మాయా దర్శిArijith

Download Free Ebook
Download Now

మాయా దర్శి … ఎనిమిదో తమగమన

అసమయ దీర్ఘ దృష్టి కథలకి లేచిన అంపకాల నివురు తోడుకి.. అడివి చేర్చిన పడవల అటు ఇటు గట్టులపై కొండలు చేసిన తీర్మాన కథ .. పాట….కప్పుకొని వెళ్ళడానికి వెనక ఎవరూ లేరు.. నీరు పోసుకొని ఆందోళ పడి.. స్టూడియో కాళ్ళని సంచీలో ఉంచి.. అడివి పక్కన ఉంచాక.. పడవ వచ్చి పలకరిస్తోంది..

అద్దిన అద్దకాల నిప్పుని ఊది.. పొగరు చల్లారిన రుణ కథ ఏటవాలు ఊపిరికి కలుసుకొని.. ఇంకిపోయిన నలుపక్కల తీరికని జోడించి కదిలే మాటలతో.. కాస్త నెమ్ము.. బిగించిన నొప్పి.. గొంతులో పండిన దగ్గు .. లాలా పోసిన చీకటి నెలలకి కూరిన మట్టి జడల తలుపుకి గొళ్ళెం పెట్టి.. దీప హద్దులు ఉడకబెట్టిన మాంస గుండాల గతికి చెక్కిన మాటలు.. ఆంగ బంధీమాల రుణ శీర్శ్య బిగింపు.. నిలబడి కదిలిన ఊపు.. అదే స్వరమని తట్టి లేపిన మెలకువలో కలిసిన శూన్య గర్భ నిర్మాణాలు.

……………………….

బయట పడలేనని .. ఒద్దిక తీర్చుకోలేనని .. కథకి మూలకాలని సిద్ధం చేసిన చీకటిలో ఆదమరచి తిరగలేనని .. కదిపిన సమయ భయాల్లో చిక్కుకొని .. నిర్ణయ తీరిక వదిలిపెట్టలేనని తెలిసి.. వెనక నుంచి దూకాలని చూస్తూ.. భయమూ.. అభయ మాయకి నేసిన కాటుకల వలలో చిక్కిన పడవల కన్ను.. దీవుల్లో జరిగే విందు..

మృత్యు సాధకి లేవదీసిన కథకి నిద్రని చేర్చి వదిలేసిన పాట…బోరుమని తీరికని కడిగి.. ఇంకేం తెలియని విపత్తులో ఉడికి ,, కథకి నిలువెత్తు దూళి తెరని కట్టి .. ఇంటి ముందే చల్లార్చి పోయిన కథన భాగం మోసగించిన హద్దుకి చేర్చిన రంగుల గుండ్రం మళ్లీ కక్ష్యని చేరి.. 

……………………………..

లాలహ సృష్టి మోహార్ణత ..ఒక్కోటిగా దగ్గర పడుతూ.. శిధిల దేహ తాండవ చిహ్న రంగుల గదిలో ఒక ఊరు చతికిలబడి చూస్తూంది.. కథలేం వినదు.. సృష్టి కాపలా ఒక్కోటిగా నా నుంచి దూరమవుతుందన్నప్పుడు.. ఆమకళ్ళలో నీటి పాదాలు జారుతున్న చెమ్మ కదలాడుతుంది..

నేను ఉలిక్కిపడి దగ్గరకి వెళ్ళబోతే ఆమె దూరంలోనే ఆపేస్తుంది. వండిన అన్నం వడ్డించనే లేదు.. బయట కురుస్తున్న వర్షం కారుతూనే ఉంది .. కిటికీ అద్దం పగల గొట్టిన నా అరచేతి రక్తం ఆగనే లేదు .. ఆమె పాడుతుంది.. నాలో కరుగుతూ పాడుతుంది.. నాకేం వదిలిపెట్టాలో అర్ధమయ్యేలా పాడుతుంది. 

సంయోగ శిశుమతి తడిచిన నిద్ర కూర్పుల కైవారంలో పడి ముక్కలైన ….దేహ స్థితుల నిలేహిత వారింపు. పట్టుజారినప్పటి కలత నివేరణ…గోడలని కూల్చిన నిశ్వాస గోళంలో విడమర్చి చెప్పుకొన్న పరిమళ పొరల ఎత్తుగడ .. మోసగించిన గొంతులోని నిడబాటు. తడబడిన కక్ష్యలో మోసిన మంచు నలతలుఎక్కడికో  తెలియని వెనకడుగు .. నిద్రపోతలని  తుడిచినా  గుర్రాల  సకిలింపు .. తెలియబడటం  గుర్తుకు  లేదు. నిశామయోల సాధకి వచ్చి వెళ్ళడంకనబడుతుంది . తప్ప….పూడ్చుకోవడానికి లేని నిధి నాభిలో .. పొగని కూరిన విశ్వ సాధనలోఒడిసిపట్టినఅనుకరణ ఎవరమూ ఒక వివరాన్ని పట్టుకొని మొదలవ్వలేదని ఆమె అంటుంది. వినిపించుకోవడానికి ఏదో మాయ అడ్డం పడుతోంది. 

…………….

అదేం హెచ్చరిక కాదు..నిరశన అంతకన్నా కాదు. కథ గుప్పుమంది . ఆ బాటిల్ లో ఉన్న చీకటి నిర్జల దుఃఖ పత్రంలోంచి రాలే మెలగడ ..మహా స్వరం .. దుఃఖం పూడిపోయిన విశ్వ నిర్జన హేతు ధారగా కురిసి .. మిగిలిపోయిన కంటి ధూళిని తుడిచి కప్పెట్టిన ముఖాలతో మోసగించిన చీకటిలో..అంతః శాలల శ్వాస మెరుగు.. మహా మాయ … కదిలి మూసుకొంది…అనివార్య సమయ విలాస కట్టి చెప్పిన ఉనికిని కాల్చి పెట్టుకొన్న నిలుగు గతిసమయ ఉద్గారం లో అంటి పెట్టుకొన్న మాటల మెలికల ఒడుపు.. పెద్ద ఆవలింతలో పురుడు పోసుకున్న గొంతు ధారల కైవల్య జడ అల్లుకున్న నదుల ఊట ..సృష్టి వికేంద్రంలో కౌగిలికి  మసి పూసిన ఎద్దడి నిరూపాల పురాతన విరూపం .. గర్భంలో నిరాకరణ దృష్టి నిరూణ కలుపుడు ముఖాల వేపుగా .. సమయ వియార్గతని తట్టుకొని వదిలిన నిద్ర ఖనిజాలతో పాట.. రోప రోపల గస .. గడ్డ కడుతుంది

……………………..

విసుగుల రెండో విపత్తుల .. విశ్వాన్ని ముద్ద చేసి కురిసిన శ్వాస మయామి నలతలు.. పొగరుకి రెండో పక్క నేసుకొన్న బట్టని చింపి .. కట్టు రాల్చుకొని సముద్ర ఆవిరి ..కొట్టి తెచ్చిన ఊరి సంత .. బేరాలు లేని శరీరం ఏడుస్తూ పాటని అందుకొంది. నేను  మళ్ళీ  మొదలవుతానని .. తను విడిచిన చీరతో .. సగం కత్తిరించిన గొంతుతో  ..పొద్దు గడపలో నిలువు చెట్టుని దించుకొని వెచ్చని గొంతుతో .. టీ తాగుతుంది. నువ్వెప్పుడూ.. నేను నచ్చితేనే చేస్తావుగా .. ఇవిగో .. ఇవి సంచీడు  సాధనల గుళికలు..

మొదలుపెడదామా? ఆఖరికి చేరి నిలబడదామా?

…………………..

Note ;

ఒక పాపులర్ సింగర్ .. ఒక monotonous కక్ష్యల్లో చిక్కుకు పోయి .. ఆ కృత్రిమ లయని వదిలిపెట్టి.. తన లోపలి తనతో దాటాల్సి శూన్యం తెలుసుకొని ..అన్నీ వదిలిపెట్టేసాక ..  ఒకానొక మహాదర్శి తనకి కలలో కురిపించిన సంగీతాన్ని వెదుక్కొంటూ వెళ్లి.. తనకి తాను దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే .. అదే మాయా దర్శి … ఎనిమిదో తమగమన ..

…………………..

1.ఛాయా రోషణ .. రంగు పుట్టిన కంటి పాటల మడుగు

(Cream of laughs … dark entry duals)

వెలుపల నిలబడి మూత పెట్టిన గ్రహణ తీరు .. మూలకి చేర్చి పెట్టిన ఛాయా రోషణ ..

దిగులు ముడిచిన పెద్ద వాకిలి శరీర సంధి… నీటి పాముల అల్లిక

నిజానికి ఒక రాత్రి పొడుగు చేసిన గొంతులో..కొన్ని గిటారు తీగల పొడి రాత …

ఎవరు వెళ్లిపొమ్మని చెప్పారు. ఒకటో గుమ్మంలో పెట్టుకొన్న కేకని సరిచేయాలని..

దుఃఖం అకారణ వీలుని కనిపెట్టి .. మళ్ళీ చేరదీసిన కథతో పాడుకొంది.

ఎవరమూ కదిలించని కథతో చల్లారి పోయాం. .. వయో స్థలీన  …చంచరార్ధ..

ఏటవాలు గుమ్మంలో పగిలిన వయోలిన్ చెప్పిన పాటల గురి తప్పుకొని..

ఆవిరితో కరుగుతున్న పెద్ద పెట్ల రైలు.. ఊరు మర్రి చెట్టు విరిగి పడక ముందే ..

dustbin  లో మార్చి మార్చి రాసిన కాగితాల నీరు .. కళ్ళని నింపి .. ఉబ్బిన ముడి పోతల గుట్టు..

నిస్వా నిరాభారం .. కనబడని సంధి ఊరట్లో తగలబడి.. సమయోపి నిస్వస్థ గండం..

ఇక మిథ్యల తీరుని రాల్చిన ఊరట కథలో .. గుట్టు రుణాల ఏడుపు..

నసిగి తప్పుకొన్న కంటి ఊటలో ఈదిన నిద్ర దోషాల కైపుని ముడి పెట్టుకొంటూ.. పాట

చినిగిన షర్ట్ .. బస్సు స్టాండ్ విడిది.. కుళాయి నీరు.. ఒక చోటు ..
సైకిల్ విరిగిన క్షణంలో కళ్ళకి తగిలే తీరుతుంది. మాట నేర్చదు…

రెండూ ఒకేసారి జరిగినా .. విలసట లేని నిర్ణయ ధ్వని వరద కమ్మిన మర్మ తాకిడి ..

వద్దులే అని.. ఎసరు పెట్టుకొన్న గ్రహణ పోటుని మార్చి చెబుతూ ..

 తను ముట్టుకున్నా వీడ్కోలు నిండా ఉన్నదే  పాట.. రంగు మార్చదు.

అది ఐపోలేదు… ఎప్పటికీ .. వినపడలేదు ఎవ్వరికీ.. ఇంకో మూలన చోటు లేదు.

నిరూప మేఘం .. చెయ్యి ఊపిన కన్ను కదులుతూ.. నిద్ర వలసల గాబరా ..

వెళ్లిపోవడం .. ఉండిపోయిన నిద్ర రవ్వల కినుక వండి వార్చిన నిర్జల గుండం..

పూడిక లేని శ్వాస సంధికి .. వేరు చేయని.. కరకు మంట ఉమ్మడి ముఖం తో పండుతుంది.

దొరకాలని ఎవరూ అనరు.. నిస్త్రూప పగటి నిద్రపై ఉరిమిన కల.

మళ్ళీ సగం తెగిన తన అరచేతుల మధ్య వాలిన నదిని  సెగలో తోడి..

నిర కలహింత మోసిన విపరీతంలో చెలరేగిన హద్దు ఊపుకొంటూ..

 ఇక్కడే ఉండిపోవడమూ.. నిస్సత్తు మరకని తుడిచి కథలో రాలడమూ..

ఎవరూ ఇక్కడ మళ్ళీ చేర్చుకోవడానికి ఖాళీ చేసిన గదిలా ఉండరు.

1.నిద్ర పడకల ఊపు.. పాట లోపలి ఖాళీ దీపాల కొరివి

నిస్సంశయ భయం ఊడ్చిన పాటని పట్టుకొని.. తను ఓడిపొయిన కలని తాగి..

 ఇంకో కల్ప పుట్టుకని వదిలేసి పోగొట్టుకొన్న శ్వాస తీరుకి కరిగించిన స్వేద విపులతలో

ఊగే చిత్ర జ్వరం.. నిలదోసిన కథకి మోసిన ముఖాల గడువులో నివాళులు

అక్కడే కదలికనే కలిపి మరో నిశ్వాస కూపం.. ఛాయా నిజోరణ

అతను ఉండిపొమ్మని అనడు.. తిన్నావా అని అడగడు..

పాడటం అంటే .. త్రిగుణ తీవ్రతని మోసిన చీకటి స్వానునయంలో కాల్చిన

లాలింపు మసకల  ఊట.. ఒత్తి.. అద్ది తీసిన గోడలని వదిలి.. పండిన చీకట్లు

నువ్వు రావా? అంటే .. సంధి దొరకని.. నిద్ర పడకల ఊపు.. ఊదిన గోళాలపై పాట

ఏదీ మరో మధ్యని తాకిన నిరూప జ్వర బరువుకి పోత పోసిన కంటిలో కూర్చిన

ఎగుడు దిగుడు మాటలని కప్పుకొని.. విడిపోయిన కంటి శూలలో ఉడికిన గొంతు..

ఎందుకా నల్ల జీరా .. కొంచెం మాయ కలిపి తెల్లగా చేయగలవా?

అర్ధ రాత్రి.. ఎక్కడో కారు వెళ్ళిపోతుంది.. మళ్ళీ న్యూస్ పేపర్స్ .. ఫుట్ పాత్ గతేనా ?

………

గొంతులో… ఆదిమ గానం అరగదీసిన అడ్డు పోగుల ఎండ కమ్మేస్తూ..

 ఋణం వీడిన కౌగిలి లో పడి నిలదొక్కుకొని.. ఉండిపోయిన జాములోని.. కొండల కలత.

పాట లోపలి ఖాళీ దీపాల కొరివి .. అమ్మ కదా ? అడుగుతుంది.

నిశీధి మాయపు మంగళ ధ్వని.. అన్నీ నిండే ఉన్నాయనేగా ..

జీర .. శ్వాసకి అంటుకున్న బంక .. ఏడ్చినా ఉండిపోని వాకిలి పొట్టుని దులిపి ..

ఎవరో నిలబడతారు.. ఓ గ్యారేజీ షెడ్ లో మేనేజ్ చేసుకోమంటారు..

కానీ హార్మొనీ నిండా వాన.. చెల్లచి పెట్టిన బొట్టులా ..

 దుప్పటికీ మగ్గిన నిద్ర ఊడల కంటి నాల్కలని తుడిచి.. ఎత్తుగడ లేని కూపాలని దాటుకొంటూ.. మళ్ళీ పాట .. నేల చిమ్మిన వాన నిందల కరుకు నెలల బరువు…

ఆమె కూలుతుంది.. సవరణలు లేవు.. చితిలో వేసి కాల్చినా ఇదే నేను..

ఇలాగే నేను.. ఇంతే నేను.. ఇక్కడ మాత్రమే మిగిలిపోయే నేను..

…………….

అలాసకి రెండో ఋణం ఇచ్చి వదిలిన కొందరి కళ్ళ చుట్టూ

 ఊగి చిరిగిన ఊపిరి తిత్తుల లోపల గడ్డి మంట.. తెల్లబోయిన చీకటి తరలింపుల గుట్టు

శరణు మోసిన మొదటి రోజులో కాల్చిన నిద్ర పొగల నిద్రాణ గతి ఊటల ఉరవడి కొండ..

అది ఒక ఛాయా ముగ్ధం .. కాసిన్ని చవక సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకొన్న సబ్బు ముఖం ..

రెండు రొట్టెలు.. పల్చని టీ నీళ్లు.. రబ్బరు చెప్పలు.. ముడతలు పడిన పైజామా

 స్క్రీనింగ్ స్టూడియో బయట చెట్టు కింద .. మొదలయ్యే వాద్య గొంతులో..

 తాను రాల్చిన రెండు చుక్కల పొగరు. గ్లాసులో రాలిన బూడిద నొప్పి దూదులు…

కొన్ని ఊరికినే ఆగిపోతాయి.. కొన్ని కొరివి ఛాయల పలకరింపుని దాటి చూస్తాయి.

వెళ్ళిపోదాం .. ఇది .. తనెలాగూ ఒప్పుకోదు.. చావు మరో గడపలో.. కడసారి సిగ్గుల గుట్ట..

వెళ్ళికీలైన సత్యాల గుండంలో పడి.. నురుగులు కక్కిన కోపపు దోషాల యాతకి కూరుకుపోతూ..

విశ్వ సాధ్యత ఏడుస్తూ.. తేరుకోలేని మరింత ముట్టడి రంగుల ఊపుని పగగా అరగదీసింది.

………….

2.దేహ నిదూకం .. రొప్పిన బొడ్డు సూత్రాలు.

సూత్ర స్థలం ఏడుస్తుంది.. ఒద్దిక లేని నిద్ర గాహన ముద్దడిని లాక్కొని .. పగతో చెలరేగిన

నిస్వయ ముఖాలన్ని చేరదీసుకొంటూ.. తెచ్చి పెట్టుకొన్న నిద్ర ఊసుల కమకం ఏడుస్తూ..

ఆ ఆది ఖనిజ మంటల లోపల గొంతు ఉడుకుతూ.. త్వరపడని నిద్ర గుర్రుల కలత పంట

ఈ జీర నిద్రని ఎండ బోసిన ఖనిజ నింపుదలలు .. ఊరట పెట్టిన నివా ధూప శూన్య కత్తెరతో ..

 ఊడబెట్టిన కంటి మసకని పాతేస్తూ.. మోసపు ఊడల మెలికల్లో చిక్కుకొని..  

కదిలేది.. కదలని మన్నింపు గోళం లో జోడించిన కథని చేర్చుకొని .. చెమ్మ మడుగులో .. ఖాళీ

అనిత్య కోపపు మండలం లో దీర్ఘ నిశ్చంతకి లేవదీసిన పొడుగు నడక..

ఏదీ సరిపోతుందని.. ఎదురై కదిలే నీటి చూపుని కప్పుకొని .. చేర్చుకొంటుందని.. నాజూకు

 బొమ్మల చీకటి వదులుని .. కట్టుకొని .. అంచు తడిచిన కథ పట్టుకొని.. రాలిన పుట్టుకలు..

కొసరి తినిపించిన చీకటి కడిగి కూలిపోతూ.. సవరింపులేని సాధ్య నిరూణ దీర్ఘ మెలికలు ..

 కొండ ఊటల పాత పాటని మెత్తుకొన్న జాడలు లోపలి దాచుకొంటే…

…………….

బోరుమని ఏడ్చిన అమ్మ గదిలో కడిగిన నిష్ఠూర గ్రహణ కలమిడి వికర్షంలో వొంచి పెట్టుకొన్న ..

కరిగిన జాతరల డప్పు పాట పలకని.. దేహ నిదూకం .. తలబాటుల నిర్ణీత కక్ష్య..

ఉంటె ఉండిపొమ్మని.. లేదా కదిలి కరిగిన హద్దు వెంబడి .. లేవదీసిన కంటి సూత్రాల బొడ్డుని

 కరిగించి చేర్చిన ఝాములో … కలగాపులగపు.. జోడించిన కంటి  హద్దులు

రొప్పిన మంగళ కునుకుని సాగదీసి.. ఒద్దిక లేని విపత్తుని జోడించే కంటికి .. విసిగిన సముద్ర

 నిర్యాణ కొలత కొత్తగా చాపిన రెండు మెట్ల పితాని కడిగి .. చీకటి పారబోసిన మలుపులు..

ఇంకి పోవడానికి లేని నిద్ర చర్యలు…తెల్లార్లూ నేసిన పాటలు అవేగా ఉండక  .

కదిలేవి.. విదిలించి పట్టుకొన్నవి.. అనుకోని.. చెలరేగింపుల నిద్ర దోషం పట్టుకొన్న .. సంచార్య

గతి మొత్తాల కప్పడిన రాతల మధ్య తుడిచి పెట్టిన చూపుల బరువు..

మార్చి పెట్టుకొన్న తాళాల గొంతు .. మళ్ళీ చెలరేగిన దేహ మెరుపు చుక్కానీలని వదిలించుకొన్న

 బరువుతో.. నేలకి చేరుకొన్న పడవల ఛాయా కెరటాల దొంతర..

గుప్పిన నెలల గుట్టుని తవ్వుకొంటూ.. దోసిలిలో పండిన అమాంత తాకిడికి పోసుకున్న నలతలు.

ఏక సఫలత.. రెండోసారిగా ఉండిపోని చీకటి నలత.. ఆ దూరంలో మెరిసిన గ్రహణ కోపపు

 సంకెలకి మూర్ఛ పోయిన మంటల జాజుడి… అలమోత నిందలకి మలుపులు…

…………….

ఒంటరి పోటు కరిగి రాలిన కంటి కక్ష్య .. నిండు కలతని తుడిచే కథతో.. ఊరుకుని ఉండిపోయిన

 మాటల మధ్య చిదిమి రాలిన పొగల రంగు మూటలు.. చేదు నిగుమతులు 

పాటని ఎవరూ ఎదురొచ్చి పెట్టుకోరు.. తెలియనట్లు వెళ్ళిపోరు.

ఏది కావాలో అది తెలియడం లేదు.. ఇదే నిద్ర కలతని నీటిలో ముంచి

మళ్ళీ దగ్గరగా నిల్చి పోదు. నీటి బొమ్మల అల్మారా లో వదిలిన కంటి పోటు నిందలు .

అంతా తెలిసింది..ఏదీ చెప్పుకోదు.. వాళ్ళూ ఊరుని చేరుకోరు.

విసిగిన నిద్ర గదిలో అలమట తీర్చుకొన్న శరీర ఊపులని చేరతీసి.. కంటిని కప్పి పెట్టుకొన్న

నిరూప నిండు తనపు. నిఖరత .. అలవాటు కాలేక పోయాక  …

అదే ఇంకో కంటికి తెలియని మధింపుని మోసే దూప నిలజార ..

కత్తికి తెగిన జోడింపులని దాటి పాట కావాలని గొడవపడే నిద్ర మెరుగులు గుట్టు..

2.దేహ నిదూకం .. రొప్పిన బొడ్డు సూత్రాలు. .. కథ వినీ వినని నిద్రలు

ఒంటరి పోటు కరిగి రాలిన కంటి కక్ష్య .. నిండు కలతని తుడిచే కథతో.. ఊరుకుని ఉండిపోయిన

 మాటల మధ్య చిదిమి రాలిన పొగల రంగు మూటలు.. ధ్వని మొవ్వుల నిద్ర గుచ్చాలు

పాటని ఎవరూ ఎదురొచ్చి పెట్టుకోరు.. తెలియనట్లు వెళ్ళిపోరు.

ఏది కావాలో అది తెలియడం లేదు.. ఇదే నిద్ర కలతని నీటిలో ముంచి

మళ్ళీ దగ్గరగా నిల్చి పోదు. దూరం జరిపామని ఊరుకోదు…విస్మితః పోతలు

అంతా తెలిసింది..ఏదీ చెప్పుకోదు.. వాళ్ళూ ఊరుని చేరుకోరు.

విసిగిన నిద్ర గదిలో అలమట తీర్చుకొన్న శరీర ఊపులని చేరతీసి.. కంటిని కప్పి పెట్టుకొన్న

 నిరూప నిండు తనపు. నిఖరత .. వదులుగా రాలిన కొండల నెలసరి మంటకి తగలబడుతూ..

అదే ఇంకో కంటికి తెలియని మధింపుని మోసే దూప నిలజార ..

కత్తికి తెగిన జోడింపులని దాటి పాట కావాలని గొడవపడే నిద్ర మెరుగులు గుట్టు..

వెళ్లిపొమ్మని అనలేం .. ఉండిపోవడానికి ఎవరూ లేరు. ..

పెదాలకి ఎర్రగా కందిన భూమిలోంచి తీసి.. కదిలే నిద్ర గడువుకు చెమర్చిన దుడుకు సగంలో

 పూర్ణ నిలిచివేత ఏరి తెచ్చిన మంగళ రేవు..

శరీర సర్దుకొని నిలబడుతుంది.. ఎవరూ తెల్సుకోనేలేదు.

……………………..

3.ఘర్ష మైల ధూపం.. అడుగులో పడిన నిండు గదులు

ఏదో జరిగే తీరిన నిషిద్ధ రాత్రం జరుపుకున్న మాటలని అరగదీసి..

 కదలికనే కట్టడి చేసిన ఊరభూమి .. మళ్ళీ తెచ్చుకొన్న నడక.. చీకటి కలబడుతుంది  

ఎవరో ఇక్కడే మాట ని నంజుకొని.. కాటుక పండిన చీకటి మోసిన దృష్ఠి ఒంపులో ..

 ఊలడి పెట్టిన ఉమ్మడి రంగు.. కలత మోసిన కంటి జిగురు. కారి గడ్డకడుతూ…

పోత పోసిన నిద్ర వర్షపు గుండం లో కదిలే కెరటాల కైపులో నానిన కంటి వాలులు..

ఎవరీమె తెలియక వినపడని మాంస దర్శన కూర్చిన .. బీట పడిన శ్వాసలు

 వీడిపోని.. సవరింపుల కేకని చేర్చిన అరుపుని మింగేసిన జీర .. నిర్మితం

తెలియబడదు.. ఉండి వీడ్కోలుని తెరిచి వినదు. కదలాడుతుంది.. తెర్చుకోదు

అదే భావి.. నిన్న తెలియని ఎండలో ఊరేగే నిద్ర నలతల వంతెన ..

 ఆధార చిత్ర గతులని .. అంతే కలగలిపిన ముంపులతో ఏకమై.. సడి నిద్రలు

ఊడిపోయిన కంటి సూత్రాల మధ్య .. తేరుకొని రంగు ఊపులు .. అదిలింపులు

వడపోసిన కదలికనే జోడించి.. అక్కడిదీ ముందులా లేదని ,,

పాట విని వెళ్లిన గది చెప్పుకు తిరుగుతుంది.

………………

తిప్పి పెట్టుకొన్న అటు వైపు గొంతు.. చీకటి అనుసంధాన ముసుగుని తీసి..

పైకి లేచిన పొగల వరదని కమ్మేస్తూ.. ఎవరమూ.. మరో చిత్తడి సర్దిన పాటని పట్టుకోలేదు.

భయమూ .. ఏక బిగువులతో మోగిన నిద్రా నాదే.. కనిపెట్టిన కదలికలు…

ఒరిసిపోయిన చావు.. కదిలే నీటి ఛాయలతో మెరిసి ..మసక బారిన నిద్ర పోలికల ఉరుముని..

 పడి లేచిన కంటి చివరలో .. ఇదొక మాంస సముదాయ అలవడి రంగుల గతికి కట్టిన దృష్ఠి.

అదో సమయ కూర్పుని ఎగరవేసే .. అడుగులో పడిన నిండు గదులు .. తెర పాటులు

ఏదీ ఇక్కడ చేరవేసిన నిద్ర ముడులని మీటిన కంటి దోషం కడిగి.. వెక్కిళ్లు పడుతూ

హద్దుని జోడించే మాటలని వదిలేసి.. అతనిని లోపలి పిల్చారా ?

అదొక మహా చాయకి నునుపు తలల జుత్తు సరిదిద్దే కదలికనే జోడించి .. తాడించి

పేర్చుకొన్న గొంతు తీరులు…వీలు వెంబడి నడిచిన కంటి రేవులు

. పదే పదే గుచ్చిన కత్తి.. సగం రక్తం కాలిన నిద్ర విరుపుల నెట్టుడు…

మళ్ళీ తెలియని తీర్మాన ఒంటి నిద్రకి జాలంలో ఇరికించిన రంగుల గొడుగుని వదిలిన ఊరు..

మసి పోసుకొన్న చీకటి .. రెండో సర్దుబాటుని అటు పెట్టుకొని..

ఇదే చెప్పి వెళ్ళడానికి లేని.. దేహ ఋణం.. పగిలే కంటి పోటుని సర్దిన కథ,, అదీ నేనే..

……………………..

చిదిమి పెట్టిన నీటి జ్వరం.. కదిలే గోడల మధ్య కదిలే నిద్ర ఊపుల కరకు గొడవ .

 పట్టి తెచ్చుకొన్న దేహ ఋణం .. సగం రక్తం కాలిన నిద్ర విరుపులు నెట్టుడు…

ఊసు తెలియని సర్దుబాటుకు .. లిపి తుడిచిన శాసన నిర్మితి.. కదిలే వాలు కొండల్లో ..

 ఇంకా దొరకని ఖనిజ కథలు.. నిండు రాత్రుల్ని మోసిన చీరలు…

అతనిది అదే కల .. రెండో గడపలో మోసుకొన్న చీకటి గుట్టలో వేషం తీసిన ….

నిర్దయ ఏకం లో పడి కొట్టుకు పోయిన గట్ల వెంట .. ఇంకా తిరిగే పాట..

తాను అదే అంది.. ఎలాగూ వదలవని తెలుసు.. నేను వదిలేస్తేలా ..అని..

జరుగుబాటు లేని చిత్రా దూరంలో కంటికి చేమార్పుని కట్టి దుళ్లగొట్టిన నాజూకు..

 మందలింపుని కట్టుకొంటూ.. ఇంకేదో దూర విసుగును వడపోసి .. పైకి తీసిన నిరూప మెరక..

చల్లార్చిన నటనలని.. రంగు తీసిన చీకటిని.. పైకి చేర్చిన హద్దుని వెనక్కి లాగి..

పైన పోసుకున్న ధూప బోర్లింతలని కదిలిస్తూ. అడుగుకి చేరిపోతారు….

                         ………………….

4.పాట జోలల ఆరడి.. నిశి లోపపు రుణ కలత .. రోషాలు

ఏక ద్రువపు మందలింపుని కరిగిస్తూ.. తీర్మాన మందలింపుని కదిపి.. నలత ఊటలు

ఎటూ తేల్చుకొని బయట అలసట దర్శన నికరాల కట్టడిని ఏరివేస్తూ..

కదిలేది.. నింపి రాల్చుకొన్న కలల ముట్టడి అదిలింపుకి .. లొంగిపోలేక

వేరే చూడని నిద్ర కూర్పుల సన్నిహతపు పగని గడ్డ కట్టించి.. లోపల తిరుగుతూ …

జోడించినవీ.. ఊడదీసి.. కదిలే నిద్ర గుణమే మోసిన కలకి ఆరబెట్టి..

తేరిపార చూసిన నిద్ర అనువాద ముంపులని కట్టుకొంటూ.. చెల్లాచెదురై

ఒక దూరమూ.. రెండు రంగుల చీకటి కొండలో చితి కాలిన ఉరుము..

మళ్ళీ చేర్చుకొని.. పోలికల ఊరభూమి రంగుల కావలి .. మాంస పొడులు

నేను ఇక్కడ పాటతో లేను. పాటలో ఉన్నాను.. మిగిలి రాలేను ..

పాట కాకుండా లేనిదీ.. ఇంకేదీ కానీ ఆ మాటలు దూరం జరిపిన చావులో నాని..

……………..

విసిగిన రెండో చీకటి పేజీలో పడి .. మాట తుడిచిన అనుసార ముఖాల కొత్త నిద్రని

వదిలించిన ముసుగులతో.. తలుపు చాటు .. బిగి చచ్చిన దూరాల్లో పడి ..

కొట్టుకు పోతున్న సముదాయ .. మందలింపుని .. ఒరిసిపోయిం కంటి నీరు పోటుని …

దేహ ఊపులో పడి కూరుకు పోయిన మందలింపుని .. వద్దని వాళ్ళేం తోసేయ లేదు.

కదలికనే జోడించి ఔననీ అనలేదు. కూరుకు పోయిన విసుగుతో పడి..

చీకటి అలుముకున్న నిద్ర వేసట కౌగిలిని కట్టుకొంటూ.. పట్టు నులిమాక…

ఇంకేం లేదు.. అదే అని ఉండిపోదు. కదలిక రెండోసారి కనబడదు..

కాస్త వద్దని వాళ్ళేం తోసేయ లేదు. కదలికనే జోడించి ఔననీ అనలేదు.

 కూరుకు పోయిన విసుగుతో పడి.. చీకటి అలుముకున్న నిద్ర వేసట కౌగిలిని కట్టుకొంటూ..

కాస్త  .. కాస్త గా పోగొట్టుకొన్న నా లోపల నిద్ర ఓ మంత్రం జాల కోపమై..

 లోపల పాటని వదిలి చెదిరి పోయిన కలల మధ్యనే కదిలే కంటి శూలపు…

 నిద్ర  సన్నాహంలో చెలరేగిన నేను .. ఉండి రాల్చుకొన్న తోడు.. శ్వాస రజాణి

దూరంగా ఉండిపోయిన నువ్వనే కదలికనే పట్టి రాల్చి .. కనిపోయిన చీకటి చూరణం

నీళ్లలో కలిపి పంచుతూ.. విరామ దోషాల కంటి గడపని మోసిన కన్ను.

నేనేం నిన్ను ఉండమనలేదు.. వెళ్ళమనీ అనలేను.. నేర్పి పెట్టుకొన్నాను

 ఏదైనా జరుగుతుందా తెలియదు.. అలా అవ్వాలనీ లేదు…తెలిసి కూలాను..

మిగిలిన నా పాటల ముక్కల మధ్య .. నీ దుఃఖపు ఎంగిలి .. ఎర్రటి పొంగలి

తిరగ బడిన కథల్లో పడిపోయిన దేహ విందుల కథ పర్చుకొంది.

ఎవరమూ వద్దన  లేదనే చెప్పుకొంటారు. చేజారిన ఈ వ్యాక్యం ఆ ఊరిని మరకని తుడిచి ..

 పాటని కలిపితే తను వింటానంటోంది.. చింపి పోసుకున్న ముఖ వీధులు…

…………………….

సమయమని నిద్ర ధోరణిని కనిపెట్టి.. ఒద్దికలేని అపార్ధ ధ్వని చిత్రం

అద్దిన కలబాటుని మోసుకొంటూ.. వంతెనల పక్కగా .. దీవి మోసిన గొంతు

 కొంచెం వేలాడ దీసిన ముఖాలన్ని కడిగి వాళ్ళు బొట్టు పెడతారు..

జేబులో కొన్ని నోట్లు కుక్కుతారు.. మందు సీసాని గిర గిరా తిప్పాలని చూస్తారు…

అదేం పాట కాదు.. కానీ పాట నొక్కినా మీటాలని తొడుగుతూ .. హద్దు ఊడదీసిన కథకి ..

రెండో దీప సంధి లేని నివేశ చలన కలబెడుతుంది. కథ పడుతుంది..

విరుద్ధమవలెను.. ఇంతే అని కట్టుకొని ఆగలేను.. కదలికనే చుట్టి .. మోసుకొన్నాక

మసక గ్రహణంలో పడి కొత్త గొంతుని మోగించలేను. పట్టి చూడలేను..

అలా అనడానికి ముందే తెలుసుకొన్న చీకటి గదిలో .. నిండి జారినపుడు…

 గొంతుకి వేలాడిన పాట ఉక్కిరిబిక్కిరి అవుతూ.. నిమ్మళంగా ఉండిపోయిన పాట.

………………….

5.నిశి మొరలో శృయ రక్ష .. విదేహ నిద్ర పూడికలు 

శరీర మూలం లో చేర్చి పెట్టుకొన్న నడకలు .. రెప్పలని అద్దిన కట కటల మధ్య …

 విదేహ నిద్ర పూడికలు … చెమ్మకి మోసుకొన్న దేహ మోతలు .. పరిపరాల కక్ష్యకి ..

చర్చిత నిడబాట్లు కలిపి చేసుకొన్నా .. నీతో గమించనవీ .. కూలి ఎగిసినవీ..

ఉండిపోయినవీ .. కథలో ఉండి కాలిపోయినవీ .. రంగు పట్టి చెలరేగినవీ..

ముందే తెలిసి.. కథలో ఒరిగిపోయినవీ.. పాటై స్థితి చెప్పినవీ…

కడబాటు చీకటి ఒడిలో కోరిన కంటి శూన్యమే నేను.. నువ్వు అటు పక్క ఎడమ విడిదిలో

 ఉండిన ఎండు కలల పాటవి . బీడు మోసిన నది గట్టు జీరలవీ.. ఉరిమిన రుణాలు

వాళ్ళు మరేం అనుకోరు.. నేను ఇంకోలా ఊడిపోయిన ఊరట నిశి ఝాములో

అప్పగించుకొన్న శరీర ప్రదక్ష కొలివిని అరగదీసుకొంటూ.. రేహనించుకొంటూ

ఇంకేం ఇక్కడ అదీ అనుకోలేని ముఖం పక్కకి వడపోసిన నస సముదాయాల మధ్యనే

తిరుగుతూ .. హద్దుల్ని సాగదీసిన కథకి కొన్ని వంకీలని చేర్చి మాటలని తాగుతాను.

పాట అక్కడే ఉండిపోయిందని ఆశ పెడతారు. కన్నుకి రుద్దిన మంత్ర తపపు

ఒరవడి ఛాయని కడిగి.. లోపలనే అలసటకి రుణపడి కదిలే కంటిలో ..

………….

మూలంలో పోసుకున్న రుణ గది ఎత్తుపోతల కొండ .. ఇంకా లోపల బరువుగా దిగుతూనే ఉంది.

కళ్ళలో పారబోసుకొన్న మసక చిత్రాల కలాప ద్రోణుల్లో పడి .. మిగులు పడుతూ

 లోపలి దిగబడిన పాటకి చేర్చిన నిశి మొరలో శృయ రక్ష .. దండ ఊదనలు

ఏదీ ఎందుకూ కాదని.. కక్ష్యల బయట ఏడుపు గొంతుతో .. రంపంలా మోగుతూ

వదిలి పోయిన సగం గుర్రుల ధూపం పట్టి వడపోతలతో .. గతి నిలించి

హద్దుకి ఆవల విడిచిన చుక్కల కొండలో .. ముఖం తెగిన పాట .. కథలో లేదు

 కొంచెం దూరమూ.. కొంచెం సవరించిన దగ్గర్లో ఊరేగి.. నెట్టుకుపోతూ…

తొందర గడిచిన నిద్ర తీరికలేని విడిదిని ఖాళీగా పెట్టి.. ఉండిపోయిన కునుకు..

ఎప్పటి పోతలతో కాలిన అరికాళ్ళ చప్పుడు .. తబలాపై మోగి..

 రెండో తలుపు లేని విపరీతాల సంధి గమణిత ఊడ్చిన కంగారు.

ఎవరమూ లేము.. ఎక్కడా ఆగము .. కొంచెం తడబడే నిద్ర పూనకాలే మధ్య

ఋతువుని కడిగి.. తొందరలేని కన్నుని చుట్టేసి పాకుతూ.. వలస పోయిన పాట..

…………………….

పూడికలు.. నిండి పోయిన నిరాధార కంటి ధారణ మోసి తెచ్చుకొన్న నిగూర్పు..

కన్నుని ఎత్తి.. బిగి సడిలిన దుఃఖంలో మెలికని సరిచేసి.. పాటని పోగు చేసి

కలకి రెండో వేపు పగిలిన ముట్టడి రంగుల దేహం పట్టుకొని .. విరుచుకొంటూ

ఊగి .. ఊగి.. రాలిపోతున్న పాట . అక్కడికే దూరం జరిగిన మాటలని కట్టుకొంటూ…

 పల్చని ఊపుని సరి చెయ్యలేని హద్దుకి పక్కగా .. నీరు కూలిన వంతెన

.శృయ నిద్ర కాల్చిన గది బోగపు బరువులో … నిశి చేరికలు. ప్రదర్శ మోడులు

ఉండిపోవడమూ..పగటి ఋణం పీల్చిన దృష్ఠి విముఖుడి సర్ధబాటుకి కదిలే భూమి ..

 మూడు మడతల సారం .. మోసి తెచ్చుకొన్న ఊరిలోని వంట ఇల్లు.

ఏటవాలు సంధికి అంటిన దూరాల నిధి.. కాలేక పోయిన పునాదుల మధ్యనే ఊగి పోయిన

మరకల గోడ .. వేలాడే ఒక ఫొటో.. అంటించి వదిలిన పాట ..

వెళ్లిపోవడానికి మడత పెట్టిన వీధిలో పిసికి వదిలిన దేహ భూమి కలరింత ..

 ఎక్కువ తక్కువ లేని మిగులు రాతల ఫలకం పై చెక్కిన ఊడలు.

పునాదులు పట్టి ఊపిన ఇల్లు.. పాట పిండిన కళ్ళలో ఊరేగే ఊరు గుమ్మాల రోటి పోటు…

చెదురు మదురు రంగుల గడపకి అద్ది తీసిన నాజూకు చూపుని బిగించి..

 కదలిక లేని విసుగుని వడపోసి.. ఆ మూలకి విసిరి కొట్టిన పాట..

ఏదో తెలిసినా .. అక్కడ ఆగిపోయేదిగానే ఉంది….

………………….

 6.నిద్ర పుకారణ … సోధారణ మితి పేలికల నిద్ర ఎర

కదిలే కంటి దేహపు పగుళ్లలో కూరి తెచ్చిన పాట మూట విప్పలేక .. వెళ్లనూ లేక ..

వాళ్ళేం లోపలి పిలవ లేదు.. బయటనే కదల లేదు. వదిలి పొమ్మన్నారా

హద్దు ఒక నిద్ర పుకారణ.. జంట పూడ్చిన శ్వాస బోగపు నిండాలని ఊడ్చి ..

 కంటికి చేర్చిన నడకని తేరుకొనే మన్నింపుతో ఊరిస్తూ ..

 కలబడే దేహ చిరాకుని కప్పుకున్న దూరంలో ..సోధారణ మితి పేలికల నిద్ర ఎర…

ఆవ పెట్టిన పుట్టుకలు..తెర కట్టిన నల్ల ఝాములు .. రుణ భావుల పొగ నిద్రలు

 పొడవు కత్తిరించిన మసక రొమ్ముల గొయ్యి.. పాట విదిలించిన చెట్టు కిందుగా

 చావు గడపల విందూ .. పాటే .. అది మరో పక్క నుంచి పాకి  నషా నింపినా…

అప్పటికి ఉన్నదీ నేనే .. ఉండిపోలేక ఖాళీ నిద్ర ఆయాసాల తూర్పు గడపలో నుయ్యి తవ్వి..

 కథ చెప్పుకొన్న ఝాము తెరవడీ నేనే.. చీకటి నెలవడి లెక్కా నేనే…

నిశి సంకెల ఊడిపోయిన వదులు ఎండ కౌగిలి తెరిచిన గుమ్మాల గుట్టూ నేనే..

 ఆ పాటగా మిగిలిన చిన్న ఖాళీ నిమిత్తం లో పడి కూత పెట్టిన చీకటి మడుగులో

కూలిన తీర్ధ రథమూ నేనే,, మాయా గది విచారమూ నాదే….

………….

ఎదుట పడిన రెండో పోలికలో ఊసు.. పగటి ఝాము మంట పెట్టిన

గస గొంతులో రగిడిన హద్దుని .. మార్చి .. ఏమార్చి.. తమార్చి.. చేకూర్చి

 వెల వెల బోయిన స్థితి చిత్రణ కవ్వింతలో నెగడుని ఊది..

కూర్పుల బయట పెకిలిన నిద్ర దర్శన కొండల నిశి రూపుల బిగువూ నేనే ..

 కంటికి పేర్చిన చెమ్మ రంగుల ఊపుడు మాటల మధ్య రంగు వెలిసిన చీర

 బరువుల నిద్రా నేనే.. అలా ఎదుటపడడానికి.. ఇంకెవరో కాదని కూడుతూ..

ఇలా చెప్పుకొని విడిపోవడానికి లేని కథ బయట దీర్ఘ వాలులో చెలరేగే నిద్ర తవ్వకం..

ఊగ దిమ్మలు.. పోత కొండలు.. గాలి నీరపు నదుల ముద్దలు..

 కథ గెలుపుల పాట మంటలు .. నడుం ఊదిన కలత మోడులు…

అది వేదకాలనేం లేదు.. ఇది ఇలా ఊసు తెచ్చుకోవాలని లేదు.

ఊరు మారింది.. పాట తోడకుండానే ఉంది.. కప్పి మార్చుకున్న రంగుల మార్పిడి

మోసపు కలలో పోసి తెచ్చుకొన్న గారడీ నొప్పుల పిలుపుకి ..

