శిధిల విశ్వధుని

                                                                    శిధిల విశ్వధుని

Download Free Ebook
Download Now

శత విధాలా నలిగే యుద్ధం.. విసిగి వేసారే శారీరక శక్తులు..ఊగిపోతున్న మంత్రం దండాలతో పైకీ కిందికీ చేరి ఊగిసలాడే మానసిక స్థితి… కనపడని పదార్ధం.. విశ్వ నిండా కరిగిపోయిన దేహంలోని క్రియా శాపం.. విశ్వాస క్రియ … సంతులీన మైధునా గతుల గండం.. ఇంకా ఉంది.. ఐనా లేదు… తను తనతో ఉందా? తను ఎవరితో ఉన్నప్పుడు తను ఆమెతో ఉన్నాడు.

ఆమె ఎవరితో ఉందో అది ఏ మాత్రమూ కదలని ముద్దలా మట్టిగా విశ్వాస నీలంలోని సాపేక్ష దృష్టి మంత్రాలని పేనుకొంటూ లోపలకి జరిగి నిజమైన సంతులన సవ్వడి ముఖాలతో తిరిగి మాట్లాడుతూ … మరిగించే శ్వాస మితిని సరిచెయ్యని విసుగుని జల్లించి … అడుగులకి ముసిరిన గొడుగుతో రాల్చిన సంగీత ఆహారహా నిద్ర బాణీలు మోసుకు తిరిగే వంపులో పరోక్ష నిర్దార కన్నుకి చెలమని తవ్వారు….. తత్ క్షణం దానిలోంచే  ఓ సముద్రం పుడితే…..

మ్యూజిక్ అంత పెద్ద obstacle  ఎలా అవుతుంది… ? దీని నుంచే తనని చేరినపుడు.. తనపై నేను  దేనికీ ఆధారపడనప్పుడు… ఏ కలల నిండు అవస్థనీ తాగి తూలనపుడు.. సరి చెయ్యని బట్టని వదిలేసి రెండో గదిని పాట నులిమి తాగేస్తూ దీర్ఘ నిద్రల ముఖాన్ని పోతపోసి ఊర బెట్టిన నిద్ర మూర్తులతో రేగుతూ ఆలోచనని ముక్కలు చేస్తుంది.  ఇంకెలా దీని existence ఇబ్బంది తీసుకు వస్తుంది.? అసలీ మూడు ముఖాల వెనుక . నాలుగు దిక్కుల వెర్రి కేక ఎవరిది?

అంకితమైపోవడం ఎవరు ఎవరికీ? ఉనికి మాత్రమే ఆకర్షించేదిగా ఉంటే అదే ఉనికిని .. ఆ signature ని వదిలేయమంటే ఎలా?  అసలు.. శాసనం ఎట్లా ప్రేమ?

……………………………

ట్రైన్ ఖూర్గ్ చేరుకొంది.. దేవుడి కలలని ఆరబెట్టే నిద్ర కథల సంక్షేప ముడిని సళ్లించి … వెలిసిన దుఃఖాల నిద్ర రుజువుని సానబెడుతూ … రూప నిందల మిగులు వడపోసిన స్వర్గ నివాళి.. కేరళ.. ఓ పక్కన అందంగా దిద్దిన పుట్టు మచ్చ … ఖూర్గ్…  luggage తో viswadhuni  దిగేసరికి ఎదురుగా వాసుకీ.. 35 ఏళ్ళ వయసుకే ఎన్నో చూసేసిన ఒక నిర్లజ్జ తన స్త్రీతనమేదో విసుగ్గా మోస్తున్నట్లు.. కళ్ళని నిదానంగా ఉంచదు.. ఉంచితే ఆమె సవరించిన అలజడిని మనం పెట్టుకొంటే అలాగే మోయనూ లేం.. మాటలు కొంచమే.. స్పష్టంగా.. రాజీ లేకుండా.. సూటిగా .. పాల గిన్నిలోకి రాలుతున్న తెల్లని మంచులా ..తన  లోపల ఏం జరుగుతుందో కనపడదు. …

… … ఆ అర్ధ రాత్రి కారులో వెళ్తూ ఉన్నప్పుడే .. తనింటికి చేరేలోపు… మధ్యలో… సందర్భ శృతి దాటి నా లోపల అవలీల మంత్రమేదో కదులుతూ.. శ్వాసలో కలిసి తోడుకొని.. సవరించిన విస్వకీయ మూర్తుల దీర్ఘ గుప్పింత ఊగే .. చర్మ మాయంలో పడి కొట్టుకొని ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగే ఆ కంటి తూగుని వాసుకీ .. తాగి… అప్పుడే మొదలైందా అన్నట్లు చూసినా.. ఆ కొండా . పైన చిన్న నీటి కుంట లో పౌర్ణ చంద్రుడు… కింది వెదురు తోట నుంచి మురళీ నాదం… వాసుకీ ఇంకా నాకేం చెప్పక్కర్లే .. అన్నట్లు… కారు ఆగింది.. ఆ కుంటలో ముఖం కడుక్కుని .. ఆ నీళ్లు తాగి.. ఫ్లూట్ బయటకి తీసాను .. విశ్వ సాక్షి .. నిండు వరాలతో దీర్ఘ చలన మృతువుని లేపి.. నిశ్వాస ధుని మధ్యం లో కలలని నూరి.. నూరి.. సంభోగ వికులత మూర్చనల గర్భ దోష పరిశ్రమని వేలాడదీసిన చీకటి ఆనవేత్తలని కాల్చి.. రక్షించిన నిద్ర వార్పుల సహకార కీల భగ్గుమని .. ఇదే నిర్ణయ ముద్రలీలగా మొదలయ్యే సంగీతం. ఓ పాము కాసేపు మాకు దగ్గరగా వచ్చి మళ్ళీ వెళ్లిపోయింది. వాసుకీకి అన్నీతెల్సు.. విశ్వధుని అనే పేరుతో నేను మొదలు పెట్టిన సంగీతానికి మొదటి శ్రోత.. విమర్శుకురాలు.. విచక్షణీయ దారి గతిని నాకిచ్చి కూడా ఎక్కడ ఆ విషయం చెప్పని అభిమాని… మేమాగిన ఆ చోటు … అదొక చీకటి సామ్రాజ్య అడ్డా… అన్నీ రాత్రి శక్తులే.. అక్కడ హింసా విహారం చేసి కడుపు నింపుకునే ప్రమాదాల కూడలి… ఐనా తెల్లార్లు..  ఏమీ అనలేదు. తెల్లార్లు అక్కడే ఉన్నాం.. ఎవరూ అటు ఆ రాత్రి రాలేదా .. లేదా మమ్మల్ని విని వెళ్లిపోయారా ?

ఉదయం ఇంటికి వచ్చాక నిద్ర పోయి మర్నాడు… ఉదయం లేచే సరికి .. వాసుకీ ఆ రాత్రి రాగాన్నే ప్రాక్టీస్ చేస్తుంది. నేనెప్పుడూ ఏదీ ప్రాక్టీస్ చెయ్యలేదు.. ఆ క్షణం నాలో కదిలేదే నా సంగీతం..పలుకక పోతే అదే ఆఖరి రోజు.. ఈ భూమి తో నేను కూడా శెలవు తీసుకొనే రోజూ అదే.. నిన్న నాది … ఈ రోజు ప్రవహించి వెళ్లిపోయింది.. రేపు.. నేనుంటానో లేనో తెలియనప్పుడు.. ఇప్పటి నేనే నేను… అది మాత్రమే నా సంగీతం.. విశ్వం నిర్జించిన మృత్యు నాదంతో శ్రేయా గతిని నమ్మి.. కదన మూర్తి నర్తించే జ్ఞాపక నివాళిలోని .. సదా కాల్చి నిశ్వాస మితిని పగలగొట్టి.. నేసుకొన్న కలల దాపుల్లో.. కంటిమోడు దిగబడ్డ నిద్ర శాపిత సహాయ మంత్రం.. సంగీతం.

వాసుకీ అన్ని వింటుంది.. ఏ నోట్స్ రాసుకోదు… కానీ ఒక్క రోజులో దానిని తిరిగి ప్లే చెయ్యగలదు. నీ ఇండివిడ్యువాలిటీ ఉండాలిగా అంటే… చందమామ ఎవరికైనా ఇష్టమే కదా ? అంది.. ఓసారి..

ఇక నేనెప్పుడూ ఏం అనలేదు.

……………………………..

