
మోక్ష బీజం
1.
సాయం సమయ దర్శన .. తనేం పలకలేదు..
చల్లని ఏకైకం లోని నిస్పృహ … పెద్దగా దీవెనలు.. పలకరింపులు లేని మహా దర్శన శిఖరం కూలిన అవిధేయ నిర్జన .. నేను … నా దేహం … లోపలకి … బయట కంగారులు ఏవీ చేరడానికి సిద్ధంగా లేవు… ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి… చెమట ఒరిసిపోయిన తలకిందుల నిద్ర.. అదీ ఒక శాప సాయుజ్యంలోని పుట్టుక.. ఇది ఇలా ఎలా ఇంత నిర్దయగా మారిపోయిందో..
లోపలనించి .. ఓ సంచి తీసి దులిపి … బుజానవేసుకొని.. రోడ్ మీద.. సెకండ్ హ్యాండ్ బుక్స్ .. ఓ క్వార్టర్ … చిప్స్ .. (కేరళ – ఆంధ్ర నీ కలిపి ).. ఇరానీ చాయ్.. మూసీ మురికిన దాటించే వంతెన పై .. కాళ్ళకి బూడిద.. సెంటు సీసాలు.. మల్లెపూలు.. గర్భం నీలం లోంచి.. లోపలి దూకేసిన చంద్రుడు …మోసపోయిన రాజ రాజ సంతానం కొంచెం గడుసుగా .. శాశ్వతం అవ్వాలని కట్టుకొన్న మహళులు… మురిసిపోయే సమాధులు.. ఒంటరి నడకలా తప్పట్లు.. చిత్రమైన నాగరికత… పైకి .. కిందికి కదుపుకోలేని ఆలోచన … ఎగుడు దిగుడు రాత …
అనేక సార్లు .. భార్యా రోల్ లో విశాలత … చాలా ఖచ్చితంగా
ఓ రచయితగా నీ చుట్టూ ఓ మృత్యు భయం ఆవహించుకొని ఉంది. ఇది పోనేలే నీ లైవ్లీహుడ్ అంటే… అదీ కాదు.. మరి దేనికీ ఇంత నిస్పృహ … నాకు అర్ధమే కాదు.
గొంతులో … ఇంకా కొంచెం కోపం యాడ్ చేసి …. దానినో .. నన్నో వదిలెయ్యి.. నీ సమాధానం ఏదైనా… అది నన్ను నీతో మిగిల్చుకోవడానికైనా… ఇలా అడుక్కోవడం నాకు నచ్చడం లేదు… ఇదే చివరిసారని..అలా అన్నట్టుగా చూసింది
………………….
2.
వాడు నవ్వుతున్నాడు.. వడ్డించాలా అన్నాను..
వాడు వద్దని… అర్ యు రెడీ ఫర్ మేజిక్ అన్నాడు .. నా సమాధానం కోసం చూడలేదు.. అంతా మారిపోయింది… ఆకు పచ్చగా చెట్లు… తీగలు.. చల్ల గాలి .. దూరంగా వర్షం.. మెరుపు.. ఆ లోపలి నుంచి తను కిందికి దిగింది. కాంక్రీట్ ముద్దలని వాంతి చేసుకొన్న నగరం ..ఇప్పుడిలా మారుతూ … అప్పటి నా శ్వాస… ఇప్పుడిలా నల్ల తెర కప్పుకొన్నా నివాళి బొమ్మల కొలువు.
ప్రేమ విరాగి .. ఏడూ ఏళ్ళ దీర్ఘ నిద్ర.. కట్టుకొని నిరాశపడ్డ చీకటి.. ఉన్మాద… ధ్వని స్వయం లోని చెప్పలేక పోయిన మాట .. చేరలేకపోయిన సైగలు.. తను ఓ కొత్త నిద్రని చేరుకొని నన్ను దూరం పెడుతుంది.. ఎవరూ కనపడరు.. నుంచుని స్పృహ తప్పుతాను. రెప్పల కింద అదిలించి పోతున్న స్వర్గం …
రాత … నా శ్వాస .. నిశ్వాస .. కనిపించని చీకటిలో శతాబ్దాలుగా నలిగిపోయిన నా ఆయుస్సు.. కొంచెం కొంచెం కొరికి పోతున్న జన్మ ధారలోని నివ్వెరపాటు. విడిగా నేను లేను.. కలిపితే నువ్వు నాతో ఉండవు.. ఇక కలిసి ఉండడంలో ఏ అర్ధమూ లేదు.
