
సంగీత తధామయ
విశ్వమంతా నీరై నా కళ్ళలోకి దిగి … శబ్దాల బాధా గణితమంతా చెలరేగి కలుస్తూ .. నేను నీకై కనపడని ఆత్మ నీరులా ఆవిరిని పట్టుబట్టి తాగి… సన్నగిల్లిన నిరాహా తమకారంలో తలకిందులై.. నిస్తీర్ణ విశదీకరణ పట్టుతప్పి గింజుకొంటూ సరిపోని మాటలే నేను. సర్వ భూమి సమాధిగా మారి గజ్జె కట్టిన చీకటిని అరగదీసి.. ముడి తీసిన నిద్ర చలనాన్ని ఆవలింతలతో కప్పి.. కలలు ధార బోసిన ఏడూ సముద్రాల ముద్దలా తను.. విశ్వ మాయకి..
విశ్వ అంతః తరి భ్రమణ ఓదార్పు సవ్వడితో నిండిపోయిన దేహాల కబురుని .. చేర్చి పెట్టుకున్న నిద్ర ముఖాలు ఇచ్చిపుచ్చుకున్న నిరూప దూరంలో .. విసిగించే అయస్కాంత రాశుల విభ్రమ పునాదులు మండుతూ.. కదలని నిశ్వాస దేహ భూమిని తాకిన సరిహద్దులు పక్కగా ఉండిపోయిన ముహూర్త మండలంలో పోత పోసిన దీప కుండలని నింపిన ఆచూకీల మధ్యనే తలపడుతున్న కథనాల తొందరని కనిపెడుతూ ఉండిపోయాం. ఇంతవరకూ ఎప్పుడూ ఎవరూ చూడని స్త్రీ…
ఆమె వయసు ఎన్ని శతాబ్దాలోఎంత అడిగినా ఆమె చెప్పిన మనకి తెలియదు.
చూడడానికి ముప్పైఏళ్ళ వయసున్నదేహంలా … మంచి నీటి సరస్సులో అప్పుడే అమృతం తాగి నిద్ర లేచిన కలువలా ఉంటుంది.. రోజులో ఏ టైం లో చూసిన ఆమె అలానే ఉంటుంది.. చంద్రుడే కాదు … సూర్యుడి అతి లీల లోహిత కిరణాల నుంచి వెన్నెల తాగుతుందా అన్నట్లు ఉండే ఆ కళ్ళు.. లోపల నిరంతరమూ సంగీత సరోవరం కదులుతూనే ఉంటుంది.. దానిని ఓ రెప్పపాటు సమయం ఆపి.. మనలోకి చూడటమే మాట. ఆలోచన మహా లయంగా చేర్చిపెట్టుకున్న లక్షలాది కాగడాల వెలుగు చేరి ఆ హిమ పర్వతాల్లో భాస్వర ముద్దగా మారి భస్మమైనప్పుడు .. తీరిక చుట్టుకొన్న వీలు రాతల కొలువుని తాగి.. తూలుతున్న విశ్వ నిద్రాణ గతి త్వరపడే అడుగులు వేసుకొంటూ…..
……………………….
భాషణ విశ్వ పరిణితిని పట్టి తెచ్చే స్త్రీ గొంతు.ఏక శిలా మంటపంలో మోసి తిరిగిన జన్మ యానం.. తోడుపెట్టుకున్న దుఃఖ కుండలిని చిలుకుతున్న కలలని తలా చిటికెడు మట్టి పాటలని .. శృతి శరీర తాళం వేసిన నిర్ణయాలతో ఊరేగించి తడిసిన వృత్త శ్వాసల హద్దు.
ఆమె; నా వేపు తిప్పి.. ఎందుకు నాతో ప్రేమ .. అది అసాధ్యమన్నా వినవా? (ఆమె గొంతు నిండా హెచ్చరికలని చాటుతున్న మట్టి పుటలు.)
అదొక మృత్యు నిద్రకి పుట్టిన దేహ వైరాగ్య దండన .. ఎట్టి పోసుకున్న సమయముఖాల దుమ్ముగా పేరుకొని.. నీకు నువ్వే నచ్చని పరిస్థితి తెచ్చుకొంటావ్.. శతాబ్దాలుగా నాలోపల సేద తీరే ఏ నిశ్శబ్దమూ పుట్టలేదు. కన్ను మూసి తెరిచేలోపు యుగాల మంత్రం హొధాన కలగలిసిన ఖాళీ జాగారాలు.. ఉంది లోపల ఉనికిగా జారిపోతూ…
ఆశ్రయ నిందలు ఊరేగే నా కళ్ళలో ఆటువంటి మత్తు నీకెందుకు కనిపించింది..
అతను; విశ్వమంతా నిండిన నాదం నీ శరీరం లో కలిసి .. కనిపించని శ్వాస జాగ్రత్తలు తుడుచుకొంటూ .. జ్ఞాత మంజీరా ముద్ర ప్రవాహాలు చిత్ర నిందలని ఒడిసిపట్టి రాత్రంతా నీరుని తోడు కొంటుంది. అక్కడే నా దాహానికి నిద్ర పోసిన సరిహద్దు గతుల్లోని కలలు దొరుకుతాయి.
ఆమె; నా లోపలి ఓ క్షణం అంతే మొత్తం నీ లైఫ్ స్పాన్.. ఈ భాష ఈ క్షణమే .. నువ్వు చూస్తున్న ఈనేనుగా మరు క్షణం లోనూ ఉండక పోవచ్చు.. ఇదంతా నేను తెలుసుకొనే చేసేది కాదు….
అతను; నాకు ఆ క్షణాలే చాలు .. మొత్తంగా ధన్యత పొందుతూ సమయ జోలన ఊగే మంత్రం సారం ఊగుతూ ..పడి కొట్టుకొనే దృశ్య సాంద్రతలో పరిపూర్ణమయ్యే క్షణాలు కాసిన్ని ఉంటే చాలలు.
ఆమె; నువ్వొక భ్రమా శాపితవై నా చుట్టూ తిరుగుతున్నావు.. నీకు నేను ఏమీ .. చివరికి నీకు రాసి పెట్టిన ఆయుస్సుని కూడా.. ఇటు చూడు .. నా కళ్ళలోకి చూడు.. ఇందులో ఏమంత కలలు కూర్చొని లేవు. నువ్వు నన్ను శాసించాలని నా నిమిత్తం లేకుండానే సృష్టి నుంచి ప్రతీకారం మొదలైపోతుంది. నేను నీకు క్షేమము కాదని అర్ధం చేసుకో…
అతను; ఏం జరగాలో అదే జరుగుతుంది..అదీ నీ.. నా ప్రమేయ తీర్మానాలతో ఆగిపోదు. ఏం జరగాలని ఉందొ .. దానిని మార్చి రాయడానికి ఎవరొకరు నే వైపు వస్తూనే ఉంటారు.
హిమాలయాలపై కురిసే మంత్రం జగతి దాటుతూ .. శరీర గత తీర్ధ ద్రవంలో మోటుగా సర్దిన ఇల్లు. ఆ చెట్ల చివర ఇంకా కొనసాగే సందోహంతో అతను పడివున్నాడు.
……………………………..