 ఆ దూరంలో నెరిసిన గంటల కూర్పూ నేనే ..

అది ఉన్నపుడు ఇదేం లేదు..ఇది ఇలాగే మిగిలి ఉండాలనీ లేదు.

……………

ఒకే విన్నపము.. ఎర పుకారణ .. ఒంటి గడప ఊసుల భరిణ ..

పెద్ద ఎద్దడి గదుల మధ్య ఊగిన అద్దాల కొండకి వేలాడించి పట్టుకొన్న వాన బరువు పాట ..

అవతలకొచ్చి ఉండిపోవడానికి పాట ఎక్కడికీ వచ్చి ఆగి పోదు..

 నిద్ర ఎండని సాగదీసి .. కాళ్ళ మధ్యలో వదిలేయదు..

ఉండబోతుంది.. ఉంటానని చెప్పా బోతుంది.. హార్మొనీలోంచి ఎలక పరుగు పెట్టి బయటకి  

వెళ్ళిపోయాక.. నిండు చీరాల బిగువులో వెలిసిన దీప నిడివి మీగడని చిలికి పాట ..

రెండో గోతుతో పరాయిదిగా ఉండి.. కొలత మార్చిన సమయ మిగులుని సరిచేస్తోంది.

కొత్త దిగులు.. నీటి ఊట.. మసక కోసిన కత్తిని దూసి.. అవతల కాల్చిన మాట తీరులో .

. కలిపి చుట్టుకొన్న బోణీ మాటల పళ్లెం లో కదిలే ముఖాలు.. రుబ్బిన పాట కథనాలు..

గుర్తు పట్టనట్లే ఉంటారు.. ఊసులు మొత్త పోగుచేసి మూటగట్టి .. కనిపించకుండా పోతారు.

ఋణం తీరుబాటు లేని కదలికనే కరిగించి.. హద్దు లేవని నడకతో కొండల మధ్య ఊరేగుతారు..

అంతా ఇక పాత్రలని దులుపుకొని.. గోడలని మడత పెట్టి.. రుణ గుండం లో పడి ..

 పోలిక దొరకని హద్దుని రెచ్చగొట్టి.. కడబెట్టిన ముఖ తోడుల నింపారులు 

పాకిన పాట వెనక ఇంటి తీరుని దిద్ది .. మళ్ళీ చేర్చిన కంటి విపులల

పోలికని దూరంగా ఉంచి. నీటిపొద్దుని సరిచేసుకొంటారు. తలపోసుకొంటారు..

ఇక్కడ సరిపెట్టుకోవడానికే అందరూ సిద్దమై కలుస్తారు.

………………..

7. మసకబారిన కౌగిలి ..మోసగించిన  పాటల చీకటి. 

యదార్ధ గేలం తో చిక్కిన నిద్ర రాళ్ళ గట్టుని .. ముఖహల్తో కొట్టుకు పోయిన వీధుల్లో ..

 నిధార్ధ  తకమకలని పట్టి లాక్కొంటూ.. ఊడదీసుకొంటూ  పోయిన  పెద్ద  నిద్రల  కొండ

ఋణం కాల్చిన హద్దులే తెలియని పెద్ద చీకటి అడుగులో … మసకబారిన కౌగిలి..

కొన్ని విడిగా ఉండిపోతాయి.. కొన్ని విడివడి దూరంలో నిలిచిపోతాయి.

కథలు చెప్పుకోవడానికి.. మాటలు నీళ్లు పోసుకోవడానికి.. శ్వాస కొండలని ఎక్కడానికి ..

 ఉండి ఊరేగే ఖాళీల మధ్య మోసగించిన  పాటల చీకటి .. రెప్పల గొంగటి

అదే వార్త .. తెలియని తాళాలతో తీసిన కంటికి చెమ్మ .. నుదిటికి నెమ్ము …

 భయం కోసిన అరచేతులని నలుపుతూ.. రుద్దేసిన రెప్పలని చేర్చి ..

అలుముకున్న మాటల మధ్య పెదాలని వణికిస్తూ.. కదిలే దేహ వికర్షంలో  పలికిస్తూ

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రుణ పడి ఉండిపోయిన తీవ్ర ధ్వని జోడింపులని పెట్టుకొంటూ.. నేసుకొంటూ

దోసిలి నిండుగా గస లేపిన దుఃఖ తీరులని ఒడిలో తిప్పి .. శిధిల నొప్పి

ఇంకేం తెలియని ఆ దూరం లో ఒడిసిపట్టిన కథ. తెల్లార్లూ అరిగేలా తిరుగుతూ

ఊరిదీ .. మాట తీసుకొన్న బజారులో మూసేసిన తలుపుధీ .. గడియ పైదీ

కథ తెలియని విసుగుతో నేర్పిన మాటలదీ .. అంతా అనుకోని వదిలేసిన కథదీ ..

కలబడి.. వినబడే ఉండిన చూపుల ఆవిరిని వడపోసి నిండుకొన్న …కట్టుకొన్న

వేసట గుండం లో పడి తలపడిన గాజుల గుట్టలో పిండేసిన సగం తలుపు గుస గుసలు

వడపోసి.. అద్దం లో కూరి ఇంటికి పంపిస్తారు…తలుపులు చేర్చుకొంటారు…

ఇదొక సర్దబడని నిషాద బొమ్మల కొలువులో .. మోసపు దారిని కాల్చిన నిద్ర గడువు ఊరట .

.కదిలే నిద్ర ధూపపు పరిధిని .. మరింత చెలరేగిన చిత్ర బుజాల నడకని మమ్మిన పాట..

ఒకే కైవల్య చాయకి నేసిన రెండు బట్ట తానులు ..కొన్ని గుమ్మాలు..

నిద్ర ఊడ్చిన పెద్ద వీధుల గాలింపు.. తరలిపోయిన ఆకళింపు

అదే ఆగిపోక నిండు రాతల కైపుని సాగదీసి.. మోసి తెచ్చుకొన్న ముద్దడి ముఖాల

నిగారింపుని మోసి తెచ్చుకొని నిడివి. .. పోసి వెళ్లిపోయిన కలతల కొరివి

పోటు పెట్టే వెన్నునొప్పిని .. కథలో ఉండిపోయిన నులిమివేత్తల గుట్టుని..

ముట్టడి గతుల చక్ర దీపం ఏడ్చిన కలతో ఒంటికి చుట్టుకొన్న చీరని ఇచ్చినప్పటి పాట.

………………….

అవసరం ఉండనే ఉందని.. లేదని మసక ఝాముల ఓంపుని పగగా కూల్చి..

 ఒంటికి చుట్టిన నికార ధ్వని సమ్మతంలో పడి .. అదే చడీ చప్పుడు లేని..

 అవకతవక ముట్టడిలో .. ఊపు కప్పిన నడకని మార్చుకొంటూ.. ఇంకా ఒకటే ఏక పాదం..

గుప్పిన మట్టి నాడుల మధ్య కంపిన నిందలు. భయం చొచ్చిన నిద్ర తర్ఫీదులు ..

 తనిఖీ పెట్టిన రంగు రుచుల కథని పట్టుకొని వేలాడే గతి చక్రాల నిండు పూతలు..

వద్దనీ ఉండిపోయిన నిందల గొడుగు కింద చీకటి బరువు ధూళి.

ఒకేసారి అనుకోవడానికి లేని దూర చిత్రం ఒరిగిన నిద్ర రాట్నాల బిగువుని చుట్టి..

తీరికలేని అలముడు దీపం ఒరిగిన నూనె మడుగులో … శ్వాస అడుగులో

ఇల్లు.. కొన్ని ఖాళీ మూటల దుఃఖ భూమి కోసుకొని వెళ్లి అడుగుల మధ్యే ఇరుక్కుపోయిన

 చిత్రాల విసుగు. .. నిద్ర కథలు చేయించిన సమయాల మెరుగు…

కూలాడిన హద్దులకి దేహ సమ్మతాల జ్వర గూడు.. నిండి..

పండిన గాలులు మధ్య తిరుగాడే భూతంలా .. కట్టు తెంచుకున్న శ్వాసల అధీన రాశులలో

గుట్టలు పడ్డ వ్యతిరేక నిద్రల కొండ కరుగుతూ.. ఎండ నీరు కారుతూ…

హెచ్చరిక లేని నీపేక్ష సగం .. భూమి పైన్ టీ ల కొండ కట్టుకొని.. పాటని నూరి కలుపుతుంది.

,,,,,,,,,,,,,,,,,,,

8.చిత్ర రుచుల మరక … ఎండిపోయిన చీకటి ఆవిరి

కథలోకి పర్చిన ఎండని తీసుకొని.. భావిలో కూలిన నిద్ర దర్శనాల కదలికనే మార్చి …

పెట్టుకొన్న ముఖాలన్ని ముద్ద చేస్తూ.. కథలకి అడ్డం పడి సద్దు చేస్తూ…

కదిలేదీ నేనే .. కదిలించే నిద్ర ముఖాల మండలంలో కలదిరిగిన రుణ కథల ముట్టడి నేనే ..

పొగలు .. గాలి వాటపు రాతలు.. దుఃఖం బోరుమన్న ఇల్లు.. కావెడ జల్లు

హఠాత్తుగా ఇల్లు ఖాళీ అవుతూ.. ముసిరిన హద్దుల్ని వెలిగించే నడకని తోడుకొంటూ..

మాసిపోయిన గోడలు.. కన్ను పట్టిన కలల మధ్య ఊగే చింతన …సరి లేని పొంతన

గర్భం మోసిన పాట ని తాగి సొమ్మసిల్లిన కునుకుతో.. మాట నసులుతూ…

పిండి రాలిన కథ.. మార్చి చేసుకొన్నా ఒప్పంద నిండు రాతల కూర్పుని దాటించుకొంటూ..

మసి పూసిన జోడీ రంగుల ద్రవపు మంగళ శబ్దం తుడిచిన హద్దుల్లో పడి..

 తలకిందుల కెరటాలని  కొండ అంచులకి అతికించి  అప్పగించిన కునుకు..

భయమూ నాదే .. నిద్ర నాడిని చుట్టి సవరించిన మత్తు గాథల పాటా నాదే ..

ఏదో పొరపాటుని అల్లుకున్న నిద్ర విడుపులతో కదిలే దేహ నిరాహాల

కదలికనే పట్టి లాగుతూ.. తేరుకోలేని దోష రంగుల పోలికని తోసుకొచ్చే పాట..

………………

విసిగిన దేహ క్రమం .. నులిమిన కంటిలోని పాకుడు చెవి..

శబ్దం మాసిపోయిన నివురు ముడుల పొడి.. కథలోకి వాలి తెచ్చుకొన్న

 మెతక మన్నింపుల ముట్టడి. పోలిక జారుడుల కళ్ళ మడి

అదే మాటకి రెండోసారి అద్దిన చూపుని బిగించి.. ఎంపిక లేని చీకటి జారుతూ..

 హద్దు చెదిరిన కలకి.. రెండో సంకెల ఊడదీసిన మడత బొమ్మల నిరోషణ ..

తట్టి లేపిన వణుకుతో .. చెలరేగిన ముఖాల మధ్య కదిలే నిద్ర కదలికనే దాటుతూ..

 హద్దు చెదిరిన కథని తీసుకొని.. మోగించలేని కునుకుని తాగి.. సొమ్మసిల్లిన నడక.

..త్వర పడిన నిద్ర శంఖాల ఊట .. గొంతు నిండుగా పెనవేసుకున్న చీకటితో తడబడే …

నిశ్త్రత చేర్చిన జోడింపులని కట్టుకొంటూ.. తడి రేగిన కంటి జ్వరంలో

వణికిన దర్శన మూటల గుట్టని కుదుపుతూ.. మాయద ముఖాలని తుడిచి

పెట్టుకొన్న వానగూడుల్లో మునకలు. తోడుపడని చీకటి మంచు నెర్రులు..

కదిలేదీ నేనే.. కదలికనే ఆపేదీ నేనే .. చుట్టూ చెలరేగిన నిశ్చింత కదిలే ఎదురు గూడులో ..

మళ్ళీ వద్దనుకొని ఆగిన … ప్రపోలిత మోసిన కునుకు..

…………….

చిత్ర రుచుల ధూపం .. కమ్మేసిన నడకలా మధ్య కూలిన ఇల్లు..

 కదిలే రుణ మండలం లో చెలరేగిన ఆది నిద్రల ముంపునీ… పెనవేసుకున్న కoటి చూపుకి ..

 కన్ను చెదిరిన చీకటి ఏడుస్తూ.. రుణ బరువు ముట్టడికి చేర్చిన కథ..

ఏదోకటి .. ఎక్కడో అక్కడ మాట తీసుకొని… పాటని మాయ చేసి బరువెక్కి ..

 కంట్లో నులిమిన దుఃఖ చింతని చిలికి .. పారబోసుకొన్న దూరాలకు చీకటి రాళ్లు చివికి

రంగుల ఊగుకి .. పెనవేసిన రుణ చిత్ర గదులని తుడిచి..

కదిలే భయం పోగైన చిత్రాలతో.. కథల్లో కూలిన మడుగులు నిండుతూ

బోర్లించిన వంట గదిలో .. గొంతుని సరి చేసే చిత్ర రుచుల మరక .. ఏది ఉందొ ..

 అది మరో తెలిసే చోటుని వదిలి .. కరుకుగా పండిన దేహ గర్భ నీటి ద్రోణుల్లో ..

ఉబికినవి.. ఉండినవీ..ఉండి లేకపోయినా నిరాశ చిత్రాల చిత్తడి రాకలు ..

 ఒద్దడి నివ్వెరలని కాల్చి .. కొత్త చోటులో దొరికిన కలతో చెలరేగిన పాట..

విసుగుని .. విపరీత చెదురు మదురు.. ఆలవింతల్ని కుదిపి..

 మట్టి పోటులని పట్టి  ఘాతాల వినికిడి రాజీల కుట్రని మోస్తూ..

పగిలిన గోళాల తీరుని సరిచేసి..  ఎండిపోయిన చీకటి ఆవిరి. పండిపోతుంది.

…………………….

 9.తుడిచి..అద్దిన చావు మెడ .. అకల్వ మాయన జోరు

కాల్చి రాలిన చీకటి బెరుడుని తింటూ.. కొరికేసిన రంగు ముడుల కలకి ..

 రెండో వర్ణ చిత్రం తొడిగిన కథతో .. ముఖాలని చెదరగొడుతూ.. హెచ్చించి పోయాక

కళ్ళలోకి పోసుకున్న ఊరి నిడివిని చెదరగొడుతూ.. కూర్చి పోయిన నిద్ర శోధనల గుట్టు..

పరి పరి దీపాల జూలని .. శరీర గొంతులు ఉరుముని.. నాజూకు మందలింపులు….

 కత్తిరించిన గోడలని.. మళ్ళీ ఇక్కడే ఉండిపోయిన చీకటి రుణాల సవ్వర

అదే చెప్పుకొన్నాం … మాటని అడిగి తీసుకొన్నాం .. రంగుని కడిగి మారాం

 కదలని రొప్పుతో .. కురిసిన నొప్పితో …రంగుని తెరిపి గ్లాసులో పోసుకొన్నాం.

ఇదే చెప్పుకొన్న దేహభూమి అలుపుని మోసి తీర్చుకొన్న నిండు గ్రహణ మంగళ గతిని

 చెదర గొడుతూ.. వాకిలి బోర్లించిన కాళ్ళ మధ్య కుదిరిన చీకటి విస విసలు,

పోలికకి దొరకని కల బరువు మన్నికని .. తెరిపిన జోడించి పెట్టుకొన్న కలల ఊటలో..

సరి చెయ్యని తిమ్మిరి భూమిలో …తరిగిన కలతతో ..  ఒదిగిన హద్దులతో …

……………..

తుడిచి..అద్దిన చావు మెడ  .. స్వనల్ప మంత్ర గతికి చేర్చిన నిద్ర వాగుల్లో..

ఓర్పు మాటలని రుద్ది .. కట్టి పోయిన గోడల మధ్య కూరుకు పోయిన కాళ్లపై నిండు పాటని

 రంగులతో వేలాడదీసి.. కునుకు చెదిరిన ముళ్ళ కంచెల్ని తెగ్గోసుకొంటూ..

ఉండిపోయింది నేనే .. కదిలించి పెట్టుకొన్న నిద్ర ఉసురుకి .. తాళం పడి

మోసగింపులతో చుట్టేసిన కునుకు పడకని చిక్కగా తరిగి  నేసుకొంటూ..

దీప జారుడుకి పీల్చిన చీకటి .. కథల పాకుడికి కురిసిన గొంతు తడి

నిండుగా రాలిన నిద్ర పోటుకి మాట తప్పిన ఎర్ర కొండల నదిని ఊపుకొంటూ..

 కొండల్లో చిక్కుకొన్న ఆది మంగళ కక్ష్య గాలించినా ..ఉండిపోని దేహ మడుగులో..

తేలికైన నిద్ర దేహపు ఋణం .. మివేళ  పగటినీ చీకటని లాగి..  

……………

ఎప్పటికి చెప్పుకొన్న వదలని మాయకపు జోరుతో.. వదిలేసిన గారడీ ముఖాలని సర్ది ..

చెప్పి చేసుకొన్న గదులలో నిండిన నీటిని తోడుకొంటూ.. విడిచి పోయిన కునుకుని పట్టుకొని..

నిశ్చింతని జోడించి వదిలిన ముఖాలతో.. చీకటి అనువాదపు కంటికి తోసుకొని ..

విడిచిపోని మాటలతో ఇంకిపోయిన కథలతో.. ఇల్లంతా ఒత్తిన దుమ్ము సంచీలు

అవధిని తప్పించి పెట్టుకొన్న పునాదులు.. పెళ్ళగించిన శబ్దాలతో ఊడ్చిన కన్నుకి ..

రెండో ఋణం చుట్టేసిన కునుకు.. ఆ మూల మెట్లని మూత పెడుతూ…

పాతి పెట్టిన కూర్పులు.. వదిలి పోయిన గొంతులోని  మెరుపు నాడులు ..

తొలచి పోయిన మాంస పోటులతో కదిలే నిద్ర గర్భ ముఖాలని కలబెడుతూ పాట..

ఉండిపోవడం .. కదలికని మార్చి చేర్చుకోవడం .. వెలిసిన వాన గడపని లాక్కొని..

ఊడిపోయిన ప్రదక్ష కూడలిలో చెలరేగిన హద్దుని తోసుకుపోయిన అడుగులు.

……………………..

సమయమూ.. నేనూ ఎదురు తిరిగి .. నెట్టేసిన కథల మధ్యనే తిరిగే నిండు రాతని కప్పుకొని..

కలనీ మోసగించిన కునుకుతో హద్దుని  వేలాడదీసి.. అరచేతుల మంటని కరగదీసి..

కథలూ .. జోడించిన నడకల  మధ్య ఊరేగే సందడికి పాటని అతక లేక పరిధిని కూల్చిన

ఆనుపానులు చేర్చుకొన్న నదులని పెనవేసుకొంటూ.. గట్టుని పాటగా ఆకట్టుకొంటూ

తేరుకొన్నవి.. తీరుబాటు లేనివీ.. పగతో నులిమినవీ .. ఆదరించక కదిలిన నాటకాల మధ్య

కదిలే రుణ విపులీతకి మోసిన చీకటి నిలుగడ … పెద్ద కత్తుల నిలువు మెడ

ఋణం గుబులు పడుతుంది.. నస పెట్టిన గొంతులో కదలికనే తోడి ..

మసి రాల్చిన కంటి కింద తడి పొడిగా నలిగి   ఉండిపోయిన విపరీతాలు.

ఉండిపోవడం.. కదిలి చెదిరిపోవడం .. మళ్ళీ ఛేర్హుకొని కథని విన్పించి తప్పుకోవడం..

ఇది పాటకి ఎన్నో చరణంలో తెలియని గట్టు.. కాల్చి పోసుకున్న రుచి చిత్రాల కైపుని

మోసుకు తిరిగిన కిటీకీల మధ్య ఊదర. కథలని కప్పి పెట్టుకొన్న చీదర

10..చిత్ర జాలం కమ్మేసిన నడక … బొట్టు రుచుల దేహ జడ

కలా .. నేను .. ఏకైక దీపం లో రెండు కనుసన్నల మధ్య ఉరిమిన చూపుని కప్పి..

దూళి పండిన చూపుతో . గొంతు మార్చిన విడుపుతో…. మాట కట్టిన రుణ తాకిడి

ఏదో ఉంది.. అదే తెచ్చుకోవడానికి లేని తీరికని కదిపి.. నీలోపల చిత్ర జాలం కమ్మేసిన నడక..

అదే మరొక పల్చని దుప్పటిలో ఒరిగిన నిద్ర పొందుల చీకటి రుణాల  కలత..

మరేదో ఏటవాలు ముఖాల నొప్పిని .. అద్ది తీసిన కంటిలో కునుకు దాటిన గడపని ..

ఋణం పట్టుకొన్న .. చీకటి ఆనవేతల పునాది చుట్టూ కదులుతూ ..

నీరు పట్టిన నల్ల గదిలో ఉక్కపోత.. ఎండ గదిలో నేసిన కలనేత

కదిలే నిద్ర రుచుల విప్పరింతకీ తడిచిన కలత .. కూడలిలో పడి కొట్టుకొనే ..

నడకని జోడించి కమిలిన రంగుల్లో నానిన తడబాటుకి నిందలని కప్పుకొంటూ …

తేరుకోలేని మసకల కలని మోసుకొన్న నీటిముడి బిగువుని.. బిగదీసుకొంటూ..

కంట్లో తడిమిన చీకటి లోపల స్వశిత భ్రాంతిగా మార్చుకున్న

అనులోమన దుఃఖాల మెరుగు పూత శరీర గతి పోతపోసుకొన్న భయాలు.

అదే ఉంది.. అది మాత్రమే ఉంది.. అది లేనిదిగా మరేదీ లేదు..

నీరు పీల్చిన ఏక భుజం .. మాట తీసుకొన్న నిద్ర ఊరింపుల పొత్తుకు మాటని కడిగి ..

 చెలరేగిన నిద్ర వేళ్ళతో పూడికలని తీస్తూ .. రుణ గతిని చుట్టుకొన్న

ఝాము మండలంలో పడి కలియతిరిగిన మత్తు పేజీలు.. పాటలో పడి తిరుగుతూ..

…………….

చిత్ర జాలం కమ్మేసిన నడక .. ఒరిపిడి గాలుల  దశ చూరిన   మత్తుని కలిపి ..

 కథలో కూలిన మసక నీటి చిత్రాలు.. అద్దకపు మోతాదులని ..

 ఇగిరిపోయిన కంటి చూపుని .. తప్పించు చేసుకొన్న ఒప్పంద నిద్రలే ..

చేజారిన నల్లని గోడలతో… తెల్లార్లూ.. ఉండిపోయిన పాటల నిరాపాయల

పోలికని తెచ్చుకోవడానికి .. తలపడే గొంతుతో .. కాపాడిన చీకటికి .. నెట్టుకొన్న ..

ఇళ్ళని మోసుకొన్న .. మెట్ల బయటనే కిటికీలని హద్దుకి చేర్చిన చిత్రాల నిగురులు.

ఇది నమిలేసిన నా లోపలి అడుగు.. పచ్చి పొగ లేచిన నిర్భర గతి కరకు మాటలకి

చేర్చిన రంగులతో.. అద్దిన దేహ భుజాల బరువుని మోసుకొంటూ..

కదిలే భయమూ.. విసిరిన నిద్ర పూర్వాల కౌగిలి మంట పెడుతూ.. లోపలకి

జరిపిన దేహా చీకటి కొండని అరగదీసి.. కళ్ళకి జోడించిన శ్వాసతో దట్టమై..

మోసుకొన్న గదులు. విడిచి వెళ్లిపోయిన పాటల వీలునామాలు.

అదే ఉంది.. ఒంటిగా చుట్టుకొన్న గంటలని పాతుకొని .. లోపలికి  చేర్చుకొని…

దేహ ఋణంలో పాతుకు పోయిన నిప్పుల చిత్రం కడిగిన హద్దుని వదిలేయమంది.

అందుకే ఈ పాట చిత్ర జాలం నివ్వెర రంగులతో నానిన కమ్మేసిన నడక

……………

నియమిత సత్తువులతో … తుడిచిన కాళ్ళ మీదుగా చేరుకొన్న ఊరు .. పిసికేసిన కన్నులో

 పిడుగుపడి .. నుదిటి చితి పంటలో తగలబడి … నవ్వుకి పగలబడి

ఉరుముని మింగిన ..రుణపడిన వీధులు .. బజారు గొంతులో ఇరిగిన ఘర్ష మందలింపుని

 పట్టుకొని.. దూరం   చేసుకోవడానికి అనుకొని ..

 ఒరిగిన ఇళ్ల బయటనే తలుపు చప్పుడుని కోసుకొన్న పిలుపుతో  ఉన్నప్పుడే ..

నికర్ష  కాపాడుకొన్న కదలికకు రెండో విడిదిలో దాచి పెట్టిన చీకటి సానుపానుల

నిద్ర ముహుర్తత కూర్చిన కథనే మోసి తెచ్చిన నడక పోత పోసిన గదులు.

విపరీతము.. సగం విన్న నడక వెనక తలుపులు.. సోదాలు జరిపిన కథకి ..

 ఒక ధూప జ్వరం కమ్ముకొన్న దుమ్మని మీదేసుకొని బయటపడుతూ..

హెచ్చరికలు లేని సాధనని మోసుకొంటూ.. తడబాటు లేని నిర్దేశం చిత్రం ఒరిగిన నడకలు.

చిత్ర జాలం కమ్మేసిన నడకకి .. రెండో నిద్రకి మోసి తెచ్చుకొన్న వంతెనలని కూల్చుకొంటూ..

దరి చేరని కదలికలపై ఊరబెట్టిన కునుకుని చల్లారబెట్టి..

కప్పిపోయిన ధ్వని ముఖాలని రంగు మార్చి .. సాధించిన కథకి రెండో తలుపుని అద్దిన కన్ను.

అలవాటు పడ్డాం. ఆయుస్సుని పట్టుకొన్నాం .. నీరు కమ్మిన చీకటిని సాగదీసి ..

విసుగుని నానబెట్టిన రెప్పల కింద ఊడిపోయిన ముతక నవ్వులు..

……………………….

11.నేనూ .. నువ్వు యధాతధం …  సన్నని  నిద్ర పూర్వం  .

అపురూపమూ.. స్వరూప నిద్రకి కట్టిన దారాల గొంతుని కడిగిన హద్దులో ..

 పాట పగలగొట్టిన సన్నని  స్టూడియో రొమ్ముల గాలి దులిపి  ..నిద్ర పూర్వం ..

ఏదోకటి ఎక్కడో ఒకచోట కదిలిన దేహ రుచుల కల్లోమానత..

అద్ది తీసుకొన్న చేతి ముద్రలని తుడుచుకొంటూ.. నిరూప ముఖాలన్ని కొరుకుతూ…

సంధి చేసిన కంటిలో ఉనికి .. సఫల నిస్వస్థ .. కదలని రొప్పులో పాకుడు మెట్లు..

నిజంగా ఈ ఇంటికి.. ఆ ఊరుకి మధ్యన చుట్టేసిన తెల్లని పాటల వంతెన ..

ఆ దూరంలో గుట్టపై .. నేనూ .. నువ్వు యధాతధం ..

 ఉండిపోయిన కలత సన్నుడి.. బరువెక్కి కూలిన నిద్ర ఊరడి..

విస్తుపోవడానికి .. కదిలి నవ్వడానికి లేని .. విమోరూప పచ్చి పొగలతో ఉరిమిన మాటల చివర ..

కొంచెం గాలి అలల నొప్పిని కప్పుకున్న సాధ్య దేహపు సన్నని కాటు..

అదేం లేక పోలేదు.. ఆగిపోలేదు.. తప్పుకొని.. కొత్త జడలో గుప్పిన శ్వాస చుట్టూ పాట

రాలుతుంది. కదిలి ఉండిపోని కునుకుని కప్పుకొని.. ఇంకిపోయిన తలుపులు..

ఇంకేదో రంగుల గడపకి నీరు పట్టిన కేకలని చేర్చి.. భుజాలు పట్టుకొన్న ఉరుముని మింగేస్తూ..

…………………….

సన్నని పూర్వ యధాతధాలు .. లోపలికి వినిపించి తప్పుకొన్న నిద్ర పేచీలు పెట్టిన గడువు..

 కోరిన శ్వాసగా కదిలే సమయ బిగువు.. పాటగా తెరిచిన రంగు నిద్రల కల ..

కలత పెట్టిన ఊరటతో.. నిన్నటి సగం ఊరు పోతూ పెట్టిన చెవిలోంచి కేకలని వడపోసి..

 అటు పోయి ఇటు వచ్చిన కథలతో .. పాకిన అరచేతుల మధ్య వేడిని కదిలించి..

రుణ పూర్తిని కట్టుకొన్న కొత్త కబురుతో.. పాట ముగ్గిన బాటలని తవ్వుకొంటూ..

ఇల్లు కనిపించదు.. మాట తొణకదు.. విసుగు నిందల గడువుతో తేరుకోలేని కథకి నేసిన

మాటలని కలిపి.. ఇంటి బయటనే ఆగిన కథకి రెండో మలుపుని చేర్చి..

 ఆ ఇంటిని వదిలిపెడతాడు. ఆ మెట్లని పగలగొడతారు…

అంతే ఉంది.. ఖాళీ లేని విపరీతం లో పడి .. దుఃఖం పాటని పీల్చుకొంటూ..

 సాధారణం కానీ వివిసాత నిరూర్ను మోసి తెచ్చిన మట్టి కొండల మధ్య

ఊడిపోని కలని చెక్కుతూ .. నింపార పెట్టుకొన్న నది నిర్మాణంలో వణుకుతూ

అదే మసక రేవులో కదిలే కెరటాల తీరుని సర్ది.. తలుపులు లేని .

. కీ ఇచ్చిన కిటికీల మధ్య కూరుకు పోయిన మాటని తప్పించి వెళ్ళిపోతారు ,

………….

వెనక కట్టినవీ .. ముందు కూలినవీ .. పోగా మిగిలినా దృశ్య సమాన నిద్రకి బయట .

. ఓ కుర్చీలో దేహమంతా పట్టక నిద్ర పోతూ.. సగం కాలిన కలని పట్టుకొని..

 రెండో విడత మృత్యు దీపాల యాతర పట్టుకొన్న .. పల్చని చీరల వడపోతలో..

వేడి నవ్వుతో వణికి పోతూ.. జ్వరం మోగిన నల్ల నిద్రలు పోగైన గొంతుతో పాట.

ఇది ఆగదని.. మాటకి విడిచిన చెప్పుల్ని బటన్ ఉంచి.. వర్ష సాయం వదిలేసిన

కథతో ఊడిరాక మిగిలిపోతుందని చెప్పుకొంటూ.. అడ్డం తప్పుకొంటూ

తేల్చినవీ.. సగం కొరికిన కల ముడుపు పోతలతో .. దేహం చుట్టూ కాల్చి పోసుకున్న

పెదాల మధ్య …నస పోసిన నిద్ర కూడికల గొంతు మంటలో…

 తిరుగాడే పునాదులతో పాట చెవుల్లో నేసిన చీకటి తర్జుమాల నడక.

అదో అప్పటి చీకటిలో కబురు.. ఇప్పటి మోత బరువుల కైపుని లాక్కొని ..

ఉండిపోవడం ఎవరికీ తెలియదు.. అనుకున్నదే ఖాళీల మధ్య తిరిగే నిద్ర విపులతకి

 కూర్చిన హద్దుగా ఉండి .. కథ మధ్యలో జోరు నలతల పాటని లాగి..

రెండో దూరంలో ఊసుపోక కలలని ఉడకబెట్టి.. పాటలని బయటకి లాగుతుంది.

సాగిన శ్వాస.. మలచిన చీకటి ఎసరు.. రంగు లేని బజారులో గుతుకు దొరకని

నిష్పురు వ్యతిరిక్తంలో పడి.. మునిగిన పాటల కొండ .. తలపెట్టిన చీకటిలో మడి

 అదే నలత ముగ్గిన దేహ ఝాముల ముసురు..

 తేల్చుకోలేని హద్దుల్లో పడి.. ఊపిన కబురు.. అదే పాట.. ఇంకా మొదలు కాలేదు.

………………………

12.అద్దాలు కప్పిన పదార్ధ కూపం .. తోసిన మడమ మెట్ల ఆరడి

విసిగిస్తూ ఓడిపోయిన నిద్ర రేవులో పడి తిరిగిన కథకి చేర్చి.. కథకి రెండో ముఖం చుట్టిన ..

 చెవి పొగిలి మోగిస్తూ.. గొంతు వారగా పీల్చిన మట్టి చెమ్మల వాసన బరువెక్కి తూలుతూ

తీర్చి దిద్దిన కంటి రాత్రిని జోడించే కథలతో.. హద్దులే తెలియని మసక నీరు 

నిమురు మునకల కాళ్ళని కప్పి.. ఓడిపోయిన కన్నుతో.. తడిచి పుట్టిన పెదాలు

కలని పాడి,,,  అద్దాలు కప్పిన పదార్ధ కూపం.. ఒంటి మీద రాక్షస ముద్రని వదిలి ..

కొండల బయటనే ఉండిపోయిన పాటని మళ్ళీ అడగక .. తప్పుకొంటూ  …

ఉందీ లెక్కిపోయిన జ్వర జాడీలో పోసుకున్న వాన కలత నిద్ర రాతల్ని కదిలించి..

హద్దు తెలియని కునుకుతో పడి పాటకి ఊపిరినివ్వక కంగారు పెడుతూ..

అవధికి నిట్టూర్పు మోసిన కథతో.. ముఖాల రంగుని దులుపుకొమి..

ముందే చుట్టిన తలుపుల బయట,, పర్ణ చేతులు పొగిలి ఏరుకొంటూ….

తోసిన మడమ మెట్ల ఆరడి .. ఓ ఊరు జలానికి చిక్కిన నిద్ర ఋణం ఏడుస్తూ..

కథల మధ్య ఊరేగిన నగరం .. ఆకలి ఉతికిన బట్టల మధ్య

నిడిమి కథని వదిలిన ఖాళీ స్థలాల కాపలాని కట్టేసుకొంటూ ..

………………….

మెట్ల ఆరడి మధ్య కొంచెం చెప్పి నిలిచారు.. కొంచెం అందిపోసుకొని కదిలారు..

 అక్కడే అందిన కబురుతో.. పాటలేం వద్దని.. రైలు కూతని టీ లోకి పిండి..

 మంచు విస్తరిలో కూలిన కలతని తాగి.. మాటని తోడుకొంటారు..

తెలియక పోవడం తెలిసినట్లే ఉంటుంది.. అవధికి రెండు గంటల నిద్రలో ఊరుతున్న

మాటలు.. కొత్త కట్టడి రంగుల్లో పడి శరీర ఊర్పుల పోలికని అడుగుతాయి.

తెలియక పోవడానికి .. తెలిసి ఆగిపోవడానికి దూరంలో కొంచెం పల్చని భయం ఆరబెట్టి .

తోచిన నిద్ర గురిని ఎక్కుపెట్టి.. వాడింకా సిగెరెట్ ని ఊది.. గొంతులో ఆగిపోడు..

అదో రకం చూపు నిడివి కలతని కప్పుకొంటూ.. తీవ్ర మాయకి నేసిన దుప్పట్ల మధ్య కుదిరే చూపు

గుప్పెటలో తీసుకొన్న పాటలు.. వేలాడిన పొత్తిలి మధ్య పెద్ద స్తంభపు పునాదులని దాటుకొంటూ

పాట కట్టిన బజారులో పాట మోగే గొంతుని ఇంకా అమ్ముతూనే ఉన్నారు..

వాన మంటని కుదిర్చి.. మాసిన రైలు పైన అన్నం ఉడకబెడుతూనే ఉన్నారు.

ఏదీ చెప్ప రని.. చాటు నవ్వుతో.. ఛాతీ ని కోసి.. గాలిని తాగేసి .. ఎగరేస్తూ

మళ్ళీ రమ్మని ..అదే ఇంటిలో గ్లాసు బోర్లించి ఏడ్చే కథలు. వెనకనే కలుస్తాయి.

………………….

అద్దాలు కప్పిన పదార్ధ కూపం .. తోసిన మడమ మెట్ల ఆరడి

తోసి తెచ్చుకొన్న పదార్ధ కూపం .. మడమ చెట్ల మధ్య కూలిన ఏరివేతల కంటితో ..

 పొడుచుకొన్న వినికిడి సత్తువుల గడువుని కలిపి.. కన్నెర్ర చేస్తూ.. తేల్చిపోయిన కథలని ..

 తూగు చుట్టిన మసక ఋణం గడించి పెట్టుకొన్న మాటలని కలిపి.. అదే మాటకి ..

రెండో స్థలంలో కలిపి పెట్టుకొన్న చీకటి నమూనాల చిత్రం ,..

పోతపోసిన పాటల బట్టకి.. మాటలని అద్దుతూ.. ఇక సరిపోదులే అని నెట్టేసిన

కథ ఇంకేదో దారిలో కొత్త గడువుని .. పిండి.. రెండో చుక్కానీ గుప్పిన చీకటిలో

పట్టు తప్పిన నిద్రని ఒడ్డుకి చేర్చాలని.. ఊసుపోదు.. నిద్ర రాదూ..

తినాలని లేదని.. కణ కణ మండే విపరీతంలో పిరికి కథలని ఆడించి కొట్టి..

పాట అక్కడే జడ అల్లుకొని.. చీకటి నింపుకొని.. మోకాళ్ళలో తల పెట్టుకొని ఏడుస్తుంది .

కొన్ని వివారాలు.. కొన్ని నటనలు.. కొన్ని బట్ట మార్చిన చీకటి కబుర్లు..

 అంతా తెలిసే నిద్ర కూతని చల్లార బెట్టి.. నడక జల్లించిన హద్దుకి ..

రెండో తలుపు లేని ఇంటికి కడిగిన మాటలని జత చేసి..

ఎవడో దారి బయట ఇంటిని ఊపి ,, కథకి కాల్చిన పునాది రంగుని జోడించి కదులుతూ ..

అదే తీరుకి మలచిన ఇళ్ల మధ్య తీరికలేని చావుతో పాటని మోయిస్తారు.

…………………..

13. అటు .. ఇటు కొంచెం తిరిగాం .. పట్టి రాలిన దేహ ఊOపన   .

అవును ఇది కదులుతుంది.. మాట మాత్రం తెలియని కథతో ఏడుస్తూ ..

 ఋణం పోసుకున్న మాటలని విని ఇది చేరుకొంటుంది.. అదే కావాలా ..

ఇంకేం తెలియని మసక భూమి ఋణం పిండిన   వాకిలిలో దొరికిన కొన్ని ఆనవాళ్లతో  అటు ..

 ఇటు కొంచెం తిరిగాం.. ఏదో తెలియని ఆదితో ఉందని.. పూర్తి కాలేదని…

పట్టు తప్పిన నడకని కడిగి.. ముందటి గుమ్మంలో కోరి తెచ్చుకొన్న అలసటకు

మోసి రుబ్బిన చీకటి విడిపోయిన శ్వాస నికారపు  ముద్దడి రంగుని సరిచేసుకొంటుంది.

 అలిగి తప్పించుకున్న నడకలా మధ్య ఋణం కూల్చిన బిగువుకి ..

ఇదో ఆరని కాపలాగా ఉంచి.. పాట తిరిగి తలుపు కొడుతుంది.

మరో విడిది.. కొంచెం గానుగలో చుట్టి.. కన్నుకి చేర్చిన చీకటి ఉతికిన బట్టతో..

 కూలిన వాడని మళ్ళీ కట్టే మేస్త్రీలా ఉండిపోయి.. అది అలానే ఉండిపోవాలి..

 ఋణం చేర్చి కాలాలి.నిద్ర తవ్వకాల కథని మోసిన కునుకుతో..

చీకటి మూసి …బేరసారాలు లేని వినికిడి పోతలు టీ కి పిలుస్తాయి.

పట్టపగలు నిద్ర ఊతల బిగువుని పట్టుకొని .. మరోసారి మిగలని కథ తీసుకొని..

ఇంకిపోయిన గింతుతో .. కీ తిప్పిన పాటలని కలిపి.. విశ్వ నిషారణ కూల్చిన

పెద్ద మెలికల కొండ పక్కాగా .. వార్చిన చీకటి అనులోమాత మోగి.. కొత్త తీరుని వదిలి..

…………………

ఎవరమూ లేమని .. పట్టి రాలిన దేహ ఊOపన .. ఎగా దిగా ఉండిపోయిన అడుగుల మధ్య

 కదిలే నిర్ణయం .. ముఖాలు.. కదిలే గొంతు నివారింపుకి .. పోత పోసిన కునుకుని కట్టి..

 కప్పేసిన నడకని కనుక్కొని.. అక్కడే ఇంటి బయట వాన చిలుము దులిపిన పాట ..

 పారబోసుకొన్న నిండు రాతల కట్టడికి చేరదీసి కథతో .. ఉండిపోవడం చేతకాక ,,

 ఎవరో పీల్చి చెప్పిన మాటలు.. వాసనలు కట్టేసుకొన్న దేహ జీరల సమాధుల మధ్య

 తీరిక మోసిన కథతో.. బిగి తాళాలని గుప్పించిన నుదిటి హోరు బొట్టుని దిద్ది..

 అక్కడే  కాదనక ఉండిపోయిన నిద్ర దారాల అల్లికని చిక్కు తీస్తూ..

 కలలు పేర్చిన కొండ బిగువు అద్దం పోసుకున్న చీకటి నిలువు కట్టడికి

 వాళ్ళు మళ్ళీ చేరుకొని.. ఆగలేరు. అరిచి.. చిక్కిన కథలో మాటలని విడిచి..

తడిచినవి.. తడవని.. దేహ కోతల గడువుకు రెండో తాళం లేని గుమ్మం మాట తీసుకొని..

అదే మాటకి .. మూడు ముఖాలు పోసుకున్న ఇంకిత ముఖాల నెట్టుడి..

అదే రావమూ.. చంచిలీత కంటి సూదులు గుచ్చుకొన్న దుప్పటి మోసుకొని..

నీటి గడపల మధ్య తిరుగాడే నొప్పి తో గొంతు సాయం వదిలి  ఒరిగిన పాట..

అదే మాటని రెండో సారి అడిగి చూడదు.. అతనూ చెప్పి ..ఇక ఆగడు.. ఐనా పట్టుకోవాలి.

……………………..

కొంచెం తిరిగాం .. మాట తీసుకొని కూలిపోయాం .. అక్కడే సంచార నిద్ర తోపుల్లో పడి .

. కొత్త నిద్రల కలవిడి.. అఖాతం వదిలిపెట్టాం.. నీరుని పోల్చాo…గట్టు కట్టాం..

 చావుని చుట్టాం.. మాటని కట్టాం … పాటని అడిగాం.. వంతులు కలిపాం..

 ఇంకా ఏదో లేదని అనుమాన పడ్డాం.. వెంట చీకట్లో నడిచి.. తడబడి కలుసుకొని..

 అక్కడే ఉడికిన కన్నుని చిదిమి.. కలలకి మట్టిని చేర్చి.. పాటని కడుతూ వెళ్ళాక ..

 ఊరు వదిలేయమంది.. ఇంకా ఎందుకు మాట వెనక ఖాళీలని,, అదే చెప్పుకు పోవాలి..

 ఇదెలాగూ ఇంకొకరికి ఇచ్చి ఆగిపోయేదీ కాదు.. ఉండి నిల్చిన కన్నులో

పొదిగి నిండిపోయేదీ కాదు.వేరు పడడానికి ఎవరదీ ఈ భూమి.. ఈ వానా .. ఈ గొంతూ.. ఈ పడకా

 అదే అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతూ చేరుతుంది.. కదలికనే మోస్తుంది.

కప్పుకొని ఉండిపోయిన ఖాళీల మధ్య .. ఊరికినే ఉండిపోయిన నిద్రల గూడు కూలిపోతుంది.

………………….

భయమూ లేదనే చీకటి దిశని తిప్పి రాసిన కంటిలో చూపు వణుకుతూ..

పాటకి మూడో చరణం చేర్చిన కథకి మోసిన కలని పట్టుకొని.. ఊటని పిండుకొని..

ఇంకిపోయిన మాటల మధ్య కదిలే ఒద్దికని పట్టుకొని.. శారీర సారం కట్టిన ఉనికిని దాటుకొంటూ..

