భాషణ… దర్శన

                                                                      భాషణ… దర్శన

Download Free Ebook
Download Now

సృష్టి అనంతానంత గర్భం లో మరింత తెల్లని కల ఆరబోసిన ఓ జాగృత శిల్పంగా … పుట్టిన దుఃఖ సారాలు … ప్రశ్న గతులని మారుస్తూ .. ఇంకాస్త వెనక్కి జరిగిన చీకటి వలయం లో పడి కొట్టుకు పోతున్న నిరాశ ఒక్కోసారి అందుకోవాల్సిన అనుమానాల్ని ముంచేస్తూ … ఒక్కసారిగా జ్ఞాన స్పృహ మేల్కొన్నప్పుడు.. అతను మళ్ళీ తనలోకి కలుపుకోవడానికే అక్కడికి పిలుస్తున్నాడు.

అతను ఆమెని పిచ్చిదానిలా చూసాడు.

వాడు ఎక్కడుంటాడో .. ఏం చేస్తాడో … ఏం కావాలనుకొంటున్నాడో .. దేనికి ఓ ఆన్సర్ లేదు.. ఎంతమంది అతని చుట్టూ … ఎవరితోనైనా స్థిరంగా ఓ రెండు నెలలు ఉండడు. అలాంటి వాడికోసం నువ్వు అన్ని వదులుకొని… జనరల్ మేనేజర్ … నెలకి నాలుగు లక్షల జీతం.. ఓన్ హౌస్..ఇదంతా వదులుకొని… వాడి కోసం పోతే..

నువ్వు తిరిగి వెనక్కి రావాలనుకొంటే … ఇన్ని ఇయర్స్ నీ కష్టం గాల్లో కొట్టుకుపోయి మళ్ళీ మొదటికి వస్తుంది…

రాత్రి నుంచి ఆలోచించుకొన్న ఆర్గుమెంట్ .. విజయం సాధించానేనే ఓ తృప్తి.. అన్నీ లాజికల్ డెడ్ ఎండ్ కి వచ్చి ఆగాల్సిందేనని అతనికొక పుట్టుక తోనే వచ్చిన బలమైన నమ్మకం … ఓ ఒక్క దానితోనే అతను ఎప్పటికప్పుడు చెల్లెలు పై నెగ్గుకొంటూ వస్తున్నాడు…  

కాని ఈ సారి ఆమె అలా విని ఊ కొట్టేలా లేదు. తను నిండా ఈ నిర్యాణం తీసుకొన్న దగ్గర నుంచి పూర్ణత పొందిన ఒక నమ్మకం ఆనందం తో నింపేస్తుంది. అది ఎవరితోనో .. గొడవ పెడతామో.. ఒప్పించడమనే స్థాయిని ఎప్పుడో దాటేసి వెళ్లిపోయింది.

అన్నయ్య … నువ్వు వంద చెప్పు..నా నిర్ణయం లో మార్పు లేదు.. హౌస్ సేల్ చేసి లోన్ క్లియర్ చేసేసాను… సేవింగ్స్ కొన్ని ఇయర్స్ వరకు ఓకే.. ఈ లోపు ఏదొక సర్వైవల్ వెదుక్కొంటా … లేదా హాయిగా ఏ హిమాలయాల పైనుంచో దూకేస్తా … అంది .. వైశామి

ఆ మాటల తర్వాత ఆమె అన్నయ్య లో చూసిన ఎక్స్ప్రెషన్స్ … మారిన రంగులు… ఓ నల్లని తెర వెనక మగాడిగా గింజుకున్నా నిస్సహాయతలు… అయినా గొణిగిన చిన్న చిన్న మాటలు..

ఆమెకి  ఈ మాటలు పదే పదే .. గుర్తుకు వస్తున్నాయి.. హాయిగా నవ్వు కొంది..

సరిగ్గా మూడు ఏళ్ళ క్రితం.. అన్నయ్య లెక్కల్లో … టిపికల్ మ్యారేజ్ ఏజ్ లో… రఘు .. ఆఫీస్ colleague తో  అప్పటికి వన్ ఇయర్ గా Friendship లో … ఓ రోజు live-in propose  చేసాడు.. మరో నెలలో… మూడేళ్లు గడిచాక … ఓ నైట్ …  

ఈ ట్రయిల్ అండ్ ఎర్రర్ మెథొద్స్ ఎన్ని సార్లని..ఇదొక రోజూ policy లా మారింది…రోజూ  ఏదో డాక్యుమెంట్ చూస్తూ .. లివింగ్ relationship ని ముందుకు తీసుకుపోతున్నట్లు…

రఘు…అర్ధ రాత్రి తలుపు కొట్టాడు.. హలో లో అంతా సెట్ చేసి పిలిచాడు… drinks … సిగిరెట్లు.. ఆమ్లెట్స్ … పల్లీలు… టీవిలో కమలాకర కామేశ్వర రావు పాత సినిమా…

ఇది మనకి వర్కౌట్ అవుతుందా? అన్నాడు.