ఇదంతా ఎలా జరిగిందని నేను వెనక్కి వెళ్లి ఆలోచిస్తే … కొంచెం కూడా తడబాటు లేని మరణ క్షేమం అవహేల చిత్రంగా పాలిపోయి నమ్మకాన్ని లోపలికంటా కడిగి కంటి ముందు సత్యమై నిలబడుతూ.. హిమాలయాల్లో .. ఎవరి కళ్ళోలోనూ ఇప్పటి వరకు కంట పడని ఆ పాత శతాబ్దాల గుడి..స్పృహలు తప్పి దొల్లుకొంటూ తను అక్కడకి చేరి …. అది యాదృచ్ఛికం ఏ మాత్రం కాదు. సృష్టి గమన కిటుకు ఏ రకంగా దాచిపెట్టుకొని ఉందేమో.. ఒక పరిష్కారం తమానత ఒంటిపై పోసిన పూతగా కందిపోతూ .. నిశ్వాస నిద్ర ముంపులని దాటుకొంటూ కలల మాయ కాళ్ళని దించుకొంటుంది.
ఓ రోజు తర్వాత స్పృహలోకి వచ్చాడు. అతనికి ఆ కొండలు ఎక్కే ట్రైనింగ్ ఎప్పుడూ తీసుకోలేదు. ఎవరి దిగులు కాస్త కూడా ఎప్పుడూ చదవ లేదు.. కానీ ఈ ఎక్కాలని తాపత్రయం.. చివరకి అది మృత్యువై తన ముందు వేలాడిన .. ప్రత్యేకించి తల్చుకొని అడగడానికి అతనికి ఎవరూ లేరు. తనకొక అడ్రస్ .. ఆచూకీ .. అసమాస రాశుల యత్న గతిని బిగలాగే నడకలతో ఊరేగుతూ తను ఇక్కడే ఆగాలని రాసి ఉందేమో..
ఆ పాత గుడిని నిశితంగా గమనించినప్పుడు చాలా ఆశ్చర్యాలు అతనిని ముంచెత్తాయి.. దీపాలు వెలుగుతూ ఆ ప్రమిదలు .. ఫ్లోర్ అడుగు ఎత్తులో .. గాలిలో .. మహా మూర్తి ఎవరో తెలియడం లేదు.. ఆ విగ్రహఃహాన్ని తాకినప్పుడు .. సన్నని విద్యుత్తు సెగ ఓ పులకింతలా..పైనుంచి పూలు కురుస్తున్నాయి.. ఆ పైన అంతకుముందు ఏదీ లేదు.. విగ్రహంలోంచి పరిమళం.. అలౌకిక సంగీతం.. గంట చప్పుడు.. అన్ని దానికవే… గోడలనిండా.. స్తంభాల నిండా.. గర్భ గుడి నిండా .. అంతులేనన్ని శిలాకృతులు.. చిత్రమైన రాళ్లపేర్పు కట్టడం..ననేక వింత రూపుల దేవతలు.. గుడి చుట్టూ … నీరు కనిపించకుండానే నీటి శబ్దం.. ఎవరు శుభ్రం చేస్తారో కనిపించ లేదు గానీ అత్యంత పరిశుబ్రాంగా ఉంది. నిండు అలంకారం తో దేవత.. రోజూ ఆ పూలని మారుస్తున్నంత తాజాగా .. పరిమళంతో … అగరు పొగ.. సాంబ్రాణీ ధూళి పుప్పొడి … చిన్న చెమ్మతో నిండిన గర్భ గుడి.
శ్వాస ప్రతీక్ష విడిచి పెట్టిన జాము మండలం లో ఒంటరి తమకంతో నీరై పోయిన మురిపెపు నిద్రలు కావలించుకొన్న గోడుగా నీలో కలిసిపోతూ .. వర్ణజాలం విసిరితే ఏర్పడే వలయంలో ఆకర్షణ పోసి.. నిద్ర వికార మూర్తులని వలస పంపిన సాయుజ్య మకలిత ముద్దునిచ్చే దీప బంగార ముట్టిడిగా స్త్రీ.
అదే మొదటిసారి చూస్తున్నాని తెలిసినా అలా ఎందుకో అనిపించలేదు. పరాయి కాని పరాయివి .. చాలానే ఉన్నాయీ సృష్టిలో … సకల నిత్యమూ..చేరగిలిన సకల మోక్ష కారణాలు.. గుంజేసే దేహ పరాదా లని దుఃఖ మంత్రం చేసే సమయ నిమంత్రత ..
ఆమె మొదటిసారి సంగీతంతోనే పరిచయం. గతి రాగమై మంత్రించి నిద్ర పొదలో చిక్కుకొన్న మూల దీప రహసితాలు ఉరుకోబెట్టుకొన్న లిపి సముదాయంలో కలగా బెట్టిన శ్వాస నింపాలని అనుకోగానే కలిసిపోయే నిర్ణయ వ్యతిరేకాల ఆరాలని గట్టెంక్కించి పైకి చేర్చిన నిద్ర కాపుల గుంజాట..
ఇదే రాగం? అని నేనడిగినప్పుడు …
ఆమె ఆశ్చర్యంతో ఇక్కడకి ఎలా రాగలిగావ్ ? అని అడిగింది..
(సంగీతాన్ని మించిన విస్మయం మరేం ఉందని నేను.. నేనక్కడ ఉండటమే విస్మయమని తను.)
అతను; నేను వచ్చానని నేను అనుకోవడం లేదు.. ఏదో నన్నిక్కడికి రప్పించింది.
ఆమె; అది అసాధ్యం.. ఇప్పటికైనా మించి పోయిందిలేదు.. ఇక్కడ నుంచి వెళ్ళిపో.. సాధ్యాసాధ్యాల (సృష్టి విషాదం మనలని పలకరించి .. గుర్తుపట్టలేదని తప్పుకొంటుంది. ఏకత గడించిన సంబరాలు వరస పెట్టి చేసుకొంటూ దారి తప్పిన నిసౌఖ ముంపులు.)
అతను: నేను పారిపోయి రక్షించుకొనేంత భాద్యతలు ఏమీ లేవు.. నేను ప్రతీ క్షణం చాలా స్పష్టత తో అన్నింటికీ సిద్దతతో ఉంటాను.. నా వెనక ఏ గతమూ లేదు.. మరో భవిష్య్తతు గురించిన ఆశా లేదు.
ఆ తర్వాత అతనికి ఏంజరిగిందో అతనికి అంతగా గుర్తు లేదు.
అదొక లీల సంధి చేయించుకున్న కలల మాత్రలు కరిగిన నీళ్లు తాగడం లాంటిది. మరోసారి శుభ్ర పడడానికి ఎవరూ ఎదురురారు. దేహ తేలికైనప్పటి మహా నిర్జన ఒంపుల్లో పడి కొట్టుకుపోతూ సమయ నిద్రాణ వంచనలోని ఇహిత శక్తి మూర్ఛనలు.
…………………………….
జరుగుతున్న ప్రాణాలయ తీర్ధ గతులని తప్పించుకొని .. జాగృత పుట్టుకలపై కన్నుని సాగదీసిన మూర్తవ సంకల్పం లోపలనే తిరుగుతుంది.. దానికొక అడ్రస్ అంటూ లేదు.. నిర్వికార ప్రతిబంధన అంటూ తడుముకోదు.. నిద్ర సాయాలపై కోత పెడుతున్న జాగారం మట్టి పోసుకున్న తీర్మాన రాత్రుల్ని దీవిస్తోంది.
కాని అతను చాలా విషయాలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొన్నాడు..
