
నిస్వామిత సంగీతం
విశ్వ శాంభవి… నిర్ధారణ లేని దేహ స్థితి తగల బెట్టి దూరం జరిగిన మురిపెపు చీకటి తో సర్దుకొని నిద్ర గతులని మార్చి తిప్పుకొంటూ…. దీర్ఘ సవ్వడి మోసుకొన్న సరీగత ఒప్పులకుప్పలా గుండ్రంగా తిరిగి .. జ్ఞాన వివింశ పట్టుదప్పే మునకల ఓర్పుతో లాలించిన మూర్తులని జోకొడుతూ సదా సన్నని తీగ రాగాలని మోసి తిరిగే ఓరిమిక చలనం లో తొందరగా తిరుగుతూ .. కదిలే విశ్వ రక్షా ఒంటరిగా తరిచి చూసిన దేహం తో తనకి తాను పరాయి కావడం అర్ధం కాక కిందికి లాగి చుట్టుకొన్న మరకలని తుడిచి .. నిద్ర భంగాల తూర్పు వాకిలి తెరిచే ఉంది.. తను తిరిగి రాడనీ తెల్సు. కాని తను తలుపులు తీసే నిద్ర పోతుంది..
ఆమె ఒక భ్రమా ప్రపంచంలోకి చూస్తూ ఇలా అనుకొంటున్నదే గాని .. నిజానికి అతను ఆమె అలాంటి సంభాషణ ఎప్పుడూ చెయ్యనే లేదు.. బయటలా చెప్పి చెప్పి చివరికి ఆమె లోపల అదే సత్యమనే ఒక చిత్రమైన తెర నిండిపోయింది. ఇది చాలా ప్రమాదకరం … జరిగి చచ్చేదీ కాదని తెల్సిన.. లోపల ఇంకెదో ఆరాటం అది ఏ మాత్రమూ ప్రాక్టికల్ కాని నిద్ర చోటు.. అక్కడ మొదల్లయ్యే కలలు అలానే కన్నుని కాలుస్తున్నాయి.
ఇంట్లో నుంచి పెళ్లి ఒత్తిడి.. కాని ఇదొక అర్థంలేని సాకని ఆమె కి తెల్సు.. పేరెంట్స్ చెప్పీ చెప్పి.. ఇక తన ఇష్టానికే పెళ్లిని వదిలేశారు. చిన్న కూతురికి కూడా పెళ్లి చేసేసారు. ఆమె ని ఆ పెళ్ళికి రావొద్దని ముందు నుంచి హెచ్చరించారు. చెల్లెలు కూడా ఫోన్ చేసి అదే రిక్వెస్ట్ చేసింది. ఒక రెగ్యులర్ రిథమ్ వెళ్లే లైఫ్ ని వదులుకొని.. తను సాధించింది ఏమి లేదే అనే మాట మరీ బాధించి …ఆ blame దేవంద్ర పై వేయాలని ఆమె ప్రయత్నం.. దానికి విమల అడ్డంకి అని .. కసి పెంచుకొంది. ఇది ఎవరి నుంచి ఎవరికీ కొత్త పరిచయాన్ని ఇవ్వదు.. కదలని నిద్రిత విశ్వం లోకి తొంగిచూసినపుడు ఆ ముద్రలు కన్పించిన … నీటి పై బొమ్మలు.. తీసుకెళ్లాలని దోసిలి ముంచితే అంతా చెదిరిపోతుంది.
………………………………….
అసలు మొదటిసారి Devendra కలిసింది వారణాశి లోనే… వాళ్ళ స్నేహం ఎలా ఏర్పడింది అన్నది .. ఊహించడానికి కొంచెం కష్టం కాని మరీ విచిత్రమేమీ కాదు. దేవేంద్ర వయస్సు 50 ఇయర్స్ ,విమల 40 ఇయర్స్ … అందరి కన్నా చిన్నది సమరిత వయస్సు 28 ఇయర్స్ … దేవేంద్ర వోకల్ సంగీతకారుడు.. సాంప్రదాయ రీతులని దాటి అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.. ఒకే కీర్తనని అనేక రకాలుగా అనేక ప్రదర్శనల్లో మారుస్తూ ఉంటాడు. విమల అతనికి తబలా సప్పోర్టునిచ్చే కళాకారిణి.. అదొక చిత్రమైన జోల కదలాడే కళ్ళతో.. నిద్ర స్థావరంలోంచి.. అడిగినప్పుడే తన రాగం తో కలలని మన ముందుంచి .. మనలని మొత్తంగా లాక్కొని ఒక సమలయ మైదానం లో మన దేహాన్ని ఓ కొత్త రాగం లో నానుతూ ఉండడాన్ని చూపించ గలడు. ఆ ముఖం నిండా పండే ఆ గొంతులోని తన్మయ స్థితి ఒక అయస్కాంత మాహీ ఘారత .. విశ్వ నిందని వడపోసి… ఈ రాత్రికి అదంతా వదిలి పెట్టు.. భారం తీసేసి నన్ను అనుసరించు అని పిలుస్తున్నట్లు… అతనిని కేవలం అనుసరించడానికి… కాచి రక్షించడానికి పుట్టిన విమల….
సమరిత ఓ యంగ్ మ్యూజికల్ బ్యాండ్‌లో సింగర్ గా స్టేజి షోస్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా అతనొక షోలో ఆమె ప్రదర్శన చూసి … చాలా positive కామెంట్స్ చేసి వెళ్ళిపోయాడు. ఆమెకి ఆ మాటలు అప్పుడప్పుడు గుర్తొచ్చి వెంటాడుతూ ఉండేవి. నూనె లోకి పిండి ముద్దా జారినపుడు లేచిన వేడి వేడి తుంపరలా ఆమె చూపు.. కస్సున లేస్తూ.. అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఓ అనాది స్త్రీ గా చంచల దీపమై … వాన కురుస్తున్నప్పుడు ఓ కాగడాలు కమ్మిన గుహలోకి వెళ్లునప్పుడు మొదలయ్యే చలి మడుగుల వెచ్చదనం ఉడుకుతూ .. ఆ చిత్రమైన మరిగే చీకటి నూనెల వాసన ఆమె దగ్గరగా..