నేను నవ్వాను… నువ్వేగా అవుతుందని.. పీజీ లోంచి లాగి … నాకు నెలకి 20 వేలు రెంట్ కాంట్రిబ్యూషన్ పెంచావు… అన్నాను…

అతడు; చూడు..వైశమి… Iam talking about our secured future? You just worried  about present expanses ?

 వైశామి; yes ..for me every penny is value … we have to spent for the right cause otherwise this is all nonsense.

అతడు; నీ కళ్ళు సమంది వేపు చూస్తున్నాయని నాకు తెల్సు… అది చెప్పడానికి నువ్వేదో .. బరువైన philosophy తీసుకొచ్చి … నన్నో ఫూల్ చేసే ప్రయత్నం చేయక్కర్ల … అన్నాను.

సమంది … నీలా కాదు. ఏదీ టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు… చివరికి ఇలా చేతి మీద ముద్దు పెట్టు ( పెట్టుకొంటూ …) కోవడం కూడా…

ఒక ప్రతిభాధిత ఆనవాళ్లు .. పొడవైన నాలికతో తరిమే జాగూరత.. ఇదంతా ఇలా కలయబెట్టుకొన్న నిరాశలో చిలికిన మువ్వల గతి.. ఇదంతా మారి ఎవరో సుత్తి తో మోదుతున్నట్లు … అయినా ఇక మారడానికి ఏం లేదు.. వదిలేయడమే .

వైశామి కి కళ్ళలో నీళ్లు తిరిగాయి.. ఏదో తెలియని బరువు… వాడు లేచి ఎదురు కుర్చీలోంచి … సోఫాలో ఆమె పక్కన కూర్చో బోయాడు. నేను  కాలితో బలంగా తన్నాను.. ( ఇది కేవలం ఓ అసంకల్పిత చర్య ) ఎగిరి కింద పడ్డాడు .. కుర్చీ కాళ్ళలో చెయ్యి ఇరుక్కుని .. బాధతో అరిచాడు.. నా రూమ్ లోకి వచ్చి.. తలుపు గెడ పట్టుకొని ఏడుస్తూనే ఉన్నా..

మొబైల్ లో ఏదో వాట్సాప్ మెసేజ్ అలెర్ట్ చూసి .. ఓపెన్ చేసాను.. నందయోగి ప్రవచనము క్లిప్ ఎవరో పంపారు… .. భాద కి మరో పర్య పదం లేదు… నివారణ మార్గమూ లేదు.. కానీ .. మన ప్రయాణంలో దేనికి భాద పెడుతున్నామనే దానిలో … ఓ ఎదుగుదల ఉండాలి.. ఓ సంకల్పం… ఓ ఆర్తి… ఆ ఆర్తి లో ఓ విశాలత్వం ఉండాలి.. స్వయంకృతం అని దేనికి భాద పడొద్దు. స్వయం అనుభవానికి రాని సత్యం ఎంత గొప్పదైన మనకి దానితో నిమిత్తం లేదు.. ఏదైనా .. అది మీ స్వయం చేతలోంచి… సంపూర్ణ నమ్మకం లోంచి …అయి ఉండాలని గుర్తు పెట్టుకోండి… మీ లోపలి ప్రయాణం ఎప్పుడు ఆపొద్దు … అందులోంచి మీవైన నిర్ణయాలు తీసుకొంటూ ఎదగండి.. దీని నుంచి ప్రయోజనం కాదు… ఆనందం వెదకండి.. ( అదొక మూడు నిమిషాల క్లిప్ అంతే..)

ఆ తర్వాత అంతా శూన్యం … ఏదో తెలియని తనం.. బెంగ ..ఒంటరిగా చాల తిరిగాను.. సాఫ్ట్వేర్ వదిలేసి.. జర్నలిజం .. పెయింటింగ్స్.. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్.. అడ్వెంచర్ టూర్స్ .. మధ్య మధ్య లో .. నేనున్నానే అన్నయ్య బెదిరింపు ప్రేమలు..

కల విరిగిపడ్డ నిరాహా దర్శన లోని అపప్రధ దేహాల కుప్పపోతని కాల్చేస్తూ.. కొంచెం చోటు అడగక ముందే .. గిల గిలా కొట్టుకున్నా గొంతులోంచి మరో మాటని తీయక ముందే అంత తెలియనట్లుగా….

..ఓ నెలలో విడిపోయి ..నేను పీజీ కి… సమంది ఆ ఇంట్లోకి… ఆ తర్వాత three ఇయర్స్ .. నందయోగిని గురించిన ఆలోచనలు … కొన్ని ఆర్టికల్స్ …స్కెచెస్.. ఒకటి .. రెండు అతని డైరెక్ట్ మీటింగ్స్ … ఓ ఆన్లైన్ ఇంటరాక్షన్ సెషన్ .. ఇంకా చాల మంది జర్నలిస్ట్స్లతో కలిసి.. ఎప్పటికప్పుడు ఇన్స్పిరె చేస్తూనే ఉన్నాడు. నన్ను కూడా మీరు … ఓ ఇన్స్పిరేషనల్ టూల్ గా చూసి.. రోజూ షుగర్ టాబ్లెట్ లా అలవాటు చేసికోవద్దు.. మనము ఊహించని రివర్స్ ఆర్గుమెంట్… ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాడు….

