
Yamakhastam
EPISODE 1
ప్రయోక్త ; విహ్వల దేహ తంత్రీ అరుపుని బిగించినప్పుడు గుడి భూమి లోంచి బలంగా లేస్తుంది.. అది ఒక కథని మధ్యలోనే నరికి తన పునరుత్త్సనా వేడుకని కడిగి పైకి జరిగి.. దీపాన్ని మరగబెట్టి కలలో తిరుగుతుంది.. విశ్వం ఆరబోసిన ముఖాలన్ని తోడుతూ .. కొంచెం గడ్డకట్టిన గొంతులతో పొడుగ్గా ఉండిపోయిన పొరబాట్లని కలిపి .. అక్కడే నిద్ర తోడుల భయం కంపిస్తూ అక్కడే సర్వాన్ని వదిలి లోపలి తీరులని సర్దే గొంతుతో తనని పిలవమని అడుగుతుంది..
ఇదొక స్థల పురాణం .
సత్య వచన దీర్ఘ గమన విపులతల నిండుతనంతో పండే పాపాల సమ్మెట.. ఇది కొంచెం ఇక్కడే ఉండిపోయిన నరక ద్వారంలోని మసకల బాట.. ఓ రాక్షస సంతర్పణ..
…………………..
కొందరు పెద్ద మనుషులు (దొంగల్లో)..దుఃఖ చంద్రుడు ఆనవాళ్ళని మోసుకొని.. నెమ్మిదిగా ఆ గుడిని చేరారు.. వాళ్లలో వాళ్ళు తగువు పడుతున్నారు.. తాగేసి తూలు తున్నారు .. ఉమ్ములు ఊసి .. ఉచ్చలు పోసి .. కంగాళీగా తగవులు.. బూతులతో…. అర్ధనగ్న శరీరాలతో… చిందులేస్తూ…
అవును ఇదే ఈ గ్రామాన్ని నిలబెట్టే ఆదరువు.. మనం ఇదే పడగొట్టామా .. ఒక దేవీ భయం పుట్టించామా .. అంతే సగం ఊరు ఆత్మ హత్యకి సిద్ధమౌతోంది . మనం ముందు భయపెట్టాల్సింది ఈ గుడి పూజారిని…..
అలాంటి పాప భయాలని సృష్టించి.. నమ్మించి.. బలి తీసుకొంటుందని ఊరంతా అరిచి.. గోల చేసి.. గుమ్మాల ముందు తెల్లారే సరికి.. కొంచెం రక్తం కలిపిన అన్నం .. నిమ్మకాయలు.. పగిలిన గుమ్మడి ముక్కలు.. గొర్రె తలలు.. అంతే సంగతులు.. ఊరంతా భయం గుప్పెటలో ఊగిపోతోంది.. పూజారి ఇంటి ముందు అవే…
అందులో ఒకడు నేను బాబాగా మారి అదే వాటికి కథనాల్ని అల్లి ప్రచారం చేసి.. కొంతమందిని బలికి సిద్దం చేస్తాను.. ఆనాధలు.. బికారీలు.. అనారోగ్య వంతులు.. పిరికివాళ్ళు.. పిచ్చివాళ్ళని వెదికి మనమే చంపి.. ఆత్మహత్యగా మారుస్తూ ఉంటాం.. దీనిలో మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని లేదు.. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఆలోచించడం మానేస్తారు.
మిగిలిన కొంతమంది.. తన కుటుంబాలని కాపాడుకోవడానికి ఊరు వదిలి వెళ్ళిపోతారు.. లేదా మనమింకా భయాన్ని సృష్టించి తరిమేస్తాం.. సగం ఆ భయం తోనే చచ్చిపోవాలి,,,
అప్పుడిక ఊరే మనది.. ఎవడైన దైర్యం చేసి అడ్డొచ్చిన .. పొద్దున్నకి వాడు మిగలదు.. రాజ సైనికులైన సరే .. లోపలికొస్తే బయటకి పోరు.. జరిగింది చెప్పడానికి కూడా ఎవడూ మిగలడు…
ఎక్కడిక్కడ కంచెలు కట్టి.. తవ్వకాలు మొదలు పెట్టి ఆ బంగారు గనిని మన సొంతం చేసుకొంటాము.. పొలాల పంటలన్నీ మనమే అనుభవిస్తుంటాం. అంతా మనదే…
వాళ్ళు ఆగుడి దగ్గర మాట్లాడుకుని.. ఆ ఊరిలో పెద్ద జమీందారుల దగ్గర వేరు వేరు ఇళ్లలో పనికి కుదిరిపోయారు.. వచ్చే పౌర్ణమికి కలవాలని ముందే అనుకొన్నారు. అలాగే కలిసి.. మందు తాగి.. తిని.. గుడిలోకి అడుగు పెట్టారు.. జాగ్రత్తగా గుడి తలుపులు పగలగొట్టి.. గర్భ గుడిని తెరిచారు.. అక్కడున్న అలంకాలంకారాలన్నీ చెల్లా చెదురు చేసి ..దేవీ విగ్రహపు ఓ చేతిలోని కత్తి ని తీసుకొని వెళ్లిపోయారు.. ఆ మర్నాడు ఆ చర్య కలకలం రేపింది.. ఊరి జనమంతా అక్కడ పోగై రకరకాల ఆలోచనలు చేస్తున్నారు.. పూజారి ఇంటికి వెళ్లి చూస్తే అతని ఒళ్ళు కాలిపోతుంది జ్వరంతో.. అతని ఇంటి ముందు.. నిమ్మకాయలు.. బలి అన్నం .. గొర్రె తలలు.. ఎర్రగా పగిలిన గుమ్మడి కాయలు….
ఒకడు మంత్రగాడిగా మారి.. గుడి ముందు పూనకంతో పడిపోయి.. మళ్ళీ లేచి.. పెద్ద గొంతుతో.. త్వరలోనే .. ఈ ఊరు వల్లకాడుగా మారిపోతుంది.. అందరూ ఖాళీ చేసి వెళ్లిపోండని.. అరిచి ఏటో పరుగున ఎవరో తరుముతున్నట్లు వెళ్ళిపోయాడు.. అతని నటన వాళ్ళ లోపల పెద్ద పెద్ద డప్పులు మోగించింది….
ఆ రాత్రి పని ముగించుకొని అడివి దారిని వస్తున్నా వ్యాపారి.. గేదలు కాసుకొని వాడు.. ఆ గుడి పూజారి.. ఆ గుడికి ముహుర్తాలు పెట్టిన పురోహితుడు చచ్చి పడి ఉన్నారు. అలా రోజూ .. నాట్యం నేర్చుకొంటున్న గురు కులంలో .. దళితుల వాడాలో.. సారాయి అంగడి దగ్గర కొందరు.. పొలం లో రైతులు.. రోజుకి రమారమి.. ఐదుగురు చొప్పున చనిపోతూ ఉన్నారు. ఎవరూ ఊహించని చావులు.. ఏ పాపం ఎరుగని అమాయకులు..
స్పృహలేని స్థితిలో పడి ఉన్న ఆ మంత్రగాడిని గుర్తు పట్టి.. అతనికేం తెలుసో చెప్పమన్నారు.. అతనికి కడుపు నిండా తిండి పెట్టి.. కానుకలు ఇచ్చారు. ధూపాలు వేశారు.. స్నానాలు చేయించారు….
మళ్ళీ అదే పాట.. మరో ఉపాయం లేదు.. పిల్ల పాపలతో బతకాలనుకొంటే వెంటనే ఊరు వదిలి వెళ్లిపోండి.. త్వరలోనే అమ్మవారు విగ్రహం తల తెగిపోతుంది.. ఆ తర్వాత అరిష్టాన్నిఊహించలేరు .. అన్నాడు.. ఊరంతా సమావేశమై .. రాజుని కలిసి సమస్యని చెప్పాలనుకొన్నారు..
గుర్రాలు.. పల్లకీలపై వెళ్లారు.. రాజు అప్పటికే వేగుల ద్వారా విని ఉన్నాడు.. వాళ్ళకి భరోసా ఇచ్చి .. గుడికి కాపలా నియమించాడు.. ఎవరో శాంతి హోమాలు చేయాలన్నారు. ఏమీ అర్ధం కాకుండానూ ఉంది..
రెండు రోజులు అక్కడే విశ్రాంతి తీసుకొని వాళ్ళు ఇంటికి వచ్చేసరికి .. వాళ్ల కొడుకులు.. పనివాళ్ళు చచ్చి పడి ఉన్నారు.. వాళ్ల నోళ్ళలోంచి రక్తం.. వాళ్ల వ్యాపారాలు దొంగిలించబడ్డాయి.. కొన్ని పొలాలు మంటల్లో కాలిపోయాయి.. కొంతమంది ఆడపిల్ల శవాలు బావిలో తేలాయి.. ఊరంతా వణికి పోయింది.. రాజు వల్ల నిజంగా తమ సమస్య పరిష్కారం అవుతుందా ? అని వాళ్ళందిరిలో ఓ తెలియని అనుమానం.
భటులు గుడిని చేరారు.. వాళ్ళకి అన్నీ సౌఖర్యాలని సమకూర్చిడానికి .. వాళ్ల ఇళ్లలోంచి వీళ్ళనే పంపారు.. ఇరవై మందిలోనూ .. తలలు తెగి పదిమంది పడి ఉన్నారు.. అక్కడంతా పసుపూ.. కుంకుమ.. కొన్ని పగులగొట్టిన గుమ్మడి కాయలు.. మిగతా సైనికులు భయపడి .. ఆ రాత్రికి ఎవరూ బయటకు రాలేదు.. సత్రం లోనే ఉన్నారు.. ఐనా ఉదయానికి మరో ఇద్దరు బలి .. ఒక ఇద్దరు అన్నీ వదిలి పారిపోయారు..
కానీ ఉదయమయ్యేసరికి .. గుడి గోపురం కూలి.. విగ్రహం పెద్దగా పెరిగి ఉంది.. చాలా భయంకరంగా .. నిజానికి సైనికులకు .. మత్తు సారాయి పట్టించి.. ఆ దొంగలు గర్భ గుడిలోకి వెళ్లి విగ్రహం తల తెగ్గొట్టే లోపు.. ఆ విగ్రహం పదింతలు పెరిగింది.. వాళ్లంతా భయంతో పరుగులు పెట్టారు.
ఆ దొంగలకీ అర్ధం కాలేదు.. ఏం జరుగుతుందో.. ఇది వాళ్ళు ఊహించిన దానికి పూర్తి విరుద్దంగా ఉంది. కానీ వాళ్ళు చేయాలనుకొనే దానికి వ్యతిరేకమూ కాదు.
ఊరు .. ఇక రాజు వలన ఏం కాదని నమ్మి.. ఊరు వదిలి వెళ్లిపోయారు.. దొంగలకు అదే కావాలి.. దాని వలన వాళ్ళకేమైనా ప్రమాదం వస్తుందాని చూసారు.. అలాంటిదేమీ జరగక పోయేసరికి .. వాళ్ళు వాళ్ళ పనిలో .. గనుల తవ్వకంలో పడ్డారు.. ఒక్క పురుగుని కూడా లోపలి అడుగు పెట్టకుండా ఏర్పాట్లు చేసుకొన్నారు.. తవ్వుతూనే ఉన్నారు.. వస్తూనే ఉంది..
ఏ అమ్మవారూ వాళ్ళకి ఏ నష్టమూ కలిగించలేక పోయింది.. ఆ గుడి అలానే .. పగిలిన గోపురంతోనే ఉండిపోయింది.. గుడి పాడుబడుతూనే ఉంది.. జనం మాత్రం అప్పుడపుడు .. అమ్మవారు ఏదో చెయ్యాలను కొంది.. కానీ ప్రజలే లేకపోయేసరికి ఆమె దానిని పట్టించోకో లేదని గుస గుస లాడుకొన్నారు.
ఊరు నిర్మానుష్యం అయిపోయింది..భయమే రాజ్యం చేసింది.. ఆశ్రిత భయ ఖండం.. మృత్యువులా దేహ రాజ్యం.. ఉనికి పెకిలించి తరిమేసిన నిరా స్మశాన వేదిక.. చావు పండిన ఆకలి మధ్య ఎదిగి ఆగిపోయిన దేవుడు.. ఏది ఎలా ఉండాలో తెలియక తికమక పడే ఊరు కథ …
రాజు కి అందిన కబురు ప్రకారం .. తను చూసిన సాక్ష్యాల తర్వాత .. దానిని పట్టించుకోక పోవడమే క్షేమమని .. ఆ ఊరినే వదిలేసాడు. అది మొత్తం రాజ్య క్షేమాన్ని పాడు చేస్తుందని వేగుల ద్వారా నమ్మి వదిలిపెట్టేసాడు.
వాళ్ళు కొద్ది ఏళ్లలోనే .. నిధులతో ఊహించలేనంత …ధనవంతులై పోయారు.
ఆ తర్వాత ఓ వంద మంది బ్రాహ్మణ పండితులు.. ఆర్ధికంగా చిదిగి పోయిన వారు ఆ ఊరిలో అడుగు పెట్టారు.. ఎక్కడైనా పోవాల్సిందే అదేదో ఇక్కడే చచ్చి పోదామని వచ్చినవారు.. ఊహించలేనంత బతకడంలో చిదిగి పోయి దాదాపుగా .. చావు కన్నా హీనమైన స్థితి దిగజారి.. ప్రాణం విలువని పూర్తిగా వదిలి పెట్టేసిన వారు.
కానీ దొంగలు .. వాళ్ళ వలన ఏ ప్రమాదం లేదని భావించి మొదట్లో ఆదరించిన .. తర్వాత రోజుల్లో వాళ్ళు.. గుడిని బాగు చేసి..గోపురం కట్టించి..పూజలు మొదలు పెట్టాక.. వాళ్లకి కొన్ని దైవ ప్రమాదాలు జరగడం మొదలైయ్యాక .. వాళ్ళ పై దాడులకు ప్రయత్నించినా… వాళ్ళకి ఏదో దైవ శక్తి కాపుకాస్తున్నట్లుగా నమ్మారు.. అప్పటికే తవ్వకాలతో ఆ భూమినంతా గుల్ల చేశారు..
అక్కడ నుంచి అందమైన దీవిని కొనుక్కొని వెళ్లి పోదామనుకొన్న.. బ్రాహ్మణులూ ఎదుగుతూ ఉండటం నచ్చక ఓ రోజు వాళ్ళందరిని చంపి.. గుడి అమ్మవారి విగ్రహం తలలోనుంచి రక్తం కారడం చూసి .. వాళ్ళకి ఓ రకమైన భయం కలిగి… ఇక క్షేమం కాదు.. వాళ్లకి ఆ అవసరమూ లేదు..
అప్పటికే వయసు పెరగడం తో .. ఆ ఊరినే వదిలి దీవులకు వెళ్లిపోయారు..
ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకి కూడా ఎవరూ ఉండడానికి సాహసం చెయ్యక పోయిన .,. ఆ చరిత్రని తలచుకొంటూ.. చూడడానికి వచ్చీ వచ్చి.. ఓ సందర్సక స్థలంగా మారిపోయింది. ఆ గుడి విగ్రహం .. దానంతట అదే ఒక్క రాత్రిలో పెరిగిందనే కథ .. లక్షల జనాన్ని చూడడానికి ఆకర్షించేది.
కానీ తర్వాత రోజుల్లో అదొక సమూహ హత్యల చోటుగా మారిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఇది ఇలా అనుకోవడానికి కొన్ని ఏళ్ళ ముందు.. ఆ గుడి ఉత్త్సవాలని చేయాలని కొంత మంది నిరాయించుకొని .. పెద్ద ఎత్తున చేస్తూ.. అందులో భాగంగా ఓ రోజు సంగీత కార్యక్రమం పెట్టారు గాయకుడు పాడటం మొదలు పెట్టాడు. .. నెమ్మిదిగా అతని శరీరం చల్ల బడటం .. వణుకుతూ పాడుతూనే .. నెమ్మది నెమ్మదిగా .. కాళ్ళ లోంచి అతని శరీరం చల్లబడుతూ .. క్షణాల్లో ఒళ్ళంతా చల్లబడి ఆ స్టేజి మీదే చనిపోయాడు.. జనం పరుగులు తీశారు.. గుడిని ఇక అలానే వదిలేసారు.
ఊపిరిని గడ్డ కట్టించే అమాంత భయం.. విసుగు లేని ఓటమి.. ఇక చాలానే మృత్యు దేవత పదఘట్టన.. అంతే రాసి ఉంది.. మార్చనుకోవడం ఓ పిచ్చితనం…
ప్రయోక్త ;
ఆత్మ సంధి చుట్టూ శబ్దం లేని నిరాకరణ …విశ్వ రహస్యం మొదలైన కడసారి నిద్ర విందులో వడ్ఢినచ్చిన తలలు.. ఊడిపడిన ఊపిరి తిత్తులు.. పగబట్టిన గాలి.. వాన.. మట్టీ .. నీరూ.. కన్నూ .. గొంతూ .. నడకా.. నడత .. గాడిలో పడని మృత్యువు.. .. అదొక విస్మృత కంటి దీక్ష .. నిద్ర లేని చావు డప్పు .. బిగతీత .. ఉండీ లేవదీసుకొన్న కసి రేగిన సంతర్ప సందడి..
పెద్దదైన మసక వెలుతురు.. అదే గొంతులోని ఎండా.. కొండలు కూలిన మిగులు భూమి.. ఎవరు వెంటపడ్డ వెనక్కి తగ్గని శాపం.. తనేం పోగొట్టుకొందో అది లోపల దిగబడ్డ అరుపు.. కల్లోలపు తలల్లో మోగే చిత్ర తోపుల మసకలో తడి రేగిన దేహ త్రవ్వింపు.. ఇది ఇలా మాత్రమే జరగాలా? విశ్వ నిందలోకి వదిలిన ప్రశ్నలు.. సమాధాన గొంతులు వినిపించవు. దేహ ధారా అడుగంటిన మెళుకువలు బీడు భూమిలో.. అంతులేని స్మశానాలు.. పొడవైన నివాళి విసుగులు.. ఆత్మ సంధి చుట్టూ శబ్దం లేని నిరాకరణ … గాడిలో పడని మృత్యువు.. తనేం పోగొట్టుకొందో అది లోపల దిగబడ్డ అరుపు.. కల్లోలపు తలల్లో మోగే చిత్ర తోపుల మసకలో తడి రేగిన దేహ తవ్వింపు…
………………………
EPISODE -2
Stage ; Mid night
వెనక నల్ల తెర … మధ్యలో … ఎర్రగా పట్టీలు… కొన్ని లైట్స్ పై నుంచి వేలాడుతూ …ఫ్లోర్ పై నుంచి కొంచెం అప్పుడప్పుడు పొగ రావడం.. ఎక్కువ నిశ్శబ్దం… కొన్ని కొన్ని సార్లు ఓ వేదన వినిపించే బ్యాక్ గ్రౌండ్.. ప్రాణ భయంతో కూడిన అరుపులు..పరుగులు వినిపిస్తూ.
కొన్ని వేలాడుతున్న బట్టలు .. .. రక్తం చిరిగిన చోటులోంచి (బుల్లెట్బు తగిలిన చిల్లులు) .. టచ్ చేస్తే వాటిలోంచి అరుపులు… ఎర్రని కుంకుమ రాలడం.. పెళ్లి మంత్రాలు.. అంతలోనే చావు మంత్రాలు.. భగద్గీత శ్లోకం .. నవ్వులు.. ఏడుపులు… ఆయాసాలు.. వాన కురవడం.. అంతలోనే ఓ పక్క మంట…
ఒక్కసారిగా అంతా ఆగిపోవడం..
స్టేజి పైన ఓ స్ట్రెచర్ .. దానిపై ఓ పేషెంట్ … ఓ లేడీ డాక్టర్ ఆమె ఆపరేషన్ కి అంతా సిద్దమనగానే .. ఆమె కణతలు నుంచి చెమట ధార … అది చూసిన మరో డాక్టర్ …
ఇది మనం చేయగలమా? (అని అనుమానం తో అడగడం) అతను అనుమానంగా ఆమెని ..చూసి.. ఇంత expertise ఉండే మీరనే మాటా ఇది.?.
ఆమె తల అడ్డంగా ఊపి … ద్దేహం నాకెందుకో సమాధానం లేని ప్రశ్నలా కనిపిస్తుంది.. ఎనస్తేషియా ఇచ్చిన తర్వాత బెడ్ పై చూస్తున్నప్పుడు … నాకు మొర్చురీ లో శవాన్ని చూస్తున్నట్లు..ఏదో అర్ధం కానీ కంగారు… చలనాలతో సంబంధం కేవలం నేనేదో కోసి కుడుతున్నట్లు..
ఒక భయ విషాదం,.. ఎర్రని కలవరం… విశ్వ నిద్ర కలిపిన ధ్వని సంతకం.. ఆయాసము.. ఆవేశమూ పెనవేసుకున్న చిత్ర జ్వాలా …
(ఈ మాటలేవీ ఆమె నోట్లోంచి కాదు .. ఎదురుగా ఉన్న డాక్టర్ ఏకపాత్రాభినయం చేసే వాడిలా మారిపోయాడు… ఆమె పెదాలు కదులు తున్నాయి … అతని గొంతు వినిపిస్తుంది…మరో మాట లేకుండా చూస్తూ ఉంది… మళ్ళీ అతను అందుకొన్నాడు)…
పూర్తిగా కమిలి పోయాక … పాతి పెట్టిన శరీరం.. తనతోనే ఉంటానంటుంది… ఎవరూ వినలేదు.. దుప్పటిపై రక్త మరకలు… ఎంత తుడిచినా పోవడం లేదు.
అంతలోనే అన్నీ మర్చిపోయిన దానిలా ……………
ఆమె; మనం మాత్రమే చెయ్యగలం..మనం ఏ మాత్రం లేట్ చేసిన … పేషెంట్ ప్రాణానికి ప్రమాదం.. బాడీ రీడింగ్స్ అన్ని కరెక్టుగా ఉన్నాయి కాబట్టి ఫెయిల్యూర్ ఛాన్సెస్ అర్ వెరీ లెస్.. విల్ స్టార్ట్ నౌ..
(ఆపరేషన్ గురించిన Instruments , అడిషనల్ లైట్స్.. చేస్తున్న ఆక్షన్… కొంచెం టైం గడిచాకా .. ఆమె కి ఓ వాయిస్ వినిపించడం… మిగతావాళ్ళు వినడం లేదని అర్ధమౌతుంది..) సడన్ గా ఆపరేషన్ టేబుల్ పక్కాగా నాన్న … ఛాతీ దగ్గర విపరీతమైన రక్త స్రావం.. బులెట్ దిగిన కంతలు.. దానిలోంచి పంప్ అవుతున్న బ్లడ్ .. ఆమె కళ్ళు.. ముఖం పై పడి .. ఏం కనిపించడం లేదు.. అంతా blurr తో కూడిన గొంతు… ఆయన మాట ఆమెకి అర్ధం కావడం లేదు..
డాక్టర్; ఇక్కడికి ఎందుకొచ్చావ్?
నాన్న ; మోక్ష సిద్ధికి …
డాక్టర్ ; ఎవరికీ..
నాన్న; నీ పేషెంటుకి ..
డాక్టర్ ; అతను మనకేం నష్టం చేసాడు ?
నాన్న ; బతికినా ఎవడు ఎప్పుడు చంపేస్తాడో తెలియదు.. నేనైతే అనాయాస మరణాన్ని ప్రసాదిస్తా …
డాక్టర్ ; నేనీ పని జరగనివ్వను..
నాన్న; అది నీ పిచ్చి.. నీ వల్ల ఏం కాదు..
డాక్టర్; కూతురిని ఓడిపోవాలని కోరుకుంటున్నావా?
నాన్న ; కాదు.. మనందరం ఇక్కడ కలవాలనుకొంటున్న? వీలైనంత తొందరగా … అంతే..
మృత్యువుని సర్దుకోవడానికి లేని వరుస తప్పిన నిద్ర గొంతులతో .. రసి కారుతున్నా మహా విందుకు నేలంతా నాకుతూ.. పొద్దు కుదించిన దేహ సర్దుబాటుల నిద్రని ఉడకబెట్టి ..గమించే సాధన లేని ఒంటి బిగువులు లాగదీసుకొంటూ….. కొంచం నిస్సాహసం దుఃఖాన్ని ఒంపుకుంది.. .కనబడకుండా వినపడే నిద్ర సాయుజ్యాల దేహ కోతని వదుల్చుకొని… ఇంకా ఏదో కావాలనే దగ్ద భోగంలో పడి ఒళ్ళు మర్చి తిరిగే నడకలు కూలిపోతూ….ఇది ఇలానే జరగాల్సి ఉన్నప్పుడు నేను మరోలా నీలోకి చూసుకోలేను…
నువ్వు కొంచెం విని వెళ్ళిపో … నువ్వా ? అవి ఎలాగో నేను ఎరేస్ చేసుకుని ,బతుకుదామంటే..మాటికీ ఆ పేజీలో లైన్స్ ని అండర్లైన్ చెయ్యడానికి ఎందుకొస్తావ్?
తల్లి; ఏదో తెలియడం లేదు.. ఒక శూన్యం లోకి ఎక్కడో ఇర్రుక్కుపోయి.. … మాట కట్టిన అలసటని విడిచి పెట్టి దుఃఖం సగం తీర్చుకున్న విసుగుతో … వివర్ణ సంకెలలు పోతపోసుకున్న దేహ రొప్పు కంగారు పడుతుంది…ఇంకేమి సందు దొరకని నిద్ర విందుకి పల్లాలు పట్టుకు తిరిగాం… ఎవరూ వడ్డించలేదు…ఆయన తన తలని నా పళ్లెంలో ఉంచేసి పోయాడు.
ఒక నర్స్ రూమ్ నుంచి బయటకి ఆమె scissor అడుగుతుంటే ఇవ్వకుండా… ఆమె అడుగుతూ నర్స్ వెనక నడుచుకొంటూ… రూమ్ బయటకి వెళ్లి ముందుకు తిరగగానే … నర్స్ .. డాక్టర్ చనిపోయిన తల్లిలా మారడం..
తల్లి; (ఆమె గొంతు… భర్త మగ గొంతు రెండూ కలిసిపోతూ)
రక్త మాయ .. ధ్వని పతనం … ఆశ్రిత గగుర్పు.. చాతి లోంచి బులెట్ తీసి… నాన్నది.. క్షమించలేను.. అప్పుడు ఒంటి మీద ఉన్నదీ.. నాన్న ప్రియురాలు కొన్న షర్ట్.. పాపపు దీవెన ఏదో తగిలేసింది.. నా ఉసురు.. ఇప్పుడు వెనక్కి ఎలా తీసుకోను.. ఎటైనా తిరగనియ్యి.. తర్వాత అంతా నాతోనే అన్నది సరిపోలేదు.. గొంతులో గట్టి అన్నం ముద్ద.. ముల్లుతో కలిసి ఇరుక్కున్నట్లు.. అల్లాడి పోయాను.
(కొంచెం ఆగి ఏటో చూస్తూ… వేదికపై మళ్ళీ ఫోకస్ లైట్ బట్టల నుంచి రక్తం కారుతున్న వేపు..)
ఎందుకు పగలు.. రాత్రి అలా కష్టపడటం … మీ నాన్న కూడా అంతే.. ఏమయ్యింది.. (ఆమె తన పొడుగు అంగీ లోపల చెయ్యి పెట్టి ఓ సీసాని తీస్తుంది.. అందులో ఏదో నల్లని నీరు… కొంచెం ఆగి ఏటో చూస్తూ… వేదికపై మళ్ళీ ఫోకస్ లైట్ బట్టల నుంచి రక్తం కారుతున్న వేపు.. కూడా చూసి ఆ బాటిల్ కి ముద్దు పెట్టింది … నీరు తెల్లగా మారింది… దాని నిండా బుల్లెట్స్.. తల్లి రెండు కణతల లోనూ … నుదిటి మధ్యలో … ) ఒక్క మాట లేదు .. చూపు లేదు… అంతా క్షణాల్లో … నిన్ను ఒక సర్జన్ గా నిండుగా కనీసం చూసుకోలేదు… ఆయ్నన్నట్లు .. మరో వారం ఆగి… వెళ్లుంటే.. ఇదంతా నా వల్లే…
డాక్టర్;
ఇదంతా .. ఎన్నిసార్లు నచ్చ జెప్పినా … అయినా నీ మీదకి తీసుకున్నావ్… పిల్స్ మింగావ్ … చనిపోయావ్..గా. ( ఈ మాట ఆమె అంటున్నప్పుడే.. తల్లి ఎదురుగా చిన్న గురక పెడుతూ నిద్ర..కలలో ఒక్కసారిగా బులెట్ శబ్దాలు విని ఉలిక్కిపడి లేస్తుంది.. ) ఇంకా దేనికి నీ ఆందోళన … నేనిలా ఉన్నందుకు ఏదో ఒకటి చెయ్యాలిగా.. మాటి మాటికీ … ఇలా పని మధ్యలో వచ్చేస్తే … నేనేం చెయ్యాలి…
తల్లి; ఆమె రెండు కణతల నించి.. నుదిటి మధ్య లోంచి రక్తం…..
నువ్వన్నది నిజమే … ఇందులోంచి … ఈ మూడు బుల్లెట్స్ తీసుకో…ఆయన సీక్రెట్ setupకి ఇవ్వు … అదీ మోయనియ్యి ఈ బరువు.. (నిద్ర గుర్రు.. బులెట్ చప్పుడుల మధ్య ఆమె ఏదో మంత్రాలు చదువుతుంది.. ఆమె కుడి చేతిని గాలిలో తిప్పి .. గుప్పెట తెరుస్తుంది.. బూడిద ..ఆమె చేతిలో పోసి.. ఆమె ఆశ్చర్యంగా చూస్తుంటే )
మీ నాన్న చితా భస్మం.. ఎప్పుడూ నీతో ఉంచుకో… (ఆమె తీసుకొని.. తన మెడికో జాకెట్ పోకెట్లో వేసుకొంటుంది.. . ఆమె రెండు అరచేతులని రుద్దుకొంటుంది…ముఖం లో ఆందోళన.. ఆమె చేతులలోంచి రక్తం కారుతుంది… అక్కడ కింద పడున్న శిలాఫలకం పై పడి .. దాని పై వ్యాక్యాలు స్పస్టనగా కనిపిస్తాయి…)
ఆమె చేతిలో సడన్ గా ఓ దీపం వెలుగుతూ… దానిలోనుంచి రక్తం కారుతుంది… ఆ తల్లి దానిని తీసుకొని డాక్టర్ నుదిటిపై కొట్టి వికృతంగా నవ్వుతుంది. కూతురు థన్ దేహం నిప్పుల్లో కాలుతున్నట్లు అల్లాడి పోతుంది . ఐనా తల్లి వేపు ఏకాగ్రతతో చూస్తూ ఉంటుంది.
తల్లి పెద్ద గొంతుతో చదువుతుంది…
మూల మలుపులో .. గాజు జగ్గుతో .. మనిద్దరం మోసిన ఆందోళనలు తాగి .. నిండు ప్రసవం జరిగి .. వర్షం కురుస్తుంది… అదెలా ఎందుకు జరగలేదు… ఇలా మాత్రమే ఎందుకు జరిగింది…
పెద్ద గజ్జెల వర్ష రధం ఊరేగే ఊరిలోనే నా సమాధి కట్టుకున్నాను.. ఇది మరెవరికీ చెప్పలేదు కూడా
నాకేం కావాలో అది నాలో మిగిలే లేదు.. నేను నీలా శిధిల గతాన్ని కాపలా పెట్టుకొనే మృత్యు రాతని కాదు..
నేను నీలా ఛిద్ర మూర్తిని కౌగలించుకుని ఏడ్చే ఏడుపుగొట్టు మనిషినే..
అదే మారిపోతుంది… తనింకా ఆ పెట్టె లోంచి ఊడిపడలేదు.. బుల్లెట్లని అన్నం ముద్దలో కలిపి ఇంకా మింగించలేదు…
జమాఖర్చుల లెక్క తేలలేదు.. ఎడ్యుకేషన్.. ఇల్లు.. కారు … అన్ని EMI లు అలాగే ఉన్నాయి..
తాను నాతో లేనప్పుడు నా పై కురిసిన వర్షంలా తను… ఇస్తూనే ఉంది…
ఆత్మ నిందకై తడిచిన యజ్ఞపు కట్టెలు కాలక కళ్ళు మండినా ఊదుతూ ….
నా భార్య శాపాలని తీసుకోమని చీకటి పగుళ్లలో నివాళి మునకలు వేలాడుతున్న దుఃఖ శూల దిగబడ్డ నినాదాలతో వాళ్ళు తిట్టుకొంటారు. ఎవరూ దగ్గరకి రారు…
ఆ శిలువ ని మోయలేము.. ఆ పిడుగుని మింగనూ లేము.. అని అరుస్తున్నారు. మళ్ళీ తుపాకీ పేలింది…
కూతురు కోపంగా తల్లిని చూసి ..
డాక్టర్ ; నువ్వంతా ఉన్నదీ … లేనిదీ కలిపి చదువుతున్నావ్.. ఆమె నాకు తెల్సు.. ఓ గాజు బొమ్మ.. నడుం నుంచి కిందికి paralyze అయ్యే … నాన్న కళ్ళలో బతికింది.. ఆత్మ కణమై రోజూ నాన్న వ్యాక్యాల్లో ఆ కాసేపు పుట్టినట్లుగా వింటూ .. మర్నాటి కోసం మళ్ళీ చనిపోయేది.. నాన్న ఆమె ఒక్క రూపాయీని కూడా నా చదువుకి వాడ లేదు.. అలా నటించారంతే … ఆయనకే తెలియని ఓ కక్షని నీ పై తీర్చుకోవడానికి…
ఆమె వైద్యానికే …వాళ్ళు కుటుంబం నడుపుతూ వచ్చిన చారిటీ ట్రుస్టులకే ఆ మనీ ఇచ్చేసేవారు..
(తల్లి శరీరం అంతా ఎర్రగా మారి ఆమె కణతలు.. నుదిటి నుంచి రాలే రక్తం నల్లగా మారుతుంది… ఓ వెలుగు ఆమె పైకి పిడుగులా రాలుతుంది.. ఆమె మాయం అవుతుంది.. )
నర్స్ లోపలికి పిలుస్తుంది…
ఆమె ఆందోళనగా మానిటర్ చూస్తుంటే.. నర్స్ ఆమె చెవిలో మృత్యు మంత్రం చదువుతుంది..
Aum .. Trayambakam yajamahe
Sugandhim Pustivardhanam
Urvarukamiva bandhanan
Mrityor Mukshiya maamritat
ఆమె వాష్ రూమ్ లోకి వెళ్లి అద్దం ముందు నిలబడి.. బుల్లెట్స్ శబ్దం..అమ్మ గుర్రు శబ్దం వింటూ.. కళ్ళలోంచి ఎర్ర నీరు…
తనలో తనే మాట్లాడుకొంటూ … అద్దంలో చూసుకొంటూ …
ఏదీ ముగిసి పోలేదు.. కానెవరో అక్కడ దూరంగా పెద్ద చెట్లు నరికి చేసిన తలుపులని బిగించి .
అడివి చుట్టూ గోడకట్టి.. ఆ ముందే కాలుతున్నారు.. లోపలి పిలుస్తున్నారు..
లోపల అడివిలో .. కొత్త ఆవకాయతో అన్నం కలిపి మీ నాన్న నీకు ముద్దలు తినిపించడానికి ఎదురు చొస్స్తున్నాడు..
మీ అమ్మ చాలా రోజుల తర్వాత .. వీణ పై దుమ్ము పట్టిన బట్టని తీసి .. శృతి సరి చేసుకొంటూ … మొదలు పెట్టె పాట కోసం ఎదురు చేస్తుంది… అది మృత్యువైతేనే సరైందని నాన్న .. కాదని అమ్మ ఇద్దరూ గొడవ పడుతున్నారు.
పైకి రండి.. ఈ గట్టుని తెగ్గోసి కొంగుని కాల్చి .. ఆ శంఖాన్ని బోర్లించండి.. దాని నిండా బుల్లెట్లే..
(ఆమె గుక్క పెట్టి ఏడుస్తూ…)
నాన్నా…… నా ఇంట్లో చితి ఎప్పుడూ ఆరనీయ లేదు.. ఇప్పటికీ నా దేహం కాలుతూనే ఉంది.. అదొక నరకం.. ఈ చేతులు సృష్టించే మాయ ఎప్పుడో ఎండిపోయింది.. నీ .. నా .. అనే ఉత్కర్ష ఏడుస్తున్న చంచలన నిస్సుత్తుని తాగి నేను దూరం జరిగినప్పుడు … చెప్పకుండానే విపత్తులు జరిగిపోతాయి. ఎలాగూ దేనికీ అలవాటు కాలేదు.. శరీరం ఇలా ప్రయోగ శాలలోనే మిగిలిపోలేదు.. మృత్యు సంతర్పణ మొదలైంది… నీ నుదిటిపై ఏవో తీర్ధ రేఖల్ని చదివి … ఆ తర్వాతనే వడ్డిస్తారు … నీకు కావాల్సిన వారెవరు ఇక నీకు కనిపించరు..అంతా ఓడిపోతున్నట్లుగా తెల్లారి పోతుంది. కొంచెం అలిసిపోయానని .. రెప్పని తడుపుకొని.. కాస్త నిద్రని నాలోకి నింపుకొనే లోపు … వాళ్ళు పగబట్టినట్లుగా .. నాన్నని పక్కకైనా లాక్కుండానే .. ఇంకా నా భుజం దగ్గరే నా చెయ్యి ఉన్నప్పుడే..పళ్ళు కొరుకుతూ .. బుల్లెట్స్ దించేసారు … ఇంకో సారి కంగారు పడడానికి … ఇది ఇలాగే జరిగిందా అనడానికి సాక్షంగా ఇంకెన్నో ఆ పక్కనే రక్తపు మడుగు … బుడగులుగా తేలుతూ… యముడు అరుస్తున్నాడు.. తన కాష్టాన్ని సిద్ధం చేస్తున్నాడు.. మసకగా కనిపించేలోపే … చూపు నల్లబారిపోయింది.. వేల టన్నుల ఇసుక కళ్ళలో… చెవుల్లో.. గొంతులో… శ్వాసలో కూరుకుపోయినట్లు.. అంతా గొంతు పిసికిన నిరామయం..
ఆ వైట్ జాకెట్లోంచి బూడిద తీసుకొని మింగి.. ఆ టాప్ వాటర్ తాగేస్తుంది… సడన్ గా వెనక్కి విరుచుకు పడిపోతుంది.
బులెట్ గాయాలతో ఉన్న నాన్న అద్దము లోంచి బయటకొచ్చాడు… ఆయన ఛాతి దగ్గరంతా బుల్లెట్స్ హోల్స్ .. ఒక్కో చుక్క రక్తం వస్తూ ఉంది.. అతను .. కూతురిని చూసి మెత్తగా నవ్వుతున్నాడు..
ఇంతకంటే ఏం చెయ్యగలను… నా దగ్గరకి రా.. నేనీ ఛాతీ పైన మంచు దుప్పటి కప్పుకొంటాలే.. నీకు జోల పాడతాను …ఆకలన్నప్పుడు తాయిలాల కోసం చెప్పి.. నీకు దిష్టి తీసి.. ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకి తీసుకెళ్తా … ఘాడ నిద్ర మధ్యలోంచి లేసినా .. అమ్మ చూడు ఎంత ప్రశాంతంగా నీ కోసమని వంట చేస్తుందో.. ఆ జయదేవుని అష్టపదిని చూడు ఎంత … దీర్ఘమైన జీరతో నింపి..స్వర్గ రచన చేస్తుందో..నిన్న స్వయంగా జయదేవుడు వచ్చి … ఆ పాట విని ఆమె కాళ్ళని కడిగి .. అక్కడే కూలిపోయాడు.. కానీ అమ్మ పాడటం ఆపలేదు…పాప ఇది ఎంత స్వర్గ వేదికైన మోసిన పాత్రతోనే మమ్మల్ని ఇక్కడా తిరగ మంటారు..ఎక్కడో కలుక్కుమంటూన్న దీర్ఘమైన అనుమానం.. అయినా నిన్నెందుకు ఇలా పిలుస్తున్నాననే దిగులు నాలోపల ఉన్న .. అమ్మ వండిన పరమాన్నం నీ ప్లేటులో వడ్డించగానే అంతా మాయమైపోతుందిలే.. నేనే తినిపిస్తాలేరా?
అతని కళ్ళ దగ్గరంతా చిక్కని కాటుక నిండి.. కళ్ళు ఏమాత్రం కనిపించవు.. అతను మళ్ళీ నవ్వి.. తడుముకొంటూ … ఎస్… ఎస్ .. నాకు ఇదే కావాలని అరుస్తూ స్టేజి అంతా పరుగులు పెడుతూ ఉంటాడు..
నర్స్ కిందపడున్న ఆమె ని చూసి … డాక్టర్…. డాక్టర్ ….. అని అరుస్తుంది.. అతను పరుగున లోపలి వస్తాడు.. అప్పటికే ఆమె రెండు కణతలోంచి.. నుదిటి మధ్యలోంచి చిలులు పడి రక్తం కారుతూ ఉంటుంది.. డాక్టర్ చేతిలోకి రక్తం నిండిన మూడు బుల్లెట్స్ రాలతాయి…. అతను దుఃఖంతో ఆమె ని చూసి…. పల్స్ చూసి..
She is no more …. No more అని గొణుక్కొంటూ … చేతిలోని స్టెతాస్కోప్ .. తుపాకీ గా మారితే .. కణతల దగ్గర షూట్ చేసుకొంటాడు…
ప్రయోక్త ;
దుఃఖపు కణతల్లో ఎర్ర గది.. ఒంటరి సమ్మెహధ్వని మృత్యువులో నాని.. నల్లని పొగ .. గజ్జెలని మోగించుకొంటూ .. దేహ నిరూప స్థితిని ఊది.. ఆ పైకి నిద్ర సంధితో లేచి.. కుమిలిపోయిన నిరూప ముట్టడి కదిల్చిన ఏక దండన ముహూర్తంతో .. వికసిత కంటి పోగులు అల్లుకొని.. చిక్కుపడి .. మాటలు ఇక తనని మోసం చేయవని చెప్పుకొని… అమాంతం మింగేస్తుంది .. నాకేస్తుంది.. పిసికేస్తోంది..నమిలేస్తుంది.. కొరికేస్తుంది.. ముద్దులు పెడుతుంది..
తూఫాన్ లో వదిలి పెడుతుంది.. సమాధుల అడ్రస్ ని ఇస్తుంది.. ఎనేస్తేషియాతో చేతులు కలిపి.. మృత్యు మంత్రం జపించి.. కదలికల్ని నించోబెట్టే .. నిద్ర తెల్లని పెదాలని జోడించి.. జల్లించి..మరిపించి … సాగిలపడి .. పైకి చేర్చుకొన్న కలల రూడీని దాటిస్తూ…ఇక తాను కథల గర్భంలో కూలిపోయిన ఆల్బం. ఓ పాత క్యాలెండరు .. దర్శనాలు లేని గుడి.. చీకటి కలవరపడ్డ నిద్ర దీవి.. కెరటాలు ముంచి పడవలోని దీపం .. కథలు ఊరేగిన పెద్ద అరుగులపై ఉంచిన శవం.. నూనె పులిమిన నుదురు.. కట్టు విప్పేసిన నాదస్వరం..
(Stage స్క్రీన్ డౌన్ అవుతుంది. )
……………………………
EPISODE -3
ఏకపాత్రాభినయం చేసేవాడు.. స్టేజి పైకి వస్తాడు… ఓ తెల్ల దుప్పటి స్టేజి పై పరిచి …
ఇదే చావుల పల్లకీ … ఎన్ని లక్షల మందినైనా విస్ఫోటనాల మధ్య ఎక్కించకోగలదు. స్మశానాలు ఎన్ని నిండి పోయినా .. చోటు ఏ మూల మిగిలి ఉన్న అక్కడికే తీసుకు వెళ్ళుతుంది…
అప్పట్లో నాకీ చావు ప్రక్రియ అలవాటైన కొత్తలో … ఒక్క చావు అంటే చాలా పెద్ద విషయం..బంధువులు.. మిత్రులు…ప్రియురాళ్ళు.. సంగీతకారులు.. చిత్రకళాకారులు.. కవులు… ఆ చావుని కీర్తిస్తూ.. ఈ భూమి పై శాశ్వతం చేస్తూ వెంట వచ్చేవారు..ఆ తర్వాత 13 రోజులూ అతని కార్యాలని.. ఘనతలని … ఆలోచనలని గుర్తు చేసుకొని.. ఏడుస్తూ.. అంతలోనే మురిసిపోతూ.. అక్కున చేర్చుకున్న నిద్రలతో .. ఒక గదిలోనే అంతా సర్దుకొని తలచుకొని తలచుకొని గడిపేవారు .. ఆ మిగిలిన వారిని ఒంటరిగా వదలక వెంట తీసుకెళ్లి.. ఇంటి నుంచి ఇంటికి నెలలు తిప్పి బట్టలు పెట్టి పంపేవారు. అదొక విషాద ఉత్త్సవంగా ఉండేది.. ఇప్పుడు చావు ఒక నిస్సార ప్రక్రియగా మారిపోయింది. ఒక తాండవం నిప్పు ముద్ద ఆకారంగా ఆరిపోతూ ఉంది.. మన ఉనికి ఇచ్చిన అసాధారణ మెళుకవల అమృత స్థితిని చేరుకోవడమే మృత్యువంటే,,, కానీ అది ఒక ఆయుధం విసిరినా అర్దాంతర చావు కాకూడదు. అనిర్ధయ దాడి.. ఆకస్మిక మృత్యు రంకె .. పెద్ద కాగడాల మధ్య ఉడుకుతున్న పగల మహా వికారం..
అతని మాట సడన్ గా ఆపి.. కడుపు దగ్గర అంగీని చించి .. లోపలి చేతిని తిప్పి … ఓ శంఖాన్ని బయటకి తీసి ఊదుతూ … ఉంటాడు.. పొట్టలోంచి రక్తం బయటకి చిమ్ముతున్న పట్టించుకోడు… ఒక్కసారిగా కింద పడి ఏడుస్తాడు.. గిల గిల లాడుతూ … ఆ నేల మీద ఇష్టం వచ్చినట్లుగా పొర్లి.. లేవబోయి కిందికి పడిపోతూ ఉంటాడు.అతని కంటి చుట్టూ నల్లటి వలయాలు.. అతని అంగీ అంతా రక్త మయం
నా దుప్పటి చిరిగి పోయింది.. తూట్లు పొడిచారు… అంతా ఐపోయిందిగా అని దుప్పటిలో దేహాలు పేరుస్తుంటే … చెట్ల మాటు నుంచి తిరిగి దాడి.. నా రెండు భుజాలు కూలాయి.. కళ్ళు రెండూ రెండు కంతలుగా మారాయి..రెండు నిప్పుల కుంపట్లుగా రగిడిపోతూ… ఛాతిలో సల సల మరిగే ఆమ్ల ద్రవంలో ముంచిన కత్తిని దించి తిప్పుతున్నట్లు .. శరీరం తీసుకోగల స్పృహని మించిన మంట.. అది … ఇదీనని చెప్పడం నాకెలానో తెలియడం లేదు. తెగిపడ్డ శరీర అంగాలు… హఠాత్తుగా నవ్వు తెగిన తలలు.. శ్వాస కోసిపోయిన బుల్లెట్ల జల్లడ … తలలో బరిసెలు దించినట్లు తీవ్ర బాధ.. విసిగిన దేహ గ్రహణాలు ముద్దగా తేరుకోలేక … ఉబికిన ముట్టడి గోడలు కూలుతూ సతత ఘనీభవన స్పృహ … ఏ స్పృహలు లేని చావు కావాలని పెద్ద గొంతుతో అరుస్తాడు.
ఎవరో ఆకాశం లోంచి వచ్చి అక్కడకి తీసుకువెళ్లారు… వాళ్ళ కాళ్ళ మీద పడి వదల లేదు…
నన్నూ మీతో తీసుకు పోండి… ఇదంతా చూడటం .. నా వల్ల కావడం లేదు… వాళ్ళు వింతగా చూసారు… నీకా అర్హత ఇప్పుడు లేదు… నీ కళ్ళు పూర్తిగా పొడిబారి … నీ గుండె అంతా ఇసుక కూరుకు పోయి… నీ గొంతు .. తెగిపడిన నాలికల గుట్టగా మారాక … ఆ పైకి చేరగలవు… ఇప్పుడు భూమి మీద ఒక్క చోటునే నువ్వు చూడగలుగుతున్నావు.. పైన మొత్తం అన్నీ గ్రహాల నుంచి చేరుకున్న శవాలతో… ఇక్కడ నువ్వు రోజూ చస్తుంటే … అక్కడ నిమిషానికి ఒకసారి చావాలి… అక్కడ ఇంకేమీ లేదు…
నాకీ చావు ప్రక్రియ అలవాటైన కొత్తలో అనిర్ధయ దాడి.. ఆకస్మిక మృత్యు రంకె .. పెద్ద కాగడాల మధ్య ఉడుకుతున్న పగల మహా వికారం.. అతని అంగీ అంతా రక్త మయం అతనికి మామూలు దుస్తుల్లో ఉన్న చిత్రగుప్తుడు ఎదురవుతాడు..
చిత్ర; ఏంటి నాయనా నీ కష్టం ..
ఏక ; ఎవరు నువ్వు… ?
చిత్ర; చావుల ధర్మ గీతని రాసి.. నా గురువు తో పని పూర్తి చేయించే వాడిని..
ఏక ; (అతను పిచ్చి వాడిలా నవ్వి.. ) ఎవరు నువ్వు.. ?
చిత్ర ; (అతని నుదిటిని చదివి.. ) నీకు చావు లేదు.. నీ ఆందోళన నాకు తెల్సు.. కానీ నేనే కాదు .. నా ప్రభువూ తీర్చగలిగేది కాదు..
ఏక ; మరింకెందుకు.. నువ్వు ఎవరైనా ?
చిత్ర ; నా కష్టాన్ని .. ఇంత అనాయాసంగా తీసిపారేస్తావా.. ?
ఏక ; ప్రాణాలని మీరు అలాగే తీసి పారేస్తున్నారుగా..
చిత్ర ; ధర్మ చక్ర గతులు .. ఒక్కోసారి అలా తప్పినా మళ్ళీ సర్దుకొంటాయి..
ఏక ; ఎన్ని దశాబ్దాలకి? ఈ భూమి మొత్తం సమాధుల గుట్టలని మోసే స్మశానాలుగా మారి .. బతుకుని అపహాస్యం చేస్తున్నాయి.. ఇంకెప్పుడు .. దారిలో పడేది.. ఎవరకి ఈ మాయ మాటలు..
చిత్ర ; రాత్రి కూడా నా ప్రభువుతో ఇదే మాట్లాడాను.. ( కళ్ళలో నీళ్లు) అతను నిస్సహాయ తాండవం చేస్తే .. భూమి ప్రకంపనలతో అల్లాడి.. మరిన్ని చావులు… అందుకే ఇదంతా ఇలా నివేదించకూడదని నిర్ణయించుకున్నా…
ఏక ; ఎవరు నువ్వు ?
చిత్ర ; (అతని కాళ్ళపై పడి..) నేను చేతకాని వాడిని.. ధర్మ నిర్వర్తన లోని సవాళ్ళని వదిలి .. నా నుంచి నేను సత్యానికి దూరం జరిగిన అసహాయ జీవిని.. అసమర్దుడిని..
అతను .. చిత్రగుప్తుడుని గాడంగా కౌగలించుకోగానే.. చిత్రగుప్తుడు అంతర్దానమౌతాడు.
విశ్వ నిర్జన అసహాయ రీతిన చుట్టేసిన నిర్దయ రాజీల మృతు కలశం .. నేను నేనని .. నేను లేని నరకపు మృత్యు దండ పెకిలి .. విసిరినా కపాలాల మూర్చన ముద్రాలని వడపోసే తాగే సముద్ర తీర్ధం.. ధ్వని జారాలా మెలికని మోసే రౌరవ బ్రహ్మాండం లోని అసలు కథని దాచిన ఓటమి.. మృత్యు సింహాసనం ఖాళీ చేసి..చీకటి పిండేసుకొన్న నిర్యాణ వేదిక ఈ భూమి…
హాహా హాహా .. అని వికృతంగా నవ్వుతాడు..
ఈ లోపు ఆకాశవాణి…
మృత్యువుని అంతలా తలవడమెందుకు?
ఏక ; అసలీ మృత్యువు ఏంటని? దీనికి నిజంగా ధర్మ విచారణ యముడు చేతిలో ఉందా?
ఆక ; సృష్టి రహస్యంలోకి ఎందుకు రావాలని.. నీ పని ఆత్మ విచారణ అంతే.. ఎందుకు ఏమిటనేది.. నీకు అనవసరం .. నీ పని నువ్వు చెయ్యి..
ఏక; అలా ఎలా .. మొత్తంగా ఆలోచించివారెవరైనా ఉన్నారా అని ? అదే నా బెంగా..
ఆక; ఒకవేళ ఉన్నారని నేనంటే..
ఏక ; మరెందుకు … ఏ అర్ధాంతర చావులు.. కర్కశ చావులు.. కనీసపు పాపపు ఖాతా వాళ్లకి లేకపోయినా …
ఆక; సృష్టి నిర్మాణాన్ని ప్రశ్నించడం ఉచితం కాదు..
ఏక ; ఇలాంటి మాటలతోనే సత్యం కప్పిపుచ్చి.. పూర్తి వినాశం వైపుగా .. భూమిని విసిరేస్తున్నారు.. ఇక ఏ భూమి కోలుకోదు.. అది తెల్సిన మీరు ఒప్పుకోరు..
ఆక ; నీకు ఏదైనా నీకు సంబదించిన కోరిక ఉందా .. నీకు మాత్రమే..
ఏక ; నా చావుని బిగించుకోవాలని ?
ఆక ; నువ్వు ఎప్పుడో చచ్చిపోయావ్… నీ ఆత్మ వైధవ్య స్థితిని పొంది .. చేస్తున్న దుఃఖ సందోహానికి భూమి దద్దరిల్లి పోతుంది.. ఇప్పుడు నువ్వు చేయాల్సిన ప్రయాణం వెనక్కి కాదు.. ముందుకి మాత్రమే …
ఆకాశం లో పెద్ద చప్పుడు.. అతనిపై పిడుగుపడి దగ్ధమై .. మళ్ళీ లేస్తాడు..
ఈ గుట్టలన్నింటినీ మేము ఆ తర్వాత చీకటి బిళం గుండా … భూమి లోపలి పొరలలోకి వదిలి పెడతాం… కానీ ఇప్పుడు పెరిగి పోయిన వాటి ఆత్మగోష భూకంపాలై కబళిస్తున్నా … అక్కడా దాచిపెట్టిన మీ రసాయన కర్మలన్నీ ఇంకెన్ని బీభత్సాలుగా మారతాయోనని భయంగా ఉంది…
వాళ్ళు అతనిని ఓ వింత జంతువుని చూసినట్లు చూసి.. వికృతంగా నవ్వి …కరకు గొంతు తో…..
ఆ చీకటికి … ఈ చీకటికి పెద్ద తేడా లేదు.. అయినా నేను ఆశగా ఒకటే అడిగాను.. అక్కడ నా వాళ్ళని నేను మర్చిపోగలనా? మెరుపు ఒకటి నాకు అక్కడ దొరుకుతుందా అని ? వాళ్ళు విసుగు … కోపం తో చూసి.. కొంచెం వికృతంగా నవ్వి… అక్కడ గత జన్మలు కూడా కలిసి అద్దము ముందు కనిపిస్తూ … దుఃఖ పర్వతాలని నీ ముందు ఉంచుతాయి..అన్నారు.
ఏం చెప్పాలో తెలియని అతని ముఖం వికృతంగా మారిపోతుంది.. వాళ్ళు అతనిని చూసి స్పృహ తప్పి పడిపోతారు..
ప్రయోక్త :
నిద్ర సాధ్యం కానీ ఏకైక భయం.. ఒరిపిడి లేని విపరీత క్షేమంలో పడి తిరిగే కలల ద్రోహంపై కెరటాలని ఊదుతూ.. కంట్లోకి పట్టుకొన్న నిర్జీవ మూర్తుల ముట్టడి మృత్యువుని అందుకొని.. ఆ పై పల్చని నిద్ర గుడిని విడిచిన కథా ముద్రల మధ్యనే విడిపోయిన దేహ శిధిలం చెప్పుకొన్న తీర్మాన మంత్రం.. సమాధి లోపలి నుంచి పాటని తాగి.. చిత్రమాదక సంచార్యం కదిలించి పెట్టిన ఉనికిని దాటించి కదిలే అంతర్య సంధి చలన ముఖాలని దోపుకున్న బొమ్మల వీధిలో ఉనికి మొత్తం తడిపిన మృత్యు నీరు.. కాదని కూల్చి .. కాస్త నిస్సహ నిప్పు కుండల పేర్పుని అప్పగించిన దూరాలలో ఇరుక్కున్న కాస్త సందడి మందగించాక తను మరో వరం లేని శ్వాసని తీసుకొని దారి తప్పుతుంది.
( స్క్రీన్ డౌన్ అవుతుంది)
…………………………
EPISODE -4
ఓ నలభై ఏళ్ల వ్యక్తి స్టేజి పైకి వస్తాడు.. చిత్రంగా ఉండే వేషధారణా.. ఓ పొడుగు అంగీ … దాని నుంచి రక్తం కారుతూ ఉంటుంది…
నేను జర్నలిజం వృత్తిలోనే ఎంతో సాధించిన .. సంపాదించిన వాడిని …ఎంతో సాధించిన వాడిని … కుప్పలు తెప్పలుగా రాసి… నాటక ప్రదర్శనలు చేసిన వాడిని… నా బెడ్ రూమ్ నిండా మెడల్స్ … రోజూ వాటిమధ్యే పడుకొంటాను.. దివిసీమ ఉప్పెన .. పోస్కో చట్టం.. ఆర్టికల్ 370 … మసీదు కూల్చడం.. సర్జికల్ స్ట్రైక్ … అన్నీ ప్రదర్శించగలిగాను..
కానీ.. కాని… అని పెద్దగా … దీర్ఘంగా అరుస్తాడు. కానీ ఆరోజు ఘటనని ఎలా రాయాలో….
స్టేజి పై .. ఓ టెలిఫోన్ బూత్ లా .. గుండ్రని పెద్ద గాజు ఛాంబర్ … పైన షవర్ స్నానమ్ చెయ్యడానికి వీలుగా…
అందులోనే ఎప్పుడూ తన అంగీ పై రక్తం వదిలించుకోవడానికి ఎప్పుడూ స్నానం చేస్తూ ఉంటాడు.. అయినా రక్తం వస్తూనే ఉండటం…అలాగే బయటకొస్తాడు.. )
ఆ రోజు.. రంగుల అమావాస్య.. నా కూతురికి పుట్టిన బిడ్డ ఫస్ట్ ఇయర్ సంబరాలు చేసుకొంటున్న నిద్ర పచ్చల వంతెన కింద.. దిగబడ్డ నిద్ర కన్నీరుకి ఋణం తెగిన గుస గుసలా… సృష్టి పొదిగిన దేహ ధరల మహా మోక్ష ససాoదర్య మాదకత తొణికిసలాడే మహా ఉత్సవ వాకిలి … నిండు మూటల చెట్లు రాలిన విశ్వ సర్దుబాటు పర్చుకొన్న నేల … అక్కడ చెయ్యాలంది.. నేను కాదనలేక పోయా… ముందు రోజు చేరుకున్నాం …
అంతా అలసిపోయే వరకు తిరిగి.. ఆ సృష్టి అందాలని కళ్ళలో కారిపోయేలా నింపుకొన్నాం.. హోటల్కి చేరుకొని … అందరమూ ఒకే రూంలో నిద్ర పోయాం.
రెండో రోజుకి అంతా అమర్చుకొన్నాం.. వేడుక టైం ఇంకా రెండు గంటలు ఉందనగా … సడన్గా నా భార్యకి ఎప్పుడూ వచ్చే వెన్ను నొప్పి .. ఓఇంజెక్షన్లపడితే తప్ప నార్మల్ కాదు… అది నా కూతురికి తెల్సు.. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ల మంది.. నార్మల్ అవుతుందని … హాస్పిటల్ వెదుక్కొంటూ . మీరు ప్రోగ్రాం మేనేజ్ చెయ్యండి.. మేమొచ్చి జాయిన్ అవుతామని. నేను చెబుతూనే అక్కడ నుంచి హాస్పిటల్కి టాక్సీ ఎక్కాను … నా భార్యతో…..
(అతను సడన్ గా ఫ్లోర్ పైకి టప్ మని పడిపోతాడు. చాలా సేపు అంతా సైలెంట్… మళ్ళీ స్టేజి పై లైటింగ్ వచ్చేసరికి అతను స్నానపు ఛాంబర్ లో రక్తం కారుతూ… )
అతను ఈ పోయెమ్ తనలో తానే అనుకొంటూ. ఆ అర్ధానికి అనుగుణంగా డాన్స్ చేస్తూ…..
విస్ఫోటనా ముద్దలతో బిగించిన కేకల మధ్య జన నిందల జగుర్పు …
జేగురు రంగు వాంతులా మారిన నేల..
ప్రసవ చీరలకి చీముపట్టి దుఃఖం క్రిములుగా దేహం లోపల తిరుగుతున్నట్లు అరుపులు..
ఊడిపోయిన పోలికలు.. అపనింద కరిగిన నిద్ర కాల్పులు. (స్టేజి వెనక నుంచి బుల్లెట్స్ పేలుతున్న చప్పుడు)
.నిర్ధార గతి సన్నాహాలు మూసుకుపోయిన రోడ్లు.. పాలిపోయిన కళ్ళతో … (అతని కళ్ళు ఎర్రగా మారతాయి)
నిస్తేజ వికారం కమ్మిన ఆయుస్సుని జడపట్టి లాగి.. లోపలికి ఛాతి మండలాలు పగిలేలా బాదుకొంటూ …( దబ్ దబ్ మని తన ఛాతీ పై బాదుకొంటాడు)
నివ్వెర గట్లని తెంచుకొని.. దుఃఖం దొరకక పిచ్చిగా తిరుగుతూ…
దేనికీ తొందరలేని చీకటి ముక్కలు కాళ్ళలో గుచ్చుకొని అడుగు పడక … అరుపులు బయటపడక…
నిండా ఏడాది నిండీనిండని బిడ్డ … ఎత్తుకుని కేక్ బాగ్ తో వస్తూన్న భర్తని కంటి ముందే.. జిప్ తీసి మరీ ఖాయం చేసుకొని… ఛిద్రమైన కేక్.. ఎర్రని ముఖాలు… మూడు కిలోల మూటగా పాప …
అంతే …. అతను కాసేపలా ఆగిపోతాడు …ఆమె మెదడు అక్కడే స్తంభించి …
ఇప్పటికీ నా కూతురు నాకు దొరకలేదు.. 60 కేజీల మాంస మూటగా నా ముందు ఊపిరితో పడిఉండటం తప్ప…
నా భార్య శాశ్వతంగా మంచం పట్టింది… ఆమె వెన్నుముక అక్కడే విరిగి పోయింది.. ఏ వస్త్రం ఆమె పై కప్పినా .. క్షణాల్లో కాలి… రక్తం స్రవిస్తూ వికృతంగా ఉన్న నగ్న శరీరమే నా ముందు .. ఊపిరి మాత్రం ఆడుతూ .. నిర్జీవంగా… తనని చంపేయమని అరుస్తుంది.. ఎలాగో ఓపిక తెచ్చుకొని… కాని శరీరమంతా నా స్వాధీనం లేక .. నిరంతరమూ స్రవిస్తున్న ఈ రక్తంతో .. ఆమె ముందుకు ఎలా వెళ్ళగలను.. ఎలా గొంతు పిసకగలను..
అతను స్నాన ఛాంబర్లోకి పరుగు పెట్టి గుక్క పెట్టి ఏడుస్తూ .. నేను దీన్ని ఎలా ప్రదర్శించాలి అని అరుస్తాడు..
పెద్ద గొంతుకతో ప్రయోక్త ;
సంధి కుదరక చెల్లాచెదురైన మాంస దండోరా.. చిత్ర బాలింత స్వయంగా కడుపుపై గుద్దుకొని చేసుకొన్నా పిండ ద్రోహం.. రక్త మాల .. చావు గోళీల లీల లో ఉబికిన శ్వాసల దుర్గంధం.. లేని పిని కలతల పిచ్చి.. మాట ,, నాలికతో సహా లోపలి ముడుచుకు పోయి .. గగ్గోలు పెడుతున్న విశ్వ మన్నికల అపరార్ధవాలు.. సంకోచ చలన కక్ష్యలు పట్టు తప్పి చేరగిలిన విస్ఫోటనం .. ఇదే ఇలాజె ఉండాలని ఎవరూ అనుకోలేదు.. ఇప్పుడిక ఎవరిరో సరిచేసేలా మిగిలే లేదు.. నిష్ఠ సముఖంలో చీకటి అల్లాడి పోతున్న నిస్సహాయ హోరు.. చెవులే కాదు.. ఈ భూమి అంతా ఆ చప్పుడు మోయలేక పరుగులు తీస్తుంది.. ఆ చీకట్లో తల పగలకొట్టుకొంటుంది.. ఆచూకీ లేదు.. ఆ లోపలి బిగువులా ఊపిరిని ఇంకేదో నాకేస్తూ .. శూన్యంలోకి విసిరిన ఆ ఖాళీ సంచీలలో దేహాలు.. పెద్ద గొంతుకతో ఆకాశవాణి మృత్యు కొరడా జులిపిన అనర్ధ గొంతులోని కీర్తన .. అది కీర్తన కాదు.. వెన్నులో పొడిచి అసహాయ మృత్యు కాష్టం లోకి నెట్టేసిన పెద్ద నోరులా మింగేసిన అకస్మాత్తు బిలంలోకి పట్టుతప్పి గుట్టువులు పడ్డ శవాల లెక్కలు తేలక.. చావు ఆత్మహత్య కై తలకిందులవుతున్నా జీర్ణాహ దుఃఖ విలవిలా … గట్టి కేంద్రాల్లో పెళ్లున రాలిన చీకటి సమాధుల పెళ్ళలు…
………………….