తను దేవేంద్ర చుట్టూ కట్టుకొన్నది కేవలం వాంచ ఒక్కటేనా అనలేం.. కాని ఒక్క సంగీతమే .. అతనిపై పురుష వాంఛ లేదూ అంటే అది అబద్దమే.. ఆ ఇష్టం ఏ మాత్రం ప్రాక్టికల్ కాదని తెల్సినా వదలని నిస్సహాయత వెనక ఇంకేం ఉందో తనకీ తెలియదు.. కాని దానిని ఒప్పుకోలేని అహం ఆమె లో చాలా ఎక్కువ. సుమారు త్రీ ఇయర్స్ తర్వాత ఓ రోజు వాళ్ళు ప్రోగ్రాం ఓ రోజు ముందుగానే వారణాశి చేరుకున్న .. ఆ రాత్రి దేవేంద్ర ప్రోగ్రాం సిటీలో ఉందని తెల్సి ఆమె చూడడానికి వెళ్ళింది. అదొక సృష్టి మహామాయ తలపోసి యజ్ఞ వాకిలో .. వందల మంచు మోసిన స్తన్యాలు కాలుతూ .. ఒక దీర్ఘ చిత్ర కాండని అనంతానికి తీసుకుపోతూ.. గర్భ సమ్మతి తెల్సినా .. వర్ణ పురుడుని మోసుకు తిరిగే కళ్ళలో .. ఒక సంపూర్ణత పగిలి ఉబికిన కన్నీటి ముద్దల చేర్పు… అతని గొంతు. అతని ప్రతి చర్యలనూ అందమే..నాప్కిన్ తో తుడుచుకున్న.. కళ్ళజోడు సవరించిన… తబలా వేపు చూసిన.. కళ్ళు మూసుకుని రాగ ప్రయాణం చేస్తున్న… ఒక మామూలు మాటని విన్న.. సంగీత బ్రహంలోంచి .. నాభి చీల్చుకొని పుట్టిన కలువల గుచ్చంలా…. అతనొకసారి మన లోపల పట్టుకొన్నాడా మరి వదలడు….
ప్రోగ్రాం అంతా అయిపోయాక .. ఆమె అతనితో మాట్లాడానికి వెళ్లే టైం కి … అతనికి విమల ఎదో టాబ్లెట్ మింగించి.. అతని నోటి దగ్గర తుడుస్తోంది.. ఆ దృశ్యం ఆమె ఎప్పటికీ మర్చి పోలేనిది.. యుగులు సృజించుకున్న రూపాన్ని శిల్పి క్షణాల్లో చెక్కినట్లు… ఆమె కళ్ళలో .. చెప్పుకోలేని..రస యజ్ఞ ఫలాన్ని పట్టుకొని.. అతనిలోకి ఒరిగి .. ఇది నీదే సుమా …. అని తిరిగి శిధిల చూపుల ఉరవడితో సమర్పిస్తున్నట్లు..
ఆ kerchief ఓ చివర రక్తo అంటుకోవడం చూసేసరికి.. విమల కంగారుగా ఆ రక్తం కనిపించకుండా ఫోల్డ్ చేసి.. ఆమె వేపు వచ్చి.. ఏం కావాలి? అంది..
చూడకూడనిదే చూసానని ఆమెకి తెలుస్తూనే ఉన్న.. వాళ్ళకి అది తెలియాలని అనుకోవడం లేదని అర్ధమయ్యాక .. ఆమె లోపల కొన్ని సెకన్లు తిరిగిన అయోమయంగా తిరిగిన ఆలోచన .. అంతలోనే పట్టు చిక్కించుకొని…
సమరిత ఇబ్బందిగా చూసి …మాట్లాడాలని.. అంది.
విమల ఇబ్బందిగా .. ఆయన హెల్త్ బావుండ లేదు.. ఆమె మొత్తంచూసిందని తెలిసాక కొంచెం ఒప్పుకొన్నట్లుగానే …. మరోసారి కలుద్దురుగాని అనబోతుంటే…
దేవేంద్ర ఆమె ని పిల్చాడు. అది విశ్వ గతిని క్షణాల్లో మార్చగల సన్నని వేళ్ళ కదలిక.. ఆ చూపు .. చూసిన వాళ్ళలోపల ఒక శాశ్వత మహా నిర్దేశం కృతిగా .. పాటలా వినిపిస్తూనే..
స్వర స్థానాలు..పూర్వీకుల సాహిత్యం.. రాగాల సృష్టి ఎలా జరిగి ఉంటుంది.. వింటున్నప్పుడు మన లోపల ఏం జరుగుతుంది.. మీరు ఎలా దీనిలోకి… ఇలా ఎన్నో ప్రశ్నలు అయిపోయాక …
ఈ షోస్ కి ఇంకా ఆదరణ ఉందనా? మీరిలా … హెల్త్ కూడా లెక్కచేయకుండా … అతనిలోని ఏదో రహస్యాన్ని క్షణాల్లో తన గుప్పెటలో పెట్టుకొన్నానే అహం చూపిస్తూ ….
అతను నవ్వి… అంతరిక్షంలోంచి కురిసే ధవళ విన్యాస సందడిలా … నెలల ఆత్మ స్థావరం లో జన్మ పిండం అప్పుడే గర్భం లోకి మొదలు పెట్టిన నడకలా …. చూస్తూ …
నేను శూన్యంలోంచి వచ్చాను.. మళ్ళీ శూన్యం లోకే పోయేది.. నా సంగీతమూ అంతే.. కళ తప్ప నాకు మరో నిమిత్తం లేదు.. ఇంకేం రాదు .. వచ్చినా చెయ్యాలని లేదు. మృత్యువు నా కనుసన్నలలోనే తిరుగుతూ ఉంది.. నేనెప్పుడైనా … ఈ క్షణమైనా నేను అంతే నిర్దారిత సత్తువతో పిలవగలను..
మీరు హాయిగా ఉండండి… మీకు నచ్చింది చెయ్యండి.. నన్నిలా వదిలెయ్యండి .. అన్నాడు.
…………………………………..
సమరిత ఆ తర్వాత .. ఆ అయస్కాంత క్షేత్రం నుంచి బయట పడలేకపోయింది.. మాటి మాటికీ వెల్తూనే ఉండేది.. అతని ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నా వదలకుండా వెల్తూనే ఉండేది. సంధి ముద్ర సృష్టి ఏది ఎప్పుడు ఎలా జరగాలో అదేదో తెలియనిది..
కొంచెం మైకం కమ్మే నవ్వు ముద్రల ఘాడత పెంచేది… కలని మయా సొనలతో కడిగి.. విశ్వ రాగం లో నానబెట్టి.. సారళ్య సమీకరణాలు కాని.. వాటి మధ్య ఛిద్రమయ్యే శక్తుల నిశ్చింత తీర్దాన్ని ఒడిసిపెట్టి పైకి జరిగి .. సంధి చేసుకున్న నిర్ణయాల గతి పత్రంలో సంతకం చేసి.. స్నేహం.. ముందే డిజైన్ చేసి పెడుతుందా? ఏదీ దానికదే జరిగిపోలేదా?
