలి తెర్చుకొన్న దీర్ఘ గదుల మధ్య తన ఊరు కుమ్మరించిన అడివి తడుస్తూ..
కనిపించగానే మళ్ళీ దోతర తన మధ్యంతర వార్పులని లోపలికి దిగి అందుకొని..
శుబ్ర చిత్రాల మత్తుని దులుపుకొని… శరీరం నేసిన కథతో… యాత్రకి సిద్ధమౌతోంది.
…………..
తప్త శ్రమల నిధీగ్ద ని మోసుకొన్న కదలికనే తిప్పి కొంటూ .. శరీర చిత్రాలు కరిగిన హద్దుని
కప్పుకొని.. ఝాము మోసిన కథకి .. ఏడూ తలుపుల ఆవల కురిసిన మాయా కక్ష్యలు ఊడిపోయి
దుఃఖపు మండలంలో పోసి రాల్చిన చీకటి గుర్రుని కదిపి.. శ్వాస ముట్టడిని సుళ్ళు తిప్పి
అదే చెప్పుకొంటారు.. ఇంకా ఊసులాడుకోని విపరీతాల మధ్య కూలబడిన చర్యల ముట్టడి
రాల్పుని రుద్దుకొంటూ.. ఏదో జరగబోతుంది. మరేదో వినడానికి దగ్గరైంది ..
అది ఇదే అనడానికి లేని ఖాళీల మధ్య కూరుకుపోయిన కంటితో .. చూడాలని చెప్పి
పెనవేసుకున్న కథలని కట్టడి చేస్తూ.. దుఃఖ నిర్మాణ కూర్పులని తోడు తెచ్చుకొన్నారు.
ఆరబెట్టినా కదలికనే మోసుకొంటూ.. తేరుకోలేని మంత్ర స్థావర కన్నెర్రని సరిచేయలేక
పట్టుబడిన కలకి .. స్థావర భూమి కంటి శిలని తెగ్గొట్టి.. అటూ ఇటూ జారవిడుచుకొని…
మంత్ర పోతలకి జత చేసిన కళ్ళలో వడపోసిన సంధి చీకటి నివార దోషపు చీకటి పాడుకొంటూ..
ఇంకా తెలియని మహా నిర్యాణ పుప్పొడి మూటలని దులిపి.. అడుగులని తేలిక చేసుకొని..
వాడు పైకి ఎక్కుతున్నాడు.. కిందికి జారీ కూలిపోతున్నాడు…
……………………..
దోతార కణతలు … జలతారు మోత .. అందిన పాట
నాన్నతో అప్పుడే కాదన్నాడు.. ఇంకా సాధన ధ్వని లోపలికి చొచ్చుకొని పోతున్న చలన చీకటి
నిండు గ్రహణ తొక్కిడిలో … ఊరునే నగర తలుపుని నెట్టుకు పోతున్న మహా వివక్ష చిత్రం
మసకబారక ముందే.. నిశ్చలాల గంభీర మాయకి వెన్నులో గుచ్చిన ఝాము.. పొడి ముడులు
అదే కలిసి పోయిన కన్నుకి నేర్పిన తడబాటు.. వెన్నులో మోసుకొన్న నిద్రపోటు
వీటి మధ్యలోంచి ..వాడింకేదో పట్టుకోవాలని.. అది తనతోనే సమయ స్థితి నిద్రల పట్టుని
దులిపి .. ఒదిగిన దేహ ఝాములో పడిపోయిన కథలని పట్టుకొని.. కలకంతా నిండిపోతూ..
ప్రభావ చిత్ర ద్వారం లోపల ఖాళీగా ఉండిపోయిన పాటకి గొళ్ళెం పెట్టిన దోతారాల వంతెన
చుట్టూ.. కదిలే కొండలని తాపడం చేస్తూ .. ఉన్నప్పటి మెట్లకి జోడించిన కథలని దాచుకొంటూ ..
శరీర లయని తూగించే కదలిక బయట మోసుకొన్న అడివి.. నిడివి లేని దేహ చమురు ..
కనిపెట్టి..కనిపెట్టని .. బరువు కదిలిన నడకలతో.. పికిలిన సంధి దీర్ఘపు.. పోతలతో రుణ
దేహపు కొలనులో తడిచిన దీవి.. ఏటిగట్టున పాతబడ్డ సైకిల్ … అదే పాట..
దోతార కణతలు సర్దుబాట్లు లేని రోజూ.. తడబాటుకు మోసి తెచ్చిన భావి..