EPISODE -5
పెద్ద గొంతుతో ప్రయోక్త ;
విశ్వ సంపద కూల్చిపెట్టిన సంకల్ప దారా .. ఎండిపోయాక .. గర గర లాడుతున్న వ్యాక్యం బైబుల్ ముద్రాలని పట్టుకొని పైకి జరిగాక.. సత్య మాయలో పడి తిరిగే కోపం జాడలు విప్పుకొని మీదకి దూకాక .. పరిస్థితిని కూల్చిపెట్టుకొన్న సఫల ముంపులు.. దీర్ఘ చలన చంపుకొన్న కన్నుతో నులిమిన భయాన్ని హోరుపెట్టి కలుపుకొన్నాక.. కసిగా ఓడిపోయిన మైకపు అంచనాల చావు చర్చిలో పడి తలకిందులై.. సమాధులని లాక్కొచ్చి నింపాక .. ఇంకేం లేదని శ్రద్ధ మసకబారి .. సర్దుబాటులేని విసుగు ఒంపుకొన్న దేహ దుఃఖం ఆచూకీ దొరకక .. ఇదెలా జరిగింది.. చావు చప్పుడు .. చర్చి గోడలని బీటలు తీసాక …
అదొక చర్చి … చర్చి ఫాదర్ దగ్గర కాఫిన్ ఓపెన్ చేసి పెట్టి ఉంది…దాని దగ్గరే చాలా యంగ్ గా ఉన్న అతని భార్య ఏడుస్తూ .. అక్కడక్కడా చిరిగి .. రక్తం స్రవిస్తున్న నల్లటి అంగీతో ఉంది.
అతను లోపలి రూమ్ లోకి వెళ్లి కొవ్వెత్తి వెలిగించాడు… గుండె అవిసేలా ఏడ్చాడు.. గాల్లోంచి ఓ గొంతు.. కాండిల్ ఆరిపోయింది… అతను ఓ నల్ల అంగీతోనే ఉన్నాడు… అతను ఏడుస్తుంటే … అతని కోటు లోంచి.. నల్లనీరు కిందికి జారుతుంది.. ముఖం ఎర్రబడుతుంది.. గొంతుపై ఎర్రటి చారలు వస్తూ ఉన్నాయి.
దేనికి ఏడుస్తున్నావ్? (ఆకాశవాణి … గర గర లాడుతున్న గొంతుతో తెలిసీ అడగడంలో ఉండే పాశవిక నవ్వు.. )
అతను ఇంకా ఏడుస్తూ .. కాసేపటికి సర్దుకొని..
అన్నీ ఖచ్చితమైన పద్ధతులని పాటించి .. బైబిల్ పై ప్రమాణం చేయించి… పెళ్లి నేనే చేసాను. ఒకరికొకరు ముద్దు పెట్టుకొంటునప్పుడు మురిసి పోయి.. ఆ దైవ స్వర్గాన్ని …వాళ్ళ కళ్ళలో చూసి మురిసిపోయాను.. కేక్ నా ముందే ఒకరికొకరు తినిపించుకొని.. నా కాళ్ళని తాకి … నీ ఆశీస్సులు తీసుకొన్నారు.. వాళ్ళు ఒకరినొకరు చూసుకొన్నప్పుడు వాళ్ళ కళ్ళలోని వెలుగు.. మరో వంద జన్మలైనా విడిపోరని నమ్మకం నాకిచ్చింది.. ఏంటి కావాలి ప్రభువా? అసలీ అర్ధవంతమైన కాంతి వాళ్ళలోకి నింపడానికి.. నేనూ దానితో నిండి పోయానని.. దశాబ్దం క్రితం చనిపోయిన నా భార్యని తలచుకొని కొవ్వొత్తిని వెలిగించి.. ఆ రాత్రంతా .. నా భార్య నేర్పిన డాన్స్ ని చర్చిలో ఒక్కడినే చేస్తూనే ఉన్నాను..ఆ కొవ్వెత్తి ఎక్కడా ఆరకుండా వెలుగుతూనే ఉంది.. కానీ అది నిన్న కారణం తెలియకుండానే ఆరిపోయింది.
నీ రహస్య ఆశీస్సులు ఆ రోజు నాకు లభించాయి .. అనర్ధాల కన్నా ముందు.. ఆ నమ్మకం నన్ను ఆనంద పరవశుడని చేసింది… కాని …… (దుఃఖం ) కాని ….. ఇదే రూంలో … అనగానే…
అతని పై కోట్ .. ఎవరో లాగినట్లు పైకి లేచింది… భగ్గుమని మండింది.. అతని కంటి రెప్పలు సర్రున కాలినట్లు కళ్ళు నులుముకొన్నాడు.. నాభి నుంచి అంతులేని భాదకి చుట్టుకు పోయాడు.. అరచేతుల బొబ్బలెక్కినట్లు అల్లాడిపోయాడు. అతను స్నాన ఛాంబర్ లోకి వెళ్లి .. శుద్ధుడై.. చేతులు మళ్ళీ మరో సీసాలో నీటితో శుభ్రం చేసుకొని.. కొవ్వెత్తి వెలిగించాడు.. (అతను లోపల అనుకొంటున్నాడు.. అవన్నీ అనర్ధ సంకేతాలని నాకప్పుడు తెలియలేదు..)
వాళ్ళు …కొత్తగా … ఎన్నో కలలతో మెరుస్తున్న వాళ్ళ కళ్ళని చూసి… శీత దేశం వెళ్ళండి.. అక్కడే .. దేవుని ఆశీస్సులతో సృష్టి మీకు కలుగజేసిన ఆనందాన్ని సంపూర్నంగా అనుభవించండి . మీ దేహాల తన్మయ అధికారి ఆ ప్రభువే.. ఈ సృష్టి విలాస మందిరం చేసి.. కళ్ళని ఆ దేవ హస్తం నిమిరే పవిత్ర చోటది .. సంపూర్ణ విశ్వాసం ఆ దేవునిపై ఉంచి .. ఆనంద సాగరంలో ఓలలాడండి.. అదే మీకు .. తర్వాత లైఫ్ ఎదుర్కొనే శక్తిని.. మరింత గట్టిగా మారే ప్రేమ బంధాన్ని అక్కడ నుంచి పొందండి. ఇష్టమైనన్ని కొవొత్తాలని వెలిగించుకోండి.. చేతనైనంత ఆహారం పంచిపెట్టండి .. దానాలు చెయ్యండి.. వస్త్రాలు కప్పండి.. రొట్టెలు పంచుతూనే ఉండండి.. ఏదొక శీతల సాయంకాలం ప్రభు సన్నిధిలో మోకరిల్లండి.. ఆయన పాదాలని మీ కృతజ్ఞతల కన్నీళ్లతో కడగండి.. విశ్వ సన్నాహం లో పండిన అడుగులని భద్రంగా దాచుకోండి..శ్వాస పంచుకోండి.. బిడ్డని ప్రసాదించమని అడగండి.. విశ్వ సంపూర్ణతలో ఏకంకండి
అని.. చెప్పాను… పాపం వాళ్ళు నా మాటని అలాగే నమ్మి.. మళ్ళీ మళ్ళీ … వెనక్కి తిరిగి నాకు కృతజ్ఞతలు చెబుతూ…. ఆ మర్నాడే ప్రయాణమై…
మూడో రోజుకి ఇలా … ఒంటి నిండా బుల్లెట్స్ తో జల్లడ చేశారు..ఆ భాధ దేహాన్ని … ఆమె ముందే.. అతనిని కణతలో పేల్చి ఆ రక్తం చూస్తుండగానే తాగారు. ఆమె తనని చంపేయమని కాళ్ళ మీద పడ్డ తన తలని ఆ నేలపై పగిలేలా కొట్టుకొన్న కనికరించలేదు… ఆమెని గన్నుకున్న కత్తితో వెన్నుపై పొడిచి … వికృతంగా నవ్వుకొని … ఏదో విజయగర్వంతో నినాదాలని అరిచి వెళ్లిపోయారు. ఆమెని జీవశ్చవంగా వదిలి పెట్టేసారు..
ఇప్పుడు బయటకెళితే .. ఆమె నేను చేసిన తప్పిదం ఏంటో చెప్పమని నిలదీస్తుంది… దేవునికి నేను ప్రియమైన
అనుచరుడనని ఆమె కి తెల్సు.. కానీ నాకే నీనుంచి సమాధానం దొరకలేదు.. నేను బయటకెళ్ళి ఏంచెప్పాలి…దేవుడు చాలా సందర్భాల్లో నిస్సహాయుడనా ? చలించని దుర్మార్గుడనా … ఆమె గత జన్మ లో చేసిన పాపానికి .. నువ్వు ఈ జన్మలో విధించిన కిరాతక శిక్ష అనా? ఈ రక్త బీభత్సాకాండని ఏ సైతాను చర్య అని చెప్పమంటావ్.. పెళ్లి గౌను మడతయినా నలగ లేదు..కొవ్వేత్తైన కరగ లేదు.. ప్రామాణించిన పెదాల లిప్స్టిక్ ఐనా తుడవలేదు.. వాళ్ళు కూరుచొన్న ప్రధాన బెంచ్ పై నుంచి ఇంకా ఆవిరైనా ఆరలేదు. అతనికి పూలమారినపుడు ఆమె ఆందోళనగా చూసిన చూపు నా కళ్ళలో అలాగే ఉంది.. కంటిలో ఆచూకీ దొరకని నిద్రతో ఎర్రబడి .. ఏ క్షణం నాపైకి దూకేస్తాయని భయంగా ఉంది.. నిలదీస్తుందని కాదు.. నిలదీసిన నాకు చెప్పడానికేం లేదు..ఎవరి పాపానికి ఎవరికీ శిక్ష.. వాళ్ళు చేతులు కలిపినప్పుడు వినిపించిన వాళ్ళ పులికిత గుండె చప్పుడు చెవుల్లో అలాగే ఉంది..
అతని ఎదురుగా ఉన్న అద్దంలో కాలుతూ కనిపించాడు.. ఉల్లిక్కి పడి తనని చూసుకొనే లోపు ఆ అద్దం ఎవరో సుత్తితో కొట్టినట్లు పగిలింది.ఫాదర్ బయట కొచ్చాడు … అతను ఒంటిమీద drawer తప్ప మిగతా బట్టలు విప్పి .. కుప్పపోసి కాల్చాడు. ఆ కోటాలో ఉండి కాలిపోతున్న బైబుల్ ని చెయ్యి పెట్టి తీసాడు.. మంటతో నిండిన చేతిని దులుపుకోలేదు.. ఒక పెద్ద కేక ప్రభూ అనే అరిచాడు.. నాకు ఏ సమాధానం ఇవ్వనప్పుడు.. ఆ సంధానం దొరికే నీ రాజ్యానికైనా నన్ను తీసుకుపో.. బంధన తాడులని ఇంత నిర్దయగా తెంపిసినా నిన్ను ,, నేను నిలదీయకుండా ఉండలేను.. భక్తుల నిన్ను సింహాసనంపై కూర్చోబెట్టి చూసుకొంటుంటే నువ్వేచ్చే ప్రతిఫలం ఇదా.. నీ సమక్షంలో జరిగిన ఓ పెళ్లిని చల్లగా ఉండమని ఆస్వీరదించ లేకపోయావా … స్పష్ట లేని ఈ జన్మ కారణం నీతో తెలుస్తుందనుకొన్న.. కాని నువ్వింత .. చీకటి రాతని రాస్తావని తెలిసాక దేనికని ప్రార్ధించను?
మృత్యు కంకణ దారి.. తన శిలువని తానే మోసుకొన్న ఈ మృత్యు ఆహ్వానిగా నువ్వేం చెప్పినా నాకు ఒక భయం నిండిన శాప తీర్మానాన్ని మాత్రమే చేస్తుంది.. ఇంకెంత నాలోపల నేనే మోసపోను.. నిద్ర సంకల్పం చావే అనుకొంటే అదే నేను నీనుంచి తీసుకొంటాను.. ఆమె ముందు ఓడిపోయాను.. దైవ కరుణకి నోచుకోలేదని .. తప్పు తనపైనా వేసుకొని అల్లాడుతున్నా ఆ పెళ్ళికూతురికి ఏం చెప్పను. పాపములను క్షమించి దేవుడు నరక ద్వారం దగ్గర ఉన్న అతని శరీరాన్ని లాగి స్వర్గం వేపు లాగుతూ పడిపోయాడు..నే వెళ్ళాలి. నిస్సహాయుడైన దేవునికి నేను సహాయ పడాలి… అతనికి మరే అపప్రధ రాకుండా నేనే కాపాడుకోవాలి.. లోకం ఎంత మారి పోయిందో.. సైతాను శక్తిని ఎంత తగ్గించాలో ఆ దేవునికి నేను చెప్పుకోవాలి.. కొన్ని లక్షల కొవ్వొత్తులు నా గుండెల్లో వెలుగుతున్నప్పుడు వచ్చే ఈ మంటని ఈ భూమి మీద ఎవరూ ఆర్పలేరు. అక్కడ నువ్వూ ఆర్పమనడం లేదు.. నేను చూసిన క్రౌర్యాల ముందు ఈ మంట లేకపోతే నేను నిలబడలేను…. అని అక్కడా ఉన్న కేక్ కట్ చేసిన కత్తితో గుండెలో పొడుచుకొన్నాడు… తీవ్ర రక్త స్రావం.. నేల పై ఒరిగిపొయాడు. ..
ఆమె అతని శరీరాన్ని అతి కష్టం మీద ఈడ్చుకు వెళ్తూ …బయట నుంచి ఒక శిలువని తీసుకొచ్చి దానిపై అతని పడుకో బెట్టి… చేతిలో మేకు కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు … ఆమెని ఎవరో బలంగా పట్టుకొని ఆపారు.. అతనిపై అరిచి… గొంతు సవరించుకొని ….
ఏవో కొన్ని మృత్యు వ్యాఖ్యలని లోపల గొణుక్కోని.. దీర్ఘ విశ్వపు అనుసార ధ్వనిని వింటున్న ఏకాంత సారంతో పండి … దిగులు ముడిని బలంగా వేసుకొన్న ముట్టడి రంగుల క్షేత్రంలో విడిపోయిన ముహూర్త చలనాల సిద్దతని మోసుకొంటూ .. వాళ్ళు సమర శృతిని సరిచేస్తారు. కొంచెం దూరం జరగండి.. ఇక్కడ ఏం జరుగుతుందో నాకూ తెలియదు.. ఏదో అసాధారణమైందే జరగడానికి అవకాశం ఉంది.. తన్మయ శాంతిని మింగేసి వేలాడుతున్న చలన మొండాలతో అప్పగించిన అనుమాన సదృశనలు..విడిపోతే ఉండిపోయిన కలతలు.. కొరుక్కుతున్న మంగళ హోరులు.. ఏవీ మనలోనే ఆగిపోక ఎటు పోతున్నాయో తెలియక విసిరేయబడతాయి. ఆ తర్వాత అతని కాళ్ళు పట్టుకొని ఇంకొక కాఫిన్ బాక్స్ తెప్పించి … మా ఇద్దరిని మృత్యువులో నువ్వు బైబుల్ వ్యాక్యం చదువుతూ ఏకం చేయగలవా ? అని స్పృహ తప్పి ఆ పేటికలో పడిపోతుంది…
Screen down
……………….
EPISODE-6
స్టేజి అంతా ఖాళీ … ఏకపాత్రాభినయం చేసే వ్యక్తి వస్తాడు.. చర్చి ఫాదర్ వేషంలో ఉంటాడు. అతని తెల్లని కోటు నిండా రక్తపు మరకలు.. ఒక అద్దము పగిలిన కళ్ళ జోడు.. ఒక కాలు సరిగా లేని నడక
ఈ నేర సామ్రాజ్యంలో మంచిని మించిన ప్రమాదం మరొకటి లేదు..
తన మృత్యు శిలువని మోసిన ప్రభువు ఇక్కడ .. నా ఈ చర్చి గోడల మధ్య ఓడిపోతున్నాడు.. తన గొంతు నిండా సమాధి మట్టి.. ఆరిపోయిన చీకటితో మాయమైన కళ్ళు..విశ్వపు నడక అర్ధంకాక .. వణికి పోతూ .. తప్పిపోయిన గొర్రెల మందలోంచి. తన వెంట వచ్చే ఒక్క గొర్రె లేక దుఃఖపడుతూ ప్రార్ధిత ముఖాలన్ని మార్చి కౌగిలిలో తడిచిపోతున్నాడు. మొత్తం చలన శీల ప్రపంచానికి వినిపించాలని గొంతు చించుకు అరుస్తున్న ఎవరూ అతనిని చేరడం లేదు.. చెవి ఒగ్గడం లేదు.
ఇప్పుడిక గర్భాలన్నీ నిలిచి పోవాలి… పెళ్లి కొడుకులంతా యుద్ధంలో చనిపోయి … బూడిదై గాల్లో కలిసిపోవాలి ..
చర్చిలన్ని ఆయధాగారాలుగా మారి … మనుషులని వెక్కిరిస్తున్నాయి… భరించలేని దుర్గంధం .. సవాలు కుళ్ళిన అగడ్త .. విశ్వ భ్రమణం వణికి కంగారు పడుతున్న దేహ శూల .. పరుగులు పెడుతున్న నిశానీ దాడులు .. పిలుపికి అందని ముంపులు.. ఇరుక్కుపోయిన మృత్యు గాలుల పెనుతూఫాను …
అంత్యక్రియల నిండా ఎర్ర పూల వాన… సైతానుల అరుపులు.. ఒక్కో సైతానుకి వంద చేతులు.. వాటి నిండా ఆయుధాలు.. సంబంధ చర్యలు లేని విశ్వపు తలపోత పరుగులు.. ఇది ఇలాగే ఉండాలని ఓ భయం చెప్పిన చావు కథలు చెల్లా చెదురై.. కాలుతున్నాయి.
గుండెలపై శిలువలని … లోపలి దించుకొని ఫాధర్ లంతా పరుగులు పెడుతూ కూలి పోతున్నారు.. వాళ్ళ శరీరాలపై బుల్లెట్ల వర్షం… (అతనూ ఒక శిలువని కష్టం మీద మోస్తూ ఉంటాడు.) పునురుస్థానాలు వద్దని ఓ పొలికేక .. ముక్కలయ్యే భుజాలు.. నొప్పిని తాళలేక అరుస్తున్న కొరటాల మధ్య తూలిపోతూ.. మృతు సహారా ఎండు గొంతు.. శరీర సమాధి మోయలేని నిస్సహాయ కోపం.. మోసిపోయిన నిరాశల మధ్య తెగిపడ్డ గొంతులు.. లోపలంతా తారీకులేని చరిత్ర.. మొండి కోపంతో ఇగిరిపోయిన నడకలు.. ఇక్కడ శాపిత జనం గగ్గోలు వినడానికి ఎవరికీ ఖాళీ లేని పరుగు.
అతను ఉన్న ఆ చోటు ఓ పెద్ద స్మశానం
ఆ పెద్ద స్మశానంలో ఓ పక్క వంటలు చేస్తున్నారు… అది నరమాంస వంటకం.. విందు కోసమని మద్యాన్ని నింపుతున్నారు.. నన్ను లాక్కుపోయి … తాళ్ల తో కట్టేసి …ఆహారాన్ని నా గొంతులో కూరారు… ఎన్ని రోజులు నేను స్పృహ లేకుండా పడిఉన్నానో నాకు గుర్తు లేదు… పునరుస్థానాలు వద్దని ఓ పొలికేక .. ముక్కలయ్యే భుజాలు.. నొప్పిని తాళలేక అరుస్తున్న కొరడాలా మధ్య తూలిపోతూ.. మృతు సహారాల ఎండు గొంతు.. శరీర సమాధి మోయలేని నిస్సహాయ కోపం.. మోసిపోయిన నిరాశల మధ్య తెగిపడ్డ గొంతులు.. లోపలంతా తారీకులేని చరిత్ర.. మొండి కోపంతో ఇగిరిపోయిన నడకలు.. ఇక్కడ శాపిత జనం గగ్గోలు వినడానికి ఎవరికీ ఖాళీ లేని పరుగు. నిద్రలో నా కలలకి గొలుసులు కట్టి మొండిగా నరికేసిన ఒత్తడితో చలన మాత్రలు కరిగిన కల్లోల నిమంత్రణ … పరుగుతో చుట్టుకు పోయిన కలవరం .. స్పృహ లేని కేకలతో నిండిన శరీరం..
నా కాఫిన్ బయలు దేరింది… ఏక్షణమైనా చేరుతుంది… నా గోతిని నేనే తవ్వుకున్నాను…
ఇంకాసేపు ఇదంతా .. కాసేపుని సమయం మింగేయక ముందే తిరగబడ్డ మోసగింపు.. ఓడించి పోయిన కక్షని తడిమి .. గుంజేస్తున్న ముట్టడి ముఖాలన్ని దారిలోకి లాగి.. దేహం కలవరపడి ఒరిగిపోయింది శ్వాసలతో యుద్ధం కనిపెట్టుకొన్న తారీఖులు.. ఇవన్నీ వద్దనుకుని.. ఆ తర్వాత నేనే మట్టి దుప్పటి కప్పుకొని మాయమైపోతాను…
ప్రభువు నుంచి … పాలకుల నుంచి… కీచకులు… వంచకులు… చివరికి నానుంచి … దూరమై … నా మట్టి కలల భవంతులలోకి ఎగిరిపోతాను… కాల్చి పెట్టుకొన్న నిద్ర దర్శనాల్లో కదిలే భయం పగతో ఎర్రగా కాలుతూ దీర్ఘ నివృత్తాల సరిపోతే గర్భం మూసుకుపోయి .. అటు చీకటిని .. ఇటుగా విసిరేస్తున్న చావు గడపలు..
చివరికి అక్కడ మృత్యువు ప్రసవించిన సంగీతముంటుంది.. ద్రవ నిద్ర ప్రవహించే దేహ మూర్తులు కొలువై ఉంటాయి.. నిమిత్తం లేని మహా దర్శనకై … శక్తి తన భుజాన్ని దన్నుగా ఇచ్చి లాక్కుపోతున్న విశ్వాస సముద్రాలకి ఆవల చీకటి బిళాల్లాల్లోకి తప్పిపోయి…వాటి ధాటితో శూన్యంలో దుఃఖం చింది మరో జన్మ సంతకం లేని నిశానీ రంగులు కళాయాంలో గడ్డ కట్టిన అరుపులతో పక్కాగా చనిపోతూ… ఆ క్షణాన్ని నుంచి ఏ క్షణానికి … దాటిపోక … వదిలిపెట్టి ఊపిరిని తీసుకోలేక .. నిద్ర మరిచిన ఒకానొక దీక్ష క్షణం ఒరిగిన ముఖాలతో సరిపోలని దూరాల ఒత్తిడి…. ఏదీ తెల్సుకోవాలనుకోవడం లేదు… తెలుసుకొంటే తిరుగు ప్రయాణానికి దిక్కు లేదని నాకు బాగా తెల్సు. ఆశ్రిత విశ్వం పగతో నా కళ్ళని.. కాళ్లతో చిదిమి … నా గొంతుని..గునపంతో తవ్వి.. నా ఊపిరికి బొక్క పెట్టి.. తెగిని శ్వాసని … అంగాల జిగురుతో అతికించి … పొత్తికడుపుని చీల్చి కాలుతున్న కొవొత్తుల గుట్టని కూరి… నోటినిండా మన్ను దట్టించి .. మాట రాకుండా చేసి.. నా నడుముకి వందల పేటికలని కలిపి బిగించిన తాడుని మూడేసి… నేను లాక్కెళ్ళడానికి … కొరడాతో కొడుతుంటే… ఏ ఆకాశవాణి తన గొంతు విప్పలేదు… తమాషా చూస్తూ ఉందంతే…
ప్రయోక్త ;
అమాంత స్మరణలో వెలిగే బైబిల్.. పొడవైన వంట గది చివర స్మశానం.. ముట్టడి చేసిన సంతర్ప దుఃఖం లో జోడించుకున్నా వదలని.. వాదులు కానీ.. గోడలు కూలిన రెప్పలా ధూప చలన మత్తు ఊడల కింద కాస్త నిద్ర కూర్పుని మెదిగి.. తను నములుకున్న చలన మెతకల చూపు రుజువుని సరిచేసే నిద్ర మొత్తం కలవపడి .. అధీన దేహ మూర్చన కంటి పొంగులని సాగా దీసి.. అక్కడే సర్దుకు కూర్చునా బెంచీపై.. మూత పెట్టిన మట్టి దోసిలి కింద .. నాధా స్వరాల మూట..
తన కథ అదే .. పెద్దగా వంత పడదు.. ఎవరికీ చెప్పుకున్న పెదాలని సరిచెయ్యరు .. వేడికి ఉంచేసి అలసట కి రెండో స్థితి శూలాన్ని అంటుకట్టరు. తను పిలిచాడని తెల్సి .. కొత్త వేదికని తెచ్చి వెయ్యరు.. నలతపడ్డ వికార తీవ్రతల మధ్యలోనే నేను ఉండిపోయానని నిందిస్తుంది.. ఐనా నేను ఏదీ తుడిచెయ్యాలని అనుకోలేదు.
Screen down
………………………………..
EPISODE -6
స్టేజి పై ఓ తెల్లని హంస బొమ్మ.. ఏ నోరు కదలకుండానే … స్టేజి వెనక నుంచి మాటలు..
ఒక తెల్లని హంస మమ్మల్ని తీసుకు వెళ్తూ ఉంది… వెనక్కి తిరిగి ఉన్నట్లుండి మనోహరంగా నవ్వుతుంది…
నేను ముందుకి జరిగి అంతా బాగానే ఉందిగా ? అన్నాను. ఆ అనడం లో జన్మల నైవేద్య దీపం వెలుగుతుంది.. విశ్వ నిద్ర మోసుకొచ్చిన కలల నెమలి పింఛాలు కురిసిన సరస్సులో .. అలా ఈదుతూ గాఢ నిద్రలో తనని కలగన్నట్లు.. విపరీత సంధి సూత్రాల కలకలం సర్దుమణిగాక ముద్దుని .. ఏకాంత మందిరం చేసి అడిగినట్లు…
హంస కళ్ళలోంచి నీళ్లు.. నా బిడ్డ .. నా భర్త … వాళ్ళతో కలిసి నేను … ఆ మహా నదిలో వలస మొదలు పెట్టాము.. అక్కడ కలువల్లో అమృతం ఉందని తెలిసేసరికి .. నా వయసు ఐపోయి నేనిక్కడే ఉండిపోయా… మీరైనా వెళ్లి … ఆ అనుభవం పొందండి … అంది..అమ్మమ్మ .. ఎన్ని కథలో విన్నాను.. ఎందరి మాటలలోంచో .. నేనా కలలని పోగుచేసుకొని చూస్తూ ఉన్నాను.. పండిపోయిన నా శ్వాస సగం లో ఊరే కన్నుని పరాయిగా చేసుకోలేను.
. నా బిడ్డా అది విని .. రోజూ వాళ్ళ నాన్నని ఇదే అడుగుతూ… వాడికోసం నేను తెచ్చిన ఏ చేపలూ తినేవాడు కాదు. ఒక రోజు నా భర్త ఎవరో స్వామీజీ చెప్పగా తానూ విన్నానని … అక్కడకి వెళ్లడం అనేది .. ఓ పూర్ణత్వానికి సంబందించిన విషయమని.. అమృత స్థితిని శ్వాసిస్తూ అనుభవించడం అంతా మామూలు మాట కాదని.. వెళ్లే తీరాలని.. ఒంట్లో పూర్తి ఓపిక ఉన్నప్పుడే… మోక్ష ధార మనలోకి సరాసరిగా కురుస్తుందని.. చెప్పి మురిసిపోతూ … ఓ పౌర్ణమి రోజు బయలు దేరాం.. మా భుజాలు ఎక్కి… మధ్య మధ్యలో దీవుల్లో ఆడుకొంటూ … అదే చివరి దీవి.. దాని తర్వాత ఒక రోజు అంతే … ఆ కలువల స్థావరం… ఉత్సాహం తో మా బిడ్డ మాటలు వింటూ నిద్ర పోయాం…
మధ్య రాత్రిలో పెద్ద చప్పుడు… ముందు అర్ధం కాలేదు… ఆ తర్వాత తెల్సింది… తుపాకీలని.. బిడ్డని మా ఇద్దరి మధ్యలో పెట్టుకొని ఈదుతూ ఉన్నాం.. అంతే మళ్ళీ బుల్లెట్లు… కింద నున్న జలాంతర్గామి నుంచి… పెద్ద అల లేచి .. అదొక మృత్యు సునామీ లా .. పొడవైన వికారమేదో ఆవహించి ఊపిరిని నలిపీస్తునట్లు.. సవరించలేని దుఃఖ నింద పోలిపోతూ గొంతు పూడుకు పోయినట్లు.. అంతెత్తునుంచి విరిగి నామీద పడింది.. ఆ తర్వాత నాకేమీ తెలియదు… మూడురోజుల తర్వాత స్పృహలోకి వచ్చాక .. నెలలుగా వాళ్ళని వెదుకుతూనే ఉన్నాను.
కానీ నాకు నిన్ననే కలువల చెరువు ఉండే చోటు ఆచూకీ తెల్సింది.. పోగొట్టుకొన్నవి తిరిగొచ్చాయని..ఇదమిద్దాం కాని ఓపికని తడిమి.. తురిమిన విశ్వ రాత్రిలోని నా బెంగాని పంచుకొని.. హత్తుకోవాలని.. ఈ ఏకాంత ముద్రాలని తన ముందు పెట్టి బలమైన కౌగిలిలో తడిచి పోవాలని.. మహా విస్ఫుర శ్వాసని తనలోకి వదిలి తన నుంచి ..శ్వాస్యత ఎడబాటు లేని సద్యోతని కలుపుకోవాలని.. ఎప్పటికీ వీడిపోని శ్వాస చమురుల మృత్యు బంధన బిగించుకోవాలని.. మరింత పండిన ఉద్వేగంతో ఈదుతూ.. రెక్కల అలసటకీ ఆగక…
నా భర్త … నా బిడ్డ అక్కడకి వచ్చే తీరతారు. మిమ్మల్ని అక్కడికే తీసుకు వెళ్తున్న .. అంతకు మించిన శాంతి స్థలం ఈ భూమి మీద ఇంకెక్కడా లేదు.. ఉండదు కూడా… ఓ మంత్రం దీపంలా చిప్పిల్లిన వెలుగులో ఆ మాటలని అనుసరిస్తూ ….. రోజుల రోజులు .. అలసట ఆకలి లేకుండా…. తీరా మేము ఆ చోటుని చేరాక….
అదొక నిర్మానుష్య దీవి.. ఓ చిన్న అలికిడి కూడా లేదు… అద్భుతమైన అందం … శతాబ్దాల వయసున్న చెట్లు… రకరకాల పక్షులు.. మంచు తడిచిన గాలి… చిత్రమైన పళ్ళు వేలాడుతూ .. రాలుతూ… దూరంగా కలువల చెరువు కనిపిస్తుంది.. అదంతా నీటి పై దేవుని సంతకంలా … అనేక వర్ణాలతో ఉన్న కలువలు.. ఓ మంత్రం దీపంలా ఆ మాటలని అనుసరిస్తూ చిప్పిల్లిన వెలుగులో దేవతలు ఆరబెట్టుకున్న నీటి చీరలులా సరస్సులు.. మత్తు మంత్రించే గాలి.. చేతి వేళ్ళతో నిమిరిన లేత చిగుళ్ల వాన .. అదొక పరిమళ మైకం.. రెక్కల్లో అలసటని లాగేస్తూ.. సరి దిద్దని మంత్ర విస్ఫుర పరిశీలన ముద్దు పెట్టుకొంటూ.. సరిచేసుకొన్న ఊపిరి రంగుల్లో వెలిసిపోని ఇసుక మడులు.. చెట్లు సముద్రంలోకి జారీ .. శతాబ్దాల నాచు రుచి… చిత్రమైన పరిమళం..ఆ హంస పరవశించి పోతూ ఉన్నప్పుడే …
స్టేజి పైకి ఆ దీవి వాతావరణం వస్తుంది…
ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లుగా అరిచింది… అక్కడ ఓ మంట వేసి చలి కాగిన గుర్తులు.. వంట చేసిన రాతి పాత్రలు ఉన్నాయి… ఆ హంస ఆశగా అక్కడంతా వెదికింది… ఒక్కసారిగా పెద్దగా అరిచింది..అక్కడ ఓ రెక్కల గుట్ట .. దానిలోంచి .. ఓ నెమలిపించంలా ఉన్న రెక్కని తీసుకొని పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది.
(ఆ సన్నివేశం కనిపిస్తూ ఉంటుంది)
అర్ధమైపోయినా అడిగాను…అది వాళ్ళ జాతిలో … చాలా ప్రత్యేకంగా ఉండే రెక్క.. వాళ్ళెంతో ప్రత్యేక క్వాలిటీ అని భావించే… నెమలి పింఛపు రెక్క … అలా ఎప్పుడో … ఓ హంస పుడుతుందoతే..ఆమె భర్త ఆ కోవకి చెందిన వాడు.
తన బిడ్డ ఆచూకీ ఎక్కడాని వెదికితే… దూరం గా … నోట్లో కోరలతో .. రక్తం నిండి..కొన ఊపిరితో ఉంది.. పరుగుతో చేరాం.. ఏం జరిగిందో చెబుతూ … ఒక్కోసారి భయం తో గడ్డ కట్టి .. మళ్ళీ కోలుకొని అరుస్తూ.. ఇలా చెప్పింది…
ఆ రోజు .. నాన్న మనము కొంచెం ఓపిక తెచ్చుకున్నాం కాబట్టి.. రాత్రికి బయలుదేరదాం.. అమ్మని వెదకడానికి… అన్నాడు.. మేము … మంట వేసి చెప్పాలని కాల్చే పనిలో ఉన్నప్పుడు .. హఠాత్తుగా … ఆ చిన్న మంట ఇంత పెద్దగా ఎగిసి .. దానిలోంచి.. ఓ రాక్షస రూపంలో .. భగ భగ మండుతూ ఒకడు వచ్చాడు… వాడి చేతి ఎదో ఆయుధం ఉంది.. అది ఎక్కుపెట్టాడు..
నాన్న అడిగాడు..మేమేం తప్పు చేసామని… వాడు వికృతంగా నవ్వి… బ్రతకడం .. అన్నాడు..
నా పని లెక్క సరిచెయ్యడమే… నాన్న ఒళ్ళంతా తూట్లు పొడిచాడు..
నాలో కోపం ఒక్కసారిగా పెరిగింది…ఏం చెయ్యాలో అర్ధం కాలేదు..కళ్ళు మూసుకున్న … నా వంతు ఇప్పుడని…
కానీ ఏం చప్పుడు లేదు.. కళ్ళు తెరిచి చూసే సరికి .. నాన్న శరీరాన్ని .. వాడు కాల్చుకొని తింటున్నాడు..నేనిక సహించ లేకపోయాను..
నా నోటి దగ్గర విపరీతమైన నొప్పి… కాళ్ళని పెట్టి తడుముకొంటే తెల్సింది.. నాకు రెండు పక్కల బలమైన కోరలు వచ్చి ఉన్నాయి… అంతే ఒక్కసారిగా ఎగిరి దూకి …వాడి ఛాతీని చీల్చి … వాడి గుండెని బయటకి లాగి పడవేసాను… వాడి మీదికి దూకినప్పుడే … వాడు నా గొంతు బలంగా నొక్కాడు… నా పని ఇక అయిపోయింది… వీలైతే నన్ను క్షమించు… నాన్నని కాపాడలేకపోయాను.
ఒక్కసారిగా ఊపిరి వదిలి చనిపోయింది .. ఆ కోరల హంస……….
.ప్రయోక్త ;
తూట్లు పొడిచిన మృత్యు సావిడిలో .. ఎప్పటిదో ఎదురు చూసి చీకిపోయిన వాన గుప్పిళ్ళ దేహం .. అటు చేరి శ్వాసని అడగదు.. ఇటు తిరిగి హంసని మోయదు. చలన కీల దర్శన లోని .. నడక తిప్పిన అప్పగింతలు కోలాహలం.. కాటుక పాకిన వీధిలో శిలాప ముడుపుల వంతెన పక్కాగా ఇంకా తవ్వుతూనే ఉన్నారు.. అవును అది తేనె నీటి సరస్సు.. గుబులు పంచిన మంచు మేళాలతో .. రెక్క అల్లార్చిన అరుపు.. చలన మంటని కలిపి ఈదిన దీవి ..
నుదురు భాష్యం చెప్పుకొన్న దీర్ఘ సమాధారణ .. అంతే ఉండనే అనుకునే లోపు.. ఎవరో ఎత్తుకెళ్ళి పోతారు.. ఆచూకీ ఏమాత్రమూ నిద్ర కేసుని తగ్గించలేదని .. నెమ్మది దేహ నిధిని కలలో తిప్పుతూ .. మార్చి చెల్లించుకున్న దేహ శిలల గుట్ట .. పెద్ద నోరుని విసిరింది. నేనో వివరణ ఇచ్చే ఉన్నాను. కాదని తప్పించుకు తిరిగి మృత్యు తీర్మానానాన్ని తగలబెడుతూ అక్కడే ముడుల కలుపు తీసి .. హంసల చెరువుని ఇంట్లో దాచాను.
Screen down
……………………………………
EPISODE-8
ఒక పెద్ద శబ్దం.. మృతువు సమీపించిన వాడి అరుపు.. మెరుపులు .. రక్త మరకలు.. అంతలోనే జీర నిండిన నాధ స్వరం.. మసక స్టేజి లైటింగ్ .. యముడి ప్రవేశం.. ఒక ముళ్ళు నిండిన తివాచీపై.. అతని వీపంతా రక్తం కారుతుంటే వికృతంగా అరుస్తూ.. నవుడుతూ.. ఆ తివాచీని పట్టుకొని చిత్రగుప్తుడు ఒంగిన నడుముతో.. స్టేజి పైకి చేరతారు. అతని బుజం మీద ఒక పెద్ద సుత్తి ఉంటుంది. సన్నగా .. మాసిన గడ్డం.. ఓ పెద్ద నల్ల అంగీ … పెద్ద మీసాలు.. చింపిరి జుత్తు …
డాక్టర్కి యముడు దర్శనం జరగడం …
ఆమె ; ఎవరు నువ్వు.
అతను వికృతంగా నవ్వి.. విశ్వ నిద్రని పండించే జ్ఞాన చమురు మూర్తులని భగ్గుమనిపించగలనూ .. దీర్ఘ శూన్యం పండే శరీర ధార చిందిన ముగింపుల మధ్యనే కదిలే ఉనికిని సానపడుతూ .. మోగిన మృత్యు గంటల అనుసార శృతిని కప్పిన సంధి జాలంలో మొదలయ్యే పీడన అపసోపాల ఎద్దడి గతిని.. ముహూర్తానికి దొరకని మృత్యు రాతల సమవర్తిని.. యముడిని… నే నే యముడిని …
ఆమె; అనుమానంగా నవ్వుతుంది.. అతను చిత్రగుప్తుడి వేపు చూస్తాడు..
అతడు ఆమె ని చూసి దిగులుగా ముఖం పెట్టి.. సరాసరిగా ఒక సత్యం మనలని చేరినపుడు అలాగే ఉంటుంది.. ఒకరకంగా అది సర్దుకోవడానికి ఒప్పుకోదు.. అందులోనూ సాక్సాత్తు మృత్యు సత్యం .. అల్లానే ఒప్పుకోనివ్వదు.. కాని నిజం అలానే ఏ హడావుడి లేకుండానే అలానే చేరుకొంటుంది.. స్థిరపడే లోపు మారిపోతుంది.. నీకు అయినా నమ్మకామ్ లేకపోతే… గాల్లో చేతిని తిప్పుతాడు.. అతని చేతిలో … ఒక ఫైల్ . అది ఇచ్చి. చదవమంటాడు..
ఆమె; (విషాదంగా ముఖం పెట్టి )… అంటే ఈ పేషెంట్ …
చిత్ర; ఆయనని ( యముడిని చూపిస్తూ ) చేరిపోయాడు.
ఆమె ; నువ్వెలాఅంగీకరిస్తావ్ ?
యముడు ; దేనిని?
ఆమె; తప్పులేకుండానే శిక్షింపబడటాన్ని..
య; అదంతా నాకుతెలియదు… నేనొకశిక్షుతుడని.. నాదగ్గర ఈ యమదండం .. ప్రాణాన్నిహరించే శక్తే తప్ప … నిర్ణయాధికారంనాదికాదు.. ఒక ఆదేశ సారం నన్ను కమ్మినపుడు నేనీలానే ముక్కలై .. తిరిగి చేరుకొన్న విశ్వాస రాశుల కిందనే ముగింపుని తెచ్చుకొని హద్దుని వేలాడదీసుకొంటాను.
ఆమె ; మృత్యువుఅసలేంటి?
య; వికృతంగానవ్వుతాడు.. మృత్యువేనేను. సమస్త మానవ హితాల తిరుగుబాటుని నేను మోస్తూఉంటాను. ఒక్క ప్రాణం కూడా సంపూర్ణ సమర్పణతో నాకోసం సిద్ధంగా ఉండదు.. మృత్యువునీ ఉనికి రెండో పరిధిని దాటి ఆపైన సరిచెయ్యని దుఃఖభోగాన్ని వరంగా ఇస్తుంది.. ఇక్కడంతా బాకీలు లేని ఎదురు దాడి.. ఉనికి మొత్తం నాకేసి పోతూ ఊళ పెడుతున్న భయం .. ఊగిసలాట.. ఓపికలేని ముట్టడితో కౌగిలిని అప్పగించిన ఇక్కట్లు.. మెట్లు పోసుకున్న తోడు.. క్రియా చప్పుడుని తోడు తీసుకొని.. ఇహిత సత్తువలా వేలాడుతున్న ఆధారాలు.. సమయం తిప్పిపోతున్న ముడుపులు ముప్పుని .. ఒరిగించి పెట్టుకొన్న మునకలు
నేను నీకొక రహస్యం చెబుతాను.. నేను నేరుగా బ్రహ్మ ని కలవగలను.. కానీ అతను ఎలా సృష్టిసాడు.. ఎందుకు సృష్టిసాడు .. లాంటి ఏ ప్రశ్నలకి సమాధానమివ్వడు.. ఊరికినే మాట్లాడతాడంతే..
ఆమె ; అక్కడ మేమనుకొనేది ఏదైనా ఉందా?
య; లేదు.. ఏదీలేదు.. ఫలమూ .. పలారహితంగాని జ్ఞానగోష.. వేలసంవత్సరాలుగా నేనీ ప్రశ్న అడుగుతూనే ఉన్నాను.. ఎవరూ దీనికి సమాధానం ఇవ్వరు.. ఓ మహా శూన్యం లో సృష్టి రచన నిరంతరమూ జరుగుతూ ఉంటుంది.. ఇది ఇక్కడే అని ఆగిపోదు.. మాటకి.. శ్వాసకి.. గతికి.. తీర్ధ రాతకి.. రీతికీ .. నీతికీ .. అతీతమై.. ముక్కల ముక్కలుగా… నా నిమిత్తం లేకుండానే నాలోకి జారుతుంది.
ఆమె ; అంటే .. నీకు పూర్తిగా ఏదీతెలియదా?
య; ఈసృష్టిరచన .. నాకొక అంతంలేని పనిని ఇచ్చoదంతే … పూర్తిగా ఏదీ నాచేతిలో పెట్టదు.. ఎప్పుడైనా ఏదైనా వాణి శూన్యంనించి వచ్చిన .. అదికేవలం ఆక్షణం ఏంచెయ్యాలో చెప్పడానికే.. ఆ నల్లని బిళం .. నేను విసిరే ఈనల్ల ఆత్మసంచీలన్నీ ఏమైతావో నాకేతెలియదు.. తెలుసుకోనంత తీరిక లేదు. ఎదోతెలియని ప్రవాహశబ్దం నాలోపల నిండిపోయి ముందుకు తోసేస్తుంది..
( అతని ముఖం నల్లగా మారిపోతుంది.. ఆమె కంగారుగా చూస్తుంది.. )
య; ప్రాణంపోయే ముందు .. ఆ దేహం పెడుతున్న శాపాలు మోసేమోసే … నేనిలా … ఇదంతా నాకొద్దు అనుకొన్న … ఎలా ఆపాలో నాకూ అర్ధంకాదు.. నేనొక నిస్సహాయుడనని .. ఎప్పుడూ ఎవరి దగ్గర బయటపడ లేదు.. కాని నీ దగ్గరెందుకిలా … స్పటికమాత్రుడిగా మారిపోతున్నానో నాకే తెలియడం లేదు..
ఆమెనాన్న ; ఇప్పుడెందుకు ఇక్కడకి వచ్చావ్? నాచేతులతో ఎన్నో ప్రాణాలని కాపాడుతూ ఉంటాను.. ఇప్పుడు నాకు .. నీగొంతు పిసికేయాలని ఉంది…
య; అంతేనా … నన్నుముక్కలుముక్కలు చేసి విసిరేసిన … నాచిత్రగుప్తుడు క్షణాల్లో అతికేయగలడు.. అప్పుడు కూడా నాకు మృత్యు అనుభవం కలగదు.. అంతెందుకు .. ఈక్షణాల తర్వాత ఇదేదీ నీమస్తిష్కములో మిగిలి ఉండదు.. ఇదంతా ఓ అహీర శూన్య ప్రయాణం .. ఒద్దికలేని జ్ఞాన ప్రకాశంపై ముసురు కప్పిన బెంగ ..
ఆమె ఒక్కసారిగా నేల మీద చతికిలబడి.. నేనిప్పుడేం చెయ్యాలి.. అని ఆందోళన పడుతూ … సన్నని గొంతుతో…
నా ఇంట్లో చితి ఎప్పుడూ ఆరనీయ లేదు.. ఇప్పటికీ నా దేహం కాలుతూనే ఉంది.. అదొక నరకం.. విశ్వ బ్రహ్మాండం లో ఎవరూ శిక్షారహితులు కారు. సల సల లాడుతున్నా నాలోపలి ధర్మం నన్ను తీవ్రమైన భాదలోకి నెత్తినప్పుడల్లా ఇలా ఎదురు తిరిగి..సృష్టి హింసకి గురవుతాను … ఆ కాసేపు తృప్తి తప్ప .. దీని నుంచి ఎప్పటికీ నాకు విముక్తి కలుగుతుందో నాకే తెలియదు..
నాకు నిన్ను చూస్తే అసహ్యం … బాధా .. భయం .. అంతే తగ్గకుండా ఇష్టమూ కల్గుతున్నయి.. ఇందులో ఏది నిజం .?..
అతను వికృతంగా నవ్వి సమాధానం చెప్పాడు.
ఆమె అంతలోనే ఉక్రోషం… కసి…కోపం … పిడికిలి బిగించి….
ఆమె ; నవ్వి… నువ్వలా తప్పించుకోలేవు.. సీసీటీవీలోఅంతారికార్డుఅవుతూఉంది…
య; అతనునవ్వి … నువ్విప్పుడు ( వెనకస్క్రీన్మారి పోతుంది) నీభూమి మీదే లేవు..ఈసమయాన్ని నుంచి నిన్ను దాటించి … తిరిగి ముందు టైంలోకే నిన్ను నేనిప్పుడు పంపించబోతున్నా ?
ఆమె ; అతని చేతులు పట్టుకొని… నాఅమ్మని … నాన్ననీ అలాఇవ్వలేవా ?
య; నేను తిరిగి ఇవ్వడానికికాదు.. ఉన్నదీ తీసుకుపోవడానికే నేను… నిజానికి .. ఈ నేను కూడా .. నేను మాత్రమే కాదు…
ఆమె; ( చిరాగ్గాచూసి) ఇప్పుడు దేనికొచ్చావ్.. ఈప్రశ్నకి సమాధానమే ఇవ్వలేదు..
య; అది చివరినిమిషం వరకు రహస్యమే .. ( అంటూనే .. అతను ఒక్కసారిగా కూలిపోతాడు.. దుఃఖంలో మునిగిపోతాడు… ఆమె దగ్గరకి వెళ్ళేలోపు… బాధతో అరుస్తాడు .. అతని శరీరమంతా ఎక్కడికక్కడ రక్తంస్రవిస్తూ.. 10000 వోల్టుల కరెంటు ప్రవహించినట్లు ఊగిపోతాడు.. సడన్గా అంతర్ధానం అయిపోతాడు. )…….
బ్యాక్గ్రౌండ్లో ఒక గంభీరమైన వాయిస్ … ప్రయోక్త…
మృత్యువుల మహాసముద్రం … శోఖ నిద్ర కదిల్చిన తూఫాన్ … మాయకమ్మిన ఒత్తిడిని కమ్మేస్తూ .. భద్రచలనాలు మోగించిన కదలిక చనిపోతూ … నిస్సత్తు భుజాల బరువుకి కాలుతూ … విన్యాస సర్దుబాట్లులేని నల్ల కలువల దీపం .. శాపంతో పట్టుకొన్న జన్మ …ఆ పెద్దనాలిక పీల్చేస్తుంది.. ముక్కలు ముక్కలై .. అనంతానంత అనంతంలో నీ అనే ఉనికిని కలిపేయడమే.. ఏది నిన్ను నిమ్మలపరుస్తుందో అది లేదు… ఎప్పటికీ లేదు.. ఉన్నదేదో అది కనిపించదు. లేనిదీ ఎలానూ లేదు. ఇదొక మహా విశ్వాసం దిద్దిన బొట్టు.. కంట్లోనే సమూహ రాత్రంగా ఉండిపోయిన ఆచూకీ ముడుపుల కన్నెర్ర .. అందిపోసుకున్నా పుట్టుక.. ఏది ఉందో అదే ఉంది. ఏది లేదో అదెప్పటికీ లేదు. ఈ వినపడుతున్నాదేదీ నువ్వై వినడం లేదు.. అంతమై నీ ఉనికిని నిర్ణయించక వింటున్నావా.. ఇక్కడా నీ నిమిత్తమ్.. నా నిమిత్తం అని లేదు.. కానీ ఇంకేదో నిమిత్తం ఉంది… కానీ ఆ ఉనికిని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు.
Screen down
…………………………………
తను ఎప్పుడూ అలాగే … ఆనల్లని గదిలో … ఎర్రగా కాలుతూ కనిపిస్తుంది.. ఆరోజు అలానే.. నాప్యాంటు ఊడదీసి.. నామర్మా … ( పదంపూర్తిచెయ్యలేకకష్టపడుతూ) … తన ముందే నన్ను ఛాతీలో … పొత్తికడుపులో … బుల్లెట్స్తో మొత్తం దేహమంతా జల్లడచేశారు…
అప్పుడేచూసాను… మూసుకుపోతూన్న నాకళ్ళు అలాగే ఉండిపోయాయి.. తను కణకణలాడూతూ .. ఎర్రగా మెరిసిపోతూ .. ఒక భయంలోకి కమ్ముకొని … ఈభూమి మీద మిగిలిన నిద్ర మొత్తాన్ని కాల్చి భస్మం చేసి సర్వాన్ని తలకిందులుచేసే శక్తి ఆకళ్లలో దాగి ఉందేమో ..నేను చనిపోయాననే సమస్త అర్ధాలని అది మార్చేస్తుంది..
వేగంగా నాలోపలికి ఆ శ్వాసాలన్నీచేరిగడ్డకట్టి… మోయలేనంత .. పెద్దకొండలై … వాటి బరువు కింద నలిగిపోతూ… నాకు నేనే కనపడని .. కేవలం కళ్ళగా ఉండిపోయిన ఈ నిర్దయదశ … నేను చనిపోయాయన్నది … నేనిప్పటికీ మోయలేనంత దుఃఖం .. అదీ తనని తల్చుకొంటే..
ఇప్పుడిక ఏం కనిపిస్తుందో అదేంటో నాకు అర్ధం కావడం లేదు.. అయినా చనిపోవడంతో ఇదంతా ఆగిపోదా ? అన్నీ వెంటాడుతూ నేనా వెనకవస్తున్నాయి..
Back ground voice ….
పలకరింపులు మధ్యంతర సంధి .. తెగిపోయిన విశ్వముద్రల ఐకాంతక చెమ్మ ఆరకముందే .. నాదే నాదేనని ఊపిరి మెత్తగా మసకబారి పెద్దసందడి కదలిక మోసిన పగటి చిత్రాల వాకిలినిండి.. మాదక మొహాల తుది దశమి కుదిపేస్తూ … చలనమూర్తిని అప్పగించిన మెలిక గింజుకొంటూ … ఇదిమరలా ఉండిపోని వ్యాఖ్య నిరాహాలపై .. విసిగిన చిత్రనిద్రల పోలికనీ కప్పిపుచ్చుతూ… అంతటి అనంతంలో కదలికల్ని ముట్టడి చేస్తూ .. దీర్ఘ చలన వైధవ్యంలో ఇగిరిపోతున్న మంథన సమూహాలు ఓడిపోతూ ,, ఇంతేనని లేని ఉపరితల ముద్రలతో కరిగే నిద్ర మూర్తుల సంధి సూత్రం తెగిపోయిన పోలికల జ్వర తమకాలు.. ఉండీ లేవదీసుకొన్న ముహూర్త దిగులు.. నల్లని చెమ్మ దిద్దిన అడుగులు.. ఇంగిత సత్తువు నేర్పరి ఊగించిన క్రియా ధారల కంటి తూగు.. చావు ఏడేడు పుట్ల మునక… అందిపోసుకొన్న అడ్డంకి .. శరీరంలోకి జత చేసిన ఊపిరి కంతలు.. తెగువ లేని చీకటి సంతాప హద్దు.
Screen down
…………………………
EPISODE -9
Background voice ప్రయోక్త
కొన్ని స్వయం మృత్యువుల నిద్ర కాలుస్తూ … అనర్ధం జరిగిందని గిల గిలా కొట్టుకొన్న .. దేహ దర్శనాలు జరిగే .. మంత్రం తమకాల వర్ణ దశని నేను ఎర్రగా కాల్చి కలలోకి తప్పుకొంటాను. ఇంకా అదే ముఖాన్ని ముద్రిస్తూ తలలోనే ఉంచిపోయిన రహస్య పొగగా … జ్ఞాపక చలన మూర్తులని అప్పగించిన తూర్పు శిఖరంలో వేలాడుతున్న శిక్షాశిల పాతిపెట్టిన పేజీలు … జేరగిల బెట్టిన కంటి సూత్రాలు … ఉనికికి వేరుచేసిన అలారపు సీసాలు … మరిగించిన ఇంగిత హద్దులు ఒప్పుకోని ఓర్పుకి మోసుకొని తేడాగా ఉండిపోయిన మసక మాటల తొందరలోనే మంచు చల్లని ఆశీస్సు.. ఇదంతా నాకు తెల్సిన స్వయం కాలుడు..
ఆమె సడన్ గా స్టేజి పైకి వచ్చి తన గొంతుతో మొదలు పెడుతుంది… ఆమె ఎదురుగా డాక్టర్ వస్తుంది.. ఆమె చెబుతూ ఉంటుంది.. ఆమె నల్ల అంగీ తో .. ౩౦ ఇయర్స్ ఏజ్..అందంగా ఉంటుంది.
నిద్ర ..తిండి ..శ్రమ ..ఆలోచన.. పని.. శ్రద్ధ … అన్నీ సమస్యలే … అవీ మోయలేనంత పెద్దవిగా ..
దీపం చనిపోయిన నిషాద ముద్రలు కాపలా పెట్టుకొన్న మధ్య రాత్రి మూలల్లో కొంచెం మెదిలిన కన్నీరు.. నాది కాకపోవడమే తట్టుకోలేక పోతున్న…ఆ పక్కాగా తను ఇప్పుడు లేడు.. నాకు రెండు .. మూడు వార్నింగ్ లెటర్స్ రావడం చూసి.. ఈ ప్రేమ తన కెరీర్కి ఓ మెట్టు కాదని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏడవగలిగిన గుణమంతా కరిగిపోయింది … ఇక మిగిలింది.. నేననే ఓ శూన్య సమాధి కలిపిన ధ్వని మూర్తుల హోరు.. కదిలిక లేని నా నిట్టూర్పులోని ఇరుకు.. రక్తపు బురద .. కంటి నిండుగా సంధించిన కౌగిలి మత్తుల ఊసట…
Doctor; నిన్ను వదిలేసి వెళ్ళిపోయాక ఇంకా ఈ మాటలు ఎందుకు ? అతను చనిపోయిన.. బతికున్నా ?
ఆమె ; అదే జరిగి ఉంటె ఎలా ఉండేదో …( ఆమె విషాదంగా ఊపిరి తీసుకొని)
నాకు లోపల ఓ భారీ విస్ఫోటనం లాంటిది.. ఇదంతా .. డిప్రెషన్.. డ్యూటీ ఓ కరెక్ట్ గా పెర్ఫర్మ్ చెయ్యలేక job resign చేసి.. సేవింగ్స్ amountతో ఇండియా అంతా తిరగడం మొదలుపెట్టా.. కాశ్మీర్ చేరుకొని .. హోటల్లో స్టే చేసాక .. రిసెప్షన్ నుంచి కాల్ .. గెస్ట్ వచ్చారని.. దిగి కిందికి వెళ్లి చూస్తే .. వీడు… అప్పటికి ఇంకా రాత్రి ఎనిమిది గంటలే … రిసెప్షన్ నిండా జనం .. చూస్తూనే.. నా కాళ్ళ మీద పడిపోయాడు.. తల కొట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు.. రూంని డబల్ occupancy కి మార్పించి .. రూంలోకి తీసుకు వెళ్ళాక .. నువ్వు ఊహించగలవుగా … కరువుతో ఉన్నాడు.. కోరికతో గిల గిల లాడుతున్నాడు .. నేనూ ఏం అనలేదు.
తింటున్నాడు.. తాగుతున్నాడు.. మాటలని వదిలిపెడుతున్నాడు.. చూపుని కడుగు తున్నాడు.. మసి పూసిన గొంతుని అద్దం తో కొయ్యలాని చూసినట్లు అరుస్తున్నాడు. .. కదిలిపోతున్నాడు .. కలవరపడుతున్నాడు.. గంబీరంగా చిత్ర విచిత్ర భయాలతో కదులుతున్నారు.. ఎత్తి పడేసిన మూర్తుల మధ్య తప్పిపోయిన విశ్వ రాక్షసి ముద్రాలని నాపైకి కురిపిస్తున్నాడు.. కాళ్ళు పట్టుకొణ్టనున్నాడు.. ముద్దులు పెడుతున్నాడు.. నా కాళ్ళని మంచం పైనే కడిగి .. ఆ నీళ్లు నెత్తి మీద వేసుకొన్నాడు.. పసి పిల్లాడా ? నిమిత్త మాత్ర దుఃఖ చరితుడా ? తను నాకు తెలిసిన పురుషుడిగా కనిపించలేదు.. కాని నచ్చుతున్నాడు ..
కాని చాలా సేపు ఆర్గుమెంట్ జరిగింది..
పురుషుడిగా నేను వదిలించుకోలేని పట్టూ బిగువులు ఏవో నన్ను చంపేస్తుంటే .. ఏదో ఒక చిన్న మాట నానుంచి .. జారింది అంటే.. అవన్నీ .. వంశ పారంపర్య పూర్వ స్పృహలు.. ఎత్తి పారేసుకున్న పూర్వ జ్ఞాపకాల దేహ నిర్దయ .. నేను ఎప్పటికప్పుడు జయించే ప్రయత్నం చేస్తూ ఓడిపోతుంటాను..
నువ్వూ దీనికి సహాయం అందించాలిగాని.. మొత్తానికే నన్నలా కొండ చివర వదిలేస్తే .. మొత్తానికే దూరమైపోతూనుగా .. అనే నా కాళ్ళని పట్టుకొని .. తన గుండెలకి కొట్టుకొంటున్నాడు.
నాలోపల గట్టి పెంకులన్నీపగిలిపోయాయి.. ఇద్దరమూ అలా షవర్ కింద తడుస్తూనే ఉన్నాం..వణికిపోతూనే ఉన్నాం.. తానే ముందు కోలుకొని నన్ను రూమ్ లోకి మోసుకొచ్చాడు. పచ్చి కర్పూరం భగ్గుమన్న వాసన .. ముద్ద కట్టిన గొంతు.. విసిరి పోయిన శ్వాస ముఖాలు.. ఆకర్షణ రెండోసారి విరిగిన కలియిక.. మత్తెల్లి చూపుని బరువెక్కిన్చే కన్నుని తాగి .. ఇంకొంక శ్వాసని కరిగించే తత్తరపాటు.
స్త్రీగా చెమ్మగిల్లిన దుఃఖంలోంచి మహా దర్శన .. స్త్రీనైనoదుకు … ఒక సంపూర్ణ పరిమళం తో కూడిన ఆనంద తమకం.. పురుషుడి విశ్వరూప మహా సందర్శన .. లోపల మిగిలి పోయిన మంచు గాలుల మంట.. తెగిపడి రాలుతున్న దేహాల గమక ఒరిపిడి ముద్రల మధ్యనే ఉండిపోయిన ఐహిత ఘనీభవన స్థితులన్నీ కదిలి ఒరిగి చేరుతూ అదొక దీర్ఘ ఊపిరిని తీస్తున్న ద్రవ శిఖరాల కూల్చివేత .. నేను నేనుగా ఉండిపోయిన ముద్దల .. ముద్దల .. జంట నిద్ర.. కదిలిపోతున్న జ్ఞాన తీపిని పలకరించే పెదాల మడుగు.. అటు .. యిటుకి కాని విశ్వనీలంలోని కంటి రాశుల పరవశపు చీకటి.. హటాత్తు వెలుగు..
( o small gap.. stage darkness )
ఆ తెల్లవారు జామ్ మా గైడ్ తీసుకెళ్లిన పెహాల్గమ్ వెళ్లాం.
ఆకుపచ్చని సృష్టి మహాలయం .. విశ్వ చమత్కారం దిద్దిన కౌగిలిలోని కథన దూరాలు.. వినిపించని ముట్టడి రంగుల కైవల్య శరీర ముడిని బిగదీసి ఉనికిని మోగించే కదలిక .. ఎవరమూ దూరంగా లేవని.. కట్టుకు పోయిన సంతర్ప విసుగులు మోసుకొని నేను ఈ శరీరంతో మరో దేహం లోకి పిండుకొన్న ముట్టడి రంగుల శ్వాస పల0.
ఆమె స్టేజి అంతా అదిరిపోయేలా అరిచింది..
(డాక్టర్ అది విని ఉలిక్కిపడి తన లోపలి వణుకుని సర్దుకోలేక పోయింది..) అలా ఆ అందాలు కంట్లోకి దిగుతున్నప్పుడే .. కొన్ని నిమిషాలు కూడా గడపకు ముందే.. మా చేతులు ఒకరి చెమట ఒకరు తాగక ముందే ..
వచ్చారు..
రక్షకుల డ్రెస్సులో … మాకు అర్ధం కావడానికి .. కొంచెం చాటుగా ఉన్నామని.. మేము వైఫ్ అండ్ హస్బెండ్ అనే లోపు.. మెదడు వాళ్ళేం చెబుతున్నారో అది తీసుకొనే లోపు.. వాళ్ళలో వాళ్ళు నల్ల నవ్వు గుస గుసలాని పండించుకొని.. మా కంగారుని చూసి మళ్ళీ నవ్వుకొని.. అంతలోనే పళ్ళు కొరికి.. ఒక భయంకరమైన దిష్టి చూపుతో విరగబడి.. సప్పరించే మగత గొంతుని ఊపుతూ ..
AK -47 తూపాకీ ని పాయింట్ బ్లాంక్స్లో నా తలకి గురి పెట్టి…ఖాళీ గస నవ్వు నవ్వి,, జర్దా నములుతున్న వాడి ఉమ్ముని .. నా భర్తపై ఊసి.. మళ్ళీ నవ్వి.. ఇంకొకడు …
అతనిని ప్యాంటు తీయమన్నారు..
ఇద్దరికీ కాసేపు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.. మా ప్రాణాలు మాత్రం కాసేపట్లో గాల్లో కలిసిపోతున్నాయని అర్ధమైన.. ప్యాంటు తీయడం అతనికి అర్ధం కాలేదు.. అది ప్యాంటు తీయడంతో ఆగలేదు.. కట్ డ్రాయర్ ఊడదీయంచారు.. మళ్ళీ నవ్వుకొన్నారు..