ఇద్దరమూ స్పష్టంగానే ఉన్నాం.
…………………
3.
అంత్య క్రియలు జరుగుతున్నాయి.. Friend వి .. ఇంకా అంతా వయసు అనలేం .. కార్డియాక్ అరెస్ట్ … ఏం చేస్తాం … అలా చావు రాసి పెట్టి ఉంది .ఎవరం ఆపగలం.. అని దూరంగా ఎవరో అనుకొంటున్నారు.
అందరూ వెళ్ళాక .. వాడు దూరంగా నవ్వుతున్నాడు.. చెవి దగ్గరకొచ్చి … నువ్విక్కడే ఉండు.. వాళ్ళకి తెలియకుండా … అన్నాడు.
రాత్రి పొద్దుపోయాక… ఓ సమాధిలోంచి.. రాజీవి .. ముప్పైయేళ్లు … నేను లేవబోయాను.. ఆమె సైగ తో . ఎందుకు ఆ కంగారు.. కావాలంటే … నిన్ను యవ్వనంలోకి లాగెయ్యగలను… అంది
సంపత్ ఎలా పరిచయం ? వాడి దృష్టిలో పడ్డావంటే .. నువ్వు చాలా ప్రతిభావంతుడివి.. ఒంటరివి అయ్యుండాలి .. అంది.
నేను వినయంగా.. ప్రతిభ సంగతి నాకు తెలియదు… ఒంటరిని… వాడు ఎలా పరిచయం అనేది … నాకు అసలు ఎంత గుర్తు చేసుకొందామన్న గుర్తుకు రాదు… అన్నాను.
పోనీలే …నీకు అన్నాను.
ఆమె చాలా సేపు సైలెంట్ గా ఉండి .. అక్కడున్న పడున్న .. ఓ పాత అద్దం లో ఎవరినో చూపించి ..
హి ఐస్ మై హస్బెండ్ అంది. వదిలేశాడు.. అదీ .. చెప్పా పెట్టకుండా ఏటో వెళ్ళిపోయాడు… నేను సూసైడ్ చేసుకొన్నా … వాడితో చాలా భాద .. కానెందుకో వదులుకోలేం.
…………………….
4.
వాడు పొట్ట పట్టుకొని నవ్వుతూనే ఉన్నాడు..
నేను సీరియస్ గా … ఇఅం వెరీ సీరియస్ ఇన్ ఠిస్ మేటర్ అన్నాను..
వాడు నవ్వు ఆపి… ఇది సృష్టి విరుద్ధం.. అన్నాడు
నా బాల్యం ఓ అనాథలా గడిచింది.. నా కొడుకు బాల్యాన్నైనా నేను చూస్తూ గడపాలనుకొంటే … తన సొంత ఆస్థి అన్నట్లు తీసుకు పోయింది… తనకి మాత్రమే వాడేలా చెందుతాడు … మగాడు ప్రసవించగలగాలి.
నువ్వు దీనిని పై వాళ్ళ నోటీసు కి తీసుకు వెళ్ళగలవా? అన్నాను..
ఆమె ఏం చెప్పకుండానే గుక్క పెట్టి ఏడుస్తుంది. వాడు నా బిడ్డని తీసుకెళ్లి ఎక్కడో బ్రోతల్ హౌస్ లో అమ్మేసుకొన్నాడు.
…
5.
మర్నాడు లాంటి కొన్ని రోజులు గడిచాక … అటు పక్కకి జరిగిన నిద్ర రాశుల లోంచి ఉలిక్కిపడి లేచినపుడు అంతే సంబరంగా … 25 ఏళ్ళ కొడుకు ..నరేంద్ర … ఎదురుగా… ఓ రకమైన సౌష్టవం.. భార్య పోలికలు .. నావి ఎక్కడ దొరకడం లేదు… నా కోరిక అదే .. నాలా వాడు ఎక్కడా ఓడిపోకూడదు.