ముందు ఎన్నిసార్లో అడిగితే.. ముక్కలు ముక్కలుగా తను చెప్పిన మాటలని కలుపుకొంటే.. వచ్చే సమాధానం ఇలా … అదీ ఒక నిరశన పెనవేసుకున్న మాత్రికా మూర్తుల గొంతుతో..

ఎన్ని ఏళ్ళ తర్వాత … ఆయన వదిలేసాక .. దారి తప్పిన సందర్భ స్మృతి తీవ్రాల నిద్ర సగంలో ఓ గుక్క..అది సంగీత మృతిగా గొలుసుకట్టు మాటలని పడదోసి .. ఏది వెనక .. ఏది ముందు.. స్థితి ముంపులు లేని దీర్ఘ సవరింతగా కదిలే మహా సమాధి ముందు నలిగే దేహ తాళాలు బిగించిన చీకటి .. పురుష ప్రవేశ తెగతెంపులు… నువ్వసలు నువ్వీ పెళ్లనే format లోనే ఇమడవు.. నీ సంగీతం గోలతో .. ఇప్పటికిది మూడో ఇల్లు…ఇంకెన్ని పడ్డం.. ఆఫీస్ నుంచి … నేనే పిల్లల ఆచూకీ చూసుకోవాలంటే ఎలా? అలాని నిన్నేం అనడం లేదు…

.ఆమె లోపల విస్పుల్ల మాయ గా గతి తప్పిన నిషా ముఖాల శూన్యంలో పడి తలకిందులై .. శరీర ముంపుల నిద్ర కెరటాలని నెట్టుకొంటూ .. పడదోసుకొన్న గట్లని దాటి .. అప్పగించిన మెట్ల ఒంపుని కడిగి .. దేహ ఖాళీలు నేసిన ఉత్త్సవ కంటి ముడిని వాదులు చేసి… దృశ్యం పరిచే చిత్ర మోక్షణ ద్రవం పట్టించిన కలలని చిలికి.. సంగీతంగా లోపలి సర్దుతారు.. ఆమె ఏదో అనుకొంటుంది .. అటూ ఇటూ నడుస్తుంది.. ఈ లోపు ఏదో కృతి ఆమెలో పురివిప్పుకొని.. గొంతులో కాళీ .. చీకటిలోకి వాల్చి.. మాటలని సరి చేసి.. ఇంకిపోయిన దీప పాయల్లో ఓ దీవిలా దూరం జరిగిపోతుంది.

పెళ్ళికి ముందు నువ్వేదో చెప్పావ్… కానీ నీ చుట్టూ ఉన్నవాళ్లు నన్ను మరోలా నమ్మించారు.. ఒక్కసారి పెళ్లి … మొగుడు.. పిల్లల్లో పడితే .. ఆ పనికిమాలిన సంగీతం గోల వదిలిపోతుందని… కాని జరిగింది.. వేరేగా ఉంది..  కోర్ట్ నాకే పిల్లలని అప్పగించింది.. భరణమన్నారు.. ఆత్మ లోపలెక్కడో గోల చేస్తుంది.. ఇందులో కాదనడానకి ఏం లేదు… రాజ్యాంగం కల్పించిన హక్కు … ఏది వస్తే అది రానియ్యని.. వద్దనడం అతనికీ రిస్క్… నీకూ ఎంతో కొంత ప్రొటెక్షన్….

ఓ two ఇయర్స్ అంతే.. ఆ తర్వాత ఏ భరణమూ వాసుకీ కి అందలేదు.. ఆమె లాయర్ ..కేసు వేస్తే అతనిని జైల్లో వేసారు.. పిల్లలని .. మావయ్య తీసుకెళ్లాడు.. మొదట్లోనే ఫోన్లు.. ఆ తర్వాత పిల్లలు.. అన్నయ్య అందరూ దూరమే.. ఇప్పుడిక నాతో నేనే .. విశ్వ గతి నిర్జన ఛాయల్లో కూలిపోయిన విసుగుతో తన్నుకులాడుతూ .. దీర్ఘ స్థిమితాలో ఉండి కూడా లేకుండా… నిల్చున్న సగం లోంచి కేక పెడుతూ ఒక శూన్య తూలు … అదేదో పోలికని వదుల్చుకొని .. నీటి గట్టు తెగిపడ్డ అపార్ధ సాయాన్ని లోపలనే దాచిపోతారు. 

ఎవరైనా బ్యాండ్ వాళ్ళు పిలుస్తారు.. అదే ఫుడ్.. ఆమెకి ఇంకేదైనా రహస్య మార్గాల సంపాదన … లౌక్య చర్యల వెసులుబాటు అసలే తెలియదు.. ఉన్న దానినే చూస్తుందని కాదు.. ఆమె చూసేది.. మిగతా మూర్ఖులకి అర్ధమయ్యేది కాదు. ఇల్లు పూర్వీకులది.. అదొక్కటే ఓన్ అంతే….

……………………

ఒక పురుషుడిలో అనేక మంది స్త్రీల తచ్చాట.. చేరగలిగిన ఎత్తులో కలబడే నిద్ర రాశుల ముట్టడి..కాచిపోసుకొన్న నిర్ణయ సత్తువలు.. అసలే తెలియని దూరంలో విసిగిన చమురు కాళ్ళు. సవ్వడి వడపోసిన చిత్ర బానిసల రెప రెపల్లో ఊరేగే  మసక నాది చల్లార్చిన కంగారు.. చలన ధూప నడవడిక తెల్లార్లు కాలక్షేప నిద్ర తీరాలని లాగి.. ఇంకేదో పాదాల కూడికకి పూడిక తీసి .. మరో వికర్ష మెరుపులా తీరుని కట్టుకొని .. బొడ్డులో దోపుకొన్న పొగ రేవులు.

నాతో ఉండిపోవచ్చుగా ? అన్నప్పుడు..

విశ్వధునిలో   మరో చెలగాట నిప్పులేం లేవు.. రావు కూడా… అతన రోజువారీ హద్దుల్ని ఎప్పుడో దాటేసాడు. కొత్తగా వీలు చూసుకొన్న నిర్ణయ సంకేతాలు.. ఊడిపోతూ….తత్తరపాటు లేని ఓ గమన రక్షా చలన చోటుగా ఉండి….

పోయింది.. ఈ ఇల్లు .. ఉండడాలు.. వీటిపై నమ్మకం పోయింది.. నువ్విక్కడికి రాకపోయినా నేను మాత్రం నీ దగ్గరకి వచ్చేదాన్ని కాదు.. అదిప్పుడు నాలో లేదు.. నీలోనూ పురుషుడు లేడు కేవలం ఓ కళాకారుడంతే.. ఇళ్ళకి ఇది సరిపోదు. అదేదో కావాలి.. అది ఇప్పటి వరకు నాకే పట్టుబడలేదంటే.. నీకది పూర్తిగా అసాధ్యం.. కాని అదే నీ అర్హత అని మర్చిపోవద్దు. 

వాసుకీ ఎంత స్థిరమైన గొంతుతో ఈ మాట అందంటే .. మరోసారి వెనక్కి పిలిచి చెప్పడానికి సంగీతమూ ఒప్పుకోనంత స్పష్టంగా.. అలా ఉండడానికి ఎన్ని చీకటి రాత్రుల మంధన ఆమెలో జరిగిందో.. అదెంత పెద్ద భూతమై ఆమె పై విరుచుకు పడిందో…

……………………………….

ఇంకా కొన్ని క్షణాలు ఆలస్యమై ఉంటే అంతే … ఎందుకిలా ?

రోజూ నిద్ర పోతూనే ఉన్నవుగా? మళ్ళీ ఈ ఒక్కసారి నిద్ర ఎందుకు?

వాసుకీ ఆత్మ హత్యా ప్రయత్నం .. స్లీపింగ్ పిల్స్ మింగి .. అది అతనికీ కొరుకుడు పడని విషయం.. పెద్ద నాదపు వీధుల్లో కొప్పు చుట్టుకొన్న .. శవ కాపరి ఊడదీసుకొన్న గోచీతో ఒక్క దూకు దూకి .. ఒక నల్ల మడుగు ధూప జల్లెడ చేయించిన పరీక్షలో సమయం జల్లుమని లెంపకాయ కొడుతుంది.ఇది అనర్ధ తాళాల రేవుని కట్టుకొని.. మరింత మునిగిన పొగ కుండగా పైకి లేచి .. రెండు అనునాద మూర్తుల శ్వాస కల్లంలో మాటల నూర్పు.