ఇద్దరకీ ఏం జరుగుతుందో ఎంత తల బద్దలుకొట్టుకొన్న అర్ధం కావడం లేదు… చెమట ధారలై కారుతుంది.. గన్ కున్న కత్తి మొనతో అతని తొడలు చీల్చారు… లోపలనించి రక్తం.. నా వేపు వికృతంగా చూసి నవ్వారు. అతను భాదతో విల విల్లాడి అరుస్తుంటే .. అంతే పెద్దగా వాళ్ళు నవ్వుతున్నారు.
ఇక అంతా అయిపోయింది..
నేను కళ్ళు మూసుకున్నాను. గన్ పేలింది. కనీసం ఓ పది సార్లు.
నేనలానే ఉన్నాను.. ఏం జరిగిందో అర్ధమే కాలేదు.. చూస్తే రక్తపు మడుగులో తను..
ఒక్క మాటకి .. చూపుకి కూడా తనలో ఓ చిన్న ఊపిరి కూడా నాకోసం మిగిలి లేదు.
ఒక్క రాత్రి గడిపినందుకే .. తన ప్రాణం నాకై వదిలిపెట్టేసాడు.
అక్కడ ఇక్కడా వినడమే తప్ప .. ఇంత కర్కశ చావుని ఇదే మొదటిసారి .. అదీ నా ఆత్మ అంతా నిండిన వాడిని చూడటం.. ఎవరికీ ఏం చెప్పాలో తెలియడం లేదు.. ఎప్పటికో ఏదో అంబులెన్సు శబ్దం.. నా ఇంటికి ఫోన్.. పోస్టమోర్టూమ్ … టీవీ ఆ లోంచి ఏదేదో అర్ధం కావడం.. అంతా మందిని ఒకేసారి బుల్లెట్ల వానతో కుమ్మేసి.. దుఃఖ కవచం జారిపోయిన నిర్దాక్షిణ్యత .. ప్రాణ లాలాహాయ .. చిత్ర ఎంగిలుల పగ .. పగ ఎవరిపై.. బలి ఎవరు.. రాజకీయ .. పోలీస్ .. బోర్డుర్ సెక్యూరిటీ అంతా ఏమైయ్యారు.. ఏంటో తెలియదు.. బుల్లెట్స్ తో నిండి పోయిన ఒక దేహ జల్లెడ ముద్దని మూట గట్టి నా ముందు పెట్టారు.
Background voice… ప్రయోక్త
ఒక బలమైన కరకు ముడుల ఒంటరి వీధిలో చనిపోయిన నిందలు.. మన తప్పుకాని శిక్షలమద్యనే ఊరేగే ఐహిత జ్ఞాన బిక్షకి చాపిన చేతుల నిండా రక్తమే.. ఎక్కడో తప్పి పోయిన విశ్వాస రాజీల దుఃఖ మండలంలో గోష.. నిందలని కలిపి పెట్టుకొన్న మూల సూత్రాల కరకు ముడులు.. ఏది ఎటునుంచి కూలుతూ ఎదురు తగులుతుందో.. విపత్తుని కదిలించే మునకలు … వేలాడుతున్న మాంససగాల ఊపిరి కదిలి ఒప్పుకోని శిలాశాసనాలు.. అసహన .. సహనాల మృత్యు వాటిక .. శవాల పేటిక.. సంస్మరణ లేని నిరాధార దాడి .. పెద్దదైన నీటి గొంతు పులిసిపోయి పుండు పడి.. పురుగులు .. పాములు చేరి.. చెవులు పగిలేలా గంటలని మోగిస్తూ.. విశ్వాస సగం లోని కొండలని కలిపి చుట్టి .. కథన ముద్రలు జల్లెడ పట్టిన ఉనికితో ఊరిపోయింది ముఖాలు ముద్దరాలు పడి.. కొంచెం చేరదీసుకొన్న ఇనుప కండారాలు తుప్పు పట్టి.. సల సల కాగుతున్న మంటల్లో .. ఒక పెద్దదైన ఉనికిలోకి కాలిపోయిన చావు మూటలు..
………………………
Episode -10
ఎవరూ లేని స్మశానం …
ఆమె గజల్ పాడుతూ ఉంది.. సాంప్రదాయక గజల్లా లేదు.. అంతా మాయ కమ్మిన నరక ప్రవేశంతో .. కాగిన దేహం ముక్కలై.. కేవలం గొంతు మాత్రమే మిగిలి చెలరేగిన పాటలా .. స్నూతింగ్ గా లేదు.. బుల్లెట్ శ్వాస కోశాల్లో ఇరుక్కొని రగుడుతున్నట్లుగా ఉంది.. చావు కాలుతున్న కళ్ళలోంచి రాలుతున్న పిడుగు ముద్దలా ఉంది. తన భర్త సమాధి దగ్గర .. పైనుంచి .. రక్తం చెమరుస్తూ ఉంటుంది..
మృత్యు దుఃఖం గురించిన గజల్ .. ఒళ్ళు గగుర్పుని ఇచ్చే జీర.. తన మొదటి ప్రేమికుడు.. చూపుని తెప్పించడానికి ఓ మాయ లాంతురిని తీసుకొచ్చి.. ఆమె చుట్టూ మూడు రౌండ్లు తిరుగుతూ.. ఆ తిరగడంతో .. లాంతురు వెలుగుతో గాయపడుతూ.. మూడో రౌండ్లో ఆమె చూపు వచ్చి.. అతనికి పోతుంది. అతను మహా ఆనంద పడతాడు. గజల్ పాడుతూనే .. ఆ చెమరిస్తున్న రక్తాన్ని ఒంటికి రాసుకొంటూ ఉంటుంది..
విశ్వాస రంపాలు కోత దేహ తీర్పుల దేహం.. తను ఉంది.. తను లేదు.. గొంతులో నిండి పల్చని కన్నులో ఊడిపోయిన నరకాలని ముద్ద చేసి.. కథలని ఓర్పుతో చుట్టిన ముతక కంటిలోని బరువు కెలికిన బూటు కాళ్ళు.. (అప్పటి వరకు పై మాటలన్నీ చెబుతున్న సంధాన కర్త .. ఆమె ని కలిసి…)
సంధాన కర్త ఆమెని చేరతాడు.. ఏంటి తల్లి ఇదీ .. లక్షల మంది.. నీ పాటకై స్టేజి దగ్గర ఎదురు చూస్తుంటే .. ఏంటి నువ్విక్కడిలా.. ఏం జరిగింది?
ఈ స్మశానాన్ని దాటి నాకు ఎక్కడికి వచ్చే అర్హత లేదు.
ఎందుకలా?
ఇదంతా నా వల్లనే.. నేనే తనని చంపుకొన్నాను.. తను వద్దంటూనే ఉన్నాడు.
నేను చెరిగిన నిప్పు కన్నుతో.. నా మాటనే కాదంటావా ? అన్నట్లు చూసేసరికి … కాశ్మీర్ కి వెళ్ళాం.. రాత్రి చాలా పొద్దుపోయాక చేరుకున్నాం …
ఓడిపోయిన పురా ప్రేమల గురించిన దిగులు , సమాధి కాబడ్డ ఆ కథలపై నిర్మించిన ఇంటి అలజడి.. సరిహద్దు త్యాగాల్లో విడిపోయిన ప్రేమ కథలు.. మృత్యు తాండవం చేస్తూన్న పేటికల్లో వెలిగే లాంతరు కథలని చెప్పే గజల్స్ అంటే తనకి చాలా ఇష్టం..
ఎంచు మించుగా అన్నీ తను రాసినవే .. ఒక్కోసారి ట్యూన్ తనే సరి చేసేవాడు.. పదాలని ఎంత నాజూకుగా .. ప్రేక్షకుడిలోకి వదలాలో తనే చెప్పినపుడు నేను ఆశ్చర్య పోయేదానిని..
నాన్నకి చూడగానే నచ్చాడు .. అమ్మ లేదు.. పెళ్లి అంతే హాయిగా ఖాయమై పోయింది. పెళ్ళికి ముందే తీసుకెళ్ళమని నా పోరు.. కాని పెళ్లి కాగానే అని.. అందుకే .. చేతి గోరింటాకు ఆరాక ముందే.. ఇంకా మెడలో నూలు మంగళసూత్రం ఉన్నప్పుడే.. తన కళ్ళకి పారాణి.. ఎప్పుడూ సాక్స్లు వేసి కవర్ చేసెంత సిగ్గు… చాలా మొహమాటం..
ఎంతంటే.. నేను ప్రదర్శన ఇస్తూ.. ఇది రాసింది తనేనని చెప్పనిచ్చేవాడు కాదు ..ఆ సిగ్గు తను భరించలేననే వాడు. రాయడం తప్ప తనపైకి ఏ వెలుగుల్ని ఆశించేవాడు కాదు.
ఆరవరోజుకే కాశ్మీర్ చేరుకున్నాం.. ఆ అందం లో తన్మయులమై.. తను ఫోన్లోనే కొత్త గజల్ టైపు చేస్తున్నాడు .. నేను నన్ను చూడటం లేదని అలుగు తున్నాను..
అంతే మా చుట్టూ నలుగురు .. మిలిటరీ గార్డ్స్ లా .. నేను భయపడి మంగళసూత్రం చూపించాను.. ఒకడు లోపల వేసుకొని .. అడ్డుగా ఉన్న పైట తీసి చూపించమన్నాడు. నేను వణికి పోయాను.. నేను సర్దుకొని లోపే .. తను వాడి చెంప మీద బలంగా కొట్టాడు.. you have to have learn some manners.. అని అంటూ
మరో క్షణం ఏం జరిగిందో అర్ధం కాలేదు. రక్తపు ముద్దగా తను.. వాళ్ళు నవ్వుకొంటూ వెళ్లిపోయారు.. తనకి ప్యాంటు కిందికి లాగేసి ఉంది.. నేను అది మాత్రం పైకి లాగి స్పృహ తప్పి పడిపోయాను. కొన్ని శబ్దాలు.. కీచుమని అరుపులు.. ఒంటరి దీప సరిహద్దుల్లో పగ పట్టిన దుఃఖ సమూహాలు.. ఉందీ లేవదీసుకోనా సంరక్ష గుణాలు.. మొహమాటాలు.. నగ్న పరిధులు.. పెళ్ళగించిన పరిధి దాటి .. ఒప్పుకొని లిపి గాయం తో ఎర్రబడ్డ ఆలోచనలు బిగిసి.. తెల్లగా పాలిపోయిన ఉtనికిని ముద్దాడి పెద్ద నోరుతో మింగేసిన నడకలు.
ఆ మృత్యువుని ఆపడానికి యముడు ప్రయత్నిస్తుంటే … ఆ మరణ దశలోనూ అతని ఆత్మ రాస్తూ గానం చేస్తూనే ఉంటుంది… యముడి బాధని చూడలేక … అతని ఊపిరి తీసుకోకుండా ఆ గజల్ కి ట్యూన్ చేసి గానం చేస్తూ చనిపోతాడు.
Background voice ప్రయోక్త
విగ్రహాల పంట.. వాన జాజర కురిసిన మూర్తుల తాండవ చలన మోగుతున్న చిత్రాల ఉమ్మడి కలయిక నిండిపోయిన గుర్తులు. ఒరిగిన నిందలు,, ఇరుక్కుపోయిన ఊపిరితో ఒంటరిగా జార్చుకొన్న గాధలు.. అనామయ రాజీలతో తిరగబడ్డ చీకటి అప్పగింతలతో పోటెత్తే ధ్రువాల ఏక సన్నాహాయ విపత్తుని మోసే కథా నిద్రలకి దూరంగా నా ఇల్లు ఇంకా నాకోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆశావహ దీపాల కిందుగా నేను చలన మూర్తుల వీధిని కట్టుకొంటాను. నువ్వు మరి దేనికీ కంగారు పడవనే నా నమ్మకం. ఒక పొడవైన శూన్య సందడి మోసిన దేహం. కనీ కనపడని దీప సాయుజ్య సందడి కరుగుతూ.. విసిగిన పెద్ద నవ్వుల మాయ .. తడిచిన రెప్ప మూటల బరువుని పల్చన చేస్తూ స్నాన నిప్పుల కల్లోలం..
————————–……………….
(సంధానకర్తలోకి మరో ఆత్మ ప్రవేశించి మాటలు మొదలవుతాయి)
సమయాన్ని నంజుకొంటూ పోతూన్ననల్ల బొమ్మల వీధిలో … తగలబడి ఇంకిపోయిన చక్రాల మధ్య … రుజువు తెలియని ఆచూకీతో … మోయుంచుకొన్న మూర్తుల తీర్ధ భూమి సంశయాలు ఆడుతూ … కొంచమైనా తెలియని ఉనికి … చిత్ర పలవర ఒంపులో కాటుక పర్చుకొన్న తీరముంపుల దేహ గమ్మత్తులు.. తడి నడక నాజూకు ఒంటి పైటలు … ఊడిపోయిన గోడలు.. తట్టుకోలేక అలసట జోడించిన హద్దు … ఇరుకులో ఒద్దికగా ఉన్న శరీర బరువుని దాటిస్తూ … ఆక్రమిత దాడులతో మూసుకు పోయిన సలహాల నిండి… దాహనాభి …
మొదటి పరిధి నుంచి .. జాగృతతో ఇంకిపోయిన మూర్తుల ఒంటిగా మెట్లని నలిపి పీల్చి కప్పి దులుపుతూ..చేర్చిపెట్టుకొన్న ఉలిక్కిపాటుతో గది..ఇప్పటికే మంథన బాటలతో పట్టుకొన్న ఒంటరి ముఖాలు… తిప్పిపెట్టుకొన్న మాటలతో పండుతూ … లోపలే నిలబడిపోయిన శత్రు యంత్రాలు .. పగగా మీదకి దూకుతాయి.
Screen down
————–
EPISODE -11
మస్తిష్కము ఓ సంభాళించలేని ఓ అనుభవ గని.. అంతా అనుకోకుండా జరిగిపోతుంది.. పెద్దగా ఆచూకీ లేని భయ గందరగోళం లో దిగబడి.. అప్పగించిన తగువులని పొడుగ్గా సాగదీసి .. కొంచెం కపట ముదాలని బిగించే చూపుతో చల్లబడి.. శరీరమంతా మసక బారిన మత్తు సగాలతో వడపోసి.. కథలని ముట్టడి చేస్తూ .. తెల్లబోయిన చిత్ర గాధల నిద్రని పొడి చేసి.. సరిపెట్టుకోలేని పగటి గొంతుని ఆరబెట్టి .. ఇసుకగా పారబోసుకున్న ఆత్మ ఇక్కడ గడగడా లాడుతుంది.
ఆమెని బ్రదర్ సైకియాట్రిస్ట్ కి దగ్గరికి తీసుకొస్తాడు..
అతని రూమ్ చాలా చిత్రంగా చిన్న పిల్లల గదిలా ఉంటుంది..ఎక్కువ గుర్రపు బొమ్మలుంటాయి.. ఇంకా చిత్రమైన కత్తులు పట్టుకొన్న యుద్ధవీరుడు .. కళ్ళలోకి పొగ ఊదుతున్న మాంత్రికుడు.. సగం మునిగిపోయిన పడవ.. ఇంకా ఏవోవో.. అతనికిది ఆ పేషెంట్ తో సెకండ్ సెషన్..( డాక్టర్ మీరు నా దగ్గర దాచి పెట్టారని తెల్సు అన్నట్లుగా ఆ మాట ఉంటుంది..)
మీరేవైనా డిటైల్స్ దాచిపెట్టి ఉంటే.. ఇప్పటికైనా మొత్తం చెప్పండి.. అతను కాసేపు మాట లేకుండా భాదగా చూసి.. గొంతుతో దగ్గి.. ఓ గుటక నీళ్ళని తాగి ….
అతనిలో ఓ సహనం చచ్చి పోయిన ఫీలింగ్ … నేనీ బరువుని తలకెత్తుకోలేను అనే ఓ నిస్పృహ.. జరిగిన నష్టం పట్ల తీవ్రమైన కోపం..
నా పేరెంట్స్ నాకేం ప్రాపర్టీస్ మిగల్చలేదు.. ఇదిగో దీన్ని అంటగట్టారు.. దీనికి ఎంత ఖర్చనుకొన్నారు.. రోజూ ఏదో ఒకదానికి డబ్బు అడుగుతూనే ఉండేది.. ఫీజులకి అని ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టేసి.. తిరగ డేట్ దగ్గరకి వచ్చాక బాల్క్మైల్ చేసి డబ్బు కట్టించేది.. రాత్రులు పొద్దుపోయి రావడం.. ఫోన్ ఎస్విట్-ఆఫ్ లో పెట్టడం.. అది వచ్చే వరకు నిద్ర లేకుండా ఎదురు చూడటం .. పొద్దున్న డ్యూటీ అలసట వలన నేను సరిగా చేయలేకపోవడం.. ఇంటి పనిలో ఇంత కూడా హెల్ప్ చేసేది కాదు. ఏ చిన్నది తేడా జరిగినా విరుచుకు పడేది.. అమ్మా నాన్నలు లేని పిల్లని అన్నీ భరించాను. అన్ని భరించాను.. కనీసం జాబ్ చెయ్యడం పెట్టిన తర్వాతైనా కొంచం హెల్ప్ చేస్తుందనుకొంటే..క్లబ్స్, బ్యూటీ పార్లోర్స్, టూర్స్, దాటింగ్స్ అంటూ .. ఒక్క రూపాయి ఇంట్లో ఇవ్వక పోయినా .. నా వైఫ్ నా ప్రాణం తోడుతున్న భరించాను.. పది మందితో డేటింగ్ చేసి చివరకి ఒకడిని తీసుకొచ్చి .. వీడితో నా పెళ్లి అంది..
( టేబుల్ మీద ఉన్న గ్లాసు నీళ్లు గట గట తాగేసి)
నా PFwithdraw చేసి పెళ్ళిచేస్తే … అందరి దగ్గర నా పెళ్లి సరిగా చెయ్యలేదు.. ఏదో బరువు దించుకొన్నాడంతే నని ప్రచారం చేసి insult చేసింది.. బంధువులు .. ఫ్రెండ్స్ దగ్గర ..అదీ భరించాను..
వన్ ఇయర్ మాకు ప్రశాంతత అంతే … మళ్ళీ తిరిగి గోడకి కొట్టిన బంతిలా తిరిగొచ్చింది.. అయినా మా ఖర్మ ఇంతేననుకొని భరిస్తుంటే,, ఇప్పుడు దీని వైల్డ్ activities కి భయపడి.. నా వైఫ్ నన్ను వదిలి వెళ్ళిపోతానంటుంది.. నాకు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు..
(డాక్టర్ చాలా సేపు మాట లేకుండా ఉండిపోయి … అతనిలోకి చూసి.. తల దించుకొని..)
నర్స్ తో ఆమె ని గమనిస్తూ ఉండమని .. అతనిని లోపలికి తీసుకెళ్లాడు.
ఏం చేస్తుందో దాచకుండా చెప్పండి అన్నాడు. (డాక్టర్ అతని లోపలికి స్కాన్ చేసేసిన వాడిలా చూస్తూ)
అతని దుఃఖం నిండిన గొంతుతో నా భార్యతో నన్ను ఉండనీయడం లేదు..తన గదిలో ఆమెని పడుకోబెట్టు కొంటుంది.. మమ్మల్ని సంసార సుఖానికి దూరం చేసేసింది..
నిన్ను నైట్ దైర్యం చేసి తను నా గదికి వస్తే ,, ఓ అర గంట తర్వాత హాలులో పెద్ద చప్పుడు … ఉలిక్కిపడి బయటకొచ్చి చూస్తే .. లక్ష రూపాయల విలువైన టీవీ .. ముక్కలు ముక్కలై ఉంది.. నేను కోపంగా దగ్గరికి వెళ్ళబోతే నా చెంపల మీద బలంగా కొట్టి . నా భార్య నిలువు గుడ్లేసుకొని నన్నే చూస్తుంది.. నాకా క్షణం గొంతు పిసికి చంపేయాలనిపించింది… జైలుకి వెళ్లాల్సి వచ్చినా సరే…
నీ చావుని నువ్వే కోరి తెచ్చుకొంటావ్.. మీ ఇద్దరు కలిసి ఉంటే వాళ్లకి తెలిసి పోతుంది .. వచ్చి నిన్ను కాల్చి పారేస్తారు.. అని అరుస్తూ నానా హంగామా చేసింది.. ఆ పక్క వాళ్ల్లు .. ఈ పక్కవాళ్ళు వచ్చి చూసి.. చెవులు కొరుక్కొంటూ పోయారు.. గంటలు పట్టింది… దానిని ఊరుకోబెట్టేసరికి.. చివరకి ఓ డాక్టర్ని పిలిపించి .. స్లీపింగ్ డోస్ ఇప్పించాక నిద్ర పోయింది.. నా భార్య రాత్రంతా ఏడుస్తూనే ఉంది.. తన బిడ్డ నాశనమై పోతాడని.. ఈ దెయ్యాన్ని ఇంట్లో పెట్టుకొంటే అని నామీద అరిచింది..
నా భార్య బిడ్డనీ తీసుకొని .. తెల్లవారు ఝాము ఫ్లైట్ కి వెళ్లిపోయింది.. తను నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయినట్లే ( అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు)
ఎదురు సోఫాలో కూర్చున్న డాక్టర్ కాళ్ళ దగ్గర కూర్చొని.. దయచేసి ఓ సర్టిఫికెట్ ఇవ్వండి.. దాని బతుకు ఎలానూ నాశనం అయిపోయింది… నన్ను నాశనం చేసే వరకు అది వదలదు.. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఓ మెంటల్ asylum లో మాట్లాడి పెట్టాను.. మీరొక certification చేస్తే నేను అక్కడ జాయిన్ చేసి రెగ్యులర్ గా వెళ్లి చూసి వస్తూ ఉంటాను.. మీకు ఎంత ఫీజన్నా ఇస్తాను .. ఈ ఒక్క హెల్ప్ చెయ్యండి..
(డాక్టర్ సమాధానం కోసం కూడా చూడకుండా గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు.)
డాక్టర్ అతనిని లేపి … రేపు వచ్చి తీసుకెళ్లండి.. నాకు మీరు ఏ ఫీజు ఇవ్వనక్కర లేదు.. అన్నాడు
ఎదురు రూంలో కూర్చున్న ఆమె.. నర్స్ వినడం తో నిమిత్తమ్ లేకుండా .. ఎదురుగా రూంలో కనిపిస్తున్న ప్రోపర్టీస్ని చూస్తూ కథ చెప్పడం మొదలు పెట్టింది..
ఆ రాజ్యంలో రాజకుమారుడు .. చాలా అందగాడు.. పరాక్రమ వంతుడు.. స్వయంవరంలో రాజకుమారిని గెల్చుకొని రెక్కల గుర్రం పై తన రాజ్యానికి వస్తూ ఉంటే.. చెప్పలేనంత ప్రేమ .. ఆనందం వాళ్ళ మధ్య… కిందనున్న విశాలమైన సముద్రాన్ని.. అడవులని.. దీవులని.. ఎడారులని చూస్తూ … ఓ బంధనలో తన్మయులు అవుతూ….నూరేళ్లు కలిసి ఎలా బతకాలో మాటలు చెప్పుకొంటూ…..
ఒక్క సారిగా పెద్ద పెద్ద గద్దల దాడి.. రాజకుమారి ని రక్షించుకొంటూ యుద్ధం చేసి రక్థసిక్తమై ఆ గుర్రం పైనే స్పృహ తప్పిపడిపోయాడు.. గద్దలు ఆమె ని లాక్కెళ్లి అక్క దగ్గరలోనే దీవిలో ఆగడం గుర్రం చూసింది.. అతనిని జాగ్రత్తగా ఓ ఆశ్రమ చేర్చింది.. అతనిని గుర్తుపట్టి వైద్య సేవలు చేశారు.. గుర్రం అతనిని బయటనుంచి కాపాడుకొంటూ ఉండేది..
అతను కోలుకోగానే .. వాళ్ళు వద్దని వారిస్తున్నా ఆ దీవికి రెక్కల గుర్రం పై బయలు దేరాడు.. వాళ్ళు మాయావులు.. నరరూప రాక్షుసులని చెప్పిన రాజు భయపడలేదు.
ఆ దీవిని గాలించాక .. రాజకుమారి ఓ గుహలో చిక్కి శల్యమై కనిపించింది.. గద్దలకి ఇష్టం లేని ఏదో పసరు ఒళ్ళంతా పోసుకొని.. దగ్గరకి రానిచ్చేది కాదు.. అవి చూసి చూసి .. విసుగెత్తి .. వదిలేసి వెళ్లిపోయాయి.
అతను ఆమె కి పళ్ళు.. నీళ్లు ఇచ్చి.. ఓ రెండు రోజులు గడిపాక కోలుకొంది..
బయటకి తెచ్చాక .. తన రాజ్యపు దుస్తులతో రాజభటులు కనిపించారు.. వింతగా చూస్తుంటే.. ఆశ్రమ కబురుతో చేరుకొన్నామన్నారు.. రెక్కల గుర్రం అలసటగా ఉంది.. ఇప్పుడు అంత దూరం రాలేను.. నాక్కొంత విశ్రాంతి కావాలంది.. నిజానికి గుర్రానికి కీడు శంకిస్తూఉంది .. కానీ రాజు చెప్పినా నమ్మడు.
భటులు పడవని ఏర్పాటు చేసారు .. చాలా అందమైన .. అన్ని ఏర్పాట్లు ఉన్న పడవ.. రాజకుమారి .. నిర్భయంగా నిద్రపోయింది . నిద్రలో ఆమె అందాన్ని చూస్తూ రాజు మురిసిపోయాడు..
అతనికి కంటిలో నిద్ర తూగు .. అక్కడే ఒరిగాడు.. లేచేసరికి అతను కట్టేయబడి ఉన్నాడు … భటులని పిలిస్తే.. వాళ్ళు రాక్షస దుస్తుల్లో .. మోసం జరిగిందని అర్ధమై .. వదిలేయమని ప్రాధేయ పడ్డాడు.. చాలా బలమైన తాళ్లతో కట్టేరేమో అవి ఎంత గింజుకున్నా ఒదులుకావడం లేదు.
వాళ్ళు బేరం పెట్టారు.. నీ రాజకుమారి హాని జరగకూడదంటే … నీ చావుకు ఒప్పుకోవాలి.. ఆమె ముందే నీ తల నరికి .. ఈ పడవలో ఆమె ని వదిలి వెళ్ళిపోతాం.. అన్నారు.. రాజకుమారి వద్దని అరుస్తూ ఉంది .. కానీ అతను సరేనన్నాడు.. చివరిసారి అతను ఆమె ని ప్రేమగా చూసుకున్నాడు.. ఆ తర్వాత నీళ్లు నిండిన కళ్ళని మూసుకున్నాడు..
ఆమె వాళ్ళ కాళ్ళ పై పడి ప్రాధేయ పడుతూ ఉంది.. ఆమె పొట్టలో వాళ్ళు తన్నుతూ ఉన్నారు.. బాధకి గిల గిల లాడుతున్న వాళ్ళ కాళ్ళని వదల లేదు..
అతని తల ఎగిరి ఆమె ఒడిలో పడింది.. వాళ్ళు వికృతంగా సముద్రం ఉలిక్కిపడేలా నవ్వారు.. ఆమె స్పృహ తప్పి పడిపోయింది.. రక్తంతో నిండి పోయింది
ఆమెని పడవలో వదిలేసి నడి సముద్రంలో .. ఏ నడిపే వాళ్ళు లేకుండా .. ఆ కెరటాల్లో కొట్టుకొంటూ పోతుంది.. చెబుతున్న ఆమె కళ్ళ నిండా నీళ్లు .. నర్స్ కి అదేమీ పట్టడం లేదు.. నర్స్ ఏంటి సోది .. అన్నట్లు వింటూ.. తన లవర్ కాల్స్ అటెండ్ చేస్తుంది.
ఆమె కథ చెప్పడం ఆపి…
ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే గాజు టీపాయ్ ని ఎత్తి కిందపడేసింది అది ముక్కలు ముక్కలైంది.. దానిలోంచి … షార్ప్ గా ఉన్న ఓ ముక్క తీసుకొని నర్స్ పొట్టలో బలంగా పొడిచింది.. వాళ్ళకి అర్ధమై.. దగ్గరకి వచ్చేలోపు .. మరోసారి…. పొడిచింది… ఆమె కుప్పకూలి పోయింది..
ఈ సరసాలు వద్దంటే వినరేం … నువ్వు బాగానే ఉంటావ్.. అక్కడ వాడిని చంపేస్తారు.. అని కోపం తో అరిచింది.
Background voice ; ప్రయోక్త
భయద రాజ్యం కన్ను మిటకరించిన శాపిత మస్తిష్కం .. లోపలి జరుపుకున్న ఉత్త్సవ ఊసులకి వేళ్ళాడుతూ .. కలబడుతున్న చీకటి ఒడిలోని దాడి..మెత్తని శ్వాసని దాచిపెట్టి దేహ నీలం పండిన కొసరింపు మాటలతో కథని వేలాడదీసిన రంగుల పొడిని కలుttపుకొని … తాగి .. తూలీ.. అప్పగించిన నిరాశని తిప్పికొడుతూ… అలసట చనిపోయిన నిద్రవరం తో పాతి పెట్టుకొన్న ముద్రల ఆచూకీని కుదురుగా లాక్కొని .. వాళ్ళు రెండో గదిలో లాల పోసుకొంటారు.
వెళ్ళాం .. కూర్చున్నాం.. మాటని పండించుకొన్నాం .. పెద్ద చెట్టు చాటులో … పెదాలు దాటినా హద్దుని ఆవిరిగా చున్నీలోకి చుట్టి.. కలతలపాటుతో విశ్వమంతా అసటలేని ఉనికిని దాచుకొని … మాటని మోగించమన్నాం.. కానీ మోగింది మరేదో.. బూటు కాలు పొట్టలోకి దిగబడింది.. ఊసిన ఉమ్ము ముఖం మీద ఆరలేదు.. కౌగిలి శిధిలమై.. రక్త నిద్ర కాటేస్తున్నప్పుడు .. నాకు గొంతుక నివ్వమని అరావాలనుకొన్న .. కోలుకోవడానికి.. అసలేం జరుగుతుందో అర్ధం చేసుకోవడానికి సమయం లేదు..వాళ్ళు చీదర కప్పిన ముడులతో … బోరున ఏడుస్తూ .. ఐహిత సత్తువలని వదిలేసి కొత్త పాటని సరిచేయమంటారు.. మృత్యువు ఎర్రబారిన హెచ్చరికిలా ఉన్న ఆ కాళ్ళ నడకలో ఇంకేం మిగిలిందని.. నేను గడుసు ముద్దలా కొండని తొలచి … కొంచెం అణుకువ లేని విపరీతాలని మరిగించి.. చలన మూర్తుల తవ్వకాలతో పెట్టుబడిగా దగ్గర చేసుకొని .. ఆ లోపల తలలు నరికిన అద్దాలని దాచుకొని ఊడిపోతాను..ఊళ పట్టేసిన దేహ నేరాల మధ్యనే నేర్పులేని ఎదురుదాడి .. ఏం జరిగింది.. ఎవరు మోశారు.. ఎవరు చూసారు.. ఎవరు వచ్చారు.. ఏదీ రిజిస్టర్ కాలేదు మైండ్లో …
Screen Down
………………………………..
Episode -12
stage పైన ఓ అద్దాల ఫ్రేమ్ .. కరెక్ట్ గా సగం లో .. ఓ వేపు యక్ష గానం కి సంబంధింఏర్పాటు.. మరో పక్క సోషల్ డ్రామా … ఇటుపక్క నుంచి .. రక్తం కారే అంగీ వాడు .. అద్దం లోంచి అటు పక్కకి వెళ్లి భాగవతార్ గా మారిపోతాడు. ఒక గంభీర ముద్రలో కూర్చుని… గొంతు సరిచేసుకొని… ఒక విషాద దర్శనకి సిద్ధమవ్వండి
విశ్వవిషాదం .. ప్రధమ శత్రువు.. దుఃఖిత నేరం లోని విశుద్ధ తంత్రీ గానం నాది.. కొసరి తినిపించిన మృత్యు పత్రం తెరిచిన వెసులుబాటు ముద్రల దేహ కవచం చినిగినపుడు.. ఎర్ర కన్ను యముడు తొంగి చూసిన వృత్త చలన అరచేతి రాత ..పెద్ద గాధల పాత్ర దర్శన విప్పిన తెరలు.. అద్దాలు ..మేకప్లు .. ఊరబోసిన చావు వాసనలు.. వాంఛ చెలగాటాలు.. నేరమూ నాదే.. నేరం చేసినవాడు నావాడే .. సరిలేని సంకల్పం కదిలి చెప్పిన మృత్యు చక్రం కథ.. ఇక ఇదే.. అని ప్రేక్షకులకి చెబుతాడు.
(మొత్తం స్టేజి అంతా యక్షగాన వేదికగా మారిపోతుంది…)
Bhagavathaar;
అది సింధూర జలం ప్రవహించే మంత్రం యుద్దపు కొండ.. చలన చరిత్ర సాయం పట్టిన యుద్ధ హింస తలపడే దేహాల చిరునామాలు.. ఇది ఉంది.. ఇదే ఉందని ఊరేగే విరగబాటు తవ్వకాలలోంచి పది లేచిన మృతు జల చక్రం తిరుగాడే నేల. భయం నీరాజనాలు ఎత్తిన ముట్టడి చిందులు.. కలవలపాటు నిద్ర విందులు.. చావు పల్లకీలు.. నిస్సహాయ శాపాలు.. అంత కలిపితే నేను .. నాలోని పాత్రల కబేళా .. చనిపోయి లేస్తూ..
తన ఉనికి కోసం పోరాడి .. పోరాడి.. పోరాడుతూనే.. విజయం సాదింఛావని ఆ రాజ్య ప్రజలు అంటే.. సంబరాలు చేసుకొన్నారు.. గుడి గోపురాలకు మొక్కులు తీర్చారు.. ఊర్లన్నీ అలంకరింర్చుకొని విందులు చేసుకొన్నారు.. తమ బతుకుల కష్టాన్ని పాడుకొంటూ ఆనందంగా ఉన్నారు.. విశ్వ బృకుటి విభ్రమ చెందేలా భయరహిత తాండవహేల .. సర్రెర వెలుగుని చప్పరించిన ముప్పు పరిధిని తోడు తెచ్చి .. గగనమూర్తిని తట్టి లేపిన విశ్వ చంద్రుడి వర్ష స్తూపం ..
భర్తలని పోగొట్టుకొన్న ,,, కొడుకులని పోగుట్టుకొన్న తల్లితండ్రులు ఒక్కటై… యుద్ధ విద్యలు నేర్చి.. ఒక్కసారిగా దండయాత్ర చేశారు.. నేరుగా రహస్య మందిరంల్కొకి చెలికత్తెలు సాయం తో ప్రవేశించే .. రాజుని విషం కలిపినా మద్యం తో చంపి.. ఆ తర్వాత యుద్ధం లో .. మిగతా సేనని.. చంపి.. రాణి .. కొడుకు ( ఇంకా పదేళ్ల వాడే) ని రాజుగా ప్రకటించారు .. మొత్తం స్టేజి అంతా యక్షగాన వేదికగా మారిపోతుంది…( పాట)
అమ్మా… భూమి తిలకమై తిరిగే నా రాజ్యం.. ఆనంద తాండవానికి పోసింది ఆజ్యం..
స్వామి చిత్రమై వెలిగే నా సాయుజ్యం … నర్తన ధ్వజకీర్తికి చేసింది యుద్ధం …
కామి మంత్రమై నీలిగే నా ఆయుధం … కథన ఆవర్తనకి మోసింది కాష్టం …
పులిమి నాలికై పగిలే నా విలోలం .. మూర్చన ప్రతీకలకి నేసింది వస్త్రం ..
ఈ యుగానికి పేరే యమకాష్టం … యమకాష్టం … యమకాష్టం
గతాల విభజన ముద్రల చుట్టూ .. కదిలిన ముఖాల నిద్ర దర్శన విప్పి చెప్పిన లిఖిత రాశుల కంటి పంట ఊయసాలు పోయే .. సమయ నిర్మాణ అగడ్తలని గుప్పించి చంపే నిద్ర విషాద ముప్పెనలు.. కలశపు దేహ రాశుల కళలకి పిండేసిన ఆత్మల బరువుని కట్టి తెర లేపాక .. ఖాళీలని పండించే యుద్ధ గడువు.. శత్రువూ నావాడే.. నేనూ వాడికి శత్రువునే… గడప గడపకి .. పొట్ట చీల్చిన జ్ఞాన గడువు దగ్గరగా మృత్యు పల్లకీని దించుకొని.. ఆయాసం తీర్చుకొంటూ .. మరి లేవక అక్కడే ఉండిపోయినపుడు మొదలైన యమకాష్టం.
డాక్టర్; నేనొక డాక్టర్ అని .. సైగలతో చెప్పి… తర్వాత అభినయిస్తూ …
దేహమొక మృత్యు రహస్యం దాచుకున్న పాముల కుండ … లోపల నీళ్లు .. బంగారు నాణేలు.. చుట్ట చుట్టుకొన్న పాము.. స్వప్న మహా మంత్రజాలంలో విడదీసుకొన్న నిద్ర ముడుపులు..
కదలని ముట్టడితో కదిలే విశ్వగతి పట్టుకుని తలకొట్టుకొన్న నిశ్వాస భీకర సంధి సూత్రం. నాతో ఉంది.. నాతోనే ఉండదు.. నమ్మించి మోసం చేసి దుఃఖ సముద్రంలో ఓలలాడే పడవల ఆశువు మాత్ర.. మింగిన గొంతు.. మస్తిష్క చలన బ్రాంతి.. వదలని వల ..
కన్నెర్ర చేసిన ముట్టడి స్వర్గాల నిద్ర స్ఫురణ .. ఏక దీక్షకై లేచిన శ్వాసల మాయా పేటిక..
శ్వాస మా పాలిట పండిన శాపాల ఆయుధం..
ఎనేస్తేషియా కి ముందు.. వాళ్ళెలాగైనా బతకడానికి ఎన్నో కథలు చెబుతారు..
కళ్ళ నీళ్లు పెట్టుకొంటారు.. జాతకం బుక్ తీసి చదువుకొంటారు..ముహూర్తం పెట్టించుకొంటారు .. నుదుట బొట్టు పెట్టించుకొంటారు.. కొబ్బరి చిప్పని ముట్టుకొంటారు.. కళ్ళకి ఆ నీరు రాసుకొంటారు.. కళ్ళు మూసుకొని చీకట్లో దేవుణ్ణి చూస్తారు.. పాపాల ముట్టడి జరిగే .. ఇక అంతేనని పగ్గాలు వదిలేస్తారు. పిల్లలని మళ్ళీ మళ్ళీ చూసుకొంటారు.. భార్యకి కూడా తెలియకుండా దాచిన డబ్బు కోసం చెబుతారు.. చివరకి స్ట్రెచర్ పై సర్దుకొంటారు.. తన ప్రాణ ధారని మాలోకి ఒంపి హాయిగా నిద్రలోకి జారుకొంటారు..
వాళ్ళ కలల ఎడారిలో .. నేను మృత్యు కలశం తీసుకొని.. ఓ శూన్యం లోకి చేరుకొని తప్పిపోతాను..
చుట్టూ అంధకారం.. అరుస్తాను.. గగ్గోలు పడతాను..నా ఊపిరిని మూట గట్టి పేషెంట్ ఒంటి లోకి వదలాలనుకొంటాను.. దీర్ఘంగా రోధిస్తాను… విశ్వ సంఘర్షణ లోంచి.. ఈ ఒక్క ప్రాణాన్ని రక్షించమని రోజూ వేడుకొంటాను.. ఏళ్లగా నా ప్రార్ధన ఇదే..
కొంచెం మృత్యు దర్శనని నటించే జీర్ణ చీకటి కమ్మిన వేడుకని కాదని నేను తలపడే బరువుతో చుట్టుకుపోతాను.. కనికరం కోసం అల్లాడుతాను..
మృతువు మురిసిన పాముల కొండ.. దీపపు అండ .. కలతల నెత్తురు బండ,,
తాను మోసిన రోజుల ఖర్చు.. కథలకి దొరకని జ్ఞాన వలసల తీరు..
క్రతువు కోసిన శస్త్రాల చమురు ఎండా .. శాస్త్రపు కండ .. నలతల జిగురు కుండ..
అదే దేహం .. కాలుతున్నాయమకాష్టం …
నిమిరింతలు లేని విశ్వ సందడి ఉనికి తోడైన శరీర రాశులు.. ఓపిక లేని కథనాల దేహ శస్త్రాలు
విడిచి.. అరిచి.. కరిచి.. తలచి .. పిలిచి .. శిదిలించి .. ముగించి.. చేరుకున్న యమకాష్టం
(భాగవతార్ పాడుతుంటారు .. ఆమె అభినయిస్తుంది.)
ప్రయోక్త ;
యక్ష గాఢ సాగిలాపడ్డ నిర్ణయం మూర్తుల చితి పేర్పులో .. మృత్యు తివాచీ ఎగిరిన ముల్లులా దండన .. కదలనిది.. కదిలితే దొరకనిది.. అమాంతం మార్చుకొని ఇంకిపోయిన జ్ఞాన మహా తర్పణలో బీటలు తీసిన చీకటి అవహేల నిద్ర పొడిని గ్లాసులో కలిపి .. మత్తు జాతర ఉడకబెట్టిన ఛాయల బీకరుని బోర్లించి.. ఉనికి పీల్చిన దేహ మగత కథలని అప్పగించిన … రాత్రి కాపుగాచిన నిరూప చలన కేంపుని అరగదీసి.. పైకి చేర్చిన ఆయాసం.
ఇక్కడ గాధలు తడిచిన సమాధుల మధ్యనే తిరుగాడే దేహ విలుకాడు … నిదర్శిత లక్ష్యం ఎప్పుడో వదిలేసి ఏడుస్తూ ఆ మూలకి ఒరిగిపోయాడని తెల్సి నవ్వుకొంటారు.. కొంచెం జరగాల్సిన దేదో బయటపడక ముందే .. రెండో దేహం బదులడిగిన వంతులతో.. దేహ బిగువుని కాల్చిన చితి మంట .. ఆ గదిలో ఇంకా ఆవిర్లు వదలుతూనే ఉంది.
Screen down
EPISODE -13
డాక్టర్; ఇది నాకు రోజూ భుక్తని కాదు.. నా జీవ చైతన్య ధార అక్కడే ఇరుక్కొని ఉంది.. నా కలల సాంద్రత .. నా నమ్మకం .. నా ఆశల జ్ఞాన విభాషణ అక్కడే గూడు కట్టుకొని నన్ను చూస్తూ ఉంటుంది. అతను లేదా ఆమె తమ సంపూర్ణ విశ్వాసాన్ని .. తన ప్రాణాన్ని నా చేతిలో పెట్టి .. స్పృహని కూడా నాలోకి నింపేసినప్పుడు ఆ బరువు చాలా అసాధారణమైనది. సామాన్యురాలినైన నేను .. దానికి అర్హతని సంపాదించడమనేది.. అది సృష్టి సుకృతమని భావిస్తాను. ఒక్క రోజులోనే.. సంతోషం .. విషాదం .. రెండూ.. ఒకరు వెళ్ళిపోతారు.. ఒకరు జయిస్తారు.. పూలూ .. పండ్లు.. శాపాలు.. దీవెనలూ.. భయమూ. ధైర్యమూ .. వెలుగూ.. చీకటి.. ఉంధీ .. లేదూ.. అన్ని ..
లోపలివీ.. లోపలని ఖాళీ చేసే బయటవీ.. అది సర్వస్వమై నిండి పోతుంది.. అది విసుగై విడిచి పోతుంది.. కళ్ళలోకి చూపై రుణపడ్డాం.. దేహ విఘాతి రాసిన మెరుపు నిద్రని వదిలి పెట్టాం ..
ఇంతలోనే .. ఇందాక ఆపరేషన్ జరిగిన పేషెంట్ నాట్యం చేస్తూ .. అనేక ముద్రలతో .. తన తల లోని భాద .. అది వచ్చినప్పుడు తన కాళ్ళు నాట్యానికి సహకరించక పోవడం.. అలా సహకరించని ఈ శరీరం బతికి ఉండటం కన్నా .. చావు మంచిదని చెప్పేలోపు..
డాక్టర్ ఆ మాటని ఆపి.. దీర్ఘ దిగులు నిందతో చూసి…
సర్వ విశ్వ ఆహార్యమే దేహం,, ఇదొక పంచభూత గని .. నిద్రాణ మెలుకులోని శ్వాస ముద్ర..
ఆ సంకల్పం నాది కాదు.. యమధర్మరాజుది.. నా ధర్మం కాపాడటమే.. సృష్టిని వ్యతిరేకించడం కాదు..
నా శాయశక్తులా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను.. నువ్వు .. నేనని లేదు.. నాఓటమి నాకు నా మృత్యువు తో సమానం..
అద్ది తీసిన మహా నిర్మాణం లో విశ్వ నరుడి ఆట నాలో మొదలైంది..
ఆమె ని ఓ మంచం పై పడుకో బెట్టి.. నర్స్ డాన్స్ చేస్తూ ఆమె ఒళ్ళంతా నిమిరి .. నీరుని పోసి.. మరో వైద్యుడు వేపు చూస్తే .. అతను ముందుకు వచ్చి.. ప్రేమగా ఆమెలోకి చూసి….
నేను కలల ప్రసాదిని … నీ కళ్లు మూసుకొని .. నా నిద్రని తీసుకొని.. ఓ చల్లని పడవలో ఎక్కి .. ఆ పడవ ఓ మహా జేజి .. తలవని కలవరం .. అగ్ని పునీత .. ధర్మ మూర్తుల శిధిల గంట .. విశ్వ నరుడి కీర్తనని మోసి ఆత్మ పత్రం.. శాంతి ధ్యానం .. కల్లోల ముద్రాలకి ఆవలకి దాటుతున్న దీవి సూత్రం.. మంగళ మహా యానాం …
దానిలోకి ఎక్కి నా కలలోకి రండి..
అక్కడ నీ బాల్యం.. మీ బంధు వర్గం.. నీ పెళ్లి సందడి.. శోభన రాత్రి చెమట ముడులు.. సిగ్గు తోరణాలు.. పూర్ణ అసువిని మోసిన వంట ఇల్లు.. తారీకులేని దస్తావేజు పంచాయితీలు.. కథలు .. కమానీసులు .. తెగడ్తలు.. నిద్ర బోర్లింతలు నువ్వు మొదటిసారి తల్లైన క్షణాలు .. అన్ని నీ ముందుకు వస్తాయి..
అన్ని మర్చి అందులో విహరించు.. మా దేవత మీ దేహం లో చేయాల్సిన సర్దుబాట్లని చేసేస్తారు.. ఆ తర్వాత కూడా నా కలలు నీతోనే..
ఆమె ఆనందం తో సంసిద్ధమై ధ్యాన ముద్రలో కాసేపు కూర్చోగానే .. యముడు.. ప్రత్యక్షమౌతాడు.. ఆ పేషెంట్ సంభాషణ యముడితో..
యముడు ; తల్లీ … ఈ శుభ సమయం లో నన్నెందుకు తల్చుకోవడం.. ? నేనొక అశుభ కారుడని.. భయాన్ని.. ఏ మనిషి కనీసం మాట మాత్రం కూడా తలచుకోనివాడిని.. అశ్ప్రుష్యుడని .. దుఃఖ కారకుడని… జీవుని వేదనని.. నలుపుని… స్త్రీ మాంగల్యం తుంచే నిర్ధాక్షిణ్య కిరాతుని… అహంభావిని.. ఏ గమన సంధిని ఒప్పుకోలేని నిస్సహాయుడని.. అజ్ఞాత నష్టకారకుడిని.. భయావ విస్మతుడని .. కలంక నిద్రల సంహారిణి .. కబురులేని కంపనని.. అతీత ఎరుకల దాడిని … నిలదీత మూర్తిని..
తల్లి; ఆమె కళ్ళలో నీళ్లు.. ఏంమాటలవి … నువ్వీ దేహానికి ఒక అర్దానివి.. ఒక సంపూర్ణతకి చిహ్నానివి.. ఈ విశ్వ సంకలపాలికి సరిపడే సామర్ధ్యాన్ని మాత్రమే భూమి పై ఉంచి..మిగతా చెత్తని ఎప్పటికప్పుడు ఖాళీ చేసే సమవర్తివి.. అకస్మాత్తుగా తుంచేసినప్పుడే తట్టుకోలేనిదిగా ఉంటుంది.. బిడ్డ చనిపోవడాన్ని తల్లి చూడకుండా .. ఆ ఒక్కటీ చెయ్యగలిగితే .. ఈ భూమి స్వర్గమే.. జీవ పరిణామ క్రమంలో.. నీ పాత్ర చాలా విలువైనది… నాయనా…
యముడు ; (పులకించిపోతూ)బహుశా నువ్వు మొదటి స్త్రీవి .. నన్నూ.. నా ఉనికిని .. సరిగా గుర్తించిన స్త్రీవి.. నీకు నా ధ్యన్య వాదాలు.. నే వెళ్లి వస్తాను తల్లి..
తల్లి ; ఉండు.. నా బిడ్డని నేనెప్పద్దూ .. ఇంత ఎంగిలిపడకుండా పంపలేదు… ఆమె కొంగులోంచి .. కొన్ని పళ్ళు.. తేనే .. నీరు.. కొంచెం వేడివేడి పరమాన్నం ఉన్న అరిటాకు పొట్లం..ఇస్తుంది..
యముడు ; ఇదెలా సాధ్యం తల్లీ …
తల్లి ; తల్లిని.. ఆ మాత్రం బిడ్డ ఆకలి తెల్సుకోలేనా ?
యముడు ; ఖాళీ కొంగులోంచి..
తల్లి ; అవేవి .. మాయ నిండినవి కాదు నాయనా.. నా బిడ్డ కోసం .. నా కడుపు ఖాళీ ఉంచుకొని.. వాడికి వడ్డించడానికి ఎదురుచూస్తూ .. దాచుకున్నవి.. సందేహించకు నాయనా..
యముడు ; అమ్మా.. నా ఉద్దేశ్యం అది కాదు.. ఈ శూన్యం నుంచి సృష్టి..
తల్లి ; ధర్మరాజువి.. సృష్టి .. నేనని నీకు తెలియదా?
యముడు ఆమె కాళ్ళపై పడి… ఆమె జుత్తు నిమురుతుంటే .. ఆబగా తింటూ ఉంటాడు..
( అతను ఆమె కాళ్ళ దగ్గరకి చేరి నమస్కరించి..) నే వెళ్ళాలి తల్లీ….. అంటాడు
ఆమె అతనిలోకి చూసి నవ్వి.. మళ్ళీ వస్తావుగా ? అంటుంది
యముడు; (అతని కళ్లలో.. నీళ్లు…) అది నాకు తెలియదు.. ఈ సకల చరాచర సృష్టికి .. ఆధారభూతమైన అమ్మవి నువ్వు.. నువ్వు తలుచుకొన్నావని వచ్చాను. మృత్యు రహస్యం నాకు తెలియదు.. ఎవరి ఆదేశాలనో ఇలా పాటిస్తూ ఉండే .. నీ అర్భక కొడుకుని నేను.. నా స్వార్ధమల్లా నిన్ను దర్శించుకోవడమే .. అన్నపూర్ణలా .. ఎన్ని విస్తరులని లేదనకుండా నువ్వు వడ్డించావో నాకు తెల్సు తల్లీ …
ఇప్పుడూ నాకూ నీ గర్భపు ఆకలి తీసి నాకు బిక్షగా నింపావు..
ఆమె అతనిని దగ్గరకి రమ్మని.. ఆశ్యీరదించి.. ఒక వేళ నా దగ్గరకి రావడమే ఆ ఆదేశమైతే .. అందుకు మనసుని కాస్తకూడా కష్ట పెట్టుకోకు… నువ్వు నా బిడ్డవేగా .. ఆనందంగా నీతో వస్తాననగానే..
అతను నేలపై దుఃఖంతో కూలిపోతాడు..
ప్రయోక్త ;
దక్షత మాయ కూలిపోయిన వైద్యశాలలో.. తన అనే దుఃఖ ముద్రల పుట్టుకని మోగించి సంతర్ప వేడుకని తీసుకొని పోయిన కంగారులో వదిలేసినా దేహ నీరుని ఎండగట్టిన హద్దుల్ని కాదని … కౌగిలి మూర్తీభవన మోతాదులని కలిపి పట్టించి.. గొంతులో వదిలాక .. స్మర కవ్వింపుని వద్దని .. పెద్ద బూరాలా సంకీర్త కదలికలోని వరదని కప్పుతూ.. ఇంకిపోయిన చిత్ర చలన హద్దులే .. మసకపడి కనిపిస్తాయని.. లోపల తిరుగుతూ .. తాళం పెట్టుకున్న ఇంటి లోపలే తను .. మృత్యు శిల నాకిచ్చి .. విందుకు లేవడానికి సిద్ధంగా ఉందని నాకెలా తెలిసేది..
ఇది చల్లని అనుకువని సాగదీసి.. సాన పట్టిన గొంతుతో పాటని పీల్చి తప్పి పోయిందని తానే గొడవ పడుతూంసీది .. కొంచెం వద్దనుకున్నా వెసులుబాటు చేసుకోవాలి.. సంకల్పం చెప్పుకొని అరిగిపోయిన నిద్ర రీతులని కలిపి ఒరిగిపోయిన ఆనవాళ్ల మెట్లని అతికించి … ఇంకా కొన్ని కాళ్ళ ముద్రాలని వడపోసి .. ఆ ఇంటిని నన్నే తీసుకోమంటారు.
……………………………
EPISODE -14
అశనిపాత దిగ్ధర్శనగా కోలుకొని మృత్యు తీపి.. విశ్వం ఒరిగి పోయిన సంకీర్ణ ముట్టడి .. పెద్దదైన ఓదార్పు లోపల జరుగుతున్న సర్దుబాటు
పేషెంట్ మంచం చుట్టూ నల్ల తెరలు కట్టి ఉంటాయి.. డాక్టర్ లోపలి వెళ్లే లోపు.. నర్స్ బయటకొచ్చి..
ఆమె చుట్టూ కలువలు … సీతాకోకచిలుకలు.. మిణుగురులతో కూడిన రక్షా కవచం.. శంఖ శబ్దం.. కంచు tగంట.. ఒక మహా సమ్మోహ విగ్రహం లా ఆమె నిద్రిస్తున్న శరీrరం.. ఆమె సామాన్యురాలు కాదు .. నిద్రాణ విశ్వంలోంచి కలవర మూర్తిలా అంతెత్తు ఛాయారూపం కప్పుకొని.. ఒక మహా పరిమళం.. ఒక సంపూర్ణమైన దేహ ద్రవ అలల్లా ముంచెత్తి .. కప్పిన నిరూప దర్శనలని అందిపుచ్చుకొంటూ .. ధూప వర్షంలో కాగడాలా .. ఓ మత్తిల్లిన తాండవ వరద కమ్మినా .. ఆ కల్లోలో ఎదో తెలియని మహా శాంత ద్రువపు గోస … తారతమ్య ఉనికిని చూపుకి పట్టించి చేరుకొన్న నిర్యాణ కలవరల పుట్టు నీరుతో నిండిన దాహం దార్శనిక శక్తితో నిండి ఉంది.. విశ్వ రహస్యం ఏదో చీరగా చుట్టుకొని వచ్చినట్లు ఉంది.
డాక్టర్ అది విని పులకిత ముద్రలతో నాట్యం చేస్తూ.. ఆమెని చేరుతుంది..
ఆమెని పరిశీలించి .. ఆమె గుండె దగ్గర చెయ్యి పెట్టగానే … ఓ కలువపువ్వు లోపలనుంచి వస్తుంది… అది ఆమె చేతిలోకి రాగానే నల్లబారి పోతుంది.. ఆమె షాక్ గా చూస్తుంది.
ఓ నూనె దీపం తీసుకొచ్చి ఆమె రెండు గుండెల మధ్య ఉంచుతుంది .. అది లోపలి వెళ్లి .. ఓ తెల్ల కలువగా బయటకొస్తే.. ఆమె మురిసి చూసేలోపు అదీ నల్ల బారుతుంది… ఈ లోపు ఆమెని ఆ లోపల నుంచి .. ఎవరో బయటకి గుంజినట్లు అవుతుంది.. ఆమె బయట నేలపై పడిపోతుంది..యముడు .. అతని పాశానికి చిక్కి అల్లాడుతున్న ఆమె నాన్న.. కానీ అతను కళ్లు తెరవ లేకపోతున్నాడు..
ఆమె : (కోపంగా ) నేనేం తప్పు చేసాను.. ఇటువంటి శిక్ష.. నేను చేతనైనంత వరకు .. ఓప్రాణాన్ని కాపాడాలనే చూస్తాను.. నాకెందుకు ఇలాంటి శిక్ష..
యముడు ; నువ్వు ఎన్ని సార్లడిగినా .. ఆ విషయాలు నాకు తెలియవని అంటాను… నేనెందుకు వచ్చానంటే.. నువ్వు నన్ను తల్చుకొన్నవాని..
ఆమె ; అయితే మాత్రం.. నా ముందే .. నా తండ్రిని.. ఇలా ఇంత కఠినంగా … అయన మొత్తం తన జీవితాన్ని.. అనాధల బాగు కోసం ఖర్చు పెట్టిన వాడిని.. ఎంత పాశవిక శిక్షకి గురి చేసావ్.. ఎక్కడైనా ధర్మం ఉందా? నువ్వెలా ధర్మరాజువి
యముడు ; (వికృతంగా నవ్వి ) మా ధర్మ0 .. కేవలం భూమికి సంబంచినది మాత్రమే కాదు..
డాక్టర్; ధర్మం ఎక్కడైన ధర్మమే కదా?
యముడు ; ( అతను తల ఊపి.. ) నేను ఒకరి ఆదేశాల్లో ఇర్రుకొన్న వాడిని..
డాక్టర్ ; అయన ఇప్పటి వరకు .. సంపాదన .. మమ్మల్ని నిలబెట్టడం లోనే ఉండిపోయారు.. ఇప్పుడే అమ్మతో కలిసి .. తీర్ధ యాత్రలు చేయాలనుకునే ఆలోచనలు చేస్తున్నారు.. ఇంకా కొంచెం ఆయుస్సుని ఆయనకీ ఇవ్వు…
యముడు ; ( జీరా నిండిన గొంతుతో) … జాతస్య ధ్రువో … అనే గీతాశ్లోకం చదువుతాడు.
ఆ తర్వాత ఆమె అక్కడ కుప్పకూలి పోతుంది.. మళ్ళీ లేచే సరికి.. ఆమె తన తల్లి ఒడిలో ఉంటుంది..
ఏమ్మా: ఏమయిందిరా .. అలా తల్లడిల్లి పోతున్నావ్?
నాన్నని … నీ కోసం కాపాడలేక పోయాను..
ఆమె .. డాక్టర్ లోకి చూసి.. అన్ని మన చేతిల్లోవి కావు.. రాసిపెట్టి ఉండాలి..
డాక్టర్ ; మరి నువ్వెందుకమ్మా ? నన్ను ఒంటరిని చేసి … నీ చావుని నీ చేతుల్లోకి తీసుకున్నావ్?
ఆమె తల్లి ; బిడ్డా నన్ను క్షమించు.. నేను తీసుకొన్నదేమీ లేదు.. మీ నాన్నే .. నా ఉనికిని తన చావుతో తీసుకెళ్లి పోయారు.. మిగిలిన ఆ కొద్దీ రోజులు తిరిగింది .. కేవలం ఆత్మ లేని ఓ ఖాళీ సంచీలా .. నా ఆత్మ సంధాన కర్త .. నిలువునా తడిచిపోయి కరుణ రసజార .. ఆ ధార లేకుండా ఈ దేహం .. నీళ్లు పొయ్యని మొక్క లాంటిది. నిలువెత్తు శ్వాస సన్నాహా ముద్రల మధ్య ఆవహించుకొన్న దీపాచిత్రం తాను నాకు.. ఆ ఉనికి లేకపోతే నాకీ భూమి మీద రంగులు లేనట్లే.. అంతే.. నా చావు ఎప్పుడో జరిగిపోయింది.. అయినా .. నీతోనే ఉన్నాను.. నువ్వు ఎప్పుడు తలచుకొన్న వస్తాను.. సరేనా..
నాన్న .. నేను … ఓ కలువల సముద్రం చూడడానికి వెళ్తున్నాం.. అదిగో పిలుస్తున్నారు.. నే వెళ్ళాలి.. అని ఆమె మాయమైపోతుంది..
ఆమెకి కలువలు అనగానే … పేషెంట్ గుర్తొచ్చి .. నల్ల కర్టెన్ లోపలి వెళ్ళుతుంది.. నర్స్ ఆమె మంచం పై తల పెట్టి నిద్రపోతూ ఉంటుంది.. ఆమె ఎంత లేపిన లేవదు.. ఆమె ఎత్తి .. అక్కడే నేలపై పడుకో పెట్టి.. పేషెంట్ గుండెలపై ఉన్న మరో నల్ల కలువని తీసి.. ఆమె గుండెల దగ్గర చెవి పెట్టి చప్పుడు వినాలను కొంటె.. చప్పుడు వినిపించదు.. బ్యాక్ గ్రౌండ్ లోంచి .. మృత్యుంజయ మంత్రం వినిపిస్తూ ఉంటుంది..
ఆమె కోపం తో.. నిస్సహాయతతో నాట్యం చేస్తూ.. అక్కడున్న స్లీపింగ్ పిల్స్ ఒక్కసారిగా మొత్తం డబ్బాలోవి అన్నీ మింగేసి కూలిపోతుంది…
ఆమె కళ్ళు తెరిచే సరికి ఎదురుగా …
ఆమె ; నువ్వు వస్తావనే .. నేను సంసిద్ధంగా ఉన్నాను.. అలిసిపోయాను .. ఈ మాత్రం భూమి పై గడిపిన సమయానికే.. అసలు నువ్వెవరు ?
యముడు; సృష్టి సమస్త వైభవ సన్నాహాలు.. క్రియలు.. అతికించి పెట్టుకొన్న ఆనవాళ్ల పరంపర.. విశ్వ కృతి చేరదీసుకొన్న నిద్ర గతులు.. మృత్యు సంతకం తో పండిన అడుగుల ఐహిత మూర్తుల పాఠాలు.. ఇంకిపోని అనుమాన దర్శనాల మధ్య సంతరించుకున్న విషాదాలు.. అన్నీ నావే.. ఏవీ నావికావు. సరాసరి చేరుకొన్న సాధ్య భూమి పలవరింపు.. సంతకం చెయ్యని భూమిగా ఉండిపోయిన అననుకూల ఒత్తిడి.. తడబాటు ముద్రల కల్లోల ఊయల .. తీరుబాటుని నింపుకున్న శ్వాస తీరాలా ఆట.. గడ్డ కట్టిన ముంపులతో అతికించిన దేహ జిగురుల ఒంటి పరిమళ రంగుల వైభవం..
ఆమె; నువ్వేగా ఆ అనంత అంతానివి.. సౌర శక్తివి.. నిద్ర అననుకూల ఊర్పుల చకిత వీడ్కోలువి.. సంతకానివి.. ఊపిరి జాడలు విప్పుకొన్న అంత్య స్థలానివి.. తీవ్ర రార్ధన బోగీవి..
(కొంచెంసేపు మాట లేకుండా …)
యముడు ; ఏమ్మా .. ఆగిపోయావ్.. ఇంకేదైనా అడగాలా?
ఆమె; ( ఆనందంగా) నా తల్లితండ్రుల దగ్గరికి తీసుకెళ్తావుగా? అంటుంది..
యముడు ; లేదు.. ఈ భూమి మీద నీ ఆత్మ చేయాల్సిన కొన్ని పనులు మిగిలి పోయాయి..
డాక్టర్; ( విషాదంగా నవ్వి) నేను ఓడిపోయిన దానిని.. ఒక మంచి వైదురాలిని కూడా కాదు.. నాతో ఏమౌతుందని..
యముడు ; అన్ని నిమిత్తాలు నీవి కాదు.. నీ ఆత్మ ద్వారా మాత్రమే చేయాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి.. నాతో సహకరించు.. నువ్వు కోరుకొన్న చోటుకే నిన్ను చేరుస్తాను..
డాక్టర్ ; నీ ఈ మాటలు .. సత్యం కాదని నాకు తెల్సు.. అయినా పర్వాలేదు.. నేనేం చెయ్యాలో చెప్పు చాలు.. చేస్తాను…
అతను మళ్ళీ అలానే వికృతంగా నవ్వుతాడు.
BHAGAVATHAAR ; సర్వ భస్మపు కంకాళాల మధ్య ఊపిరి చుట్టిన దేహ రాగం బిగించిన కోరికని కడిగి .. వర్షించే దేహ పూర్ణ ముట్టడిని ఎగదోస్తూ .. ఇంకిపోయిన కాలి ముద్రలు అప్పగించిన కొద్దీ గడపల పెద్ద ఊరట .. కలల మూర్తులని దాటి చేరదీసుకొన్న ముంపుల జ్వర వికారము పెళ్ళగించిన విలాస ధ్వని సంపద తనదే..