మీ లోపలినుంచి సమాధానం ప్రతి ప్రశ్నకి అందుతూనే ఉంటుంది.. అలా వెళ్తూ ఉండండి.. డెస్టినీ సెపరేట్ గా ఉండదు.. మన ప్రయాణమే … ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న మజిలీల మధ్య నచ్చు తున్నట్లుగా అనిపిస్తుంది… మీ.. మీ… డైలీ కంఫోర్ట్స్ని దాటి పైకి రండి… అది మీ అనుభవానికి అందుతుంది..

జ్ఞానదీక్ష పరిధిని గోళాల చుట్టూ తిప్పి …జరిపిన మృత్యు భీషణ నది నిద్ర పోతున్నప్పుడు కట్టిన నిర్మాణంలా …శాంత ద్వారపు గాలి అలలు కౌగలించుకొన్న మహా నిషాదం లో ముద్రలు వడపోసిన కట్టడాలతో నంద విహార ఆశ్రమం.

సెక్యూరిటీ ఫార్మాలిటీస్ దాటుకొని లోపలి వెళ్లేసరికి చాలా రాత్రై పోయింది.  

ఎవరో వచ్చి ఆమె ఉండాల్సిన రూమ్ చూపించారు.

                                                                   ……………………………………

చీకటి తన రెండో వీలునామాని రెడీ చేసుకొంటున్న టైంలో… రాత్రి రెండు గంటలకి .. ఎవరో తలుపు కొట్టినట్లైంది… ఎవరూ ? అంది … సమాధానం లేదు.. వెనక్కి వెళ్లిపోయిన అడుగుల చప్పుడు.. ఆమె కి ఎందుకో అనుమానం … తలుపు తీసి చూడలేదు..

ఎన్నో చీకటి నులిమిన రాత్రులు నిన్నటివి … పెద్దగా నిండిపోని ఆందోళన తొందర పెడుతూ .. పడదోసిన నిద్రల మధ్య కదిలే .. ఒక సంధి దొరకని నిద్ర సందర్భం నిండిపోతూ… దూరంగా జరిగిన తేడా ఘటనలు కొన్ని అనుమానాల్ని శ్వాస లో రాల్చినప్పుడు నమ్మకం లేని ఓ ఎత్తుగడ తలకి బరువుగా ఊగుతూ

అలసట అనుకొంటా … లేటుగా లేచింది.. నంద యోగి ఉండే హాల్లోకి వెళ్తే తెల్సింది … ఆయన తెల్లవారు జామున వెళ్లిపోయారని… తెల్సీ తెలియకుండా .. ఆ వచ్చి వెళ్ళింది ఆయనేనా?

 ఎక్కడకి వెళ్లారు… ఎప్పుడొస్తారు … ఈ రెండు ఎవరకి తెలియదు.

ఓ డివోటీ(ఇరవై ఏళ్ళు కూడా ఉండవు.. పేరు ధానేష్… అలహాబాద్ .. ఈ వయసుకే అతనికి ఏ క్లారిటీ వచ్చిందో అర్ధం  కాకపోయినా.. వయసుకి మించిన చిత్రమైన స్టెబిలిటీ కనిపిస్తూనే ఉంది.) ఆమెకి ఒక బుక్ ఇచ్చాడు … స్వామి ఇమ్మన్నారని.. ఆ భాగ్యం అందరిదీ కాదని ఆమెని అతను చూసే చూపులోనే అర్ధమౌతుంది..

 వైశామి కి … ఆ వ్యాక్యాల వెంట ఆమె కళ్ళు ఓ నిశ్చంత చుట్టిన ప్రవాహంలా కదులుతున్నాయి. 

బంధించే జ్ఞానభూమి అంతటా పర్చుకొంది.. నీతో నేను సంభాషణ మొదలుపెట్టానని కొత్తగా చెప్పుకొంటూ.. గంట మోగుతుంది.. గాలి ఓ ప్రవాహ ధర్మాన్ని వీడి గడ్డ కట్టినట్లుగా….

సృష్టి ఒక స్మశాన ముద్రలో ఒళ్ళు విరుచుకొంటూ పుట్టుకని దాటి మురిసిపోతున్న గగుర్పు.. వాంఛ దేహంలో మొదలైనప్పుడు కొత్త భాష కావాలి… భయం మనలోని ఆత్మని కాష్టం పై కూర్చోబెడుతుంది..

నాపై ఎవరో ఇన్ని అక్షింతలు వేసి వెళ్ళినప్పుడు కల మొదలవుతుంది… ఈ అఖండ విశ్వానికి నేనే మొదటి .. చివరి గాయకుడనని చెప్పి.. నా గొంతులో ఒక శంఖాల నదినీ… శత పత్రాల నిద్రని… అంతకు రెండింతల కలలని కలిపి ఊపిరిలోకి జనన మాత్రని అరగదీసి పట్టించి.. నేనే పురుషుడనని నమ్మబలకి … మరి కనబడదు.