ముగ్గురూ చాలా మంచి స్నేహితుల్లా .. Devendra తో సమరిత ఇంకాస్త ఎక్కువ దగ్గరై.. విమల కంటి కొసల నుంచే దేనినైనా గమనించ గలదు.. దుఃఖ తీర్మాన రెప రెప లతో పూడ్చుకున్న విశ్వ బిళం నల్లని చిత్ర మూర్తుల వాంఛిత సంజ్ఞలు కప్పిన చేర్పుడు రాతలతో కంటి ఫలాన్ని దోసిలో పట్టి…
ప్రేమగా … విమల వాళ్ళ మధ్యలోంచి తప్పుకొని… తన పని తాను చూసుకొనేది..
Devendra ఎన్నోసార్లు.. ముగ్గురమూ కలిసి బయట ఎక్కడికైనా వెళదామన్న . సమరిత ఒప్పుకునేది కాదు. ఏవో నమ్మదగ్గ కారణాలు చెప్పి అలా జరగనిచ్చేది కాదు. ఆమె లోపల ఏం జరుగుతున్నదనే ఓ గందరగోళాన్ని స్పష్టంగా తెలుసుకొనే ప్రయత్నం చెయ్యదు… చీకటి విసిగించిన సత్య దోషాల మిశ్రమ శ్రమ లోని ఆంచింత మహా ప్రశ్న .. ఒక్కోసారి నడిచొచ్చిన పునాదులని తిప్పి కొడుతుంది..కనీసం ఒక్క పదం మోపే స్థలాన్ని కూడా మిగల్చదు… అందుకే అనేక దేహముద్దలు కరిగి.. వాళ్ళ పూర్వీకుల పోతల్లోంచే పైకి లేచి చలి కాచుకుని … కాచుకొని .. ఓ నాడు చచ్చిపోతారు.. ……………..
సమయం ఏ నిమిషం .. దేనిని మనపైకి విసిరి నవ్వుకొని … శిక్షని జులిపిస్తుందో చెప్పలేం.. ప్రతీ క్షణం సిద్ధంగా ఉన్నవాళ్ళకి ఇదంతా ఒక చిన్న నడక మరో సత్రాన్ని చేరుకోవడంగా ఉన్నా.. ఆ స్థితి చేరుకోవడానికి చేయాల్సింది చాలా పెద్ద యాత్ర.
విమలకి ఓ రోజు ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ ఉంటే .. Devendra ఆ రాత్రి అక్కడే స్టే చేసాడు.. ఉండిపోవడమంటే తను తనలోంచి కరిగించుకొన్న దేహ దీపాల ఒడిని కాస్త ఉలిక్కిపాటుతో చుట్టి మందగించిన విశ్వ శ్వాస మొదలైన రోడ్డుల్ని కదిపి .. ఇక ఇది నా నివేశమనే సాయుధమ కలిగింతని తాగి తూలిపోతూ … శరీరం మరో నిండా గడించిన జాగృత మైలల పోతగా గడ్డ కట్టిన మెట్ల మధ్య కొడి గట్టిన నిద్ర.
ఆ నైట్ సర్జరీ జరిగింది.. జరగాల్సింది ఓ చల్లని మిశ్రమ నిద్ర తొణికిసలని దండ కట్టి.. కౌగిలి విశారమా ముక్తి చలనం లోని మంత్రాలని కరిగించి తాగించాక ….. అంతా జరిగి పోతుంది.. జరగాల్సింది,.. జరగకూడనిది… జరుగుతూ ఆగిపోయేది.. సాఫల్య చీకటి లోంచి కన్ను చిలికిన కలలని వదిలేసి.. మరో మహా మంటకి వేలాడుతూ ఉదయ ఛాయల మాగన్ను మెదిలిక
ఉదయం సమరిత వచ్చి.. ఫ్రెండ్ ని కనీసం చూడకుండా Devendra తో రాత్రి అక్కడే ఉన్నందుకు గొడవ పెట్టుకొంది.. గొడవ అంటే కేవలం ఆమె అరిచింది. అతనేం మాట్లాడ లేదు.. అతనికి అదేం పట్టదు… అలా పట్టే పరిధులని దాటి విశాల మాయల తోరణాలని అల్లుకొంటూ… శూన్య మొహం లోని మృత్యు తీగని గటించుకొంటూ … నిశ్చల మురిపంలోని .. విశ్వ శ్రుతిగా నెరిసిన సమయ తీర్ధాల ఉత్త్సవ మార్దవంలో కప్పుకొని శరీర ముఖాల దిగాలు వాదులు ముడిని లాలించి పెట్టి..
ఏదో పాటకి అక్కడున్న మెడికల్ ఫైల్ అట్టపై నోట్స్ రాసుకొంటున్నాడు. అనంత సవ్యతని తిప్పి తీసి .. దీర్ఘ నిశ్పోతలని తగలబెట్టే విముఖం సరళాల దేహ వరద సంగీతమై … సరాసరి ఉపరి సాయాల చుక్క నిద్రకి రంగుని కలిపి …పాట సాయాన్ని వరమడిగే సన్నని దిద్దుబాటులోని కౌగిలితో నిండి సంగత ముడుల సంగీతం.
………………………………..
విమల ఆ మర్నాడు స్పృహలోకి వచ్చింది.. దేని నుంచి దేని స్పృహలోకి… ప్రాణ మత్తుజడ దులుపుకొని.. విరబోసుకున్న నడకతో చీకటిని కప్పి .. ఊపిరాడకుండా చేసి.. అంతలోనే ఇది ఆటేనని కళ్ళగుంతలు ఊడ దీసి కనిపించకుండా పోయినపుడు..
ఆ రాత్రి తానే ఉండమన్ననని… హాస్పిటల్ ప్రోటోకాల్ .. సర్జరీ జరిగే అప్పుడు పేషెంట్ దగ్గరవాళ్ళు ఉండాలని…ఆయన అందుకే ఆగాడని హెడ్ నర్స్ ఆమెకి చెప్పాల్సి వచ్చింది.
విమల అనాధ .. ఆమె కి ఎవరూ లేరు. కాని ఆసరాగా దేవేంద్ర పరిచయమయ్యాక ఇక ఎవరి గురించి ఆమె ఆలోచించలేదు. అలా చించాల్సిన అవసరం దేవేంద్ర మిగల్చకుండా.. తన గురించి తను ఆలోంచించుకొనేంత టైం అతను మిగల్చలేదు.