పెనవేసిన దోసిలిలో .. కూర్చి పెట్టిన దుఃఖం కడిగి.. రంగులు చేర్చుకొని

 పైకి చేర్చిన నిద్ర అణుకువలని కట్టుకొంటూ.. అదే చెప్పుకోలేని..

జోడింపులని .. ముఖాలని తెలుసుకొనే అదే ఇంటిని . రెండో చోట పాతుకొని…

. కొత్త పాటకి అట్టేపెట్టిన కథతో పోలికని తుడిచి..హద్దు మార్చిన పాటలో తనే ఉంది.

ఇదే కాలుతుందని.. కథకి ముందే   ఆ రైలు అటు పోయి ఇటు రావాలని..

 కథలో ఉండిపోయిన చినుకు మండపంలో ఊరేగే దర్శన ముంపునీ కదిలించి..

ఋణం తీర్చుకోవాలని.. ఇక్కడేం లేదనీ అనరు .. పాటనీ వడ్డించరు..

కొంత చీకటిలో నడక తీసుకొని..  రైలు ఆవిరితో కూరుకుపోయింది.

……………………….

2.చంచల విపరీతాలు … కేకలు విడిచిన దిగులు పేటిక

(Mechanized chemistry … time proportions )

అది తెలుస్తూనే ఉంది.. దుఃఖ పాత్రలోంచి సగం ఉడికిన కథని అటూ ఇటూ తిప్పి..

 నిగ్రహ చిత్రం ఉడికించిన చలన ముఖాలని తోడుకొని..

ఏదో కావాలి.. అదే అని తెలియని .. అవార్డు ల గోడకి బీటని పూడ్చలేక .. విసిరి కొట్టినప్పుడు..

ఎక్కడో ఖాళీ చీకటి నింపిన నది .. గడ్డ కట్టి షవర్ కింద నల్ల చీరతో అటు తిరిగి నిలబడినప్పుడు..

 పొగ మండలం లో కనబడని దుఃఖ నీలంలో కదిలే సమయ తోరణ మంటలు చెలరేగి..

పునాదులని తిప్పి రాసినప్పుడు.. కలత జడ అల్లిన చేతివేళ్ళ వణుకు…

ఇంకేం లేదు.. అదే మిగిలి పోయిన పేజీల మధ్య ఊగిసలాటని మోసే మాటలు.

కొందరిని కలిసి ఊయించిన చీకటి కొండల్లో .. వదిలి పెట్టని తవ్వకాలు..

రక్తం దొరకలేదని.. వాళ్ళు చాటుగా నవ్వుకొని.. మళ్ళీ అతని ముందు..

…………………

తెల్లబడినవి .. మరింత నానబెట్టిన గొంతునే అడుగుతూ.. ఏడ్చి వదిలిన స్క్రిప్ట్స్ ని తీసుకొని..

ఇలా కూడా విడిపోతారా ? అక్కడ  మెరిసిన దుఃఖం నిండా సముద్రం బోర్లించిన బికినీలని

కుదిపి.. గొంతు నిండా ఇసుకు కూరి దేహం నిండా మాంసం కుక్కి..

దేహబిగువు శ్వాసలో ఉరేగించిన పాటని మరిపిస్తూ.. అదే వీధి.. రెండో కథలోనూ..

వాడే మళ్ళీ .. ఎర్రబడిన కళ్ళని జేబులోంచి తీసుకొని అతికించుకొని.. ఆక్షన్ .. అనగానే తెరిచి..

పాటని రాత్రికి పిలిచిచి .. నది మధ్యలో సగం తెగ్గొట్టిన భయంలో తట్టి లేపి ..

అదే నిద్ర .. వేరే కలని తేలేక  ,,ఆ అక్కడే ఆ పెద్ద చెట్టు కొమ్మకి వేలాడుతూ…

ఇగిరిన గొంతులతో ఎన్నిసార్లు లోపల అరుచుకొని పగిలిన .. తిరిగి అక్కడికే లాగి..

జీర ఇంప్రూవ్ అయ్యిందని.. మిలియన్ వ్యూస్ ని లెక్కపెడుతూ..

అతనెప్పుడో.. ఆ పెద్ద కొండ పై నుంచి.. నుజ్జు నుజ్జు ఐన పాటని లాక్కోలేని   పేటికలో వేసి

లాక్కొని .. ఇంట్లో వదిలిపెట్టాక.. నిషిద్ధ తడబాటులో కూలిన ఎత్తుగడల ఉడకమోత…

ఒక్కో గదిలోనో.. అలుముకొంటూ వస్తూన్న చీకటి.. తర్జుమా  లేని మాటలు. 

విప్పిన చీర కాలిపోయిందని ఆమె గుక్క పెట్టాక.. నది ఊడ్చిన నీరు ..

గొంతులో చిక్కబడుతూ.. రేవుల్లో చనిపోయిన ఆకలి ఇంకిపోయాక.. బరువుచుట్టని ఖాళీలని

వదులుకొని.. ఇల్లు కిందికి కూలబడింది. చెల్లా చెదురైన పాట

హటాత్తు మెలుకువ.. లేవలేక .. అడగలేక ,.. అల్లాడుతున్న దాహ ముడుల కట్టడిని చెదిర్చి..

ఎవరో చల్లారి పొమ్మంటారు.. గంటలని .. లెక్కలని .. కూడుకొని.. ఏమంత ఐపోయిందని..

ఇంకా ఎంతో ఫ్యూచర్ .. పాడుతూ ఉండులే అని..

సమీక్ష  తెలియని.. రైలు.. నేరుగా బ్రిడ్జి మీద నుంచి కిందికి దిగి.. గదిలోకి తల పెట్టి అరిచాక..

ఊరు మసక బారి.. చితి పై.. సరైన మంట లేక సన్నని కూతతో కాలుతూ..

……………

ఎవరో తలుపు కొడుతున్నారు.. లోపలి ఏడుపుతో ఈ బంధమూ కట్టక..

స్టూడియో is  ready .. what  is  the  fun  for  delay .. మీరు సింగల్ టేక్ ఆర్టిస్ట్ కదా.. పాడేసి .

. మీ ఇష్టం ఎక్కడికైనా పోండి.. రోడ్ల మీద అనామకుడిలా తిరిగినా అదీ మా పాటకి ఓ మైలేజీనే..

అతను అరిచాడు.. అరే .. అదే అంటున్న .. పాటని తెచ్చుకొని వస్తా ..

అని తలుపు ముఖం మీదే వేసాక.. ఆగని మొబైల్.. భుజం కూలిన మీడియా,,,

ఏది అతుక్కొంటున్న కల .. ఏది విడిచి పెట్టాల్సిన కళ ..శరీరం రెండో సరిహద్దులో …

శంఖం ఊదుతూ.. సరి చేసిన గొంతు మండలం లో గొయ్యి తవ్వుకొంటుంది.

నిత్య క్రియలని ఒకడు.. అవే అంత్య క్రియలని ఒకడు.. అతని ఇంటి ముందు..

వందల కెమెరాలు క్లిక్ చేయడానికి .. వానలో తడిచి జ్వరపడుతూ..

అదే పాటలని పాడుకొంటూ.. కిటికీలని…కర్టెన్ ఎగరడాన్ని వదలక..

సరైన నిదానాలు దొరకలేదని ఇంటికి పెట్టిన కబురు అందనే లేదు.

                                    ………..

1.డైనింగ్ హాల్ .. ఏడో రుచి.. రెండు ఆత్మహత్యల  కలత పూడికలు

ఇదే కంటికి కనబడని .. వినిపించుకోని .. చిత్ర వరదల్లో పగిలిన దేహ గ్రహణత .. ఉండిపోవడమూ .. నిలిచి తేలని బంధన నిద్రలతో కూర్చిన దుఃఖ నిస్త్రాణత ..

పాట .. డైనింగ్ హాల్ పై .. మురికితో వాలిన పక్షిలా కునుకుతూ..

రుచి తెలియని మంట నిండిన పొగల వేడుక .. కథలు కూలిన పూడిక  

అదే నిద్ర తెలియని ఏడో రుచి.. గొంతులో మోగుతూ.. రుణ కలిచివేతకి నిండిన హద్దులో ..

 పాత పడకల ఊరు చనిపోయిన నగరం.. తట్టి లేపిన స్థితి గ్రహరం  ..

కారు హోర్న్లతో ఏడుస్తుంది.. కనబడని హద్దులే చుట్టుకొని..

భయం మోగిన రంగు చూపు.. లోపల గదిలో నేసుకొన్న అలిపివేత..

పగల పూడిక .. అదే తెలియని హద్దులోని .. క్షమార్ప ముఖాన్ని పట్టుకొని ..

ఎత్తు నుంచి కిందికి.. కలలో కింద నుంచి ఎత్తుకి.. అదో చిత్ర మాయా క్షమార్ప …

 నిలువు రాపిడి.. ఆరబెట్టిన పెద్ద భూమి  బొట్టులో పులిమిన కాటుక….

ధ్వని కలతని రెండో ప్రదక్ష గుమ్మంలో పీడిస్తున్న కలతకి చేర్చిన వడపోత…

…………..

ఎందుకు ఇద్దరు ఒకేసారి.. ముఖాలు సాధించిన నిద్ర అవకతవకల నిగుర్పు ..

 పడి లేచిన భయం కోతకి.. నిల్చి పోయిన ఆయుస్సులోని పోతలు..

కదలడమూ… ఉండటమూ.. జోడించిన కునుకుతో తేలిపోవడమూ..

అదే పాటగా .. కథకి బయట మాట పడిపోయిన వార్త ఏం చెబుతుంది..

ఏది కావాలో.. అదే కావాలనా ? అదే కావాలనుకున్నప్పుడు..

 ఈ అలజడితో నిండుగా పోతపోసిన .. తుడుచుకోవడానికి లేని ..

అద్ది పోయిన రంగులతో.. గొంతు నిండిన  పీడనతో.. పీల్చేసిన ఝాముతో..

విసిగిన హద్దులో చిత్ర కలపూడికలు.. నిద్ర గాలించిన పాటల కుదురు….

పెనవేసుకున్న గదితో.. చీకటికి పూర్వ నమూనాలని కునుకుతో.. పాటకి..

ఏడూ చరణాల ముద్దా గతికి .. ముఖాలని కప్పిన ..  నిండుగడువు..

రెండు ఆత్మహత్యల  కలత పూడికలు … చేర్చి రాలిన భుజాలు ఒరిగిన చీకటి నిద్ర పోతలు.

అదే వర్ష ఝాములో లేవదీసుకొన్న కలలకి తెలిసిన నా శరీర చిద్రతలో ..

చితి మెత్తని నిప్పు కణిక మోసిన దోసిలిని గొంతులో ఉంచాక ..

పాట కలిపిన నిద్ర సంధికి కూర్చిన నడక చివర  మెళుకువలు ఎద్దడి.

కలిపి చూసుకొన్నారు.. మాట తీరుని కలిపి చుట్టిన కథలో ఇగిరిపోయిన కన్నుకి ..

నీటి మెడని ముంచి.. దోసిలి మంటలో .. పాటకి జతకడుతున్నారు.

తీరు మళ్ళీ చేర్చుకొన్న సగం ఖాళీల్లో సమాధి..ఇంకేదో హెచ్చరికని కప్పి జోకొడుతుందా ?

………….

నచ్చిన పాట ఎందుకు ఏడుస్తూ.. తేరుకోలేని .. నర్మ గర్భ నమూనాల కేవల రంగుని విడిచి .

కాల్చి పోసుకున్న నిద్ర తీరులని కుదిపి… చావు గడపలో .. నిందలు పోసిన బుట్టలో  

బలవంతపు నిఘా … పాట కదులుతుంది.. మట్టి బరువుని పెళ్లగిస్తుంది..

నగరం వాసనతో.. చితి చిత్రం మింగి.. ఆయాస చెమటతో .. నానిన కన్నుని తాగి ,..

 రుబ్బేసిన కథని మోసుకొంటూ.. కిందికి రాలిన నిద్రని విడిచిపెట్టి ..

ఛాతీ పగిలిన నిద్ర జాడల మధ్య మళ్ళీ స్టూడియో.. కథ నెమ్ముని కరిగిస్తూ…

మెట్టు కనిపించడం లేదు.. లోపలి గొంతులో మైక్ భయం చిమ్మి వణుకుతుంది..

అదే వదలమని.. దేనిని శ్వాసనా .. శ్వాసకి నిఘా పెట్టిన కథేనా ..

ఇంకేదైనా కునుకు పండిన ఝాము పోతల మధ్య .. నిద్రలని నిలుపుకొని…

కదిలే నిద్ర దర్శన చిత్రాల ముంపునీ కూర్చి.. గిల గిల మంటూ…

ఎవరో వెనక నుంచి తోసినట్లుగా .. రైలు మింగిన నది బొంగురు పోతూ పాడుతుంది.

………………………..

2, రొమ్మును కాల్చిన శ్వాస పూతలు.. పాటల రెండో వినికిడి

రుణ పోలికల వీధిని కరిగించి నేర్చిన కథతో .. రెండు ఘటనల విడిపోత ఒడిలో నిప్పు మడి

 ఉండిపోయిన నిజ అద్దకపు మోస కలని వద్దనుకుని.. తొందరపడగానే …

అక్కడే ఉండిపోయిన పాటలోంచి.. ఆ దుఃఖం కనిపించని ఖాళీలు… రంగుల నిడివి.

అదే తీర్ధము.. విగ్రహం లేని ఊరేగింపు.. సర్దుకొని వదిలేసిన ఎండ .. బరువు మాట

రాత్రి పూత నంజుకు తిన్న చిత్తడి.. వరం కూలిన గుడి పక్కగా .. ఏడు మూటల నది

బెంగ పడిన నది చెప్పిన కథ. ఆ మూలగా తడిచి వణుకుతున్న పాట…

ఊరట లేని కణత .. రుబ్బి రుబ్బి వదిలేసిన చీకటి అనువాదంలో పడి ..

తల పట్టుకొన్న గదులని దాటుకొంటూ.. ఋణం మూట విప్పిన కదలికనే పోతపోస్తూ..

పాటల రెండో వినికిడి… నీరు పట్టిన శరీర గుంభనల చితి…

అదే పాట .. ఒక విసుగు చుట్టిన తలగడ కిందుగా .. బూడిద కలిపిన నీటి కుండ మూతని జార్చి..

నీరు ఇంకని కన్నుతో.. గొంతు పండిన చీకటి నమిలిన కథని పోగుచేసుకొని…

తీపి చచ్చిన పెదాల ముద్దుని కడిగి.. కెరటాలకి పట్టిన నాచుని సానబడుతూ..

అంపకాల ఋణం తోసిన పగతో కదిలే నిద్ర వాగులు..

……………

పాట లోపలి దొరకడం లేదని.. రొమ్మును కాల్చిన శ్వాస పూతలు ..ఆమె కోప్పడింది..

దుఃఖం చెలరేగిన నిస్సాపుర గతి క్షేత్రం లో కలిసిన నడకని కదిలించి ..

అంపకాల నిర్మాణ రీతులని కనిపెట్టి ఏడుస్తుంది.. కదిలి ఎగురుతుంది

గట్టు తెగిన కన్నుకి .. ఎర్రగా కందిన మాటని చేర్చి.. తలుపు పగుళ్లలో కదిలే నిద్ర అనుకూలనాల

 గరుకు సందడి.. నోరు పట్టిన శ్వాసలతో కొండల్లో కాలుతున్న వాన…

అదేమీ నిద్ర తాఖీదులతో అలికిన ముఖం కాదు.. తొందర పడలేను.

 నిమిత్త రాంధాన కూల్చిన అంపకాల చిత్రమూ కాదు.

గోటి చుట్టూ కాలిన నిష్ఠూరం కప్పిన గతి కోత కాదు. నిండిపోలేం…

అదే ఊపిరి .. పల్లవి చుట్టూ.. గట్టు తెగ్గొట్టి మోసిన నిద్ర రుణాల ముట్టడి..

అది పగలనీ.. వేడుక లేని.. రాత్రనీ … తెలియని ఊసు బొమ్మల కొలవేతలో పుట్టిన

నగర రజ్జువులు.. ఎదురు పోటులని కట్టుకొన్న చీకటి సంతర్పాలు.  …

,,…………..

మొదలైన .. రెండైనా .. కుమ్ముకుపోయిన .. కరకు మందలింపుని చుట్టబెట్టి ..

 ఒద్దికగా లేవదీసుకొన్న ఝాములో పడి.. మెట్లు కడిగిన దే.హ స్థలం..

తలమునకలు.. లేవదీసుకొన్న కంటి రాత్రులు.. పోతపోసిన దృష్టి పడకలు ..

 కలలు రాలిన విశ్వ నిద్రలో సముదాయ మన్నింపులై కాంతిలో అరగదీసి ..

కలిసినవీ .. ఉండిపోయినవీ.. వద్దనుకొని విడిపోయినవీ.. అక్కడే అమాసని తాకిన నగరం ..

పగిలి ఉండిపోయిన గొంతులు మధ్య వేలాడే గతి కక్ష్యలని చెమర్చిన కంటిలో..

చూపు గడిచిన హద్దుకి .. పరిధి మోసిన కథకి.. చీకటి నమిలేసిన మాటకి..

 చెమర్చి వదిలిన కలకి .. పాట దొరకక ఏడుస్తూ.. అక్కడే బోర్లాపడ్డాక…

నీరు మోసిన కౌగిలిలో పడి కొట్టుకు పోతున్న చీకటి పోతలని దాటుకొంటూ..చిదిమేసిన కక్ష్యలు ..

బయట తిరిగిన మాటలు.. కరిగించి పెట్టుకొన్న ధూప ముఖాలు..

అందీ .. అందని కథతో.. మూసుకు పోయిన కంటిని తోసి .. కథలోకి లాగి ..

నివ్వెరపడ్డ దీపాల అండ .. పాట చెప్పుకుపోతూనే ఉంది…

,,,,,,,,,,,,,,,

3.ధూప శరీర ధృవాలు .. అంట కాగిన విపత్తు జీరలు

శరీరమెందుకు ఇలా కాలిపోతుంది.. దుఃఖం విడిచి పెట్టని గతిని కదిలించి ..

 విప్పుకోలేని చీకటి చుట్టూ.. పట్టి లాగిన నిద్ర దూపుల కట్టడి .. పెనవేసిన నిరూప సాధనాలు..

మోసి తెచ్చుకొన్న కునుకు పట్టుకొని.. వడపోసిన కలలో దొరికిన పాట ..

తందానాల ఆకర్ష జాడింపులు.. ఏరివేతల నిష్క్రియా అందుబాటులు… అలమోతలు

నువ్వేనా అని నిందిస్తుంది.. అంట కాగిన విపత్తు జీరలు … ముద్దడి బొమ్మల తెల్ల చీకటి

అంపకాల చలన నిద్ర గాలించిన దుఃఖపు వీలునామాలో పడి.. ఎర్ర నోటి జీరలు…

అదే తెలియని నిద్ర ఝాము మోసి తెచ్చిన కథకి .. నీరు పట్టిన వెన్నుతో..

కథకి పట్టిన దుఃఖ తీర్మాన ముఖాలతో.. చెలగాటపు సన్నతికి రెండో అనుమానపు …

తలుపుని కొట్టి రాలగొట్టారు…పాటని నీటిలోంచి తీసి ఆరబెట్టారు.

రెండోసారి నడిచిన కునుకు పారబోసిన రంగులు వెలిసిపోతూ..

………………………

ఎక్కువా .. తక్కువా కానీ.. నిద్ర ద్రోహపు పూచీలేని.. కదిలే నగరం ఏడ్చినా ఆవిరి కొట్టం లో..

మీకు ఊడదీసి దుఃఖ నమిలివేతని కక్ష్యల్లో తిప్పి…రెప్పల జడని బిగలాగి అల్లుకొని..

తీవ్ర నిందల కదలికనే వార్చిన పాదాలు మోసి తెచ్చుకొన్న ఇల్లు..

హద్దులు పట్టి లాగిన చీకటి గోడలు.. ఇరికించుకొన్న మోసపు కన్నులో …నాని గడ్డ కట్టిన పాట..

అపార్ధత పోసి తెచ్చుకొన్న నడకలు.. విసిగి నిండిన కథలు.. నలుపు కొండలు చిట్లిన….

 కథలోని ఝాము.  వేరుపడని హద్దులు తీరిక చేసుకొని .. పిండేసుకొని నిన్నటి …

కలతకి కొండల బాటలు. నది పారబోసుకొన్న నిన్నటి తీరుకి గడ్డ కట్టిన పాటల జాడీలు..

విప్పి చెప్పుకొన్న పెదాల మధ్య కూరుకు పోయిన నిద్ర దృవాల్లో పడి … విస రేవులు  

నిశిత కథని కూర్చిన గొంతు .. ఏటవాలుగా ముందు నిలబడ్డ నేను.

కప్పిపోయిన విప్పార స్థితి సంధాన కూర్పుని లాగి.. వెల్లువుల రేగడి గొంతు.

నిస్సంశయ అంటుపోతలు .. రంగు మార్చిన నిద్ర కబుర్లు.. తెలివిడి మొత్తాల మట్టి ఇల్లు..

వాళ్ళు వెళ్ళిపోయినా కథకి చేర్చిన నడకలు.. అంపకాల నిడివికి రెండో నాలుకపై పాట..

ఊసులాటలు.. ఉబికిన దూర గ్రహణాలు .. పాట కాల్చిన దుప్పట్ల ముందు.. చితి కాల్చిన

గొంతుల నిమజ్జన రూపుని .. దృష్టి గతం చేసిన బాణీలు..

అదే వరుస .. అదే రంధి.. అదే సగం మోసిన అంపకాల నిండు మెట్లు..

రెండు చక్ర గమనాలని సర్దుకోలేని.. నినీయత గోళంలో ఊగే శ్వాస కందకాలు.

ఎవరో అద్దం లోంచి చేతులు తిప్పారు. కాదనడం .. ఔననడంతో ఆగిపోదు.

నిప్పులు పోసుకున్న నిద్ర ఊర్పులు పోసి తెచ్చుకొన్న నడకని పోసుకొంటూ..

రుణ దీపాం పెట్టుకొన్న వీధి చివర .. ఇంకా బిక్ష దొరకని పాట ..

……………..

మళ్ళీ చెప్పుకొన్న ధూప శరీర ధృవాలు .. గొంతుకి నులిమిన శరీర భావులు..

 ఒంటిరిగా వదులైన కంటికి రాలగొట్టిన చిత్ర వాకిలిని .. త్వరపడని ..

 లోపలి కూడలిలో పోసుకున్న వాన కుదురు.. వెదురు బొంగులో ఉడికిన పాట

గొంతులో మరిగిన అంపకాల నిడివి రాత …చేదు నిడివికి సాగదీసిన కొలిమి.

పాడుబడిన కంటిలో ..నుసి రాల్చిన మసక భూమి.. కాస్త నిద్ర పూరణత లేని..

 పాటని కడిగి…నిప్పులు పోసుకున్న ఇంటిని కనిపెట్టుకొన్న చెట్టు కిందుగా పాటల గానుగ

అక్కడే టేబుల్ దగ్గర వెసులుబాటులేని కథతో .. ఊగిన దుప్పటి పక్కగా ..

అప్పగించిన తోడుతో.. నీరు పట్టిన వెన్నుతో.. కథకి పట్టిన దుఃఖ తీర్మాన ముఖాలతో..

ఎక్కువ కానీయని    నిద్ర ఖాళీలని పట్టుకొని … చేర్చి  పెట్టుకొన్న ఇంకిత భూమి..

అద్దకాల నివురు రాతలు. .. చెట్ల జోగారపు బజారులో కాల్చిన నడక

 అక్కడే ఉండిపోయిన పాట ..ఇక ఏ మాటని అందించని కథతో కూలబడి..

 కొంచెం తరిగిన స్టూడియోలో మట్టిని తెచ్చుకొని.. కనబడ కూడదని..

అపనార్ధమూ.. ధూప దృవం నెట్టిన నగర చలనము.. పాటని తాగి ఊగిన వరుస పోలికలు..

చిత్ర మండలంలో ఊరేగే తమక రుణ ఊపులు గడ్డకడుతూ…

                                                 ………………..

4.విశ్వ ధారల ఏడు కణుపులు … రేగిన ద్రవ ఊబులు .. నెరవడి

చంచార్య తీరికలేని ఆనుపానులు … చిత్ర నైరూపపు పాటలని దుమారపు..

 కలకి నెట్టేసిన ముఖాల్లో.. రేగిన ద్రవ ఊబులు… పెద్ద కణతలు .. ఉబ్బి రాలిన దగ్గు..

నెలలు నిండిన.. వరస తప్పిన కంటి పీడనకు చీకటితో..కలతో నులిమిన చేదుమాత్రలు..

వరస తప్పిన దీప సముద్రాల్లో పడి.. సుడిలో పడి కొట్టుకొంటున్న సవరింత కథల

నిండు సూత్రాలని మార్చికొంటూ.. శరీర నిరాకరణకి .. ఊరట లేని కథని మళ్ళీ చెప్పుకొన్న

పాట దగ్గరే తాను చెక్కిన ఇల్లు ఉందని కొందరు సందడి చేస్తారు.

దిద్ది తీసిన అనులోమ చీకటిలో వాలిన కన్ను.. కొన్ని కాగితాల నిండు పొడుగుల మగర్పు..

 ఉండాలని అనుకోలేదు.. ఉండిపోవడం తెలుసుకోలేదు. నిరోహిత గర్భ మాతృక..

అదే కనబడని మంద్ర రేవుల్లో ..కట్టు వీడిన పాట .. అక్కడే ఉందని గొడవ చేస్తారు.

అప్పటికి మొదలైన విశ్వ ధారల ఏడు కణుపులు  .. నిండు గ్రహణ వెలుగు చిట్లిన కథకి ..

 రెండో గొంతులోని .. చెమ్మ.. వీలు కాని నిర్దయలోని నిరోధ ముఖాలు.

కాళ్లలో ఊరిన భూమి గానుగుల నిండు కళ్లెం లో పండిన ధాన్యము ..

మగ్గిన పాట. ఉడికిన కంటిలోంచి .. బుడగల ఆవిరితో రాలిన పాట…

కలత నిగురు రంగు ఊటలని అడ్డుకొంటూ.. పాతి పెట్టుకొన్న చీకటి గేలపు దొంతర ..

…………………

ధూప బాటలని నెమ్మిదిగా మార్చి చేరుకొన్న నిద్ర గదుల కింద ..

 మార్చి చేసుకొన్న ఒప్పంద నిందలు.. రేగిన ద్రవ ఊబులు ..

కలబడి తీసుకొన్న చీకటి అద్దకపు .. నిలువు రాకడ కదలికనే కట్టుకొని..

మరలా చెప్పుకొన్న కథకి .. రెండు మాటలతో.. బజారు గొంతుని కడిగిన వెనక తలుపు.

కప్పుకొని చేరదీసి కంటి శిక్ష.. మాయ దర్శనతో .. అలిగి దూరం చేసిన ఝాము ముఖాలతో ..

పేర్చిన ఒంటి రాతకి రంగు మార్చిన ఇల్లు.. ఊట భావిపై ఎండ గొడుగుకి చుట్టిన నడుము

స్నాన శూన్యాల ఎగుడు దిగుడు సాధ్యపు మంగళ శబ్దం .. ఋణం తప్పిన కథకి చేర్చి ..

కలబడే కథలకి చేసిన పాత పాటలు.. నెరవడి .. అలవడి లేని నవ్వు తీగలు

నీరు పోసిన కొండ .. నిద్ర తడిచిన కన్నులో కాల్చిన కరకు ముడి ..

గొలుసు విప్పిన కథకి పోసుకున్న మాటల తీరు. అదే ఉంది..

కథగా లోపల మోసిన చీకటి నదిని .. దీవిలో ఊయించి .. ఒడ్డుని కట్టుకొన్న మాటల వంకీలు.

…………………..

విశ్వ ధారల ద్రవ ఊబులు దిగబడి ఉన్న .. కథలకి చేర్చిన అనుభవ ..

సరళ మైలపు విశ్వ శరీర చిత్రం జోడించే … అగాధ మందలింపుని కొట్టి రాస్తూ..

తోడుకు పోయిన కలలు .. ఇచ్చి పోయిన నమ్మకాలని ఎగరేసిన కన్నులో పోటు

నీరు పట్టిన గంటల మధ్య తమక నిద్రల ఊరబావిలోకి దూకిన పాట

ఇదే కౌగిలి.. అదే తెలియని గట్టుని కూల్చిన నడక ..

 రేగిన శ్వాసలతో తీరిక లేని అవస్థల మధ్యలో కుదిరిన కలత..

గమనించి తప్పుకోవడానికి లేని.. రెండో కన్ను బయట ..

 కలిపేసుకొన్న మరో చీకటి అనువాదపు మంత్రిత చేరి సగపు చీకటిలో కూలిన

 దేహ నిర్బంధాలు. ఆకస్మిక సాయుజ్యంలో కురిసిన నిద్ర మునకల కల తెరిచిన వరాలు.  

నివురు గప్పిన నిద్ర సాయుజ్య ముఖాలన్ని దాటి.. రంగ కూలిన నిద్ర పగుల్లో

పేరుకున్న పాటని నరికి .. చిత్ర సంధిని వదిలి పోయిన చావు వెనక మాటలు ముద్ద కట్టిన

ఒక నిదాన తాకీదుని మోసి తెచ్చుకొన్న అవసాన ఇల్లు.. వేలాడిన నిచ్చెన…

కొన్ని గోడలమధ్య బొమ్మ చెక్కిన గమన నివేళ.. మళ్ళీ రెండో వాగులో గడ్డి మంట

పరిధి కలల కథకి మోసిన ఖాళీ స్థలంలోకి.. ఇంకా ఇల్లు లాక్కొచ్చి వదలనే  లేదు.

………………..

5.కప్పిన జత తెరల నిందలు … ఊసులాడిన కంటి చమురు

కమ్మేసిన పెద్ద గొంతు చివర ..  నీరు ముగ్గిన కథగా కలిసి.. మసకబారిన కథలో ..

పెద్ద గోడల ఇంటిని వదిలి .. దుఃఖం కలిసి  .. కప్పిన జత తెరల నిందలు..

ఉండిపోవడమూ.. లేకపోవడమూ.. నాజూకూ సవ్వడిని కూర్చుకొని..

పొట్టు రాలిన కథలో పడి.. తలకిందుల నిద్ర జడని అల్లుకున్న కునుకుతో..

దేహాం మళ్ళీ చెప్పుకొన్న పాట వెనక.. జంట రంగుల విధేయ స్వస్థత ..

అదే కనిపించే చీకటి అనుసంధాన కైపుని పెనవేసుకున్న గడప..

ఆ పక్కన కూలిన వంట శాల.. తాను కడిగి వదిలి వెళ్లిన గొంతులో ..

ఇంకా తడిగా మిగిలిన పాట.. అది కొన్ని రంగుల మధ్య .. చీకటిని మింగిన నది..

అదే కావాలి.. ఇంకా ఏదో తెలిసేలా కావాలి.. కొండ అప్పటి వరకు పట్టిన పడవని వదిలి ..

 కొత్త పాటని కలిసిన నిద్ర యాగంలో మెసుకొన్న దూర గ్రహణాలు కావిడి..

నిర్ణయ స్థిమితం లేని నిరాదీక్ష కథకి కలిసిన ఆమె నివాళి చీరకి పెట్టిన మంటలా కదిలి..

నీరు పట్టిన కలతో .. చెలరేగిన దృష్టి సగం మోసి తెచ్చిన … కథల పొత్తిలిలో కత్తి..

మరో వీధి.. ఇంకో చలన సంధికి ఊదా రంగుని పులిమిన నవ్వు..

పాట కోసం తాగిన మంచు కక్ష్యలో .. పట్టు దొరకని నిద్రని ఊడదీసి..

అంతా మళ్ళీ కనిపించలేదని.. హెచ్చరిక .. రెండో హద్దుని దాటిస్తూ  …

…………………..

దీప సమాధి కూలిపోయింది.. అతని గదిలోని భావి గొంతులోకి దొరకడం లేదు..

 అదే ఉంటే ఇంకేం కాదని చలన గతి ఏడుస్తుంది…గోల పడీ పడి ఊరుకొంది.

తమక మండలంలో పేరుకు పోయిన కలకి .. మాట లేని కునుకుతో.. పూడ్చి పోయిన కునుకుతో..

తలబడుతున్న రాశీ ఘటం .. ఒద్దికగా ఉండి .. చీకటిలో కూలబడి..

 అంది పోసుకున్న కథకి .. మరో చలన కక్ష్యకి లోపల కదిలిన చావు వేలాడుతూ.. అంపకాలు.

ఉరిమిన నిద్ర కలతల గారడీ .. ఇంకేం చెప్పుకోని కంటి సూత్రాలతో నలిగిన అల్లిక

ఇదంతా నూరి పోసుకున్న కప్పిన జత తెరల నిందలు .. పులవిందలు

చెప్పుకోవాలని.. వెలిసి పోయిన కథని తెచ్చుకొని తాగాలని.. కథకి నేసిన బట్టని ..

 కొట్టుకొని.. ఇంకిపోయిన చీకటిలో తప్పిపోవాలని.. కదలని.. కుదరని.. జత సగం లో

పాత బట్టని దులుపుకొన్న శ్వాస సాధనకి నేసుకొన్న చీకటి కక్ష్య . తిరిగిన వెన్ను.

 మరిన్ని హద్దులే గుచ్చుకొన్న నిపత్తు సగం ఏడ్చి.. కథలుగా చెప్పిన కాటుక రాళ్ళ కట్టడం .

 అదే పాట.. చేదు గ్రహణం కాపించి తెచ్చిన మట్టి కుండలో నానబెట్టిన గొంతు

ఒక్కసారిగా నింపుకొని ఉండిపోదని.. కదిలి రెండు రైళ్ల మధ్య పాటని గుండ్రంగా తిప్పి ..

 ఓడిన  రెండో కన్నులో గడపలకి గుచ్చిన కబురు. 

…………………….

వాళ్ళు చెప్పుకు తిరుగుతారు.. నిందలకి చేర్చి కబురుని వేలాడదీస్తారు.

 అదే సవరింపుని కట్టుకొని.. రెండోసారి నడకని కప్పి .. తప్పించిన ఖాళీలు.

వదలలేం ,. ఉండలేం.. అక్కడే కనిపెట్టిన మాటని తోడలేం ..

ఏది సగమో అదే వద్దని అన్నా .. ఎవరూ వినరు.. అతను తననీ వినడు.

పాట జీబురు గొంతుతో.. నలిగిన కొండలని పట్టుకొని.. ఇంకిపోయిన

సగం శరీరం మోసి తెచ్చిన నడకలని కుదిపి.. ఊడ్చేసిన సూత్ర దర్శన క్రియల మధ్య

సగం ఆగిన పాట. మెరుగు కంటి నిద్రలో కాసిన చీకటి ఉరుములో కూరిన గతి చక్రం  

విషాద తడి గొంతుల శ్రమ కూలిపోతూ.. ఒక్క నిద్ర వాగుని కనిపెట్టిన ముఖాలన్ని దాటుకొని ..

 కథగా ఓడిపోయిన కునుకుని జత చేసి.. కథలో ఉంచినేసిన గారడీ మాటలు.

లోబడి దేనినీ చెప్పుకోవు.. ఉండిపోయి దేనినీ చేరుకోవు.. కలిసి నీరు పడతాయి..

కొందరు ఏదో తెలియదని.. ఇంకొందరు ,, ఏదో వద్దని.. ఉబుసుపోని

కథల మధ్య కూరుకు పోయిన సిద్ధ రాత్రుల్ని .. తుడిచి ..

మంచు యాగంలో చెమటలు కక్కే పాట .. ఉన్నా ఆగిపోయినట్లుగా తేరుకొంటూ..

…………………………….

6.ఇటు అటు దుఃఖం తెరుచుకొని ఊరికినే .. ఓ కప్పు టీ ఇస్తారా ?…. విస్తార గ్రహణ హేళిక

తను నలుపు .. ఎరుపూ కాని గాజు కళ్ళ చీరని కట్టుకొంది.. నీటి బొట్టు గొంతులోంచి …

రాలుతున్నప్పుడు .. ఆమె గాజులలోంచి శంఖాలు రాలే చప్పుడు..

శిధిల గది ఒత్తిని రాల్చి.. కథ చెప్పిన ఊరటతో కదిలే నిద్ర దర్శన ముఖాలని కప్పుకొని..

అక్కడి శరీరంలో ఒత్తిని వెలిగించింది.. ఎవరమూ మరో నిద్ర సంధికి దొరకని ఏడుపుని

మోసామని కొత్తగా చెప్పుకొంటారు. అలిసిన శరీరం లో టీ గిన్నె

పాట కావాలని ఎవరో వెంటపడతాడు.. ఊరికినే నిద్రతల్లని పేని కలని చేర్చుకొంటారు.

అదే విధమూ .. ఒంటి పై రాలిన చీకటిని జోడించి కునుకుని నెట్టుకొస్తున్న మెలికలు కొండలు

ఎదురేగి.. నల్లని తనులతో చుట్టిన ఇల్లు.. దీపం కోసం అడిగి.. టీ మరగబెడుతుంది.

ఎవరో గుమ్మంలో నిలబడి ,, కొంచెం సిగ్గుపడుతూ..ఇటు అటు దుఃఖం తెరుచుకొని ఊరికినే ..

 ఓ కప్పు టీ ఇస్తారా ?.. అడగక ముందే ఆకులు రాలిన చెట్టుకింద నులిమిన పాట

అల్లం టీ.. నూరి వేసిన యాళికలు.. డార్జిలింగ్ టీ పొడి  …  ఓ రెండు ముక్కలు పాడతారా? అని..

అతను ఏడుస్తున్నాడు. ఇక్కడ కూడా  పాట నన్ను వదలదా ? అని..

ఆమె అలానే చూస్తూ ఉండిపోయింది.. అతను తల దించుకున్నాడు.

……………….

ఎందుకు బాధో తను అడగ లేదు.. అక్కడ గదిని తోడుకొని .. కథలో ఉండిపోలేదు..

ఘర్షణ ముఖాలని తాకిన వీధి మెడలో దిగబడ్డ నల్లని రోడ్లు ఎటూ దాటనీయవు.

తెలిసిపోతుంది.. తెలియకుండా వణికి కొత్త నిద్రల చూర్ణం అరగదీసి..

కథలో కలని పండించి.. ఇచ్చిన పాట ఇది కాదుగా ? అని నిలదీస్తోంది.

ముఖంలో నేను తప్పించి పెట్టుకొన్న చెసదు దుమ్ము ఐ పులుముకొని..

సగం కూసిన మాటలతో బిగువు చల్లిన చీకటి భుజాలు ఏడ్చిన నడక..

అతని పాట మధ్యలో మైకు వదిలి .. స్టూడియో మధ్యలో విస్తార గ్రహణ హేళిక ..

నన్ను మింగేయడానికి వస్తూంది.. ఇంకా ఇది వద్దని మూసుకొన్న గొంతులోని…

సగం ఆయాసం వదిలిన వెలుతురు కావాలని .. వాళ్ళు కాళ్ళ మీద పడ్డారు.

అదే నేను .. ఎవడికి కావాలి.. నీ నేను.. నాకు ఉండిపోయేది .. వద్దని వెళ్లిపోయేది..

 ఒకటే .. రెండో కన్ను కడిగిన నిద్ర తానుల కీర్తన మోసి తెచ్చుకొన్న నిరాశ ఋణం ..

కొత్త గదిని సర్దుకొంది. అదే అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు..ఉండిపోయిన

చీకటి బురద కళ్ళు తప్ప.. నిలదోసిన శిక్షల టీ గొంతులు తప్ప…

జీర బిగుతుల మట్టి బాటలో .. ఎక్కడో కూరి వదిలిన కొండ వీపు దులుపుకొంటుంది.

పాట ఇంటి అల్మారాలో దాచుకొన్న టీ కప్పుల పగులుని అతికించిన రెప్పల కిందుగా ..

ఊగి రాలిన సిప్స్ ని లెక్క పెడుతూ .. పెదాల ఎద్దడి చివర .. సూది గుచ్చిన పాట

……………………

టీ అంటే .. కొన్ని రుణ సముదాయాల మధ్య ఒరిగే బాషణకి మోసిన నివ్వెర పొంగు..

కొంచెం తీపి.. కొంచెం వగరు.. అక్కడ కన్ను వాలిన ఆవిరి తనం మోసిన నిండు గ్రహణ ఊపులో..

నది కట్టు తెంచిన వడపోత సందడి కాలిపోతూ.. పట్టు బిగువుల ఊలని కట్టుకొంటూ..

ఊదుకొన్న టీ కప్పుల మధ్య .. కొన్ని రాళ్ళలా.. పాటని అడిగినప్పుడు.. కూలిన కొత్త ఇంటి

గుమ్మం.. ఊరు మార్చిన టీ తోట .. ఆ మూలగా ఇంకా తవ్వటం పూర్తి కాని సమాధి..

 పెద్ద గొడుగు.. మాట తాగిన హార్మొనీలోంచి.. టీ చుక్కలు బొట్లు బొట్లుగా ఒలుకుతూ..

గొంతు పల్చనై.. వాసన పీల్చిన శ్వాస సర్గణ మందలింపుతో..

మళ్ళీ సమాధానం దాచుకొన్న పాట .. చేరదీసుకొన్న చిత్తడి .

. టీ గిన్నెలపైనా .. వాలిన సీతాకోకచిలుక .. గొంగళీ పురుగై.. పెదాలని రుచి చివరి చప్పరించి ..

పెలపరించినపుడు పాట.. అదే గుటకగా మింగేసి.. వదిలేసుకొన్నానని తెలియక ముందే…

చూపుని పట్టుకొన్నాక.. ఉక్కపోత చీరాల మధ్య .. కొన్ని గమకాలూ ఊడి రాలుతూ..

ఏడుస్తున్న పెద్ద ఎత్తు కొండల మధ్య .. సగం ఊడిపోయిన కంటితో కడిగిన ముహూర్త గది.

అందరూ సర్దుకోక ముందే .. నా గది … ఇదేనని చెప్పి.. టీ కప్పుని కిందకి వదిలి

చెవులు పగిలేలా తలుపు వేసుకున్నప్పుడు.. పగిలిన పాట ముక్కలని ఏరుకొంటూ….

……………………..

7.చావు రెండో గదిలో సంగీతం …విశ్వయోని మలిన యోగం 

ధ్వని ఆగాంధంలో పోటు పెట్టే గొంతుని లాక్కొని.. నిద్ర తమకపు గుండంలో …

కదిలే స్పృహకి సరి చెయ్యని దూరాలని తోడుకొని.. వాదులాడుకొంటారు…

అదే పాటగానూ.. తోచిన పగటి వెన్నులో కూరిన పడవ .. నదిని వదిలి ..

 అద్దం లో తెరిచిన తెరచాపతో కూరుకు పోయిన నిదర్శన కలయికకు ఎండిపోయిన కథని

చేర్చి.. ఆయాస నీలంలో తిరిగిన చెక్క బండి నల్లబారుతూ చీకటికి అడ్డం పడి..

పాటని చూపిస్తోంది. గొంతుకి వేలాడుతున్న చీకటి దారాల్లో చిక్కుకొన్న ఖాళీలు…

ఇదే ఆశలని తెలియని దృష్టి సగం ఈడ్చుకొంటూ.. రగడ దీసిన చావు రెండో గదిలో సంగీతం..

అది మాసి పోయే నెల కాదు.. అక్కడే అయిపోయినవిగా ఏవీ లేవని ..

కొందరికి ఇంటి అడుగు మట్టి నిద్రలో ఊరిన మాటలు  తెలిసే ఉంటుంది.

కదిలే నిద్ర గృహంలో పడి.. ముక్కలైన కదలికనే పట్టుకొని.. చేరబెట్టుకొని…

తప్పిపోయిన పాట ముఖాలు గొంతు ఎత్తి ఏడ్చినప్పుడు..దుఃఖం దోసిలిలో పోసిన

కథకి కొంచెం దూరంలో ఊదితే .. తెలియని పట్టుదారాల బట్ట జారిపోతున్న ..

మంచు పొదలో..కొన్ని దిగడానికి సిద్ధంగా ఉన్న కత్తులు.. మట్టి ముఖాలు

ఇంకొన్ని ఏడ్చి తప్పుకొన్న నిరాదృవ అంపకాల నిడివి.. మంచం పట్టిన బెంగలు…

…………………………

ఒక సంయోగము.. రెండు విపత్తులు.. కొన్ని కాగితాల చప్పుడుని మోసిన ఖాళీ గడపల మధ్య ..