ఆమె దగ్గర ఉన్నప్పుడు శ్వాస ఏ మాత్రమూ ఇబ్బంది పెట్టడం లేదు.. చలి తెలియడం లేదు. కంటి చూపుల తీవ్రత పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అనాయాత్నంగా పెద్ద నవ్వు.. ఆయాసంలేని చాతి.. శరీరంలో అంతా నిండి ఊగుతూ .. చల్లని విద్యుత్ మండలాలు నరాల్లోకి పాకుతున్న తిమ్మిరి..
కాళ్లలో ఏదో పసరు రాసినట్లు.. చాలాసార్లు ఆ శీత దర్పణముపై అడుగు ఎత్తులో .. గాల్లో ఉన్నానని అనుమానం తో ఉలిక్కిపడి కిందికి చూసుకొంటున్నాడు.. పర్వత పాదాలకి వందల మీటర్ల ఎత్తులో తను ఉన్నాననేది.. స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఐనా ఒక నమ్మలేని మాంత్రికత వేటాడుతూ దీపాల్ని మింగుతున్నట్లు.. అదొక అయోమయమూ కాదు….
ఆమె ఎన్ని సార్లో దగ్గరకి రావడానికి వ్యతిరేకిస్తూనే స్పష్టంగా .. చాలా తీవ్ర స్వరంతో చెప్పింది.
.. నేను నీ ఆత్మ ప్రతీక్ష కాదు.. ఆ ఆత్మ వికారంలోంచి దగ్గరై.. ఎప్పటికైనా వెగటు పుట్టించే ఓ నిస్త్రంత కాగు ముద్దనంతే.. నువ్వు నన్ను కలిసిన ఏ శారీరక అలసత .. తదంత్యత .. తపనీయ దీప కొండలుగా కరిగే నీళ్ల బొట్టుగా నేను మారను.. ఇది నీ నమ్మకాలకి చాలా దూరంలో ఉండేది. నీ ప్రాణ శక్తిని హరించే ఒత్తిడి కమ్మేయడం ఎప్పుడో మొదలైంది.. ఇప్పటికైనా తొందర పడు.. ఇక్కడనుంచి వెంటనే వెళ్ళిపో.. కాపాడుకోవడంలో అసలు అర్ధం అదే..
నువ్వు నన్ను ఊహించ లేవు.. నాకు నేను దగ్గర కాలేను.. చూపుల అవస్థలో చల్లారిపోయిన నిద్ర రుచులు నా కసలే తెలియవు.. కలలు అర్ధం కావు.. అలాంటివి ఊహించలేను … ఆ ఊహ నిజమై దానిలాగా మారి మరు క్షణం నీ ముందు నుంచి మాయమై పోతాను.
…………………………….
అదెప్పుడు నేనై ఎప్పుడూ వినని మహా గానం… మరొక చోట .. మరొక మానవ దేహంలో .. అటువంటి గానం అసాధ్యమేమో అనేలా … పదాల ఖాళీలలోంచి ఆ గొంతు ఆత్మకి ముడి వేస్తూ.. విశ్వ జాగారంలోంచి నిస్త్రంత గతి సర్దుబాట్లు వెలిగీ ఆరుతూ తడి రాళ్ళ ద్రుష్టి భ్రమణ .. ఆ ఎదురుగా తనే మంచు చెమర్చిన శిలారూపంగా కనిపిస్తూ .. నిద్రాణ సతీతం లోని మసక ఛాయల మెళుకువకీ దిష్టిని తీసి.. పేరుకున్న నిద్ర రూప ధూపాల మధ్యనే తిరుగుతూ .. తదానన సేవల ఆశ్రిత మృత్యు కీర్తన.. ఇదొక ధ్వనిని సరి చేసే మనకాలని ఊడదీసి .. ఇంకిపోయిన దేహసాగులో తనే అడుగంటిన మూర్చన మూర్తులతో దగ్గరపడి.. ఇంకా కాస్త మాయా పులకింతలు వడపోసిన మాంస ద్రోణులు.
ఆ సాహిత్యం ఎప్పుడూ విన్నదిగా లేదు..సరి చెయ్యని అపార్ధ సాయాల కూర్పుని జోడిస్తూ కథలనే తిరిగి చెప్పుకున్న విసుగుతో నేనే నా నుంచి వేలసార్లు విడిపోతూ ఓ క్షణ విరీక్ష నేలలోంచి లేచిన పగుళ్లు. అదొక దీర్ఘ వర్తులంలో ఊరూ పేరూ లేని మసక నెమ్ముదలని కాల్చి.. అరగదీసి నీటి రేవుల్లో పొందికగా ఉంచిన జ్ఞాన కూర్పులు చేయించుకున్న తీర్మాన రాజీలు పూత పూయించిన స్పష్టత. ఇది ఉంది అంటే ఉంది.. కాదనడానికి మరేం దూరంలోనూ ఆగి ఏదీ లేదు. కొంచెం మసక బారిన నవ్వు కీడుగా తన తలపు మోసిన దుప్పట్ల రేవులో.. ఒక వేలి చూపు.. కాళ్ళు గిరిగీసిన ముట్టడి.. ఆ పై తేరుకున్న గంటల నిపుల రాత..
ఎన్ని పగళ్లు .. రాత్రులు మా నుంచి తప్పి జారిపోతున్నాయి.. సమయ ప్రవాహం తనలోకి ఎంత తీవ్రతతో లాగి తనలోకి ముంచేసుకొంటుందో తెలియదు. అంతా ఉపరిగత సన్న్యియం లోని ప్రాధమిక దశ .. ఇది ఇంకాస్త జరిగినప్పుడు నాతో కలిసి ఎవరూ రారు. ఉన్న చోటనే ఆగిపోయే నిద్ర చెరువుల ముంచివేత.. తాడు తెంచుకున్న నిద్ర రాళ్లు రేగిడి శబ్దపు నీటి బొమ్మని కడిగే రంగుల గుడి. ఉందని చెప్పుకోవడానికి లేని కథల నిదానత పెట్రేగి ఆ పై కొండని కూల్చి .. మరో విపాయ శ్రమ లేని ఏకత ఊపిరిపైనుంచి కళ్ళలోకి కూలి పడుతుంది. స్పృహలు గడించిన దేహ నౌకా విషాద మునక .. తీవ్రజడి కురిసిన కొండల పియానుంచి ఆవిరి పట్టిన గాలి శ్రమలు ఒలకబోసిన దూరాలలోంచి కదలని సృష్టి మసక సన్నని గాలుల ఘీంకార సృష్టి ఖజానా లో మొండిగా దిగబడ్డ కన్ను. ఆ పక్కకి తప్పుకొన్నప్పుడు మెరుగుతూ చిన్న పోటుని మోసి కెరటాలని తీర్చి దిద్ది.. ఉనికిని వదిలేసి మూర్త రాత్రంలో కదలాడే నిద్ర కూర్పులు.
…………………………………
ఇదెలా కుదిరిందో నాకూ అర్ధం కావడం లేదు.. కేవలం మృత్యు వాత పడే ముందు .. ఈ గుడిని . నా పాటని వింటారు.. ఆ తర్వాత పంచ భూతాల్లో వాళ్ళ ఆత్మలు ఈ జ్ఞాపకాన్ని వదిలి కలిసిపోతాయి.. కానీ నువ్వే సృష్టి ఏం తలచుకొని పంపిందో అర్ధం కావడం లేదు.