సమరిత అతని ఫోన్ కి ట్రై చేసింది.. స్విచ్-ఆఫ్ వచ్చింది.. ఆ తర్వాత ఇక అతను కాంటాక్ట్ కాలేదు… సమరిత అతని ఆదాయపు లెక్కలు విమలని అడగాలని చూసింది.. కాని విమల స్పష్టంగా చెప్పింది.. అది నాకు దేవేంద్ర చెప్పినప్పుడే.. ఆయన వెళుతున్న మాట నాకు ముందే తెల్సు.. ఎప్పుడు తిరిగి రావడమనేది .. ప్రకృతి అతనిని డైరెక్ట్ చేస్తుంది. ఆయనెప్పుడూ సంగీత సాధ్యంలోని అసాధారణ మాంత్రికతతో సంచరించే విశ్వ నిర్యాణకారుడు..స్వేచ్చాగతి చిత్రకారుడు .. మనం దగ్గరుండి చూసుకొంటున్నాం ఇప్పుడెలా అని .. ఆందోళనపడటంలో ఏ మాత్రం అర్ధం లేదు..
వన్ ఇయర్ గడిచి పోయినా… కాని సమరితకి అనుమానం .. విమల కాంటాక్టులో ఉందని… తనకి చెప్పడం లేదని… ఆమె లోపలి చీకటి తొలిచే ప్రశ్నలతో విమలకి ఏ నిమిత్తము లేదు.. అతకని ఆందోళన.. మరకలు నిండిన పలకరింపు.. చేతికి .. మాటకి.. మనిషి ఎదుటలేనప్పుడు ఆలోచనకి అదుపులేని సమరింతని విమల అంతగా పట్టించుకొన్నదీ లేదు.
…………………………………..
ఆ రోజు విమలకి ఓ కొరియర్ వచ్చింది.. అది చాలా పెద్ద సైజెలో ఉన్న పెయింటింగ్.. ఆ పెయింటింగ్ పై ఒక స్పష్టమైన సంతకం .. విమలేంద్ర అని.. విమల పోలికలతో ఉన్నా ఓ స్త్రీ లోంచి.. సంగీతం బయట పాడుతూ.. తూఫానుకి ఊగుతున్న చెట్లని.. కెరటాలని చుట్టుకుంటూ … ఒక బీభత్సా మౌనం ఆ కేన్వాస్‌లో… సంపూర్ణ నిర్గతి సాయుజ్యం మసకబారిన చిత్తడి మేళంలో .. చిత్తడి నడక జుట్టులోకి పట్టించి ముడి వెయ్యలేని అసహాయత మొండిగా దూసుకొస్తున్న నిర్ధార విపరీతం .. ఆ పెయింటింగ్… సంగీతం … వర్ణమయం లోకి హఠాత్తుగా దూకిన సమయ విసిగ్ధ రస ధారామృతి … దేవేంద్ర …. విమలేంద్ర అనే కొత్త పుట్టుకల సంతకం….
సమరిత అది చూసి ఏడుస్తూ వెళ్లిపోయింది.. విమల ఇంట్లో పెట్టుకొంది. ఆతర్వాత అనేక పెయింటింగ్స్ అలా… Devendra నుంచేనని .. సమరిత .. విమల తో వాదించేది…క్రమ క్రమంగా … వాళ్ళ మధ్య స్నేహం పల్చనై పోయింది. సమరిత అతనిని ఎలాగైనా వెదికి పెట్టుకుందాం అన్నప్పుడల్లా విమల ..అతని నిర్ణయాన్ని మనం గౌరవించాలి.. తనే వస్తాడు నచ్చినప్పుడు.. మనం లాక్కురావడంలో అర్ధం లేదని ఖచ్చితంగా వ్యతిరేకించేది.
ఒక అర్ధరాత్రి ఇంటికి చేరుకొని తలుపు కొట్టాడు దేవేంద్ర .. గుమ్మంలో ఓ పెద్ద van … దానినిండా ఈ వన్ ఇయర్ లో ఆటను వేసిన కొన్ని వందల పెయింటింగ్స్… ఇదంతా తనకి తెల్సిందే అన్నట్లు … రిసీవ్ చేసుకొని.. ఆ రాత్రీ అతనికి ఇష్టమైన పప్పుచారు.. బంగాళా దుంపలు వేపి భోజనం పెట్టి… కళ్ళు నొక్కుతుంటే హాయిగా నిద్రపోయాడు.
………………………………..
దేవేంద్ర , విమలల మధ్య ఉండే సంబంధానికి బయట చాలా పుకార్లు ఉన్నాయి.. ఇద్దరికీ మధ్య పెళ్లి అనేది లేకపోవడం.. అతని టీంలో అందరూ మారుతున్న ఆమె మాత్రం వదలక పోవడంతో మరిన్ని అనుమానాలు.. gossips .. నడుస్తూనే ఉంటాయి… నోళ్లు చీకటి బురద ప్రవహించే డ్రైనేజీలు.. మూతలేని manholes మనిషి లాగినట్లే .. అటు తిరిగే లోపు ముంచేస్తాయి. జరగుతున్న దానితో వాళ్ళకి ఏ నిమిత్తము లేదు.. వాళ్ళ తిమ్మిరి తీర్చుకొనే రహస్యనిందలే ఆ నాలికలకి ఆహారం.
అర్ధరాత్రి ఆమె ఇంటికి ( వన్ కిలోమీటర్ దూరం) నడుచుకుంటూ వెళ్లడం చూసామని.. మూడు రోజులు అక్కడే ఉండి .. రాత్రీ పగలు తేడా లేకుండా మందు తాగుతూ .. ఒంటి మీద బట్ట ఉందో లేదో అనే స్పృహ లేకుండా డాన్సులు చేస్తూ ……… ఒక మంచీ చెడ్డ . నలుగురు చూస్తున్నారనే భయం ఏమి లేకుండా బరితెగించడం.. బలాదూర్ తిరగడం….
కాని ఆ తర్వాత ఒక స్టేజి పై అమ్మవారి కీర్తనని అద్భుతంగా ఆలపించాడని.. పాట మధ్యలో సంగతులకి ఆమె తబలా సపోర్ట్ అమోఘమని.. వేల సముద్రాల హోరులా మధ్య గుర్రపు డెక్కల చప్పుడు.. విశ్వం స్తన్య నిద్ర తిప్పిన కల.. సాధ్య మంద్రత ఆవహించిన రెప్పలా గడుసు మగతలో కాల్చి పెట్టుకొన్న నిరాశ ముంచిన కదలికల చిత్ర నిరూపం.. సంగీతం.