అదే ఉంది.. అది మాత్రమే ఉంది.. అది లేకుండా ఏదీ లేదు. కంటి ముద్రలు పల్చని పోగలతో కమ్మిన దేహ సొగసు మంత్రపు ఆనవాళ్ళని తాగి.. తూలి.. శరీర శుద్ధిని వడపోసే కన్నీరు.
ఏకపాత్రాభినయుడు ; విశ్వపు గంభీర ధ్వనిని దాటి స్వా స్థిత అనుకరణ ఈ నేను.. నేనిప్పుడు యముడిని.. సర్వపాతకాల అనుగ్రహుడని.. సగం బుద్దిని .. సగం నీరు పట్టిన దేహ స్థలపు మాంస ముద్దని.. కదలికల్ని అద్ది పెట్టిన ముప్పుని.. లోబడి రాసుకున్న తీర్పుని.. నేను వినిర్మిత జ్ఞాన కోశంలోని దిద్దుబాటుని.. కౌగలింపుని.. సరీ సరిపడని సెగల సంచీని.. మూర్చనల విగ్రహాన్ని.. భోగాన్ని.. వేరుపడని కన్నీరుని.. మౌన అలల దర్శనమాత్ర హెచ్చరికని .. సౌజ్ఞని.. దుప్పటిలో చుట్టుకొని రూపు మార్చే కదలికని .. తీర్పు చివర మోసిన చీకటి కక్ష్యని.. మెళుకువని..
భాగవతార్; నేను నిన్ను ఒప్పుకోనంటే ?
ఏక ; ఎవరూ .. వాళ్ళ లోపలి చీకట్లోకి వస్తానంటే ఎందుకు ఒప్పుకొంటారు.. అయినా నువ్వు ఒప్పుకోనంటే .. నేనే నువ్వుగా మారిపోతాను. నీ లోపల ఒప్పుకోని భాగాలే శూన్యం లోకి పంపి .. నేనై ఉండిపోతాను…
ఓపెద్ద చప్పుడు .. హోరు … ఆ తర్వాత అంతా కమ్మేసిన చీకటి
నా ఉనికి నీకు జవాబు దొరకని ప్రశ్న .. తడబాటు.. గతం కనిపించని కంగారు లోని శబ్ద స్పృహ.. అలావిలయ శూన్యమేయం .. తర్జన ముంపునీ కుదిపే వేరు జంటల పలవరింపు.. కలవర మూర్తుల కేక .. శరీర సంపదని నింపుకొని ఖాళీ చేయబడ్డ మనకేల తాండవం.. ఇదంతా కలలుగా మారుతున్న నటన .. కథలుగా సరిపెట్టుకున్న దీర్ఘ ముద్రల శరీర కలకలం .. చుట్టూ కమ్మేసిన హద్దుల్ని అప్పగించి.. పరస్పరము జత చేసిన ముతక నవ్వులు.. మాంస మడుగులు.. తెల్లబోయిన నల్ల కళ్ళలో ఓడిపోయిన కథ ఊగుతూ.. చెంపలపై అద్దిన ఝాము ముద్దలపై కలబడే ఆవిరి గూళ్ళలో చల్లారి పోతున్న అడుగులతో.. చేరిపోతున్న ఆ దూరాల్లో తలపడుతున్న గుణ గొంతుల సలపరం.
భాగవతార్ గుక్క పెట్టి ఏడుస్తున్నాడు.. నేనెలా అనాథలా మొదలు పెట్టిన ఈ బతుకు నీకర్ధం కాదు.. దాన్నంతా నువ్వు వెలుగు లోకి తీసుకొస్తే … నాకు చాలా సమస్యలు వస్తాయి.
ఏక ; నేను నీ గతాన్ని తవ్వుతాననడం లేదు. ఇప్పటి నిన్ను అనుకరిస్తానంతే …
భాగ; ఎం చెయ్యాలో నాకు చెప్పు.. అంతా నేను చూసుకొంటా..
ఏక ; అది జరగని పని… ( అంతే వేగంగా కదిలాడు.. బొటన వేలుతో భాగవతార్ నుదిటి పై రుద్దాడు.. అతను స్పృహ కోల్పోయి.. ఘాడ నిద్ర లోకి .. గురక పెడుతూ అతను ఈడ్చుకొని తేరా వెనకకి వెళ్లి .. తానే భగవతారగా వచ్చాడు.
సయోధ్య ఘర్షణ .. అంతం లేని అనుగ్రహం చుట్టిన మెళుకువలోని దీపపు సెమ్మ .. పక్కకి తప్పుకొన్న నిద్ర మూర్తుల పుట్టుక .. లోపలి విసుగుని నానబెట్టిన ఊరటతో పెద్ద ముసుగులు ఒరిపిడి రాజీలు.. ఒప్పుకోని బయ ముద్రల కౌగిలిలో కాల్చి పెట్టుకొన్న విశ్వ గొంతులు పెను చీకటి ముంపులు.. అప్పగించిన చిహ్న మోడుల్లో కలవర దీపాల సూచిక .. అంతే ఉంది.. అంత తెలుసుకొనే ఉంది.. చర్చి .. ఎదురుగా క్రిస్టియన్ ఫాదర్ .. తన ప్రార్ధన వినిపిస్తూ…
భాగ ; నవ్వి.. నువ్వు ఓడిపోయి చనిపోయావని తెలియదా..
ఫాదర్; ఇది .. నా ఇంకార్నేషన్.. నీకు అర్ధం కావడం లేదా?
భాగ; గర్భ మాత్రలు మింగిన సృష్టి.. తిరిగి కోలుకోవడమా? అసాధ్యం .. నీలో ఉన్న ఆత్మ నీది కాదు.. నీ ఉనికిని ప్రశ్నించాక .. నీ దేహం వదిలి .. నువ్వు కనుక్కోలేనంత దూరంగా నీ ఆత్మ వెళ్లిపోయింది.. ఇప్పుడు నీలో ఉన్నదీ నువ్వు కాదు.
ఫా ; నాకు నువ్వు ఏం చెప్పి మాయ చేయాలనుకొంటున్నావ్? నన్ను నేను సిద్దపర్చుకోవడానికి లేని అనేక సమస్యలతో సతమతమోతుంటే .. ఇంకా ఏం ఆశీస్తున్నావ్?
భాగా; జీవ వేదన … మాయతో.. కొన్ని వ్యాక్యాల మాటున సత్యాన్ని కప్పి పుచ్ఛి మీరు చేసే మోసం పట్ల స్పష్టత నివ్వాలి..
ఫా; ఇది చాలా ప్రమాదకరం.. సున్నితమైన విషయాలవి.. దానిని నువ్విలా కదపక పోవడమే మంచింది..
భాగా; నువ్వు చెప్పే మంచి ఎవరికీ మంచి చెయ్యడం లేదు.. ఆమె ఇప్పుడు తన పేటిక శిలువతో ఉండాలని ఆలోచనతో పూర్ణ మైన తన మతి తప్పుకు పోయింది..ఎప్పటికీ దొరకని ఆ శిలువకై అంత్యంత ప్రమాదకరమైన ప్రయాణం లో ఇరుక్కుపోయింది. తన భర్తని పోగొట్టుకొన్న దుఃఖమూ లేక ఆ ఆత్మ శూన్యంలో అల్లాడు తుంది. ఇప్పుడు ఎవరు సరిచెయ్యగలరు దీనిని?
ఆమె ఆత్మ దుఃఖాన్ని ఆమెలోని ఉంచి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.. నాలోపల ఇప్పుడు అసహన మంధన .. దీనిని భరించడం నావల్ల కాదు.
ఫా ; నాకు నేను శిక్షని విదించుకొన్నాను కదా ?
భాగా; ఆత్మహత్య శిక్ష కాదు.. సృష్టి నీకిచ్చిన వరాన్ని అర్ధం చేసుకోకుండా .. నీకు నువ్వు ఆ సృష్టిని హింస పెట్టడం..
ఫా; ఎవరు నువ్వు? కేవలం ఓ యక్షగాన భగవతారావే అంటే నేను నమ్మలేను.
భాగా; నా నేనుని కాదు .. నీ నేనుని నువ్వు వెదుకు…
ఓ పెద్ద విస్ఫోటనం …
ప్రయోక్త ;
పోగు పోసిన దేహ చీకటిలో తప్పిపోయిన ఉనికి తాగి.. తూలినా ఝాము పేటికల కలవర చాయని మోగిస్తూ .. రుణ పడిన దేహ నిలువుల గోతిలో .. దీర్ఘ సంధి చెలార్చిన బొటనవేలి ముద్రని తాగి.. పట్టు తప్పిన శ్వాస నిండా చిక్కబడి .. ఆ దూరంలో ఆగిపోయిన భంగిమ .. పెద్ద నిద్రల సముద్రం దాటించే కలలు రుణ గండం లో పడి తలమునకలై.. తీరుబాటులేని ఉపేక్ష కథనాల ద్రుష్టి చిత్రాలు ముక్కలని కాల్చి .. గింజుకున్నా వదలని మోక్ష స్పర్శ కలవరపడ్డ … చితి సంపద.. అలమారీ నిండా…
కాల్చి పోసుకున్న పాటలు గోడలపై తిరుగుతూ .. కక్షల కేంద్ర దీపం వణికిన హద్దుని కూర్చుతూ.. కధనాన్ని కాదని .. కేవలం బాయ కోలాటం లో ఊగిసలాడే సంతర్ప వినికిడి శరీరం తలపడి.. అక్కడే చెట్ల కిందనే .. రక్త బావులు చిక్కబడ్డ నీళ్లతో శ్వాస కి రెండో చర్మం దొరకక కొంచెం ఉబ్బుపోయానని వాళ్ళు కంగారు పడతారు.
స్క్రీన్ డౌన్ అవుతుంది.
EPISODE -15
ప్రయోక్త;
ఆత్మ సమర్పిత ధ్వని రెప్పలాని నపుడు కిదిగా రాలిన పెద్ద గడువు చీకటి కరుగుతూ.. విసిగిన రెండు చేతుల వెలుగు ఊడిపోయి … పోలికలేని కంగారులో ఊడిపడి.. ఉత్త్సవ నిద్రల జోరుని తోసుకొస్తున్న ముద్దల ముద్దల అలసట తిరగబడి.. ఊరికే ఉండిపోయిన మస్తిష్కములో కలలు పండి .. దేహ రాగ వికారాన్ని ఊడదీసి ఒంటరి శిక్షలు కరిగి .. చిత్ర తాపం కౌగలించుకొన్న మహా దర్శన మూర్తిని ఊరేగిస్తూ .. ఒక చీకటి దుప్పటి వడపోసిన రక్త దేహపు పొడి బావురుమన్న శిధిల జాతుల పాట .. తెలియని రంగుల మోతాదులని గిలిగించి.. హద్దుని దాటాకా –
క్రిస్టియన్ పెళ్లికూతురు .. ఓ స్మశానం ముందు.. చిరిగి పోయిన బట్టలతో.. చిక్కి శల్యమై ఉంటుంది.. ఆమె రోజులుగా అక్కడ నిలబడి ఎదో అడుగుతుంది.. అదేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు.. కొంతమంది దగ్గరకి రావడానికి ఆలోచిస్తున్నారు.. రాత్రీపగలూ.. అక్కడే.. కొంతమంది తిన మని పళ్ళు .. అన్నం ఇచ్చిన .. అవన్నీ అక్కడే కుళ్లిపోయి .. వాసనతో పడివున్నాయి.. ఆమె శరీరమంతా భరించలేని వాసన .. కళ్ళలో ఎక్కడ జీవం లేదు.
అటు పోతున్న ఏక పాత్రాభినయుడని ఆపి.. అతనిని చూసినప్పుడు మాత్రం .. ఆమె లో ఏదో తెలియని వెలుగు.. అతనిని గట్టిగా పట్టుకొంది.. అతను నవ్వుతూ ఆమె తల నిమిరి…ఏం కావాలి ? అన్నాడు.
నాకొక శిలువ కావాలి … ఇవ్వగలవా? అంటుంది..
అతను ఆమె ని చూసి కళ్ళలో నీరు పెట్టుకొని.. ఏం తల్లీ .. నువ్వు అన్నం తిని ఎన్ని రోజులయ్యిందమ్మా ? అన్నాడు.
ఆమె ; గుర్తు లేదు.. అయినా పళ్లెం నిండా రక్తమే … బులెట్ లోంచి నా ముఖం పై ఎగిరిపడ్డ నా భర్త శరీర మాంసం .. నా పళ్లెంలో.. ఎలా తినగలను.. ( మాటలు ఆపి ఏటో చూస్తుంది)
ఆనాటి ఘటన ఆ కళ్ళలో మెదులుతుంది.. తనకి స్పృహ తప్పెవరకు నిండిన తన భర్త ముఖం కళ్ళలో నిండుతుంది. తడబాటు బొమ్మల కౌగిలిలో కాలుతుంది.
నాన్నకి చెప్పా … అన్నయ్య ఖచ్చితంగా పెళ్లి రోజుకి అమెరికా నుంచి వచ్చి ఉండాల్సిందే.. లేకపోతే నేనూరుకోను..చర్చి లో గొడవ చేస్తా.. నా పెళ్లి గౌనుమీద మరకలు చేసుకొని.. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటా … ( మళ్ళీ మాటలు ఆపి ) ఆ నవ్వు భయపెడుతుంది.
ఆయన ఈ రోజు .. మా ఫేవెరెట్ కాఫీ షాపులో సీక్రెట్గా కలుద్దామన్నారు.. తనని మొదటిసారి కలిసినప్పుడు ఏ డ్రెస్ లో ఉన్నానో అదే డ్రెస్ లో రమ్మని.. అలాగే అలంకరణ … అవన్నీ ఇప్పుడు కళ్ళలో మెదులుతున్నాయి … నడక .. నవ్వు.. చూపూ.. మనసూ.. ఊగిసలాడే .. నా వదులు జుత్తు… గొంతు దగ్గర మోగే శంఖపు హోరు అన్ని అలానే ఉండాలట.
పెళ్ళికి ముందు ఓ రహస్య ముద్దు ఆయనకీ కావాలట.. ( మళ్ళీ కాసేపు ఆగి.. తీవ్ర స్వరం తో ఏడ్చి.. ) చర్చి ఫాదర్ ని కలిసి దీని విషయమై సంప్రదించాను.. ఆయన ఇంతవరకూ అటువంటి సమస్య ఆయన దగ్గరకి రాలేదని.. రాత్రికి ప్రభువుని అడిగి చెబుతామన్నారు.. అయినా ప్రార్ధన చేసిన ఓ శిలువని నా మెడలో వేశారు.. పెళ్లి తర్వాత తిరిగి ఇచ్చేయమని..
సడన్గా ఆమె ముఖ కవళికలు మారి … దుఃఖ చమురుని కాలుస్తూన్నట్లు కళ్ళు ఎర్రగా మారిపోయి..
ఈ శిలువ ని వెదికే పనిలో నువ్వేం చెయ్యలేకపోతే .. పో .. ఇక్కడ నుంచి… అదీ … ఆ ప్రభువు మృత్యుధార కురిసే శిలువ అది మాత్రమే కావాలి.. నన్నెవరూ ఈ విషయంలో ఏమార్చలేరు. నాకన్నీ తెలియని నిశ్చలంగా తడిచిన ముద్రల నిద్రని తెగ్గొట్టే కలలే.. అవి నాలోపల .. బయట తడుముకున్న శరీర దీప చిత్రాల కలయికనే మోసే దృశ్య తలుపుల వినికిడి గొంతులు.. ఇక్కట్లు.. పొరపాటుని సరిచేసే శ్వాస మోడులా సంకీర్ణ మెలికలు.. తొందరపాట్లు.. ఉనికిని వడపోసిన నడకలో .. దారి దొరకని నీటి పుట్లు.
(ఈసారి గొంతు పెంచి గట్టిగా )నన్నెవరూ ఈ విషయంలో ఏమార్చలేరు.
అతనికి ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోయాడు..
ఏక ; నాతో వస్తావా .. కొంచెం తిని.. ఆ ప్రభువుని ప్రార్ధిస్తే.. ఆయన నీ పట్ల దయ చూపుతాడు.. ఈ సృష్టిలో ఇన్ని రుచులూ.. రాత్రి పగళ్లు.. గాలీ . నీరులూ.. ఎండా-నీడలో ఉంచింది.. మనలోపల ఓ తృప్తితో కూడిన ప్రార్ధనని వినడానికి.. మన కృతజ్ఞతలని స్వీకరించడానికి..
ఆమె అతనిని అనుసరిస్తుంది.. ఆమె కళ్ళు కొంచెం చల్లబడ్డాయి.. గొంతులోంచి సన్నని శంఖపు మోత .. అణూనయ ముద్రాలని పడుతూ గాలి అలలు..
మళ్ళీ సడన్ గా కళ్ళు ఎర్రబారుతూ .. అది అతను గమనించుకొనే లేదు. ఒళ్ళు గగుర్పొడిచేలా అరుపు.. కంటి నుంచి జారే దిగులు పొడి..
కాసేపటికే .. ఆమె అతనిపై వెనక నుంచి కత్తితో దాడి చేస్తుంది.. విచక్షణా రహిత ఫోట్లు .. సర్రున లేవదీసుకొన్న ఒగర్పు.. పెద్దదైన అండ లేని ఆయాసం..
అతను కుప్పకూలిపోతాడు. అతని శరీరం ఓ శిలువగా మారిపోతుంది. మళ్ళీ అన్నీమర్చిపోయి అతనిని వెదుకుతూ ఉంది..
కానీ ఆమె ఆ శిలువని వదిలి … నా పెళ్ళికి టైం ఐ పోతుంది.. ఎక్కడ చర్చి అని మరో వేపు పరుగులు తీస్తుంది. నాన్నా నా పెళ్లి డ్రెస్ ఎక్కడా అని అరుస్తుంది.. నన్నెవరూ అలంకరిస్తారు.. ఆమె ఒంటి నిండా రక్తం.
భాగవతార్ వాయిస్ ; కంటి తీపిని పీల్చేసిన మొండి శ్రమలు .. గత చంద్రుడు కూలిన వీధి బజారు.. శిలువల క్షేత్రంలో కాల్చి పోయిన ఆనవాళ్ల నిద్ర దృష్టి.. కసి రేగిన ఉనికితో మోసగించిన చలన ధూపపు ఒత్తిడి .. పరినేతల కొంగుని దులిపిన నూనె మాడుగుల మంట.. తను అదే .. తను అదే కాదు.. రొమ్ము విరిగిన దేహవంపుల ఒరవడి.. స్థిమిత రుచిని పిండిన పెదాల ముట్టడితో కదిలే దీప రంజన ముద్రలు.. ఆలోచనలు.. చీకటి అమ్మిన ఘాట్లు.. పై పై నిమిరింది నిప్పు వీధుల పాటలు.. తీరిక లేని ఆచూకీలు .. పొడిబారిన మంత్రం ముఖాలని తాగి దారి తప్పిన శేషభూమి లొంగిపోని పాట లోపల నుంచి హత్య చేయబడి అరుస్తుంది.
స్క్రీన్ డౌన్
………………………………
EPISODE -16
Doctor Operation theatre
ఆమె ఎదురుగా బెడ్ పై శిలువ …
భాగవతార్ … ఓ ధ్యాన ముద్రలోంచి లేచి .. నువ్వు మాత్రమే దీనిని చేయగలవు.. లేకపోతే ఆమెని మనం కాపాడలేం.. మృత్యువు ఓ అసంకల్పిత దేహ రాగం .. విదిలించిన శరీరాల మాల తెగిన చీకటి కల్లోల ముంపులని దాటే శీర్శ్య ధ్వని.. కదిలిపోతున్న దశల చుట్టూ ఊగిసలాడే సంతర్ప ఝాములు.. ఒడిలో కురిసిన మంచు గొంతుల బిగువు.. లోపల తడిచి రాలిన సగం దీపాల పాలు విరిగి సన్నని మట్టి మూర్తుల బిగిసలాట .. తన్నుకువస్తున్న తలపోటులా దేహసారం ఒలికిపోతూ .. ఎప్పటికీ తెరవని తలుపుల కంటి గోలని ఊది.. ఉనికిని మోసేసుకొన్న నిద్ర గతుల ఓదార్పు మంత్రాలు చల్లార్చిన ముద్దలతో శ్వాస జిగురు గడ్డ కట్టిన స్నాన రేవులు.. ఇక్కట్లు ..తొలిచిపోయిన నికర తలల గోడు.. ఉన్నదీ ఉన్న .. లేనిదిగా ఆగిన స్పృహ మంగళ తీరులు చిక్కుకొని.. జల్లించిన అతిథి విలాసగొడ్డుని హద్దులు దాటించే మెలుకువ.
డాక్టర్ ; ఎట్లా.. ఏది నా వృత్తిలో ఇప్పటి వరకూ ఎప్పుడూ చెయ్యలేదు.. ఊహించడానికే ఊహించనలివిగా ఉంది.. కనపడని రుణ తీవ్ర రుచి కాల్చిన ముఖాల్లో పడి సుళ్ళు తిరుగుతూ .. ఒంటిసారం గుంజు తీసిన ముప్పుల అవధి దాటి ఆపై ఏం ఉందనే ఆలోచన నన్ను కుదురుగా ఉండనీయడం లేదు.. అదే కావాలి.. అదే అనుభవపాత్రంగా నమిలేసిన ఓర్పుకి తాగి సొమ్మసిల్లిన ప్రతీరదాలూ..
ఎట్లా .. ఒక దేవుడికి postmortem చేసి.. మస్తిష్కపు అంతః ప్రయాణం.. ఆ లోపలి నేను వెళ్ళాక తిరిగి రాగలనా ? అది మన మెడికల్ టర్మ్ అర్ధమయ్యే విషయమా? ఎన్ని దిక్కుతోచని నల్ల బిళాలు .. తూర్పు గడపలేని ఇల్లు.. గొంతులు మూసుకు పోయిన చెమట రంగులు .. పాలిపోయిన రేఖల మధ్య రోజులు తిరుగుతున్న ఎగుదిగుడు సంతర్ప తీరికలు.. ఏది భయం .. ఏది అభయం.. ఇది ఇక్కడ మాత్రమే ఎందుకు ఉంది.. అక్కడ ఎందుకు లేదు.. మధ్యలో నేనెక్కడైనా ఆగిపోతే చెయ్యి పట్టి నడిపించేదెవరు? విశ్వ సమర్పణ మోసగించిన ఇరుకు మాటల ముట్టడి..
భాగ; తల్లీ .. ఇవేవీ అవలీలగా అయ్యే విషయాలు కాదు .. అది నాకు తెల్సు.. కానీ నువ్వు తప్ప మరొకరు దీనికి సాధ్యం చెయ్యగలిగే వాళ్ళు లేరు.
Doctor; తెలియని బరువు మీద పడ్డ కంగారు.. ఒద్దికలేని వికార స్పర్ధ .. ఎవరో దొరకని ఇంటిలో దొరికిన తాళాల గుత్తి.. సమయ సగంలో కలవరపడ్డ పెద్ద భూముల సాగు.. అంతే వడపోసిన తీరికలేని గుద్దుతూ అప్పగించిన కునుకు.. ఇది ఇలాగే ఆగిపోవాలా? (తనలో తను అనుకొంది).
ఆ తర్వాత…………
సడన్ గా ఓ బలమైన శిలువ వచ్చి తన తలకి తగిలినట్లు అవుతుంది.. ఏదో మాయా రూపం.. ఆమె ఆ రూపాన్ని పిలుస్తుంది… నవ్వు తప్ప సమాధానం లేదు. తన దేహం కరిగి ఆ రూపం పై కురుస్తున్నట్లు ఉలిక్కిపడుతుంది .. పెద్దగా మాటని దాచుకోక .. చాటుమాటు కన్నీళ్లతో కథని వింది. అన్నీ గుసగుసలు .. తగలబడ్డ రొమ్ములు.. కాగితాల గుట్టలు.. ఇగిరిపోయిన సన్నాహా నిందలు.. కలాప ముడుల జాలరి పట్టుకొన్న చేప కళ్ళ కంతలు…
ఆమె స్నానానికి వెళుతుంది.. ఆహార్యం మారుతుంది.. స్తభద్రతతో బరువెక్కిన నమ్మకం మీద మొదలైన .. వెన్నులో నొప్పి.. చెమటతో తడిచిన నుదురు.. నల్లబారిన పెదాలు.. ఓ కొవ్వత్తిని వెలిగించి తెచ్చుకొంది. చెవులు ఇంకొంచెం పెద్దగా .. జుత్తు మూడేసి కట్టుకొంది.. ఒద్దికగా నడిచింది.. ధ్యాన ముద్రలో కూర్చొంది.. నీరసం కానీ కళ్ళని మళ్ళీ కడుక్కొంది.
ఆపరేషన్ థియేటర్ అంతా ప్రాసెస్ మొదలు పెట్టగానో కాంతితో నిండి పోతుంది.. గాలిలోంచి మొదలైన శంఖ శబ్దం .. ఊపిరి ఖజానాలో దూకిన ముద్దల కంటిసారాలు.. ఇంకిపోని నవ్వుని పలకరించి… గదిలో ఘాడంగా ఉండిపోయిన అనుమానాల్ని తుడుచుకొని..
ఆకాశవాణి మొదలు అవుతుంది..
దేనికి తల్లీ .. ఈ ప్రయాస.. ఈ తెలుసుకోవడం లోంచి కొత్తగా ఏమీ జరగదు. ఉనికి ఈ సృష్టి అధ్యాంతమూ నేనై ఉన్నాను.. మరో కొత్త సమితి ఏదీ నీ దారికి రాదూ.. నీ లోపలే అంతా ఉంది.. కదిలిస్తున్న జ్ఞాన వికాసం ఏడ్చినప్పుడు .. ఆమె నా ప్రియ పుత్రికగా మారుతుంది.. తనని నేను అనుగ్రహిస్తాను.. రాద్ధాంతాలు.. పరిశీలనలు .. ఉమ్మడి అతుకుల నిద్రల రంగు రాళ్ళ కవ్వింతలు..
వేడి వేడిగా దూరిపోయి ఆయాసపడే గదులు.. సమ్మతి లేని విరాగ విగ్రహాల ఒంటి పచ్చలు.. అశరీర దీప వీధుల్లో తప్పిపోయిన మృత్యువులు…యధా తద దుఃఖ విలాసంలో జోడించిన మహా దేహ స్మరణము.. పెద్దయిన హోరులో కదలాడే విశ్వ నిర్జన ఆచూకీలు.. కొంచెం చెక్కిన విగ్రహాల దీపం పక్కాగా కొత్త పెట్టిన నడకలని తోసుకొస్తూ .. వినబడని ముఖాల కవ్వింపు.. మళ్ళీ చెప్పుకోవడానికి లేని విశ్మర ప్రయాణ తీరికలు.
Screen down
…………………………….
EPISODE -17
క్రిస్టియన్ పెళ్లి కూతురు అంత్య క్రియలు.. ఆమె నివాళి సభని ఎలా చెయ్యాలోననే .. ఓ నోట్ వాళ్ళకి .. ఆమె శరీరం పై దొరుకుతుంది.. ఓ నిర్యాణ ప్రేమని మోస్తూ తల్లడిల్లిన నా దేహం.. ఒక పరిమిలా శ్రద్దని వదిలిపెట్టి.. జ్ఞాన దీక్ష చనిపోయిన ముట్టడిని దాటి.. ఆపై సంక్లిష్ట నిద్రల మాయలో ఓలలాడి.. పురుష ఉనికిని నిలిపేసిన రాక్షుసుల ముందు సొమ్మసిల్లి.. ఎటు పోయిందో తెలియని .. నా మస్తిష్క రాశీ ముప్పెనలని తెగ్గొట్టి .. కదలని.. విడువబడని నిద్రసాగుల విపరీతంలో ఊగిసలాడి.. మరో సంధిచేయని ఊగిస మూర్తుల కదలికనే కనిపెట్టి.. ఒక సంతాప ముడిని లాగుతారు. ఇదంతా తెలిసిపోతూ ఉంది .. కదలికనే కాల్చి ముసుగు పెట్టుకున్న దీప చెమటని తుడిచి ,, కథని భద్ర పరిచిన సమాయ భూమి గొంతు సవరించుకొంది. ఇప్పటికి తెలియాలని తను కొత్త శ్వాసని తెచ్చుకొంది.. అక్కడే అంతా వరుస తప్పిన గంటలని మొత్తుకొంటూ దీర్ఘాంగా ఓడిపోయాను. అప్పగించుకోలేని.. ఉపిరితలా కునుకుని ఊడ్చి గంటలని మసకగా మడత పెట్టిన ముంపులతో కదిలే ఓ మహా చీకటికి తను వారసురాలు.. అలాగే పరిచయమయ్యింది. నడకని సరిచేసుకొంది.
కొంచెం వినపడదు.. కనపడదు.. తాను ఉంటాడు ఆ పైన .. నీ నా దృశ్య తంత్రిని సరి చేసి పాటని వినగలుగుతున్నాను.. నాకేం భయం లేదు.. ఉనికి లేదు.. మతి లేదు.. మాట లేదు.. శ్వాస తోడురాని కలలో ఇరుక్కొని నేను దిగాబడుతుంటే .. తన చెయ్యి నాకు రక్షగా ఎలానూ ఉంటుంది.. అదిగో తాను పిలుస్తున్నాడు.. సైగ చేస్తున్నాడు.. సిగ్గు పడుతున్నాడు.. ఇప్పటికైనా .. నువ్వా సంపూర్ణ సమర్పణకు సిద్ధమా అని అడుగుతున్నాడు.. ఈ మాట కోసం ఎంత కష్టపడుతున్నాడా అని నేను కంగారు పడ్డాను..
తీరా నే వెళ్ళబోతే వద్దు వద్దని అరుస్తున్నాడు.. రక్తపు ముద్దగా పడివున్నాడు.. శ్వాస కొంచెం మిణుకు మిణుకు మంటుంది.. ఛాతీలో నాకైనా ఓ కంపన కనిపిస్తూ ఉంది..నాకేదో రహస్యంగా మిగిలుంచుకొన్న మాట నుదిటిలో కనిపిస్తుంది. నా కోసం రెప్పని కూడా ఎత్తలేకపోయాడు.. లోపలంతా కుమిలిపోతున్నాడో నాకు తెల్సు.. నాకేం కంగారు లేదు.. కానీ ఎదో అశరీరవాణి నా లోపల ఇదంతా కాదు.. ఇదంతా ఎదో శాప కారణం.. నువ్వు అ శిక్షని మోస్ట్ తాను క్షేమంగా ఉంటాడు.. నేనప్పుడు తలా ఊపాను.. అదెంతో తేలికైన పని అనుకొన్నాను.. కానీ ఇప్పుడే తెలిసింది.. అదంతా తేలికైంది కాదని..
నేను ఎక్కని గుమ్మం .. తిరగని వీధీ లేదు.. కొంచెం తీరిక చేసుకొని .. కష్టపడి ఒద్దికైనా ఉన్మాద కీర్తనీ శృతిచేసి .. వాళ్ళు రంగురంగుల బట్టలతో నా ముందు తిరుగుతారు.. ఎలా గుర్తు పట్టాలి నేను..నీ లోపల గాయాల రక్తం తప్ప మరేం మిగలలేదని.. నేను దానినే వెదుకుతున్నాను.. అదిక కనబడదనే నిరాశ ముంచెత్తుతుంది..
నా ప్రభువు ఊపిరి వదిలిన అ రహస్య శిలువ ఉన్న చోటుని… అదే నాకిక మృత్యు హద్దు.. ఇదే నీ చివరి కోరికని నాకు తెల్సు.. ఈ శిలువ గురించి .. ఏ భూమి మీద నేను తప్ప మరెవరూ ఏమియు చెప్పలేరు.. అదేంత పరిశ్రమ తో కూడినదైనా .. నేను సిద్ధం .. యాత్రకి.. నాకా శిలువ దొరికే చోటుని చెప్పండి చాలు.. నా దేహం పైనుంచి.. అందం వర్షించే .. నా చర్మాన్ని ఒలిచి .. మీ దోసిట్లో పెడతాను.. తనకి నా ఆత్మ తప్ప ఏమియు అవసరం లేదు.. కానీ తనకి నేను అ పై రాజ్యంలో .. దేవుని చేత నిలబడాలని నా ఆశ .. దానికే అదొక్కటే దారి.. అది నరకమైనా .. దేవుని రాజ్యమైనా .. కొత్తగా నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు.
నా శ్వాస అడుగంటే వరకు.. శిలువని మోస్తూ వెళ్లడమే..ఇదొక్కటే నాకు చేసి పెట్టగలరు.. కొంచెం వేడికి ఎక్కడుందో చెప్పండి… నేను మోసుకొంటాను.. మీకెవ్వరికీ ఇంత కష్టం కూడా ఇవ్వను.. నా రక్తాన్ని ఒలకకూoడా ..చెమటగా మార్చి .. మీ భూమి తడుపుతాను.. నా శ్వాస తీరుని మార్చుకొని.. నడిచే దారంతా చల్లగా కురుస్తాను.. ఇది దురాశ కాదు.. ఆ వాణి వినిపిస్తున్నానంతే
తనకి.. నా దేహమంతా వస్త్రం లేకుండా .. మల్లెలతో చుట్టి ఉండాలంటాడు.. లైటల్ని ఆర్పిన కొవ్వెత్తి వెలుగులోనే చూస్తానంటాడు. చెమటని .. తన పెర్ఫ్యూమ్ లో కలుపుకొని ఒంటిపై చల్లుకొంటానంటాడు.. వాడికి ఏదైనా అది మల్లెలే … అదే నా దేహమంతా నింపండి.. ఏ సిగ్గూ పడకుండా సంపూర్ణ పరిమళ స్నానం చేయించండి.. స్త్రీగా నా దేహాన్ని అతనికి ఇవ్వకముందే .. దూరం చేసుకొన్నాను.. ఈ తలపోత నన్ను .. నాలోపల రహస్యంగా దాచుకున్న కొన్ని వైభవ ముద్రలు గుచ్చేస్తున్నాయి… ఇదంతా నేను లేని స్పృహలోకి ఎవరైనా తీసుకుపోగలరా
యుగాలు శిలువని మోసిన ఈ పాపం చల్లారదు.. కొంచెం నన్ను కనికరించని.. నా పేటికలోనూ కొవ్వెత్తిని ఉంచండి.. కొన్ని పూలని .. నీరుని.. పన్నీరుని.. ఓ తెల్ల దుప్పటిని .. జాస్మిన్ అగరుబత్తీలని.. పొడి రాల్చే మంచు సీసాని.. కొంచెం పళ్ళనీ … అదియే మీరు తలుపు మూసేలోపు దానికదే వెలుగుతుంది.. నా మాటలన్నీ సత్యాలేనని అప్పుడైనా నమ్మండి..
ఆ ప్రకారం చేస్తారు.. ఆరిపోయిన కొవ్వొత్తి దాని అంతటదే వెలుగుతుంది.
అది చూసిన ఫాదర్ పులకించిపోతూ .. పెద్ద గొంతుతో ప్రార్ధన మొదలుపెడతాడు. అతని నరాళ్లన్నీఓ మంచు ధారతో నిండినట్లు.. కౌగిలిని దేవా రాజ్యం తనకి అనుగ్రహించినట్లు..
మంత్రజలంతో అ స్మశానాన్ని అంతటినీ శుద్ధిచేస్తాడు.. ఆమె అడిగిన విందుని అక్కడ ఉంచుతారు.. అందరూ అటు తిరిగి నిలబడి .. కదులుతున్న స్పూన్ల చప్పుడు విని వణికి పోతారు. ఐనా ఒకరికొకరు .. చూసుకోరు.. మాట్లాడుకోరు.. ఏడుస్తూ ఉంటారు. ఒక బిగువులో దాచుకొంటూ ఉంటారు.
ఫాదర్ ఒక్కసారిగా బిగ్గరగా ఏడుస్తూ.. చర్చి వేపు పరుగు పెడతారు.. జనం ఆయన వెనక..అతనిని పట్టుకొని ఆపాలని లోపు .. ఓ కుక్క అతనికి దగ్గరగా వచ్చి.. వచ్చీ రాగానే కాలిపోతుంది. వాళ్లలో వాళ్ళు గుస గుసలాడుకొని.. ఒక సత్యంతో కూడిన భయం వాళ్ళని ఆవహించుకొంది.. సరిపడని జాగ్రత్త లోపలనుంచి ఓ కుదుపు.. ఇదంతా వద్దనుకునే లోపు..
ఫాదర్ చర్చి లో అంత ఎత్తులో ఉన్న శిలువని ఒక్కడూ ఎత్తే ప్రయత్నం చేసి.. తల పగలకొట్టుకొంటాడు.. అందరూ కంగూరు పడిన దగ్గరకి వెల్తే ఆ కుక్కలాగా కాలిపోతామని వాళ్ళకి తెల్సు.. అతను ఎలాగో దించుతాడు.. అతని కోటంతా రక్తమే.. అలానే నేలపైనా ఈడ్చుకొంటూ … ఆయాసపడుతూ .. చాలా కష్టంతో.. కోన ఊపిరితో అ చోటుని శిలువతో చేరుకొంటాడు.. అతని ఆయాసపు చప్పుడు వాళ్ళ చెవులు చిల్లులు పడేలా ఉంటుంది.
ఒక్కడూ గోతిలోకి దిగి.. అ శిలువని పేటిక పైకి లాగి .. పేటికపై శిలువ .. శిలువ పై ఫాదర్ .. ఎవరెంత పిల్చినా పైకి రాడు .. ఆ శిలువపై ఆమె శరీరం ఉంచగానే భాగవతార్ నాట్యం చేస్తూ పాడతాడు.. డాక్టర్ ప్రార్ధన చేస్తుంది.. ఏకపాత్రాభినయ కర్త దేహం లోకి .. దైవ ఆత్మ ప్రవేశించే ఆ పై లోకాల కోసం .. మనిషి వినాశనాన్ని వివరిస్తాడు. అది ఏమంత స్పష్టంగా ఉండదు.. చాలా వాటిలానే .. అర్ధం కాకపోయినా .. ఊ అన్నట్లు తల ఊపుతారoతే
భాగవతార్ అతనితో సంభాషిస్తాడు ..
పునరుత్త్సనా సత్యం ఏం చెప్పుతుంది.. ఈ ప్రపంచానికి .. దేనిని మనం ఇప్పుడు స్పష్టంగా తెల్సుకోవాలి..
హింస పుట్టుకని.. ఆకలిని ఆదరించక పోవడం.. ఏమీ లేని తోటి మనిషిని .. మనిషిగా దగ్గరకి తీసుకోకపోవడం.. విశ్రాంతి లేని కనికరం వేధించడం.. విసుగులేని ఆదరణ గురించి తెలియకపోవడం.. సరిపెట్టుకోలేని అలసట ని అద్ది తీసే కరుణ మన కళ్ళలోంచి ఖాళీ ఐపోవడం.. ఘర్షణ మరిగే .. మరిగి .. చిత్ర బ్రాంథంలోకి ఎగిసిన ముట్టడి రంగుల ఉత్పాతం ని గమనించకపోవడం.. అది నిప్పై ఎట్లా కాలుస్తుందో అంచనా లేకపోవడం.
ఫుట్ పాత్ మీద అడుక్కొంటున్న అతని తల్లి ని ఎవడో కారుతో ఎక్కించి.. రెండు కాళ్లు పోయి.. ఒంటిని ఈడ్చుకొంటూ తిరిగి.. ఓ రోజు ఎలా ఎక్కగలిందో.. తెల్లవారి చర్చి కొచ్చే వాళ్ళు చూసే వరకు తెలియదు.. చర్చి పైకి ఎక్కి అక్కడనుంచి నేలపై పడి చనిపోయి ఉంది.. అతని అమ్మ.
ఆ పిల్లాడికి ఇంకా 13 ఏళ్ళైనా నిండలేదు..ఎవరూ ఆదరించలేదు.. ఏదో సత్రంలో .. పాచి పనులు చేసుకొంటూ .. చాలీ చాలని .. తిండీ .. నిద్రా .. ఒక రోజు శెలవు లేని చాకిరి.. అలిసిపోయాడు.. తెలియని కోపంతో రగిలేవాడు.. ఎవరైనా డబ్బున్న పిల్లలు.. ఖరీదైన .. తిండి పేరెంట్స్ కలిసి తింటుంటే.. తన తోటి పిల్లలని తెలియని కోపంతో కొట్టేవాడు.. అదీ చాలా బలంగా.. ఏ మాత్రమూ .. సంకోచమూ .. భయమూ లేకుండా ….
అదే ఎవరో గమనిస్తూ ఉన్నారు.. అతని చేతుల వేగాన్ని అంచనా వేస్తున్నారు..
ఓరోజు వాళ్ళే జీతమిస్తాం .. వారంలో ఓ రోజు శెలవు.. నెల నెల క్రమం తప్పకుండా జీతం.. వాళ్ళ వెంట వెళ్ళాడు.. వంట పనులు.. రుచిగా వండే వాడు.. శుభ్రాంగా బట్టలు ఉతికేవాడు.. మంచి సరుకులు కొనుక్కొని .. అన్ని కరెక్టుగా చెప్పి .. మిగిలిన డబ్బులు అప్పగించేవాడు. ముందు వాళ్ళు చెప్పినట్లే.. నెల నెలా జీతం .. అలా కొన్ని నెలలకి .. ఆ భోజనాలు ఎవరు తింటారో…. ఆ బట్టలు ఎవరు కట్టుకొంటారో… అక్కడికి తీసుకెళ్లారు ..
అదే మరో ప్రపంచం.. అతని లైఫ్ని పూర్తిగా టర్న్ తిప్పిన ప్రపంచం… ఈ భూమి మీద రహస్యంగా పెరుగుతున్న అతి ప్రమాదకర ప్రపంచం.
గుహల్లో.. పొదల్లో.. చెట్లపై ఉండటం.. దూకడం .. పరుగు పెట్టడం .. భయం లేకుండా పులిని చూడటం.. ఈ యుద్ధం ఎందుకనే .. దేశభక్తి పట్ల పూనకం తెప్పించడం.. నిద్ర .. తిండి లేకుండా .. రోజుల రోజుల ఉండిపోవడం.. శారీరక చిత్ర హింసల అనుభవిస్తూ … ఏ వివరాలు చెప్పకుండా ఉండగలగడం .. అన్ని ..
అన్నింట్లో రాటుదేలాక కత్తి .. కర్ర.. రాయి .. ఆయుధాలుగా ఎలా మారతాయి.. సౌజ్ఞలు.. సైగలు.. సూచనలు.. వీలుంటే ఇక్కడి స్వర్గం .. ఈ యుద్ధం లో మరణిస్తే .. పైన స్వర్గం .. అని అంటూనే ..
మొదటిసారి .. గన్ చేతిలో పెట్టారు.. ఆ తర్వాత అది అతని చేతిలో పేలుతూనే ఉంది..
అతని ప్రతిభ అడవిని దాటి.. జనావాసంలో.. అదీ భూతాల స్వర్గమని వందల మండి నిత్యం సంచరించే చోటులో .. కొన్ని వేలమంది వీర సైనికులు చుట్టి పహారా కాసే చోటులో కనీసం పదుల సంఖ్యలో .. ఏ మాత్రమూ ఏ విషయాల్లో తల దూర్చక తమ పని చేసుకొనే బతికే సామాన్యులని బలి తీసుకోమనే అసైన్మెంట్కి రోజుల ముందు నుంచి తయారు చేసి.. రెండు .. మూడు దళాల నుంచి సెలక్ట్ చేసి ఓ ఐదుగురిని పంపారు. .. వాళ్ళు వాళ్ళకి అప్పగించిన చాలా ఖచ్చితంగా నిర్వహించారు.. 21 మంది సామాన్యులని పొట్టన పెట్టుకొని… తద్వారా వాళ్ళ కుటుంబాల వెలుగుని చిదిమి..
నవ దంపతులని హనీమూన్ గా విహరించమని చెప్పిన పాపానికి చర్చి ఫాదర్ దోషిలా.. ఓ హంతకుడిలా భర్తని పోగుట్టుకొన్న ఆ పెళ్లికూతురు ముందు నిలబడి సగం చచ్చిపోయాడు.. ఆమె ఆత్మహత్య చేసుకున్నాక .. ఆ మిగిలిన సగం ..
వెర్రిగా నవ్వుతాడు… ఒక్కసారిగా లోపలి కొవ్వొత్తి భగ్గున మండి అతనూ కాలిపోతాడు.. అలానే కాలిపోతున్న .. అతని ముఖంలో ఓ సంతోష ముద్ర చెరిగిపోదు.. అ తర్వాత అక్కడంతా మట్టి పోసి .. ఇద్దరకీ ఒకే సమాధి లో కాలిపోయేలా చేసి… పూర్తిగా మట్టిని కప్పి వెనుదిరుగుతారు. ప్రయోక్త ; విశ్వం నిండా ముందుగా పుట్టింది .. నిర్దయ మాత్రమే .. కునుకు పాడనీయని ఘాతుక చర్యలు కలిసే దీపాల కిందుగా వాళ్ళ వాళ్ళ ఆత్మహత్యల కథలని రాస్తు
న్నారు.. అది చాలా బలంగా ఉంది..స్మరణ చిత్రాల లోపల ఒప్పుకోలేని దిగులు చంపేస్తూ .. మరింత జ్ఞాన స్పృహ ఓడిపోయినా చెమ్మ మూర్తుల కలకలం పట్టుకొని .. అక్కడే ఇగిరిపోయిన భయం.. అదీ నేనే .. ఇక్కడా నేనే.. ఈ దేహం ఓడిపోయిందని తనకి తెలియక ముందే చెదిరిపోయిన విశ్వ ధరల కన్నీరుని అప్పగించిన శ్రమల నీరుతో .. మీదికి చేరుతున్న పునాది తాపాలు.. కొంచెం నా మాట వినాలని తను వెనక్కి పిల్చినా .. ఇంకేం లేదక్కడ..
ప్రయోక్త ;
అంచున జారిన సమయాల కొత్త తీరికని గడ్డకట్టిస్తూ .. పొడవైన దేహ వాహికని కనిపెట్టే నిరాశ చిత్రాల కౌగిలి సంపదని ఊరబెట్టి.. కలబడుతున్న ఉపదేహ సంకలన మూర్తినిt పగలగొట్టి అంత్య క్రియలు .. నాధతta పడుకూబెట్టిన వికార చూపుని మరిగించిన కృతి మోదులని నరికి .. పైకి చేర్చి పెట్టిన చావు పక్కాగా ఇంటిని కట్టి .. అసహన దీప గొంతుని సవరించే ఖాళీలని ఓర్పుగా నమిలి మింగుతున్న పోలికల నిరూరపు విగ్రహాల కంటి పోటుని కాపలా కాసే మృత్యు భోగం పల్లకీలో .. కొన్ని గుణపాలని తెచ్చి .. తవ్వి పాట వినాలంటారు. పొగ రేవులని చీరకి కట్టి.. దూరం చేరకుండా .. శిలువని బరువుకి కడతారు. రెప్పలు చల్లగా ఏడ్చి.. అప్పగించిన చలన కృతి నిద్రని పాకించి .. రంగు అద్దాలతో రెండో చర్మం చీల్చిన స్పర్శని తాకి … పక్కనే కాల్చుకొని తింటారు. ఆకలిని గాలిగా శంఖంలో ఊది .. కలవర రుజువుని ముట్టడిస్తూ అక్కడే ఓ గుర్తుని మిగిల్చి దోసిలిలో నింపుకొంటారు.
Screen down
…………………………….
EPISODE -18
పిచ్చి పట్టిన యువతి … asylum నుంచి తప్పించుకొని .. గజల్ సింగర్ భార్యని స్మశానం లో కలుస్తుంది.. ఆ Hospital నుంచి పారి పోయి వచ్చావా?
ఆమె. నా నుంచి నేను ఎప్పుడో వెళ్ళిపోయాను.. నేను నా ఆత్మ లేని ఖాళీ డబ్బాని … భయం .. భాద .. అన్నీ ఇగిరిపోయిన మాంసం ముద్దని…
సింగర్ భార్య ; నేనూ అంతేగా .. కానీ మరీ నీలా కాదు.. ఇలా రహస్యంగా వచ్చి .. రోజూ చెమర్చే .. నా భర్త ఒంటి రక్తం ఒళ్ళంతా పులుము కొంటున్నాను ..
ఆమె ; గుక్కపెట్టి ఏడుస్తూ… నువ్వు కొన్ని దశాబ్ద్లైనా నీ భర్త తో కలిసి ప్రయాణం చేసావ్ ? నేను.. కేవలం ఐదు రోజులు .. మూడే రాత్రులు మేము కలిసింది.. మిగతా రెండు రాత్రులు ఇలా .. ఆ చోటుకి వెళ్లి తనని బలివ్వడానికి మేము చేసిన ప్రయాణం లోనే గడిచిపోయింది.. చిన్నప్పటి నుంచి అన్నని పెట్టిన నరకానికి ప్రతిఫలం అనుకొంటా..
సింగర్ భార్య ; ఎందుకలా ?
ఆమె ; ఇప్పుడు ఆలోచిస్తే .. ఆ కారణం నాకూ అర్ధం కాదు.. కానీ దానిలో నాకేదో తెలియని ఆనందం.. పాపం .. ఇంతా పెళ్లి చేసి .. మళ్ళీ అనాథలా తన పంచన చేరితే మళ్ళీ ఆదరించాడు.. ఈ మెదడు సరి కాదని చెప్పిన వినకుండా సరి చెయ్యాలని చూసాడు..
సింగర్ భార్య; నా భర్త .. ఈ లోపలి శుద్ధి కోసమే పాడేవాడు.. ప్రేమ దానిని ఎలా జేయఁస్తుందో చెప్పేవాడు.. క్రౌర్యానికి ఆది మూలం కనుక్కొంటేనే దానిని మార్చగలమని తన పాటలతో చెప్పేవాడు.. విని వెళ్ళిపోయేవారు.. అదే సిటీ లో ఆ మర్నాడే బాంబులు పేలడం చూసి .. రోజుల రోజులు ఏమీ తినకుండా ఏడుస్తూ పస్తుండేవాడు.. మరో పాట రాసేవాడు.. అతని చివరి శ్వాస వరకు హింస ఆగాలని.. కానీ చిత్రం .. ఆ హింసకే బలయ్యాడు..
ఆమె; ఇప్పుడు రోజూ అతనిని కలుసుకొంటున్నావా?
భార్య ; అంతే కాదు.. ఈ రక్తం పులుముకొని ప్రపంచం ముందు నిలబడి .. ఇలా కొవొద్దని.. అరిచి చెబుతున్నాను.. ఎవరికీ వినడానికి కూడా ఖాళీ లేదు.
అదొక విశ్వ సహకార మంత్రం లోని సంధి సూత్రాల కౌగిలిని దాటే మంత్రం స్థలం.. విన్నదే భాగ్యం.. రెట్టించి అడగడానికి ఏమీ లేదు.. రీసోనింగ్ అందేలా ఏదీ లేదు.. తాను ఉన్నాడు అంటే తాను ఉన్నాడు .. లేదు అంటే లేదు.. స్పృహ బతికే ఉంది.. ఆ స్పృహని కళ్ళు తీర్చుకొని వినమని ఆమె పోరుపెడుతుంది..
రోజూ అవసరాలు.. పోటీలు.. రకరకాల ఉన్మాదాలు.. సవరింపులు.. కష్టాలు.. డబ్బు ఇక్కట్లు.. మోసగించడాలు.. కూతుర్లని .. భర్లని మానభంగాల నుంచి రక్షించుకోవడల్లో పడి .. జనానికి ఆమె మాట వైన్ ఖాళీ లేదు.. అంతా పరుగు.. ఎప్పుడో కొండా శిఖరం చివరకి చేరి దూకేయడాలు.. అంతే..
లోపలి సమాధి లోంచి.. ఆమె దుఃఖాన్ని.. మెదడుని కడిగే ఓ గజల్ వినిపిస్తుంది.. ఆమె ఇంకేదో మాట్లాడాలని చూసిన ఏ స్పందనా ఉండదు.. ఆ రోజుకి అంతే ఉంటుందని చెప్పిన ఆమె వినడం లేదు.. నేనీ సమాధిని తవ్వి .. ఆ రహస్యాన్ని ప్రపంచానికి చూపిస్తాను.. తప్పుకో మంటుంది.. ఆమె సమాధి అంతా నిండేలా పడుకుని.. అదేం కుదరదు.. ఈ భూమి ఉన్నంతవరకు.. నా భర్త ఇలా పాడుతూనే ఉండాలి.. నేనా సందేశం .. ఈ జనానికి చేరవేస్తూనే ఉండాలి.. ఆమె అక్కడున్న గడ్డపార తీసుకొని.. ఆ భార్య గుండెల్లో పొడుస్తుంది.. అలా కళ్ళలో ఆ కల వచ్చి వెళ్ళగానే .. ఆమె అక్కడనుంచి .. పరుగున బయటకి వెళ్ళిపోతుంది.. ఆ భార్య ఎంత పిలిచినా ఆగదు.. ఆగితే ఆ భార్య ని ఎక్కడ పొడిచి చంపేస్తానేనొననే ఓ భయం ఆమె వెనక్కి చూడకుండా పరుగు పెట్టిస్తుంది..
ఆమె తాను పాడి ప్రేమ నిర్వచనం గురించి వినిపించగానే . ఆది సౌక్షిక పరిస్థితులేని మోక్ష ధారామతి … మితి లేని ప్రవాహ నిధి.. హత్తుకునే ఉండిపోయిన చీకటి కౌగిలిలో ఝాము సరి అంచుల వాన నీటి గంట.. నిద్ర విశాలంగా ఊరిపోతున్న దీప రంగుల కలహిత చంద్రుడి గది.. మెత్తని సౌజ్ఞ సహకారం తో ఉండిపోయిన అడుగులు.. ఎక్కడలేని ఎత్తుగడలా ఓదార్పులో చీకటిని ఊదే ముద్దుల మైదాన జాతర .. ఉండీ .. లేకపోయినా ఉనికి పట్టి తెచ్చి ఊపిరిలోకి అదిమిన దుఃఖ మంతనాలు.. గుస గుసలా వేడి తేనీరు గొంతు.. తాగి సొమ్మసిల్లిన దీర్ఘ నిమిత్తాల చేరి సాగవు ఘర్ష శిఖరాల కంటి సాగు.. తను ఉంది.. తను మాత్రమే నాలో ఉందనే దీర్ఘ గ్రహణల కలవరపాటు..
రక్తం స్రవించడం ఆగి .. ఓ పూల గుచ్చం బయటకి వస్తుంది.. అది మహా సువాసనతో ఉంటుంది.. అవి భూమి మీద దొరికే పువ్వులు కాదు.
ఏకపాత్రాభినయుడు ఆ గజల్ సింగర్ రూపం లో అక్కడికీ వస్తాడు..
ఆమె మాట్లాడుతుంది..
దేహం అతనిలా మారినా సరిపడని భయం .. ఇదేననే ఉనికి .. చిత్ర జ్వరం కాలుతున్న నజ్జు గొంతులో ఉరిమింది బెంగ.. ఏదీ తను కాదు.. ఆ కళ్ళని చూపు కలిపినపుడు మాయగా మిటకరించడం .. కథలని కాదని పాటని అందుకోవడం.. విశ్వ అనుగ్రహం మోసిన కళాకారుడి శ్వాసల అనుసంధాన ఛాతీ అతనిలో కనిపించక పోవడం.. తనది యుగాల అనుబంధం.. కొన్ని క్షణాల్లో కాలిపోయిన వేరుపాటు.. దుఃఖ చితి ఖాళీ చెయ్యని పొగ ఇంకా కళ్ళలో ఇరుక్కొని .. గొంతు దగ్గర ఉండ కట్టిన అతని ఉనికి దేనిని ఏమార్చగలదు.. అతను ఆమె కాళ్లపై పడ్డాడు. ఆది క్షమించమని .. ఆ గజల్ ని వినిపించమన? ఇదెలా సాధ్యమనే రహస్యం చెప్పమనా?
కాసేపటికి అతను అసలు రూపం లోకి మారి .. క్రిస్టియన్ పెళ్లికూతురిని తీసుకొని వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత భాగవతార్ అక్కడికి వచ్చి అతను దేవుడే నని చెబుతాడు.
ఒక విభ్రమయ అనంతంలోకి కూలిపోయిన ఓ ఖాళీ తనం.. ఇంతేనా .. దేవుని ఉనికి ఇంత సామాన్యమా .. విశ్వ నిందా గర్హం ప్రతీక్ష ధ్వని గూడు కట్టిన కళ్ళలో తెలియని ఆందోళనతో జారుతున్న నీరు.. ఇదే ఆయన కురిపించిన వరమా? ఒక్కమాట కూడా నేనేనని చెప్పలేదు.. సాంద్రతర ఆయుస్సులో ముసుగేసుకొన్న అనుమాన పునాదుల చూపు .. లోబడి లేని ఉమ్మడి ఒప్పందాలు.. రెప్పలపై తీర్చుకున్న ముచ్చట్ల తీరుని సరిపెడుతూ .. లోపల లేని కాళ్ళని దులిపి రంగు తీరుల ఓర్పు మునకలని అప్పగించిన చీకటి అంచులని సరిచేసుకొంటూ .. ఆయన ఆముక్తకారుడిగా నన్ను అనుగ్రహించాడా ? కొంచెమైనా తన ఉనికి ఇదేనని నాకు తెలియాలని ఎందుకు అనుకోలేదు.. దాని నుంచి ఇంకేదైనా ప్రయాజనం ఆశిస్తాననా .. ఇంకేదైనా తెలియనిదా .. లేదా నాకా అరహతా లేదనా?
భార్య ; ఏమంటున్నావ్ నువ్వు ?
భాగ ; సృష్టిలో ఎక్కడా జరిగినది .. మరిత్యువు తర్వాత కూడా నీకు అతనితో అనుభందం మిగిల్చాడు.. ఐహిత సత్తువలని తిప్పి రాసాడు.. ఒక పాటని అనంతం లోకి తీసుకెళ్లి ఆశీర్వదించాడు .. ఒక కలల దీపాన్ని నేరుగా నీ కళ్ళలో పెట్టి చూసే అవకాశమిచ్చాడు.. ఒక ఆందోళన భూమిపై పంచడానికి ఆరాట పడ్డాడు. దుఃఖ నిర్మాణ మూర్తులని కదిలించి కౌగిలో పండించాడు.. ఇది ఇలాగే ఉంటుంది .. దానిని ఆపలేం.. కొంత గందరహాలం తప్పదు.. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న వంతెన .. ఆ భఙ్గహిత అసంకల్పిత మృత్యు బిగీస చూసి.. ముచ్చట పడి తన ఓ వరం ఇవ్వాలని ఇదంతా చేసాడు..
భార్య ; నమ్మలేక పోతున్నాను. ఒక బయమేదో నన్ను ఆవహిస్తుంది..
భాగ ; అలా ఉండాలి తల్లి.. నీ పాడాలని తాక నివ్వు.. ఇదంతా చాల అరుదైన అనుగ్రహం..
భార్య ; నాకు ఆయన .. అయన చర్యల పట్ల అంతులేనంత కోపం .. అంగీకరించలేనితనం ఉంది.. అదెలా చెరుగుతుందో నాకు తెలియదు.
భాగ ; నాకు తెల్సు.. బహుసః ఈ పారదర్సకతే ఆయనకీ ప్రియమైనది.. నువ్వెప్పుడూ ఆయన లోపలే ఉంటావ్.. అలా అని .. కాపాడతాడని కాదు.. కనిపెట్టుకొంటాడు అంతే..
ప్రయోక్త :
శబ్ద జన్యువుల దేహ ధార .. స్థితి ముద్ర కదలికల్ని దాటి .. ఆ పైకి జరిగే తాండవ భౌతిక మూర్తుల కలకలం.. ఒక దేహ నిర్మాణం లో నిర్యాణ తలకిందులు దుఃఖ తీవ్రత .. ఏది .. ఎప్పిటి నుంచి ఎటు పోయి ఎక్కడ ఆగింది.. తల బరువు ఓర్పులతో తోడైన ఉనికి కిందనే మూసేసిన ముద్దల ముద్దల సంధాన ముఖాలతో కదలికల్ని ఓర్పుగా దృష్టికి తెచ్చిన కన్నుని .. హెచ్చరిస్తూ .. భయం గుప్పెటలో ఉండిపోయిన మోతాదులని దాటి .. ఒక పోలవరపు నిద్ర చూపుని మోసే తీపి ముడిని బిగించి .. కొంచెం ఊరట లేని కుదుపుతో .. కథలని గారడీ చేస్తున్న పోలికల మధ్యనే తప్పిపోయిన కల.
Screen down
……………………………
EPISODE -19
తెల్లని హంస పై ఎగురుకొంటూ .. అతని మనవరాలు వస్తుంది.. ఆ పాప రేడియం దుస్తుల్లో మెరుస్తూ ఉంటుంది.. ఆ హంస ఎప్పుడూ లేనంత మెరుస్తూ ఉంటుంది.. ఎదురుగా పొడుగు అంగీ వ్యక్తి .. రక్తం చెమరుస్తూ ఉంటాడు.. అతని ముఖం లో భయంతో కూడిన నవ్వు.. ఒక యుద్ధ మూర్తిని జోడిస్తున్న తలపోతతో కలవరిస్తూ .. ఏదో చెప్పాలని పెదాలని కదుపుతున్నాడు.
ఆ పాప అడుగుతుంది..
దేవుడా .. ఎందుకీ ఇన్ని గాయాలని మోయడం.. ఇదంతా వదిలేయి .. ఆ నదిలో నీ ఉనికి మర్చి స్నానము చేసి .. వెళ్ళిపో.. నీ సృష్టి రచనలో .. వీలైనంత తొందరగా లీనమైపో.. ఇదంతా ఇలాగే ఉండనియ్యి.. జరిగిన నష్టం చాలు.. నీ ఉనికి అంత మంచిది కాదు.. మమ్మల్ని నీకోసం అలా వెదుకుతూనే ఉండనియ్యి… కొంచెం కూడా మా లోపల మేమికా సర్దుకోలేదు.. ఇంకిపోని విశ్వ జాగృతిని ఊరడించలేదు.. కథ మరింత చిక్కబడ్డ నడకని దాటి ఆ గోడలు కమిలిన విశ్వ స్వార్జిత కన్నుని సరిచేసి .. కాస్త జిగురు తుడిచినా కౌగిలిని ముద్దుపెట్టుకొంటాను.
ఆమె తన బాలన్స్ అఫ్ లైఫ్ ని గానం చేస్తుంది.. చీకటిని వడపోస్తుంది..
ఆది విశ్వ సమేకా మూర్తుల వివక్ష ధారా .. కళ్ళలో ఒప్పుకోలేని కలలు .. అతీత నిద్రల మధ్యనే నా అడుగులని దాచి .. పెద్ద కథల వదుల మూర్తులని కనిపీఠిన విశ్వాస ముద్ర .. తను అలానే పగిలి .. రొప్పుతూ .. ఇంకిపోయిన జ్ఞాన దీపపు ఒరిగింపుని పీల్చి .. అనుకోని చోటుని కడిగి .. వడపోసిన ముట్టడి రంగుల ఒజ్జగింపుని తడిమి … ఒళ్ళంతా తడిపిన మోతాదుల ఋణం తీరి .. అలానే ఉండిపోయిన సమ్మతి అప్పగింతలతో సర్దుకొని .. అలానే కదిలే చీకటి సముదాయాల మృత్యు తీరికలేని గుమ్మలని మూసిపోతూ .. కొత్త అలారాలని తీర్చి దిద్దిన గంటల మధ్యనే నేను మరో దేహమై కనబడతాను.
గజల్ సింగర్ ని అతనికి అతని భార్యతో … భాగవతార్ లోపలి నుంచి మాట్లాడిస్తుంది..
Singer ; కళ .. ఒక మహా నిద్ర లోపలి తూఫాన్ .. పెద్దదైన ముట్టడి.. ఉనికిని కాదనలేని తీరుతో నమిలేసిన దీర్ఘ సమ్మతుల ఒప్పుదలని జోడిస్తూ … ఒక కొత్త గుమ్మం లో కింద పడ్డ రంగు విగ్రహాల తీరికని ఊపుతూ అదే దర్శనాన్ని అడిగి తెచ్చుకొంటారు. ఇక్కడ పోలికలు ముఖ్యం కాదు.. భయం అంతా కలియదిరిగే తమక స్థిరమై గొంతులో గూడుకట్టుకొంది.
Bharya ; నాకు దీని అంతటితో నిమిత్తం లేదు.. పెద్ద జాగ్రత్త లేదు..కంటిలోపల ఇంకా ఏ దశ లోని గడువూ మిగల లేదు.. నువ్వేం చేస్తున్నావో.. దాని నుంచి ఏ ప్రయోజనం ఉందో నాకు తెలియదు.. ఒక అభయ సమాధి ఒప్పుకొని నిద్ర తీరాలని దాటిస్తూ .. ఐహిత ముఖాల రేవులో .. ఉండిపోయిన తీర్ధ కదలికలు .. నువ్వు కావాలి.. ఆది నా మృత్యువు తర్వాతైనా .. దానికి ఈ క్షణమే సిద్ధం.. నా నుంచి దేనిని పోగుట్టుకొన్న ముట్టడి రంగుల దేహ ముద్రలుగా నేను ఒక పల్చని దేహ తీవ్రాల చిత్ర ముఖాన్ని తెచ్చుకొని ఒబ్బిడిగా చేరుకొంటాను.