ఆ జలపాతాల లోపల ఉండే కలల అడితిలో తయారయ్యే మూర్తులు.. పిల్లలు నాకు లేరు.. పురుష రక్షకి ఒప్పుకోలేను.. సంగీత శృతి అంతా వేరెవ్వరిదో.. గొంతు మాత్రమే తనది.. దానిని ఓన్ చేసుకోవడమో ఈ జన్మ కి సాధ్యమయ్యే నేర్పు కాదని తెలిసిపోయాక .. ఇంకే విషయం కోసం ఇలా పొడుగించుకొంటూ పోవాలి.. అసలు ఇంట్లో అంత లెక్కకు మించిన బిళ్ళలేందుకు ? సంగీతాన్ని రక్షించే ఈ క్రియ నిన్ను చావు నుంచి వెనక్కి పిలవ లేదా..?

గజ గజ వణికే శ్వాస.. అదే ఆమె నుంచి అందిన సమాధానం ..

ఇది జరిగిన కొన్ని సంవత్సరాల  తర్వాత మళ్ళీ ఇదే ఆమెని కలవడం.

ఇదొక మయా స్వరత కప్పిన వణుకుని మింగి .. తనతో తనే కదలిక లోపల … ఆ కళ్ళలో ఒక సంపూర్ణత గడించిన అస్పష్ట ఉడకమోతలతో .. తోడు తెంచుకున్న ఉద్రేక రాశుల మధ్యనే రెప్పలా .. గగుర్పు ముడతలా ఉండిపోయిన .. ఊగిపోయిన నిద్ర దీపాల వీక్షణ తీరికలేని అందుకొని ఆ పక్కాగా నిలుచోండి పోయిన జ్ఞాన భూమి ఒంపులు.

………………………

విశ్వధుని 38  ఏళ్ళ వాడు.. జమీందారీ.. బాల్య వివాహం.. ఆస్తులు దగ్గర వాళ్ళ మధ్య మాత్రమే ఉండాలనే ఓ తాపత్రయం.. విశ్వాధుని కి అప్పటికి అదేమీ అర్ధం కాలేదు.. జమిందారీ పోకడలో భాగంగా .. అతనడగగానే సంగీతం లో జాయిన్ చేసిన .. కొద్దీ రోజుల్లోనే గురువు.. ఇతనిలో ఏదో స్వశక్తి సంగీత ధార పలుకుతూ ఉంది… ఇతనికి వేరే గురువు అవసరం లేదని చెప్పి .. జాయిన్ ఐనా రెండేళ్ల లోనే అతనిని అతనికీ వదిలేసాడు. అంటే age మరీ చిన్నని కాదు.. 18 యేళ్ళకి.. ఆమెకి ఓ 14 యేళ్ళ వయసు   ..

స్వముఖి.. చాలా అందం సంతరించుకునే మధ్య దారిలో… సగం చుట్టిన ప్రకృతి గడువుని కాల్చి .. దీర్ఘ వెసులుబాటు లేని సమయ గదిలో కొంచెం మాట తిప్పిన విగ్రహాల తీరుని కప్పుతూ.. అంతు తెలియని మహా సాయాలు కలబడే ముఖం దాచుకొని… జరిగిన నిద్ర తీరులనీ తుడిచి .. కప్పిపోయిన మహా పాదాల సంకెల వదులై .. అక్కసుగా .. గడుసుగా .. నిస్సత్తు ముప్పెనగా .. పైకి పడి.. పూర్ణ స్త్రీలోంచి సగం నరికి.. సగం నీరు పోసి… శ్వాస సాగులో పాలని కలిపి.. నుదిటి తీరుని చదివి..

 ఆస్తి అడ్జస్ట్మెంట్ .. కాపురం అప్పటికి అతనికి 27  ఏళ్ళు .. అతనిలో ఓ ఖచ్చితమైన కళ మొదలై అప్పటికి 10  ఏళ్ళు. అతని చాలా వాటికి ఎంతో వెనకబడిన వాడు.. ఇంట్లోనే అలానే అనుకొనే.. అడుగడుగునా దగ్గరుండిచూసుకొంటూ… హెచ్చరిస్తూ.. దీపం మోసుకున్నా నూనె చేతులని తుడిచి .. చీకటి అలవాటు లేని తొందరపాటుకు గొడుగుని పట్టి… తెల్లార్లు తలుపుని ఊపి.. కొంచెం కూడా కనికరం లేని మనుషుల మధ్యనే ఊపిరాడక అల్లాడుతూ…

కొంత సోషల్ స్టేటస్ కోసం.. ఏదో బిజినెస్  పార్టీనేర్షిప్ అని.. హైదరాబాద్ హోటల్స్ లో.. ఫ్రెండ్స్ ..

కేవలం క్యాపిటల్ ప్రొవైడర్.. ఆ లెక్కల్లో అతను సంతకాలు తప్ప ఇంకేం చెయ్యలేదు.. నేర్చుకోలేదు.. నేర్చుకోవాలని అనుకోలేదు.. ఏదో అలా నిలబెట్టితే .. డబ్బు సంపాదించే రుచి మరిగితే .. లైన్లో పడిపోతాడని… ఆశతో.. కాని జరుగుతుంది వేరు..

మిగతా టైం మ్యూజిక్..

                                                          ……………………………………

అదే క్రమం లో ఎవరో అతనికి వారణాశి వెళ్లి రమ్మన్నారు.. భార్య రావడానికి ఒప్పుకోలేదు.. పుట్టింటికి వెళ్తాను .. నువ్వు వెళ్ళు .. సాధ్య మైనంత తొందరగా వచ్చెయ్యి అంది.. అతను తలా ఊపాడు.. అదొక రహస్య మాయ నాద రక్షా.. విశ్వపు మొదటి శూన్య నిర్యాణ ఋతువుల గుమ్మం.. ప్రవేశశాల కడిగిన నిర్లజ్జ దేహ పంజరం.. ఒదిగిన స్వాధీన శక్తుల మహా వారంలో పునీత దర్శనగా నమ్మే వారణాశి.  క్రమం లేని మృత్యువులా ముక్కని తోడుకొంటూ గంగ .. నీరు పాతిన కొండల మధ్య నున్నని రాతి కవ్వింతల్లో ఒరిగిన శత ముంపుల మోహ ధార.. ఏదో చెబుతుంది.. నేర్పుతుంది.. పరాయిగా చేస్తుంది… పంకిలా ఆగ్రణీతం లో ఊరేగే సంచీతా గడువులు…

అతనికి ఏదో వైరాగ్య శ్రమ అంటుకొన్నట్లుగా మారి.. విశ్వ చిరస్థాయి సంగీత మూర్చనకి హారతి పట్టి లోపలి తీసుకెళ్తావాని.. ఏది ఉందొ అది కాలుతుంది… ఏది లేదో అది స్పష్టంగా కనబడుతుంది.. జరగాల్సింది మసక పడి.. చర్యల కప్పిన మంటలపై జారే నిద్ర కూర్పుల మందాన మెరుస్తూ .. కదిలే పునాదులే శవ ముద్రల క్రీడని గుక్కపెట్టి ఏడ్చాడు. నిద్ర ఊరబెట్టుకొన్న కల ఉసూరుమని పగిలింది.. సంగీతం వినిపిస్తుంది.. వెదురు గెడలాలో ఉడికిన అన్నాన్ని తినిపించారు.. దాహానికి నీరిచ్చి …కళా పాయగా నోరెండిన పూతలతో ఇర్రుక్కున శరీర పంపకాలతో .. వాళ్లంతా గొల్లుమంటారు. ఆనక .. ఓ రెండు రోజులు పోయాక నవ్వుకొంటూ అన్నం వడ్డించుకొంటారు.

ఏదొక ఆలోచనతో ఏ గుడి మెట్ల దగ్గరో కూర్చొంటే.. బిక్ష వేసేవారు.. అతనిది అలా వదిలేసి వచ్చేసేవాడు.. ఒక్కోసారి నది ఒడ్డున కూర్చొన్న ప్రవాహ చప్పుడే వినిపించేది కాదు.. వాలెట్ రూంలో మర్చిపోయి పడవవాడు ఘాట్లన్నీ తిరగడం అయ్యాక .. మెడలోని గొలుసు తీసి ఇచ్చేసాడు.. భర్త శవం పేరుకొని .. అంత్యక్రియల డబ్బు కోసం అల్లాడుతున్న ముసలావిడకి.. వాలెట్ నిండుగా ఉన్న డబ్బంతా తీసి ఇచ్చేసాడు.. ఒక్కోసారి పూర్తి రాత్రి ఆ ఒడ్డునే ఉండిపోయేవాడు.. ఏ దేవాలయ దర్శనానికి ఎప్పుడూ వెళ్ళలేదు..