వస్తాననే ఆమె ఆ ఇంటిని నా కోసం గొడవపడి మరీ సాధించుకొంది.. మృత్యువు లేని మొదటి వంతెన పక్కగా… ఇంటి తలుపుని తీయొద్దనే వాళ్ళు చెబుతారు. తీసి చూస్తే ఏమవుతుంది… కాదని కాదు…యధాలాపంగా తీయగలవాడే … ఋషి …

ఏం కాదులే … ఈ విశ్వం అన్నిజాగ్రత్తలతోనే మనలని నిర్ణయిస్తుంది.. ఏదో ఒక సందర్భం మన నావకి .. దీపాన్ని ఎత్తి చూపి పిలుస్తుంది.

                                                                                         ……….  

Dhanesh మళ్ళీ వచ్చాడు..

ఈ పుస్తకాన్ని … రోజూ తీసి చదువుతూ  ఉండండి…గురువు నుంచి  కొన్ని వాక్యాలైనా రోజూ యాడ్ అవుతూ ఉంటాయి. ఆయనకి ఇదంతా చాలా మామూలు విసయమన్నట్లుగా కనిపించాడు.

నేను నమ్మశక్యం కాకుండా చూసాను.. అతను నవ్వి… తల్లీ … ఇది నిజం … ఆయన ఒక అసాధారణ మైన మనిషి.. మహర్షి.. మన కోసమే మామూలుగా మనతో కలిసిపోయినట్లుగా ఉండడం చూస్తామంతే .. కాని అది కాదు ఆయన. ఏదిగా ఆయన ఉన్నాడో అది మనం స్వయంగా తెల్సుకోవాలి.

ఈ మధ్య జరిగిన ఓ విచిత్రం చెప్పనా … ఆయన డివోటీ ఒకరు అనుకోకుండా చిన్న వయస్సు లో హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుండగా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. ఆయన స్వయంగా కాలినడకన హాస్పిటల్ కి వెళ్లి … ఆ శవం చెవిలో ఏదో చెప్పారు… అంతే .. అందరకి ఆశ్చర్యం .. ఆ శవం ముఖంలో చిరునవ్వు… అతని అంత్యక్రియలు అయ్యేవరకు అలానే ఉంది..దీనికి కావాల్సినన్ని proofs హాస్పిటల్ లో ఉన్నాయి.

మిగతా ఆశ్రమాల్లో ఏవో జరుగుతుందో నాకు తెలియదు… కానీ ఆయన మాత్రం Environmental issues పై పోరాడుతూ ఉంటారు.ఏ పర్సనల్ సెక్యూరిటీకి ఒప్పుకోరు.. ఎన్ని రోజులు ఆయనని ఈ కార్పొరేట్ ప్రపంచం వాళ్ళు   బతకనిస్తారనేది  మనం ఊహించలేం.  

మళ్ళీ అంతే దీక్షగా చూసి.. ఉపదేశ శ్రవణOకి టైం అయ్యింది. ఆమె వెళ్లి మందిరపు హాలులో వెనకెక్కడో కూర్చొంది.. ఒక మహా నిర్వాణ శిఖరం .. సృష్టి మొదలైనప్పటి శిధిల సరస్సు లోకి మునిగినట్లు…

ఆమె ముందర మైక్ పెట్టి .. కుర్చీలన్నీ తిప్పి ఆమె వేపు వేసుకొన్నారు.. ఆమెకి అర్ధం కాలేదు…

Dhanesh వేపు చూసింది … తల్లీ.. గురువు ఆజ్ఞ … మీ అమృత వాక్కులని వినడానికి మేము ఎదురు చూసున్నాం … అన్నాడు. ఆ మాటల్లో ఏ మాత్రమూ … మరో శ్లేష లేదు…. సంపూర్ణ విశ్వాసం తప్ప…

ఆమె వణికిపోయింది… ఆ నోట్ బుక్ తీసింది.

ఆపేక్ష రహితంగా భావి దగ్గరకి వెళ్ళినప్పుడు .. విందు దొరుకుతుంది… దప్పిక తీరుతుంది..

స్త్రీ శబ్దం విశ్వపు వెన్నుముక లోంచి ఓంకారంతో మొదలైంది. .. ఈ రెండు వ్యాక్యాలు అప్పుడే ఆ నోట్ బుక్ లోకి కొత్తగా వచ్చాయి. అవి ఎంతో గుండ్రంగా … ఇన్క్ పెన్ తో రాసిన చేతి రాత .

ఆమె మాట్లాడుతూ ఉంది.. ధారాళంగా .. ఎక్కడా విశ్రాంతి లేని సమూహాల కదలికలోంచి బయటపడి.. సైర్వ విహారం చేస్తూ … ఈ లోపు గంట మోగింది.. ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. మహా గోళం తన శయన మందిరం చేరీ … చేరక ముందే పేర్చిన పుట్టుకలు మధ్య సౌమ్య గాయం కడుక్కొని విశ్రాంతి తీసుకొంటున్నట్లు..