 ఎప్పుడూ ఎవరికీ తెలియని అతిధి ఏడ్చుకొంటూ.. సాధనకి రెండో వివరం కలిపిన …

దూరాల వెంట కన్ను పోసిన విశ్వయోని మలిన యోగం ..

.ఆయాస సగంలో నల్లని ధారని కలిపి.. రంగు తవ్వకంలో మెరిసిన అడుగుజాడలే కైపుని

 పండిస్తూ..తీరిక లేని నిష్పత్తు మెలికలు .. రోడ్డు చివర వెలిసిన పాటల కొట్టు..

 పట్టుకొని వదలదు. ఇదే కావాలని లేదు.. అదే దొరికిందని ఒప్పుకోలేం..

తెలుస్తుంది.. తెలియాల్సిందేనా .. అదేం అలా తెలిసిపోలేదు. కథని కప్పింది.

అక్కడ పాట .. ఇక్కడ నీటిలో తేలిన పాటల దేహం .. స్టూడిలోకి ప్రవహించినపుడు..

నెగడు ఊరుతూ.. వణికిన రెండో కన్నులో చితి ముద్ర అలికిన కల .. పాటలు కదులుతుంది.

యాగం లో మలిన నూనె ఒంపిన మంటలు కారుతూ.. స్థితి ధీరణ కలకలం

హద్దు బయట ఏడ్చిన ముఖాలని కొరికి .. దుఃఖం తెలిసిన చోటి నుంచి మారి ..

 కబురుని కలుసుకొని.. మాటకై మెరుస్తుంది. ఆగనివ్వనూ లేదు.

భాషణ రెండో సగం .. ముందు కనిపించే ముఖం .. రెండు జాతరలు మోసిన రంగుల పాట

మూడు స్వరాల మధ్య కదిలే నిద్ర నిరూప సాధ్యంలో మోసిన కరకు జడల అల్లిక ..

 అదే చిక్కబడుతుంది.. చల్లారుతుంది. అది కాదని నెట్టి వెళ్ళిపోతుంది.

………………………

సమలయ చావు జాడలో గొంతుకి  పట్టిన కంటి దీక్ష కార్చిన నీటి తీరిక ..

అదే తీరికగా మాట వెనక కదిలే నిద్ర తూగుని కుదిపి.. దుఃఖ పదిలికని జోడించే శూన్య స్థితి

మూర్తుల గర్భం నిండి ఉంది. పాట కదలక ముందే వాళ్ళు స్టూడియో వదిలిపెడతాడు.

ఒక మాటకి.. కొన్ని నిర్ణీత మీటర్ల మధ్య కదిలే .. నిద్ర ఊపుడు స్థలంలో పడి.. కొత్త దర్శన లేని

 ఏకైక మూర్తిని కప్పుకున్న మలిన యాగం.. స్థితి సాధ్యం లో ఊరేగిన పాట..

అదే గ్రహణ ముద్ర వార్చిన కథల వెంట గొంతుని తెరిచిన చీకటి అనునాద ఉక్కిరిలో ..

విశ్వయోని మోసిన రెండో గదిలో సంగీతం.. అదొక సదా ఋణం పోసుకున్న ఛాతీల మధ్య

ఊగిస రాత్రుల కలతని కనిపెడుతూ .. హద్దుని ఏకం చేసింది.

ఒరిగిపోయాం.. అదిలించి చెప్పుకొన్న దేహ దర్శన మెలికని సరి చెయ్యక ముందే మిగిలిన

 ఖాళీలని చుట్టుకొని.. నీరు పట్టేసిన కదలికతో కబురుకి సిద్ధమౌతారు.

…………………………..

8.ఒంపులు తిరిగిన విగ్రహం .. మలుపు తిప్పిన ఛాయల చూపు

కసి కూరిన నిద్ర దూరాల పాటని కాగబెడుతూ.. రొమ్ము పిండిన చీకటిలో ..

నిండి గాలించినా దొరకని ఇల్లు.. కాలిపోయిన గోడల్లో నేసిన పాటకి ..

కొన్ని చరణాలని కలిపి ఈడ్చుకు పోయిన మత్తుని ,, ఊడలుగా చుట్టి..

రసాయ మాదకతకి నిండు రాత్రి కొలువుని కట్టి.. సరిచెయ్యని గొంతుతో..

బూజు పట్టిన కన్నుని సగం కత్తిరించి.. పాట ఆచూకీలో కలబడతారు.

ఆదే బాటగా తప్పిపోయినపుడు .. చీకటి నది దాటుతున్నప్పుడు ఎదురైన  ఒంపులు తిరిగిన

 విగ్రహం .. కూలబడిన ముక్కలు.. మసి పూసిన ఖాళీ నిద్రల బయట ..

ఉండి .. నీరు పట్టిన వీధుల్లో .. పాకి వెళ్లిన శ్వాసని గుట్టుగా చుట్టుకొని..

వెదకబోయిన పాట. అదే ఉంది.. అక్కడే పగిలిన కుండల మధ్య నడక తెలియని కాళ్ళు…

మాటకి ముందూ .. వెనకలుగా పండిన కలతో అంపకా మూర్తుల వాలు కొండని కత్తిరించి..

 హద్దు కొట్టేసిన వీధుల బయట.. కొత్త నగరం కావాలని అరిచిన పెదాలని నానబోసి..

 దుఃఖం తిప్పుకొన్న చర్యలు. మరో అలవాటులో కొత్త పెట్టిన దుఃఖం మోసిన కదలికనే

నెట్టుకొంటూ.. భూమి నివేశ రాత్రిని పొట్టి పొట్టి అడుగులతో కొల్చి..

అటు పోయి ఏడ్చిన మాటలు. వీలుపడని పాటలు.. నిండిన కొండలు .. పెద్ద మోడు చెట్లు.

…………….

లోపలి నిద్రని లాగేసిన ఆందోళ ముగ్గిపోతూ.. అద్దేసిన దుఃఖ మాత్రని కరిగించి పెట్టుకొన్న

..విన్యాస ముద్రలో . కప్పెట్టిన దేహాల కమురు మట్టి మెత్తని కదిలే కలకి పాటని కట్టి..

 గది నుంచి బయటకి లాగుతారు.. వద్దని అరిచేవారు .. తలుపు చివర కథని ..

జిగురుతో అంటించి ఎగరమనేవారు.. నరాల సల్లుడులో మోగిన విపరీతాల

కంటి దూరంతో సరిపెట్టాం…గొంతు దగ్గరలో ఎంత కడిగినా వదలని బురద…

ద్వేషపడి లేం.. మసక బరువు రాకని కట్టుకొని ఆగిపోలేం..

 కునుకు నిద్రజాడలో కనిపెట్టిన పాట అదేనని చెప్పుకోలేం.. ఊసులు పడతాం ..

సరి చెయ్యని కథల బయట .. గొంతు పండిన నలుపు కాగడాలని దులిపినప్పుడు

 అంటుకొన్న నిద్రకళ్లని తెరిచి.. కేకలని మింగిన దారి బయట ఛాతీలు పొంగుతాయి. 

ఇది అదే కాదని తెలిసినపుడు మాత్రం దుఃఖం సరి చెయ్యని భయం ఊరేగి కథలో

మరో పేజీ తెలియని విపరీతంలో మోసపోయిన కథ.. ఆనవాళ్ళని రూపం కట్టి చూపించదు.

మలుపు తిప్పిన ఛాయల చూపు .. తాను కనబడదు.. అంతా తెలిసిపోతుంది.

గొంతు వెలిసి పోయిన ఇంద్ర ధనుస్సు.. వాన ఏడ్చిందని ఎవరూ ఒప్పుకోలేరు.

సలపరమూ.. నిద్ర నలిగిన కిటికీల మధ్య కూర్చి పోయిన ఖాళీ గొంతుల రాక ..

అదే పాట.. మళ్ళీ తెచ్చుకొన్న కథలో వినికిడి రుద్దన మోసిన సొరంగాలు గూడు.

……………………..

విపరీతాలు నిద్ర సంధిని అరగదీసి గొంతులో కాలుతూ.. తెలియని ఒత్తి పిండిన వెలితి..

 అదే ముఖమూ.. రెండు చీకటి తలుపుల దూరమూ .. మార్చి పెట్టుకొంటూ..

దూప జ్వరంలో కాల్చి పెట్టుకొన్న పునాదులని తగిలించి.. కొత్త ఋణం ..

కొంచెం ముఖం చెప్పిన మాటల వెనక .. కల పూడ్చిన పాటని ..

మంటల్లో వేసి చలికాగుతూ.. దుఃఖం పూర్తి చేస్తారు. కథ ఆగిపోయింది.

పులబారిన చావు వీధిలో ..సగం వదిలిన చీకటి ఎత్తులు కరిగిన హద్దుల్లో ఆరడీలు..

విసిగిన ప్రాసలు.. పొడుగు సాకీల మధ్య కూరడి రాతల కుట్రని కలిపి..

వేరు పడిన చలన ధారకి మోసి తెచ్చుకొన్న కథలు.. మాటని తప్పించిన నిద్ర రూపుల జల్లెడ..

కప్పిపోయిన నిర్మాణ తీవ్రాలు.. మళ్ళీ చెప్పిన శ్వాస ఖాళీల్లో మోసుకు తిరిగిన వంతులవారీ

కుట్రలని తాగి.. దూరంలో ఉండిపోయిన నిగ్రహ కణుపులని సాగదీసి

మరో పాటకి తీర్చిన కథ తగువుల మధ్య  కుదిరిన ఒప్పంద అనుకూలనాలు..

వడపోతల మధ్య రంగు నవ్వు.. తెల్లార్లూ మెరిసే గొంతు మడమల్లో దిగిన ముళ్ళు..

ఉంటే ఉంటాయి.. ఉంటాయని అనుకున్నాక .. చెప్పకుండా వెళ్లిపోతాయి.

……………………………

9.చలి మడుగుల పెద్ద పెద్ద కేకలు…దిగులు బుట్టలో పాట

తెలిసి పోయిన పెద్ద కథలో.. ఊరు చనిపోయిన రెండో బాటలో.. సమాధి నిద్ర కప్పిన తను ..

 రెప్పవేటు దూరంలో ఏడ్చిన దుఃఖం తీసుకొని..దిగులు బుట్టలో పాట..

అది నిషిద్ధ పురాత కథనం చెప్పుకొన్న నిండు కుండలతో పారబోసుకొన్న నిద్ర మిగులు..

కలలో చేజార్చిన హద్దుని మోగిస్తూ.. పగటి చిత్రం కాల్చుకున్న పెదాల ఘాడత ..

ఉరిమిన రుణంలో కప్పుకున్న సగం నిద్రకి పీల్చిన పాటనే వాళ్ళు ముందు పెడతారు ..

వద్దని ఒకరు.. ఉండీలేమని ఇద్దరు.. మగత చినుకుతో కూలిన ఆఇంటిలో కలవిడి మెలకువతో

ఒకరు.. వేళ్ళాడి కలిసిన చావు విడిదిలో మోసి తెచ్చిన సమయ గుండాల రుణ దీక్షను వదిలి

పోయిన కంటి ఋణం కప్పుకున్న మాటల మధ్య ఆగిన ఊటలని గిలకొట్టి.. చీకటి భుజం

సర్దుకొన్నా నెలివిడి చూపులతో ఇంకో నిద్ర తీరిక కూలబడిన స్టూడియో..

కొన్ని సముద్ర కావలింతలు.. ఒద్దిక కొండ మలుపుల్లో .. గుది గుచ్చిన వణుకు తీర్ధాల గుట్టుని

కుదిపి.. అక్కడే వేలాడ దీసిన కన్నుకి పేర్చిన వడపోతలు శంఖాలని నమిలేస్తూ పాట..

సొమ్మసిల్లిన నడకని లేవదీసుకొని.. కథలో విప్పుకొన్న చర్యా కథల కలని తోడుపెట్టుకొని.. సంధి

చెయ్యని పాటకి తగిలిన నిద్ర తీర్మాన భుజాలని లాక్కొంటూ.. తీరిక ఆగిపోయిన కంటిలో నల్ల

 కొండల కలత..కొన్ని తాళాలు వేసిన గారడీ గొంతు మట్టిలో కూరుకు పోయి

మాట చనిపోయిన కథకి .. చెప్పుకొన్న నిద్ర దేహాల గురి తప్పుతూ..

 కిందికి చేరిన పాట చుట్టూ కమ్మేసిన నీరు…పాకి వెళుతూ కనిపించని పాట…

ప్రదక్షణ .. ఊరి మోతలతో పైకి చేరిన గుడి.. నమ్మకం మోసిన నది మెలికలో నలుగుతున్న

 వంతెన .. చెవుల్లో బూజు నింపే పాట.. కడుపులో పుండు పెట్టిన ఊట…

…………

అందరినీ వదిలేసి చలి మడుగుల పెద్ద పెద్ద కేకలు .. రుణ పదార్ధ తేదీలు మారుతూ..

 కథకి రాల్చుకొన్న చినుకుల మధ్య నిలిచినా దీర్ఘ రుణాల కథనే పాట చేసి పాడినా ..

ఎవరూ   వినలేదని కంట్లో రాలిన కునుకుతో తోడు పండిన దూరాల కుట్ర..

నువ్వు అక్కడే ఆగిపో.. అంతకు మించి మెట్లు లేని పాట గోష పడుతూ అరిచి ..

కొత్త ఇంటిని .. వెనక నుంచీ తవ్వి.. అదే వంతెన కి కలిపి దూక మంటోంది..

అపనిందల దేహ భూమిలో ఒరిగిన హద్దుని కలిపి పెట్టుకొన్న తీరికలేని సారధుడుకి నేసిన చీకటి

ఏడుస్తూ.. కలిపి పెట్టుకొన్న మెట్ల మధ్య ఊగిన భుజాలు.. నిజారపు గతి బొంగరాల నికిత గదులు.

ఇంకిపోయిన నిద్ర ఋణం .. పాకిన చీకటి వానలో వాడిపోయిన కథలని కలిపిన కల ఊగుతూ ..

శిధిల ధారణ పెళ్ళగించిన పాట ఇంకా దొరకలేదని .. పిచ్చివాడై తిరిగాక ..కళ్ళకి కట్టిన తాళ్ల దగ్గర

 గడ్డ కట్టిన రక్తం.. ఎవరో గొంతు మార్చి వదిలేయమని అరుస్తున్నారు.. దగ్గర పడతారు

 కథని కడిగి ఊరుకోమని అదిలిస్తారు…కప్పి చూసుకొని వెనక్కి తిరుగుతారు..

అదే పాటని కూర్చిన జోరులో.. వాన పగులగొట్టిన దుఃఖం పండిస్తూ.. దీర్ఘ సంతులన మోసిన

 గొంతు పండుతూ.. అద్దకపు పాత పాటని కదిలించే కథలకి మధ్యలో ఊగిసలాట..

కొంచెం నీరు పట్టిన కొంగుతో.. నిద్ర జారుడుని వదిలిన పాట కలుసుకొని .. కొత్త ముఖం మాసిన

 ఎవరూ గుర్తు పట్టలేదని ఏడుస్తూ.. తిరిగి చెక్కడం మొదలుపెడతారు.

……………………..

దిగులు బుట్టలో నింపుకొంటూ పోయిన నెమలి కొండలు..నది మిగులు దీవిని చప్పరించిన

పడవల్లో.. పాత మంటని కుదిపి.. కొంచెం ఎసట్లో పోసిన బియ్యం.. తరిగిన మంచు..దుప్పటి

ఊడదీసి సముద్రం.. రెండు జడలు వేసుకొన్న పడవ ఆచూకీ జారిపోయాక..

మసక మండలం లో కొట్టి తెచ్చుకొన్న పడకలు.. నుదిటిలో జార విడిచిన నీలం దగ్గు గొంతులో

పండాక .. పాట కొంచెం నల్లబారిందని.. హాస్పిటల్కి పంపారు. గట్టు తెంపారు

ఏడవడానికి ఏదీ లేదు. నిల్చి పోయిన పొగ గొంతులో కథకి ఏదీ కొత్త కాదు.

తలపడి లేచిన కథలో పడి.. దుఃఖ తీర్మానం లేని అవ్యయా  ముఖం తో ముద్రలు పట్టిన

 కంటిలో కొన్ని ఊరిన సముదాయ నాటకాల తీరుని కనిపెట్టి .. చీకటి సర్దిన కంటి సూత్రాలతో .

. ఎక్కీ దిగిన కొండల మధ్య … సమాధులు గడించిన పాటలకి ..చెట్లని వేలాడదీసి .. ఊరు

కనిపించక వెళ్లిపోయిందని కాయంగా తెలిసాక .. అక్కడే ఆగిపోయారు…

వంతులేసుకొని ఓడిపోయిన ఒడిలో పొగని కాల్చి ,.. దుఃఖం వెళ్ళిపోయినా కాటుక తెరల ఇల్లు.

…………………………

10.తెల్ల చీరల చీకటి .. విప్పిన నిద్రోహ గోళపు నిప్పుల జడి

పాట గాలులు మోసి తెచ్చుకొన్న కబురు ఏడ్చుకొంటూ.. తేరుకోలేని నిద్ర ఝాములో ఊదిన

కొండలని కలిపే వంతెన తీరికని కడిగి.. కూర్చిన ఛాయల మధ్య కలిసిన శత్రు గుడారపు

మెలికని తప్పించి .. తెల్ల చీరల చీకటితో కప్పుకొని ఉండిపోయిన పాట ..

పైన కొంచెం.. కిందికి లాగిన నిద్ర దర్శనంలో మోగిన కథ కొంచెం కొరికిన పాటతో .. దేహ ధారణ

కప్పుకున్న కథలు .. ఊరిపోయిన కంటి ఋణం .. పొగ పండిన కళ్ళకి రాసి పెట్టుకొన్న నడకని

దాటి.. అక్కడే మరో శిధిల గర్భం ఊడ్చిన కథని పట్టుకొని..

రెండో సవరణ ,, మూడో సిట్టింగ్..నాలుగో ట్యూన్ .. చివరకి మిగిలేది మాత్రం .. తిరిగి అదే జీర..

 సమర్పిత గతి చక్రాల కొండ కిందుగా .. నిప్పుల పొదలో ఇంకా ఉడుకుతున్న పాట..

గొంతు మండలం రగిడిన అమావాస్య చనిపోతూ .. మరలా చేరుకొన్న నీటి గుట్టు కప్పుకున్న

 చీకటి వదులుగా తొడిగిన కథ .. రెండు వంతెనలు రాల్చిన ఇల్లు…

మళ్ళీ చెప్పుకొన్న దేహ రుణపు .. పట్టు దీపాలని.. వరం కురిసిన కంటి పాటని అరగదీస్తూ..

 పెనవేసిన  కథకి .. నేసి తెచ్చుకొన్న పాటలు చీకిపోతూ.. సాధారణ చిత్ర నిద్రలు మోసి

తెచ్చుకొన్న మోసపు గతుల్లో లేవదీసిన పీడన.. కథ కూలిన నెలల పొగ ఊడలు

……………………….

పారబోసుకొన్న కన్ను.. దులిపి పెట్టుకొన్న చెమట బట్టల్లో .. నలిగి చేరిన గాలుల మధ్య ..ఊరిన

 కలతో .. నిస్సార దూర గ్రహణం తిప్పుకొన్న నడకలని పోతపోస్తూ.. బిగదీసుకొన్న నిద్ర రవ్వల

 గుట్టలో తవ్వి చేర్చుకొన్న పునాదులు.. కదిలే నిద్ర చుట్టూ.. పగుళ్లు తీసిన అద్దకపు

నిండిపోతలు.. సమాధానం తన దగ్గర లేదని ఏడ్చినప్పుడు .. విచ్చిపోతూ  …

ఊరిపోయిన కళ్ళకి మోసి తెచ్చిన కాటుక కొండలో ముఖం చాటు చేసిన పాట.

 విప్పిన నిద్రోహ గోళపు నిప్పుల జడి .. రుణపడ్డ పగటి తలుపులని మొత్తుకొంటూ..

 పోసి తెచ్చిన కునుకు .. పోలిక లేని తీరుబాటుని మార్చి తెచ్చుకొంటూ.. తేరుకోలేని ఉనికి

పెట్టుకొంటూ.. దగ్గర చేసుకొన్న పాటలని కాగబెట్టి .. కళ్ళలో పోసుకున్న నిద్ర కథలు..

ఏవ్ పాటకి… నీరు పెట్టిన గొంతులోని పొగలని పీల్చుకొంటూ.. రుణపడిన

కథలకి వేరు కలలు లేని హద్దుని చేరదీసి ఏడుస్తూ.. పైకి చేరిన నిద్ర కలతల గుట్టు

ఒక దేహమూ .. రెండు హద్దులే మధ్య కదిలే కొండని లాగి పెట్టుకొన్న నది ..

 ఎండ పోతల గొడుగు కింద ఒక రాత్రి మొత్తమూ ఊరట లేని పాటలో పడి ..

 పోలికలని దులుపుకొంది. వదిలేయమనే పొగురుని పిండుతూ…..

………………….

పాతి వెళ్ళిపోయిన నిద్ర ఖాళీలని కట్టుకొని ..దేహ నిఘార విరుపుని దట్టించే కదలికనే కాగబెట్టి..

 ఒద్దికలేని ఇంటి గడపకి .. గుమ్మంలో మాసిపోయిన కునుకుని పట్టి..

నిప్పుల జడిలోకి కూలిన తెల్ల చీరలు.. ఒడిలో కురిసిన నిద్ర ఝాము మందలింపుని కరిగిస్తూ..

తేరుకోలేని దేహ చిత్రాల గడువుకు దిగిన హద్దులో .. పాటని దోపిన చీకటి నిల్వలు

తెల్ల చీకటి నిద్రోహ గోళంలోకి పాకుతున్న పాట .. ఇంకా ఎందుకు ఏడలేదని నిలదీస్తారు.

కథలోనూ.. కథ బయట కాలిన నిప్పుల ఒడిలోనూ..పాకిన చీకటి కురిసిన పాటల పక్కాగా ..

 అదే ఇల్లు.. కొన్ని మాట మార్చిన గదులు.. బజారులో తిరుగుతున్న ఒప్పందాలు..

 ఈగలు ముసిరిన పాట .. దూకుతూ కదిలే నిద్ర గతిని చెక్కి ..

కథకి దూరం జరిగిన అంతాప నీటి గడువులో నలుగురూ కూర్చొని.. గొంతు మార్చమంటూ..

తిరిగి అక్కడికే లాగేస్తారు. …   నిర్ణీమ పొగ చూరుల కథలిమ..

వేరు ఒప్పందాలు లేవు.. కురిసిన గుమ్మాల బయట చెట్ల గుబురులో కురిసిన వాన కుండల్లో ..

ఊడిపోయిన కాళ్ళ దారిని కుదిర్చిన ఝాము… పాటని వదిలేసి పాడుతూ..

…………………………

11.దేవుడు పాడిన గుడి … కలకట్టిన నీటి కొండ

చివరకి ఇదంతా ఎక్కడో మారిపోవాలని.. కన్నుకి పట్టిన జ్వరం దులిపి.. కలిపి చుడుతూ

కథలో కూరిన అడుగుల మధ్య వాన రాకడకి మోసి తెచ్చుకొన్న కలని ఉంచాలని ..

అక్కడే పాట మోసిన కథతో నిండిపోవాలని.. అదే నటన కి వెలిసిన వేదిక కాదని ..

రెండోసారి కలిపి తెచ్చుకొన్న నడకని కాపాడుతూ.. హద్దుని మోసి తెచ్చుకొని.. పండిపోవాలని..

అతని పాటని లాక్కొని..దేవుడు పాడిన గుడి .. సముద్ర బాలింతని మోసిన కథలో

ఒరిగిన కునుకు పండుతూ.. అద్దకపు మందలింపుని .. చేర్చిపెట్టారు…

ఎక్కడో నేసిన కథతో అంపకాల బయట ఇల్లు .. ఇంకా కదలకుండా అలాగే ఉంది.

ఎలాగూ ఎవరూ మరో నిద్ర కృతిని చెప్పుకోని కొత్త కథలో ఒరిగిపోరు.

తడబాటు ఎవరదీ కాదు.. నిర్ణయం మళ్ళీ మాటని తెచ్చుకోదు..

అవధికి చేర్చిన పాటతో మోసి తెచ్చిన ఒంటరి రూపుల కల.. జల్లారుతూ…

వెళ్లబోయామని ఏడుస్తూ.. తేరుకోలేని కంటిని కాగబెట్టి .. విడి మోడులు

మళ్ళీ నీరు పట్టిన చీకటి అనుగ్రహిత జాములో మోసి తెచ్చిన పాటకి .. ముందే తను. 

………………….

ఆమె చెబుతుంది.. అతనిలో కూర్చొని .. పాట  కలకట్టిన నీటి కొండ ..

ఒద్దికగా పండిన కథతో .. మోసి తెచ్చుకొన్న అలసట కరిగిన మంతనాలు..

ఎత్తి పొడిచిన కన్ను.. మాట మార్చిన పాట ని తప్పిస్తూ.. తేరుకోలేని కథకి చేర్చిన

కునుకు పట్టుని .. లాగి విడిచిన కథలో .. మోయించి పెట్టిన అనుమాన కథలు..

అవి.. ఇవీ .. కదిలే నిద్ర గృహంలో ఊపి పెట్టుకొన్న కలలని కడిగి.. విడిపోతారు..

దేహ నీరుకి చేర్చిన కెరటాల ఊపుని దగ్గర చేసి.. కన్నుకి వీధిని కట్టిన కథగా ఉండిపోయాక ..

వద్దన్నవారూ లేరు.. అనుకొన్నది ఒకటిగా ఉండిపోక నిల్చిపోతూ..

అద్దిన అవధిలో పోసుకున్న దేహ సాక్షి మోసిన కలలు.. కొన్ని కౌగిలిని చీల్చిన గొంతుతో ..

 తీరిక మోసిన పాట .. అద్ది పోవడం తెలియని పాట .. ఇక మారదని ఏడుస్తూ.. జోడించిన కథ..

నేను మిగిలిపోయాను.. మరోలా మారలేక నిండిపోయిన కునుకుతో హద్దుని చేర్చి ..

 పొడుగ్గా నిద్ర తీరికని కడిగి ముగ్గు పోసుకున్న మందలింపు.. అడుగుల పొడి

కదిలే ఋణం .. కదలని ఝాము పొగరు.. నీరు పట్టిన కలతతో.. పట్టి లేచారు 

కొత్త భూమి నివాళి బయట పాట జీరాతో ఉరిపోసుకొని కలలోకి చేరి .. ఇక బయటకి రానని..

నేను కనబడలేదని పగిలిన అద్దం.. బొట్టు ఊడిపోయిన గొంతులో మరిగిన చీకటిని చిలుకుతూ..

 కథలోని కథకి గుచ్చుకొని ఊడని పాట.. అప్పగించిన సాయుజ్య ఋణం వేలాడుతుంది

వేరు పడడానికి లేదని.. కొంత కొత్తని గుట్ట చేసి కాల్చిన గోడల మధ్య ఊగిన కంటితో

నిద్ర చేసిన ఖాళీలని కప్పి తిరుగుతూ.. కొంచెం తెలిసినట్లే ఉన్నా ..

 ఒప్పుకోవడానికి ఎవరూ లేరు. తలుపు వెనక పెద్ద ఖాళీల్లో తాను నలిగిపోతున్న ..

ఈ మాట చెప్పడానికే ,, తన రక్త మాలని మోసిన శ్వాసకి పాటని చుట్టి మెడలో వేస్తుంది.

పెద్ద బొమ్మల నిద్రలో .. శ్వాసని కూరి.. కదిలిన నిద్ర సంధికి మోసి తెచ్చుకొన్న..

క్రియల కూర్పుని అడిగి.. మన్నిక లేని విపత్తుకి మోసిన కరకు గొంతులో శిధిలాలు..

కాపుదల లేని ఋణం పోసుకున్న చీకటిని సాగదీసి.. మసక బారిన కథల కిందుగా

హాద్దు లేని కలలకి .. పాటని .. గిరా గిరా తిప్పి కలుపుతూ.. కప్పి పోయిన నిద్ర రాకలతో

తెల్లబోయిన నడకని .. బార్లా తెరిచిన కలతో .. కూరుకు పోయిన చలన చీకటి నమిలిన ..

కునుకు పట్టులో ఊదిన హద్దులు.. కథలో నెరిసిన జుత్తుతో.. కాల్చి వేసిన …

చీకటి వీధుల మధ్యలో ఒరిగిన ముఖాలు…తడిచిన ఛాతీల బరువుకి కూరుకుపోతూ..

మోసపు రంగుల వీధిని కుదిపి..ఆరబెట్టినా కథకి లేవదీసిన ముళ్ళ గొంతు..

బొంగురుపోతూ.. .. ఊడ్చి మోసిన కథనాల గుట్టు బయట కూలిన పేటికల నిమజ్జనం లో పాట..

కొన్ని హద్దుల మధ్య ఊరట లేని కంటి చూపుని సాగుచేసి .. కథలకి ఒరిగిపోతారు.

………………….

12.సరళ మితి కొండలు .. నిద్రార మంగళాలు  .. రెండో వరుసలో పాట

సరళగతి మండలంలో పడి ముక్కలైన కథకి .. పల్చని తెరల వెనక కూలిన

దేహ మండలం లో పాట కదిలే రూపత ముక్కలని అతుక్కొంటూ.. ఒరిగిపోయి

పిండేసిన చీకటి వెనక హద్దుని కూల్చి.. ఎండిపోయిన పగుళ్ళని కప్పి.. చేరవేస్తూ  

ఉన్నదీ .. లేనిదీ .. కదిలేదీ .. కదలనది.. ఉండిపోవడం ..

ఒక్కోసారి .. అటూ .. ఇటూ జరుపుకున్న సరళ మితి కొండలు .. ఎగుడు దిగుడు మండలాలు  

ఎత్తిపోసుకొన్న గర్భ నిద్రల వెసులుబాటు.. కథలో కలిసిన కల.. పాటని వదిలి పెట్టిన నేను.

అక్కడేం కొత్త నడకని మింగేసే పాట .. తన దీప నిద్రని కప్పుకోదు.

వదిలి పోయిన వర్ష ఝాములో పడిపోయిన కన్ను.. నిలబడలేని గది చుట్టూ

రమణీత వాగుల గట్టు.. చెంత చేర్చిన శ్వాస మలినాల గుట్టు…

అంతా తెలిసి పోయిన నటనలని బయట నుంచే కాపాడే మంత్ర నిధి తవ్వకాలు..

కొన్ని పొట్టి నడకలు.. పెద్ద ఆవేశాలు.. నవ్వు రాతలు.. పాట పగిలిన నల్లని కొండలు..

………………………

భయం చావు గడపలో కూలిన నిద్రార మంగళాలు .. అదే మళ్ళీ తెలియని విషయమై

 కదిలే నిద్ర దర్శన ముఖాల మధ్యనే కురిసే కల.. నేల తాకిన పాటల మట్టి అల

ఒంటి పూత నిద్రలు.. కాల్చిన మట్టిలోని బొమ్మలు.. పెద్ద గొడుగు పడవలు.

ఉంచిన నిద్ర గడువు కౌగిలిలో మోసి తెచ్చిన అంపక ముడుపులు.. నేల పాడిన కథకి ..

 దేహం పుట్టిన కథ మోసుకొని ఒరిగిన హద్దులో పడి.. అక్కడే నిల్చిపోయిన కథ..

ఒద్దిక తెలియని నిరాదీక్ష నమిలివేత కలిసిన ముఖాలని దగ్గర చేసుకొని..

రెండో వాకిలి తెలియని నిద్ర పోరుతో తూగిన కథ.. రంగుని నిలుపుకొని ఏడ్చింది.

ఇంకిపోయిన కథ.. ఉండిపోయిన ఇల్లు.. కాలు పెట్టిన భూమిలో నది పోసుకున్న స్నానపు

చప్పుడు.. పాట కలబెట్టిన రెండో కన్ను ఊడిన గొంతు… తెగ్గొట్టి మోగిస్తూ…

కదలని ఊపిరికి .. తెరవని దేహ రుజువుకి.. కాపాడిన దుఃఖ తెరల నల్లని పొగకి ..

 నీళ్ల రేవులో కదిలే శరీర దక్షణ గతికి వేరుగా ఉంటూ..

………………….

సఫలత .. నిద్ర పూర్వంలో కదిలే కథకి .. మరింత వదులు కాని కలని చేర్చి..

 హద్దు వెంట కదిలే దేహ నిర్మిత ముఖాలని కడిగిన జోడింపుకి .. పుట్టు రేవులకి

మరలా తెచ్చుకొని దూరాల మధ్య ఊగే నిరూప పగటి ద్రవంలో పడి కోలుకొంటూ..

విప్పుకొని కలుసుకొంటూ.. నిలదీసిన దేహ శిఖర కంటి ఎరలు…

అదే కథ తెల్లార్లూ లేవదీసుకొన్న అనుమానాల్ని జత చేసి ఏడుస్తూ..

తీరిక అమరిన నిద్ర దోసిలిని పాటలోకి కట్టి.. ధూపాల సమితికి నింపిన కథని పాట చేసి ..

ఓ భాషణ కంటి రాతకి కూర్చిన గతితో.. హద్దుని బిగుతుగా చేర్చిపోతారు.

కావాలని కలుసుకొన్నదీ లేదు.. ఒంటి గడపలో పోసుకున్న

నిద్ర కన్నీరులా పాకిన దుఃఖం మోసుకొన్న కదలిక ఒడిసిపట్టాక..

ముగిసిన కథ చెప్పిన రెండు నిద్రల కొండలో .. నీరు చప్పరించిన కౌగిలి రుచిని తాకి..

మరో చిత్ర చయత కలిసి నింపిన కథకి దూరం జరిపే భూమి పంపకాలు.

వేరుపడిన గతిలో ఓ పాటని ఉంచి.. ఉబ్బిన కళ్ళతో కాటుక దీపం చుట్టిన కథని

పెనవేసుకొంటారు. ఊరిన నిద్ర కాపలాలు కప్పిన కథలో శూన్యం పట్టిన గొంతు బిగిసిపోతూ ..

ఏదీ మళ్ళీ తన కథగా ఉండిపోదు. తననే దేహ రుజువుని వదిలి కొత్త దీవిని చేరుకోదు.

తెలిసినది.. తెలియనిది.. ఉన్నప్పుడే కలిపిన జోడు రథాల పరుగుని పాటలో ముంచి..

కథకి దగ్గర చేసిన దేహ నిప్పుని ఊది.. కళ్ళలో పడి తప్పుకొంటారు.

…………………………….

13. ఆది సమ్మతం .. మూడు గదుల ముద్దు .. పొగ నిగ్గరించిన పాట

కలతపడి ,, నిప్పుమడిలో మండి … దుఃఖ తీర్మాన రాత్రంలో కలబడి… విలవిలలతో..

 చేతుల్లో రాల్చిన కిటికీని మూసీ .. తెరిచి.. కథకి మోసుకొన్న సంకెళ్ళ బయటనే గుర్తు తెలియని

 పాటని పట్టుకొని.. కొంచెం లాగి చూసి.. తాళం చెవులు విసిరేసి ఏడుస్తూ..

నిభామితం కాని.. ఒంటి పాటని జోడించి.. తిప్పి కొట్టిన దృశ్య నిద్రలో కలవడి..

శరీర సాయం తెలియని కునుకుని అడ్డగించి.. లోపల కాలిన గోడలని కట్టుకొని..

 ఆది సమ్మతం చేసిన కొన్ని మాటలు.. గదులు.. గదులని చుట్టుకొన్న కొండలు..

ఊపి రేగ్గొట్టిన  కునుకుని విడదీసి .. రెండు రంగుల చిత్ర జ్వరంలో పోసుకున్న మెట్లు..

అదే ఇల్లు.. మాసిన శరీరం.. పాచి పట్టిన బట్టలు.. పొగ ఊరిన గొంతు.. ఒడ్డుని మోస్తూ…

 జీర గంటలు మోగిన హోరుని కదిపి .. నిరుటి దండన కలిసిన అండ ..

లోపలికి  తవ్విన కంటి తీగలు చిక్కుకొన్న నిద్ర దేవడిలో  విసిగిన నిద్ర దేహాల కలుపుని దున్ని..

 ఎత్తిపోస్తూ..తీవ్ర నడకలు .. కారం కలిపిన గొంతులు.. చీలిపోయిన అరచేతుల్లో పదాల గొంతు

 పిసికేసిన నిద్ర నాడుల మధ్య ఊరేగే కథ. పాటకి కట్టి లేపిన ఇంటిని కడిగి దీపం పెడతారు.

…………………….

చెప్పుకొంటూ పోతే .. తను ఇంకా ఆ గట్టునే  కలని కడిగి.. నిద్ర మొత్తాన్నీ తుడిచి..

బట్టలన్నీ ఊడిన రంగులతో .. పేరుకున్న నమూనా ముఖాలతో హద్దుని ఎగదోసి..

పాట ఇదేనని చెప్ప్పడానికి నువ్వెవరని ఎవరో గద్దిస్తారు .. కలని పోతపోస్తారు.

మూడు గదుల ముద్దు  చప్పుడు చేయక ముందే ఇంటిని విసిరినా కబురుతో

ఎవరో నిలబడతారు. మళ్ళీ మళ్ళీ అక్కడకే లాక్కెళ్లి వదిలిపెడతారు…

పారిపోవడానికి లేని నిద్ర కొండల పిలుపుకి.. ఒరిగిన కథలో నేసిన చీకటి విప్పిన దుస్తులని సర్ది..

చీకటి అప్పగించిన నడకతో మరలా తిప్పేసుకొన్న తీర్మాన రాత్రుల మధ్యలో నీటి కోతలు..

సగం జుత్తు దువ్వి వదిలిన చీకట్లో తచ్చాడే పాట .. అదే మందలింపు..

 కాస్త నిద్ర తీరులు.. భయం పోసుకున్న పుట్టుకలో.. కాటుక చిప్పిల్లిన పెదాల మధ్య ఊరే పాట..

తను ఉంది.. పాటకి ముందు.. పాట తర్వాత .. పాటలో లేదనే శ్వాస కాయం చేసింది.

పాటలో ఎక్కడా అంటే ,, తాను ఆ గట్టు వదిలి వెళ్లిపోయింది.. పడవ లేదని దీవిని చేరడానికి

కొండ వాలింది.. పెద్ద పెద్ద పెళ్లలుగా చీలి.. వర్ష ముద్దలని మింగి..

కాని ఆ చప్పుడుతో తను కలిసిపోయింది. నిండిన గదిని వదిలిపెట్టింది…

తాను లేదని ముందే తెలిస్తే .. కొండ వాలు తుండగా  .. ఉంది.. కానిప్పుడు లేదు.

………………….

పొగ నిగ్గరించిన పాట ఒంటిపై చేరుకొని .. నిద్ర కదిలించిన కంటిలో పడి ..

 సాగుచేసిన కథని మింగి.. నిలబెట్టిన  కలని సిగ్గుతో ముంచి. కోల్పోతారు..

ఆది మోహారాల కైపుకి చేర్చిన నిరాళ పాట ,. సమాధి హారుల గుచ్చం  

అదే వరుస .. కదిలీ కదలని రెప్పల బరువుని అరగదీసి .. సాగబడిన వెన్ను నీరుల కలత

పైకి చేర్చిన చందన పరీమళపు కడసారి నిద్రలో కూరుకు పోయిన నిశ్చల చర్యకి ..

 ప్రతీప  నికరాల హద్దుకి .. రెండో వేపు ఉండిపోయిన కలనే పట్టుకొని ..

కలిపి చెప్పుకొన్న పడవల కింద దాచిన పాట ఏడుస్తూ.. పెట్టెలోకి వెళ్లిపోయింది

ఇంకెంత ఏడవాలో తెలియని అయోమయం.. కదలికనే తట్టి లేపిన జ్వర దేహ వికర్షల కూర్పు..

.నిధ్రూప కౌగిలికి చేర్చిన కన్నుని దిగబెట్టి నడకలో చుట్టి వెళ్ళిపోతారు. కదలనివ్వరు

పైకి చేరిన చిత్ర దర్శన ముఖాలతో చేదుగా గొంతులో దిగిన పాటకి రెండో అనువాదం లేని

ముఖం .. కొంచెం కప్పి వదిలిన దూరాల మధ్య ఉంచేసి పాటల చుట్టూ .. వీలుపడి 

తేరుకోలేని అరూప పోలికలు…పాట చుట్టిన పెద్ద వీధులు

……………………

3.ఉరవడి పోతలు … నిదీప శరీర గదులు

(Seasonal health card … dipstick of heart )

ఉండీ లేకపోయిన గొంతు చెలమల్లో .. నీటి పగుళ్ల విశ్వం కదల్చిన ఉరవడి పోతలు..

 పాట ఆ దూరం లోంచి ఎటు విసిరి ఆగిపోతుంది. కదలనని ఒప్పుకొంది..

చలన కక్ష్య కలబారిన గదిలో ఊరటలేని దుఃఖం .. నిండి పోతున్న దీప పూతలతో ..

ఏదో దూరం పెట్టాల్సింది హెచ్చరిస్తోంది.. వదిలిన ఆవిరి నురుగుల కాష్టం

వివరమూ .. గది వాలు శాపమో.. కొండకి పట్టిన నాచు కాళ్ళ విడిది దేహం మింగేసాక ..

చుట్టూ సముద్రం ఏడుస్తూ.. కథ మెలికలతో కాదనే చోటులో ఊరేగి చేరుకొంటూ..

విస్మయాన పూర్ణిక .. తధార్ధ మాన మసలికలోని ఒగర్పు..

మసి పోసిన పేజీల బయట గొంతు సవరించిన జీరలో నీటి ఎద్దడి..

హద్దు దాటినా సమీపాలతో కొండ కూలాక.. ఏడ్చి వదిలిన కదలియాకుని చేతితో తిప్పుతూ ..

గొంతులో రాట దించిన పాట ఏడుస్తూ.. తేరుకోలేని నిద్ర సంధికి అయోమయం కప్పిన ..

నిరూప ధూళి చిగుళ్లు పైకి లేస్తూ .. అల్లేసుకొన్న శ్వాసలో … కలపని నల్ల రంగు దోసిలిలో ..

నిలువెత్తు సాధన వెనక గుక్క పెట్టిన తలుపు తీర్చుకొని చీకటి సముదాయాల మధ్య

చూపు విరిగిపోతూ.. కథ కొట్టుకుపోతూ.. విలవడి నసిలిపోతూ

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కథ ఎవరిదో నిర్ణయం కాలేదని మాట చెప్పుకొని.. కల ఊడిపోయిన పాత ఇంటి తారీఖులు

మోసి తిరుగుతూ..చింపేసి మిగిలిపోవాలనుకొనే షెడ్యూల్స్… క్రాస్ డేట్లు

విసుగు.. నిద్ర బరువు పడవ కుదుపుతో మునిగిన స్వాధిష్టం లో పడి .. జోత పొడులు

పాట తడి రేగ్గొట్టిన పొడి ఇసుక బొమ్మలు గాలిలో ఎగిరిపోయాక.. వీలుపజారీలు

 ఇంకేం మిగల కూడదనే ఎత్తుగడ చుట్టూ.. సమయం అంటుగట్టిన కదలికనే

గట్టిగా పట్టుకొంటారు. విడిచి పెడతారు.. పట్టుకొని ఊగుతారు…

సంకల్పం వదిలేయమని .. తీగలు తీగలుగా అల్లుకొని.. నిద్ర విరిచిన

పగతో కమ్ముకొన్న నిశ్చల నిధాన కలత ఊరేగి.. ధ్వని నిఖాత దండనతో ..

కేక పెట్టిన సరళ ముడి బిగుసుకొని.. ఇంకిపోయిన కథకి నేర్పిన కల …

ఊరట లేని జోడు రథాల చప్పుడుని మింగి.. రెండో నిద్ర గతికి పోసుకున్న కథతో..

 కొత్త దశ కలిసినపుడు.. ఉలిక్కి పడేదేదో ఉందని .. కదలిక కలిసిందని  …

చుక్క నీరు లేని వాన కారుతూ కమ్ముకొస్తున్న దాహంతో .. చెలమ ఎండిన కరుకు నాడులు.

…………………………..

వినిపించి తప్పుకొన్నాం.. పాటని వేరుచేసే నిదీప శరీర గదులు కావాలనే సాయస్తిక

మందలింపుని కమ్ముకొని.. ఆ లేత ఝాముల బయటనే ఉండిన కలతకి ..

రెండు చేతుల జోల కావాలని.. గొంతు పూడ్చి ఖననం చేసిన కలతలో…

ఏది ఉందో అదే లేదనుకొన్నప్పుడు.. ఏది లేదో అదే ఉందని ఎలా అనుకోవాలి.