నాకేం చెయ్యాలో అర్ధం కావడం లేదు.. శుభ్రంగా ఉన్నాడు.. కౌగలించుకోవాలంటే నా శరీరం నుంచి బూడిద రాలుతున్నట్లు.. వాడూ అందుకు సిద్ధం లేడు. ఏవో ఫార్మల్ సంతకాల కోసం వచ్చాడు. అంతకుమించి నథింగ్ స్పెషల్ .. అసలు మాకు చట్టపరమైన విడాకులంటూ రాలేదు. వాడి వీసాల కోసం నా సంతకం … ఓ చోట mandate అనుకొంటా.. వాడికీ .. దస్తావేజులన్నీ చూపించాను… వాడికే హక్కులు రాస్తూ..
ఇదంతా ఇప్పుడెందుకు … నాకు ఇవన్నీ ఏవీ అవసరం లేదు..మీరు ఇంకేదైనా చేయాలనుకొన్న మీ ఇష్టమే … ఇప్పట్లో ఇండియాకి రాదల్చుకోలేదు…గూగుల్ లో టీం లీడర్గా ఓపెద్ద ప్రాజెక్ట్ అసైన్ చేశారు..
అమ్మ ఇక వారణాశిలోనే.. ఆమెకి రావాలనిపించినపుడు నా దగ్గరకి వస్తుంది..
మరి పెళ్లి … అన్నాను ( కొంచెం లౌ వాయిస్ తోనే.. )
వాడు పెద్దగా నవ్వాడు… దాని పట్ల నాకే గౌరవం లేదు. ఇష్టం .. ఆకర్షణ ప్రస్తుతానికి ఏం లేదు. ఓ వేళ కలిగితే మీకు చెబుతాను.. లేకపోతే ఇక లేనట్లే..
వాడు వెళ్ళబోతూ … వెనక్కి వచ్చి… అమ్మ ఎప్పుడు మీకోసం చెడ్డగా ఏం చెప్పలేదు.. నాకు మీకు చెప్పడానికి ఏం లేదు… అమ్మ ఫోన్ నెంబర్ మీ వాట్’స్ అప్ కి సెండ్ చేసాను. వెళ్తూ… వెళ్తూ .. కొంచెం అటు పక్కకి ముఖం తిప్పి … కాళ్ళకి నమస్కారం చేశాడు.. నేనది ఊహించలేదు. పైకి నేను లేపగానే … కౌగిలించుకొన్నాడు.
……………………………
6.
ఆమె తన కొంగు కప్పి పాలు పట్టిస్తుంది. పెద్దగా తనేం పరవశం లో లేదు… అదే అడిగా .. నువ్వు కొన్ని పోస్టర్స్ ని శాశ్వతాలుగా చూడకు… వాడు ఒక్కోసారి కొరుకుతాడు కూడా…
నాకు ఒకటే భయం… నీ ప్రేమ మొత్తం … వాడిలోకి వెళ్లిపోయి … నాకు కేవలం పిప్పిగా మిగులుతావని…
ఆమె నవ్వి… అనంతం లోంచి కొంచమే మనం అందుకొనేది. నేను ఇంకాస్త లాక్కుకొంటాను నీ కోసం..
తను మాట నిలబెట్టుకోదని నాకు ముందే తెల్సు.
ఇక కాపాడుకోవడం జరగని పని… అన్నీ యుద్ధాలే… తెగిన వంతెనల దారాలే..
సినిమా ప్రేమలా నీకు కావాలి.?.. అంది.
నేనేం మాట్లాడలేదు.
తిరిగి తనే … కోర్ట్ ఫార్మాలిటీ ఎప్పటికైనా జరగనియ్యి…కానీ నేనిప్పుడే వెళ్లిపోతున్నా.. అంది.
అవేం చేస్తాయి… పనికిమాలిన బయట సలహాలు ఏ పెద్ద విపత్తుని అర్ధం చేసుకోవు.
…………………
7.
కొన్ని పడవలు … చెక్క ఇల్లు… కొండా… నది… మర్రి చెట్టు దగ్గర చెక్కిన శిల్పం.. దండ కడియాలు.. పటికబెల్లం నీళ్లు. కంటిలోంచి జారిన చీర … సాంబ్రాణి పరిమళంతో చనిపోయిన ఆఖరి గది… నేల నుంచి పైకి ఎగిసిన నిలువెత్తు కౌగిలిని తడుపుతూ … విషాద నిద్ర సంధిని రాల్చుకొన్న నైవేద్య సన్నాహం.
అక్కడ బొట్టుని కొంచెం దిద్ది అటు పక్కగా వెళ్లి … దుప్పటి పరిచాక.. విశాలత….