ఆమెని వీల్ చైర్లో కూర్చోబెట్టి రూమ్ కి చేర్చారు. ఎవరిలోనూ ఎటువంటి కంగారు లేదు.

                                                                ……………………………………….

ఆ మర్నాడు తెల్లవారు జామున Dhanesh ధ్యానమందిరంలో ఉండడం చూసి.. వెళ్ళింది. కొన్ని లక్షల కళ్ళపై సంతక ముద్రలు వేసిన అలసట చప్పుడు చెయ్యకుండా … కలలకి వర్ణమిచ్చి శ్వాస తో చిత్రిస్తున్నట్లు ధ్యానమందిరం…

Dhanii  … ఏం నాన్నా అప్పుడే నిద్ర లేచావ్ ? అంది..

తల్లీ..అంటూ  సాష్టాంగ నమస్కారం చేసాడు. ఆమె లేపింది.. నా నిద్ర కొన్ని క్షణాలే …అన్నాడు.

నీ వయసు ఎంత ? నీకిప్పుడే ఇదంతా ఎందుకు? అంది.

ఇదే నా కర్తవ్యవం.. వయసు దేనికి కొలత ?  అన్నాడు. శంఖం … తేనే తేరుని తాగి … నిద్ర కెరటం వదిలి అప్పుడే తొణికిన శక్తి తో చూస్తున్నట్లు… అజాఋణం…

అంటే … ఎప్పటికి ఇక ఇలాగే ఉండిపోతావా?  అంది.

రేపటి గురించి నాకు తెలియదు… అన్నాడు..

నాకు నిన్ను చూస్తే భయంగా ఉంది. అంది.

భయం దేనికి? పుట్టుక .. చావుల మధ్య .. అది నీతో ఆటాడుకొంటుంది. ఈ విశ్వమంతా నా ఇల్లే.. ఇప్పటికి ఇక్కడ.. ఆ తర్వాత మరెక్కడో…నాకంటూ మరో భూమిక లేదు… ఇదే మాత్రమే నాది.. ఇది మాత్రమే నేను… ఈ నేను … నా నేను కాదు. అంతం లోని నేను.. ఆ గురుపీఠాన్ని చేరాలనే నేను..

ఆయన ఎప్పుడొస్తారు?

విశ్వసంచారి మరో దర్శన భాగ్యముందో .. లేదో… ప్రస్తుతం .. ఈ ఆశ్రమానికి మీరే ధీర్ఘదర్శి.. మిగతావన్నీ అప్రస్తుతం .. బహుశా ఇది ఆయనకీ తెలియక పోవచ్చు.  అన్నాడు.

నేను మరేదో వెదుక్కొంటూ ఇక్కడికి వచ్చ్చాను..నా నడకని వారెవరో నిర్ణయించేశారు.  అంది.

దిగులు బంధిత శరీరంలోని… కాంక్షని కప్పే ముసురు.. ఏదీ దాచుకోని వెలుగులోకి రండి.. అన్నాడు.

ఓ వేళా నేనీ రోజు వెళ్ళిపోతే … ఎవరిక్కడ ధీర్ఘదర్శి… అంది..

అతనిలో ఏ చిన్న తొణికిసలాట లేదు.. మెత్తని గొంతుతో…స్వామి నుంచి సందేశం అందుతుంది. అన్నాడు..

ఆమె నిద్ర పోయింది.

నిద్రనే పురివిప్పిన నెమలి పింఛాల కాంతి.. నిలదొక్కోలేని సమాధి శిఖరం పై పడి రాలిన మంచు పూలు మోసే పడక .. కొంచెం శ్వాసలు మెత్తపడ్డ భూమిగా ..భూమికి  నమస్కరించకుండా అడుగు కింద పెట్టకూడదనే ఒట్టు.

                                                                  ……………………………….

మర్నాడు ఉదయం … ఆశ్రమంలో కలకలానికి నిద్ర లేచింది .. రూమ్ నుంచి బయటకి వచ్చేసరికి పోలీసులు.. అందరూ ఆమె  పాదాలకి నమస్కారం చేస్తూ ఉన్నారు.

ఆమె కూర్చొని… ఏమైంది.. ? అంది

Dhanesh కంప్లైంట్ ఇచ్చాడు.. ఆశ్రమంలో భారీ చోరీ జరిగిందని… బంగారం సుమారుగా ఓ కిలో … వాడెక్కడ? అంది. వేల మంది NRI లు తమ సంపాదనలోంచి .. కొంత టాక్స్ తప్పించుకోవడానికి … కొంత పాపభీతి తగ్గించుకోవడానికి .. కొందరు ఆయన environmental  issues నచ్చి సపోర్ట్ గా పంపిన సంపద అది.  ఖచ్చితమైన లెక్కలతో… ప్రతి సిక్స్ మంత్స్కి  ఆడిట్ రిపోర్ట్ .. పబ్లిక్ వెబ్సైట్ లో పెట్టి.. అందరూ చూసేలా ఉంచుతారు.. ఎవరో ఏదైనా Questions  రైజ్ చేస్తే ఆన్సర్స్ provide చేస్తారు.  