జోడి కలలోనే కాదు.. మంచo మీద కూడా ఏ మాత్రం తగ్గరేమో… అనే .. బూతు కామెంట్స్ … సోషల్ నెట్ వర్కులో ఆ పాటని షేర్ చేస్తూ.. కొందరు రాక్షస ఆనందం తీర్చుకొన్నారు. హస్త చలన తిమ్మరి పట్టుకొన్న నిద్ర జాడీల్లో ఎర్ర కాళ్ళ జాగారం..నాకే నాలిక .. వెనకనుంచి వెన్నుముకని చీల్చి.. ముందు నుంచి నవ్వు మరకని తళుకు రాసి పోయే పలకరింపు… కొందరకి ఈ సోషల్ నెట్ వర్క్స్…
ఓ పక్క పవిత్ర సంగీతం .. మరో పక్క ఇలా రాసలీలలు… అని నిలదీయడానికి ఓ రోజు సమరిత వచ్చింది.. ఇలాంటి వాటికి స్టీరింగ్ కమిటీ లీడెరై సొసైటీ కాపాడే ముద్రతో పాపులర్ కావాలని.. తన రేటు తనే ప్రోగ్రాం నుంచి ప్రోగ్రాంకి పెంచుకోవాలనే మామూలు ఆశ.
కానీ అతను hospitalized అని తెల్సి అక్కడికి వెళ్ళింది… ఆయనకీ గొంతు కాన్సర్ … సర్జరీ జరిగితే .. పాడగలడో లేదో తెలియదు.. పాడ లేకపోవడాన్ని దేవేంద్ర ఊహించలేడు.. అది చావుని మించి ఎర్ర కేక .. సంధి చెయ్యని మృత్యు కొసల బిగువు.. ఏటవాలు సమాధిని కాలుస్తూ .. సమయ మతి తప్పిన దేహ సవ్వడి వoతులు వేసుకొని ఇంగిత శక్తుల తీరుబాటుతో స్థిరపడలేని ఆందోళన.
సమరిత కన్సర్న్ లో ఏమేమి ఉన్నాయన్నది ఊహించలేం .. ఒకవేళ తెలిస్తే భరించడానికి అంతే అసహ్యం కలగవచ్చు. కొంతమంది చీదరించుకోవచ్చు.
ఏదో parallel ట్రీట్మెంట్ తీసుకొంటూ .. పాడుతూ రోజులని లెక్కపెడుతున్నాడు..
సమరిత సూటిగానే అడిగింది.. ఇంకా ఎంత ఆయన ఆయుస్సు.. అని..
ఆయుస్సు సమస్య కాదు… పాడగలగడం ఇంకా ఎన్ని రోజులనే భయం.. ఆ తర్వాత అతనిని అలా పాట లేని బతుకుతో ఉండలేడు… ఎలా కాపాడుకోవడం ..
ఆదతనికి లైఫ్ కాదు. పరమ దుఃఖ ముద్రగా వేలాడుతున్న మృత్యువుని కాదని … నిండు గడపాలి పైన్నుంచి దాటి .. రెప్ప చదవని కల బీటలు తీసాక .. సాగిపోయిన చీకటి మడుగులో పోలిక లేని దేహఊతాలు బిగించి చేసుకొన్నా ఒప్పంద తీరికలు. …………….
……………………………..
సమరిత … దేవేంద్ర తో ఉన్నప్పుడే .. gossips తనే create చేయడానికి ట్రై చేసింది.. కానీ అది possible కాలేదు… అవన్నీ చాలా చవుకబారు ఎత్తుగడలని మీడియా ఏ రకంగానూ వాటిని ఎంకరేజ్ చెయ్యలేదు..( దాని నుంచి తను పాపులర్ కావాలని ఆశ పడింది) ఈసారి వాటిని నిజం చెయ్యాలని … దేవేంద్ర ఇంటిలో ఒక రాత్రి ఉండేలా .. ఆ మాట ఒకరిద్దరికి తెలిసేట్లుగా ప్లాన్ చేసింది… వాళ్ళప్పటికే ఒక స్పష్టమైన అవగాహనతో.. కళ్ళతోనే.. దేవేంద్ర – విమలాల మధ్య చూసినట్లు ప్రసారాలు ఎన్నో చేసేసారు.. ఇప్పుడు మరేదో కొత్తని తీసుకు రావడంలో ఆమె లోపలి నలుపు కష్టం లేకుండానే కనిపిస్తుంది.
కానీ ఆ రాత్రి అతను విమల దగ్గరే ఉన్నాడు.. హెల్త్ issues వలన..
సృష్టి వినిమయ మాత్రలుగా కరిగిన సమయ చిత్రాల కౌగిలీ ముంపులతో కదిలే విశ్వ చలన ఉపేక చుట్టూతా కట్టుకొన్న … దేహ అసలోమయ మంద్రతని కరిగిస్తూ .. కాస్త తోడు దొరకని ఇంటి నుంచి తోసుకొస్తున్న దీర్ఘ మెరుపులు కప్పుకొని … శిలా మర్ధనల కష్టమూ కనిపెట్టే అనుగమంగా ఒత్తిలి .. ఇది సదా తల్చుకొనే మహా దర్పణం పండిన మగతల చిత్ర శాల. తను అందులోనే… మృత్యువుకి అదే దీర్ఘ విశ్రాంత కొలిమి అని తెల్సి… విమలా అనే నిద్ర పలవరం ఆమె చెవిలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది.
సమరిత పట్టరాని కోపం తో … సీక్రెట్ గా ఉంచిన అతని హెల్త్ విషయాలని .. డబ్బు ఖర్చు పెట్టి మరీ ల్యాబ్ నుంచి డూప్లికేట్ కాపీలు తీసుకొని.. సోషల్ నెట్వర్క్స్ లో హడావుడి చేసింది… సెన్సేషన్ కోసం ఎదురుచూసే మీడియా దీన్ని ఊదరగొట్టేసాయి… మనిషి చావు.. బ్రతుకు.. సిగ్గు వదిలేసి చేసే దాడులు.. శరీర బిగువులని .. ఆసిడ్ కొలిమిలో ఉడక బెట్టే తొందరలు.. అన్నీ ఎంటర్టైన్మెంట్ … ఏ రోజుకా రోజే .. మరునాటికి అదే పాతది…కన్నుని నిద్రాక్షణ్యంగా కాళ్లతో నలిపి..సిగెరెట్ పీల్చి … గాజు ముక్కలని కూరే పైశాచికాల నుంచి.. దీర్ఘ దోసిలి చలీ జ్వరం వరకు.. అంతా అయోమయం .. ఎవరు ఎటు ఎందుకు పరుగు పెడుతున్నారో తెలియదు.. ఆ చీకట్లోనే నరాల మసాజ్.. క్రిమి నిండిన నవ్వులు.. నాలిక ఊరబెట్టిన బూతులు…
విమల వెంటనే వచ్చి.. ఆమె చెంప పేలగొట్టి.. ఆయనకీ జనాల సానుభూతి ఇష్టం లేదు.. అందుకే సీక్రెట్‌గా ఉంచింది.. అతనింకా డబ్బు సంపాదించాలనే దుగ్ధ కాదు… అతని సంపాదన అంతా .. ఎన్ని చారిటీస్ కి వెళతాయో అదే సోషల్ నెట్ వర్క్ ద్వారా .. ప్రూఫ్ డాకుమెంట్స్ తో సహా అందరూ చూసుకొనేలా ఉంచింది.