సరిగా చూడని.. వినని.. పట్టు దొరకని.. వీలుపడని .. గొంతు పండని పాటతో..

ఉరవడి పోతలు ..కొంచెం గది బయట శత్రు రాత్రం తచ్చాడిన కథకి

రెండో ఝామునే ఇచ్చిన దూరం లో చితి పొగలు.. ఎర్రచీకటి చీల్చిన పడవ ..

దాని కంటిలో ఎడమ పల్లంలోకి కురుస్తున్న వేడి కుంపట్ల  మంచు..

 కొండల నీటి ముఖం నల్లబారి కాలుతున్న నిశార మట్టి నాడులు వణుకుతూ..

చింపి వేసుకొన్న నిద్ర సముదాయ కన్నుకి .. ధూపామేసి కురిసిన దృష్టి మసక జోరుని ..

గిర్రున తిప్పుతూ.. కళ్ళకి పల్చని నిద్ర తోరణం కట్టిన మెలికలు తిరిగిన నది పక్కగా ..

తాడు కోసిన వంతెన .. అటువేపు  గట్టు ఒంపిన కేకలు..

……………………..

1.అలయ రీక్షణ .. స్థితి మోసిన గందర గోళపు నివాళి… నిలుస్తున్న  పాట

ఒకటే దశ .. కొత్త నిద్ర ధూపాలపై కదిలే దేహ నిరూప ముఖాలన్ని కదిలించే గ్రహణ

సముదాయాలపై.. చేరుకొని.. కూలిన కథని తాగి.. ఎండబోసిన దళసరి శ్వాసలు ..

నిల్చింది నేనే .. కదిలింది నేనే.. ఊరేగింది నేనే.. అనుకొని కూలిందీ నేనే…

ఊసుపోని అలయ రీక్షణ .. కదలికనే కనిపెట్టి మోసిన కథలో పడి తప్పుకు పోతూ..

 ఇక్కడే మిగిలిన దేహ సంధాన ఓపికని దాటి.. కన్నుకి పోసిన నిద్దర ఒంటి పోతల మధ్యలో ..

గడించి వదిలిన చావు రింతని కదిపి.. నీరు పట్టిన కలలో పడి తిరుగుతూ..

హెచ్చరికని మోసిన ముఖాలతో కలిసి.. పాటని అదేలా చెప్పుకొంటారు…

 నిరుటి చీకటి కూలిన నిస్పృహ కథని తాగి.. అదే కనిపించని ..

నిపత్తు కలిపివేతని కరిగించి.. దూరం లో నిండి మోగిన గంటలని దూకిస్తూ..

 తేరుకోలేని పాటకి రెండో విడుపు లేని కథతో మళ్లించిన దుఃఖం ..

అక్కడే ఆగే ఉంది.. మాటని తెచ్చుకొని కరిగే ఉంది.. పాట నిలబడే ఉంది

మసక రేవులో దూసుకొస్తున్న చూపు పాతకాలు .. గొంతులో గుర గుర లాడుతూ ..

మాటకి అడ్డం పడుతున్నాయి.. చేతలు మగ్గిపోయిన స్టూడియో

పక్కకి సరిపోనిది.. పాటకి సరిపోక .. పైకీ కిందికీ జరిగిన హద్దులో పడి ..

 కదలికనే మోసి తెచ్చిన కంటి శోదాలు.. ధూప గుణాలు అరగ దీసి కదిలి వెళ్ళిపోతారు …

ఆ దూరమూ.. ఈ దగ్గరా తెలియని రుణ ముఖాలు పోతపోసిన కన్నీరుని బిగలాగి కడుతూ..

 దోసిలి నింపిన కరకు పగటి సంచీలు. .. చేదు మంగళ వీధులు..

,,,,,,,,,,,,,,,

ఆమె కనుక్కోమంటోంది.. ఈ లోపు మళ్ళీ వస్తానని.. కానిది కనిపించడం లేదని.

 నిద్ర మోతాదులని ఊడదీసి.. కంటిలో రాలిన వాన కక్ష్యలు మోసి తెచ్చుకొన్న

 కునుకుని పట్టుకొని.. విరళ తీరిక కలని తెచ్చి పోస్తోంది…

తెచ్చి పోసుకున్న స్థితి మోసిన గందర గోళపు నివాళి .. ఒరిగిన అండ

కంప చుట్టిన చీకటి పరధాని చింపి సగం చేసి కట్టిన నడకని వడపోసి ..

 ఏడుపు పెట్టుకొంటూ.. నిశాంతన లేని రెండో ఋణం పంపుకొన్న నిద్ర కేకల మధ్య

చీల్చి పెట్టుకొన్న గోడలు. .. నిద్ర మందలించిన గుహల సముదాయాలు.. నొప్పి

అదే దారి.. రెండు మలుపుల మధ్య కూలిన వంతెన పక్కాగా నేర్చిన కంటి చూపుకి ..

చితి పోసిన పాట ..నిండు రాతల పేజీలని కడిగి.. హద్దు వదిలేసినా దృష్టి నింపుపోతలు

పేర్చుకొన్న ఝాము మందలింపుని సరి చెయ్యక ముందే .. మరింత ఒంగిపోతూ

 ఊగిస నిద్ర కథల్లో పోలుచుకొన్న దూరాల కథని కప్పుకొని..

ఇరుకుగా కలిపి కలతో కూరిన మాటల మధ్యనే మోసి తెచ్చుకొన్న నడకలు..

ఖాళీ రుణాల కైపుని వడపోసి.. పాట దూరం జరపగా ముందే .. మోట కెరటాల జుత్తు మూటలు

చేతీల మేకులు కలిపిన అన్నం … ఒత్తి పట్టిన గదుల మధ్య తడి రేగిన నిద్ర రుజువు దగ్గు..

నూనె కారుతున్న కొండలపై .. ఎవరో కాగడా విసిరారు.. అదే తెలిసిపోతూ…

 నగర సగం మోసి తెచ్చుకొన్న శిధిల గడువు..పాతగా చిందిన కథకి నేసిన చీకటి రుజువులు ..

కొట్టి రాల్చిన కథతో ఊరేగే నిద్ర సమాధులని తవ్వుకొని.. పారబోసుకొన్న గమకాల మెడ..

విలబడి కూలిన కథకి దూరం జరిపిన కథని పాతుకొన్న మాటతో

చెప్పి చూసిన ఆర్థుడి.. కలగా విచ్చి పోయిన చీకటిలో  నుదురు పగిలిన పాట  

…………………

గమ్మున నిలుస్తున్న  పాటలో ఊగిపోతాం .. చల్లారి కప్పుకొంటాం..

విడదీసిన కథకి రెండు జాడలు వేసిన రాకతో .. చెట్టుని వదిలి పెట్టి ..

మాట వెనక నిలుస్తున్న  పాట .. రెండో మాట తెలియని చావు గడప

అదే దూప మెళుకువని కత్తిరించి.. బుస కొట్టిన సీసాల మధ్య వణుకు పొడిని దులిపి ..

మాటని కట్టుకొని.. దూరంలో పండిపోతాం.. దగ్గరై చెలరేగుతాం

అదే కంగారు .. రెండో దూరంలో మోసి తెచ్చిన నటనలు.. రంగు వెలిసిన నిద్రలు

పెద్ద కొండ మధ్యలో మిగిలిన కాగడాల గుట్ట.. నురుగు పీల్చిన కెరటాల

పట్టుని నాకే పడవలు.. పాట దొరకదు.. కొండ బోర్లించిన వాన కుండలు

దొరికిన అదే వాసన .. నాచు ఎంగిలితో పాచి పోయిన అన్నంలా ..

 కదలిక లేని నిద్ర చూపారు గుచ్చిన వేరు రూముల్లో పడి .. గోడ పట్టుకొని ఊగిన కథలు..

…………………………

2.చితి సాయుజ్య ద్రవ రీతులు. .. పాట కట్టిన సంధి దీపాలు..

ఊరబెట్టిన కలతతో నేసిన దుఃఖ అనుమాన రథాలని దిగబెట్టి .. పోసి కట్టి

చితి సాయుజ్య ద్రవ రీతులు.. ఉండమని.. ఇదే చోటని ఎంత మోసగించినా ..

పొడి బట్ట చిరిగిన కథని తాగి.. పాట మడిలో దున్నిన దుఃఖం .. పొడి చేసి ఆరబెట్టి..

ఎన్ని కథలకి మధ్య పాటని కొట్టిన తిరిగి అదే నిద్రలో చనిపోతూ.. ఇదే వద్దనే అరుపు..

ఆ వాంతిని మింగి పోసుకున్న పాట.. ఎంగిలి ఆకుల పండిన విశ్రాంతిలోకి నిప్పు కురుస్తూ..

తేరుకోలేని కథ చివర మోసి తెచ్చుకొన్న నడకలని జారబెట్టి.. కళ్ళలో పోసుకున్న మాటల

ఇగురు.. అదే సంధి చేసుకొన్నా శరీర గతం ఓండ్ర పెడుతూ.. కథకి చివర నెట్టుకు పోయిన

ముఖాలన్ని చేర్చుకొని.. ఇసుక రాలిన కంటి క్షేత్రంలో శ్వాస కుదుపు మందలింపు…

అదే ఉంది.. అది ఎప్పటికీ ఉంది.. అదే చర్యకి చేర్చి ఉంది.. కదలక ఏడుస్తూ ఉంది.

చెప్పబడిన కథ.. వాలుగా చేసుకొన్నా దేహ నిడివి పొగ .. దుఃఖం పోసిన కంటి రుణపు సొద..

……………..

కళ్ళకి రెండో అమరిక లేని దేహ నిందలని కదిల్చి .. మోగిన గంటల మధ్య తీరికల గుంపు..

ఏది లేదో అదే లోపల గొంతుని తూట్లు పొడుస్తూ.. వద్దు వదిలేయమని అడ్డం లోపల చితి..

స్నాన దేహం లేని మెరుపు మండలంలో .. కూల్చి తెచ్చుకొన్న నిద్ర దర్శన వినతిని కట్టుకొని..

 జోరు తెలియని నడక చివర గుప్పిన శ్వాస యేరుల కైపు సంధిని .. ఇంకోలా మార్చ లేమా? ని

ఎన్నిసార్లు అడిగినా .. తిరిగి అదే మార్కెట్ గోల.. అలవాటు నోళ్ళ కిళ్లీ ఉమ్ములు..

రాల గొట్టిన సిగరెట్లు .. మోసి తెచ్చిన ఖాళీల మధ్య కుదిరిన కథనే పాట చేసి తీసుకెళ్లినా .

. కాదనే అనుమాన లెక్కలు.. రెండు గడపలని చీల్చిన నిద్ర పోగుల అండ

దండన మోగిన చింతన కళ్ళకి రాసుకున్న మహా బరువు కల్లంలో పడి.. దుఃఖ పోలికని కోరి

తెచ్చుకొన్న నిద్ర గతుల తమకంతో పడి .. ఊరట లేని కథలోకి తాగి తోడు నెడుతూ…

సాగు చేసిన ఒద్దికల నొప్పిని ఆరబెట్టి.. కథలోకి లాగిన హద్దుకి చేర్చి వదిలిన కంటి కోతలు.

ఏదో చెల్లా బోతుంది.. అల్లుకొని అడ్డం పడుతుంది.. గొంతుని నాచుతో నింపుకొంటుంది.

ఇదే తెలియడం . తెలియక పోవడం మధ్య ఊగిన కళ్ళతో పాట నానిపోతుంది.

………….

కల కుమ్మరించిన వాసనకి ఉలిక్కిపడ్డప్పుడు .. భూమి చీలికలోంచి లేవదీసిన పాట ..

తోడుగా ఎవరూ లేరు.. వెన్నుని ఎవరూ మెలితిప్ప లేదు.. కథని ఎవరూ కుదిపి వెళ్లిపోలేదు..

అంత తెలిసినట్లే ఉన్నా.. చేతుల మధ్య లోంచి రాలిన చీకటి సాను నాదం మోసిన కత్తెర..

ఎక్కడో తప్పి పోయిన అంచనాలు.. కొత్తగా కోత పెట్టిన నిద్ర త్రిగుణాల మధ్య ఇరుక్కొన్న

 ఇంటి తనఖా లో పడి.. చిక్కుకొన్న పాట ఒరిసిపోతూ.. శ్వాస నిస్త్రంతీ ముఖాలన్ని కరిగించి..

అద్దకపు హద్దులు.. నేసుకొన్న పాట బట్టలు కనిపించక చీకటిని మరిగించి చితి నగరాలు..

ఆ బయట ఋణం సిగ్గుపడ్డప్పుడు పాట కట్టిన సంధి దీపాలు.. ఏదో తెలియని రెండో ఇరుకు

 సాయంతో కట్టిన కథ వెనక్కి వెళ్లి . కలల పోగులోంచి. ముందుకు జరిగిన హద్దుని కప్పి..

కలలో పాకుతున్న నిద్ర నాడుల అల్లికని చేర్చుకొని.. కథలో మోసిన అద్దకాల నిద్ర రీతులని సర్ది

 పెట్టుకొంటూ.. నీటి గంటుని పెట్టి పిండిన కథకి రెండో తలుపుని ఊపి.. నిప్పుల దండ వేసి

తీరిక లేని సగం నిద్ర నటించిన కథలో మోసిన రంగుల బండి.. ఊరు తెలియని కథ మధ్య జీర

 పోసిన నదికి దొరికిన గొళ్ళాలు బిగించిన కొండ .. శిధిల నాదన ఏడ్చిన కంటి ఖాళీలు

అవసరమూ నేనే .. ఆయాసము నాదే.. నిండి పెట్టుకొన్న సరళ రుణ పొగరూ నాదే..

నిద్ర సంధికి లేచి పెట్టిన కాళ్ళని నిద్రలో నానబెట్టి.. వెన్ను గడపలో మోసి తెచ్చుకొన్న కథలని

 ఊరడించి.. ఒడ్డున పడ్డ కలకి చుట్టిన భయ సాధనాల రూపు తీరులు..

తెలిసింది.. తెలియని గతి ముఖపు పోలికలు ఊడి.. కళ్ళాపి చల్లిన రంగుల ఇల్లు..

లోపల ఉండ నివ్వదు.. బయటకి తోసేయదు.. ఏదో కనిపెట్టుకొని నిలదీస్తోంది.

……………………

3.ఊరుపుల గతి గుచ్చం .. చెదిరిన మసక రుణాలు..

కదిలిపోతున్న నిత్సర గతి చిత్రాల కొండ పై కదిలే వాన తెరలు .. గుప్పుమన్న గారడీ కథలు..

లెక్కలేని హద్దుని కనిపెట్టి .. ఋణం తీర్చుకొన్న ఇంటి పోట్లు.. కథ లోపలి పాట…

తెలిసేది.. కథకి తిప్పిన కునుకుతో పండిన చీకటి రుజువుల కట్టడి రంగుల్లో

పోత పోసుకున్న పడకలు .. పొద్దుపోయిన రాత్రుల్లో కథ వినబడని

కంటికి రాతని కట్టిన నడకలు.. కూలిపోయిన ఇళ్ల చివర చీకటి చెట్ల ఊళ..

ఏదో తెలిసే ఉంటుంది.. అంతకు ముందే సర్దుకొన్నా తలుపుల నుంచి..

ఎప్పటికీ తెలియని నిద్ర ముంపులు .. కదిలే కథ చుట్టూ.. మండిపోయిన కునుకు

చెదిరిన మసక రుణాలు.. పల్చని గంధపు పరీమళ .. లోపల చెట్టుని ..

కదిలే నిద్ర నదిని చెదరగొట్టిన నటనలని .. పోతపోసుకొన్న మెట్లని చుట్టుకొని..

ఇంకిపోయిన చీకటిని కట్టిన నిర్లయ అవగాహిత సవరింతలని..

………

గత్తర పడుతున్న సన్నివేశాలు.. దుఃఖం కదులుతున్న పొగల వీధి.. కలని వదిలి

కంటికి చేరిన నడకలో మోసిన అలసట కదిలే నోటి జడుపులు.. పాట కనపడాలని..

వినపడాలని.. స్పర్శ నిద్రలో కూలిన చర్యల మధ్య కుదురుని కప్పుకోవాలని..

నేరుగా తప్పుకొన్న కల పులుపు రుచితో సొమ్మసిల్లిన బరువుల కూర్పుని నెట్టుకొన్న కథలు.

కలిసి కదిలిన కూర్పులతో.. చీకటి పట్టేసిన నడకలని .. కూకటి వేళ్ళతో పైకి లాగి

కూల్చి పోయిన  కలతలని తెగ్గొడుతూ.. అద్దకపు నిందలని అరగదీసిన కథకి .

రెండు ముఖాలు లేని గమన చిత్రం కరిగిన మాటలు .. కూడిక .. విడిపోయిన ..

చీకటితో పొడువుగా పండి పోయిన చోటనే .. మళ్ళీ కనిపెట్టి చూపులో నింపి…

మసిపూసిన నలత గోడల చుట్టూ.. కదిలే నిద్ర శంఖాల కమురుని ఊడ్చి..

ఊరుపుల గతి గుచ్చంతో .. లోగా నిండి పోయిన కలతతో కూర్చిన నమూనాలపైనా..

నిగ్రహ తడిపొతలతో.. కాల్చి పెట్టిన పాటలని .. నిందలని ఉడకబోస్తూ ..

నీరు పట్టిన గ్లాసుల్లో .. పగ పట్టిన దుఃఖ నలతల మెలికని కరిగించి ఊడ్చిన కథలు.

…………….

నిరుటి వికర్ష ముఖాల్లో ఝాము మోసిన దృష్ఠి .. సగం కప్పిన కౌగలింతలని ..

అదే సంధికి తెరిచిన కుర్చీల పై వాలిన కాళ్ళని.. కథలో నేసిన నిద్రల రవ్వలని..

 తలపట్టుకున్న నిగారింపు బయటనే కూలిపోయిన భద్ర కథల చీలికని మోసుకొంటూ ..

భయమూ.. నివ్వెరపాటు రుణాల కైపుని తిప్పుకొంటూ.. కదిలే దేహ గుణీమ రంగుల

కల్లోల ముఖాలని తాగుతూ.. వెలిసి పోయిన స్వచ్ఛ కణతలు మధ్య కుదిరిన నిద్ర ఇళ్ల కలతలు..

ఉండిపోవడమూ.. కదిలి నిండి పోవడమూ.. అంతే ఉండిపోయిన కరకు అపాయతా ..

ఊరుపుల రుణాలు కట్టుకొని ఉండిపోయిన కట్టు గోడల మధ్య ఊరేగే నిందలని కదిలించి ..

మరో చిత్ర గదికి నివాళి కురిసిన దుఃఖ నిర్మితాలని కుదిపే చర్యలని చుట్టుకొని..

అదే చెప్పుకోవడానికి లేని రెండో చీకటి సర్డుబాటు .. మళ్ళీ చెప్పుకొన్న నీటి పోలికల మెలికలు..

అదొక విలోమ సన్నిహిత దీపంలో కురిసిన చలన చీకటికి అద్దిన కథలతో కలిసిన పోలికలు..

నిద్ర విరోధపు కళ్ళని కూల్చిన చేరి సగపు మంతనాలు.. పూర్ణ నిష్కర్షలు

ఉండీ చెప్పుకోలేని రుణాల చుట్టూ కదిలే కలత సగపు నీటి సముదాయ కూపాలపై ..

రుజువు చేర్చుకొన్న మంత్రం పూర్ణ ముఖాలు. .. ఆగామిత  నిష్కర్షలు

అదే ఇక మరో చలన విగ్రహ నిండని కప్పిన పాటగా నిలదీస్తూ.. నిలబెట్టి గాలిస్తూ

 కదిలే బయపు ఖాళీలని కూర్చిన నికర నిందలు.. పరాయి రథాల తీర్ధం..

కరిగిన హద్దుల్లో .. కురిసిపోయిన నడకలని దోపుకొంటూ.. ఇంటి చెట్లని

 రెప్పలు విడిచి పెట్టిన చూపుని కుదిపి.. దుఃఖం చేర్చి పెట్టిన నటనలు..

అదే పాటని మోసగిస్తూ .. తేరుకోలేని శరీర రుజువుల శ్వాస గతికి బొట్టుని దిద్ది..

ఇంకోసారి ఏదీ లేనప్పుడు ఆగి కలుస్తాయి…

………………………

4.త్వరిత చిత్ర నిద్ర రూపులు .. కథలో మాసిన కంటి చీకటి గొంతులు

చలన సాధారణ గతి చిత్రాలు.. కౌగిలి కటిలో మోసుకు పోయిన నిద్ర రుణాల గుట్టలు..

కప్పిన రుజువు మధ్య కాలిన చీలికలతో .. కూలిన మహా స్వర నివేద రాశుల మధ్య

కూల్చివేతలు.. ఏది కావాలో అదే నేను .. ఏది నేను కాదో అదీ ఎలానూ లేదు.

కథ చెప్పిన జోడు పేజీల చీకటి రాతని కూర్చిన దీపాల మధ్య కుదిరిన చుక్కలు..

వాటిని కలిపిన శరీర స్వరాల పోలికలు.. రెండో చీకటి మధ్య పాత ఊసులు 

సర్దిన నిద్ర గ్రహణాలు .. కూలిపోయిన జోడింపులతో హద్దుని పట్టుకొని లేచిన

కంటి దూరాలని లాక్కొని.. ఇంకిపోయిన కథలకి చేర్చిన కలలకి లేవదీసిన చీకటి తెరలు..

అంతా ఉంది. అక్కడే ఉంది.. అదంతా తెలియకుండా ఉంది.. కక్ష్యలని గాలించి ..

పాట పక్కగా బెంగ పడుతూ ఉంది.. ఇది కాదని చెబుతూనే ఉంది.

నిర్మిత నిర్మాణాల కథకి .. ముఖాలని తెచ్చి పెట్టుకొన్న కథకి .. ఒక మాటని కూడా ఉంచని

 శరణు నిద్రల కల్లోల కంపనకి.. కదిలే నిద్ర దర్శన రంగుల మధ్య ఊగే భయాల చుట్టూ..

కూలబడి.. ఉన్నది మర్చిపోయి.. చెంత చేరిన ముంపులు నది పట్టుకొని కాగడాలు.

………………

పాట కూర్చిన నిద్ర గుణాలతో హద్దుని చేర్చే కలతకి పట్టిన .. శరీర ఋణం ఎగిసిపోతూ..

 మళ్ళీ చేర్చుకొన్న సదా గతికి మోసిన కన్నుని పాడుకొంటూ..

కాపాడిన చీకటిలో కలిసిన రుణ దూరాలు.. అదే అని వదిలేయని కుట్రతో..

హద్దుని చుట్టుకొని మొలచిన నడకలని వేలాడదీస్తూ.. గుర్రు పెట్టే కన్నులో విడిపోయిన

 దేహ రుజువు రుచి…నిగరువు మోసి తెచ్చిన కథల లోపల ఖాళీ భుజాలు..

కదిలేదీ నేనే.. గొంతుని విడిచి ఏడ్చేదీ నేనే.. మోసిన బరువు కన్నీరులా కలత ఊటనీ నేనే..

అంతా తెలిసి పోతుంది.. కొంచెం చెప్పుకొని  నలత పోసుకొని  కలిసిపోతుంది..

స్టూడియో కొండగా మారి తల కొట్టుకొన్న రక్తం తో .. మోస పోయిన దూరాల మధ్య నడిచిన

చిత్ర కూర్పుల జ్వరం రేగిపోతూ.. అదే విడిపోవడం లేని కబురు తాగిన నిద్ర పోకడలు.

ఉండిపోయింది నేనే.. ఉండాలనుకొన్నది నేను కాదేమో. నీటి పోతలు..

అదే బిగువు చనిపోయిన కథ ముందు నడిచిన పాట కూలిపోతూ..

అంపకాల సరిహద్దులోని శిధిల శ్రమ కథ చెప్పి దూరం పెడుతూ.. అదిలించి

వెళ్లిపోయిన చీకటి గడువు .. ముగిసిన ముంపులు.. కథనాల నిద్ర రేవులో పోరు పెట్టె కథల గుట్టు..

అల్పిత చెమటలు పట్టుకొన్న తీరుబాటు నిద్రలని ఊగిస్తూ.. తేరుకోలేని కుదుపు పట్టిన

వడపోతలతో కదిలే  పాటలు.. నీరు నొప్పి పుట్టిన కెరటాలతో తోడైన కన్నులో బీడు గదులు…

………………………

ఉండమని చెప్పింది వాళ్ళే.. ఉండినప్పుడు .. కదిలిన గుమ్మాల కథ చుట్టూ చేదు బొమ్మల

రేవుని తవ్వి.. హద్దు చెదిరిన కథతో మోసి తెచ్చుకొన్న నటనలని పట్టుకొని..

తెర వెనుక కదిలిన నిద్ర ముడుల కథనం వెనుక చేర్చిన కుదుపులు.. అదుపులు ..

 అరుపులు .. కుదుపులు .. మెరుపులు.. ముఖ రుణాలు.. కథ రొప్పుల గొంతులు…

నుదుటిలో పేరుకున్న చీకటి సవారీలు .. ముంపు తెచ్చిన కునుకు ..

పాట పాడిన నడకలని కట్టి పెట్టి మిగిలిన .. లోపల పేర్చుకొని ఉన్న గుండాలు..

గట్టు తెగిన హద్దుకి . గది పేరుకున్న ఝాము… శరణు మాటలని అద్ది ..

కలిపి.. పెట్టుకొన్న .. నిలిపి చెమటతో.. చల్లార్చి పెట్టిన వీధికి .. బొగ్గు బొమ్మలకి …

రెండో ముఖం కట్టిన కేవల ధ్వని రేవుల్లో .. కొన్నింటిని .. త్వరపడని కంటి రాతకి ..

పేరుకున్న నడకల మధ్య .. వదిలి పెట్టిన కుడి పక్కగా ఏడుస్తున్న నటనలతో..

తీరిక లేని నిషారపు పూతలని దిద్దుకొంటూ.. ఇంకా చప్పుడు లేని నిద్ర పాతకజాలం

మధ్యనే తిరిగే ముఖాల తీరు.. గదికి సేకరించిన నిద్ర వాలుల ముద్దలని తోసి…

సరి పెట్టుకోలేని నింపుడు దృష్ఠి పేజీలపై చిట్లిన వాన కన్ను పేటికల పగుళ్లు .. పాట..

…………………………..

5.పరామితం .. ప్రదక్ష ధ్వని నిరోహ .. ఆరు కొండల నది

వక్ర పరామితం .. ఏడ్చిన నిద్ర పోగుల గుణ తీర్ధన .. కదిలే భద్ర రూపుల నలతకి పట్టిన

కంటి దూరాల శ్రమ .. వెళ్లిపొమ్మని మాసిపోయిన రాళ్ళ చీకటి పట్టిన భావి..

అదే ఉంది.. తేలికపడి ఏడుస్తూ .. నది చుట్టూ పగిలిన కొండలని తిరగబోసుకొంటూ..

కదిలే నిద్ర పూరంలో పాట చుట్టుకొన్న నషాయి అపార్ధాల గడువు కొండ.

ఏక మితం .. కంటికి పోసుకున్న రంపపు బొమ్మల గతి ఊపుని తడుపుకొంటూ ..

బయపు ఖాళీలని సర్దుకొన్నా  ఇంకా మరో మాట వినడానికి లేని   ఓపికల రేవు.

అదే గట్టు.. తెలియని గోల పరామితుల నొప్పిని కదిలించి చేసుకొన్నా నిర్బంధ రేవులు ..

 మరిన్ని కలత చెట్లు.. అక్కరకు రాని చీకటి పొదుగుల గుప్పెటలో చెలరేగుతూ..

అతనే తేలినట్లు ఉంటుంది.. అతని లోపల కూలిన ఇల్లు మాత్రం కనిపించదు.

వదిలేయమని అడగదు. మాటలని తాగి తూలిపోదు.. మడిచిన కంటి చివరకి చేర్చిన కాళ్ళని

సరిచెయ్యక ముందే .. తిప్పి చేరుకొన్న గుమ్మాలని రొమ్ములోకి పోసి…

నీరు పట్టిన కథలకి మోసిన కునుకుతో.. హద్దులే తెలియని బయట రుజువులు..

ఇంకిపోయిన చూపు బరువు కథకి మోసపోయిన  కళ్ళని అతికించి..

అదే అనుకోవడానికి లేదు.. అక్కడే ఉండిపోవడానికి లేదు.. అలసట తిరిగిన

చీకటిలో కలిసిన  మాయల కుదుపుని వడపోసిన ముఖాలని దాచుకొన్నదీ లేదు.

………….

ప్రదక్ష ధ్వని నిరోహ  .. పాట .. వెక్కిళ్లు పడుతుంది.. అదే కావాలని పట్టు పెట్టినపుడు ..

ఒప్పుకోక కూల్చేసిన కథల వెనక బరువెక్కిన నిడివిని సాగదీసి.. కొంచెం వెసులుబాటు లేని

 చీకటి చిలికిన పీడన తప్పించుకొంటూ.. లోపల . బయటా కానీ నిద్రిత సంధి

మన్ననలని చెదరగొట్టి.. ఇంకిపోయిన నీటి ధూపాల మధ్య సమయం ఆరిపోతుంది.

విశ్వమూ.. ఒక ధ్వని కవ్వాలా క్షేత్రంలో ఏక  మాత్రపు అందుబాటుని పెట్టుకొంటూ..

అదే మాటకి .,రెండో గొంతు కడిగిన నటన ల మధ్య ఉరి బిగించుకొన్న పాట ..

వాళ్ళు చెప్పుకొంటారు.. వీళ్ళు చూడమంటారు.. కొందరు తడి రాతని కొట్టి తెచ్చి

కడిగిన దుఃఖంలో సొమ్మసిల్లిన పాటలని నానబెట్టి పడి తిరుగుతూ …

ఇంకేం కావాలో తాను చెప్పి.. పెదాలని దాటుకొని .. నల్ల బారిన కునుకుతో ..

చేర్చిన శ్వాస గుణాల సలత కావేడలో మోసుకొన్న మంగళ రుజువులు..

……………….

అదే అని మళ్ళీ చెప్పుకోవడానికి ఎలానూ వీలుకాదు. నీరు పెనవేసిన  కళ్ళలో పోసుకున్న

 కథకి లోపల కుదిరిన ఒప్పందాల పడక.. చేర్చిన రాత్రుల కౌగిలి పులకలు..

ఉండిపోవడమూ.. జోడించి చల్లారిన రెప్పల వెంట కథలో మోసి తెచ్చుకొన్న

 చీకటి నెలలు కత్తిరించిన ముఖాలు .. సడి పెట్టుకొంటూ… పీడనకు మూడు రేవులని కలిపి

 గుచ్చిన ఋణం అప్పగిస్తూ.. కదిలే భూమి చర్యలని విసిగించిన మాటకి

రెండోసారి నవ్విన దుఃఖం .. పండి వెళ్లిపోయిన పాట వానని రాలుస్తూ ఆవిరైంది

పోలికలని మోసి తెచ్చుకొన్న పగటి రేవులో .. విగ్రహ ముంపులని కట్టేసిన కథకి

గొంతుని చేర్చి మళ్ళీ క్షేమ మునకల నొప్పిని కనిపెట్టి ఉంచేసి ఖాళీలు.

అదే మళ్ళీ చూడాలని .. రుణ పోలికని తీర్చిన కథతో.. నెలలని లాగదీసుకొని  పాటని మింగి..

కొంచెం జార్చిన హద్దుకి మోసిన కలకపు సంధిని నిందారబెట్టి వెనక్కి తప్పుకొంటారు.

అదే వారమూ.. ఆ పాటే శాపమై.. కలబడి తప్పుకొన్న పక్క ఇల్లు దేహంలో మిగిలిపోయిన

కంటి జోరులు.. నిద్ర పాటలని కూల్చి పెట్టుకొన్న ఇంటి రాత్రుల చీకటి ఊసులు

…………………

6.మాయా నిఖీరం .. వలస ధ్వనులు … విరాళగామి పాట

చెల్లా చెదురైనా ఖాళీ కొండలు.. ఎగరేసుకు పోయిన క్యాలెండర్లూ .. ఒజ్జు పెట్టిన పేజీల

 బయట నటన వదిలిన ఇంటి పునాదులు.. అప్పగించేవి.. వద్దనుకుని వదిలేవి.

ఇంటి రాతలు.. నిండు కూతలు.. పైకి చేరిన మెడ కాట్లు.. ఇంకి పోయిన నిద్ర రుజువు కసి ..

రేగిన చీకటి వదులలో పడి .. ఒబ్బిడి కాని నడకని కనిపెట్టి… ఇంకా వాలిపోని

నిద్ర పూడికలని ఉంచేసి చీకటి సరిచేసి కంటి పోటు.. స్థలనేత చిత్రాల గడువుకు

తిప్పుకొన్న త్రయాలు. నలుపక్కలా శరీరం ఆరబోసిన కథకి మెరిసిన రక్త నిరూపాలు..

అప్పుడు కొంచెం … అప్పుడు కొంచెం .. చనిపోయిన నొప్పికి దూరం జరిపిన గంటలు మోగించి ..

 నిరూప రాజీయాలు మోసిన రంగు పుట్టుకలు .. … అలాత నిడువులు.  వివోద

గుంభమూ.. అయోమయం .. కలిసిన నిద్ర రొప్పుకి చెప్పుకొన్న

కిటికీలోంచి దూకిన పాట .. సమర్పించిన నడక చివర నిద్ర ఏరులో పడి ముఖాల గడువుని

తలచుకొని.. మోసపు మంతనాలు కూల్చిన పాట.. రంగుల చెప్పుడు రాతలు

రుణపడి ఊగిస హద్దులే చివరగా ఆ గదిలో మోసిన కుండలని కడిగి బోర్లించి .. హద్దులు

చెరిగిన బయట కలతని.. రంగు ముంచి … శ్వాస గాలించి … దేహం చేస్తారు.

ఒకే దిశా క్రమంలో పడి తలకిందులైంది కన్నుని జోడించి తాకట్టు పెడుతూ..

పల్చని ఊపిరి రేవులో కలిసిన శిధిల ముఖాలకి చేసిన నికర ఒప్పంద పూర్వాలు ఒడిసిపట్టి..

ఆగి పొమ్మంటారు.. అలిగి వద్దంటారు.. అనుకొని ఆ ఇంటి చివర గడ్డకట్టి నీరు పోసిన

తలుపులకి కిటికీలని అమర్చి …గుమ్మాలని ఆరబెట్టి … పాటని వేలాడ దీస్తారు.

అదే సగము.. కొంచెం మాట తిరిగిన పెద్ద పాట స్టూడియోలో పిసికి తెచ్చుకొన్న ముఖాల

 కసిగోళ్ళని దింపిన గొంతు…లేత కన్నులో పల్చని కలని జత చేసి కట్టుకొంటూ…

……………………

విసిరిన మాయా నిఖీరం .. రెండుగా విడిపోయిన చెదురు మదురు గాలుల మధ్య

ఇరుక్కొన్న నిద్ర ఖాళీలతో … శ్వాస దండన కదలికనే సరిపెట్టి  చేర్చిన కథకి ..

కొన్ని పాత్రలు .. బహుముఖ చేదు గొంతులు .. అలవడి పోసుకున్న పాట నొప్పులు..

జీర కణుపులు .. త్వరపడి తోరణ గొంతుల్లో కథ చెప్పిన చీకటి ముడి తీసి ఏడ్చిన గది..

అదే తను.. నాకు దొరకని తను.. పాట తనవుతానని.. ఏడ్చిన తను.. తనుగా ఉంచలేక

కంగారు పడి.. కొండ  కిందకి తోసిన తను.. లోపలి ఎండ కూలిన రొప్పుల మంట…

రుణ గ్రహణం .. తట్టి లేపిన పుట్టుకని చేర్చుకొని .. మాసి పోయిన పెదాల మధ్య కదిలే

తను నింపుకొన్న నిద్ర దోషాలతో అల్లిన కథకి మోసి తెచ్చిన నడకని జోడించి ..

పోలికలేని స్థితి చిత్రం కూల్చిన తను … విడిపోలేని కూల్చివేత

ఎవరమూ ఇంకో సాధయతో తోడిపోసుకొన్న రెప్పల రాల్చిన పొడి చూపుల నిశీతం ..

తడబడే కథలని మోసుకొని.. ఒద్దికగా నేర్చుకొన్న చీకటి సాధనాల కట్టడితో

కలగాపులగపు అనాసనాన ముఖాలతో చేర్చిన కంటిలో కదిలే భయం …

చేర్చుకొని.. విడిపోయి.. వృత్తపు చలానాలు తిరిగి పట్టుకొన్న కరకు దేహాల యాతనకి

ఊగిన నలుపు బొమ్మల కావెడ లో నూగు దగ్గుని వడపోసి… చేరిన మలుపులు

…………………..

సఫల ముఖాలని దాటుకొని .. విరాళగామి పాటతో నిండి వెళ్లిపోయిన కథకి ..

మోసపు రంగుల కలని కత్తిరించి.. చేర్చిన కథకి .. నిస్తరణ కలతో హద్దుని కట్టుకొని..

పిసికేసిన కూర్పులు.. నసపెట్టిన పాటలని కంటిలో నూరిన కథతో మధ్యలోకి వదిలి..

ఒరిగిపోయిన చీకటి అద్దకాలతో కలబెట్టిన వలస పాటని చేర్చుకొని ..

 నిండి పోయిన కథల పక్కగా ఊపిరాడని కన్నుని తాగి ..

 ఒకేలా నిండి పోయిన ముఖాల కంగారు.. చెవుల్లో మోగిన హోరుని జత చేసుకొంటూ

అదే నేను.. మరోలా కనిపిఅంచని కథకి రెండో దారం చుట్టేసిన నేను..

 కథకి నేర్పిన చీకటి అద్దాలని తుడిచిన ఝాము ముంపునీ కుదుపుతూ..

హెచ్చరిక లేని దేహ రుజువు మోసిన కళ్ళకి … పేరు చుట్టిన కాటుక బయళ్లలో కలబడే

సాహరణ చిత్ర భూమిలో వాలు నిందలు. మెడలో వేసుకొన్న సానపెట్టిన కత్తి.

తీరు కట్టిన మెరుపులు .. చీకటిలో నడిచిన కళ్ళకి .. తీర్చి దిద్దిన చూపుని సాగదీసి..

 కరకు పెదాలని అల్లిన పోలికేకలతో ఊడిపోయిన నిద్ర శకునాలు ..

ఊరట లేని నిద్ర సిద్దతలు .. పెద్ద ఊరట లేని కథల లోపల తలుపుకి పట్టిన

ముఖాల నీరుకి కథలో ఉంటూ .. ఒకే కణ నిద్ర విచ్చుకొన్న మాటలని తాగి ..

లోపలే ఉండిపోయిన హద్దు. కొన్ని రాతి దెబ్బలు.. చేతి రూపులు..నిద్ర కోతలు..

7.అది అందుకోవడమూ.. నాలుగు దిక్కుల కథ .. పాటకి తెలియడం

పొడి పొడి నడకల ఊపుని పట్టుకొని.. జోడించిన కథకి రెండో భుజం ఇచ్చి..

కథ చెప్పిన కునుకు ఒరిగిన హద్దులో తగలబడి.. నిండి పోవడం ఇంకెలానో ఆగలేదని…

దృష్ఠి కాలిన పాటకి అదేనని తెలియడం .. భయం చేరిన కథకి నిండిన గదిని ఎదురుగా పెట్టి ..

 నిద్ర సాధన ఋతువుల మధ్యలో పైకీ కిందికీ తిరిగి.. మధ్యలో దొరికి ..

నులిమి పెట్టుకొన్న ఝాము మందలింపు పోలికని తాగి… గుర్రు పెట్టిన ఆయాస ఋణం

కలుపు కొన్న కదలికనే దాటి .. ఇంకేం లేని కళ్ళకి కూర్చిన నటనలు..

ఊరిపోతాం.. ఉసురు పోసుకొంటాం.. గొంతు నసని తడుపుతాం.. కథ లేవదీసిన రెప్పల కింద

 ఒరిగిన హెచ్చరికని కప్పేసి .. కడసారి రంపపు పోటుతో.. కూలిన దుఃఖ సాంద్రతలు ..

ఎవరూ ఇక్కడ మిగిలి లేరు.. తడిచిన కంటిలో కూర్చొని .. మాటని పక్కకి లాగలేరు.

కలబడుతూ .. ఎంపికలేని నిద్ర పూతలని పోల్చి పెట్టుకొన్న ముఖాలతో కదిలే కెరటాల ఎద్దడి.

అది అందుకోవడమూ.. కన్నై శపించడమూ.. లోపలి నిద్ర ని కదిలించి పొగగా మండిన

దుఃఖంలో చేరి కథ చెప్పడం..  .. పాటలోకి చేరి ఉన్నట్లే తప్పిపోవడం…

………………….

ఆమె నవ్వింది.. ఇదిగో నీ నాలుగు దిక్కుల కథ .. ఇదే వేలాడబడి ఉంది..

 కనీసం వినికిడి లేని దుఃఖ చలనకి లేవదీసిన కథతో ఉంది. ఏది వెళ్లిపోయిందో అక్కడే పాట

మళ్ళీ దుఃఖం పులుముకొని.. చీకటి నేసిన కంటికి చేర్చిన చితి చిత్రంగా ఉంది.

భయం చెదరని జోడింపుతో కదిలే నిద్రని కాగబెట్టి… సర్దుకోలేని విసుగుతో ..

మాటని పట్టిన గొంతులో కరిగి .. దుఃఖమై ఉంది.. మాటల వెనక కదిలే నిద్ర దర్శన

ముక్కలుగా ఉంది. పగిలిన అద్దాల మధ్య కునుకుల చెరుపుగా ఉంది…

కాపలాతో ఉంది.. దుమ్ము దులిపిన సాధారణ గతికి చేర్చిన ఒబ్బిడి రుణంగా ఉంది.

అదే చెప్పుకొంది. అంపకపు మందలింపుని పట్టుకొని కథలో పడిపోయింది..

కథగా పల్చబడింది. నిశ్చింత మండిపోయిన చీకటికి రెండో అనువాదం లేని నిరాదీక్ష కదలికనే

కట్టుకొని.. పల్చని ఆవిరి గుండం లో సుళ్ళు తీరుతున్న కొండని పట్టుకొని కదులుతూ ఉంది..

అవకాశం లేని సర్దుడు గుణంతో చుట్టుకొన్న విసుగుని పగలగొట్టి కథలో ఇరుక్కొని ఉంది..

సగం సఫలత .. సగం మెళుకువకీ ఆవరించిన చర్యల ముఖంలో పట్టు తప్పి కథలో పడుతూ

 ఉంది. నీరు కూలిన చర్యల మధ్య కాలిన చీకటి రుజువుగా ఉంది.

…………………..

కొన్ని నిర్మాణ నగరాలు.. చీకటి అనువాదం లో మాట కట్టుకొన్న గదులు..

ఎక్కి పోయిన కథలతో చేరుకొన్న నడకలని దాటి మరో చింతితాల గమన ఖండం లో

కూలిన కాళ్ళ దారిలో ఆగిన నిద్ర రాత్రుల గట్టు పట్టుకొని అదే మళ్ళీ పాటకి తెలియడం ..

మబ్బులు పట్టిన సీసాలు.. కన్ను చుట్టిన పోలికల కొండలు.. నదులు లేవదీసిన

 కథలో మోసిన నడకకి చేర్చిన అపనత ఊపులు సర్దుమునిగిన కథతో తెల్లార్లూ రాలుతూ..

 దేహ నిర్జన ఎంపికల నిర్యాణ గతికి .. చేర్చి పెట్టుకొన్న నిశీధి ద్రోణుల్లో పడి

కథలని మోసిన కంటికి .. గొంతుని చీల్చిన పాటకి    రెండో పరీక్ష లేని తొందర..

అదేనని తెలిసిపోవడం .. కథలోకి సిద్దమై ఊరేగడం.. ముద్ద కట్టిన దీపం వెలిగించడం ..

అక్కడ మరో క్రియాదేహం లేదని మాట బయట సాధన పెట్టుకొని..ఇగిరిపోవడం

మృత్యు ఖజానాలో కాల్చి పెట్టుకొన్న నిద్ర రాత్రుల్ని.. పాటలతో తవ్వి పుండు పడ్డ గొంతు..