వాడే దొంగతనం చేసి పరారీలో ఉన్నాడు. అన్నారు పోలీసులు… విస్మయంగా చూసింది .

మీరు మాట్లాడే మాటలకి అర్ధముందా? అతనిని ఒక్కమాట కూడా అనవసరంగా అనొద్దు … అతనొచ్చే వరకు నన్ను అరెస్ట్ చేసి జైలు లో ఉంచండి… అంది.

ఆమె ని అరెస్ట్ చేశారు.. ఎంక్వయిరీ లో ఆమె చెప్పిన విషయాలకి ఆశ్చర్య పోయారు. … కూడా నోట్ బుక్ .. మర్నాడు ఆమె జైలులోనే ఆ టైం కి వచ్చిన వ్యాక్యం పై ప్రసంగం చేయాలంది.

 పోలీసులు  అలా రావడాన్ని స్పష్టంగా చూసారు.

నేరస్తులందరు … ఎంతో శ్రద్దగా విన్నారు. రోజూ … ఆ వ్యాక్యాలు అలా రావడం వాళ్ళకి విచిత్రంగానే ఉంది.

మూడో రోజుకి ఆ Dhanesh బంగారంతో పోలీస్ స్టేషన్కి వచ్చాడు.. ఆమెని చూసి … మళ్ళీ సాష్టాంగపడ్డాడు. అది గురువు  ఆజ్ఞ … ఆమెకి అది ఒక టెస్ట్ లో భాగం..

అంతకు మించి ఆమెకి ఏమి తెలియదు అని అంతే నిర్మలంగా చెప్పాడు. వాళ్ళా పిల్లాడిని చూడగానే తెలిసిపోతుంది.. వాడికి ఏమీ అక్కరలేదని..వాళ్ళకి అన్నీ ఒకటే.. అది జైలా … ఆశ్రమమా ? అన్న ప్రత్యేకమైన తేడా అంటూ ఏం లేదు.

పోలీసులు గురువుతో మాట్లా వాళ్ళా పిల్లాడిని చూడగానే తెలిసిపోతుంది.. వాడికి ఏమీ అక్కరలేదని..వాళ్ళకి అన్నీ ఒకటే.. అది జైలా … ఆశ్రమమా ? అన్న ప్రత్యేకమైన తేడా అంటూ ఏం లేదు.

పోలీసుల ఆశ్చర్యం అంతా  వాడి వయసుని చూసే…  అన్నారు.. నేను చెయ్యడానికి లేదు.. నేను మీ జైల్లోనే ఉంటాను.. ఆమెని వదిలెయ్యండి.. ఆయన ఫోన్ వచ్చినప్పుడు మీతో మాట్లాడిస్తాను.. అన్నాడు.

ఆమె ఒప్పుకోలేదు… వాడిని మీదగ్గరే office లో ఉంచుకోండి.. మీ అనుమానాలు తీరాకే నన్ను వదలండి… అంది. కానీ వాళ్ళు అప్పుడే ఆమెని ఎంత చెప్పినా వినకుండా  వదిలేశారు.

                                                                                       ……………………

ఆ ఆశ్రమం … చాలా వాటిలా మరీ కాస్టలీగా ఏం లేదు.. అన్ని వయసులవారు ఉన్నారు. నవ్వుతూ పలకరిస్తున్న .. కొంచెం ప్రత్యేకంగా చూస్తున్న … ఎవరూ ఆగి ఏదీ మాట్లాడటం లేదు. ఆమె తన statement ఏదో రకంగా అయిందనే అనుకొన్న రోజు … అతనినించి ఫోన్.. మీకొక ఈ -మెయిల్ చేసాను..

ఈవెనింగ్ మీ ప్రసంగం అదే అన్నాడు.

నేనేదో చెప్పాలనుకున్న … నేను సీఎం తో ఉన్న మళ్ళీ కాల్ చేస్తాను … అన్నాడు.

 మెయిల్ ఓపెన్ చేశాను … సుమారు మూడు పేజీలు ‘ communication to నేచర్’ అనే టైటిల్ తో ఉంది.

యిక్కడ నేను ఏ రోల్ తీసుకోకూడదని వచ్చానో… కానీ మొదటి రోజే నుంచే ఈ ప్రపోసల్ అర్ధం కాలేదు.  చాలా హడావుడి చేశారు… స్టేజి ..మైక్ … స్పీకర్స్ … లైటింగ్ … అద్భుతమైన డిజిటల్  స్క్రీన్స్ … అవి అలా మారుతూ ఉంటాయి. పూలు .. పళ్ళు.. తివాచీలు .. పరిమళాలు….