మృత్యువుకి అతీతంగా వెళ్లి దూరం జరగగలుగు తున్నావు. ఇప్పటికీ శూన్య వాణి నీకోసం ఏదీ వినిపించ లేదు.. నిన్ను గురించిన ఎరుక వాళ్ళకి లేదా అనుకొందామంటే .. నువ్వు ఇంతసేపు బతికి ఉండటం అసాధ్యమయ్యేది. ఇంకేదో నిర్వచనము లో నువ్వేఉన్నావనే ఇప్పటి నా నమ్మకం..
ఆకలిదప్పులు జయించేలా చాలా మార్పులు చేయక పోయుంటే ఇదంతా వీలు కాదు. నీ దేహాన్ని .. ఆ మృత్యు దర్శనాన్ని దాటించే దశగా ఉంచి ఉంటారాని నా అనుమానం.
ఈ గుడి అయస్కాంత ఆకర్ష వికర్ష లకి వ్యతిరేకంగా జరిగే నిద్ర చలన కక్ష్య .. ఇదే ఉన్న చోట ఉనికి రెండో కన్నుని తిప్పి చూసుకొంటుంది. ఈ అద్భుతం మనిషి సామాన్య గురుత్వాలకి.. శ్వాసల మధ్య ఖాళీలకు చాలా దూరం వెళ్లి ఆగిపోయిన నిద్ర సవ్వడి ముప్పెనలు.
అలవాటైన మన స్పృహలని కాదనే హెచ్చరిక .. కదలని సమయనిందని లాగి.. దూరంలో ఊగిపోయిన దృశ్య మమంత్రాన్ని వేడికి జేర్చి.. కొత్త గది ఆనవాళ్లతో గుడిని కాదని .. ఒకింత శుభ్ర లిప్త తాకిన జాము మౌధరవుల మునక .. ఒళ్ళంతా ఓదార్చి జాజుమూర్తుల ఒదిలిక సంతర్ప మూర్తుల వీధి నిండా కదిలి ఉత్సవ నిద్రాణత ఒంపి పెట్టుకొన్న కాళ్ళ కలాపం లో చెమరించే అనుష్టాన ప్రశ్నలు. ఊక దంపుడు సమాధానాలు దేనిని అందుకోవు.
ఇలా ఆమె అతనికి రోజులుగా చెప్పుకొంటూనే వస్తుంది..అతను వినని వాడిలానే ఉంటున్నాడు. విని మారిపోవడానికి.. వదిలి వెళ్లిపోవడానికి అతనికి మరొకటి అంటూ ఏం లేదు.. ఈ క్షణంలో చావైనా అతనికి అల్లాడే వాళ్లంటూ ఎవరూ లేరు.. రారు.. అడగరు.. అటొక ఓ క్షణం చూపూ విసిరారు.
ఈ రోజు ఆమె మరింత గట్టిగా చెప్పి వెళ్లాలనుకొంటుంది.. ఆమె ఓ కచ్చితమైన నిద్ర ఝాతరలో తిరిగే .. ఓ బలి మూర్తిలా అతను కనబడ్డాడు. అది ఆందోళన.. అభద్రతా .. లేదా అతనిని ఉనికి నుంచి ఇంకేదైనా జరగాలా ? అది ఆమెకీ స్పష్టం కాదు.. అలాని.. ఇలాగే ఉండనిద్దామనీ లేదు.
అతను పెళ్లి గురించి మొదటిసారి అడిగినప్పటి నుంచి…ఎన్ని చెప్పిన ఏదీ వినడం లేదు.. ప్రతీ రోజు .. రేపు నేను రాను.. ఇక రాలేను .. అటుందే గాని .. ఆమె వస్తూనే ఉంది. రంగుల గున్నంలో పడి తిరిగే దృశ్య చిత్రాలు ఆమెకి దేనిని అందివ్వడం లేదు.. మృత్యువుని మించీ ఇంకేం ఉంది..నేను దానికైనా సిద్దమే నాని ..ఆత్మ రక్ష లేని ఆ మాటల తర్వాత ఇంకా ఏం సాధించాలని అలా చెలరేగిపోవడం.. లేదా మసక బారిన ముఖం తో శిలలా మారడం.. ఏదీ మరో చోటుని అతనికీ మిగులుస్తుందా అదీ తనకి తెలియదు.
విశ్రామ ద్రవం ఊరేగే నిద్ర కథలో జారాడుతున్న కమలిక హద్దులే బయటగా ఉంచి పోయిన నిర్ణయాలని పట్టుకొని .. జత సందడి మోగుతున్న విశ్వ క్షేత్రంలో కదలికల్ని కప్పుకున్న మాటల వినికిడి గది. అతను దాంట్లో తిరిగే దేహం లేని మహా నిద్ర మాసిన మట్టి కొండా.. కుండలో తోడు పెట్టిన శ్వాస.. నిద్ర తీరికలు లేని ఊర్పుల ఇంగిత సత్తువ.. మిగిలిన తలుపుల బయట కనీరు తిప్పుకున్నా గానుగల ఆత్మ పిప్పి..
……………………………
మంచు తూఫాన్ .. అవలోక తీర్ధ రథమే తిరగబడి హిమాలయం పిడుగు మోయలేక కూలినట్లు కూలుతూ.. బరువెక్కిన చీరని వదుల్చుకొని సృష్టి పెడుతున్న పరుగుల తూఫాన్.. గుడి చుట్టూ ఓ రక్షా వలయంలా . అక్కడికి మాత్రం చిన్న మంచు పెళ్ల కూడా విరిగింది రావడం లేదు. ఇది ఇలాగే పెద్ద మూర్తుల చీకటిని పట్టుకొని అందిపోసుకొన్న నిద్ర సన్నని పూరి బిగువులని చల్లింపజేసి అర్థమౌతుంది.
అతనికి తీవ్ర జ్వరం .. వాళ్ళ శారీరక కలయిక .. వేడెక్కిన తూర్పు శంఖాల మహా ముద్రల వేడుకకి దారి గుమ్మరించిన నిద్ర తీరికలై జోడించి .. పడి లేచిన కాళ్ళ మునకలని వదలక దూరం జరిపిన మంద్రత బిగువుని దాటించే తీరిక తో ఉన్నామని అనుకోని.. ఉండక తీరుగుకొని.. అవలసత అనేకం లో తీరిక చేసుకొన్నా మృత్యు హామీలు కాగిపోతూ .. సమతమా ఆయూరాల్యత మోగే దూరంలో రెప్ప పొడి మరిగే నిద్ర కరువులు. దిగులు.. మృత్యు అంచులు తాకడం.. ఇంకొక సంగీత సాన్నిహిత్యం తో పొసగని విందులోకి దీర్ఘ శ్వాస తీసుకొని తప్పిపోవడం.
వేడెక్కిన తూర్పు శంఖాల మహా ముద్రల వేడుకకి దారి గుమ్మరించిన నిద్ర తీరికలై జోడించి .. పడి లేచిన కాళ్ళ మునకలని వదలక దూరం జరిపిన మంద్రత బిగువుని దాటించే తీరిక తో ఉన్నామని అనుకోని.. ఉండక తీరుగుకొని.. అవలసత అనేకం లో తీరిక చేసుకొన్నా మృత్యు హామీలు కాగిపోతూ .. సమతమా ఆయూరాల్యత మోగే దూరంలో రెప్ప పొడి మరిగే నిద్ర కరువులు.