………………..
ఒక కలనీ సృష్టించి.. స్టేజి అంతా ఓ చిత్రమైన కాంతి … శబ్దాలు.. నడకలు.. ఎవరో ఏదో విసిరేస్తున్నట్లు.. చీకటి కుప్పలా కుప్పలుగా కురిసి .. దృశ్య నిద్రల చెలగాటపు సంధి సూత్రాలని వాదులు చేసి కదలికని అప్పగించిన ఇరుకుల్లో ఓడిపోయిన గతి దేహాల చిత్రాన్ని ఓలలాడించినట్లు…
డాక్టర్ స్టేజి మీద .. ఆమె ఒక్కతే .. ఓ రౌండ్ టేబుల్ .. రెండు కుర్చీలు.. .. తనలో తను.. ( కొంచెం యువతిగా .. మోడరన్ మేకప్ తో ) రెండు కాఫీ కప్పులు.. కొన్ని కాగితాలు.. ఓ స్టెతస్కోప్ .. వైట్ కోటు
యువకుడు వస్తాడు ..ఎదురుగా కూర్చొంటాడు.. ఆమె పేరైన అడగకుండానే …
నాకు దేహమిప్పుడు ఒక సందేహాస్పద మంత్ర జాగారం .. కనబడని నిద్ర సూత్రాల వదులు.. ఇంకా కాస్త లోపలి జరిగేనా .. అంతా అంధకారం.. ఎన్నింటినో .. రక్షిస్తూ .. ఊపిరిని వింటూ.. మత్తులోకి జారుస్తూ.. కొన్ని శాశ్వత మత్తులోకి జారి.. ఒక్కోసారి కంటి నలతలా కమ్మేస్తే.. నా మృత్యువే .. ఇదొక జ్ఞాన మూర్తి సరిచేసిన అప్పగింత .. తడిమిన ఝాములోని ఓ సంకల్ప వేడుక
ఎదురుగా ఆపరేషన్ బెడ్ పై ఎదురు చూస్తన్నట్లుగా … ఏదో అనననుకూలమైంది నాలోపల గడ్డ కట్టి.. కొంచెం ఉపరి తలంలో నంజుకు తిన్న అనుమానాల రూపంలో మోగుతూ .. కదిలే మోహ ద్రవ్యాల కనువిప్పు నిద్రలు కాల్చేసిన ముట్టడి.
మీరూ డాక్టర్ .. నేనూ డాక్టర్ అన్నదా పెళ్ళికి బంధన బిగించే సూత్రం.. ( అతని కళ్ళలో నీళ్లు) ఇదొక వ్యాపార సూత్రం .. ఒక అనుకూలతని వేసుకుకొని క్రమం.. ఒక మూర్తుల ముద్రని పోగుట్టుకొన్న జ్ఞాన విషాద సంకీర్ణ పరిధి..
డాక్టర్; మరెందుకొచ్చారు?
అతను ; మా నాన్న ఈ భూమి మీద ఉన్నప్పటి మాట కోసం.. ఆయనకి పెళ్లినేది ఓ కామన్ phenomena … నాకు అదే అర్ధం కాదు.. పెళ్లి నా లోపల పలకడానికి.. అసలు దేహం నాకు అర్ధం కానీ ఓ సంక్లిష్ట రాజీయమయ్యే ఓ యుద్ధ తంత్రంలా .. ఇప్పటికీ నాకు నేను అర్ధం కాలేదు..దేహమో.. నా ఆలోచనలో.. మేధనో .. ఇదంతంతా ఒకదానికొకటి synchronize అవుతున్నాయో లేదో నాకే తెలియదు.. అలాంటప్పుడు ఈ పెళ్ళెందుకు? .. సేవ నుంచి సేవ ..అసలు నాకంటూ చిన్న అమౌంట్ కూడా బ్యాంకు లో ఉంచుకోలేక పోయాను.. ఇక నాకెలా .. ఈ పెళ్లి.. సంబంధించినంత వరకు నాకు ఏ రకమైన అర్హతలు లేవు..
డాక్టర్ ; హాయిగా నవ్వుతుంది.. కళ్ళలో నీళ్లు.. ఏదో మాట్లాడాలనుకొని,.. అంతలోనే తల అడ్డంగా ఊపుతుంది.. కాళ్ళని గట్టిగా ఆడిస్తుంది….
అతను ; ఆది మీకు స్వయంగా చెప్పాలని.. మీ గురించి విన్నాను.. మిమ్మల్ని కలిసి క్షమాపణ అడగడం నా కనీస కర్తవ్యంఒక మంచిని అక్నౌలెడ్జి చెయ్యాలిగా.. ( మళ్ళీ నీటి పొర)
డాక్టర్ ; మీరూ నాలాగే ఉన్నారు.. నాన్న ఇచ్చింది తప్ప .. దానికి నేనంటూ ఏమీ ఆడ్ చెయ్యలేదు.. నా కసలు బెడ్ మీద శరీరాన్ని చూసాక .. స్త్రీ – పురుష వైరుధ్యమే కనిపించదు. అంతా కలిసిపోయినట్లు.. వాళ్ళ చావుతో కలిసి నేనూ యుద్ధం చేస్తున్నట్లు… ఈ అనాటమీ మరిదేన్నో నా లోపల నుంచీ మూసేసింది.
అతను; నాదొక చిన్న ప్రతిపాదన .. నా ఫ్రెండ్ తన ఇండివిడ్యుఅల్ హాస్పిటల్ కి నన్ను ఓ కీ వింగ్ చూసుకోమంటున్నాడు.. మీకు అభ్యన్తరం లేకపోతే .. పెహాల్గమ్ లో …. నాతో పాటు మీరక్కడే ఉద్యోగం చేయవచ్చు…
డాక్టర్; పెహాల్గమ్ లోనా ?
అతను ; నాకీ భూమి మీద ఉన్న ఒకే ఒక మనిషి.. మా నాన్న .. ఆయనని అక్కడే పొట్టన పెట్టుకొన్నారు.. ఆ జ్ఞాపకం తడి ఆరకుండా ఉండాలని.. ఆయన చివరిగా అక్కడ నడిచిన జ్ఞాపకం నాలోపల అలాగే ఉండిపోవాలని.. మీ విషాదమూ నాకు తెల్సు
డాక్టర్ ; మీ విషయం నాకు తెల్సు .. ఆ ముందు.. మా డాడీ ని మీ ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇద్దరూ లేరు..
ప్రయోక్త ;
స్వయంచాలన కూలిపోయిన మహా విషాదమూ.. కనిపించని చరాచర మరణ కాష్టం .. పొరబడని దుఃఖ దృశ్యంతో కదిలే రంగుల తీర్ధంలో .. కంటికి చుట్టుకొన్న కంగారు మాసిపోతూ … కాళ్ళని కాపాడుకొనే దేహ కవ్వింపు కదిలికని మార్చి పెడుతూ .. వినబడని నిద్ర స్థలాన్ని కుదిర్చి.. వెకనే గాయ దర్శినిగా తరిమినప్పుడు .. పొగబెట్టిన కదలికల్ని అప్పగించిన అజాగ్రత్త ముద్రాలని కుదిపి .. ఆ పక్కాగా ఉంచేసి ముట్టడి కనుమల్లో .. తెల్లబడిన చూపుని తాగి పురా నిశ్చయాల పరాకుతో తురిమిన దేహ వర్షం అడుగంటిన చూపు.. ఇగిరిపోయిన స్థల మార్పిడి మూర్తులని తిట్టుకొంటూ మిగిలిన యుద్ధ స్థావరాల్లో కదిలే ఒత్తిడి .. అక్కడే జరిగిన దాడితో .. పక్కకి జరిగిన బాయ దేహాల కుట్రని కుదిర్చిన అవకతవక నిద్రలేని పోటెత్తించే ముఖాలు.. పదే పదే గుర్తు రావాలని.. కూలిన శిఖరాల కిందే నేను మిగిలిన గొంతుని బయటకి తీసుకోవాలని.. వెలుగు మోస్తున్నప్పుడు చీకటి జంతువుల దాడి.. పెద్దదైన కన్నీటి ముద్రలని పల్చని కంటితో చూస్తూ జ్ఞాన వికర్ష దర్శన ఊడలని తాకించి .. పైనే ఉండిపోయిన నడకలు సరిచెయ్యక ముందే.. ఒక ఆవిరి ఉడికిన స్థిమిత జాలంలో ఊరేగే మృత్యువు..
Screen down
……………………………
EPISODE -20
యక్షగాన రూపం లో … చాలా వరకు నీడలు .. వైట్ స్క్రీన్ పై …
చరిత్ర నింపిన గాయంతోనే ఊగిపోతూ .. శరీర శ్రూయం లేని దేహ స్థావరంలో కునుకు తర్వాత కునుకు.. మాట తర్వాత మాట .. కథ వెంట నడిచే కథ .. ఒక పెద్ద తోడు.. నల్లని కలకలంలో ఇగిరిపోయిన మంథన మూర్తుల దేహ వైభవం.. నంజుకు తింటున్న మాట వరుస తీరికలేని దాటి కొత్త వీలు లేని తూగుదు నిద్ర పగలు.. ఉడికిపోతున్న మంటలపై ఒంటరి దీపం.. కత్తులు.. గొంతులు.. స్త్రీ మాంసాలు.. ఉక్కిన వంట గదులు.. పెద్ద తలుపులు వేరిగాక తీర్చుకొనే సొరంగాలు..
ఓ రోజు పెను తూఫాన్ లో .. ఓ రక్కసి మూకల పడవ ఓ రాజ్యపు ఒడ్డుకి చేరింది..వాళ్ళు దిగి.. ఈ అడవి.. ఈ రాజ్యం ఒకప్పుడు మనది.. ఇప్పుడు చూడు లాక్కొని ఎలా కులుకుతున్నారో అని … కోపంగా అరిచారు..పళ్ళు కొరికాడు.. ఆయుధాలన్నీ ధాన్యపు సంచీలలో సర్ది .. కొన్ని గొడ్డళ్లు.. కత్తులు .. బరిసెలు.. కాగడాలు.. పడవ లోకి ఎక్కించి .. నగరంలోకి బయలు దేరారు.. నలుగురు మిలిటరీ దుస్తులలో అద్దానికి ఇటు పక్క అభినయిస్తుంటే .. అటు పక్క అదే విషయాన్ని జానపద శైలిలో అతను పాడుతూ .. చెబుతూ.. అభినయిస్తూ పరిచయం చేస్తున్నాడు..
మృత్యు తాండవం సెలరేగే హద్దులు.. కాల్చి పోసిన ఛాందస గతి ఊరేగే మూర్తులు
సత్య నిరంతరం ఊయలూదే లోయలు .. పీల్చి రాలిన గంధక స్థితి పారాడే గోళాలు
రాజ్యం .. ఒక మానవ ఇతిహాస ముట్టడిలో జ్ఞాన గర్భపు విచ్ఛిత్తి .. కత్తి తిప్పిన దేహ గాథ
ఆజ్యం .. ఒక దేహవ సన్నాపమ కట్టడి తో పూర్ణ నిబ్బర వికృతి … సుత్తి కూల్చిన మోహ స్వేద
వాళ్ళు ఆ రాజ్యపు రక్షక భటుల రూపం లో ఉంది .. ఎవరూ వాళ్ళని ఏ మాత్రమూ కనుక్కో లేరు.. మాట తీరు.. నడక తీరు .. అంత అలానే.. అక్కడ వీధి.. ఊర్లు పేర్లు అన్నీ ముందే తెల్సుకొని వచ్చారు
రాత్రి పూట ప్రవేశించి..ముందుగా ఓ గుడిలో విగ్రహాన్ని నరికేస్తాsaa రు .. రాజ్య సరిహద్దులో .. భటులని తలలు తీసేస్తారు.. పొలిమేర దగ్గరలో ఉన్న ఆశ్రమం లో ఋషులని చంపి.. అటుంనుంచి… నేరుగా ఊరిలో అడుగు పెట్టి.. చప్పుడు లేకుండా ఓ ఫామిలీ మొత్తాన్ని చంపి.. అడవిలోకి వెళ్లి .. ఓ గుహలో బస చేస్తారు. ఆ ఏర్పాట్లు.. దానికి కావాల్సిన రూట్ మ్యాప్ వాళ్ళ దగ్గర ఉంది..
మళ్ళీ మరునాడు రాత్రి.. ఓ పెళ్లి బృందాన్ని .. ఊరు చివర పట్టుకొని .. అందరినీ ఊచకోత కోస్తారు.. ఏమీ తెలియని అమాయకులు.. కొంతమంది తాగి ఊగుతున్నారు.. కొంతమంది మిఠాయి తింటున్నారు.. కొంతమంది వాళ్ళ పెళ్లి రోజులని గుర్తు తెచ్చుకొంటున్నారు
ఓ గురుకుల పాఠశాల విద్యార్థులని .. చంపేస్తారు.. వాళ్ళకి ఏ పాపమూ తెలియదు.. గురు సన్నిధిలో జ్ఞాన దర్శన చేసుకోవడానికి రాత్రీ పగలూ కష్టపడుతున్నారు.
రాజ్యం లో తీవ్ర అలజడి.. రాజు స్వయంగా రాత్రి సంచారం (కేవలం గూఢచారులకి తెలిసేలా రహస్యంగా ఉంచి).. చేస్తాడు … రాజు అన్నీ రకాలుగానూ .. సిద్దమై పోయాడు.. ఎలానైనా ఈ సమస్యని పరిష్కరించాలని.. బలమైన సేనని తయారుగా ఉంచుకొని … భార్యని కంటి నిండా ఓ సారి చూసుకొని.. ఊపిరిని ఓసారి బలంగా పీల్చి బయలు దేరాడు
కానీ కొంతమంది చేతులు కలిపినా గూడచారులు రాజుని వాళ్ళ స్థావరం వేపు పిలిపించి పట్టుపడేలా చేస్తారు.. విషయం తెలిసి … ప్రజలంతా గగ్గోలు పెడతారు.. తమ రాజుని తలచుకొని కన్నీరు పెడతారు.. రాణి నిస్సహాయత.. మరో పక్క కోపం తో ఊగిపోతోంది.. రాజ్యమంతా అనాది అయిపోయినట్లుగా .. రాజుని అందరూ. వెదకటం మొదలు పెడతారు
రాజ్యానికి రాజు లేక మంత్రి .. వెంటనే.. రాణిని .. రాజ్య అధిపతిగా ప్రకటిస్తాడు…. ఆమె చాలా తర్జన భర్జనలు పడుతుంది.. రాజ్య క్షేమం ముందు తన దుఃఖాన్ని దిగమింగుకొని .. ఆ పదవికి ఒప్పుకొంటుంది.
ప్రయోక్త;
తనదంటూ సంతతి లేని విశ్వ కేలన … అప్పగించిన ఒప్పుకోలు రంగుల దేహం.
ఊరడించే పగటి తలుపు.. తాళం వెయ్యని చీకటి అడుగులు .. ఝాము ఓపికని పీల్చుతూ .. పొడిబారిన మృత్యు శరీరాల అప్పగింతలు మధ్యనే .. ఇల్లు.. రాజ్యమే తనదేనని ఆరడి .. తల్లడిల్లే చూపులు ఖాళీల్లో మెట్లని సరి చెయ్యని .. నడకలతో కోరుకొన్న గుడి.. వెనక నుంచి మోటు బరువుల దాడి .. ఐనా తెలియని ముట్టడి .. తెల్లని ఊపులతో పండిన రుతువుల కప్పుతూ … ఒంటరిగా అరిచెయ్యని విసుగుల బరువుతో పండిన చీకటి పలవరింపులు.. ఎర్రని మోసాలు.. శిక్షలకి ఆరిపోయిన గోడలు.. బీటలు దీసిన ఇంటి రాత్రుల మధ్యనే వాళ్ళు పరాయిని చేసి పెట్టుకొంటారు.
ఎంత మాత్రమూ ప్రయాజనం ఉండదు.. రాణికి గూఢచారులపై అనుమానం వచ్చిన .. వాళ్ళు అప్పటికే పారిపోయారు.. ఆ ద్రోహుల నాయకుడు.. ప్రజలు మళ్ళీ మామూలు జీవనం లోకి వెళ్లడం ఇష్టపడక మరో పథకం చెబుతాడు.. జనం లో చావుల భాద మిగిల్చాలని.. ఓ కుటుంభం మొత్తాన్ని చంపితే ఏ ప్రయోజనం లేదని.. సరైన ఎత్తుగడకై.. వాళ్ళు మారువేషాల్లో తిరుగుతూ ఉంటారు.. గ్రామ దేవత సంబరాలు సరైన అవకాశమని పధకం వేస్తారు.
. కుటుంబాల లెక్కలన్నీ గమనిస్తారు. ఆ రోజు రానే వచ్చింది.. జనం అంతా తిని.. తాగి.. పాటలు .. ఆటలు నడుస్తున్నప్పుడు.. మైమరిచి పోయి ఉన్నారు.. కాసేపటికి పెద్ద పెద్ద అరుపులు.. రక్తం .. తలలు.. కాళ్ళు.. చేతులు.. రక్తపు మడుగులో మొండాలు.. శ్వాస ఆగిపోతుందోమోననెంత దుఃఖం.. సరి లేని విపరీతాల మద్యనే నలిగిపోయే నల్లని పొగ… ఊపిరాడని చిక్కదనం.. మోత పెట్టె గొంతు జిగురు.. కథ తెలియని మృత్యు బిగువు.. ఏదో తెలియక పోయిన తెలిసినట్లు….
ఎవరికీ ఏం జరింగిందో అర్ధం కాలేదు.. ఎవరి వారేవోరో గుర్తు పట్టలేని పరిస్థితి… రాణి పరుగున అక్కడికి చేరుకొంది.. ఏడుపులు .. పెద్ద బొబ్బలు.. ఒక్కకొక్కరు వాళ్ళ గోడు వెలబోసుకొంటున్నారు.. ఏ పెద్ద కుటుంభాలని వాళ్ళు పట్టించుకోలేదు .. అన్ని పేద కుటుంబాలే.. అనేక లెక్కలు.. ఆలోచనలు.. అయోమయాలు.. అంతు తెగని విపరీతాల మధ్య దేహ ద్రవ మాయా నటనలు.. తెల్ల నవ్వు శాపాలు..
చిత్ర విభ్రమల ఎర్రబడి… కనిపించని కత్తుల ఒరలో కూరుకు పోయిన విశ్వ సంపద ఊరడించిన శరీర ముంపులని దాటి .. కదలిక లేని వినయ మూర్తుల .. పండిన దీప నజ్జు కోసి పెట్టుకొన్న సన్నాహా తీరులు కదిలించే లిపి దర్శన బొటనవేళ్ళ తాకిడితో కళ్ళలో తిరగబడ్డ నోటి మాటలు.. ఎలాగూ ఎదుటపడి ఏదీ అనుకోవడానికి లేదు. తప్పుకు పోవడమూ కుదిరేది కాదు…..
హఠాత్తుగా ఉండిపోయిన జ్ఞాన మూర్తుల ఒరవడి గొంతులతో అప్పగించుకొన్న ముడులని వదులు చేసి.. వినసొంపుగా ..జీరగా లోపల ఐహిత సత్తువుల ఒప్పగించుకొన్న ముగింపులు .. ఒరిగిపోయి ఉండిపోయిన తలఒంపుల దీప వంతులతో కలబడే అప్పగించిన అతిక్రమ మంతనాలతో ఓరగా పడిపోతున్న చీకట్లు..
ఇంటి పెద్దని.. ముసిలి తల్లితండ్రుల ఉన్న ఇంట్లో.. కొడుకుని.. కొత్త జంటల్లో .. భర్తలని( వాళ్ళ ముందే) తలలు తెగ్గొట్టి మరీ చంపారు.. అందరూ మొగ వారే… ఐదేళ్ల నుంచి అరవైయేళ్ల వారి వరకు… రాణి .. మూడు రోజులు.. అక్కడే గుడారం వేసుకొని.. తీర్వన్గా తన సేనతో కలిసి వెదికింది.. దొరకలేదు.. ఆమె అలసిపోయింది.. అంతఃపురం చేరుకొన్న రాత్రే మళ్ళీ దమన కాండ ..
ఈసారి రాజ్య పాలకుల ఇళ్లలో.. జనం కోట దగ్గరకి దత్తుకొచ్చారు.. అరిచారు.. తిట్టారు.. శాపాలు పెట్టారు.. రాజు కావాలి.. ఈ రాణి వల్ల మాకు ప్రమాదం .. అని అరిచి అరిచి .. రోజుల రోజులు అక్కడే ఉండిపోయారు.. రాణి ఇదంతా చూసి ఓ రాత్రి ఆత్మహత్య చేసుకొంది.. ఆ ద్రోహుల నాయకుడు నేరుగా కోట లోకి రక్త పాఠం చేసుకొంటూ వచ్చి.. తానే రజని ప్రకటించుకున్నాడు..
భర్తలని పోగొట్టుకొన్న ,,, కొడుకులని పోగుట్టుకొన్న తల్లితండ్రులు ఒక్కటై… యుద్ధ విద్యలు నేర్చి.. ఒక్కసారిగా దండయాత్ర చేశారు.. నేరుగా రహస్య మందిరంల్కొకి చెలికత్తెలు సాయం తో ప్రవేశించే .. రాజుని విషం కలిపినా మద్యం తో చంపి.. ఆ తర్వాత యుద్ధం లో .. మిగతా సేనని.. చంపి.. రాణి .. కొడుకు ( ఇంకా పదేళ్ల వాడే) ని రాజుగా ప్రకటించారు ..
ప్రయోక్త ;
జోలన నరికి పోయిన ఆనవాళ్లతో .. తిరిగి అలిసిన మూర్తులని జోడిస్తూ .. విడదీస్తూ ఊపిరి ఆతని జోడించుకొంటూ పోయే దేహ గీతని జాలువార్చే ముఖాలు ఒత్తిడి ని తాకుతూ .. ఇక్కడే ఉండిపోయిన మసక నీరు నిండిన కునుకు….నల్ల పాముల పుట్టలో కాటు వేసిన ఇంటిని తప్పించి కూల్చుతూ .. బొట్టు కూలిన ముడి ముఖాల ఎద్దడి .. కథలు వేరే లేవు.
అప్పగించే నిద్ర తురుముల కలల దాడితో .. పగిలిన సరిహద్దులు.. మృత్యు అడ్డాలు.. కదిలే నవ్వుని దువ్వుతూ.. వెనక నుంచి శ్వాసని నాకుతున్న కలవరం.. గొంతు లోపల ఎండలోకి చెట్టు వేళ్ళు దిగుతూ .. ఇక్కడే ఉండిపోయిన దేహ కలకలం ఓదార్చిన ముట్టడిగా .. ఆ లోపల కన్ను చెల్లా చెదురై మాటల్లోకి ముడుచుకొంటుంది..
ముద్దకట్టిన దేహ సంపద అడుగంటాక .. వాళ్ళు తిరిగి రాలేదని .. కబురుని తేలిక చేసే కాంతిలో దీర్ఘ చెమ్మ ఆరిన దుఃఖమే తనని వెనక్కి రమ్మని ఏడుస్తూ .. అక్కడ కబురుని దాచి పెట్టి మోసగిస్తుంది
భాగవతార్ ; ఇదొక భాష్య ధారగా ఉండాల్సిన అవసరం ఉందా?
ప్రయోక్త ; ఉంది.. ఉంది.. చరిత్ర పొరలు ఇలా దిగబడి ఏ చప్పుడు లేకుండా ఉండకూడదు.. ఎంత దుఃఖం గడ్డకడితే .. ఈ భూమి ఈ రోజుకి ఇలా ఎందుకు ఉందో ఊహకి అందాలిగా ?
భాగా ; విశ్వ నిర్మాణ ముద్రాలని వడపోసే మహా సమ్మతి .. పొరపాటున కూడా ఊరుకొని ఉండిపోదు.. ఎందుకు ఇంత హింస. స్వర్గతుల్యమైన ఈ భూమి పై ఒక సంపూరణ జాగృతితో .. బతికి మన ప్రయాణాన్ని ముగించడానికి..
ప్రయోక్త ; అదే నా అనుమానం .. ఇదంతా సృష్టి కర్త చేతుల నుంచి దూరం జరిగిపోయిందా అనిపిస్తుంది.. ఆ దేవా దేవుడు మనిషికి ఇంత కసటమ్.. నష్టం జరగాలని ఎందుకు కోరుకొంటాడు.. ఇది నాకు అర్ధం కాని మహా వినాశనం …ముందు ముందు ఇలా జరిగిందని నమ్మాలన్న.. నాకీ పని తప్పదు..
భాగ ; నాకు తీవ్రమైన భయం కమ్మేసి ఉంది..తడబాటు లేని కన్నుని కలిపి సిగ్గుని వడపోసి.. దేనినో కోపం తో కాల్చేయాలని ఉంది.. కాని అదిఎలానో తెలియడం లేదు..
ప్రయోక్త ; ఇక్కడ నువ్వు నా మాటని వినాలని అనుకోవద్దు.. విశ్వ నిద్రాణ శృతి సూత్రం తగలబడి .. నిరాధారం కాని దేహ చితిని కదిల్చే చిత్రాల మధ్యనే నేను నిండిపోతాను.. నువ్వు నన్ను చేరాలని అనుకోవద్దు.. ఈ భవిష్యత్తుని చూడటం నాతోనే ఆగిపోనివ్వు.
ప్రాణం లయం తప్పుతుంది.. కథ మళ్ళీ రాలుతుంది.. ఊపిరి కొత్త ముడిని బిగిస్తుంది.. లోపల కొన్ని సమాధులు కదులుతున్నాయి.. ఊపిరికి ఓ బలమైన అంచుని పిండి … చించి తగలబడుతున్న పోలికలని ముప్పేటగా తోడుతున్న చీకటి ముడులతో మండుతున్న ఇనుప తలుపులు..
……………………………
Episode – 21
ఏకపాత్రాభినయుడు జాతక ఋషిగా మారి..కొంతమంది మరణాలని ఎక్కువ బాధ కలగకుండా తన ఆశ్రమ భావిలో.. స్నానం చేసేటప్పుడు .. అనాయాస మృత్యువుని చేరేట్లు చేయడం.. అతనూ .. గుణ కర్మ విశేషాలు లెక్కలోకి తీసుకొన్న .. న్యాయం పట్ల ఇక పక్షంగా ఉండేవాడు. మంచీ – చెడులని తేటతెల్లంగా కనిపించాలనుకొనేవాడు. ఎక్కువ సమయం నిదానించకుండానే పరిష్కారాలకు తొందరపడే వాడు.
కర్మ పరిపూర్ణం కావడం లేదు కదాని .. వాదించడానికి యముడు వస్తాడు. బ్రహ్మరాతకే ఎదురు తిరుగుతున్నాడంటే అతని సామర్ధ్యం అంచనా వెయ్యకుండా అక్కడకి రాలేదు.. కానీ అతని సమక్షంలో అన్యాయమనేది జరగదని నమ్మి వచ్చాడు. అతని ముఖంలోని ఓ స్పష్టమైన అగ్ని తో కూడిన తేజస్సు.. తృప్తి..చేస్తున్న పని పట్ల సంపూర్ణ విశ్వాసం అతని ముఖంలో కనిపిస్తూ ఉంది.
వస్తూనే అతను కేవలం నుదిటి రాతని చదవడం కాదు.. పూర్తి మార్చి అనాయాస మరణమిస్తున్నాడని… బ్రహ్మ రాతని కూడా కాదనే అతని అపార శక్తి.. ఏ సృష్టి అతనికి అలా సహకరిస్తుందో అర్ధం కాక .. కంటి నిండా ఓ గడ్డ కట్టిన ఓ ఆశ్చర్య చకిత విస్ఫురణకి గురవుతాడు.
యముడు అతని దగ్గరకి వచ్చినపుడు .. అతనిని ఋషి గుర్తుపడతారు. ఇద్దరికీ వాదన జరుగుతుంది..
యముడు: మృత్యువుని ఇలా నే చేతిలోకి తీసుకొని నడపడం ఎంతవరకు ఈ సృష్టికి అంగీకారం?
ఋషి ; సృష్టి… న్యాయాన్యాయ విచక్షణ కొంచెం కూడా లేని ఈ సృష్టి గురించా .. ? నువ్వడిగేది.
యముడు; కొన్ని తాత్కాలిక చర్యలని తీసుకొని…
ఋషి; తప్పు చెయ్యని మనిషి శిక్షంచ బడుతూనే ఉన్నాడు.. దానిలోనూ కేవలం నా దగ్గరకి వచ్చిన వాళ్ళని మాత్రమే నేను సరి చేస్తున్నాను. అదీ అర్హులైన వాళ్ళకి ( lopala నుంచి .. bayata నుంచి ) మాత్రమే..
యముడు ; దానికొక సర్వాంతర్యామి ఉన్నాడు ,, అతను చూసుకొంటాడు.
ఋషి; ( నవ్వి ) నేను చేసేది తప్పే ఐతే అదీ ఆయనే చూసుకొంటాడు.. నీ కెందుకు అనవసరమైన ఆందోళన .. యముడు; ఇది ఆందోళన కాదు.. ఎవరేం చేయాలో అదే చెయ్యాలి.
ఋషి; ఇది చాలా మంచి మాట .. కానీ.. ఇక్కడ అవతలి వారు ధర్మo పాటిస్తూ చెయ్యనప్పుడు.. నేను సరి చేసే ప్రయత్నం చేస్తున్న…
యముడు ; అది నీ చావుకి దారి తీస్తే …
ఋషి ; ( నవ్వి) ఆనందంగా అంగీకరిస్తాను.. కానీ ఈ రాత్రికి మాత్రం కాదు.. ఓ అనాధ స్త్రీ ప్రసవం ఉంది.. ఆమె దారిలో వస్తూ ఉంది.. నేను ఒక్కరు కాదు.. తల్లీ-బిడ్డా క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను.. ఆ తర్వాత నీ ఇష్టం..
యముడు; అంటే నీ ప్రాణాన్ని నాకు బిక్షగా వెయ్యాలనుకొంటున్నావా?
ఋషి; కాదు .. మిమ్మల్ని నిరాశ తో వెనక్కి పంపాలనుకోవడం లేదు. అప్పుడే చిత్రగుప్తుడు అక్కడకి వచ్చి .. నాకు విషయం తెలిసింది స్వామీ ..
యముడు ; ఏం తెలిసింది ..
చిత్ర; ఇతను .. మృత్యు దేవత అనుగ్రహం పొందిన వాడు. పొందుతున్న వాడు.. వాదించి ప్రయోజనం లేదు..అతనిని ఆపాలంటే..
యముడు; ఆపాలంటే..
చిత్ర ; ( కళ్ళలో నీళ్లు ) ఏం ఉంది.. మనకొచ్చిందే.. ధర్మాధర్మాలు విచారించకుండా … ప్రాణం తీసుకెళ్లి పోవడమే..
యముడు అంతని వేపు కోపంగా .. అంతల్నె నిస్సహాయంగా చూసాడు.
చివరిలో అతనికీ మృత్యు దేవత అనుగ్రహం ఉందని తెల్సి ఆశ్చర్యానికి గురవుతాడు. …
యముడికి నల్ల తెరల మధ్యలో.. కేవలం మృతు దేవత తల కనిపిస్తుంది..
మృత్యు ; ఎందుకొచ్చావిక్కడికి… నేను నిన్ను ఆజ్ఞాపించలేదుగా…
యముడు; నిన్నూ .. నన్ను ఆజ్ఞాపించేవాడు .. పంపాడు .. ఇక్కడికి…
మృత్యు; మనమెలాగూ .. మంచి చెడులు ఎరగం .. కనీసం అది ఆలోచించే వాళ్ళనైనా .. ఈ భూమి మీద కాసిన్ని రోజులు ఉండనివ్వు..
యముడు; తల్లీ .. నువ్వంటే నాకు ఎంతో గౌరవం.. కానీ ఇది నేను బ్రహ్మ కిచ్చిన మాట … వదిలే ప్రసక్తే లేదు.
ఐతే.. నా తర్వాతే ..
యముడు; తల్లీ మీద యుద్దమా? నా శిరస్సు నువ్వే ఖండించి..నను విడుదల చెయ్యి..
అని ఆమె ముందు మోకరిల్లుతాడు.. ఆమె మాయమై పోతుంది. యముడికి బ్రహ్మ చెప్పి పంపిన మాటలు గుర్తొస్తాయి.
బ్రహ్మ;
ఊచ కోతలు.. తీవ్ర బాధలు( భార్య ముందే .. భర్త గొంతు కోసేయడం …కూతురి మానభంగం.. కన్నతల్లితండ్రుల్ని చంపేయడం) … ప్రకృతి విసిరిన సమాధులు.. ఇవన్నీ అనివార్యమే … దీని వెనక ఓ సృష్టి రహస్యం …. స్పష్టంగా ఉంది..;;
ఈ కలియుగం అంతమయ్యే దశకి వచ్చింది.. ఇప్పుడిక ధర్మ విచారణ నశించిపోవడమే అవసరం.. అదే కాదనలేని సత్యం.
ఒప్పించి యముడిని అక్కడికి పంపించి … ఋషికి మరణాన్ని ప్రసాదించమంటాడు.
కానీ అప్పుడే ఆ గర్భణీ స్త్రీ అక్కడికి చేరుకొంటుంది.. అతనికి నిండు గర్భంతోనే పాద నమస్కారం చేస్తుంది.. ఋషి అక్కడే ఉన్న యముడిని పరిచయం చేసిన.. ఆమె లో చిన్న అలజడి కూడా కనిపించదు .. నమస్కారం పెడుతుంది.
ఋషి ఆమె భావి దగ్గరకి తీసుకెళ్లి .. పుణ్యస్నానం చేయించి.. పొడి వస్త్రం కట్టి తీసుకు రమ్మని పంపుతాడు.. తన ఆశ్రమవాసులని..
ఆమె వచ్చాక .. ఆమె నోట్లో చిన్న ఆకులోనుంచి.. రసాన్ని పోసి .. అతను నేలకి ఒరిగిపోతాడు.. యముడు ఆమెని చూసి.. ఆయన ఆయుస్సుని ,, ద్రవరూపంలో నీకు ఇచ్చాడు తల్లీ .. నాకు శెలవని.. తివాచి మీద అతనిని ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..
ఆమెకి నొప్పులు మొదలవుతాయి.
చిత్రగుప్తుడు యముడితో.. భాదగా …;
ఇక్కడ ఆ ఋషే గెలిచాడు.. అతని భిక్షని మనం గ్రహిస్తున్నామంతే … కరుడు కట్టిన మన వృత్తి ధర్మాలు.. మన ఆలోచనని మూసేసి తెల్సుకోలేకపోతున్నాం అంతే.. ఈ మాటనే అంటూ… గుక్కపెట్టి ఏడుస్తున్నాడు.
యముడు మాట లేకుండా అతనిని చూస్తూ ఉండిపోతాడు.
ప్రయోక్త ;
విశ్వ చక్రం సంధానించి తిరిగే హద్దుల్ని కాదని .. ఊడ్చి పెట్టిన చలన మూర్తిని కౌగలించి.. ఊరబెట్టిన చీకటి సంతర్పణలో ఓడిపోయినా వదలని గోడలని రెక్కలతో చదివి.. అక్కడే పచ్చగా మారిన రంగు ముడులని జోడించి … కథలు మారిన కాస్త తలుపుని తెరిచి పెట్టి.. మొత్తం చూపుని విస్ఫురించి .. జ్ఞాపక తీరుని పోతపోసిన సంకల్ప ఝామునే అద్ది తీసి… అమర్చిన దేహ కూడలిలో కాళ్ళని మార్చుకున్న నడకని మడత పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు.
అయన ఆటే చూస్తాడు.. వెనక్కి పిల్చి .. హెచ్చరించాలనుకొంటాడు. మాట తీసుకొని సిగ్గుపడతాడు.. వర్ణ క్రమంగా ఉండిపోయిన చీకటి సరాసరి ఉంచేసి దుఃఖ కథలని పోసుకున్న ముహూర్త అలికిడిలో ఓడిపోయినా ఉండిన హద్దుని కదుపుతారు.
రెప రెపలాడే దేహ ఖణ్డకం లో ఊరబెట్టిన కాళ్ళని తాగి.. కళ్ళలోంచి ఊసాక .. కథ తెలియని మాయతో బావిని చేరతాను.. నీటిని ముంచు తాను.. అప్పటికే ఆమె శ్వాసని వదిలిందని తెలిసి అతను తన దుప్పటి తీసుకొని వెళ్ళిపోతూ మరి కనిపించడు.
EPISODE – 22
ప్రయోక్త : అవును ..నేనీలానే ఆలోచించాలి.. మసక నవ్వుని తీసుకొని శాపాలు దీవిని కనుక్కొని .. విదర్ప శకునాలతో కదిలే దుఃఖ సంచారాన్ని కలుపుకోవాలి.. పొడుగైన నివాళి పోటెత్తే .. కదలికల్ని వడపోసి .. వాళ్ళకి తెలియని కొత్త దర్శన ముడులని గొంతుకి బిగించుకోవాలి.. ఇది ఇక్కడే దాడి చేసి తెగిపోతుంది.. సరాసరి కనబడని ఆందోళన మోసి కొత్త చోటుని కాదని నెట్టుకు రావాలి.. కింద ఇంకేమీ అనుకోవడానికి లేని ఉమ్మడి తారీకులు మాసిపోతూ వంతెన.. కొన్ని నాగరికథలకి కొంగు కాసి.. ఆ ఎత్తులో ఊగిన శ్వాస శిల్పం.. యుద్ధం ఒక వదలని స్పృహగా మనలని వెంటాడుతుంది. కొత్త తాళ్ళని కట్టిన దేహాన్ని మండిస్తుంది..
యక్ష గాన భూమిలో .. ఒక కౌగిలి మాట తీసుకొన్న నిద్ర మూర్తుల మంట.. చలనం లేని పరంపర ఊడిపోతూ .. చిత్ర ధూపంలో ఇరుక్కొన్న శాపిత ఎత్తుగడలు.. పొగ రేగిన అనిద్ర గాధలు.. అంతా అలుము కొన్నప్పటి దీక్ష..
భాగవతార్ హంసతో.. నేనీ ఘటనని మరోలా మార్చి ఉండేవాడిని … మహా సందర్శనల అడుగున ముట్టడితో చలన కీలల పెద్ద గుహని మింగేసే మృత్యువు ఒప్పుకొన్న నిద్ర రాశుల కిందుగా నేను ఊరుకోలేని విషాద మూర్తులతో ఓదార్పుని మడత పెట్టి .. వాళ్ళు ఇంకేదో పోగుట్టుకొంటారు.
హంస; దాని వలన ఏంటి ప్రయోజనం .. ? సృష్టి మృత్యువుని తప్ప మరిక దేనిని అమలు చెయ్యడం లేదు.. నువ్వింకేదో మాయ మాటలు చెప్పాలని చూసిన .. ఇప్పటికీ నా రెక్కల మధ్యలో .. నా భర్త నెమలి .. రక్తంతో నిండి అలానే ఉంది.
భాగ: ప్రయోజనాల పరాశక్తిని ఎందుకు మరలా గుర్తుకు తేవడం.. మహా అనర్ధం జరిగాక .. అదొక మహా నిర్యాణ ముహూర్త సంబంధం.. కదిలే కెరటాల ఒరవడి .. కొత్తగా మారిన మాత్రికల పంట.. అదొక మాంత్రిక విపరీతం .. సరళ రీతి లేని మహా సందర్శ విపత్తు లోని అడుగుల కదలిక .. పొద్దుచూపు.. కనపడని ఝాము ముద్రల సంకల్ప విషాదం..
నేను దీనినంతటే ఒక దీవి లోకి మార్చి ఉండే వాడిని .. అదొక మహా ప్రమాదకర సముద్రం.. అందులో ఒక దీవి వరకే మనం చేరగలం.. ఆ తర్వాత అంతా మనిషి మాంసం రుచి మరిగిన సముద్ర జీవులు.. నీటి అడుగున మిగేయడానికే సిద్ధంగా ఉంటాయి.
అందుకే.. మన పూర్వజ్ఞులు .. ముందే ఒక వంతెన .. ఆ దీవి నుంచి ఆ మరో దీవికి వేసి ఉంచారు .. ఆధార అనుభవాలు సిగ్గుతో తప్పించుకొంటాయి.. ఇక వివరాలు లేని దేహ వికర్ష ఇప్పటిది కాదు.. అవి మృత్యువుని ప్రమాణ రహితంగా దాటించ గలవు.. ఎవరో ఒప్పుకోరు.. పెద్దగా అరిచి ఆయాసపడతారు.
హంస ; ఆ వంతెన ఎలా కట్టగలిగారు.. చూసి చూసి .. ఇలా ఐతే ఎల్లా అనుకొంటాను.. జ్ఞాన వికాశ ధుని.. జ్ఞాన వికాశ ధుని.. గజ గజ లాడుతూ అక్కడ సంతర్ప ధారని వడ్డించింది..
భాగ ; అది నీ ఊహకి అందదు.. వాళ్ళు ఆ జీవిలో మహత్తర శక్తులు.. మృత్యువుని దాటించే మహానుక్రమ శరీర జడాలు.. అక్కడ అనేక మూలికా శక్తులు ఉన్న .. మధ్యలోని సముద్ర ప్రయాణం అంతే ప్రమాదం..
అందుకే వాళ్ళు .. చిత్రంగా దేవతని కాక యముడిని ప్రార్ధించారు. దేనికో ఏమిటో చెప్పకుండా .. యుగాలు తపస్సు చేసి .. అతని ప్రసన్నతని పొందారు.. వాళ్ళ కోరిక అర్ధమౌతున్న .. అన్నీ యుగాల తపస్సుని ఏమీ ఇవ్వకుండా ఉంచేయడం అసాధ్యం..
వంతెన అతని మాయతో.. చిత్రగుప్తుడి సాయంతో ఏర్పడిపోయినా.. ఆ తర్వాతే యముడికి అర్ధమైంది.. ఇది తనకి వ్యతిరేకమైన ఏర్పాటు అని.. ఆ క్షణం లో ఏ మాయ అతనిని ఆక్రమించిందో మనం ఊహించలేము.. వికాశ భూమి .. అంత్య స్థితి వార్తని అందుకొని .. ఇక్కడే విశ్రాంతి స్థలంలో పడి తిరుగుతూ .. ఇంకా మాట లేని దేహ భూమి చలన రీతిని కదిలిస్తుంది..
ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. బ్రహ్మ కలుసుకొని పరిస్కారం అడిగాడు..
బ్రహ్మ నవ్వి .. మరి మోసగిస్తావా ?
యముడు ; తల అడ్డంగా ఊపాడు. ఇంకేదైనా చూడండి .. ఇప్పటికే ఈ భూమి పై నేను ధర్మ స్థాపన చెయ్యలేదని అపవాదుని మోస్తున్నాను.. కొంచెం పక్కకి జరిగి జ్ఞాన దర్శన ముహూర్త చలనంలో ఉండిపోయిన అగాధ సత్యం ఊరేగే తపనని మోస్తూ .. భరణ గతి ముద్రని లాక్కొని ముహూర్త భయాలు..
బ్రహ్మ .. దివ్య దృష్టితో చూసి .. సరే .. రేపురా అన్నాడు.. అతనా క్షణం లో ఎన్ని సృష్టి దర్శన శిఖరాలని చూశాడో.. ఇంకిపోని విశ్వాస ధూపం లో పడి కొట్టుకుపోయాడో.. మనం ఊహించలేం..
.. ఆ రాత్రికి విశ్రాంతి తీసుకొని మర్నాడు వెళ్ళాడు. యముడు….
బ్రహ్మ అతనిని .. అక్కడున్న కలువల ఏటిలో స్నానం చేసి రమ్మన్నాడు..
స్నానం చేస్తూ చేస్తూనే .. ఆలోచనల చీకటి కమ్ముకొని …యముడు స్పుహ కోల్పోయాడు.. సమయ గోళాల మిoగేసే రాక్షసి గొంతు.. అమాంతం మాయం చేసిన ఉనికిని చుట్టుకొని .. కలలు …
మృత్యు అధీష్టానం వణికే చిత్రమైన కలల మహా వంతెన హఠాత్తుగా కూలినట్లు…. మళ్ళీ లేచేసరికి.. పొద్దుపోయిన .. అలానే వెళ్ళాడు..
బ్రహ్మ . ( మళ్ళీ నవ్వి ) వంద ఏళ్ళు పట్టిందా నీకు .. కేవలం స్నానం చెయ్యడానికి..
అతని కళ్ళలో తెలియని విషాదం .. అన్నీ తన పట్టు తప్పి వెళ్లిపోయాయని చెప్పడానికి మరేదో లోపలనుంచి ఒప్పుకోక .. గాంభీర్యమూ నటించ లేక వదిలేసుకొన్న దేహ సత్తువుల ఒరిపిడి..
ముందు ఒక క్షణం ఏమీ అర్ధం కాలేదు.. ఆ తర్వాత అతనికంతా చెక్కిన మెదడుతో ఆయన ముందు సాష్టాంగ పడ్డాడు.. చెరిపేసుకొన్న తడబాటుని కలుపుతూ .. మాట కదిలించే సాదారణ పోలికలని పెట్టుకొంటూ..
యముడికి అర్ధమైన నవ్వుకొన్నాడు… అవును మహాత్మా … అన్నాడు..
వంతెన శిధిలమైంది.. దాటి రాలేని ఒక ఎద్దడి ఉన్నా .. ప్రమాదం ఎంత పెద్దదో అంచనా వేసేలా వాళ్ళు లేరు.. కంగారుతో మదించిన చీకట్లో తిరుగుతున్నారు. జంతు రుచి సామాన్యమై పోయింది.. మృత్యువుని జయింఛామని తెలిసిపోయింది.. కదలికలేని విశ్వ సందడి కొసరు చూపులో ఆవిరి కమ్ముకొంది..
కానీ దీవి
ఈ వంద ఏళ్ళ లోనూ .. మరణం లేని రాక్షుసులతో నిండి .. వాళ్ళు మనిషి ఆహరం కోసం .. ఆ కూలే వంతెన పై నుంచే .. మరో దీవిని చేరారు.. ఆత్మ విషాదం .. కత్తుల దాడి.. కంగుమంటున్న నిద్ర స్థితుల కల్లోల కంపన .. దేహ దీపం ఒణికిన ముట్టడితో మూలుగుతున్న నిద్ర విరూప పగటిలోని దర్శన.. అక్కడే అంతా వికృత ఎత్తుగడాలని నేర్చుకొంటారు.
వంతెన కూలి పోయింది.. వాళ్ళు అక్కడే ఉండి … వాళ్ళకి ఆ ముందు దీవికి వెళ్లాల్సిన అవసరమూ కనిపించలేదు.. భయమూ ఒద్దికగా నేర్చిన నల్లని అనుగ్రహం తో కదలికనే తప్పించి ఇంకో తెలియని కథలోకి జారిపోతారు.. దానిని మృత్యు భయంకరంగా మార్చాలని వాళ్ళ సిద్ధ సంకల్పం.
దీవిని మొత్తం స్మశానంగా మార్చే పనిలో ఉన్నారు. రోజూ శవం ఆచూకీ లేని హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. కుటుంబాలు కుటుంబాలు.. రాత్రికి రాత్రి మాయమై పోతున్నాయి.. ఇక ఆ కుటుంభం నుంచి పగపట్టి తెల్సుకొని అంతం చెయ్యడానికి ఎవరూ మిగలడం లేదు..
ప్రయోక్త ; విశ్వం కన్ను చెదిర్చిన విపరీతంలో తూగిసలాడి.. చేతులు వదులై మెలికలు పడి .. అంతా వద్దనుకున్నా వంతెన మృత్యు తెరని చెదరగొట్టి .. ఒలికిన నిషేధ ముద్దల మాంస చలనంలో కాగుతూ .. ఇంకిపోని విలాపం హోరు పెడుతూ.. పదార్ధ చిత్రమూ.. మాంసము .. సమూహ గతిలో ఎదురు దాడి.. ఒంటిగా ఉండిపోయిన వాన బుట్టలు.. లోపలంతా అంగాలు.. దాడి ఒక వేపుదే అర్ధమయ్యేలోపే .. మిగేసే ఊసిన ఎముకలు..
పగిలిన నిద్ర గతుల సర్వమూ తోడుకొని .. నిషాద మూర్తుల కళా విలాపం.. ఇది ఎటు పోయింది.. ? ఇక్కడే ఎందుకు ఆగిపోతుంది? అపరిమిత దేహ రాశులు విదిల్చిన శేష భూమి ఖాళీగా వేరై ఉనినికి పీల్చి.. ఒప్పుకోలేని దేహ దగ దగ … ఊరటాలేని జ్ఞాన కాంక్ష.. ఒద్దికగా నీరు పట్టిన కంటిలో నూరిన భాస్వరం .. అప్పటిదే మృత్యువుని ఓడించే కల .. అది అందరినీ కప్పుకొని .. అక్కడే ఉండిపోయిన స్మశాన మూర్తులని పోతపోస్తుంది.
… EPISODE – 23
ప్రయోక్త ;
కథ అదే .. దుఃఖమే అనేక రకాలు.. విశ్వ జాగ్రత్త శక్తుల ఓటమిలోంచి.. చావు కేక .. తపస్సుగా ఉండిపోయిన నిద్ర స్ఫురణ మైకం కమ్మి .. దేహ తీరం లో మృత్యువు పుట్టిన రహస్య దీపపు నవ్వు.. మోస జీరా దిగబడ్డ గొంతు .. తనని పిలవాలని.. సైగలని అందుకోవాలని.. మురిపెపు చూపుతో తాళదువ్వాలని.. బొట్టు దిద్దాలని.. సంరక్ష శ్వాస ధూపమ ఉడక బెట్టిన సమయ శిక్ఖారం పై ఏదో దగ్గర పడుతున్న శోక ధారని ఎంతనుకొన్న పట్టుకోలేం.. అదే అలానే ఉంటుంది.. ఆలోచనకి చాలా దూరంగా .. భయానికి చాలా దగ్గరగా .. విశ్వ మూర్ఛల స్పృహ గొలుసుని తెంపి .. ఒప్పలేని సమాధి ముహూర్తంలో పడి లోత్తుకొనే ముట్టడి వెలుగులు ఇంకిపోని పాముల కొండా ఆక్రమించుకొని.. కొంచెం విశ్వ సముదాయం లో పడి కొట్టుకొంటూ .. దీపాజారాలు తొల్చుకొని పోయిన విశ్వం ఊగిసలాడే సందడి సద్దుమణిగాకా .. చేరుకొన్న అనుమాన వృత్తాలు కాటేసినపుడు…….
గుర్రాల భావి .. కత్తుల ఐస్ బాక్స్ టేబుల్ పై దానిలో ఓ కన్ను మాట్లాడుతూ .. వాడు అరిచి స్పృహ తప్పి పడతాడు. ఓ రాక్షస విగ్రహం తన తల తీసేయమని అరుస్తూ ఉంటుందిది.. హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటుంది.. అతను తీయబోతే ఆమె ఆపుతుంది.. తీసామా ఆ రక్తం తో ఈ భూమంతా నిండి పోతుంది..
ఎదురుగా ఓ చీకటి ..ఆమె అతని చేతి పట్టుకొని ఆపుతుంది.. ఎక్కడికైనా వెళ్ళుగాని అటు మాత్రం కాదంటుంది.. అక్కడే ఓ చెట్టు కింద నిద్ర పోదామా అంటాడు.. ఆమె ఒప్పుకోదు.. ఈ రాత్రి కంటి మీద కునుకు వేసామా .. కల మనలని లాక్కెళ్లి పోతుంది .. అంటుంది..
అతను ఆకలి అంటాడు.. ఆమె కొంగు విప్పుతుంది.. అదులో ఉన్న పులిహార .. పాడైన వాసన వస్తూ ఉంటుంది.. ఈ లోపు అతను ఆ చెట్టుకున్న కయ కోయబోతాడు.. ఆమె అతని చెంప పేలగొడుతుంది.. అతను నిరాశ పడతాడు..
చెప్పానా? .. ఇక్కడ దేనికి కక్కుర్తి పడకూడదని.. అలా పడ్డావా .. ఇక అంతే.. ఓ పరమ సత్యం నిన్ను ముంచేస్తుంది..
అతను; సత్యమంటే రక్ష కదా ?
ఆమె ; నవ్వి.. ఆది ఒకప్పుడు.. ఇప్పుడు సత్యమే వధ … రక్తంలో ఓలలాడటం .. భయాన్ని నిలువునా కప్పుకొని మృతువులో మునిగి వణుకుతూ .. ఊపిరి తీసుకొని .. కత్తి ధారలని మోగిస్తూ .. దండ కట్టిన విశ్వాసాల తీరుని మార్చి అంతా తగలబెడుతున్నారు.
అతను; మా అమ్మ నాకు అలా చెప్పలేదు.. \
ఆమె; నేను ఇప్పటి అమ్మని.. ఎవరిని నమ్మొద్దు.. చివరకి నన్ను కూడా.. నీ ఉనికిని రక్తంతో సహా తాగేసి జలగలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి..
ఈ లోపు ఆమె అక్కడే తుడవ బోతుంటే ( కూర్చునే చోటుకై.. ) వర్షం.. ఆమె కొంచెం తడుస్తుంది.. కళ్ళలోంచి ఏదో కాంతి జారినట్లు అయ్యే .. తూలుతుంది..
ఆమె లో అన్నీ మారి పోతాయి.. నవ్వు వస్తూ ఉంటుంది… అప్పుడే విసిగి ఉన్న అతనికి నుదిటి పై ముద్దు పెడుతుంది.. ఆ చెట్టు నుంచో వేడికి ఓ పండు కొస్తుంది.. అతనికి తినమని ఇచ్చి.. తొందరగా తిని.. కాసేపు మనమా చీకట్లోకి నడిచి వెళదాం అంటుంది…
అతనికి అంతా చిత్రంగా ఉంటుంది..
ఆమె అతనిని చూసి.. ఏదో తమాషాకి అన్నాను.. బిడ్డ ఆకలితో ఉన్నవుగా .. కాస్త ఎంగిలిపడు.. నేను ఉన్నాగా .. నీకేం కాదు.. నేను అంతా చూసుకొంటా..
అతను అనుమానం లోపలి నుంచి తొలుస్తున్న … ఆకలి .. అతనిని ఆలోచించనివ్వడం లేదు.
తడవడం వ లన అన్నది అర్ధం కాదు.. అక్కడేదో మాయ ప్రవహిస్తున్న .. దాని అనుగ్రహ మరకలు తుడవడానికి కావాల్సిన ఆధారాలు తెలియడం లేదు.
ఆమె నాకు నిద్రొస్తుంది .. నువ్వూ వచ్చి .. ఇలా నా ఒడిలో పడుకో అంటుంది..
అతను ఆమె ఒడి చేరినా .. ఇంకా లోపలేదో ఆందోళన
ఏదో అశుభం జరిగే సంకేతమా? ఏంటి జరుగుతుంది..
భార్య ఎలానూ లేదు.. పిల్లాడు మెరిట్ .. లాస్ట్ ఎక్సమ్ రాసేసాడు.. ఇంకేం అశుభం.. వాడి పెళ్లా ? ఈ లోపే .. నా చావుని గురించా.. అలా అనుకొంటే బావమరిది చూసుకొంటాడు.. వాడికి మేమిద్దరమూ అంటే చాలా చాలా ఇష్టం.. ఇంకేం భయం .. ఇంకేం కాటేసేది ఉంది..
సర్ప దోషం అంటాడు.. పండితుడు.. అతను మించి చెప్పలేదా ? వాడికేం తెలియదా.. ? అయినా మొక్కులు వృధా పోవుగా.. ఈ క్యాన్సర్తో ఎలానైనా ఇంకో రెండేళ్లు లాక్కొస్తే చాలు… అంతేగా ?
ఈ లోపు అటుగా ఆ వాన నీటిలో ఎగురుకొంటూ హంస వస్తుంది..
అప్పటికే ఆమె నిద్ర పోతుంది..
అతనిని చూసి.. ఏం నాయనా .. మృత్యు ఒడిలో ఎందుకు నిద్ర పోవాలని… నీకు చావు కావాలా ? నువ్వే భరించలేని కలలు కావాలా? అలసటని జల్లించే తీర్పు కావాలా ?
అతను తల అడ్డంగా ఊపుతాడు..
ఆమె మృత్యు దేవత.. ఈ చెట్టు ఫలాలు.. అమృతమయమై .. మృత్యువుని ప్రసాదిస్తాయి..
అతను; లేదు.. చనిపోయిన నా భార్య చివరి కోరిక తీర్చడానికైనా నేను కొద్దీ రోజులు బతికి ఉండాలి.. నా కొడుకుని ప్రొయోజకుడిని చెయ్యాలి.
హంస; ఎక్కడా నీ కొడుకు…
అతను; జమ్మూ-కాశ్మీర్ వెళ్ళాడు.. ఫ్రెండ్స్తో లాస్ట్ ఎక్సమ్ రాసి…
హంస; ( దివ్య దృష్టి తో చూసి … ఎర్రగా మారిపోతుంది ) దుఃఖపడుతూ.. ఒక రెక్కని తనపైన్నుంచి తీసుకొని.. అతని తల దగ్గర పెట్టుకొని నిద్ర పొమ్మoటుంది..
అతను; ఏం జరిగింది… ఇక్కడ మృత్యు దేవత తిరిగే చోటని.. ఇప్పుడు మళ్ళీ నువ్వే.. నువ్వెందుకలా మారావ్?
హంస; అది నమ్మినపుడు .. ఇది ఎందుకు నమ్మవు.. ఆ టైం నుండి ముందుకు జరిగాం .. ఇప్పుడేం కాదు.. నువ్వు నిద్రపో.. ఎందుకన్నానో నీకే తెలుస్తుంది..
అతను వెళ్లి ఆమె ఒడిలో నిద్ర పోయే ముందు.. వర్షం లో తడిచాడు.. వణికి పోయాడు. చూపుని నిలబెట్టలేక పోయాడు.. వెన్ను నొప్పి ఎక్కువైంది .. కదలని కంటిలోంచి ధూళి జారి విశ్వం మొత్తం తిరిగే అనిద్ర మెళుకువని భద్రపరచి ఊరుకొంది.
ఆమె చేతిలో ఉన్న పండు తిని నిద్ర పోయాడు..
అతను కల చూడడం మొదలు పెట్టాడు.. కాసేపు నవ్వాడు .. మళ్ళీ నవ్వాడు.. అతని ముఖం కొంచెం నల్ల బారింది.. అనుమానం కనిపిస్తూ ఉంది… అటు నుంచి ఎర్రగా మారింది.. సిగ్గు పడింది..
పెద్ద వాడై పోయాడు.. అమ్మాయి కూడా.. వివారాలు అడిగి పెళ్లి చేసెయ్యాలి…
మళ్ళీ నవ్వాడు.. ఒక సారిగా ఆందోళనగా మారింది
హంస అతనిని తన రెక్కలతో కప్పేసింది..
అతను ముందు అరిచాడు.. ఆ తర్వాత ఆ గొంతు ఇంకా పెంచాడు.. అయ్యో ఈ భూమి మీద ఇంకా దేని కోసం మిగిలి ఉన్నాను అనుకొంటూ .. బట్టలు చింపుకొంటున్నాడు.. నడుస్తూ నడుస్తూ.. ఆ చెట్టు కొమ్మని తీసి .. గొంతులో పొడుచుకొని.. వెళ్లకూడని చీకట్లోకి పరుగు పెట్టి మాయమై పోయాడు..
హంస అలా చూస్తూనే ఉండిపోయింది… ఆ హంస అప్పుడు ఎర్రని వర్ణం తో వెక్కిళ్లు పడుతుంది.. శిధిలమైన ఓ బెంగని రాలుస్తుంది .. కాటుక పొడితో చూపు ముడి చుట్టుకొంది.
ఆ చీకటి దగ్గర అతను చాలా మందిని కలుస్తూ ఉన్నాడు.. మరింత పెద్దగా అరుస్తూ ఉన్నాడు. అతని గొంతులో కొమ్మ అలానే ఉంది… రక్తం వస్తూనే ఉంది… కాటుక పొడితో చూపు ముడి చుట్టుకొంది. తియ్యాలని అనుకోవడం లేదు.. పెద్ద కథని ఊరడించుకోలేదు..
ఆమె అతనిని లోతుగా చూసి.. బిడ్డలని అలా వదిలేయకూడదు .. అలానే వదిలేస్తే.. బుల్లెట్లు తినిపించేస్తారు.. లేదా మెత్తగా గొంతు కోసేస్తారు.. మాట మాత్రంగా నమ్మితే.. కొండ పై నుంచి తోసేస్తారు .. అసలు పిల్లలని వదల కూడదు.. ఎప్పటికప్పుడు మన కడుపులోనే పెట్టుకొని కాపాడుకోవాలి….
అతను ; విసుగ్గా .. కోపంగా .. సంకనేసుకొని తిరుగుతామా ?
ఆమె : ఎస్ exactly అదే చెయ్యాలి.. నేను చూడు..
ఓ కీ చైన్ కి వేలాడుతున్న ఓ యువకుడి బొమ్మ చూపిస్తుంది.. ఇది బొమ్మ కాదు.. నా కొడుకు .. కావాలనుకున్నప్పుడు మార్చు కొంటాను.. హ్యాండ్బాగ్ లో కీ చైన్ బొమ్మలా మార్చుకొని బిడ్డ ఆమె తో ఎప్పుడూ ఉంటాడు . నేను ఇంట్లో .. నిద్రలోకి వెళ్లే ముందు … గోడలో దాచి పెడతాను .. అంటూ వికృతంగా నవ్వి .. స్పృహ తప్పి పడిపోతుంది..
అతని ఫోన్ మోగుతుంది.. ఎత్తితే మాట రాదు.. వీడియో ప్లే అవుతుంది.. అతని కొడుకుని .. తీవ్రవాదులు కాల్చడమే కనిపిస్తూ ఉంటుంది… అతను .. ఆ చీకట్లో గుక్కపట్టి ఏడ్చి…
ఈలోపు నిద్రపోతున్న స్త్రీ వస్తుంది.. ఆమె కాళ్లపై పడతాడు.. నా కొడుకుని ఎలానైనా నాకివ్వు..
ఆమె ; (దిగులు నిండిన చూపుతో చూసి.. ) నేనూ అదే చేసాను.. నువ్వూ అదే చెయ్యాలి .. అంటుంది.. ‘
అతను ; చెప్పు ఏం చెయ్యాలి..
ఆమె ; ఇంకొక బాటసారిని పట్టుకో.. అతనిని నమ్మించు.. ఇదే బాధని అతనికి ఇచ్చాక .. నీ లోపల నుంచి నువ్వు విముక్తమౌతావ్?
అతను; అంటే హంస .. నువ్వూ ఒక్కటేనా ?
ఆమె నవ్వి .. నేనే హంసని.. అని మారి చూపిస్తుంది.. .నేను నీకు సహాయం చేస్తాను..
ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు.. పద .. అంటుంది..
కానీ అతను ముందుకి అడుగు వేయలేక పోతుంటాడు..
ఆమె అక్కుడునా రెండు కొమ్మలు తీసి .. అతనికి ఒక్కటిచ్చి .. తానొకటి చేతిలో పెట్టుకొంటుంది..
ఇద్దరూ నడుస్తూ ఉంటారు..ఆమె నడక స్లో చేసి అతని వెనకకి వచ్చి.. ఆమె ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. పెద్దగా అరిచి.. అతనిని గొంతులో పొడుస్తుంది.. అతను కుప్ప కూలి పోతాడు..
ఈలోపు ఎవరో వస్తున్నా మాటలు విని .. ఆమె హంసగా మారి పోతుంది.. నీటిలోకి వెళ్లి పోతుంది..
వాళ్ళు భాదతో విలవిలాడుతున్న .. అతనిని చూసి .. వీడియో తీసుకొని రక రకాల angles నుంచి.. ఒకడు చెట్టుపైకి ఎక్కి.. ఒకడు దగ్గరగా .. ఒకడు దూరంగా.. ఒకనాడు.. అతను అరూపాలని రికార్డు చేస్తూ.. ఒకడు నేలపై పడుతున్న రక్తాన్ని రికార్డు చేస్తూ నవ్వుతూ.. ఈ వీడియో ఈ రోజు వైరల్ ఐ పోతుందిరా ? అంటాడు.
నవ్వుకొంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
Proyoktha : ఓకే నిర్దయ వెంబడిస్తున్న శరీర సహకార సందడి ఊరేగే నిద్ర త్తోగుతో కలబడి .. ముఖాలన్ని తొందరగా మార్చుకొనే సంకల్ప గుణం కప్పుకొంటూ … మృత్యు రాధని చదవలేని ఖర్మతో తలకిందులవుతూ.. ఏది ఎలా ఉందో .. అలానే ఆగిపోక .. వినికిడి ముద్రల మధ్యనే కదిలే .. దీప దేహాల సర్దుబాటుని ఇరికిస్తూ .. ఒక పగలబడి ఏడ్చినా నా గొంతు నిండుగా వాడి పిలుపుని నాకేస్తూ ఎవరది నాపై ఏడ్చి .. నన్నిలా ముక్కలు చేసింది.. కదలలేని నా దుఃఖ వీలునామామ్ని పంచుతూ ఈ దుఃఖాన్ని మరింత పెంచింది. పైకి నా గొంతుతో వేలాడి వినిపిస్తా .. ఈ కథని .. ఇందులోని రక్తాన్ని వర్షం గా కురిపించి నింపేస్తూ .. ఓ వినికిడి తడబాటు లేని శాఖల తీర్ధ మాటున లేవదీయసుకొన్న ముట్టడి రంగుల కంపం.. అడుగడుగునా ఓడిపోయినా నా సహకార దీప రంగుల అనుకృతి ఒత్తిడి..