నేచర్ అంటే అదేదో అద్భుతమైన … టూరిస్ట్ ప్లేస్ కానక్కర లేదు… మీ balcony లో ఉన్న పూల కుండీ కూడా కావొచ్చు.  అని మొదలైన నా స్పీచ్ సుమారు గంట …

 ఆమర్నాడు నుంచి జనం మరింత ప్రసన్నంగా నన్ను చూస్తున్నారు. టైం అవుతుంది.. అతనినుంచి ఏ మెయిల్ .. ఫోన్ ఏదీ రాలేదు.. అతని పర్సనల్ అసిస్టెంట్ని పిల్చి అదే అడిగాను…

అతను నవ్వి.. ఆయన అంతే … చేయి పట్టుకొని నడిపించరు … ఎక్కడా నడవాలో అక్కడికి తీసుకెళ్లి వదిలిపెట్టేస్తారంతే…నాకిప్పుడు … స్టేట్ హోమ్ మినిస్టర్ తో మీటింగ్ ఉంది… ఇదీ ఆయనదే ..

అర్ధమయ్యి .. అర్ధం కాని .. ఓ నిద్ర స్పృహలా .. కదిలి కదలని మంత్రం స్థలం ఒప్పుకున్నా నీటి ఒప్పందం లా కంట్లో తిరుగుతూ … జన విశ్వాసం లో పడి రాలే నిరాశల ముడిలా .. ఉండిపోయాననే కొత్త దీపాల జల్లడ లోంచి రాలే పురాతన జ్ఞాపకంలా .. అంత తెలుస్తున్నట్లై జారిపోతూ 

కానీ నాకు అసైన్ చేశారు. అది ఇక్కడకి దగ్గర్లో నదికి కట్టబోతున్న డాం ప్రపోసల్ని ఆపాలని… నేను నవ్వుకున్నాను… ఎంత వరకు సాధ్యమో.. తర్వాత ఏం  జరుగుతుందో అన్న భయం అక్కడున్న ఒక్కరికి కూడా లేదు… దీనిని ఆయన ఎలా సాధించాడో ఊహించడం కష్టం.

How to listen water ‘s heart .. అనే టైటిల్ తో ఏవో కొన్ని లైన్స్ రఫ్ గా రాసుకున్నాను.

 ఈ ఆశ్రమం లో నేనెంత లాక్ ఐపోతానో నాకు అర్ధమైంది.. ఆ రాత్రి నా luggage కూడా తీసుకోకుండా … హెల్త్  చెకప్ అని .. బయటకొచ్చి.. వారణాసికి ఫ్లైట్ ఎక్కేసాను.  సిట్యుయేషన్ ఎప్పుడు critical ఐనా … ఆలోచనలు గందరగోళ పడుతున్న … నేను ఎప్పుడు వచ్చే చోటు ఇదే…

                                                                                    …………………………………..

అలసిన మృత్యు ఘోష గుక్క పెట్టె దీర్ఘ రాశుల కన్ను.. పైకి.. కిందికి జరిగే నిద్ర ద్రోహంలో పరాయిగా మారే భయం ప్రవహిస్తూ .. కొంచెం ఆనంద రౌరత మంటగా మారి లోపలి బెంగని కడిగే చివరి స్థలం లోని జ్ఞాన దిశా సవ్వడి. … వారణాశి.

అక్కడ ఉన్నదీ ఎప్పటికీ ఉన్నట్లై ఉంటుంది..కాని ఏది జరిగి పోకుండా అక్కడ ఆగిపోదు.  లేనిదీ కొత్తగా మన దారిలోకి శాశ్వతాన్ని అర్ధంచేయిస్తుంది.

చిత్రం.. ఆ రోజు అక్కడ …ప్రధాన దేవాలయానికి దగ్గరలో నందయోగి స్పీచ్.. భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాకు కాసేపు ఏం అర్ధం కాకపోయినా .. సరేలే .. ఆ వేల జనం లో నేనెక్కడ? నన్నెవరూ పట్టించుకొంటారు? అనుకొన్న… కానీ ఇద్దరు మనుషులు నా దగ్గరికి వచ్చి… స్వామి పిలుస్తున్నారని .. అన్నప్పుడు .. ఓ క్షణం నా గుండె ఆగి కొట్టుకున్నట్లు అయింది  … ఇదెలా సాధ్యం?

ఒక్కసారి రాగలరా ? మీకు ఇష్టముంటేనే అని స్వామి చెప్పమన్నారు. .. అన్నారు వాళ్ళు ..

నవ్వు కొన్నా వాళ్ళ వెంట వెళ్ళాను. అతనిలోకి కళ్ళు కలిపి స్పష్టంగా చూసాను.

జ్ఞాన దీపం ప్రసవించే వణుకు అతని కళ్ళలో… వదిలేసి వచ్చారా అనే దృష్టి ఏ మాత్రమూ లేదు.. అప్రసన్నత లేదు .. ఇంత చిన్న తొణికిసలాట కూడా లేదు.

ఈ రోజు మీరు మాట్లాడాలి ఇక్కడ స్టేజి పై అని చిరునవ్వుతో … అన్నాడు.