నేల నుంచి పైకి ఎగిసిన నిలువెత్తు కౌగిలిని తడుపుతూ … విషాద నిద్ర సంధిని రాల్చుకొన్న నైవేద్య సన్నాహం. నాకు అర్ధమవడానికే తన గమన చుట్టూ వారణాశిని తీసుకొస్తుంది.. నువ్వేం చెయ్యాలనుకొన్నావ్ … అనేది .. చాలా పెద్ద ప్రశ్న. దానిని మనం జాగ్రత్త చేస్తూ … ఇంకా కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు ఇదంతా ఏం వద్దులే అని రావాలన్న … తనేం అది అడగడానికి రాలేదు..
కొడుక్కి ఇంజనీరింగ్ జాయినింగ్ ఫీజు కోసం …. తీసుకోవడం ఐపోయిన … అప్పటికి వారం … వెళ్తానన్న మాట లేదు. నాకు ఏదీ గట్టిగా చెప్పడం రాని మొహమాటం.
వాంఛ … మనకి తెలియని రంగుల రాట్నంలా తిరుగుతూ .. ఎవరి ముందో ఆగుతుంది.. వాళ్ళు ఒకసారి తట్టారని …. తలుపు తీసాక లోపలికి వస్తే … ఇక మన పైనే వాళ్ళ అధికార దర్పం మొదలవుతుంది..
కొడుకుకి మనకి తెల్సిన వాళ్లలోనే మంచి సంబంధాలు ఉన్నాయి.. కొన్ని ఫోటోలని స్క్రోల్ చేస్తుంది మొబైల్ లో… నాలిక తో పెదాలని తడుపుకొంటూ … చిత్రంగా మెరుస్తున్నా ఆమె కళ్ళు…తనేదో పడిపోతున్నది పట్టుకొని కాపాడుతున్నట్లు… కంటి చివరలోంచి ఓ పల్చని నల్ల నవ్వు రాలుతూ … నేను ఉలిక్కిపడి సర్దుకొని … కోపంగా చూసి … ఈ drama ఇక అవసరం లేదు… వాడు చాలా క్లియర్ గా ఉన్నాడు.
వాడు కొన్ని ఫార్మల్ signatures కోసం వచ్చాడు.. దానిని నువ్వు అంతకంటే పొడిగించొద్దు.. నువ్వు తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపో… ఇప్పుడే… రేపు నేను ఎటుపోతానో నాకు తెలియదు.. ఇంకా Money ఏదైనా అవసరమైతే … నాకొక మెసేజ్ పెట్టు అంతే…
తనకి చెప్పాల్సింది ఏదో ఉంది.. అది తన గతమైతే నేను వద్దనే అంటాను… అక్కడే కూలిపోతున్న మృత్యు దోషాలు గడ్డకట్టి ఏడుస్తూ … ఒక పగలు.. ఒక రాత్రిగా ఉండిపోనీ మసక బరువు చెలగాటంగా లేవదీసుకొన్న ముహూర్త ధ్వని కప్పెట్టుకొన్న కొంచెం నిద్ర చాటుగా హద్దుని పెట్టుకొని … అక్కడ తన కన్నుని భద్రం చేస్తూ మరింత తడి రాశుల అనుమానం ఎగిరిపడుతుంది.
………………………………..
8.
ఇద్దరమూ వారణాశిని ప్రేమించిన వాళ్ళమే .. సూర్య హృదయం పుట్టుకని దర్శించే స్థలం.. ఆది దర్శన … సామ్య ఆయుర్ధాయం లోని కనిపించని కడసారి నివాళి… కొత్తగా ఎప్పటికప్పుడు … ఎన్నిసార్లు వెళ్లినా … ఆ కాష్ఠ మునకలు… పడవల ఊరేగింపులో రాలిపోయిన మసక నిద్ర .. కొంచెం గడ్డ కట్టినపుడు … నది పై నడుచుకొంటూ వెళ్తే … సన్నాయి ఉత్సావాల కొండా మనలోని పలకరిస్తుంది… నా బిక్ష పాత్ర అక్కడే నిండి… ఆ తర్వాత ఆమె ని అడగడానికి ఏం మిగలలేదు..
పలకరిస్తుంది… నా భిక్షాపాత్ర అక్కడే నిండి… ఆ తర్వాత ఆమె ని అడగడానికి ఏం మిగలలేదు..