అసంపూర్ణ   వైరాగ్యత ఐనా అతనిని తర్వాత ఈ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉండేవి.. గంటల చప్పుడు.. మంగళ హారతిలో మోగే సన్నాయి.. ఇంకా ఎంత వెళ్లిన కాలుతున్న మృత్యు నిద్రలే తాండవమే నిండి.. మరేదో శ్వాస గురించిన రహస్య ముడి వదులైన గసతో పరుగులు పెడుతూ… ఇంకా ఏదో తెల్సుకోవాలి. క్రమం కూలిన విశ్వ ఖండనలో నిండి ఎగురుతున్న నడక నిండా పరీక్షలే … కొంచెమైనా వెసులుబాటులేని క్షేమ నిందలా కూర్పుని చల్లార్చి.. విందులు లేని ప్రవాహం లో సగం కాలిన శవాలు. కొట్టుకు పోతున్న పడవల మధ్యనే శవాలు కాలుతూ .. ములుగర్రతో అటు ఇటు తిప్పి..వివిక్ష నిశ్వాస లోని ఊరేగింపు దగ్గరై.. ఇంకా కాస్త చెట్లు కూలిన నిర్మల పుట్టుకలు ఒరిగే కల .. వారణాశి… ఇది ఉంది .. మృత్యు సత్యంగా నిలబడే పిలుస్తూ అలానే ఉంది.. ఉంటుంది..

                                             ……………………………………..

సంగీతం లో అది సంపూర్ణత అనలేం..అది అటు వేపు ప్రయాణమా? అని అతనికీ సందేహమే.. కాని అదే పలుకుతుంది.. ఇంకా కొంతమంది.. సంగీతమే అనలేం అని.. కాని అతని గొంతుని.. రాగ లయలేని దూరంలో కనిపించే మంచు జఠరనీ.. పూర్ణ ప్రేమలోనే మృత్యు పరిమళాన్ని .. ఉండీ ఉడిగిన సంతూర్ణ దుఃఖ తలంలో కదిలే దేహాల చుట్టపు చూపులో అర్ధాంతర మరణాలని.. చెట్ల పై కూలే గాలి గాయాల తూఫాన్ని … ముంచి తెరిచిన పడవ రేవుల కథన తీరుని ఒడిసిపట్టి.. ఆర్పలేని భయ సన్నోహ తీరులనీ మార్చి తిప్పుకొన్న ఆనవాళ్లు.

ఆమె బ్యూటీ పార్లోర్ … బెట్టింగ్స్ .. secrete ఫ్రెండ్స్ దశాబ్దాలుగా .. సినిమాల్లోనూ.. వ్యాపార నవలలోనూ కనిపించే సంస్కృతిని .. అదే అందుకునే స్తోత్రంలో … సిటీకి రాగానే మొదలు పెట్టి మునిగి.. క్లబ్ పార్టీలో.. చిన్న చిన్న తిరిగి రాణి అప్పులు ఇచ్చుకొంటూ.. స్టేటస్ బట్టలు.. పరిచయాలూ.. భాష నేర్చుకొంటూ… ఉన్న మూకాన్ని రోజుకో రకంగా కరిగించి.. రంగుల పోత పోసి.. వేలు కుమ్మరించిన .. లిపోసక్షన్ లు .. లిప్ కరెక్షన్లు.. దవడ సెట్టింగ్స్.. కళ్ళు.. కాళ్ళు.. పళ్ళు .. దగ దగ మనిపించే కెమికల్ బాత్లో ఊరేగి … నోట్లనే రోజూ విసురుతూ…

ఇలా.. ఆమె కోట్లు పోగొట్టాక పెద్దల పాత్ర .. విడాకులు.. ఆస్తులు.. బంగారం.. భరణాల కొట్లాట ..స్థిరమైన ఇళ్లలో వాటాలు.. చివరకి కారూ .. ఫర్నిచర్ కూడా..

అతని నపుంసకడని అపవాదు. .. అతనినిక  మరో పెళ్లి కోసం ఇక అడగానే అడిగారని ఓ కసితో కూడిన ధీమా.. రాక్షస సంతృప్తి .. మీమాంస లేని కొత్త కథ …  

అంటే ఆమె మరో పెళ్ళికి శరీర పవిత్రతల బలమైన టాగ్ .. పిల్లలు ఎలానూ లేరు.. ఎవరి వలన లేరు అది అప్రస్తుతం.. మరో పెళ్లి వరకు.. ఆమె అతనిలోకి కనీసం కూడా ముఖమెత్తి చూడలేదు..లాయర్స్ ని డబ్బుతో మేనేజ్ చేసి.. అతను ఒకసారి కోర్టుకి వెళ్ళలేదు. కోర్టు తీర్పుల మించిన పెద్ద శిక్షలు జనం నోళ్ళలో తిరిగే మంథన మూర్తుల తాగుబోతు కూతలు.

పుంసత్వ తెర విసిరినా నల్ల కెరటం బరువు చాలా పెద్దది.. బలంగానే కొడుతుంది  పల్లెటూళ్ళో … అతని ఉనికి వెనక వంకర నవ్వు.. నిజం తో సంభందం లేని నాలిక మెలిక.. ఉప్పు రాల్చే గోడల వెనక జుత్తు మూడేసి బీటలు.. కదలీ కదలని దుఃఖం వెనక సత్యం వద్దనుకునే నొప్పి.. భరించరాని నొప్పి.. తెగిపడ్డ దారి తెంపులతో కలబోసుకొన్న నిద్ర రేవుల తీర్ధం గుంబించిన పెద్ద గాలి మంతనాల చెదురు మదురు ముఠాలతో తలపడే ఎర్ర రంగు శవాలు.

………………………….

అతనికీ కొన్ని అర్ధమయ్యేవి.. కొన్ని అయ్యేవి కాదు. కిందికీ పైకీ చూసే వెగటు చూపుల వాళ్ళ వంక అంతే మాములుగా చూస్తుంటే ఏం మాట్లాడడానికి ఎవరూ కొత్త నలతలని తెచ్చుకొని దిగులు పడేవారుకాదు.. ఓ వేళా ఎవరైనా పడితే .. అతని ఫ్రిడ్జ్ లోంచి ఓ మందు బాటిల్ మోసుకుపోయేవారు.

సృష్టి మాత్రం ఇలాంటి కళాకారులని కొంతైనా పట్టించుకొంటుందా అన్నట్లు.. మరదలు మాత్రం .. అతని తరపునే పోరాడేది.. ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టనిచ్చేది కాదు.. అన్ని లెక్కలు తనే చూసుకునేది.. అతని అకౌంట్లో కొంత బాలన్స్ ఉంచి ఎప్పటి కప్పుడు దానిని రీఫిల్ చేసేది.. ఎవరు కావాల్సిన వారు.. ఎవరు కాదనేది ఆమె స్పష్టంగా చెప్పేది..

అతనొక రోజు నేరుగానే ఆమెని చన్ యు హెల్ప్ మీ ఇన్ ఠిస్ ? అన్నాడు. ఆమె క్షణం కూడా ఆలోచించలేదు. మూడు రోజులు … మూడు సంవత్త్సరాల పెళ్లి తర్వాత భర్త వదిలిసిన భార్య ఆమె … చాలా మందికి తెల్సిన జమీందారీ రహస్యంలానే బావ తో .. నిర్లజ్జ .. నిస్సంసంశయం.. నిర్మొహమాటం తో .. ఓ పూనిన వర్ష ఋతువులా .. ఓ కదిలే నిద్ర మత్తులా… ఓ అయస్కాంత జలంలోని కుంపటిని కూల్చిన జన్మ మూలంలా… తనకు ఎలానూ తల్లి యోగం లేని శరీర అవకతవకలు .. పుట్టుక తోనే .. ట్రెయిట్మెంట్కి అతీతమైనవనీ .. పెళ్లి తర్వాత టెస్ట్ లు చేసినపుడు   తెల్సి వదిలేసాక … ఇప్పుడు తనకేం వద్దు.. బావ లోపలి బీటలకి కొంచెం పూడిక అంతే…

వాసుకి దేశాలు పట్టి తిరగడం మొదలు పెట్టాడు..