అసలు నిజం తెలియగానే .. చాలా నోళ్లు మూత పడ్డాయి.. కొన్ని మాత్రం నమ్మలేమని లోతుగా ఎంక్వయిరీ చేసినా … దానిని బయటపెట్టే సహృదయత చూపలేదు… కొంతమంది.. సానుభూతికి .. ఆయనింటి వేపు రావడం.. మొబైల్ ని ఖాళీ లేకుండా మోగించడం చేసిన అతనిని వాళ్ళెవరికీ విమల చిక్కనివ్వలేదు..
అప్పటికి అతను..కోమా లో ఉన్నాడు. సంజీవని దొరకని జ్ఞాత శక్తుల ఓటమి గొంతుతో.. తడి రేగిన విశ్వ బిళంలోకి నల్లని నిద్ర రూపం తో పిలుస్తూ.. కదిలే విశ్వ దిగ్భ్రమ ఒంటికి అతుక్కొని … వరమివ్వని శాపిత అనంతం లో మృత్యువు దీర్ఘ విపరీత మూర్చన గతికించిన అరుపుతో… శ్వాస తప్ప సంగీత ధార మస్తిష్కం లోంచి జారీ .. నిద్ర పునాదుల సమలయ గంత్యంతరం లోపలి ముడుచుకొన్నప్పటి నిషేదమయ శ్రుతిని దాటి .. స్పృహ తెగిపడ్డ బాహ్య స్థితి కోమా.
……………………………….
హాస్పిటల్ కి తీవ్రమైన జనం… మీడియా … అలా రాత్రి -పగలు అక్కడే.. విమల తో అక్రమ సంబంధమని .. సమరిత ఇచ్చిన టిప్స్ తో ఓ చిన్న ఛానెల్ ప్రచారం మొదలు పెట్టింది.. విమల నవ్వుకొని.. అంతలోనే గుక్క పెట్టి ఏడుస్తూ….. ఇంకెవరో ఏదో చెయ్యమన్నా తీవ్రంగా రియాక్ట్ అయింది.. ఇందులో తప్పేం ఉంది.. తనకి నేను అన్నీ.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా..
నిజంగా మా మధ్య అలా జరిగిఉంటే ..నా ఈ శరీరానికి అంతకు మించిన మోక్షం లేదనుకొంటాను. కానీ అలా ఎప్పుడు నన్నే కాదు .. ఏ స్త్రీని చూడ లేదు.. అసలతనికి సంగీతం తప్ప మరో ధ్యాస ఎప్పుడూ లేదు.. ఎవరు నమ్మినా నమ్మక పోయినా .. నా లైఫ్ మొత్తం అయన కోసమే .. ఇక ముందు కూడా .. దానిని ఎవరు ఎన్ని వక్రపు ఆలోచనలతో రాసిన.. నన్ను గాని.. దేవేంద్రగాని అవి ప్రభావితo చెయ్యవు. నెగిటివ్ వే లో అయినా గాని … సమరితకి కొంత పాపులారిటీ వచ్చింది..
విమల స్టేటుమెంట్ కి కొన్ని నెగిటివ్ త్రేడ్స్ ని లాగి… విమల వాటికి దూరం కాబట్టి.. ముందునుంచీ సమరిత చెప్పేది నిజం కాయడానికి అవకాశం ఉందంటూ చర్చా గోష్ఠులు మొదలయ్యాయి.
…………………………………
కొంతమంది .. వాళ్ళద్దిరి తోనూ అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తూ .. అతనికే సాంప్రదాయ సంగీతానికి అర్హుడు కాదన్నట్లు ప్రచారం మొదలుపెట్టారు .. వాళ్లంతా ఎప్పటి నుంచో అతని స్థానాన్ని లాక్కోవాలని ఎదురు చూస్తున్నవారు. విశ్వగతి లో నిస్సుగ్గుగా జరిగే ఎదురు దాడి లో ముందునుంచి కాచుకొనే లోపు .. వెన్నులోనూ మరొకడు .. పలకరింపులు పూల గుచ్ఛమని గడ్డపార దించేస్తాడు.. సంగీతమతనికి బతుకు తెరువు కాదు.. అదే అతని శ్వాసని నడిపే మూలాధారం.. మృత్యు వచనం.. మండుతున్న యజ్ఞ కుండని నిరంతరం మోసే తపస్సు.. దానికి వెనక .. దానికి ముందూ .. మరో నిర్వచనం అతనికంటూ లేదు.. ఇక స్థానాన్ని మరొకరు ఎలా మోయగలరు.. ఆ మహర్ష ముద్ర సృష్టి ఏరికోరి వర్షించిన మహా దేహమతను..
విమలకి జరుగుతున్నది అర్ధమౌతున్న .. ఎలా ఆపాలన్నది అర్ధం కాలేదు. చాలా కాంట్రాక్ట్స్ కాన్సల్ అవుతూ నోటీసులు వస్తూ ఉన్నాయి.. కొంత ప్రాపర్టీస్ అమ్మి ఆ ఇయర్ చారిటీ సంస్థ లకి పంపాల్సినవి పంపి … నెక్స్ట్ ఇయర్ నుంచి వీలు కాదని చెప్పేసింది.. అతని గురించి పట్టించుకొనే వాళ్ళు తగ్గిపోయారు.. మీడియాకి ఇక అదొక చీకేసిన చెరకు గెడ .. విసిరి అవతల పారేసింది.. కొంత మంది మాన్తా వేసుకొని చలి కాగలరు.. బూతు కథలుగా చెప్పుకొన్నారు. అదీ రోజు రోజుకీ కిక్ రావడం తగ్గిపోయింది. నమిలేసి ఊసిన కథగా మారిపోయింది……
విమల తన సేవింగ్స్ అన్నీ ఆమె ఖర్చు పెట్టేసింది.. చివరకి తన ఇళ్లు అమ్మేసి ఆ డబ్బు ఖర్చు పెట్టి .. దేవేంద్ర ఇంట్లోనే ఉండటం మొదలు పెట్టింది. కొన్ని అడ్వాన్స్ లు వెనక్కి అడగడంతో … హాస్పిటల్ charges పెరిగి పోతూ ఉండడం.. ఒక్కరూ పలకరించి ఆదరించే వాళ్ళు లేక …అన్నీ రకాల అప్పు ప్రయత్నాలతో అలిసి పోయాక ఆమె అతనిని ఇంటికి తీసుకొచ్చేసింది..