ఈ భౌతిక దేహం నిండా కాష్టం కాలే వాసన… అంతే … అదేగా స్పృహ..
ఎప్పుడో ఒక్కసారనుకొంటా గట్టిగా నిలదీసింది.. ఎందుకింత … ఎన్నో సత్యాలు … అందులో మృత్యువు కూడా ఒకటి.. అదెలాగూ ultimate డెస్టినీ.. దానినే పదే .. పదే .. తల్చుకోవడమెందుకు ?
ఇంతటి నిస్పృహ … నా బిడ్డని కడుపులోనే విషాదం తో నింపేస్తుంది…life అదొక సెలెబ్రేషన్లా ఉండాలి… నీలో ఎప్పుడూ … ఆ లాస్ట్ డిపార్చర్ కోసమే… ఎదురు చూస్తున్న వాడిలా ఉంటావ్.
……………………………
9.
సుమారు పాతిక ఏళ్ళ తర్వాత …
తను దశ శతాలని మోసిన శిధిల స్వరాలని వదులుకొన్న దేహంలా చాలా అలసటతో ఉంది… గంగ ప్రవాహానికి ఎదురీదిన ఉత్త్సవ సంధితో కలిసిన దీర్ఘ వీధిలా ఉంది..
నేను దగ్గరికి జరిగాను… ఆమె కొంచెం బరువుగా రెప్పలని ఎత్తింది.
నేను మాట్లాడాల్సింది ఉంది… వేదిక పై… టైం అవుతుంది వెల్దామా ? అంది.
నేను సరిచెయ్యని ఏకైక చీకటి స్వరంలా … మెళకువలోకి కదిలి … తల ఊపాను..
ఆమె గుడి దగ్గర ఆగలేదు… సందడి కురిసే చోట ఆగలేదు… నేరుగా ఘాట్లని దాటి ఓ మర్రి చెట్టు దగ్గర … ఆమె కై ఎదురుచూస్తూ… పారిశుధ్య కార్మికులు… కాటికాపరులు… ఇంకా కొంతమంది … చావు సన్నని సరిహద్దులో ఉన్నవారు… అక్కడే ఆమె ఆగింది.. నాకు దేనికో ఆ క్షణం అర్ధంకాలేదు.. అది నేను ఏ మాత్రమూ ఊహింగలిగేది కూడా కాదు.
ఆమె వాళ్ళ వివరాలని తన లాప్టాప్ తో ఏదో వెబ్సైటు కి ఆన్లైన్ లో కనెక్ట్ చేసి… ఒక్కొక్కరిని వివరాలు అడిగి ఫిల్ చేస్తూ… ఎంతమందికి నిజంగా మంత్లీ సపోర్ట్ కావాలో అంచనా వేస్తుంది… అలా కొడుకు సాఫ్ట్వేర్ ప్రోగ్రాం డెవలప్ చేసి ఇచ్చాడు…
వాళ్ళ ట్రుస్టుకి ఉన్న ఫండ్తో ఎంతమందికి అప్పటికప్పుడు చేయలేదో అంచనా వేసుకొంటూ … కొంతమంది స్టేటస్ ( సుమారుగా ఉన్నవారికి రిజెక్ట్ చేస్తూ) అప్పటికి అప్పటికి ఎంతమందికి చెయ్యగలదో చెబుతుంది… మెడికల్ , ఎడ్యుకేషన్ .. కొంతమందికి పెన్షన్ లా … ఆ తర్వాత తెల్సిన విషయం …
ఆ ట్రస్ట్ తల్లి కొడుకుల ఇద్దరి సంపాదనతో మాత్రమే నడుస్తుంది ఇప్పటి వరకు.. ఇప్పుడే కొడుకు అబ్రాడ్ లో దీని గురించి ప్రచారం చేస్తూ … ఫండ్ collect చెయ్యడానికి try చేస్తున్నాడు… నాకు ఓ ఫారం ఫిల్ చెయ్యమని చెప్పి… మంత్లీ drive కి కొంత ఇమ్మని…. నా ఆస్తినంతా trustకి ఇచ్చేస్తున్నట్లుగా … సుమారు వేల్యూ mention చేసి అప్లోడ్ చెయ్యగానే … వాడి నుంచి ఫోన్… థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ డాడ్ అంటూ…
………………………….