………………………………………
Episode 24
Prayoktha ; నిద్రాణ సమవర్తిత భూమి.. పెద్దయిన అణుకువల కలకలం.. ఏదో తెలియాలి.. మరోలా ఈ సత్యమంతా ఎక్కడో నిర్ణయించ బడుతుందేమో.. అదే దేవుడా? అయితే .. ఆ దేవుడి ప్రశ్నించాలిగా . ఈ విశ్వం ఓ బోర్లించిన సత్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.. దీనిని ఎవరో సరిచేసి శస్త్ర చికిత్స్చ చేయాలి.. లేదా .. ఇదొక మహా వినాశనం గా మారడానికి ఎక్కువ టైం తీసుకోదు.. ఏదో మనలని మన ఇష్టం లేకుండా ఆక్రమిస్తుంది.. ఆహాఎంతో తెల్సుకోవాలి..
ఏం ప్రయోజనం ఎన్ని చేసిన .. చూసిన .. తర్కించినా .. మిగిలేది ఇది మాత్రమే.. జరిగే దానిని ఆపలేం.. అప్పడెందుకిక .. ఇలా తెలియని దూరాల్లో ఇరుక్కోవడం.. ఇరుక్కొని వాళ్ళు మాత్రం సాధించింది ఏం ఉంది.. ..
దేవుడి ఉనికిని ప్రశ్నించే ఓ ప్రయాణం … చర్చి ఫాదర్, , ఏక పాత్రాభినయకుడు ,, డాక్టర్ … ప్రయోక్త .. భాగవతార్
యముడు చాలా కలత నిండినవాడిగా కనిపిస్తున్నాడు.
ప్రయోక్తని .. భాగవతార్ ని చూసి ఏది మీ ఆఖరి నిర్ణయమా ? అని. అడిగాడు. వాళ్ళు అవున్నట్లు తల ఊపారు …
ఇది .. మీ ప్రాణాలని తీసేదిగా ఉంటే? అన్నాడు..
చర్చి ఫాదర్ తో కలిపి ముగ్గురూ నవ్వారు.. దేని గుంరించి చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావ్? మృత్యువా ? అది నిత్యమూ తాండవించే … ఈ భూమి పై ఉంది… నువ్వా ఈ మాట అంటుంది..
చిత్రగుప్తుడు ; పోనీ .. ఆయనని వదిలేయండి.. ఆయన తరుపున నేను చెబుతున్న .. ఇదంతా వద్దు.. ఇప్పటికి ఎలా ఉందొ .. అలానే ఉండనియ్యి..
భాగ ; నాకు మీకు కూడా ఏమీ తెలియదని నాకు తెల్సు.. తెలిస్తే .. మీకు ధర్మం గురించిన బలమైన అవగాహన ఉండేది.. మీరు కేవలం ఓ కూలివాళ్ళలా పని చేస్తున్నారంతే..
యమా ; ( మరోసారి ప్రయత్నిద్దామని) మేము మీ కర్మ ఫలాలని అనుసరించి..
ఏక ; (పెద్దగా నవ్వి ) ఏమ్మాట్లాడుతున్నావా.. సరిహద్దు యుద్దాలు .. సామాన్యులపై జరిగే బాంబు పేలుళ్లు.. మందిరాల్లో ఊచకోత.. చిన్న పిల్లలపై అమానుషాలు.. విహార స్థలాల్లో గన్ కాల్పులు.. ఒకేసారి అంతమందికి .. ఒకే రకమైన కర్మఫలం.. 3 ఏళ్ళ పిల్లకి కూడా అప్పుడే కర్మ పాలం అనుభవించేస్తుందా ? ఎలా నమ్మమంటారు దీనిని?
చిత్ర ; ధర్మరాజా .. దీనికి నా దగ్గర గాని.. మీ దగ్గర గాని .. సమాధానం ఉందనుకోను.. చరిత్ర విషాదాలని రాసే న చేతులు ఇప్పటికీ వణుకుతూనే ఉంటాయి.. ఈ విశ్వం .. వాళ్లకి ఓ సందర్శ మహాశాలగా .. ఓ సంకల్ప మాత్ర వరంగా లేకపోవడం .. ప్రశ్నించాల్సిదేగా …
యమ ; నా ఉద్దేశ్యం ఆపడం కాదు.. మళ్ళీ… వాళ్ళకి పడుతున్నవి కాకుండా మరిన్ని కష్టాలు ఎందుకని..? చిత్రగుప్తా … ( బాధగా ) ఇక ఇప్పటి నుంచి నన్ను … ధర్మరాజా ? అని మాత్రం పిలవొద్దు.. నేను కేవలం ఓ ఆజ్ఞకారినంతే..
ఒక్కసారిగా .. పై నుంచి ఏ వర్షము లేకుండానే .. యముడి తో సహా అందరి బట్టలు తడిచిపోతాయి.. అందరూ స్పుహ తప్పి పడిపోయి మళ్ళీ లేస్తారు. ఒకేరీనొకరు చూసుకొని .. ఎం జరిగిందని అనుకొంటారు.. వాళ్ళ ముందు యముడు ధగ దగా మెరుస్తూ ఉంటాడు.
Bhaga; విశ్వం నుంచి కురిసే అనుగ్రహ నిందలు.. వెల్లికిలై దేహ వర్థిత మహాను సంపదల దీపాన్ని పట్టుకొని .. కొంచెం సిగ్గు కురిసిన పశ్చత్తాపం ఏదో లోపాలు తొలుస్తూనే … ఏది జరిగింది.. అదే ఉంది .. ఏది జరగలేదో అదీ ఉంది. సంకల్ప మాత్రంగా నడిచే ఈ భూమి.. అసంకల్ప మృతు దాడిని కురిపిస్తూనే ఉంటుంది..
ఏం కావాలి?
విశ్వపు మృత్యు సంగీతం.. శృతించని పాటని తీసుకొని అరుస్తుంది.. తెలుసుకోవడానికి ఏం లేదు.. ఎందుకంటే ఆ ఉనికిలోనే ఏదీ మిగిలిలేదు.. యుద్ధం ఓ అనివార్య దృశ్యం అంతే.. పోవాల్సిందే.. ఆ ధూళి ఎత్తి పోయాల్సింది.. కళ్ళు కనిపించవు.. ధర్మం వినిపించదు.. శ్వాస ఎర్రగా మారకుండా ఉండదు.. చీకటి గాలి పీల్చి.. ఆత్మలని .. ఆ నల్లని బిళం లోకి విసరకుండా ఎవరూ ఆపలేరు.. ఇది ఏ ఒక్కరి నిముత్తం కాదు.. అలా ఎప్పటికీ ఉండదు..
చిత్రగుప్తుడు చేతిలో ఏదో సాంబ్రాణి పొగ వేసేలాంటిది ఉంటుంది.. దానితో అందరి ముఖాలపై పొగ వేస్తాడు.. అందరి ముఖాలలోనూ .. ప్రసన్నత .. మత్తు.. ఓ రకమైన తూగు.. వివశత …
యముడు వాళ్ళని చూసి వికృతంగా నవ్వుతాడు..
మీ మానుష జన్మ కి మృత్యువుని మించిన అంత్య పలం లేదు.
Bhaga; భాగవతార్ అంతే వికృతగా నవ్వి.. నువ్వూ ఇంతకు మించి ఎం చెయ్య లేవు.. దీనికన్నా .. మా శిక్షా స్మృతీ వేల రేట్లు నయం.. సంవత్సారాలు టైం తీసుకొంటారు.. చర్చించి ఒక్క ఉరి తీయడానికి.. వాళ్ళు దుర్మార్గులని తెలిసిన..
మీరు కేవలం క్షణాలు .. అదే ఒకే సారి.. ఏదొక రూపంలో తుడిచిపెట్టేసారు..
యముడు .. చిత్రగుప్తుడు వంక కోపంగా చూస్తాడు.. అతను మరింత పొగ వాళ్ళ ప్పైకి వేస్తాడు.. వాళ్లలో మాట ఆగి పోతుంది..
యముడు ఈ సారి మెత్తగా నవ్వి …
విశ్వ రహస్య ముద్ర.. సంకల్ప విషాదం .. నేనై ఉన్న నేనే .. అధీకృత యుద్ధ విరామం.. మరో ఉనికి లేదు.. నేనే ఆ ఉనికి … స్పష్టతలపై దండయాత్ర దేవుడు.. నీ సృజనే నా ఈ రూపం.. లయం నాలో ఎప్పుడూ ఉంది .. నిన్ను కాపాడుకొనేవాణ్ణి నీలో ఉన్న ,, నిన్ను మించి జరిగేదే మృత్యువు ..
వాళ్ళు ఆ మత్తులో తూగుతూనే .. ఎంతో శ్రద్దగా వింటున్నారు..
యముడు : అప్పుడే పుట్టిన ఆనంద తమకం .. నువ్వు పుట్టుక ముందూ ఉంది.. నీలోనూ ఉంది.. నీ తర్వాతా ఉంటుంది.. ఇదొక మహా సంకల్పం.. మంచీ చెడుల విచారం కన్నా అతీతమైంది.. అది అంత శులభంగా అందేది కాదు.. అందుకోవాలని చూడకూడదు.. అది అంతే.. చేతనైంది చేయండి.. చెయ్యక పోయినా .. చేసిన .. మీకు అతీత మైంది ఒకటి చూస్తూ ఉంది.. ఇది భయపెట్టడం కాదు.. కేవలం స్పష్టం చెయ్యడం.
అశనిపాత ధ్వని.. ఓ దాడి.. ఓ ఉప్పెనల దండ.. మొండితనపు గుర్తు.. నాశ తీర్ధంలో జరిగే ఉత్త్సవం.. నేనై ఉన్నదీ నేనే .. కల్పనా అంతలా దేహ కరువు..
( అతను స్క్రీన్ వెనక ఒక మహారూపం పొందుతూ ఉన్నాడు.). .
కర్మ ఫలం .. అదేదో కేవలం నీకు బదులుగా .. నేరుగా లభించేదికాదు.. అది మీకు ఆర్డమైన కేవల ఆలోచన కాదు. ఆ సత్యం నీలోపల సాధనతో లభిస్తుంది.. అంతా నీ లోపలే ఉంది .. బయట ఎక్కడికి పోయినా ఏదీ లేదు.. నేనూ.. దానిని సాధన చేస్తూనే ఉన్నాను..ఇది యుగ కాలాల తపస్సు.. మీరూ చెయ్యండి.. మీరే అన్నారుగా .. పునరపి జననమని.. ఈ తపస్సుని చేస్తూ వెళ్ళండి..
చిత్రగుప్తుడు కంపిస్తున్న గొంతుతో ….
మనిషే.. ఒక మహా సరోవరం కావాలి.. మస్తిష్కంతో సహా .. అన్నీ ధూళులు వదిలించుకునే మహా సరోవరం.. జైళ్లు కాదు.. ఊరు ఊరికే … నగరాల్లో అన్నీ మూలలకి .. ఇలాంటి సరోవరాలు నిండి పోవాలి.. అవి .. ఆత్మలతో పూర్ణ ప్రక్షాళన చెయ్యాలి. యుద్దాలన్నీ ఆ వరద దాడికి కొట్టుకు పోవాలి.. నేరస్తుళ్లంతా దాంట్లోంచి అన్నీ మరిచి బయటకు రావాలి.
ఈ విశ్వం ఓ రాజీ లేని ఓ మహా సంకల్ప విషాదం లోని కల .. ఎప్పటికప్పుడు ఒక దీప నిర్యాణంతో నిండి.. ఆక్రమించుకున్న శ్వాసల చిక్కని భయాన్ని వదలనివ్వక.. మాయ చేస్తుంది.. దానికి అతీతమై జరిగి తెలుసుకొనే శక్తీ నీకే ఉంది… ఒక శాంతి నివాళి ఎండతో భూమంతా మెరిసి.. కొత్త పుట్టుకలతో ప్రతీ శ్వాస నిండిపోవాలి.
విశ్వం లో ఘూమీరేతంతా మాయమై.. ఒక విస్ఫురిత గానా ప్రవాహం నిండిపోవాలి.. నిద్ర … స్వర్గ వాస తీర్ధ గమనాల కథలుగా పండాలి.. అదే మా ధర్మరాజు సంకల్పం..
యముడు చిత్రగుప్తుడు వైపు ప్రసన్నంగా చూసాడు..
ప్రయోక్త .. భాగవతార్ ;
మన సంకల్పాలని మిగలనివ్వరు.. మాయని దానిపై దులిపి .. సత్యానికి దూరం చేస్తారు.. నీరు పెట్టుకొని.. మనలని ఓ పాపపు సంచీలుగా చూపిస్తారు. ఎంత ప్రయాసపడ్డా .. ఈ సంకల్ప విషాదం ఆగేది కాదు.. యముడు కేవలం ఓ దేహాలని ఊదే కార్మికుడంటే.. ఎక్కడా ఏదీ .. దొరకదు.. దేనికదే .. అన్ని వాటి వాటి వృత్తాల్లో తిరుగుతున్నానంతే .. వీటికో స్పష్టత .. చూపూ .. నిలకడ .. కదిలిక .. ధర్మ దీక్ష ఏదీ లేదు.. ఉండడానికి అవకాశమూ లేదు .. అది పోతూ ఉంది .. మనము చూస్తూ ఉన్నాం .. ఇంతకంటే ఏమీ చెయ్యలేం.. ఒకవేళ మనం చెయ్యాలనే దశలో ముందుకు వెళ్ళామా .. సృష్టి .. మృత్యు రూపం లో మనలని కబళించి.. ఆ సత్యం తన దగ్గరే ఉంచేసుకొంటుంది..
నాకది కనిపిస్తున్న బయటకి చెప్పకూడదు.. అందరూ మా వెంట రావొద్దు.. కానీ మేము వెళ్లడం ఆపం .. మేమూ ఎప్పటికీ ఆపాలని అనుకోవడం లేదు.. చూపుల అదీ కృత గొలుసులు బంధన మెరుస్తుంది.. దానిని చూడడానికి మన కన్ను సరిపోదు.. మం ఊపిరి తట్టుకోలేదు.. మన శరీరం ఉడికిపోతుంది.. మనలని నిస్సహాయులని చేసి.. ఈ సృష్టి మనపై నవ్వుకొంటుంది..
EPISODE-25
Devudu ichhina anubhavam
వాళ్ళు ముగ్గురూ అప్పటికే అలిసిపోయి ఉన్నారు .. తెచ్చుకొన్న ఆహారం ఐపోయింది.. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకొంటూ..
ఏక ; ఈ కొండల మధ్య మనకి ఆహరం దొరికేది కష్టం.. ఒక్క మనిషి ఎదురు పడలేదు.. ఇంకెవరికైనా ఇక్కడి వరకు రావడం అసాధ్యమే …
భాగ; మనమింకా శక్తి కూడగట్టుకోవాలి..భయాన్ని పూర్తిగా విడిచి పెట్టాలి.. ధ్యానం లో మునగాలి.. అదే మన ఆకలిదప్పులని తీరుస్తుంది..
ఈలోపు పెద్ద వర్షం.. అక్కడున్న ఆకులతో వానని పట్టి తాగుతారు.. ధ్యానంలో కూర్చొంటారు.
ఎదురుగ ఓ ముసలాయన కనిపిస్తాడు.
ముగ్గురూ ; ఎవరు మీరు.. ఇంతటి కఠిన ప్రదేశంలోకి రావడం ఎలా సాధ్యం..
ముసలి; నవ్వి.. నేను ఖాడు వచ్చింది.. మీరే నా చోటికి వచ్చారు.. తరాల నుంచి మేము ఉండేది ఇక్కడే..
ముగ్గురూ ; అలా .. ఎవరి తోడూ లేకుండా .. ఇలా ఒంటిగా …
ముసలి; తల్లి గర్భం … సమాధి అనంత నిద్రలో .. మనం ఒంటరి వాళ్ళమేనని మరిచారా..? అది సరే .. మీరిక్కడికి వెళ్ళుతున్నారు …
ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.. మాట్లాడారు.
ముసలి; సరే.. అంత రహస్యమైతే .. చెప్పోద్దులే..
ముగ్గురూ; రహస్యమని కాదు.. మమ్మల్ని అందరూ ఎగతాళి చేస్తున్నారు?
ముసలి ; దేనికి ? దేవుని కలుసుకోవాలని వెళ్లడంలో హాస్య మేముంది?
ముగ్గురూ ; ఎవరూ .. ,మా మాటలు విశ్వశించడం లేదు..
ముసలి; నేను నమ్ముతాను.. అది సాద్యమే .. మా పూర్వీకులు దైవంతో మాట్లాడానికి ఓ ఏర్పాటు చేసారు .. మీకు నమ్మకముంటే నాతో రండి.. మీకా కోరిక తప్పక తీరుతుందని నేను నమ్ముతాను.
ముసలాయన వాళ్ళని తీసుకొని .. తన ఇంటికి తీసుకు వెళ్లి.. ఆతిధ్య మిచ్చి … సపర్యలు చేసి.. కాసేపు నిద్ర పొమ్మని.. తానే .. వాళ్లకి విసురుతూ .. కాళ్ళని ఒత్తి.. అలసట తీరి వాళ్ళు లేచాక ఆ చోటికి తీసుకు వెళ్ళాడు.. అక్కడ మూడు గదులులా నల్ల తెరలు కట్టి ఉన్నాయి.. ముగ్గురిని మూడు గదుల్లోకి వెళ్ళమన్నాడు.
దేవుడిని వెదికేప్పుడు …. జీవ చక్రాన్ని పరిచయం చేయడం..
భాగవతార్ .. డాక్టర్ … ఏకపాత్రాభినయుడు..
ముగ్గురూ మూడు నల్ల తెరలు కట్టిన గదుల్లోకి వెళాతారు.. అరుస్తారు.. ఏడుస్తారు.. మాటా లేకుండా ఉంటారు.. పాడతారు.. నిద్ర పోతారు… ఎగిరి గెంతులేస్తారు..
ఒక్కొక్కరు .. తమ అనుభవం ప్రయోక్తకి చెబుతారు.
భాగవతార్ ; అతని తల్లి తండ్రుల పెళ్లి… అతని గర్భ ప్రవేశం.. జ్ఞానం.. స్త్రీ పరిచయం..నిశీధిలో తప్పిపోవడం..
సమాధిని మించిన నిశీధి నిశబ్దంలో ముదుచుకొని ఉన్న నా ఉనికి చుట్టూ .. ఏదో రక్షా వలయంలా ద్రవ ప్రవాహం.. జీర్ణ చీకటిని మెత్తగా తట్టిన రంగుల చప్పుడు.. ఎదో మహా ధ్వని సంగీతించిన పాట .. మరేదో తెలియని వేణునాద ధ్వని.. ఉనికి మొత్తమూ .. చెలరేగుతున్న ఆత్మ నిమీలనని జోడిస్తూ .. ఇంకేదో తెలియని నిద్ర జాతరల ప్రవాహ ధారని కప్పుతూ .. మరింత ముడేసుకున్న ఆయాసాల నడుమ చలన మూర్తి ప్రవేశ దీపంలా ఉండిపోయిన నిశాచరణ…అది నా తల్లి గర్భం..
సమయం నన్ను అంతకంటే వెనక్కి .. తీసుకెళ్లినప్పుడు .. మంగళ వాయిద్యాలు.. సన్నాయి.. డప్పులు.. మంత్రోచ్చరణలు ..హారతి పరిమళాలు … పసుపు పూసిన వాసనలు.. మామిడి కొమ్మల పైనుంచి రాలే మంచు తడి.. మట్టి వేదికపై.. పసుపు వస్త్రం కప్పి.. పరిపూరం ఇష్టంతో ఎదురెదురు కూర్చుని.. మహద్యలో దుప్పటి అడ్డుపెట్టుకున్నప్పుడు .. ఎవరో హాస్యం చేస్తుంటే ఇటుపక్క నవ్వుతున్న మా నాన్న .. అటు పక్క సిగ్గుపడే మా అమ్మ .. వాళ్ళిద్దరి పెళ్లిని నేను కళ్లారా చేస్తున్నాను.
మరి కొన్నేళ్ళకి .. తానొక వైద్యురాలు.. నేను అదేదో మృత్యువు అంచుల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడింది.. కళ్ళలో పెట్టి చూసుకొంది. అప్పటికే నా తల్లీ ధ్ద్రులు చనిపోయారు.. ఆమె నన్ను తన ఇంటికే వచ్చేయమని.. అక్కడే ఉండిపొమ్మని.. ఎవరూ లేని నేను వెంట వెళ్ళిపోయాను.. ఒకరినొకరు ఇష్టపడ్డాం.. ఇక పెళ్లి అనగా.. ఊరికి వరదలు వచ్చాయి.. అంటు రోగాలు ప్రబలాయి.. తనకి ఖాళీనే ఉండేది కాదు.. నిరంతరం వైద్యం.. తన గురించి తాను పట్టించుకునేది కాదు.. నేను ఆ రోగులతోనే సతమతమయ్యేవాడిని.. ఒక రోజు తాను అదే అంటు రోగం తో చనిపోయింది..
డాక్టర్ ; ఇదీ నా గత జన్మకి సంబంధినది…
ఏ జన్మలోనైనా నా తండ్రి దానికే ఉన్నారా? ఆ రోజు అమావాస్య .. అర్ధరాత్రి.. భయంకరమైన తూఫాన్.. నాన్న … ఆ ఊరిలో ఎంతో మందికి వైద్యం చేసేవారు.. కానీ రోగి నుంచి ఏదీ అడిగేవారు కాదు..వాళ్ళిచ్చింది తీసుకొని సరిపెట్టుకొనేవారు. చాలా వరకు.. మా ఇంటికి దగ్గరగా ఉండే అడవులు.. కొండల్లో దొరికే మూలికల ఆయన మందులన్నీ.. ఎంత పెద్ద మెండి రోగమైనా నయం చేసేవారు.. అదీ ఇంచుమించు ఏమీ తీసుకోకుండానే..
ఆరాత్రి మా పాలిట అలా అవుతుందనుకోలేదు.. ఆయన రోగి పాలిట దేవుడే… కానీ కొంతమంది చూచాయగా ఆయనకి ఏదో ప్రమాద సంకేతమిచ్చినా .. ఆయన పట్టించుకోకుండా .. మీ అంతా ఉన్నారుడిగా? అనే వారు..
ఏదీ ఆశించని ఆయన .. భార్యని మాత్రం కాపాడుకోలేక పోయారు.. పొరుగూరు వైద్యానికి వెళ్ళినపుడు.. నేను గురుకులంలో చదివే రోజుల్లో .. అర్ధరాత్రి పాము కాటుతో ఒంటరి ఇంట్లో చనిపోయింది.. ఆయన అంతంత మాత్రపు సంపాదన .. మాది చాలా చిన్న ఇల్లు.. మట్టి గోడలు.. కొబ్బరాకుల కప్పు..ఇప్పుడూ ఈ తూఫాన్ రాత్రి ఉంటుందా .. ఊడిపోతోందా అన్నట్లు.. సుమారు దూరంలో కానీ మరో ఇల్లు లేదు. ఇద్దరమూ అలా బిక్కు బిక్కు మంటూ .. ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్లు చూస్తున్నాం.. ఈ లోపు కొంతమంది ఎంతో పేరూ .. డబ్బు ఉన్న రాజ వైద్యులు మా ఇంటి తలుపు తట్టారు.. నాన్న తీసారు.. మొత్తం నలుగురు… వాళ్ళ చేతుల్లో సంచులు కూడా..
నాన్న ఏంటి విషయం.. ఇంత ప్రమాదంలో ఎందుకొచ్చారు ? అని అడిగితే .. మీ కోసమే.. ఈ పరిస్థితుల్లో ఈ ఇంటిని నమ్మి ఉండటం సరైంది కాదు.. వాళ్ళ ఇంటికి రమ్మన్నారు.. నాన్న ఆనందపడిపోయారు..
ఎప్పుడూ .. సూటిపోటి మాటలతో వేదించే మనుషులు.. ఏంటి వీళ్ళలో ఇంత మార్పని నా అనుమానం.. నాన్నకి ఏ అనుమానమూ లేదు.
అందులో ఎంతో భవిషత్తు చూడాల్సిన అమ్మాయి … మీతో ఉంది.. ఇలాంటి అప్పుడు అశ్రద్ధ మంచిధీ కాదు .. వెంట రమ్మన్నారు..
నాన్న .. నేను ఊ…అనే సరికి.. ఓ అని.. ఇద్దరమూ బయలుదేరాం. కాలి నడకన నది ఒడ్డున నేను ముందు నాన్న వెనక నడుస్తున్నాం. ఒక్కసారిగా పెద్ద అరుపు.. నాన్నని ఒకడు కత్తితో పొడిచి.. ఆయన కడుపులోంచి రక్తం వస్తూ ఉంది.. అమ్మా .. మనం మోసపోయాం … పారిపో.. అని.. వెనక్కి తిరిగి కూడా చూడొద్దు … పారిపొమ్మని.. నా కళ్ళలో నీళ్లు.. ఆందోళన.. నాన్నని కళ్లారా ఆఖరి చూపు చూడడానికి కూడా లేకుండా.. మిగతా ముగ్గురు ఆయనని కుళ్ళ పొడిచి నదిలోకి విసిరేసారు.
అని ఆమె చెబుతూ .. నేలపై కూలి ఏడుస్తుంది..
నా వాళ్ళ చావు తప్ప .. ఏమీ లేకపోయినా .. ఈ జన్మలోనూ నాన్నగానే ఉన్నారు. మళ్ళీ ఆయనే నా కాళ్ళ ముందు చనిపోయారు.. నేను దురదృష్టవంతురాలినని తెల్సిన.. నన్నే అతని కూతురిగా ఉండాలని కోరుకొంటారు… నా కోసం ఇలా బలి అవుతూనే ఉంటారు. నా మొత్తం జన్మలో కనీస కృతజ్ఞతని కూడా చూపించ లేకపోయాను.. ఇదెంతో బరువుగా … నన్ను నేనే ఈడ్చుకొంటునట్లుగా ఉంటుంది.
ఏకపాత్రాభినయుడు;
ఏకపాత్రాభినయుడు ; నాదీ మీ లాగే .. గత జన్మ … ఏదో చేసి బతికాను.. నా భార్య.. నేను ఒకే ఊపిరిగా బతికాం.. రాజ్యం కోసం ఎంతో చేసాం.. శత్రు రాజు భటులు నన్ను కుట్రతో అడివిలో చంపి పడేసి వెళ్లిపోయారు.. క్రూర మృగాలు ఆ అడివిలో .. పొద్దున్న దగ్గరలో ఉన్న ఊరివాళ్ళు చూసే వరకు కూడా ఏమీ చేయలేదు.. అవి నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసాయని ..అందరూ చెప్పుకొనేవారు. ఊరంతా ఇక మైంది.. నా అంత్యక్రియలకు.. రాచ మర్యాదలతో నాకు అంత్య క్రియలు చేసారు.. కానీ ఎవరూ నా భార్య స్థితిని గమనించుకోలేదు.. ఓ రాత్రి నా భార్య .. స్మశానానికి అర్ధ రాత్రి వచ్చి .. నా సమాధి పైన తల పెట్టి ఏడుస్తూ అక్కడే సొమ్మసిల్లి పడి పోయింది. …………
మరో వేపు .. వైతరణి లో నా యాత్ర మోడైలైంది.. అది నరక భూయిష్టం.. ఆ నది అంతా రక్తం.. కుళ్ళిన మాంస భాగాలు.. సగం కాలిన శవాలు.. భరించలేనంత దుర్గంధం … చీకటి.. చీము కార్చే చెట్లు.. నీటి మొక్కలు.. కోరల చేపలు.. ఒక్కోసారి మీద నుంచి .. రక్తం ఒలకబోస్తూ వెళ్లి పిశాచులు.. తీవ్ర అలసట.. వికారం.. నిద్ర లేని తనం.. ఒళ్ళంతా తెలియని నొప్పులు.. గడ్డ కట్టిన చూపు.. ఆందోళన.. అదే స్థితిలో.. ము
ళ్ళ తివాచీపై.. కింద చిత్రగుప్తుడు ఆధారం పట్టుకోగా యముడు… రా నా తివాచీ పైకి రా.. నీ భార్య దగ్గరకి వెళ్ళాలన్నాడు.. నాకేం అర్ధం కాలేదు.. అదే అడిగాను.. తాను ఎందుకుంది..?
యముడు; ప్రేమ అజేయ శక్తితో కూడింది.. అది మృత్యువునైనా జయిస్తుంది. అదిగో ఆ మొదటి రేవు దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంది..
నేను తన దగ్గర దిగాను.. ఆమె పరుగున వచ్చి నన్ను కౌగలించుకొని.. ముఖమంతా ముద్దులు పెడుతుంది.. గుక్కపెట్టి ఏడుస్తుంది..
కొంచెం కుదుటపడ్డాక..
ఇంకా భాద్యతలు పూర్తి కాలేదుగా? నువ్వెందుకు ఇక్కడికి.. పిల్లలు అల్లాడి పోతారు..
ఆమె ; నేను వెళ్ళాను.. వెళ్తే ఇద్దరమూ వెళ్ళాలి.. లేదా ఇద్దరమూ ఇక్కడే …
చిత్ర ; మా రాజుకి కోపం తెప్పించుకు తల్లీ …
ఆమె ; చేదుగా నవ్వి… ఇంకేం మిగిలింది.. మాకు ఆయన నష్టం చేయడానికి..
చిత్ర; నవ్వి… మృత్యువు..
ఆమె; దానికి నేను ఆనందంగా సిద్ధం ..
చిత్ర; అది .. ఆయనకీ తెల్సు.. నేను చెప్పేది.. అకాల మృత్యువు గురించి..
ఆమె; అదెవరికి ?
చిత్ర; నువ్వు ఇక్కడనుంచి వెళ్లక పోతే.. నీ బిడ్డలకి..
ఇద్దరూ పెద్దగా అరిచారు.. మేము చేసిన తప్పేంటి? అంత పెద్ద శిక్షకి …
యముడు; సృష్టి విరుద్దంగా నడవడం.. అసాధారణ మైనవి కనుక్కొని.. రోగి ఆయుస్సుని పెంచడం.. ( ఆమె వేపు చూస్తూ) ఇప్పుడు నువ్వు చేస్తుంది.. అతని ఆత్మని నీలో బంధించి ఉంచడం.. అది నీ భర్తకి మరింత నరకం చూపిస్తుంది.. తర్వాత నీ ఇష్టం..
ఆమె స్మశానం లో ఉలిక్కి పడి లేచింది..
అక్కడే చితిని పేర్చుకొని.. మంట వెలిగించి .. దానిలోకి దూకి కాలిపోయింది.. తన ఆత్మ నాలో కలిసిపోయింది.. ఇప్పటికీ నాలో అలానే ఉంది.. మరో జన్మలో నేనున్నా..
మిగతా ఇద్దరూ అతనిని ఆశ్చర్యం తో చూసారు. దేవుడు దొరికే చోటు …
ముగ్గురూ .. సరే .. మా ప్రయాణం మేము తిరిగి మొదలు పెడతాం..
యముడు;; చాలా పెద్దగా నవ్వుతాడు. వాళ్ళు ముగ్గురూ అతనినే చూస్తూ ఉంటారు.
అతను ఆగి మళ్ళీ నవ్వుతాడు.
వాళ్లలో చిన్న అనుమానం మొదలవుతుంది.. ముగ్గురూ ఒకే సారి .. అంటే…
యముడు; అవును .. మీరనుకొంటున్నదే … ఈ జీవ చక్రాన్ని పరిచయం చేయడం ఇంకెవరి వలన అవుతుంది..
ముగ్గురు ; అంటే .. మాకు ఆ దర్శనం జరిగిపోయింది.
యముడు ; అందులో సందేహమా?
ముగ్గురు; మరి మాకు సమాధానాలు..
యముడు; అది ఆయన దృశ్య రూపంలో ఇచ్చే ఉన్నారు.. కేవలం మీరు ఆ అర్ధాలు చిత్ర విభజనలోకి వెళ్ళండి.. ఆ దేవ దేవుడి సమాధానాలు దొరుకుతాయి.. అన్ని మహిమాన్విత శక్తులు మనలో నింపే ఉంచాడు. అటు .. ఇటు కానీ నిర్దేశ తీరులు.. ఓపిక లేని చీకటి సంగతులు.. ఊడిపోతున్న నిద్ర గృహాల చాటుమాటు వ్యవహారాల్ని వదిలి ఆ పైకి చేరగలిగితే .. తడిచిన వర్తమాన ముద్రాలని మోగించే శరీరం తప్పి పోయిన పునాదుల మధ్యనే నేను వెదుక్కొంటున్నాను.
Proyoktha ;
అది మహా విశ్వ ధుని.. చర్యల చర్యలతో కదిలే నిద్ర సోపానాలు మృతు జడని అల్లుకొని.. విరబోసుకున్న మధ్యహాన్న నిద్ర సమూహాల్లో .. రహస్య ముద్రలు కదిలే కన్నుని జల్లెడ పడుతూ .. దేహ సాంద్రతల శ్వాస తానులో .. పొడిగా చుట్టుకొన్న దేహ నిద్రల ఓగర్పు.. ఇదిఅంతా ఉంది.. ఇది మాత్రమే లేదు.. ఇది కూడా ఉంది..అంతర్ధాన శక్తులు..ఆవిరవుతున్న నిశ్చల మితిని సాగదీసే కంటిలో.. చూపుకి విసిగిన నిద్ర ద్రవాల తోడుని నింపుకొని .. కాస్త కల తప్పిన అంతాల మధ్యనే .. నేను సరిపెట్టుకున్న మృత్యు భ్రమణ సమ్మతిని మార్చి కథలని కౌగలించుకొన్న శరీర తీరులు.. నడకలు.. మూలాలు.. పొందికలు.. పోతపోసిన ముంపులలో ఇరుక్కొని మరింత శ్రద్ధని మోసుకుపోతూనో తను దొరుకుతాడు.. నేనే అంతా అని.. ఆ లోపలనే మిగిలిపోతాడు. ఇదంతా నా కలలో ఆగిపోయినపుడు.. ఉంచిపోయిన మోతాదులతో పండి రాలుతున్న శరీరాలు.. అక్కడే ఉన్న గది .. కిటికీలు అల్లార్చిన గాలి తంత్రులపై సరిచేసిన అడుగులతో చూపుని పేర్చిన ఒంటిమీదుగా చేరిపోవాలని.. …
ఇదంతా నా కలలో ఆగిపోయినపుడు.. ఉంచిపోయిన మోతాదులతో పండి రాలుతున్న శరీరాలు.. అక్కడే ఉన్న గది .. కిటికీలు అల్లార్చిన గాలి తంత్రులపై సరిచేసిన అడుగులతో చూపుని పేర్చిన ఒంటిమీదుగా చేరిపోవాలని.. … దేహ ప్రజ్ఞని వదిలిపోయిన అనుమాన నిర్దేశాలపై ఇంకిపోయిన మూల సూత్రాలతో చీకటిని చల్లార బెట్టిన ఓపికని నానబెట్టి.. సందేహం మనలోదే .. అది ద్రుష్టి విభ్రమ మహాత్తులోకి ప్రాణ మాయగా నిండి పోయి .. దుఃఖ చమురు ఆర్చుకొన్న అతుకుల గోడలని పగలగొట్టి.. చలన మాత్రంగా ఉండిపోయిన ధూప చంద్రుడి కథనాలు.. కౌగిలించుకోవాలి.. మాటని వదులుకోవాలి.. అతను అడుగులో అడుగు కలపాలి.. ఊడ్చిన జ్ఞాన స్పృహని తనఖా పెట్టాలి.. కాళ్ళు.. కన్నూ … చెయ్యి.. వెన్నూ అరిగిపోవాలి.. వెదుకుతూనే ఉండాలి.. ఆత్మ స్నానం చెయ్యాలి.. చీకటి అలజడిని వడపోసి మింగాలి..
EPISODE ; 26
Prayoktha ;
విశ్వం నిండా మరిగించిన మృత్యువు సాష్టాంగ పడి.. పదే పదే .. గుర్తుకు తెస్తున్న నిద్ర దేహాల సంధి సూత్రం అప్పగించిన చిత్ర ద్రోహాల కంటిపోటుని గిలిగించి … అటు నుంచి ఆటే మారిపోతున్న బయట రూపాల శ్వాస తీర్మానం.. వినబడని.. కనబడని.. ఆశ్రిత శాపాలు దీప విందుని .. గొంతు నొక్కి ఆర్పుతూ .. తాను నా లోపల చేరుకోలేని విశ్వదర్శనాని ఉంచి.. వెక్కిళ్లు పడుతుంది. శాపముద్రని దగ్గర చేసుకోలేను.. తానేనని .. ఒక్కమాటనీ ఎంత అడిగినా పలకదు .. తలుపు తియ్యదు.. కిటికీకి మేకులు దిగ్గొట్టింది.. వెలికణుపులు తిరిగి చురుక్కుమనే దేహ చప్పుడుని ఎవరో నాకుతున్నారు.
ఇక్కడ ఏదీ మరోలా .. మనలని చేరదు. తనతో తను .. తనలో తాను.. తానై తాను.. .. విశ్వ నిగ్రహంలోని మాటల తడబాటు చెలరేగి.. ఒంటరిగా ఉండిపోయిన దేహ శిక్షణ.. మృత్యువు తర్వాత గ్రహణం ఊడ్చిన నిరాధార క్షణాలని పోతపోస్తూ నేను ఒక ఇహిత సత్తువుల నిద్ర చలనంలో చతికిలబడ్డ శ్వాస చలానాలు గడ్డకట్టిన దుఃఖ చిహ్నాల మెలుకువ..
పోతపోసిన అరమరికలు గ్రహణ దీపం కిందుగా ఊదిన శ్వాస చలనంతో పడి లేచిన మరణ దీపాల అల్లిక … ముద్రని దగ్గర పొడిగా రాలిన చలన సాక్షి ఏడుస్తూ .. మడతపడ్డ వృత్తాల కీడుని నలుపుతూ .. కొంచెం గోడని వాల్చి .. చిత్ర వికార దీపంలో తన్నుకులాడి .. మరలా తెలియని సగం నటనని నేర్పి పక్కకి తప్పుకొంటారు.
హంస రెక్కల మధ్యలో దాచుకొన్న సప్త వర్ణాల భర్త రెక్క .. రక్తంతో నిండి జారిపోతుంది.. అప్పటికే గట్టు తెలియని దూరంతో ఈది .. ఈది .. అప్పటికే ఎంతో అలిసిపోయింది.. ఇంకో మాట చెప్పడానికైనా తాన్ దగ్గర దగ్గుతో కూడిన ఆయాస సంకేతం తప్ప మరొకటి లేదు. ఎవరో పైనుంచి చూస్తారు.. కదలికనే పట్టుకొని. స్మరణ తీరికని ఒద్దికగా వడపోసి.. కథని ఊడ్చిన నటనల బిగువుని దగ్గరగా చూసి .. రెప్పలు చిలకరించి దీప నిద్రల మధ్యనే తప్పిపోతారు. ఇంకిపోయిన యుద్ధ కౌశలం పలుకుని చుట్టుకొంటూ .. అక్కడే ఉండిపోయిన చీకటి మాల రెక్కలకి చుట్టుకొని…
ఆత్మగా నాలో ఉండిపోవడంలో నీ కష్ట మేమిటి?
విరుద్ధ స్వయంగా నే పడిన పాటని నువ్వు వినలేదా? గర్భ సూత్రం తెగి రాలిన మహా నిద్రలో నిండిన కౌగిలి … అదొక తెలియని పెద్ద బరువు…విసిగిన కంటిలోని ధూళి.. మహా దర్శన విస్ఫుల్లత కదిలి నా శ్వాసని .. ప్రతీదీ నీనీడగా తల్చుకొంటాను .. విశ్వ సందడి మోసుకొన్న శరీరం .. నేను నీటిలో ఈదుతున్నా… ఓ వాన చినుకుని తాగుతున్న .. ఓ విశ్వ రహస్యం .. నా పుట్టుకలోంచి .. నాకు అర్ధమౌతున్న … ఓ కల నన్ను .. నా నిద్రని కాలుస్తున్న .. నా లోపలి కదలికల బయట భయాన్ని నేను తీసుకొని .. మరో మంత్ర జగతి లోకి నేను ప్రవేశిస్తున్న .. ఇదంతా నీతోటిదే … నువ్వై ఉన్నదే .. నీ ఉనికిని మించిన స్వర్గం .. నా కంటూ ఇంకేం లేదు. దేహపు నిర్దిష్ట అనుకూలనలో.. నేను .. నా స్పృహని నీతోనే తీసుకొన్నాను..
ఈ మాటలు విన్నాక .. ఆ రెక్క .. ఆకాశంలోకి ఎగిరి సప్త వర్ణాల వానగా ఆ హంస పైకి కురుస్తుంటే .. నాట్యం చేస్తుంది.. ఆమె ఒక పాటని నిదాన ముంపులతో ఉద్రేకించి.. పైపైకి తేరుకున్న బెంగని తవ్వి తీసి .. మాటలు లేని తలుపులు వెనక సరస్సులు ఎండిపోయాక .. ఎటు వెళ్లాలో అర్ధం కాక .. అలా నిల్చినప్పుడే నిందుతున్న ఆనందం.. విసిగినప్పటి దీర్ఘ చలన ముట్టడిని కుదుపుతూ .. అక్కడేవో వీలుకాని సంతర్పణలు.
హంస రాయభారం
ఆ హంసకి ఓ రాయభార సందేశం ఆకాశవాణిగా వినిపిస్తుంది.
హంస ; నన్ను ఇంత అలసటకు గురి చూసి ఇంత దూరం రప్పించింది.. ఇందుకా .. నీ వాణి .. వినే .. ఈ చోటిని చేరడానికా ? ఇక్కడ నా శ్వాస రొప్పుని నేనే వినడానికా?
ఇదే దేవుని ఆజ్ఞ ఐతే నేనేం అనలేను.. ఇదొక ప్రజ్ఞ .. విశ్వ జాగారంలోని స్థితుల ఒద్దిక .. కదలని సాపేక్ష నిద్ర కథల పట్టూ.. విడుపుల ముద్రలు .. ఒప్పుకోని ముఖాల పోలికలని .. కదుపుతూ .. అప్పగించుకున్న నేర్పుల ఐహిత శక్తుల దీప ముడులు.. ఒక జీవి ఇంకొక జీవి .. తినడమనేది.. జీవ జాలపు సిద్ధాంతంగా ఉండటంలో మెళుకువలు ఏవైనా కావొచ్చు.. అదే మరో జీవనానికి సృష్టి ప్రకారం ఆహారంగా ఉంటే అదే వేరే సంగతి.. ఏ నిమిత్తము లేని .. ఈ హత్యలు దేనికి?
ఈ హత్యలు జరగక ముందు అది వేరే సంగతి..
జరగాల్సిన నష్టం జరిగాక అదే అలాగే ఉండిపోదు.. ఈ పతనం .. దేవుని సంగతి కదా?
ఈ రాయభారం దేనికి? తన సృష్టిని తనే ప్రశ్నించక .. నన్ను రాయభారిని ననడం … అది నా చావుని కోరేదే ఐతే .. దానికన్నా సంతోషం మరేం లేదు …
భర్త లేని ఈ నిస్సార యవ్వనం నేనేం చేసుకోవాలి? ఎలా నన్ను నేను కాపాడుకోవాలి? అంతా అయోమయం.. ఈ చీకట్లోంచి.. మరో చీకట్లోకి వెళ్లిపోవడంలోనే .. నీకెప్పటికైనా మోక్షమని నమ్ముతాను.
నా భర్త ప్రతిమని నేను చేసుకొని మురిపోవాలని.. నాకు తెలిసిన పురుషుడు అతనొక్కడే.. మిగిలిన అందరూ నాకు శిశువులే.. ఏ పరిధులని నమ్ముకుని .. నీలో నేనని నమ్మించాలి.. ఇది ఇలా కాకుండా వెదికి పెట్టుకొన్న శరీర మృదుల వంతుల చీకటి ముడుతుల గుమ్మంలో తీరికగా నేను …అలా అనుకొని అలిసిపోవాలా?
పురుష ప్రతిమని తయారు చేస్తున్నప్పుడు అకారణ మృత్యువు… నిని ఎలా అర్ధం చేసుకోవాలి.. ఎవరి నిర్మాణమని నేను నమ్ముకోవాలి..
హంస ఒక పురుష ప్రతిమని తయారు చేస్తుంది.. అదిఒక జీవమున్న దేహంగా .. అచ్చం .. భాగవతార్గా ఉంటుంది.. ఉన్నట్టుఉండి .. చలన ఛాయగా మారక ముందే.. అందులోంచి మాటలు మొదళ్లయ్యాయి..
భాగవతార్ ; నన్ను ఎలా పోల్చుకోగలిగావ్?
హంస; చలనశీల దేహ విపత్తు మోసుకొని.. లిపి చూడని విశ్వ మూర్చనల కేంద్రంలో కొంచెం కీడు గుచ్చినా వదలని ముద్దల ముద్దలు చీకటి ఏడుస్తూ .. అక్కడే దిగబడి చలన నీరు తాగుతుంది.
భాగ ; ఇదంతా మారిపోవాలిగా?
హంస; దానితో నీకేం నిమిత్తం .. ఏదీ సరిచేయడానికి లేదు.. విపరీతమని తగువుపడడానికి లేదు.. బయ వర్తన చంద్ర వృత్తాలని అద్ది తీసిన నేర్పుతో దూరం జరుపుకున్న ముట్టడి రంగులే .. నా శ్వాస .. అనునయ బయట ప్రాణం.. గిల గిల్లాడుతూ .. పైకి జరిగి ఇక దూకనా? అని అడుగుతుంది.
అతను.. కాసేపటికి జీవ చైతన్య మూర్తిగా మారి… ఆమె తో శరీర భాషణ మొదలు పెడతాడు..
ఆ భాషణ ఏ లౌకిక వర్తనాల చలన ధీరని నిర్మించలేదు.. పగని కాల్చి.. దుర్మార్గం పైన ఓ చిప్ల్లిన కంటి దీక్షని వేడికి.. ఆ లోపలికి కూలి.. మరింత తెల్లని విశాద ముంపుల మన్నికని దాటి.. రంగు క్షేత్రాల్లో ఓడిపోని విశ్వ తంత్రిని బిగుతుగా లాగి.. అదంతా కాదన్నా .. చిత్రాల గట్టుపై .. ఒకింత ఒణికిన దేహ శీర్ష్యల పడాలని తాగేస్తూ తూలిపోయిన పోలికలు.
మరు జన్మ గురించిన ప్రస్తావన రాగానే.. హంసకి అర్ధమై పోతుంది..
ఈ జన్మలే వ్యతిరేకమౌతాయి తప్ప అదేగా ఉండిపొమ్మని..
ఈ ఎడబాటు .. ఇంకెలా ఎన్ని జన్మలో ఇప్పుడు ఊహించగలిగేది కాదని.. శరీర తనలో తనకి ఇన్నెలా తెలుస్తున్నాయో అర్ధం కాక తను ఎలా మిగిలిపోయిందో అర్ధమే కాలేదు. అడగడానికి సరిపడే ధైర్యం తనకి ఎదురుకాలేదని ..అది అలానే పొడుగ్గా సాగి.. శ్వాస తీరుబాటుని కదిలించే రుణ చిత్రాల కానుకని సర్దిన పళ్లెంలో .. చూపు వివిరణలని దాటిస్తూ .. చీకటి సరస్సుగా మారిందని.. కొంచెం పొడుచుకొచ్చిన నిద్ర ఖాళీల్లో పొడుగైన ఘర్షణ ..
తన కథని మళ్ళీ మరో కోణంలోంచి చెప్పడం… తన భర్త ఆ యాత్రలో దొరకనప్పుడు.. ఆ మహా యాత్ర ఎలా జరిగిఉంటుందని అడిగినప్పుడు.. ఆ సరస్సు సముద్రంగా మారేదని.. తన కన్నీరు సరస్సు అడుగు పొరల్ని చేరి.. పొంగి.. ఎగిసి.. కెరటాలై.. హద్దులు చిరిగిపోయి.. ఎక్కడిక్కడ గుండ్రంగా చుట్టుకొని.. సముద్రంగా మారిపోయి .. దేవుని తాన్ శ్వాస లోంచి విడిచిపెట్టి.. దూరం నుంచి చూస్తున్నప్పుడు .. ఆ అప్పటి నీటి రుచి.. తన భర్త చెమటని… సముద్రం పై పర్చుకొన్న ఈ గాలంతా అతని శ్వాసల రెప రెపలని ఏడుస్తూ .. కొన్ని సంతకం చెయ్యని చీకటి సూచీలని అందుకొని.. అతను మరు జన్మ లినోచ్చి నన్ను వెదుక్కొంటూ ప్రయాణం మొదలుపెట్టాడని.. నేను గట్టిగా అరిచి నాకు నేనే చెప్పుకొంటాను..
యాత్రలో కలిసే వారు… వాళ్ళు ఆనాధలు .. అర్భకులు.. క్షతగాత్రులు.. పుట్టు మాటలు లేని వెర్రిబాగులవాళ్ళు.. పెద్ద మాయల వికారులు.. పై పై మెరుగులు దిద్దే మహా సంతర్ప దుఃఖ తీరుల శరీరాల వాళ్ళు.. విభజితులు.. వాళ్ళు ఎదురు పడరు.. దూరం లోంచి చూసి వాళ్ళ ఉనికిని వదిలిపెట్టి మంలో కలిసిపోతారు.
ఒక గుడ్డివాడు.. మాయ నింపే ఏ చూపూ అవసరం లేదని.. తనకి .. తన లోపలి దృశ్యానికి .. బయట సృష్టి తీర్మానం తో సంయోగం కుదిరందని.. అది బయట ఎలా ఉన్నా నిమిత్తం లేదని.. అదే తన చివరి శ్వాస వరకు దడ దడ లాడుతూనే ఉండి తనని నడిపిస్తుందని … స్పర్శ అంటు కట్టిన కునుకుని ఉడకబెట్టి కొత్త గోళంలో గుడి తలుపుని మోగించి.. మరో మాటకి కూడా మిగలకుండా మాయమౌతాడు.
పిచ్చివాడు.. నువ్వూ .. నేనూ ఒకటేనని.. తన దేహాన్ని ఓ సీసాలో పెట్టి .. ఆమె అందేలా ఉండి.. లోపాలు నేరుగా మారి .. ఆమె దాహానికి ఆధరువుగా మిగులుతాడు..
సంగీత ఉన్మాది.. ఉన్మాద భయా ఊలం లో .. గుక్క పెట్టి తిరిగే .. నిద్ర దీప వారధిలా .. ఆ గట్టు చీకట్లో . కేవల. చప్పుడుని.. శంఖంలోకి ఇరుక్కొన్న దెయ్యాల ఉక్కిరిబిక్కిరిని … పై లాలాహా దీప స్మరణంలో కిక్కు ఇచ్చే దేహ సారంగ ముట్టడిని .. పాట సంగీతం లోకి లాగి అటునుంచి కూలిపోతుంది..
డ్రగ్ అడిక్ట్ … కలల ప్రేమికుడు.. వాడూ .. నేనూ .. కొత్త నిద్రని వెదుక్కొంటూ .. ఓటమి పాలవుతాం..ఓ గుప్పెటలో ఇంకిన నిద్ర తీరుల కౌగిలి ముడిని వదులు చేసి .. పై పై పొగల నిద్ర ఊర్పుల్లో నడుము తిప్పీ తిప్పి విరిగాక .. ఇక అంతే లెమ్మని .. గుర్తు పట్టనట్లుగా ఆ హద్దులో పది కొత్త నిర్యాణ ముఖాన్ని తెచ్చుకొంటాం.
ప్రవక్త .. మాయ సంయోగం లో కొత్త వెలుతురు వర్షాలతో తడిచి జ్వరంగా మారి.. వణికే కల గదిని తీరు మార్చుకొని.. మృత్యువుని అద్దెకి తెచ్చుకొని.. పోతపోసిన రుణ గతుల ఒరవడి సంకేత నిద్రలేని చదును చేసి .. కల్పిత కల్పాల్లో పడి ముక్కలైన ఆనవాళ్లనే కాదని..
ఋణం కలబడే పోలికని తనకి ఏ సంబంధం లేదని .. ఊపిరిని లోపలి పీల్చి.. గాలిని ఖాళీ చేసాక .. చీర నలగని నవ్వుతో .. ఒక చీకటి నిద్ర విడువుని మోసి .. ఆ పై నిడివిలేని మృత్యు రాకని కనుక్కొని దుప్పటిని దులిపి .. ఇక చాలా వెళ్ళనా .. మళ్ళీ మళ్ళీ అడిగి విసిగించి,, పొడుగు రంగుల పైటని జల్లిస్తుంది.. ఎంత తిరిగిన రావాల్సిన చోటు అదేనని అందరకీ తెల్సు.. అక్కడ ఒక చావు అనేక దశాబ్దాల శరీర రేవులుగా మారి సేద తీరుస్తుంది..
EPISODE 27
గతి చిత్ర మునకలు.. జీవమాల .. శృతి చేసిన కన్నీరుకి అంత్య ఫలంగా ఉండే మృత్యువుని.. చిత్రగుప్తుడు ముందే చూడగలడు.
అతను ఏడుస్తూ ఉంటాడు..
భాగవతార్ అతని దగ్గరకి వెళ్లి.. ఓదార్చే క్రమంలో కౌగలించుకోబోతాడు. చిత్రగుప్తుడు అతనిని దూరం తోసి .. నా దగ్గరకి రావొద్దు నాయనా ? అంటాడు.
భాగ; మాకా అర్హత లేదా? మీరు ఈ దుఃఖానికి అతీతులు కారా? అంటాడు.
చిత్రగుప్తుడు … ఇది దేవ రహస్యమైన.. అన్నీ బయటపెడుతున్నప్పుడు .. ఇది మాత్రం దాచడమెందుకు ?
ఏదైనా శరీరం గిల గిలాడుతున్నప్పుడు.. ఆ ప్రాణానికి అంత్య ప్రాప్తాన్ని ఇవ్వడానికి .. నేను కౌగలించుకొంటాను.. నా కౌగిలి లోంచి.. వాళ్ళకి మృత్యు ప్రాప్తి జరుగుతుంది. కానీ ఇది నా బాధ్యతలో భాగంగా ఒప్పుకున్నాను. అప్పుడు నేను ఊహించలేదు .. ఇది నా వ్యక్తిగతాన్నీ ఎంత మార్చేస్తుందో.. ఇప్పుడిక నా అని ఎవరినీ దగ్గరకి తీసుకోవడానికి లేదు.. నాకంటూ ఏదీ మిగిలేకుండా ఐపోయింది.
భాగ; నా విషయం లో నువ్వేం చెయ్యగలవ్?
చిత్ర; అది నా ప్రభువుకి సంబంధించినది.. నేను నిమిత్తమాత్రుడని..
భాగ; జరగబోయేది ముందే తెలిసినపుడు.. అనవసర అన్యాయ మరణాలని కూడా ఆపలేరా? మీరిక సృష్టి రచనలో ఏ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నట్లు..
చిత్ర; నాకు .. నన్ను నేను ఎలా అంతం చేసుకోవాలో కూడా తెలియడం లేదు.. ఇది తప్పని ఎన్నోసార్లు అనిపిస్తుంది… కానీ దీనికి పరిసుఖార్తా ఎవరో .. అతనిని నేను ఇంతవరకు చూడలేదు.. ఇక ప్రశ్నించడం ఎలా జరుగుతుంది.. నిజానికి మేమేమీ నిరాయించడం లేదు.. అమలు చేస్తున్నామంతే..
చిత్రగుప్తుడు కౌగిలిలో చావు.. నీ చావు ఓ యక్షిణి రూపంలో నేను వచ్చి అంతం చేయాల్సి ఉంది.. కానీ నేను నా యముడితో వాదించాను.. ఒప్పుకోలేదు..
భాగ; ఏంటి ? నాకోసం .. వధించడం కూడానా ?
చిత్ర; అవును నీకోసమే .. ఈ సృష్టి నిర్మాణానికి.. అర్ధాంతర చావుని.. ఏదొక కలలోకి నింపి .. ఒక వ్యాఖ్యానమిచ్చే ప్రయత్నం చేస్తూ.. మృత్యువుకి.. మనం ఇవ్వలేని అర్ధాన్ని తనిచ్చే ప్రయత్నం చేస్తుంటే.. ఏమంత వయసుని .. మనం ట్టేసుకు వెళ్లాలని వాదించాను.. నిజానికి నీకు నా కౌగాలి నుంచే.. నరక ప్రవేశ ద్వారం నిరాయించబడింది.. నిజనగా అదెలా ఉంటుందో .. చూసే తీరికి.. అవకాశమూ .. మాకు ఇంతవరకు.. సృష్టి కల్పించని లేదు.
భాగ; మరిప్పుడు నీ పరిస్థితి..
చిత్ర; నన్ను ఓ వలయం లో మాత్రమే తిరిగేలా చేసి.. యముడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు..నాకిక మరో దారి లేదు.. ఆయన వచ్చే దీని నుంచి బయటపడెయ్యాలి తప్ప..
భాగ ; ఎందుకంత .. ప్రేమ?
చిత్ర ; ( నవ్వి) ఇది .. కనీస కర్తవ్యం .. జరుగుతున్న ఈ ఊచకోత కి ఏదైనా ఒక అర్థముందేమోననే భాష్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావ్.. ఇది మానవాళికి .. తమ ప్రయత్నాల పట్ల కనీస మర్యాద మిగులుతుందని నమ్మకం.. .
చిత్ర గుప్తుడి చుట్టూ ఓ వలయం.. అతను భాదతో విల విలలాడి అరుస్తుంటే.. భాగవతార్.. గుండెల్లో కత్తితో పొడుచుకొంటాడు.. రక్తం రాదూ.. మల్లెలు రాలతాయి.. ఎదురుగా చిత్రగుప్తుడు మాయమౌతాడు..
యముడి ఎదురుగా చిత్రగుప్తుడు..
యముడు; ఎందుకలా అతనిని మోసం చెయ్యడం..
చిత్ర ; మోసం కాదు.. భూమి మనం తీసుకుపోయే ప్రాణాలకి .. కనీస అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నం.. అంతే.. మీకొక మర్యాద అంతే..
యముడు; (భాదగా చూసి ) నిన్ను నేను ఎలా శిక్షించగలను..
చిత్ర; మీకా కోరిక ఉంటే .. ఇప్పుడే చెప్పండి.. నన్ను నేనే శిక్షించుకొని.. మీకా సంతృప్తిని ఇవ్వగలను..
యముడు; నన్నింకా దుర్మార్గుడని చెయ్యడం .. నీ ఉద్దేశ్యమా?
చిత్రగుప్తుడు ఏ సమాధానమూ చెప్పడు.
(ఒక్క ప్రాణం కోసం అతనెలా అల్లాడుతాడో చూసి యముడు ఆశ్చర్య పోవడం. )
యముడు; ఆ హంసకి ఎలాంటి చావుని నిర్ణయించావ్?
చిత్ర; ఏం.. మాట్లాడాడు..
యముడు; ఎందుకీ అకారణ మౌనం.. ఇది మాకు కోపాన్ని రప్పిస్తుందని తెలియదా..
చిత్ర; తెలుసు..
యముడు; భూమిని రక్షించే అయస్కాంత సరోవరాల కోసం నీకు బాగా తెలుసని నాకు తెల్సు..
యముడు; ఆ హంసకి ఎలాంటి చావుని నిర్ణయించావ్?
చిత్ర; ఏం.. మాట్లాడడు..
యముడు; ఎందుకీ అకారణ మౌనం.. ఇది మాకు కోపాన్ని రప్పిస్తుందని తెలియదా..
చిత్ర; తెలుసు..
యముడు; నీకు బాగా తెలుసని నాకు తెల్సు.. నేనెపుడు అడగాలని చూసిన నువ్వు ఏదో రకంగా తప్పించుకొంటున్నావ్ తప్ప . సమాధానం ఇవ్వడం లేదెందుకు..
చిత్ర; అవి భూమి రక్షించే అయస్కాంత సరోవరాలు.. ఆ హంస తన ప్రాణాలకి తెగించి కనుక్కొంది . అవన్నీ దేహ నిర్మాణాలకు మాత్రమే ఐనా.. తాను తెల్సుకోంది.. వాటి రహస్యాన్ని మీరు ఎంత నన్ను హింసించినా నేను చెప్పదల్చుకోలేదు..
యముడు ముఖం లో తీవ్ర ఆగ్రహం..
దీని పరిణామాలని తెల్సే.. నన్ను ఎదురిస్తున్నావా?
చిత్ర ; ( నిర్భయంగా ) .. అవును.. ఇన్ని యుగాలుగా .. మీరు ధర్మరాజనుకొన్నాను.. కానీ మీరే ధర్మం పాటించడం లేదని తెలిసాక .. కనీసం మీ పేరులో నేనైనా చేద్దామని.. కానీ ఈ భూమి పై ఎప్పటిలానే .. మీ పేరుని మాత్రమే తల్చుకొంటారు లెండి.. మీకా విషయంలో భయమొద్దు. నిజానికి నేను ఏ విషయంలోనూ గుర్తింపుని ఆశించడం లేదు..
యముడు పట్టరాని కోపంతో తన సుత్తిని ఎత్తి చిత్రగుప్తుడు వెన్నుపై కొడతాడు.. అంతే అతను ఎగిరి Black hole లోకి వెళ్ళిపోతాడు..
యముడు తర్వాత భాద పడతాడు.. కానీ వెనక్కి ఎలా తీసుకొచ్చేదని.. ఎంతో భాదతో .. ఆకాశవాణిని అడుగుతాడు.. కానీ అక్కడ నుంచి ఏ సమాధానమూ రాదూ.. అతను అల్లాడి పోతాడు.. తలచుకొని.. తలచుకొని కుమిలిపోతాడు.
యముడి యుద్ధ ప్రతిపాదన , ప్రయత్నాలు నిర్వీర్యం కావడం .. యుద్ధం నడుస్తూ ఉంటుంది.. కానీ చావులు ఆగిపోతాయి.. ఏదీ ఇంతకీ పూర్తి కాదు.. స్మశానాలు.. మార్చురీలు ఖాళీగా ఉంటాయి. ఆక్సిడెంట్లోనూ .. చావులు జరగవు.. ఓ పెద్ద ఫ్లైట్ ఆక్సిడెంలోనూ చావులు ఉండవు.. అందరూ ఆ మంటల్లోంచి .. అనాయాసంగా నడుచుకొస్తారు.. ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు.. యముడికి శూన్యం నుంచి హెచ్చరికలు వస్తూ ఉంటాయి. మృత్యువులు ఆగిపోయి..
దేహాలు తీవ్ర భాదకి గురికావడం.. యముడు అది చూడలేక గుక్కపెట్టి ఏడవడం..
కొన్ని రోజుల చిత్రగుప్తుడి సహాయ నిరాకరణ . యముడు అల్లాడి పోతాడు…
యముడు; నీ ఉద్దేశ్యం నాకర్ధమైంది.. మృత్యువులోకి ఓ ధర్మాన్ని తీసుకురమ్మంటావ్ అంతే కదా?
చిత్ర; అతని నవ్వు .. శూన్యం లోంచి..
యముడు; నీ దాగుడుమూతలు ఆపు.. నా దగ్గరకి రా..
ఎదురుగా చిత్రగుప్తుడు.. అతను యముడి కాళ్లపై పడతాడు.. అతను లేపి బలంగా కౌగలించుకొంటాడు.. ఇక నుంచి అంతా ధర్మ నిర్ణయమే.. అని మాట పూర్తి కాక ముందే … రక్తం కక్కుకొని .. నేలపై కూలిపోతాడు..
అప్పుడు చిత్రగుప్తుడికి తన కౌగిలి శాపం గుర్తొచ్చి..
ఇప్పుడు నేనేం చెయ్యాలని అల్లాడి పోతాడు.
ప్రయోక్త ; ఇది మృత్యు రాజీయత చేరదీసి మహా నిషేధ ద్రవాల సరస్సులో ఊపిరాడక మునిగిపోవడం.. ఓ సంకల్ప నిద్ర కెరటాలుగా లేచి.. ఆరి పోయిన దీపాల నివ్వెరపాటు ని తాగి.. విశ్వ పలాయన మంత్రం స్థావరంలో కూలదోసుకొన్న ముద్రాలని చెరిపి.. అప్పగించిన నివ్వెరపాటు.. రంగు శాపాన్ని చేసి .. ఆ పైకి చేరుకొని.. ఆ శూన్యంలో ఏం ఉంది.. ఏదీ లేనిదే.. ధర్మ పరిరక్షణ ఎలా ?
ఎందుకు ఇలా జరిగింది.. ఇంత గందరగోళమెందుకు? ఏ ప్రయోజనం ఒరుగుతుందని.. ఒక పక్క కూలిపోతున్న నా ఎగుడు దిగుడు సత్యాలని కాదని .. ఆ దూరం లో ఏం ఆగిపోయింది.? అనునుకూల సానుకూలం.. మృత్యువుకి మరేదో పరిష్కారం ఉందా? లేనిదీ ఉన్నదానికన్నా పైన ఇంకేదైనా నిదానించి చూస్తూ ఉందా?