 అతని కేర్ taker అన్నీ రకాలుగా .. కేరళ వెళ్ళినప్పుడు ..

వాసుకి ఓ ప్రోగ్రాంలో పరిచయం.. అప్పటికే ఆమె కూలిపోయి ఉంది.. వాసుకీని కలుస్తాడని తెల్సి.. ముందే చెప్పింది.. అతని కండిషన్ .. ఏం కావాలన్న అడగమంది. ఎవరు ఎవరిని ఏం తెలుసుకోవడానికి అడుగుతారు.. ఎవరు ఎవరిని ఎలా చిత్రించాలని  కక్ష కడతారు.. భూమి రెండో సమాధానం లేని ఉపేక్ష తో దీపం తీసి రాసిన వీలునామా నిండా పిచ్చి రాతలే.. బొమ్మలే.. గుడ్డ కాలిన గొడుగులే… ఉండీ తీసుకెళ్ళిపోయిన మధ్య ముఖాల తీరిక లేని విషపు శ్వాసలే..

ఇద్దరూ కలిసి చాలా తిరిగారు.

కాని తనలోకి తను.. తనలోంచి తను.. తానై తను.. తనని మోయలేని తను.. తానుగా కాపాడుకోలేని తను. తన బయట నుచి లోపలి దారి దొరకని తను.. తననే సృష్టిని తను కాదని నమ్మించే తను. తనకి పునాది తానేకాదు.. తను మాత్రమే తన తప్పుకి పరిష్కర్త ..

ఓ రోజు అతను ఆమెని వేరే ఊరిలో వదిలి వెళ్ళిపోయాడు. … కాని జ్ఞాన భిక్షని అడిగే బౌద్ధ గమనిలా.. చిత్ర మౌక్తం లో విసిరినా పెద్ద చప్పుడుల గొలుసులా .. భావి నీటిలో గొలుసులు మాత్రమే పెట్టిన అరుపులా …. వదిలి వెళ్ళిపోయాడు.

ఆమెకి  మతి చలిస్తే  .. ఆలోచన చలించడమంటే .. ఆగడమని కాదు,, వేగం పెరగడం.. విస్తృతి అడ్డం తిరగడం.. ఆయుస్సు పుట్ట గొడుగులా రాలి.. మృత్యు దేవతని కత్తితో భయపెట్టి నదిలోకి దూకడం. కొన్ని వేల చీకట్లు.. వాన గుండ్రాల మధ్య తడిచిన ఇల్లు.. మొండి రాక్షసుడి మూడో కన్ను తొలచిన మంట.. గురుత్వ ముడిలేని కాళ్ళు.. శ్వాస తలకిందుల స్తూపం కడుపులో పండుతూ మోయలేని భాదతో .. కాలిపోతూ ఏడవడం.. ఉన్నదీ లేనప్పుడు.. లేనిదే ఉందనే పరమ సత్యంతో అరవడం…  

 ఎవరో మెంటల్ asylum  లో పడేస్తే అక్కడ నుంచి పారిపోయి తిరిగి కేరళ వచ్చింది.. తన ఇంటికి.. లోపల  తెలుస్తుంది … ఎవరి మస్తిష్కము లోని దీపాల చీకటి పాకుడు.. సరిల్ల ఆది దీర్ఘ వికారం గొంతులో చమరుస్తూ .. ఇష్టపడని తలనొప్పులు పీడన ఊగి రెండో సారి కళ్ళలో విరిగిపడ్డ నాళికల చమురు ఎండిపోతూ.. మెదడు కంపనలో బిగుసుకొన్న ఉత్ప్రేరక నిద్ర సంబంధి వేరుపడి.. ఇది కథాకాదని తెల్సినా ఎవరూ పలకరించారు.. ఏం జరిగిందనీ అడగరు..

…………………

మరదలు పెళ్ళికి సిద్ధమా బావా? అంటుంది.. కేరళలో  అతనిని వెదుక్కొంటూ వచ్చి.. ఏది ఎన్ని రకాల ఆకారాలని పొందినా .. తిరిగి కరిగించి అదే మూసలో లాక్కుపోయే సంకల్పం అంతిమ సత్యమని నమ్మే తీరిక చుట్టూ మరింత పెద్ద కాపలాదారు విడిచిపెట్టిన బాణంలా సూటిగా చూస్తూనే..

 వింటూనే అతనిలో ఒక్కసారిగా పగిలిన అసహనం.. ఒద్దిక లేని అరుపు.. కల కుండ పగల గొట్టి చేప గొంతు నులిమినట్లు అల్లాడుతూ…   ఆమె ముందే ..

వాసుకీ తో …. నాతో న్యూడ్ గా పడుకోగలవా?  అంటాడు..

 విధేయ మాతృక తెలియని ఇక దీపపు ఒత్తి వదులుగా అల్లి భగ్గుమన్నాక .. తిరగడం తెలియని హద్దు సంపదలు శిలాజ మృతి గడ్డ కట్టిన ఆందోళనలో .. కదిలీ కదలని తీరికల పైన ఆలోచనలు ఒప్పుకొని సర్వ సత్తువుల గాలి దారులు మూసుకుపోయి.. మనుగడ లేని విశ్వ ఆగృతి తీర్ధంలో అరిచి వగర్చిన శీతల ఊపిరి ఊరికినే వణికి.. సరిపోతూ లేని సగం భూమి నిర్యాణ ముహూర్తం లో విడిపోయి .. ససంఘ శరీరం ఓదార్పు అరుపుని కాల్చి .. ద్విలిక ఛాయా రుణ జూలుపుని అప్పగించే నడకలు.. అక్కడే తెలియకుండా ఉంది.. అలానే కదలకుండా ఉంది.. కన్ను కాన్పులో కాలనీ జోడించుకుని మృత్యు తీగకి వేలాడుతూ ఉందతని  ప్రశ్న…

 ఆమె అక్కడే బట్టలు తీస్తుంటే … అతను లోపలికి తీసుకు వెళ్తాడు. పరిమళ విధేయంలో కడుపు పండిన దుఃఖం.. నిండా గతిమూర్తుల సంగీతంలో కిటికీలని సాగదీసి .. పలకలేని తెర ని చించి .. రెండో శూన్యంలోకి నేరెళ్లబెట్టి చూస్తూ .. ఇంకేదీ చోటు లేదని ఏడవక ముందే .. చీకటి సగంలో విరిగిన వీధిని తోడుపెట్టే నిరాకార సంధి సమీపాలు.

మరదలు మర్నాడు వెళ్ళిపోయింది. కేర్ టేకింగ్ కొంతవరకు కరెక్ట్ అనుకొన్న .. తన లైఫ్ దీనితోనే ఉన్న ఊళ్ళో నడుస్తున్నదనేది మరో వేపు నిజం..

………………………….

ఫ్లూట్ తయారు చేసే కళాకారుడు అతనితో మాట్లాడాక… ఆ  తయారీ మానేస్తాడు..

వాళ్ళ మాటలు ఇలా సాగాయి. ఎక్కడికక్కడ ఉండీ లేక తెగిపోయినట్లు..

నీ చేతులతో పనిముట్లని .. ఓ గంభీరత లేని తీరిక పట్టుకొని .. ఊపిరి వెనకకి తీసుకొని.. నల్లని కాళ్ళ మధ్య దానిని పెట్టుకొని… దాని గొంతునైనా గమనించక  పిసుకుతూ.. ఒకానొక ఉష్ణ రేఖని చేరని ఇనుప చువ్వతో వెదురు వెన్నుపై గుచ్చినప్పుడు .. దాని అరుపు విన్నావా.. ఆ గాలి అలలన్నీ పట్టుకొని .. మళ్ళీ ఆ చెట్టులో వదిలి పెట్టావా..ఇదొక జీవ తెంపు అని నీకు తెలుసా.. మట్టి ముసుగు కప్పిన సంతర్ప దుఃఖ ఖండిక ఆరబెట్టుకున్న పెద్ద పోటు  …

ఈ రాగ స్రావంలోకి.. నీ ఆత్మని ఒంపి.. కలగలిపి.. ఆయుస్సు సీమని మంత్రించి.. నియంత్రణ లేని పెద్ద బావి కాళ్ళ దగ్గర క్షమార్పణకి పెట్టి.. రోజుల కొత్త మంచు ని తీసుకొచ్చి ఉడికించి.. బొట్టు పలచని విగ్రహాల రేవుని .. నిద్రతో కలిపి పండించి.. ఊరుకోలేక పోయిన సమాధి జాగారం విరిగిపడి.. నిందలని ఒడిసిపట్టిన శ్వాస క్షేమం నలిగిపోతూ .. విశ్వాస క్షమారూపం ధూప క్రియలని కూర్చి.. ఆ పైకి జరిగి తీర్ధ భాషణ లేని ముట్టడితో .. కదిలే దీర్ఘ చర్యల నడుములో నొప్పిని కొలుస్తూ చెక్కి.. అలసట తరిమిన స్నాన బావి లోకి దిగి …. తీర్చి దిద్దావా?    