ఈ జీర ఎవరైనా మోసుకుపోండి.. కథ సoవాద దుఃఖంలో పడి ఊడ్చుకు పోయిన

సాధ్య రుణాలకి అద్దిన కథని పైకి లాగి నిలబెడదాం.. పక్కకి కూల్చి తిరగబడదాం

ఐనవీ .. కొంచెం తెలిసి వెళ్ళిపోతున్నవీ .. కదిలి నిద్ర దూపుని పట్టుకొని

ఛాతీ లోపల వడపోస్తున్నవీ .. కాల్చిన భద్ర దేహపు నిందలకి శ్వాస తెరిచిన మాటలు .

 కొంచెం కదిలేవి.. కొంచెం పలికేవి.. ఇంకొన్ని చిత్రమై పాడేవి.

……………………..

8.మృత్యు రథమూ .. పెద్ద శూన్యాల వీధిలో ఇల్లు .. పాకుడు నీళ్ల పాట

అవును అందరూ అదే మాట్లాడుకున్నారు.. పెద్ద శూన్యాల వీధిలో ఇల్లు ..

మాట చనిపోయిన నీటి శూన్య స్తిరార్ధ లో పడి.. కంటికి దొరకని ఖాళీ నెమ్ముల దేహ ఖాతాలు..

కథ మరొకరి నొప్పికి తీసిన కళ్ళ వెనక నిద్ర పొదలో కాల్చిన దుఃఖ మాటల హాలుకి చేర్చి..

వద్దులే అని వదిలిన కళ్ళ వెనక పిల్చి పెట్టుకొన్న తగువు ఊరట పడి పైకి వెళ్లి ..

నిండు రాత్రుల మధ్య ప్రశ్నని వదిలి నప్పుడు .. ఇది అదేనని మోసిన కథనాల ఛిద్ర కావల ..

అదే పెద్ద మూతల గోళమూ.. నా చిన్న ఇంటిలో మోసిన రక్షా మాయల కక్ష్య .. వేలాడిన

 కంటి రాత్రంలో  పొగలెత్తిన కథకి నూరి పోసిన కళ్ళని కడిగి .. అటూ .. ఇటూ కాని

విశ్వ నిద్ర విసుగుతో .. ఓరగా పెట్టిన పాటల కునుకు వడపోసి.. పిండుతూ..

చిత్ర స్థితి మరిగించిన చిక్కుల్ని విడదీసుకొంటూ .. ఇంకాస్త దూరం కప్పిన గొంతు

సవరించిన మంచు చరియల మధ్య స్థితం చెల్లిన పాట

…………………

అంతు చీలిన మసక కావెడలో మోసి తెచ్చిన తీర్ధాల గుండం .. మరిన్ని చేర్చి పెట్టుకొన్న

నిద్ర పోకడల కథకి పాడుకొన్న నొప్పి వెన్నులు.. ఆగిపోయిన మృత్యు రథమూ ..

పాట వేపే చూస్తూంది.. ఇంకేదో కావాలి.. అదే భూమి పైని గుప్పిన పొగల నేరుగా గొంతులోంచి

బూరాని విసిరి .. కలిసిన శత్రు తోవలో విందుకి లేని జవాబుని కాల్చి..

వాన పిడుగుల అలసతని కట్టుకొని మళ్ళీ చేరదోసుకొన్న కలత పాటని కప్పుకొని..

ఇంకిపోయిన నడకతో.. పెట్టి లాగిన హద్దుని మోసి మరో నిద్ర జీరని సాగదీసి అటు పక్క

 ఇంటిలోకి వెళ్ళలేవా ? అని నిలదీసినప్పుడు.. అరికాళ్ళలోంచి జారే నీరు దుఃఖమేనా?

ఇదే అది కాదా ? అలా మాత్రమే ఉందా? అలా అనుకోకుండా ఉందా?

మాటలు చుట్టిన విభజన ఖాళీల్లో పడి .. దిగబడ్డ రాత్రి సర్దుబాటుని కూలగొట్టి..

నడక మార్చిన కునుకుతో పైట తీసిన చేదు భద్రపు కంటిలో గొంతు కూరుకు పోయింది.

కొన్ని అనుమానాలు.. నిద్ర కడిగిన కవ్వింత చీదరని తుడిచి.. ఆర్పేసి పట్టుకొని..

కదలాడే దేహ ఝాము పోలికలై చేసిన సంధికి .. పాట రెండో సాకు.

……………..

ఇక్కడ వివరాలు గొంతు నొక్కవు .. కాగితాలని నింపవు.. భూమి తాండవ సాయం మోసిన

కథతో ఊరేగి ఊరుని దాటవు.. కలబడి నేర్చుకోవు .. ఉందనీ దగ్గర పడవు.

పాటకి ధ్వని కథన ముతక చీకటి శరీర గతిని సరిచేసిన నల్ల మలుపు కొండ పక్కగా ..

నిప్పు మడి దున్నుతున్న వాన దోసిలిలో పాట.. ఇంటి బయట ఎవరో కూల్చిన గుమ్మం..

అతని గొంతు .. కొంత శరీరమూ.. పోలికని తప్పించిన హద్దులో పడి పోలికని దాటినా కథ..

నీరు కాల్చిన పాడాలని మోసుకొంటూ .. ఋణం కాలబెట్టిన అరచేతుల సగంలో కల

మోసగించిన కథని కడిగి.. హద్దుని కలబెట్టిన గాలి లుంగల కుదురు….

ఎవరో వదిలి పెట్టిన వైద్యపు లెక్కలు.. కంటి చూపుకి కుదరని శ్వాస దిక్కుల్లో కనబడి..

సగం పట్టుకొన్న చీకటి సలింతని తిప్పి తీసుకొంటూ వీలు లేచిన నవ్వు వెనక ..

మసి పూసిన కాగడా.. అదే గొంతు .. కొంచెం చిమిడిన అన్నం.. పుల్లగా లేని పచ్చి పులుసు..

ఘాటు పచ్చి మిరప నానిన పెరుగు.. అందే చింత .. ఆరబెట్టినా నీటి ఊలంలో పేరైన నడక …

అక్కడ ఇంకేమీ లేని తీరిక కదిలి .. మళ్ళీ మాసిపోయిన కంటి రాత్రిని జోడించే కథలు..

పులిసిపోయిన కంటి రాత్రులు ,.. మార్చి పెట్టుకొన్న స్వేద నికర్ష నిగ్రహాలు..

జుట్టు పాయల్లో కనిపెట్టిన దుఃఖ జతల వెల్లువ.. అదే మంగళ ద్యుతి నీలము..

 పాకుడు నీళ్ల పాట. కొంచెం జారి పోతుంది.. కొంచెం పట్టు దొరికినప్పుడు గుచ్చుకొంటుంది..

…………………………….

9.మాటలు కట్టిన మహా మాయ … పరి భ్రమికుడి అలాస నది .. అదే పాట

ఇదొక పరి భ్రమికుడి అలాస నది … చేర్చి పోసుకున్న పెదాల మధ్య కదిలే ..

నిద్రనీ  కప్పేసుకొంటూ.. పెనవేసిన కొండల మధ్య ఇరుక్కొని పెట్టిన అరుపులో ..

 గొంతు లేదని .. చీకటి అలిగి.. దేహాన్ని మింగేస్తూ.. ఓ పెద్ద కల చెప్పిన భద్ర గతి తిరగబడి..

 ఆక్రమించాక సరి చెయ్యని నిసౌదిక ముట్టడికి మోసిన కథల రహసిక నివాళిని పోసుకొని..

 అదే పాట వదిలేయాల్సిన ఒక పొడుగు అనుమానం లో కమ్ముకొన్న దేహ సత్తువ విడివడి

ఏడుస్తూ .. ఒక కదలిక .. రెండు ఫొటోల మధ్య ఊయసలాటని కప్పుకొని ..

రెండో చరణం లేని ఇల్లుని .. స్నానాల గదిలో చప్పుడుని..

 కథ వదిలిన ఝాము ముఖాల ఎద్దడిని కాదని కోలుకోలేని విపరీతాల గతికి మోసిన నటన..

ఏది వద్దో అదే పట్టుకొని వదలడం లేదు.. నల్ల బొమ్మల దుఃఖ ఊటని నింపుకున్న

దేహ ఋణం మోసిన కథకి ,, రెండోసారి జ్వరపడ్డ నిఘా తాఖీదులని ఇచ్చి

కాపాడుకోలేని చంచిత సముదాయాలని కాల్చిన కరుకుదనం మోసి తెచ్చుకొన్న

 నాలుకలతో పల్చని శరీర స్థాపన కూరుకున్న గొంతు.. అదలా ముందుకి జరిగిపోతుంది.

…………………

ఎవరమూ ఇక్కడ ఇంకో మాటని ఎత్తి తెచ్చుకోలేదు.. జీర అనే నొప్పిని .. గరకురాయి పై

అరగదీసి… ఇంకా మరగబెట్టి గొంతు పుండుని ఊదుతూ పాడమంటారు.

అది ఉందని ఇంకెవరూ అననప్పుడు .. పొందికలేని ఎదురుదాడి కథలోకి వచ్చి ఏడ్చినప్పుడు..

దుఃఖం ఆనవాళ్లు కదిలే .. నిద్ర నిపులత గతిని చుట్టి.. మరింత లోపలి పాటని వదిలి

హెచ్చరికాని వదిలినప్పుడు.. అదే అనుమాన సాంద్రత పెరిగి.. దేహం పట్టి చూసి..

మాటి మాటికీ .. ఒళ్ళు కాలుతుందా …ఒంట్లో బాలేదా ? అని అడిగినప్పుడు..

పాట శపిత సుడిలో చిక్కుకొని.. ఆవిరి గుండం లోంచి.. నిప్పు పొట్లంలా ఎగిరినప్పుడు..

 అదే అని తెలియని వీలు రంగుల గతి నిద్రకి బలిని తెచ్చి.. గదిలో దాచినపుడు..

మాటలు కట్టిన మహా మాయ భయం చివర మాట తెలియక ఏడుస్తూ ..

పైకి పోసుకున్న శ్వాస యుద్ధాల గతి రొప్పుని సగం తెంపి.. చీకటి ఋణం కరిగించి పెట్టుకొన్న

ముఖాన్ని పోసిన కంటితో నీటి దురద ని కప్పిన బిగి పోతల అదే పాట ఏడ్చి కొట్టుకొన్నప్పుడు..

ఇంకా ఏదో వెదికే ఉన్నానని .. ఊపిరి రెండో  అరలో చిక్కబడ్డ కేక బయటకి రాలేకపోతుంది.

……………..

గట్టి పడిన గొంతులోని జీర గ్రహణాలు కుప్ప పోసిన కదలికనే దాటుకొంటూ ..


నిద్ర విరిచిన కళ్ళ మధ్య కదిలే.. కోపపు చర్యల కునుకుని మోసుకొని.. జోడించిన హద్దులే

బయట కలని చేర్చి పెట్టిన నాలికల మధ్య .. కూరి తెచ్చుకొన్న ..

గొంతు ఋణం ఒంపిన మాయతో కదిలే నిద్ర రుణాల బరువుని ఎక్కి సగం కోసి.. మరలా చిత్రిత

 కథల ఒబ్బిడి రాతని దులిపి.. పేరుకున్న ముఖాలపై నిద్ర సంధి చేసిన దుఃఖం పోసుకొని..

పోత పోసిన కథల ఋణం పేర్చిన కునుకుతో రంగుని ఒంపి చేర్చుకొన్న మాటలు.

నిద్ర రాశుల గతి ముఖాలని దాటుకొని .. నివర్ణ భయం పోసుకున్న పాట కూలబడి ..

కొంచెం దూరం లోనూ.. కొంచెం దగ్గరలోనూ.. అదే మాటకి చుట్టిన నల్లని గోడలపై

 గీసిన దుఃఖ చర్మాల గతకి పోసిన స్నాన దేహంలోనూ.. పేరుకు పోయిన

రాళ్ళ మధ్య ఊరేగే నిద్ర వరుస యుద్ధాలని కనిపెట్టి పైకి పడుతూ..

 అవధికి దూరం జరిగిన పాట మరుగుతూ ఛాతీ మంట..

అదే ఉంది.. అలా ఉండాలని అనుకోకుండా ఉంది.. అక్కడే ఉంది..

అటు నుంచి ఎటూ జరగనివ్వకుండా ఉంది.. కదలడం తెలియని మసక భూమి

చిక్కుడులో పడి .. పోలిక తెలియని దేహంతో కెరటాలని మింగేసి .. కలబడి మిగిలి ఉన్నానని

………………….

10. పడవ కూల్చిన నిద్ర వేడి.. కలకాని మహా మాయ .. రెండో వరస పాట

మింగేయబోమన్న కథ ఏడుస్తూ.. తేరుకోలేని చర్యల ఊపుడుకి కాల్చి ,,

 నిద్ర తప్పించిన కునుకుని కప్పి .. వదులుగా ఉండిపోయిన నటనల  మధ్య రెండో వరస పాట  ..

భూమి వదిలిన కొండల్లో తిరుగుతూ నది కూలిపోయాక.. అదే శంఖాల శాపం మోసిన నిద్ర కథలో

 పిసికిన కనన్నుని చూపుకి దగ్గర చేసి.. విప్పుకు పోయిన కథల చుట్టూ పట్టుకొన్న జీరల కందకం

 పట్టు తప్పిన నిద్ర కావెడల కూర్పుని వదిలి ,.. అటు ఇటూ కాని .. వరుస దర్శనల కట్టడికి లేచిన

 కలకాని మహా మాయ ని కలిసి .. స్పృహ తప్పిన గతి చిత్రం చుట్టూ.. పారబోసుకొన్న నిద్ర తోడుకి

 ఇంకో నిద్ర ఇచ్చిన ముందటి మాటలని కట్టుకొని.. పెనవేసుకొని ఉండిపోతూ…

నలస పోసిన కథలో గొంతు వారల పగుళ్ళని .. పొగతో కూరి.. అక్కడ నుంచి విరుచుకు పడ్డ .

. చావుల గుట్టలో.. కొన్ని శరీర ముద్రలు కలబడి ఎగిరిపోతూ.. అదే చప్పుడు లేని మరో దీపాల

పట్టణం ..పాటలని కాదని మొదళ్ళయ్యిందని అనుకొని ఊరిపోతూ..

కథల నిద్ర గొట్టంలో ఊదిన కన్నుకి.. గొంతు నానబెట్టిన మాటలని సరి చేసి .. రాగంలోకి పంపాక .

. నిరుద్ధ ఋణం తెలియని .. సత్తా క్రమ వాకిలిలో మరో ముహూర్త సాధకి ఏడ్చిన వీలు వెంబడి .

. కక్ష్యల్లో పడి .. దుఃఖం గట్టి పడి .. పెద్ద గొంతుతో అరుస్తూ.. అదే యాయన ..

……………..

పడవ కూల్చిన నిద్ర వేడి.. ఒక భాగమూ .. రెండో వర్తమాన కేకకి మాట తప్పిన కథలని పీల్చి

నిషాద రాశుల కంపన ఋతువుకి.. అదే ఫలమూ .. కొన్ని వీడిపోని పాటలూ .. మరుపులూ

 కలిపితే నేనని ఆయాసం చెప్పిన కథలకి దగ్గరై మోసేసిన కథతో .. నీరెండి పోతూ  

వీలు వెంబడి దుఃఖధార కి చేర్చిన కథ నది ఒడ్డుకి చేరినా మారలేదని.. త్వరపడి..

 కళ్ళలో పడి.. కూరుకు పోయిన నిద్ర యాతనలు .. పడి లేచిన కథలకి పట్టు తప్పిన

నిద్ర పూర్వపు నటనని .. ఆకట్టుకొని.. నల్ల పెదాల కాపలాని కత్తిరించి..

చిలికిన దేహ ఋణం ఓడిపోయిన నెలలని దాటించుకొంటూ… తేరుకోలేని నిద్ర రుద్దుడు

మెలికని కలుపుకొంటూ… పీడన .. అవలీల నిద్ర కాల్పుల మధ్య పాట కునుకు తీసి..

కలలో ఇక మిగలగా చీకటి విచ్చినపుడు .. చూపు పట్టుకొన్న ద్రోణుల్లో కలదిరిగిన హద్దుని కప్పి .

. ఇంకేం తెలియని శరీర చూపుని మరిగించి.. ఆ కిందనే దాచిపెట్టిన కునుకుతో..

కాటు వేసిన దీపాలకి పైన ఇంటి చాటుకి మేకుని కొట్టి  వేలాడదీసిన పాట,..

ఇంకోసారి పలమారడానికీ లేదు.. సారరి నిర్మాణ రూపపు మాయలో తిరిగిన దుఃఖపు తీరుని కలిపి..

 చిలికి కట్టిన కథకి.. కొన్ని రంగుల పులిమివేతని మాంస లేపనం చేసి..

 కల చుట్టూ పోసి తెచ్చుకొన్న గడువుకు చేర్చిన రంగు గోడలు ఊడదీసిన.. చేరవేసిన…

 కదలికనే ఉంచుకొన్న పాట. భయం ముద్రలు పడ్డ చర్యల అపలోహిత కథకి చేరుకొని…

………………………..

పడవ కూల్చిన రెండో వరస పాట గారడీ చేస్తూ .. వదిలేసినా దూరాల మధ్య

పూడికలేని విపత్తు కొండలని కలిపి కట్టి.. నదుల బయట చర్యల ఒకే ముఖం ..

రెండు నిద్రల కాపు గంటలు.. పోతపోసిన విపరీత రక్షా కట్టుడుకి వేలాడిన కన్నులో

కూలిన నిద్ర రాశుల బరువుని అరగదీసి.. కథ చెప్పుకొంటూ.. అదే వరుస తప్పిన

 పాటలు కావాలని .. తాను ఏడ్చినప్పుడు .. దీపాలు సర్దుకొన్నా ఖాళీలని కడిగి..

అంతే లెమ్మని వదిలేసినా స్టూడియోల మధ్య ఊత పెట్టిన నిద్ర రుణాల లోపల కదిలే

 గోడలు కట్టి పోసుకున్న మాటలని చుట్టూ తిప్పి.. శ్వాస బిగువు వరసల ముట్టడికి

రాలిన కొండల కింద గొడుగు పట్టి.. నురుగులని చుట్టుకొని …ఇంకేం చెప్పుకోని పాట.

అదే వరుస .. రెండోసారి చీకటిలో నాని.. ఊపిరి అంచుల్లో చిరిగిన కొండ గొంతుని దువ్వి..

కలిపి పెట్టుకొన్న నిద్ర వేడి.. కలబెట్టి.. ఒద్దిక లేని కలతని పట్టుకొని.. అద్దుకొంటూ

దూరంలో కనబడక వదిలిన పెదాల ముడిని బిగదీసి..  చీకటిని సాగదీసి…..

మహా మాయ ముంచేసిన పడవ నిండా పాటలు.

11.పరంపర నిర్వాణ సంధి .. కొసలు పిండిన గాలి నలతలు…ఇక్కడే నసిలిన పాట

కల చుట్టూ ఇంద్రధనస్సులు పేనుకొని..సుళ్ళు తిరిగి కూలాక .. ఎటూ వినబడని కథని తీసుకొని..

 ఇంకిపోయిన చెదురు మదురు.. కంటి చూపుని కలిపి.. విసుపు పోసిన బుగ్గ నెమ్ములు…

దృష్ఠి నిద్రలో పేరుకుపోయిన రసాయన గొంతులు.. పాటలో పడి.. నిద్ర తప్పాక..

 మృత్యువు కాల్చిన కొండ పక్కాగా ఆవిరి లోయలు.. లోపలి కూలిన వాన జుత్తు..

అక్కడే అదిమి పెట్టిన పరంపర నిర్వాణ సంధి .. గతికి రెండో వాలులో తీర్ధాలని మెలిపెట్టి..

 కథని మోసగించిన పాటకి దొరికి పోతూ.. అదే అలా వస్తూ ఉంది..

చావు కనిపెట్టుకొన్న గొంతులో చీకటి ఉడుకుతూ కలియబెట్టిన నిద్ర నిందివేతలు ..

 ఇదో పరంపర .. జీర పండిన బొద్దు లోంచి దగ్గుతూ .. ఒక తీరికలేని భయం కాపాడిన నదిని

 చూయిస్తూ.. అదే తెల్సిన వెనక ఇంటి తలుపు దగ్గర తాను ఇంకా దిగబడక ..

 ఊపిరికి నమ్ముతూ.. రెప్పలా కింద వెలిగించిన కాగడాలకి నూనె పోయమని కాలిపోతూ..

కొసలు పిండిన గాలి నలతలు .. కొన్ని తెలుస్తాయి. ఇంకొన్ని తెలియవు.

…………

అతనొచ్చాడు.. స్మశాన సాయంత్రం ఏడ్చిన కదలికనే జారబెట్టి.. కథలకి అలవాటు కాని మనిషిలో

 ముందే తిరుగుతూ.. ఇంకో చర్యకి దూరం జరగని .. కాటుక ఓలతో.. మళ్ళీ చెప్పుకొన్న సాధ్య చీకటి

 అరల్లో దాచిన గొంతుతో.. చిలికి ఇక్కడే నసిలిన పాట .. పరుగు లేదు.. పూత రాలదు

స్టూడియో మూయనే లేదు.. గర్భ గోళంలో ఇంకా సర్దుకోవడాకిని ఏదీ లేక అరవనే లేదు..

మాటలకి రంగు పులిమి .. జత చేయని కక్ష్యకి నిలబడి.. చూపుని వదిలేయక కట్టుకొని

వదిలేసిన ముఖాలతో.. పడి తప్పించుకున్న .. వెలుపలి.. తడబాటుకు దూరం జరిగిన హద్దు.

 సర్ది చెప్పడానికి లేని నిందలని జతకట్టి పాట నోటిలోకి తోసాక.. ఉండబట్టలేక…

చెప్పుకోవడానికి వీలు లేని దేహ రుణాల కసిని పిండి .. అంటూ పోసుకున్న గోడల మధ్య

చలనిత దేహ బిగువు రక్షలని కుదిపి.. అదే చోటులో పగిలిన సీసాల వెసులుబాటు

గొంతుని అరగదీసిన కంటి శిక్షల ఊరులో పోటు పెడుతున్న దుఃఖ నిద్రలని కరిగించి..

తుడిచి.. నీరు పట్టి .. నిద్ర పుచ్చాక.. మళ్ళీ ఆచూకీ దొరకని పాట… కదిలి రేగుతూ

అదే ఉంది.. అలా తెలియడానికి ఉంది.. అనుకొని దగ్గరైనా .. గొంతు రాళ్ళని కొట్టిన

సుత్తి దెబ్బలతో పగిలి .. నిషారిత దేహ విలోమ పంపకాల ముట్టడికి చేర్చిన కళ్ళ ముందుగా

 రొప్పిన ఝాము మందలింపుని కడిగే కొండల బిగువు…. గొంతు ఎర్రని నదులు

,,,,,,,,,,,,,,,,,,,,,

నిద్ర సాంద్రతకి దున్నిన వర్ష సాగులో .. కదలికనే నేర్పిన పరంపర గాలి నలతలు ..

ఉండిపోయిన శరీర రుణపు మగతలో పడి ముక్కలవుతూ.. అద్దిన చర్యల కలతని పట్టుకొన్న

నిద్ర రేవుల్లో కూలిన పాట .. ఎక్కడైకీ పోనీ .. రాలేని కళాపపు ఎద్దడి కథలో పోసి తెచ్చుకొన్న

గదిని పట్టుకొని.. తెరిచీ .. మూసీ .. కదిలించి కదిలే దేహ రుణపు మూర్తులని చుట్టుకొంటూ..

పాతరేసి కదలికనే పట్టుకొని.. నసిలిన సంధి నిర్వాణం లో మునకలైన ముఖాలని

కాగబెట్టి .. ఊరుకోలేని దేహనీరుల భయం ఊరేగిన చిత్ర గడువు స్నానాలకి

మెరిసిన శ్వాస తీరులు.. నిజ మాయల క్షేత్ర దీపంలో హోరు ఆవిరి కూలిన గోడలు. 

స్థితి మంట పెట్టిన గతిని తాగి.. ఉక్కిపోయిన కథలతో.. ఏరి తెచ్చుకొన్న పోలికలు ఏడుస్తూ..

 తీవ్ర రుణాల గండిని కొట్టి మోసిన అరుపులు.. చాపి వెళ్లిపోయిన

చీకటి నివాళికి లేచిన గోడల చుట్టూ కళ్ళు పోసుకున్న వరద నిద్రల గదిలో కూలిన

చిత్ర రుజువుల గతిని అరగదీసిన కట్టువేత్తలు. చూపు రాతలు.. గొంతు గీతలు…

చెప్పుకోవడానికి ఏమీ మిగలేదని.. రోజూ అదే పండిన పెదాల మధ్య ..

బూజు పట్టిన గొంతుతో దుఃఖం అరుస్తూ కొంత చీకటి కాపలా పెట్టిన కాగడాల మధ్య

 ఊరేగే కట్టుడు దీపాల కొలువులో పట్టి రాలిన సాయంత్ర రాల్పులు ఏకమవుతూ ..

తేరుకోలేక ఆగిపోతారా … తేరుకొన్నామని కాపలాకి దొరుకుతారా ..

12.నీరు మోసిన దుఃఖ ఎద .. పాటలో పాట విడిచిన గోళం .. తలుపు ఊడలు

నిద్ర కొల్చిన దుఃఖం పోసుకున్న చీకటిలో పడి .. మెరుగు దిద్దిన రంగు నుదురు ..

కలతపేరుకున్న చీలికలని దాటి .. గొంతు చేసిన ఒడంబడికని కాదని .. దేహకథ కి రెండో పేజీ

ఇచ్చిన నల్లని సూచీల చుట్టూ పేరుకున్న మధ్య రాత్రులని కుదిపి .. పట్టి లేపిన కథకి ..

ఇంకొక నిశీర ముగింపుని కట్టుకొన్న ఊసులు.. తేల్చి పెట్టుకొన్న ఖాళీ రొప్పుల గట్లు.

తెలియాలని ,, తెలిసి ఆగిపోవాలని.. చూసి తప్పుకోవాలని .. కదిలించి కలలో మునిగిపోవాలని

 కల ఆశపడుతూ.. చర్యా చిత్రాల కుదుపుని లేవదీసుకొన్న నడకతో చేర్చుకొన్న

పగటి కూర్పుల నడక తేలిపోతుంది. దేహం పని వదిలి పాటలో పారబోసుకొంది.

అవధికి అదే మరో తెలియని గుట్టుగా ఉంచి.. కలత పట్టిన చర్యలపై .. నీరు మోసిన

దుఃఖఎద కరిగిన గోడలపై.. పాట ఇంకా చూపులేక పాకుతూనే ఉంది..

నిద్రకి గురి పెట్టిన కాళ్లపై కూరుకున్న దేహ ఋణం కూలుతూ .. కొన్ని పోలికలని

తప్పించుకున్న చర్యలకి చేర్చిన కూర్పులని లాక్కొంటూ.. తేరుకోలేని హద్దుల

బయట కదిలే పుట్టుకలు.. విడిపోతూమండిపోయిన నిప్పు ఝాముల కేకలు..

……………………..

నిర్గమయ చిత్ర రాజీలేని కప్పుకొని .. నటిస్తున్న కథలకి చేర్చిన కంటి చూపుకి ..

మరో శ్రద్ధ గుప్పిన పెద్ద భుజాల ఊతాన్ని పట్టుకొని .. దృష్ఠి కేకలకు చేర్చిన కలతలతో

 పోసుకున్న .. మంతనాలని చేర్చి.. విసిగిన హద్దుల వెంట ఊగిన కలతకి వయసు

నిద్రని చిలికి .. పాటకి పైన .. కిందా లాగి పెట్టిన గుహల్లో తిరుగుతూ.. హెచ్చరిక లేని నిరాదీక్ష

కదనత పెనవేసుకున్న నిర్మాణ గుండాలని తిప్పుకొంటూ.. కదలికనే కనిపెట్టి .. ఊరుకోలేని

చర్యల బయట ఉంచేసి నివుర్పు పట్టుని ఊడదీసి కదలికలు గుప్పించే

నటనలు రాలిపోయాక .. తనే తనకి మరోలా కనిపించినప్పుడు .. అదిలించినపుడు

కొంచెం కూడా వాలి ఉండిపోని ఝాము నిద్రాలకి చేర్చిన నుదిటి పొంగు చిత్రాలని

కట్టుకొన్న సంసిద్ధ గాలి రుణాలు పోసుకున్న మునకలు.. తీరుబాటుగా కలని మారుస్తాయి   

అదే చెప్పుకోవాలని లేదు.. అక్కడే ఆగమనీ చెప్పరు.. కదిలిపోతారు..

కథ విరిగిన దేహ కక్ష్యలో పడి .. దిక్కు తెలియని చీకటి వదిలిన పాటని తాగి..

 అతనింకా లేవలేదని .. వార్త గుప్పుమన్నాక .. తెలిసిన ఊరట పై మోగిన

చీకటి ఆనుపానులు మోసుకొన్న నిద్ర జాడీల్లో కదిలే రంపపు చప్పుడు..

చెట్లు ఆవలించిన గాలీవానలో పడి.. ఊరు చెప్పని ఇంటి నమూనాలని కడిగి..

అంటుపోసుకొన్న పాట.. నిద్ర పోగుల దీపపు ఇంటిలో హోరు పెట్టే నమూనాలు  …

………………………….

అవునని అక్కడే ఉండిపోయిన కథలకి .. పాటలో పాట విడిచిన గోళం .. అతనికి దొరకనివ్వక

ఊపిరికి నొక్కిపట్టి.. కదిలే నిద్ర దర్శన మూర్తులుగా కలబడే దేహ కథకి లేచిన కునుకు ..

అక్కడే ఆగిపోవడానికి లేని ఛిద్ర ఏకం లో పడి ధ్వని కథన చప్పుడుకి ..

మోసి తెచ్చిన కంటి నిద్రకి పాకుతూ.. అంపకాల చీలికని .. కథలో ఒరిగిన చీకటికి నింపిన

చూపుని .. పాట అడ్డంగా నరుకుతూ.. సమయ నిత్సర ఊపులని సరిచేసి ఏడ్చుకొంటూ..

అదే మళ్ళీ .. మళ్ళీ కలిసి.. కునుకు పట్టిన చిత్ర నిద్రలో ఊగి.. కాల్చిన కథతో తిప్పుకొన్న

దేహంలో పాతి పెట్టిన మాటలు.. బలంగా బిగించిన తలుపు ఊడలు .. అక్కడే నిప్పులో దూకిన

 పెదాలని లాగి పెట్టుకొంటూ.. రుణ పూర్తి కలతని పట్టుగా లాక్కొంటూ.. భయం పొట్లాలని

పగులగొట్టిన చర్యలకి వేలాడుతున్న కథకి .. మోసి తెచ్చుకొన్న రుణ గుండంలో

తలకిందులుగా ఉండిపోయిన ముఖాలు .. ఇక్కడే ఉండిపోయిన నిద్ర రుణాలని కదిపి ..

లోపలి చేర్చిన కథలతో అంపకాల్ని చేర్చిన దోసిలిలో పడి .. ఉక్కిరైన అనుమాన కదలికలు

చేర్చి  కంటిలో పాతి పెట్టిన ద్రవ పూతలతో కలబడ్డ ఆయుస్సులు…నిఘానీతాలు

 ఒబ్బిడిగా సర్దుకోలేని నిరీశ సదుపాయ గదుల్లో .. పాకిన దుఃఖాల ఎదురీతకి

లేచిన చూపుని పీల్చి .. మళ్ళీ కూలిన అనుమాన దుఃఖాలు .. రస ఛాయా రొప్పులు

ఒక పాట ఎలా కావాలని ఎవరో అడిగినప్పుడు . అదే ఇంటికి కిందనే. దుఃఖం తెలిసిన

నగర చిత్రం పాటలని కట్టుకొని బీటలు తీస్తూ మసక పడుతుంది.

………………………

13.కలిచి వేసిన నిద్ర ఊరు .. ఎండ పొదలో తుడిచిన చూపు .. లోపల పాట వినాలని..

దీపం చుట్టిన కథలోకి మెరిసిన చీకటితో .. పొడిచిన దుఃఖాల కథని .. ఊడ్చి పెట్టిన గంటలతో ..

 అడ్డుకొన్న చిత్ర నిందలు .. భయం పట్టుకొన్న నిడివి వీధుల పై కొండని దులుపుతూ..

తీరిక లేని నీటి కలుపుతో.. వ్యతిరేక సాయుజ్య నడకలు కట్టుకొని వదిలేసిన మాటల బయట

 పొక్కిపోయిన కంటి రాతకి .. అరగదీసిన కన్నుని పట్టుకొని .. పొడుగ్గా రాలిన శ్వాస కావిలిలో ..

ఊడలు రాలిన నిద్ర చిత్రాలు పెనవేసుకున్న కథకి కలిచి వేసిన నిద్ర ఊరు ..

పాతి పెట్టిన కథల చుట్టూ.. పెనవేసిన కళ్ళకి సరిచేసిన మోసపు బొమ్మల పట్టుని దులిపి ..

 పాటకి నిలువు గోడలపై పాకిన దృష్ఠి ఋణం …

అప్పటికి చెప్పుకోని ..నిన్నటి ఋణం పాడుకొన్న కథలో పాతి పెట్టిన కల్లోల గమని .. మరిన్ని

జోడింపులని వదులుకొని… నేరుగా నెట్టుకు పోయిన పోలికల బయట పాట.

కొన్ని దేహాలు.. రుణ భాగపు ముఖాలు లేని .. దున్నుడు సగంలో పడి .. కోతపెట్టే నడకని

చేర్చుకొని.. గడ్డకట్టిన నిందలని దులిపి .. పేరుకుపోయిన మాటలకి చేరదీసిన

రంగుల మోడుని కడిగి.. వేలాడిన కథలతో నింపి పోయిన నల్లని కాళ్ళ కొలిమిలో పడి ..

 గింజుకు పోతున్న శరీర మండలంలో పేరుకు పోయిన నమూనా చలన విగ్రహాలని

పోలిన ముఖాలు.. ఆ నోటి నుంచి జారి వెలుగుతున్న పాటలు.

…………………

నిన్నటి రాత్రి ఉతికిన నిద్రలోంచి.. శుభ్రపడి నిండిన పాట .. ఏదో హెచ్చరికని వదులుతుంది..

తలుపులు మూసి.. గొంతుని నొక్కుతూ.. వరద ముద్రలతో ఏకం చేసిన కథని తీసుకొని..

 అటే వెళ్లి మాయమైన దేహం సరిపోయిన కంటిని తాగి .. నీలో ఉన్నదీ.. నాలో తిరిగేది ..

 మాట తీసుకొని కనబడని ఇంటిని కాపలా కాస్తూ ఉన్న మోతాదుల దీప పోతని గుప్పిన పాట ..

అలవాటు కాని నిద్ర దోషాలతో కదిలిన చిత్ర ఊపులు పడి.. కదలిక లేని ఊరటని

కప్పిన కునుకు పట్ట్టేసిన కలకి దోపిన రంగుల విపత్తు.

అదే ఉండటంలో ముడుచుకున్న నిద్ర రాట్నాలతో వాడిన కథలో ..

నీరు పోసిన మంచు కాగడాలు వెలిగాయని గంట మోగాక పాట మొదలవుతుంది.

కలబడి కదులుతాం .. నిలబడి కూలిపోతాం.. జోడించిన కథల మధ్య ఊరట లేని భయం

పోసుకున్న నల్లని జోడు భుజాల బరువుని కనిపెట్టుకొంటూ.. కలిచి వేసిన నిద్ర ఊరు…

రుణ తీరికలేని అపాద ధ్వనికి .. ఏడు రంగుల ప్రదక్ష కక్ష్యని కప్పిన కుట్రతో ..

 కొంచెం వెలిసి పోయిన పాటని పట్టుకొని.. అదే కొండ కి ఆవల సముద్రం పొంగుతూ..

నదికి చేర్చిన పాట పొంగులు దూకి విడిపొమ్మని చెబుతూ.. కలలో గుప్పిన కాసిన్ని బియ్యం

గింజల కుండ బోర్లించి వడ్డిస్తూ.. దేహం మరిగిన కథలతో లేవదీసిన కలతవెతలు.

………………

ఎప్పటికీ అంతే తెలియని గర్భ దోషిత అంటుకట్టుడు సఫలత మోసిన చీకటి పొరల నదిని ..

 పాటలకి ఒంపి.. అదే భయం ఎండిపోయిన జీర కొండ పేలిపోతే..

వినేవాడే లేని దుఃఖ సర్దుబాటులో.. ఇక అన్నీ తెగదెంపులు..

ఎవరో వద్దని.. ఇంకెవరో కావాలని.. అంతా వదిలేసి.. లోపల పాట వినాలని…

భయం కుదిరిన మెలికల నిద్రని నంజుకొన్న ముఖాలని సాగదీసి.. ఇంకిపోయిన కథలో ..

వేటు పడని గర్భ నిబ్బరం .. కాలబెట్టిన కొంచెం కాటు.. అదే మళ్ళీ మళ్ళీ వినాలని..

గడిచిన నిద్ర కౌగిలో అంటుకట్టిన నిద్ర ఊపు కప్పిన కొన్ని అసమ చర్యల వినికిడి

ముఖంలో నేసిన ఖాళీలు. త్వరపడే   కొండల మధ్య ఏడుస్తున్న పాటలు…

ఇల్లూ .. ఒళ్ళూ .. కొండా .. యేరూ .. కథా .. మాటల రోదా ..అన్నీ  కాలుచుకొని .. కూల్చుకొని..

 మళ్ళీ పుట్టి.. కొత్త దోషిత ఆనుపానులు మోసి తెచ్చుకొన్న పాట కావాలని..

ఏదో వద్దని .. మరేదో పట్టు బిగిసిన కన్నుతో కూలబడి.. ఇంకిన నిద్ర పూర్వాల కంటి తోడులో

అదే కల గొంతవ్వాలని.. తోసి పోయిన దుఃఖ మలామాని సరిచేసి దువ్వుకొంటూ..

తీరికలేని సరంజామాతో.. అదే దీపం పక్కాగా అన్నీ వదులుకొని..

మళ్ళీ ఇల్లుకు మట్టిని మోసుకొంటూ .. గొంతుకి సాయం అడిగిన రంగుని పులుముతూ..

దేహ జడని సందీప బావుల్లో ముంచి.. వీలుకాని నిద్ర రీతులని గుప్పిన కథకి .. నేను రెండో

 పేజీలో మోసి తెచ్చుకొన్న బరువుని….లోపల పాట వినాలని అన్నీ వదిలి దూరం జరిగితే..

…………………

4.వెలితి తోరణాలు.. అనుసార ధ్వని ముంపులు

(Vacuum to brake … situational art of dildos )

యధాతధాలు.. నిద్ర ధరించిన పాత నడకల ఊపుని మింగుతూ.. నిరాఫల  విసుగుతో గాలి నలత

తిరిగి పోలేని విశ్వ సముద్రం ఆవహించిన అఖాత జ్వరంలో .. ఉండి కోతపడిన…

దేహపు పట్టుగొమ్మలని జార్చుకొంటూ.. రహస్య అవీకరణ చేరబిల్చిన హద్దుని కాగబెడుతూ..

రోజులు.. నెలలు.. ఏళ్ళు..వదిలి కాపలా పెట్టిన ఆకలి చుట్టూ తిరుగుతూ.. విడి విడిగా ఉండి..

కదిలే స్వర జోగు కలతకి నీరు పోసిన ఆవిరి కొండలకి దోసిలి చేర్చిన గొణుగుడు..

నిస్వార ఎత్తిపోతలు.. వెలితి తోరణాలు .. కనబడటం .. విడిపోవడం .. తెల్లబోవడం

పాట తగిలిన నిద్ర భారం చెప్పి పెట్టుకొన్న కథా ద్రవ చిత్ర సాయం ఒరిసిపోయిన వెన్ను

 నొప్పిలోకి ఊదిన వాయులీనల జల్లుని మూట గడుతూ .. చల్లార్చి నిఘాతో 

గొంతు సలసిన నడక సరి మధ్యంలో ఊపి పెట్టుకొన్న నిద్ర రాతని గిరా గిరా తిప్పి తుడిచి..

అంపకాల భద్ర రంగులవాలుని కట్టుకొని .. నిలబడి పాతుకొన్న కాళ్ళని పైకి

లేవదీసిన పాటని వెన్నుకి వెదురుని కట్టి వెదుకుతూ కల..

……………..

నీటి పైటలు కురిసిన మాయకి రెండో వేపు గంట కొట్టిన కల రైలు .. కుండపోత స్టేషన్లు  

వెళ్లిపోక ముందే నిద్ర ముడి వాదులు చేసిన కథకి … మాసిపోయిన చీకటి వరుస కొండల మధ్య .

ఎగురుకొంటూ వెళుతున్న అమాస గుండం లో పడి .. రేవులు మగ్గబెట్టినవి…

కొంత ఊపిరి రాతల్ని స్క్రిప్ట్ లో పెట్టి.. ఇల్లు.. పట్టణమంతా తిరిగాక,.. నిశి రొప్పుకి చీల్చి పెట్టిన

మాటల కాల్చివేతని సరిచేసి.. శూన్య యానపు ద్రవ రక్ష కురిపించిన అనుసార ధ్వని ముంపులు

 కథలైనవి.. మాటలు వదిలిన కక్ష్యల్లో తప్పిపోయిన నిద్ర ఇరుకు గొంతులో పాటగా ఊరిన

 దుఃఖం తీసుకొని.. తరిమి .. తీరిక చేసిన నిద్ర ఋతువుల మంటని ఎగదోసి.. కట్టి రాల్చిన

 కునుకుని జోలికి సర్ది.. ఊలపోసిన కంటి దారాల కైపుకి ఒళ్ళుని పండించి

ఆమె రాకముందే .. స్నాన దేహంతో చితిపై నిద్ర పోతున్నప్పుడు .. చెవిలో పాడుతుంది.

…………….

జీర్ణ సత్రాలు .. మాయావి నేసిన నదుల మధ్య పేదవాలని తవ్వి తీసిన దీవులు..

వేల గొంతులు దట్టమైన చీకటిలో మిణుగురుల్లా వెలుగుతూ.. అర్ధమయ్యేలోపే ..

ఆ గొంతులోకి దూసుకుపోయి.. పాట ముద్దగా కరుగుతూ.. మంచుసొనలు చిలికి పట్టిన వాన కావెడ

లని తెచ్చుకొని.. నేలంతా పంచి పెట్టాలని.. కథకి నింపి తెచ్చుకొన్న నిరాశల రుణ గట్టు కురిన

పోలికలని పట్టుకొని . కథలో మాసిన నవ్వుకి .. గంధక పాఠాలు చేర్చి నిప్పు పెడుతూ.. సత్రాల

 బయట ఇసుక బయళ్లలోబైరాగీల చలిమంట చుట్టూ పాట ప్రసవించిన లావా తిరుగుతూ..

ఎర్రగా మెరిసిన మట్టిని తాగిన కొండలు .. చిత్ర స్వీకార నొప్పికి.. గుడ్డ బిగించుకొని వింటూ..

వాన కురిపించాక.. దట్టించి సీసాల్లో కూరిన పొగ మండలాల చీకటి నెరిసిన పాట గొడుగు

చిల్లుల లోంచి  …పుట్టుక వదిలి.. మాయల జ్వరం ఊరబెట్టిన కథకి దొరికి..

 నిర్వాణ కంటి శూల తిప్పుకొన్న ఇరుకు బొమ్మల నిద్ర రూడీలని .. ఊడలతో ఊపి..

కరకు మెడల తల్లిని వాదులు చేసి .. శంఖం లోపల వదిలాక .. కొండ కొప్పుల్లో ..

మల్లె తోట కురిసిన భూమి పగుళ్ళని మోసుకొని.. పాట కూలిన రెండు పుట్టుకలు మధ్య వంతెనకు

 వేలాడుతూ నేను వింటున్నానని ఆమె అంటున్నప్పుడు .. ఇంకేం కావాలి.. ?

అదే ధ్వని శీర్శ్య స్థలంలో శంకుస్థాపనలు.. వీలు చుట్టిన గోడలకి నేసిన కిటికీలు…

నీరు పట్టిన చెమటల మధ్య తన కౌగిలి కలబోసిన గొంతు ఇక ఆగకూడదని ముందుకి నడుస్తూ ..

ఆ వెనుకే రమ్మన్నాక.. ముందూ .. వెనక లేని వక్ర కక్ష్యల్లో .. నేను తానై కనిపిస్తూ….

…………………….

                    1.ఆశర్య నిదాన ఎడారి .. వాన గుంజలు.. తేనె కక్ష్యల ఋణం  

సమర్పిత దృశ్య చిత్ర పోలికలు .. నేరుగా నెరిసిన దుఃఖంలో పడి కలియతిరిగే ..