ఆ వచ్చిన మూడో రోజు అర్ధ రాత్రి ఆమె ఆనందంతో లేచింది.. అతను బాల్కనీ లో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.. మనిషి బాహ్య రూపం లో అంత నీరసపడి.. మాంసమంతా కరిగి పోయిన .. ఆ గొంతులో ఏ మాత్రమూ కుంగుబాటు లేదు.. అలసట లేదు.. ఎర్రగా కందిన దాహ తర్జుమాలు వినికిడి మాత్రల గాల్సులని బోర్లించి.. మాదక రసాయన సర్వం లోని ఆశ్రిత పరాయీకరణ వేలాడే కథ మధ్యలో చిహ్న విదూరం లేని జన్మ సాధారణలు పక్కకి తప్పుకొన్న తొడతొక్కిడి తొందరలో చీకటి చల్లరే విశ్వ దిగ్ద వికార ముఖం సగంలో వీడే సంగీతం.
………………………..
ఆ రాత్రి అతను ఆమె తో శారీరకంగా కలిసాడు.. సాగిలపడ్డ నిశ్వాస ముంపులో గతి సమయ నిర్ధారణ మోసే దేహ రక్ష కళ్ళలో కదిలి .. శరీరం లేని జాడీల్లో మంత్రం నీలపు పొగ దేహ సంతకం చేస్తూ.. జన్మ దీక్ష ఒరిగిన చెమటలు కుంపటిలో… కొత్త నిర్వచనం దొరికిన పురుష ఒయాసిస్సులో .. తలపడే దాహ భంగిమల సరాసరి యుద్ధం కావ్యం .. ఇంకా దొరకని రెండో పేజీలోని ఊపిరి వదిలే .. నిర్యాణ తిమ్మిరి మూటలు ఒక్కసారిగా తీర్చుకొని.. చీర మడుగుల్లా కూలిన పిడుగులా సంతర్ప దుఃఖ మాల విడిపోయి ఆశ్రిత కెరటాలుగా నుదిటిలోంచి కరిగి .. చిత్ర బంధిత నివుర్పు వేలాడిన కంటి దీక్షలో నిద్ర సొమ్మసిల్లిన పరుగుల కదలిక అలిసిన ఛాతీలో బరువెక్కిన ఛాయా మడతలు.. దీర్ఘ వీధులని కడుగుతూ .. బొట్టుపెట్టుకున్న సమయ మంత్రాల అధీన సగం ఉండిపోయిన పుట్టుకని కలుపుతూ.. తెలియని వ్యాకరణమై పాటని పెట్టుకొంటూ.. అంతలోనే జుట్టు విరబోతల్లోకి విడివడి పొద్దు కమ్మిన జాము సవ్యతని అరగదీసి సాయుజ్య సమతలంలో విసిగిన జన్మ శ్వాస ఇంకేదో దూరంలో గ్రహాలని పొంచి పట్టి.. ఆమెలోంచి ఏ సందేహమూ బయటకు రాలేదు.. ఏ ఆశ్చర్యమూ తొణికిలాడలేదు.. ఉన్నదల్లా సమర్పణకి రెండో వరమైన మృత్యు ధారని తీసుకు పోతూ .. అదేదో మారాలని అనుకోడు.. చెప్పుకోవాలనీ చూడదు. ఇది తెలుసుకోవడం .. అర్ధం చేసుకోవడం కొంత వరకు జరిగినా .. ఎవరి లోపల ఏదీ ఎప్పుడు మారాం చేస్తుందో ఎవరికీ తెలియదు.. ఇంత మాయా అగమ్యత కమ్మిన సృష్టిని నమ్ముకొని చేసిన ప్రమాణాలన్నీ కేవలం ఓ చిన్న ఆటలా మూసుకుపోతూ… స్త్రీ ఆస్థిత్వా సంపదగా కాలిపోయిన ఆయుస్సు..
ఉదయానికల్లా విమల నిద్రలోనే హార్ట్ ఎటాక్ తో చనిపోయింది… అతను ఆమె అంత్యక్రియలు ఓ భర్తలాగ చేసి … అతను ఖాళీ కాబడ్డ తన ఆత్మ రెప్పలని పోగొట్టుకొని.. నిద్ర దొరికించుకునే దారిలో తన ఇల్లు అలాగే ఉందని తెల్సి.. మళ్ళీ వడ్డించమని యుగాలుగా తన కాళ్ళ చప్పుడుకై అక్కడనే ఆగిపోతానన్నాడు. కాని ఎవరో ఒప్పుకోలేదని గట్టి గట్టిగా అరుస్తున్నాడు… అదంతా లోపలనే …
దేవేంద్ర అలా మాటా .. పలుకూ లేకుండా రెండు రోజులు ఉండి.. మూడో రోజు వారణాశి వెళ్తున్న అన్నాడు సమరితతో … ఆమె నేనూ వస్తానంది.. ఎందుకు.. నీకు అక్కడేం పని అన్నా ఊరుకో లేదు.. అస్తి నిమజ్జనం జరిగాక .. సమరిత తో అనంత చారల శూన్యం లోకి కలిసే బూడిద కెరటాలు.. మహా సవ్య సమయ సూచీని దాటే సాద్య స్తంభనలోని కవ్వింపు మునకలు … ఐనా సృష్టి తనవనుకొన్నవి వెనక్కి తీసేసుకొంటుంది.
……………………………..
అక్కడున్న కొంతమంది పడవల వాళ్ళు అతనిని గుర్తు పట్టి పాడమని అడిగారు. వాళ్లలోనే ఉన్న కొంతమంది వాయిద్య సంగీతకారులని.. తనకి కావాల్సినట్లుగా తయారు చేసి.. వాళ్ళ అమ్మవారి గుడి దగ్గర చిన్న స్టేజి వేసి.. mikes సెట్ చేసి … ప్రోగ్రాం మొదలైంది.. దీర్ఘ రాగం లోకి తప్పిపోయిన జానపదుల అలసట .. కొత్త నిర్వచనాలుగా మారే ప్రేమ.. ఆయుస్సు దారాలతో తెల్లని వేళ్ళ సమయ కుండని మోసుకు పోతూ దుఃఖం.