ఎవరు ఈవారిలోకి అడిగిన చోటు కొత్త నిండని కాల్చి తూర్పు మంత్రాన్ని పాటిస్తుంది. కథ నాకు కావాలేమో… అతనికి ఏం కావాలో ఇంతవరకు అర్ధం కాలేదు.. ఏది సర్వస్వం అనే దానిలో అతనికేం అనుమానాలు లేవు.. రస దగ్ద యజ్ఞ శాలలో జల్లించిన నిద్ర చీలికలని కడిగి తనని చూడ గలుగు తున్నాను.. నాకు నేనే మరో పరిచయంలో సమయాన్ని కలుసుకొని వీలునామా ఇవ్వాలని నాలోకి నేనే నవ్వుకొన్నాను.
. ……………
ఏది వినాలనుకొన్న తనకంటూ గతమే లేదంటాడు.. గతమే నువ్వు.. మనడోకా సంచార్య నీలం లేని ఎర్ర కలువలు మెట్ట .. పైనే ఎవరో గుడిని కట్టి ఇక్కడే దిగేసి పోయారు. ఇక్కడే నా మృత్యువు పాడుకొంటున్నా నిద్ర రుణాల సంగీత చిత్రం కరగ బెట్టి .. గామెపుడు సమయ సత్తువుల విశ్వ మోడులా మంటని ఊదుతాను.. అతనెప్పుడూ దేనికైనా సరేనంటాడు.. తనకేం జరుగుతుంది అనే భవిష్యత్తుని నేను చూడాలని వేడుకొంటాను.. అప్పుడే చీకటి మొదలై .. సుమారు పదిహేను రోజుల కల్లోల మూర్చనల సల్లోలం నేనై బిగిసిపోతాను.
అతని గతాన్ని ఆమె మార్చడం. అతనిని తనతో కొద్దీ రోజులు ఉండేలా ఆ గతాన్ని మార్చుతూ వెళ్లడం. సన్నని పొలమార్పు తో ఎవరో నా గొంతులో తీరికి తిరిగి చెవిలో చెప్పి వెళ్లారు.. ఐనా నమ్మలేనని .. నేనన్నప్పుడు పెద్ద మూటల ఇల్లు బీటలు తీసి మహా మూర్చనల నిద్ర రేవుల బయటనే బరువు దించుకొంది.
శ్వాస రీతులని సరి చేసి భూమి కాటుక దిద్దేదెవరు?
వాళ్లే ఈ హిమాలయాల్లో ఎక్కడో అక్కడ ఎదురు పడకపోరు.. ఆశ్రిత చోటుని ఇంకాస్త ఇచ్చే తననీ నీలో ఉంచుకో అనీ అనకపోరు. అన్నప్పుడు .. అనలేన్నప్పుడు .. ఎప్పుడూ ఒకేలా అలా ఎలా .. కాదని వదిలేసి వెళ్ళిపోతాడు .. నేను అతనిని ముఖం మీదే ఉమ్మేసి ఈసడించుకొని వెళ్ళిపోతే.
ఇదెందుకు ఎప్పటికీ ఇలాగే ఉంది?
అలాంటి శాశ్వతాలనేకం లో ఇదీ ఒకటంతే .. ఓర్పుతో పెద్ద గతి మార్చి రాసే స్వయం ఉనికిని దాని వెనుక స్త్రీ గా ఒంచిపెట్టుకొన్న ఆందోళన రాశుల ముద్దా రూపును .. పిసికి .. రెండో వివర్ణ మోతాదు దాటని జుంపీలతో వదులైన కిటికీల మధ్యనే కన్నుని వడపోసుకొన్నాం.
సమయ నిద్రానంలో జాడించి పెట్టుకొన్న తీరికలు ఏ కలలని ఇచ్చి వెళ్లిపోతాయో… అవి నన్ను సగం సగం కలలతో నిలబెట్టి .. దీప జువ్వలుని మోసి రాల్చిన శ్వాస దూరంలో ఊరేగే నిద్రపుట్టులని తెగ్గొట్టి … మరింత ఎత్తులో నిద్ర అంచనాల ముడుతలని తీసి కొత్త రాత రుద్దుతూ..
అవి ఇద్దరవే వేరు వేరుగా ఉంది నిందించుకోవు .. నొప్పికి కాల్చి నిద్ర రసిని కెలికి మాటల్లోకి తూలీ ముడుచుకు పోవు.. అంతా నిన్నటికి లేదు.. రేపటికి ఏదీ ఇక్కడే అవుతుందా? అసలీ గుడి ఉనికి నిర్ణయించేదెవరు? ఆ సముద్ర తలం పైన పడవని కుదురుగా కర్రకి కట్టి లంగరేసామంటారు.. ఆ కెరటాలు గడ్డకట్టినప్పుడే వణుకు మొదలై ఇక్కడ ఇలా పాతుకు పోయాయేమో.. కొంచెం తెలియాల్సి ఉంది. కంగారు పడకుండా అర్ధం చేయించాల్సి ఉంది….
…………………….
. ఆమె అన్నీ confuse చేస్తూనే ఉండేది.. తనని తాకితే ఊహించలేనంత అతని లైఫ్ సైకిల్ ముందుకి వెళ్లి పోతుందని.. ఆ తాకని ప్రేమ మాత్రమే తనకి చాలనేది.. అతనిది ఏ మాత్రమూ ఒప్పుకోలేనిదిగా ఉండేది. ఒక అర్ధవంతం లేని అనుమానం చుట్టేసి కంగారు పెట్టేది..
ఒక్కోసారి నిద్ర లొంచి అరుస్తూ .. ఇదంతా నీకు అర్ధం కావడం లేదు… నాకు సంబందించినదేదీ నీకు అర్ధం కాదు..
ఆమె చాలాసార్లు మనిషి నిలబడ లేనంత సన్నని శిఖరం పై నిలబడి .. అక్కడి మంచుని దోసిలిలోకి తీసుకొని.. సూర్య కిరణాల ముందు ఉంచగానే .. ఆ మంచు బంగారు రంగులో మారేది.. దానిని ఆమె తినేది.. మామూలు ఆహారం అతని కోసం ఎక్కడనుంచి వచ్చేదో అర్ధమయ్యేది కాదు. ఓ తెల్లవారు జాము అతను నిద్ర లేచే సరికి ఆమె చాలా పెద్ద నెమలిపై ఠీవిగా కూర్చుని కిందికి దిగుతూ ఉంది. ఆమెని దించిన ఆ నెమిలి ఒక్కసారిగా మామూలు సైజు కి మారి అక్కడ నుంచి ఎగిరి వెళ్లిపోయింది.
అతనికి ఒక్క రోజు మాత్రం మైధున కల. విచలిత కంటి క్షేత్రంలో పోగొట్టుకొన్న విశ్ర గతి సంధిని వదులు చేసి.. కలల ఉరుము మోసుకున్న చిత్ర జ్వరం తెగిపడ్డ ఆధార స్థలంలో పడి రాలిన ముఖాలు గుచ్చుకొని.. ఐహిత సత్తువు గుచ్చంతో విడదీయలేని దేహ వలయాల నిద్ర గుహ తెరిచిన తాళం చెవి చప్పుడు లేకుండా తెరుస్తూ.. గ్లానా నిసార తీపి ధారని తగ్గించే ఋతువుల ప్రోక్షణ కాదనుకొని విశ్వ సంచార్య కొండలపై .. గుండ్రంగా తిరుగుతూ.. లోవలోకి కూలి అంతలోనే నిచ్చెన మెట్లని కదిలించి ఎదురుగా విస్ఫోట చీకటిని నాకేస్తూ..