నా కళ్ళలో నీళ్లు … ఇది నాకెంతో ఇష్టమైన చోటు… నేనిక్కడ ఉండడానికి లేకుండా చేయొద్దు … నా ఉనికిని ఇక్కడ మరోలా మార్చొద్దు.  అన్నాను. జ్ఞాన వైరాగ్యం ముసిరిన దీర్ఘ బెంగ .. వానగా మారి పడవని నింపేస్తుంటే .. ఒడ్డు కనిపించని కంగారులో ఈత రాని నేను .. దూకాలా? అని చూస్తున్నట్లు…నిస్సహాయ ఉరుము … 

మీరు అన్ని వదులుకొని … నా ఆశ్రమానికి వచ్చింది.. నాతో మమేకమవ్వడానికి కదా ? అన్నాడు.

నేను తల ఊపి .. దానర్ధం … ఇరుక్కుపోవడం కాదు.

అతను నవ్వి… తల్లి గర్భం లోంచే మన ఇరుకు మొదలవుతుంది. చదువు… పెళ్లి .. ఉద్యోగ  భాద్యతలు.. పిల్లలు … అన్నింటిలోంచి… మన శ్వాస.. నిశ్వాసలు ..  ఇర్రుక్కుని అల్లాడుతాం … ఇప్పుడు ఇది మనకి కొత్త కాదు.

నేను ..వాటినుంచి లిబరేషన్ ఆశించే … మీ ఆశ్రమానికి వచ్చింది.

అతను నవ్వి.. సృష్టి అంత ఓ స్టాండర్డ్ పాటర్న్ల మధ్య మాత్రమే నడుస్తుంది… దీని నుంచి నేను కూడా exceptional  కాదు.. ఇదొక అలాంటి భ్రమ కలిగించే మాయ … దూరంనుంచి చూసే వారికి …

నాది.. ఇంకో వన్ ఇయర్ schedule .. అదీ రోజుకి 18 గంటల చొప్పున పని చేసుకుంటూ వెళ్తే .. పూర్తి అయ్యేలా ఉంది ఆ షెడ్యూల్.. మిమ్మల్ని మా టీం సుమారు three years గా గమనిస్తుంది.. మీ రచనలని అనలైజ్ చేస్తూ …మీరు నా తర్వాత వారసులని నిర్ణయించారు.

నేనయానని అలా చూస్తూ ఉండిపోయాను..

నేను ఇలా ఎప్పుడు కోరుకోలేదు. నాకే వినిపించనంత చిన్న గొంతుతో అన్నాను.

ఇదంతా … మీ పూర్తి అంగీకారం తోనే జరుగుతుంది. మీరు మీ లోపలికి పరిశీలించుకొంటే తెలుస్తుంది.

కంగారు పడాల్సిందేం లేదు. మనం ఎన్ని అనుకున్న … సృష్టి తన కోరుకున్న దానిలోకి మనలని లాగుతుంది.

నాకు ఒక అభద్రతా నుంచి మరొక అభ్రత లోకి వచ్చిపడ్డట్లు ఉంది. అంది .. ఇంకా తగ్గకుండా…ఇలాగే అని అర్ధం చేసుకోవడానికిసృష్టి దేనినైనా తేలికగానే వదిలేస్తుంది.. అన్నీ కనిపిస్తున్న రహస్యాలే…  మనపై ఎటువంటి బరువుని ఉంచి తేల్చుకోమని చెప్పావు.. ఈయన అలానేనా?  

ఆ Dhanesh ఏమైయ్యాడు.. జైల్లో …

అతను నవ్వి… ఖైదీలకు … రోజూ ప్రవచనం చెబుతున్నాడు. అదొక Political స్టంట్ … ఇప్పుడీ హోమ్ మిస్టర్ గా చేస్తున్నా పార్టీ .. ఎలెక్షన్స్లో ఓడిపోబోతుంది… అతను పార్టీ మారబోతున్నాడు.. అందుకే ఆ మరో పార్టీ కి నచ్చే పనులు చెయ్యడం మొదలు పెట్టాడు. వీడు ఇంకొక ఐదు నెలలు లోపల ఉండాల్సిందే … FIR ని ఆ రకంగా కుక్ చేసి బిగించి ఉంచారు….

ఇదంతా మీకు తెల్సే… అన్నాను. మాట పూర్తి  చెయ్యకుండా….ఎక్కడో లోతుల్లోకి బాణం దించాననే తృప్తి … 

నాకే కాదు … వాడికీ తెల్సు… అన్నాడు.

ఇప్పుడు పగిలింది నా లోపల నల్లని బిళాలని మింగే గొంతు.

విశ్వం నిండా సంభవ శిఖరాలు స్పష్టం చేసిన కదిలిక .. అదే పుట్టుక అని రెండో వేపునుంచి అరుపుని అందుకొని .. ఆ లోపలి తిరిగి మృత్యు సద్భావం లేని కానుకని వర్షిస్తూ … నేను ఉన్నదీ… నేను లేనిదీ .. గమనిస్తున్న మట్టి గర్భం లో .. కొన్ని ప్రాథమిక అడుగులని దగ్గర చేసుకొని కొత్త నడకకి సిద్ధమౌతూ….

ఆమెకేదో అర్ధమైంది … నేను సిద్దమే అంది.

                                                                     …………………………………….