EPISODE 28;
ఏకపాత్రాభినయుడు ఆ రోజు ఏం జరిగిందని చెబుతుంటే అన్నీ ఆత్మహత్యల ఆత్మలు శ్రద్దగా వినడం.. నేను మీ అందరి కథల వెనుక ఒక భయాన్ని తీసేసి మృత్యు వాకిలి తెరిచినా చివరి మెట్టుగా ఉన్నాను.. మీరు అది కనిపెట్టాలని నేననుకోలేదు.. కానీ ఇప్పుడు ఇక్కడికి ఇలా రావాల్సి వచ్చింది.
నన్ను ఎవరో దేనికో బలవంతం చేశారని మీరు అనుకోవద్దు.. కానీ అసాధారం మృత్యు సంకెల .. దీని వృత్త నిర్మాణం అంత తేలికగా అర్ధమయ్యేది కాదని మాత్రం తెల్సుకొన్నాను. పాతగా ఉండిపోయిన రంగుల కలత ఉమ్మడి నిద్రని కదిల్చి.. నేలపోత మూటలని దాటి .. పోతపోసిన ఉనికిని దాటుకొంటూ.. విస్మయ నిష్క్రమ మూర్తుల కల్లోల ముట్టడిని మీదకి రాల్చుకొని.. అక్కడనే ఉండిపోయిన చిన్న చిన్న ముడుల కంటి శూలాలని మోసేసుకొంటూ కొంచెం వీలుచూసుకొని ధ్వని పరాయి చేయాలని దగ్గరకి తెచ్చు కొంటారు
ఒక విస్మయ కాంతిలో నిస్పృహ మొదలైంది.. కథలకి దూరం జరపని .. మాంత్రిక నిరీహ సత్తువలని ఏకం చేసి .. కదిలిక లేని ఉపేక్ష రాశుల తీర్ధం లో పడి కలయదిరుగుతూ .. అంతు లేని దేహ ఛాయగా కూర్చున్నామని ఎవరో అనుకొంటారు.. లోపలి ప్రయాణపు అలసట అక్కడే దిగబడిందని ..
కొన్ని నొప్పి పుట్టే కదలికలు రాల్చుకొంటూ దీప నిమిర్పూ ముద్రలు కథని లాక్కొని దూరంలో ఉండిపోయి చుక్కాని లేని విస్మయ గదిని జత చేసి పెద్ద పగతో కలలని మూట చేసి .. ఆ నల్లని బిలం లోకే విసిరేస్తాయి..
Doctor ; దీనిని ఎలా ఖర్మ ఫలానికి మూడేసి అర్ధం చేసుకోవాలో నాకు అర్ధం కావడం లేదు.. నేనూ రక్తం లోనే ఓలలాడతాను.. కానీ అది రక్షించే క్రమంలో.. కానీ కొద్దీ రోజులుగా .. హాస్పిటల్లో పేషెంట్లు రావడం తగ్గి పోయింది.. దాదాపుగా మృత్యువుని చూడడం తగ్గిపోయింది.. ఇలాంటి స్థితిలో ఎందుకు మళ్ళీ ఆ గాయాన్ని రేపడం..
భాగ; సృష్టిలో అనేక మార్పులు జరుగుతున్నాయి.. ఒక మార్పుని తీసుకొచ్చే మహా ప్రయత్నమేదో.. నాకూ స్పష్టంగా తెలియదు.. కానీ అప్పటి వరకు .. ఈ మృత్యు స్పృహని మనం కాపాడుకోవాలి.. ఇది ఆంటీఎంత అవసరం..
డాక్టర్; నేను ఒప్పుకోనంటే … అది నా లోపలి అంగీకారంతో ఏ స్పర్ధలని మార్చుకోదు.. కొంచెం తెలిసీ అతనికి దగ్గరగా జరిగి నా కథని నేనెందుకు వినిపించలేదని .. ఒక ఆందోళన .. నేను ఖాళీల మధ్య నిజమైన వరాన్ని పోగుట్టుకొన్నాను.. అది వస్తున్నా రాకడ నా నుంచి గమనించలేనంత దూరం జరిగిపోయింది.. ఇప్పుడు హెచ్చరించి ఏం లాభం..
భాగ; నీ మెదడు నేను కంట్రోల్ చేసుకొని.. నీ కలలోకి ఆనాటి దృశ్య చిత్రాన్ని తోసి .. నా పని పూర్తి చేస్తాను.. నా కర్తవ్యం అదే.. ఇదెందుకో .. ఇప్పుడు నీకు తెలియక పోయినా .. అప్పుడు ఒప్పుకొంటావ్?
Doctor ; నేనొక డాక్టర్ అని తెల్సి ఇటువంటి సంభాషణ ఎలా చెయ్యగలుగు తున్నావ్? … నాకొక మర్మ భాషణ తెల్సు.. మృత్యువు వాలే ముందటి దేహం గురించి తెల్సు.. విశ్వ వీక్షణం లో వణికే చంద్ర దర్శనాలు తెల్సు.. నువ్వు నన్ను ఏమార్చ లేవు.
భాగా; విశ్వం కిందికి దిగి జోకొట్టినప్పుడు .. నాకంతా చీకటి కమ్మేస్తుంది.. ఇది నీ ప్రతిభకి సంబంధిన పరీక్ష కాదు.. ఇది ఒక అతీత సమానవ్యం .. అక్కడే రహస్య చిత్రాలన్నీ పుట్టి లయమయ్యేది. ఆ సంకల్పం పుట్టకకి ముందే నిర్ణయించబడింది .. అది నీ స్పృహలకి పైన జరిగే ఓ వేడుక .. ఓ శిక్ష స్థలి.. అదిమీ నిన్ను కాపాడదు. బియ్యాన్ని వడపోసి నీ రక్తం లో కలుపుతుంది.. అంతే..
Eka ; నేనిప్పుడే చిత్రగుప్తుడి ఆవాహన లో ఉన్నాను.. నాకంతా తెలుస్తూ ఉంది.. మృత్యువుని రాబోయే తరాలకి ఓ శాసనంలా అందించాలి.. లేదా ఇదంతా మారిపోయాక.. ఊహించని ఓ ప్రళయం భూమి పై సంభవిస్తుంది.. యముడు లేని ఈ సృష్టి బ్రహ్మాండాన్ని ఊహించలేం..
కానీ నాకు తెల్సు .. నీకు సృష్టి రహస్యాన్ని కొంచెంగా చెప్పారని.. కానీ నువ్వే మాకు చెప్పడం లేదు. ఇలాంటి మాటల వలన ఏం ప్రయోజనం .. ఏదో తరుముకొస్తుంది.. ఐనా ఈ మాటలే లేనప్పుడు నా నుంచి ఇంకేం కావాలి.. నేనెప్పుడూ సామాన్యంగానే .. నిన్ను దర్శించి నిద్రని వదులుకున్నాను.
ఏక ; ( నవ్వి) మృత్యువే లేనప్పుడు .. దేనిని కాపాడుకోవడానికి పరుగు పెట్టాలి..
Doctor ; ఇది కరెక్ట్ కాదు.. మీరెక్కడా చిత్రగుప్త.. ఇది అనవసరంగా .. ఓ సంక్లిష్ట దశని చేరుకొంటుంది.. అప్పుడిక చేతులు దాటిపోతుంది.. యముడిని తిరిగి నిలబెట్టగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది.
భాగ; అనినిర్మాణ నిర్మాణ క్రమం.. ఇది ఇలాగే ఉంది.. మరోలా ఉండటానికి ఆస్కారమే లేదు.. అది నీ మౌనమే చెబుతూ ఉంది..తిరిగి అదే కౌగిలితో నిరాజీవతని తీసేసి.. మాకు మీ దర్శనమివ్వండి..
మనం బాధని కలిసి పంచుకొందాం.. మీ నిస్సహాయత మాకర్థం అయిందిగా …
వెంటనే .. ఆకాశం లోంచి .. చిత్రగుప్తుడు మూళ్ళ తివాచీని కింద పెట్టుకొంటే.. యముడు రక్తసిక్తమై దానిపైన భాదకి అరుస్తూ వస్తూ ఉంటాడు. ఏడ్చినప్పుడు కదిలిన దీప కట్టడాలు.. పునాదులతో కదిలి .. కప్పుకున్న నిరూప ధ్వని మోగే సంకల్ప మాత్రతః అనిర్యయ ఉమ్మడి మృత్యు వాకిలి .. పగగా లేచిన గాలి అలల చిత్ర ధూప నిరాశలు మోగుతూ .. అక్కడే అందరూ అదే చివరని .. చూపుని నిగ్గదీసి .. అరగదీసుకున్న పుట్టుకలని దాటి .. ఆ పైకి చేరుకొని .. ఝాము ముంపులని నెట్టుకొంటూ .. దీర్ఘ కౌగిలి విసిరినా నిరాశని మీదకి తెచ్చుకొని జ్ఞాన విస్మయ మూర్తులతో .. దేహాలని పోల్చుకొని సిగ్గుపడతారు .. అంతా అక్కడనే ఆగిపోతుంది..కొన్ని వివరాల వెనక చిత్ర కల్వంలో నూరిన శ్వాసలు.. రంగుల జుత్తుని వాదులు చేసి పడవలుగా వదులుతుంది.
చివరకి ఆ స్పృహని తీసేయమని బతిమాలడం. భాగవతార్తో ఘర్షణ .. సృష్టి రహస్యాలని వాళ్ళేమీ బయటపెట్టరని చెప్పడం. మీ సమాధి స్థితుల లోంచి మృత్యువు ఆడుకొంటూ దీర్ఘ కాపలాల నిద్ర కూడికలని ఒప్పించి .. ఇంకా కాస్త చరణ నవ్వుని తాగే చోటు.. అక్కడంతా ముందు నుంచే ఉంది.. ఇక ముందూ ఉంటుంది.. అంతకంటే నిరాశని ఎవరూ దగ్గరకి తెచ్చుకోరు. కొంచెం ఊరట పడాలనుకొన్న ఎవరూ దగ్గరకి రారు.. చీకటి స్వయం మూటల బరువుని దించి.. శూన్య శిక్షిత ఆనవాళ్ళని ఎవరూ మార్చలేరు.
ప్రయోక్త ; ప్రళయ విస్మయ దండన .. ఊరుకోలేని విశ్వ చిత్రాల ఏరువాక .. మొలకెత్తే మృత్యువు.. బ్రహ్మ నిలయంయొలో కొత్త చోటుని అడిగిన నిర్దయ రాలి.. అంతెత్తుకు చేరి దూకుతున్న భయాల మధ్యనే పుట్టుక .. విసిగిన నవ్వు ఎర్రబడింది.. కొంచెం పొద్దు కలవరపడి అతనిని వెనక్కి పిల్చి.. అంతలోనే ఏమీ లేదులే అని నవ్వుతుంది.. నల్లని కళ్లలో పూర్తికాని నిద్ర .. సొరంగ తవ్వకాలని చేయి సమాధులని తిరిగి గాలితో నింపి వాటి కలలని వింటుంది.. ఏదీ ముందులా ఉండకూడదు.. మృత్యువూ వేరు సగం కానీ .. మట్టుబెట్టే దీర్ఘ రాశుల సమనవ్యయ నిద్ర శిఖరం లో ఒంటరిగా తప్పిపోయి .. అలిసిన దుఃఖ శిధిలాన్ని కౌగలించుకొంటుంది.. అదే అక్కడ ఆగిపోయేది.. ఇదొక ధ్వని ప్రయోగం లేని దీప స్మరణ .. అంతకంటే మరోలా ఉండలేని పెద్ద అగడ్త .. పెద్ద హోరుని మింగేసే జ్ఞాన నిద్రల మిగులు రాశులు..
………………….
ఆమె కి నివాళి అని ఓ ప్రోగ్రాం నిర్వహించడం…
ఓ పెద్ద దేహ సగం ఉన్న పేటిక ని వాళ్ళు మోసుకొస్తారు.. భాగవతార్ పేటికని తెరిచి చూసి .. ఒక్కసారిగా దుఃఖంలో మునిగి పోతాడు.. ఎవరికీ గొంతు లోంచి మాట పెగలదు.. ఇంత అన్యాయమా ? ఎవరనుకొని ఎవరికీ విధించిన శిక్ష .. అక్కడ జరుపుకున్న అక్కసుతో దూరమై .. కంటి ప్రోక్షణ లిఖితాలు ఓడిపోయినా సరే .. దారికి తెచ్చుకొన్న పాట.
Bhaga ; ఆమె ఏం చేసిందని ఈ శిక్ష .. నాకు ఎంత మాత్రమూ అర్ధం కావడం లేదు.. కొంచెం శరీర చిత్రాల కౌగిలి ముప్పుని కూల్చి .. రెండో అనునయత లేని కూర్పు. ఆమె ఒక మృత్యువుకి కారణమైంది..
కానీ కారణానికి కారకులెవరు ? ఆ యముడే కదా? పరిష్కర్త అతనేనా ? దేహ తీవ్రతలని తడిపి పోయిన సందేశం .. తీర్మాన చిత్రాలని కదిలిస్తూ .. ఊరికే ఆ మాటని సాయం అడుగుతుంది.. కొంచెం తీరిక చేసుకోవాలి.. ఎవరిని నిలదీయాలి..
చిత్రగుప్తుడు వస్తాడు.. ఆమె కాళ్ళకి నమస్కరించి.. గాల్లోంచి ఏదో సీసాని తీస్తాడు. ఆమె పై చల్లగానే .. మిగతా సగం శరీరం వచ్చేస్తుంది.. అతను ఏడుస్తాడు.. నేను నిన్ను కాపాడుకోలేక పోయాను..
డాక్టర్ పేటిక లోంచి.. : భయ వర్తన ముసుగులు లాలించే సమయం లోంచి నేను కదులుతున్నాను.. ఇంకేం చూడాలి.. ఇదంతా భూమి మీద చూసిందే.. ఇంతకంటే ఏమీ చూడలేనా ?
చిత్ర; అన్నీ సమాధులు .. పరిస్కారం కానీ ధర్మాలు.. అమానుషాలు.. వ్యతిరేక ముసుగులు దాడులే.. ఈ చూడాలనే తపనని వదిలి పెట్టు.. శరీరం ఎవరి గొంతులోని సత్తువా కాదు .. సత్యం మిగిలే ఉందా .. ఇగిరి పోయిందా ఎవరికీ తెలియదు.. తీవ్ర నిషేధంగా ఉండిపోయిన ఉనికిలో ఉమ్మడి శరీరాల వేడుక కదిలి లోపలనే మిగిలుతూ పరిధులు కొత్త ముద్రల వెంట అలసి .. పొగిలి ఉండిపోయిన జ్ఞాన దర్శన ఖాళీలతో కదిలే నిద్ర వాగుల కట్టడి..
Doctor ; ‘ నా వాళ్ళు కనిపిస్తారా? నా మొదటి ముద్దు ఇచ్చిన చోటు.. నా చేతిలో చనిపోయిన మా అమ్మమ్మ వండిన వంట గది.. మొదటి రహస్య స్థావరం లో మగ్గిన నా ప్రేమ కథ.. ఎర్రగా చూసిన మా మేనమావ పై కోపం తో చెంప మీద కొట్టినప్పుడు.. కందిని ఆ గది.. విశ్వ రాజీలు లేని ఉపేక్ష..తడబాటు..
Bhaga; ( అతను పెద్దగా నవ్వి ) అవి నీ స్పృహలో ఇప్పటికీ తాజాగానే ఉన్నాయిగా ? మళ్ళీ వాటికి కొత్త రంగులు వేసి .. పోలికలని మింగేయడమెందుకు? ఇక్కడ అంతా నీ వాళ్ళే..
ఇక్క డ నువ్వు శుశ్రూషలు చెయ్యాలి..
కానీ మీ కత్తులూ.. కఠారులు అవసరం లేదు.. అంతా నీ వాళ్ళే.. ఇక్కడా నువ్వు శుశ్రూషలు చెయ్యాలి.. కానీ మీ కత్తులూ.. కఠారులు అవసరం లేదు.. అన్నీ ద్రవ నిశ్చంతలు .. కదలికలు .. మూర్తి చిత్రాలు.. లోపలి రంగులు పాలిపోవడాలు..కొన్ని పురాతన జన్మ కారకాలు లోపల దిగబడి ఒద్దికగా ఏడుస్తూ మసకబారి కొత్త మాటలని దాటి .. అనుకరిస్తాయి.. చిట్లి పోతాయి.. తోడుకొంటాయి.. విసిగి వెంటపడతాయి….
ఇక్కడ పగిలిన వెదురు మోడు కూడా ఇక్కడ పాడు తుంది.. వర్షం కింద నుంచి పైకి వెళుతూ నిన్ను తనతో తీసుకు వెళ్ళుతుంది.. ఓ చినుకుని నీ వైద్యానికి కళ్ళలో దాచుకో.. అభయ సమృద్ధి ..కనబడని విషాద సంకల్పం లోని ఎత్తుగడ .. తీవ్ర నిషేధంగా ఉండిపోయిన ఉనికిలో ఉమ్మడి శరీరాల వేడుక కదిలి లోపలనే మిగిలుతూ
ఇదంతా కలిపి నీ లోపలి ఒక పాటని ఇచ్చి వెళ్లాను.. వీలైతే దగ్గరికి తీసుకో.. ఒక నిద్రని వడపోసి మీదకి దిమ్మరబోసాను.. వీలైతే హత్తుకో.. ఎవరికీ చెప్పడానికి మళ్ళీ కొత్తగా ఏదీ లేదు.. రాదూ.. కదలదు.
EPISODE 29;
ఆమె పాట పాడుతున్నప్పుడు జరిగినదని పాట వదిలేయడం.. బులెట్ ఉన్న గుండెని పట్టుకు తిరగడం.. ఆమె పాట దొరకక తన మొత్తం లైఫ్ కి అర్ధం దొరకక యుద్ధంలోకి వెళ్లిపోవాలనుకోవడం..
నల్ల తెరల గది.. అక్కడొక మనిషి వణికిపోతూ ఉంటాడు.. ఆమె అతని ఎదురుగా కూర్చొని..
ఇప్పుడు చెప్పు .. ఏం జరిగింది.. మా అక్క – భావ .. ఏళ్లయింది.. పెళ్ళై.. కానీ ఏదో సమస్య చెప్పారు.. ఎక్కువ పుట్టింట్లోనే.. ఆ రోజు బావ సంతోషంగా వచ్చాడు..అక్క కన్సర్ట్స్ కి వెళ్ళేది.. తనకి గజల్స్ ఇష్టమైన దానిని ఆదరించే వారు లేక సినిమా Musical నైట్స్ కి వెళ్ళేది. దానితోనే చాలీ చాలని సంపాదన .. భావ బలాదూర్ తిరుగుళ్ళు…అన్నీ చూసుకొంటూ ఇంకా తిట్లు తినేది.. అతని సరదాలకు డబ్బు ఇవ్వడం లేదని..
అతనికి గల్ఫ్ లో పెద్ద జీతం తో జాబ్ వచ్చిందని.. అక్కలో ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చింది.. అదే అక్కనడిగితే.. చాలా మందికి నేను ఆన్సర్ చెప్పలేకరా … అనింది. అర్థమవడానికి .. కాకపోవడానికి మధ్య తరపు చర్యలు .. చాలా చిత్రమైనవి.. కొన్ని మొదటిసారి తగిలినప్పుడు .. అనేక చర్యల మదేనే చతికిలబడ్డ నిద్ర దశనాల్లోంచి అక్క .. ఒక స్వయం సారాన్ని తాగే మెలుకువగా ఉంటూ .. ఒక కొత్త పాటలోని కదలికనే ఒడిసిపట్టి .. కలలని వింటుంది.. అదే అనుకోవడానికి ఎవరూ లేరు..
. అతను ఇంకో నెలలో వెళ్ళిపోవాలి.. మూడు .. నాలుగు రోజులు గడిచాక .. సింగల్ బెడ్ రూమ్ ఇంట్లోనే ఉండటం .. అననుకూల అనుకూలనాలు.. పెద్దయిన ముద్దలతో కీడు కమ్మిన చీకటి తిరగబడి.. ఇంచుమించు దేహ నిద్ర కాల్చిన విస్పర అవసానంలో పది తలకిందులవుతూ.. ఓర్పు పట్టలేని పెద్ద శత్రువుల గది.. అన్నీ కుదురుతున్నాయి .. అవసరం లేని ఖాళీలు మోసేసుకొని.. ఇరుక్కున్న చిత్ర జ్వరాల గుండంలో ఓర్పు పట్టిన సాపేక్ష రుతు ముప్పెనలు ఇత్తి పెట్టి .. కదిలే బొమ్మల్లా.. మధ్య తరగతి ఇరుకు గదుల భాషణ గుస గుసలు.. హోరెత్తి.. కదలికల్ని తిప్పి కొడుతూ .. వదిలేయమని దేహ ముద్రలు కదిలే కంటి దోషం.. ఇదంతా ఇలా వద్దులే..
ఏ రకంగా సరైందని కాదని.. నేనే టికెట్స్ బుక్ చేసి కాశ్మీర్ కి పంపించాను..
అక్క ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. భావ కి తెలియంది కాదు .. నీకు ఏది ఎప్పుడు చెయ్యాలో బాగా తెల్సురా .. అని మెచ్చుకొంది. ఒక గడ్డ కట్టిన సత్యపు ఒడ్డుని కదిలిస్తూ ,,. మసకేసిన ముందటి దోష గుణాలు చిలికించి.. అంతా దూరం లో ఉండి పోతారు. మీ అక్క అంత పట్టుగా ఉండకపోతే.. అలా తిరుబోతులానే ఉండిపోదునేమోనని.. అవన్నీ పాత మాటలు ..
భావా .. ఇప్పుడు నాకు అర్ధమవుతున్నావ్… మా అక్కకి ఇక మంచి రోజులు వచ్చినట్లే.. హాయిగా ఎంజాయ్ చేసిరండి.. ఇక అన్నీ సర్దుకొంటాయని నమ్ముతున్నాను. అదొక స్పష్టమైన ఆనందం .. మోతపడుతున్న ఇక్కట్లు .. ఒరిసిపోయిన పగటి ఒప్పుకోలు .. ఇలాగే ఉండిపోయిన చీకటి ఎడబాటు.. కౌగిలి ఏటో కూలిపోయిన నడకలు..
కౌగలించుకున్నాను.. ఇదే మొదటిసారి అతనిని కౌగిలించుకోవడం.. అలా అనిపించడం.. అక్క కళ్లలో నీటిపొర .. నాకో చిత్రమైన ఆనందం.. అక్క లోపలి వాకిలిని తీర్చుకొని.. వానలో నిండుగా తడుస్తూ .. తనకిష్టమైన డాన్స్ చెయ్యడం నాకు కనిపిస్తుంది..
నాకు ఇక ఉన్న ఒక్క అనుమానం పటాపంచలైంది.. ఇక నేను వీళ్ళ కోసం ఆలోచించనక్కర లేదని అర్ధమైంది..
కాశ్మీర్ చేరాక మొదటి రోజు.. రెండో రోజు ఫోన్ చేశారు.. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారని అర్ధమౌతూ ఉంది.. ఆ మర్నాడు పెహాల్గమ్ వెళ్తున్నామని చెప్పారు. పాట దొరకని మంత్రనాదమేదో నాలోపల నిండి.. కంటి సూత్రాన్ని లేవదీసి.. ఉన్నప్పటి మాటలని గుంజేసుకొని.. తెలియని సంతోషం.. అక్క ఏదో చెప్పబోయింది.. మల్లి అంతలోనే .. నవ్వేసి .. ఇప్పుడు కాదులేరా .. నేను అక్కడకి వచ్చాక అంది. నేనూ నవ్వి .. సరే అన్నాను.
………………………………
సరిగా 12 గంటలు కూడా కాకుండానే అదంతా మారి పోయింది.. ఆమెలో మాట పడిపోయింది.. రక్త ప్రతిమలా మారి.. తన ఒంటిపై చీర .. పైట ఉన్న స్పృహని కూడా పోగొట్టుకొంది.. అమంగళ అమ్మవారి పెనుకేకలా .. ఒదిగని నిరాశ .. చాలా పెద్ద బొట్టుని నుదిటిపై మోస్తూ .. వాళ్ళు మనలని బోర్డుర్ లో కాపాడే మిలిటరీ డ్రెస్సులో ఉన్నారు.. అది ఒక్క క్షణమే.. వాళ్ళు నోరు విప్పక అర్ధమైంది.. అది కేవలం ఓ ముసుగని.. వాళ్ళ వెంట పడుతూ రమ్మన్నారు. తను ఒప్పుకోలేదు.. వాళ్ళు అక్కడే చాటుకి తీసుకెళ్లారు.. తలపై బలంగా కొట్టారు.. తల పగిలింది.. స్పృహ తప్పింది. పలకర జ్వరాల నిద్ర గొలుసు తెగిపోయింది..అతికించనూ లేం.. పగల కోసం మీకేం తెలుసు.. ఎంత అణగ డొక్కలో అంతా అయ్యాక నేను ప్రదక్షిణ చెయ్త్రాలని దాటుకొంటాను.. కోత కోస్తాను..
జీర్ణ గతి సముదాయంలో మాటలు పట్టుకొన్న దేహ చలనం ఉడికిపోయే సంకల్ప ముద్రల ఎడబాటు. ఎట్లా ..ఇలా .. స్త్రీలో ఇంత భయానక పరివర్తన … తన గొంతుని కోసుకో బోయింది.. నేను చెయ్యి పెట్టి ఆపడంలో .. నా చెయ్యి చిన్నగా కోసుకుపోయింది.. తానే మళ్ళీ అల్లాడి పోయి .. పట్టు తప్పిన దేహ గ్రహణాన్ని మొదలుపెడుతుంది.
అదే అడిగితే తను పెద్ద హోరుతో ఏడ్చింది.. కాసిన్ని గ్రాముల చావుని ఇవ్వరా? అదొక్కటే.. నీ అక్కనైన పాపానికి.. అంతే ఇంకేం వద్దు.. ఈ గొంతుని నాతో ఉండనివ్వొద్దురా.. నేను పాడటం వల్లే .. వెళ్లిపోతున్నా వాళ్ళు కాస్త .. దూరంగా చెట్ల వెనక సేదతీరుతున్న మమ్మల్ని చూసారు.. మంతనాలు చేశారు..
కౌగిలిని విడదీసుకొని దోషులులా సిగ్గు పడుతుంటే.. ఒకడు నా లోపలికి చూస్తున్నాడు.. ఇంకొకడు.. తుపాకీ ఎక్కుపెట్టి బట్టలు ఇప్పమన్నాడు.. భావాన్ని.. పాపం అతను సిగ్గుతో ఇబ్బంది పడుతుంటే ఆ తుపాకీకి ఉన్న కత్తితో పొట్టలో చిన్నగా ఘాటు పెట్టాడు.. నువ్వు ఇప్పక పోతే .. నీ పెళ్ళాం ఇప్పాల్సి వస్తుందనగానే .. అతను చటుక్కున ఇప్పేసాడు.. కట్ డ్రాయర్ కూడా తీసాక వరుస బుల్లెట్స్ .. మర్మాంగం దగ్గర.. ఛాతీలోనూ దించారు.. మీ భావ చివరి చూపుని కూడా న వైపు తిప్పనివ్వలేదు.. నన్ను చంపేయమన్న .. డొక్కలో తన్ని దూరం గెంతాడు.. వెళ్లిపోయారు..
అక్క చెబుతూ చెబుతూనే .. ఇక నా పాట నాకొద్దు.. నా గొంతు కోసేసుకొంటాను.. నువ్వు తెల్లార్లు .. వినపడే చలన కీలని ఆర్పి… లోపలి రా …. ఈ సారి నేను కదిలే వేగం సరిపోలేదు.. ఆమె కోసుకొని .. నన్ను దాటి దూరం పరుగు పెట్టి కూలిపోయింది.. నా లోపలి నుంచి నేను తలతో వేరుపడి.. కిందికి డొల్లి అంత దూరంలో పడిపోయినట్లుగా అయిపోయింది.. నా చావు నాలో నాని.. అక్కని చూస్తున్నట్లుగా …
మరి లేవలేదు.
కానీ కాసేపటికే .. ఆమె దేహంలో అనేక మార్పులు.. ఎర్రగా మారింది.. ముఖం పొంగిపోయింది.. రక్తం దారాలు కడుతుంది.. గొంతులో ఏదో విషం ఆడుతున్నట్లు అల్లాడు తుంది.. ఆమె అక్కడ నుంచి లేపడం నా వల్ల కావడం లేదు.. ఎవరో హెచ్చరిస్తున్నారు.
ఆమె పాట పాడుతున్నప్పుడు జరిగినదని పాట వదిలేయడం.. ఎవరో హెచ్చరిస్తున్నారు. నెలలు అల్లానే .. మాటా మంతీ లేకుండా .. శరీరం .. నిద్రా వదిలేసి.. కాపలా .. పొరపాటు పడ్డ నీటి రంగుల ఎద్దడి .. పడి లేచిన కెరటాల చీకటిని అప్పగించిన కునుకు..
ఆమె మ్యూజిక్ ట్రూప్ వచ్చారు.. ఎవరో బలవంతం చేసి పిలవబోతే .. గొంతు కొరక బోయింది.. వాళ్ళు ఒక్క పరుగున వెళ్లిపోయారు. ఎవరు ఎవరికీ కాపలా .. లోపల నుంచి బయటకా ? బయట నుంచి లోపలికా? అర్ధం ఎలానూ కదలదు.. శరీరం మాటని జోడించదు. కథలు .. బొట్టుని సరిదిద్దావు.. అతను ముందులానే సాధించే వాడిలా ఉండుంటే .. తను మాకు దక్కేదేమో.. ఇప్పుడు ఏదీ లేదు.
తన వేళ్లతోనే భావ ఛాతీని చీలింది.. బులెట్ ఉన్న గుండెని పట్టుకొని పరుగులు పెట్టింది.. చివరకి కిందికి జారీ .. తలకి రాయి బలంగా తగిలి స్పృహ తప్పింది. అప్పుడిక ఆమెని కాళ్ళూ చేతులు కట్టేయాలని అనుకున్న.. ఆమె ఆ అవకాశం ఇవ్వక ముందే.. తన పాట వలననే భావ చనిపోయాడని .. గొంతు కోసుకొని ప్రాణం తీసుకొంది..
బులెట్ ఉన్న గుండెని పట్టుకు తిరగడం.. ఆమె పాట దొరకక తన మొత్తం లైఫ్ కి అర్ధం దొరకక గొంతు కోసుకోంది. అంతే తెలియని మసక బారిన మంతనాలు.. ఎక్కడా లేని మాటలని జత చేస్తూ వెంటపడి ఉండిపోయిన తలుపులు మూతపడిన వెంటనే గదిని .. పాటతో తడిచి పోతుంది. తెల్లార్లు ఒప్పుకొని మసకగా చీలిపోయిన అప్పగింతలు .. లోపాలు.. తన లోపల .. తక్కువలో పెంచేసుకున్న నిద్ర మోతాదులతో చిక్కబడ్డ ముసుగులు… తడబడే అడుగుల కలల హోరు….
Proyoktha : శేష భూమి కథన సూర్యుడు.. మళ్ళీ తప్పుకొన్న నిశ్శ్రేష మిత్రుడి దీప కల్వమ్.. ఇది ఇలాగే అందాలని కొత్త సొగసుని దాటించి .. చిత్ర జ్వరం కమ్మిన ఆయాస మునకలని ఓర్పుతో అప్పగించిన సాధ్య శిఖర నిర్యాణ ముహూర్తాల వెంటపడుతూ కథ కొంచెం అడ్డుచెప్పుకొంది..మార్పు మహా ప్రేమని అందుకుని స్వర్గ తుల్య మామోఘం.. ఉండీ లేని శాసన భూమి క్రియలని ఒప్పిస్తూ తడబాటు లేని చిత్రపూనికల వేరు భూమి.. కథలు దూరం జరుపుకున్న వినికిడి దర్పణాలు ..
పరాయి చలనాలు అప్పగించిన ముసుగులని తప్పిపోయిన నాజూకు మంతనాలతో క్రియా ఛాయల ఓర్పుతో కట్టుడు మెట్లు. ఎవరి పాపాలకి ఎవరు ఇలా మారిపోతారు.. కథన శ్రద్ధలు లేని వికర్ష దర్శన.. ముట్టడి.. అంతా క్షణాల్లో మారిపోతుంది.. ఒక పాట రక్త సిక్త మౌతుంది. ఏదీ సరిపెట్టుకోక నిండాలని వడపోసారు. కొంచెం అలవాటు కాక ముందే అంతా జరిగిపోతుంది.. గమనించుకోవాలన్న అంతే బిగించిన భయం. ఏదో వెంటాడి వెంటాడి .. దుఃఖం రేపి .. ప్రాణాన్ని తీసుకు పోతుంది.. అదే వర్తుల శిఖరం ఊడదీసిన నిద్ర చలనం..
EPISODE ;30
ఓ ఖైదీగా ఏకపాత్రాభినయుడు..
అతనిని ఓ కన్ఫెషన్ ఛాంబర్ లో ఉంచి ప్రశ్నలు సంధిస్తున్నారు.. చాలా వాటికి అతనేం మాట్లాడటం లేదు.. వికృతంగా నవ్వుతున్నాడు.. కొట్టి కొట్టి అలిసిపోయారు తప్ప .. అతనిలో ఏ మార్పూ లేదు.. చలన నిద్రాణత గడ్డ కట్టిన వికారం.. దేహం వాళ్ళకి ఏమీ ఖాదు.. వాళ్ళని స్వర్గానికి చేరవేసే ఓ మెట్టు.. ఆ గిలగిలలని చూడటం వాళ్ళకి ఆట.. పగబూనిన మాటలతో చుట్టేసిన నరాల బిగువు..
దేనికి ఇదంతా ఎందుకు అన్నప్పుడు మాత్రం .. దీని ఒక్క దానికే నా సమాధానమని.. వాడెంతో స్థిర గొంతుతో .. దేహ సందడి హఠాత్తుగా ముగిసిన మత్తుతో .. ఒరిసిపోయిన చీకటి దుమారాల కింద .. అలిసిన మాంస దర్పణంలా ముట్టడి ముసుగేసుకుని.. ఇరుక్కొన్న శరీరాల రాళ్ల మోత బొడ్డుకి చుట్టుకొని.. ముట్టడి.. పెద్దాడైన అలసట.. కనబడని దాడి.. ఊపిరి తెగ్గొట్టే అరుపు..
ఛస్తే .. స్వర్గ ప్రాప్తికి.. 21 మంది అందమైన కన్యలతో సేవలు అందుకోవడానికి.. ఒక వేళా బతికితే.. ఈ భూమి అంతా నాదే .. అన్నీ హక్కులు నావే.. అప్పుడూ ఈ భూమి నా స్వర్గం కట్టుకొంటాను.. కోరికలు తీర్చుకొని గొంతు కోసేయడానికి ఆడ పిల్లలు.. చేతి నిండా డబ్బు.. ఏది కావాలన్న లాక్కోవడమే… అడిగే పని లేదు.. ఎవడికి వాడే చక్రవర్తి.. నేను ఎవడికీ ఇక బానిసని కాదు…
అంతే రాబట్టారు.. బాడీ నిండా కరెంటు పాస్ చేసి.. హిప్నో వరల్డ్లోకి తీసుకు వెళ్ళినప్పుడు మాత్రం.. వాళ్ళు అందించే కఠిన మైన ట్రైనింగ్ గురించి చెప్పాడు.. చెబుతూ వికృతంగా వాడు నవ్వితే .. వాళ్లలో చావు ఎర్రగా కాగే చావు తిరుగుతుంది.. నల్లగా ముసుగు తీసేసి కుళ్ళి నడుస్తున్న శవంలా…
అది అంత్యంత పాశవికంగా .. కొంత మంది training లోనే సూసైడ్ చేసుకొంటారని.. అవ్వగానే risk assignment తో prove చేసుకోవాలని.. లేదా చీకటి గదిలో తిండీ .. నీళ్ళూ లేకుండా పడేసి.. పిచ్చివాళ్ళని చేసి.. అందరి ముందే గొంతు కోస్తారని.. కోసే ముందు భయంకరంగా బూతులు తిట్టి .. ఉమ్ములు ఓసి.. శరీరమంతా ముక్కలు చేసి ఆ..తర్వాతే గొంతు కోస్తారు. ఆ ఘటన అలా వెంటాడుతూనే ఉంటుంది…
అతనిని వాళ్ళమ్మ ట్రైనింగ్ పంపడానికి ఒప్పుకోకపోతే ..అతనెంతో చెప్పి చూసాడు.. అప్పటికే తనకి తెల్సిన వివరాలు చెప్పాడు.. తన ఆటలు.. తగువులు.. పరుగులు.. అప్పటికే జైలు వెళ్లి వచ్చిన ట్రాక్ రికార్డు.. చదువు అబ్బకు పోవడం.. ఇవన్నీ రహస్యంగా చూసే తనని సెలెక్ట్ చేశారని ఎంత కొడుకు చెప్పినా ఆ తల్లి ఒప్పుకోలేదు.. కాళ్ళ మీద పడి .. నీ బతుకు నువ్వు చూసుకో .. నన్ను వదిలెయ్యి అన్నా .. వినలేదు.
అతని ముందే ఆమె గొంతు కోసారు.. నాన్న అది దూరం నుంచే చూసి పారిపోయాడు.. ఒక మగాడిలో అంతటి పిరికితనం మొదటిసారి చూడటం..
తను ప్రేమించిన అమ్మాయికి ఏదీ దాచకుండా .. రహస్యంగా కలిసి చెప్పాడు.. ఆమె ఒప్పుకోలేదు.. వరసగా వారం రోజులు బతిమాలాడు .. ఆమె ఒప్పుకోలేదు.. తర్వాత ఆమె కి పెళ్లి ఫిక్స్ అయిపోయిందని తెలిసి . ఒకే.ఒక్క చివరిసారి కలుద్దామన్నాడు. ఆమె నేరుగా ఇంటికి వచ్చింది.. మళ్ళీ అదే మాట చెప్పింది.. ఎంతో నచ్చ చెప్పాడు .. వినలేదు.. మీ ఆడవాళ్ళంతా ఇంతేనా .. ఛస్తేగాని మాట వినరా? ఆమె కి ఎదో అర్ధమైంది.. వదిలేయమని కాళ్ళ మీద పడింది.. కావాలంటే ఒకసారికి నీతో పడుకొంటాను ఇప్పుడే.. నన్ను వదిలెయ్యి అంది… ఎంతో బతిమాలుకొంది.. వాడికి అవేవీ వినపడ లేదు.
నాటు కత్తితో గొంతు కోసాడు.. ఆ రక్తం తన ఒంటి మీద పులుముకొన్నాడు..ఆమె ఒంటిలో వేడి మిగిలే వరకు తన శరీర కోరిక తీర్చుకొన్నాడు.. శవాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. కనీసం ఓ దుప్పటి కూడా కప్పకుండా.. అలా నగ్నంగానే…రక్తపు మడుగులో వదిలేసి.. మొబైల్ లో వీలైనంత రికార్డు చేసి…ఆ వీడియోని చూపించాడు.. కోస్తున్నప్పుడు తనకి కలిగిన ఫీలింగుని చెప్పాడు .. వాళ్ళు అతనిని బలంగా నమ్మారు.
మొట్టమొదటిసారిగా అతనికి ఇదే తప్ప మరో దేనికి పనికి రానని .. ఇదే తన బతుకుతెరువని నమ్మాడు. తనకి పెళ్ళీ .. ప్రేమా .. కుటుంబం.. ఏదీ కలిసి రాలేదని .. ఇదొక్కటే దారని నమ్మి వాళ్ళ దగ్గరకి పరుగులు పెట్టాడు. ఎలా ఐనా .. ఎంత కష్టమైనా .. తానూ వాళ్ళలానే తయారు అవుతానిని గట్టిగా చెప్పాడు.. వాళ్లు నమ్మారు.
అలా క్యాంపులో పడ్డాడు.. ముందేవో బరువు పనులు .. మెసెంజర్ పనులూ చేయించేవారు. వంట చేయించే వారు.. చిన్న పిల్లలని ఎత్తుకు రమ్మనే వారు. ఏది దేనికని అడిగేవాడు కూడా కాదు. ఎంతసేపు వాళ్ళ ప్రాపకం సంపాదించడమే లక్ష్యంగా ఉండేవాడు.
దారుణమైన ట్రైనింగ్ మొదలైన.. అతనికి ఊరు గుర్తొచ్చేది.. అతనితో ట్రైనింగ్ లో ఓడిపోయినా వారిని అతనితో చంపించేవారు.. అన్నా … అని నిన్నటి వరకు పిలిచిన వాడిని ఆ రోజు కోయాల్సి వచ్చేది. కానీ ఆ చేతులు ఏ మాత్రం వణికేవి కావు.. అదొక దీక్షలా చేసేవాడు…ఎంత రిస్క్ పని చెయ్యాలన్న ముందు ఉండేవాడు. తనకి తను అవతలి వాడి కళ్ళలో రాక్షసుడిలా కనిపిస్తున్నానా .. లేదా అని చూసుకునేవాడు.
జంతువుల వేట.. పచ్చి మాంసం తినడం.. గొంతులు కోసి చంపే వీడియోస్ చూడటం.. వాళ్ళు అప్పటి వరకు చేసిన విద్వాంసాల లెక్కలు.. అన్నీ అతని నరాలని పురిక్కేంచేవి.. కోరిక కలిగిందా .. దగ్గరలో ఉన్న ఊరికి పోయి.. ఓ ఆడపిల్లని ఎత్తుకొచ్చి .. కోరిక తీర్చుకొని .. గొంతు కోసి అడివిలో పడేసి వెళ్లిపోవడం..
…………………………..
అతని దళ నాయకుడు పిలిచి .. పహాల్గమ్ గురించి చెప్పి.. ఎంతమంది ఉంటె అంత మంది.. మన జాతి కానీ అందరినీ .. జనమంతా చూస్తుండగా .. పట్టా పగలు.. వాళ్ళ కుటుంబం లోని వాళ్ళు చూస్తుండగా .. కిరాతకంగా .. జనరేషన్స్ గుర్తుపెట్టుకొనేలా గొంతులు కోసేయమన్నాడు. వెనకా ముందూ.. జాలి.. భయం ..ఒక రాతి మనుషుల్లా .. మన డిమాండ్ ని గొంతు పగిలేలా అరిచి ( వాళ్ళని అక్కడ అరవమని .. విని ఓకే చేసాడు) స్పష్టం చేయాలని.. మన దళం పేరు.. నా పేరు.. మన కోరిక అందరకి గుర్తుండాలని చెప్పాడు.
మొత్తం ఒక ఐదుగురు టీంగా వెళ్ళమన్నాడు. ముందు వెళ్లి రెక్కీ చేయమని.. మిలిటరీ ఫోర్స్ ఎక్కడ ఉంది.. ఏ గేటుప్లో వెళ్తే కరెక్ట్.. ఏ స్పాట్ ఐతే ఎక్కువ భయానక స్థితిని కలగ చేస్తుంది.. ఎక్కువ గొంతులు తెగుతాయి..ఆ తర్వాత ఎక్కడ నుంచి ఎస్కేప్ అవ్వవచ్చో చూసుకొని .. ప్లాన్ చేసి తనకి వివరించమన్నాడు.. అతను ఒక లోకల్ మీడియా ద్వారా .. ఈ న్యూస్ ఎప్పుడు రావాలో కూడా decide చేసాడు. అదెంత గట్టిగా వాళ్ళ డిమాండ్ని చెప్పాలో కూడా instructions మళ్ళీ ఇచ్చాడు.
వాళ్ళక్కడ రక రకాల getup లో మూడు రోజులు తిరిగారు.. ప్లేస్ .. టైం.. outfit నిర్ణయించుకొన్నారు .. మళ్ళీ మూడు రోజుల తర్వాత వాళ్ళ పేర్లూ.. రక్త ప్రవాహం.. కేకలు … మనుషుల ఏడుపులు.. పరుగులు.. భయాలు.. ఆగిన గుండెలు.. వేరుపడ్డ తలలు.. కోపాలు.. శాపాలు.. మిలిటరీ కళ్ళలో కసి.. పగ.. అన్ని అప్పుడే కనిపించాయి.. ఎంత తొందరగా ఈ పని చేస్తామా ? అని వాళ్లలో ఒక బలమైన ఉత్కంఠ …
నాయకుడు వాళ్ళ ఎస్కేప్ ప్లాన్ ఓ అంబులెన్సు లోకి .. ఆ తర్వాత ఓ మిల్క్ వన్ .. అక్కడ నుంచి.. బైక్స్ గా మార్చాడు. వాళ్ళు అక్కడ నుంచి ఓ సీక్రెట్ ప్లేసుకి వెళ్లి మూడు రోజులు స్టే చేసి.. పోలీస్ followup ఇక లేదనుకొన్నాక .. వాళ్ళ చోటికి రమ్మన్నాడు.. లీడర్ గా ఇతనినే ఎన్నిక చేసాడు..
……………………
అదొక భయానక దుశ్చర్య .. పగిలే గొంతు.. కనపడని వేడి.. హెచ్చరిక..మొత్తం ప్రపంచం ఉలిక్కిపడ్డ ఒక మహా ఘటన.. తూపాకీ గుల్ల వర్షం.. గొంతు కోసిన కత్తులు.. మెడలు తెగిపడ్డ చావు కేకలు.. పరుగులు.. కోలుకొని పిచ్చి కేకలు.. అదొక భయాన్ని మించిన ఆవరణ .. అంతా మారిపోయింది క్షణాల్లో.. చుట్టూ ఎవరూ దగ్గరకి రాలేదు.. ఆటో .. ఇటో.. తెలియని దేహ నీరులా పాలిపోయిన మగత .. ముఖలని మార్చిన కలగటంలో పెద్ద హోరులా తలరాత.. పగలగొట్టుకొంటున్న తలలు.. భరించలేని కళ్ళు.. ఇగిరిపోతున్న గొంతులు.. శ్వాసలు..
ఏ కంగారు లేకుండా.. ఫాంట్లు కూడా ఊదా దేశి.. జాతిని నిర్ణయించి.. ప్రార్థనలతో రుజువు చేసుకొని.. పక్కనే ఉన్న భర్యల .. తల్లుల .. పిల్లల కళ్ళలోకి చూస్తూ .. పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్స్ దింపి.. నల్ల నవ్వులు.. జిగురుతో చిక్కబడ్డ శ్వాసలతో గడ్డ కట్టి.. శరీర మొత్తం గడ్డకట్టిన అలసతలో .. ఆటో .. ఇటో.. తెలియని దేహ నీరులా పాలిపోయిన మగత .. ముఖలని మార్చిన కలగటంలో పెద్ద హోరులా తలరాత.. పగలగొట్టుకొంటున్న తలలు.. భరించలేని కళ్ళు.. ఇగిరిపోతున్న గొంతులు.. శ్వాసలు.. తడబాటు లేని ఒక మృత్యు నడక .. నల్ల రాక్షసుల మెడలోకి చేరుతున్న నరాల కోత.. ఇరుకుగా నిలబడుతున్న భయ రాజీల అంపకం.. ఆయుస్సు లేని పెళ్లి రాతలు.. కొన్ని రోజులు కూడా పూర్తి కానీ కొత్త జంటలు…
కొన్ని గుండెలు ఆగి.. శవాల పక్కనే స్పృహ తప్పి.. అసాధారణ మహా విలయం మూర్ఛనలు పోతూ… చలి గానుగల్లో గిర్రున తిరిగి నలిగినా తలలు.. ఒక మహా నిర్జన .. సామూహిక మరణ కాండ.. చీకటి వికార ద్రువాల్లో పొగిలిన శవాల గుట్టలు.. దానికో లెక్క లేదు.. నడక లేదు.. భయం లేదు.. వినడం లేదు.. కదిలి పోవడం లేదు.. నిదానంగా బుల్లెట్స్ దించుతూ…మీడియా చేరి .. అంబులెన్సుల సైరెన్లు.. గొంతులు చెమ్మ చెమటగా ముంచేసాక.. కోపం ఇగిరి పోయిన కళ్ళలో పోతూ మొదళ్ళయ్యాకా .. కసి ఎవరి మీదనో అర్ధం కాక .. మీడియా పలానా అని వివరాలు మొదలు పెట్టక.. రాజకీయం ఆక్టివ్ అవడం చూస్తున్నాక.. వాళ్ళు చాలా తీరుబాటుగా అక్కడ నుంచి వెళ్లారు.
ప్రయోక్త ; ఆధార సమ్మతంగా ఉండిపోయిన మృత్యు ధార.. కదిలే నిద్ర నీరులా పులపరింపు.. నల్లని కత్తి కోతలతో ఊరేగే దావానలం కమ్ముకున్న చిత్ర ధూళులే పెళ్ళగింపు .. వరస పెట్టి పేల్చినా దుఃఖ తాండవం.. ఆయాస మార్పులతో .. చిక్కబడ్డ శ్వాస .. రంగులు వెలిసిన నిద్ర పట్టులు వదులై.. స్వర్గం గురించిన మూఢ నమ్మకాలు.. ఆడ శరీరాలు.. రాల్చిన చెమటతో రక్త మరకల జిగురు.. సుఖం ..మొద్దుబారిన అంగాలకి కానుకలు.. మాంస ఊళలు.. దండన గురించిన యుద్ధ మొడులు.. ఇంగితం చనిపోయిన పొడి మూటల బరువులు.. కదలని కాళ్ళ కింద నలిగి పోయిన ఛాతీలు..
దేహాన్ని గురించిన పాశవిక వర్ణన .. కొలతలు.. కంతలు.. ఎత్తుపల్లాలు..దిశమొలలు.. వికారాలు.. ఉచ్చ గుంతలు.. పేలాపరపు నోటి బూతులు.. ఉమ్ము ఊసిన కౌగిళ్లు.. తెగిపడ్డ ముద్దలా ముద్దలా మాంసాలు.. కదలిక లేని ముందటి అడుగులు.. లోపలి నిద్రల కాట్లు.. ఓర్పు లేని నాశ ముఖాల ఎత్తుగడలు.. వెలపరాలని పాతిన మొండి చేతులు.. వాంతులు.. పోటెత్రినా నేరాలతో ఉబ్బిపోయిన మెదడులు.. కదలలేని ఉనికితో.. కేకలు ఆరిపోయిన కళ్ళు.. శ్వాస ఉందొ లేదో తెలియక తెగిపడ్డ చెవులు….
తన గతం గురించిన ఒక అసహ్యం తో కూడిన వెగటు … తల్లి గొంతు తెగి.. వాలిన తల వాడికి ఎప్పుడు గుర్తొచ్చిన నేనూ అదేగా చేస్తూన్న అనే మహా తృప్తి.. బూతులు.. కోపం.. ఒక్కసారిగా వైల్డ్ రియాక్షన్…మరిన్ని పేలుళ్ళు.. కోతలు.. కసి మోటు మెలికలు.. జుత్తు గుంజి విసిరేయడాలు.. ఇంకేం చెప్పడానికి లేనంతగా…
EPISODE ; 31
భగవతార్ .. ప్రయోక్త .. కలిపి చెప్పిన మహా సందర్స .. సంభాషణ
కొన్ని పదాలని/దృశ్యాలని/వార్తలని/వాస్తవాలని వడపోసి అందించే చోటులో చిక్కుకొన్న కొన్ని సత్యాల గింజులాటని ఓ కాపలాదారుడు పట్టుకొని .. వదులుతూ … తను మాత్రం సాయుజ్యం పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన లోపల నిద్ర దొంగిలించిన వాడిని పట్టుకోమని ఆదేశించడం..ఆ వెళ్లిన వాళ్ళు బుల్లెట్ తగిలి చనిపోయిన అరుపు.. కదలికలు పట్టి లాగే శ్వాస తమకాలపై .. సరిహద్దు ముగింపులేని యుద్ధ కాండలు.. నిర్జీవ శరీరాల గుట్టలు.. పోటు పెడుతున్న కళ్ళు.. నిద్ర నల్లబారిన కత్తుల పడక.. ఏ తప్పూ లేని చోట దబాయించిన శిక్షలు.. మోస్తున్న చావులు.. వాసన కమ్ముతున్న శవాలు… నొప్పి పగబట్టిన శిక్షా గృహాలు..
అదేగా…. Yamakhastam
కొన్నిస్వయం మృత్యువుల నిద్ర కాలుస్తూ … అనర్ధం జరిగిందని గిలగిలాకొట్టుకొన్న .. దేహదర్శనాలు జరిగే .. మంత్రాతమకాల వర్ణదశని నేను ఎర్రగా కాల్చి కలలోకి తప్పుకొంటాను. అప్పుడే ఏదో పుట్టుక జరుగుతుంది.. కన్ను నలుగు తుంది.. శ్వాస కాగుతుంది.. దేహం అర్ధమై ఏదో కావాలనే నిద్ర కావెడలో మృతు స్థలం కమ్మిన బరువు చెమ్మ చిక్కబడుతుంది.. అదే నాలో మారకుండా ఉండిపోయిన మృత్యు పొగ… కమ్మేసిన వివశ చావుల వాసన .. ఓ బాటని పట్టుకొంటాం. ఓ శత్రువుని కౌగలించుకొంటాం.. ఓ మట్టి ముఖాన్ని గుర్తు పట్టుకొంటాం..
ఇంకా అదే ముఖాన్ని ముద్రిస్తూ తలలోనే ఉంచిపోయిన రహస్య పొగగా … జ్ఞాపక చలన మూర్తులని అప్పగించిన తూర్పుశిఖరంలో వేలాడుతున్న శిక్షాశిల పాతిపెట్టిన పేజీలు … గర గర లాడుతూ చదువుతున్న కళ్ళు .. మంటలు తురిమిన నిద్ర పోటుతో .. ఇరుకైన నిద్ర సాగుతో మత్తు మూటలు తగలబడి .. గోడలు పట్టుకొని ఊరుతున్న మెళుకువలోని ఇమిడింపులు. చిక్కుకున్న చావు లెక్కలు .. పీడనలు.. ఓర్పు లేని జంట రుచులు.. తెగి రాలిన నాలుకలు.. బూతులు..
జేరగిలబెట్టిన కంటిసూత్రాలు … ఉనికికి వేరుచేసిన అలారపుసీసాలు .. పొర్లిన టేబుళ్లు.. మంచాలు.. తలగడ పీల్చిన ఏడుపులు.. ఎర్రబారిన అరికాళ్ళు.. సుడులు తిరిగిన దగ్గు.. వెన్ను నలత .. పాత కథని అప్పగించుకున్న మోతాదుల వినికిడి మత్తుతో నిండి ఊరిపోయింది ఏడుపు.. అంతా తేరిపారా చూడక ముందే.. కథలు ఊయించిన కదలిక సరి చేసి ఉంచుతూ… గతాల విరుద్ధ సిద్ధ స్థలంలో మంటని తాగి .. ఉనికి మొత్తం పరాయి మహా నిదర్శనాల ఒత్తిడి సర్దుబాటు తో కదులుతూ…
. మరిగించిన ఇంగిత హద్దులు ఒప్పుకోని ఓర్పుకి మోసుకొని తేడాగా ఉండిపోయిన మసక మాటల తొందరలోనే మంచు చల్లని ఆశీస్సు.. ఇదంతా నాకు చెప్పిన స్వయంకాలుడు.. అతనొక ప్రళయ దార్శనికుడు.. విశ్వ సమ్మోగం లో ఉండిపోయిన అనాధ. ఎడబాటు లేని శత్రువు.. కదిలే మానవ శత్రు కూపం లో కాలే విన్యాసం.. మృత్యు పరాయిగా ఉండిపోయిన పునాది.. ఊరిన ముద్దలా వినికిడి రాజీలు.. ఇంకేదో కావాలనే తీరికలేని దాటినా అభయ క్రీడల తీరిక లేని ఉపేక్ష ముడుల జ్వర గోళాలు..
నిద్ర ..తిండి ..శ్రమ ..ఆలోచన.. పని.. శ్రద్ధ … అన్నీసమస్యలే … అవీమోయలేనంతపెద్దవిగా .. ఇల్లు ఇలా మారుతూ .. తమక తొందర నిద్ర స్ఫురణల వేడుకని తట్టి లేపి .. ఉరిమిన సమయ మూర్తిని పైకి చేర్చి.. శరీర మంధన ముడుల బరువుని తెల్లార్లు అప్పగించిన తేలిక తనాల పీడనతో వెలిగి .. బూడిదై.. అంతా ఉంది.. అంతే ఉంది.. అనుకోకుండా ఉంది.. అడిగిన తర్వాత ఉంది.. అక్కసుతో చుట్టుకొని ఉంది.. అలసటతో పగిలి ఉంది.. అల్మారాలో దాక్కొని ఉంది.. అల్లుకొని .. నీలిగి.. నీరశించి .. కదిలి.. కాకూడని దీప ముంపులుగా ఉంది..
దీపం చనిపోయిన నిషాదముద్రలు కాపలా పెట్టుకొన్న మధ్యరాత్రి మూలల్లో కొంచెం మెదిలిన కన్నీరు.. నాదికాకపోవడమే తట్టుకోలేకపోతున్న…ఆపక్కాగా తను ఇప్పుడు లేడు.. నాకు రెండు .. మూడు వార్నింగ్లెటర్స్రావడం చూసి.. ఈప్రేమ తనకెరీర్కి ఓమెట్టుకాదని వదిలేసి వెళ్ళిపోయాడు. పురుషుడు అంతే .. తనది కానీ కంపరం నెత్తిన ఎత్తుకోడు.. కడుపుని మోయడు.. కొంచెం షప్ మారిందా మరో ఇల్లీగల్ జిగురు కేక .. అదే మగతనం.. తడబాటుని కనబడనివ్వడు.. వెసులుబాటు కల్పించుకొని మరో చోటుని వెదుక్కోవాలనే వాంఛా దాహం.. ఇంకిపోని శరీర గతుల ఉమ్మడి పోరు ఇది నమిలేస్తున్న నాభి ముద్రల కథని తాగి.. తూలీ.. వినబడే .. వినబడక .. జోడించి .. కదిలీ .. కదలక .. ఎండిపోయిన కంటి రాకని ముట్టడిస్తూ
ఏడవగలిగిన గుణమంతా కరిగిపోయింది … ఇకమిగిలింది.. నేననే ఓశూన్యసమాధి కలిపిన ధ్వనిమూర్తుల హోరు.. కదిలికలేని నానిట్టూర్పులోని ఇరుకు.. రక్తపు బురద .. కంటినిండుగా సంధించిన కౌగిలిమత్తుల ఊసట… ఒకబలమైన కరకు ముడుల ఒంటరి వీధిలో చనిపోయిన నిందలు.. మురికి గదుల్లో .. తెగి రాలిపడ్డ సంచార ముఖాలతో .. తేలిక కానీ నిద్ర ఖాళీల ముడి బిగువులతో.. ఒద్దిక లేని సంధి ముప్పులతో.. ఊడదీసుకున్న శ్వాస నాది ఆనవాళ్ళని కప్పి .. ఊరడించని ముప్పుతో కలబడే రంగు ముడుల బిగువుని .. వేడిగా గొంతులోకి దింపి.. ఉనికి మొత్తం నాకేసి నాలికని కోసి.. పిడులని పీల్చిన గోడలని జోడిస్తూ.. ఇంకిపోని శరీర గతుల ఉమ్మడి పోరు…
మన తప్పు కాని శిక్షల మద్యనే ఊరేగే ఐహిత జ్ఞానబిక్షకి చాపిన చేతుల నిండా రక్తమే.. ఎక్కడోతప్పిపోయిన విశ్వాస రాజీల దుఃఖమండలంలో గోష.. నిందలని కలిపిపెట్టుకొన్న మూలసూత్రాల కరకు ముడులు.. ఏది ఎటునుంచి కూలుతూ ఎదురు తగులుతుందో.. విపత్తుని కదిలించే మునకలు … వేలాడుతున్న మాంస సగాల ఊపిరి కదిలి ఒప్పుకోని శిలాశాసనాలు.. ఇవి చాలా బాధ పెడతాయి .. తట్టుకోలేక పిచ్చిగా మారతాయి.. నీరశించి మరో సమ్మతి లేని ఎండల్లో పడి తిరుగుతాయి.. అంతా గందర గోళం ఊడ్చిన ఎర్ర ముంపుల కేళడి …నిరా పూర్ణం.. విశ్వ సంఘర్ష .. పగిలిన ధ్వని చెరుగుల పిలుపు..
పట్టూ .. అదుపూ లేని బంధనాలు మధ్య తిరుగుతూ .. విశ్వ నిద్ర తూగులు.. పల్చని కొండల నడకని దాటించే .. వెగటు ముద్దలా ఆకలి మింగి.. సర్దుకోలేని రుద్దుడు మింగిన మోటు గట్టులు.. జిగురు దగ్గులు.. కేకలని తడిమిన సమయాల జంత్రంలో పడి తిరిగే నిద్ర కత్తుల పదును..
………………………
బంధన ఎంత గర గర లాడుతున్నా .. విశ్వం ఎంత వణికి .. భయం చెపుతున్న .. విసుగు ఎంత రాలి.. శ్వాసలో బరువెక్కుతున్న .. ఇది ఇలాగే ఉండిపోదని.. దుఃఖాన్ని లాక్కెళుతుంటే .. మధ్యలో హఠాత్తుగా ఈ దాడులు.. చెయ్యని తప్పుకి మృత్యుశిక్షలు రగులుతూ.. తడబడే ముఖాల మాయని తాగీ తాగి .. ఉండిపోని కలవర దర్శన షరతులు .. కదిలించిన దృష్టిని మూసి .. అంతలోనే తిరగబడే రంగు కలల కట్టడి ఓడిపోతూ
ఎప్పటికీ మూత పడనీయని జోడింపులు.. తలపోటులు.. రక్త జల్లింతాలు.. హెచ్చరికలు.. పక్కన ఉండగానే తుపాకీ దాడులు.. శరీర మూటలు.. బలి రంగు గోడలు.. మానసిక మొడులు.. కల బీడులో సమాధులు.. ఉడికిన నేరాలతో పగిలిన మెదడులు.. ఇంకిన చెమట లెక్కలు ..తెగ్గొట్టిన ముట్టడి ముఖాల ఎండ బీటలు..
నడుము విరిచిన కాళ్ళ తన్నులు.. పెద్ద అరుపుల కీడుని నంజుకొంటూ దీర్ఘ తిరుగుడు సమయాల చిత్ర గంభీర నులుముడు కాళ్ళ మెలికలు.. కొంచెం విప్పి చెప్పుకున్న హింస తడిచిన కొండల మధ్య ఊరేగే నిద్ర శూలాల పోరుని దాటి కదలికల్ని ఊరబెట్టిన దీపాల పంట ఎండిపోయి.. కూలిన అలసత చుట్టుకొని.. తన్మయ మరకల మృత్యువు పక్కనుంచి వెళ్ళిపోతుంది..
EPISODE ; 32
ప్రయోక్త ;
నిర్యాణ విపరీత పుట్టుకల అవస్థ ,, తిరగబడ్డ జ్ఞాత రేఖల పరిధిని దాటించి .. విశ్వ ముట్టడి ధ్వనించే సంకీర్ణ బరువుని తాగి.. తూలి.. ఓపిక పట్టిన దేహ వికాసాలు మళ్ళీ కుంచించుకుపోయి.. జన్మ రహస్యమిదేనని.. కదిలికలని జార్చిన ముద్రలతో కదిలే దేహ విరాగి పొద్దునే కలుపుతూ .. కదిలే రంగుల కుండలో అరచేతులని చదువుకొని.. నుదిటి గీతలని సరే చెయ్యక ముందే.. నాలుగు తలల బ్రహ్మ రాతని మరిచి .. శరీర నిర్ఘాంత ముహూర్త సమాధులు తిరగబడి.. పోగొట్టుకున్న నిద్ర విపులీత సంఘర్ష దాడి.. దానికి ఓ హద్దూ .. ఆపూ లేని దండయాత్ర.. ఉనికిని మింగేసే తడి రాతల కౌగిలి మసి చేసి .. దుఃఖ విపులీత సంధి తెగ్గొట్టి .. అటు పక్క కుప్పపోసిన నిద్ర పీడనలు.. పైకి చేరుకున్నాం. ఒడిని చీల్చుకొన్నాం .. తపనత దేహ దిమ్మరితనంతో అంతా గాలిస్తూనే ఉన్నాం.. అదే జరగాలి.. జరుగుతుంది.. జరిగే తీరుతుంది.
భూమి పై గవర్నమెంట్ తరుపు నుంచి ఒక మహా యుద్ధం జరిగింది.. చాలామంది తీవ్రవాదులని అంతం చేశారు.. రక రకాల పేరుల దాడులతో… భూమంతా దద్దరిల్లి పోయింది.. యముడుడికి చేతి నిండా .. రాత్రి పగలూ ఖాళీ లేని పని.. చిత్రగుప్తుడు .. వాళ్ళ జన్మ వివరాలు .. ఎక్కడికి పంపాలనే లోపు ..వాళ్లంతా .. అతనిని మభ్య పెట్టి… అతనిని మభ్య పెట్టి .. ఏమార్చి.. దాడి చేసి … కొన్ని దీనమైన మోసగింపు కథలని చెప్పి…అతనికి తెలుస్తున్న మోసాన్ని చూసే దైర్యం చేయలేక నమ్ముతూ తల యధాలాపనగా ఊపి.. చిత్రగుప్తుడు ఓ రకంగా నిస్సత్తుకి గురయ్యాడు.