లేచేసరికి మరో దశాబ్దం తనలోంచి తరిగి పోయినట్లుగా… తలవని తలపుగా కలలోకి వస్తేనే … ఒక సంకల్ప సమ్మోహన అరాయించిన ఆయుస్సు 10 ఇయర్స్ అనేది ఆమె చెబుతుంటే physical చేంజెస్ మాత్రమే నమ్మించేలా ఉన్నాయి..
అదొక సమయం కూలిన ఆర్ద్ర వలయం.. పైకీ కిందికీ కాని విశ్వ నిద్రల కల్లోల తమకంలోని విశ్రాంత తలుపుల దీప రేహానా ఒరిపిడి తంత్ర మొహం లో పాట.. ఒక శిధిల అంకురార్పణ .. ముత్తడి గర్భ సంభోగ మితి.. ఇంకాస్త జన్మ ఖాళీలో తడబడే మెతక గాలుల తీరుని మార్చి రాస్తూ కదలిక లేని సర్వ రక్షణ తీరికలు వదులుగా కట్టుకొన్న పై ఎత్తు మెట్లపై కాసింత నిద్ర రేవులని తవ్వే కుదురు నడకలు..
సంగీతం.. ఆర్ద్ర వలయంలో కన్ను తీర్చుకున్న నిద్రాణ గతి మూర్తులని పోతపోసి నవ్వుకొనేదెవరు?
అతను నేర్చుకొన్నది అదేనని కౌగిలిలో మోక్ష మితి సర్దుబాటుని ఎక్కించి .. దిగ్గొట్టి.. పగులగొట్టిన రంపపు కోతల నిద్ర భాంగంలో ఊరిగీ.. స్థల గంభీరాల సయోధ్య మితి ఎట్టి రాల్చే తీరికలు కుదురుగా లేవని.. అంతే ఉంచిపోయిన గాలి మూర్తుల కొండ పై కథ ఊరేగుతుంది.
విశ్వం ఎన్ని వలయాల ఆవల పుట్టుకని నిర్ణయిస్తుంది.. ?
ఒక రోజాతను అదే అడిగాడు.
ఆమె అదోలా చూసి.. నేను ఈ కక్షయాలల్లో పడి గుండ్రంగా తిరిగే ఒక మామూలు రూపమంతే.. తరుగు పెరుగులేని శతాబ్దాల యాత్ర ఎటు నుంచి ఏం పొంచి ఉందని నాకు కొంచెం కూడా తెలియదు.. ఏదో కొన్ని సమయ రహస్యాలు ఆవహించి అర్ధం చేయించాయింతే … ఇదంతా పెద్ద అవగాహన తో నేడ్చిన .. నా పాత్ర చాలా చిన్నది… ఇది శిక్షో .. వరమో నాకిప్పటికీ తెలియదు.
…………….
భూమి ప్రేమ గురించిన ఆమె ప్రశ్నలు అతనికి ఊపిరాడకుండా చేస్తాయి.
ఈ సకల ప్రేమ నిద్రాణత ఎర్ర వాగుల మట్టి కిటికీ..కొన్ని పురా స్మృతి జననాల కృతి సాగదీసి మార్చి రాసిన ఖాతా… పెద్దగా అడుగులని ఎవరూ వేయడం నేర్పలేదు. సరిచెయ్యని నడకని ఎవరూ దిద్దిపోలేదు.. ఇరుక్కుపోయిన మంత్రం స్థలంలో కునుకు పాడనీ కన్నుని తాగి .. ఇంకాస్త చోటులో.. విసిగిన నిద్ర పంచానామాలని సర్దుకోమని దగ్గరకి జరిగి మరింత చూపుల మరకతో తోడు పెట్టుకొన్న నిద్ర భాగాలు కోలాటం లో కలిసిపోతాయి.. అంతే జరగాలని.. ప్రతీ పాత్ర ఇదొక రోజు ముగిసేదిగా ఉందని అనుకొంటూ దీర్ఘ వశీ ఆయుర్దాయంలోని అడుగులు సర్ది చెప్పే ఆచూకీలని దాచి పెడతాయి. అక్క ఊరుకొని ఇంకేదో దీప పాలని పట్టి .. హిమాలయాలని వెలిగిస్తారు. ఇక్కడ ఇంతే మిగిలిందని అనుకొంటూ సర్వ నిద్రాణ ముఖాలు తీరు మారుతూ దూరంలో అంటుకున్న కొండ రేవులని బదులడుగుతారు. నిజం ఇది సగం సమాధానమూ.. సగం ప్రశ్న .. బదులేని సహకార మంత్రం వేసుకొన్న తీర్ధ వాకిలిలో ఉండిపోయిన అతిధి రక్ష ఓడిపోయాక .. ఇంకో అవసరం లేని ఇంటిని కాదని అంతే దూరంలో వదులుకొన్న నిద్ర భావులకి గండిపడి.. ఊరుకోలేని విశ్వ గతి పట్టుతప్పి.. అరాయించుకొన్న మితి గంటల చప్పుడుని కాల్చి ఇంకా కొంచెం నడక పండిస్తూ వెనకనే వస్తారు.
ఇక్కడా ఇదే మితి అని చెప్పడానికి.. వినడానికి ఎవరూ లేరు.. అంతా నిమిత్తం లేని ఆయాసంతో తిరుగుతూనే ఉంది.. ఉంటుంది.. వెనకగా ..నా గది.. అడ్డమో. రాసి పెట్టిన డిజిటల్ డైరీ.. ఓ ఆల్బం .. కొన్ని పిచ్చి మొక్కలు.. గోడ వారగా కొన్ని ఫోటోలు.. దీపాలు.. చెప్పులు.. తేనె కుండ .. ఎత్తు గడప.. నులిమిన కేలండర్.. బస్సు టికెట్.. ఓ జత బట్టలు.. సగం విరిగిన బొగ్గల ఇస్త్రీ పెట్టె.. ఇంకా కొట్టని గోలీ షోడా.. పెద్ద పుగాకు కట్ట.. మామిడి కాయల బుట్ట.. పెరుగు తోడు పెట్టిన ఉట్టె … ఇదొక పరాకాష్ట .. పైకీ కిందికీ జరిపి.. అవుననే .. కాదనీ .. జత జంత్ర వాయిద్యంలో తిరిగి రాలిన మాటలు.. పోకూడని దారులు.. కంకణాలు.. మెడలో పూసల దండ .. చెక్కబొమ్మలోకి దూరిన ప్రాణం.. జాగ్రత్త చేసిన చూపుల వివరం ఓడిపోయి .. అలసట మోసిన సమ ప్రాప్త గతి సహకారమే ఇక కొత్త చోటుని విరిచి చుట్టుకొని దీపాల శక్తి సాంద్రతని ఏమార్చి .. మన నడకనే దారి తప్పించి .. హమ్మయ్య .. అనుకొంటుంది.
…………………………..
చీకటిని ఇష్టపడక పోతే మనం ఏమేమి పోగొట్టుకోవాలి.. శ్వాస నిర్జనలో ఆత్మ తపస్సు చూసే దేనిని?