ఎన్ని శతాబ్ద రాగాల వయస్సు .. సమయ వృత్తాలు.. మృత్యు కక్ష్యల్లో ఊడిపోయిన సూత్ర రహశిఖల మంత్రం తావిని గాల్లో తిప్పి …వెసులు లేని తేలిక వణుకుని కలిపి పట్టుకొన్న పొట్టి పొట్టి రంజన దీప సందీన మోగింపులని వినడం ఎలానో సృష్టి నీకు ముందు చెప్పిందా ? ఎక్కడ …ఎందుకు…   దీనిని నీతో కలిపి ముడిపెట్టమందో నీకు తెలుసా?

మాటలు వరుస తప్పని రాగం తో తోడుకొని.. ఆశ్రిత శకునాల దీర్ఘ సన్నిధి.. తెలుసుకొన్న ఒత్తిడి పొరల్ని కిందికి లాగి.. ఇంకాస్త నలత పడ్డ స్నాన దేహాల కంటిని నులిమి గాలి రహస్యాన్ని తెల్సుకొని .. తెలుసుకోక .. చావుకి దగ్గరకి జరిగి.. ఇందులో అద్దావా ?

భయాన్ని వేల వేల మీటర్ల ఎత్తు నుంచి కిందికి వదిలి … విశ్రామ సరుగుడు గాలి సంతతి నిద్రని కాదని కాలుతూ.. కూర్చిన గతి తీవ్ర రంగుల పోలికని తీరిక అల్లిన ఖాళీ ముఖాల పెద్ద నోరుతో ఆవలించి.. అలసట చనిపోయిన నిశ్పూర్తి సణుగుడుని మూటగట్టి ఆ పై కొండల్లో నానబెట్టి … ఆ నాచు దారాన్ని దీనిపైనా పులిమావా?

చెప్పవలసిందేం లేదు.అలిసిన రక్షా ముద్రగా నలిగిన నడకతో తిరగబడి .. ఉంటే ఉంటానని .. లేదూ దూరంలో ఆగలేనని.. తీరు తెలియని ఉన్మాద పోలికలు చిక్కబడి.. అంతా కలుపుకున్న నిద్ర రాతల్ని .. దీనికి నేర్పావా?  

ఆ పనివాడు మరిక ఒక్కమాటా మాట్లాడ లేదు.. మరో పనికి వెళ్ళిపోయాడు.

ఒకే ఒక చివరి ఫ్లూటుని చేసి అతని కాళ్ళ దగ్గర పెట్టి … జలపాతం పై నుంచి దూకేసాడు.

…………………………….

వారణాశికి వెళ్ళినప్పుడు .. కాశీ క్షేత్రం లో రోజూ ఆరాధన చేసే వంశ పారంపర్య కళాకారుడు .. అతనిని చూడగానే ఇంటికి తీసుకుపోయి ఆతిధ్య మిచ్చాడు.. రాత్రికి అతని మురళిని వినిపించమన్నాడు. అతనిని విశ్వధుని పిచ్చివాడిలా చూసి .. జోలె భుజాన వేసుకొని.. ఆ రాత్రిలో ఓ స్మశానం చేరాడు. అక్కడే ఓ చోట పగిలిన కుండల గుట్ట పక్కాగా కూలబడ్డాడు. ఇంకా ఒక చితి చిన్న చిన్న నెరుసులతో అతనిని చూస్తుంది. భస్మ కాందిశీక నెమ్ముతో .. గొంతంతా నిండి.. దాహమన్నాడు.. కాటికాపరి ఓ కుండతో నీళ్లిచ్చాడు.. అతని నాధా జావృతిని మెల్లగా తట్టి.. విరుచుకు పడి.. గాలి క్షేత్రంలో కంపన మొదలు పెట్టాడు. ఆ తెల్లవారు జామున నేరుగా అతనింటికి పరుగు పెట్టాడు..జోలె స్మశానం లోనే ఉండిపోయింది. గుడికి తయారవుతున్న అతను.. మట్టి పేరుకు పోయిన విశ్వ ని చిరాకుగా చూసాడు.. అతనికీ ఆ స్పృహ లేనే లేదు..

  రాత్రి స్మశానం లో ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు దేవత దర్శనం జరిగిందంటాడు.. అని ఓ దేవరాగం వినిపిస్తాడు.. అతనది వింటూ ఉన్నాడు.. ఏమనడానికి ఏమీ లేదు.. తన మూల గురువుకి కూడా ఇంత విద్వత్తు లేదని అతని కొన్ని నిమిషాల్లోనే అర్థమైనా.. ఒప్పుకోవడంలో గొంతులో ఉండకడుతూ   ఉంది.. తనకి నిద్ర పట్టనప్పుడు వాడే బిళ్ళలని నూరి అన్నంలో.. కూరలో.. పాయసంలో …  కలిపి వడ్డించాడు… కాటికాపరి పరుగు తీసుకొచ్చి అందించిన జోలె కూడా ఇవ్వకుండా … చాలా కిలోమీటర్ల దూరం లో.. ఇంకేమీ జన సంచారం లేని చోట .. పడేసి రావడానికి ఏర్పాట్లు చేసి పంపాడు.

దేవుని ముందు.. అందరూ వింటూ ఉండగా తను కనుకొన్న కొత్త రాగమని.. రాత్రి దేవత కలలో తనకి కొంత సహాయ పడిందని …గొప్పగా చెప్పి.. వినిపించాడు.. అందరూ మురిసిపోయారు. ఘన సన్మానం జరిగింది.. ఇంటికి వెళ్ళాడు.. మర్నాడు లేచాడు.. అతని లోపల నుంచి సంగీత ఖాళీ ఐపోయిందని క్షణాల్లో అర్థమైంది.. ఏ రాగమూ గుర్తుకు రావడం లేదు.. గొంతు మాటలు తప్ప రాగానికి ఓపెన్ అవ్వడం లేదు.. ఒక వేళ ప్రయత్నించినా .. లోపల గుండె చప్పుడు .. దేవాలయాళం పెద్ద గంట చప్పుడులా .. అతని చెవులు భరించలేనంత …  భార్యకి.. పిల్లలకి.. తన అభిమానులకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.. మళ్ళీ అదే మందు బిళ్ళలు మళ్ళీ నూరాడు.. భార్యని పాయసం అడిగాడు.. చక్కగా కలుపుకొని తాగేశాడు.. గది తలుపు గెడ పెట్టుకొని నిద్ర పోయాడు.

………………………

ఆ సత్రంలో నిద్రలేని వందల దేహాలు .. ప్రార్ధన వాళ్ళకి తెలియదు. వెనకా .. ముందూ.. వాళ్ళ పుట్టుక విసిగించిన నిద్ర దారుల్లో ఏక ముఖం తో అడ్రస్ దొరకని దుఃఖం పట్టుకొని .. చిరిగిన చేతి రేఖలతో వేడికి… కన్నూ.. కాలూ అలిసిపోయాక .. ఇంత ముద్ద తిని..మధ్య రాత్రి ఒక గుటక  నషా సవరింపులతో విశ్రాంతి నమిలిన … అది అలానే ఆగిపోతుందో.. ఉండిపోతుందో…తెలియదు..కాని కథకి రెండు – మూడు రంగుల దేహ ఫలం అరగ ఆందోళన పట్టించి ఆ పైకి చూసాక .. ఇది ఇలాగే ఎప్పుడో ఊపిరి గొంతులో నొక్కినప్పుడు మారుతుందని అనుకొని జారిపోతారు. ఆ కొందరి నుంచి అతను కొత్త కళల దారులు తెలుసుకొనే వాడు. మహా నిద్రల వర్తమానం వదిలిన సంకల్ప ముద్ద.. చెరిపీ .. చెరపని ముఖాల నిద్రని రంగరించి.. మాటలు తిప్పి రాల్చుకొన్న .. విచక్ష మోదులని దిగ్గొట్టిన వెన్నులో.. ఒంటి గడపల ముప్పుని లాలించే అద్దకపు ముంతలని తిప్పి పెట్టుకొంటూ .. అంత పొడుగు నడక దేనిని నమ్ముకుని.. దాహం తిరిగి చూడదు.. ఎవరూ గుర్తు పట్టరు.. కన్ను చుట్టరు.. పెదవి కొరకరు.. శ్వాస ఉడుకుతున్న కుండలోని కొంచెం తీరు కప్పిన ముఖం తూలి.. పొగ ఓ నిర్యాణ విలాఖి..