 నిండు రాతల కౌగిలో నేసిన పాటల గుట్టు.. శరీర కథని కనిపెట్టిన ఖాళీలు

తడిమిన నీ దేహం .. కదిలి పోయిన దుఃఖ నిమిరివేతకి మోసి తెచ్చిన కణ కణ మంటలలో

మోసుకు పోయిన చావు బిగువు శ్వాసల పులకించిన పాట .. అదే కొంచెం విసుగు పోసిన నడకకి ..

 తెల్లార్లూ.. గమన నిద్రల పొర్లింతని మోసుకు పోతున్నఆశర్య నిదాన ఎడారి…

అదే ఉంది.. పరిధి చుట్టుకొన్న నిద్ర దర్శన కథలో ఉండిపోవడమూ.. నీటి కథకి చేర్చిన

ముఖంతో కథలని చేర్చి కౌగిలో పోసుకున్న భయాల్ని పండించాలని కొట్టి చెప్పడం ..

తలుపుని మోసే ఇల్లు.. గాయాల కొత్త కథకి నేర్పిన పేజీల బయటనే ఉండిపోయిన

పెద్ద కేకల నిందలని కట్టుకొంటూ.. పిసికేసిన నడకల మధ్యలో మోసి తెచ్చుకొన్న కన్ను..

అదొక పచ్చి వెదురుతో కూలిన శూన్య చిత్రాల పాట .. పై నుంచి కరిగి రాలిన వాన గాటు

 మొవ్వుని చిదిమిన ఆయుస్సులో .. పగకి వేలాడదీసిన కంటి నిప్పుని .. ఒడిలోకి చేర్చి

 ఊదుకొంటూ..అక్కడికే ఎదురు చూసే మైక్రో ఫోన్ల్య్.. వెబ్ అప్డేట్ లు లేని

 ఓ నిరామయ అంతః సాధనలో …ఇగిరిపోయిన ఫొటోల ముట్టడికి చల్లారి…

నెరిసిన గొంతుకి పోసిన పాల ధార .. మోసపు గుండం లో తిరిగే నల్లని మాంస

సంయోగ నిద్రల చుట్టూ కదిలే గుహలని కూల్చిన పొంగుల మెళుకువలు..

…………..

ఇంటి ముందు పాతిన వాన గుంజలు.. కళ్ళకి చేర్చిన నిద్ర సగాల తీరుని సర్దిన గొంతులో

మెరుగు పెట్టి తాగిన ఋణం .. పట్టుదప్పిన కథలోకి .. మళ్ళీ దారి కొండలని కడిగి..

మాటకి మోసి తీర్చిన కునుకుని పట్టుకొని.. పాట కావాలని.. నీరు చుట్టాలని …

వండిన అన్నం .. కూర మెదిపిన గెరట .. నీరు తరిగిన ఉల్లిపాయలు.. పాలు తోడైన మజ్జిగ ..

 చిలికిన చీకటి వెన్నలో.. స్థితి పరాయిని చప్పుడు క్రమాలు.. వాన హోరులో దాచుకొన్న నిద్ర

 శకునాలు .. ముద్దకట్టిన హోరుని పట్టుకొని.. అదే నిదానంలో పడి కాలిన అవకార దీపాల

గుట్టుని మోసుకొంటూ.. తవ్వి వెళ్లిపోయిన నిద్ర గుణాల్లో .. పాట దిశలు దొరికిన కల..

కొంచెం ఇక్కడ సందడి.. కొంచెం మాసిపోయిన కలకి పోతపోసిన చీకటి నీలోప గ్రహణ ..

ఒద్దిక లేని సిద్దతలకి .. అటు పక్క కాచిన కొండలపై .. ఇంకా ముహూర్త ధూప ఖండాలని

మోసి తెచ్చుకొన్న గొంతుల్లో యజ్ఞత.. తెచ్చి రాల్చుకొన్న నడకల అజ్ఞాత దీపాల కొండ

                                                     ,,,,,,,,,,,,,,

తేనె కక్ష్యల ఋణంతో కదిలి వేలాడిన కట్టు తీరుల మాటని మోసిన ముఖం తప్పించుకొని..

 సరళ రీతి కన్నుని మార్చి పెట్టుకొన్నసడలింపు.. శరీర నిగ్రహ పాతకాలు 

ఉన్నప్పుడే ఉంది.. లేనప్పుడు ఏదీ లేదు. కదిలించి పెట్టుకొన్న నిద్ర స్థలాల్లో మొదలైన పాటకి ..

 రెండో దీపం చుట్టిన కంటి చూపులో మోసిన కునుకు..

బంధనలేని నిశిత క్షణిక మత్తులో పడి ఊగుతూ… అద్దిన కథలోని రెండో శరీర ధారగా

లేవదీసుకొన్న .. కథల వికర్ష ముఖాలు తెచ్చుకొన్న మరకల దుప్పటి..

అక్కడే కొన్ని వలయ ధారకై గొంతు తెరిచిన శరీరాలు.. వెల వెల బోయిన కథలు

అదో ఔషధ మాయ .. ఊగిపోయిన లోపలని పేరుకున్న కథలని .. మోసి తెచ్చిన నిరోప కళ్ళకి

 అవధికి .. చేదుగా దిగబడి నింపుకున్న పాత శిక్షణ ముఖాలని .. తోడి పోసుకున్న ఝాము

 ముంపులో వెళ్లిపోయిన వికర్ష ఊపిరి ఖండాలు.. విధోపాల మంగళ తోవ..

రుణ దశల చిత్రం తుడిచిన పాటలని కమ్ముకొంటూ.. నిల్చి పోసుకున్న వాన గుమ్మాల

అలసట చుట్టుకొన్న శూన్య విరుపుల సర్దుబాటు దేనినో తెలుసుకొంటుంది.

………………….

2.తీగ రాలిన కునుకు జ్వరం .. ఆవిరి పుట్టిన చీకటి పడవల బాటసారి

కుదిరిన కథలకి సరిచెయ్యని నడకని కప్పి .. వేలు పట్టి లాగిన అవసర చీకటి తలకిందుల

 నిద్రని నానబెట్టి.. కనబడని నిరాదీక్ష ముఖాలని నానబెట్టి.. కదిలే నిప్పు మడిలో ..

చలన ముఖాలకి చేర్చిన కలతో పండిన నాజూకు పోతలతో  అలుముకొని

సావలంభన గతి సాక్షి తీర్చిన మోసపు కథలని కూల్చి .. సమాపకపు నిద్ర దొంతర్ల మధ్య

కదిలే నిద్ర రాతలు తిప్పిన శరీర నాడికి  కరకు చలనాలని తిప్పి కొడుతూ..

పోగొట్టిన నెలల పెద్ద మలుపులో తను నాకు కనబడని ముఖాలని చేర్చి ..

కంటికి చూపు నిచ్చిన పల్చని మాటలని తాగి.. అద్ది పోయిన కంటిలో అదే సర్ది పోయిన

శూన్యాల మధ్య కదలాడే పదాల చుట్టూ మసిపూసిన కలతలని కంగారు పెట్టి ..

హఠాత్తుగా చీలిన చీకటితో .. హద్దు చెదిరిన కథలని దాటుకొంటూ.. పెనవేసిన నల్ల గొంతులు

మధ్య నది కడిగి  అద్దిన దీవులని కాపలా పెట్టుకొంటూ .. తెచ్చి రాల్చుకొన్న ..

స్వయపు కక్ష్యల్లో మందలింపుని కసి తీరా వడపోస్తూ.. తేలిక పడాలని..

సేకరించిన కట్టుబాట్లకు విడదీసి చేసిన ఒప్పందాలని సరి చేసుకొంటూ..

తడబాటు కుండలిని పగలగొట్టి.. ఎండ చుట్టిన ఖాళీలని కప్పుకొని..

ఆవహించిన సర్దుబాట్లుకి తలుపు ముంపులని కనిపెట్టి.. చేరుకొన్న నిద్ర తూలుని కప్పుకొని..

……………

సఫల నిందలని మరగబెట్టి .. ఓరగా పెట్టిన కన్నుని తాగి .. చేర్చుకొన్న ఒడిలో ..

కదిలే నిద్ర శాపాలు .. చేర్చి పెట్టుకొన్న ఖాళీల అయోమయం చుట్టుకొన్న గుప్పెటలో ..

 విప్పీ విప్పని పొగ ఊడలు చిక్కుపడుతూ.. అదే చేదు నుదిటిలో సవరించిన కలకి ..

మోసి తెచ్చిన ఇంటిని కాపలాకి ఆరబెట్టి.. మరోలా చెప్పుకోలేని కదలికనే పాట చేస్తూ..

ఇప్పుడు ఆమె వెనక అతను ఆవిరి పుట్టిన చీకటి పడవల బాటసారి ..

కొన్ని నిద్ర దోషాల కథకి గుచ్చిన ఓడ రేవుల లంగరు పక్కగా .. అంచు పిండిన కథని తాగి ..

 అదే కథతో మళ్ళీ  తప్పిపోయిన పడవ .. ఇంటి గదిలో.. పగిలిన ఉప్పు దొంతర్లు..

పై నుంచి రాలుతున్న ఇసుక దోసిలుల కట్టడి రావాలని అరగదీసి.. పోయి చేసుకొన్న

రంగు పోగుల ఒప్పంద మాయకి చేర్చిన కుదుపుని లాగి..

కొన్ని కెరటాలు.. మరిన్ని ఇసుక ముంపుల గాలి అలల మధ్య కోసుకు పోతున్న గొంతులోంచి ..

 అదే వివర్ణ చెమటల రాతి గ్రహ నెరుసులని సంచీలోకి ఎత్తి.. కలిసిపోయిన మసక తెరువు

 మరుపుని కూర్చి..  అలుముకొని .. పట్టి అదే కాదని చూసుకొన్న నిండైన గదిని …

కొన్ని కాళ్ళ దళసరి ఆపసోపాలు పట్టి చేర్చుకొన్న కథలు ఊరేగుతూ…

 అలిగి మోసిన మాటలు స్వరాల్లోకి ఊడిపోయి . అద్దంలోంచి రాలుతూ..

……………..

గర్భ నీలంలో పేరుకున్న మంటకి నూనె పోసిన కన్నుని జార్చి.. కదిలే నిద్ర గ్రహణ

పూనకపు చెమటని తుడుచుకొంటూ.. తీరికలేని ఝాము పూతలా కలకి నేసిన దృష్ఠి సగం

నేసుకొన్న ఆ పెద్ద చీర మడతల్లో ఉండిపోయింది.. పాటే..

అదే తెలియాలని.. అదే నిండి దుఃఖం పోసుకున్న కన్నుతో కదిలి .. గడ్డకట్టిన ముఖాల

మధ్య తిరుగాడే కథని తీసుకొని.. ఒత్తి పోయిన గంటలని నానబెట్టి..

చప్పుడు రాలిన చెట్ల పక్కగా … నీటి దోసిలి ఋణం కూలిన వాలు చీకటి లోయలో కడిగిన

మంచు ఊడలు చిక్కుపడ్డాక .. విడదీసిన వేలి కణుపుల్లోంచి జారిన మూడో నది పాట..

 లోపల పడిపోయిన గంటలకి .. కొంచెం భూమి కైపుకి నిమిరిన వణుకుని సరిచెయ్యక ముందే..

 చెక్కి వెళ్లిన కథకి మూడు సమయాల చిత్రం తీరిక చేసిన గొంతు

ఇల్లూ .. మాట తీసిన అతిధి కట్టిన ఇల్లు.. ఓరగా దించిన మంచు తలుపుల గూడుని ..

 తీరికగా చెమర్చిన కథలో ఉంచి.. పాలిపోయిన గోడలని దాటి వచ్చిన కబురు మాసిపోతుంది.

……………………….

3.కథల సత్రం లో పాట గుచ్చిన ద్వయాలు… మాయాదర్శి .. ఆగమ స్పర్శ

పడి లేచిన నిద్ర శరీరాల గుట్ట .. మళ్ళీ చేరదీసుకొన్న కథల నిపులతకి ..

సంధి చేసిన పాటతో.. ఆక్రమించిన కునుకుతో.. అంపకాల శ్వాస గది నిండిపోయిన భూమికి

వర్ణ మిశ్రమ ధ్వని ఏకం చేసిన కునుకుకి … ఆరించి పెట్టుకొన్న సాధన మతి సరిచేసి

 కన్నుకి సరాసరి నిద్ర పోగుల గుండంలో పాట ..

కథల సత్రం లో పాట గుచ్చిన ద్వయాలు.. అప్పుడే అంతా కలుస్తారు .. నిలదీస్తారు..

మంటకి చేర్చిన దోసిలి అడిగిన తీర్మాన రాత్రుల్ని చేరదీసి.. వాళ్ళు మాట చెప్పక ముందే ..

 ఇంకా నిద్ర పోవాల్సిన చోటుని అనుకోక ముందే .. విసిరేసిన నిందలు మోగిన కథకి కొన్ని

 తలలని బలిగా తిప్పేసిన చీకటి తలుపుకి బయట కూర్చిన భ్రమణ గోళం..

అదే దూరమూ.. కొంచెం నస పోసిన దగ్గరా .. అక్కడే విని ఉండిపోయిన కాళ్ళ ఊపు ..

మాయల తొణికిసలాటకి .. రెండో నిద్ర చేసియాన్ కూపాల్లో జోడించిన పులకింతలు ..

 ఆయాస సగాలు కట్టి కూలిన నడకతో.. హద్దు మోసిన కథకి లేవదీసుకొన్న ఇరుకు బొమ్మల

 ముఖం తిప్పిన మాటలకి జోడించిన కథకి.. కొన్ని రంగుల వెలిసిపోత ..

నడుం పగిలిన యాయానా మాయలో పడి .. చీకటికి అనువాద పూడికలని.. లేవదీసి..

కలుసుకున్న వీధి గుమ్మంలా .. చేయించిన పూర్వపు కంటి దోషపు నమూనాలని..

 లొంగిపోతున్న సంధి సూత్రపు చీకటి సవరింతని .. లొంగిపోని రుణ ధారణతో నలిగిన

లోపల పేరుకున్న సన్నిహిత వర్ణ నమూనాల నిలబోత.

వరుస తప్పిన కంటికి చూపుని సగం చేసి.. గొంతులో తేనె పోసి మంట పెడుతూ ..

దీర్ఘ నిజారణ ఆపదకి చేర్చిన మెట్లు ఊడిపోయిన కథ.

……………….

నిధూప పరికర కట్టడాలు .. పీల్చి పెట్టుకొన్న నిరసన ధ్వనుల కమ్మివేతకి ..

అలాగే ఉండిపోయిన నిద్ర శరీర కూర్పుని పోసుకొని .. ఇంకిన గొంతులో చెదిరిన మాయాదర్శి ..

లోపల .. ఆ లోపల .. అక్కడే చెదిరిన గంధపు మెత్తుడు .. నూరి పోసుకున్న చీకటి బరువు

పేజీలకి పాటని వేలాడ దీసిన నలతకి మోసి తెచ్చిన భద్ర గుంజలు.. అదే చెబుతూ ఉంటారు.

 ఆ కొండ వెనక నడిచిన కథ ఆగిపోయి దిగబడ్డ మాటలని చేర్చి .. నీరు పట్టిన వెన్నులో కలబడే

 దేహ పూనకాల నిద్ర జాడీలో కలబెట్టిన శ్వాసలని .. పోతపోసిన కంటితో .. అద్దుకొన్నకూర్పులు.

 అలాగే ఉండిపోయిన నిద్ర ముహూర్త ఖండాల్లో పడి.. కెరటాలుగా తప్పించుకున్న పాట ..

 గుక్కపెట్టి ఏడుస్తూ.. దర్శి మాయల ఊర్పుని కలబెట్టి అక్కడే శరీర గేలపు పొగని కట్టుకొన్న

స్థితి గోళాలు.. ఉట్టి నిద్రలు.. విపరీత కళ్ళలోంచి ఒలికిన పాటలు..

అదే తెలియాలి.. తెలుసుకోవాలనేం లేదు.. పాట ఆగకూడదు.. నిద్ర మారిపోయిన

 శ్వాస యాగంలో కుదురుకుని .. నిషిద్ధ గాలి పొంతనల దేహ కౌగిలి నేసిన కుదుపులు

……………………..

బంధన పొత్తు ఉరిమిన కునుకుల పట్టుకి చెల్లార్చిన దూరంలో కదిలి చుట్టిన ఇంటి చూరులో..

 మోసిన  వాన బెంగల తీరుని సరిచేసి ఏడ్చుకొంటూ .. నిద్ర సాధన గుమ్మల్లో కనిపెట్టిన

శత్రు బేధ నిర్మాణ గతికి ..  తిరిగిన హద్దులో పడి.. మాంస ఛాయల కైపుని దాచిపెట్టిన

కలతకి నేసిన చీకటి పరాయిగా మార్చిన దృష్టి పోతల కలకి తీసిన పాత నిద్రలో అదే పాట

మళ్ళీ పక్కనే చోటు అడిగి.. కథలో ఊరిన శ్రమకి పోసిన కుదుపు చోటుని లాక్కొని

మోసిన ద్వయాలు. మరో చిత్ర దీపపు అప్పగింతని సరిచెయ్యని కథకి మోసిన రంగులు..

అవును అలాగే ఉంది.. మాట వెనకా .. ముందూ తెలియక నీటి స్థలం మోసిన నదులకి

చేర్చిన  పడవలని పట్టుకొని .. ఇంకిపోయిన కునుకుతో .. అందినవి లేని స్మశాన మరకలు ..

ఉండిపోయిన శరీర గోడల మధ్య కుదిరిన ఊయసలాటకి చుట్టేసిన సగం వికర్ష నిద్రకి పంచిన

చీకటి ఆరిపోయి .. పెళుసు రొమ్ముల ఊగు .. అదే ఉంది.. తెలియబడని నమ్మకం కమ్మేసిన

కథతో తేలికపడి.. ఇంకేం తెలియని కదలికని జోడించి .. ఆగమ స్పర్శ ..

                                       ………………………

4.నిద్ర బజారులో పాటల పేటిక .. రొప్పిన కాగడాల పల్లకీ .. సమయ వికర్ణి

ఉండిపోవడం నాలోది.. కదిలి మిగిలిన కునుకు చేర్చుకొన్న ఇహిత రుణాల చేదు గుర్రు

సర్దుకోలేని దుఃఖం మెరిసి.. దృష్ఠి నాదన గుప్పిన వరుస కలతలకి చేర్చిన కంటి శిక్ష ..

మెరుగు పెట్టిన ఊపిరిపై రాలిన శిక్షిత నుదిటి పాయల కదలికనే ఉంచి పోయిన నీటి పాటలు..

ఊళ పెట్టిన లోయలు.. అదిలించిన క్షణాల బరువు చుట్టిన రంగుల దూరంలో పోగైన ఊరులు

ఓదార్చి పెట్టుకొన్న రుణ దీపాలని .. కదలాడే శరణు మాట కుట్టిన దోసిలి ఎండలో ..

ఊడి రాలిన శరీర మాంసాల గుట్టల పక్కగా .. అదే నిద్ర కథ తిప్పి చెప్పుకొన్న నడకని పెట్టుకొంటూ.. తిప్పి రాలిన కథలో .. మళ్ళీ చెప్పుకొన్న విడి సమయ ముంపులో పడి..

కెరటాలని గుద్దిస్తూ .. నిద్ర బజారులో పాటల పేటిక .. అదే వివరం తెలియని దోసిలి మోసుకొన్న

కథని ఊగిస్తూ.. పెట్టి వెళ్ళిపోయిన గుమ్మాలని  కడిగి.. రుద్దేసిన గోడలని కట్టుకొని

అక్కడే నింపుకొని వదిలిన నది కడుగుతూ పాట.. పురివిప్పిన చీకటిలో కలబడి నిండిపోతూ..

…………………..

ఆ లోపల చావు మరుగుతూ.. ఆవిరి పొంగులు జత చేసిన కునుకుని జార్చి..

 కొంత దేహ మర్మతా వణుకుని కరగదీసి .. విష నిమిత్తాల పాటకి చేర్చిన కథలో పాకుతూ..

పక్కకి తప్పుకొన్న భయం మోసిన కునుకుతో చల్లబడుతూ.. లిపి చక్ర విన్యాసం ..

 పరిధిని దాటుకొని .. నిద్ర ఊర్పుల నింకేత దర్శి మోసుకొచ్చిన ముఖాలని తప్పించి..

విస్మ కొండల అరచేయి .. కంటి దోసిలిని కడిగి .. బోర్లించిన దుఃఖం పోసుకున్న చీకటి నిద్ర

 ముడిని వాదులు చేసి .. కథలో మోసి తెచ్చుకొన్న శరీర నిప్పుల ఊపుని విసిరిన కథ ..

ఏక గుమ్మము .. రెండో పాట .. మొండి చేయి.. రాళ్లు కురిసిన నిద్ర పొగల ఊడలు ..

కథకి చేరదీసిన కొండలని కుదిపి.. అద్దకపు గోడలకి చప్పుడుని జోడించి చేర్చిన కలత..

పల్చని దగ్గు .. శొంఠి కొమ్ము కాషాయం.. మిరియాలు మరిగిన పాలు.. చీకటి మండపం లో

మంచు విగ్రహాలు లాలా పోసుకున్న వాన .. చుట్టూతా  .. బిగించిన పాట..

 పట్టు విడుపులేని ఆయాస ద్రోణుల్లో తన కనపడలేదని ఆందోళన కప్పిన కలత బింబం

 చేర్చుకొన్న ఝాము ముంపులో పడి కొత్త నిందల పూడిక

ఊపిన రుణాలపై బరువెక్కి సమయ వికర్ణి చేర్చుకొన్న విడుపు రాతల ముగింపుని కదిపి..

 నిండారిన క్షణ మాత్రపు.. నిప్పుడి రాలబెట్టిన హద్దుని దాటుకొంటూ ..

 కుదిపిన గొంతు నింద మాటకి కరిగించిన కాపలాతో … అక్కడే అంతా ఉందని ..

ఎర్ర నీటి బజారులో కట్టిన మూడు ముడుల నలత.. నొప్పి కందిన పాట ..

 అదే చెప్పుకోవాలని ఆగుతూ ఉంది.. వెనక్కి జరిగి అవస్థలు పడుతూ …

చేరిన దుఃఖం లో విసిగిన నిద్ర రుచుల మునకలని బరువెక్కిస్తూ.. పీల్చి వదిలిన వెనక నడక .

 ఇదే భూమి రెండో అంచు చివర చీరుకు పోయిన కలవలపాటు దగ్గర చేసి పాట మొదలుకావాలని .. కనబడని వినబడి కదలని  ఏడు సర్గల గోళం.

……………….

నేల కూలిన ద్రవ రక్కసి నమిలేసిన దృష్ఠి నిద్రతో కూరుకుపోయిన అనూహ్య మోతాదుల

 పరిధిని పట్టుకొని.. అదే తెలియని చీకటి గుండంలో ఆకర్ష పూర్ణలా కలబోతకి ..

కలిపి చుట్టిన నిగర్భ ధ్వనిలో కురిసిన వర్ష సాగుకి దిగబడ్డ సంధి కోరిన కంటి శాలలో ..

కలబడిన చిక్కులతో .. గాలి పట్టిన దేహ బొమ్మల పాటని కరగబెట్టి ఊరుకొంటారు.

 ఇది కొంచెం దూరంలో చెప్పుకొన్న మసక పొరల నిందకి కూలిన ఆయాస ముట్టడిగా

చెప్పుకొంటూ.. ధ్వని రుణ కైపుల మగతని మోసిన కంటి క్షేత్రంలో ఊరేగే నిద్ర చనువు

పోలికలని తాగి పాట గాలించినా కబురుతో వెల్లడైన కంటి చూపులు కమ్మేసిన విడిది.  

ముంచి పెట్టుకొన్న నూనె మడుగులో రొప్పిన కాగడాల పల్లకీ .. ఎవరు ఎటు పోయిన ..

 కథ ఎవరినీ ఏదీ అడగక పోయినా .. ఎక్కడో అక్కడ నిందలని వదులుకొని కూలిపోయినా ..

అద్ది వదిలిన రమిత  రుణ తీరుని కదిపి పాట .. విసిమిత వ్యాకులంలో పడి కొట్టుకొనే

రుణనాడీల చూపు పట్టుని దులిపి .. మరి కనిపించని మంత్ర నీరు.

పెనవేసి పాట జీబురు బొమ్మల తీర్ధంలో వదులైన కదలిక పట్టుకొన్న మాటల కైపు…

……………………

5.దర్శ మాయల్లో నిలువు గది గర్భాలు …చిత్ర గొంతు .. ఆలోమం

నీటి కూడలిలో ఒరిగి పోయిన కథ .. మళ్ళీ చేరదీసుకొన్న నిద్ర రేవులో ..

తీరు మార్చిన విసుగుని కుదిపి.. కళ్ళకి వాలిన దుఃఖం చుట్టి.. తేరుకొని ఝాము విరుపు కలకి

 లేవదీసిన కునుకుని ఆవరించి.. చక్ర తీర్ధక ఎండ పోటుని మింగిన ఝాము పంపకాలు ..

 కట్టి చూసిన వికార దూరాల నియోలాల విలోమ మోసిన పాట ఉనికి అతనిలో ఉంచి ..

 మృత్యువు రెండో గడపలో మాట తీసుకొని.. విడిపోతుంది.

అపాశ్రమ సంధి దూరంలో పడి .. నిలదొక్కుకోలేని ముఖాలని కడిగి.. ఊళ పోసిన కథకి నేసిన

 బట్టని వదిలి.. నాని పోయిన గింతులో ఊదిన కలత పూడికని కుదిపి ..

రంగు కోలాటంలో పగిలిన దేహ గురిని సానబెట్టు.. అదే సాయమూ..

నిద్ర గుణాల మూర్తి చిత్రమూ .. ఉంచి పోయిన ఖాళీ కాగడాల ధూప పూర్ణ ముఖాల

గుండమూ.. పూడుకుపోతూ.. వెచ్చని శ్వాస అరల్లో కూలిన గ్రహణ మార్పులు…

ద్విజోల మాయా రేహన .. పేరుకు పోయిన చీకటి సంధాన రాత్రులపై ..

 కథ మోసిన నల్లని అడుగులతో .. కాపుకాసిన మోతాదులని దాటి కలుపుతూ..

అద్ది వదిలిన రుణ పాత్రకి .. దేహ సంధికి చుట్టేసిన పథకాన్ని సర్ది.. ఇంకో దూరమూ..

 ఆరోహ సర్గల మడి … ఉండీ రాలిపోయిన కథల వినికిడి చిత్రం తుడిచిన చేతులు

…………..

ఆమె సాధ్య నిరాకరణతో గొంతు పట్టుకొని.. వేలాడిన దుఃఖ పరిధికి నిండుతనం కురిపించి..

దర్శ మాయల్లో నిలువు గది గర్భాలు .. ఉండీ .. లేకపోయినా విపరీత కక్ష్యకి నిమిరి తప్పుకొన్న

 ఝాముతో .. అంపకాల ఛాయా విన్యాస ఋణం కూర్చుకొన్న నాటక తెరల వెనక రంగు

దులుపుకొన్న అవమానిత చిత్ర రూపులకి దట్టించిన కాటుక రాశుల మధ్య నిమిరేసుకొన్న

గర్ష స్తంభానికి ఆరోహ సర్గల మడి … పెట్టి వెళ్ళిపోయిన కునుకుకి ..

చేర్చి విపులల కథకి నేసిన మంటల మధ్య ఊరడి లేని కన్నులో పోసుకున్న హద్దు.

ఆమె తన చిత్ర గొంతు కావాలా? అని .. భావిలోకీ దూకింది.

నిద్ర తోపుల్లో పడి .. రుణ వికార హద్దులో .. గతి తప్పిన చూపుని తీర్చుకొని ..

వడపోసిన మాటలని కట్టిన కునుకు పొడిని ఆరబెట్టి.. పాటని పట్టుకోవాలని తిరిగే పడవల

కల్లోలంలో ఊరట లేని నిద్ర బిగువుని జోడించి .. మెరుపు చుట్టిన పెదాల మధ్య ఊరట కడిగి..

 పాట మోసిన చీకటి నిర్బంధి .. అదే తెలియలేదని లోపే .. పెద్ద కాపలాల సొరంగం లో

గుప్పిన నిద్ర పోలికల కలని తోసుకొంటూ.. రంగుల ధూప చిత్రంలో పోసుకున్న…

విపరీతము.. నిద్ర కక్ష్యని వదిలిన జీరలతో.. ఊపుకొన్న చేదు మంత్ర గాధలు కూలిన

 రక్షా మహా మాయకి .. దోసెడు మట్టి కోరిన శ్వాస సర్దుబాటు..

సముద్రాన్ని లుంగ చుట్టిన ఖాళీ గడపల  మధ్య .. కాస్త నిద్ర చుట్టిన ముఖాలు మోసిన

సత్రంలో పడి కలియదిరుగుతూ.. దీపం పెంచి .. ఒత్తి వదిలిన గాలి నొప్పి

తెలిసిన .. తెలియక పోయినా అదే ఉంది..కదలిక తెలియని మాట తీసుకొంటూ కుదిపిన

రక్ష సాధనకి పైకి చేరి.. అంతలోనే మాట కడిగి.. సమయ కావలిని పాటలతో నింపి ..

నది ఒడ్డు దీపంలో  కాల్చిన దుఃఖ నింద కరిగించిన ఆదమరుపు వీధుల్లో కోరిన

గంధక చెట్ల పిలుపులో పడి ముఖాలు ఒరిసిపోయిన కల.. ఆగి ఉండమనలేదు..

………………………

మసి కోరిన అలోమ గొంతుల దీర్గంలో పిండుకొన్న నడకని .. భూమిలోకి దించి కథకి

నివురుగప్పిన చిత్ర రాజీల తాజా కూర్పుని సరి చెయ్యక ముందే ఓడిపోతూ..

అదే దిశా రుణ చక్రం.. వదులైన కూర్పుతో లేచిన కన్నుకి దిగబడా ముఖమూ..

అదేనని తెలియని కసి ఋణం చెప్పుకొన్న చివరి చీకటి అనువాదంలో పాట ముందే …

కదిలిన నడకలో ముంచిన ఇల్లు. సావకాశ ధ్వని ఏడ్చిన నిద్ర ఊర్పులు .

.విప్పుకొని వెళ్లే నిద్ర గ్రహణ సంధికి ఉంచి పోయిన కాస్త ఛాయా ,..

కొన్ని బంధిత తపనల విలోల మంగళ రేవులో పోసుకున్న స్నాన గదికి ఆ వాలిన దేహం ,

పాటని తొడిగి బయటకి వస్తూంది.  కలలో కూలిన వాన జాడలు

ఆ పోలికలు .. నిద్ర రాజీలు.. మాట గుచ్చినా పంపకాలు.. దోసిలి పోసుకున్న నిప్పు కుండల

సగం ఆవిరి రక్షలు.. పొడగరి నిద్రలేని అప్పగించిన కోపాలతో దూకినా …

సముద్ర చర్యలు మింగిన పడవకి దగ్గరగా తను చేరుకొనే ఉన్నాడు.

……………….

 6.ఆత్మ సన్నిధాన ద్రోణులు ..  నింపుపోతలు .. మాంస భూములు

వెలిసి పోయిన నిద్ర ద్రోణుల గుర్రుని పాతిపెట్టుకొంటూ .. త్వరపడని ఇంటికి చేరిన

 కథతో.. రంగు పూసిన దోసిలి నిండుగా .. ఓ గది నిద్ర శాపం తో కదిల్చిన పాట ..

 ద్రోణుల్లో పడి తిరిగే ఆయాస సగం ఊచకోత కోస్తూ.. తేరుకోలేని దక్షత గడించిన కలత పాకిన

 ధూప కొండల్లో .. కొంచెం కుదిరిన శరీర రూపుల కథకి పీల్చిన నడకని కడిగి..

బొట్టు తీసిన నుదిటిలో పాట మోసిన పెద్ద బరువు నొప్పిని ఆరబెట్టి  ఆత్మ సన్నిధాన ద్రోణులు …

పాటని ఊరబెట్టి.. మూత తీసిన పొగల మధ్య .. కాల్చిన దుఃఖ చలన మాత్రంగా ఉన్న పగటి

 గుమ్మం మోసి తెచ్చుకొన్న కూర్పుల వదులుని కట్టుకొంటూ.. ఊరట లేని సముద్ర గోళాలు ..

ఆయువ్య సముదాయ దృష్టి కల్వంలో .. నూరి పోసుకున్న ఛాతీలని కుదిపి ..

 జంటగా రాల్చిన దుఃఖ శిధిలపు పగని కట్టిపెట్టి .. అక్కడకి చేరుకొని కథలో కూలిపోతారు.

……………………………

జాడీలో ఏడు కలల దీపం .. ఎలాగూ దూరంగా లేనని ఎనిమిదో దీపం వదిలిన

నది బొమ్మల గుండంలో పడి రాలిన తీర్ధ కెరటాలని జోడించి పెట్టుకొంటూ..

కొంచెం వాలి చెప్పుకొన్న పాట సూత్రాలని వదిలి పెట్టి .. కథలో కూలిపోయిన

మాయాతాల నిండు కథకి జ్వరపడ్డ కునుకుని కట్టుకొని.. నింపుపోతలు

ఎక్కడివో జరిగి.. మళ్ళీ చెప్పుకొని నటనకి దిద్దిన కథ ముఖాలపై ఒరిగిన వాన కుంపటిని

ఊది పాటకి నేర్చిన కల్లోల పూర్ణత హద్దుని పట్టుకొని .. ఇంకేం తెలియని మాటతో

లోపలి పట్టుజారిన నలుపు దుమ్ముని దులిపి ..కలబెట్టిన దోష నిరాకరణ మూర్తవ

కథనాల్ని చేర్చుకొని.. ఆపార్ధ దొంతుల నీటి కథ..

తెల్లబోయిన కరకు గొంతులో ఉన్న కథకి .. రెండు అనునాద శత్రు గతులని కూర్చిన

కునుకు చల్లిన భుజాలకి ఎత్తిన కథలో .. కొన్ని రంగులు.. కొన్ని మరకలు ..

హోరు పెట్టుకొన్న భావి పోటులతో చిలికిన చీకటికి ముఖాలని కలిపి..

చేదు ముంపులని కదిపిన పూడికలతో తీరు మార్చిన నడకలు.. రైళ్లు.. షిప్పులు ,, విమానాలు..

 మృత్యు సంధిని కలిపి చుట్టిన ఏడు ముఖాల కథ.

…………………

ఆత్మత పోతలు .. నిండు రాత్రి చుట్టుకొన్న చీరల మధ్య కల పూచిన సన్నని

నిద్ర ఆచూకీలని దాటి మరింత చిక్కబడిన కథలకి రంగులేసుకొంటూ ..

మసి పూసిన కళ్ళకి ఊరిన వర్ష రథాలు చేసుకొన్నా ఒప్పందాలు. నులిమిన మాంస భూముల

కలతకి చేర్చి.. కళ్ళకి కప్పిన చీకటి నివేయ మూర్తులని  కాల్చిన ఒగర్పుతో.. హద్దుని నేసుకొన్న

 విడి పోటు ముఖాలని దాటుకొంటూ… అదే రుణ గర్భంలో మోసుకొన్న నిద్ర సాధనాల

పూర్వ నొప్పుల పొడుగుతో కలిసి.. పాటకి నీటిని దులుపుతూ.. నిధి ఛాయల కలత ..

ఎవరూ వెనక .. ముందూ కాక వదిలిపోరు.. మాటని సరిచేయక .. మలుపులో కోరిన చీకటి లోయని

 వడపోసి కప్పిన చీకటి రాగోతాలు .. నిలబడి కూలిన నిద్ర కోతలని పూడ్చుకొంటూ..

 కసి లేపిన కథకి రెండో పాటగా ఉండిపోవాలని.. విడిచిన బరువులో కెరటాల అండ

పూడికలు గొంతులోంచి .. ఆవరించి కాల్చిన రెప్పల ముద్దని కూడబెట్టి.. తీరిక లేని విసుగుని

 కప్పే ముఖాలపై నిందల వాగులో కుప్పపోసిన  పొడి పొడి వెలుగు… పాటలో కలిసి  

……………………………

7.అయోమ తంత్రీ శాల … మాంసాల నీటి ధార .. ఎనిమిది ముడులు

ఇదొక తాండవ నిద్రలో కూలిన దేహ శిఖర అనునాద చర్యల కలతని కలదిప్పిన ..

శరీరశాలలో పడి తప్పుకొన్న మాటలు.. ఇంకేమి తెలియని దూరంలో ఒడ్డు తెగిన విపత్తు

చుట్టూ కదిలే నిద్ర అనుకరణ ముఖాలన్ని కట్టుకొంటూ.. తీవ్ర రాజీల తెగిపోతలకి

పండిపోతూ హద్దుల్ని దాటిపోతూ.. కెరటాలకి తెంపి పోయిన…

ఇదొక తాండవ నిద్రలో కూలిన దేహ శిఖర అనునాద చర్యల కలతని కలదిప్పిన ..

శరీరశాలలో పడి తప్పుకొన్న మాటలు.. ఇంకేమి తెలియని దూరంలో ఒడ్డు తెగిన విపత్తు

 చుట్టూ కదిలే నిద్ర అనుకరణ ముఖాలన్ని కట్టుకొంటూ.. తీవ్ర రాజీల తెగిపోతలకి

పండిపోతూ హద్దుల్ని దాటిపోతూ.. అనుకోలేనిది చివరకి దిగబడి..

ఏది ఉందో అది పాటని మించి .. మంచు గాలించిన ఇంటి ముందు వాలిన నది

తాగుతూ.. పోలిక లేని శ్వాస ముంపుల తాకిడిని దాటి..అయోమ తంత్రీ శాల ..

అదే ఉంది.. అలా అని చేరి సరిపెట్టుకున్న నిద్ర పోతల సంధి చరణాల

పిలుపు చుట్టూ .. కాపలాగా .. నిషిద్ధ సమయాల చీకటి రుంజనాల మగత…

కాస్త ఊపిరి అడ్డుని తుడిచి..కొండ నిండుగా నదిని నింపి.. దట్టమైన మృత్యు కెరటాల

 సుడిని తాకే ముందు.. పడవ లోపల రంగు చిక్క బడిన దుప్పటలని తీసుకొని.. నిద్ర

చేరే ముందు పాట.. కదలడానికి … వద్దని దూరం జరగడానికి సంసిద్ధ కక్ష్యని కూల్చి..

చేరీ చేర్చుకోని యధార్థ గ్రహణ కూర్పుకి చేయాల్సిన ధ్వని కాగడాల రక్షా నిడివి

పేర్చిన చీకటి సంధాన రేవులో .. దీపాలు పట్టిన దీవిగా లేచిన కథ .. అదే పాట .. 

…………….

చెప్పుకోవడంగా లేదు.. ఉండిపోవడంగా కదిలే నిరూప రాశుల మధ్య కూరుకున్న

నిస్వా చలన ముఖం కప్పుకున్న నిజరూప దర్శనలో భూకంపన ఏడ్చి..

గజ రజ లాడిన వణుకుని మూట గట్టి .. పాట .. మాంసాల నీటిధార ..

వీలువెంబడి వెళ్ళిపోతూ..కొన్ని అరమరిక నిరూపలా .. కథ మోసిన గుణ స్థితి

ఖండం లో ఊగే నిద్ర ఋతువుల ఊపు..  అద్ది తీసిన పాదాల శకున కైపుని జోడించి..

స్థిమిత మాయని కదిల్చి.. అంపకాల రుచి లేని కలకి .. చేయించిన రంగు పాటల చికిత్స

 ఊడిపోతూ.. సరి చెయ్యని కుట్ల మధ్య నొప్పి పాట .. అది అలానే చెప్పి ఉండిపోలేదు.

ఇంకోలా ముఖ తిప్పి దగ్గరగా చూడలేదు.

సమితి లోలంలో కూలబడి చేరుకొన్న నిద్ర గదుల కైపుకి బొట్టు దిద్దిన నిదాన

కూర్పుని పోగొట్టుకొన్న కథ… నిస్త్రాణ దేహ ఋతువుకి కూర్చిన మట్టి పోగుల కుండ..

బయట రుణాల నిధాన రంగుకి కూలబడిన మత్తుల ఊడలని ఇల్లంతా అల్లుకొని..

చీకటి అర్చిన అద్దకపు తడిని ఊదుకొంటూ..  గొంతుని మాత్రమే వదిలినప్పటి పాట..

……………………. 

అదే కావాలి.. చలన భద్రంలో ఊరేగే కలకి నేసిన సగం ఖాళీల కూర్పుని సాగదీసి..

పొడి కలిపినా ధూప గొంతులో కడిగిన హద్దుకి .. మాట తీసుకొన్న వెనక గదిలో రాయి

పడిన భావికి .. తప్పి జారిన బరువు కంటి నీటి చక్రాల ముడి తిప్పిన కథకి ..

ముఖానికి .. ముడి కట్టిన వడపోతలు .. శ్వాస సాయుజ్యంలో .. ఆగక తిరిగే

దేహ నిర్జన గాథని .. పట్టి .. పాటని లాగడానికి వేసిన ఎనిమిది ముడులు ..

నిప్పు తిరిగే కొండల అలసటని కనిపెట్టి రాల్చిన తంత్రీ శాలలో..

ఆయోమ ధార పాటగా మారి .. కొంత నిండు రహణ తీరుల పల్చని నవ్వుకి ..

ఆరబెట్టిన కథని మార్చి చుట్టుకొన్న ధ్వని గోడలతో.. పెదాల నిద్ర శ్రోయపు

కదలికని అంటుకట్టి లేచిన పాట … ఇంకా లోపలనే తిరుగుతున్నచీకటి తోవలు…

………………..

8.విచ్ఛిత్తి మితి నిలకడలు.. దేహ నిర్గశ .. ఎనిమిదో తమగమన

నిత్య సంధీకం లోంచి .. పారబోసుకొన్న నిద్ర సన్నుడి కథలో మోసిన

పెద్ద బొట్టు నీటి కథలు .. కొట్టుకు  కొట్టుకొని కిందపడి ఏడుస్తూ.. చీకటి రవ్వలు

రుణ ఝాము కత్తిని దూసినా పాటలో బొట్టు తుడుచుకొని   ..

తేనెతుట్టల మంటలో శేష భూమిని కప్పి దాచుకొన్న కొండ నిలబడి ఏడుస్తూ ..

తీరిక లేని కంటి దోషం పట్టి లాగిన హద్దు బయట కథ చెప్పిన ఆపద ఊగిపోతూ ..

అర్ధరాత లేని నీటి రుణపు .. పై మీగడ చిలికిన కన్నులో పడి

ఆ దేహపు ఆరోహణ క్రమం మోసిన విచ్ఛిత్తి మితి నిలకడలు..

దేహ సమీక సంపదకి రాసిన కంటి సూత్రాల తాకిడి మెరుపులు చేర్చిన కల కి ..

కొన్ని నీటి పత్రాలపై రాసిన ఋణం దిద్దిన నిచ్ఛిత్తి బొంగరాలు తిరుగుతూ..

గొంతులో నవ నవ లాడే దీర్ఘ సయోజ్య  గతికి ..తీర్మాన మాయతని సర్దిన సగపు

నిజార గతి క్షేత్రం.. అది ఉలిక్కిపడి .. నిద్ర భుజాలని బరువుగా లాగి..

నిషాధూపజల  దగ్గర కదిలిన దుఃఖంలో ఏకమై పాట గా కదులుతూ..

……

సమయ నిందల బొట్టుని అరగదీసి కథకి .. ఇంకిపోయిన రుద్దన మండలంలో

 పేరుకున్న హద్దులే కనబడని ఝాము కోతల మంచు రాళ్ళని పేర్చుకొంటూ ,,

శ్వాస ఖనిజాల కూర్పుని కూల్చిన దుఃఖ నిప్పుని లోపల నుంచి ఊది..

కంటికి నీరిచ్చి కట్టిన చే సంచీల ఊపుని కాల్చి .. అదే ఇంకో తెలియని గడువులోని

 సరాసరి మయా దీపాల ఇంటికి .. ఆ గాలి తలుపుని కట్టి వేలాడదీసి ..

మాట వెనక తీరికని గాలించిన కక్ష్యలో పడి.. విడి మునకల ధీరణ రాతని గొంతులోంచి

 తీగలుగా తీసి..దేహ నిర్గశ.. లేదని తెలియడానికి మిగిలిన చిత్ర తూగుని వేలాడదీసి..