తెల్ల చీకటిలోకాళ్ళు పోగొట్టుకొన్న నడక .. జన్మల ఊయల ఖండంలో .. జాగ్రత్త చేసిన నిర్మాణ కృతులు.. పెద్ద గందరగోళంలో పడి ముక్కలై .. ఒకింత విశ్వగతి సమయ ప్రాంగణం లో ఓలలాడే తీపి ముద్రలని ఓ కొలిక్కి తెచ్చి .. ఊరుకోబెట్టలేని సతత రూప ఫల యాత్రలో కదలాడే కీర్తన అతనికి పట్టుబడుతోంది.. కాని ఆమె లో కొత్త అలజడి అది రాస్తూ పోతుంది..ఇక ఇలాంటి కథనే వినాలని ఓర్పు పట్టుకొన్న శరీర దూరం లో కినుకగా ఉంచేసుకొన్న మెట్ల పక్కనే దుప్పటి కప్పుకున్న హిమాలయం తన తలని చదవమని పాటని సర్దుకొని బరువెక్కి .. గొంతు నల్లగా మారాక అరుస్తూ .. కొత్త దిక్కులా ఒరిపిడి పగలగొట్టిన తర్ఫీదులతో చల్లారి … అక్కడి ఉంచిపోయిన రెండు వ్యాక్యాల తీర్ధ స్థలము .. పేరుపడ్డ రథాల కేంద్రంగా ఉంది..
అదే తన ఇళ్ళని… మళ్ళీ మళ్ళీ అనుకోని .. సరిపోని జాగారాల వంతెనని ముట్టడిస్తూ .. జరగరాని .. ఉద్రేక మంత్రం చెమర్చి పెట్టిన విసుగు .. ఇక చాల్లే అనిపించాక … ఇంకేవో సన్నని పురులతో చెవిలో గోలపెట్టే మాటలు .. పాటగా జమిళించుకొని ఆ దూరంలో వర్షాన్ని పోసి తవ్వుకొన్న కొండలని .. పొడుగ్గా ఆరబెడతాయి. అక్కడే శ్వాస నిర్జనలోనే .. తన ఆత్మ తపస్సు మొదలిఅందని అదొక చిత్రమైన కల్పనా ముద్రాలని పొంది… అని ఆమె చెప్పడం ఆపి ఒక్కసారిగా కూలిపోయింది.. ఆ పర్వత సానువుల్లోనూ అంతే పెద్ద చప్పుడు. ఇంకేదో అర్ధమవ్వనిది జరుగుతూ పోతుంది.. కొంత సరి చెయ్యాలనే తపమేయా జ్ఞాన విరూప ధూపం కమ్మేసుకొంది. అలవాటు పడమని .. అంతలోనే వద్దని ఎవరూ చెప్పడానికి రారు. లుపు చివర నిద్రనే వడపోసి కథలని మార్చి చేరుకొంటారు……
……………………………..
స్వర్గం ఉనినికి ,,, సంగీతం ఎంత దూరం లో ఉంటుంది..
అది తెలుసుకోవడానికే .. తను అన్నింటికీ సిద్ధమని అన్నాడు.. ఆమె దుఃఖం ఆగక పోయిన అతనికి బలంగా కౌగిలించుకొంది.. శతాబ్దాల స్త్రీ ధూళి ఆమె గర్భంలోంచి రాలుతోందా.. రెండు చెవుల్లోనూ .. హిమాలయాలు చంటి పాపలా ఏడుస్తున్న సూచికలు .. ఎంతో అనర్ధం జరిగిపోయింది.. నువ్వు నాతో మోసపోతావా పురుషుడా ? అంది.. ఆ అడగడంలో మాతో మాయని తుడిచినా తడబాటు. మృత్యువు పక్కగా శ్వాసని నాకుతున్న స్పృహలోంచి కదిలి మళ్ళీ గడ్డకడుతూ.. నిమిత్త శృయామ సత్తువు దీర్ఘ సంపత్తిగా ఉండిపోయిన హిమాలయ గొడుగు కింద గుడి వణుకుతూ…
అతను కన్నైన తెరవకుండా .. నాశ్వాస ని తీసేసికో .. సృష్టి లాకొన్నే లోపు .. అదే శాశ్వతం చేసే నా రూపుని నీ కడుపులోకి దించుతుంది.. ఏదైనా జరగనియ్యి.. నీ పాటని .. ఈ ఇంటిని దాటి ఎటూ వెళ్ళిపోనిద్దోద్దు.. చివరికి నా అంత్యక్రిలని కూడా ఇక్కడే .. ఈ ఇంటిలోనే.. నువ్వీ గడపని దాటి కిందికి దిగొద్దు..నా ఆత్మ కావలిగా.. నీకూ .. నీ బిడ్డకి.. ఈ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.. నాకేవో మాటలు కొంచెం చిట్లి వాన కుండలా చేరి వినిపిస్తున్నాయి.. కంగారుగా కాదు.. నిదాన శ్రుతుల జయద్వనమేదో చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిగా చనిపోయి తిరిగి నీ లోపల జన్మ క్రియని మొదలు పెట్టడానికి సిద్దమై..
మరేమి అనుకోవద్దు.. నా క్షేమం నీ ఊపిరిలోకి దాచుకొని.. నేనొక బిడ్డగా నీతో ఆడుకొంటాను.. ఇంతకంటే ఏమి చెప్పేంత ఆయుస్సు నాకుందా? మహా నీల కంఠం జరిగిన పునాదుల మధ్య కైలాస ధార అటు ఇటుగా కురుస్తూ .. ఇది నా ఊపిరిని అల్లుకునే ముహూర్త సమయం.. ఎవరూ నన్నేమి పిలవొద్దు.. చేసుకుపోండి… పాత ముద్ర ముడులు ఊడకా తనని గాసిరినప్పుడు.. వాల్చిన రెప్పలా కింద బిగించిన వాన ముంపునీ జోడిస్తూ.. ఇంకేం జరగాలి.. త్వరగా పదా ? అని … ఎవరో తరుముతున్నట్లు..
… అతని ఊపిరి ఆగేలోపు.. ఎవరో తరుముతున్నట్లు.. విశ్వ గతి నిద్ర రెండో వీపుకి ఒరిగిన చీకటితో.. సంతూరయ శ్వాస లీనంగా వేలాడే పర్వతాల మధ్య కూలబడ్డ విదూమిక దూళి చిత్రమై.. దేహం. కవ్విస్తున్న విస్తృమిత విరాగి తవ్వకాలు మృత్యు సంకల్ప ముసురుని జోకొట్టి రెండో గుమ్మంలో వెలిగించిన మంటని తీసుకొని..