9.
అక్కడే ఆమె ఆగింది.. నాకు దేనికో ఆ క్షణం అర్ధంకాలేదు.. అది నేను ఏ మాత్రమూ ఊహింగలిగేది కూడా కాదు. అప్పటికే ఎంతమందికి …
రాత్రి వచ్చేసరికి పొద్దుపోయింది.. ఎవరో వచ్చి .. నాకు ఆలౌట్ చేసిన రూంలో luggage పెట్టామని .. రూమ్ చూపించారు.. మరెవరో భోజనానికి వెళ్లాల్సిన డైనింగ్ హాల్ చూపించారు.. తినాలనిపించలేదు.
మేడం… పై ఫ్లోర్ లో ఉంటారు.. అది ఒక రేకుల షెడ్ అంతే … అక్కడే ఏం ఫర్నిచర్ ఉండదు.. చాప … కుండ.. దుప్పటి.. బయట బాత్రూం అంతే .. అదీ చాలా చిన్న రూమ్.. ఆమె అలానే ఉంటానంటారు… ఎవరు చెప్పినా వినరు. ఆవిడ పర్సనల్ విషయాలు మేమెప్పుడూ అడగలేదు… ఆమె చెప్పనూ లేదు.. అలా ఇచ్చుకొంటూ పోతున్నారు… తల్లి అలా ఉంది ఏజ్ అని అనుకున్న … కొడుకూ అంతే … అంత యంగ్ ఏజ్ లో ఆ క్లారిటీ అర్ధం కాదు. IIT టాప్ ర్యాంకర్ .. గూగుల్ top పోసిషన్ లో ఉద్యోగం… మిగిలిన టైం అంతా దీనిపైనే..
నాకు పైకి వెళ్లాల్సిన కారణం కనిపించలేదు.. పెద్దనాన్న డాక్యుమెంట్స్ కొరియర్ చేసాడు. మూడు రోజుల్లో అందాయి… లీగల్ ఫార్మాలిటీస్ complete చేసి..ట్రస్ట్ కి హ్యాండోవర్ అవ్వడానికి ఓ వారం పట్టింది… ఈ వారం లో తనని ఓ మూడుసార్లు చూడగలిగాను.. ఆమె కి అనేక షెడ్యూల్ అఫ్ మీటింగ్స్ …ఫండ్ రైసింగ్ … స్కూల్స్ , హాస్పిటల్స్ తో డిస్కౌంట్ ఫెసిలిటీ తో టై అప్ … ఇంకా అనేకం..
ప్రతి శనివారం మాత్రం అక్కడే … ఆ మర్రి చెట్టు దగ్గరే… అప్పుడు మాత్రమే ఆమె నన్ను పిలుస్తుంది.
నా గురుంచి ఎవరూ ఏమి అడగ లేదు.. నేను ఎవరికీ ఏమీ చెప్పాలేదు.
………
10.
మరో వారం గడిచింది… వారణాశి రోడ్లు.. పడవల్లో ఘాట్ల దర్శనం… హారతి దిద్దిన రాత్రులు.. గంగా కుళ్ళిన పొట్టతో … నొప్పి తట్టుకోలేక గగ్గోలు పెట్టడం.. కళ్ళు అలిసిపోయేటన్ని శవ జాగారా నిదర్శనాలు.. ఒక్క శనివారం రెండు గంటలు .. అదీ నా అవసరమనేదిగా ఏం లేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి ఏం మిగలలేదు. వాడూ మళ్ళెప్పుడూ ఫోన్ చెయ్యలేదు. ఆమె ఎప్పుడు మాట్లాడింది లేదు.
నాకు ఏదో అర్ధమైపోయింది. ఒక ఖాళీ పాత్రగా మారిపోయానని.. దానిని ఇక్కడకొచ్చాక బోర్లించి పెట్టేసారని .. ఇక ఏ నిమిత్తము కనిపించనే లేదు..
ఆ రోజు నిండు పొర్ణమి… కొంచెం నేర్చుకొన్న విద్యతో అక్కడున్న ఓ పాత .. బెస్తవాళ్ల పడవ… నదిలోకి అతి కష్టంతో లంగరుని విప్పి… వదులుతూ … అందులోకి దూకి … ప్రవాహo మధ్యలోకి చేరి .. తెడ్డు విసిరేసాను … నేను దూకేసాను.