అదే మెంటల్ asylum  లో   మరదలు సాయంతో గడిపాడు. ఓ  ఆమె అతని ఆలోచనని ఏ మాత్రం వ్యతిరేకించలేదు.. CA చదివాక .. చాలా జాబ్స్ ట్రై చేసింది… కాని ఆమె వాళ్ళ ఏ మాత్రం కాలేదు.. కొన్ని చోట్ల వాళ్ళ ఆకలి చూపులు తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి.. ఆ తర్వాతే .. విశ్వధుని బావని వెదుక్కొంటూ వచ్చి..బంధువులు అతని ఆస్తిని ఎన్ని రకాలుగా కాజేయాలనుకొంటున్నారో అర్ధమయ్యాక.. అదే అతనికీ చెప్పి.. జాయిన్ ఐ మొత్తం కంట్రోల్కి తెచ్చుకొని.. అతనిని మెప్పించిన… అతని దృష్టి డబ్బు కాదని.. శరీరం కూడా అతనికీ చవుకబారు మూట కాదు…చాలా గౌరవం.. ఆమె అతనిని ఇక వదలాలనుకోలేదు.

తనెలా సాయం .. ఎందుకు సాయం.. ఎక్కడివారేకాని సాయం.. నూనె పొడిచిన మాటలు భుజం మీద నుంచి జారుతూ .. కనిపించని ఆధార రక్షా తానేనని నమ్మించి .. దూకి పోయిన సగం మొత్తాల అల్లిక .. ఏకా సామ్యం.. పెద్ద నుదురు విగ్రహంలో సంగీతం.. ఆవిష్కృత శూన్యంలోని మహా నిర్దేశం అడుగుల జ్ఞాన విలాస కన్నుని పట్టుకొని చెమర్చిన రాగ నిర్బంధంలో మోగే మూర్తుల గంటని వెలిగించి .. అర్ధం లేని తవ్వకాల ఒరిపిడి దర్శన రాశుల మధ్య ఊరేగే సవ్వింత తీరికలు జాడిస్తూ … పలకరించలేని భుజాలపై బరువు నిద్ర కొత్త పెట్టే గతుల వంచన… సంగీతం

ఆమె ఏం చెయ్యబోయిందో.. మీకు అర్ధమౌతుందా?

దేనికి ఎవరు ఎందుకు అర్ధం కావాలి… అలా అయ్యే ఎవరైనా ఉండిపోయారా? ఉండలేక పోయిన విసుగు ముడిని నూర్చి కొత్త విముక మత్తుని రాల్చే దిగుడు బావి నెమ్ములో పడిపోతూ…

మిమ్మల్ని కాపాడటం ఆ వానల ఇంట్లో అసాధ్యం.. ఈ భూమి దేనిని కప్పుకు తిరుగుతుంది.. దేనిని వద్దని విసురుతుంది… ఎక్కడ మనం అలిసి ఆగిపోవాలి.. ఎక్కడ కలుపుకొని స్మశానంలో దేహ గతి విప్పుకోవాలి.. నెమ్మిది నెమ్మదిగా అర్ధం చేసుకునే లోపు .. వాళ్ళ ప్యాకెట్స్లో ఏం ఉన్నాయో.. ఎంత పదునైనవో.. ఎంత వేగంగా కదిలిస్తారో.. ఏ మాత్రం విచక్షణ లేకుండా దించేస్తారో.. నీకు తెలియనూ కూడా తెలియదు.. జరిగిపోతుంది.. ఇక చాలు.. ఈ నిప్పు అంచులపై ఇంకెన్ని రోజులు నడక..అక్కడ కలలు.. నిద్రా లేని మనుషులు.. ఏం చేస్తారో ఊహించలేం.. చుట్టూ  వాళ్లే.. వాళ్ళతోనే.. తనూ.. ఎవరు ఎవరి మాటని తాకి … వెనక్కి వస్తారో.. వాళ్ళకీ తెలియదు.

…………………………………

మరణావస్థలో ఉన్న ఓ రోగి ( Father of Inspector)  చివరి కోరిక కోసం పాడతాడు.. ఏడు మలుపుల ఆవల ఎత్తు కొండల్లో దారి.. మృత్యు మసక కమ్మిన సవరింతని గడుసుగా నమిలి .. పెద్ద ఆవలింతల సరోవరం ఎదురై.. నీరు పట్టిన గట్లని కోసి.. పెదాల నిప్పుని .. కుండలోకి పిండి… ఆ సరికే.. చితి నిండని పూసుకు తిరిగే శరీరాన్ని వెనక్కి పిలవ లేక .. గుడి హెచ్చరించిన తనిఖీ ముఖాలు జార్చిన కొంత వెసులుబాటుని నాకుతూ.. సత్య సాముద్రిక గురుత్వంలో పడి అడ్రస్ లేక .. నిలబడ్డ కాళ్ళ కింద భూమి లేదని ఒగిర్చి.. కాస్త నీరుని కాంతిలోకి విడిచి.. సంగీత సముక్తంలో ఊడిపడ్డ రాళ్ళ నడకని బొట్టుతో నులిమి.. చుక్క చెమటకి ఇర్రుక్కుని ముంతలు పగిలిన చప్పుడు కపాలాలదని తనింకో నేలని గట్టిగా సవరించి చుక్కానీ పేర్చిన విసుగుని బిగలాగి శ్వాసలోకి చూసినప్పుడు.. శిధిల వికార్పు సన్నీలత కథలోకి కూర్చొంది.

ఇన్స్పెక్టర్ తండ్రికి అతను క్లోజ్ ఫ్రెండ్.. అతనూ ఆ రాగం వింటాడు.. మర్నాడు తన ఇంటికి ఆహ్వానిస్తాడు.

 అక్కడే ఇన్స్పెక్టర్ అతనిని చూస్తాడు. అతని ప్రతిభ అర్ధమౌతుంది… నిద్ర గతిని వెళ్లబోసిన మాట మాత్రపు ఇరుకుల్లో .. నాలుగు దిక్కులూ ఊరబోసిన మంథన కవ్వింతగా సృష్టి ఏక సమూహంలేని నిర్లయ చివుళ్ళని సాగదీసి … కొత్త మునక తీపి రంగుని జోడించి అటు.. ఇటు కదులుతుంది.

 కానీ ఆ తర్వాత రోజు.. ఓ మునిసిపల్ డంపింగ్ యార్డ్ పక్క పడున్న ఓ వేశ్య వైద్యం కోసం ఎవరినో కార్ లిఫ్ట్ అడిగి .. బలవంతంగా ఆపి (పెద్ద పెద్ద రాళ్లు అడ్డం పెట్టి.). కొడుతూ ఉంటాడు. అదొక ఉన్మాద పూనకం చుట్టుకొన్న ముడి రాత్రుల సవరింత తోడైన ఇంటిలో.. కాటుక చిటెకలు ఊడదీసిన చెలమల్లో నిండుకొన్నా … ఒక నిలువెత్తు కథన గుండాల కొరుకుడు దివ్యంలో ఊరేగే సంతర్ప చెలగాటాల నివరింత..  ఆ వేశ్యా  భయపడి పారిపోతుంది.. ఇన్స్పెక్టర్ ఆ రిస్క్ నుంచి బయటపడేస్తాడు. మరో కేసు ఐ .. అతని మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా .. ఆ కారువాడినే బెదిరించి పంపించేస్తూ..