ఆమె అక్కడ చితి ఏర్పాటు చేసి.. అతనిని ఓ మంచు తల్పం పై పడుకోబెట్టి ఆమె ఎగిరి ఆ చితి పై కూర్చుని తన చేతి నిండా మంచు తీసుకుని.. ముద్దగా చేసి.. నుదిటి బలంగా మూడు సార్లు కొట్టుకొంది.. అంతే ఒక్కసారిగా ఆమె చేతిలోని మంటతో చితిని వెలిగించింది… విశ్వం చుట్టూ సంధించిన చీకటిని .. రెండు కాళ్లతో ఈదుతూ మరింత అలిసిన చెమట బండ్లపై .. తిరిగిన శ్వాస దిమ్మలని ఏమార్చి.. కరిగించే సముదాయ మంటలు..అంతటి మంచు పొదల్లో…
అతని శరీరంపై ..వేగంగా జరిగే వయసు మార్పులు ఆగిపోయాయి. అంతా ఒక శాంతి ముద్రలో వెలిగే శిలా తలపంగా మారి నవ్వుని అరగదీస్తున్న రెప్ప ముద్రాలని తుడుస్తూ .. అడుగులని నిర్ణయంలోకి తీసుకుపోతుంది. ఇదే ఇంతేగా ఉండక తిరిగిన జ్ఞాన నిమూర్తి నిద్ర పర్వంలో మరో రాతకోతని వద్దని… చూపు నిడివిని కత్తిరించిన ఇంటి ఖజానాలతో తలపడి.. తలా పగిలి విసిగి.. వణుకు ముడిని లాగి బిగించి.. తేరుకుని.. ఆ గట్టుని దాటి..
ఆమె శరీరం ఎన్నో శతాబ్దాల శిధిల గతులూ.. రాత్రులూ.. ఒంటరి అనుమానాలు మస్తిష్క మూర్ఛనలు… వాంఛ పరిభ్రమణ దానిగా నిండిపోయిన దేహం లోని అసమ గతులతో సహా తగలబడుతున్నప్పుడు.. శూన్యవాణి విస్పష్ట అధికార నివ్వెర కాపుకాచినా నిండా సమయ ఘటనలని ఊగించి .. శృతి సముదాయ నిర్వాకాలతో తలపడే నిషా గాయత కళ్ళలో పండి.. స్థితి చిత్ర మిగులుని వడపోసి.. దోపుకున్న అనుమాన నిర్దేశాల మధ్యనే చేరదీసి కన్ను జంటల చప్పుడుని ముంచి.. నీకోసం మరో పురుషుడిని పంపిస్తున్నాం.. ఇతనిని మర్చిపో.. అతనితో సంగమించు నీ కంతా మంచి జరుగుతుందని..
ఆమె నవ్వింది.. మొత్తంగా హిమాలయం భయంతో వణికి ముక్కలయ్యేలా ఉందా ఆ నవ్వు.. కోటానుకోట్ల అనుగ్రహ మంటలు తిరగబడి.. హిమాలయాలనే మరిగించి కూల్చేస్తాయనే భయం తిప్పుకొని ఉపేక్ష రాజీతాల మధ్య .. ఉనికి విసిరినా కొరడా చప్పుడు పండి.. పెకిలిన క్షణాలు .. ఆ నవ్వు. దేహమంతా చుట్టుకొన్న సముద్ర కెరటాల పైట పట్టిన వెలుగు పిడుగుల మూట .. ఆ నవ్వు.
ఇంకా ఏ అనర్ధం జరగలేదని .. నువ్వను కొంటున్నావో నాకైతే తెలియదు.. నా ప్రియుడిని కాపాడుకోలేని.. ఈ వరాలు నాకెందుకు.. మరో పురుషుడనే పదం .. నా సమాధి పై నా అనుమతి లేకుండా తిరిగే నల్ల గాలితో సమానం. అదొక పాషాణ ధారతో కలువల నిండు సరస్సుని మాడ్చేయడం.. ఇంకేం జరగదు.. నీ నుంచి.. అలా ఈ సృష్టి ని ఆదేశిస్తాను ..
విసిగి వేసారిన ఈ దేహాన్ని ఇప్పటికైనా కాలానియ్యి.. వీలైతే నాకెంత బాధనైనా ఇవ్వు… నా పురుషుడికి మాత్రం అనాయాస మరణ మివ్వు.. సంఘటిత శక్తుల నిద్ర గోష అతని చుట్టూ గుండ్రంగా తిరిగి కాదలనే .. ఆ నిస్సంశయ ఆశని ఆశ్వీరదించు.. కదిలి కలిసి …పెల్లులుగా చిట్లి.. ముక్కలుగా పొంగి.. కరిగి.. దీప శాపపు నిద్రజోరుని మోగిస్తూ రాలిపోయే .. ఈ పర్వత సానువుల నిండా అతనికి .. నా పాటని నింపు.. వింటూ ఊయించే గాలిని కదలనివ్వు…
శూన్యవాణి గొంతులోనూ బరువు.. అతనూ ఇదే కోరాడు.. నిన్ను నేను కాపాడ లేను… ఒకరి ఉనికిని మరొకరి కోసం వదిలిపెట్టేయగల చింతన గడ్డ కట్టిన .. ఈ అసంతులన స్థితిలోంచి … నా నిస్సహాయత .. ఎవరి ముందు జోడించి నీ కై వరం పొందాలో .. నాకీ క్షణం ఏ మాత్రమూ తెలియడం లేదు.. ఇంకేదో జరగాలని కోరుకొనే నా అసహాయతని అర్ధం చేసుకో.. దగ్గరకి తీసుకో
ఆమె ఒక్కసారిగా అరిచి.. నా ఉనికిని … నా సంగీతపు ఉనికిని .. ఈ భూమి మీద బ్రతికించగలవా? అంది.. ఆమె శరీరం మహాలయం అడుగులు వేస్తున్న చివరి క్షణాల ఊపుని పట్టుకొని.. ఓ దీర్ఘ నసలత వడపోసిన దారి కొల్లగింపులో… తనేమంటుందో .. కాసేపు సృష్టికి అర్ధం కాలేదేమో..
శూన్యవాణి ఓ క్షణం నిస్సుత్తుగా ఆగి.. మరెవరి వాణినో వింటున్నట్లు.. విశ్వనిందా శిఖరం ఆఖరి క్షణంలో మీదకి దూకాక .. సన్నని తాడుని గొంతికి బిగించుకొని వేలాడుతున్నట్లు… మరెవరి వాణినో వింటున్నట్లు.. విశ్వనిందా శిఖరం ఆఖరి క్షణంలో మీదకి దూకాక .. సన్నని తాడుని గొంతికి బిగించుకొని వేలాడుతున్నట్లు…
తన చివరి మాటని సిద్ధం చేసుకొన్నట్లుగా ఎక్కడో దూరంగా పర్వతాల్లోకి.. పిడుగు రాలింది.. వెలుగు నిండింది… మొత్తంగా వణికింది.. ఇంతకంటే ఇంకేం లేదనే స్పష్టతని జుట్టులోకి చుట్టి.. గుంజి.. నిలబెట్టింది… నీ ఆత్మ సంగీతమై అతనిలోకి ప్రవేశించి ముద్ర గతుల పిండంగా మారి.. విశ్వ నిద్రాణ స్వరూప ధ్వని మొత్తం మృత్యువు చుట్టూ ఒరిగి.. సంతాప సహిష్ణు మగత కన్నులో తలపడి.. దుఃఖ ఖండికని మోసి తిప్పిన పరిష్కారంగా అతనొక పునర్జన్మ తో లేచి..
ఈ గడిచిన క్షణాలన్నీ.. నీతో అతని అనుభవాలు.. మాటలు.. ఈ గుడిలో ఓ దైవిక మంత్రం సిద్ధిని పొందిన రుతు భ్రమణ అంతా అతని లోపల కలలుగా మిగిలి.. ఉనికి ఇక్కడనుంచి ఎక్కడికో జరిగి అంతా తుడిచిపెట్టుకుపోతాయి …
సంగీతంగా శాశ్వతమౌతాడు..
……………………………………………..