ఆమె వాటిని మొబైల్ కెమెరాలో రికార్డు చేసి సోషల్ నెట్ వర్క్స్‌లో పెట్టేది. మళ్ళీ అతనికి అక్కడా పాపులారిటీ రావడం జరిగినా ఏ గుడులకి పిల్చేవారు కాదు. అతనికి ఎక్కడ ఉన్నానని … ఎవరు .. ఎంతమంది చూస్తున్నారనే స్పృహ గురించిన శ్రద్ధ చాలా చిన్నది.
కాని ఒక్కసారి బిస్మిల్లాహ్ కుటుంబం తన తండ్రి సమాధి దగ్గర పాడమని రిక్వెస్ట్ చేసారు .. పోల్చి చూసుకొన్న సన్నాయి కాష్టం లోంచి విశ్వ పదగ్రాహిగా ఉండిపోయిన నీటి జన్మ కొత్త వాకిలిలో మృత్యు భిక్షని జోలెలోకి తీసుకొని .. బిస్మిల్లాహ్స అని అరిచి … శోధన ఆశ్రితంలో దేహ పేటిక మింగిన బూడిద రాశులు తప్పిపోయి .. ఆ పై వీధిలో తనని కలిసాక .. భ్రమయ మితి తెలియని నివ్వెర గాట్లతో.. ఉడకబెట్టిన నిద్ర నీళ్ల భావి కింద ఒక మాసిపోయిన గొంతుని ..నాద ముంపుతో శుభ్రం చేసి
ఆ రాత్రి అక్కడ నేరుగా చూసి విన్నవారుగాని.. సోషల్ నెట్ వర్క్ చూసిన లక్షలాది జనం గాని .. వాళ్ళ మొత్తం లైఫ్ లో ఇక అటువంటి ప్రోగ్రాం చూడటం అసాధ్యం అన్నట్లు కామెంట్స్ పెట్టారు. సమరిత పొంగి పోయింది. ఆమె ఆత్మ సర్వమూ మారిపోయి.. విమల ఆవహించినట్లు…. ఆమె సేవింగ్స్ .. నగలు కరిగి పోవడం మొదలయ్యాయి.
ఓ రోజు ఆమె ని దగ్గరకి తీసుకొని కౌగలించుకొని.. నుదిటిపై ముద్దు పెట్టి.. దీంట్లోకి నువ్వు ఇరుక్కోవద్దు.. నీ లైఫ్ వెదుకుకొంటూ వెళ్లి పో అని అతని దగ్గర మిగిలిన కొంత డబ్బు ఆమెకి net banking throughసెండ్ చేసాడు. ఆగకుండా వివరాలు లేని వీడ్కోలు దస్త్రం .. అసమస ముడుతలుగా లుంగ చుట్టుకు పోయిన మాటలు.. అలసిన ముట్టడి రంగుల ఏక తాళంతో.. నీకు ఇంకో దిక్కు లేదనే కంపన.. దీనికి ఇక్కడే ఎందుకు మేకులు దిగ్గొట్టాలి.
ఆమె కై ఆ రాత్రి చాలాసేపు పాడుతూనే ఉన్నాడు. అది మళ్ళీ అలాగే తిరిగి దొరకని రాత్రిని బాగా తెలుస్తూనే ఉంది.. కాని ఎలా మార్చుకోవాలో తెలియడంలేదు. ఆమె మరేమీ మాటలని చేర్చ లేక పోతుంది.. సర్దుకోవాల్సిన దేహ రవ్వల తృప్తిని ఆర్పలేకపోతుంది… ఆత్మ వస్త్రం కాలి
తనకి స్పష్టమై ఓ రకమైన సిగ్గుతో.. దుఃఖంతో అతని కాళ్లపై పడుతూనే ఉంది.
కాసేపటికి అంతా నిర్జనమై సమరిత హాయిగా నిద్ర పోయింది.
ఉదయానికి అతను లేడు.. ఆమె మూడు రోజులు ఆగకుండా వెదుకుతూనే ఉంది.. అతనికే విశ్వం చెందుతుంది .. అతనికే ఎవరికీ చెందాడు.. కన్పించని వారమై వాన ఆత్మని తడుపుతుంది .. అయినా ఏదో పిచ్చి .. ఇంకేదో ప్రాక్టికల్‌గా ఆలోచించమని మోసగిస్తుంది… అక్కడేం లేదు.. వాటికి అయన చెందనే చెందడు.
మరో మూడు రోజుల తర్వాత ఒక యాత్రికుడు ఆమె ని వెదుక్కొంటూ వచ్చి … ఐదు అడుగుల ఎత్తు .. ఎర్రగా కమిలిన శరీరంలో .. ఏదో అంత్య ప్రార్ధన మృత్యువుని నమ్మే దీపాల వెలుగు కళ్ళలో పండుతూ .. అంతే నెమ్మిదిగానూ ఉన్నాడు….
కొన్ని ఫొటోస్ షేర్ చేసి… ఆమె లోకి నిశ్శబ్ద ఛాయతో చూసాడు.. శ్వాస అతను తీసుకొనే క్రమం ఏదో శృతి చేస్తున్న వీణలా నిదానంగా ఉంది.. ఒక హెచ్చరిక వాల్చేవాడిలా అప్రమత్తం గానూ ఉన్నాడు.
అవి కైలాస పర్వతపు చివరి స్టేజి ఫోటోగ్రాఫ్స్ .. దాదాపు ఆరోహణ అసాధ్యమై .. మృత్యువు పుట్టిన రహో హేళనల ఆట పాడుకొనే నిర్జన స్వేదంగా పగిలిన చూపు రేఖ మొత్తమూ తనే దాట లేక సృష్టి మోయించిన నిర్యాణ వాకిలి.. అవెంతో క్రిస్టల్ క్లారిటీ తో ఉన్నాయి…. లోపలేదో కీడు తొలుస్తూ పోతూన్న. .. మృత్యువుని తరుముకొస్తూ .. అదే వింటానని .. అలా ఎందుకు ఆలోచించడమని తనని తనే తిట్టుకొంటూ… దిద్దుబాటు లేని ఆశతో….
Devendra కైలాస పర్వతం ఎక్కుతూ మధ్య దారిలోనే మరణించాడని… మహా నిద్ర సంశయాలని ముకుళించిన అపేక్ష రాశుల్లో.. తనకని తెలియని విశ్వ మోక్ష సంగీతమై.. సృష్టి మహా ముద్రల ఆది స్థానం దగ్గర వీడ్కోలు తీసుకోవాలనే.. అంతా తేటతెల్లమయ్యే రహస్య మయంలోని సాపేక్ష పోటు..
అతనికి ఎవరూ లేరని తెల్సి గవర్నమెంట్ అన్నీ లాంఛనాలతో అంత్యక్రియలు చేసిందని..
ఆ మాటలు వింటూనే ఆమె కుప్పకూలిపోయింది.
…………………………………..