ఏం చెప్పడానికి కాదు.. మరేదో తెలియని తర్వాత శ్రమని కూర్చిన హద్దుకి పాటని చేర్చి

అడుగు తొడగాని నిద్ర రాతకి .. జత చేసిన స్వరాల నింపుటిని కప్పే పాటగా ఉంచి

 మాయం అవుతూ.. తొందరగా కట్టిన ఇంటిలో మంచు వాసన రాయాలని గదిలో ..

దుప్పటి తీసినప్పుడు.. కూజాలు పండించిన పరిమళం ఎగిరి .. తాజా పొగల పాట ..

పాట మధ్యలోంచి బయటపడి .. మధ్య సాయంత్రపు కక్ష్యలు మధ్యలో పేరుకున్న

 నిద్రజాడల కుదురుని కలబెట్టి.. ఉండిపోయిన కంటిశాలలో పడి ..

ఎదురుకాని ఇళ్ల  కక్ష్యల్లో .. నలత పండిన కాస్త వెసులుబాటుకి మోసిన కథ..

……………..

విన్నప్పుడు .. కలని కడిగి చేరదీసిన  నిద్ర జాగారపు మంటలో పాటకి నూనె పోసి

 అరిచినపుడు.. కొండపై పిడుగుపడి కూలినపుడు.. అడివి కేకని వడపోసి ..

పడవ గుహల్లోకి చేరుతున్నప్పుడు.. కాస్త నిందల గట్టుని తవ్వకపు బొమ్మల రేవులో

పాటకి అదిమిన నవ్వుని .. జతగా అంటించి.. కూలిపోయిన నివ్వెర పాటులో ..

గతికి మోసిన కథని చూపించి.. హద్దు బయట నిర్వేద కథల కూల్చివేతని నమ్మినపుడు ..

 దృష్టి నిఘాద ఖండన కూర్పుని చేర్చిన కన్నుకి మోసిన కళ్ళతో.. కలిసి.. విడిపోయి..

 ఎనిమిదో తమగమన ..సందడి చేసినపుడు.. ఇక గొంతు .. నీరు పట్టిన కాగడాల కొండ..

 బోర్లించిన నదిలోంచి లేచిన నిద్ర కేక .. మన్నిక లేని కూప దొంతరలు

మసక కనువిప్పుల ద్రోణుల్లో కూలబడి .. మరో అంపక చెమ్మని ఆరబెట్టి ..

అది ఆరని సంధి దోషపు నిరా ధ్రువం ఆకర్ష గుట్టు చప్పుడులోని సమాధి లోపల

సన్నగా వినిపించే గంట.. భుజాల వణుకు పై .. తొణికిన కుండ నీళ్ల చప్పుడు..

సముద్రం అమాంతం కూలిన కెరటాల మధ్య .. కొన్ని కాలుతున్న పడవల శ్వాస..

నిలదీసిన కథగా .. తన పక్కన కూర్చొనే చోటు అడిగినప్పుడు పాట మొదలైంది.

                                     …………………….

9.సోయగాల నిమ్మెర .. మూడో వచన గుచ్చం .. సంధి గాథ

కొన్ని పడవలని ప్రసవిస్తున్న అడివి .. లోపల లాoతరులని ఆర్పుకొని..

 నిద్ర ఒలిచిన దుఃఖం చేరదీసుకొని మొదలైన యాత్ర సోయగాల నిమ్మెర..

అది అంతే ఉంది.. అక్కడ కదిలి చేరుకొన్న కొండలని పట్టుకొని.. కళ్ళలో పెట్టుకొని

దాచుకొన్న పడవ నీటి కాళ్ళని కదిలించి … నివారణ కృతి మందలింపుని కాల్చిన

మట్టి తోరణ ముంపులని కట్టుకొంటూ.. తెలీని కథలకి చుట్టిన ఙిలాలు మర్చి ..

పాటని అడిగి తెచ్చుకొని పారిపోతూ.. సడలించిన నిద్ర గుణాల రుచి  

సరి చెయ్యని దేహ సంసిక్త సొరంగాల్లో పడి ముక్కలై పాట కలిసిన వెదురు

రుణాలతోడుని తెగ్గోసుకొని వెళ్ళిపోతూ ,, తేల్చి చెప్పిన నొప్పి.. కాపడం పెట్టిన కన్ను..

 పెదాల నిద్ర ఋణం తీర్చుకొన్న కథలకి మోసిన దేహ తాకిడి నిర్మితల గుట్టుని కుదిపి..

ఆగిపోయిన ఖచ్చిత మాయల గుర్రుని కట్టి లాగుతూ.. అద్దకాల చాయకి చేరదీసి

ముఖాలు.. ముచ్చట చనిపోయిన అడివి.. ఇంకొంచెం కేకలని విడదీసి .. వెనక్కి

జరిగినప్పుడు ,, వాళ్ళు చెప్పుకొన్న ఖాళీ ఋణం కూల్చిన కథ అక్కడే ఉంటూ..

………………..

చెప్పి చేర్చుకొన్న మూడో వచన గుచ్చం .. అదాట్టుగా కూలిన నిర్ణిత దేహభాష

కదిలే గాజు మండల ఋణం .. నీళ్ళని గొంతులో పోసుకొని.. శుద్ధి కలల గడియారం

తిప్పిన కళ్ళు మోసిన గర్భ సంప్రాప్తికి చేర్చిన ఝాము వసారాలో పండించి

తెచ్చుకొన్న నిద్రల బయట కదిలే నిర్ణయ ఊపులు పట్టుకొని లాగుతూ ..

అప్పగించిన సగంలో వాళ్ళు సన్నని నవ్వు తోరణ ముడులని కట్టుకొని ..

శరీర జాలపు సవ్వడి వడపోసిన నడకతో.. తోడు రాని విపత్తు పోతలని సరి చేసి..

కదిలిన ముఖాల మధ్య ఊపిరాడని కథకి.. నిలువు వెన్నుని రాల్చిన ముఖాలని కట్టి..

 కుదిరిన తీరికలని అలుకుతూ దేహ స్థలం మోసిన పాటతో ..

ఆ మూలగా ఇంకా పాతిపెట్టే ఉన్న ఇల్లు.. ఊలపెట్టిన చెట్టు.. దీపాలు కాసే మట్టి పంట..

 చల్ల కాగులు.. నిద్ర కోతలు.. గురి పెట్టిన కాల్పు ఊడలు  

అదే నా రూపమని పట్టి తెచ్చే అద్దము.. కొన్ని రంగు సంచీలో కదలికలు..

రాత్నాలని గుండ్రంగా తిప్పి… కంటికి క్షేత్ర నిదర్శ పునాదులని జోడించి కలిసిన

అంపకాల బరువుని తెచ్చుకొని.. పీల్చేసిన సగం కొండల నల్లని తేమని

 వెచ్చజేసే గొంతు.. పడి లేచిన గట్లని దాటి నోరు మోసిన కొండలు…

……………………..

ఆమ్ల పుండుల సంధి గాథలో వేలాడుతూ.. అద్ది పోయిన ఇరుకు కథలు నేసిన కథకి .

. కొంచెం నిమిరి తినిపించిన కథలో .. అక్కడే ఉండిపోయిన నిచ్చెనలు..

 దేహ సంధి కి వాలిపోయిన గుప్పెడు రంగుల నలత .. మరిన్ని కాటుక బయళ్లలో

 మోసిన కెరటాల బిగువుని తట్టి లేపుతూ.. ధ్వని మండలం లో పడి ..

పోలిక తుడిచిన పునాదులని కప్పుకొని .. మంత్రసారిత నిలబడి చెప్పుకొన్న పెద్ద దోసిలి

మంటతో మోగిన గంటలని కాల్చి.. లేవదీసిన పునాదుల చిత్ర వాకిలిలో ఊరట లేని

 కథకి .. రెండో ద్రవ విపత్తుని కుదిపి.. సుళ్ళు తిరిగిన దేహ శిక్షణ పాటకి అతుక్కొని.

. జల్లించి పెట్టిన దుఃఖ సరళత కూర్చిన ముఖాలతో.. హద్దుని కాపుగాసి..రుణ వికార

 తాండవంలో కాల్చిన గోడలని మోసుకొంటూ.. పెనవేసిన నిద్ర గతుల శ్వాస జార్చిన

 పాట.. అలాగే ఇంకేం చెప్పుకొని ..  నీటి జాలపు అల్లికలో చిక్కని కేకలు..

హఠాత్తుగా చెప్పుకొనే భయమూ కాదు.. నిండి పోసుకున్న పల ధారా కాదు..

కలిసి చేసుకొన్నా ఒప్పందమూ కాదు.. నింపి చెప్పుకొన్న చీకటి కొండల నొప్పీ కాదు..

 ఇది పాట.. కొంచెం ఋణం బరువు తీర్చుకొనే ఆందోళ ముఖాల నిండు రాత్రి కి

లేచిన కథల గుట్టు.. వ్యతిరేకమూ.. పక్కకి జారిన సమాంతర రుణ దీపమూ..

వదిలిన కథతో .. పేజీలని కాల్చిన గ్రహ నిందల కారుకు నవ్వూ.. దూరంలో పాట.

……………………

10.ఆమ్లపూర్ణి స్థిత్యంతర జాడ .. విశ్వ సాధ్యకి .. నీటి కల్పాలు

భయం సాయం చేసిన కాలి దారాల కొండ.. పైన కూలిన విపత్తు మందలపు ఒద్దికని

 సవరించి కదిలే నిరూప జోడీలు.. మళ్ళీ చీకటికి చెప్పుకొని  విడిపోతారు.

అదొక ఆమ్లపూర్ణి స్థిత్యంతర జాడ.. పాటని కట్టుకొని తిరిగిన హద్దులే తెలియని ..

నీటి గట్టుకి .. దోసిలి మిమ్పి పోసిన కునుకుతో.. తెలీని శరీర నిద్రల కంటి శూల

 దిగబెట్టిన వాలులో ,, కళ్ళ మగతని తెచ్చి కాల్చిన ముఖాలతో రుణపడి నేసిన కథకి

 ఎవరో మరో సంధి అలసటని .. స్థిగామ  ఒత్తిడిగా జత చేసిన వంతెన మరో బరువు కొండ

 కింద సేద తీరుతూ .. కలహిత దన్నుకి చేర్చి రాలిన నది పాటని పట్టుకొని

 వెళ్ళిపోయాక… అదెక్కడా దొరుకుతానదో ఎవరికీ తెలియదని ఎవరో ఏడుస్తున్నారు..

అతనే నల్లని ఛాయల పై కురిసిన కoటి దోషం .. రెండు నదుల దేహం

…………………….

ఉండుండి మెరుపు సేకరించిన కధకి కసి రంగు మోతాదుల మందుని తొరిపి..

ఉనికి మోసిన దీప జ్వరంతో హద్దుని లాగేస్తూ తీరిక మార్చిన గుట్టు..

అభయ చాయని.. నెమ్మది చేసి.. ఒరిగిన నాలికలపై కుదిరిన రుణ దీప మాత్రలు

కరగదీసిన గొంతుతో.. సమీప బొంగురు ఋణం సాగిన గొంతులో…

పాలిపోయిన నిద్ర జాడలు.. సగం ఊరిన పాత పాటలో కలిసిన దుఃఖ మాల

పుటుక్కుమని తెగి. అదే రాత్రిని సాగదీసుకు పోయిన  గంటలని అడ్డుకొంటూ…

అలమిడి స్థితి అయోగం.. చల్లారిన బొమ్మల ఖండంలో పడి తిరుగుతూ.. అద్దకాలు

…………………..

నెమ్మిదిగా నాలోపల్ చిత్ర వాగుని ఒంపిన కన్నుకి జ్వరం తగిలి నిండాలని

కాల్చుకొంటూ.. చరియాలపై మోసిన దుఃఖ నదిని కూర్చిన కథతో ..

చప్పుడు తలుపుల పాటని కదిలించి పెట్టుకొన్న విశ్వ సాధ్యకి ..

నీటి పూలమార్పుని కప్పిన మాంస నీరుని వడపోసి ఆవిరి చేసి.. సమాధి ధూళిని

మింగిన కొండల పక్కాగా .. తన గొంతు యజ్ఞ వాటికని తప్పించి పెట్టుకొన్న నిరూప

 భూమి కన్నులో పడి .. తలకిందులుగా ఉంచిన ఖాళీ శరీరాల గుట్టుకి ..

నమారింపు పూర్తిని కట్టి .. అందిపోసుకొన్న స్నాన వాలులో నీడల జడని గుప్పించి

 పెట్టుకొని.. సాధ్య స్థిరం కానీ నొప్పిని బిగుతుగా సరిపెట్టి.. నీటి సుడిలో

ఉంచిన కలల పట్టుకుచ్చుల గొంతుని.. మంటలోకి విసిరి కలిపి చుట్టిన కదలికని

 చీల్చిన కంటి పోతలు. లోపల గ్లాసులు .. కొన్ని పింగాణీ దళసరి గొంతులు

మింగిన ప్లేట్ లు .. అక్కడే నిండి ఉండిపోయిన ఇల్లు సాగిపోతూ..

 కథలో కలిసిన దృష్టి సాగు మంత్ర భూమి నేసిన కెరటాల పక్కగా పాట ..

……………………

గమన నికారం .. మోసపోయిన నిద్ర కణతలు మధ్య చెలరేగిన దీపాల ముడిని బిగదీసి ..

 లలాయించిన దుఃఖ ఏరులో పోసుకున్న దీవి నిలువుపాటి నిందల గుట్టుని కదిపి..

 అంతే కాదని దూరం జరిగిన కథలకి మాటని కట్టి..  చితి నిద్ర కూపాల పొడి  ..

ఒకే జలమూ.. కొన్ని బొమ్మల యేరు పట్టిన శూన్య నిద్రేక తీరుని మార్చి .. పోతపోసిన

గొంతులో పొడి నాలికని జత చేసి.. మాటలకి కాల్చిన పాట శకున ముద్రకి ఆంచులు

 తడిపిన  నీటి కల్పాలు.. అక్కడే నిలబడి చూసే మాట జమానాలో పడి ముఖాలు

చేర్చిన అంపకాల గతిని కప్పి.. కొంచెం నీటి జ్వరం కూలిన గట్టు పక్కగా గుడి పోలికలని

 జత చేసిన కంటితో నిమిరిన పాట వినాలని.. కొంత అలసట జోడించిన కథతో

కుమిలిన గొంతు  మైలాల పేరిక.. ఉండీ .. లేకపోయిన నీటి ఎద్దడి కలుపువేతలని

కలబెట్టి నేర్చుకొన్న రంగుల అద్దకం మళ్ళీ ఎగదోసిన ముఖాలు.

అదే చెప్పుకొని మాటని తీసుకొని ఆమ్లపూర్ణి సాధ్యకి   విసిరిన సముద్రంలో

అతనికి దొరికిన పాట.. రెండో గమనం లేని ఊరిలో తడబాటుతున్న గదిలో పడి..

…………………

11.రక్త మంత్రపు కథలో పాట నిదర్శ .. ఆలాప సాయాలు .. తెలియని లయ

ఒక్కోటిగా లోపల కరిగి తప్పుకొంటూ.. శిధిల మాయమ ధారలో మెరిసిన విపరీత సంధుడి

 కదిలే నీటి గుణం తెరిచినా కథలోకి తొంగి చూస్తూ .. ఇంకేం లేదనే దుఃఖ తెర ఊరిన

 చీకటి కథలో కురిసిన మంత్ర ధారకి రక్త మంత్రపు కథలో పాట నిదర్శగా వచ్చి

..అలవోక నీటిలో కాలిన కథకి మోసిన ఇంటిని కదిపి.. గోడలని గాలించి పెట్టిన

చెట్ల పక్కగా అనుకొన్న ఊరే దొరికి .. మాటలకి ఏడ్చి.. మహా సముద్రం కావెడ పట్టిన

సగం బిగువు ముంపునీ అదిమి పెట్టి.. కథలోకి జారిన నిప్పు గంటల తీరుని

గడ్డకట్టిస్తూ..  నీరు పట్టిన చలన కూకటి నిద్రల జడని అల్లుకొంటూ..

 రుణపడి నిద్ర కప్పులని లోపలి సర్ది.. ఆరబోసుకొన్న నడక మధ్యలో కూలిపోయిన

నిశిత గది మెళుకువని తీర్చుకొని.. అక్కడే ఉండిపోయిన కథన రొప్పుకి నెరిసిన

శ్వాసల స్థలంలో పడి కొట్టుకుపోతున్న పాటల వరద..

నిండు మాటలు .. నీటి కలతల నెట్టుడు ఊపులు .. పడి రాలిపోయిన మెట్లని

దాటుకొని.. ఎవరమూ.. ఎవరికీ అప్పగించామో తెలియని నిద్ర ఖాళీల మధ్య

కురిసిన వర్ష కొండల గాలి నలత కలబడి తెచ్చుకొన్న ఆనవాళ్ల గుర్తు ..

 చెరిపేసి పెట్టుకొన్న నిద్ర మొలచిన రోడ్ల పక్కాగా ఆగి చేసుకొన్న సంధి గగుర్పు

దేహ చలమ ఆవరించిన ఆ దూరం పoడుతూ… గొంతులోని పాట..

……………

సాధ్య రశ్మీ కినుక పాకుతున్నప్పుడు ఆలాప సాయాలు .. వరదై కొట్టుకు పోతున్న

నీటి గుట్టు సాధనలో పంచి తిరిగిన గొంతుని అరగదీసి..

అడవి కన్నులో కట్టి తిప్పిన దీవుల బయటనే పడవ పిలిచిన చోటుని ఉంచి..

 కొంచెం కథ దారిలో పడి చుక్కల భూమిని దున్నుకొంటూ.. విశ్వ నిషేదిత కంటిని గుచ్చి

 కోసి పారేసిన చీకటి ఏటవాలు వెలుగు నిమిరిన కోలుకుల్లో.. ఆధార ధ్వని కట్టిన కలతలు

 మోసుకుపోతూ.. అద్దేసి పోయిన కథా రాత్రులు.. చెమ్మగా ఉండిపోయిన తీర్దాల చోటు

 నుంచి పందిరిని తీసుకొచ్చి.. కొండ పై వేసాక పాట మొదలైంది.. అదేం ఆగిపోయేది

 కాదని తాను తలుపు తీసి చెప్పి.. వెనక వంతెన నుంచి వెళ్ళిపోతుంది..

అతనలా చూస్తూ ఉండిపోతాడు.. నిన్న లేని ఆ వంతెన ఈ రోజు.. ఇంట్లోంచి

 మొదలైంది.. కథకి నీరుపోసి.. చిత్రం గీసి.. రంగుల్లో సొమ్మసిల్లి.. కలల్తో కప్పిన

సముద్రం కెరటం జుత్తు దువ్వి.. రెప్పలని తాగిన గొంతుతో.. పాటకి తెరని కప్పి

ఇంటి గూటిలో శ్వాసలు  పేనిన ఒత్తితో  వానదీపం వెలిగించింది.

………….

సేకరణ పాటలు .. నిద్ర ఊపుల పైటని కలిపి చుట్టి.. కథకి రెండో భుజం వేలాది దీసిన

 కన్నులో కరిగించి పెట్టుకొన్న చీకటి వదిలి.. సడి చెయ్యని నిద్ర ఖజానాలో మిగిలిన

 ఆయుస్సు ద్రోణుల్లో పడి పోలికలని జత చేసి గింజుకొంటూ.. తీరికలేని అవశేష దీపం

 మోసిన పాటకి తెలియని లయ తో ఎండ బోసిన కన్నుని మింగేస్తూ ,..

నీటి ధనుస్సుని ఎక్కుపెట్టిన కథల ఎడారి రొమ్ముకి గాయం చేసి నీరు తాగుతూ ..

 తడుపుకొన్న గొంతులోంచి పాట .. కొంచెం సర్ది చెప్పుకొని .. నెమ్ము పోత రాశుల

 మధ్య తిరుగాడే నిద్ర ఊరుల గుట్టుకి వడపోత చేతుల్ని వేలాడదీసి..

 అక్కడే పాట రెండో రుజువు చేరుకొన్న నషాయ తెరికాని కడిగి ,,

తప్పిపోయిన కొండల మధ్య లోయల వెన్ను నొప్పి సర్దుతూ పాట ..

 రెండో తలుపు పగిలి.. ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాక.. నిద్రామయ భూమి నీరంతా

పొంగి ఆవిరై కట్టిన కథలో ఆమె తన గాయకుడిని తెచ్చుకొన్నానని

సమాధి వెదురుని లాగి … కెరటాలని లోపలికి వదిలిపెట్టి  పాడుతుంది.

…………………..

12.మృత్యు సాగు..ఎనిమిదో నిద్రలో పేనిన గొంతు .. ఆపద కథలు

వచ్చి చేరిన చలన గది నిద్రలో మోసి మాసిపోయిన  దుఃఖ చరణధ్వని ..

కలిపి చూసిన పాట చల్లారిన చలన దీపం ఒడిసిపట్టిన నిర్జల శాసన  గతికి ..

అమాంత నిజరూహాల శక్తి స్థిమిత పూర్ణాన కలిసే గ్రహణ నిర్మిత కొండల్లో కురిసిన

సముద్రం.. అంది పోసుకున్న కెరటాల గుట్టు .. వేలాది గడ్డ కట్టిన రాతి నిద్రల

 వెన్నులో కాగడాలు ముగ్గిన ద్రవిత పుట్టుక నెలలు నిండి మోసిన ఇల్లు..

ముద్రలు పడి ఏడుస్తూ.. తేరుకోలేని సిద్ధ ముఖాల కథన మితి పోసుకున్న కృతి చిత్రం

 రంగులని వదిలి ఓ దూరం లో ఏడుస్తూ.. గొంతులో మొదలైన మృత్యు సాగు..

నదీ ఒడ్డున కాలిన సమాధి దీపం .. రెండో దోసిలి వానలో మట్టి ఋణం కాలి మగ్గుతూ ..

కథన దీర్ఘపు మంత్ర సాధిత కలకి పెట్టిన మెత్తని భుజాల బరువు కూలిన శ్వాసల పోతకి

 అద్ది తెచ్చుకొన్న నీటిగానం చప్పరిస్తూ.. మిడిసిపడ్డ దేహ జల ఉరుములని..

కెరటాల గట్టుకి పెట్టిన బొట్టులా ఎర్రగా మండుతున్న దీవి.. చెమట కురిసిన ఛాయ

స్నానం పేర్చిన శరీర దిగులుని విడదీసి కదిలే స్థితి మంగళ దూపులో కరిగించి

చేర్చుకొన్న వినికిడి రుజాన సత్తువుల మలుపులో పడిన వానముంపు తాగిన శిలలా ..

  విసిగిన చీకటి రేవులో కన్ను పగిలిన పడవ  …దేహం చెక్కుతూ పాట..

………………

మొదటి నిద్ర .. తెలియని స్పర్శిత సయోమయంలో పడి ఊగిసలాడి గతికి చేర్చిన

 అంపకాల ఝాములో పోసి కురిసిన సిగ్గుకీ .. మరింత దూరం జరిపిన కాన్వాస్ కీ ..

రెండో నిద్రలో .. యవ్వన దర్శన మోసి తెచ్చిన కరకు ఎండలో ..

 అంతే రాత్రి పోసి చుట్టిన కల మోసపు రంగుల దుప్పటి.. ఇంతకీ వదలని వర్ణ మూర్తుల

సంధి గాయం తెరిచిన గుహలో మోసి పోసుకున్న కథ..

మూడో నిద్రలో.. మొదటిసారి కదిలిన మృత్యు పునాది .. కప్పిన ఇసుక చితుల మంట

నాలుగో నిద్ర .. కదలికని పట్టి తెచ్చిన చిత్రాల బిగువు.. కొంచెం కలిసి చేసుకొన్న నీటి

 గట్టు ఊరిన గాలి ముంతలు చుట్టిన భావి..

ఐదో నిద్ర .. ఆమె నిరాశ ఋణం పట్టుకొని ఒడి పోయిన వెనక తలుపు చప్పుడు వెనక

 దిష్టి తీసి వెళ్లిన పాట.. కొంచెం బయట కలిసి చెప్పిన గారడీ ముఖాల నవ్వు ..

దత్తపు మండలంలో ఏకాకిగా ఉన్న చిత్ర ఛాయల శిదిలత ..

ఆరో నిద్ర .. గాలీ వానలో దిగబడ్డ ఎద్దుల బండి వెనక .. వాడు అందుకొన్న జానపద

 రంకె.. పొద్దు చుట్టిన గారడీతో మోసిన చావుకి ..  వెంట్రుక దూరంలో.. అదే ఉంది..

మునిగిన రక్షా చిత్ర మరకని తాగి సొమ్మసిల్లిన మూడో కథ ఏడుస్తూ..

ఏడో నిద్ర … కృత్రిమ పాటలు గొంతు చేరి ఏడుస్తున్న జీరగా అరిగినపుడు వదిలేసిన

 ఆమె నివాళి పొగ మోయించిన కరకు మెడలో దూకిన గాలుల ఓటమి..

ఎనిమిదో నిద్రలో పేనిన గొంతు .. నన్ను నాకు దొరికించాలని .. సృష్టి చలన కలిపి

 చెప్పిన కథకి.. మొదటి బొట్టు అడుగునై.. కుదిరిన మృత్యు ఒప్పందాల

బయట కదిలే శ్వాసగా కొట్టుకు లాడుతూ…

………………

ఊరిన ఆపద కథల విందులో కోప్పడి తప్పుకొన్న .. నిరుద్ధాల కల్పిత అసహాయ నిర్వరి

కూర్చిన మంథన రంగుకి నేర్పిన ఒంటరి దృష్టి చెమ్మ కట్టిన గోడలు పగిలి ఏడుస్తూ ..

 కదిలి ఉండిపోయినవీ.. కదలక ఏడ్చి తప్పించుకొన్నవీ .. రప్పించుకొని అలిసేవి..

మళ్లించిన రుణాల చర్యకి మోసిన నడకని కరిగించి.. బొట్టులో పోసిన కథని..

పాటకి కలిపించి చూసుకొన్న ధూప నిర్జరి ఊపుని .. సాయం పడుతూ… ఆధార సగం

నిండిపోయిన కక్ష్యలో పడి కలియ తిరిగిన రుణాల దీర్ఘ నిషావి పొగ కమ్ముకొని..

కొంచెం చీల్చి పెట్టిన గొంతులో ఊట చప్పరించిన మాయకి రెండో మెట్టుని కడిగి..

 దూరంలో నవ్వే .. కథల రూపుకి పట్టేసిన ఆపద కథలు  .. ఆ వెనక నిందించిన పాటలు..

………………….

13.ఒక రుణమూ … రెండు దేహాల ఒర .. చావు వెనక రైలు మోయలు

ఉండిపోయిన రెండు మృత్యు సరిహద్దుల్లో దేహమై .. పరాయి నిద్రలో కదిలే గంటలని

 మోసుకొని.. ఇంకి పోయిన చీకటి సగం లో రుద్దేసిన కథకి మోసపు పునాదిని కట్టి..

 ఆగి రెచ్చి పోయిన పాటతో.. కనబడని ఒక రుణమూ .. కొన్ని పాత తర్జుమాల మధ్య

కుదిరిన కూతవేటు దూరాల ఒప్పందం .. అదే మళ్ళీ తేలని ఒప్పుకోలుని సరిపెట్టి

కదల్చిన చీకటి సరి జోడింపుకి ఎగా దిగా అల్లిన కథ మూసి పోతూ.. ఆరబోసిన

తలుపుల మసికి పాటని రాసి ఏడుస్తూ..వాన కుండల మంచం పై తనతో కలిసి

ఏడుస్తూ… పాట కావాలని వేగిరపు ఎద్దడి మోసుకొన్న కల.

తెల్లబోయారు.. పరిధిని కాల్చి .. నొప్పిని ఊడ్చి .. కథ బరువు దుఃఖం తీసుకొని ..

 అదిలించిన గడువుతో.. తేలిపోయిన నడకని తాగి.. ఉరిమిన జోడు చీకట్ల కేకని కనిపెట్టి ..

నులిమిన భాదతో అడ్డుకొన్న నడకని కాగబెట్టి.. ఊతమిచ్చిన పాట.ఎక్కడివి అక్కడే ..

 నిలువెత్తు మంచు కొండల కరుగుడు నదిని గొంతులో ఉంచి.. ఒళ్ళు విరిచిన సమాధి

 వణుకుతూ.. దుఃఖ స్థలం లేని ముఖాల మధ్య ఘాటు పెట్టిన కథ వెల్లకిలా తిరిగి ..

 అలసట మందగించిన ముఖాలతో .. నేను అదే మాయకి రెండో వేపు అనుకూలనని

 చెప్పుకొని… నిశీక రూప పూర్తిని కలబెట్టిన  ఏడు కలతల నిధి…

…………..

అలుముకొని వాలిన నిద్ర తురాయి రాతలతో దుఃఖం మోసి తెచ్చిన కథకి ..

 గొంతుని నింపి కలల పాటకి .. కొన్ని ఆనవాళ్ల పై ఛాతీలో బీడు భూమికట్టిన పోగలని

 కలిపి దున్నుకొంటూ.. శాసిత కథాయన ముఖంతో కప్పి దూరమైనా పోలికలకి …

కొన్ని మెత్తని రుజువుల కట్టడికి .. అలా ఉంచేసి కథకి .. పల్చని చీరల తూగు గడువుని

 ఏకం చేసి అతుకుతూ.. గుమ్మంలో మోసి తెచ్చిన గడువుకు ..

 కొంచెం దగ్గర చెయ్యని పట్టు బిగువుల వలయం మోసిన పాటగా రెండు దేహాల ఒర ..

 అదిమి చీల్చుకొని.. ఒప్పుకొని చిక్కన చేసి.. అడివి కొండ ఊళ పెట్టిన రాత్రి కథకి ..

మెడ విరిగిన పడవ సముద్రం లోంచి తోడు పలికి .. కొన్ని సూదులని మింగాక ..

ఒకటి రెండై.. పాటకి సానుగ్రహ చిత్ర రుణపు కౌగిలి మోసుకొని..

 కాస్త రంగు మాసిన దూరంలో చెలరేగిన చూపుని కనిపెట్టి.. సమయ స్నానత కనిపెట్టి

 చెప్పిన నిజరుయాల సాధన చెమ్మకి తడుస్తూ.. కణ కణ మండిన రాళ్లతో..

కెరట నురుగు అద్దిన గోడలతో.. దోసిలి పండిన కలతో .. పడవల సిగ్గుని ఒంపి

నేసిన మెట్లని కట్టి.. కొన్ని వదిలేసియాన్ రంగుల పాటలని వేలాడ దీసి..

దిష్టి బరువు గుమ్మము.. గుహల జోరు పొగల ఆవిరి గొంతుని చుట్టి..

 కట్టిన రైల్వే స్టేషన్.. ఆ బెంచీపై తను..  పెద్ద పొగల ఊళ దుమారం  ..

………………

పిల్చి కప్పిన కలతలు పోసిన గోడల పోటు .. నిండు రాగం కట్టిన ఊరు నిద్రకి కావలిగా ..

 చీకటి గుండాలు కూలిన మంచు దోసిలుల గుట్టలో పాట..

అది రెండో ద్రోణితో కలిసిన కథకి.. వెన్ను పక్కన కట్టిన నడకల కట్టడి దూరంలో పడి ..

 ముక్కలైన ఊపిరి దూరపు ఎడం లో పడి .. సాధ్య దర్శన పట్టు విడుపుని కదిపి..

 చిక్కుకొన్న దూరపు నిద్రల కట్టుబాటుని వదిలిన గొంతుకి ..చిదిమిన

అమాస రగడలు మోసిన కెరటాల పోటుతో.. ఆ వంతెనకు దగ్గరగా ..

ఆ చెట్ల తోపులని మింగేసి.. చావు వెనక రైలు మోయలు .. అదే కదిలి …

 అదే వదలక.. అదే వండి.. ఇంకేమి వడ్డించాక చల్లని పొగల గడ్డలా మధ్య కలిపినా

 చేతులు వణికిపోతూ.. ఆకలి చితి చేసిన రంగు కాగడాల మృత్యు గారడీతో పడి లేస్తూ

 పాట.. అతనికి సరి కానీ రేణు సంఘాల నొప్పి.. కథలో పరుగుగా నిలబడి ఏడ్చినా

కొన్ని అంపక ముఖాలు మాసిపోయిన నుదిటి హేలాయ మన్నింపుని కట్టి ..

పట్టు తప్పిన సాధ్యత నిల్చిపోతూ  .. నీరు కట్టిన సాధ్యమాల ఆయాసం కరిగిపోతూ

అటు పక్క కమ్మేసియాన్ శ్వాస దుమారం.. వెసులుబాటు లేని క్షేమం వదిలేసిన పాట

 చిక్కకుకొని.. నిద్ర రాజీల బిగువుని కదిలిస్తూ.. కథల మాటున రైలు చప్పుడు ..

కెరటాల బొడ్డులో పొగకి తవ్విన గునపం తగిలి పగిలిన వాన కుండలోంచి అద్దిన పాట ..  

………………

14సమయ నాదమూ… ఆరో భూతపు నిదర్శన .. అస్థితి నిర్ధార 

నిదాఘాల    వరద నీలాం  లో మెరిసిన చలన కృతి మందలింపుకి  ..

ఎగిరి పడిన పడవ .. గొంతులో స్థిరం కానీ ఆయాస యాత్రకి  మోసి తెచ్చిన కథ..

అక్కడే నీరు పట్టిన సముద్రం ఏడుస్తూ.. దుఃఖ వాకిట నెరిసిన చెట్టుని కదిపి..

చంచిత ఆయాస భరిణ  మోసిన కథతో చెలరేగి  తెచ్చుకొన్న పాట ఇదేనని కొండ

చెప్పాక .. మరింత పొడుగు చేరిన కలత మోసిన కౌగిలి చేరికతో కప్పిన కథకి రెండో

ఋణం ఇచ్చిన ముప్పేట గుణాల పాట … గతమూ.. రేపూ కానీ పొడుగైన ఇప్పుడు..

పొగచూరిన కన్నులో ఇంకా బెంగ చదవని కొండ మింగిన స్టేషన్..

రైలు చేరుతూనే ఉంది. పాటని వదిలిన కొండ వాలిపోయిన పెద్ద గొడుగుల వరద

కాపలా కాసిన ఋణం బరువెక్కి.. ఏడ్చినా పెదాల మధ్య కుదిరిన ఒప్పంద

ముఖాలతో తెల్లార్లూ మోసి తెచ్చుకొన్న నిద్ర గింతుల అయోమయం కలబడి..

సర్ది వెళ్లిన  కంటిలో ఇంకాస్త దీప ఝామునే కాల్చి తెచ్చిన కథ ..

ఊగిన దొరికివేతల గుండంలో పడి.. ముక్కలని అతుక్కొన్న మసక భూమి పోలికలని

 కడిగి.. ఇప్పటికే అప్పగించిన సమయ నాదం లో పాట .. అది మృత్యువుని

పలకరించి.. ఇంట్లోకి అడుగుపెడుతుంది, ఇంకొక చీకటి సర్దిన దుప్పటి దులిపి…

……………….

సఫల  మాయకి నేసిన కథని మింగి .. కనబడని పేజీల వెంట కుదిర్చిన హద్దుని

వేలాడదీసి .. కుదిపిన మాటలతో కూర్చిన ఝాములో పడిపోయిన వాన పోట్లు ..

ఎప్పటికని వెనక్కి తిరిగి కలుసుకొని.. అదే చూస్తూ ఆరో భూతపు నిదర్శనని మాటలలో

 ముంచి.. కల కానీ నిద్ర విప్పలించిన కుదుపుని పట్టుకొని.. లోపలి వదిలిపెట్టిన

ఆయాస సగాల ముంపునీ కదిలించి కుదరలేదంటారు.. పాట కి రెండు దృష్టి

నిద్రని ఇచ్చి ఊరుకోమంది. ఆనక మింగేసిన కబురు …

అదే కలబాటు.. నిద్ర హోరు.. గమన హాయావి మోసిన సముద్రం ఏడుస్తూ..

కెరటాల నురుగు చివర ఉరి బిగించుకొన్న పాటగా తెల్లార్లూ.. కన్నుకి పోసిన

మసక తెరల కాల్చివేతని కరిగిస్తూ.. తేరుకోలేని అపక్రమ నిద్రలో పడి పోలిక

తెలియని ఆయుస్సులో పడి .. ముఖం చాటు కథలో ఊరేగి దాటుకొన్న వెన్నుని .

 చెమట మాటలతో నింపిన కథగా .. ఎవరో ఏరి తెచ్చిన రెండో రంగు కథకి

పెదాలని కప్పి.. ఆవిరి గొంతుతో.. దీర్ఘ నదుల విరుపుని కాసి పెట్టిన వంతెన బరువెక్కి .

కూలక ముందే ..అదే స్మర మగ్ధ దీపాల పాడె మోసిన భుజాలని తాగుతూ పాట ..

కొంచెం మసి పూసిన గోడలని సర్దుకొంటూ.. పలకరించిన చీకటి కలతని నెట్టుకొంటూ..

 అనాహత గతి చిత్ర ఒంపులో పడి.. భూమి పిల్లలు కొండలుగా లేచినపుడు ..

ఆ దగ్గర రైలు లోంచి దిగిన పాట.. సిద్ధం చేసిన మంచు చితి.. కుండల కూలిన గది .

తను నేసి తెచ్చిన గొంతుని చుట్టుకొని సొమ్మసిల్లిన కల ..

                                                ……………

అదే ఛాయల మిగులు మన్నింపు .. పొగ చరిచి కంటిలో దూకిన కథకి నేసిన కంటి

చూపుకి .. తెర కట్టిన కల పాటని కట్టుకొంటూ.. నిద్ర నుంచి లేచి.. సముద్రాన్ని

అవలించాక ,, ఉరిమిన హద్దులే చుట్టిన మధ్య రాత్రి కదలికని కాలుస్తూ.. తేరుకోలేని

నిద్ర గర్భం ఊడదీసిన మాయా ముఖాల పట్టుని సడలించి.. కాక పోసిన మధ్య

సమయం అస్థితి నిర్ధార గా ఎదురుపడి .. ఇంకేం తెలియని అరుపుని మింగి..

కథలో మెరిసిన ఇంటిని తిరిగి చేరాలని వదిలి పెట్టిన రైలు పాటని తాగి భూమి లోకి

వెళ్ళిపోయాక.. ఛాతీలో మొదలియాన్ చప్పుడు.. ఏదో తెలియాల్సినదే ఉందని..

కొన్ని నీటి ముద్రల కైపుని వడపోసి.. సుడుల్లో ఇగిరిపోయిన మాటలకి చేరదీసి

మసక భూమి నొప్పిని సరిచేసి .. ఇక ఎప్పటికీ వదలని పాట..

                                             …………………

15.ఇది నేను — మరో నేను లోని తను .. మహా దర్శి

ఇది నా లోపలి ఒక నేనుకి ఇచ్చేసిన నివాళి.. దుఃఖ త్రిమంతన వడపోసి ..

 రంగుల ముద్దలా కడిగిన శరీర నాభికి పొగల చిత్ర కూడలిని జత చేసి..

కలలో ఊరిన కథకి నేసిన దృష్టి చలన ముంపునీ కూల్చి.. ఆ పై నిద్రలో దారి కాచిన

 చావుతో..తను దూరంగా మండపంలో చేతులని చాచి .. ఝాము పోతల కూర్పుని

పట్టుకొన్న గదిలో మరి కనిపించని అకస్మాత్తు భయం కమ్మాక మోసిన మాటలని

నటించుకొంటూ.. చెమర్చిన కంటి దోషం  తేరుకోలేని విపత్తుకి చేర్చిన కథలో పాట..

ఆమె లోపలి చూసినపుడు దేహ కర్షణ చిత్రాల ధూళిని కప్పేసిన నల్ల దుప్పటి జాడలు ..

 పేర్చి వెళ్లిన చావు తెరల వెనక .. అక్కడే పండిన  తను.. నీళ్లు పోసిన లేపిన గొంతు..

మరో నేను లోని తను..విసిగిన నిద్ర సముదాయాల మధ్య కూరిన మాటలని తెరిచిన

 తలుపులతో తోడి తెచ్చిన కలగా ఉండిపోయిన అలుపు..

పడిపోయిన తలలు.. ఊరిపోయిన చీకటి అరుపుల కట్టడిలో మోసి తెచ్చుకొన్న

వేదికలని జోడించి .. కథలకి చేర్చి నిన్యాస శిలగా కాలుతూ .. పొడుగ్గా పేర్చిన చితుల

 మధ్య తనతో కలిసి నడక .. కదిలిన నిద్రపోటుని జత చేసి కూర్చిన

 అడుగులని దాటి పైకి చేరిన మంచు గోళాల ఊటని .. కాటుక నవ్వుతో వదిలి..

అటు వేపు సముద్రంలోకి కథని లాక్కొని నిద్రని పోసి  తోసేస్తుంది.

…………….

మరో నేనుకి చేదోడుగా ఉండిపోయిన పాటకి .. ఇంకో శరీరం చేర్చి కట్టిన శంఖాల దండ

 మోగుతూ .. సమర్ప మంతనాల మధ్య కదిలే నిద్ర రూపు కెరటాలని అదిమి

అదే కథకి నొప్పి గుచ్చినా చెట్ల పక్కాగా మృత్యు ఊయల ఊపులో తను..

ఆ నేనులో పాడిన నా పాట,.. కదలిక నిత్సర్గ అదుములో పోసుకున్న కునుకు నిద్రల

గంటకి చేర్చిన మాటల వెనుక …రంగుల మంట సిద్ధం చేసిన పాట..

మంగళ పూర్ణంలో మహాదర్శి కదిలిన పుట్టుకలని కప్పుకొని.. నిద్ర విడిచిన కంటితో

 పాటని చేరుకొని.. అదే నిధిని తవ్వుతూ పోయే దుఃఖ నడపు కంటికి చేరిన కదలికని కట్టి

 పెట్టి ..ఓ సన్నని శబ్దాలు కలిసిన స్పూన్ల చప్పుడు.. తన ఎంగిలిని తింటూ ,,

మసక భూమి హారతికి చుట్టిన కలతో .. పండిన నా ఇల్లు.. వెనక బావిలో నిద్ర ..

కలత రాత్రి ఊగిన నాలుగు గదుల గొంతుని చేర్చిన చీకటి అరుస్తూ.. సరిచెయ్యని

నిద్ర దోషపు గొంతులో .. నిర్మాణ ఊపుని సరిచేసిన నడకలా దుఃఖ జల మొదలై..

కదిలే నిద్ర ఝాము తాఖీదులని చేర్చిన కంటి మసకలో ఊదిన పాట. ఇంకా అలాగే

మరిన్ని పెద్ద రాత్రుల కైపుని నిందించి కలిసిన శరణు మాటల మధ్య పొగ మోసిన

భద్ర సందడి చేయాలని కలిసి.. సంధికి దొరకని విపత్తు కథకి రెండోసారి నీరుని

ఇచ్చి దాటిన పోలికల మధ్య తను ఏం తెలియకుండానే  పూర్తిగా మార్చేసిన పాట ..

…………..

నిగ్రహ కేకలని సరిచేసే నిద్ర స్పరిత మహా మాయత కలలోయల్లో పొగ చేర్చిన పాటలు..

 ఇంకిపోయిన సముద్రాల చీకటి కింద .. కాగడాల గుట్ట వెలిగిన దీపం..

మహా విశ్వం కన్నుగప్పిన దోసిలిలో పడి.. ఇసుక కొండల అలసత కప్పుకున్న

మంచు కావెడ దారిలో .. చల్లని గుహల నెమ్ముని కప్పుకున్న నడక ..

రెండో ఊపిరి కొండ మోసిన కెరటాల జడని గుప్పిన దేహాల ముంపు..

మహా దర్శి తానే .. ఒక ఆధార తీగ ని సాగదీసిన కంటి చెరకు గొలుసుని సాగదీసి

వేలాడుతూ.. అంపక మందలింపుని కూల్చిన కట్టడి రాతల నొప్పిని అరగదీసి ఏడుస్తూ..

 అదే సరికి చెయ్యని సమయ గుయ్యారా రాత్రంలో పడి.. కొంత నమ్మక కూల్చివేతలని

 కడిగి ,, తీరు మార్చిన కథకి గొలుసు తీసిన ఇల్లుని కప్పి.. మళ్ళీ గొంతు ముద్రలో ..

తన పాద ముద్రల తడి చీర చేరి.. ముఖం తుడిచి నిద్ర పుచ్చాక .. అలిసిన దేహపు కల

మహాదర్శి పేజీలు అవేనని.. కాపాడుకొంటూ ముందుకు పొమ్మని..

                                             ……………………

 22.06.2026