అంతే ఊహించలేనంత వేగంగా తీవ్రవాద ఆత్మలన్నీ బ్రహ్మ లోకం చేరాయి… అవన్నీ .. అవన్నీ .. ఒక విశ్వ విశ్వాసాసలని అడ్డంగా నరికి .. తేరుకోలేని .. నిశ్వాస రాజీలని సరి చెయ్యలేక.. పొందీ ఊడగొట్టుకున్న మృత్యు కృతులని మార్చి అతికించుకొంటూ … తనకి తానుగా అన్ని సిద్దత లన్ని వక్రాంగా తిప్పుకుని.. అంతలోనే జాగ్రత్త పడి మోసగిస్తూ…చలన తీరులు.. అంటుకోతలు.. కత్తి పిడులు.. రక్త నిందలు.. అలుముకున్న నల్ల బాటలో ఊపిరికి దొరకని ఇరుకు..
వాళ్ళ ఆలోచనలు మాత్రం అలానే ఉన్నాయి.. చావు దేనిని మార్చలేదు.. అప్పటికీ మనమే జయించగలమనే మిడిసిపాటు.. దైర్యం.. తెగువ.. లెక్కచేయలేని తనం లో ఏ మార్పూ లేదు. చావుతోనూ ఏదీ పోదనీ .. కసి.. కోపం.. వాంచ.. వాంతీ.. కట్టుడు తనాల చావు మూటలు గింజుకొంటూ అన్ని ఒక వ్యతిరేకం లోని పిడుగు దెబ్బలు.
వాళ్లలో వాళ్ళకి రహస్య సమావేశం జరిగింది.. పూర్తి అహంకారం నిండిన వాతావరణం లో.. విశ్వ సమన్వాయలని పక్క దారి పట్టిస్తూ .. ఇలానూ చేయడానికి పక్క దారిలో …ప్రతి సృష్టి క్రియల దుర్మార్గం .. ఉందీ .. లేదూ.. కదలదు.. ఊగీ ఆ లోపలి దూకి .. భయానికి .. నరకానికి రెండో చర్యని అతికించి.. మిగిలి పోయి.. ఒక రహాయస నిందలా గుట్టని మీదకి ఒంపి.. దేహ తర్జుమాల నుదిటి మూర్తులని ఏ మార్చి తగల బెడుతూ …
రాతలు ఎక్కడనించి రాస్తారో అక్కడికే వెళ్లి .. వచ్చేసిన తమవి.. కింద ఇంకా యుద్ధం చేస్తున్న వాళ్ళవి .. మార్చేసి పునః జన్మ .. మరో పక్క మృత్యువు ( కింద పోరాడుతున్న వాళ్లకి ) లేకుండానూ చేయాలనుకొన్నారు. ఎలా చెయ్యాలి .. ఎం చెయ్యలేడు ముందు ప్రాసెస్ observe చేయాలనుకొన్నారు.. సృష్టి మొదలైన దగ్గర నుంచి ఈ రకమైన వ్యతిరేకమైన ఆలోచనలు ఎవరూ ఊహించినది కాదు.. ఒక కనిపించని భయం తలపడుతూ.. కదలిక లేని ఒక స్పర్ధ ముద్ర పాకిపోతూ.. పల్చగా మారి బెంగ పెట్టుకొన్న నిద్ర చెలరేగుతూ.. ఎం జరుగుతుందో అర్ధం కాక .. అన్ని మహా శక్తులు నిస్చహాల మూర్తులుగా చూస్తూ
సరస్వతి.ఆమె .బంధువు లక్ష్మి తో కలిసి మరునాడు భూమికి యుద్ధ క్షామం అడ్రస్ చెయ్యడానికి వెళ్తుందని తెల్సి. సామాన్యుల ఆవాస స్థితులని చూసి చాలించి పోయి.. ఏ మాత్రం నిమిత్తం లేకుండా .. తన ఇల్లు దోచుకోబడి… కూలిపోయి.. నిర్ధయవసరాలు సరైన ధరకి దొరకక.. రోజూ సరిపడే పని దొరకక నీళ్ళతా సరిపెట్టుకొంటూ.. ఖాళీ జేబులతో రోగాలని మురగబెట్టుకొంటూ…పూజలని వదలక..
.ఆమె చేతిలోని ఓ కలువపువ్వుని దొంగిలించారు ( వాళ్ళకి ఇంకా శిక్ష అమలు కాలేదు కాబట్టి శరీర సత్తువులు అలానే ఉన్నాయి ) బ్రహ్మని స్టడీ చెయ్యడం మొదలు పెట్టారు.. ఆ కలువపువ్వు నుంచి వచ్చే పరిమళం పీలుస్తూ.. అతను తన గంటం తో నుదిటి రాతని రాస్తాడు..
లక్ష్మి ఆ కలువపువ్వుని ఇచ్చి వెల్దామంటే అది కనిపించలేదు.. అదే మొదటిసారి అలా జరగటం .. ఇలా కూడా జరుగుతుందని ఆమె ఎప్పుడు అనుకోలేదు.చాలా చోట్ల వెదికింది.. గుర్తు చేసుకొంది.. జరగడానికి అవకాశం లేదుగా అని తల కొట్టుకొంది… ఆమెకేదో కీడు శంకిస్తూ ఉంది.. ఏదో భయమూ ముసురు కొంది.. బ్రహ్మతో అంటే .. అతను ఎప్పటిలానే నవ్వి.. నువ్వు వెళ్ళు .. నేను చూసుకొంటాలే .. అన్నాడు.
బ్రహ్మ మరో పువ్వుని సృష్టించి ఆమె చేతిలో పెట్టాడు.. అదేంత పని అన్నట్లు .. స్థితిని తేలిక చేసి.. అరుదైన నవ్వుని ఆమెకి కానుక చేసాడు.. ఆమె ఒకప్పటి రోజులు గుర్తొచ్చి నవ్వుకొంది.. ఆమెని అతను ఇష్టంగా చూసాడు.
ఆమె అతని గుండెలపై దానితో రాసి .. నవ్వి.. అతనికి ఆ పరిమళం అందేటట్లు పెట్టి వెళ్లి పోయింది.. అది యుగాలపాటు వాడిపోక శాశ్వతంగా నిలిచే మహా పరిమళం..వెనక .. మూడూ .. లేని అనాథ మూర్తుల కలివిడి ముద్ర.. ఆకర్ష వికర్షలకి అతీతమై.. మొత్తంగా అప్ర్పించుకునే సందర్శ నిద్ర పాయల వెలుగు
ఎంత తాను సృష్టించినా భార్య చేయి తాగాలందే .. దానికి ఏ గుణమూ అబ్బదని తెలుసు. ఆ మాట ఆమెకి ఆనందం… ఆ మాటని ఒప్పుకోవడం లో బ్రహ్మ ఎప్పుడూ ఆనంద పారవశ్యం లో చెబుతాడు.. ఆమె విన్నదే ఐనా ఎపుడూ కొత్తగా విన్నట్లే మురిపోతుంది..
వాళ్ళు ఆ కలువ పువ్వుతో.. ఓ అద్దం పై కొట్టి .. అతనిని కలలోకి లాకెళ్లి ( వాళ్ళ పరిశీలనలో అక్కడున్న శాసనం చదివి తెలుసుకొన్నారు. దానికి ఉండే మహా ప్రయోజనం వేరు.. వాళ్ళు దానిని తప్పుడు ప్రయోజనానికి వాడుకొన్నారు. ) ఓ గాజు పేటిక లో బంధించి .. ఏ మాత్రమూ తనుకూ బెరుకూ లేకుండా. బ్రహ్మ తన ఆశ్చర్యం లోంచి బయటపడే లోపు.. ఊహించని ఈ దాడి జరిగిపోయింది. అక్కడే బంధించి.. ఆమె ని అలా చేస్తామని బెదిరించి.. తమ రాత ఆ గంటం తో అద్దం ముందు నిలబడి కొంతమందివి మార్చి .. యముడు వస్తున్నాడని తెలిసి వెళ్లిపోయారు.
యముడు చావులెందుకు ఆగిపోయాయని అడగడానికి బ్రహ్మ దగ్గరకి రాగానే .. బ్రహ్మ కనిపించని బ్రహ్మ లోకంలో.. ఓ వెలుగూ .. పరిమళం.. కాంతీ.. ఒక అనుకూలత తప్పిన స్పృహ.. అతనికి ఎదో అర్ధమౌతూ ఉంది.. కానీ అతను ఒప్పుకోలేక పోతున్నాడు. అలా ఎందుకు జరుగుతుందని.. పిలుస్తూ సరిపెట్టుకోవాలని చూస్తున్నాడు.
విషయం తెల్సి .. అక్కడున్న అద్దానికి తన యమపాశం తగిలించగానే .. అతనికి అక్కడ జరిగిన అన్ని విషయాలు అర్ధమైపోయాయి.. అక్కడున్న అద్దానికి తన యమపాశం తగిలించగానే .. అతనికి అక్కడ జరిగిన అన్ని విషయాలు అర్ధమైపోయాయి.. అదురుపాటుని.. అలజడిని..రేపాక .. అనుకోని ఛాతీ కంపనని పట్టుకొంటూ .. వెతుకుతున్నాడు. బ్రహ్మ ని ఓ గాజు పేటిక లో చూడటం అతను ఏ రోజూ ఊహించిందే కాదు.
వాళ్ళు వెళ్లే వరకు చాటున దాక్కొని.. తన యమపాశంతో అతనిని అతి కష్టం మీద కలలోంచి విడిపించాడు.. అప్పటికే కొందరు తీవ్రవాదులు మారిన తమ జాతకాలతో భూమిని చేరిపోయారు. విలయం పై విలయం సృష్టిస్తూనే ఉన్నారు.. ప్రకృతికి విరుద్దంగా ఆ జ్ఞాన స్పృహ అలాగే ఉండిపోయింది. అది భూమికి ఎంత ప్రమాదమైనా .. వాళ్ళకి ఆ భయం లేదు. యముడు అది తెల్సుకొని .. ఒక రకమైన శూన్యా స్థితి గురై.. అంతలోనే .. తనని ఎవరో ఓ కొండని విసిరి డేమేస్తున్నట్లు అల్లాడి పోయాడు.
బ్రహ్మ ని చూసి యముడు స్పృహలోకి తెచ్చినా.. అతని నుదిటిపై జరిగిన దాడికి .. అతను పూర్తిగా కోలుకోలేక పోయాడు. అతనికి కలలూ .. వాస్తవాలు.. స్పృహలూ.. దాడులూ.. పరిమళాలు.. సరస్వతి.. నుదిటి రాతలూ .. ఏదీ గుర్తుకు రావడం లేదు.. అసలు యముడి మాటే అతనిని చేరడం లేదు..
యముడికి అర్థమైనా .. అతనిని సరి చెయ్యడం ఇప్పటి కిప్పుడు.. జరిగేదికాదు.. ఈ లోపు భూమి పై జరిగే నష్టాలు.. స్త్రీలపై దాడులు.. ప్రాణ నష్టాలు.. విళయాలు.. ఊడ్చిపెట్టుకొని పోయే సంపదలు.. ప్రకృతి నష్టాలు.. అతని కాళ్ళ ముందు తిరిగి అల్లాడిపోయాడు.. తానె ఏదోకటి చేసి కాపాడాలనుకొన్నాడు.
తానే అన్ని అయ్యి ఏదో ఒకరకంగా మృతువుతో సరిచెయ్యాలనుకొని.. నుదిటి రాతల్ని మొత్తంగా తుడిచేసి.. చావుపై రాతతో నిమిత్తము లేకుండా తన యమపాశపు వశం లోకి తీసుకొని .. భూమికి బయలు దేరాడు.. లోపల అతనికి లక్ష్మీ .. సరస్వతుల భయమూ ఉంది. అలా ఆ ఆందోళనలన్నీ మోస్తూనే .. కృంగిపోయి.. అలిసిపోయి.. భూమి కి బయలుదేరాడు. బయలుదేరే ముందు..
కానీ వెళ్లే ముందు తాను తిరిగి వచ్చే వరకు.. బ్రహ్మని ఎలా కాపాడుకోవాలని తీవ్రంగా అలోచించి.. ఎటూ తేల్చుకోలేని స్థితి.. అంతా గడ్డకట్టిన మంత్ర స్థావరాలు.. నిర్వీర్యం చేసే శక్తులు.. తనని కాపాడుకోవడానికి ,. బ్రహ్మని ఎలా అనే ఆందోళన.. ఒక దాని మీద ఒకటి.. చిత్రగుప్తుడిని పిలవాలని చూసాడు కానీ సాధ్యం కాలేదు. ఓ పక్క భూమి పై అనర్ధాల స్థాయి పెరిగిపోతూ ఉంది.. మరో వేపు.. బ్రహ్మ ని అలా వదిలి వెళ్లడం ఇష్టమూ లేదు. అంతే వేగంగా చర్యలు చేస్తూ… సరైనదా .. కాదా అని తేల్చుకోలేక…
అతనికి అప్పుడే నల్లని బిళం లోంచి సందేశం వినిపించింది..అవ్యక్త దేహ చింతన .. వినాశనం పట్ల ఉలిక్కిపాటు.. కాపాడుకోవాలనే తపన.. ధర్మ రాజా నువ్వు సార్ధక నామధేయుడివే.. నీకిక అనుకున్నది జరగకుండా ఆపడం ఎవరి వల్లా కాదు.
ఆ తర్వాత ఏ చప్పుడూ లేదు.. ఆందోళనతో తిరుగుతూనే ఉన్నాడు.
..అంతలోనే భూమి నుంచి చిత్రగుప్తుడు .. ఓ నల్ల సంచీలో .. భూమిపై తమకంటూ ఓ సంతృప్తి తో బతికి చనిపోయిన కొన్ని స్పందనాత్మక ఆత్మలని వేసి పంపించాడు. యముడు ముఖం ఒక్కసారిగా వెలిగి పోయింది.. చిత్రగుప్తుడు ఆలోచన అర్ధమైంది.. శూన్యంలోకి అరిచి శక్తి ఆవాహన చేసి.. అదొక ఉజ్వల కాంతి దారగా వస్తే దానిని .. ఆ నల్ల సంచీలోకి ప్రవేశపెట్టాడు.. ఆ సంచీని .. పేటికకి తాడుతో కట్టాడు..
వాటిని తాత్కాలిక రక్షా కవచంగా మార్చి .. బ్రహ్మకి కాపలాగానూ.. ఆయనకి స్పృహ వచ్చాక .. అతని నుదిటిని సరిచేసే క్రమంలో సహాయానికి నియమించాడు..
ప్రయోక్త ; సిద్ద సంపద కదలాడే దేహ నీరులా వరం.. క్షమా రహిత మహా ధారలా భూమి ముఖాన్ని మార్చేసి చేసే విలయ తాండవం.. సృష్టికి ఎం చెయ్యాలో తెలియని అయోమయం.. నుదిటి భోగాలు అర్ధం కాక తల కిందుల తపస్సు చేసే అనర్ధ విపరీతాల కల్లోలం.. కనబడని ఆధారాలు.. మోసగింపులు.. ఒత్తిడులు.. కల్లోల మూర్తులని జాడించే దుష్ట నీతులు.. పై ముసుగులు.. ఇక్కట్లు.. ఉనికి లేని అపరిమిత మృత్యు కందకాలు..
ఏది ఎటు నుంచి ఆగుతుందో తెలియని అసంతృప్త కన్నీరులా బలహీన భయం.. పోటెత్తిన మాటల మధ్య ఇంకా అర్ధం కానీ కుట్రలు.. ఇరుక్కుపోతున్న సరిరాత తడుము కోతలు.. విసుగులు.. దీపా కందకాల కుట్రలు.. ఇంగిత మూర్తులుగా లేని క్షోభాలూ.. ఎత్తుగడలోఉండిపోయిన చావులు.. తెగిన భూమి పై రక్త మడుగులు.. చేత నిర్వీర్యం లోని పుంసక ఓడిపోతలు .. కలకాలు.. మొండిగా మీద పడే సగం చావుల పల్లకీలు..
భయమనే ఆయుధం కట్టిన చీకటి విలయ దండనలో ఆగక ఎగిరిపడే సమాధులు.. మాంస మోడులు ..వాసన గోతులు.. ఇది ఇలాగే తెలియాలని లేని ఉపేక్షలు.. విపరీతాలు.. కక్క్షలు .. దీర్ఘ దాడులు.. మోసాలు కత్తి పదునులు.. మండుతున్న విశ్వ మూర్చనల ప్రళయ దాహాలు..
EPISODE ;33
Prayoktha ; ఏదీ అకస్మాత్తుగా .. మన నుంచి జారిపోదు.. ముందు సౌజ్ఞ చేసే ఉంటుంది.. పలకరింపుగా తడబడదు. తెలిసినట్లే ఉంటుంది.. ఏదీ తెలియలేదని అర్ధమౌతుంది. యుగాల చూస్తూ పరిభ్రమించే ఈ కందకాల నీరుకి దాహ నిద్రల గురించి తెల్సే ఉన్న బయటపడదు.. ఎదో కోరుకొంటుంది.. ఇదే అని నిర్ణయించలేం.. మాటని వెనక్కి తీసుకోలేం.. ఇది భయం వడపోసిన దేహ సముద్రాల విలోల బంధన .. కనబడని వికార చీకటిలో శూన్య మాయల విపరీత కథనాలు.
మృతు సాంద్రతలు గడ్డకట్టే నిద్ర జాగారాల మధ్యనే .. నేనుగా పోగొట్టుకొన్న విశ్వసగం లో చిప్పిల్లిన మృత్యు పాత్ర.. దేహం కరిగిపోయిన కదిలికలని దాచుకొని .. ఒప్పించలేని మహా కక్షల యుద్ధభేరి..శత్రువు లోపలి ఊపిరి మంచుని నమిలేస్తూ …
స్టేజి మొత్తం నల్ల తెరలు.. రక్తం తో వేలాడుతున్న బట్టలు.. రక్తపు అంగీ వాడి స్నానం.. గజల్ సింగర్ సమాధి లోంచి కేకలు.. పొడిబారిన కళ్ళతో డాక్టర్.. మరో పక్క అన్ని పాత్రలు.. ఒక్కకొక్కరికి యముడు పాద నమస్కారాలు చేస్తున్నాడు..
యముడు ; తనని తాను కాపాడుకోలేని బ్రహ్మ వలన తీవ్ర నష్టం .. అన్ని మహా లోకాలికి జరుగుతుంది.. ఎలా దీనిని సరిచెయ్యాలో నాకూ తెలియదు.. నాకు తెలిసిందల్లా ఈ మృత్యువుల జోడింపు మాత్రమే.. అలా అని నేను చూస్తూ ఉండలేను.
అంతా అంతమై పోతుందేమో… బ్రహ్మ లోకమూ నిర్వీర్యమై పోయింది..
కాపాడుకోవడానికి ఒకటే దారి.. అదీ మీరు ఒప్పుకొంటేనే .. లేకపోతే ఇది సాధ్యం కాదు.. ఊహిండానికి కూడా వీలు కాదు. మీ పై నా సర్వ హక్కులు నావి కావు.. చనిపోయారుగాని మీ ఆత్మల శక్తి అనంతం.. వాటి ముందు ఏదీ నిలబడ లేదు.. కానీ ఈ సమీకరణకు .. మీ అంగీకారం ఎంతో అవసరం. ఆకలి.. అవసరాల యుద్ధం.. దురాశ.. రేపటి భయం .. కాపాడుకోలేని వాళ్ళ నిరాశ అవన్నీ అలాగే పచ్చిగా ఉన్నాయంటే .. ఈ ఇద్దరిని ఎక్కడ వెదికి పట్టుకోవాలి..
డాక్టర్; అసలు మీ చిత్రగుప్తుడిక్కడ?
యముడు; అతను అవసరమైనప్పుడు కొన్ని సహాయాలు చేస్తున్నాడు తప్ప .. ఎక్కడ ఉన్నాడో నాకూ తెలియడం లేదు.. తానూ సమాచారం పంపడం లేదు. ఇలా ఎప్పుడు తను చెయ్యలేదు.. ఏ నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడో తెలియడం లేదు.
డాక్టర్ ; మీ తివాచీ ఉందిగా ?
యముడు; అదీ అతనే కాపాడుతూ వస్తున్నాడు.. దాని వెన్ను ఎప్పుడో విరిగి పోయింది.. అతను కింది నుంచి ఆధారం ఇవ్వక పోతే అది ఏ ప్రభావమూ చూపించదు.
డాక్టర్ ; సరస్వతి.. లక్ష్మి .. స్త్రీ శక్తులు .. అనంతం వరకూ కాదా?
యముడు; సరస్వతి .. లక్షముల ఆచూకీ దొరకడం లేదు.. క్షామము ఇంతలా చుట్టుముట్టేస్తున్నప్పుడు .. వాళ్ళు చేరుకొని .. పని మొదలు పెట్టి ఉంటే .. ఎక్కడో ఓ చోట వాళ్ళ ప్రభావం కనిపించాలిగా ..
ఎటు నుంచి ఏ కొంచెం మంచీ జరగడానికి ఏమీ మిగల లేదు.. అంతా బూడిదే.. శవాల కుప్పలు .. ఇప్పుడిక ఏం చెయ్యాలన్న .. ఒకటే మిగిలింది.. ఇప్పటి వరకు.. నేను మీకు బ్రహ్మ గురించి చెప్పలేదు. యోగ్య ఆత్మలన్నీ తనతో ఉంచుకొని.. వాళ్ళకి మల్లి నుదిటి రాధని రాసి భూమికి పంపించే ఆయన… ఈ రోజు ఏమాత్రం ఉనికి లేని స్థితిలో ఉన్నాడు.. అతనిని కాపాడాలనేది ఎంత వరకు సాధ్యమో నాకు తెలియదు.
Proyoktha ; మరిప్పుడేం చేయాలి?
ఏక పాత్రాబినయుడు ; పోనీ నేనే ఆ బ్రహ్మ గా మారి పోనా ? నాకా వరం ఉంది..
యముడు ; ఇద్దరు బ్రహ్మలా ? అది అసాధ్యం. మహా లోకాల గందరగోళం మనం ఊహించలేం.
భాగవతార్ ; నువ్వు దేనికో సందేహిస్తున్నావ్ .. అనిపిస్తుంది. నీకు మా నుంచి ఏం కావాలో స్పష్టంగా చెప్పు.. మేము కోల్పవడానికి ఏం మిగిలిందని ? చచ్చిన వాళ్ళం.. .. సృష్టి దేనిని అనుసరించి నడుస్తుందో … దేనిని తట్టుకొని.. ఒక మంచికి సహరాగా నిలుస్తుందో నాకెప్పటికీ అర్ధం కాలేదు.. ఏది దేనిని నియంత్రిస్తుందో నాకు ఎంత మాత్రమూ అర్ధం కాలేదు.. ఏ సమ న్యాయమూ కనిపించలేదు.. ఉడికిపోతున్న దేహ శక్తుల తీరు మార్చుకోక మోసే ఈ ఆందోళన తిప్పి రాసి .. ఆ యుగ ముగింపులో ఓలలాడే అతీత గమనపు విశ్రాంతి ఎక్కడ?
ఎక్కడో శూన్యంలోంచి చిత్రగుప్తుడు హృదయ విదారకమైన అరుపు.. ఏడుపు..
ధర్మరాజా నన్ను క్షమించండి.. మీరు తల్చుకొన్నప్పుడు నేను రాలేకపోయాను..
సరస్వతి.. లక్షములని రక్షించే పనిలో ఉన్నాను. ఇది ఎంతవరకు నాతో సాధ్యమయ్యేదో నాకు తెలియడం లేదు.. విశ్వం మొత్తం నాపైకి కూలిపోక ముందే .. నేనా ఇద్దరి స్త్రీ మూర్తులని కాపాడుకొని .. సృష్టి క్రమాన్ని పరిరక్షించుకోవాలి. లేకపోతే జరగబోయే నష్టం ఊహించలేం.. కానీ ఓ భయమూ నాలోపల ఓడిపోతానేమోననై..
యముడు; నువ్వు అపార బ్రహ్మ కి మరో రూపానివి.. నీకు అసాధ్యం లేదు..
చిత్రగుప్తుడు; ఇది ఎంతవరకు నాతో సాధ్యమయ్యేదో నాకు తెలియడం లేదు.. విశ్వం మొత్తం నాపైకి కూలిపోక ముందే .. నేనా ఇద్దరి స్త్రీ మూర్తులని కాపాడుకొని .. సృష్టి క్రమాన్ని పరిరక్షించుకోవాలి. లేకపోతే జరగబోయే నష్టం ఊహించలేం.. కానీ ఓ భయమూ నాలోపల ఓడిపోతానేమోననై..
యముడు; నువ్వు అపార బ్రహ్మ కి మరో రూపానివి.. నీకు అసాధ్యం లేదు..
చిత్రగుప్తుడు; అది మీకు నా మీద నమ్మకం.. ఒకవేళ నేను ఓడిపోవడం .. మొత్తం విశ్వానికి సంబoదించనిదే… అదే నా అభయం..
యముడు ; ఇప్పుడిక నేను ఆశ్రయించడానికి ఒకటే మిగిలింది.. అదే ఆ నల్లని బిళం.. దానికి మీ సహకారం ఎంతో కావాలి.. లేదా నేను చేయగలిగేది ఏదీ ఉండదు. అనంతం వరకూ కాదా? అనంత శూన్యంలో యుగాలుగా అనంత శక్తిని దాచుకున్న ఆ నల్ల బిళం..
ఈ లోపు చిత్రగుప్తుడి ఆర్తనాదం .. యముడి కళ్ళలో నీళ్లు.. ఒక్క మాట లేదు.. అలా స్తబ్ధతతో ఉండిపోయాడు. ఈ లోపు చిత్రగుప్తుడి ఆర్తనాదం .. యముడి కళ్ళలో నీళ్లు.. ఒక్క మాట లేదు.. అలా స్తబ్ధతతో ఉండిపోయాడు.
అందరూ ఒకే సారి అరిచారు.. మేము సిద్ధం .. ఏం చెయ్యాలో చెప్పు..
అందరి ఆత్మలని .. ఈ నల్ల సంచీలో కట్టి .. ఆ నల్లని బిళం లోకి విసిరేస్తాను.. ఆ మహా శక్తి మాత్రమే ఇప్పుడిక కాపాడగలిగేది.. మీరు వెంటనే సహకరిస్తే … అందరూ వాళ్ళ చివరి వీడ్కోలుని ఇచ్చి .. సంచీలోకి ప్రవేశించారు.. యముడు దాన్ని ఓ బలంతో విసిరాడు ..
అవి మాయమయ్యాక .. ఆటే ఆందోళనగా చూస్తూ ఉన్నాడు..
కానీ కాసేపటికి.. ఏవో పగిలిన సీసాల చప్పుడుతో.. తిరిగి స్టేజి పై పడుతుంది… ఆ సంచీ …
యముడు ఏం జరిగిందాని .. ముడి తియ్యబోతాడు..
చిత్రగుప్తుడు గాయాలైన శరీరం తో పరుగున స్టేజి పైకి వస్తాడు.. రాజా .. ఆ సంచీ తెరవొద్దు.. అది మహా ప్రళయానికి దారి తీస్తుంది.. ఇప్పటికే ఛిద్రమైన ఆ విస్ఫోటనాలని తెరిచామా .. ఈ భూమి భరించలేదు .. ఛిద్రమై పోతుంది.
ఇదేమి మన చేతుల్లో ఉన్నదీ కాదు.. మనం కూడా సృష్టి చేయబోయే మరో కార్యాన్ని చూడటం తప్ప ఇంకేం చెయ్యగలిగింది లేదు. నబడని ఈ మహా విశ్వం ఇంకెన్ని రూపులని మార్చుకొని .. ఏ రహశ్యాలని తీర్చుకొని మనముందు సాక్షాత్కరిస్తుందో…. అది మన ఊహకి అందే విషయం కాదు.
Proyaktha ; ప్రళయ స్థాపనలోని విశ్వ మూర్ఛనలు.. మనిషి మూర్కత్వనికి పరాకాష్ట.. ధ్వని లేని శూన్యంలోని దేహ హారతి.. సాధ్యత ఆగిపోయిన .. మృత్యు కాష్టం.. ఇది యమకాష్టం.. వివిరణ లేని సంతులనం .. దీప నిర్జన లేని వికల దర్శన .. మహా ముట్టడిగా ఉండిపోయిన శిధిల వృత్తాల కలయిక .. కేంద్ర స్థాపన లేని విరగబాటు.. తవ్వకాలు నెరవేర్చని నడక .. కూలిపోయిన ఉనికి లోని తత్త్తరపాటు.. లోపల నుంచి పగిలిన చిత్ర ధూపాల ఎదురుదాడి.. మార్గం ఉండే ఉంటుంది.. లేదా ఉండనూ లేదు.. కదలిక లేని విశ్వ నిర్జన సగం లోని ఉపేక్ష ముడుచుకు పోయిన కల్లోలం.
సంతులీనత ఊగిపోయి జరిగిన మహా అనర్ధ సంఘర్ష లోని చావుల సమాధి సముద్రాలు. పెద్ద దీవుల ఏకైక విళయ సంబంధ కేళన..
ఇది ఇక ఉందా ? లేదా?
…………………………………
EPISODE ; 34
Prayoktha ; సృష్టి నిర్వహణ గురించి ఎవరికీ ఎంత తెలుసు.. ఆడో పెద్ద అనుమానం .. వాగ్దత్తలని దాటుకొని విశ్వ రక్ష కదిల్చిన నిద్ర పోరుతో కదిలే తీరుని తప్పిస్తూ .. కలబడి మిగిలించుకున్న పెద్ద హోరులా గాలీ-వాన , చీకటి ఒరిగిపోయింది … ముట్టడి తీరికల మెట్టు.. చిన్న గుమ్మాల పెద్ద ఇల్లు.. కలబడే వాన చిందులు కలకలంలో ఓరగా నిండిన కునుకు పాటని జోకొట్టి .. నల్ల సంచీలు దులిపిన దుమారం కమ్ముకొని.. పగటి కత్తి ని దులిపిన మెట్లు.
ఉనికి సాధారణాల మాత్రలు మింగి.. విరిగిన ఆయాస సాధన ఊగి.. జాతకాలు.. ఎలా దీర్ఘ వక్ర గతుల గ్రహాల మధ్య తిరుగుతూ తప్పించుకొనే శరీర లిపిని జత చేయడం.. ఇలాగే జరుగుతుందనడానికి అవకాశం ఎక్కడ ఉంది? లేదు అది తెలియడమనే దానికి అర్ధం లేదా? కలబడి మిగిలించుకున్న పెద్ద హోరులా గాలీ-వాన , చీకటి ఒరిగిపోయింది … ముట్టడి తీరికల మెట్టు.. చిన్న గుమ్మాల పెద్ద ఇల్లు.. కలబడే వాన చిందులు కలకలంలో ఓరగా నిండిన కునుకు పాటని జోకొట్టి .. నల్ల సంచీలు దులిపిన దుమారం కమ్ముకొని.. పగటి కత్తి ని దులిపిన మెట్లు. లేదనుకున్న చోటల్లా లేక పోయిన ఉప్పని రుచి కథలో ఇమిడిపోతుంది.
నన్ను కొన్ని విపరీత విషయాలు బాధ పెడతాయి.. కొన్ని జాతక గంటలు.. కొంచెం అటూ .. ఇటూ జరిగితే ఇవన్నీ సర్దుకొంటాయా? విశ్వం మరింత వణికిన సముద్ర నిద్రల మధ్య తీరు మార్చుకొని .. సమర్ప ముఖాల పోలికలని తొంగి చూస్తూ.. వణికే ఝాము మంతనాల దేహ ముడులని వదులు చేసి … పొరపాటు పడని కథలు తెలిసి .. గతి మార్చిన నీటి ముఖం అప్పగించిన కిటికీల పక్కాగా ధూళి కన్నుని పోతపోసి అటు పోయి చదువుకొంటూ పలకరింపుని మీదేసుకొంది.
. అక్కడే ఉండిపోయిన శరీర సహకార ఎత్తుల్లో .. ఒరిగిన మృత్యు కథతో తాను తొందరపడలేదు.. వికర్ష దేహ చంద్రుడు చల్లబడి ఆ పైన హడావుడి మొదలైంది..
అతనికి అది తెలుస్తూనే ఉంది.. మృత్యు రహస్యం తెలుసుకోకుండానే వాళ్ళు బిగించిన ఊపిరి మోతాదుల కళశాలని గిర్రున తిప్పి విశ్వ నిద్రాణ కలతలని కాదని ఓడిపోతారు. రీరాన్ని చిలికి .. ఓర్పుగా దిగబడ్డ చలన నిద్రని కాలనివ్వరు.. ఇక్కడ ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేనప్పుడు చిక్కిన మాటలతో తీర్ధం పక్కకి జరిగి కథని మొదలుపెడుతుంది.
మృత్యు యత్నాన్ని calculate చేసుకొంటున్నాడు.. ఒకటికి .. రెండు సార్లు.. భార్య కి ఎదో చెబుతున్నాడు.. అతని బతుకు తెరువే వెక్కిరిస్తుంది.. మాటని తీసుకోలేని ఆత్మాభిమానం తల ముందు గిర్రున తిరిగి నిలదీస్తుంది. ఏది ఎలా తెచ్చుకొని .. కునుకుని వదిలి ఆ చోటుని చేరుకోవాలి.. కలలోనూ వినబడే మృత్యు ఘంటికల్లో ఓ స్పష్టత లేదు.. శాస్త్రమూ పల్చబడి నిలదీస్తుంది..
ఆమె కి బోన్ కాన్సర్ 4th స్టేజి .. ఇక ఏ మాత్రమూ బయటపడే ఛాన్స్ లేదని తెలుసు.. కానీ ఇంత జాతక ప్రముఖుడు.. ఆమె మృత్యు ఘడియలని అంచనా వెయ్యలేక పోతున్నాడు. అదంతా ఓ గ్లూమి చర్యగా మారి .. అతనిపై నవ్వుతున్నట్లుగా ఉంది.
కానీ ఆమెకు తెలుసు.. తన భర్త తనకి మృత్యువుని గురించి చెప్పడని.. అది అతని వృత్తి ధర్మానికి విరుద్ధమని.. కానీ అతను లోపల అల్లాడుతున్నారు.. తను అలా మరి దేన్నో సరిపెట్టుకొంటుంది.. గోడలని పగలగొట్టి .. తలబడే ఉనికిని జోడించి పీల్చుకొంటూ దూరంలో పగులుతుంది.. విసిగిన అయస్కాంత గోళం లో ఆకర్ష మోతాదుల మూర్తిని కడిగి .. వ్యతిరేక సంధి కూల్చి .. ఇంటిని మిగిల్చికొంటుంది
అతనికి యమ దర్శనం జరిగింది.. చిత్రగుప్తుడు.. దేనికో తీవ్రంగా బాధ పడుతున్నాడు. యముడు ఆ ఎగిరే తివాచీ పై .. వెనక వీపంతా .. ఆ చిన్నగా పొడుచుకొచ్చిన కత్తులతో గాయపడి రోధిస్తున్నాడు. అప్పటి వరకు మామూలుగా మాట్లాడిన వాళ్ళు.. అప్పుడే దేవ భాషలోకి వెళ్లి ఎదో చెబుతున్నారు.. అది అర్ధం కావడం లేదు..
కానీ అమెరికాలో ఉన్న కొడుకుకి ..
వాళ్ళ ప్రయాణ వీడియో అప్లోడ్ చేసి .. వివరాలు పంపించాడు.. రిప్లై లేకపోయినా .. వ్యూ చేసాడని తృప్తి పడ్డాడు. ఈ రోజుని నేను .. మరో ప్రత్యేక నిదర్శనంతో నింపి పెట్టుకున్నానా ? ఏదో తెలియడం లేదు.. ముఖాలు వదిలించుకొన్న సిద్ద విపరీతాల మధ్యనే .. కలుపుకున్న సదా నడకల భయం వడపోసి ఆ దూరంలో మాటలని తోడుకొంటాను .
అనర్ధమా .. మంచి? చేదా? తనకా ? తన భార్యకా?
ఈ జాతకాల నుంచి మనలని తీసేయమని.. భార్య ఎప్పుడో చెప్పింది.. స్త్రీ కి మాత్రమే అలాంటి నిదర్శన పూర్వక అంచనా ఉంటుందా?
ఏది మృత్యువు.. తల్చుకొంటున్నప్పుడు .. వచ్చిందా? తలవక ఎప్పుడో తెలియకుండా మింగేసేదా?
విశ్వం మొత్తం ఊరేగించి సంపద మదేనే నిండి శరీర పోలికలని సరి చేస్తుంది.
……………………………………
తెల్లవారుఝాముకి ముందే బుక్ చేసుకొన్న హోటల్లో దిగారు. అతను నెందుకో.. ఆ టైం ని యమగండమన్నట్లుగా .. ఎవరో చెవిలో చెప్పినట్లు అయింది .. కొంచెం గుస గుసగా .. ఆమె ఏంటన్నట్లు చూసింది..
నిన్నటి నుంచి వేరేగా ఉంటున్నారు.. ఏంటి విషయం?
అదేం లేదని నవ్వి.. ఆమె కి స్నానం ఓ చిన్న పిల్లకి చేసినట్లు చేయించాడు. తల దువ్వాడు.. బొట్టు పెట్టాడు.. ఆమె కాసేపు నిద్ర పోతానండి.. అతను స్నానానికి వెళ్ళాడు. బయటకి వచ్చాక నుదుటికి బలంగా తగిలింది .. గోడ.. రక్తం వచ్చింది.. కాసేపటికి ఆగింది.. మళ్ళీ తను కంగారు పడుతుందని ఫ్లోర్ తుడవాలనుకొన్నాడు.. .. కానీ ఆశ్చర్యం కింద రక్తపు మరకలు లేవు. అవన్నీ మల్లిపువ్వులుగా మారాయి. అతనికి అర్ధం కాలేదు.. నుదిటి దగ్గర దెబ్బ లేదు.. అదే చోటి నుంచి ఏదో పరిమళం వస్తుంది.. పుదీనా , తులసి.. తేనే కలిపి మరిగించి చేసే ఓ పరిమళ ద్రవ్యం.. ఆమె కి చాలా ఇష్టం .. ఆమె ఉలిక్కిపాటుగా లేచి.. ఎక్కడిదీ అంది.. అతనేం అనలేదు..
ఆ తర్వాత నుదురు చూపించాడు.. ఆమె వింతగా పీల్చి .. ఆ తర్వాత అతని నుదుటిని చూస్తూ స్పృహ తప్పి పడిపోయింది. అతను ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు.. డాక్టర్ కి ఆమె కేసు హిస్టరీ ఫైల్ ఇచ్చాడు.. డాక్టరు కి ఏదో అనుమానం వచ్చింది.. కొన్ని టెస్ట్ చెయ్యాలంది.. రిపోర్ట్స్ వచ్చాక ఆమె ఎం మాట్లాడకూడ సైలెంట్గా ఉండిపోయి.. కొంచెం వెయిట్ చేయమంది..ఆ తర్వాత నలుగురు డాక్టర్స్ సమావేశమయ్యారు..
వాళ్ళని పిల్చి .. ఇది ఏదో అర్ధం కానీ మెడికల్ మిరాకిల్.. ఆమె ఒంట్లో ఏమాత్రమూ కాన్సర్ కణాలు లేవు.. శే నార్మల్ … అన్నారు.. అదెలా ? అంది ఆమె ..
డాక్టర్ ; గాడ్ అనే అనాలి.. మీరు చేసిన పుణ్యం ఇలాంటి మాటలు తప్ప నా దగ్గర ఇంకేం లేదు.. కానీ టెస్ట్స్ నార్మల్ ఇంటెర్వల్స్ లో చేయించుకొంటూ ఉండండి.. అన్నారు.. ఆమె అతనిని కౌగలించుకొని సంబరపడ్డారు ఇద్దరూ.. కొడుకుకి ఫోన్ చేసి చెప్పారు.. అతనూ రిపోర్ట్స్ పంపించమని అడిగాడు.
నమ్మశక్యం కాక పోయిన అదే సత్యం.
ఇదంతా చెబుతున్న ఆమె ముఖం లో ఒకేసారి తీవ్రమైన మార్పు.. ఏం జరిగిందనేది కొంతమంది కి అర్ధమౌతున్న .. ఎందుకు అనే దానిలో .. ఏదో తెలియని ఆందోళన .. అదేదో తరుముకొస్తుంది.. దాని కంటూ ఓ స్పష్టత లేదు.. ఆమె ఏదో చెబుతుంది.. దూరంగా యముడు .. డాక్టర్..
డాక్టర్; ఎందుకిలా మనుషులతో ఆడుకోవడం? ఎప్పుడు ఎవరికీ ఎందుకు ఆయుస్సు ఇవ్వాలో కూడా తెలియకుండా..
అతని భార్య ; నాకు అప్పడే ఎందుకు తెలియాలి.. అతను వద్దంటున్న .. నా ఆరోగ్యం కుదరడం శుభ సంకేతం కదా .. అనే నేను .. ఆయన మళ్ళీ మళ్ళీ వద్దంటున్న .. వెళ్లాలని పట్టుబట్టాను..
అప్పటికే ఆయనకీ తెల్సి పోయింది.. కానీ వృత్తి ధర్మం.. భార్య అడిగింది.. అడిగిన పాపానికి తన ప్రాణాలే ఇచ్చేసాడు.. ఇప్పుడే బరువు నేనెలా మోయను..
డాక్టర్ యముడితో… ఇది ఆ ముష్కరులకు మించి ఆమె కి మీరు విధించిన శిక్ష..
యముడు;; (హీనమైన గొంతుతో ) నా అడుగులని ఎవరూ ఆపలేరు.. చివరకి నేను కూడా..
ప్రయోక్త ;
మృత్యువుకి అంటిన జాతక మరకల కాంతిని దృష్ఠి మాత్రంగా పోతపోసి.. తనలో ఉండిపోయిన దూరపు కాల్పుల ముద్దలని జోడిస్తూ .. ఇంకిపోని నిద్ర సాధనాలతో కలబడే చూపులని ఎదురు తెచ్చుకొని.. అక్కడే ఉండిపోయిన శాసన శిఖరాల ముడిని తెగ్గొట్టి .. ఎగ్గొట్టి .. తలరాలుతున్న మత్తు ఊడలు … ఏది.. ఎటువంటి .. అంచనాలతో నిండి కదులుతున్న .. లిపితో కలబెట్టుకొన్న అడుగులతో ఒంటరిగా మిగిలిన హద్దులు.. తలవాల్చిన ఒప్పందాలు .. పైకి జరుపుకున్న తీర్మాన వేరుపాట్లతో మిగిలాను..
ఇంతటితో ఆగని జాతక చిత్రాలు.. ఇగిరి పోతున్న మృత్యు ముఖాల దొంతర్లలో పడి కొట్టుకొనే వివిధ సమాన రాశుల పల్లకీ నడకలు.. రేపటికి లేని పేజీలు.. ఉండీ కదల్చ లేని ముట్టడి రంగుల అయాచిత నిద్ర దశలని వేరు చేసి.. ఎండా కమ్ముతుంది.. ఎవరో అల్లా మాటని విననివారు.. మరో దేహాన్ని తొడుక్కోనివ్వరు.. పలుకుని శుభ్రం చెయ్యరు.. శరీరాన్ని చిలికి .. ఓర్పుగా దిగబడ్డ చలన నిద్రని కాలనివ్వరు.. గతాల ప్రాణ ఛాయని మింగి ఏడుస్తూ .. కలబడే కలల ధ్వనిని తాగి.. ఊగిసలాడే దీప నుదిటి లో కోలుకొని.. మరేదీ చదవలేక .. మూసుకుపోయిన నిర్మాణ కదలికల్ని సర్ది పెట్టి .. కథలో ఉండిపోయిన ఆ మలుపు మండలంలో పాత రంగుల ఇంటిని సమాధి చేసిన వణుకు.
కదిల్చిన దేహాల నిద్ర గడువుని సాగదీసుకొని.. ఇది ఇంతే కథగా మిగిలిన దీర్ఘ రాపిడితో..చెప్పి చెప్పని .. మంథన తీర్మానాలు.. యముడు మిగిలిచిన ఆతని చుట్టేస్తూ.. కలకలపు పునాదుల పై నుంచి వర్ష రొప్పుని డొల్ల చేస్తూ .. కదలికల్ని మోస్తూ .. మరింత చిక్కబడ్డ చీకటితో శిధిల మూలకాలతో చేర్చి పెట్టిన ఒడుపుల ఒత్తిడిని మార్చి చూస్తున్న పునః శరీరాల కునుకు.
………………………..
EPISODE ; 35
ప్రయోక్త : దర్శనీయ సమాధానం లేని ప్రశ్న.. కిందికి లాగిన సర్దుబాటుతో చెలరేగిన విరాత స్పర్ధలు.. తగవులాడుకొంటూ .. లోపలి నుంచి ఓ ఒప్పుకోలేని తనం .. అంతా దగ్గర పడి ఆగుతుంది.. ఎలాగో కలవాలి.. సరిపడే దేహాన్ని తీసుకుపోవాలి. పైకీ .. కిందికీ కానీ సన్నని దుఃఖ మూలాలతో ఊరేగే సన్నని జాతి చేర్పుల మోడుతనం .. అల్లాడిపోతున్న కలల పట్టుని దులుపుతూ.. ఇక మొత్తంగా నిండి పోయిన గుణ కర్మలు.. పెద్ద దారి కత్తులు .. పొడవు దారుల మొడులు.. ఛాతీ పొగలు..
సరి చేసుకోలేని నిద్ర మార్పులు.. ఏమార్పూ నడకలు .. చెల్లా చెదురై.. ఇరుక్కొన్న సిరీస సాగదు చితులు చిర చిర లాడుతూ .. కవ్వించే మృత్యు దగ్గర నలుపుని అద్ది వాళ్ళు ఓడిపోతారు. అదే సరిపోలేదని.. ఇది ఇలానే ఒక్కసారిగా మారి ఈడ్చి పారేస్తుందనీ తెలియక అక్కడే తిరుగుతూ .. కనపడని కాళ్ళ గుర్తుల ముద్రలు అంపకం ఊడ్చి పోయిన చెంప మెరుగులు స్మశానాలు. శవ దేహాలని ముక్కలు చేసి.. ఓడించి పెట్టిన నిద్ర భూమి పల్లకీలని అప్పగించి .. సర్దుబాటు లేని విపరీత క్షేమం ఊగుతూ .. బిగిసిన మంత్ర జారుడు చూపుతో .. పోతపోసిన వెన్ను గంటలు మోగుతూ…
…………………
యముడు మృత్యు దేవతని కలవాలని ప్రయత్నంలో … కోమాని మించిన ఓ నిర్వీర్య స్థితిలోకి అతని దేహం వెళ్లిపోవడం. ఆ నిర్జీవితలో ఓ తెలియని భయం.. కంపన .. తీర్ధ ముంపులు .. ఒక నివాళి చరుపుని మోసే ఉలిక్కిపాటు.
వెళ్లే ముందు…
యముడు ; చిత్రగుప్తా … ఎలా ఈ రక్త భయంకర స్థితిలోంచి.. ఈ అర్ధాంతర చావుని అంగీకరించడం.. ఏ చేశారని.. దేని కర్మ పలమిది? ఒక్కొక్కరు నన్ను నిలదీస్తుంటే.. నా లోపల ఏ ధర్మమూ మిగిలి లేదని.. స్పష్టంగా తెలుస్తూ ఉంది …. నీకూ .. నన్ను చూస్తే అలాగే ఉందా?
చిత్ర ; నేనెవరిని స్వామీ … మీరేం చెబితే అది చేసేవాడినంతే.. ధర్మాధర్మ విచక్షణకి మీకు సాటి ఎవరున్నారు?
య; ఈ దుఃఖానికి ఓ సమ న్యాయం చెయ్యలేమా ? ఈ మృత్యువుని ఆపలేమా? ఎందుకీ .. ఏ మాత్రమూ సరిపెట్టుకోలేని .. ఈ ఆత్మ తో నచ్చని ఈ చాకిరీ.. ( గట్టిగా కేక పెట్టి… )
ఇదంతా నాకింకేం వద్దు.. నువ్వూ నన్ను వదిలి వెళ్ళి పో. నీతో నేను చేయరాని అన్ని పనులు చేయిస్తూ ఉన్నాను. ఇది ఇక వద్దు….
చిత్ర ; మృత్యువుని తీసేయాలనా? ఆ తర్వాత పరిణామాలని ఎలా ఊహించగలం.
య; కొంచెం న్యాయమైన ఉండాలని.. నేనూ బానిసనే.. తీసేయడం ఎక్కడ జరుగుతుంది..?
చిత్ర ; అది మీ చేతుల్లోది కాదుగా?
మృత్యు దేవత పట్ల కృతజ్ఞత .. ఆమె అప్పగించిన కార్యం నిర్వహిస్తున్నారు. న్యాయాన్యాయ విచారణ ఆమెది.. ఇందులో మీకే పాప భాగం ఉండదు.
య; మృతు దేవత (?) .. ఉందనుకోవడమే గాని.. ఇంతవరకు ఆమె దర్శనమే నాకు ఇవ్వలేదు.. ఓ యంత్రంలా నన్ను వాడుకోవడం తప్ప..
ఐనా.. పుణ్య లోకాల గురించి కాదు .. నా ఆందోళన.. నాకు ఆమె నిర్ణయాల మీదే ఏవగింపు పుడుతుంది. నాకు అన్నింటి పైన విశ్వాసం పోగొట్టుకున్నాను.
అంటూనే .. అతను తన చూపుని.. ఉనికిని .. శ్వాసని బంధించాడు..
కోమాని మించిన ఓ నిర్వీర్య స్థితిలోకి అతని దేహం వెళ్లి పోయింది. అది చూసి చిత్రగుప్తుడు అల్లాడిపోయాడు ,, కాసేపు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.. శూన్యం లోకి చూసాడు.. ఏ సందేశమూ అతనిని చేరలేదు
చిత్రగుప్తుడు.. అతనిని తీసుకొని.. మార్చురీ లో ఉన్న డాక్టర్ దగ్గరికి తివాచీలో తీసుకెళ్లాడు.
డాక్టర్ చూడగానే .. యముడా ? అంది.
చిత్ర; నీకు చంపేయాలని ఉందా? నీ బాధ నాకర్ధమైన.. అది కేవలం ఒక్క యముడి పాత్ర కాదు. ఇది మాత్రం నువ్వు నమ్ము
డాక్టర్ ; నా వృత్తి ధర్మం అది కాదుగా ?
చిత్ర; నీ విషయం లో ఏ ధర్మం నడిచింది తల్లీ ? నీ లాంటి తల్లుల చావులే .. అతనిని ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చాయి.. .. అతని ఆత్మ దేహం లో జరిగిన విస్ఫోటనం భరించలేనంతగా పెరిగి పోయింది.
డాక్టర్ ; ఇప్పుడేం చెయ్యాలని..
చిత్ర ; నా ప్రభువు.. నేను మృత్యు దేవత దగ్గరకి తీసుకెళ్ళాక … ఆ సంభాషణ వీలు ఉండేటట్లుగా అతను మాట్లాడేటట్లు చెయ్యి చాలు..
కనీసం కలలోనుంచైనా… ఆ తర్వాత నేను చూసుకొంటాను..
డాక్టర్ ; ముగ్గురూ ఎగురుకొంటూ ఓ స్మశానానికి వెళ్తారు .. ఆమె అతనిని ఓ చితి పడుకో బెట్టి .. మంట పెడుతుంది.. అమండుతున్నప్పుడే .. యముడి సుత్తిని అడిగి .. అతని కపాలం పై కొడుతుంది.. గుక్కపెట్టి ఏడుస్తుంది.. నిలువెల్లా ఆమె శరీరం వణికిపోతుంది..
చిత్రగుప్తుడు .. ఆమె భుజం తట్టి.. అటు చూడు అంటాడు.. అతని శ్వాస కదులుతూ.. కళ్ళులోనూ ఓ వైబ్రేషన్.. అతనిప్పుడు .. తన కలల సంభాషణ చెయ్యగలుగుతాడు.
డాక్టర్ .. వీలుంటే … నేనూ మీతో పాటు మృత్యు దేవత దగ్గరకి వచ్చే అవకాశం ఉందా?
చిత్ర ; నువ్వా ముళ్ల తివాచీ పై బాధని భరించగలవా?
డాక; ఆమె విషాదంగా నవ్వుతుంది..
……………….. మృత్యు దేవత ఉండే చోటు..
అది స్టేజి స్టార్టింగ్ లో ఉన్నట్లు .. రక్తం రాలుతున్న బట్టలు వేళ్ళాడుతూ.. ఓ పక్క ఆ గాజు ఛాంబర్ .. దానిలోంచి ప్రయోక్త బయటకి వచ్చి..
ప్రయోక్త; అది అధిష్టాన ముద్రలతో తిరిగే మహా పరిధిలోని మూల సృష్టి.. విన్యాస కృషిదారి .. రా తల్లే.. నీకు… మరణ మహమ్మారిని .. తన పాశంతో బంధించి .. బంధించి .. అలిసిపోయిన నీ పుత్రుడు.. ధర్మరాజు ( అలా అంటున్నప్పుడు .. యముడి శరీరం తెఇరిగి కంపించి ఆగుతుంది) వచ్చాడు..
స్టేజి అంతా డార్క్గా ఐపోతుంది..
జుట్టు అత్తా పండిపోయి .. వంగిన నడుముతో నెమ్మిదిగా నడుచుకొంటూ మృత్యు దేవత .. ఆమె ఒంటి నుంచి వాసన భరించలేనట్లుగా .. మురికి చేతులు.. బట్ట.. చూపు సరిలేదు..
ఆమె చేతులో ఏదో నల్ల సంచీ.. ఆమె యముడి దేహం దగ్గరకి వెళ్లి.. చెవిలో మీ అమ్మని రా … అని .. ఆ సంచీని నోట్లో పిండింది. అతనిలో ఏదో కదలిక .. మనిషి అలా నిద్రలోనే.. కానీ మాట్లాడుతున్నాడు.. చూసే వాళ్ళకి వికారమున్నా .. అతని ముఖంలో అది తాగాక ఓ ప్రసన్నత..
మృత్యు దేవత; ఎందుకు నాయన .. నీకంత పాప పుణ్య విచారణ.. వీటికి నువ్వు అతీతుడివి..
య; లేదు.. అలా కాదల్చుకోలేదు..
మృత్యు ; ఎందుకిప్పుడు కొత్తగా …
య; ముందు నమ్మాను.. నాకిప్పుడు అది పోయింది.. ఈ చావు నిర్ణయాల వెనక ఏ ధర్మ విచారణ లేదని అర్ధమైంది.
మృత్యు; నన్నిలా చూసిన తర్వాత కూడానా ? ఏ శిధిలత .. ఈ దుర్ఘనడం.. ఈ చీకటి.. ఈ చూపులేక.. నడవలేక.. వెన్ను నొప్పిని భరించలేక.. ఇదంతా ఎందుకు?
య; ఈ కష్టం తర్వాత కూడా .. మనమేమీ .. ధర్మ స్థాపన చెయ్యడం లేదుగా?
మృత్యు; అది కేవలం నాతోనే అయిపోదు.. సృష్టి .. స్థితి.. లయం .. గురించి నీకు తెలియంది కాదు.. సమయానుగుణంగా .. ధర్మం మారుతుంది.. నీకు తేలనుంది కాదు..
య; ఆ స్థితిలోంచి గట్టిగా నవ్వుతాడు.. ఎవరిని ఏమార్చడానికి..
మృత్యు; ఆమె కోపంగా … ఇప్పుడు నువ్వు నిరాకరిస్తే ఇదంతా ఆగిపోతుందనా? నీ చోటులోకి మరొకరొస్తారు..
య; నాకు తెల్సు.. నాకు కైవల్యం ప్రసాదించు తల్లి..
మృత్యు; ఎందుకు నాయన .. నన్నిలా ఇబ్బందతి పెడతావ్?
య; (నొచ్చుకొని) .. నాకు అటువంటి ఉద్దేశ్యమే లేదు.. కానీ .. నేను కేవలం యముడిగా మిగిలిపోయాను..ధర్మరాజానే నా పేరుకి ఎటువంటి అర్ధమూ లేదు..
మృత్యు; నీ కెలా చెబితే అర్ధమౌతుంది..
ఈ భూమి మొత్తం ఓ ధర్మ నిర్వీర్యం వేపుగా జరుగుతూ వెళ్తుంది.. ఈ కలియుగం అంతమయ్యే ప్రపంచం లో .. ఈ అర్ధాంతర చావులన్నీ … తర్వాత మరో రూపం పొంది.. ఇంకో సమలయని అందుకొంటాయి.. అప్పటి వరకు .. ఏ విచారణ లేకుండా .. నే చెప్పిన దానిని అనుసరించాల్సిందే.. తల్లిగా నా ఆజ్ఞ ..
ఆమె చెప్పడం పూర్తి కాలేదు … ఆయాస పడుతుంది .. మళ్ళీ ఓపిక కూడ గట్టుకొని…..
నిరంతరం మారే మరో ధర్మంలోకి ఇదంతా ఒదిగి పోతుంది.. ఆ పరిణామ క్రమం జరిగిన తర్వాత గాని మీ స్పృహకి అందదు.. కానీ .. దీనికి అతీతంగా మరేదో విస్ఫోటనం .. జరగబోతున్న కీడు నన్ను తొలుస్తోంది.. అదెలా ఉంటుందో.. నేను ఐనవారు అనుకున్నవారి వల్లే జరగవచ్చు..కానీ అది నా ఆలోచన పరిధిలోకి రావడం లేదు..
డాక్టర్ వేపు చూసి.. నా బిడ్డని నువ్వేం చెయ్యగలవు? అంది..
డాక్టర్ ముందుకి వచ్చి.. ఆమె తలలోంచి ఓ తెల్ల వెంట్రుకల గుచ్చం తీసి.. వాటిని ఆమె చేతితో ఇలా పొడుగ్గా రాయగానే.. సూదులుగా మారాయి.. వాటిని నెమ్మిదిగా .. అతని రెప్పలపై .. పెదాలపై … నుదిటి పై.. కణతలపై.. అరికాల్లో గుచ్చి.. అల్లానే ఉంచి.. అక్కడున్న ఓ నూనె పాత్ర తీసుకొని.. చెవుల్లో పోసి … అతని దేహాన్ని జాగ్రత్తగా పరిశీలించి….
మృత్యుంజయ మంత్రం చదివింది..
అతను పెద్దగా అరుస్తూ లేచాడు..
గుక్కపెట్టి ఏడ్చాడు..వికృతంగా నవ్వాడు. అతని నోటిలోకి మళ్ళీ ఆ నల్ల సంచీని పిండింది.. అది చిక్కని రక్తం లా ఉంది.. అతని ముఖం లో మారుతున్నఓ స్థిరత్వం కనిపిస్తుంది
తల్లీ .. నీ ఆజ్ఞ .. అన్నాడు.
మృత్యు; నీతో .. కాని పనులు చేయించడం నా ఉద్దేశ్యం కాదు.. మనమింకా బలపడాలి.. ఇంకా మహా కార్యాలు ముందు ముందు .. చాలా ఉన్నాయి.. ఈ భూమి ఓ పలవంత ఫలితాల దశకి చేరుకొంటుంది…..
య; ఇంకానా?
డాక; నాకు భయమేస్తుంది.. ఇంకా అంటే..
మృత్యు ;ఇది సృష్టి రహస్యం .. కానీ నీకు వినే అర్హత ఉందనే.. నేననుకొంటున్నా.. ఒక వేళా లేదనుకున్న రోజు.. ఇది నీ జ్ఞాపకం లోనుంచి వెళ్ళిపోతుంది.. విన్నది విన్నట్లుగా మర్చిపోతావు.
యముడు వేపు చూస్తూ..
కలియుగపు అంతం సమీపిస్తోంది.. ఇక ఇలాగే ఉంటుంది.. ఇప్పుడు నీకు చూపించబోయేవి చూస్తే నువ్వు స్తబ్దతకి గురవుతావు. … అంతా కదిలిపోతుంది..
ఈ విశ్వ నిర్మాణానికి పట్టిన సమయం లోని నూరో వంతు అంత కూడా పట్టని సమయంలోనే .. ప్రతీది నాశనం కాబోతుంది.. నేను కొన్ని లక్షల మృత్యు నౌకలు తయారు చేయించాను.. భూమిపై జరిగే మహా యుద్దాలు కొన్ని లక్షల మందిని చంపుకొంటూ పోతాయి.. వాటి ఆత్మ యాత్రలు.. వాటికి అంత్యక్రియలకు కూడా ఎవరూ భూమి మీద మిగలనపుడు .. మనమే వాళ్ళనంతా ఇక్కడకి తీసుకొచ్చి పుణ్యగతులకి పంపించాలి..
అందుకే ఆ మృత్యు నౌకలన్నీ… నీ ఊహకి కూడా అందనంత పెద్దవి..
చిత్రగుప్తుడిని వెంట తీసుకెళ్లి వాటిని నువ్వు చూసి రా… అది నీకొక మహానుభవం ఇస్తుంది…
చిత్ర ; నేనేం చెయ్యాలి తల్లీ …
మృత్యు ; తీర్మానాలు కూడా .. వేగం చెయ్యడం.. ఒకటి నుంచి లక్షకి విస్తరించడం.. మనకిక విశ్రాంతి లేదు..
డాక్టర్ కళ్ళలోంచి రక్తం..
డాక్టర్; ఎందుకు తల్లి … మాకీ విజ్ఞానం.. మనుషులు ఒకరనొకరు ఇంతగా చంపుకొంటూ పోతుంటే.. వైద్య శాలలు ఇంకెందుకు… స్మశానానాలు.. మృత్యుశాలలు అంతేగా….
మృత్యు ; అందుకే అన్నది.. నువ్వీ విషయం మోయలేవు.. రాబోయే మరో సృష్టి రచనలో .. నువ్వు మహా ధన్వంతరి గా మారి ఓ కొత్త వైద్య విధానం ప్రవేశ పెట్టె క్రమంలో .. ముఖ్య పాత్ర పోసిస్తావ్ ..
మళ్ళీ బలంగా ..ఆయాస పడుతూ….
కానీ ఏదో అతీత శక్తి నా వెనుక మండుతుంది.. పట్టుబడకుండా ఉంది.. అదేం చేస్తుందో అనే భయం నన్ను వెంటాడుతుంది.
ప్రయోక్త :
ఆవిరయ్యే కెరటాల ఝాము ముంపులు ఇగిరిపోయిన కలకలం పెద్ద చప్పుడుతో జరుగుతూ .. నిలిచిన దారి మగతలు మృత్యువుని పాడుతూ మహార్ణ సాధన .. విరీత తర్జుమాలు లేని ఏక ధారలా .. కంటిని .. శూలాలకి వేలాడదీసి .. ఉడికించిన శేష భూమి పోలికలని తోడుతీస్తారు. ఎవరూ ఏదీ మాట్లాడ లేదు. అనుకోవడానికి ముందే అప్పగించిన మృత్యు నౌకలు.. తెల్లబోయిన కెరటాలు.. సుడిగాలి.. చనిపోయిన దొంతర్ల నీళ్ల పంట.. పిండాలు జవ జవ లాడే ముడి.. కొంచెం దాహ నీరు.. ఒక చిన్న అరుపు.. చేతుల వణుకు.. రెప్పలా అల్లర్సు…. చివరి గుటక ..
తగలబడుతున్న విశ్వం నిండా మతి తప్పిన క్రియల మెళుకువని మోసే కథల గారడీ నిద్రలతో .. పోతూ పెట్టే నడకలా దేహ ధుని .. భగ్గుమన్నాక … తగలబడి నిద్ర సాధనాల్లో మృత్యువు తిరిగి తప్పిపోయిన మాటల మధ్యనే చర్యల పెనుగులాడే దేహ సంకీర్ణ పిడుగులగుండం. ఆవిరయ్యే కెరటాల ఝాము ముంపులు ఇగిరిపోయిన కలకలం పెద్ద చప్పుడుతో జరుగుతూ .. నిలిచిన దారి మగతలు మృత్యువుని పాడుతూ…
ఏదీ ఇక ఆగిపోదనీ .. అలా ఉండిపోయిన చిత్ర నిందల కౌగిలి .. సృష్టి మహా విరుద్ధ సంపదకు నివాళిని కలుపుతూ.. ఇదే ఇలానే మృతు నౌకల సంతతిగా చుట్టుకొని.. లిఖితం కానీ విరుద్ధ కంటి పాయల నడకని పోతపోస్తూ.. ఇగిరిపోయిన సంకల్ప జాతరలు పెద్ద ఊరేగింపు సృష్టిని మూసేసాక .. ఉండిపోయిన పునాదుల కలకలం అప్పగించిన సరిహద్దు తమకాల శరీర శ్రుతులు .. కళ్ళలో తిరిగి .. చీకటి మీదేసుకున్న చలన మూర్తుల దేహం ఓ నిర్జీవ బిగుతులో ఓలలాడి.. కథని వినక ముందే ఆ లావాలోకి దూకేస్తుంది..
…………………………..