అతని అవినీతిని తండ్రి ఎక్సపోజ్ చేస్తున్నాడని స్లో poison తో చనిపోయేలా చేస్తాడు.. ఊపిరికి సన్నని సూదితో చిల్లు పెట్టి.. శరీర గాలిని ఒడిసిపట్టిన ఒకే కబురుని మళ్ళీ మళ్ళీ చేరుకొని… జ్ఞాన నిరూహంలో ఊగీ .. చిత్ర వంచకీ నడుముని సవరదీసి.. ఇంకేదో దుఃఖ రక్షా వాకిలి .. నీరు లేకుండా ఆ ఫోటోనే చూసిందని.. ఇంకేదో కబురుతో జోడిస్తారు.  అలా మెల్లిగా స్పృహల అంచుని తెలుసుకోకుండా జారిపోతూ.. ఉనికి మూర్చనల గట్టుని కోసే సవ్వింత తీరికని దూరం జరిపి.. ఆ మూలకి చేర్చి పెట్టుకొన్న నిఘా మూర్తుల చీకటి చమురుని మోసే తీరికల ఆలవాలపు సందీర్థని చెంపలకి అద్దుకొంటారు. ఊపిరి ఇంకెన్ని కోసల దూరంలో ఉండి కవ్వించి నమిలేస్తుందో .. ఆరాలు తీసి విశ్వ రక్షా జ్ఞాన భూమిలో చితిని పేర్చి రమ్మంటుందో తెలియదు.

తండ్రి తన secrete  ఎఫైర్ నడిపిన ఆమె కి (ఎన్నో ఏళ్ళు) ఆస్థి పంచుతాడని … అందుకే అతనిని తొందరగా అడ్డుతొలిగించాలని.. ఇదంతా చేస్తూ ఉంటాడు. ఏది ఎంత కావాలో మరో సంగతికి కట్టుకొని తెలిసికోక .. నిలువు రంగుల ప్రవాహం ఒరిగి .. పెయిన్ నుంచి కురిసి .. తడి కట్టుకొని నిరూప లోహపు మునకలా శరీరం మారి.. ఆలోచన వికృత నింపు కోతల్లో తలపడి..

ఆ మాట విశ్వధుని  అతని తండ్రికి  ముందే చెబుతాడు.  అతను నమ్మకుండా పనివాళ్ల తో కొట్టి పంపిస్తాడు. మరో మాట అతను చెప్పాలని చూస్తున్న వినడు… ఇదంతా తనకేం కొత్త కాదన్నట్లుగా .. నెమ్మిదిగా ఓపిక తెచ్చుకొని.. అతనిని మళ్ళీ వెనక్కి తిరిగి చూసి వచ్చేసాక…

ఇన్స్పెక్టర్ మర్నాడు అతనిని గంగలో కలిపెయ్యడానికి సిద్దమై వస్తాడు… ఇంకేదో ఆగకుండా తొలిచే అనుమానం.. ఈ పిచ్చోడు ఇంకెక్కడైనా తన కోసం చెప్పేస్తే .. తను గడించుకొన్న గౌరవం నిప్పుల కొండై కాలుస్తుంటే .. ఇక వీడిని నా కాలుతో నలిపెయ్యడమే కరెక్ట్ అనుకొని… ఓ పడవవాడి పాత కేసులు బయటకు తీసి భయపెట్టి.. ఫోటో ఇచ్చి… ఓ లక్ష రూపాయలు చేతిలో పెట్టి.. ఘాట్ల దర్శనంలో అనుకొని ప్రమాదమంటూ పడవని తలకిందులు చేసి…

 కాని అతను కనిపించడు. ఇన్స్పెక్టర్ లోపల నవ్వుకొని .. వీడింతే .. ఎప్పుడో మర్చిపోయి మరో పిచ్చోళ్ల చోటుని వెదుక్కొంటూ పోయుంటాడని అనుకొన్నాడు. కాని అదే స్లో poison  మెథడ్ ని .. ఏ మాత్రం తెలుసుకోలేనoత టెక్నిక్కేతో అతను తాగే లిక్కర్ లో కలిపి … కొడుకు పై సక్సెస్ఫుల్ గా ప్రయోగిం చాలని .. కొడుకుకి దొరికిపోయి.. ఆ తర్వాత కొడుకు తో కలిసి హాస్పిటల్కి వెళ్తూ.. కారు దిగాక కొడుకు కార్ పార్క్ చేస్తున్నాడు.. తండ్రిని ఓ లారీ గుద్ది అక్కడిక్కడే చనిపోయాడు. 

సృష్టి సిద్దంచేసిన మృత్యువు దీనికి అతీతమైందా? ఏది ఉందో అదే లేదా? ఏది ఎంత కావాలో నిర్ణయించి సృష్టి ఓ కంట్రోల్ ని మనిషి పై తీసుకు రాలేదా? ఏది కావాలి ఎలా కావాలి ఎందుకు కావాలి? ఈ మృత్యు స్పర్ధలని ఆ పైన …. ఆ ఎత్తులో….  తీర్చేదెవరు?

………………………

వాసుకీ .. ఏంటి నీ కంప్లైంట్ … ఆయన నిన్ను చంపబోయాడా? ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఆయనకీ అలాంటి అవసరాలేo లేవుగా?

నా కన్నా ముందు అతనితండ్రిని చంపబోతున్నాడు.. కొద్దీ రోజులే.. మెడికల్ టెస్టులకి కూడా దొరకని చావు.. నాకా మందుల గురించి బాగా తెల్సు.. కావాలంటే.. కొన్ని టాబ్లెట్స్ ( అక్కడ నుంచి తెచ్చినవి.. సాంపిల్స్) చూపించి.. డాక్టర్ని consult చెయ్యమన్నాడు.. అది నిజమే..

 రాను .. రాను పెరుగుతున్న కొడుకు అవినీతి పనులు తండ్రికి ఇష్టం లేదు.. అందుకే ఆస్తిని వేరే వాళ్ళకి రాయాలనుకొంటున్నాడని కొడుకు అనుమానం.

.. వాసుకీ హస్కీగా మాట్లాడి.. విశ్వధుని ఉనికి కోసం చెప్పి రాత్రికి రమ్మంది.. రాత్రి అనగానే నరాలు పురెక్కిన ఆ ఇన్స్పెక్టర్ .. ఆరోజు సాయంత్రమే అక్కడ ఉన్నాడు.. ఆమె కవ్వింతగా చూసి గ్లాసులు నింపింది..కళ్ళతోనే సంకెళ్లు వేసి.. నల్ల నవ్వు జడని విరబోసుకొని.. ఓ పాటని దీర్ఘ మసకలోకి జోడించి.. తెల్ల దుప్పటి కథని మత్తుగా చెప్పి.. బొడ్డు కింద కుచ్చిళ్లని జాడించి.. వాడు కూర్చోవడానికి .. మంచెం పై పడుకోవడానికి మధ్య  ఖాళీలో…  వాసుకీ  అతనిని కడుపులో పొడిచింది .. ఎన్నో కేసులు చూసిన వాడైనా .. ఇదిలా జరుగుతుందని ఊహించలేదు…

 మరు క్షణంలో అతని గొంతు కోసింది. కోసేటప్పుడు….

ఇదిలా జరుగుతుందని ఊహించలేదు… ఊహించడం .. ఊహించక పోవడం.. అది కేవలం మనిషి సమర్ధత .. నమ్మకం.. నిద్ర ఊపిన కలల పునాది కదలడం.. ఇది ఇల్లా.. ఇది ఇలా కాదు.. అనుకోవడం మన నమ్మకాల మత్తు గుడి కూల్చడం.. కొంచెం వినాశ సెగ మూర్చిల్లన కోపం .. వికృ నిమర్జ చాలా బరువైంది.. భయంకరమైనది.. విసిగించేది.. ఆ నమ్మకం ఊహించలేనంత బలమైంది.. గస పోసిన నిర్వాకపు ముద్దలు గొంతు దిగక…

ఆమె అన్న ఆ ఒక్క మాట వింటూ shockలో ఉండిపోయాడు .. విశ్వధుని.

నీ Father సరే.. నా బిడ్డ జోలికి ఎందుకు కొస్తున్నావ్? అంది. అప్పుడు ఆమె కంఠ నరాలు ఉబ్బి… కళ్ళు ఏ నిమిషం బయటకి వచ్చేస్తాయాన్నంతా పెద్దగా.. కోపం విడిచిన ఆ హైయెస్ట్ డిగ్రీ టెంపరతురే ముందు.. మనిషి మాడిపోకుండా తప్పుకోవడం దాదాపు అసాధ్యం.

ఆ తర్వాత … ఇద్దరూ అడివిలోకి ఫ్లూట్ బాగ్స్ తో పరుగు పెట్టారు.

                                                       ……………………….