……………
ఒప్పుకొన్న కమిట్మెంట్స్ ఐపోయాక తానే ఆ ఊరు వస్తానన్నాడు..మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ
వనశాలలోనే కొన్ని రోజులు నీతో ఉండి నేర్చుకొంటా.. ఊరుని నింపుకొంటా…
నానుంచి నీకేదైనా దొరికితే అంతకంటే మరో ఆనందమే లేదు అన్నాడు..
వాడు.. అక్కా..భావా .. నాన్న .. దోతారలతో .. రైలు లోనే వెళ్లదామన్నాడు..
ఆ కాంపిటీషన్ లో ఉన్న అందరూ వెనకా ముందూ లెక్కలు మరిచి వాడి వీడ్కోలుకి వచ్చారు..
నగరంలో .. ఊపిరి మోయతగ్గ చలన మొత్తాలని కనుక్కొని .. మాసిన కళ్ళ వెనక ఊదుకొన్న
చీకటి దుప్పటిని దులిపి.. కళ్ళలో పాతుకొన్న నీటి ముద్దల వెన్నుని పట్టుకొని చిదిమి ..
నిషిద్ధ ముఖాలు .. ఆవరించిన కదలికలు.. అమాంతం కప్పిన ఒద్దికల నొప్పిని కంటూ..
దేహ నిర్జన కూపాల్లో పడి వేన్ను తిరిగి నడిచిన చలన చీలికలు.. మార్చి వెళ్లిన
పాద దీపాలు కొలిమిని కట్టుకొని.. పోగుపడిన దుఃఖ విరమిత ఛాయలకి కలిసి..
అవలీల చంచల నిమ్రమయంలో పడి.. తోసుకు వస్తున్నా గర్భ నీరుని కెరటాలకి చేర్చి పెట్టి.
చేర్చుకొన్న కథలో గుమ్మాలని సగం చూసుకొని పైకి కూలిపోతూ.. మళ్ళీ సర్దుకొని
ఉక్కపోసిన చీకటి వీధుల్లో . గడ్డకట్టిన రుణాల ఛాయా కొలిమి తిప్పుకొన్న పునాదులు.
……………
ధ్వని అపనయన గండం చలన కీల మోసిన కథకి .. రెండో నిద్ర గడిచిన మాటలని తాగి..
ఉండిపోయిన ముఖాల బయట మంచు దీవిని పట్టి లాగిన పడవలతో… ఏటిగట్టుకి ముడేసి
పెట్టిన కొండల మధ్య దోతారల దోసిలి పట్టిన వానగుట్టుని వడపోసి .. బయటా .. లోపలా
తెలియని వణుకు బుట్టలో కందిన దుఃఖ పడక కలబెట్టి.. అప్పగించిన నిస్త్రాణ మగ్గింపుని
తోడిపోసుకొని.. రుణ దీప మళ్ళింతలని కట్టుకొన్న నిద్ర వాగుల్లో నల్ల రంగు ఎండ
గాలి కొసలు పండిన మత్తుని కాపాడుకొంటూ.. లలామయ దీప చిత్రాల జరుగుబాటు
పిండేసిన దుఃఖపు చర్యలని లాక్కొని దగ్గరైన ఆపేక్ష తుంపర మోసిన గండాలు..
వద్దని అనలేం.. ఔననీ ఉండలేం.. సంభాషణ పాటల చుట్టూ.. కదిలే నిద్ర చొరబాట్లని
తవ్వుకొంటూ.. మరెక్కడా పక్క దారులకీ పోలేని సర్దుబాటుతో .. దిద్ది పెట్టిన కథలు
తడిచిన నిద్ర కన్నుకి అమర్చిన కళ్ళతో.. ఒరిగిపోయిన చిత్ర వరదల సాధన పోతలు
హద్దుని మీటిన కకావికలపు దృశ్య గతికి మోసి తెచ్చిన కలలు .. నిండారా దులుపుకొని…
సమాధికి మోసిన అడివి కథలని .. నేరుగా తెచ్చి పోసుకున్న కొండల ఊసులని …
సాగదీసి పెట్టుకొన్న కట్టుడు మాటలని చేరదీసుకొంటూ.. నింపాదిగా ఓడిపోయిన మరకలని
తుడిచి.. చింపే పెట్టుకొన్న దృశ్య చిత్రాలు.. కదిలిక లేని గ్రహణ లోయలు …
అన్నీ కలిసి.. విడివడి.. మాయ చేసిన కథలకి చూపుని గుప్పిన కలలు.
…………………………… 16.07.2026
